హైకోర్టు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్‌సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది.
తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి.
Comments
Please login to add a commentAdd a comment