gudiwada
-
రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇదే నిదర్శనం : బొత్స
సాక్షి,అమరావతి : గుడివాడలో పేర్నినాని కారుపై దాడి ఘటనను వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఖండించారు. ఈ మేరకు బొత్స పోలీసు అధికారులు ఫోన్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు సన్నగిల్లుతున్నాయని అన్నారు. పార్టీ నాయకులకు ఏమైనా జరిగితే పోలీసులు బాధ్యత వహించాల్సి ఉంటుందని బొత్స సత్యనారాయణ ఎస్పీకి స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఆటవిక పాలనకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు బొత్స.కొనసాగుతున్న రెడ్ బుక్ రాజ్యంగంరాష్ట్రంలో ఆటవిక పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగం కొనసాగుతుంది. గుడివాడలో పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులు జరిగాయి. సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా న్యాయ సహాయం కోసం గుడివాడ వెళ్లారు పేర్నినాని,కైలే అనిల్. ఇంటూరిని విడిపించిన తర్వాత స్నేహితుడి ఆహ్వానం మేరకు టీ తాగేందుకు వారి ఇంటికి వెళ్లారు పేర్ని నాని. దీంతో రెచ్చి పోయిన జనసేన, టీడీపీ కార్యకర్తలు పేర్నినాని కారుపై రాళ్ల దాడి చేశారు. అద్దాలు పగుల గొట్టారు.పోలీసుల సమక్షంలోఇక ఈ ఏపిసోడ్ మొత్తం పోలీసుల సమక్షంలో జరగడం గమనార్హం. పోలీసుల సమక్షంలో దాడులకు తెగబడ్డారు టీడీపీ, జనసేన కార్యకర్తలు. అటు దాడులు గురించి సమాచారం తెలుసుకుని టిడ్కో గృహాల వద్ద మరో కారును ఉంచారు పేర్ని నాని కారు డ్రైవర్. అయితే, అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడి చేశారు. -
గుడివాడలో పేర్నినాని కారుపై రాళ్ల దాడి
సాక్షి,అమరావతి : గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని కారుపై రాళ్ల దాడి కలకలం రేపుతుంది. వైఎస్సార్సీపీ నేత వైసీపీ నేత తోట శివాజీ మాజీ మంత్రి పేర్ని నాని,మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ వెళ్లారు. ఆ ఇద్దరు నేతలు శివాజీ ఇంట్లో ఉన్న సమయంలో.. ఇంటి బయటే టీడీపీ, జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. పరుష పదజాలంతో దూషిస్తూ.. తాము దాడి చేసేందుకు వచ్చామంటూ హెచ్చరికలు జారీ చేశారు.టీడీపీ, జనసేన నేతల దాడిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. అయినప్పటికీ వారిని నిలురించే ప్రయత్నం చేయలేదు. సుమారు రెండు గంటలకు పైగా పేర్నినాని శివాజీ ఇంట్లోనే ఉన్నారు.ఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్ రాజ్యాంగంఏపీలో ఆటవిక పాలన, రెడ్‌బుక్‌జ్యాంగం కొనసాగుతోంది. గుడివాడలో మాజీ మంత్రి పేర్ని నాని లక్ష్యంగా రెండు సార్లు దాడులకు పాల్పడ్డారు టీడీపీ, జనసేన నేతలు. కారుపై దాడిచేసి అద్ధాలు పగలగొట్టారు టీడీపీ, జనసేన నాయకులు. పోలీసుల సమక్షంలో దాడులకు పాల్పడ్డారు.సోషల్ మీడియా కార్యకర్త ఇంటూరి రవికిరణ్‌కు అండగా ఉండేందుకు న్యాయ సహాయం కోసం పేర్ని నాని, కైలే అనిల్‌లు గుడివాడ వెళ్లారు. ఈ క్రమంలోనే పేర్ని నాని కారుపై దాడి చేసి అద్దాలు పగలగొట్టారు కూటమి నేతలు. టిడ్కో గృహాల వద్ద మరో కారును పేర్ని నాని డ్రైవర్ ఉంచగా. అక్కడకు వెళ్లిమరీ కారుపై దాడికి పాల్పడ్డారు. -
గుడివాడ గెలుపుపై కొడాలి నాని రియాక్షన్
-
‘వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే.. చెప్పేవాడు చంద్రబాబు’
గుడివాడ: చంద్రబాబు, ఎల్లో మీడియాపై మరోసారి ధ్వజమెత్తారు ఎమ్మెల్యే కొడాలి నాని. చంద్రబాబు అండ్ కంపెనీ ఇష్టంమొచ్చినట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై బురదజల్లడంపై కొడాలి నాని తనదైన శైలిలో కౌంటరిచ్చారు. వినేవాళ్లు తెలుగు తమ్ముళ్లైతే... చెప్పేవాడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. ‘ఇప్పటి వరకూ అభ్యర్ధుల్ని ,ఇంఛార్జ్‌లను ఏడు విడతల్లో జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. అభ్యర్ధుల్ని మార్చేచోటే మార్పులు చేర్పులు చేస్తున్నారు. వైఎస్సార్సీపీలో సీట్ల మార్పులు జగన్మోహన్రెడ్డి చేస్తారు.. ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ5 బీఆర్ నాయుడు, మహాటీవీ వంశీ కాదు. నరేంద్రమోదీకి కూడా గుడివాడలో ఏబీఎన్ రాధాకృష్ణ టికెట్ ఇవ్వగలడు. నన్ను ఓడించాలంటే చంద్రబాబును తెచ్చి గుడివాడలో పోటీచేయమనండి. గుడివాడలో నేను పోటీచేయాలో లేదో జగన్మోహన్రెడ్డి చెబుతారు.. టీవీ5, ఏబీఎన్, మహాన్యూస్పకోడీగాళ్లు కాదు. ఏబీఎన్ రాధాకష్ణ,బీఆర్ నాయుడు పోటీచేస్తారని నేను కూడా ఫ్లెక్సీలు పెట్టిస్తా ... నిజమైపోతుందా? ... గన్నవరంలో వంశీని, గుడివాడలో నన్ను మారుస్తామని జగన్మోహన్రెడ్డి చెప్పారా?, మా సీట్లు ఇవ్వడానికి ఈ ఏబీఎన్..టివి5,మహాటీవీ బఫూన్ గాళ్లు ఎవరు?, పక్కలేస్తే సీట్లివ్వడం...డబ్బులకు అమ్ముకోవడం వైఎస్సార్సీపీలో ఉండదు. వంద కోట్లుంటే చంద్రబాబు టీడీపీలో టిక్కెట్లిస్తాడు. మా మైలవరం అభ్యర్ధికి ఎకరం పొలం తప్ప ఏమీ లేదు. వైఎస్సార్సీపీలో ఒకడు ట్రైచేస్తేనో... బ్రోకర్ గాడు చెబితేనే టిక్కెట్లు రావు. సామాజిక సమీకరణాల ప్రకారమే ఎస్సీ,బీసీ,ఎస్టీ ,మైనార్టీలకు జగన్ మోహన్ రెడ్డి పెద్దపీట వేశారు.చంద్రబాబుకు దమ్ముంటే..మగాడైతే బీసీలకు ఎక్కువ సీట్లివ్వాలి. సీట్లు మారుస్తాడా లేదా.. అనేది మాకు జగన్మోహన్రెడ్డికి సంబంధించిన వ్యవహారం. మధ్యలో టీడీపీ బ్రోకర్లకు పనేంటి. .... ఏబీఎన్ రాధాకృష్ణ బ్రోకర్ పనులు టీడీపీలో చేసుకోమనండి. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కోలేక పార్టీలన్నీ కలిసి వస్తున్నాయి. ఎంతమంది కలిసొచ్చినా జగన్మోహన్రెడ్డిని ఎదిరించలేరు. జగన్ సింగిల్‌గా వస్తానని చెబుతున్నాడు. మీరెందుకు ఒకరి సంక మరొకరు ఎక్కుతున్నారు. చంద్రబాబు పర్మినెంట్‌గా మాజీగానే ఉంటాడు. పదిలక్షల మంది జనం వచ్చిన చోట ఆంధ్రజ్యోతి పేపర్ ఫోటో గ్రాఫర్ కు పనేంటి. ఏబీఎన్‌ను, వాళ్ల పేపర్ ను మేం బ్యాన్ చేశాం.. ఎవరు రమ్మన్నారు. రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ,బీఆర్ నాయుడు మా సభలకు మీ లోగోలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేస్తున్నా. మీరు మా సభలకు వస్తే మా కార్యకర్తలు మీ కాలుకు కాలు విరిచేస్తారు’ అని కొడాలి నాని విమర్శించారు. -
లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా?.. పేర్ని నాని సవాల్
సాక్షి, అమరావతి: నారా లోకేష్‌కు గుడివాడలో పోటీ చేసే దమ్ముందా? అంటూ పేర్ని నాని సవాల్ విసిరారు. గుడివాడ, గన్నవరంలో పోటీకి టీడీపీ అభ్యర్థులు లేరన్న ఆయన.. సూర్యుడు అస్తమించాక లోకేష్ యాత్ర ప్రారంభం అవుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, అసలు లోకేష్ ఎవరితో మాట్లాడతారు? ఏం చర్చిస్తారు?. పాదయాత్ర పగటిపూట చేస్తే జనం ఛీ కొడతారని, జనం నిద్ర పోయాక అర్ధరాత్రి చేస్తున్నారు. రోజుకు వెయ్యి రూపాయల చొప్పున డబ్బులు ఇచ్చి జనాన్ని రప్పించుకుంటున్నారు’’ అని మండిపడ్డారు. లోకేష్‌ను సంస్కారం లేని వ్యక్తిగా మార్చి చంద్రబాబు జనం మీదకి వదిలాడు. జగన్‌ని బూతులు తిట్టటానికే లోకేష్ యాత్ర చేస్తున్నారు. వైఎస్సార్, జగన్‌ల పాదయాత్ర ఎలా చేశారో వీడియోలు చూస్తే ఎలా పాదయాత్ర చేయాలో తెలుస్తుంది. తండ్రి గురించి చెప్పుకోలేని దుస్థితిలో లోకేష్ ఉన్నాడు. పేదలకు ఇళ్లు కట్టిస్తాననీ, రెండు లక్షల ఉద్యోగాలు కల్పిస్తాననీ, విద్యారంగంలో సమూల మార్పులు చేస్తాననీ జగన్ చెప్పుకుని ఓట్లు అడిగారు. కానీ లోకేష్ బూతులతో పాదయాత్ర చేస్తున్నారు’’ అంటూ దుయ్యబట్టారు. ‘‘వంశీ టీడీపీలో ఉన్నప్పుడు కూడా పశువుల డాక్టరే. అప్పుడు మనుషుల డాక్టర్ అయ్యాడా?. సిగ్గుశరం లేదా మీకు?. 2004, 2009లో టీడీపీ తరపున పోటీ చేసినప్పుడు కొడాలి నాని సాఫ్ట్వేర్ ఇంజినీరా?. ఇప్పుడు మాత్రం లారీ క్లీనర్, కప్పులు కడిగే వాడా?. ఆ లారీ క్లీనర్‌ని చూస్తే చంద్రబాబు, లోకేష్‌లకు ప్యాంట్లు తడుస్తున్నాయి. ఆ లారీ క్లీనర్లు, కప్పులు కడిగేవాళ్ల ఓట్లు అవసరం లేదా?. కొడాలి నాని చంద్రయాన్ సైంటిస్టు అని చెప్పుకోలేదే?’’ అని పేర్ని నాని మండిపడ్డారు. చదవండి: లోకేష్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని ‘‘జగన్ మీద పోటీ చేసే దమ్ము లేకనే దత్తపుత్రుడుని తెచ్చుకున్నారు. జగన్ ఇచ్చే పథకాలను తానూ ఇస్తానని చంద్రబాబు చెప్తున్నారు. అలాంటప్పుడు జగన్ ఉండగా, ఇక చంద్రబాబు ఎందుకు?. పండుగల సమయంలో వారి హెరిటేజ్‌లోని సరుకులు అమ్ముకోవటానికే రకరకాల పేర్లతో పథకాలు పెట్టారు. అన్నా క్యాంటీన్ల పేరుతో దోపిడీ చేశారు. అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని అన్నా క్యాంటీన్లు పెట్టారో లెక్క చెప్పగలరా?. బెజవాడకు అటు గన్నవరంలో వంశీ గెలిస్తే ఇటు లోకేష్ ఓడిపోయాడు. అలాంటి లోకేష్ కూడా వంశీపై ఆరోపణలు చేస్తున్నారు. ఇకనైనానా తప్పుడు సంస్కారం, బూతులు తిట్టటం మానుకోవాలి’’ అని పేర్ని నాని హితవు పలికారు. ‘‘మచిలీపట్నంలో పోర్టు నిర్మాణాన్ని టీడీపీ ఎలా అడ్డుకున్నదో జనం అందరికీ తెలుసు. ఆధారాలతో సహా లోకేష్ తో చర్చించటానికి నేను సిద్దం. దమ్ముంటే లోకేష్ చెప్తే నేను అక్కడకు వచ్చి చర్చిస్తా. నా సవాల్‌ని లోకేష్ తీసుకునే దమ్ముందా?. లోకేష్‌ని చూస్తే వారి పార్టీలోని వారే భయపడుతున్నారు’’ అని పేర్ని నాని వ్యాఖ్యానించారు. -
సీఎం జగన్ గుడివాడ పర్యటన వాయిదా
సాక్షి, తాడేపల్లి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపటి(శుక్రవారం) గుడివాడ పర్యటన వాయిదా పడింది. ఈ కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు సీఎం క్యాంపు కార్యాలయం అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, సీఎం జగన్ రేపు గుడివాడలో టిడ్కో ఇళ్లను ప్రారంభించాల్సి ఉంది. -
గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి: కొడాలి నాని
సాక్షి, కృష్ణ: గుడివాడ ఆర్టీసీ డిపో గ్యారెజ్ నిర్మాణం పూర్తి అయినట్లు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని వెల్లడించారు. గ్యారెజ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన కొడాలి నాని మాట్లాడుతూ.. రేపు(సోమవారం) బస్టాండ్ నిర్మాణానికి టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. అంతేకాదు వచ్చే నెల 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు. పులివెందుల తర్వాత రూ. 20 కోట్లతో బస్టాండ్ నిర్మిస్తున్నది గుడివాడలోనే అని చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష నాయకుడు టీడీపీ నేత చంద్రబాబు నాయడుపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఈ మేరకు కొడాలి నాని మాట్లాడుతూ.. తండ్రి కొడుకులు మాట్లాడితే గుడివాడ మాదే అంటారు. అసలు ఏం చేశారని ఫైర్ అయ్యారు. సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు కట్టి గుడివాడ దాహార్తిని తీర్చిన వ్యక్తి వైఎస్ఆర్ అని చెప్పారు. 14 ఏళ్లుగా సీఎంగా ఉన్న చంద్రబాబు గుడివాడలో ఫ్లైఓవర్ ఎందుకు కట్టలేదని ఎద్దేవాచేశారు. సీఎం జగన్ చొరవతోనే ఆ పనులు మొదలు పెట్టామని చెప్పారు. మాటిమాటికి గుడివాడ నాదే అని చంద్రబాబు సిగ్గులేకుండా చెబుతాడన్నారు. ఆనాడు వైఎస్ఆర్ చలువతో సేకరించిన 77 ఎకరాల్లోనే పేదలకు ఇళ్లు కడుతున్నాం అన్నారు. టిడ్కో ఇళ్ల నిర్మాణానికి జగన్ రూ. 540 కోట్లు కేటాయించాం. అలాగే చంద్రబాబు తన పాలనలో ఆర్టీసీ కార్మికులు చనిపోతే వారి కుటుంబాలను గాలి కొదిలేశాడని మండిపడ్డారు. దాదాపు 2300 ఆర్టీసీ కుటుంబాలను గాలికొదిలేసిన వ్యక్తి చంద్రబాబు. ఆయనకు తన కులానికి చెందిన వాళ్లే ముఖ్యం. ప్యాకేజ్ పడేస్తే పక్క రాష్ట్రం నుంచి వాళ్లే కావాలి అంటూ రజనీ కాంత్‌ని ఉద్దేశించి చురకలంటించారు. అయినా రజనీకాంత్ మూడు రోజులు షూటింగ్ చేస్తే నాలుగు రోజులు ఆస్పత్రిలో ఉంటాడని విమర్శించారు. ఈ చంద్రబాబు మంగళవారం వస్తే కనబడడని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్తాడని అన్నారు. అసలు ఏ విషయం పరంగా చూసిన జగన్‌కు చంద్రబాబుకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందంటూ కొడాలి నాని ఘాటుగా విమర్శలు గుప్పించారు. (చదవండి: ‘పవన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకు రజినీకాంత్ రంగంలోకి!’) -
టీడీపీ నేతల ఓవరాక్షన్.. పోలీసుల రియాక్షన్..
సాక్షి, కృష్ణా: ఎమ్మెల్సీ ఎన్నికల విజయోత్సవాల పేరుతో గుడివాడలో టీడీపీ నేతలు గురువారం ఓవరాక్షన్ చేశారు. 144 సెక్షన్ ఉండగా బహిరంగ ప్రదేశాల్లో బాణాసంచా కాల్చవద్దన్న పోలీసులను టీడీపీ నేతలు దూషించారు. తమ విధులకు ఆటకం కలిగించడం , అసభ్య పదజాలంతో మాట్లాడారని ఎస్సై గౌతమ్ కుమార్ వారిపై ఫిర్యాదు చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 353, 341, 285, 290, 506, R/w 34 కింద వన్‌టౌన్ పోలీసులు కేసులు నమోదు చేశారు. -
సంకల్ప సిద్ధి కేసులో టీడీపీ అసత్య ఆరోపణలు
సాక్షి, విజయవాడ స్పోర్ట్స్: సంకల్ప సిద్ధి కేసుతో మాజీ మంత్రి, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీలకు ముడిపెట్టి టీడీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని హైకోర్టు న్యాయవాదులు తాడికొండ చిరంజీవి, బర్రె శ్రీనివాసరావు పేర్కొన్నారు. మంగళవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. ఈ కేసుపై త్వరగా విచారణ జరిపి దోషులను అదుపులోకి తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ డీజీపీకి ఇటీవల వినతిపత్రం ఇచ్చారన్నారు. కేవలం రాజకీయ కక్షతోనే టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ కేసులో అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. సీఐడీ చీఫ్ సునీల్, పోలీస్ కమిషనర్ టీకే రాణా పేర్లను ప్రస్తావించడాన్ని వారు ఖండించారు. సీఐడీ విచారణను చెంచా విచారణ అని సంబోధించడం పట్టాభి అహంకారానికి పరాకాష్ట అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉందని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని వల్లభనేని వంశీ గతంలోనే ప్రకటించినట్టు గుర్తు చేశారు. అసత్య ఆరోపణలు చేస్తున్న పట్టాభికి లిఖిత పూర్వకంగా నోటీసులు ఇచ్చామన్నారు. పట్టాభిపై కేసు నమోదు చేసి రాష్ట్ర బహిష్కరణ చేయాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. (చదవండి: ఏకలవ్య జాతీయ క్రీడల ఏర్పాట్లపై రాజీ పడొద్దు ) -
అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతల అరెస్టు
గుడివాడ రూరల్(కృష్ణా జిల్లా): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఫొటోలతో అసభ్య పోస్టులు పెట్టిన టీడీపీ మహిళా నేతలను అరెస్ట్ చేసినట్లు వన్‌టౌన్ సీఐ గోవిందరాజు తెలిపారు. స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో శనివారం విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ సీపీ నాయకురాలు, మాజీ కౌన్సిలర్ రేమల్లి ప్రభోద రాణి ఫిర్యాదు మేరకు సోషల్ మీడియాలో అభ్యంతకరమైన పోస్టులు పెట్టిన టీడీపీ నాయకురాలు అసిలేటి నిర్మల, సిరిపురపు తులసీరాణి, మాదాల సునీత, బంటు రోజాలను అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరిపై నాన్‌బెయిల్ సెక్షన్ 505–2 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపర్చనున్నట్లు వివరించారు. చదవండి: నాటుకోడికి ఫుల్ గిరాకీ.. ఆ టేస్టే వేరు.. రోజుకు వెయ్యి లాభం! -
రైతుల ముసుగులో టీడీపీ నేతల హల్చల్
గుడివాడ: రైతుల ముసుగులో టీడీపీ నేతలు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. శనివారం సాయంత్రం అమరావతి రైతుల మహా పాదయాత్ర కృష్ణా జిల్లా గుడివాడకు చేరుకుంది. స్థానిక శరత్ థియేటర్ వద్ద ఉన్న వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దకు రాగానే టీడీపీ నాయకులు రెచ్చిపోయారు. కవ్వింపుగా ఈలలు, కేకలు వేశారు. అదే సమయంలో ఏలూరు మాజీ ఎంపీ మాగంటి బాబు అక్కడికి చేరుకుని, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) కటౌట్‌కు చెప్పు చూపించటంతో వైఎస్సార్సీపీ కార్యాలయం లోపల ఉన్న పార్టీ కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చారు. ఇరువర్గాల మధ్య కొద్దిసేపు తోపులాట జరిగింది. అంతలో పెద్ద ఎత్తున పోలీసు బలగాలు వారిని విదదీసి.. రోప్ పార్టీతో అడ్డుగా నిలిచాయి. అయినప్పటికీ, పాదయాత్రలో పాల్గొన్న మహిళలు తొడలు కొడుతూ చిందులు వేశారు. వచ్చాం.. వచ్చాం.. గుడివాడకు వచ్చాం.. అంటూ నినాదాలు చేస్తూ చప్పట్లు కొడుతూ.. కేకలు వేస్తూ ముందుకు సాగారు. తాము ఎందుకు యాత్రగా వచ్చామో చెప్పకుండా గుడివాడ ప్రజలను రెచ్చగొట్టేలా మహిళలు గోల చేసిన తీరును చూసి ప్రజలు ముక్కున వేలేసుకున్నారు. టీడీపీ గుడివాడ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావు వర్గీయులు, అర్బన్ బ్యాంక్ చైర్మన్ పిన్నమనేని బాబ్జి వర్గీయులు వేర్వేరుగా బల ప్రదర్శన చేస్తూ తమ ప్రాబల్యం చాటుకునేందుకు యత్నించారు. కాగా, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్.. హౌస్ అరెస్ట్ నుంచి తప్పించుకుని గుడివాడ చేరుకున్నారు. మార్కెట్ యార్డ్ వద్ద పోలీసులు అడ్డుకోగా.. వారి కళ్లుగప్పి ఓ కార్యకర్త బైక్ ఎక్కి పాదయాత్ర ప్రాంతానికి వచ్చారు. ఈ తంతు మొత్తాన్ని ఆయన తన అనుచరుడి ద్వారా వీడియో తీయించుకుని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయించారు. -
ఐఓసీ పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు
సాక్షి, అమరావతి బ్యూరో: పెట్రోలు, డీజిల్ ధరలు రోజురోజుకూ మండిపోతున్నాయి. ఈ ధరలు వాహనాల యజమానులకు కొండంత భారంగా మారాయి. ఈ తరుణంలో పెట్రోల్, డీజిల్‌తో పనిలేని ఎలక్ట్రిక్ వాహనాలు (ఈ–వాహనాలు) అందుబాటులోకి వస్తున్నాయి. తక్కువ ధరతో ఎక్కువ మైలేజీ ఇచ్చే ఈ వాహనాల వినియోగం ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. అయితే వాహనాలకు సరిపడినన్ని చార్జింగ్ స్టేషన్లు లేక వాటి కొనుగోలుకు ప్రజలు వెనకడుగు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యుత్ వాహనాల చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుపై నూతన, పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (నెడ్‌క్యాప్) దృష్టి సారించింది. ఈ చార్జింగ్ స్టేషన్లు అందుబాటులోకి వస్తే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగనుంది. ఇలా ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రాథమికంగా 27 ఈ– చార్జింగ్ స్టేషన్లు/పాయింట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. వీటిలో ఇప్పటికే ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు చెందిన 11 పెట్రోల్ బంకుల్లో 25, 30, 50 కిలోవాట్ల సామర్థ్యం ఉన్న చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. మూడు స్టేషన్లకు విద్యుత్ (గ్రిడ్) కనెక్షన్ కూడా ఇవ్వడంతో అందుబాటులోకి తెచ్చారు. మిగిలిన వాటికి త్వరలో కనెక్షన్ ఇవ్వనున్నారు. ఆర్టీసీ బస్టాండ్లలో.. కొత్తగా ఆర్టీసీ బస్టాండ్లలో ఈ–చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 16 చోట్ల ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టేషన్, ఆటోనగర్, మచిలీపట్నం, గుడివాడ, హనుమాన్ జంక్షన్, జగ్గయ్యపేట, కంచికచర్ల, నూజివీడు, ఎ.కొండూరు, ఆగిరిపల్లి, అవనిగడ్డ, బంటుమిల్లి, చల్లపల్లి, చందర్ల పాడు, గన్నవరం, కైకలూరును ఎంపిక చేశారు. ఆయా ప్రాంతాల్లో ఆర్టీసీ బస్ స్టేషను/డిపో/బస్టాండ్లలో వాహనాల చార్జింగ్కు అనువుగా ఉండే స్థలాలను ఆర్టీసీ అధికారులతో కలిసి పరిశీలిస్తున్నట్టు నెడ్‌క్యాప్ జిల్లా మేనేజర్ జె.వి.ఎల్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు. అవి ఖరారైతే ఆయా చోట్ల చార్జింగ్ పాయింట్లను అమర్చనున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నాలుగు, మూడు చక్రాల విద్యుత్ వాహనాలకు చార్జింగ్ పెట్టుకునే వీలుంటుంది. అంతేకాదు.. వాహనదారులు తమ వాహనానికి చార్జింగ్ అయిపోతే సమీపంలో చార్జింగ్ స్టేషన్/పాయింట్ ఎక్కడుందో తెలుసుకునే ఆధునిక సాఫ్ట్‌వేర్‌ను కూడా రూపొందించారు. (క్లిక్: కృష్ణా యూనివర్సిటీకి 14 ఏళ్ల తరువాత అరుదైన గుర్తింపు) -
స్పందన కార్యక్రమం: పుట్టిన బిడ్డ తనది కాదంటున్నాడయ్యా !
కోనేరుసెంటర్: ప్రతిరోజు స్పందనలో వచ్చిన అర్జీలను చట్టపరిధిలో విచారణ జరిపించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు ఎస్పీ సిద్ధార్థ కౌశల్ తెలిపారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ప్రతిరోజు స్పందన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా పోలీసులను ఆశ్రయించవచ్చనన్నారు. సమస్య తీవ్రతను బట్టి పరిష్కార చర్యలు తీసుకుంటామని చెప్పారు. గుడివాడకు చెందిన ఓ మహిళ తన భర్త వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని అధిక కట్నం కోసం వేధిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. తనకు కలిగిన బిడ్డ కూడా తనది కాదంటున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. భర్తపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలంటూ విన్నవించింది. బాధితురాలి ఆవేదన ఆలకించిన ఎస్పీ గుడివాడ సీఐకు ఫిర్యాదును బదిలీ చేసి ఆమెకు తక్షణమే న్యాయం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. చదవండి: ఫింగర్ ప్రింట్స్ సమస్య.. తక్షణమే స్పందించిన గుంటూరు కలెక్టర్ మీరే మాకు కళ్లు, చెవులు.. మీరే మా బలం: సీఎం జగన్ -
గుడివాడలో శివరాత్రి వేడుకలకు సీఎం వైఎస్ జగన్
గుడివాడ టౌన్: కృష్ణాజిల్లా గుడివాడలో గురువారం నిర్వహించనున్న మహాశివరాత్రి వేడుకలకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి హాజరుకానున్నారని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. వేడుకల ఏర్పాట్లను మంగళవారం ఆయన సీఎం కార్యాలయ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురాం, జాయింట్ కలెక్టర్ మాధవీలత, ఎస్పీ ఎం.రవీంద్రనా«థ్‌బాబుతో కలిసి స్టేడియంలో పరిశీలించారు. మంత్రి మాట్లాడుతూ.. సీఎం జగన్‌కు పరమశివుడి కృపాకటాక్షాలు సిద్ధించాలనే సంకల్పంతో వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అభిషేకం, మహా హోమం కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొంటారన్నారు. కాగా, మహాశివరాత్రి పర్వదినాన సూర్యోదయం నుంచి అర్థరాత్రి లింగోద్భవ కాలం వరకు రుద్రపారాయణం, రుద్రహోమం, సహస్రలింగార్చన, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, శివపార్వతుల కల్యాణ కార్యక్రమాలు జరుగుతాయని నాని తెలిపారు. -
దమ్ముంటే గుడివాడలో నాపై పోటీచెయ్యి
సాక్షి, అమరావతి: ‘నీకు దమ్ము, ధైర్యం ఉంటే.. నువ్వు మగాడివే అయితే.. గుడివాడలో నా మీద పోటీ చెయ్’ అని పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని చంద్రబాబును సవాల్ చేశారు. తాను పేకాట క్లబ్లులు నడుపుతున్నానని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రగిరిలో 1978 ప్రాంతంలో వ్యభిచార గృహాలు నడిపిన చరిత్ర ఆయనదేనన్నారు. నోరుందని అడ్డగోలుగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్ తెచ్చిన లక్ష కోట్ల అప్పులో సంక్షేమ పథకాలకే రూ.90 వేల కోట్లు ఖర్చు పెట్టారని, చంద్రబాబు రూ.3.60 లక్షల కోట్ల అప్పు తెచ్చి దోచుకున్నారే తప్ప జనానికి ఒక్కపైసా ఇవ్వలేదన్నారు. కొడాలి నాని ఇంకేమన్నారంటే.. దొంగలంతా నీ పక్కే ఉన్నారు ‘మా మంత్రి వెలంపల్లిని కొబ్బరి చిప్పల మంత్రి అంటావా? కొబ్బరి చిప్పలమ్ముకునే వాళ్లు, సైకిల్ బెల్లులు దొంగతనం చేసిన వాళ్లు నీ వెంటే ఉన్నారు చంద్రబాబూ. దుర్గగుడిలో నీ కుటుంబం క్షుద్ర పూజలు చేసింది కాబట్టే అమ్మవారు నీకు దిక్కులేని పరిస్థితి కల్పించింది. కృష్ణా పుష్కరాల పేరుతో రూ.3 వేల కోట్లు మింగేశావ్. విజయవాడ ప్రజలకు పౌరుషం లేదా అంటావా? పౌరుషం ఉంది కాబట్టే మోసం చేసిన చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు, విశాఖ స్టీల్ ప్లాంట్‌పై దమ్ముంటే ప్రధాని మోదీని నిలదీయాలి. జగన్ ఓటుకు రూ.2 వేలు ఇస్తాడని తప్పుడు మాటలు మాట్లాడుతున్నావ్. ఓటుకు రూ.5 కోట్లు డీల్ కుదుర్చుకున్న దొంగవు నువ్వు. చంద్రబాబూ.. నీ సంగతి నీ మనవడికి కూడా తెలిసిపోయింది. అందుకే ‘ఏబీసీడీ ఎఫ్.. తాత పని టఫ్’ అని పాటపాడుకుంటున్నాడు. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించం. ’ అని నాని మండిపడ్డారు. -
అన్నీ ఒక్కటవ్వడంతో.. బతుకు జీవుడా అంటూ
సాక్షి, గుడివాడ: మనుషులే కాదు..మాటలు రాని పక్షులు సైతం తమ బిడ్డలను కాపాడుకోవడానికి ప్రాణాలకు తెగించి పోరాడుతాయనేందుకు గుడివాడలో జరిగిన ఓ ఘటన సాక్షీభూతంగా నిలిచింది. వివరాల్లోకి వెళితే.. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలోని వృక్షానికి గల తొర్రలో ఓ చిలుక పిల్లలను పెట్టింది. దానిని పసికట్టిన ఓ పెద్ద పాము తల్లి చిలుక గూటిలో లేని సమయంలో వాటిని మింగేందుకు తొర్ర వద్దకు చేరింది. అదే సమయానికి అక్కడకు చేరుకున్న తల్లి రామచిలుక గట్టిగా అరవడంతో చుట్టు పక్కల ఉన్న చిలుకలన్నీ దీనికి తోడయ్యాయి. అవి మూకుమ్మడిగా పాముపై దాడి చేశాయి. ఆ దెబ్బకు బతుకు జీవుడా అంటూ పాము పలాయనం చిత్తగించింది. తమ బిడ్డలను రక్షించుకునేందుకు ప్రాణాలకు తెగించి పామును తరిమికొట్టే వరకు చిలుకలు చేసిన పోరాటాన్ని చూసిన ప్రజలు..పేగు బంధం అంటే ఇదే సుమా అంటూ చర్చించుకున్నారు. -
‘వకీల్ సాబ్ కాదు.. నువ్వు షకీలా సాబ్’
సాక్షి, గుడివాడ : జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి కొడాలి నాని స్పందించారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చారు. పవన్ కల్యాణ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని హెచ్చరించారు. తన నియోజకవర్గం గుడ్లవల్లేరులో ఇళ్ల పట్టాల పంపిణీ సందర్భంగా నాని మాట్లాడుతూ.. ‘రాష్ట్రం నడి బొడ్డున విజయవాడ, గుంటూరు, భీమవరం, గుడివాడ ప్రాంతాలలో పెద్ద పేకాట క్లబ్‌లు పెట్టిన ఘనత చంద్రబాబు నాయుడు, అయన పార్టనర్ పవన్ కల్యాణ్‌ది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రంలో పేకాట క్లబ్‌లు పెట్టమా.. లేక మూసివేశామో రాష్ట్ర ప్రజలకు తెలుసు. రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు పేకట క్లబ్‌లు పెట్టినప్పుడు ఆయన పార్టనర్ ఎక్కడ వున్నాడు. ఎవరో ఇచ్చిన ప్యాకేజిలు తీసుకుని నోటి కోచ్చినట్లు మాట్లాడితే మంచిది కాదు. మేము కాదు నువ్వు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది’ అంటూ మంత్రి కొడాలి నాని హెచ్చరించారు. (చదవండి: ‘అప్పుడు గుడ్డి గుర్రం పళ్లు తోముతున్నారా?’) ‘గతంలో పవన్ కల్యాణే జగన్మోహన్రెడ్డి బాగా పరిపాలిస్తే రాజకీయాలు వదిలి సినిమాలు చేసుకుంటాను అని అన్నాడు. నువ్వు సినిమాలు చేసుకుంటే మాకేందుకు.. చేసుకోకపోతే మాకేందుకు. నిన్ను సినిమాలు మానేయ్యమని మేము అడగలేదు కదా. మేము ఇప్పుటికి నిన్ను ఒక సినిమా యాక్టర్‌గానే చూస్తున్నాం. నువ్వు సినిమాలు వదులుతావా లేక ఇంకా ఎవరినైనా వదులుతావా అని మేం అడగలేదు. ఏం వదలాలి అనేది నీ ఇష్టం. ప్యాకేజీ వచ్చినట్లు ఉంది.. బయటకు వచ్చి పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నావు. చంద్రబాబు నాయుడు దత్తపుత్రుడిని ఒక వైపు.. సొంత పుత్రుడుని ఓ వైపు జిల్లాలోకి నిన్న పంపించాడు. జోగిజోగి రాసుకుంటే బుడిద వస్తుంది అంటారు. అదే వచ్చింది’ అంటూ నాని ఎద్దేవా చేశారు. ‘ఏ మతమైన మాకు గౌరవం. పవన్ కల్యాణ్ ముక్కోటి లింగాలలో బోడి లింగం అని అంటున్నాడు. శివ లింగాలని బోడి లింగంగా సంబోధించడం ఆయన సంస్కారినికి అద్దం పడుతుంది. రాజకీయ పార్టీలు పెట్టి వ్యాపారం చేసుకుని డబ్బులు ఎలా సంపాదించాలో తెలిసిన వ్యక్తులు వాళ్ళు. ఇలాంటి రాజకీయ పార్టీలు చాలా వచ్చాయి.. కాలగర్భంలో కలిపోయిన సంగతి అందరికి తెలిసిందే. ప్యాకేజీ తీసుకుని ఇప్పుడు బయటకు వచ్చి వకిల్ సాబ్ చెప్పాడు అని చెప్పామంటున్నావ్. నిన్ను నువ్వు వకీల్ సాబ్ అని అనుకుంటుంటే జనం మాత్రం షకీలా సాబ్‌గా భావిస్తున్నారని తెలుసుకోవాలి. ఈ రాష్ట్రంలో పార్టీలు పెట్టి రెండు చోట్ల ఓడిపోయిన అధ్యక్షులు ప్యాకేజీకి మాత్రమే పనికి వస్తారు’ అంటూ నాని మండి పడ్డారు. -
మంత్రి కొడాలి నానికి కరోనా నెగిటివ్
కృష్ణాజిల్లా, గుడివాడ : అసెంబ్లీ సమావేశాలు నేపధ్యంలో రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖామంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని)కి సోమవారం రాత్రి కరోనా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈపరీక్షల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. నాసల్ స్వాబ్ పరీక్ష ద్వారా వైద్యులు వెల్లడించినట్లు మంత్రి కొడాలి నాని క్యాంపు కార్యాలయం అధికారులు తెలిపారు. -
‘పేదవాళ్ల సొంతింటి కల సాకారం’
సాక్షి, కృష్ణా: జూలై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాలు అందచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ మల్లాయపాలెం గ్రామంలో 90 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద లే అవుట్‌ను మంత్రి నాని, జేసీ మాధవిలతతో కలిసి అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. లే అవుట్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంట్, డ్రైయినేజీ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంతి కొడాలి నాని మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని తెలిపారు. ముఫ్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నామని తెలిపారు. మొదటి దశలో భాగంగా ఆగస్టు నెలలో 15 లక్షల వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. (వైఎస్సార్సీపీలో చేరిన శిద్దా రాఘవరావు) రాష్ట్రంలో అర్హులైన పేద వాళ్లకి సొంతింటి కల సాకారం చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజాభిమానం ఉన్న సీఎం వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు బుద్ధి మార్చుకుని ప్రజా సంక్షేమ పథకాలకి మద్దతు తెలపాలని హితవు పలికారు. కొడుకు భవిష్యత్తు కోసం ప్రజా ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. (ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు) -
పారిశుధ్య కార్మికులకు నిత్యావసరాల పంపిణీ
సాక్షి, కృష్ణా : కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపల్ కార్యాలయంలో 300మంది పారిశుధ్య కార్మికులకు మంత్రి కొడాలి నాని నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. వైఎస్సార్సీపీ నాయకులు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. కరోనా నివారణకు అహర్నిశలు శ్రమిస్తున్న పారిశుధ్య కార్మికులను సామాజిక బాధ్యత కలిగిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఈ సందర్భంగా మంత్రి కోరారు. పారిశుధ్య కార్మికులను ఆదుకోవడానికి వైఎస్సార్సీపీ నాయకులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. -
కిరాతకులకు హెచ్చరిక కావాలి
అ..ఆ సినిమాతో టాలీవుడ్ పరిచయమయ్యారు కేరళ కుట్టి అనుపమ పరమేశ్వరన్. పుట్టి పెరిగిందంతా కేరళలో అయినా తెలుగు కూడా చక్కగా మాట్లాడగలరు. తెలుగు, మలయాళం. తమిళం భాషల్లో నటించిన అనుపమ చివరగా రాక్షసుడు చిత్రంతో తెలుగు ప్రేక్షకులను అలరించారు. ఈ ముద్దుగుమ్మ తాజాగా గుడివాడలో సందడి చేశారు. గుడివాడలో గురువారం ఎస్వీఆర్ బ్రదర్స్ నూతన షోరూంను ప్రారంభించారు. అనంతరం అనుపమ మాట్లాడుతూ.. దిశ హత్య కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్కౌంటర్ మహిళలపై దాడులకు పాల్పడే కిరాతకులకు ఒక హెచ్చరిక కావాలన్నారు. ఈ చర్యతో దేశంలోని ప్రతి మహిళ విజయం సాధించిందన్నారు. ఇక నగరానికి నటి అనుపమ విచ్చేయడంతో ఆమెను చూడటానికి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. చదవండి: భగవంతుడే పోలీసుల రూపంలో: బాలకృష్ణ 'తమ్ముడు చేసిన పని వారికి కఠినమైన సందేశం' దిశ కేసు: నేరం చేశాక తప్పించుకోలేరు ఆ పోలీసుల కాళ్లు మొక్కాలని ఉంది: మనోజ్ -
పంచభూతాలను దోచుకున్నది వాళ్లే: నాని
సాక్షి, మచిలీపట్నం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమలు చేసున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకే చంద్రబాబు నాయుడు బురద రాజకీయాలు చేసున్నారని పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని ఆరోపించారు. కృష్ణా జిల్లా గుడివాడ మచిలీపట్నం రోడ్డులోని ఇసుక పాయింట్‌ను పరిశీలించిన మంత్రి.. రోజుకు ఎంత ఇసుక స్టాక్ ఉంచుతున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలోనే ఇసుక దోపిడీ జరిగిందని, వేల కోట్ల రూపాయల ఇసుకను చంద్రబాబు దోచుకున్నారని అన్నారు. అంతేగాక చంద్రబాబు, లోకేష్ నాయకత్వంలోని టీడీపీ నేతలు పంచభూతాలను దోచుకున్నారని మండిపడ్డారు. గత రెండు రోజులుగా రోజుకు లక్షా యాభై వేల టన్నుల ఇసుకను సరఫరా చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో వరదలు రావడంతో ఇసుకను బయటకు తీయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఇసుక కొరత ప్రభుత్వం సృష్టించింది కాదని అన్నారు. ఆరోపణలు చేస్తున్న చంద్రబాబు ఆధారాలు చూపించమంటే పారిపోయారని, ఆయనను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేసేవి దొంగ దీక్షలని.. దీక్షలు చేసే అర్హత ఆయనకు లేదని మండిపడ్డారు. ఇసుక దోపిడీని అడ్డుకున్న అధికారులపై తెలుగుదేశం శాసన సభ్యులు దాడి చేశారని గుర్తు చేశారు. లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్న బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా కృత్రిమ ఇసుక కొరతను సృష్టించారని నాని ఆరోపణలు చేశారు. బ్లూ ఫ్రాగ్ సంస్థ ద్వారా ఇసుక వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశారని, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇసుక మాఫియా కింగ్ అని అన్నారు. ఆయన తన అనుచరులతో ఇసుకను ఇతర రాష్ట్రాలకు తరలించిన చరిత్ర ఉమాదేనని అన్నారు. గ్రీన్ ట్రిబ్యునల్ వంద కోట్ల రూపాయలు జరిమానా విధించినా చంద్రబాబుకు బుద్దిరాలేదని విమర్శించారు. చంద్రబాబు హయాంలో జరిగిన ఇసుక కుంభకోణాలపై కోర్టుల్లో కేసులు నడుస్తున్నాయని, ఇప్పుడు ఇసుక కుంభకోణం అంటూ దొంగ దీక్షలు చేయడం విడ్డూరమన్నారు. -
చికెన్‌పకోడి తినలేదని ఆత్మహత్య
సాక్షి, గుడివాడ(కృష్ణా) : తనతో వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళ చికెన్ పకోడి తినలేదని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన పట్టణంలోని ధనియాలపేటలో చోటుచేసుకుంది. మంగళవారం జరిగిన ఈసంఘటనకు సంబంధించి వన్‌టౌన్ సీఐ వి.దుర్గారావు తెలిపిన వివరాలు ప్రకారం ధనియాలపేటకు చెందిన తెర్లి శ్రీనివాసరావు(25) మత్య్సశాఖలో కాంట్రాక్టు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ధనియాలపేటలో ఉండే ఝాన్సీతో వివాహేతర సంబంధం పెట్టుకున్న శ్రీను తాను తెచ్చుకున్న చికెన్ పకోడిని తినాల్సిందిగా ఝాన్సీని కోరాడు ఆమె తినకపోవటంతో సోమవారం రాత్రి గొడవ పడ్డాడు. నాపై ప్రేమ లేదని అందుకే తినటం లేదని అన్నాడు. మంగళవారం ఉదయం ఝాన్సీ తనకుమార్తెను స్కూలుకి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వచ్చే సరికి ఇంట్లో ఉన్న ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఝాన్సీ ఫిర్యాదు మేరకు వన్‌టౌన్ పోలీసులు అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
స్వల్పవివాదమే హత్యకు దారితీసింది
సాక్షి, గుడివాడ(కృష్ణా) : గుడివాడ పట్టణంలోని ధనియాలపేటలో జరిగిన హత్యకేసులో నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హత్యజరిగిన వెంటనే తాము నిందితుల్ని గుర్తించామని గుడివాడ డీఎస్పీ సత్యానందం విలేకరులకు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ధనియాలపేటకు చెందిన దూల భార్గవ్ శనివారం తెల్లవారుజామున హత్యకు గురైన విషయం పాఠకులకు విధితమే. కాగా ఈహత్యకేసులో నిందితులుగా ఉన్న ఇద్దరిని పట్టుకుని కోర్టులో హాజరుపరచనున్నట్లు డీఎస్పీ తెలిపారు. తాగిన మైకంలో ఏర్పాడిన స్వల్ప వివాదమే హత్యకు దారితీసిందని డీఎస్పీ పేర్కొన్నారు. నిందితులను మంగళవారం సాయంత్రం స్థానిక మార్కెట్‌యార్డు సమీపంలో పోలీసులు పట్టుకున్నట్లు తెలిపారు. హత్యకు గురైన దూల భార్గవ్ శుక్రవారం రాత్రి సమయంలో దుర్భాషలాడటంతోనే ఈహత్య జరిగిందన్నారు. బుధవారం ఉదయం నిందితుల్ని కోర్టుకు హాజరు పరుస్తామని అన్నారు. ఈకార్యక్రమంలో సీఐ దుర్గారావు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ఎస్సైపై గృహహింస కేసు నమోదు
సాక్షి, కృష్ణా : గుడివాడలో ట్రాఫిక్ విధులు నిర్వహిస్తు ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో వీఆర్‌లోకి వెళ్లిన సబ్ ఇన్స్పెక్టర్పై అతని కోడలు గృహ హింస చట్టం కింద ఫిర్యాదు చేసింది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం పడమటలో నివాసం ఉండే శిరీషా, భాస్కర్‌కు 2013లో వివాహం అయింది. భార్య, భర్తలు ఇద్దరు హైదరాబాద్‌లో సాప్ట్వేర్ ఉద్యోగులు. వీరికి ఒక బాబు ఉన్నాడు. పెళ్లి సమయంలో కట్నం కింద ఐదున్నర లక్షలు, 15 సవర్ల బంగారం, అర ఎకరం పొలంతో పాటు, అడపడుచు కట్నం కింద రెండు లక్షలు ఇచ్చారు. తన బాబును చూడనివ్వటం లేదని, పైగా తన బ్యాంకు అకౌంట్నుంచి లోన్లు తీసుకుని, తనను వేధిస్తున్నారని శిరిషా విజయవాడలో ‘స్పందన’ కార్యక్రమంలో కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది. కమిషనర్ సూచన మేరకు గురువారం పటమట పోలీసులకు అమె ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నెరవేరిన గుడివాడ ప్రజల కల..
సాక్షి, విజయవాడ/గుడివాడ: తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీ రామారావు సొంత నియోజకవర్గమైన గుడివాడలో నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు(నాని) జిల్లాలో తిరుగులేని నాయకుడిగా గుర్తింపు పొందారు. గుడివాడ రాజకీయంలో ఆయన ఒక సంచలనం. ఏళ్ల తరబడి తమదైన శైలిలో జిల్లా రాజకీయాలు నడిపిన ఎన్నో కుటుంబాలను తెరమరుగు చేసిన చరిత్ర కొడాలి నానిది. నెరవేరిన గుడివాడ ప్రజల కల గుడివాడ ప్రజల కల నెరవేరింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంత్రి వర్గంలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని)కి చోటు దక్కటంతో ప్రజల సంబ రాలు చేసుకుంటున్నారు. గుడివాడ నియోజకవర్గం ఏర్పడ్డాక 25 ఏళ్ల క్రితం కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి కఠారి ఈశ్వర్‌కుమార్ మంత్రిగా పని చేయగా అనంతర కాలంలో గుడివాడ నుంచి మంత్రిగా పనిచేసిన వారు లేరు. తెలుగు యువత జిల్లా అధ్యక్షుడుగా రాజకీయ అరంగేట్రం.. తెలుగుదేశం పార్టీలో తెలుగు యువత జిల్లా అధ్యక్షుడిగా కొడాలి నాని రాజకీయాల్లోకి అరంగేట్రం చేశారు. మొదట్లో ట్రాన్స్‌పోర్టు నిర్వాహకుడిగా ఉంటూ రాజకీయాల్లో తనదైన శైలిలో రాణించారు. అప్పటికే తెలుగుదేశం పార్టీలో గుడివాడకు రావి కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి. అటువంటి తరుణంలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపున 2004లో అనూహ్యంగా టిక్కెట్టు దక్కించుకోవటమే కాకుండా ఆ ఎన్నికల్లో విజయం సాధించారు. దీంతో గుడివాడలో రావి కుటుంబానికి స్థానం లేకుండా చేశారు. 2009 ఎన్నికల్లో టీడీపీ తరఫున విజయం సాధించారు. అనంతరం 2013లో వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. 2014, 2019 ఎన్నికల్లో వరుసగా రెండుసార్లు వైఎస్సార్సీపీ తరపున గెలుపొందారు. గుడివాడ నియోజక వర్గం నుంచి వరుసగా నాలుగుసార్లు తిరుగులేని నేతగా కొడాలి నాని సత్తాను చాటుకున్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ తరఫున 19,749 ఓట్లు మెజార్టీతో నాలుగవ సారి విజయం సాధించారు. గుడివాడ నియోజకవర్గ ప్రజల్లో తనపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నారు. తెలుగుదేశం పార్టీ కొడాలి నానిని ఓడించేందుకు ఎన్ని కుట్రలు చేసినా ఆయన విజయాన్ని ఆపలేక పోయింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు వచ్చిన సమయంలో గుడివాడలో కొడాలి నానిని గెలిపిస్తే మంత్రిగా చేస్తానని మాట ఇచ్చారని ఆమాటను నేడు నిలబెట్టుకున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార పక్షంతో పాటు మంత్రి పదవి రావడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు తీస్తుందని అంటున్నారు. కొడాలి నాని శనివారం మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతకు ముందు ఆయన మాట్లాడుతూ...వైఎస్ జగన్ తనపై ఉంచిన నమ్మకాన్ని వొమ్ము చేయనని అన్నారున. -
భర్త నుంచి ప్రియుడిని కాపాడిన భార్య
సాక్షి, గుడివాడ : భార్య ప్రియుడిపై భర్త దాడి చేసి అతని బైక్‌ను దగ్ధం చేసిన ఘటన క్రిష్ణా జిల్లాలో చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పెదపారుపూడి మండలం వెంట్రప్రగడ గ్రామానికి చెందిన మురళీకృష్ణ, శ్యామలకు వివాహం జరిగింది. అయితే, మనస్పర్ధల కారణంగా ఐదేళ్ల నుంచి వీరు వేర్వేరుగా జీవిస్తున్నారు. ఈ సమయంలోనే శ్యామలకు ఎ.కొండూరు మండలం చీమలపాడుకు చెందిన గోకరాజుతో వివాహేతర సంబంధం ఏర్పడింది. శనివారం గోకరాజు వాంబే కాలనీలోని శ్యామల ఇంటికి వచ్చాడు. అయితే, అదే రోజు అర్ధరాత్రి మురళీకృష్ణ కూడా శ్యామల ఇంటికి వచ్చాడు. దీంతో ఇంట్లో ఉన్న ప్రియుడు గోకరాజును శ్యామల దాచి పెట్టింది. తలుపు తీయటానికి ఆలస్యం కావటంతో అనుమానం వచ్చిన మురళీ కృష్ణ ఇంట్లో వెతికాడు. గోకరాజు కనబడటంతో అతనిపై మురళీకృష్ణ కత్తితో దాడి చేశాడు. ఇది గమనించిన శ్యామల భర్త మురళీకృష్ణ కళ్లల్లో కారం కొట్టి ప్రియుడిని రక్షించుకుంది. మురళీకృష్ణ కళ్లు కనిపించకుండా ఉండటంతో శ్యామల, గోకరాజు ఇద్దరూ ఇంటి నుంచి పారిపోయారు. కోపంతో రగిలిపోయిన మురళీకృష్ణ ఇంటి బయట ఉన్న గోకరాజు బైక్‌ను దగ్ధం చేశాడు. గోకరాజుకు కత్తి గాయం కావటంతో చికిత్స నిమిత్తం గుడివాడ ఏరియా ఆస్పత్రిలో చేరాడు. ఆస్పత్రి నుంచి వచ్చిన సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది: కొడాలి
గుడివాడ(కృష్ణా జిల్లా): ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడిపై గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నాని(కొడాలి వెంకటేశ్వర రావు) తీవ్రంగా మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా కొడాలి విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు, రాధాకృష్ణల మధ్య జరిగిన సంభాషణల వీడియోతో వీరి అసలు నైజం బయటపడిందని, ఆ సంభాషణల్లో ఎన్టీఆర్ గురించి చంద్రబాబు చేసిన అసభ్యకరమైన వ్యాఖ్యలు తనను బాధించాయని కొడాలి అన్నారు. చంద్రబాబు వ్యాఖ్యలపట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు గురించి ఎన్టీఆర్ అభిమానిగా ముందు నుంచి చెబుతున్నానని, ఉచ్ఛం, నీచం లేనటువంటి దుర్మార్గుడు చంద్రబాబు నాయుడని శాపనార్ధాలు పెట్టారు. ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని కొట్టేసి, ఆయన పదవిని కూడా లాక్కుని మరణానికి కారణమైన నీచాతినీచుడు చంద్రబాబు అని విమర్శించారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉండి నాలుగు గోడల మధ్య ఎన్టీఆర్ గురించి మాట్లాడే భాషేనా అది...బయటకు వచ్చి ప్రజలు రాళ్లతో కొడతారేమోనని ఆయన విగ్రహాలకి దండలు వెయ్యటం, పథకాలకి పేరు పెట్టినట్లు నటించడం చంద్రబాబు నాయుడికి అలవాటేనని తూర్పారబట్టారు. బాబు ఎన్టీఆర్ పాలిట దుర్మార్గుడని, రాష్ట్రానికి పట్టిన శని అని దుయ్యబట్టారు. వైఎస్ జగన్ నాయకత్వంలో వచ్చే ఎన్నికల్లో ప్రజలు, చంద్రబాబును ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్‌ను కించపరిచే విధంగా మాట్లాడిన చంద్రబాబు నాయుడిని, రాజకీయంగా భూస్థాపితం చెయ్యటానికి తాను ముందు ఉంటానని, ఎన్టీఆర్ అభిమానులు అందరూ తనతో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇంకా చంద్రబాబు మాటలు విన్నాక కూడా ఎన్టీఆర్ అభిమానులు చంద్రబాబు వెంట ఉంటే ఆయన ఆత్మక్షోబిస్తుందని చెప్పారు. ఎన్టీఆర్ అభిమానులు అందరూ వైఎస్ జగన్ వెంట నడిచి ఫ్యాన్ గుర్తుకి ఓటేసి చంద్రబాబుకు చరమగీతం పాడాలని విన్నవించారు. -
గుడివాడలో టీడీపీ నాయకుల బరితెగింపు
సాక్షి, గుడివాడ: కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో టీడీపీ నేతలు బరితెగించారు. పోలింగ్ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ జోరుగా ప్రలోభాలకు తెరదీశారు. గుడివాడలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కొనుగోలు చేస్తూ తెలుగు తమ్ముళ్లు అడ్డంగా దొరికిపోయారు. గుడివాడ మున్సిపాలిటీలో శానిటరీ వర్కర్స్‌ను ఎన్నికల విధుల కోసం ఇతర ప్రాంతాలకు నియమించటంతో వారికి ఎలక్షన్ కమిషన్ పోస్టల్ బ్యాలెట్ సౌకర్యం కల్పించింది. ఇదే అదనుగా భావించిన టీడీపీ నాయకులు ఒక్కొక్క పోస్టల్ బ్యాలెట్‌కు రూ.2500 ఇస్తూ కెమెరాకు చిక్కారు. 200 మందికి పైగా మున్సిపల్ ఉద్యోగుల వద్ద నుంచి పోస్టల్ బ్యాలెట్లను తెలుగు తమ్ముళ్లు తీసుకున్నారు. ఆధోనిలోనూ పోస్టల్ ఓట్ల కొనుగోలు మరో వైపు కర్నూలు జిల్లాలో కూడా టీడీపీ నేతల ప్రలోభాలు ఎక్కువయ్యాయి. కర్నూలు జిల్లా ఆధోని నియోజకవర్గంలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్లు లాక్కుని దౌర్జన్యంగా టీడీపీ నేతలు ఓట్లేస్తున్నారు. ఈ విషయం తెలిసి వైఎస్సార్సీపీ నేతలు రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో జరపాల్సిన అధికార పార్టీ, ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభాలకు గురి చేసిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ నేతలు చేసిన ఫిర్యాదును కూడా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడంతో యువనేత జైమనోజ్ రెడ్డి వాగ్వాదానికి దిగారు. కళ్ల ముందు అన్యాయం జరుగుతున్నా రిటర్నింగ్ అధికారి పట్టించుకోకపోవడం అన్యాయమన్నారు. -
గుడివాడలో వైఎస్ షర్మిల రోడ్ షో
-
రోజుకో మాట.. పూటకో వేషం: వైఎస్ షర్మిల
సాక్షి, గుడివాడ: తన స్వార్థ రాజకీయ లబ్ధి కోసం ఏపీ ప్రత్యేక హోదాను చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. ఐదేళ్లు హోదాకోసం పోరాటం చేయకుండా.. ఎన్నికలు వస్తున్న వేళ దొంగదీక్షలు చేస్తున్నారని మండిపడ్డారు. రోజుకో మాట.. పూటకోవేషం తీరు అన్న విధంగా చంద్రబాబు తీరుందని ధ్వజమెత్తారు. అద్భుతమైన పరిపాలన ఇచ్చి, పేదలను ఆదుకున్న రికార్టు వైఎస్సార్‌కే చెందుతుందని ఆమె గుర్తుచేశారు. ఎలాంటి తారతమ్య భేదం లేకుండా పాలన చేశారని అన్నారు. సీఎం అంటే అలా ఉండాలని.. బాబు అనేక హామీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయలేదని మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ చేయలేదని, పిల్లలకు ఫీజు రీయింబర్స్ మెంట్ కూడా విడుదల చేయట్లేదని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ షర్మిల రోడ్ షోను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గుడివాడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి నానిని, మచిలీపట్నం లోక్‌సభ అభ్యర్థి వల్లభనేని బాలశౌరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సభలో వైఎస్ షర్మిల మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు నాయుడి పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు పడ్డారు. కనీస వైద్య సదుపాయం లేదు. పంటలకు గిట్టుబాటు ధరలేదు. డ్వాక్రా మహిళలకు రుణాలు మాఫీ చేయలేదు. ఇంత అమానుషం దేశంలో ఎక్కడాలేదు. పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేసి.. రైతులకు నీళ్లు ఇస్తామాన్నారు. ఐదేళ్లు గడిచిన పూర్తి చేయలేకపోయారు. అమరావతి నిర్మాణానికి 3500 కోట్లు ఇచ్చినట్లు కేంద్ర చెబుతోంది. కానీ ఇప్పటి వరకు పర్మినెంట్‌గా ఒక్కభవనం నిర్మించలేదు. బాబు వస్తే నిరుద్యోగులకు జాబు వస్తుంది అన్నారు. కానీ ఆయన కొడుకు లోకేష్‌కు మాత్రమే మంత్రి పదవి వచ్చింది. ఒక్క ఎన్నిక కూడా గెలవని లోకేష్‌కు ఏకంగా మూడు శాఖలను అప్పగించారు. పుత్రవాత్సల్యం అంటే ఇది కాదా. ఏపీకి హోదా ఊరిపి లాంటింది. దాన్ని నీరుకార్చడానికి చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు. ఆయన స్వార్థ రాజకీయం కోసం తాకట్టుపెట్టారు. ఎన్నికలు రాగానే మళ్లీ హోదా కోసం దొంగ పోరాటం చేస్తున్నారు. హోదా కోసం మొదటి నుంచి పోరాటం చేస్తున్న ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రమే. హోదాపై నిజం మాట్లాడే దమ్ము చంద్రబాబుకు లేదు. బీజేపీ, టీఆర్ఎస్తో మాకు పొత్తు ఉందని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. ఆ పార్టీలతో పొత్తుల కోసం ప్రయత్నించింది మీరు కాదా?. మాకు ఎవ్వరితోనూ పొత్తులు అవసరంలేదు. వైఎస్ జగన్ సింహంలా సింగిల్‌గా వస్తారు. మీ భవిష్యత్తు నా బాధ్యత అని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. గడిచిన ఐదేళ్లు ఏంచేశారు. 50 ఏళ్ల ఉమ్మడి ఏపీలో చేయని అప్పులు ఐదేళ్ల నవ్యాంధ్రప్రదేశ్‌లో చేశారు. 600 హామీలు ఇచ్చారు ఏ ఒక్కటీ అమలు చేయలేదు. చేపలకు ఎర వేసినట్లు ఎన్నికల ముందు పసుపు కుంకుమ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారు. తొమ్మిదేళ్లలో వైఎస్ జగన్ ప్రజల సమస్యల పట్ల పోరాటం చేశారు. మీ బాధలను చూసి చలించిపోయి మీకు సేవ చేయాలని తపిస్తున్నాడు. మళ్లీ రాజన్న రాజ్యంరావాలి అంటే వైఎస్ జగన్ రావాలి. పేదల బతుకులు మరాలి అంటే వైఎస్ జగన్ సీఎంకావాలి’’ అని షర్మిల అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
గుడివాడలో చంద్రబాబు సభ వెలవెల
సాక్షి, గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సభకు జనం లేక వెలవెలపోయింది. ఓ వైపు సభకు అనుకున్నంతగా జనం రాకపోగా మరోవైపు వచ్చినవారు చంద్రబాబు మాట్లాడుతుండగానే వెనుతిరిగారు. ఈ సభకు మూడు వేలు దాటని జనం, బాబు వచ్చేసరికి సగం ఖాళీ అయ్యారు. మిట్ట మధ్యాహ్నం ఎర్రటి ఎండలో వచ్చిన జనాన్ని తెలుగు తమ్ముళ్లు అష్టకష్టాలు పాలు చేశారు. దాహం వేస్తే కనీసం మంచినీళ్లు ఇవ్వకపోగా మజ్జిగ ప్యాకెట్లను ఒక్కొక్కరికి ఇవ్వాల్సిందిపోయి జనం మీదికి విసిరేశారు. దాహంతో తల్లడిల్లిన వారు మజ్జిక ప్యాకెట్ల కోసం ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఎండకు, తమ్ముళ్లు పెట్టే ఇబ్బందులకు తాళలేక వృద్ధుడు తప్పి స్పృహ తప్పి పడిపోయాడు. వెంటనే అతడిని 108లో ఆస్పత్రికి తరలించారు. డబ్బులు ఇచ్చి జనాన్ని తరలించిన తెలుగు తమ్ములు వచ్చిన వారి పేర్లను నమోదు చేసుకున్నారు. డబ్బులు ఇచ్చి బిర్యాని ప్యాకెట్లు పంచినా జనం లేకపోవడంతో టిడిపి నాయకుల తీరుపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. జనం లేక అసహనంతో అటు మోదీని, ఇటు వైఎస్ జగన్మోహన్రెడ్డిని మధ్యలో కేసీఆర్‌ను విమర్శించి తన ప్రసంగాన్ని ముగించి చంద్రబాబు వెళ్ళిపోయారు. గుడివాడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దేవినేని అవినాష్ బరిలో ఉన్న విషయం తెలిసిందే. -
అవిశ్వాస తీర్మానంలో మరో మలుపు
కృష్ణా : గుడివాడ మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా బాబ్జీ మీద పెట్టిన అవిశ్వాస తీర్మానం మరో మలుపు తిరిగింది. గతనెల 28న జరగాల్సిన అవిశ్వాసం నాటకీయ పరిణామాల మధ్య వాయిదా పడింది. బలం లేదని గ్రహించి అవిశ్వాస తీర్మానం వాయిదాకు టీడీపీ ప్రయత్నించిందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది. వాయిదా వెయ్యటాన్ని సవాల్ చేస్తూ వైఎస్సార్సీపీ హైకోర్టుకి వెళ్లింది. దీనిపై విచారణ చేసిన హైకోర్టు స్టే ఇచ్చింది. తదుపరి తీర్పు వెలువడే వరకు వైస్ చైర్మన్ మీద ఎటువంటి బలనిరూపణ చేయరాదంటూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు హైకోర్టు నుంచి గుడివాడ ఆర్డీఓకు ఉత్తర్వులు అందాయి. -
గుడివాడలో దంపతుల దారుణ హత్య
సాక్షి, గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో అర్థరాత్రి దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఒంటరిగా ఉంటున్న వృద్ధ దంపతులు.. దుండగుల చేతిలో దారుణ హత్యకు గురయ్యారు. రాజేంద్రరనగర్ నాలుగో లైన్లో నివాసం ఉంటున్న బొప్పన సాయిచౌదరి (72), నాగమణి (67) ఇంట్లోకి దుండగులు చొరబడి వారిని తీవ్రంగా కొట్టి హతమార్చారు. అనంతరం ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు దోచుకు వెళ్లారు. అంతేకాకుండా ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న కారును కూడా దుండగులు అపహరించుకు వెళ్లారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇంటి హాల్లో రక్తం మడుగులో పడిఉన్న మృతదేహాలను స్వాధీనం చేసుకుని, పోస్ట్ మార్టంకు తరలించారు. మరోవైపు రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తోంది. నిందితుల ఆచూకీ కోసం ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. కాగా ఈ హత్యకు పాల్పడింది దోపిడీ దొంగలా లేక ఇరతర్రా కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన కలకలం రేపడంతో ఘటనా స్థలానికి పెద్ద ఎత్తున స్థానికులు చేరుకున్నారు. మరోవైపు జిల్లా ఎస్పీ త్రిపాఠి సంఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
తిరిగి సొంత పార్టీలోకి చేరిన వైఎస్ఆర్సీపీ నేత
సాక్షి, గుడివాడ : ఇటీవల మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు సమక్షంలో టీడీపీలో చేరిన గుడివాడ మున్సిపల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ రవికాంత్ తిరిగి సొంత పార్టీలో చేరారు. ఆదివారం స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానితో కలిసి రవికాంత్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల కుట్రలు, బెదిరింపులను ఆయన మీడియా సమక్షంలో బయట పెట్టారు. త్వరలోనే టీడీపీ నేతలు తనను ఏ విధంగా ప్రలోభపెట్టారో ఆధారాలతో సహా బయటపెడతానని స్పష్టం చేశారు. చంద్రబాబు వైఎస్సార్సీపీ నాయకులను ప్రలోభ పెట్టి రాజకీయం చేస్తే ఇలాంటి సంఘటనలే జరుగుతాయని ఎమ్మెల్యే కొడాలి నాని హెచ్చరించారు. -
గుడివాడలో టీడీపీ నేతల హంగామా
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు సంబరాలు ఘర్షణకు దారి తీశాయి. గుడివాడ 19వ వార్డు ఉప ఎన్నికలో గెలుపుతో టీడీపీ నేతలు మంగళవారమిక్కడ హంగామా సృష్టించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ముందు బాణాసంచా కాల్చి తెలుగు తమ్ముళ్లు రెచ్చగొట్టే ధోరణి ప్రదర్శించారు. అంతేకాకుండా కార్యాలయంలోకి దూసుకొచ్చేందుకు ప్రయత్నించారు. వారి చర్యలను వైఎస్ఆర్ సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. వివరాల్లోకి వెళితే...స్థానిక టీడీపీ నాయకులు ఊరేగింపుగా పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. శరత్ థియేటర్ సమీపంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బాణాసంచా కాల్చి హంగామా చేశారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొడాలి నాని కారులో బయటకు వెళుతుండగా, అప్పుడే బాణాసంచా పేల్చేందుకు యత్నించారు. అయితే ఆ బాణాసంచా సామాగ్రిని వైఎస్ఆర్ సీపీ కార్యకర్తులు అక్కడ నుంచి పక్కకు తీసేశారు. ఈ ప్రయత్నాన్ని టీడీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో... ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. కాగా వైఎస్ఆర్ సీపీకి చెందిన కౌన్సిలర్ అనారోగ్యంతో మృతి చెందారు. సాధారణంగా ఏ పార్టీకి చెందిన సభ్యుడు మృతి చెందారో, ఆ పార్టీకి చెందినవారినే ఏకగ్రీవంగా ఎన్నుకోవడం సంప్రదాయంగా వస్తోంది. అయితే గుడివాడలో మాత్రం పరిస్థితి భిన్నంగా టీడీపీ తన అభ్యర్థిని పోటీకి దించింది. అంతేకాకుండా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుని గెలుపే లక్ష్యంగా ఒక్కో ఓటుకు దాదాపు రూ.7వేలు నుంచి రూ.10వేల వరకూ పంచి మీడియాకు అడ్డంగా దొరికిపోయింది కూడా. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయడంతో పాటు పోలీసులపై దౌర్జన్యానికి పాల్పడి ఎట్టకేలకు ఆ ఎన్నికలో గెలుపొందింది. పైపెచ్చు ఆ గెలుపుపై రెచ్చిపోతూ... వైఎస్ఆర్సీపీ శ్రేణులను రెచ్చగొట్టి... ఏదోఒక వివాదం చేసేందుకు యత్నించడం గమనార్హం. -
గుడివాడలో టీడీపీ నేతల హంగామా
-
గుడివాడలో దళితులపై పోలీసుల లాఠీ ఛార్జ్
-
ధ్యానంపై అవగాహన అవసరం
గుడివాడ టౌన్ : విద్యార్థి దశ నుంచే ధ్యానంపై పట్టు ఉండాలని రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం ఫౌండ్ ఆఫ్ ట్రస్టీ రాజకుమారి అన్నారు. స్థానిక రూరల్ మండలం తట్టివర్రు రోడ్డులోని పిరమిడ్ ధ్యాన కేంద్రాన్ని, గుడ్లవల్లేరు ఏఏఎన్‌ఎం అండ్ జీవీఆర్‌ఎస్‌ఆర్ హైస్కూల్ విద్యార్థులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా రాజకుమారి మాట్లాడుతూ ధ్యానం జ్ఞానాన్ని పెంచుతుందని, అది విద్యార్థి దశ నుంచే అలవరుచుకుంటే ఉన్నత శిఖరాలకు ఎదుగుతారన్నారు. విద్యార్థులు ధ్యానంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయుడు మనోహర్, జ్ఞానకేంద్ర ఉపాధ్యాయులు అనిత, అనిల్, మాధవి, వంశీ పాల్గొన్నారు. -
దేశమంతా చిల్లర గోల.. అక్కడ గ్రూపుల గోల
గుడివాడ టీడీపీలో అసమ్మతి సెగలు కొత్తవారిని కలుపుకోలేమంటున్న పాత నేతలు జనచైతన్య యాత్రలకు పిలవడం లేదు పార్టీ వీడుతామంటున్న బీసీ నేతలు గుడివాడ : దేశమంతా చిల్లర గొడవ సాగుతుండగా.. గుడివాడలో మాత్రం అధికార పార్టీలో గ్రూపుల గోల ఎక్కువైంది. కొత్తగా పార్టీలో చేరినవారిని కలుపుకుని వెళ్లేందుకు పాత నాయకులు అంగీకరించడంలేదు. కనీసం టీడీపీ చేపట్టిన జన చైతన్యయాత్రలకు కూడా పిలవడం లేదు. టీడీపీలోని కొందరు బీసీ నేతలు ఏకంగా ‘వారు ఆ పార్టీలో ఉన్నారు కాబట్టే మేం తెలుగుదేశంలో కొనసాగుతున్నాం. ఇక మేం టీడీపీలో ఉండలేం. సామూహికంగా వెళ్లిపోతాం..’ అని నియోజకవర్గ నేతల వద్ద చెప్పినట్లు సమాచారం. గెట్ టు గెదర్‌లో రగడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి, కౌన్సిలర్లు టీడీపీలో చేరిక అనంతరం వారం రోజుల క్రితం స్థానిక ఏలూరు రోడ్డులోని ఓ రెస్టారెంట్లో వార్డు స్థాయి నేతలతో గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాత టీడీపీ నేతలంతా నియోజకవర్గ ఇన్చార్జి రావి వెంకటేశ్వరరావుపై ఆగ్రహం వ్యక్తంచేసినట్లు సమాచారం. ‘రేపు వేరే పార్టీలో ఉన్న నేతను చేర్చుకుంటున్నాము. ఆయనే మీకు ఎమ్మెల్యే అభ్యర్థి అంటే మీరు ఆహ్వానిస్తారా.. మీరు వెళతారా..’ అని ప్రశ్నించినట్లు తెలిసింది. అర్ధరాత్రి 11 గంటల సమయంలో తమకు ఫోన్ చేసి వీరిని దొంగతనంగా పార్టీలో చేర్చుకోవాల్సిన గతి ఎందుకొచ్చిందని నిలదీసినట్లు సమాచారం. ‘రెండున్నరేళ్లు వీరితో మేం రాజకీయంగా పోరాటం చేశాం. ఇప్పుడు కలిసి ఎలా ఉంటాం...’ అని మరికొందరు చెప్పగా, ‘యలవర్తి ఆ పార్టీలో ఉన్నారు. కాబట్టి మేం ఈ పార్టీలో చేరాం. ఇలా అయితే మేం పార్టీ మారతాం..’ అని కొందరు బీసీ నేతలు చెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో పలువురు బీసీ నేతలు పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. దీంతో వారిని బుజ్జగించే పనిలో రావి నిమగ్నమయ్యారని ఓ నాయకుడు చెప్పారు. లింగం ప్రసాద్‌కు బుజ్జగింపులు గెట్ టు గెదర్ కార్యక్రమంలో టీడీపీ ఫ్లోర్ లీడర్ లింగం ప్రసాద్ బహిరంగంగానే తీవ్ర విమర్శలు చేసినట్లు తెలిసింది. ‘మున్సిపల్ ఎన్నికలు జరిగిన మొదట్లో పార్టీలోకి ఆహ్వానించాం. ఆయన రాలేదు. ఈ రోజు ఎందుకు వచ్చారు. ఎందుకు చేర్చుకున్నారు. కౌన్సిల్ ప్రారంభం నుంచి నేటి వరకు ముగ్గురు పిల్లల వ్యవహారంపై రాజీ లేని పోరాటం చేశాను. ఇప్పుడు ప్రజలకు ఏం సమాధానం చెబుతాం’ అని ఆయన ప్రశ్నించినట్లు సమాచారం. అయితే ఇవన్నీ విన్న రావి... లింగం ప్రసాద్‌ను బుజ్జగించేందుకు ప్రయత్నిస్తున్నారు. లింగం ప్రసాద్‌కు నామినేటెడ్ పదవి ఇచ్చి ఆయన్ను శాంతింపజేసేందుకు పార్టీ జిల్లా స్థాయి నేతలతో మాట్లాడతున్నట్లు సమాచారం. గుడివాడలోని టీడీపీ నేతల మధ్య గ్రూపుల గోల ఎటు దారితీస్తోందని ఆ పార్టీ సీనియర్లు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. -
కఠారికి రఘువీరారెడ్డి పరామర్శ
గుడివాడ : మాజీ ఎమ్మెల్యే కఠారి సత్యనారాయణరావు కుటుంబ సభ్యులను పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పరామర్శించారు. గురువారం రాత్రి స్థానిక బంటుమిల్లి రోడ్డులో ఉన్న కఠారి నివాసంలో ఆయన కుటుంబ సభ్యులను కలిశారు. కఠారి సత్యనారాయణరావు సతీమణి రత్నబాయమ్మ ఇటీవలే మృతిచెందారు. కఠారి కుటుంబంతో తమకెంతో అనుబంధం ఉందని రఘువీరారెడ్డి చెప్పారు. సత్యనారాయణరావు రెండుసార్లు ఎమ్మెల్యేగా , మున్సిపల్ చైర్మన్‌గా గెలిచారని, ఆయన కుమారుడు ఈశ్వర్‌కుమార్ తనతోపాటు ఎమ్మెల్యేగా గెలుపొంది మంత్రిగా పనిచేశారన్నారు. ఈ కుటుంబంతో కాంగ్రెస్ పార్టీకి విడదీయరాని బంధం ఉందని తెలిపారు. రత్నబాయమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కఠారి కుటుంబ సభ్యులు కఠారి ఈశ్వర్‌కుమార్, కఠారి రామ్‌కుమార్, మల్లిపూడి శ్రీనివాస చక్రవర్తితో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీసీసీ మాజీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, నాయకులు గానుగుల వీరనేతాజీ, రాజేష్, ఉంగరాల హైమావతి, భాగవతుల కోదండపాణి పాల్గొన్నారు. శిష్టా›్లదత్తాత్రేయులు కుటుంబానికి పరామర్శ గుడివాడకు చెందిన కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు శిష్టా›్లదత్తాత్రేయులు కు టుంబ సభ్యులను కూడా రఘువీరారెడ్డి పరామర్శించారు. ఇటీవల దత్తాత్రేయు లు తల్లి పద్మావతి మృతిచెందారు. ఈ సందర్భంగా వారి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. పద్మావతి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. రత్నాబాయమ్మకు ఘన నివాళి గుడివాడ టౌన్ : కుటుంబ అభ్యున్నతికి కఠారి రత్నబాయమ్మ ఎంతో పాటుపడ్డారని పలువురు వక్తలు పేర్కొన్నారు.ఆఫీసర్స్ క్లబ్లో మాజీ ఎమ్మెల్యే కఠారి సత్యనారాయణరావు సతీమణి రత్నబాయమ్మ సంతాపసభ గురువారం నిర్వహించారు. పలువురు ఆమె చిత్రపటం వద్ద నివాళులర్పించారు. మాజీమంత్రి కఠారి ఈశ్వర్‌కుమార్, ఆయన సోదరులను పరామర్శించారు. నివాళులర్పించిన వారిలో రాజ్యసభ మాజీ సభ్యుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), మున్సిపల్ వైస్ చైర్మన్ అడపా వెంకటరమణ (బాబ్జీ), మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు, లింగం ప్రసాద్, లంకదాసరి ప్రసాదరావు, నుగలాపు వెంకట, సురేష్‌బాబు ఉన్నారు. -
గుడివాడ ఎరువుల షాపుల్లో తనిఖీలు
గుడివాడ : గుడివాడలోని ఎరువుల దుకాణాలపై వ్యవసాయశాఖ ప్రత్యేక బృందం నిర్వహించిన తనిఖీల్లో అధీకృత లైసెన్సులు లేని కంపెనీలకు చెందిన రూ.4 లక్షల 7 వేల 550 విలువైన ఎరువులు, పురుగుమందులను గుర్తించి సీజ్ చేశారు. వ్యవసాయశాఖ డిప్యూటీ డైరక్టర్ ఎన్.నాగాచారి, ఎడిఎ జి.రవిప్రకాష్, ఎఓ బి.సురేష్‌లు బృందం ఈ దాడులు చేసింది. బంటుమిల్లి రోడ్డులోని సాయిశ్రీనివాస ఫెర్టిలైజర్స్‌లో రూ.3.87 లక్షలు, కిన్నెర కాంప్లెక్స్‌లోని గాయత్రి ఫెర్టిలైజర్స్‌లో రూ.20 వేల విలువైన పురుగుమందులు, ఎరువులను సీజ్ చేశారు. ఈ తనిఖీ బృందంతో పాటు గుడివాడ మండల వ్యవసాయాధికారి రంగనాధబాబు పాల్గొన్నారు. అధీకృత లైసెన్సులు లేని కంపెనీల ఎరువులు, పురుగు మందులను విక్రయిస్తే కఠినచర్యలు తప్పవని అన్నారు. -
నవలా రచయిత్రి కోగంటి కన్నుమూత
గుడివాడ టౌన్ : ప్రముఖ నవలా రచయిత్రి, మున్సిపల్ మాజీ చైర్పర్సన్ కోగంటి రాజబాపయ్య కుమార్తె కోగంటి విజయలక్ష్మి(69) కన్నుమూశారు. గురువారం రాత్రి కృష్ణా జిల్లా గుడివాడ రాజేంద్రనగర్‌లోని తన నివాసంలో ఆమె గుండెపోటుతో నిద్రలోనే తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 1946 జూలై 24న కోగంటి రాజబాపయ్య, శకుంతల దంపతులకు విజయలక్ష్మి జన్మించారు. 40 ఏళ్లకు పైగా నవలా రచయిత్రిగా ఆమె కీర్తి పొందారు. ఆమె రచించిన నవలలు పాఠకుల ఆదరణ పొందాయి. ఆమె రచించిన నవలల్లో జ్వలిత, నా కవిత, మన్నించు ప్రియా, చక్రతీర్థం, చక్రవ్యూహం తదితర నవలలు ప్రాచుర్యం పొంది ప్రజామన్ననలందుకున్నాయి. ఆమె ఆయుర్వేద వైద్యురాలిగా కూడా సేవలు అందించారు. ది సొసైటీ ఆయుర్వేద గ్రామీణ వైద్య వెల్ఫేర్‌లో శిక్షణ తీసుకుని ప్రభుత్వ సర్టిఫికెట్ పొంది ఆయుర్వేద వైద్యం మొదలుపెట్టారు. ఆమె అవివాహితగానే జీవితం కొనసాగించారు. ఆమె మృతి వార్త తెలుసుకున్న పలువురు ప్రముఖులు, సాహితీవేత్తలు ఆమె భౌతికకాయాన్ని సందర్శించి ఘననివాళులర్పించారు. -
ఏసీబీ వలలో రావికమతం వీఆర్వో
విశాఖ: విశాఖ జిల్లా రావికమతం మండలం గుడివాడ గ్రామ వీఆర్వో అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు పట్టు బడ్డాడు. గుడివాడ గ్రామానికి చెందిన రాజు అనే రైతు హుద్‌హుద్ తుపాను బాధితుడు. దెబ్బతిన్న ఆయన పామాయిల్ తోటకు ప్రభుత్వం నష్ట పరిహారం మంజూరు చేసింది. అయితే, దానిని పొందాలంటే వీఆర్వో ధ్రువీకరణ అవసరం. అందుకోసం వీఆర్వో ముత్యాలు రూ.50 వేలు డిమాండ్ చేశాడు. దీని పై రాజు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. గురువారం ఉదయం గుడివాడలోని వీఆర్వో గదిలో బాధిత రైతు డబ్బు అందజేస్తుండగా అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. వీఆర్వో ని అదుపులోకి విచారిస్తున్నారు. -
పోస్టల్ ఉద్యోగి ఇంట్లో బంగారం చోరీ
గుడివాడ : ఓ పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన కృష్టా జిల్లా గుడివాడ నీలామహల్ థియేటర్ రోడ్డులో శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాలు.. పోస్టల్ ఉద్యోగి ఇంట్లో గుర్తుతెలియని దుండగులు చోరికి పాల్పడ్డారు. భార్యాభర్యలను కట్టేసి వారి ఇంట్లో నుంచి 18 కాసుల బంగారంతో పాటు రూ.50 వేల నగదు చోరీచేసినట్లు పోలీసులకు బాధితులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించినట్లు చెప్పారు. -
యువతిపై గ్యాంగ్ రేప్
గుడివాడ: కృష్ణాజిల్లా గుడివాడలో దారుణం జరిగింది. ఓ యువతిపై దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.. ఆటోలో ప్రయాణిస్తున్న యువతిపై ఆటో డ్రైవర్ తన ఇద్దరు స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. బాధితురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడటంతో, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇందుకు సంబంధించి ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. యువతిని వైద్య పరీక్షల నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
పోలీస్ వికృత చేష్టలు
-
గుడివాడలో కొడాలి నాని ఆందోళన
-
గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద కొడాలి నాని ఆందోళన
గుడివాడ : అక్రమార్జన కోసం కృష్ణాజిల్లా గుడివాడ ఆఫీసర్స్ క్లబ్లో పేకాట నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్ఆర్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌లలో క్లబ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులు, మద్దతుదారులు, మహిళలతో కలిసి కొడాలి నాని శుక్రవారం గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద ఆందోళనకు దిగారు. -
కాయ్ రాజా.. కాయ్..
* ప్రవేశం ఇలా.. *పేకాట ఆడాలనకునే వ్యక్తి ముందుగా రూ.2వేలు చెల్లించి లోపలికి వెళ్లాల్సి ఉంది. *ఎంత డబ్బుతో ఆడగలడో దానికి సంబంధించి టోకెన్‌ను తీసుకుని టేబుల్‌పై కూర్చుని ఆడాలి. *ఆటలో గెలిచిన వ్యక్తి తన వద్ద ఉన్న టోకెన్లు గుడివాడ ఆటోనగర్‌లోని 5వ నంబరు రోడ్డులో ఉన్న ఓ ఇంట్లో ఇచ్చి ఆ మేరకు సొమ్ము తీసుకోవాల్సి ఉంటుంది. గుడివాడ అర్బన్ : గుడివాడ పరిసర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. పలు ప్రాంతాల నుంచి జూదరులు తరలివస్తున్నారు. రోజూ లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నాయి. గుడివాడ రూరల్ మండలంలోని బొమ్ములూరు గ్రామానికి చెందిన అధికార పార్టీ నేత ఈ జూద శిబిరాలు నిర్వహిస్తూ భారీగా సొమ్ము చేసుకుంటున్నాడు. ఎవరైనా పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే రాజకీయ ఒత్తిళ్లు తీసుకొస్తున్నారు. మరోవైపు కొందరు పోలీసులు కూడా ముడుపులు పుచ్చుకుని జూద శిబిరాల నిర్వహణకు సహకరిస్తున్నారని తెలుస్తోంది. ఎక్కడ ఆడుతున్నారంటే.. పట్టణ పరిసరాల్లోని 20 ప్రాంతాల్లో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఇవన్నీ ఏకకాలంలో కాకుండా ప్రతి రోజు ప్రాంతాలు మారుస్తూ ఉంటారు. ఆ సమాచారాన్ని ఎప్పటికప్పుడు జూదరులకు తెలియజేస్తూ పకడ్బందీగా కొనసాగిస్తున్నారు. పట్టణంలోని మార్కెట్ యార్డు సమీపాన ఓ ప్రైవేటు కార్యాలయం, మార్కెట్ యార్డుకు ఎదురుగా ఉన్న కాలువగట్టుపై ఓ బిల్డింగ్‌లో పేకాట ఆడుతున్నారు. బొమ్ములూరు గోదాముల వద్ద, పామర్రు రోడ్డులోని రైల్వేగేటు సమీపంలోని ఓ ఐరన్ దుకాణం వద్ద, రామనపూడి నుంచి నూజెళ్లకు వెళ్లే రోడ్డులో కాలువగట్టుపై పాకలో, ఇదే రోడ్డులో రొయ్యిల చెరువు వద్ద జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. ఆయా ప్రాంతాలన్నీ రెండు పోలీసు స్టేషన్లకు సరిహద్దులో ఉండటం వల్లే వాటిని ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. ప్రజలు ఫోన్ చేసి పేకాట గురించి సమాచారం ఇస్తే పోలీసులు ఆ ప్రాంతం తమది కాదంటే తమది కాదు.. అంటూ బదులిస్తున్నారు. చివరికి ఏ స్టేషన్ వారు వెళ్లాలని నిర్ణయించుకునేలోపు జూదరులు జారుకుంటున్నారు. సూత్రధారి అధికార పార్టీ నేత! గతంలో పేకాట క్లబ్బులు నడిపిన అనుభవం ఉన్న టీడీపీ నాయకుడు ఒకరు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్లీ తన చేతికి పని చెప్పారు. కొందరు పోలీసులకు మామూళ్లు రుచిచూపి తన దందాను కొనసాగిస్తున్నాడు. దాదాపు 120మందికిపైగా ఈ ఆటలో పాల్గొంటారని తెలుస్తుంది. పేకాట ఆడే ప్రదేశాన్ని ముందుగానే ఫోన్ ద్వారా జూదరులకు సమాచారం ఇవ్వడం ఇక్కడి ప్రత్యేకత. రోజూ మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10గంటల వరకు 13ముక్కల ఆట, రాత్రి 10 నుంచి తెల్లవారుజాము 3గంటల వరకు లోనా-బయటా(కోసు)లను నిర్వహిస్తున్నట్లు సమాచారం. నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతున్నట్లు తెలుస్తోంది. పోలీసుల్లో కోవర్టులు పేకాట ఆడుతున్నారనే సమాచారాన్ని ఇటీవల ఓ వ్యక్తి జిల్లా ఎస్పీ కార్యాలయ హెల్ప్‌లైన్‌కు ఫోన్‌చేసి తెలియజేశాడు. ఆ సమాచారం జూద శిబిరాల నిర్వాహకుడికి అనుకూలంగా ఉన్న వ్యక్తికి అందింది. దీంతో ముందుగానే జాగ్రత్తపడ్డారు. గత శుక్రవారం గుడ్లవల్లేరు శ్మశానవాటిక, గుడివాడ మార్కెట్ యార్డుల వద్ద జూదశిబిరాలపై పోలీసుల దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకుని, అతి తక్కువ లభించినట్లు వెల్లడించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిర్వాహకుడిపై కేసులు లేకుండా చేసేందుకు గాను రూ.40వేలు తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే వ్యక్తి గతంలో జూద శిబిరాలు నిర్వహిస్తుండగా అప్పటి ఎస్పీ జయలక్ష్మి తీవ్రంగా హెచ్చరించడంతో కొంతకాలం జూదక్రీడకు తెరపడింది. -
కౌలుకు రాంరాం!
వర్షాభావం నేపథ్యంలో ముందుకురాని కౌలు రైతులు రేటు తగ్గించి, వడ్డీలేని రుణం ఇస్తామన్నా ససేమిరా సాగు ఆలస్యం నేపథ్యంలో తపానులతో నష్టమని భయం ఆందోళన చెందుతున్న భూయజమానులు గుడివాడ : జిల్లా వ్యాప్తంగా వరిసాగయ్యే భూములు 6.34 లక్షల ఎకరాలు ఉన్నాయి. ఈ భూములను యజమానులతోపాటు, కౌలు రైతులు సాగుచేస్తుంటారు. జిల్లాలో 3.40 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ఒకప్పుడు పొలాలను కౌలు తీసుకోవడానికి గుడివాడ, చల్లపల్లి, ఉయ్యూరు, కంకిపాడు తదితర డెల్టా ప్రాంతాల్లో కౌలు రైతులు పోటీపడేవారు. కొన్ని చోట్ల కౌలు మొత్తం ముందుగానే చెల్లించే వారు. ప్రస్తుతం రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల్లో వ్యవసాయం చేసేందుకు కౌలు రైతులు ముందుకు రావడంలేదు. గుడివాడ నియోజకవర్గంలోనే దాదాపు 35వేల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారుల అంచనా. కౌలు రైతులకు ప్రభుత్వం రుణార్హత కార్డులు ఇచ్చినా బ్యాంకర్లు మాత్రం అప్పు ఇవ్వడంలేదు. ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులు, కాలువలకు నీళ్లు వస్తాయో రావో తేలియని పరిస్థితి కౌలు రైతులను ప్రశ్నార్థకంగా మార్చింది. దీంతో కౌలుకు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. గుడివాడ ప్రాంతంలో ఎకరానికి గతేడాది 17 నుంచి 20 బస్తాలు కౌలు ఉండగా ఈ ఏడాది ఎకరానికి రెండు బస్తాలు కౌలు తగ్గిస్తామని యజమానులు చెబుతున్నారు. దీనికి తోడు ఎటువంటి వడ్డీ లేకుండా ఎకరానికి రూ.5వేల చొప్పున రుణం ఇస్తామని ఆశపెడుతున్నా కౌలుదారులు ముందుకు రావటం లేదు. ఏడాది మొదట్లో చేసుకున్న ఒప్పందాలను సైతం రైతులు ఇప్పుడు రద్దుచేసుకుంటున్నారు. ఒకొక్కరిది ఒక్కో కథ గుడివాడకు చెందిన శ్యామ్ పాలవ్యాపారం చేస్తుంటాడు. వ్యవసాయంపై ప్రేమ, లాభాలు వస్తాయన్న ఆశతో ఏటా 20 ఎకరాలు కౌలు చేస్తున్నాడు. ఎకరానికి రూ.20 వేల చొప్పున పెట్టుబడులకు వెచ్చిస్తున్నాడు. రెండేళ్లుగా వరుస తుపానుల కారణంగా పెట్టుబడులు సం గతి దేవుడెరుగు అప్పులు తెచ్చి కౌలు చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది ఎకరం కూడా కౌలు చేయకూడదని ఒట్టుపెట్టుకున్నాడు. మోహన్రావుదీ అదే పరిస్థితి తన కుటుంబం మొత్తం ఒకరి వద్ద కూలికి వెళ్లే కంటే తన పొలంలోనే పనిచేసుకుంటే హుందాగా ఉంటుందని ఏళ్లతరబడి కౌలు వ్యవసాయం చేస్తున్నాడు. తుపానుల కారణంగా మూడేళ్లుగా ఒక్క గింజ మిగల్లేదు. వ్యవసాయంపై ప్రేమ చావక ఈ ఏడాది రెండు ఎకరాలే కౌలు చేయాలని నిర్ణయించాడు. గుడివాడ రూరల్ మండలానికి చెందిన నరసింహారావుదీ అదే పరిస్థితి. గతేడాది కంటే ఈఏడాది ఎకరానికి రెండు బస్తాల కౌలు తగ్గించి ఇవ్వాలని భూయజమాని చెప్పినా తనవల్ల కాదని కాడిపడేశాడు. రెండు ఎకరాలే ఒప్పుకున్నా ఏటా ఏడెకరాలు కౌలు చేస్తున్నా. ఎప్పటికప్పుడు నష్టాలే మిగులుతున్నాయి. ఈ ఏడాది కౌలు చేయకూడదని నిర్ణయించుకున్నా. మమకారం చావక రెండు బస్తాలు కౌలు తగ్గిస్తానని రైతు చెబితే ఈ ఏడాది కేవలం రెండు ఎకరాలు మాత్రమే కౌలు చేస్తున్నా. ఈ ఏడాదీ వర్షాలు లేకపోవడంతో పంట దిగుబడిపై అనుమానంతో ఎవరూ ముందుకు రావడం లేదు. - గూడపాటి మోహన్, గుడివాడ ఈ ఏడాది సాగు చేయడం లేదు ఏటా కౌలు చేయడం వల్ల నష్టాలు బారిన పడుతూనే ఉన్నాం. కౌలు చెల్లించలేక అప్పులపాలు అవుతున్నాం. ప్రభుత్వ రుణామాఫీ ఇంకా అమలు చేయలేదు. దీంతో ఈ బాధలు ఇక పడలేమని ఈ ఏడది కౌలు చేయడం మానేశాను. ప్రభుత్వం ఇప్పటికైన కళ్ళు తెరవకపోతే కౌలు వ్యవస్థ పూర్తిగా కనుమరుగవుతుంది. - నిమ్మగడ్డ నాగశాస్త్రి, బిళ్లపాడు, గుడివాడ రూరల్ మండలం. సాగు నీరు ఆలస్యమైంది సాగు నీటి విడు దల ఆలస్యంగా వల్ల సార్వా సాగు చేయడం కష్టంగా మారింది. కాల యాపన కావడం వల్ల దిగుబడి తగ్గే అవకాశాలు ఉన్నాయి. ఈ ఏడాది కూడా ప్రభుత్వం సాగునీటిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ సమయంలో వ్యవసాయం చేసినా నష్టాలు తప్ప మిగిలేది ఏమీ లేదు. అందువల్ల ఏడాది వ్యవసాయం మానేశా. - కొండపల్లి రేణుకారెడ్డి, జనార్దనపురం, నందివాడ మండలం -
విశ్వాసమే రక్షిస్తుంది
అంతర్జాతీయ సువార్తికులు బ్రదర్ అనిల్‌కుమార్ గుడివాడ : ఏసుక్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని, ఆయనపట్ల విశ్వాసమే మానవులను సర్వదా రక్షిస్తుందని ప్రపంచ సువార్తీకులు బ్రదర్ అనిల్‌కుమార్ స్పష్టంచేశారు. బుధవారం స్థానిక పెదఎరుకపాడులో పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి నూతనంగా నిర్మించిన న్యూలైఫ్ ప్రార్థనా మందిరాన్ని ప్రారంభించిన ఆయన అనంతరం జరిగిన సభలో సువార్త ఉపన్యాసం చేశారు. వేల సంఖ్యలో హాజరైన క్రైస్తవ విశ్వాసులనుద్దేశించి మాట్లాడుతూ మానవులు చేసిన పాపాలకు ఆయన మూల్యం చెల్లించాడని అందుకే క్రీస్తును అంగీకరించిన వారంతా నీతిమంతులేనని అన్నారు. క్రీస్తు మహిమలు ద్వారా గుడివాడ పట్టణం అంతా సస్యశ్యామలంగా ఉండాలని ఆయన ప్రార్థనలు చేశారు. ప్రపంచ సువార్తికుడుగా దేవుడు తనకి ప్రసాదించిన శక్తితో తాను ఈ మాటలు చెప్పగలుగుతున్నానని అన్నారు. ప్రభువునందు విశ్వాసం,కృప వల్ల ప్రతి ఒక్కరూ రక్షించబడతారని చెప్పారు. పాటలతో ఉర్రూతలూరించిన అనిల్‌కుమార్... బ్రదర్ అనిల్‌కుమార్ నూతనంగా రూపకల్పన చేసిన పాటల సీడీలోని కొత్తపాటలు పాడి కార్యక్రమానికి హాజరైన వారందరినీ ఉర్రూతలూగించారు. ‘నిబ్బరంకలిగి ధైర్యంగా ఉండు..’ అంటూ పాడిన పాట అందరిలో ఉత్సాహాన్ని నింపింది. బ్రదర్ అనిల్‌కుమార్ సందేశాన్ని ప్రముఖ సువార్తికుడు సజ్జా బర్నబాస్ తెలుగులోకి అనువదించారు. న్యూలైఫ్ ప్రార్ధనా మందిరం పాస్టర్ బిల్లిపల్లి ప్రభాకర్‌రెడ్డి, బిల్లిపల్లి ఇజ్రాయోల్రెడ్డి పాల్గొనగా అనీల్ వరల్డ్ ఇవాంజలిజం(ఎడబ్ల్యూఈ) రాష్ట్ర కోఆర్డినేటర్ శామ్యూల్ తొలుత అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని), గుడివాడ మున్సిపల్ చైర్మన్ యలవర్తి శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ అడపా బాబ్జీ, మండలి హనుమంతరావు, పాలేటి చంటి, పాస్టర్లు అప్పికట్ల జాషువా, క్రీస్తురాయబారి, సజ్జా బర్నబాస్, టిజె దాస్, భాస్కరరావు, కరుణాసాగర్, జడా జానన్న, నేలపాటి శామ్యూల్ పాల్గొన్నారు. ప్రేయర్ పాస్టర్ ఫెలోషిప్ ఘనసన్మానం... బ్రదర్ అనిల్‌కుమార్‌ను గుడివాడ డివిజన్ ప్రేయర్ పాస్టర్స్ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఫెలోషిప్ గుడివాడ డివిజన్ అధ్యక్షులు జి.శ్యాంబాబు, సునీల్‌రెడ్డి, బి.మోషే, డివివి.ప్రసాద్, సంఘ కాపరులు ఆమెన్, పరిశుద్ధ భూషణం, సునీల్, ఎలీషా పాల్గొన్నారు. -
భవన నిర్మాణ రంగం కుదేల్!
అమాంతం పెరిగిన సిమెంట్ ధర జిల్లాలో రూ.10 కోట్ల భారం ఖాళీగా ఉంటున్న కార్మికులు గుడివాడ : సిమెంటు ధరల దెబ్బకు భవన నిర్మాణ రంగం కుదేలవుతుంది. దీనికి తోడు ఇసుక, ఇనుము, కంకర ధరలకు రెక్కలు రావడంతో భవన నిర్మాణాలకు తీరని విఘాతం కల్గిస్తున్నాయి. నెల రోజులుగా పనులు కార్మికులు ఖాళీగా ఉంటున్నారు. నెలలో మూడు సార్లు సిమెంటు, తదితర ముడిపదార్థాల ధరలు పెరగడంతో భవనాలు నిర్మించలేమని యజమానులు చేతులెత్తేస్తున్నారు. భవన నిర్మాణ రంగానికి అత్యంత గిరాకీగా ఉండే ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఇటువంటి చేదు అనుభవం ఎదురవ్వడంతో దీనిపై ఆధార పడిన కుటుంబాలు పనుల్లేక అల్లాడి పోతున్నారు. సిమెంటు కంపెనీల సిండికేట్ కారణంగా సిమెంటు ధరలు మరింత పెరిగిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. సిమెంటు ధరలు పెరుగుదల ఫలితంగా జిల్లా వ్యాప్తంగా భవన నిర్మాణ రంగంపై నెలకు రూ.10కోట్లకు పైగా భారం పడే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా సిమెంటుతో ముడిపడి ఉన్న ప్రభుత్వ పనులు తాము చేయలేమని కాంట్రాక్టర్లు చేతులెత్తేయడంతో అభివృద్ధి పనులకూ విఘాతం కలుగుతోంది. నెల రోజుల్లో మూడుసార్లు పెరిగిన సిమెంటు ధరలు... ఈ ఏడాది మార్చి31 తరువాత నెలరోజుల్లోనే మూడుసార్లుగా సిమెంటు కంపెనీలు ధరలు పెంచారు. మార్చి 31 నాటికి ఏగ్రేడు కంపెనీలు బస్తా సిమెంటు ధర రూ.240 ఉండగా బీగ్రేడు కంపెనీలవి రూ. 225కి అమ్మారు. సీగ్రేడు కంపెనీల బస్తాధర రూ.190 చొప్పున అందించారు. అయితే మే1న అన్నికంపెనీలు బస్తాకు రూ.40 చొప్పున పెంచగా అదేనెల వారం రోజుల్లోపే బస్తాకు రూ 30 అదనంగా పెంచారు. ఈనెల 18నుంచి అన్నికంపెనీలు మరో 10 అదనంగా పెంచారు. దీన్ని బట్టి నెలన్నరలో అన్నికంపెనీలు బస్తాకు రూ.80 చొప్పున పెంచారని చెబుతున్నారు. ప్రస్తుతం ఏగ్రేడ్ కంపెనీల బస్తా సిమెంటు ధర రూ.310 కాగా బీగ్రేడు కంపెనీల బస్తా సిమెంటు రూ.300కి చేరింది. సీగ్రేడు సిమెంటు రూ.280కి అందిస్తున్నారు. నిర్మాణ రంగానికి ప్రధానమైన సిమెంటు ధరల పెరుగుదల కార్మికుల ఉపాధిపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం సిమెంటు వినియోగం 10శాతానికి పడిపోయిందని వ్యాపారులు చెబుతున్నారు. జిల్లా ప్రజలపై రూ.10 కోట్లు భారం.. జిల్లా వ్యాప్తంగా 30 రకాల కంపెనీలకు చెందిన సిమెంటు నెలకు సగటున 62.5వేల టన్నులు వినియోగిస్తారు. జిల్లాలో వినియోగించే మొత్తం సిమెంటు వినియోగంపై దాదాపు రూ.10 కోట్లభారం పడే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. ఇప్పటికే ఇసుక కొరత కారణంగా అపార్టుమెంట్లు అనుకున్న సమయానికి పూర్తి చేసి ఇవ్వకపోవడంతో అటు కొన్న వారు నిర్మాణదారుడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఫినిషింగ్ పనులపై ప్రభావం... సిమెంటు ధరలు పెరగడంతో భవన నిర్మాణ దారుడి బడ్జెట్ దాటుతుంది. దీంతో భవనం ఫినిషింగ్ పనులపై ప్రభావం పడుతుంది. రంగులు, ఫ్లోరింగ్, ఉడెన్ కార్పంటింగ్ పనులపై దీని ప్రభావం చూపి సంబంధింత వ్యాపారాలు మందగిస్తాయి. సిమెంటు ధరల ప్రభావం ఇతర వ్యాపారాలపై కూడా ఉంటుంది. - టి.భాస్కర్ , సతీష్ పెయింట్స్ అధినేత అల్లాడిపోతున్నాం..? సిమెంటు ధరల ప్రభావం భవన నిర్మాణ రంగంపై ఆధారపడిన ప్రతి కుటుం బంపై పడుతుంది.నిర్మాణాలు ఆగి పోతే ఫ్లంబర్ నుంచి అన్ని రకాల చేతిపనుల వారు పనులు లేక అల్లాడి పోవాల్సిందే. దీని ప్రభావం దాదాపు రెండు నెలలు పాటు చూపుతుంది. ఇష్టారాజ్యంగా ధరలు పెంచితే లక్షలాది మంది కార్మికులు అల్లాడి పోవాల్సిందే. - లక్ష్మణరావు, భవన నిర్మాణ కార్మికుడు -
‘గుడివాడ’కు రుణపడి ఉంటా
వైఎస్సార్సీపీ గుడివాడ ఎమ్మెల్యే కొడాలినాని గుడివాడ, న్యూస్‌లైన్: గుడివాడ నియోజకవర్గ ప్రజలకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని వైఎస్సార్సీపీ గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) పేర్కొన్నారు. గుడివాడ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ అభ్యర్థిరావి వెంకటేశ్వరరావుపై 11573 ఓట్ల మెజార్టీతో విజయంసాధించిన అనంతరం విజయవాడలోని కౌంటింగ్ హాలువద్ద విలేకరులతో మాట్లాడారు. తనను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించిన గుడివాడ నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. ప్రజలిచ్చిన తీర్పు గౌరవిస్తాం... సీమాంధ్రలో తమ పార్టీకి ప్రజలిచ్చిన తీర్పును గౌరవిస్తామని ఎమ్మెల్యే కొడాలినాని పేర్కొన్నారు. తమ పార్టీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కల్పించారని చెప్పారు. రాష్ట్రంలో ప్రజలకు ఏ అన్యాయం జరిగినా వాళ్ల తరఫున పోరాటం చేస్తామన్నారు. అయితే రాష్ట్రంలో బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రభావం కారణంగా ఒకటి రెండు శాతం ఓట్ల తేడాతోనే ఓటమి పాలయ్యామని తెలిపారు. రాబోయే కాలంలో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని అన్నారు. -
కొడాలి నాని హ్యాట్రిక్ రికార్డు
'గుడివాడ ఎవడబ్బ సొత్తూ కాదు' అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని నిరూపించారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల బరిలోకి దిగిన కొడాలి నాని భారీ మెజార్టీతో విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ...ఓట్ల తేడాతో గెలుపొందారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించారు. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నానికి గుడివాడ నియోజకవర్గంలో మంచి పట్టుంది. కృష్ణాజిల్లా వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం చేసుకున్నారు. ఇక ఓ పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి వెంకటేశ్వరరావు ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీనపడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకే అయ్యింది. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన అట్లూరి సుబ్బారావు నామమాత్రంగానే నిలిచారు. -
చివరి రౌండ్లో జలీల్ ఖాన్ విజయం
హైదరాబాద్ : కృష్ణాజిల్లాలోని 16 నియోజకవర్గాల్లో అయిదు స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. విజయవాడ వెస్ట్, నూజివీడు, గుడివాడ, పామర్రు, తిరువూరు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. నూజివీడు- మేకా ప్రతాప్ అప్పారావు, గుడివాడ-కొడాలి నాని, పామర్రు-ఉప్పులేటి కల్పన, విజయవాడ వెస్ట్-జలీల్ ఖాన్ గెలుపొందారు. కాగా విజయవాడ వెస్ట్ స్థానానికి హోరాహోరీగా జరిగిన పోరులో చివరి రౌండ్లో జలీల్ ఖాన్ రెండువేల మెజార్టీతో గెలుపొందారు. ఇక గన్నవరం, కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ, పెనమలూరు, విజయవాడ సెంట్రల్,విజయవాడ ఈస్ట్, మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట, అసెంబ్లీ స్థానాల్లో సైకిల్ హవా కొనసాగింది. అలాగే కృష్ణాజిల్లాలోని విజయవాడ, మచిలీపట్నం ఎంపీ సీట్లను టీడీపీ సొంతం చేసుకుంది. -
ముందంజలో కొడాలి నాని
గుడివాడ : కృష్ణాజిల్లా గుడివాడలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొడాలి నాని ముందంజలో ఉన్నారు. ఆయన తన సమీప టీడీపీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావుపై ఆధిక్యంలో 630 ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు. కాగా మచిలీపట్నంలో పేర్ని నాని వెనుకంజలో ఉన్నారు. -
ప్రచారంలో తిప్పించుకుని సొమ్ము ఎగవేత!
గుడివాడలో తెలుగు తమ్ముళ్ల నిర్వాకం ప్రచారానికి తిప్పుకుని, ఓటు వేయడానికి కూడా సొమ్ము ఇస్తామని ప్రలోభం పోలింగ్ రోజు మాయం టీడీపీ ఆఫీసు వద్ద పలువురి రాస్తారోకో గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : ‘మేము ఓటుకు రూ.1200 ఇస్తాం.. మీరు కొడాలి నానికి ఓటువేయవద్దు..అని టీడీపీ నాయకులు వచ్చి చె ప్పారు.. రాత్రంతా వీరికోసం ఎదురు చూశాం.. తీరా డబ్బు ఇవ్వకుండా, ఆఫీసులో లేకుండా వెళ్లిపోయారు.. మా గతి ఏమిటి?.. డబ్బు ఇచ్చే వరకు ఇక్కడ నుంచి కదలం...’ అని పట్టణానికి చెందిన సుమారు వెయ్యి మంది ఏలూరు రోడ్డులోని టీడీపీ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. ఈ సం దర్భంగా గుడివాడ-హనుమాన్‌జంక్షన్ రహదారిపై గంటకు పైగా రాస్తారోకో చేశారు. అక్కడే ఉన్న టీడీపీ నేతలతో వా గ్వాదానికి దిగారు. చివరికి పోలీసులు వచ్చి వారిని చెల్లా చె దురు చేసి పార్టీ కార్యాలయం గేట్లు మూసివేశారు. బుధవా రం ఉదయం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తమ పార్టీకి ప్రచారానికి వచ్చేవారితోపాటు ఓటు వేసే వారికి డబ్బు ఇస్తామంటూ పట్టణానికి చెందిన టీడీపీ నాయకులు వివిధ వార్డుల్లోని ప్రజలను మభ్యపెట్టారు. వైఎస్సార్ సీపీ గుడివాడ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కొడాలి శ్రీ వెం కటేశ్వరరావు(నాని)కి ఓటు వేయొద్దని కూడా వారికి హు కుం జారీ చేశారు. పలు వార్డుల్లో కొంతమందికి సొమ్ము ఇ చ్చారు. మరికొంత మందికి ఇవ్వలేదు. ప్రచారంలో పాల్గొని సొమ్ము అందని పలువురు స్థానికులు టీడీపీ నేతలను నిల దీసేందుకు వందల సంఖ్యలో బుధవారం పార్టీ కార్యాల యానికి వచ్చి ముట్టడించారు. డబ్బు ఇచ్చే వరకు ఇక్కడ నుం చి కదిలేది లేదంటూ ఆందోళన చేశారు. ఆ సమయం లో పార్టీ కార్యాలయంలో ఉన్న పర్వతనేని బుడ్డీబాబును ‘మాకు డబ్బులు ఎందుకు ఇవ్వరూ?’ అంటూ ప్రశ్నించారు. తనకేమీ తెలియదని, ఇక్కడ నుంచి వెళ్లిపోవాలని అతడు బదులివ్వడంతో వారు తీవ్ర ఆగ్రహం చెందారు. పార్టీ కార్యాలయం ఎదుట ఏలూరు రోడ్డుపై ధర్నా ప్రారంభించారు. ‘టీడీపీ డౌన్ డౌన్.. రావి వెంకటేశ్వరరావు డౌన్..డౌన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. గంటన్నరపాటు వీరి ఆందోళన కొనసాగడంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. స్థానిక 30వ వార్డుకు చెందిన నాగమణి ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రచారం అన్ని రోజులూ తమను వెంటబెట్టుకుని తెలుగుదే శం పార్టీ నేతలు తిరిగారన్నారు. డబ్బు ఇస్తామని చెప్పి ఇవ్వలేదన్నారు. డబ్బు ఇచ్చినట్లు వారి వద్ద ఉన్న లిస్టులో టిక్ పెట్టుకున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రచారం కోసం ఉదయం నుంచి రాత్రి వరకు వారి వెంట తిప్పుకుని రూ పాయి ఇవ్వకుండా మమ్మల్ని బాధపెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. రావి వెంకటేశ్వరరావు నిలబడిన ప్రతిసారీ ఇలానే చేస్తున్నాడని ఆవేదన చెందారు. మూడో వార్డుకు చెందిన మరో మహిళ కుమారి మాట్లాడుతూ మంగళవారం రాత్రి నుంచి మాకు డబ్బు ఇస్తాం అంటూ చెప్పి ఇవ్వలేదన్నారు. ‘మీ అమ్మాబాబులు సంపాదించిన సొమ్ము ఏమైనా ఉందా?’ అంటూ మా మనసుల్ని గాయపర్చారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి తోడు మమ్మల్ని కొడాలి నానికి ఓటు వేయొద్దంటూ భయపెట్టారని ఆరోపించారు. డబ్బు ఇవ్వకపోగా, మేము ఓటు వేయకముందే మా ఇళ్ల వద్దకు వచ్చి ‘మీరు వైఎస్సార్ సీపీకి ఓటు ఎందుకు వేశారు?’ అం టూ దాడికి యత్నించారని ఆ రోపించారు. అందుకే బాధ కలిగి వారిని నిలదీసేందుకు ఇక్కడకు వచ్చామన్నారు. పత్తా లేని నాయకులు.. పట్టణంలోని పలు వార్డుల్లోని స్థానికులు పార్టీ కార్యాలయానికి వస్తున్నారని ఎమ్మెల్యే అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు తదితర నాయకులకు తెలిసింది. ఆయా వార్డుల నుంచి పలువురు పార్టీ కార్యాలయానికి వచ్చేసరికి నాయకులు కనిపించలేదు. దీం తో అక్కడకు వచ్చినవారి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ‘మే ము వస్తున్నాం.. అనే విషయం తెలియగానే పారిపోతారా.. సిగ్గు లేదూ..’ అంటూ నానా దుర్భాషలాడారు. ఆందోళనకారులను చెదరగొట్టిన పోలీసులు ఆందోళనకారుల రాస్తారోకోతో గంటన్నరపాటు ఉద్రిక్తత నెలకొంది. దీనిపై పార్టీ కార్యాలయం నుంచి పోలీసులకు ఫి ర్యాదు అందింది. దీంతో ఇన్చార్జి డీఎస్పీ సీతారామస్వామి, వన్‌టౌన్ సీఐ వై.వి.రమణ సిబ్బందితో టీడీపీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళనకారులను చెదరగొట్టారు. ‘పార్టీ కార్యాలయం వరకు ప్రజలను తెచ్చుకోవడం ఏంటి?’ అం టూ పార్టీ నేతలను మందలించారు. -
అందరి చూపు..గుడివాడ వైపు
వైఎస్సార్సీపీ టీడీపీ ముఖాముఖి పోరు హ్యాట్రిక్ దిశగా నాని టీడీపీ అభ్యర్థిగా బరిలో రావి కాంగ్రెస్ పోటీ నామమాత్రమే సాక్షి, మచిలీపట్నం : గుడివాడ నియోజకవర్గం ఫలితాలపై జిల్లావాసులంతా ఆసక్తి కనబరుస్తున్నారు. చంద్రబాబు విశ్వాస ఘాతుకాన్ని, అవకాశవాదాన్ని తూర్పారబడుతూ టీడీపీకి గుడ్‌బై చెప్పిన తాజా మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) ఈసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఇప్పటికే రెండు పర్యాయాలు గెలిచిన ఆయన మరోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించేందకు సమాయత్తమవుతున్నారు. టీడీపీ అభ్యర్థిగా రావి బరిలో దిగడంలో ఎన్నికలు రసవత్తరంగా మారాయి. 1999 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఎన్నికైన రావి హరగోపాల్ రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. 2000లో జరిగిన ఉప ఎన్నికల్లో హరగోపాల్ సోదరుడు రావి వెంకటేశ్వరరావు టీడీపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ఆయన తండ్రి రావి శోభనాద్రి చౌదరి రెండు పర్యాయాలు గుడివాడ ఎమ్మెల్యేగా పని చేశారు. గెలుపు కోసం బాబు పాట్లు గుడివాడలో గెలుపు కోసం చంద్రబాబు అనేక వ్యూహాలు పన్నుతున్నారు. జిల్లాకు వచ్చిన సమయంలోను, కీలక సందర్భాల్లోనూ దృష్టి పెడుతున్నారు. అయితే నియోజకవర్గంపై నానీకి ఉన్న పట్టు ముందు ఆయన వ్యూహాలు బెడిసికొడుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబానికి అత్యంత ఇష్టుడిగా, జూనియర్ ఎన్టీఆర్‌కు మిత్రుడిగా మెలిగిన నాని గుడివాడ నియోజకవర్గంలో దశాబ్దకాలంగా మరింత పట్టు సాధించారు. ఎన్నికల సమయాన ఆయన చతురతకు కాకలు తీరిన ప్రత్యర్థులు సైతం చిత్తవుతూ వచ్చారు. జిల్లాలోని వైఎస్సార్సీపీలో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న నాని గతం కంటే బాగా ప్రజలతో మమేకమై ముందుకు సాగడంతో గుడివాడలో హ్యాట్రిక్ రికార్డును సొంతం ఖాయమని పలువురు భావిస్తున్నారు. కాంగ్రెస్‌కు అభ్యర్థి కరువు నియోజకవర్గంలో కీలక నేత, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కొద్ది రోజుల కిందట తీర్థం పుచ్చుకున్నారు. దీంతో గుడివాడలో కాంగ్రెస్‌కు అభ్యర్థి దొరకని పరస్థితి నెలకొంది. ఎట్టకేలకు రెండు రోజుల క్రితం అట్లూరి సుబ్బారావు పేరును ఖరారు చేశారు. అయితే కాంగ్రెస్ అభ్యర్థి నామమాత్రమే. పోరు ప్రధానంగా వైఎస్సార్సీపీ అభ్యర్థి కొడాలి నాని, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రావి వెంకటేశ్వరరావు మధ్యే ఉంటుంది. ప్రధాన సమస్య ఇళ్ల పంపిణీ గుడివాడలో ప్రధానంగా ఇళ్ల స్థలాల సమస్య ఉంది. వైఎస్ హయాంలో 110ఎకరాలు భూసేకరణ చేసినా ఐదేళ్లుగా పట్టాలు పంచలేదు. ఆ స్థలాల్లో రాజీవ్ ఆవాస్ యోజనలో ఇళ్లు నిర్మిస్తామంటూ కాంగ్రెస్ ప్రభుత్వం తాత్సారం చేయడంతో నివాసితులు ఆగ్ర హం వ్యక్తం చేస్తున్నారు. నీటి పథకానికి గండి గుడివాడ నియోజకవర్గంలో చేపల చెరువుల కారణంగా మంచినీటి చెరువుల కలుషిత సమస్య తీవ్రంగా ఉంది. ఐదు మండలాలకు సరిపడే మంచినీటి పథకానికి వైఎస్ హయాంలో మోటూరు గ్రామంలో భూసేకరణ చేశారు. బృహత్తర మంచినీటి పథకానికి రూపకల్పన చేశారు. వైఎస్ మరణానంతరం వివాదాల కారణంగా అనంతరం నిలిచిపోయింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు పామర్రు-గుడివాడ ప్రధాన రహదారి రైల్వేఫ్లైఓవర్ అవసరం. ఇది ప్రతిపాదనల దశలో ఆగిపోయింది. నాని ఇమేజ్ ప్లస్ పాయింటు జిల్లాలో కొడాలి నానికి ప్రత్యేక ఇమేజ్ ఉంది. ఆయన కన్పిస్తే యువత కేరింతులు కొడుతూ పలుకరిస్తారు. నియోజకవర్గ అభివృద్ధికి అందర్ని కలుపుకోవడం ఆయన ప్రత్యేకత. చొరవ ఉన్న నాయకుడిగా అందరి గుర్తింపు పొందిన ఆయన సమస్యలపై తక్షణం స్పందిస్తారు. కొన్ని సందర్భాల్లో పోరాడే తెగువ ఆయనకు మంచి ఇమేజ్ తెచ్చిపెట్టింది. ప్రజలకు చేరువకాని రావి ఒక పర్యాయం ఎమ్మెల్యే చేసిన రావి ఆ తర్వాత నియోజకవర్గ ప్రజలకు దూరంగానే గడిపారు. పార్టీ కార్యక్రమాలు, కార్యకర్తల సమస్యలపై సానుకూలంగా స్పందించకపోవడంతో వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. నియోజకవర్గంలో అటు కాంగ్రెస్ బలహీన పడటం, ఇటు సైకిల్ హవా తగ్గిపోవడంతో వైఎస్సార్ సీపీ గెలుపు నల్లేరుపై నడకేనని పలువురు భావిస్తున్నారు. -
ఎన్టీఆర్ వారసులకు మొండిచేయే...
బావ తీరుపై హరి కారాలు మిరియాలు సాక్షి, విజయవాడ : తెలుగుదేశం పార్టీని స్థాపించిన నందమూరి తారకరామారావు సొంత జిల్లాలోని గుడివాడతో పాటు హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. పార్టీ పెట్టిన తొలినాళ్లలో రెండు పర్యాయాలు ఆయన గుడివాడ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎన్టీఆర్ మరణంతో చంద్రబాబుపై కోపంతో హరికృష్ణ అన్న తెలుగుదేశం పార్టీని పెట్టి గుడివాడ నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అటు తరువాత ఎన్టీఆర్ వారసులు ఎవరూ జిల్లా నుంచి పోటీ చేయలేదు. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఎన్టీఆర్ వారసులు జిల్లా నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. జిల్లా వదిలి.. హిందూపురంతో సరి.. బావ ఆదేశిస్తే ఎక్కడి నుంచి పోటీ చేసేందుకైనా సిద్ధమేనని తొడకొట్టిన బాలయ్య చివరకు హిందూపురం అసెంబ్లీ టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఆయన జిల్లాలోని ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని అనుకున్నారు. దీనికితోడు పెనమలూరులో మాజీ ఎమ్మెల్సీ వైవీబీ రాజేంద్రప్రసాద్‌కు వర్గపోరుతో చిరాకు వచ్చిన ప్రతిసారి అవసరమైతే బాలకృష్ణను, లేకుంటే లోకేష్‌ను పోటీకి తీసుకొస్తానని ప్రకటించేవారు. గన్నవరంలో సిట్టింగ్ ఎమ్మెల్యే దాసరి బాలవర్ధనరావు సైతం వంశీతో వర్గపోరు నేపథ్యంలో బాలకృష్ణను పోటీకి తీసుకొస్తానని రాజకీయ వేడి రగిల్చేవారు. గుడివాడ నుంచి కూడా బాలకృష్ణ పోటీకి దిగుతారన్న ప్రచారం జరిగింది. ఈసారి ఏదోక చోట నుంచి బాలకృష్ణ పోటీ చేసేందుకు ఉత్సాహం చూపడంతో ఆయన అనుయాయులు పెనమలూరు, నూజివీడు, గుడివాడ నియోజకవర్గాల్లో సర్వే కూడా చేయించుకున్నారు. పెనమలూరు, నూజివీడులో రెబల్స్ బెడద తీవ్రంగా ఉండటం, గుడివాడలో కొడాలి నాని గాలి ఎక్కువగా ఉండటంతో ఆయా నియోజకవర్గాల్లో పోటీకి బాలకృష్ణ ఆసక్తి చూపలేదని చెబుతున్నారు. ఓటమి భయమో, వర్గపోరు ప్రభావమో, మరేదైనా కారణమో కానీ బాలకృష్ణ జిల్లాను వదిలి హిందూపురం టిక్కెట్‌తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బాలయ్యను ఉసిగొల్పి బాబు రాజకీయం.. ప్రచారం, పర్యటన, ఎన్నికలు ఏదైనా జిల్లాలో జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణలకు బాలకృష్ణతో చంద్రబాబు చెక్ పెట్టించి రాజకీయం నెరపడంపై ఎన్టీఆర్ అభిమానుల్లో ఆగ్రహం పెరుగుతోంది. వస్తున్నా మీకోసం అంటూ జిల్లాలో యాత్రకు వచ్చిన చంద్రబాబు పామర్రు, గుడివాడ నియోజకవర్గాల్లో బాలకృష్ణను ప్రయోగించారు. అప్పట్లో బాబు యాత్ర సందర్భంగా రెండు రోజులు ఇక్కడే ఉన్న బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలను తొలగించేలా కేడర్‌కు ఆదేశాలు ఇవ్వడంపై విమర్శలు రేగాయి. బాబు, బాలయ్య తీరుపై ఎన్టీఆర్ అభిమానులు పెద్ద దుమారమే లేపారు. తాజాగా హరికృష్ణకు సీటు ఇవ్వకుండా చంద్రబాబు చెక్ పెట్టి బాలకృష్ణకు ఇచ్చి ఎన్టీఆర్ కుటుంబంలో కొత్త చిచ్చు రాజేశారు. కారాలు మిరియాలు నూరుతున్న హరికృష్ణ... హరికృష్ణ నోటికి జడిసి పైకి ఆయనకు ప్రాధాన్యత ఇచ్చినట్టు నటించే చంద్రబాబు అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన్ను అణగదొక్కేందుకే ప్రయత్నాలు చేస్తారని తెలుగు తమ్ముళ్లు చెబుతుంటారు. సమైక్యాంధ్ర కోసం అందరూ పదవులకు రాజీనామాలు చేసినా అంతగా పట్టించుకోకపోయినా, హరికృష్ణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో ఆగమేఘాలపై ఆమోదించేలా చేశారు. సమైక్యాంధ్ర కోసం తన తండ్రి ఎన్టీఆర్ స్వగ్రామం నిమ్మకూరు నుంచి యాత్ర చేపడతానని హరికృష్ణ ప్రకటించడంతో అందుకు చంద్రబాబు అడ్డుచక్రం వేశారు. ఈసారి హిందూపురం కాకుంటే జిల్లాలో టిక్కెట్ ఇస్తారని హరికృష్ణ ఆశలు పెట్టుకున్నారు. తీరా బాలకృష్ణకు సీటిచ్చిన బాబు హరికృష్ణకు మాత్రం హ్యాండిచ్చారు. దీంతో బావ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్న హరికృష్ణ తనకు జిల్లాలో టిక్కెట్ ఇస్తారని ఆశించానని, అది కూడా ఇవ్వకపోవడం దారుణమని కారాలు మిరియాలు నూరుతుండటం కొసమెరుపు. -
కూచిపూడికి కంఠాభరణం
ఆయన చిరునామా కూచిపూడి... అది ఒకప్పడు! ఇప్పుడు కూచిపూడికి ఆయనే ఓ చిరునామా! కొన్ని దశాబ్దాలపాటు కూచిపూడి నాట్యానికి సేవ చేశారు తాజాగా 94 ఏళ్ల వయసులో... కేంద్రసంగీత నాటక అకాడెమీ అవార్డును అందుకున్నారు ‘‘ఈ పురస్కారాన్ని అందుకున్న చేతులు మాత్రమే నావి... అసలైన పురస్కార గ్రహీత కూచిపూడినాట్యమే’‘ అంటున్నారు... అవార్డు గ్రహీత చింతా సీతారామాంజనేయులు చింతా సీతారామాంజనేయులు పుట్టిపెరిగింది కృష్ణాజిల్లా కూచిపూడి గ్రామంలో. తండ్రి నుంచి నాట్యాన్ని వారసత్వంగా అందుకున్నారు. జీవితంలో కూడా ఆ నాట్యం నడిపించినట్లే అడుగులు కదిపారు. కూచిపూడి నాట్యపరిమళాలను అనేక ప్రాంతాలకు విస్తరించే క్రమంలో కూచిపూడి కళాక్షేత్ర కొత్తగా ఏర్పాటు చేసిన శాఖ కోసం నాట్యాచార్యునిగా గుడివాడలో అడుగుపెట్టారు. రక్తం పంచుకు పుట్టిన ఐదుగురికీ నాట్యం నేర్పించారు. ‘‘కూచిపూడి నాట్యంలో మాది నాలుగవ తరం. నాకిప్పుడు 94 ఏళ్లు. ఆరవ ఏట గజ్జె కట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నాట్యమే ఊపిరిగా జీవిస్తున్నా’’ అన్నారు సీతారామాంజనేయులు. ప్రతిష్ఠాత్మక కేంద్ర సంగీత నాటక అకాడెమీ అవార్డును గత వారమే అందుకున్న ఆయనను కదిలిస్తే, కూచిపూడి సంప్రదాయానికి సంబంధించి తన జ్ఞాపకాలను పంచుకున్నారాయన. ‘‘ఇప్పుడు ఉన్నటువంటి సౌకర్యాలు అప్పట్లో ఉంటే కూచిపూడి నాట్యం ఎప్పుడో ఖండాంతర ఖ్యాతిని సాధించేది. మేము ఒక ఊరి నుంచి మరో ఊరికి బళ్లు కట్టుకుని వెళ్లేవాళ్లం. ఐదారు మైళ్ల దూరాలు నడిచి వెళ్లేవాళ్లం. అప్పట్లో నాట్యసాధన అంటే అదే ప్రధాన వ్యాపకం అన్నట్లు ఉండేది. నాట్యం, అభినయం, కీర్తనం (సాహిత్యం), హావభావాలు పలికించడం... ఈ నాలుగింటినీ సమన్వయం చేస్తూ సాధన చేయాలి. అందులో పరిణతి చెందాలి. అప్పుడే కళాకారుడిగా గుర్తించేవారు. అప్పట్లో గురువులు నాట్యసాధన కోసం పెద్దగా సౌకర్యాలను కోరేవాళ్లు కాదు. ఇళ్లలో, గుళ్లలో, సత్రాల్లో ఎప్పుడు ఎక్కడ సాధ్యమైతే అక్కడే సాధన చేయించేవారు. ఉన్నట్లుండి ఒకసారి వీధిలోకి తీసుకెళ్లి సాధన చేయమనేవారు. పిల్లల్లో సిగ్గు, బిడియం వదలడానికి అలా చేసేవారన్నమాట. హఠాత్తుగా ఎవరైనా రాలేకపోతే ఆ పాత్రను మరొకరు రక్తి కట్టించేవారు తప్ప తెల్లముఖం వేయడమనేదే లేదు. మా గురువులు మమ్మల్ని అలా తీర్చిదిద్దారు. అప్పట్లో ‘శశిరేఖా పరిణయం, ఉషాపరిణయం, భక్త ప్రహ్లాద’ యక్షగానాల్లో శశిరేఖ, ఉష, లీలావతి పాత్రలు వేసేవాణ్ణి. ఆడ, మగ - ఏ పాత్రలోనైనా భావాలు పలికించడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. తరువాతి రోజుల్లో యక్షగాన ప్రక్రియలో ఎక్కువ ప్రయోగాలు చేశా. యక్షగానంలో ఎవరి పాట వారే పాడాలి, ఎవరి సంభా షణలు వాళ్లే చెప్పాలి. ఒక కథాంశాన్ని ప్రదర్శించాలంటే కనీసం ఏడాది సాధన చేయాలి. చెరుకూరి వీరయ్య (స్క్రిప్టు) సహకారంతో సమకాలీన అంశాలను యక్షగానాలుగా ప్రదర్శించాను. గుడివాడలో పనిచేశాక, జవహర్ బాలభవన్ నాట్య కార్యక్రమాల రూపకల్పన కోసం నాగార్జున సాగర్‌లో సేవలందించా. వందల మందికి కూచి పూడి శిక్షణనిచ్చా. 1947లో స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా న్యూఢిల్లీలో ‘ఉషాపరిణయం’ప్రదర్శన ఇచ్చాం. మరో సందర్భంలో రాధాకృష్ణ నాటకంలో రాధ పాత్ర పోషించినప్పుడు మా గురువు వేదాంతం పార్వతీశం గారు మెచ్చుకున్నారు. ఇవి రెండూ మరచిపోలేని సంఘటనలు’’ అంటారాయన. రాష్ర్టపతి నుంచి అందుకున్న తాజా అవార్డును ప్రస్తావించినప్పుడు...‘‘ఇది నాకు వచ్చిన పురస్కారం కాదు. మా కూచిపూడికి అందిన గౌరవం. మా గురువు గారికి చెందాలి. ఆ రోజుల్లో ఎవరూ గుర్తించకపోవడంతో వారికి ఇలాంటి పురస్కారాలు రాలేదు. ఇప్పుడు గుర్తించే మాధ్యమాలున్నాయి కాబట్టి ఈ కళలో ఉన్న గొప్పతనాన్ని దేశం గుర్తించింది. కానీ, ఇవాళ్టికీ జీవితాంతం కళ కోసమే జీవించిన ఎందరో జీవనభృతి లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం కొంత నిధిని ఏర్పాటు చేసి వారికి నెలనెలా కొంత భృతి కల్పిస్తే బావుండని నా ఆశ. ఒక గుర్తింపు కార్డు ఇస్తే అదే పురస్కారాల పెట్టు. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లాగా డాన్సు, మ్యూజిక్ కూడా పెడితే... మన సంప్రదాయ నాట్యరీతి, సంగీతం పట్ల ప్రాథమిక అవగాహన కలుగుతుంది. నా వంతుగా ఇప్పటికీ ఇంటి దగ్గర చిన్నపిల్లలకు నాట్యం నేర్పిస్తున్నా’’ అన్నారాయన. ఒకే ఒక్క బ్యాలే రూపొందించి తగినంత గుర్తింపు రాలేదని ఆవేదన చెందేవాళ్లు ఎక్కువవుతున్న ఈ రోజుల్లో ఇన్ని దశాబ్దాలు కృషి చేసినా, ‘ఈ పురస్కారం అందాల్సింది నాక్కాదు, కూచిపూడి నాట్యానికి’ అంటున్న సీతారామాంజనేయులు గారిని చూస్తే ఎంత ఎదిగినా... ఒదిగి ఉండాలన్న మాటకు నిలువెత్తు నిదర్శనంగా కనిపిస్తారు. - వాకా మంజులారెడ్డి -
పరిమళించిన మానవత్వం
చికిత్స కోసం వచ్చిన బాలిక అకస్మాత్తుగా మృతి.. మృతదేహాన్ని ఇంటికి తరలించమంటూ విలపించిన తల్లి, తాత చందాలు వేసుకుని సాయం చేసిన స్థానికులు గుడివాడ అర్బన్, న్యూస్‌లైన్ : చికిత్స కోసం ఆస్పత్రికి తీసుకొచ్చిన ఓ బాలిక అకస్మాత్తుగా మృతిచెందింది. అయితే మృతదేహాన్ని స్వస్థలానికి తరలించేందుకు చేతిలో డబ్బు లేకపోవడంతో తల్లి, తాత నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. వారి దీనావస్థను చూసి స్థానికులు స్పందించి మానవతా దృక్పథంతో చందాలు వేసుకుని బాలిక మృతదేహాన్ని స్వస్థలానికి పంపించారు. పట్టణంలో బుధవారం జరిగిన ఈ ఘటనను చూసిన పలువురి కళ్లు చెమర్చాయి. మండవల్లి మండలం పుట్లచెరువు గ్రామానికి చెందిన మద్దాల శ్రీనివాసరావు, రమణ దంపతుల కుమార్తె కళ్యాణి(13) ఏడో తరగతి చదువుతుంది. బాలిక 20 రోజులుగా అనారోగ్యంతో ఉండడంతో గుడివాడ తీసుకొచ్చి ఏలూరు రోడ్డులోని ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో తల్లి రమణ, తాత బుధవారం మరోసారి ఇక్కడకు తీసుకొచ్చారు. పట్టణంలోని ఓ ప్రాంతానికి తీసుకెళ్లి తాడు వేయించారు. ఆటోలో తిరిగి వస్తుండగా మున్సిపల్ కార్యాలయం సమీపంలో అందులోనే బాలిక కుప్పకూలిపోయింది. వెంటనే సమీపంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి అప్పటికే చనిపోయిందని చెప్పారు. దీంతో ఏజీకే పాఠశాల పక్క గేటు వద్ద మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి ఊరికి తీసుకెళ్లేందుకు చిల్లిగవ్వ లేదని తల్లి, తాత విలపించారు. స్థానికులు స్పందించి చందాలు వేసుకున్నారు. ఆటో మాట్లాడి రూ.200 ఆయిల్ కొట్టించారు. బాలిక కుటుంబీకులకు మరో రూ.700 ఇచ్చి మృతదేహాన్ని ఆటోలో పంపి మానవత్వాన్ని చాటుకున్నారు. -
మున్సి‘పోల్స్’పై మాజీల గురి!
గుడివాడ, న్యూస్‌లైన్: గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో మాజీ కౌన్సిలర్లు తమ సత్తా నిరూపించుకోనున్నారు. గత అనుభవాలకు పదును పెట్టి ప్రచారంలో ముందుకు దూసుకెళుతున్నారు. గుడివాడ మున్సిపాల్టీలో ఉన్న 36 వార్డుల్లోనూ ఇరు ప్రధాన పార్టీలకు చెందిన మాజీ కౌన్సిలర్లు 18చోట్ల 19 మంది పోటీలో ఉన్నారు. వీరిలో వైఎసార్సీపీనుంచి 12మంది , టీడీపీ నుంచి ఆరుగురు, కాంగ్రెస్ నుంచి ఒకరు చొప్పున తలపడుతున్నారు. వార్డుల కేటాయింపు లోనే వైఎస్సార్సీపీ సామాజిక సమతూకం పాటించడంతో పాటు ఆయా వార్డుల్లో ప్రజాదరణ కలిగిన వారిని మాజీ ఎమ్మెల్యే కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) నాయకత్వంలో ఎంపిక చేశారు. 36 వార్డులకు గానూ 19 వార్డుల్లో బీసీ అభ్యర్థులకు స్థానం కల్పించి పెద్ద పీట వేశారు. మాజీల గురి వీటిపైనే.... గుడివాడ పట్టణ బరిలో దిగిన ఏ ఇద్దరూ మాజీలు ప్రత్యక్ష పోరుకు తలపడే అవకాశాలు లేవు. ప్రధానపార్టీల అభ్యర్థులైన మాజీలతో తలపడే వారంతా కొత్తవారు కావడం విశేషం. 7వ వార్డునుంచి వైఎస్సార్సీపీ తరఫున పోటీలో ఉన్న అడపా బాబ్జీ గతంలో రెండు పర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈయనపై టీడీపీ నుంచి ఎటువంటి రాజకీయ అనుభవం లేని వ్యక్తిని నిలబెట్టారు. 8వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థిని వెంపల హైమావతి రెండుసార్లు కౌన్సిలర్‌గా గెలిచారు. ఇక్కడ కూడా టీడీపీది ఇదే పరిస్థితి. 9వ వార్డులో వైఎస్సార్సీపీ చైర్మన్ అభ్యర్థిగా యలవర్తి శ్రీనివాసరావును రంగంలో దింపారు. ఈయన గతంలో మున్సిపల్ వైస్ చైర్మన్‌గానూ, కోఆప్షన్ సభ్యుడుగానూ పనిచేసిన అనుభవం ఉంది. ఈ వార్డులో రాధాకృష్ణ అనే వ్యక్తిని టీడీపీ పోటీకి దింపింది. చివరి నిమిషంలో ఈయన అభ్యర్ధిత్వాన్ని ఖరారు చేశారు. 10వ వార్డు నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా షేక్ గౌస్ భార్యా హర్షతున్నీసా పోటీలో ఉన్నారు. గతంలో భార్యాభర్తలు ఇద్దరూ కౌన్సిలర్‌గా పనిచేసి ప్రజల మన్ననలు పొందారు. 11వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఫాతీమున్నీసాది మాజీ కౌన్సిలర్ కుటుంబమే. 13వ వార్డులో వైఎస్సార్సీపీ తరపున పోటీలో ఉన్న మేరుగు మరియ కుమారి మాజీ కౌన్సిలర్. వార్డు ప్రజలతో సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఈసారి కూడా ఆమెకే పార్టీ అభ్యర్థిత్వాన్ని ఇచ్చారు. 14వ వార్డులోటీడీపీ తరఫున పోటీలో ఉన్న కొయిలాపు పార్వతి భర్త కొయిలాపు కృష్ణ గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఈమెపై వైఎస్సార్సీపీ నుంచి జ్యోతుల సత్యవేణి పోటీ పడుతున్నారు. 15వవార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థిని గంధం జూలీయమ్మ కుటుంబం నుంచి ఇప్పటికే మూడుసార్లు కౌన్సిలర్లుగా ఎన్నికయ్యారు. 19వ వార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి గణపతి లక్ష్మణరావు మునుపటి కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా పనిచేశారు. ఆయనపై టీడీపీ కొత్త అభ్యర్థిని నిలబెట్టింది. 20 వార్డులో టీడీపీ చైర్మన్ అభ్యర్థి లింగం ప్రసాద్ భార్య గతంలో కౌన్సిలర్. ఆయనపై మాజీ ఎమ్మెల్యే కొడాలి నానికి బాబాయి వరుసఅయ్యే గిరిబాబాయి వైఎస్సార్సీపీ నుంచి పోటీకి దిగుతున్నారు. 23వ వార్డులో టీడీపీ పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు భార్యా పద్మావతి బరిలో ఉంది. ఈయన గతంలో రెండుపర్యాయాలు కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆయనపై వైఎస్సార్ సీపీ నుంచి వైశ్య సామాజిక వర్గానికి చెందిన జిల్లా సుధారాణి పోటీచేస్తున్నారు. 24వ వార్డులో టీడీపీనుంచి మాజీ కౌన్సిలర్ రేమల్లి కమల కుమారికి చివరి నిమిషంలో పార్టీ అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఆమేపై వైఎస్సార్సీపీ నుంచి యువకుడు చోరగుడి రవికాంత్ పోటీలో ఉన్నారు. 27 వవార్డులో వైఎస్సార్సీపీ అభ్యర్థి బెజవాడ నాగలక్ష్మీ గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. నాగలక్ష్మీ సామాజిక వర్గం ఎక్కువగా ఉండటంతో ఆమెకు అవకాశం కల్పించారు. 31వ వార్డు అభ్యర్థిగా మాజీ కౌన్సిలర్ వంగలపూడి కనకబాబు భార్యా వంగలపూడి వెంకటలక్ష్మీ పోటీలో ఉన్నారు. ఈమెపై పోటీలో ఉన్న అభ్యర్థి కొత్తవారే. 33వ వార్డులో వైఎస్సార్సీపీ నుంచి పోటీలో ఉన్న నెరుసు చింతయ్య నాల్గవసారి విజయానికి సిద్ధంగా ఉన్నారు. 35వ వార్డులో సింగిరెడ్డి పుణ్యవతి గతంలో కౌన్సిలర్‌గా పనిచేశారు. ఆమెపై టీడీపీ అభ్యర్థి మేరీసంతోషం తొలిసారిగా పోటీకి దిగుతున్నారు. 36 వవార్డులో గొరిపర్తి కనకదుర్గ టీడీపీ నుంచి పోటీలో ఉన్నారు. వైఎస్సార్సీపీ అభ్యర్థిగొర్ల శ్రీను తలపడుతున్నారు. ఏది ఏమైనా మాజీలు తమభవితవ్యాన్ని తేల్చుకోనున్నారు. -
నిశ్చితార్థానికి వచ్చి పెళ్లికొడుకు పరార్
పెళ్లికుమార్తె తరపు బంధువుల ఆగ్రహం పెళ్లి కుమారుడి తరపు బంధువుల నిర్బంధం పోలీస్‌స్టేషన్‌కు చేరిన పంచాయతీ గుడివాడ, న్యూస్‌లైన్ : తాంబూలలు మార్చుకుని లగ్నపత్రిక రాయించుకునేందుకు వచ్చి పెళ్లికుమారుడు మాయమైపోయిన సంఘటన గుడివాడలో చోటు చేసుంది. పెళ్లి కుమార్తె తరపువారు అన్ని ఏర్పాట్లు చేసుకుని చివరి నిమిషంలో పెళ్లి కొడుకు రాకపోయేసరికి అతని తరఫున వచ్చిన పెళిలపెద్దల్ని నిర్భంధించారు. పట్టణంలోని నాగన్న చెరువు వద్ద జరిగిన ఈసంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి... పట్టణంలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న నాగన్న చెరువు ప్రాంతానికి చెందిన ఓ యువతికి విజయవాడకు సమీపంలోని గొల్లపూడి పరిధిలోని నల్లగుంట ప్రాంతానికి చెందిన ఓరుగంటి శ్రీను కుమారుడు ఓరుగంటి సాయితో వివాహం జరిపేందుకు పెద్దలు నిశ్చయించారు. ఈ మేరకు పెళ్లి చూపులు పూర్తయ్యి పెళ్లి కుమారుడి ఇంటివద్ద పప్పన్నాలు తిన్నారు. రూ.60వేలు వరకట్నంగా మాట్లాడుకోగా అందులో రూ.20వేలు ముందుగానే తీసుకున్నారు. గురువారం గుడివాడలో పెళ్లికూతురు ఇంటివద్ద తాంబూలాలు మార్చుకుని లగ్న పత్రిక రాయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. పెళ్లి కూతురు ఇంటివద్ద భోజనాలు సిద్ధం చేశారు. విజయవాడ నుంచి పెళ్లి కొడుకు సాయి తాలూకా పెద్దలతో కలిసి గుడివాడకు రైలులో బయలు దేరారు. అయితే గుడివాడ రైల్వేస్టేషన్లో దిగిన కుటుంబసభ్యలకు పెళ్లి కొడుకు కనిపించకుండా పోయాడు. పెళ్లి పెద్దలు, పెళ్లి కొడుకు తండ్రి శ్రీనులు రైల్వేస్టేషన్, పరిసర ప్రాంతాల్లో వెదికినా కనిపించలేదు. గురువారం సాయంత్రానికి నాగన్న చెరువు వద్ద ఉన్న పెళ్లికూతురు ఇంటికి పెళ్లి పెద్దలు వెళ్లారు. పెళ్లి కొడుకు ఎక్కడని ప్రశ్నిస్తే వెళ్లి పోయాడని చెప్పారు. ఆగ్రహించిన పెళ్లి కూతురు బంధువులు వచ్చిన పెద్దల్ని నిర్భంధించారు. కట్నం అడ్వాన్సుగా తీసుకుని చివరి నిమిషంలో ఇలా చేయడం ఏమిటని ప్రశ్నించారు. చివరికి గురువారం అర్ధరాత్రి 2గంటల సమయంలో స్థానిక టూటౌన్ పోలీసు స్టేషన్‌కు చేరారు. ఫిర్యాదు తీసుకున్న పోలీసులు పెద్దల్ని విచారిస్తున్నారు. పెళ్లికూతురు ఎత్తు తక్కువగా ఉందని, ఈ పెళ్లి తనకు ఇష్టం లేదని సహచరులతో చెప్పాడని కుటుంబసభ్యులు పోలీసులకు తెలిపారు. -
జనం నెత్తినగ్యాస్‘బండ’
డెలివరీ పేరుతో అక్రమ వసూలు మొక్కుబడి జీతాలతో అక్రమాలకు ఆజ్యం పోస్తున్న కంపెనీలు లబోదిబోమంటున్న వినియోగదారులు నెలకు సగటున రూ.12 లక్షలు మింగేస్తున్న తీరు గుడివాడ, న్యూస్‌లైన్ : గుడివాడ పట్టణంలో నాలుగు గ్యాస్ ఏజెన్సీలు ఉన్నాయి. వీటికి గుడివాడ పట్టణం, గుడివాడ రూరల్ మండలంతో పాటు, పెదపారుపూడి, నందివాడ, ముదినేపల్లి, ఉయ్యూరు మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. వీటి ద్వారా 70 వేల కనెక్షన్లు ఉన్నాయి. రోజుకు దాదాపు రెండువేల గ్యాస్ సిలిండర్ల సరఫరా జరుగుతుందని అధికారులు అంటున్నారు. గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1213 కాగా గుడివాడ పట్టణంలో డెలివరీ చేసినందుకు రూ.20 నుంచి రూ.25 అదనంగా వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతం అయితే రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఈ పేరుతో నెలకు దాదాపు రూ.12 లక్షలకు పైగా వినియోగదారుల నెత్తినఅక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఇవీ.. గ్యాస్ ఏజెన్సీలకు కంపెనీ నుంచి ఒక్కో సిలిండర్‌కు రూ.50 వరకు కమీషన్‌గా వస్తుంది. గ్యాస్ ఏజెన్సీ ఉన్న గుడివాడ పట్టణంలో డెలివరీకి ఎటువంటి చార్జీలూ వసూలు చేయకూడదు. గుడివాడ దాటి ఇతర గ్రామాల్లో సరఫరా చేసినందుకు ఒక్కో సిలిండర్‌కు రూ.10 మాత్రమే వసూలు చేయాల్సి ఉంది. కానీ గుడివాడ పట్టణంలో ప్రస్తుతం గ్యాస్ ధరను బట్టి రూ.20 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో సిలిండర్‌కు రూ.50 అదనంగా వసూలు చేస్తున్నారు. ఇవన్నీ గ్యాస్ సిలెండర్ సరఫరా చేసే రిక్షా, ఆటో డ్రైవర్ తీసుకుంటాడు. డెలివరీ బాయిస్‌కు ఇచ్చే జీతం రూ.500లే.. ఈ విషయమై ‘సాక్షి’ పరిశీలన జరుపగా సిలిండర్ల సరఫరా కోసం గ్యాస్ ఏజెన్సీ ఉద్యోగులుగా పెట్టుకుంటుంది. వీరికి నిబంధనల ప్రకారం జీతం ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీకి గ్యాస్ కంపెనీ ఇచ్చే కమీషన్లోనే వీరికి జీతాలు ఇవ్వాల్సి ఉంది. అయితే గ్యాస్ సరఫరా చేసే వారికి ఆయా గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చే జీతం చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానరు. ఏలూరు రోడ్డులో ఉన్న ఒక ఏజెన్సీ డెలివరీ బాయిస్‌కు నెలకు రూ.500 ఇస్తుండగా మరో ఏజెన్సీ రూ.700 ఇస్తుంది. వీరందరినీ వినియోగ దారుల వద్ద అక్రమ వసూళ్లుచేసి బతకమని చెప్పేందుకు ఇది ఉదాహరణగా చెప్పవచ్చు. ఇప్పటికే గ్యాస్ ధరలు భరించలేని వినియోగ దారులు ఈ అక్రమ వసూళ్లు ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అక్రమ వసూళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఈ విషయమై గుడివాడ పౌర సరఫరాల డిప్యూటీ తహశీల్దార్ గంధం డేవిడ్‌రాజును ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా ఈ విషయం తన దృష్టికి రాలేదని చెప్పారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని అన్నారు. గ్యాస్ డెలివరీ బాయ్ చేయాల్సింది ఇదీ... గ్యాస్ సిలిండర్ ఇంటి వద్దకు తీసుకొచ్చే డెలివరీ బాయ్ దానితో పాటు కంపెనీ బిల్లును ఇవ్వాల్సి ఉంది. ఏజెన్సీ ఉన్న ప్రాంతం నుంచి 12 కిలోమీటర్ల లోపు డెలివరీ ఇచ్చే గ్యాస్ సిలిండర్లకు ఎటువంటి సర్వీసు చార్జీ తీసుకోరాదు. గ్యాస్ సిలిండర్ వినియోగదారుడికి ఇచ్చేముందు దాని బరువు (తూకం) చూపించి ఇవ్వాలి. కానీ గ్యాస్ సిలిండర్లను తూకం వేసేందుకు డెలివరీ బాయిస్ వద్ద బరువు తూచే యంత్రాలు ఉండవు. గ్యాస్ సిలిండరును వినియోగదారు ఇంట్లో రెగ్యులేటర్‌కు బిగించి పొయ్యి వెలిగించి చూపించాలి. కానీ ఎక్కడా ఇటువంటి సేవలు ఇచ్చిన దాఖలాలు లేవు. అయినప్పటికీ వినియోగదారుల వద్ద డెలివరీ చార్జీల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా అదనపు వసూలు చేస్తున్నారు. -
చంద్రబాబును చిత్తుగా ఓడించండి
అన్న ఎన్టీఆర్ కల నెరవేర్చాలి... విజయం వైఎస్సార్ సీపీదే ప్రత్యర్థులకు డిపాజిట్లు దక్కవు గతంలోనూ అదే జరిగింది... మా అధినేత జగనే ప్రధాన ఆకర్షణ గుడివాడ మాజీ ఎమ్మెల్యే కొడాలి వెంకటేశ్వరరావు (నాని) గుడివాడ, న్యూస్‌లైన్ : చంద్రబాబు ఆధీనంలోని తెలుగుదేశంను చిత్తుచిత్తుగా ఓడించాలని ఆంధ్రుల ఆరాధ్య దైవం ఎన్టీఆర్ ఆనాడే పిలుపునిచ్చారని గుడివాడ మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ గుడివాడ నియోజకవర్గ కన్వీనర్ కొడాలి శ్రీవెంకటేశ్వరరావు(నాని) స్పష్టం చేశారు. గుడివాడ పట్టణంలో గడప గడపకు వైఎస్సార్సీపీ కార్యక్రమాన్ని ఆదివారం ఆయన ప్రారంభించారు. నాని మాట్లాడుతూ మహా నేత వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలతో ప్రతి గడప లబ్ధిపొందిందని చెప్పారు. అన్న ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి ఆయన పార్టీని, పదవిని లాక్కున్న సమయంలోనే ‘ఈద్రోహులు ఉన్న టీడీపీని చిత్తుచిత్తుగా ఓడించండని’ ఈ రాష్ట్ర ప్రజలకు, ఆయన అభిమానులకు అన్న ఎన్టీఆర్ పిలుపునిచ్చిన విషయాన్ని ఎవరూ మరచిపోలేదని తెలిపారు. తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, షర్మిళ, వైఎస్.విజయమ్మ ప్రచారంతో పార్టీ విజయపథాన దూసుకుపోవడం ఖాయమని చెప్పారు. కంచుకోట అంటే ఇదేనా?... గుడివాడ టీడీపీలో బలమైన నాయకులు ఉన్నంత కాలం ఆ పార్టీ కంచుకోటగా ఉందని, నేడు ఆపరిస్థితి లేదని వివరించారు. గతంలో ఎన్టీఆర్‌కు 6,200 ఓట్లు మాత్రమే మెజార్టీ రావటంతో ఆయన మనస్తాపం చెంది హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహించారని గుర్తుచేశారు. గుడివాడ నియోజకవర్గంలో ఉన్న నందివాడ మండలంలో నేటి వరకు జెడ్పీసీటీ, ఎంపీపీ స్థానాలు టీడీపీ గెలవలేదని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక గుడివాడ మున్సిపాల్టీలో రెండుసార్లు కాంగ్రెస్ పార్టీనే గెలిచిందని చెప్పారు. కంచుకోట అంటే ఇదేనా? అని ప్రశ్నించారు. గతంలో ఈ నియోజకవర్గంలో పీఆర్పీ తరఫున పోటీ చేసి చంద్రబాబును చిత్తుచిత్తుగా ఓడించండని రావి వెంకటేశ్వరరావు ప్రచారం చేసిన విషయాన్ని ప్రజలు మరచిపోలేదన్నారు. బందరు పార్లమెంటు, గుడివాడ వైఎస్సార్సీ పీ అభ్యర్థుల్ని గెలిపించాలని కోరారు. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే సంక్షేమ పథకాల అమలు సాధ్యమని అన్నారు. పార్టీ నేతలు యలవర్తి శ్రీనివాసరావు, దుక్కిపాటి శశిభూషణ్, మరీదు కృష్ణమూర్తి, మండలి హనుమంతరావు పాల్గొన్నారు. -
ఎవరితోనూ పన్లేదు.. నాకు ఇస్తే చాలు!
డివిజనల్ అధికారి అడ్డగోలు దోపిడీ కుదిరితే చేతికి.. లేకుంటే బ్యాంకులో చేపల చెరువుల అనుమతులపైనే గురి కింది ఉద్యోగులతో వసూళ్ల దందా నిన్న మచిలీపట్నంలో.. నేడు గుడివాడలో.. డివిజనల్ స్థాయి అధికారుల అవినీతి లీలలు గుప్పుమంటున్నాయి. ‘సార్ ఎక్కడికి వెళ్లారు’ అనడిగితే చాలు.. ‘చేపల చెరువులు చూడటానికి’.. కార్యాలయంలో సిబ్బంది ఠక్కున చెప్పే సమాధానం ఇది. ‘పాలనా పరమైన పనులు తర్వాత చూడొచ్చు.. చేపల చెరువుల అనుమతుల ఫైళ్లు ఉంటే వెంటనే పూర్తిచేసి పంపండి’ అనే ఆదేశాలు అన్ని మండలాల్లో ఉన్న తహశీల్దార్లకు పంపారు. ఎన్నికలు వస్తే మనకు అనుకూల పార్టీ వస్తుందో, రాదో.. ఇప్పుడే రాబట్టుకోవాలని ఆయన గారు సెలవివ్వటంపై కార్యాలయ సిబ్బంది కూడా ముక్కున వేలేసుకుంటున్నారు. గుడివాడ, న్యూస్‌లైన్ : డివిజన్ పరిధిలోని దాదాపు 9 మండలాల్లో 10 వేల ఎకరాలు చేపల చెరువులుగా తవ్వుకునేందుకు అనుమతుల కోసం రైతులు దరఖాస్తులు సమర్పించారు. డిసెంబర్ 31న జరిగిన డివిజనల్ స్థాయి సమావేశంలో రెండువేల ఎకరాల వరకు అనుమతులు ఇచ్చారు. ఇప్పటివరకు చేపల చెరువుల అనుమతి కావాలంటే మండలం నుంచి వచ్చిన ఫైలును కార్యాలయంలో సంబంధిత డిప్యూటీ తహశీల్దార్ చూసి నోట్‌ఫైల్ తయారుచేసిన తరువాత కార్యాలయ ప్రధానాధికారి సంతకం చేశాకే ఈ అధికారి సంతకం చేయాల్సి ఉంది. ఈ కార్యాలయంలో చేపల చెరువుల అనుమతికి గాను అందరికీ కలిపి ఎకరానికి రూ.2 వేలు సమర్పించుకుంటారని సమాచారం. దీన్ని వారి వారి స్థాయిలను బట్టి పంచుకుంటారు. ఇది గమనించిన ఈ అధికారి వీరందరితో ఎందుకు పని అని నేరుగా తానే చేపల చెరువుల ఫైలు తీసుకుని సంతకాలు చేయటం ప్రారంభించారు. అందరి వాటాలు తనకే వస్తాయని మాస్టర్‌ప్లాన్ వేసి, ఈ తతంగం నడిపేందుకు తన వద్ద ఉండే ఇద్దరు కిందిస్థాయి ఉద్యోగులను పురమాయించారు. వచ్చిన రైతుల వద్ద నేరుగా బేరం మాట్లాడుకోవటం, డబ్బు తీసుకోవటం, సంతకాలు పెట్టి జిల్లా సమావేశంలో అనుమతులు వచ్చేలా చేయటం ఈ పని చాలా ఈజీగా ఉందని కొందరి వద్ద నేరుగా ‘సార్’ చెప్పటం ఇందుకు ఉదాహరణ. ఇటీవల గుడివాడ రూరల్ మండలంలో అనుమతించిన చేపల చెరువుకు సంబంధించి ఆయన వాటాను సార్ బంధువులకు చెందిన గుంటూరు ఎస్బీఐ ఖాతాలో వేయించారని సమాచారం. లక్షలు పోసి వచ్చా.. సంపాదించుకోవాలిగా? గతంలో తాను పనిచేసినచోట పేదలకు అందాల్సిన తెల్లరేషన్ కార్డుల కూపన్లు అమ్ముకుని రూ.16 లక్షలకు పైగా అవినీతికి పాల్పడినట్లు సమాచారం. దీనిపై విచారణ ఇంకా పూర్తికాలేదని తెలుస్తోంది. ‘లక్షలు పోసి ఇక్కడికి వచ్చా.. సంపాదించుకోవాలిగా?’ అని చెబుతుండటం కొసమెరుపు. ఎన్నికలు వచ్చాక మనల్ని తెచ్చిన నాయకుడు గెలవకపోతే మళ్లీ ఇక్కడ ఉండబోమనే భావనతోనే ఇలా వసూళ్ల దందాకు తెరలేపారని తెలుస్తోంది. అందుకే ఇప్పటివరకు ఏ అధికారీ చేయనివిధంగా నేరుగా వసూళ్లకు శ్రీకారం చుట్టారని వినికిడి. కొల్లేరును ప్యాకేజీలుగా అమ్మేశారు... పర్యావరణాన్ని కాపాడేందుకు కొల్లేరులో చేపల చెరువులు ధ్వంసం చేసిన విషయం విదితమే. ఆ తరువాత వచ్చిన ఏ అధికారీ కొల్లేరు జోలికి పోలేదు. కానీ ఈ అధికారి వచ్చాక కొల్లేరులో చేపల చెరువుల తవ్వకానికి ప్యాకేజీల లెక్కన అనుమతులు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మండవల్లి మండలంలోని నందిగామ లంక, మణుగూరు లంకలో కొల్లేరును చేపల చెరువులుగా మార్చేశారు. మణుగూరు లంకలో చేపల చెరువుల తవ్వకాలపై ఫిర్యాదులు రావటంతో అప్పటి జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకున్నారని, దీంతో తవ్వకాలు ఆగాయని కార్యాలయంలో పేరు చెప్పటానికి ఇష్టపడని ఓ అధికారి చెబుతున్నారు. టైటిల్ డీడ్లు.. ధృవీకరణ పత్రాల్లోనూ చేతివాటమే... టైటిల్ డీడ్లు.. ధృవీకరణ పత్రాల కోసం కార్యాలయానికి వచ్చే వారితో సార్ సిబ్బంది ముందుగానే ఎంత ఖర్చు అవుతుందో మాట్లాడుకుని లోపలికి పంపిస్తారని సమాచారం. సంబంధిత ఫైళ్లను కిందిస్థాయి సిబ్బందిగా ఉన్న వీరిద్దరూ పెడితేనే సార్ సంతకం చేస్తారని కార్యాలయంలోని సిబ్బంది అంతా బహిరంగంగానే చెబుతున్నారు. గతంలో పనిచేసిన ఏ అధికారీ రైతులకు ఇవ్వాల్సిన టైటిల్ డీడ్, జనన, మరణ ధృవీకరణ పత్రాలకు లంచాలు తీసుకున్న దాఖలాలు లేవని అంటున్నారు. కార్యాలయ సిబ్బందిలో ఆందోళన... అయ్యగారి తీరుతో కార్యాలయ సిబ్బందిలో ఆందోళన రేకెత్తుతోంది. దశాబ్దాల తరబడి ఉద్యోగాలు చేస్తున్న తమకు లేని ప్రాధాన్యత కిందిస్థాయి ఉద్యోగులకు వచ్చిందని చెబుతున్నారు. డివిజన్లో ఎన్ని వేల ఎకరాలకు చేపల చెరువుల అనుమతి వచ్చిందని కార్యాలయ ప్రధానాధికారిని అడిగితే నాకు తెలియదు. సార్నే అడగాలని సమాధానం చెప్పటం ఇందుకు ఉదాహరణగా చెప్పొచ్చు. డిప్యూటీ తహశీల్దార్లు, క్లర్కులతో సంబంధం లేకుండా నేరుగా ఫైళ్లు నడిచిపోవటంతో కార్యాలయంలోని సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. ఈ అధికారి అవినీతి లీలలపై ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
అన్నయ్యా.. చనిపోతున్నా..
జీవితాన్ని ఒకటిగా చేసుకున్నారు... ఒడుదొడుకులు వచ్చినా ఒరిగిపోబోమంటూ సాఫీగా జీవన గమనానికి దిక్సూచిగా నిలిచారు. అంతలోనే అప్పుల బాధ వెంటాడింది... కల్లోల హృదయాలకు కాస్త ఓదార్పు కూడా కరువైందేమో దంపతులిద్దరూ మృత్యువులోనూ మమేకమవుదాం అనుకున్నారు. నిద్రమాత్రలు మింగి శాశ్వత నిద్రలోకి జారుకుందామనుకున్నారు. చివరిలో బతకాలన్న ఆశ చిగురించిందో... మమకారం పంచిన అన్న అనునయం గుర్తుకొచ్చిందో వేకువజామున... అపస్మారక స్థితిలో విజయవాడలో ఉన్న అన్నయ్యకు ఫోన్ చేసి చనిపోతున్నట్టు అతి కష్టంగా చెప్పింది. వారు వచ్చి కాపాడేలోగానే భర్త మృతి చెందాడు... ఆమె మృత్యువుతో పోరాడుతోంది. మరో ఘటనలో అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తే కొరివిగా మారాడు. వేధింపులు తట్టుకోలేక కిరోసిన్‌ను శరీరంపై పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందా ఇల్లాలు. ఆమె ప్రాణం కూడా ఆస్పత్రిలో విలవిల్లాడుతోంది. మంటలు ఆర్పబోయిన భర్త కూడా ఆస్పత్రి పాలయ్యాడు. గుడివాడ : అప్పుల బాధ భరించలేక దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుడివాడలో మంగళవారం జరిగింది. భర్త మృతిచెందగా భార్య పరిస్థితి విషమంగా ఉంది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం స్థానిక రత్నమాల వీధిలో నివాసముంటున్న కొత్త ప్రసాదరావుకు చంద్రశేఖర్, ప్రేమ్‌చంద్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్‌కు 2000లో విజయవాడకు చెందిన మాధవితో వివాహమైంది. ఆ తర్వాత తండ్రి ప్రసాదరావు తనకున్న ఆస్తిని ఇద్దరు కుమారులకు పంచేశారు. వారికి ఉన్నది ఒకే భవనం కాగా, పైన పెద్ద కుమారుడు చంద్రశేఖర్‌తో తల్లిదండ్రులు నివసిస్తున్నారు. కింద చిన్న కుమారుడు ప్రేమ్‌చంద్ ఉంటున్నారు. రూ.10 లక్షల అప్పుతో వ్యాపారం... ప్రేమ్‌చంద్ వివాహానంతరం వడ్డీ వ్యాపారుల నుంచి రూ.10 లక్షలు రూ.5 చొప్పున వడ్డీకి అప్పుగా తీసుకుని కుసుమహరనాథ మందిరం సమీపంలో ‘గంగేశ ఎలక్ట్రానిక్స్’ అనే షాపు ఏర్పాటు చేసుకున్నాడు. నష్టాలు వస్తుండటంతో నాలుగేళ్ల క్రితం స్థానిక ఏలూరు రోడ్డులో అదే పేరుతో మరో షాపు ఏర్పాటు చేశాడు. వ్యాపార అవసరాల రీత్యా మరికొన్ని అప్పులు కూడా చేశాడు. ఇక్కడ కూడా వ్యాపారం మందకొడిగా సాగడంతో మనస్థాపానికి గురయ్యాడు. భార్య వద్ద నిత్యం అప్పుల విషయాన్ని ప్రస్తావించేవాడు. వాటిని ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కంటతడి పెట్టుకునేవాడు. అప్పులన్నీ కలిపి కోటిరూపాయలు పైనే ఉండటంతో తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. వాటి వసూలు కోసం నిత్యం బాకీదారులు షాపు వద్దకు, ఇంటికి వచ్చి ఒత్తిడి చేస్తున్నారు. దిక్కుతోచని స్థితిలో మంగళవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అన్నయ్యా మా ఆయన చనిపోయాడు.. నేనూ చచ్చిపోతున్నా.. దంపతులిద్దరూ తెల్లవారుజామున నిద్రమాత్రలు మింగగా ప్రేమ్‌చంద్ అక్కడికక్కడే మృతిచెందాడు. 4.30 సమయంలో భార్య మాధవి అపస్మారక స్థితిలో ఉండి విజయవాడలోని తన అన్నయ్య కందుకూరి హరిప్రసాద్‌కు ఫోన్‌చేసి ‘అన్నయ్యా నేనూ మీ బావగారూ ఆత్మహత్యకు పాల్పడ్డాం.. మా ఆయన చనిపోయారు.. నేనూ ఎక్కువ సేపు బతకను’ అని తెలిపింది. దీంతో ఆందోళనకు గురైన హరిప్రసాద్ ప్రేమ్‌చంద్ తండ్రి ప్రసాదరావుకు ఫోన్లో విషయం తెలిపాడు. వెంటనే పైన ఉంటున్న తండ్రి ప్రసాదరావు, అన్న చంద్రశేఖర్ కిందకి వచ్చి తలుపులు కొట్టారు. ఎంతసేపటికి తలుపులు తీయకపోవడంతో వెనుక తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. అప్పటికే ప్రేమ్‌చంద్ మృతిచెందగా, మాధవి నురగలు కక్కుతూ కనిపించింది. వెంటనే ఆమెను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై అసహజ మరణం కింద వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రేమ్‌చంద్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాలు.. పిల్లలు లేరనే బాధ.. ప్రేమ్‌చంద్ అప్పుల విషయంలో ఇంట్లో ఎప్పుడూ గొడవలు కూడా జరిగేవని స్థానికులు చెబుతున్నారు. దీంతోపాటు పెళ్లయి 14 ఏళ్లు అయినా పిల్లలు కలగకపోవడంపై దంపతులిద్దరూ మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది. తన చెల్లి, బావలకు అప్పులున్న సంగతి తెలియదని, ఏరోజూ ఆ విషయాన్నే వారు ప్రస్తావించలేదని మాధవి అన్నయ్య కందుకూరి హరిప్రసాద్ వాపోయారు. చెల్లెలి ఫోన్ సమాచారంతో హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న ఆయన విగతజీవిగా ఉన్న ప్రేమ్‌చంద్‌ను చూసిన కుప్పకూలిపోయారు. బావా నాకు చెప్తే నీ అప్పు నేను తీర్చేవాడ్ని కదా... అంటూ భోరుమన్నారు. భర్త వేధింపులు తాళలేక... జమ్మవరం (వీరులపాడు/ కంచికచర్ల రూరల్) : భర్త తప్పతాగి రోజూ వేధిస్తున్నాడని మనస్తాపం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న ఘటన వీరులపాడు మండలం జమ్మవరంలో మంగళవారం జరిగింది. మహిళ శరీరం ఎక్కువభాగం కాలిపోగా, మంటలను ఆర్పే ప్రయత్నంలో భర్తకూ తీవ్ర గాయాలయ్యాయి. సేకరించిన వివరాల ప్రకారం వీరులపాడు మండలం జమ్మవరానికి చెందిన మంగలపూడి గ్రేస్‌కుమారి భర్త వెంకటరత్నం వ్యవసాయ కూలీ. వారికి ఇద్దరు కుమారులు. భర్త రోజూ తాగి వచ్చి వేధిస్తుండటంతో మనస్తాపం చెందిన గ్రేస్‌కుమారి మంగళవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఒక్కసారిగా ఒంటినిండా మంటలు వ్యాపించటంతో ఆ బాధ తాళలేక కేకలు వేసింది. సమీపంలో ఉన్న భర్త ఇంట్లోకి వెళ్లిచూడగా అప్పటికే కుమారి శరీరం ఎక్కువ భాగం కాలిపోయింది. మంటలను ఆర్పే ప్రయత్నంలో వెంకటరత్నం కూడా తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కంచికచర్ల 108 సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని వారిద్దరినీ నందిగామ ఏరియా ఆస్పత్రికి, అక్కడినుంచి విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
రచ్చబండ కార్డులకు కిరోసిన్ ఏదీ ?
గుడివాడ, న్యూస్‌లైన్ : రచ్చబండలో రేషన్ కార్డులు పొందిన లబ్ధిదారులకు రెండు నెలలైనా నీలి కిరోసిన్ అందడం లేదు. తెల్ల కార్డులు ఇచ్చి తమను గాలికొదిలేశారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో వంట చేసుకోవడానికి, ఇంట్లో దీపాలు వెలగించుకునేందుకు సైతం వారు ఇబ్బందులు పడుతున్నారు. 59,920 మంది లబ్ధిదారులు... గత ఏడాది నవంబర్‌లో ప్రభుత్వం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో రెండేళ్ల క్రితం తెల్ల రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకున్నవారికి కార్డులు అందజేశారు. జిల్లాలో 59 వేల 920 మందికి ఈ కార్డులు అందాయి. వీరందరికీ గత నెలలోనే రేషన్ సరకులు అందాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, డీలర్ల అలసత్వం ఫలితంగా అనేకచోట్ల కొత్త కార్డులు పొందినవారికి డిసెంబర్ రేషన్ సరకులు అందలేదు. మరికొన్నిచోట్ల లబ్ధిదారులకు కార్డులు కూడా చేరలేదని సమాచారం. జనవరిలో అన్ని రేషన్ సరకులు ఇచ్చినా డిసెంబర్, జనవరి నెలల్లో ఇవ్వాల్సిన నీలి కిరోసిన్ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఈ కార్డులకు జిల్లావ్యాప్తంగా దాదాపు లక్ష లీటర్లకు పైగా కిరోసిన్ ఇవ్వాల్సి ఉంది. కిరోసిన్ సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సి ఉం దని, ఎక్కడా ఇంతవరకు సరఫరా కాలేదని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కొత్త కార్డులకు కిరోసిన్ సబ్సిడీ విడుదలైతేనే కోటా కేటాయింపులు జరుగుతాయని అధికారులు సమాధానం ఇస్తున్నారు. నిరుపేదల అవస్థలు... సబ్సిడీ కిరోసిన్ సరఫరా చేయకపోవడంతో నిరుపేదలు నానా అవస్థలు పడుతున్నారు. అసలే కరెంటు కోత తో దీపాలు వెలిగించటానికి, ఇంట్లో వంట చేసుకునేందుకు కావాల్సిన కిరోసిన్‌ను బహిరంగ మార్కెట్లో లీటరు రూ.40తో కొంటున్నామని చెబుతున్నారు. ఈ విషయమై ఉన్నతాధికారులు స్పందించి కొత్త కార్డుదారులకు నీలి కిరోసిన్ అందేలా చూడాలని కోరుతున్నారు. -
భళా.. విశ్వకళ
విశ్వకళా మహోత్సవం కళా సౌరభాలు వెదజల్లుతోంది. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని ఓ సాధారణ గ్రామమైన పామర్రులో ఆవిష్కృతమయ్యాయి. ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ మహోత్సవాలు మూడు రోజులపాటు సాంస్కృతిక చైతన్యానికి వేదికగా నిలవనున్నాయి. తొలిరోజైన శుక్రవారం వివిధ దేశాల బృందాలు ప్రదర్శించిన కళా రూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. గుడివాడ/పామర్రు, న్యూస్‌లైన్ : ఇది అంతర్జాతీయ సాంస్కృతిక చైతన్యం.. ప్రపంచంలో కనుమరుగవుతున్న కళలు జిల్లాలోని మారుమూలన ఉన్న పామర్రులో ఆవిష్కృతమయ్యూయి. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ, నిర్నిత, సాహిత్య అకాడమి ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న విశ్వకళా మహోత్సవాలు శుక్రవారం పామర్రులోని క్షేత్రయ్య ప్రాంగణంలో ప్రారంభమయ్యూయి. మన దేశంతో పాటు వివిధ దేశాలకు చెందిన ప్రతినిధి బృందాలు ప్రదర్శించిన కళారూపాలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మరుగునపడిన ప్రాచీన కళలను గుర్తుచేశాయి. తొలుత పామర్రు పట్టణం నడిబొడ్డు నుంచి కళా ప్రాంగణం వరకు కళాకారులు కళాజ్యోతిని తీసుకొచ్చారు. ఆస్ట్రేలియాకు చెందిన విక్టోరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సీఈవో అర్జున్ సూరపనేని జ్యోతి ప్రజ్వలన చేశారు. రాష్ట్ర పోలీస్ శాఖ డీజీపీ ప్రసాదరావు, ఐఆర్డీఏ అధినేత వినయ్‌కుమార్‌తో పాటు టర్కీ, ఆస్ట్రేలియా, అమెరికా, మనదేశంలోని తమిళనాడుకు చెందిన ప్రతినిధులు ఆద్యంతం కళలను ఆసక్తిగా తిలకించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కళా ప్రదర్శనలివీ.. అలరించిన కళా ప్రదర్శనలు ఆచార్య కళాకృష్ణ శిష్యురాలు నర్తకి ప్రణీత ‘ఆనందం నర్తనం.. భవయో’ అంటూ ప్రదర్శించిన నృత్యం కనువిందు చేసింది. గుడివాడ రూరల్ మండలం బిళ్లపాడుకు చెందిన మిరియాల శేఖర్‌బాబు బృందం ప్రదర్శించిన దేవరపెట్టి, టక్కుటమార విద్య ప్రదర్శన మంత్రముగ్ధుల్ని చేసింది. మిరియాల విజయ్‌కుమార్ చెప్పిన బుర్రకథ ఆకట్టుకుంది. కుచికాయలపూడి డప్పు వాయిద్య కళాకారులు ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. విజయవాడకు చెందిన కళాకారుల పులివేషాలు, సింహవాహిని అమ్మవారి నృత్య ప్రదర్శన అదరహో అనిపించారుు. ప్రకాశం జిల్లా అద్దంకికి చెందిన స్వర్ణ వెంకటసుబ్బయ్యకు చెందిన శ్రీలక్ష్మీ నరసింహా జడకోలాటం బృందం ఆడిన కోలాటం ఆద్యంతం ఉత్సాహాన్ని నింపింది. అదుర్స్ టీవీ కార్యక్రమంలో అందరి ఆదరాభిమానాలు పొందిన అంబికా ప్రదర్శించిన రింగ్డ్యాన్సు ఉల్లాసంగా సాగింది. ‘శంభో శంకర.. ’ అనే కీర్తనకు భరతనాట్యం చేస్తూనే రింగ్‌ను తిప్పుతూ నిప్పుల కుంపట్లను తలపై ఉంచి చేసిన ఆమె నాట్యం కార్యక్రమానికే హైలైట్. టర్కీ దేశానికి చెందిన యువకళాకారులతో పాటు మనదేశ కళాకారులు కలిసి ప్రదర్శించిన టర్కీ ట్రైబల్ ఫోక్ డ్యాన్సు అలరించింది. శాంతికి చిహ్నంగా చెప్పుకొనే ఈ టర్కీ డ్యాన్సు కేవలం మ్యూజిక్ ద్వారా ప్రదర్శించి అందరి మన్ననలు పొందారు. కాకతీయుల కాలం నాటి నుంచి ఎంతో ఆదరణ పొందిన శివ పేరణీ నృత్య ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. 15 నిమిషాల పాటు ప్రదర్శించిన ఈ నృత్యం ఔరా.. అనిపించింది. విశ్వకళా మహోత్సవం పేరుతో ఐఆర్డీఏ సంస్థ ఆధ్వర్యంలో దాదాపు నాలుగు రోజులుగా సురభి నాటకాలను ప్రదర్శిస్తున్నారు. -
‘వీఆర్వో, వీఆర్ఏ’లకు నోటిఫికేషన్
గుడివాడ రూరల్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం గ్రామ రెవెన్యూ అధికారి (వీఆర్వో), గ్రామ రెవెన్యూ సహాయకుడి (వీఆర్ఏ) పోస్టులకు భర్తీకి శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జిల్లాలో 64 వీఆర్వో, 403 వీఆర్ఏల పోస్టుల భర్తీకి రంగం సిద్ధం చేస్తున్నారు. వీఆర్ఏలు డివిజన్ల వారీగా బందరు 96, గుడివాడ 104, నూజివీడు 88, విజయవాడ 115 పోస్టులు రిజర్వేషన్లు వారీగా కేటాయించారు. దీనికి సంబంధించి మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. వాటి ప్రకారం.. జిల్లా కేంద్రంగా వీఆర్వోలు, గ్రామ కేంద్రంగా వీఆర్ఏల ఎంపిక జరుగుతుంది. గతంలో వీఆర్ఏ పోస్టుకు దరఖాస్తు చేసే అభ్యర్థులు మండలంలో నివాసం ఉన్నవారైతే సరిపోతుంది. ప్రస్తుతం దానిని మార్చి పోస్టు మంజూరు చేసిన గ్రామవాసి అయి ఉండాలని నిబంధన విధించారు. దీంతో పాటు పుట్టిన స్థలం, నివాస, రేషన్ కార్డు, నాలుగు నుంచి ఏడేళ్లలోపు స్టడీ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. 36 సంవత్సరాల లోపువారు మాత్రమే ఈ పోస్టుకు అర్హులు. వివాహ మైన మహిళలు తమ స్వస్థలం గాని, భర్త అడ్రసుతోగాని దరఖాస్తు చేసుకోవచ్చు. వీఆర్వో, వీఆర్ఏ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారు ఓసీ, బీసీలు రూ.300, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు రూ.150 చెల్లించాలి. వికలాంగులు ఎటువంటి రుసుం చెల్లించాల్సిన అవసరం లేదు. దరఖాస్తు రుసుం జనవరి 12 లోపు చెల్లించాలి. దరఖాస్తులు అందించాల్సిన గడువు జనవరి 13తో ముగుస్తుంది. జనవరి 19 నుంచి ఫిబ్రవరి 2 వరకు హాల్‌టిక్కెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫిబ్రవరి రెండోతేదీ ఉదయం 10 నుంచి 12 వరకు వీఆర్వోలకు, మధ్యాహ్నం 3 నుంచి 5 వరకు వీఆర్ఏలకు పరీక్షలు ఉంటాయి. 100 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షల్లో జనరల్ స్టడీస్ 60, అర్థమెటిక్స్ 30, లాజికల్ స్కిల్స్ 10 మార్కులకు ఉంటాయి. దరఖాస్తులను ఆన్లైన్లోనే స్వీకరిస్తారు. దగ్గరలో ఉన్న మీ సేవ, ఈ సేవలలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, రెవెన్యూ కార్యాలయాలకు నోటిఫికేషన్ మార్గదర్శక ఉత్తర్వులు పంపించారు.