సాక్షి, కృష్ణా: జూలై 8న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇళ్ల స్థలాలు అందచేస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని అన్నారు. గుడివాడ మల్లాయపాలెం గ్రామంలో 90 ఎకరాల్లో ఏర్పాటు చేసిన అతిపెద్ద లే అవుట్‌ను మంత్రి నాని, జేసీ మాధవిలతతో కలిసి అభివృద్ధి పనులను బుధవారం పరిశీలించారు. లే అవుట్‌లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, కరెంట్, డ్రైయినేజీ అభివృద్ధికి సంబంధించి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మంతి కొడాలి నాని మాట్లాడుతూ.. దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని పనులు సీఎం వైఎస్ జగన్ చేస్తున్నారని తెలిపారు. ముఫ్పై లక్షల మందికి పైగా ఇళ్ల స్థలాలు ఇవ్వనున్నామని తెలిపారు. మొదటి దశలో భాగంగా ఆగస్టు నెలలో 15 లక్షల వైఎస్సార్ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నామని తెలిపారు. (వైఎస్సార్‌సీపీలో చేరిన శిద్దా రాఘవరావు)
రాష్ట్రంలో అర్హులైన పేద వాళ్లకి సొంతింటి కల సాకారం చేస్తామని మంత్రి కొడాలి నాని అన్నారు. ప్రజాభిమానం ఉన్న సీఎం వైఎస్ జగన్‌పై నిందలు వేస్తున్న చంద్రబాబును దేవుడు కూడా క్షమించడని తీవ్రంగా మండిపడ్డారు. చంద్రబాబు బుద్ధి మార్చుకుని ప్రజా సంక్షేమ పథకాలకి మద్దతు తెలపాలని హితవు పలికారు. కొడుకు భవిష్యత్తు కోసం ప్రజా ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టు పెడుతున్నారని మంత్రి కొడాలి నాని ధ్వజమెత్తారు. (ఎస్ఐ రామాంజనేయులుపై సస్పెన్షన్ వేటు)
Comments
Please login to add a commentAdd a comment