
గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద కొడాలి నాని ఆందోళన
గుడివాడ : అక్రమార్జన కోసం కృష్ణాజిల్లా గుడివాడ ఆఫీసర్స్ క్లబ్‌లో పేకాట నిర్వహించేందుకు టీడీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్‌ఆర్ సీపీ నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని మండిపడ్డారు. మంత్రి కామినేని శ్రీనివాస్, ఎంపీ మాగంటి బాబు అక్రమంగా నిర్మించిన బిల్డింగ్‌లలో క్లబ్ నిర్వహణకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. తన అనుచరులు, మద్దతుదారులు, మహిళలతో కలిసి కొడాలి నాని శుక్రవారం గుడివాడ ఆఫీసర్స్ క్లబ్ వద్ద ఆందోళనకు దిగారు.