gambling
-
పిల్లల కంటెంట్‌లో అసభ్య యాడ్స్..
న్యూఢిల్లీ: పిల్లలు సహా అన్ని వర్గాలకు అనువైనదిగా మార్క్ చేసిన కంటెంట్‌లో తరచుగా అసభ్య ప్రకటనలు వస్తున్నాయని ఆన్లైన్ ప్లాట్‌ఫాం లోకల్‌సర్కిల్స్ సర్వే నివేదికలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది తల్లిదండ్రులు ఈ విషయం తెలిపారు. గత మూడేళ్లుగా గ్యాంబ్లింగ్/గేమింగ్, లోదుస్తులు, సెక్సువల్ వెల్నెస్కి సంబంధించిన ప్రకటనలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు వివరించారు. పిల్లలకు అనువైనదిగా పేర్కొన్న కంటెంట్‌లో గ్యాంబ్లింగ్/గేమింగ్ (ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా) సంబంధ ప్రకటనలు ఎక్కువగా వస్తున్నాయని 41 శాతం మంది తెలిపారు. లోదుస్తుల ప్రకటనలు తరచుగా ఉంటున్నాయని 35 శాతం మంది, సెక్సువల్ వెల్నెస్ యాడ్స్ ఉంటున్నాయని 29 శాతం మంది, మద్యం .. పొగాకు సంబంధ ప్రకటనలు ఉంటున్నాయని 24 శాతం మంది పేర్కొన్నారు. వయస్సుకు తగని ప్రకటనలు ప్రసారం చేస్తే నిబంధనల ఉల్లంఘనకు గాను ప్రభుత్వం భారీగా జరిమానాలు విధించాలని 88 శాతం మంది పేరెంట్స్ అభిప్రాయపడ్డారు. భారత్‌లో చాలా మంది పిల్లలు తమ తల్లిదండ్రుల డివైజ్‌నే ఉపయోగిస్తారు కాబట్టి .. డివైజ్ ఓనర్ ప్రొఫైల్‌ను బట్టి కాకుండా లైవ్‌లో ప్రసారమవుతున్న కంటెంట్ ప్రకారం ప్రకటనలు ఉండేలా ఆయా ప్లాట్‌ఫాంలు, ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకోవాలని లోకల్‌సర్కిల్స్ వ్యవస్థాపకుడు సచిన్ తపారియా తెలిపారు. 10,698 మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. వివిధ ప్రశ్నలకు దేశవ్యాప్తంగా 305 జిల్లాల నుంచి 30,000 పైచిలుకు సమాధానాలు వచ్చాయి. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్లాట్ఫారాలతో నష్టం ఎంతంటే..
భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న విదేశీ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలకు పూనుకుంది. ఆయా బెట్టింగ్ సంస్థల వల్ల ప్రభుత్వానికి 2.5 బిలియన్ డాలర్లు(రూ.20వేలకోట్లు) నష్టం కలుగుతోందని అఖిల భారత గేమింగ్ సమాఖ్య (ఏఐజీఎఫ్) తెలియజేసింది. విదేశీ కంపెనీలు భారత్‌లో తమ సంస్థలకు చెందిన ప్లాట్ఫామ్ల్లో చట్టవ్యతిరేక బెట్టింగ్, గ్యాంబ్లింగ్ గేమ్‌లను అందిస్తున్నాయి. అయితే వాటికి చట్టబద్ధత లేకపోవడంతో చాపకింద నీరులా అవి విస్తరిస్తున్నాయి. ఆ కంపెనీలకు చెందిన ప్లాట్‌ఫామ్‌లు వినియోగిస్తున్న వారు చట్టబద్ధత ఉన్నావాటికి లేని వాటిని మధ్య తేడాను గ్రహించలేకపోతున్నారని ఏఐజీఎఫ్ సీఈఓ రోలండ్ లాండర్స్ తెలిపారు. ఇలా విదేశీ కంపెనీలు భారత్‌లోని చట్టబద్ధ గేమింగ్ పరిశ్రమకు హాని కలిగించడంతో పాటు వినియోగదార్లకు నష్టం కలిగేంచేలా వ్యవహరిస్తున్నాయని ఆయన అన్నారు. ఈ ఆఫ్‌షోర్ ప్లాట్‌ఫామ్స్ ఏటా 12 బిలియన్ డాలర్ల (సుమారు రూ.లక్ష కోట్ల) వరకు యూజర్లు, ప్రకటన కంపెనీల నుంచి డిపాజిట్లను వసూలు చేస్తున్నాయి. అంటే జీఎస్టీ రూపంలో 2.5 బిలియన్ డాలర్ల(రూ.20వేల కోట్లు) మేర కేంద్రానికి నష్టం జరుగుతోందని చెప్పారు. ఇలాంటి కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందన్నారు. చాలా సంస్థలు ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సీజన్లో వ్యాపార ప్రకటనలు పెంచాయి. తమ ప్లాట్‌ఫారాలపై జీఎస్టీ/ టీడీఎస్ వర్తించదనీ చెబుతున్నాయన్నారు. దాంతో ఆయా గేమింగ్ ప్లాట్‌ఫారాల్లో ప్రకటనలకోసం కంపెనీలు ఆసక్తి చూపుతున్నట్లు తెలిసింది. ఇదీ చదవండి: గూగుల్‌లో నిరసన సెగ..రూ.10వేలకోట్ల ప్రాజెక్ట్ నిలిపేయాలని డిమాండ్.. -
కంపెనీని బురిడీ కొట్టించి గ్యాంబ్లింగ్.. అసలేం జరిగిందంటే..
కాయ్ రాజా కాయ్.. వంద పెట్టండి... వెయ్యి పట్టండి వంటి ప్రకటనలతో ఆన్లైన్ జూదం, బెట్టింగ్‌లు, మనీసర్క్యులేషన్ వంటి చెడు మార్గాలకు యువత బానిసవుతున్నారు. విలాసాలకు అలవాటుపడిన వారు తమ కోరికలు తీర్చుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. తీరా నేరం రుజువై జైలుపాలవుతున్నారు. ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న ఓ వ్యక్తి తాజాగా తన అధికారాన్ని దుర్వినియోగం చేసి దాదాపు రూ.180 కోట్లమేర మోసానికి పాల్పడ్డాడు. గ్యాంబ్లింగ్ చేసి ఆ డబ్బంతా పోగొట్టుకున్నాడు. చివరికి నేరం రుజువై ఆరున్నరేళ్ల జైలు శిక్ష విధించిన ఘటన అమెరికాలో వెలుగుచూసింది. వివరాల్లోకి వెళితే.. అమిత్‌పటేల్ అనే ఉద్యోగి అమెరికాలోని జాక్సన్విల్లే జాగ్వార్ కంపెనీలో ఫైనాన్షియల్ ప్లానింగ్ అండ్ అనాలసిస్ మేనేజర్‌గా విధులు నిర్వర్తిస్తుండేవాడు. కంపెనీ, ఉద్యోగులు తాత్కాలిక ఖర్చుల కోసం వర్చువల్ క్రెడిట్ కార్డ్ ప్రోగ్రామ్ (వీసీసీ)ని ఉపయోగించేలా అతడికి అవకాశం ఉండేది. వీసీసీను చట్టబద్ధమైన వ్యాపార ఖర్చులకోసం వినియోగించాల్సి ఉంటుంది. అయితే అతడు వ్యక్తిగతంగా చేస్తున్న అంతర్జాతీయ ప్రయాణాల కోసం, విమాన ఛార్జీలు, హోటల్ ఛార్జీలు వంటి వాటికి వీసీసీను వినియోగించేవాడు. ఈ లావాదేవీలను కంపెనీ తరఫు ఖర్చులుగా చిత్రీకరించేందుకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించాడు. చాలాసార్లు ప్రయాణాలు చేయకపోయినా నకిలీ ధ్రువపత్రాల ద్వారా కంపెనీని మోసం చేశాడు. అవి ముందుగా నమ్మదగినవిగానే అనిపించినా క్రమంగా కంపెనీ యాజమాన్యానికి అనుమానం వ్యక్తం అయింది. పటేల్ వీసీసీ ద్వారా అక్షరాల 21.1 మిలియన్ డాలర్లు(సుమారు రూ.180 కోట్లు) ఖర్చు చేశాడు. ఈ డబ్బును ఖరీదైన గడియారాలను కొనుగోలు చేయడానికి, ఆన్లైన్లో జూదం ఆడటానికి, ప్రైవేట్ జెట్లను అద్దెకు తీసుకోవడానికి, స్నేహితుల కోసం లగ్జరీ ట్రిప్‌ల కోసం ఉపయోగించాడు. ఫ్లోరిడాలోని పోంటే వెడ్రా బీచ్‌లో విల్లా, కొత్త టెస్లా మోడల్ 3 సెడాన్, నిస్సాన్ పికప్ ట్రక్ కొనుగోలు చేయడానికి ప్రయత్నించగా కంపెనీ విచారణ జరిపి పోలీసులను ఆశ్రయించింది. ఇదీ చదవండి: ‘గొప్పలు చెప్పి సరిపెట్టొద్దు.. అదో విచిత్ర అలవాటు’ ఈ వ్యవహారంపై పూర్తి విచారణ జరిపిన పోలీసులు కేసును కోర్టుకు తరలించారు. పూర్వాపరాలు, ఆధారాలు తెలుసుకున్న కోర్టు మంగళవారం అమిత్పట్ల్కు ఏకంగా ఆరున్నరేళ్లు జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పటేల్ మాట్లాడుతూ ఏడాది ముందు తానెంతో తెలివిగల వాడినని భావించినట్లు చెప్పాడు. కానీ జూదం, గ్యాంబ్లింగ్ వల్ల చాలా నష్టపోయానని అన్నాడు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశాడు. ఈ వ్యవహారంలో కంపెనీకి చెందిన ఇతర ఉద్యోగులపాత్ర లేదని కోర్డు నిర్ధారించింది. చివరకు కంపెనీ పటేల్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. -
బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలకు దూరంగా ఉండండి
న్యూఢిల్లీ: బెట్టింగ్, గ్యాంబ్లింగ్ సంబంధిత ప్రకటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో అటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలను ప్రమోట్ చేయడానికి దూరంగా ఉండాలని సెలబ్రిటీలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు వినియోగదారుల ప్రయోజనాల పరిరక్షణ సంస్థ సీసీపీఏ సూచించింది. అలాంటి కార్యకలాపాలను ప్రమోట్ చేస్తే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మేరకు అడ్వైజరీని జారీ చేసింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల ప్రకటనలు, ప్రమోషన్ మొదలైనవి వివిధ చట్టాల కింద నిషిద్ధమని సీసీపీఏ పేర్కొంది. ‘పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్ 1867 ప్రకారం బెట్టింగ్, గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉంది. దేశవ్యాప్తంగా చాలా ప్రాంతాల్లో వీటిని చట్టవిరుద్ధంగా పరిగణిస్తారు. అయినప్పటికీ గేమింగ్ ముసుగులో పలు ఆన్లైన్ బెట్టింగ్ ప్లాట్‌ఫామ్‌లు, యాప్‌లు నేరుగా బెట్టింగ్, గ్యాంబ్లింగ్ ప్రకటనలు ఇస్తున్నాయి‘ అని సీసీపీఏ తెలిపింది. ఇలాంటి కార్యకలాపాలను బలపర్చడమనే ది ఆర్థికంగా, సామాజికంగా, ముఖ్యంగా యువతపై, తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందని పేర్కొంది. వాటికి సంబంధించిన మార్గదర్శకాలు అన్ని మాధ్యమాలకు వర్తిస్తాయని సీసీపీఏ తెలిపింది. చట్టవిరుద్ధమైన వాటిని ఏ రకంగా ప్రమోట్ చేసినా ఆయా కార్యకలాపాల్లో పాల్గొన్న వారితో సమానంగా చర్యలు ఎదుర్కొనాల్సి ఉంటుందని సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లను హెచ్చరించింది. -
చంద్రబాబు రాజకీయ జూదం.. పవన్ జోకర్ పాత్రేనా?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆడుతున్న రాజకీయ జూదంలో ఒక జోకర్‌గా మిగిలిపోయేలా ఉన్నారు. చంద్రబాబు తనకు ఎక్కడ, ఎప్పుడు అవసరమైతే అక్కడ పవన్‌ను వాడేసుకుంటున్నారు. పేకాటలో జోకర్‌ను కూడా అలాగే వాడుతుంటారు. చివరికి పరిస్థితి ఏ దశకు వచ్చిందంటే పవన్ కళ్యాణ్ మేలు కోరి మాట్లాడుతున్న సీనియర్ నేత, మాజీ మంత్రి చేగొండి హరిరామజోగయ్యను, అలాగే జనసేనలోకి వెళ్దామా అని ఆలోచించిన మరో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కన్నా చంద్రబాబు నాయుడే తనకు ఎక్కువ అనే దశకు చేరుకున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు సమక్షంలోనే తన పార్టీని తానే అవమానించుకుంటూ ఆయన కళ్లలో ఆనందాన్ని చూస్తున్నట్లుగా పవన్ వ్యవహరించారు. లేకుంటే రాజకీయాలలో బలహీనతలను ఎవరూ అంత బహిరంగంగా చెప్పుకోరు. మరో పార్టీని గొప్పగా పొగడరు. మహా అయితే ఒక మంచి మాట చెబుతారు. కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం అందుకు విరుద్దంగా జనసేన కేడర్ లేదా నేతలతో చర్చించవలసిన విషయాలను జెండా బహిరంగ సభలో ప్రస్తావించి తన పార్టీ గాలి తానే తీసుకున్నారు. మనకు అంత బలం ఉందా? బూత్ స్థాయి బలగం ఉందా? భోజనం పెట్టే ఖర్చులు ఇవ్వగలమా? అంటూ ఏవేవో పిచ్చి ప్రేలాపలను చేసి టీడీపీ వారి దృష్టిలో మరీ చులకన అయిపోయారు. ఈ పరిణామం సహజంగానే చంద్రబాబుకు, టీడీపీ నేతలకు బాగా సంతోషం కలిగించి ఉంటుంది. అందుకే తాము మొదటి నుంచి జనసేనకు పదో- పరకో సీట్లు ఇస్తే, పవనే తమ వెంటపడి వస్తాడని వారు ఓపెన్‌గానే చెబుతూ వచ్చారు. దానిని పవన్ నిజం చేశారు. రెండు పార్టీలు కలిసి బీసీ డిక్లరేషన్ సభ ఏర్పాటు చేస్తే, చంద్రబాబు దానిని టీడీపీలో చేరిక సభగా మార్చి మాజీ మంత్రి గుమ్మనూరు జయరామ్‌కు టీడీపీ కండువా కప్పుతుంటే పవన్ కళ్యాణ్ బిక్కుబిక్కుమంటూ చూస్తూ నిలబడిపోయారు. పవన్ కళ్యాణ్ తనకు సలహా ఇస్తే ఒప్పుకోనని సొంత పార్టీ శ్రేయోభిలాషులపై ఆయన ఫైర్ అవుతుండడం చిత్రంగానే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు చేగొండి, మరోవైపు ముద్రగడ లేఖలు రాసి పవన్ణు ఫుట్ బాల్ ఆడుకున్నారు. ముద్రగడ లేఖ అయితే చాలా ఆసక్తికరంగా ఉంది. రెండు సార్లు కలుస్తానని కబురు చేసి, పవన్ ఆ తర్వాత ముద్రగడ ఊరువైపు కూడా వెళ్లకపోవడం సహజంగానే అసంతృప్తి కలిగిస్తుంది. మామూలుగానే ముద్రగడ చాలా సున్నితంగా ఉండే మనిషి. ఎలాంటి అవమానాన్ని సహించే వ్యక్తి కాదు. అలాంటిది పవన్ కళ్యాణ్ ఇలా చేయడం అంటే అది అహంకారంతో కూడిన పని అని ముద్రగడ భావించి ఉండాలి. అందుకే ఆయన ఒక లేఖ రాస్తూ తనను కలవకపోవడం వెనుక ఎవరి ఒత్తిడి ఉందో తెలుసుకోగలనని వ్యాఖ్యానించారు. అంటే పవన్‌తో పొత్తులో ఉన్న చంద్రబాబు నాయుడు ఒత్తిడే ఉండవచ్చని ముద్రగడ అభిప్రాయపడుతుండవచ్చు. ముద్రగడను, ఆయన కుటుంబాన్ని చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దారుణంగా హింసించారు. పోలీసులు బూతులు తిట్టడం ఆయన ఇప్పటికీ మరవలేరు. అయినా కాపు సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని పవన్‌తో అవగాహనకు రావడానికి కూడా ముద్రగడ కొంత తగ్గితే ఇలా పరాభవం ఎందురైందని ఆయన బాధపడి ఉండవచ్చు. ఆ లేఖలో పలు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్ కళ్యాణ్ నిర్ణయాలు ఆయన చేతిలో ఉండవని, ఆయన ఎన్నో చోట్ల పర్మిషన్లు తీసుకోవాల్సి ఉంటుందని ముద్రగడ ఎద్దేవా చేశారు. అంటే చంద్రబాబు అనుమతి లేకుండా ఏమి చేయలేని నిన్సహాయ స్థితిలో పవన్ ఉన్నారని ఆయన తేల్చేశారు. కాపు జాతి కోసం తాను బాధలు, అవమానాలు అన్నింటి కారణంగా పవన్‌తో కలిసి ప్రయాణించడానికి సిద్దపడితే.. పవన్ తన వద్దకు వస్తానని రాలేకపోయారని అన్నారు. అయినా 24 సీట్లలో జనసేన పోటీకి తన అవసరం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 80 అసెంబ్లీ సీట్లు, రెండున్నరేళ్లు సీఎం పదవి షేరింగ్ తీసుకుని ఒప్పందం అడగాల్సి ఉండగా, ఆ సాహసం పవన్ చేయలేకపోయారని ముద్రగడ తేల్చేశారు. తాను డబ్బు కోరుకోలేదని, పదవుల కోసం పెద్ద నాయకుల గుమ్మాల వద్ద పడిగాపులు కాయలేదని అంటూనే, మీలా గ్లామర్ ఉన్న వాడిని కాకపోవడంతో మీ దృష్టిలో నేను లాస్ట్ గ్రేడ్ వ్యక్తిగా, తుప్పుపట్టిన ఇనుములా మిగిలిపోయాయని, అందుకే తనను కలవడానికి రాలేదని ముద్రగడ వ్యంగ్యాస్త్రం సంధించారు. దీనికి పవన్ కళ్యాణ్ నోరువిప్పలేదు. జనసేననేతలు కూడా ఎవరూస్పందించలేదు. ఇక చేగొండి అయితే తాడేపల్లిగూడెం సభ తర్వాత నిస్సహాయంగా చంద్రబాబు, పవన్‌లను ఉద్దేశించి మీ ఖర్మ అని వ్యాఖ్యానించారు. కానీ, ఆ తర్వాత టీడీపీ మీడియా, టీడీపీ సోషల్ మీడియా ఆయనను తూలనాడుతూ ప్రచారం చేసిందట. తనను వైఎస్సార్సీపీ కోవర్టుగా ముద్రవేసిందట. దాంతో ఆయన మరో లేఖ రాశారు. పవన్ కళ్యాణ్ మేలు కోరి, కాపులకు ముఖ్యమంత్రి పదవి రావాలని ఆశిస్తుంటే తనను కోవర్టు అంటారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా చేసిన వివిధ కార్యకలాపాలను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. కొంతకాలం క్రితం కాపు ఉద్యమ నేతలు మంగళగిరిలో పవన్‌ను కలిసినప్పుడు కాపుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయనని అన్నారు. ఇరవై సీట్లకు ఒప్పుకుంటానని అనుకోవద్దన్నట్లుగా మాట్లాడారు. కానీ, తీరా అసలు విషయం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ కాపు నేతలకు, జనసేన నేతలకు ప్రాధాన్యం ఇవ్వకుండా చంద్రబాబు మాటలకే విలువ ఇస్తున్నారన్న సంగతి వారికి బోధపడింది. ఇప్పటికైనా చంద్రబాబు నోట రెండున్నరేళ్లపాటు పవన్ ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పించాలని చేగొండి డిమాండ్ చేశారు. ఇది హరిరామజోగయ్య అత్యాశే అనుకోవాలి. ఎందుకంటే తన కుమారుడు లోకేష్ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ సీఎం పదవికి అంత సమర్ధుడు కాదని వ్యాఖ్యానించినప్పుడే చంద్రబాబు ఖండించలేదు. పవన్ కళ్యాణ్ కూడా అసలు అవమానంగా ఫీల్ కాలేదు. అయితే జోగయ్య వంటివారి అనుమానం ఏమిటంటే ఒకవేళ కూటమికి అధికారం వస్తే లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడానికే చంద్రబాబు ప్రయత్నిస్తారని, అప్పుడు పవన్ అడ్డురాకూడదని కోరుకుంటారని కావచ్చు. ఈ రకంగా చంద్రబాబు ఆడుతున్న జూదంలో పవన్ కళ్యాణ్ ఒక పావుగానో, లేక ఒక జోకర్గానో ఉంటున్నారనిపిస్తుంది. ఇంకో రకంగా చూస్తే చంద్రబాబు చేతిలో పవన్ బందీ అయిపోయారు. బీజేపీతో పొత్తులో ఉండి, అక్కడ కాపురాన్ని వదలివచ్చినట్లు చెప్పకుండా, అనైతిక రాజకీయ సంబంధం పెట్టుకుని టీడీపీతో కలిసి ఉంటున్నారు. పైగా బీజేపీ ఆశీస్సులు ఉన్నాయని ఆ పార్టీ పరువు కూడా తీశారు. కానీ, బీజేపీ అధిష్టానం వీరికి ఏ సంగతి చెప్పకుండా అల్లాడిస్తోంది. దాంతో పవన్ ఎప్పుటికప్పుడు ఢిల్లీ వెళతారని, ఆ తర్వాత చంద్రబాబు కూడా వెళ్లి బీజేపీతో ఒప్పందం చేసుకుంటారని ప్రచారం చేయిస్తుంటారు. కానీ, అది జరగలేదు. బీజేపీతో పొత్తు కోరుతూనే ఈ రెండు పార్టీలు సీట్ల ఒప్పందం కుదుర్చుకోవడం 118 సీట్లకు అభ్యర్ధులను ప్రకటించడం బీజేపీకి నచ్చుతుందా అన్నది సందేహం. ఒకవేళ బీజేపీ కనుక ఈ కూటమిలోకి రాకపోతే పవన్‌కు ఒకరకంగా సంకట పరిస్థితి ఏర్పడుతుంది. ఇలాంటివాటిపై క్లారిటీ తెచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ తంటాలుపడుతున్నారు. మొత్తం మీద చంద్రబాబుకు జోకర్లా పవన్ కళ్యాణ్ ఉపయోగపడటం ఒక కోణం అయితే, కాపులు, బీజేపీ, తన అభిమానుల మధ్య సాలెగూడులో చిక్కిన పరిస్థితి ఆయనకు ఎదురవుతోందని చెప్పాలి. – కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు -
పేకాట కూడా మానసిక జబ్బేనా!
విజయ్ ఒక సేల్స్ రిప్రజెంటేటివ్. 35 సంవత్సరాల వయసు. పెళ్లయి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గత రెండేళ్లుగా విపరీతంగా పేక ఆడుతున్నాడు. దానివల్ల ఆర్థిక సమస్యలతో పాటు, కుటుంబంలో గొడవలూ వస్తున్నాయి. భార్య ఎంత వారించినా పట్టించుకోవడం లేదు. విడాకుల వరకూ వచ్చింది. చివరకు భార్య, కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకు కౌన్సెలింగ్ కోసం వచ్చాడు. విజయ్ బాల్యం నుంచీ అతని తల్లిదండ్రులు వీకెండ్లో సరదాగా పేక ఆడతారని అతనితో మాట్లాడినప్పుడు తెలిసింది. విజయ్, అతని సోదరుడు పెద్దయ్యాక నలుగురూ కలసి ఆడేవారు. అలా పేకాట అలవాటుగా మారింది. అన్నదమ్ములిద్దరూ అప్పుడప్పుడూ క్రికెట్ బెట్టింగ్ కూడా చేసేవారు. సేల్స్ రిప్రజేంటేటివ్గా మారాక ప్రతి నెలా టార్గెట్‌ను అందుకోవడం, కొలీగ్స్‌తో పోటీపడాల్సి రావడంతో విజయ్ జీవితంలోకి ఒత్తిడి చేరింది. పెళ్లి చేసుకుని, పిల్లలు పుట్టాక కుటుంబ బాధ్యతలతో ఒత్తిడి మరింత పెరిగింది. వీటన్నిటినీ తట్టుకోవడానికి అతను పేకాటను ఒక మార్గంగా మార్చుకున్నాడు. ఏ ఏటికి ఆ ఏడు అందులో కూరుకుపోసాగాడు. చివరకు పేక ఆడకుండా ఉండలేని స్థితికి చేరుకున్నాడు. దీన్ని గాంబ్లింగ్ డిజార్డర్ లేదా కంపల్సివ్ గాంబ్లింగ్ అంటారు. ఇదో మానసిక రుగ్మత. అదొక సంక్లిష్ట పరిస్థితి గాంబ్లింగ్ డిజార్డర్ అనేది జీవ, మానసిక, పర్యావరణ కారకాల కలయికతో ప్రభావితమైన సంక్లిష్ట పరిస్థితి. డోపమైన్, సెరటోనిన్, నోర్ ఎపినెఫ్రిన్ వంటి కొన్ని న్యూరోట్రాన్స్మిటర్లలో అసాధారణతలు దీనికి కారణం కావచ్చు. జన్యువులు కూడా కారణమని అధ్యయనాలు సూచిస్తున్నాయి జూదం ఆడే వాతావరణంలో పెరగడం దానిపట్ల సానుకూల ధోరణికి దోహదపడవచ్చు. విజయ్ విషయంలో అదే జరిగింది విజయ్ జీవితంలోలా అధిక స్థాయి ఒత్తిడి, ప్రధాన జీవన మార్పులు లేదా బాధాకరమైన సంఘటనలు జూదం రుగ్మతలను ప్రేరేపించవచ్చు డిప్రెషన్, యాంగ్జయిటీ లేదా అఈఏఈ వంటి మానసిక ఆరోగ్య పరిస్థితులున్న వ్యక్తులు వారి లక్షణాలను ఎదుర్కోవడానికి జూదానికి అలవాటు పడవచ్చు రిస్క్ తీసుకునే ధోరణి, ఇంపల్సివిటీ, సెన్సేషన్ సీకింగ్ లాంటి వ్యక్తిత్వ లక్షణాలు జూదానికి అలవాటు చేయవచ్చు క్లబ్బులు, కాసినోలు, ఆన్లైన్ ప్లాట్‌ఫామ్‌లు అందుబాటులో ఉండటం కూడా కారణమవుతుంది ఒత్తిళ్లకు ప్రతిస్పందనగా జూదం ఒక దుర్వినియోగమైన కోపింగ్ మెకానిజంగా మారుతుంది అప్పుడప్పుడూ గెలుపొందడం వల్ల వచ్చే ఆనందం మెదడులో డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దానికోసం మళ్లీ మళ్లీ ఆడతారు. ఆడకుండా ఉండలేరు గాంబ్లింగ్ డిజార్డర్ ఒక బిహేవియరల్ అడిక్షన్. జూదం ఆడకుండా ఉండలేకపోవడం దీని ప్రధాన లక్షణం. నిరంతరం జూదం గురించి లేదా జూదానికి డబ్బు ఎలా సంపాదించాలనే దానిగురించి ఆలోచిస్తుంటారు. ఈ రుగ్మత ఉన్న వ్యక్తులు... తమకు కావల్సిన స్థాయి ఎగ్జయిట్మెంట్ కోసం పెద్ద మొత్తంలో పందేలు కాస్తుంటారు. జూదం వల్ల సమస్యలు వస్తున్నాయని తెలిసి ఆపేయాలని ప్రయత్నించినా ఆపలేకపోతారు. జూదం తగ్గించినప్పుడు లేదా ఆపేసినప్పుడు చిరాకు, అసౌకర్యం, ఉద్రిక్తత.. జూదం వల్ల గతంలో వచ్చిన నష్టాలను మళ్లీ జూదంతోనే భర్తీ చేయాలనే ప్రయత్నం.. జూదం ఆడుతున్నామనే విషయాన్ని దాచడానికి అబద్ధాలు చెప్పడం, మోసం చెయ్యడం.. విద్య, ఉపాధి అవకాశాలు కోల్పోతున్నా.. జీవితంలో, కెరీర్లో సమస్యలు ఎదురవుతున్నా గుర్తించలేకపోవడం.. జూదం వల్ల వచ్చే నష్టాల నుంచి బయటపడేందుకు అప్పులు చేయడం, ఆస్తులు అమ్మడం.. జూదం రుణాలను చెల్లించడానికి మోసం, దొంగతనం లాంటి చట్టవిరుద్ధమైన కార్యకలాపాలలో పాల్గొనడం.. ఆర్థిక, మానసిక, వైవాహిక సమస్యలు వచ్చినా జూదం కొనసాగించడం.. సీబీటీతో తప్పించుకోవచ్చు.. జూదం వ్యసనం వల్ల ఏర్పడిన ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవడానికి బాధ్యతాయుతమైన ఆర్థిక నిర్వహణ నేర్చుకోవడం అవసరం. వాస్తవిక బడ్జెట్ వేసుకోవడానికి, జూదం వల్ల వచ్చిన అప్పులు తీర్చడానికి ఆర్థిక సలహాదారుతో కలసి ప్రణాళిక రూపొందించుకోవాలి. గాంబ్లర్స్ అనానిమస్, సపోర్ట్ గ్రూపుల్లో చేరడం ద్వారా సమస్యను మరింత లోతుగా అర్థం చేసుకోవచ్చు · ఒత్తిడిని తప్పించుకోవడానికి జూదం వైపు వెళ్లకుండా మైండ్‌ఫుల్‌నెస్, వ్యాయామం, హాబీస్ లాంటి ప్రత్యామ్నాయ కోపింగ్ మెకానిజమ్స్‌ను ప్రాక్టీస్ చేయాలి ·గుర్తించడం, అభ్యాసం చేయడం, జూదాన్ని ఆశ్రయించకుండా ఒత్తిడిని జయించడానికి సహాయపడుతుంది జూదానికి సంబంధించిన అహేతుక ఆలోచనలు, నమ్మకాలను గుర్తించడానికి, సవాలు చేయడానికి కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ ఉపయోగపడుతుంది కోపింగ్ స్ట్రాటజీస్‌ను అభివృద్ధి చేయడంలో, కోరికలను నియంత్రించుకోవడానికి సీబీటీ సహాయపడుతుంది కమ్యూనికేషన్‌ను మెరుగుపరచడం, నమ్మకాన్ని పునర్నిర్మించడం, కుటుంబ మద్దతును పొందడానికి ఫ్యామిలీ థెరపీ ఉపయోగపడుతుంది · జూదం వల్ల వచ్చే మానసిక రుగ్మతలను తగ్గించడానికి మందులు సహాయపడతాయి. --సైకాలజిస్ట్ విశేష్, psy.vishesh@gmail.com (చదవండి: ఏళ్ల తరబడి వదలని దిగులు.. పరిష్కారం ఏమిటి?) -
బెట్టింగ్ బాలరాజులు! కొంపలు కాలిపోతున్నాయి.!
బెట్టింగ్... ముఖ్యంగా ఆన్లైన్ బెట్టింగ్ ... చాప కింద యాసిడ్‌లా విస్తరించి అనేక కొంపల్ని ముంచేస్తోంది . బెట్టింగ్ ఒక మానసిక వ్యసనం ! తల్లితండ్రులు " కంచు" టైపు అయితే పిల్లల్లో బెట్టింగ్ వ్యసనం వచ్చే అవకాశం ఎక్కువ ! " కంచు మొగునట్లు కనకంబు మోగునా ?" అని నానుడి. కొంత మంది ఎంత సేపూ "షో ఆఫ్ " టైపు . తమ గొప్పలు చెప్పుకోవడం .. చూపుకోవడం వీరి దిన చర్య . కిట్టి పార్టీలు మందు పార్టీలలో ఈ "కంచులు" గణగణ మోగుతుంటాయి . " ఈ కాలం కూడా ఇంకా మారుతీ సుజుకిలో ఎట్టా ట్రావెల్ చేస్తారో .. ఏంటో .. నేనైతే మినిమం వోల్వో వదినా .. మా అన్నగారయితే లాండ్రోవర్ దిగరు" అని బిల్డప్‌లు ఇస్తూ బతికేస్తారు. అదొక ఐడెంటిటీ క్రైసిస్. ఆత్మ న్యూనతా భావం. ఆవు చేలో దూడ గట్టున మేస్తుందా ? నేను గొప్ప అని అవతలివారికి చాటి చెప్పుకోవాలి అనే ఆలోచన బెట్టింగ్ కు దారి తీస్తుంది. కష్టపడే తత్త్వం లేకపోవడం , ఈజీ గా డబ్బు సంపాదించాలి అనుకోవడం కూడా ఒక కారణం గ్యాంబ్లింగ్ డిసార్డర్ - అనేది తీవ్ర మానసిక రోగం. నేడు ఎంతో మంది దీని బారినపడి సతమమవుతున్నారు . ఆలోచనలు ఎప్పుడూ గ్యాంబ్లింగ్ చుట్టూ తిరుగుతుంటాయి. ఎన్నికలు .. క్రికెట్... సినిమా జయాపజయాలు.. కాదోయి ఏది బెట్టింగ్ కు అనర్హం. ఒక్క సారి గెలిస్తే.. "ఇప్పుడు మనకు సుడి తిరిగింది.. స్టార్స్ కలిసి వస్తున్నాయి.. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తే అది ఇప్పుడే.. ఇప్పుడే" అంటూ అందులో లీనం అయిపోతారు. ఓడితే .. "ఇజ్జాత్ కా సవాల్ .. ప్రెస్టేజ్ క్వొశ్చన్.. ఓడిపోయి పోవడమా? గెలిచే దాక ఆడాల్సిందే!" అంటూ ఆటలో మునిగిపోతారు. అంటే బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ అనేది సుడిగుండం. పద్మ వ్యూహం.. ఒక సారి దిగితే సేఫ్ గా బయటకు రావడం అనేది ఉండదు . ఆలా ఒకటి రెండు సార్లు వచ్చినా ఆది అంతం కాదు .. జస్ట్ బిగినింగ్. జూదంలో గెలవడం వల్ల డోపమైన్ హార్మోన్ వస్తుంది . ఇది మహా కిక్కు ఇస్తుంది. ముందుగా ఒక పెగ్గు మందుతో స్టార్ట్ చేసినవాడికి మూడేళ్లయ్యే సరికి కనీసం క్వార్టర్ దిగనిదే కిక్కు ఎక్కదు. బెట్టింగ్ కూడా అంతే. అమౌంట్ పెంచుకొంటూ పెద్ద పెద్ద బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ చేస్తేనే మునుపటి కిక్కు వస్తుంది. కాబట్టి చిన్నగా మొదలయిన వ్యసనం.. ఆస్తులు... పెళ్ళాం పిల్లల తాకట్టు దాకా దారితీస్తుంది . "నేనట్టా కాదు లే ... నేను మహా స్మార్ట్. జస్ట్ ఫన్ కోసం ఆడుతున్నా". అని ప్రతి బెట్టింగ్ బంగారు రాజు అనుకొంటాడు. బెట్టింగ్ డోపమైన్ "హై" అనేది ఒక సైంటిఫిక్ రూల్. అది ఎవడినీ వదలదు అని వాడు అర్థం చేసుకొనేటప్పటికీ అన్ని అయిపోయి కొంపలు కాలిపోయి ఉంటాయి. మహాభారతం కాలం నుంచి అన్ని రకాల జూదాలు/ బెట్టింగ్ లు మాయా వ్యవహారాలే. కేసినోకు పొయ్యి సర్వ నాశనం కానోడు .. కేసినో నిర్వహించి కోట్లకు పడగలెత్తని వాడు భూప్రపంచం లో కనపడడు. బెట్టింగ్ బంగారు రాజులను బకరాలను చేయడానికి బెట్టింగ్ మాఫియా .." ఫలానా వాడు మిలియన్స్ సాధించాడు" అని బిల్డ్ అప్ స్టోరీ లు వదులుతుంటుంది. బకరాలు నమ్మేస్తారు . బెట్టింగ్ వల్ల నిమ్మళంగా ఒక చోట కూర్చోలేని చంచలత్వం వస్తుంది . ఇలాంటి వారు ఏ పనిపై దృష్టి సారించలేరు . బెడ్ రూమ్‌లో కూడా ఇదే ధ్యాసతో వుంటారు .ఉస్సేన్ బోల్ట్ లయి పోతారు, ఆ తర్వాత ఇంకేముంది.. సంసార జీవనంలో చిక్కులే చిక్కులు. బెట్టింగ్ గాళ్ళు సులభంగా చిరాకు కు గురవుతారు . అసహనం పెరిగిపోతుంది. బెట్టింగ్ అప్పులకు దారి తీస్తుంది . అప్పులు తీర్చ్చడానికి అదనంగా బెట్టింగ్ చేస్తారు . ఆంటే చిన్న ఊబిలో నుంచి మరీనా ట్రెంచ్ లోతుల్లోకి వీరి పతనం వేగంగా సాగుతుంది. తమ కుటుంబానికి తమ వ్యసనం గురించి తెలిసిపోకుండా ఉండేందుకు అబద్దాలు చెప్పడం మొదలెడతారు. బెట్టింగ్ / గ్యాంబ్లింగ్ జరిగే చోట మందు- విందు- పొందు తప్పని సరి ఆడ్ ఆన్స్. డయాబెటిస్ బిపి కిడ్నీ సమస్యలు ఊబకాయం , ఎయిడ్స్ .. వీరు అదనంగా పొందే కొన్ని బహుమతులు . బెట్టింగ్ వల్ల అప్పుల ఊబి ఖాయం . ఆత్మహత్యలు ... కొన్ని సార్లు హత్యలు .. అటుపై చిప్పకూళ్ళు .. బెట్టింగ్ కుటుంబాలను నాశనం చేస్తుంది . 25ఏళ్ళ లోపు వారిలో మెదడు ముందుభాగం ప్రీ ఫ్రంటల్ కార్టెక్స్ సరిగ్గా అభివృద్ధి చెందివుండదు . దీనితో వీరు భావోద్వేగాలను తట్టుకొనే సామర్థ్యాన్ని కలిగివుండరు . వీరి చేతిలో సెల్ ఫోన్ . నేడు నీలి చిత్రాలు , హింసాత్మక వీడియో గేమ్స్ కన్నా కుటుంబాలను నాశనం చేస్తోంది ఆన్లైన్ బెట్టింగ్. చేతిలో సెల్ ఫోన్ ఏదో చేసుకొంటున్నాడు అని తల్లితండ్రులు అనుకొనే లోపే బెట్టింగ్ మాఫియా లు వచ్చి " మీ వాడు ఇరవై లక్షలు అప్పుపడ్డాడు . ఇస్తారా చస్తారా? అంటూ బెదిరించి ఆస్తులు మానప్రాణాలు తీసిన ఘటనలు ఎక్కువుగా జరుగుతున్నాయి. మీ ఇంటిలో కూడా పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి. బెట్టింగ్ మాఫియా కాళ్లావేళ్లా పడ్డా కనికరించదు. దయనీయమయిన స్థితిలో జీవితాన్ని చాలించాల్సి వస్తుంది. సిగరెట్ తాగితే ఇరవై ఏళ్లకు ప్రాణం మీదకు వస్తుంది. మందు తాగితే 15 ఏళ్లకు. గంజాయి కొడితే ఐదేళ్లకు. ఆన్లైన్ బెట్టింగ్ చేస్తే కేవలం ఆరునెలలకు.. చస్తారు. మిగతా వాటిలో తాగిన వాడొక్కడి ప్రాణం. కానీ ఆన్లైన్ బెట్టింగ్ లో ఇంటిల్లి పాదీ.. కట్టకట్టుకుని.. తస్మాత్ జాగ్రత్త . పిల్లల్ని సెల్ ఫోన్ కు దూరంగా ఉంచండి . 'ఈజీ మనీ పాములాంటిది అని చెప్పండి . కష్టపడే తత్వాన్ని నేర్పండి. వాసిరెడ్డి అమర్నాథ్, ప్రముఖ విద్యావేత్త, మానసిక శాస్త్ర పరిశోధకులు -
జ్యూస్ అమ్ముకునే స్థాయినుంచి రూ.5 వేల కోట్ల దాకా: ఎవరీ సౌరభ్?
Mahadev Gambling App Sourabh Chandrakar: మహదేవ్ బెట్టింగ్ యాప్ కుంభకోణానికి సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇటీవల నిర్వహించిన దాడులు కలకలం రేపాయి. దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈడీ దాడుల్లో రూ.417 కోట్ల ఆస్తులను స్వాధీనం చేసుకుంది. రాయ్‌పూర్, భోపాల్, కోల్‌కతా, ముంబై సహా పలు నగరాల్లో బెట్టింగ్ సిండికేట్‌కు చెందిన 39 ఆఫీసులపై ఈడీ దాడులు చేసింది. ఈ కేసుకు సంబంధించి ఏజెన్సీ 15 మందిని అరెస్టు చేయడంతో మహాదేవ్ బుక్ యాప్ అక్రమాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. దుబాయ్‌లో ఉంటూ ఆన్లైన్ బెట్టింగ్ రాకెట్ నడుపుతున్నసౌరభ్ చంద్రకర్ ఈ స్కాంలో కీలకం. మహాదేవ్ ఆన్లైన్ బుకింగ్ పోకర్, కార్డ్ గేమ్స్, ఛాన్స్ గేమ్‌లు, టెన్నిస్, క్రికెట్, బ్యాడ్మింటన్, ఫుట్‌బాల్ ఇతర ఆటల ద్వారా అక్రమ బెట్టింగ్ నిర్వహిస్తుంది. ఈ బెట్టింగ్ యాప్‌లో సహ ప్రమోటర్‌గా ఉన్న రవి ఉప్పల్ కలిసి బెట్టింగ్ ద్వారా వచ్చిన అక్రమ సంపాదనను FPI మార్గం ద్వారా భారతీయ స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టారు. మహాదేవ్ ఆన్లైన్ బెట్టింగ్ కేసులో దుబాయ్‌లో ఈ ఇద్దరు ప్రధాన ప్రమోటర్లు రూ. 5,000 కోట్ల వరకు కూడబెట్టారు. (బాలీవుడ్లో మహదేవ్ బెట్టింగ్ స్కాం కలకలం: సెలబ్రిటీలకు ఈడీ షాక్) రూ. 200 కోట్ల స్టార్-స్టడెడ్ వివాహం ఈ ఏడాది ఫిబ్రవరిలో సౌరభ్ దుబాయ్‌లోని అతిపెద్ద నగరంలో, అత్యంత విలాసవంతంగా వివాహం చేసుకున్నాడు. దీని కోసం ఏకంగా రూ. 200 కోట్లు ఖర్చు చేశాడు. నాగ్‌పూర్ నుండి తన బంధువులను, సినీ తారలను ప్రైవేట్ జెట్ల ద్వారా తరలించాడు. అంతేకాదువెడ్డింగ్ ప్లానర్‌కు రూ.120 కోట్లు చెల్లించాడు. బాలీవుడ్ సెలబ్రిటీలు స్పెషల్ ప్రదర్శనలు ఇచ్చారంటే పెళ్లి ఏ రేంజ్లో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ముంబైలోని మలాద్ ప్రాంతంలోని ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థకు అంగడియ సంస్థలు డబ్బును డెలివరీ చేసినట్లు ఈడీ గుర్తించింది. ఇందులో యోగేష్ భాపట్ ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ R-1 ఈవెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు రూ.112 కోట్లు, హోటల్ బుకింగ్స్ కోసం రూ.42 కోట్లు అందాయి. భోపాల్‌కు చెందిన ర్యాపిడ్ ట్రావెల్స్ చంద్రకర్ బంధువులు, బాలీవుడ్ ప్రముఖులను దుబాయ్‌కు పంపడానికి టిక్కెట్లు ఏర్పాటు చేసిందని, అయితే కోల్‌కతాకు చెందిన వికాస్ చప్పరియా ద్వారా అక్రమ నగదు లావాదేవీలు జరుగుతున్నాయని ఈడీ ఆరోపించింది. (ఐకానిక్ డబుల్ డెక్కర్: ఆనంద్ మహీంద్ర ఎమోషనల్ ఫిర్యాదు, పోలీసులేమన్నారంటే!) @GoI_MeitY @NewsG2G @Cybercellindia Today Lotus365 Again With New Advertisement on Big Front Page Government Banned Betting websitehttps://t.co/luYqv9u3oh Banned Aftet They Update Domain To . in Then Smartly Changed The Domain To https://t.co/QXi0XQGCGL After Banned pic.twitter.com/k7cTplhNrG — Sunny Sunny (@SunnySu19623409) April 7, 2023 ఈ వివాహానికి బాలీవుడ్ సెలబ్రిటీలు అతిఫ్ అస్లాం, విశాల్ దద్లానీ, రహత్ ఫతే అలీ ఖాన్, టైగర్ ష్రాఫ్, అలీ అస్గర్, సన్నీ లియోన్, క్రిసీ ఖర్బండా, ఎల్లి అవ్రామ్, నుష్రత్ భరుచ్చా, భారతీ సింగ్, క్రుషా అభిషేక్,భాగ్యశ్రీ వంటి తారలు హాజరయ్యారని ఈడీ గుర్తించింది. వీరందరినుంచి సమన్లు జారీ చేసి, వారి స్టేట్మెంట్లు తీసుకోవాలని ఈడీ చూస్తోంది.సెప్టెంబర్ 18, 2022న జరిగిన మూడవ వార్షికోత్సవ పార్టీకి కూడా బాలీవుడ్ తారలు హాజరయ్యారు. వీరిలో సంజయ్ దత్, కపిల్ శర్మ, అఫ్తాబ్ శివదాసాని, సుఖ్విందర్ సింగ్, సోఫీ చౌదరి, డైసీ షా, ఊర్వసాహి రౌతేలా, నర్గీస్ ఫక్రీ, నేహా శర్మ తదితరులు హాజరయ్యారు. ఈవెంట్ మేనేజర్లు, ట్రావెల్ ఏజెంట్లు, హవాలా వ్యాపారులపై జరిపిన దాడుల్లో ఈ నెట్‌వర్క్‌ను గుర్తించినట్లు ఏజెన్సీ తెలిపింది. ఈడీ ఆరోపణల ప్రకారం వీరు మహాదేవ్ ఆన్లైన్ బుక్ బెట్టింగ్ యాప్ గొడుగు కింద సిండికేట్ అయ్యారు. ముఖ్యంగా ఇన్‌యాక్టివ్ లేదా సెమీ-యాక్టివ్ ఖాతాలను గుర్తించి వారికి స్వల్పమొత్తంలో ఎరవేసి, ఆ ఖాతాల ద్వారా కోట్ల లావాదేవీలు చేశారని దీంతోనే వీటిని ట్రాక్ చేయడం కష్ట మైందని దర్యాప్తు ఏజెన్సీ చెప్పింది. జ్యూస్ అమ్ముకునే చంద్రకర్ ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్‌కు చెందిన చంద్రకర్ మొదట్లో జ్యూస్ అమ్మేవాడు. మరోవైపు రవి ఉప్పల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. స్థానిక బుకీలుగా ప్రారంభమై, చాలా తక్కువ సమయంలోనే చంద్రకర్, రవి ఇద్దరూ దుబాయ్‌కి వెళ్లి 2018లో ఈ యాప్‌ను ప్రారంభించారు. త్వరితగతిన డబ్బులిస్తామంటూ విద్యార్థులు, నిరుద్యోగ యువత, రైతులు, ఇతరులను ప్రలోభపెట్టారు. ఇది సక్సెస్ కావడంతో అప్పటినుంచి వెనుదిరిగి చూడలేదు. సెలబ్రిటీల ద్వారా మహదేవ్ బుక్ యాప్స్ ప్రమోషన్స్ నిర్వహించింది.అలా కోట్లకు పడగలెత్తిన చంద్రకర్, FairPlay, Reddy Anna, Lotus365 వంటి బ్రాండ్లను కొనుగోలు చేసింది. దీంతోపాటు, 'బేట్భాయ్' అంబానీ బుక్' పేరుతో కొత్త బ్రాండ్లను కూడా ప్రారంభించాడు. ఈ ఇద్దరు కింగ్పిన్లపై రెడ్ కార్నర్ నోటీసులు (ఆర్సిఎన్) జారీ చేసే యోచనలో ఉందిఈడీ. దీని నిమిత్తం రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టు పరారీలో ఉన్న నిందితులకు నాన్‌బెయిలబుల్ వారెంట్లు కూడా జారీ చేసింది. -
గెలిచింది 5 కోట్లు.. పోగొట్టుకుంది 58 కోట్లు..
ముంబై: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఆన్లైన్లో జూదమాడి 5 కోట్లు సంపాదించాడు. తక్కువ సమయంలో కూర్చున్న చోట కూర్చుని ఉండగానే కోట్లు కొల్లగొట్టడంతో ఇదేదో బాగుందనిపించి అదేపనిగా గ్యాంబ్లింగ్ ఆడాడు. ఇంకేముంది చూస్తుండగానే 58 కోట్లు పోగొట్టుకుని లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించాడు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నాగ్‌పూర్‌కు సమీపంలోని గొండా సిటీకి చెందిన అనంత్ అలియాస్ శొంటు నవరతన్ జైన్ బాధితుడైన వ్యాపారస్తుడికి గ్యాంబ్లింగ్ లో ఆనతి కాలంలోనే కోట్లు గడించవచ్చని ఆశ చూపించాడు. మొదట్లో వెనకడుగు వేసిన వ్యాపారి తరవాత ఎందుకో నవరతన్ జైన్ ప్రలోభానికి లొంగిపోయాడు. వెంటనే జైన్ కు హవాలా ద్వారా రూ.8 లక్షలు ట్రాన్స్ఫర్ చేశాడు. జైన్ వ్యాపారికి వాట్సాప్‌లో ఒక లింకు పెట్టగా దాని ద్వారా తన అకౌంట్లో రూ. 8 లక్షలు డిపాజిట్ అయినట్టు చూపించింది. దీంతో వ్యాపారికి ఆశతో పాటు నమ్మకం కూడా కలిగింది. ఆలస్యం చేయకుండా వెంటనే గ్యాంబ్లింగ్ ఆడటం ప్రారంభించాడు. మొదట్లో హస్తవాసి కలిసొచ్చి 5 కోట్లు లాభం సంపాదించాడు. అక్కడ వరకు అంతా బాగానే సాగింది. సరిగ్గా అప్పుడే మొదలైంది అసలు జూదం. ఒక్కొక్కటిగా సంపాదించిన ప్రతి రూపాయి వెనక్కి పోవడం మొదలైంది. పోయిన రూపాయిని తిరిగి రాబట్టుకోవాలన్న అతడి తాపత్రయం ఏకంగా 58 కోట్లు నష్టపోయేలా చేసింది. ఎంత ఆడినా జూదం కలిసిరాకపోవడంతో విసుగు చెందిన వ్యాపారి నవరతన్ జైన్ ను కలిసి తన డబ్బు తనకు తిరిగివ్వాలని కోరాడు. అతడు నిరాకరించడంతో చేసేదేమీ లేక తమకు కంప్లైంట్ ఇచ్చినట్లు తెలిపారు. వెంటనే గొండా సిటీలోని నిందితుడి ఇంటికి వెళ్ళేసరికే జైన్ పారిపోయాడని.. ఇల్లంతా సోదా చేయగా 14 కోట్లు నగదు నాలుగు కేజీల బంగారు బిస్కెట్లు దొరికినట్లు తెలిపారు పోలీసులు. వారంతా దుబాయ్ పారిపోయి ఉండవచ్చని చెబుతున్నారు పోలీసులు. గ్యాంబ్లింగ్ కారణంగా ఎందరో జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. అయినా కూడా ఏదో ఒక మూల అదృష్టదేవత కనికరించక పోతుందా అన్న చిన్న నమ్మకంతో అనేకులు ఈ మహమ్మారి బారిన పతున్నారు. అదృష్టం సంగతి అటుంచితే ఉన్నదంతా ఊడ్చిపెట్టుకుపోయిన సందర్భాలే ఎక్కువ. ఇది కూడా చదవండి: మణిపూర్ అరాచకపర్వంలో మరో ఘోరం.. -
టీడీపీ నేత పట్టాభి అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడుతున్నాడు: చికోటి
సాక్షి, హైదరాబాద్: థాయిలాండ్ క్యాసినో కేసులో ఈడీ ఎదుట సోమవారం విచారణకు హజరైన చికోటి ప్రవీణ్ సాక్షి టీవీతో మాట్లాడారు. తాను ఆర్గనైజర్ కాదు అని పేర్కొన్నారు. థాయ్‌లాండ్ క్యాసినో కేసులో తన ప్రమేయం లేదన్నారు. అందుకే అక్కడి న్యాయస్తానం తమకు 2000 బాత్‌లు(రూ.4,850) ఫైన్ విధించి వదిలేసిందన్నారు. థాయ్‌లాండ్‌లో కేసు ముగిసిందన్నారు. ఈడీ అడిగిన అన్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పానని, దర్యాప్తు సంస్థ మీద తనకు పూర్తి నమ్మకం ఉందని చికోటి అన్నారు. మళ్లీ ఎప్పుడూ పిలిచినా అందుబాటులో ఉండాలని చెప్పారని వివరించారు. టీడీపీ నేత పట్టాభి చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని చికోటి మండిపడ్డారు. ఆయనకు అధికారం లేక పిచ్చిమాటలు మాట్లాడున్నాడని ధ్వజమెత్తారు. తన భుజంపై తుపాకీ పెట్టి ప్రత్యర్థులను కాల్చే కుట్ర సాగుతోందన్నారు. త్వరలోనే రాజకీయ అరంగేట్రం చేస్తానని, ఏ పార్టీలో చేరేది ప్రకటిస్తానని అన్నారు. తనను రాజకీయాల్లోకి రానివ్వకూడదనే రూమర్స్ వ్యాప్తి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. చంద్రబాబుకు కనీసం సెన్స్ లేదని, అందుకే పట్టాభి లాంటి వ్యక్తిని పార్టీ అధికార ప్రతినిధిగా పెట్టుకున్నాడని మండిపడ్డాడు. పట్టాభి అన్నీ పనికిరాని మాటలు చెబుతున్నాడని, ఆయన తీరు చూస్తే మతి భ్రమించినట్టుగా భావిస్తున్నానని చికోటి చెప్పాడు. చికోటి ప్రవీణ్ సాక్షి టీవీకి ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ ఈ లింకులో చూడవచ్చు. చదవండి: హైదరాబాద్‌లో ఉగ్రవాద కార్యకలాపాలపై దర్యాప్తు ముమ్మరం..మరో ఇద్దరు అరెస్టు -
థాయిలాండ్ గ్యాంబ్లింగ్ కేసులో సంచలన విషయాలు
-
చికోటి చీకటి దందా.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు
సాక్షి, హైదరాబాద్: చికోటి ప్రవీణ్ చీకటి దందా బయటపడింది. గ్యాంబ్లింగ్‌పై నిషేధం ఉన్న థాయ్‌లాండ్‌లో.. ఓ హోటల్లో రహస్యంగా క్యాసినో నిర్వహిస్తూ పట్టుబడ్డాడు చికోటి. ఈ క్రమంలో ఈ కేసు విచారణను థాయ్ పోలీసులు వేగవంతం చేయగా.. దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. థాయ్‌లాండ్ చోనుబురి జిల్లా బాంగ్ లమంగ్‌లోని ఆసియా పట్టాయా హోటల్ హోటల్ వద్ద పెద్ద ఎత్తున్న గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారని గోవా నుంచి ఓ వ్యక్తి, థాయ్ పోలీసులకు సమాచారం అందించారు. ఆ సమాచారం ఆధారంగా రైడ్ నిర్వహించారు అక్కడి పోలీసులు. పోలీసులను చూడగానే అక్కడున్నవాళ్లంతా పరుగులు అందుకున్నారు. అయితే సకాలంలో స్పందించిన పోలీసులు వాళ్లను తప్పించుకోనివ్వలేదు. మొత్తం 93 మందితో కూడిన ముఠాను థాయ్‌లాండ్ పోలీసులు అరెస్ట్ చేశారు. చివరికి.. ఆ ముఠాకు బాస్ చికోటి ప్రవీణ్‌గా తేలింది. ప్రభుత్వ ఉద్యోగులు కూడా! మొత్తం 93 మందిలో 80 మంది భారతీయులే ఉన్నారు. వాళ్లను స్వయంగా వెంటపెట్టుకుని మరీ థాయ్‌లాండ్‌కు తీసుకెళ్లిన చికోటి.. వాళ్లతో ఆటాడిస్తూ వస్తున్నాడు. చివరికి పక్కా సమాచారంతో ఈ రాకెట్‌ను చేధించారు థాయ్ పోలీసులు. అయితే.. అరెస్ట్ అయిన వాళ్లలో హైదరాబాద్‌కు చెందిన పలువురు వ్యాపారవేత్తలు, రాజకీయ నేతలు, పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తోంది. మెదక్ డీసీసీబీ చైర్మన్.. బీఆర్ఎస్ నేత చిట్టి దేవేందర్‌రెడ్డితో పాటు ఇసుక వ్యాపారి సాగర్, మరికొందరు వ్యాపార ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. వీళ్లేకాకుండా గాజులరామారం వీఆర్ఏ వాసు సైతం అరెస్ట్ అయిన వాళ్లలో ఉన్నాడు. గత నెల 27వ తేదీ నుంచి థాయ్‌లాండ్ వెళ్లి క్యాసినో ఆడుతున్నాడు వాసు. అయితే.. అనుమతి లేకుండా థాయ్‌లాండ్ వెళ్లిన వాసును తాజాగా సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు కలెక్టర్. వాసుతో పాటు వెళ్లిన వర్మ, యాన్సాగర్ అనే ఇద్దరు కూడా అరెస్ట్ అయ్యారు. క్యాసినోకు ఫైనాన్స్ చేసిన వినోద్‌రెడ్డితోపాటు చికోటి ప్రధాన అనుచరుడు మాధవరెడ్డి, తిరుమలరావు, బిల్డర్ మధు అరెస్ట్ అయ్యారు. ప్రముఖ ట్రావెల్స్ ఓనర్‌ను కూడా థాయ్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ పేరు బయటకు రావాల్సి ఉంది. ఆమె సహకారం.. భారీగా వసూళ్లు అక్రమంగా క్యాసినో నిర్వహణ కోసం ఫేమస్ పట్టాయా హోటల్‌ను ఎంచుకున్నాడు చికోటి. ఈ వ్యవహారంలో సితార్నన్ కెల్వెల్కర్ అనే మహిళ చికోటికి కుడి భుజంగా వ్యవహరించిందని పోలీసులు నిర్ధారించారు. ఫకిన్ అనే థాయ్ వ్యక్తిని నియమించుకుని మరీ గ్యాంబ్లింగ్ వ్యవహారం ఆమె నడిపించిదట. ఇక గ్యాంబ్లింగ్ నిర్వహణ కోసం ఇల్లీగల్ మైగ్రేంట్ వర్కర్స్‌ను సైతం చికోటి ఉపయోగించినట్లు తెలిసింది. పట్టాయాలో గ్యాంబ్లింగ్ వ్యవహారంపై దాడి నిర్వహించిన థాయ్ పోలీసులు.. అక్కడి సెటప్ చూసి ఆశ్చర్యపోయారు. సుమారు రూ.20 కోట్లు విలువ చేసే ఇండియన్ కరెన్సీతో పాటు కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్‌ను సైతం స్వాధీనం చేసుకున్నారు. ఇక ఆట ఆడేందుకు ఒక్కో భారతీయుడి నుంచి అక్కడ కరెన్సీ ప్రకారం 50 వేల బాట్స్(మన కరెన్సీలో లక్షా ఇరవై వేల రూపాయల దాకా..) చికోటి వసూలు చేసినట్లు తెలుస్తోంది. సదరు హోటల్లో కన్వెన్షన్ హాల్‌ను క్యాసినోగా మార్చేసిన చికోటి.. నాలుగు బక్కరాట్, మూడు బ్లాక్‌జాక్ టేబుల్స్ ఏర్పాటు చేయించాడు. అక్కడి గేమింగ్‌ను సీసీ కెమెరాల ద్వారా హైదరాబాద్‌కు లైవ్ రికార్డింగ్ కనెక్ట్ చేశాడని థాయ్ పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్‌కు చెందిన చికోటి ఇప్పటికే ఈడీ నుంచి ఫెమా దర్యాప్తును ఎదుర్కొంటున్నాడు. భారత్‌తోపాటు నేపాల్లోనూ క్యాసినో నిర్వహణకుగానూ.. ఫెమా నిబంధనలు ఉల్లంఘించి ఆర్థిక లావాదేవీలు జరిపినట్లు ఈడీ అభియోగాలు నమోదు చేసింది. ఇదీ చదవండి: కేంద్రం తీరుపై హరీష్‌రావు ఆసక్తికర వ్యాఖ్యలు -
థాయ్‌లాండ్‌లో చికోటి ప్రవీణ్ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్‌లో ఇండియన్ గ్యాంబ్లింగ్ ముఠా అరెస్ట్ అయ్యింది. పటాయలో 90 మంది భారతీయులను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వాళ్లలో చికోటి ప్రవీణ్ కూడా ఉన్నట్లు సమాచారం. చికోటి ప్రవీణ్ ఆధ్వర్యంలోనే ఈ దందా నడుస్తున్నటు తెలుస్తోంది. పటాయలో ఓ హోటల్లో భారీ ఎత్తున గ్యాంబ్లింగ్ జరుగుతుందన్న సమాచారం అందుకున్న థాయ్ పోలీసులు.. దాడులు నిర్వహించారు. థాయ్‌లాండ్ పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. అరెస్ట్ అయిన వాళ్లలో భారతీయులతో పాటు పలువురు విదేశీయులు, 14 మంది మహిళలు కూడా ఉన్నట్లు సమాచారం. నిందితుల నుంచి రూ.20 కోట్లు విలువ చేసే గేమింగ్ చిప్స్, భారతీయ నగదును థాయ్‌లాండ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. చికోటి ప్రవీణ్‌తో పాటు అరెస్ట్ అయిన వాళ్లలో మాధవరెడ్డి, దేవేందర్‌రెడ్డి కూడా ఉన్నారు. గేమ్స్ ఆడేందుకు పెద్ద ఎత్తున్న భారతీయులను చికోటి థాయ్‌లాండ్‌కు తరలించినట్లు తెలుస్తోంది. అక్కడ ఓ హోటల్లో థాయ్‌లాండ్ మహిళలతో కలిసి క్యాసినో ఏర్పాటు చేసినట్లు ప్రాథమిక సమాచారం. ఇదీ చదవండి: ఆఫ్టర్ 55 ఇయర్స్ వాళ్లంతా.. -
గాంబ్లింగ్ తప్ప మరోటి కాదు, క్రిప్టోపై ఆర్బీఐ గవర్నర్ వ్యాఖ్యలు
సాక్షి, ముంబై: క్రిప్టో కరెన్సీపై ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రైవేట్ క్రిప్టోకరెన్సీ ఆస్తులు పెరగడానికి అనుమతినిస్తే మరో ఆర్థిక సంక్షోభానికి దారి తీస్తుందని గతంలోనే హెచ్చరించిన ఆయన తాజాగా మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం( జనవరి 13న) భారత ఆర్థిక వ్యవస్థలు, క్రిప్టో కరెన్సీ, ఆస్తులపై మాట్లాడినా ఆయన క్రిప్టో కరెన్సీ ట్రేడింగ్ జూదం తప్ప మరోటి కాదని అలాంటి వాటి విస్తరణను నిషేధించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వాటి అనియంత్రిత వృద్ధికి అనుమతించినట్లయితే కేంద్ర బ్యాంకు అధికారాన్ని కూడా బలహీనం చేస్తుందన్నారు. క్రిప్టోకరెన్సీల పెరుగుదల వల్ల భారత ఆర్థికవ్యవస్థపై ఆర్బీఐ 'నియంత్రణ' కోల్పోయే అవకాశం ఉన్నందున భారతదేశంలో క్రిప్టోకరెన్సీలను నిషేధించాలన్నారు ఆర్బీఐ గవర్నర్. మారుతున్న టెక్నాలజీలకు అనుగుణంగా విధానాలు మార్చుకుంటూ బ్లాక్ చెయిన్ టెక్నాలజీకి క్రిప్టో అప్లికేషన్ల కారణంగా మద్దతు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. క్రిప్టో కరెన్సీకి విలువ లేదని కొంతమంది క్రిప్టోను ఆస్తిగా పిలుస్తారని, అలాంటప్పుడు ఆస్థికి అంతర్లీన విలువ ఉండాలని, కానీ క్రిప్టోకు అంతర్లీన విలువ లేదని శక్తికాంత్ దాస్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీలను అనుమతించడమంటే 'సెంట్రల్ బ్యాంక్' అధికారాన్ని అణగదొక్కడమేనని దాస్ తెలిపారు. దీని మూలంగా ఆర్థికవ్యవస్థ కుదేలయ్యే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. దేశంలో క్రిప్టో కరెన్సీని చట్టబద్ధం చేయడం వల్ల భారత ఆర్థిక వ్యవస్థ 'డాలరైజేషన్'కు దారితీయవచ్చని అన్నారు. ఆర్బిఐ నియంత్రణలో ఉన్న డిజిటల్ కరెన్సీ డిజిటల్ రూపాయిపై వ్యాఖ్యానిస్తూ, డిజిటల్ కరెన్సీకి లాభదాయకమైన వాతావరణాన్ని సృష్టించేందుకు బ్యాంకుల ఐటీ వ్యవస్థలు పటిష్టంగా ఉండాలని, డేటా గోప్యతపై దృష్టి పెట్టాలని దాస్ సూచించారు క్రిప్టో లాంటి ప్రైవేట్ డిజిటల్ కరెన్సీకి పోటీగా ఆర్భీఐ "డిజిటల్ రూపాయి"ని రిలీజ్ చేసిందని శక్తికాంత దాస్ చెప్పారు. పైలెట్ ప్రాజెక్టుగా ఉన్న డిజిటల్ రూపాయి, తొలుత హోల్ సెల్ వ్యాపారులకు అనంతరం రిటైల్ వ్యాపారులకు అందుబాటులోకి వస్తుందని గవర్నర్ గుర్తు చేశారు. -
హైవేపై కరెన్సీ నోట్ల వర్షం.. ఎగబడిన జనం!
సాంటియాగో: రోడ్డుపై వెళ్తున్నప్పుడు డబ్బులు కనిపిస్తే ఎవరైనా వద్దనుకుంటారా? మరో ఆలోచన లేకుండా తీసుకుని అక్కడి నుంచి జారుకుంటారు. అలాంటిది కరెన్సీ నోట్ల వర్షం కురిస్తే.. ఎవరైనా ఊరుకుంటారా? ఎంత పని ఉన్నా.. వాటిని పట్టుకునేందుకే ఎగబడతారు. చిలీ దేశంలో కూడా అలాగే జరిగింది. హైవేపై నోట్ల వర్షం కురవటంతో జనం ఎగబడ్డారు. భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడినా పట్టించుకోలేదు. అయితే, ఈ కరెన్సీ నోట్లు వర్షం ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గ్యాంబ్లింగ్ హాల్లో రాబరి చేసి వెళ్తుండగా నోట్ల కట్టలు ఇలా రోడ్డుపై పడిపోయినట్లు తెలుస్తోంది. పుడహుయెల్లోని క్యాసినోపై శుక్రవారం రాత్రి 7.45 గంటల ప్రాంతంలో దుండగులు దాడికి పాల్పడి భారీగా నగదు దోచుకున్నారని పోలీసులు తెలిపారు. గ్యాంబ్లింగ్ హాల్లోని సిబ్బందిని, అక్కడున్న వారిని ఆయుధాలతో బెదిరించి పరారైనట్లు కోఆపరేటివా మీడియా పేర్కొంది. దుండగులు కారులో పరారవుతుండగా.. వారిని పోలీసులు వెంబడించారు. దీంతో వారు ఉత్తర తీర ప్రాంతానికి వెళ్లే హైవేపైకి వెళ్లారు. ఈ క్రమంలో పోలీసులను అడ్డుకోవడానికి దొంగలు కరెన్సీ నోట్లను హైవేపై వెదజల్లుతూ వెళ్లినట్లు మీడియా పేర్కొంది. కానీ, వారి ప్రయత్నాలు ఫలించలేదు. కారును అడ్డగించి వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. అరెస్ట్ చేసిన ఆరుగురిలో మొత్తం మంది విదేశీయులేనని పోలీసులు తెలిపారు. అందులో ఇద్దరు దేశంలో అక్రమంగా నివాసం ఉంటున్నారని చెప్పారు. అయితే, వారు ఏ దేశానికి చెందిన వారనే విషయాన్ని బయటకు తెలపలేదు. మరోవైపు.. గ్యాంబ్లింగ్ హాల్లో, హైవేపై ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని, నగదు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. A violent robbery at a store ended in a police car chase, money raining down on a highway and six suspects getting arrested in Santiago, Chile#chile #santiago #chase #anews pic.twitter.com/KeHtPTQugh — ANews (@anews) October 21, 2022 ఇదీ చదవండి: రాజకీయ పావులు కదుపుతున్న బోరిస్.. ఇప్పటికిప్పుడు ప్రధాని పదవి వద్దంటూ రిషి సునాక్‌కు ఆఫర్ -
ఆన్లైన్లో జూదమా?.. జర జాగ్రత్త..!
ఆన్లైన్ గ్యాంబ్లింగ్ కారణంగా ఇటీవల 3,800 మందికి పైగా డబ్బు పోగొట్టుకున్నారని, రికార్డు కాని కేసులు మరిన్ని ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. స్కిల్స్ ఆధారంగా నడిచే గేమ్స్ ద్వారా ఈ గ్యాబ్లింగ్ జరుగుతుంటుంది. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక జనాదరణ పొందిన వాటిలో ఆన్లైన్ జూదం ఒకటి. తాజా గణాంకాల ప్రకారం భారతదేశంలో 1.10 బిలియన్ల మంది అంటే జనాభాలో 79 శాతం మందికి మొబైల్ సదుపాయం ఉంటే వారిలో 42 శాతం మందికి ఇంటర్నెట్ సౌకర్యం ఉంది. వీరిలో 92.8 శాతం మంది ఆన్లైన్లో గేమ్స్ ఆడుతున్నారు. అవి, స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌టాప్, గేమింగ్ కన్సోల్, టాబ్లెట్లు, హ్యాండ్‌హెల్డ్ డివైస్, మీడియా స్ట్రీమింగ్ పరికరాలతో పాటు వర్చువల్ రియాలిటీ హెడ్సెట్ల ద్వారా జరుగుతుంటుంది. చట్టబద్ధమేనా!? పబ్లిక్ గ్యాంబ్లింగ్ యాక్ట్–1867 ఆధారంగా, భారతదేశంలో అన్నిరకాల జూదం చట్టవిరుద్ధం. అంటే మీకు ఇష్టమైన గేమ్ లేదా ప్లేయర్ (ఆన్లైన్, ఆఫ్‌లైన్ రెండూ)పై పందెం వేయడం చట్టవిరుద్ధం. చట్టబద్ధతను అర్థం చేసుకోవాలంటే.. బెట్టింగ్ జరిగే రెండు రకాల గేమ్‌ల గురించి మనం మరింత అర్థం చేసుకోవాలి. గేమ్ ఆఫ్ ఛాన్స్ ఇవి అదృష్ట ఆధారిత గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలో చట్టవిరుద్ధం. ఈ గేమ్‌ల కోసం పందెం వేయడానికి ముందస్తు జ్ఞానం లేదా అవగాహన అవసరం లేదు. నైపుణ్యం గల గేమ్స్ ఇవి ఎంపిక కంటే విశ్లేషణాత్మక నిర్ణయం తీసుకోవడం, తార్కిక ఆలోచన, సామర్థ్యం అవసరమయ్యే గేమ్‌లు. ఈ రకమైన గేమ్‌లు భారతదేశంలోని కొన్ని రాష్ట్రాల్లో చట్టబద్ధం. మిగతా ప్రాంతాల్లో ఇవి చట్టవిరుద్ధం అయినప్పటికీ మోసగాళ్లు ఆన్లైన్ వెబ్‌సైట్‌ను నిర్వహించేందుకు మోసపూరితమైన మార్గాన్ని ఎంచుకుంటారు. ఉదాహరణకు.. (ఎ) కరేబియన్ – కురాకై గేమింగ్ (బి) మెడిటరేనియన్ నుండి మాల్టా గేమింగ్ అథారిటీ (సి) యుకె గ్యాంబ్లింగ్ కమిషన్ నుంచి యునైటెడ్ కింగ్డమ్ నుండి లైసెన్స్‌లను పొందినవి. ఇవి ఆయా దేశాలకు మాత్రమే పరిమితం అయి ఉంటాయి. వీటి సమాచారం మనకు కనపడనంత చిన్నగా రాసి ఉంటుంది. సాధారణంగా ఫుటర్‌లో వీటిని లిస్ట్ చేసిన దేశాలలో మాత్రమే ప్లే చేయవచ్చని పేర్కొని ఉంటుంది. కానీ, అన్ని దేశాల్లోకి ఈ గేమ్స్ ద్వారా మోసగాళ్లు చొరబడటానికి ఆన్లైన్లో పొంచి ఉంటున్నారు. మన దేశంలో .. ప్రస్తుత ట్రెండ్లకు సరిపోయే విధంగా చట్టపరంగా సమగ్రమైన ఫ్రేమ్‌వర్క్ (గ్యాంబ్లింగ్ యాక్ట్)తో రావడానికి పౌరసంఘాలు, సాంకేతిక సంస్థలు, సైబర్ పోలీసులు, సైబర్ లాయర్ల నుండి మరిన్ని చర్చలు అవసరం. యాపిల్, గూగుల్‌లో గ్యాంబ్లింగ్ యాప్‌లు అనుమతించని జాబితాలో భారతదేశంలోని కొన్ని రాష్ట్రాలు మాత్రమే మినహాయించబడ్డాయి. ఈ యాప్‌లు వెబ్సైట్ల నుండి (APK,DMZఫైల్ల ద్వారా) మాత్రమే డౌన్లోడ్ అవుతాయి. యాప్ స్టోర్ లేదా ప్లే స్టోర్ నుండి కాదని గుర్తించాలి. గ్యాంబ్లింగ్ యాప్స్ నిర్వహణ దశ 01: ముందుగా, మీరు ఒక సూచన ద్వారా ఈ యాప్‌లో చేరుతారు. దశ 02: మిమ్మల్ని టెలిగ్రామ్ గ్రూప్‌లో యాడ్ చేస్తారు. యాప్ నిర్వాహకులు బ్రిటీష్ పేర్లతో ఉన్న మహిళలు, విదేశీ వ్యక్తుల ఫోటోలతో ఉంటాయి. ్ఖఓ ఫోన్ నంబర్లను ఉపయోగించి వాటిని ఆపరేట్ చేస్తారు. దశ 03: పందెంలో పాల్గొనబోతున్నందుకు మీరు మీ రోజువారీ లాభంలో 40 శాతం కమీషన్‌గా చెల్లించాలని కోరుతారు. దశ 04: కమీషన్‌ను బదిలీ చేయకుండా ఉండటానికి సబార్డినేట్ అనే కొత్తవ్యక్తిని పరిచయం చేస్తారు. దశ 05: మీరు యాప్‌లో చేరిన తేదీ నుండి 5 రోజుల తర్వాత ప్రతి రిఫరల్ వ్యక్తి రూ.3000 సంపాదించినట్టు చూపుతారు. దశ 06: ఒకే రోజున 3 రెఫరల్స్ ఉన్నట్లయితే, వారు చేరిన 5 రోజుల తర్వాత ఒకరికి రూ.3000 తోపాటు అదనంగా మరో రూ.5000 ఇస్తారు. ఇది ఒక ఎక్కువ మొత్తం కోసం వేసే ఎర అని గుర్తుపెట్టుకోవాలి. దశ 07: 7–10 రోజుల తర్వాత ఫస్ట్æ విత్‌డ్రావల్ చేయవచ్చు. అయితే, పెట్టుబడి పెట్టిన మొత్తం రూ.10,000 పందెం పూర్తయిన తర్వాతే తీసుకోవాలి.. దశ 08: ఒకసారి విత్‌డ్రాకు అర్హత పొందితే, 68 గంటల్లో నగదు మొత్తం మన బ్యాంక్ ఖాతాలో జమ చేయబడుతుంది. దశ 09: 20–30 రోజులకు ఒకసారి ఎక్కువ మొత్తం జమ అయ్యే రోజు ఉంటుంది, ఇక్కడ బ్యాలెన్స్ 10,000 ఖాతాలో అన్ని సమయాల్లో ఉండేలా మనం మరింత డబ్బు చేర్చాలి. దశ 10: సాధారణంగా రోజుకు రూ. 800. ఎక్కువ వాటాలు ఉన్న రోజున, అది రూ.1500 నుండి రూ.2000 దాటుతుంది. దశ 11: మోసగాళ్లు ఎక్కువ లాభాల కోసం పెట్టుబడి పెట్టడానికి ప్రజలను మానసికంగా సిద్ధం చేస్తారు. ఆపై వారు ఒక రోజులో సూపర్ హై షేర్ని సృష్టిస్తారు. దీంతో ప్రజలు తగినంత బ్యాలెన్స్ లేకపోవడం వల్ల నష్టాలను నివారించడానికి Sరు.50,000 కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాలి. దశ 12: ప్రజలు బ్యాలెన్స్‌లను కొనసాగించగలిగినప్పటికీ, వారు కొత్తగా పెట్టుబడి పెట్టిన మొత్తం పందెంలో పాల్గొననందున వారు ఉపసంహరించుకోవడానికి అనుమతి ఉండదు. దశ 13: చాలా మంది వ్యక్తులు డబ్బును పోగొట్టుకోవడం చూసినప్పుడు, నమ్మకాన్ని పొందడానికి, నష్టాలను తిరిగి పొందేందుకు ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టే నష్టపరిహార ప్రణాళికను అందిస్తారు. దశ 14: అందరూ నిద్రపోతున్న చోట అర్ధరాత్రి పందెం వేస్తే, అందరూ మేల్కొనే సమయానికి మన ఖాతాలో ఏమీ మిగిలి ఉండదు. చివరి వ్యక్తి మొత్తం డబ్బును పోగొట్టుకునే వరకు పందెం కొనసాగుతుంది. దశ 15: చెల్లింపు/రీఛార్జ్ ప్లాట్‌ఫారమ్‌ను క్లోజ్ చేస్తారు. విత్‌డ్రాæవిధానం రద్దయ్యి ఉంటుంది. టెలిగ్రామ్ గ్రూప్‌ను క్లోజ్ చేస్తారు. చదవండి:Parenting Tips: పంచతంత్రం.. పిల్లల్ని చక్కగా పెంచడం ఎలా? అంటే.. -
బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌పై కేంద్రం కన్నెర్ర
Online Betting Ads: మీడియా సంస్థలకు కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. మీడియా ఫ్లాట్ ఫామ్‌లలో బెట్టింగ్ తరహా యాడ్స్ ను ప్రసారం చేయడం నిలిపివేయాలని యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్ కాస్టింగ్ మినిస్టీ వార్నింగ్ ఇచ్చింది. మనదేశంలో బెట్టింగ్, గ్యాబ్లింగ్‌లు చట్టరిత్యా నేరం. అయితే వాటిని ప్రోత్సహించడం వల్ల యువత తప్పుదారి పట్టడమే కాకుండా, సామాజిక ఆర్థిక ప్రమాదాలు తలెత్తే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని కేంద్ర ఐ అండ్ మినిస్ట్రీ అడ్వైజరీ తెలిపింది. అందుకే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అండ్ ఆన్లైన్ మీడియా సంస్థలు సంబధిత యాడ్స్‌ను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది. అంతేకాదు థర్డ్ పార్టీ ఆన్లైన్ అడ్వటైజ్మెంట్ సంస్థలు, పబ్లిషర్లు బెట్టింగ్, గ్యాబ్లింగ్ యాడ్స్‌తో ఇండియన్ యూజర్లను టార్గెట్ చేయడం నిలిపివేయాలని విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలిపింది. 2025 నాటికి మార్కెట్ ఎంతంటే! ప్రముఖ కన్సల్టెన్సీ సంస్థ డెలాయిట్,ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఫ్యాంటసీ స్పోర్ట్స్ (ఎఫ్ఐఎఫ్ఎస్) ప్రకారం..38శాతం వార్షిక వృద్ధితో 2025నాటికి ఈ ఫ్యాంటసీ స్పోర్ట్స్ మార్కెట్ విలువ రూ.1.5లక్షల కోట్లుగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. కేంద్రం తాజా నిర్ణయం త్వరలో పూర్తి స్థాయిలో అమలు కానుంది. దీంతో 4.5 బిలియన్ డాలర్ల మార్కెట్‌ను శాసిస్తున్న ఆన్లైన్ బెట్టింగ్‌ను ప్రమోట్ చేసే ఫ్యాంటసీ స్పోర్ట్స్ కంపెనీలకు భారీ నష్టం చేకూరనున్నట్లు మార్కెట్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
జీవితమే ఒక జూదం
ప్రపంచంలో అతికొద్దిమంది అదృష్టవంతులకు తప్ప జీవితం నల్లేరుపై బండినడక కాదు. అలాగని అదృష్టం అందరికీ దక్కేది కాదు. అందుకే అదృష్టం కోసం మనుషులు అర్రులు చాస్తారు. స్వయంకృషి ఉంటే, అదృష్టం దానంతట అదే తరుముకుంటూ మరీ వస్తుందని ఎందరు మహానుభావులు ఎన్ని సూక్తులు వల్లించినా జనాభాలో అత్యధికులు అదృష్టాన్నే నమ్ముకుంటారు. . అదృష్టాన్ని నమ్ముకోవడం సామాన్య మానవుల సహజసిద్ధమైన బలహీనత. ఈ బలహీనతను కనిపెట్టిన ప్రాజ్ఞులు అదృష్టయంత్రాలు, తాయెత్తులు తదితర వస్తుజాలాన్ని అమ్ముకుంటూ సొమ్ము చేసుకోవడం కద్దు. వాళ్లను మించిన నిపుణులు ద్యూతశాలలను నిర్వహిస్తుంటారు. అదృష్టంపై మనుషులకు నమ్మకం అనాది నుంచే ఉంది. నాణేలు వాడుకలోకి రాకముందు నుంచే బొమ్మా బొరుసు ఆట ఉండేది. నాణేలు లేనికాలంలో జనాలు తమ అదృష్టాన్ని తేల్చుకునేందుకు ఆల్చిప్పలతో బొమ్మా బొరుసు ఆడేవారు. చేతి ఎముకలతో తయారు చేసిన పాచికలతో రకరకాల ద్యూతక్రీడలు ఆడేవారు. జూదం ఎరుగని నాగరికతలేవీ ప్రపంచంలో లేవు. జూదంలో అన్నీ పోగొట్టుకుని అడవులపాలైన ధర్మరాజు ఉదంతం మహాభారతం ద్వారా మనందరికీ తెలుసు. అంతకుముందు నల మహారాజు కూడా జూదంలో ఓడిపోయి అడవుల పాలయ్యాడు. ‘కన్యాశుల్కం’లో గురజాడ ‘వేదాల్లో అన్నీ ఉన్నాయష’ అని కరటక శాస్త్రి ద్వారా అనిపించడంలో వ్యంగ్యం ధ్వనిస్తుంది గానీ, వేదాల్లో జూదం ప్రస్తావన ఉందనేది అక్షరసత్యం. ఋగ్వేదంలోని ‘ద్యూతసూక్తం’ ఇందుకు నిదర్శనం. అంతమాత్రాన జూదాన్ని నెత్తికెత్తుకోలేదు మనవాళ్లు. సప్తవ్యసనాల జాబితాలో చేర్చారు. ‘ద్యూతంహీనామ పురుషస్య అసింహాసనం రాజ్యం’ అంటూ జూదరిని సింహాసనం లేని రాజ్యంతో అభివర్ణించాడు ‘మృచ్ఛకటికం’ నాటకంలో శూద్రకుడు. జూదంలో మాయోపాయాలు మామూలే! ‘నీకునౌ నీకునౌ నంచు నెమకి నెమకి/ ముగుదలగు వారి భ్రమియించి మోసపుచ్చు/ పశ్యతోహరు డత్యంత పాపబుద్ధి/ పట్టణములో దగుల్పరి పందెగాడు’– ‘క్రీడాభిరామం’లోని ఈ వర్ణనను చూస్తే, జూదంలో పందెగాళ్ల మోసకారితనం ఈనాటిది కాదని అర్థమవుతుంది. ద్యూతక్రీడలో పాచికలు చాలా పురాతనకాలం నుంచి వాడుకలో ఉంటే, పేకముక్కలు ఆ తర్వాత వచ్చి చేరాయి. పేకాటకు మూలాలు చైనాలో ఉన్నాయి. టాంగ్ రాజుల హయాంలో కులీనులు కాలక్షేపం కోసం పేకాట ఆడేవారని తొమ్మిదో శతాబ్దినాటి చైనా సాహిత్యం ద్వారా తెలుస్తోంది. పద్నాలుగో శతాబ్ది నాటికి పేకాట యూరోప్‌కు పాకింది. పద్నాలుగో శతాబ్ది చివరినాటికి యూరోపియన్ రాచరిక చిహ్నాలను ప్రతిబింబించే పేకముక్కలను రూపొందించుకున్నారు. అప్పట్లో పేకదస్తాలో యాభయ్యారు ముక్కలు ఉండేవి. పదిహేనో శతాబ్ది చివరినాళ్లలో యాభైరెండు ముక్కల ‘ఫ్రెంచ్ సూటెడ్’ పేకముక్కలు రూపొందాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా వినియోగంలో ఉన్న ‘ప్రామాణిక’ పేకముక్కలు ఇవే! బ్రిటిష్‌కాలంలో పేకాట మనదేశం నలుచెరగులా వ్యాప్తిలోకి వచ్చింది. పేకాట ప్రస్తావన ఆనాటి సాహిత్యంలో విస్తృతంగా కనిపిస్తుంది. ‘చతుర్ముఖ పారాయణం’, ‘తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే’ వంటి జాతీయాలు పేకాట వ్యాప్తి తర్వాత వాడుకలోకి వచ్చినవే! తొలినాళ్లలో పెద్దమనుషుల కాలక్షేపంగా మొదలైన పేకాట, అనతికాలంలోనే సామాన్యులనూ సోకింది. ఓడిపోతున్న కొద్దీ రెట్టించిన పట్టుదలతో ఆడటం పేకాటరాయుళ్ల ప్రథమ లక్షణం. ‘నువ్వు సేఫనుకొని కొట్టిన ప్రతిముక్కా/ నవ్వుతూ ఎత్తుకుంటున్నాడు పక్కవాడు/ ఇక పెయిరయ్యే అవకాశం లేదు/ ఇప్పటికయినా మిడిల్‌డ్రాప్ పడెయ్యి’ అంటారు ‘మిడిల్‌డ్రాప్’ కవితలో వెల్చేరు నారాయణరావు. ఇలాంటి హితోక్తులు ద్యూతోద్రేకులను నిరుత్సాహపరచలేవు. ఉన్నదంతా ఊడ్చుకుపోతేగానీ వాళ్లకు తత్త్వం తలకెక్కదు. ఉత్కంఠభరితంగా సాగుతున్న ఆటలో కలిసొచ్చే ముక్కలు చేతిలో ఉన్నప్పుడు పేకాటరాయుళ్ల హుషారు మామూలుగా ఉండదు. సాక్షాత్తు వైకుంఠమే తమ అరచేతిలో ఇమిడిపోయిందనేంతగా పరవశులవుతారు. అలాంటి సందర్భాల్లోనే కొందరికి ఆశుకవిత్వం కూడా తన్నుకొస్తుంది. ‘కన్యాశుల్కం’లోని పేకాట సన్నివేశంలో ఆట రంజుగా సాగుతున్నప్పుడు పూజారి గవరయ్యకి ఇలాగే ఆశుకవిత్వం తన్నుకొచ్చి, ‘రాణా, డైమను రాణీ?/ రాణా యిస్పేటు రాణి, రాణా, కళావ/ర్రాణా ఆఠీన్రాణీ?/ రాణియనన్మధురవాణె, రాజుల రాణీ’ అంటూ పేకాట పరిభాషలోనే మధురవాణిని పొగుడుతూ పద్యం చెబుతాడు. చేతిలో పేకముక్కలుంటే చాలు, ప్రపంచంలో ఇంకేమీ అక్కర్లేదనంతగా ఉంటుంది పేకాటరాయుళ్ల తన్మయావస్థ. ‘చెలువకు ప్లేయింకార్డుకు/ గల భేదం బేమొ చెప్పగలవా సుదతీ?/ చెలికన్న కార్డునందే/ వలపధికంబని తలంపవచ్చు మదవతీ!’ అంటూ పేకాటరాయుడి అభిరుచి తీవ్రతను ‘కర్ణానందదాయిని’లో జి.బాలాజీదాసు వర్ణించారు. ప్రపంచంలోని మిగిలిన అంశాల మాదిరిగానే ద్యూతక్రీడలు కూడా కాలంతో పాటే పరిణామం చెందుతూ వస్తున్నాయి. ఆల్చిప్పలతో మొదలైన ద్యూతక్రీడలిప్పుడు ఆన్‌లైన్‌కు చేరుకున్నాయి. డబ్బు చేతులు మారే జూదాలనే జనాలు పట్టించుకుంటారు గానీ, నిజానికి ఈ మాయాప్రపంచంలో జీవితమే ఒక జూదం. బతుకు పోరులో గెలుపు కోసం ఎవరి పాచికలు వాళ్లు వేస్తూనే ఉంటారు. అదృష్టం ఎప్పుడైనా తమ తలుపు తట్టకపోదా అనే ఆశతో ఎదురుచూస్తూనే ఉంటారు. -
భారత్‌లో క్రిప్టోకరెన్సీ.. ఇక గ్యాంబ్లింగ్ తరహాలోనే!
క్రిప్టో ఆస్తుల చట్టబద్ధతపై బడ్జెట్లో ఎలాంటి ప్రకటన చేయని కేంద్ర ప్రభుత్వం.. లావాదేవీలపై 30 శాతం ట్యాక్స్ ప్రకటనతో క్రిప్టో హోల్డర్స్‌కు పెద్ద షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో.. ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి మరింత స్పష్టత ఇచ్చారు ఇవాళ. జూదంలో ఎలాగైతే గెలిచిన వాళ్ల దగ్గరి నుంచి పన్నులు వసూలు చేస్తారో.. అదే తరహాలో క్రిప్టో ట్రాన్జాక్షన్స్పై పన్నుల వసూలు ఉండబోతుందని ఆర్థిక కార్యదర్శి టీవీ సోమనాథన్ తెలిపారు. తద్వారా ప్రత్యేక చట్టంపై ఇప్పటికిప్పుడు తొందర పాటు నిర్ణయం తీసుకోకుండా.. క్రిప్టో ట్రాన్జాక్షన్స్ ద్వారా వచ్చే ఆదాయంపై మాత్రం పన్నులు విధించే నిర్ణయం అమలు చేయనుంది. ‘‘క్రిప్టో కరెన్సీని కొనడం, అమ్మడం చట్ట వ్యతిరేకం ఏం కాదు. ప్రస్తుతానికి ఇదొక సందిగ్ధావస్థ. గుర్రపు పందేలు గెలవడం, బెట్టింగులు, ఊహాజనిత ట్రాన్జాక్షన్స్.. నుంచి ఎలాగైతే ట్యాక్సుల పరిగణనలోకి తీసుకుంటామో.. అదే విధంగా క్రిప్టో ఆస్తుల కోసం ఒక ప్రత్యేకమైన ట్యాక్సేషన్ ఫ్రేమ్‌వర్క్‌ని వర్తింపజేస్తాం’’ అని సోమనాథన్ స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీ వల్ల మనీ ల్యాండరింగ్, టెర్రరిస్ట్ ఫైనాన్సింగ్, ధరల అస్థిరత నెలకొంటుందని ఆర్బీఐ మొదటి నుంచి హెచ్చరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్యాక్స్ మోత మోగించడం వల్ల పై కార్యకలాపాలకు అడ్డుకట్ట పడుతుందని కేంద్రం భావిస్తోంది. అంతేకాదు ఇప్పటికే క్రిప్టోకరెన్సీ నియంత్రణకు ప్రత్యేక చట్టం.. త్వరలో కేబినెట్ నుంచి క్లియరెన్స్ ద్వారా పార్లమెంట్లో చర్చకు రానుంది. ఈ తరుణంలో ప్రభుత్వం సంప్రదింపులు, అంతర్జాతీయ పరిణామాల తర్వాతే ముందకు వెళ్లాలని యోచిస్తోంది. -
పేకాటలో హైదరాబాద్‌ను శాసిస్తున్న అరవింద్!
హైదరాబాద్: క్యాసినో, పోకర్, పేకాట, తీన్‌పత్తా.. దీన్ని అడ్డంపెట్టుకుని బేగంపేటను అడ్డాగా చేసుకుని హైదరాబాద్‌ను శాసిస్తున్నాడు అరవింద్ అగర్వాల్ అనే వ్యక్తి. ప్రతి పండుగతో పాటు ముఖ్యమైన రోజుల్లో పేకాట నిర్వహిస్తూ కోట్ల రూపాయల్లో వ్యాపారం సాగిస్తున్నాడు. ఒకవేళ పేకాటలో ఎవరైనా పట్టుబడితే విడిపించే బాధ్యత తనదంటూ భరోసా ఇచ్చి జూదానికి ప్రేరేపిస్తాడు. ఈ క్రమంలోనే కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. ఇందులో భాగస్వామ్యులైన వీఐపీలను గోవా, సింగపూర్, శ్రీలంక తదితర దేశాలకు తీసుకెళతాడు. అక్కడ కూడా కోట్లు పెట్టి క్యాసినో ఆడిస్తున్న అరవింద్.. భారీ స్థాయిలో వెనకేసుకుంటున్నాడు. ఇటీవల బేగంపేటలో 150మందికి అరవింద్ ఆహ్వానం పంపగా, అందులో 85 మంది హాజరయ్యారు. ఈ క్రమంలోనే సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్.. పలువురిని అరెస్ట్ చేసింది. పేకాట, క్యాసినో నిర్వహించే ముందు అరవింద్ అగర్వాల్ ప్రముఖులకు ఇన్విటేషన్స్ పంపుతాడు. అదే సమయంలో లొకేషన్ కూడా షేర్ చేస్తాడు. ఇది చాలాకాలంగా స్వేచ్ఛగా సాగుతుండటంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పేకాట అడ్డాపై టాస్క్‌ఫోర్స్ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. అరవింద్ అగర్వాల్ ఫోన్లో రాజకీయ నాయకులు, ప్రజా ప్రతినిధులు, బడా వ్యాపారవేత్తలు లిస్టు ఉన్నట్లు తెలుస్తోంది. అరవింద్ అగర్వాల్‌తో పాటు నలుగురిని అరెస్టు చేశారు. కోట్ల రూపాయల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్లు స్థానికులు తెలపగా, ఐదుగురి మాత్రమే అరెస్ట్ చేయడాన్ని తప్పుబడుతున్నారు. దీని వెనక చాలా మంది ఉండగా ఐదుగురిని మాత్రమే ఎందుకు అరెస్ట్ చేశారని ప్రశ్నిస్తున్నారు. -
పేకాట కేసు: ముగిసిన సుమన్ కస్టడీ.. వెలుగులోకి కీలక విషయాలు
సాక్షి, హైదరాబాద్: మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చౌదరి పోలీస్ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు సుమన్‌ను విచారించిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా పోలీసుల విచారణంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుమన్‌పై క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.. చాలా కాలంగా సుమన్ క్యాసినో, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఏపీ, తెలంగాణలో సుమన్ చౌదరిపై పలు కేసులు నమోదైనట్లు, ఎంట్రీ ఫీజు, కమీషన్ల రూపంలో లక్షల రూపాల వసూళ్లు చేసినట్లు తేలింది. సుమన్‌కు రాజకీయ నేతలు, రియల్టర్స్‌తో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. క్రికెట్ బెట్టింగ్‌కు సైతం పలువురు నిందితులు పాల్పడినట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ కోణంలో సైతం పోలీసులు విచారించారు. మరోసారి కూడా సుమన్ చౌదరిని పోలీస్ కస్టడికి కోరే అవకాశం ఉంది. చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట కాగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. -
నాగశౌర్య తండ్రికి నోటీసులు ఇచ్చిన పోలీసులు
-
నాగశౌర్య ఫామ్‌హౌజ్ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
మణికొండ (హైదరాబాద్): నగర శివారులోని ప్రముఖుల ఫాంహౌజ్‌లను అద్దెకు తీసుకొని పేకాట దందా సాగిస్తున్న వ్యవహారాన్ని సైబరాబాద్ స్పెషల్ ఆపరేషన్ టీం (ఎస్ఓటీ) బట్టబయలు చేసింది. ప్రముఖులకు బర్త్‌డే పార్టీ పేరిట వాట్సాప్‌లో ఆహ్వానాలు పంపి క్యాసినోలు నడిపిస్తున్న ప్రధాన సూత్రదారితోపాటు 30మంది పేకాటరాయుళ్లను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. సూత్రధారి సుమన్ చౌదరి గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్ చౌదరి ఓ టీవీ చానల్లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. అతను గతంలో గుంటూరు జిల్లా పెదకాకాని పోలీస్‌స్టేషన్‌లో భూకబ్జాకు పాల్పడి పోలీసులకు చిక్కాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు. ఫాంహౌజ్‌ను లీజుకు తీసుకున్న రవీంద్రప్రసాద్‌కు నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేసి స్టేషన్‌కు రప్పించి విచారించారు. అంతా ప్రముఖులే... ఫాంహౌస్‌లో నిర్వహిస్తున్న పేకాట శిబిరంలో పోలీసులకు చిక్కిన వారిలో రాజకీయ, రియల్ఎస్టేట్ గ్రూపులకు చెందిన ప్రముఖులు ఉన్నారు. మహాబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శ్రీరాం భద్రయ్యతోపాటు వాసవి డెవలపర్స్ గ్రూప్‌నకు చెందిన రాజారామ్, మద్దుల ప్రకాశ్‌లతోపాటు మరీడు తనున్, గుమ్మడి రామస్వామి చౌదరి, ననదిగ ఉదయ్, సీహెచ్ శ్రీనివాసరావు, టి.శివరామకృష్ణ, బాడిగ సుబ్రమణ్యం, పండిటాగ సురేష్, నాగార్జున, కౌతాపు వెంకటేశ్, మిర్యాల భానుప్రకాశ్, పాతూరి తిరుమల, వీర్ల శ్రీకాంత్, ఎం.మల్లిఖార్జున్‌రెడ్డి, బొగ్గారాపూర్ నాగ, గట్ట వెంకటేశ్వర్రావు, ఎస్ఎస్ఎన్ రాజు, యు.గోపాల్‌రావు, బి.రమేశ్‌కుమార్, కాంపల్లి శ్రీనివాస్, ఇమ్రాన్ ఖాన్, టి.రోహిత్, బొల్లబోడ ఆదిత్య, సీహెచ్ గణేష్, తోట ఆనందకిషోర్, షేక్ ఖదీర్, బి.రాజేశ్వర్ ఉన్నారు. రెడ్‌కాయిన్‌కు రూ.5 వేలు ఫామ్‌హౌజ్‌లో ప్రముఖులతో మూడు ముక్కల ఆట ఆడించినట్టు పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. పేకాట శిబిరాల్లో డబ్బు బదులుగా కాయిన్స్‌ను సరఫరా చేస్తారు. రెడ్ కాయిన్‌కు ఐదు వేలు, గ్రీన్ కాయిన్‌కు రెండువేలు, బ్లూ కాయిన్‌కు వెయ్యి రూపాయల లెక్క కడుతున్నారు. పోలీసులకు చిక్కిన 30 మందికి రాజేంద్రనగర్ అడిషనల్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో పోలీసులు వారిని చర్లపల్లి జైలుకు తరలించారు. కొందరు ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోగా, వాటిని న్యాయమూర్తి తిరస్కరించారు. చంద్రబాబు, లోకేశ్‌లతో ఫొటోలు మంచిరేవుల ఫాంహౌజ్‌లో క్యాసినో నిర్వహిస్తున్న గుత్తా సుమన్ చౌదరి ప్రముఖులతో కలిసి దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌తోపాటు ఓ పత్రిక యజమానితో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి. చదవండి: సినీ హీరో నాగశౌర్య ఫామ్‌హౌస్‌లో పేకాటరాయుళ్ల పట్టివేత -
‘పచ్చ’పేకలో ఖాకీ: ఎస్పీ జోక్యంతో బట్టబయలు
తాడిపత్రి రూరల్(అనంతపురం జిల్లా): తాడిపత్రి పోలీసులు మరో వివాదానికి తెరలేపారు. టీడీపీ నేతలతో కలిసి ఓ కానిస్టేబుల్ సాగిస్తున్న గ్యాంబ్లింగ్ దందాను దాచి ఉంచే ప్రయత్నం చేశారు. అంతటితో ఆగకుండా ‘మీ ఇష్టం.. ఏమన్నా రాసుకోండి’ అంటూ విలేకరులపైనే ఖాకీ నైజాన్ని ప్రదర్శించారు. ఫ్రెండ్లీ పోలీస్ అనే పదానికి అర్థం మార్చేసేలా సాక్షాత్తూ డీఎస్పీ ఎదుటే ఓ సీఐ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారి తీశాయి. ఏం జరిగింది? ఈ నెల 20న తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డులో రైస్ మిల్లు వద్ద గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో పోలీసులు దాడులు నిర్వహించారు. ఆ సమయంలో పట్టుబడిన వారిలో మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి తనయుడు జేసీ పవన్‌కుమార్ రెడ్డి ప్రధాన అనుచరుడు శరత్‌కుమార్‌తో పాటు మరో పది మంది ఉన్నారు. వీరిలో తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడు కూడా ఉండటం విశేషం. అయితే తాడిపత్రి పోలీసులు ఈ విషయం బయటకు పొక్కకుండా తొక్కిపెట్టారు. నిందితులను అరెస్ట్ చేసిన రోజు పత్రికలకు విడుదల చేసిన ప్రెస్‌నోట్‌లోనూ 11 మంది నిందితులను అదుపులోకి తీసుకుని రూ.50 వేలు స్వా«దీనం చేసుకున్నట్లుగా పేర్కొన్నా...పేర్లు మాత్రం వెల్లడించలేదు. కానీ విషయం తెలుసుకున్న ఎస్పీ సత్యయేసుబాబు కానిస్టేబుల్ వెంకటేష్ నాయుడిపై చర్యలు తీసుకున్నారు. వీఆర్‌కు పంపుతూ ఉత్తర్వులిచ్చారు. మీ ఇష్టం ఏమన్నా అనుకోండి.. ఆదివారం తాడిపత్రి పోలీసులు తెలంగాణ మద్యం స్వాదీనం చేసుకోగా, డీఎస్పీ చైతన్య విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి నిందితుల వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా పేకాటలో దొరికిన కానిస్టేబుల్ అంశాన్ని విలేకరులు లేవనెత్తడంతో సీఐ ప్రసాదరావు జోక్యం చేసుకున్నారు. విషయాన్ని దాటవేసేందుకు విశ్వప్రయత్నం చేశారు. పట్టుబడిన వారిలో కానిస్టేబుల్ ఉన్నందునే పేర్లు బహిర్గతం చేయలేదా? అని విలేకరులు ప్రశ్నించగా... సీఐ సహనం కోల్పోయారు. అది ఒక చిన్న పెట్టీ కేసు అంటూ అసహనం వ్యక్తం చేశారు. దాని గురించి లోతుగా వెళ్లకండి. కాదంటే మీ ఇష్టం మీరు ఏమైనా అనుకోండని సమాధానమిచ్చారు. చదవండి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి అరెస్ట్ ఈ–పాస్ ఉంటేనే తెలంగాణలోకి అనుమతి -
జూదానికి డబ్బు ఇవ్వలేదని ఓ తండ్రి దారుణం..
పామిడి(అనంతపురం జిల్లా): జూదానికి డబ్బు ఇవ్వకపోవడంతో ఆగ్రహించిన కన్నతండ్రి.. సొంత కుమారుడిపైనే హత్యాయత్నం చేసిన ఘటన పామిడిలో చోటు చేసుకుంది. ఎస్ఐ వి.గంగాధర్ తెలిపిన మేరకు.. పామిడిలోని టీచర్స్ కాలనీకి చెందిన ఖాజామొయిద్దీన్, నూరి దంపతులకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కుమార్తెకు వివాహమైంది. పెద్దకుమారుడు జావేద్ వలి (24) ఆటో డ్రైవర్‌గానూ, రెండో కుమారుడు చాంద్‌బాషా టైలర్‌గానూ స్థిరపడ్డారు. జులాయిగా తిరిగే ఖాజామొయిద్దీన్ పేకాట, మట్కా వంటి జూదాలకు బానిసయ్యాడు. శనివారం సాయంత్రం పేకాట ఆడేందుకు తనకు రూ.లక్ష కావాలని భార్యతో పాటు కుమారుడు జావేద్‌తో ఘర్షణ పడ్డాడు. వారు ఇవ్వకపోవడంతో ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆదివారం తెల్లవారుజాము 1 గంట ప్రాంతంలో మిద్దెపై నిద్రపోతున్న జావేద్‌పై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. కుటుంబసభ్యులు, చుట్టుపక్కల వారు గమనించి మంటలు ఆర్పి, క్షతగాత్రుడిని వెంటనే అనంతపురం తరలించారు. 80శాతం కాలిన గాయాలతో సర్వజనాస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు చదవండి: ఒకే కుటుంబంలో ముగ్గురి దారుణ హత్య మాయా జలం: మంచి నీటి పేరిట మహా మోసం -
మెయిల్ ఓపెన్ చేస్తే జేమ్స్ అధీనంలోకి వెళ్లడమే!
సాక్షి, గచ్చిబౌలి: నైజీరియాలో సూత్రధారి..ముంబైలోని మీరా రోడ్, పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాకు చెందిన పాత్రధారులు కలిసి 2011 నుంచి దేశ వ్యాప్తంగా సిమ్ స్వాపింగ్ నేరాలకు పాల్పడుతున్నారు. దాదాపు అన్ని మెట్రో నగరాల్లోనూ పంజా విసిరిన ఈ ముఠాకు చెందిన ఐదుగురు నిందితుల్ని సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. తమ పరిధిలో నమోదైన రెండు నేరాల్లో ఈ గ్యాంగ్ రూ.11 లక్షలు స్వాహా చేసినట్లు పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. వీరి నుంచి 40 నకిలీ ఆధార్ కార్డులు, రబ్బరు స్టాంపులు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సజ్జనార్ పూర్తి వివరాలు వెల్లడించారు. ⇔ ముంబయ్‌లోని మీరా రోడ్‌కు చెందిన అశి్వన్ నారాయణ్ షరేగర్ అక్కడ ఓ డాన్సింగ్ బార్ అండ్ రెస్టారెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇతగాడికి అనేక మంది నైజీరియన్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీళ్ళల్లో నేరాలు చేసే వారికి సహకరించడానికి మీరా రోడ్ వాసులు పరిచయం చేస్తుండేవాడు. ⇔ ఒకప్పుడు ముంబైలో ఉండి, ఇప్పుడు నైజీరియాలో ఉంటున్న జేమ్స్‌ను మీరా రోడ్‌కు చెందిన చంద్రకాంత్ సిద్ధాంత్ కాంబ్లేతో పరిచయం చేశాడు. వీరిద్దరితో పాటు జమీర్ అహ్మద్ మునీర్ సయీద్, షోయబ్ షేక్, ఆదిల్ హసన్ అలీ సయీద్, జునైద్ అహ్మద్ షేక్‌లతో కలిసి ముఠా ఏర్పాటు చేశారు. ఇలానే పశి్చమ బెంగాల్లోనూ ఓ ముఠా పని చేస్తోంది. ⇔ జేమ్స్ అక్కడ ఉంటూనే దేశంలోని వివిధ నగరాలకు చెందిన సంస్థల ఈ-మెయిల్ ఐడీలను ఇంటర్నెట్ నుంచి సంగ్రహిస్తాడు. వాటిని ఐటీ రిటన్స్ పేరుతో ఫిషింగ్ మెయిల్స్ పంపుతాడు. వీటిని అందుకునే సంస్థలు తెరిచిన వెంటనే మాల్వేర్ వాళ్ళ కంప్యూటర్/ఫోన్లోకి ప్రవేశిస్తుంది. దీంతో అది పరోక్షంగా జేమ్స్ ఆదీనంలోకి వెళ్ళిపోతుంది. ⇔ ఆపై వాటిలో ఉన్న ఈ–మెయిల్స్ తదితరాల్లో వెతకడం ద్వారా వారి అధికారిక సెల్‌ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా నెంబర్, బ్యాంకు లావాదేవీలను తెలుసుకుంటారు. ఈ వివరాలను అతడు వాట్సాప్ ద్వారా చంద్రకాంత్‌కు పంపిస్తాడు. వీటి ఆధారంగా ఇతగాడు తనకు ఆయా సర్వీస్ ప్రొవైడర్ కార్యాలయాల్లో ఉన్న పరిచయాలను వినియోగించి ఆ బ్యాంకు ఖాతాలతో లింకై ఉన్న ఫోన్ ⇔ ఈ వివరాలను వినియోగించే చంద్రకాంత్ నకిలీ ఆధార్ వంటి గుర్తింపుకార్డులు తయారు చేస్తాడు. ఈ గుర్తింపు కార్డులపై పేర్లు అసలు యజమానివే ఉన్నప్పటికీ... ఫొటోలు మాత్రం జమీర్ లేదా ఆదిల్వి ఉంటాయి. వీటితో పాటు ఆయా సంస్థల పేరుతో నకిలీ లెటర్ హెడ్స్, స్టాంపులు, సీళ్ళు కూడా చంద్రకాంత్ రూపొందిస్తాడు. వీటిని ఒకప్పుడు జమీర్‌కు ఇచ్చి సరీ్వస్ ప్రొవైడర్లకు చెందిన స్టోర్స్‌కు పంపేవాడు. ⇔ గతంలో కోల్‌కతా ముఠాతో పాటు అతడు అరెస్టు కావడంతో ఇప్పుడు ఆ బాధ్యతల్ని జునైద్, ఆదిల్ నిర్వర్తిస్తున్నాడు. ముంబైలోని వివిధ ప్రాంతాల్లో ఉన్న స్టోర్స్‌కు తిరిగే వీళ్ళు ఎక్కడో ఒక చోట నుంచి సిమ్‌కార్డు తీసుకుంటారు. తమ చేతికి చిక్కిన సిమ్‌ను చంద్రకాంత్‌కు అప్పగిస్తారు. ఇతడు ఈ వివరాలను జేమ్స్ వాట్సాప్ ద్వారా చేరవేస్తాడు. మరోపక్క షోయబ్ షేకర్, అష్విన్లు బోగస్ పేర్లు, వివరాలతో భారీగా బ్యాంకు ఖాతాలు తెరుస్తారు. వీటి వివరాలనూ చంద్రకాంత్ ద్వారా జేమ్స్‌కు పంపిస్తారు. ⇔ తన వద్ద ఉన్న నకిలీ సిమ్‌కార్డుల్ని చంద్రకాంత్ తక్కువ రేటుతో కొనుగోలు చేసే ఫోన్లలో వేసుకుంటాడు. ఈ తతంగం మొత్తం అంతర్జాతీయ ముఠా కేవలం శని, ఆదివారాల్లో మాత్రమే చేస్తోంది. ఆ రోజుల్లో రాత్రి పూట జేమ్స్ ఆ ఫోన్ నెంబర్లతో లింకై ఉన్న బ్యాంకు ఖాతాల ఇంటర్నెట్ బ్యాకింగ్లోకి ప్రవేశిస్తాడు. అప్పటికే ఖాతా నెంబర్ తదితర వివరాలతో పాటు ఫోన్ నెంబర్ తన వద్ద... సిమ్ కార్డు చంద్రకాంత్ ఫోన్లో సిద్ధంగా ఉంటుంది. నెట్ బ్యాంకింగ్‌లో పాస్వర్డ్ మార్చి.. ⇔ నెట్ బ్యాంకింగ్ ఓపెన్ చేసి జేమ్స్ దాని పాస్వర్డ్ మార్చేస్తాడు. అందుకు అవసరమైన పిన్ను తన వద్ద ఉన్న ఫోన్ నెంబర్‌కు అందుకునే చంద్రకాంత్ తక్షణం వాట్సాప్ ద్వారా జేమ్స్‌కు చేరవేస్తాడు. ఇలా పాస్వర్డ్ మార్చే అతగాడు ఆ బ్యాంకు ఖాతాను యాక్సస్ చేస్తూ అందులో ఉన్న మొత్తాన్ని రెండుమూడు దఫాల్లో చంద్రకాంత్ అందించే నకిలీ ఖాతాల్లోకి జమ చేస్తాడు. తాము తెరిచిన నకిలీ ఖాతాల్లోకి వచ్చే ఈ మొత్తాలను అషి్వన్, షోయబ్ డ్రా చేసి చంద్రకాంత్‌కు ఇస్తారు. ⇔ వీళ్ళు, చంద్రకాంత్ 50 శాతం కమీషన్లు తీసుకుంటూ మిగిలిన మొత్తాన్ని హవాలా లేదా బిట్కాయిన్ల ద్వారా జేమ్స్‌కు పంపింస్తాడు. ఈ అంతర్జాతీయ గ్యాంగ్ గత ఏడాది జూన్, అక్టోబర్‌ల్లో సైబరాబాద్ పరిధిలో ఉండే రెండు కంపెనీలకు చెందిన ఖాతాలను టార్గెట్ చేశారు. వాటి నుంచి రూ.11 లక్షలు ఇమ్మీడియట్ మొబైల్ పేమెంట్ సరీ్వసెస్ (ఐఎంపీఎస్) ద్వారా నకిలీ బ్యాంకు ఖాతాల్లోకి మార్చి స్వాహా చేశారు. ⇔ దాదాపు ఆరు నెలల పాటు ఈ వ్యవహారాన్ని దర్యాప్తు చేసిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు పలుమార్లు ముంబై వెళ్ళివచ్చారు. ఎట్టకేలకు జేమ్స్, షోయబ్ మినహా మిగిలిన వారిని అరెస్టు చేశారు. -
బెట్టింగ్‌లపై పోలీస్ బెత్తం
సాక్షి, అమరావతి: సమాజంలో వ్యసనంగా మారిన ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లపై సర్కారు ఉక్కుపాదం మోపింది. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే వీటిని నిషేధించింది. ఇదే విషయమై కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్‌కు కొద్ది రోజుల క్రితం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆన్లైన్ గేమ్‌లు, గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లు నిర్వహించే 135 వెబ్సైట్లపై ఆన్లైన్ నిషేధం విధించేలా చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో వైఎస్ జగన్ కోరారు. సీఎం ఆదేశాలతో బెట్టింగ్‌లపై పోలీసులు బెత్తం ఝుళిపిస్తున్నారు. ఇటీవల కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి తదితర జిల్లాల్లో పోలీసులు పెద్ద ఎత్తున దాడులు చేసి క్రికెట్ బుకీలను అరెస్ట్ చేశారు. క్లబ్‌లు, కల్చరల్ క్లబ్‌లు, అతిథి గృహాల్లో పేకాట, కోతాట, గ్యాంబ్లింగ్ వంటివి నిర్వహించకుండా నోటీసులు ఇవ్వడంతో అవి మూతపడ్డాయి. పోలీసులు హెచ్చరించినా వినకుండా వాటిని నిర్వహిస్తున్న వారిని అరెస్టు చేసి కేసులు పెడుతున్నారు. ఫలితంగా గత ఐదేళ్ల కంటే ఈ ఏడాది రికార్డు స్థాయిలో అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. -
లాడ్జి అండర్‌గ్రౌండ్‌లో పేకాట శిబిరంపై దాడి
గుంటూరు ఈస్ట్ : అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్‌పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్‌రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్‌రోడ్డులోని డీలక్స్ లాడ్జిలో అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్డౌన్ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది. స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్‌కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్లో బాత్రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్‌గ్రౌండ్‌లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. -
పోలీసులకు దొరికిపోయిన కిక్ శ్యామ్
-
నటుడు కిక్ శ్యామ్ అరెస్ట్, కారణం?
చెన్నై: తెలుగులో కిక్, రేసుగుర్రం, కత్తి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న తమిళ నటుడు శ్యామ్. ఇతనిని కోడంబాక్కం పోలీసులు సోమవారం రాత్రి అరెస్ట్ చేశారు. అనుమతి లేకుండా జూదం, బెట్టింగులు నిర్వహిస్తున్నాడంటూ శ్యామ్ తో పాటు 14 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిక్ శ్యామ్ గా ఫేమస్ అయిన ఈ నటుడికి చెన్నైలోని కోడంబాక్కం ప్రాంతంలో ఓ పోకర్ క్లబ్ ఉంది. అనుమతి లేకుండా ఇక్కడ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు దాడులు చేశారు. దీంతో పోలీసులు ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించి పూర్తి వివరాలు సేకరించే పనిలో పడ్డారు. నుంగంబాక్కంలో నివసిస్తున్న శ్యామ్ లాక్ డౌన్ నేపథ్యంలో తన నివాసంలోనే గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. చదవండి: ఉత్కంఠ రేపుతున్న వర్మ ‘మర్డర్’ ట్రైలర్ -
గుట్టుచప్పుడు కాకుండా తప్పించారు
అనంతపురం క్రైం: జిల్లా కేంద్రంలోని వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో కొందరు పోలీసులు అక్రమార్కులకు అండగా నిలిస్తున్నారు. తప్పు సొంతవారు చేస్తే వదిలేయడం..సామాన్యులు చేస్తే రూల్స్ మాట్లాడడం పరిపాటిగా మారింది. ఇటీవల వన్‌టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో పేకాట నిర్వహిస్తూ పట్టుబడిన ఓ కానిస్టేబుల్‌కు వన్‌టౌన్ పోలీసులు అండగా నిలిచారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎస్పీ సత్యయేసు బాబు దీనిపై విచారణ చేపడితే అసలు బాగోతం వెలుగు చూస్తుందని పోలీసు వర్గాలు అంటున్నాయి. (పోలీస్ స్టేషన్లోనే మద్యం తాగిన కానిస్టేబుళ్లు) ఇదీ సంగతి: గత నెలలో వన్‌టౌన్ పరిధిలోని లెనిన్‌నగర్‌లో పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం వచ్చింది. ఓ ఎస్ఐ నేతృత్వంలో పేకాట నిర్వహిస్తున్న ఇంటిని పోలీసులు తనిఖీ చేశారు. అందులో ఆరుగురు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. పేకాట నిర్వహిస్తున్న వ్యక్తి ఓ కానిస్టేబుల్ అని తెలిసింది. దీంతో పోలీసులు అవాక్కయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా కానిస్టేబుల్‌ను తప్పించేశారు. కేవలం ఆరుగురిని అదుపులోకి తీసుకుని రూ.55 వేలు స్వాధీనం చేసుకున్నారు. ఓ ఎస్ఐ అండదండలతోనే కానిస్టేబుల్‌ను తప్పించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో భారీగానే చేతులు మారాయన్న ఆరోపణలు ఉన్నాయి. -
జూదం: గాడిదను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
-
జూదం: గాడిదను అరెస్ట్ చేసిన పాక్ పోలీసులు
కరాచీ: జూదం రేసులో పాల్గొందంటూ పాకిస్తాన్ పోలీసులు ఓ గాడిదను అరెస్ట్ చేశారు. ఈ వింత ఘటన పంజాబ్ ప్రావిన్స్‌లోని యార్ ఖాన్ నగరంలో చోటు చేసుకుంది. జూదం ఆడుతున్నారన్న పక్కా సమాచారంతో యార్ ఖాన్‌కు చేరుకున్న పోలీసులు 8 మందిని అరెస్టు చేశారు. ఇక నిందితుల దగ్గర నుంచి లక్షా 20 వేల రూపాయల బెట్టింగ్ సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. సంఘటనా స్థలంలో ఓ గాడిద కూడా ఉండటంతో దాన్ని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ('నాకు 30 సెకన్లు పట్టింది.. మరి మీకు') ఎఫ్ఐఆర్లో గాడిద పేరు కూడా ఉండటంతోనే దాన్ని అరెస్టు చేశామని పోలీసులు వివరణ ఇచ్చారు. ప్రస్తుతం దాన్ని స్టేషను ఆవరణలో కట్టేసినట్లు పేర్కొన్నారు. నైలా ఇనాయత్ అనే జర్నలిస్టు ఈ ఘటన తాలూకు వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా ప్రస్తుతం వైరల్‌గా మారింది. గాడిదను అరెస్టు చేయడంపై నెటిజన్లు ఛలోక్తులు విసురుతున్నారు. (ఆ గాడిద నాదే.. కాదు నాదే!) -
పోలీసులు వస్తున్నారని భవనం పైనుంచి దూకి..
కేపీహెచ్‌బీ కాలనీ: జూదం నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. జూదం ఆడుతున్న వారిని పట్టుకునేందుకు పోలీసులు వస్తున్నారంటూ అరుపులు వినిపించడంతో గదిలో ఉన్న యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి దూకగా, మరికొందరు రెండవ అంతస్తు నుంచి దూకారు. ఇందులో ఓ యువకుడు రోడ్డుపైకి దూకడంతో తలకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి. కూకట్పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో మూసాపేట జనతానగర్‌లో నివాసం ఉండే మల్లేష్, లక్ష్మిలకు ఇద్దరు కొడుకులు, ఒక్క కుమార్తె. వీరిలో పెద్దకొడుకు ప్రవీణ్ అలియాస్ స్వామి(26) ఎంబీఏ వరకూ చదువుకుని ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. బుధవారం మధ్యాహ్నం ప్రవీణ్ స్థానికంగా ఉన్న మరికొందరు స్నేహితులతో కలసి ఓ యువజన నాయకుడి ఇంటి రెండవ అంతస్తులోని గదికి వెళ్లారు. అక్కడ కొందరు పత్తాలాడుతుండగా మరికొందరు వారితో ముచ్చటిస్తున్నారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఎస్వోటీ పోలీసులు వచ్చారన్న అరుపులు విన్న గదిలోని యువకులు చెల్లాచెదురుగా పరుగులు తీశారు. కొందరు మొదటి అంతస్తు నుంచి కిందకు దూకి పరుగులు పెట్టగా, రెండవ అంతస్తులోనే ఉన్న ప్రవీణ్‌కు ఏం చేయాలో అర్థంకాని పరిస్థితిలో అక్కడ్నుంచి కిందకు దూకాడు. దీంతో తలకు తీవ్రగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించగా..అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాంతారావు అనే మరో యువకుడు సైతం పక్క భవనంపైకి దూకడంతో అతని కాలుకు తీవ్రగాయాలైనట్లు తెలిసింది. అయితే, అతని ఆచూకీ కూడా తెలియడంలేదు. విషయం తెలుసుకున్న కూకట్పల్లి పోలీసులు ఆస్పత్రికి చేరుకుని ప్రవీణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే ఎస్వోటీ పోలీసులు రైడ్‌కు వెళ్లలేదని, అలాంటి సమాచారం తమకు లేదంటున్నారు కూకట్పల్లి పోలీసులు. పోలీసులు వస్తున్నారన్న పుకార్లతోనే యువకులు భయాందోళనకు గురై భవనంపై నుంచి దూకి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. స్థానికులు మాత్రం సివిల్ దుస్తుల్లో ఉన్న వ్యక్తులు ఆ భవనం వద్దకు వచ్చిన తరువాతే అలజడి నెలకొందంటున్నారు. మృతిచెందిన ప్రవీణ్ తమ్ముడు క్రాంతి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు కూకట్పల్లి పోలీసులు తెలిపారు. -
గ్యాంబ్లింగ్ ఉచ్చులో యువత..!
పలమనేరు పట్టణంలోని బజారువీధికి చెందిన ఇంటర్ చదివే యువకుడు కళాశాలలో ఫీజు కట్టాలని తండ్రి వద్ద రూ.పదివేలు తీసుకుని మొబైల్ గేమ్‌లో పోగొట్టుకున్నాడు. వారం రోజుల పాటు ఇల్లు వదిలి పారిపోయాడు. కన్నబిడ్డపై మమకారంతో తల్లిదండ్రులు కొడుకును వెతికి పట్టుకున్నారు. బైరెడ్డిపల్లి మండలానికి చెందిన మరో విదార్థి తండ్రి ఏటీఎం కార్డుతో రూ.6వేలు డ్రాచేసి మొబైల్ గ్యాంబ్లింగ్‌లో పోగొట్టుకుని ఇంట్లో దెబ్బలు తిన్నాడు.. ఇలా విద్యార్థులు, యువత బెట్టింగ్‌లకు పాల్పడి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. చిత్తూరు, పలమనేరు : మునుపటిలాగా పేక ముక్కలతో పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. ప్రస్తుత సాంకేతికత పుణ్యమా అని కేవలం ఓ స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలు.. ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు క్యాండీక్రష్ సాగా లాంటి గేమ్స్ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్ గేమ్‌లపై పడింది. ప్రస్తుతం జిల్లాలో ఎటుచూసినా యువత నోట ఎంజీ మాటే. ముఖ్యంగా ఈ జూదానికి బానిసైన వారిలో కళాశాలలకు వెళ్లే విద్యార్థులుండడం బాధాకరం. గత కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. కానీ నేడు మండల కేంద్రాలకూ ఇది వ్యాపించింది. పది రూపాయల నుంచి నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోంది. పలు రకాల గ్యాంబ్లింగ్‌లు.. గతంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగేది. ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇవి కాకుండా ప్రస్తుతం హల్చల్ చేస్తున్న కొత్త మొబైల్ గ్యాంబ్లింగ్ గేమ్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్ కాషినోస్, ప్లేకార్డ్ ఎక్స్‌ప్రెస్, రమ్మీ, రియల్ మనీ క్యాషినో, ఫాస్ట్ బెట్టింగ్, ఈజీ టు ఎర్న్, క్యాండీక్రష్ బెట్టింగ్.. ఇలా రకరకాల బెట్టింగ్‌లు ఉన్నాయి. ఇక ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకునే గ్యాంబ్లింగ్ యాప్‌లు వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్‌టైమ్, రాలెట్ రాయల్, బ్లాక్‌జాక్, స్లాట్ మిషీన్, లక్కీ డే, స్పిన్‌టు విన్, హార్స్ బెట్టింగ్, సూపర్ స్నేక్, జాక్‌పాట్ రాజా, టీన్‌పతి గోల్డ్, బింగో లాంటి గేమ్స్‌లో నిమిషాల్లో బెట్టింగ్ జరుగుతోంది. నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే.. మామూలుగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లే యూత్ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌లలో చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కనుక వీటిని ఎక్కువగా ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు ధారబోస్తున్నారు. వీరు ధరించిన బంగారు ఆభరణాలు, మొబైల్ఫోన్లు, బైక్‌లు సైతం బెట్టింగ్‌లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతో పాటు బంగారు భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు కనుక్కోలేరు.. జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె, పలమనేరులలో యూత్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్ ఆడుతున్నామనో, స్మార్ట్‌ఫోన్‌లో గేమ్స్ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కనుక పోలీసులు సైతం ఏం చేయలేకపోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన కుమారులను ఎలా దారినపెట్టాలో అర్థం గాని తల్లిదండ్రులెందరో ఉన్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. -
డబ్లింగ్ పనుల్లో గ్యాంబ్లింగ్
సాక్షి, ప్రకాశం : గుంటూరు–గుంతకల్లు రైల్వేలైన్ డబ్లింగ్ పనులు ప్రారంభమయ్యాయి. ఇటు కాంట్రాక్టర్లు, అటు అధికారులకు పంట పండింది. తూతూమంత్రంగా నాసిరకం పనులు చేసి అందిన కాడికి దండుకుంటున్నారు. ఇదేమని ప్రశ్నించే పర్యవేక్షకులు లేకపోవడంతో పనులు ఇష్టానుసారం సాగుతున్నాయి. కురిచేడు రైల్వేస్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం కోటి రూపాయల ఖర్చుతో 70 మీటర్ల మేర ప్లాట్‌ఫాం నిర్మించారు. నిర్మాణం జరిగి ఆరు నెలలు కూడా నిండకముందే అది కూలిపోయింది. ప్లాట్‌ఫాం కూలడంతో దానికి ఏర్పాటు చేసిన బెంచీలు, విద్యుత్ లైట్లు కూడా కూలిపోయాయి. ప్లాట్‌ఫాం నిర్మాణ దశలోనే కూలిపోయినా అధికారులు కాంట్రాక్టర్లకే వత్తాసు పలకడం గమనార్హం. దీన్నే అధికారులు మామూళ్ల మత్తులో జోగుతున్నారనేందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. 108–109 కిలోమీటర్ల మధ్య ఉన్న వాగుపై బ్రిడ్జి కింద బెడ్ కాంక్రీటు వేయకుండా కేవలం సిమెంటు పాలు పోసి మమ అనిపించారు. రైల్వే పనులు ఏ చిన్న పనైనా రూ.కోట్లల్లో ఉండటంతో కాంట్రాక్టర్లకు కల్పవృక్షంగా మారింది. దీంతో రైల్వే అధికారులకు అది వరంగా మారింది. పర్యవేక్షణ కనుమరుగు రైల్వే ఇంజినీరింగ్ ఉన్నతాధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిపై ఆధారపడి వారు ఇచ్చిన మామూళ్లు లెక్క లేసుకుంటూ ఏసీ గదులు దాటి బయటకు రావడం లేదు. క్వాలిటీ అధికారులు సైతం క్షేత్రస్థాయి అధికారులు కనుసన్నల్లో మెలగడం గమనార్హం. రైళ్ల మార్గాన వేలాది మంది ప్రయాణికులు నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. అంతేకాకుండా ఏదైనా ప్రమాదం సంభవించి ప్రయాణికుల ప్రాణాలకే ముప్పు వాటిళ్లడంతో పాటు రైల్వే శాఖ అధికారులు కూడా ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉంది. ఇవేమీ పట్టని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తమ జేబులు నిండితే సరి అనుకుంటూ పచ్చనోట్లు లెక్క లేసుకుంటున్నారేగానీ పనుల నాణ్యతను పరిశీలించిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కేంద్ర రైల్వేశాఖ నిజాయితీపరులైన అధికారులను నియమించి పనుల నాణ్యతను పరిశీలించి, నాణ్యత డొల్లగా ఉన్న పనులపై పర్యవేక్షణ చేస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. -
పోలీసుల అదుపులో టీడీపీ నగర కార్యదర్శి
సాక్షి, కర్నూలు : టీడీపీ నాయకుల తీరు మారడం లేదు. అక్రమ సంపాదనకు అడ్డదారులు తొక్కుతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే మట్కాడాన్ అసదుల్లా తనయుడు, టీడీపీ నగర కార్యదర్శి అబ్బాస్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను కర్నూలు బుధవార పేటలోని పాత ఇంటిపై మట్కా నిర్వహిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో ఎస్పీ క్రైం పార్టీ పోలీసులు బుధవారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఆ ఇంటిని చుట్టుముట్టారు. ఇంటి వెనుక వైపు నుంచి పై అంతస్తులోకి వెళ్లారు. అక్కడ ల్యాప్‌టాప్‌లు, సెల్ఫోన్ల సాయంతో ఆన్లైన్ ద్వారా మట్కా నిర్వహిస్తున్న అబ్బాస్‌తో పాటు మరో ఇద్దరు బీటర్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి కొంత నగదుతో పాటు మట్కా చీటీలు, సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని మూడో పట్టణ పోలీసుస్టేషన్‌కు తరలించారు. పోలీసుల దాడికి పది నిమిషాల ముందు మట్కాడాన్ అసదుల్లా ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. అబ్బాస్‌ను అదుపులోకి తీసుకున్న సమాచారం తెలుసుకుని అటు నుంచి అటే పరారయ్యాడు. అతని కోసం ప్రత్యేక పోలీసు బృందం గాలిస్తోంది. జైలు జీవితం గడిపినా.. అసదుల్లాపై కర్నూలు మూడో పట్టణ పోలీసు స్టేషన్లో 26 కేసులు ఉన్నాయి. ఆదోని, నందికొట్కూరు, ఆత్మకూరు, డోన్ ప్రాంతాల్లోని కేసులతో కలిపి 50 పైగానే నమోదయ్యాయి. మూడో పట్టణ పోలీసు స్టేషన్లో రౌడీషీట్ (షీట్ నెంబర్ 57) కూడా ఉంది. 2015లో బుధవార పేటలో జరిగిన హత్య కేసులో అసదుల్లాతో పాటు అతని కుమారుడు అబ్బాస్ కూడా నిందితుడు. మట్కా నిర్వహణలో ఇతనికి జిల్లాలో డాన్‌గా గుర్తింపు ఉంది. 100 మందికి పైగా బీటర్లను నియమించుకుని నిరంతరాయంగా మట్కాతో పాటు కుమారుల ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కూడా నిర్వహిస్తుంటారు. అబ్బాస్ తెలుగుదేశం పార్టీ నగర కార్యదర్శిగా ఉన్నాడు. ‘పెద్దల’ సభలో ఉన్న అప్పటి టీడీపీ నాయకుడికి ముఖ్య అనుచరుడిగా కొనసాగుతూ అక్రమ సంపాదన కోసం మట్కా, మొబైల్ పేకాట, బెట్టింగ్ కార్యకలాపాలను నిర్వహిస్తూ అనేక సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. గతేడాది డిసెంబర్ 13న ఎస్పీ స్పెషల్ పార్టీ పోలీసులు.. ఇంటిపై దాడిచేసి అసదుల్లాతో పాటు మరో 9 మందిని అరెస్టు చేశారు. సుమారు రూ.10 లక్షల నగదుతో పాటు 11.5 కేజీలు గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో అబ్బాస్‌ను కూడా అరెస్టు చేసేందుకు పోలీసులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ టీడీపీ ముఖ్య నాయకుడి రాయ‘బేరం’తో మట్కా కేసు నుంచి అప్పట్లో విముక్తి కల్పించారు. అయితే.. గత ఏడాది డిసెంబర్ 20న అసదుల్లాపై పీడీ యాక్ట్ నమోదు చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించారు. అతను అనారోగ్య కారణాలు సాకుగా చూపి మార్చి రెండో వారంలో బెయిల్‌పై బయటకు వచ్చాడు. సుమారు రెండున్నర నెలల పాటు జైలు జీవితం గడిపినప్పటికీ అతనిలో మార్పు రాకపోగా తిరిగి తన మట్కా సామ్రాజ్యాన్ని యథేచ్ఛగా నడిపిస్తున్నాడు. ఆన్లైన్ ద్వారా జూదం కర్నూలు నగరంలో మట్కా మూడు ఓపెన్లు.. ఆరు క్లోజ్‌లుగా విరాజిల్లుతోంది. చుట్టుపక్కల పల్లెల్లోనూ అసదుల్లా తన అనుచరులను బీటర్లుగా నియమించుకుని గుట్టు చప్పుడు కాకుండా వ్యవహారం నడిపిస్తున్నాడు. ఈ జూదంలో పేరుగాంచిన పాత బస్తీ బ్రదర్స్ ఒకవైపు, అసదుల్లా మరోవైపు నగరాన్ని విభజించుకుని మట్కా నిర్వహిస్తున్నారు. అనుకూలమైన పోలీసులతో చేతులు కలిపి నెల, వారాంతపు మామూళ్లు ముట్టజెప్పి జూదాన్ని నడిపిస్తున్నారు. చాంద్ టాకీస్ కాంప్లెక్స్ అడ్డాగా చేసుకుని పాత బస్తీ బ్రదర్స్ దుకాణాన్ని తెరిచారు. అసదుల్లా మాత్రం బుధవార పేటలోని తన ఇంటితో పాటు సమీప కాలనీలలో మరో రెండు ‘డెన్’లు ఏర్పాటు చేసుకున్నాడు. గతంలో చీటీల ద్వారా మట్కా రాసుకునే వారు. ఇప్పుడు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నారు. రోజుకు రూ.2 కోట్ల టర్నోవర్ కర్నూలుతో పాటు కోడుమూరు, గూడూరు, సి.బెలగళ్, ఆదోని, వెల్దుర్తి, నంద్యాల, కోవెలకుంట్ల, కిష్టిపాడు, దొర్నిపాడు ప్రాంతాల్లో ఆన్లైన్ ద్వారా జోరుగా మట్కా నడుస్తోంది. రోజుకు రూ.2 కోట్లు చేతులు మారుతున్నాయనడంలో ఎలాంటి సందేహమూ లేదు. దీనివల్ల అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. నిర్వాహకులు పదికి వంద, వందకు వెయ్యి, వెయ్యికి రూ.పదివేలు.. ఇలా ఆశ పెట్టి అమాయకులను దోచుకుంటున్నారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ ఉచ్చులో ఇరుక్కుపోయి.. నష్టపోకుండా ఉండేందుకు మట్కాపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ మేరకు రాష్ట్ర రాజధాని అమరావతిలో మంగళవారం ఎస్పీలతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కఠినంగా ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీస్ బాస్.. మట్కా నివారణపై ప్రత్యేక దృష్టి సారించారు. -
మొబైల్ గాంబ్లింగ్ మత్తులో యువత
పేకాట తదితర జూదాలకు ఇప్పుడు కాలం చెల్లింది. సాంకేతిక పుణ్యమా అని స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే ఎలాంటి జూదమైనా సాఫీగా ఆడుకోవచ్చు. ఇన్నాళ్లు క్యాండీక్రష్‌లాంటి గేమ్స్ ఆడుతున్న యువత మనసు ఇప్పుడు బెట్టింగ్ గేమ్‌లపై పడింది. జిల్లాలో ఎటుచూసినా యువతనోట ఎంజీ మాటే. ఈ జూదానికి బానిసైనవారిలో కళాశాలల విద్యార్థులుండడం బాధాకరం. కొన్నాళ్లుగా జిల్లాలోని ప్రధాన పట్టణాల్లో మాత్రమే ఇది జరిగేది. నేడు మండల కేంద్రాలకు ఇది వ్యాపించింది. రూ.10 నుంచి వేలల్లో సాగే ఈ బెట్టింగులతో నిత్యం లక్షలాది రూపాయలు చేతులు మారుతోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. చిత్తూరు :గతంలో క్రికెట్ బెట్టింగ్ జోరుగా సాగేది. ఇప్పుడు ట్రెండ్‌మారింది. ప్రస్తుతం హల్చల్ చేస్తున్న కొత్త మొబైల్ గ్యాంబ్లింగ్ గేమ్‌లు వందల సంఖ్యలో ఉన్నాయి. స్మార్ట్ కాíసినోస్, ప్లే కార్డ్ ఎక్స్‌ప్రెస్, రమ్మీ, రియల్ మనీ క్యాసినో, ఫాస్ట్ బెట్టింగ్, ఈజీటు ఎర్న్, క్యాండీక్రష్ బెట్టింగ్ ఇలా రకరకాల బెట్టింగ్‌లు ఉన్నాయి. ప్లేస్టోర్‌లో డౌన్లోడ్ చేసుకునే గ్యాంబ్లిగ్ యాప్స్ వందల్లో ఉన్నాయి. ఇందులో బిగ్‌టైమ్, రాలెట్ రాయల్, బ్లాక్ జాక్, స్లాట్ మిషీన్, లకీడే,స్పిన్‌టు విన్, హార్స్ బెట్టింగ్, సూపర్ స్నేక్, జాక్‌పాట్ రాజా, టీన్‌పతి గోల్డ్,బింగో లాంటి గేమ్స్‌లో నిమిషాల్లో బెట్టింగ్ జరుగుతోంది. నలుగురు కలిస్తే బెట్టింగ్‌లే మామూలుగా క్రికెట్ ఆడుకోవడానికి వెళ్లే యూత్ ఎక్కువగా వీటికి బానిసలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్‌ల కంటే చాలా సులభంగా నిమిషాల్లోనే ఫలితం ఉంటుంది కాబట్టి వీటిని ఎక్కువగా ఆడుతున్నారు. ముఖ్యంగా విద్యార్థులు కళాశాలలకు కూడా వెళ్లకుండా ఈ మత్తులోనే వేలకు వేలు పోగొట్టుకుంటున్నారు. బంగారు ఆభరణాలు, మొబైల్ఫోన్లు, బైక్‌లు సైతం బెట్టింగ్‌లలో పోగొట్టుకుంటున్నారు. బెట్టింగుల కారణంగా చదువులు కొండెక్కడంతోపాటు మంచి భవిష్యత్తును చేజేతులారా నాశనం చేసుకుంటున్నారు. రైళ్లలో, బస్సుల్లో కూడా రాత్రుళ్లు మేలుకుని కూడా ఈ గేమ్స్ ఆడుతున్నారు. పోలీసులు కనుక్కోలేరు జిల్లాలోని తిరుపతి, చిత్తూరు, మదనపల్లె,పలమనేరులో యూత్ బెట్టింగులు జోరుగా సాగుతున్నాయి. పోలీసులు ఈ ప్రాంతాలకు వెళ్లినా క్రికెట్ ఆడుతున్నామనో, స్మార్ట్ ఫోన్లో గేమ్స్ అనో చెబుతున్నారు. వీరి వద్ద జూదానికి సంబంధించిన ఎటువంటి ఆధారాలు ఉండవు కాబట్టి పోలీసులు సైతం ఏం చేయలేక పోతున్నారు. జూదానికి బానిసలుగా మారిన తమ పిల్లలను ఎలా దారినపెట్టాలో అర్థంగాక తల్లిదండ్రులు తలలు పట్టుకుంటున్నారు. ఏదేమైనా కొత్తగా వచ్చిన రకరకాల జూదాలతో పలు కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. -
వ్యాపారం కోసం తండ్రిని చంపాడు
న్యూఢిల్లీ : తండ్రి వ్యాపారాన్నిస్వాధీనం చేసుకోవాలనే దుర్భుద్దితో స్నేహితులతో జతకట్టి తండ్రిని హత్య చేయించాడు ఓ దుర్మార్గపు కొడుకు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీకి చెందిన అనిల్ ఖేరా ఓ కెమికల్ వ్యాపారవేత్త. అతని కొడుకు గౌరవ్ ఖేరా(37) వ్యాపారాలు మానేసి జూదానికి బానిసయ్యాడు. ఆటలో తన ఆస్తులన్నింటిని కోల్పోయాడు. జూదం వద్దని తండ్రి ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదు. గతంలో జూదం ఆడుతూ పోలీసులకి పట్టుపడగా అనిల్ బెయిల్‌పై విడిపించాడు. అయినప్పటికి జూదాన్ని వదలలేదు. బ్యాంకుల్లో అప్పు తెచ్చి మరీ జూదం ఆడాడు. దీంతో తండ్రి కొడుకుల మధ్య ఓ రోజు గొడవ అయింది. గౌరవ్‌ను అనిల్ అందరి ముందే తిట్టి, చేయి చేసుకున్నాడు. ఇది మనసులో పెట్టుకున్న గౌరవ్ ఎలాగైనా తండ్రిని చంపాలని పథకం పన్నారు. తండ్రిని చంపి వ్యాపారాన్ని, ఆస్తులను స్వాధీనం చేసుకుకోవాలనుకున్నాడు. హత్య కోసం అతని స్నేహితుడైన విశాల్ గార్గ్(23) సహాయం తీసుకున్నాడు. తండ్రిని హత్య చేయిస్తే తన వ్యాపారంలో 25శాతం వాటా ఇస్తానని విశాల్‌కి ఆశ చూపాడు. దీనికి విశాల్ ఒప్పుకొని సాదిక్ ఖాన్(23) తో హత్యకు పథకం పన్నాడు. ఇందుకు గాను ఖాన్‌కు గౌరవ్ ఐదు లక్షల రూపాయలు అప్పజెప్పారు. సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న దుండగులు..ఈ ఏడాది మే 21న అనిల్ ఖేరా ఓ మీటింగ్‌కు హాజరుకావడానికి వెళ్తుండగా తుపాకితో కాల్చి చంపారు. పోలీసుల కేసు నమోదు చేసుకొన్ని విచారణ చేపట్టగా అసలు విషయం తెలిసింది. కన్నకొడుకే తండ్రిని హత్య చేయించాడని దర్యాప్తులో తేలింది. దీంతో పోలీసులు గౌరవ్‌ని, హత్యలో పాల్గొన్న మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. -
13మంది పేకాట రాయుళ్ల అరెస్ట్
సాక్షి, కృష్ణా : కంచికచెర్ల మండలం మోగలూరు గ్రామంలో బుధవారం పేకాట శిబిరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక ఇంట్లో రోజు పేకాట నిర్వహిస్తున్నారనే పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు 13 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.44200 నగదు, 8 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. -
మా ఆటకు రండి
‘‘ఫలానా తోటలో ఆదివారం పేకాట శిబిరం నిర్వహిస్తున్నాం’’ మా ఆటకు రండి.. పందేలు కట్టండి.. నోట్ల కట్టలతో వెళ్లండి’’ అంటూ వినూత్నంగా పందెంరాయుళ్లకు నిర్వాహకుల నుంచి సందేశాలు వస్తున్నాయి. ఫోన్లలోనే ఆహ్వానాలు అందుతున్నాయి. ఇంకేముంది ఇదే మంచి తరుణమంటూ పేకాటప్రియులు నాలుగుముక్కలాటకు జై కొడుతూ శిబిరాల వైపు పరుగు తీస్తున్నారు. కష్టపడి సంపాదించిన సొమ్ముకాస్తా పేకాటలో పోగొట్టుకొని ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నారు. కోనేరుసెంటర్(మచిలీపట్నం): జిల్లా కేంద్రమైన మచిలీపట్నం పేకాటలకు అడ్డాగా మారింది. పట్టణంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో సైతం కాయ్ రాజా కాయ్ అంటూ పేకాటరాయుళ్ల పందెం కూతలు వినబడుతున్నాయి. రెండు నెలలుగా పట్టణంతో పాటు పలు గ్రామాల్లోని మారుమూల ప్రదేశాల్లో శిబిరాలు జోరుగా నిర్వహిస్తున్నారు. గతంలో ఎక్కడో ఒకచోట జరిగే జూద శిబిరాలు గ్రామ గ్రామాన పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. శిబిరాల జోరు బందరు మండలంలో పేకాట శిబిరాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అదృష్టాన్ని పరీక్షిం చుకునేందుకు అమాయకులు (పేకాటరాయుళ్లు) శిబిరాల వైపు పరుగులు పెడుతున్నారు. కాయ్ రాజా కాయ్ అంటూ లక్షల్లో పందాలు కడుతున్నారు. ఆట ముగిసేసరికి సొమ్మంతా నిర్వాహకుల జేబుల్లో పోసి ఉసూరుమంటూ వెనుదిరుగుతున్నారు. మండలంలో 34 పంచాయతీలు ఉండగా వీటి పరిధిలో 54 గ్రామాలు ఉన్నాయి. వీటిలో సగానికి పైగా గ్రామాల్లో పేకాటరాయుళ్ల పందెం కూతలతో మారుమోగుతున్నాయి. పెట్టుబడి లేకుండా లాభాలు పేకాటలో ఆటగాళ్లు బికారులు అవుతుండగా నిర్వాహకులకు కనకవర్షం కురుస్తోంది. పేకాట నిర్వాహకులుæ పెట్టుబడి లేకుండానే లక్షలు పోగేసుకుంటున్నారు. పెట్టుబడి లేని వ్యాపారం కావడంతో మచిలీపట్నానికి చెందిన అనేకమంది శిబిరాలు నిర్వహిస్తూ లక్షల్లో ఆర్జిస్తున్నారు. ఈజీ మనీకి అలవాటుపడిన నిర్వాహకులు పేకాటరాయుళ్ల ఫోన్ నంబర్లు తీసుకొని ‘మా ఆటకు రండీ అంటే మా ఆటకు రండీ’ అంటూ ఆహ్వానాలు పంపుతున్నారు. రోజుకు రెండు ఆటలు పెడుతూ అమాయకుల కష్టార్జితాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. గ్రామాలే అడ్డాగా... బందరు మండలంలోని మంగినపూడి, గోపువానిపాలెం, కరగ్రహారం, పోతేపల్లి, కోన తదితర గ్రామాల్లో కోతముక్క ఆట విచ్చలవిడిగా సాగుతుంది. పట్టణంలోని బైపాస్‌రోడ్డులో పేకాట జోరుగా సాగుతున్నట్లు తెలిసింది. మంగినపూడిలో గ్రామానికి చెందిన వ్యక్తి ప్రతి ఆదివారం ఆట పెడుతూ పేకాటరాయుళ్ల సొమ్ములు దిగమింగుతుండగా, మేకవానిపాలెంకు చెందిన మరో వ్యక్తి ఇటీవల వరకు శిబిరాలు నిర్వహించి రూరల్ పోలీసుల హెచ్చరికలతో స్వస్తి పలికాడు. కరగ్రహారానికి చెందిన ఇంకో వ్యక్తి కొన్ని రోజులుగా ఆట మొదలుపెట్టి ఆటగాళ్లను ఆహ్వానిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రసాదంలా మింగేస్తున్నాడు మచిలీపట్నం బైపాస్‌రోడ్డుకు చెందిన ఒక వ్యక్తి బైపాస్రోడు, సుల్తానగరం, గూడూరు, ఘంటసాల, కూచిపూడి తదితర ప్రాంతాల్లో పేకాట శిబిరాలు నిర్వహించి పెట్టి లక్షలకు లక్షలు వెనకేశాడనే ప్రచారం సాగుతుంది. అక్రమ సంపాదనతో పలు గ్రామాల్లో లక్షలు ఖరీదు చేసే భూములు కొనుగోలు కూడా చేసినట్లు పేకాట రాయుళ్లే చెప్పుకుంటున్నారు. శిబిరాలు మారుస్తూ పేదల సొమ్మును ప్రసాదంలా మింగేస్తున్న నిర్వాహకుడిపై సంబంధిత పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజాంపేటకు చెందిన మరో వ్యక్తి రెండు పూటలా శిబిరాలు నిర్వహిస్తున్నట్లు తెలి సింది. ఇక్కడి ఆటకు వెళ్ళిన వారంతా జేబులకు చిల్లులు పెట్టుకుని రావడమే తప్ప జేబులు నింపుకునే ప్రసక్తే లేదన్న వాదన వినబడుతుంది. చల్లపల్లికి చెందిన మరో వ్యక్తి చల్లపల్లి, ఘంటసాల, కూచిపూడి. మొవ్వ, కోసూరు, పద్దారాయుడుతోట, బందరు ప్రాంతాలకు చెందిన పేకాటరాయుళ్లను పిలిపించి కోన గ్రామ పరిసరాలు జూదాలు నిర్వహిస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. నిర్వాహకుల ఆదాయం రోజుకు రూ. 10,000ల నుంచి రూ. 20.000లపైబడి ఉంటుందంటే ఏమేరకు శిబిరాలు నిర్వహిస్తున్నారో అర్థమవుతోంది. నిద్రపోతున్న నిఘా బందరు మండలంతో పాటు పట్టణ నడిబొడ్డున పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నా సంబంధిత పోలీసులు పట్టించుకోకపోవడం సర్వత్రా విమర్శలకు దారి తీస్తుంది. పేకాటలతో వందలాది కుటుంబాలు వీధినపడుతున్నా జిల్లా యం త్రాంగం స్పందించకపోవడంతో నిఘా నిద్రపోతుందనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. కాగా కొంత మంది నిర్వాహకులు పోలీసులతో బేరం కుదుర్చుకున్నామంటూ పేకాటరాయుళ్ళను శిబిరాలకు పిలిపించుకోవడం పోలీసుల పనితీరుపై ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రౌడీషీట్లు తెరుస్తాం పేకాటలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. నిర్వాహకులపై పూర్తి నిఘా పెట్టాం. గతంలో ఆటలు పెట్టిన వారిని ఇప్పటికే బైండోవర్లు చేశాం. అవసరమైతే రౌడీషీట్లు తెరుస్తాం. ప్రజల శిబిరాల సమాచారాన్ని నేరుగా నా దృష్టికి తీసుకురండి. సంబందించి సమాచారం ఉంటే నేరుగా నా దృష్టికి తీసుకురావచ్చు. వివరాలు గోప్యంగా ఉంచుతాం. సమాచారం అందిన మరుక్షణం దాడులు చేయిస్తాం. శిబిరాలు నిర్వహించే ఏ ఒక్కరినీ ఉపేక్షించేదిలేదు. ఇతర సబ్–డివిజన్లో ఆటలు పెట్టే వారి వివరాలను అక్కడి డీఎస్పీలకు తెలియజేస్తాం.మహబూబ్‌బాషా, బందరు డీఎస్పీ -
ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే...
ఈ దేశంలో జూదాన్ని సాధికారికం చెయ్యడానికి లా కమిషన్ కావలసినన్ని సరదా అయిన సూచనలి చ్చింది. ఓ ఆంగ్ల దిన పత్రిక ఆ వ్యవహారాన్ని పతాక శీర్షికగా ప్రకటించింది. లా కమిషన్ అధ్యక్షులు– మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి బీఎస్ చౌహాన్, మిగతా సభ్యులు జూదాన్ని దేశంలో అందరికీ అందుబా టులో ఉండేలాగ పురాణాలు, న్యాయ శాస్త్రం, ఆర్థిక శాస్త్రం, నీతి శాస్త్రం, మౌలిక రచన అన్నిటినీ కలిపి– లకోటా కొట్టేసి–ఒక గొప్ప కషాయాన్ని సిద్ధం చేశారు. ఆ రోజుల్లో ఈ లా కమిషన్ ఉండి ఉంటే– కురుక్షేత్ర సంగ్రామానికి సరికొత్త ప్రయోజనం ఉండేది. ఈ విషయమై ఈ పత్రికే ఎడిటోరియల్ కూడా రాసింది. ధర్మరాజు అసలు తమ్ముళ్లను తాకట్టు పెట్టడమేమిటి? మహారాణిని జూదంలో ఫణంగా పెట్టడమేమిటి? దీనికి సమాధానం ఓ చదువుకున్న పాఠకుడు ఉత్తరం ద్వారా ఈ పత్రికలోనే తెలియజే శాడు. జూదానికీ డబ్బున్నవారి సరదాలకీ దగ్గర తోవ ఉన్నదని ఈ ఉత్తరం సారాంశం. చక్రవర్తులు కనుక– బాగా హోదా, ఐశ్వర్యం ఉన్నది కనుక– ఓ హద్దు దాటారు. మహారాణిని జూదంలో తాకట్టు పెట్టిన కారణంగానే వ్యాసుడు ‘మహాభారతాన్ని’ రచించి ఉంటాడు. ఆ స్థానంలో పనిచేసే గేట్ కీపర్ తన మర దలిని ఈ పని చేస్తే– ‘మహాభారతం’ మాట దేవు డెరుగు– దండనకి గురి అయ్యేవాడేమో? కనుక 2018లో ఈ కమిషన్ ఓ గొప్ప సూచన చేసింది. వారి సూచనల సారాంశం. మనకి మహారా ణుల్ని జూదంలో ఫణంగా పెట్టే సంప్రదాయం ఉన్న కథలున్నాయి. పురాణాలున్నాయి. కనుక జూదాన్ని చిన్నచూపు చూడటం మంచిది కాదు. ఏ ఎండకా గొడుగులాగ, ఏ స్థాయి వాడికి ఆ స్థాయిలో అందు బాటులో ఉన్న జూదాన్ని సాధికారికం చెయ్యాలి. ముఖ్యంగా జూదం ఆడే వ్యక్తి పాన్‌కార్డు, ఆధార్ కార్డు నంబర్లు గ్రహించండి. అది క్రికెట్ అయినా (ముఖ్యంగా క్రికెట్ కారణంగా నల్ల జేబుల్లోకి మాయమవుతున్న కోట్ల ఆదాయాన్ని ఖజానా మార్గం పట్టించాలని), గుర్రాలైనా, కోడి పందాలైనా, మరే జూదమైనా– వారి స్థాయికి తగ్గట్టు వారు ఆడు కోవచ్చును. ఒకప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు ‘లాట రీ’లు నడిపిన సందర్భాలు మరిచిపోకూడదు. కొన్ని నేరాల్ని బొత్తిగా రూపుమాప లేనప్పుడు– వాటిని అదుపులో ఉంచే ప్రత్యామ్నాయం ఆలోచించాలి. మనకి యుధిష్టిరులు, ద్రౌపదులు ఉండే రోజులు పోయాయి. విజయ్ మాల్యాలు, నీరవ్ మోదీలు నిల దొక్కుకునే రోజులు వచ్చాయి. సజావైన మార్గ నిర్దేశం జరిగినప్పుడు– అవి నీతి– మన చెప్పు చేతల్లో ఉండగల ‘నీతి’గా మారు తుంది. ఇంతకూ జూదానికి మనకి మార్గదర్శకం ఎవరు? ధర్మరాజు. మహాభారతం. మహాభారతం రకరకాల కారణాలకి గొప్పదని మన పండితులు చెప్పగా మనం విన్నాం. చదువుకు న్నాం. కానీ 2018లో మహా భారతంలో ‘జూదం’ చట్టానికి కొంగు బంగారం అవుతుందని మనం ఏనాడూ ఊహించలేదు. మహాభారత కథలపై ఎన్నో సినీమాలు వచ్చాయి, నవలలు వచ్చాయి, నాటకాలు వచ్చాయి– కానీ ఆనాటి ప్రభుత్వం ‘జూదా’న్ని చట్ట పరం చేయడం కారణంగా ఓ మహత్తరమైన రచనకు మూలకారణం అయిందని మనం ఏనాడూ ఆలోచిం చలేకపోయాం. నాదొక పిచ్చి ఆలోచన. శ్రీకృష్ణుడికి ఇలాంటి జూదం పిచ్చి లేదా? ఉంటే ఆయనకి 8 మంది భార్యలు. 8 రకాలైన మహాభారతాలు వచ్చేవి. లేదా తమ రాజ్యంలో జూదం చట్టబద్ధం కాదేమో? ఎంత సేపూ– సుఖంగా పెళ్లాలతో గడుపుతూ ఓడిపోయిన వారికి చీరెలు ఇచ్చే పనితో సరిపెట్టుకున్నారు. నేను లా కమిషన్ ధోరణిలో ఆలోచిస్తున్నానని తమరు గ్రహించాలి. మహాభారతానికి కథా నాయకత్వం వహించలేని శ్రీకృష్ణుడి కథని మనం హెచ్చరికగా గ్రహించాలి. తప్పించడానికి వీలులేని జూదానికి సరసమైన ఉదాహరణగా ‘మహాభారతాన్ని’ ఉదహరించగల లా కమిషన్ని, దాని అధ్యక్షులు చౌహాన్ గారిని నేను మనసారా అభినందిస్తున్నాను. అయితే మహా భారతానికి ‘జూదా’న్ని ప్రోత్సహించే ప్రయోజనం ఉన్నదని ఇన్ని వేల సంవత్సరాలు గుర్తించని పండి తులకు శిక్ష వెయ్యాలని నేను లా కమిషన్‌ను అర్థిస్తున్నాను. ముందు పండిత సభల్ని ఏర్పాటు చేసి– జూదం మీద శతకాలు రాయించండి. ప్రబం ధాలు పలికించండి. సాహిత్యానికి సాహిత్యమే విరుగుడు. శతాబ్దాలపాటు ఈ జాతిని ప్రభావితం చేసిన మహా భారతం ఇన్నాళ్లకి జూదానికి మార్గదర్శకం కావడం మన న్యాయమూర్తులు మనకి పెట్టిన భిక్ష. గొల్లపూడి మారుతీరావు -
ప్రభుత్వ జూదశాలలకు చట్టబద్ధతా?
దేశానికి మేలు చేసేలా న్యాయ సంస్కరణలను ప్రతిపాదించాల్సిన భారత న్యాయ కమిషన్ జూదాన్ని చట్టబద్ధం చెయ్యాలని సిఫార్సు చెయ్య డం హాస్యాస్పదం. పైగా అక్రమ జూదం అరికట్టడం సాధ్యం కాదు కనుక, చట్టబద్ధం చేసేస్తే ఖజానాకు లాభం అంటూ లెక్కలు వెయ్యడం పలాయన వాదం. ఇదే లాజిక్ అన్వయిస్తే ప్రభుత్వం నిషేధం అమలు చెయ్యలేని చీకటి వ్యాపారాల్ని.. మాదక ద్రవ్యాలు, దోపిడీ, దొంగతనంలాంటివన్నీ.. చట్ట బద్ధం చేయాల్సి వస్తుంది. ఖజానాకు కాసులు దొరుకుతాయి కానీ సామాజిక ఆరోగ్యం మాటేమిటో లా కమిషన్ సెలవివ్వాలి. కమిషన్, తన ప్రతిపాదనకి పురాణాల్ని కూడా ప్రాతిపదికగా చేసుకుంది. మహాభారత కాలంలో జూదం చట్టబద్ధమే అయ్యుంటే, ధర్మరాజు తమ్ముల్ని, భార్యనీ ఒడ్డి ఉండేవాడు కాదనీ, తద్వారా యుద్ధం జరిగేది కాదని చెప్పుకొచ్చారు. నిజమే మరి. వారి ఉద్దేశంలో చక్కగా కౌరవులు దేశాన్ని పాలించి, ఆదర్శంగా నిలిచే వారేమో. వ్యాసుడికి, మన కవిత్రయానికి, ఇంకా వందలాది రచయితలకు ముడిసరుకు కష్టమయ్యేది.జూదం, పేకాట లాంటివి సమాజానికి కీడు చేస్తాయి. వ్యసనంగా తయారై వ్యక్తిని అప్పుల పాలు చేసి, కుటుంబాల్ని ఆర్థిక అరాచకంలోకి నెట్టివేస్తాయి. క్రమశిక్షణ లేని జీవితాన్ని, అది పేద, ధనిక స్థాయీ భేదంతో సంబంధం లేకుండా అలవాటు చేసి దిగజారుస్తాయి. వాటిని అరికట్టడం లేకపోతే పోయె, కనీసం వాటికి ఆమోద ముద్ర వేసి సామాజిక గౌరవం కల్పిం చడం ఆత్మహత్యా సదృశం. కమిషన్‌లోనే ఒక సభ్యుడు వ్యతిరేకిస్తూ చెప్పినట్టు భారత్ ఈ తరహా సంస్కరణకు సిద్ధంగా లేదు. పేదలున్న దేశంలో మరింత మంది పేదల్ని సృష్టించే కార్యక్రమం అవుతుంది ఇది. ఒక్కమాటలో స్పష్టంగా చెప్పాలంటే.. ప్రభుత్వ జూదశాలలు, జాతీయ పేకాట పోటీలు ఈ దేశానికి అవసరం లేదు. – డా.డి.వి.జి.శంకరరావు,మాజీ ఎంపీ, పార్వతీపురం -
సంచలనం.. బెట్టింగ్‌లకు అనుమతించండి
క్రికెట్ వంటి జెంటిల్మెన్ గేమ్‌లో గ్యాంబ్లింగ్, బెట్టింగ్‌లను చట్టబద్ధం చేయాలంటూ లా కమిషన్(21వ) సంచలన సిఫార్సులు చేసింది. తద్వారా కేంద్ర ఖజానాకు పన్ను రూపంలో మరింత ఆదాయం వస్తుందని కమిషన్ పేర్కొంది. ఈ మేరకు తాజాగా చేసిన సిఫార్సుల్లో గ్యాంబ్లింగ్, క్రీడల్లో బెట్టింగ్ ను అనుమతించాలని పేర్కొంది. అయితే ఇందుకోసం ఓ నియంత్రణా వ్యవస్థ ఏర్పాటు చేయాలని, తద్వారా ఆదాయాన్ని పెంచుకోవచ్చని కమిషన్ పేర్కొంది. ఎలాగంటే... ప్రత్యక్ష, పరోక్ష పన్నుల విధానంలో పన్ను పరిధిలోకి వచ్చేలా ఈ బెట్టింగ్ లు ఉండాలి. దీనివల్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు సైతం దేశానికి ఇబ్బడి ముబ్బడిగా వస్తాయి. ఎవరైనా బెట్టింగ్ లేదా గ్యాంబ్లింగ్ లో పాల్గొనాలంటే, అతని లావాదేవీలకు ఆధార్ కార్డు, పాన్ కార్డుల అనుసంధానం తప్పనిసరి చేయాలి. డబ్బుతో కాకుండా బ్యాంకు లావాదేవీల ద్వారా ఇది జరగాలి’ అని కమిషన్ సిఫార్సుల్లో పేర్కొంది. వీటితోపాటు క్యాసినో, ఆన్ లైన్ గేమింగ్ పరిశ్రమలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను(ఎఫ్‌డీఐ) అనుమతించాలని కూడా లా కమిషన్ తన రిపోర్టులో సిఫార్సు చేసింది. 'లీగల్ ఫ్రేమ్ వర్క్ గ్యాంబ్లింగ్ అండ్ స్పోర్ట్ బెట్టింగ్ ఇన్ క్లూడింగ్ క్రికెట్ ఇన్ ఇండియా' పేరిట తయారు చేసిన నివేదికను కమిషన్.. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిందని సమాచారం. దీనిపై పార్లమెంట్ లో త్వరలో చర్చ జరగనుంది. అయితే ఈ సిఫార్సులు అమలులోకి రావాలంటే, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 252 కింద రాష్ట్రాలన్నీ ఈ నిర్ణయాన్ని ఆమోదించాల్సి వుంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు. -
వీడియో గేమ్స్... కొకైన్, జూదం లాంటివే!
పారిస్: కొకైన్, జూదం తరహాలో ప్రజలు వీడియో గేమ్స్‌కు బానిసలుగా మారే ప్రమాదముందని ప్రపంచ ఆరోగ్యసంస్థ(డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరించింది. అంతర్జాతీయ వ్యాధుల వర్గీకరణ (ఐసీడీ) 11వ సంచికను ఆ సంస్థ సోమవారం విడుదల చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణుల్ని సంప్రదించిన తర్వాత ప్రస్తుతమున్న పరిస్థితుల్లో ‘వీడియో గేమ్ డిజార్డర్’ను ఈ జాబితాలో చేర్చినట్లు డబ్ల్యూహెచ్‌వో మానసిక ఆరోగ్య విభాగం డైరెక్టర్ శేఖర్ సక్సేనా తెలిపారు. దాదాపు మూడు దశాబ్దాల తర్వాత ఈ జాబితాలో భారీ మార్పులు చేర్పులు చేయడం ఇదే తొలిసారన్నారు. వీడియో గేమ్ వ్యసనాన్ని ఓ వ్యాధిగా గుర్తించాలని గత జనవరిలోనే నిర్ణయించినట్లు వెల్లడించారు. వీడియోగేమ్‌ను వదల్లేకపోవడం, తిండీతిప్పలు గుర్తురాకపోవడం, నిద్రపోకపోవడం దీని ముఖ్య లక్షణాలని పేర్కొన్నారు. -
కొలంబోలో.. తెలుగు వారి కాయ్ రాజా కాయ్!
సాక్షి, అమరావతి: జూద ప్రియులను ఇప్పుడు శ్రీలంక అమితంగా ఆకర్షిస్తోంది. పొద్దున్నే విమానం ఎక్కి వెళ్లి పేకాడుకుని మర్నాడు ఉదయమే ఇంటికి తిరిగి వచ్చే సంస్కృతి తెలుగు రాష్ట్రాల్లో విస్తరిస్తోంది. కాసినో (జూద క్రీడ) కోసం ఇన్నాళ్లూ గోవా, మకావూ, మలేషియా, సింగపూర్ తదితర చోట్లకు వెళ్తున్న వారి చూపు ఇప్పుడు శ్రీలంకవైపు మళ్లింది. హైదరాబాద్, విశాఖల నుంచి శ్రీలంకకు నేరుగా విమాన సర్వీసులు అందుబాటులోకి రావడంతో జూదరులు కొలంబోకి క్యూ కడుతున్నారు. గతేడాది హైదరాబాద్, విశాఖల నుంచి జూద క్రీడల (కాసినో) కోసం సుమారుగా 26,000 మంది వచ్చినట్లు కొలంబోలోని బెలాజియో కాసినో మార్కెటింగ్ హెడ్ సిసిరా సెమసింఘే తెలిపారు. ఈ ఏడాది ఈ సంఖ్య 30,000 దాటుతుందని అంచనా వేస్తున్నట్లు చెప్పారు. గోవాతో పోలిస్తే చౌకనే.. కాసినో కోసం శ్రీలంక వెళ్తున్న వారిలో రాజధాని అమరావతి, భీమవరం ప్రాంతాలకు చెందిన బడాబాబులే అధికంగా ఉంటున్నారు. గోవాలో కాసినో కోసం సముద్రంలో సరిహద్దు జలాల వరకు వెళ్లాల్సి రావడం, పన్నుల భారం పెరగడం లాంటి కారణాలతో కొలంబో వెళ్తున్నట్లు చెబుతున్నారు. గోవా కంటే తక్కువ ఖర్చులో కాసినో కేంద్రాలు ఉండటంతో కొలంబో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం కొలంబోలో అతిపెద్ద కాసినోలు 5 ఉన్నాయి. మందు, విందు... సకల సదుపాయాలు కాసినో కోసం వచ్చే బడాబాబుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. కాసినోలు, ఫైవ్‌స్టార్ హోటల్స్, ఎయిర్‌లైన్స్ సంస్థలు ఉమ్మడిగా ప్రత్యేక ప్యాకేజీలను అందిస్తున్నాయి. ఫ్లైట్‌లో తీసుకెళ్లి ఫైవ్‌స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేయడమే కాకుండా మందు, విందు లాంటి సకల సౌకర్యాలు కల్పిస్తున్నాయి. మూడు రాత్రులు, నాలుగు రోజులు కలిపి హోటల్లో రూము, ఏర్పాట్లను బట్టి రూ. 3 లక్షల నుంచి రూ. 25 లక్షల వరకు వసూలు చేస్తున్నట్లు సెమసింఘే తెలిపారు. కేవలం గంటన్నర వ్యవధిలోనే కొలంబో చేరుకునే అవకాశం ఉండటం, టికెట్ ధరలు కూడా తక్కువగా ఉండటం కలిసి వస్తోందంటున్నారు. విమానాల్లో ప్రత్యేక ధరలు ఒకరోజు వెళ్లి ఆడుకుని వచ్చే విధంగా విమాన సర్వీసులను నడుపుతున్నట్లు శ్రీలంక ఎయిర్‌లైన్స్ తెలంగాణ, ఏపీ మేనేజర్ చమ్మిక ఇద్దగోడగే తెలిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైతే మధ్యాహ్నం 12 గంటలకు చేరుకుంటారని చెప్పారు. మర్నాడు ఉదయం 7.15కి బయలు దేరితే 9.15 కల్లా వచ్చే విధంగా సర్వీసులను నడుపుతున్నట్లు వివరించారు. కొలంబోకు విశాఖ నుంచి రూ. 11,000, హైదరాబాద్ నుంచి రూ. 15,500 ధరలతో ప్రత్యేక ఆఫర్లను ప్రకటించినట్లు చమ్మిక తెలిపారు. డబ్బు కడితే ఏజెంట్లే చూసుకుంటారు.. జూద క్రీడల పట్ల మక్కువ చూపే బడా బాబులను గుర్తించేందుకు ఈ సంస్థలు విశాఖ, విజయవాడ, హైదరాబాద్‌లో ప్రత్యేకంగా ఏజెంట్లను కూడా నియమించుకుంటున్నాయి. ఏడాదికి ఒకసారి ప్రమోషన్ ఈవెంట్లు నిర్వహించి ఆకర్షిస్తున్నారు. ప్యాకేజీ మొత్తాన్ని స్థానిక ఏజెంట్‌కు చెల్లిస్తే విమాన టికెట్లు, బస దగ్గర నుంచి వారే చూసుకుంటారు. వసతి, విందు, మందు ఉచితంగా అందించడంతోపాటు డిపాజిట్ చేసిన మొత్తానికి కాసినో టోకెన్లు ఇస్తున్నారని వెళ్లిన చాలామంది కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నారని స్థానిక కాసినో ప్రియుడు ఒకరు తెలిపారు. మరికొంత మంది అయితే కాసినో టేబుళ్లను కొనుగోలు చేసి లాభనష్టాలను పంచుకునే విధంగా ఒప్పందాలు చేసుకుంటున్నారు. అవకాశమిస్తే విశాఖలో కాసినో: పర్యాటకులను ఆకర్షించడానికి విశాఖలో కాసినో ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తమ దృష్టికి వచ్చిందని, ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తే ఇక్కడ ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామని సెమసింఘే తెలిపారు. ఇప్పటికే నేపాల్‌లో ఏర్పాటు చేసిన కాసినోకి మంచి ఆదరణ లభిస్తోందన్నారు. -
వినియోగదారులను దోపిడీ చేస్తున్న వ్యాపారులు
-
తూచేస్తున్నారా.. దోచేస్తున్నారా?
వినియోగదారులను నిలువునా దోపిడీ చేస్తున్న వ్యాపారులు నగరంలో ఏదికొన్నా తప్పుడు తూకమే.. కిలో అంటే ఎంత..? 850 నుంచి 950 గ్రాములు లీటర్ అంటే..? 800 నుంచి 900 మిల్లీలీటర్లు. మరి క్వింటాల్ అంటే.. ? 95–96 కిలోలు.. ఇదేంటి ఇష్టం వచ్చినట్లు రాసేస్తున్నారు అనుకుంటున్నారా..? హైదరాబాద్‌లో అంతే!? ఉప్పులు, పప్పులు, కాయగూరల నుంచి పాలు, నూనె వరకు ఏది కొన్నా మనకు వచ్చేది ఈ లెక్కనే! ఇంటి ముందు కిరాణా షాపు నుంచి పెద్ద పెద్ద సూపర్ మార్కెట్ల దాకా.. సాధారణ త్రాసుల నుంచి ఎలక్ట్రానిక్ తూకం యంత్రాల దాకా దేనిపై తూచినా ఇంతే! కావాలంటే మీరే చూడండి. ఇది కిలో అని చెప్పి అమ్మిన కందిపప్పు.. కానీ ఉన్నది 855 గ్రాములే! నగరంలోని పలు ప్రాంతాల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో తూకం పేరిట జరుగుతున్న దోపిడీ బయటపడింది. ఇంత జరుగుతున్నా తూనికలు కొలతల శాఖ పట్టించుకోవడం లేదు. నామమాత్రపు తనిఖీలతో సరిపెడుతోందన్న ఆరోపణలు వస్తున్నాయి. సాక్షి, హైదరాబాద్ : ఓ కిరాణా దుకాణానికో, సూపర్ మార్కెట్‌కో వెళ్లారు.. కిలో కందిపప్పు, అరకిలో చక్కెర కొనుక్కొచ్చారు.. ఎలక్ట్రానిక్ కాంటాపై తూచి ఇవ్వడంతో అంతా బాగానే ఉందనుకున్నారు. కానీ ఆ కందిపప్పు ఉండేది కిలో కాదు.. 850 నుంచి 950 గ్రాములే! చక్కెర కూడా 400 నుంచి 450 గ్రాములే. ఇదే కాదు లీటర్ నూనెగానీ, పాలుగానీ తీసుకుంటే వస్తున్నది 850 నుంచి 950 మిల్లీలీటర్లే.. ఇవేకాదు బియ్యం, ఉప్పులు, పప్పుల నుంచి బంగారం దాకా తూకంలో మోసం జరుగుతోంది. వ్యాపారులు సాధారణ త్రాసులతోపాటు ఎలక్ట్రానిక్ తూకం యంత్రాలను ట్యాంపర్ చేసి వినియోగదారులను నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్క తూకంలోనే కాదు గరిష్ట చిల్లర ధర (ఎమ్మార్పీ)లోనూ మోసం జరుగుతోంది. తనిఖీ సిబ్బంది ఏరీ? గ్రేటర్ హైదరాబాద్‌వ్యాప్తంగా çసుమారు 3 లక్షలకు పైగా వ్యాపార సంస్థలు ఉన్నాయి. దాడు లు, తనిఖీలు చేసి అక్రమాలను నియంత్రించే అధికారమున్న తూనికలు, కొలతల శాఖ సిబ్బంది ఉన్నది 22 మందే. వారు కూడా తూతూమంత్రపు తనిఖీలు, నామమాత్రపు జరిమానాలతో సరిపెడుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ కాంటాల ట్యాంపరింగ్ సాధారణ త్రాసులతో మోసం చేస్తారని, ఎలక్ట్రానిక్ కాంటాలతో మోసం ఉండదని జనంలో అభిప్రాయముంది. కానీ వ్యాపారులు ఎలక్ట్రానిక్ కాంటాలను ట్యాంపర్ చేసి దోపిడీకి పాల్పడుతున్నారు. అసలు సాధారణ త్రాసుల కన్నా వీటితో మరింత సులువుగా మోసం చేసేందుకు అవకాశం ఉండటమే దీనికి కారణం. ఎలక్ట్రానిక్ కాంటాలు ఖాళీగా ఉన్నప్పుడు డిస్ప్లేపై సున్నా (0) బరువును చూపిస్తుంది. తర్వాత సరుకులు/వస్తువులు పెట్టి బరువు లెక్కిస్తారు. అయితే ఎలక్ట్రానిక్ కాంటాలపై ఉండే ఆప్షన్లను మార్చడం ద్వారా తక్కువ సరుకులు పెట్టినా ఎక్కువ బరువు డిస్ప్లేపై కనిపించేలా చేస్తున్నారు. ఉదాహరణకు కాంటాపై 20 కిలోల సరుకు పెడితే 21.2 కిలోలు ఉన్నట్లుగా చూపుతుంది. అదే ఆప్షన్‌ను మార్చితే సక్రమంగా 20 కిలోల బరువు చూపుతుంది. జాగ్రత్తగా ఉండాలి.. తూకాల్లో మోసాలు జరుగుతున్నాయి. వినియోగదారులకు చైతన్యం అవసరం. కొనుగోళ్లలో జాగ్రత్త వహించాలి. మోసాలను అరికట్టేందుకు వారంలో రెండు రోజులు ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తున్నాం. సీజన్ వారీగా కూడా తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తున్నాం. తూకం మోసాలపై ఫిర్యాదు చేస్తే వెంటనే చర్యలు తీసుకుంటాం.. – వి.శ్రీనివాస్, రీజినల్ డిప్యూటీ కంట్రోలర్, తూనికలు కొలతల శాఖ, రంగారెడ్డి తూకాల్లో మోసమే గుడిమల్కాపూర్ మార్కెట్లో కిలో కూరగాయలు కొం టే 800 గ్రాములే వస్తున్నాయి. త్రాసుతో పాటు ఎలక్ట్రానిక్ కాంటాలతోనూ మోసం చేస్తున్నారు. తూనికలు, కొలతల శాఖ పట్టించుకోని కారణంగానే ఈ దోపిడీ కొనసాగుతోంది.. – శ్రీనివాస్‌యాదవ్, ప్రైవేటు ఉద్యోగి, ఆసిఫ్‌నగర్, హైదరాబాద్ ఏది కొన్నా తక్కువ తూకమే.. ► మార్కెట్లో కిలో పండ్లు, కూరగాయలు, మటన్, చికెన్, చేపలు వంటివి ఏవి కొన్నా 800–900 గ్రాములే ఉంటున్నాయి. కొందరు వినియోగదారులు అది గుర్తించి ఫిర్యాదులు కూడా చేస్తున్నారు. సికింద్రాబాద్, గడ్డిఅన్నారం, మాదన్నపేట, గుడిమల్కాపూర్, కొత్తపేట మార్కెట్లలో ఇలాంటి ఘటనలు జరిగాయి. ► ఇక మార్కెట్లో వివిధ బ్రాండ్ల నూనె ప్యాకెట్లలో నిర్దేశించిన బరువు కంటే తక్కువగా నూనె ఉంటోంది. లీటర్ ప్యాకెట్లలో 50 నుంచి 100 గ్రాములు, ఐదు లీటర్ల బాటిళ్లలో 200 నుంచి 400 గ్రాముల వరకు త క్కు వగా ఉంటున్నాయి. ఇటీవల తూనికలు, కొలతల శాఖ దాడుల్లో ఇలాంటి వాటిని గుర్తించారు కూడా. ► పెట్రోల్ బంకుల్లో కొనుగోలు చేస్తున్న ప్రతి లీటర్ పెట్రోల్, డీజిల్‌లలో 50 మిల్లీలీటర్ల నుంచి 100 మిల్లీలీటర్ల వరకు తక్కువగా ఉంటోంది. ► రేషన్ దుకాణాల డీలర్ల చేతివాటమైతే మరీ ఎక్కువగా ఉంటోంది. ఇటీవల హైదరాబాద్ శివార్లలోని బాలనగర్లో ఉన్న రేషన్ దుకాణంలో తూనికలు, కొలతల శాఖ అధికారులు చేసిన దాడిలో విస్తుపోయే విషయం వెల్లడైంది. అందులోని ఎలక్ట్రానిక్ కాంటాను ట్యాంపర్ చేయడంతో.. 20 కిలోల బరువును పెడితే, 21.2 కిలోల బరువు చూపుతున్నట్లు గుర్తించారు. ► నేరుగా లారీలు, ట్రక్కులతోనే బరువు తూచే ఇసుక, ఇనుము వంటి వాటి తూకంలోనూ భారీగా మోసాలు జరుగుతున్నాయి. వ్యాపారులు వేబ్రిడ్జిల నిర్వాహకులతో కుమ్మక్కై తక్కువ తూకం వేస్తున్నారు. మోసం జరుగుతోందిలా.. ► సాధారణంగా ఎలక్ట్రానిక్ కాంటాలను సమతలంలో ఏర్పాటు చేయాలి. సమతలంగా లేకున్నా, ఓ వైపు ఎత్తుగా, మరోవైపు పల్లంగా ఉన్నా.. తప్పుడు తూకం చూపిస్తుంది. ఇది తెలియక కొందరు, మోసం చేసే ఉద్దేశంతో మరికొందరు వ్యాపారులు కాంటాలను తప్పుగా అమర్చుతున్నారు. ► ఎలక్ట్రానిక్ కాంటాలపై నేరుగా తూచలేని సరుకులు, వస్తువుల కోసం కాంటాపై ఏదైనా బుట్ట, పళ్లెం వంటిది పెట్టి దానిలో తూకం వేస్తారు. అలాంటప్పుడు కాంటాలో బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చుతారు. దీంతో ఆ బుట్ట, పళ్లెం బరువు కూడా కలసిపోయి సున్నాగా చూపిస్తుంది. అయితే తర్వాత ఇతర వస్తువులను తూచేప్పుడు ఆ బుట్ట/పళ్లెం తీసేసినా.. తిరిగి బరువును ‘జీరో (0)’సెట్టింగ్‌కు మార్చడం లేదు. ► ఎలక్ట్రానిక్ కాంటాల్లో బరువు తూచే విధానాన్ని సవరించేందుకు మోడ్ ఆప్షన్ ఉంటుంది. దీనిని వ్యాపారులు దుర్వినియోగం చేసి.. తప్పుడు తూకానికి పాల్పడుతున్నారు. ► ఇక సాధారణ టేబుల్ త్రాసులో తూకం రాళ్లు (బాట్లు), సరుకులు పెట్టే ప్లేట్ల కింద ఉండే సెట్టింగ్‌ను అటూ ఇటూ జరపడం ద్వారా తక్కువ తూకం వచ్చేలా చేస్తున్నారు. ► ముఖ్యంగా కూరగాయల మార్కెట్ల వంటి చోట్ల అడుగున కట్ చేసిన తప్పుడు తూకం రాళ్లను వినియోగిస్తున్నారు. -
కోడిపందేలను జూదంగా మార్చేశారు
-
మంత్రి ఇలాఖాలో మంగతాయి
సాక్షి కడప : రాష్ట్ర మార్కెటింగ్‌శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి సొంత నియోజకవర్గంలో మంగతాయి జోరు పెరిగింది. రూ.వేలు, లక్షలు దాటి కోట్లకు చేరింది. మంత్రి ఇలాఖా అయిన జమ్మలమడుగు ప్రాంతంలో ప్రతినిత్యం జూదం జోరందుకున్నా నోరు మెదిపే వారు కరువయ్యారు. ఎవరైనా పోలీసులు సాహసం చేసి దాడులు నిర్వహిస్తే తాము మంత్రి వర్గీయులమంటూ బెదిరిస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే జమ్మలమడుగు ప్రాంతంలో మట్కాతోపాటు జూదం ఆడేందుకు రాష్ట్రాలు, జిల్లాల నుంచి కూడా వస్తున్నారు. గండికోట పర్యాటక క్షేత్రాన్ని స్థావరంగా ఏర్పరుచుకుని వ్యవహారం చక్కబెడుతున్నారు. ఒకరోజు ఒకచోట, మరొకరోజు మరో ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని అడ్డంగా ఆడుతున్నారు. అయితే మంగళవారం గండికోటలోని జూద స్థావరంపై పోలీసుల దాడి సంచలనం కలిగించినా.. తర్వాత అధికార పార్టీ పెద్దల ఒత్తిళ్లతో కేసు వ్యవహారం కాస్తా పక్కకు మళ్లడం ఆందోళన కలిగిస్తోంది. అన్నీ అనుమానాలే.. జమ్మలమడుగు పరిధిలోని గండికోటలో మంగతాయి ఆడుతున్న జూదరులను పట్టుకోవడం...వారి వద్దనుంచి భారీగా మొత్తాలు స్వాధీనం చేసుకున్న విషయం వరకు పరిశీలిస్తే పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే పట్టుబడిన సొమ్ముతోపాటు పోలీసులకు చిక్కిన జూదరులలో కొంతమందిని తప్పిస్తున్నారని తెలియవచ్చింది. రూ.70 లక్షల వరకు నగదు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసు వర్గాల్లోనే చర్చ సాగుతోంది. అంతేకాకుండా ఆ శాఖలోని నిఘా వర్గాలు కూడా దాదాపు కోటి రూపాయల మేర వ్యవహారం సాగినట్లు లెక్కలు కడుతున్నారు. అయితే దొరికిన లెక్కకు పక్కా లెక్కలు ఉండవనుకున్నారో...లేదా అధికార పార్టీ ఒత్తిడితో ఏదో ఒకటి చేశామని చెప్పుకున్నారో తెలియదుగానీ నగదు వ్యవహారం కాస్త జమ్మలమడుగులో హాట్ టాపిక్ అయింది. గండికోటలో జరుగుతున్న జూదం వ్యవహారంలో దాదాపు 50 మంది వరకు పాల్గొనగా. .దాదాపు రెండు కోట్ల మేర అందరి వద్ద నగదు ఉన్నట్లు బయట ప్రచారం సాగుతోంది. అయితే పోలీసులు మాత్రం కేవలం రూ. 30 లక్షలు మాత్రమే చూపించడాన్ని బట్టి పెద్ద ఎత్తున నగదు చేతులు మారినట్లు తెలుస్తోంది. జమ్మలమడుగు కేంద్రంగా.. రాష్ట్ర మార్కెటింగ్ శాఖా మంత్రి ఆది సొంత నియోజకవర్గంలో మొబైల్ గ్యాంబ్లింగ్ ఎక్కువగా జరుగుతుంది. గండికోట, కర్నూల్, నంద్యాల, బెంగళూరు ప్రాంతాలను ఎంపిక చేసుకుని గ్యాబ్లింగ్ నిర్వహిస్తున్నారు. వీరు ప్రతి రోజు ఒక ప్రాంతాన్ని ఎంచుకుని ఆ ప్రాంతంలో పోలీసులు ఎవరూ రాకుం డా ప్రత్యేక మనుషులతో వలయాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతిరోజు కోట్లలో మంగతాయి నిర్వహిస్తున్నారు. ఎవరైనా పోలీసులు వస్తే వారికి తాము మం త్రి అనుచరులమంటూ చెబుతూ బెది రింపులకు దిగుతున్నారు. దీంతో చాలా మంది పోలీసు అధికారులకు జూదం వ్యవహారం తెలిసినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలున్నాయి. దొరికింది రూ.30 లక్షలా 72 లక్షలా! గండికోటలో మంగళవారం అర్ధరాత్రి మొబైల్ గ్యాంబ్లింగ్‌లో భాగంగా కొంత మంది మంగతాయి నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో పోలీసులు మారువేషాల్లో వెళ్లి( మఫ్టీలో) వారిని పట్టుకున్నారు. అయితే మంగతాయి ఆడేవారు దాదాపు 52 మంది ఉన్నట్లు తెలుస్తోంది. వీరి వద్ద నుంచి దాదాపు 72 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారని ప్రచారం జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం తాము స్వాధీనం చేసుకుంది కేవలం రూ.30లక్షల 31వేలు మాత్రమే అని చెబుతున్నారు. అయితే పేకాట ఆడటానికి వెళ్లేవారు ఒక్కొక్కరు కనీసం మూడు లక్షలరూపాయలు దగ్గర పెట్టుకుని వెళితోనే లోపలికి ప్రవేశం ఉంటుంది. ఈ లెక్కన 51 మంది వద్ద కనీసం రెండు కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఎదురుతిరిగిన జూదరులు గండికోట టూరిజం హోటల్లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు మఫ్టీలో వెళ్లి పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే అందులో డబుల్ స్టార్ కలిగిన అధికారులపై జూదరులు దౌర్జనానికి పాల్పడటంతో పాటు వాదనకు దిగినట్లు తెలిసింది. ఎట్టకేలకు జూదరులను అదుపులోకి తీసుకోగా వారిలో చాలా మంది ప్రధాన వ్యక్తులే ఉన్నారని తెలుస్తోంది. అయితే వారిని కాకుండా వారు సూచించిన వ్యక్తులను కేసులో పెట్టేలా అధికార పార్టీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లా స్థాయి అధికారులు కేసులు పెట్టిన 21 మందిని విచారిస్తే అసలు నిజాలు బయటపడే అవకాశం ఉందని ప్రజలు పేర్కొంటున్నారు. రూ.30 లక్షలు స్వాధీనం జమ్మలమడుగు: గండికోటలోని హరిత హోటల్లో మంగతై జూదం ఆడుతున్న 21మందిని అరెస్టు చేసి వారి వద్దనుంచి 30 లక్షల 31,900 రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జమ్మలమడుగు అర్బన్ సీఐ ప్రవీన్‌కుమార్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మండల పరిధిలోని గండికోట టూరిజం హోటల్లో మంగతై ఆడుతున్నట్లు సమాచారం రావడంతో రూరల్ సీఐ ఉమామహేశ్వరరెడ్డి, ఎస్ఐలు హనుమంతు, హరిప్రసాద్, సునీల్‌రెడ్డి, రాఘవేంద్రారెడ్డి, శ్రీనివాసులు, నరసింహారెడ్డిలతో పాటు స్పెషల్ పార్టీ పోలీసులతో కలిసి దాడి నిర్వహించామన్నారు. ఇందులో తమ్మినేని వెంకటేశ్వర్లు, ఉప్పలూరు నాగేశ్వరరెడ్డి, టంగుటూరు కృష్ణమూర్తి, దూదేకుల దస్తగిరి, మాధవాపురం రవికుమార్, నారాయణ, తప్పెట్ల రామసుబ్బారెడ్డి, వేంపల్లి సుబ్బారెడ్డి, వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి, లింగాల గారి వెంకటసుబ్బయ్యలతోపాటు మరో11 మందిని అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. -
బెట్టింగ్‌ను చట్టబద్ధం చేస్తే ..
న్యూఢిల్లీ: పందెం, జూదంను చట్టబద్ధం చేస్తే దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న ప్రజలు వాటికి అలవాటు పడే అవకాశం ఉందని న్యాయ కమిషన్ చైర్మన్ జస్టిస్ బల్వీర్ సింగ్ చౌహాన్ శనివారం అన్నారు. తత్ఫలితంగా నేరాల సంఖ్య పెరిగిపోతుందనీ, సమాజం గాడి తప్పుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఆలిండియా గేమింగ్ సమిట్–2017’లో జస్టిస్ బల్వీర్ మాట్లాడారు. ‘దేశంలో నాలుగింట ఒక వంతు జనాభా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారే. వారి ఆదాయం చాలా తక్కువ. జూదం, బెట్టింగ్‌కు వారు ఆకర్షితులు అయ్యే అవకాశాలు పుష్కలం. అదే జరిగితే పర్యవసానాలు మొత్తం సమాజంపై పడతాయి. ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. నేరాలు, హింస పెరుగుతాయి’ అని ఆయన వివరించారు. దేశంలో క్రికెట్ పందేలను చట్టబద్ధం చేసే అంశాన్ని న్యాయ కమిషన్ పరిశీలిస్తోంది. -
‘అధికార’ జూదం
ఒత్తిళ్లకు తలొగ్గిన పోలీసులు గ్యాంగ్ మాస్టర్ వదిలి పెట్టిన వైనం గుంతకల్లు రూరల్: అధికార పార్టీ నేతల ధన దాహానికి అంతు లేకుండా పోతోంది. ఆఖరుకు జూదాలను సైతం ప్రోత్సహిస్తూ.. జనం సొమ్మును దోచేస్తున్నారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వివరాల్లోకి వెళితే.. గుంతకల్లు మండలంలోని నాగసముద్రం శివారులో మూడు రోజుల క్రితం భారీ ఎత్తున జూదం జరుగుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు దాడులు నిర్వహించి, 20 మంది జూదరులను, రూ. 2 లక్షలకు పైగా సొమ్ము, 14 సెల్ఫోన్లు, ఏడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. నాగసముద్రం గ్రామానికి చెందిన ఓ అధికార పార్టీ కన్నుసన్నల్లోనే స్థావరాలను మార్చిమార్చి ఇక్కడ పేకాట నిర్వహిస్తున్నట్లు పట్టుబడిన వారే పేర్కొంటున్నారు. జూదంతో పాటు అధిక వడ్డీకి డబ్బు నాగసముద్రం గ్రామానికి చెందిన టీడీపీ నేత.. ప్రతి రోజూ పేకాటరాయుళ్లకు అధిక వడ్డీలకు డబ్బు అప్పుగా ఇవ్వడంతో పాటు వారితో పరిచయాలు పెంచుకున్నారు. అనంతరం దీనినే వృత్తిగా మార్చుకున్న అతను పదేళ్లుగా కర్ణాటకలోని బళ్లారి తదితర ప్రాంతాల్లో గ్యాంబ్లింగ్ స్థావరాలతో సంబంధాలు పెట్టుకుని అక్కడ తన వడ్డీ వ్యాపారాన్ని విస్తరించాడు. ఈ క్రమంలోనే మూడేళ్ల క్రితం రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ అండతో నాగసముద్రం శివారులోని వంకలు, చింతలాంపల్లి సమీపంలోని ఈదుల్లో, పామిడి మండలం ఇలా తరచూ స్థావరాలు మారుస్తూ పేకాట ఆడిస్తూ వచ్చాడు. ఇతని నిర్వహణలో తమకు పోలీసుల నుంచి ఎలాంటి హాని ఉండదని తెలుసుకున్న పేకాటరాయుళ్లు క్రమంగా అతని పంచన చేరుతూ వచ్చారు. సకల సౌకర్యాలతో.. : గుంతకల్లు, గుత్తి, పామిడి, కల్లూరు, తరిమెల, అనంతపురం, బళ్లారి తదితర ప్రాంతాల నుంచి నిత్యం 30 నుంచి 40 మందికి పైగా జూదరులు ప్రతి రోజూ ఇతని స్థావరానికి చేరుకునేవారు. వీరితో ఒక్కొక్కరి నుంచి రోజుకు రూ. 2 వేల నుంచి రూ. 5 వేల వరకు వసూలు చేసుకుంటూ వారికి భోజనం.. ఇతర సౌకర్యాలను సదరు టీడీపీ నేత సమకూర్చేవాడు. ఇతని నేతృత్వంలోని పేకాట స్థావరాల్లో ప్రతి రోజూ రూ. 20లక్షల నుంచి రూ. 30 లక్షల వరకూ చేతులు మారేవని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ నెల 13న సాయంత్రం కచ్చితమైన సమాచారం అందుకున్న గుంతకల్లు రూరల్ పోలీసులు దాడులు నిర్వహించి, 20 మంది జూదరులను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి నిర్వాహకుడు ఎవరనే విషయాన్ని రాబట్టుకుని అదే రోజు రాత్రి 10.30 గంటలకు సదరు వ్యక్తి ఇంటిపై సోదాలు చేపట్టారు. అయితే అప్పటికే అతను అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే అధికార పార్టీ సీనియర్ నాయకుల చేత ఫోన్లు చేయించి, తర్వాత వెళ్లి పోలీసులను కలిసినట్లు సమాచారం. ఒత్తిళ్లు పెరిగిపోవడంతో సదరు వ్యక్తిని పోలీసులు కేసు నుంచి తప్పించినట్లు పట్టుబడిన జూదరులు బాహటంగానే పేర్కొంటున్నారు. -
పేకాటరాయుళ్లను అర్ధనగ్నంగా..
-
పేకాటరాయుళ్లను అర్ధనగ్నంగా..
సాక్షి, చింతలపూడి: పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి పోలీసుల ఓవర్ యాక్షన్ చర్చనీయాంశమైంది. పేకాడుతూ దొరికిన ఆరుగురిని నడి రోడ్డుపై అర్ధనగ్నంగా నడిపించుకుంటూ పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లారు. అర్ధనగ్నంగా ఉన్న వారితోనే వారి బైక్‌లను నెట్టిస్తూ మూడు కిలోమీటర్లు కొట్టుకుంటూ తీసుకెళ్లారు. సీఐ రాజేష్ ఆధ్వర్యంలో ఈ ఘటన జరిగింది. పోలీసుల చర్యలపై విమర్శలు వెల్లువెత్తుతున్నా ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. అందరికీ అవగాహన కోసమే ఇలా చేశామంటూ పోలీసులు సమర్ధించుకుంటున్నారు. బాధితుల బంధువులు చింతలపూడి పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు. సీఐ రాజేష్‌పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మానవ హక్కులను హరించే విధంగా సీఐ ఎలా ప్రవర్తిస్తారంటూ నిలదీశారు. దీంతో ఆ ప్రాంతంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొన్ని రోజుల క్రితం ప్రగడవరంలోనూ పేకాటరాయుళ్లను సిఐ రాజేష్ అర్ధనగ్నంగా నడిపించారు. చింతలపూడి సీఐలు తరచూ వివాదాల్లో చిక్కుకుంటున్నారు. గంజాయి స్మగ్లర్లకు సహకరించినందుకు గతంలో సీఐ దాసుపై సస్పెన్షన్ వేటు పడింది కూడా. -
‘మాసినేని లాడ్జ్’లో హైటెక్ పేకాట
– ఆరు గదుల్లో మట్కా నిర్వహణ – యాత్రాడాట్ కామ్ పేరుతో అద్దెకు గదులు – పక్కా సమాచారంతో వన్‌టౌన్ పోలీసుల దాడి – 48 మంది అరెస్ట్ - రూ. 5.63 లక్షలు స్వాధీనం – నిందుతుల్లో టీడీపీ ప్రముఖుల అనుచరులు అనంతపురం సెంట్రల్: నగరంలో త్రీస్టార్ లాడ్జి అయిన మాసినేనిలో హైటెక్ పేకాట సాగుతోంది. పక్కా సమాచారం అందుకున్న వన్‌టౌన్ పోలీసులు లాడ్జిపై దాడులు నిర్వహించారు. మొత్తం 48 మంది పేకాటరాయళ్లను అరెస్ట్ చేసి, రూ. 5.63 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందుతుల్లో అధికార తెలుగుదేశంపార్టీకి చెందిన ప్రముఖుల అనుచరులు ఉన్నారు. వివరాలను వన్‌టౌన్ పోలీసు స్టేషన్లో సీఐ సాయిప్రసాద్ వెల్లడించారు. నగరంలో రాజురోడ్డులోని త్రీస్టార్ హోటల్ మాసినేని లాడ్జిలో భారీ స్థాయిలో పేకాట జరుగుతోంది. పేకాటరాయళ్లు ఎవరికీ అనుమానం రాకుండా ‘యాత్ర డాట్ కామ్’ టూరిస్టు సంస్థ పేరుతో ఆరు గదులు అద్దెకు తీసుకున్నారు. ఒక్కో గదిలో కొందరు చొప్పున కూర్చొని భారీ స్థాయిలో పేకాట సాగిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు మెరుపుదాడులు చేశారు. సీఐ సాయిప్రసాద్, ఎస్ఐలు వెంకటరమణ, నాగమధు, శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొని ఒకేసారి ఆరుగదులపై దాడి చేశారు. నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం 48 మందిని అదుపులోకి తీసుకొని స్టేషన్‌కు తరలించారు. వారి నుంచి రూ. 5.63 లక్షలు నగదు, విలువైన సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. కాగా పేకాట పట్టుబడిన నిందితుల్లో ఎక్కువశాతం టీడీపీ ముఖ్య నేతల అనుచరులు ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అనంతపురం, శింగనమల నియోజకవర్గం బుక్కరాయసముద్రానికి చెందిన ప్రజాప్రతినిధుల వద్ద చలామణి అవుతున్నవారు అధికంగా ఉన్నట్లు సమాచారం. అలాగే వారిని విడిపించేందుకు టీడీపీ అనుచరులు ప్రయత్నాలు చేశారు. అయితే మాసినేని హోటల్లో ఇంత పెద్ద ఎత్తున పేకాట ఆడుతుండడం నగరంలో సంచలనం కలిగిస్తోంది. సదరు లాడ్జిలో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని తొలి నుంచి ఆరోపణలు వినిపిస్తున్నా పట్టుబడడం మాత్రం ఇదే మొదటి సారి. గతంలో ఇదే వన్‌టౌన్ పోలీసులు దాడి చేసి, నిర్వాహకులను హెచ్చరించారు. దీన్ని బట్టి చూస్తే లాడ్జిలో పేకాట ఆడడం సర్వసాధరణమనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనిపై సీఐ సాయిప్రసాద్ స్పందిస్తూ నగరంలో లాడ్జి నిర్వాహకులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేస్తామన్నారు. ఎవరైనా మట్కా,పేకాట, ఇతర అసాంఘిక కార్యకలాపాలను ప్రోత్సహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
బతుకులు ‘క్లోజ్’
- మట్కాతో సామాన్యులు చిత్తు.. - హిందూపురం కేంద్రంగా సాగుతున్న వ్యాపారం - ప్రతి నెలా రూ.4.50 కోట్లకు పైగా లావాదేవీలు - బహిరంగంగా మట్కా రాస్తున్నా పట్టించుకోని వైనం నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. మట్కా బహిరంగంగా నిర్వహిస్తున్నా అడ్డుకునేవారు లేరు. అదృష్టం బాగుంటే సునాయసంగా ధనవంతులు కావచ్చన్న అత్యాశతో కొంతమంది ప్రజలు మట్కాకు బానిసవుతున్నారు. సంపాదించిన సొమ్మంతా మట్కాకు తగలేస్తూ ఆర్థికంగా చితికిపోయి బతుకులు ‘క్లోజ్’ చేసుకుంటున్నారు. హిందూపురం అర్బన్: మట్కా వ్యసనం సామాన్య, పేద, మధ్య తరగతి ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. అటువంటి మట్కా నిర్వహణకు హిందూపురం ప్రాంతం కేరాఫ్‌గా నిలుస్తోంది. లైసెన్స్డ్ వ్యాపారం అన్నట్టు నిర్వాహకులు చెలరేగిపోతున్నారు. షెడ్లల్లో కౌంటర్లు ఏర్పాటు చేసుకుని మట్కా చీటీలు రాస్తున్నారు. ప్రతి రోజూ రూ.కోట్లల్లో లావాదేవీలు కొనసాగిస్తున్నారు. పట్టణంలో ప్రధానంగా మూడు కంపెనీలు వాల్మీకి సర్కిల్, మార్కెట్‌యార్డు సర్కిల్, కొట్నూరు ప్రాంతాల్లో వారానికి నాలుగు రోజులు చొప్పున మట్కా నిర్వహిస్తున్నారు. వారానికి నాలుగు రోజులు చొప్పున ఒక్కో కంపెనీ నెలకు రూ.1.50 కోటి వరకు లావాదేవీలు నిర్వహిస్తోంది. అంటే మూడు కంపెనీలూ కలిసి నెలకు రూ.4.50 కోట్లు మట్కా వ్యాపారం చేస్తోంది. కర్ణాటక నుంచి టర్న్.. కర్ణాటక రాజధాని బెంగళూరు నుంచి హిందూపురంలోని కంపెనీలకు నంబర్లు టర్న్ (అక్కడ ఎక్కువైన వ్యాపార లావాదేవీలు ఈ ప్రాంతానికి మళ్లించే ప్రక్రియ) చెబుతారు. వాటి కలెక్షన్ ప్రతి శుక్రవారం నిర్వాహకులకు చేరుతుంది. ప్రతి నెలా ఈ కలెక్షన్ రూ.1.50కోట్ల వరకు కంపెనీలకు వస్తున్నట్లు తెలిసింది. కర్ణాటకలో మట్కా నిర్వాహకులపై అక్కడి పోలీసులు ఉక్కుపాదం మోపడంతో అక్కడివారు సరిహద్దు ప్రాంతమైన హిందూపురం కంపెనీలతో పొత్తుపెట్టుకుని టర్న్ అందిస్తున్నట్లు సమాచారం. మట్కా నిర్వాహణ మూడురకాలు.. 1) మిలాన్ డే మట్కా : దీనికి ఉదయం నుంచే మట్కా పట్టీలు రాస్తారు. మధ్యాహ్నం 3 గంటలకు ఓపెన్ బ్రాకెట్‌గా మొదటి అంకె వస్తుంది. సాయంత్రం 5.10 గంటలకు రెండవ అంకె క్లోజ్ బ్రాకెట్ ప్రకటిస్తారు. రెండు అంకెలు సరిపోతే రూ.1కి రూ.80 ప్రకారం నిర్వాహకుడు చెల్లిస్తాడు. ఇందులోనే 0 నుంచి 9 అంకెలల్లో ఒకటి మాత్రమే ఓపెన్ అడితే రూ.1కి రూ.8 చెల్లిస్తారు. 2) మిలాన్ నైట్ : ఓపెన్ బ్రాకెట్ రాత్రి 9గంటలకు, క్లోజ్ బ్రాకెట్ రాత్రి 11.30గంటలకు ప్రకటిస్తారు. దీనికి కూడా రూ.1కి రూ.80ప్రకారం చెల్లిస్తారు. 3) బాంబే మట్కా : ఓపెన్ బ్రాకేట్ రాత్రి 9.50 గంటలకు వస్తుంది. క్లోజ్ బ్రాకెట్ అర్థరాత్రి 12.15గంటలకు ప్రకటిస్తారు. ఈ మట్కాకు కూడా రూ.1కి రూ.70 నుంచి రూ.80 ప్రకారం చెల్లిస్తారు. కంపెనీ నిర్వాహకులుగా పట్టణంలో ఐదుగురు కొనసాగుతుండగా.. అనుచరులుగా మట్కా బీటర్లు దాదాపు వందకుపైగా ఉన్నారు. బీటరు పట్టీలు రాసినందుకు రూ.వందకు రూ.20 ప్రకారం కమీషన్ చెల్లిస్తారు. మట్కా రాసే కేంద్రాలివే.. పట్టణంలోని మేళాపురం, ముద్దిరెడ్డిపల్లి, ధన్‌రోడ్డు, హస్నాబాద్, పరిగిరోడ్డు, నింకంపల్లి, ఆబాద్పేట, పరిగి బస్టాండు, చిన్నమార్కెట్, బెంగళూర్రోడ్డు, వాల్మీకిసర్కిల్, సూరప్పకుంట, రహమత్‌పురం, రైల్వేస్టేషన్ ఏరియా, శ్రీకంఠఫురం, త్యాగరాజనగర్లతోపాటు రూరల్‌పరిధిలోని తూమకుంట, మణేసముద్రం, గోళాపురం సరిహద్దులో ,దేవరపల్లి, మలుగూరు గ్రామాల్లో విచ్చలవిడిగా మట్కా సాగుతోంది. - అలాగే లేపాక్షిమండల కేంద్రంతోపాటు కంచిసముద్రం, చోళసముద్రం, కొండూరు, చిలమత్తూరు మండలంలోని కొడూరు, కొడికొండ, చెక్‌పోస్టు, పాలేపల్లి గ్రామాల్లో ప్రతిరోజూ రూ.లక్షల్లో మట్కా వ్యాపారం జరుగుతోంది. మరో 15రోజుల్లో కట్టడి చేస్తాం హిందూపురం నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా దాడులు నిర్వహించి మట్కా, జూద కేంద్రాలు లేకుండా కట్టడి చేయిస్తాం. ఇప్పటికే వీటిపై దృష్టి పెట్టాం. ఇంకా నిశితంగా పరిశీలింపజేసి చర్యలు తీసుకుంటాం. - కరీముల్లా షరీఫ్, డీఎస్పీ, పెనుకొండ -
పోలీసులే కొట్టి చంపారు..!
– మృతుని బంధువుల ఆరోపణ – పారిపోతూ ప్రాణాలు కోల్పాయాడంటున్న పోలీసులు కర్నూలు సీక్యాంప్: తన తండ్రి వెంకోబనాయుడిని కర్నూలు పోలీసులే కొట్టి చంపారని తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా తుమ్మిళ్ల గ్రామానికి చెందిన మురళీధర్‌నాయుడు ఆరోపించారు. పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేయగా పారిపోతూ ఆదివారం సాయంత్రం కర్నూలు మండలం ఆర్.కొంతలపాడు వద్ద తుంగభద్ర నదిలో మునిగి వెంకోబనాయుడు మృతి చెందిన విషయం విదితమే. మృతదేహానికి కర్నూలు పెద్దాస్పత్రిలో సోమవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సందర్భంగా మృతుని కుమారుడు మురళీధర్ నాయుడు, అతని బంధువులు అధిక సంఖ్యలో ఇక్కడికి వచ్చి పోలీసులను నిలదీశారు. తుమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబ నాయుడు పేకాట ఆడడానికి ఆర్.కొంతలపాడుకు వస్తే పోలీసులు ఉద్దేశపూర్వకంగా కొట్టి చంపారని ఆరోపించారు. అతని దగ్గర ఉన్న రూ.50 వేలు పోలీసులు కాజేశారన్నారు. మృతుని శరీరంపై ఉన్న దెబ్బలు ఉంటడంతో అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామని చెప్పారు. ఈ ఘటనపై కర్నూలు తాలూకా సీఐ మహేశ్వరరెడ్డి మాట్లాడుతూ.. పేకాట ఆడుతున్న వారిలో 8 మంది పోలీసులకు లొంగిపోయారని, వెంకోబనాయుడు మాత్రం తప్పించుకునే ప్రయత్నంలో తుంగభద్రనదిలో పడి స్పృహ కోల్పోయాడన్నారు. నీళ్లు ఆయన పొట్టలోకి చేరడంతో చనిపోయాడన్నారు. పోస్ట్‌మార్టం నివేదిక వచ్చిన తర్వాత బంధువులకు అప్పగిస్తామన్నారు. కలెక్టరేట్ ఎదుట ఆందోళన తిమ్మిళ్ల గ్రామానికి చెందిన వెంకోబనాయుడు కుటుంబానికి న్యాయం చేయాలని కుటుంబీకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. పేకాట ఆడుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకుని తీవ్రంగా దాడి చేయడంతోనే మరణించాడని ఆరోపించారు. మృతుడి కుటుంబానికి రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ సత్యనారాయణకు వినతి పత్రం అందజేశారు. ఆందోళనలో మృతుడి భార్య పుష్పావతి, కుటుంబీకులు వేణుగోపాల్‌నాయుడు, చిన్న కొండయ్య, జి.కొండయ్య, జి.మాధన్న తదితరులు పాల్గొన్నారు. -
తాడిపత్రిలో మట్కా, పేకాటపై ఎస్పీ సీరియస్
– పోలీసులకు ప్రత్యేక ఆదేశాలు – తాడిపత్రి పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఐజీ అనంతపురం సెంట్రల్ : తాడిపత్రిలో జోరుగా సాగుతున్న మట్కా, పేకాటపై పోలీసు ఉన్నతాధికారులు సీరియస్‌గా పరిగణించారు. శుక్రవారం సాక్షిలో ‘మట్కా, పేకాటకు కేరాఫ్ తాడిపత్రి’ శీర్షికన కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై స్పందించిన అనంతపురం రేంజ్ డీఐజీ ప్రభాకర్‌రావు తాడిపత్రి పట్టణ పోలీస్‌స్టేషన్‌ను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పలు విషయాలపై ఆరా తీశారు. అలాగే ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్ దీనిని తీవ్రంగా పరిగణించారు. మట్కా, పేకాట, బెట్టింగ్ పూర్తి స్థాయిలో అణచివేయాలని తాడిపత్రి సహా జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులకు ప్రత్యేకమైన ఆదేశాలు జారీ చేశారు. ఏప్రాంతంలోనైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగినట్లు తేలితే సంబంధిత స్టేషన్ ఎస్ఐ, సీఐలతో పాటు పర్యవేక్షణాధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. -
జూదం కేరాఫ్ తాడిపత్రి !!
►పట్టణంలో జోరుగా జూదం ► మున్సిపాలిటీకి చెందిన ఓ ప్రజాప్రతినిధి ఆధ్వర్యంలో పేకాట ► అధికారపార్టీ నేతల కనుసన్నల్లోనే కార్యకలాపాలు ►ఆత్మహత్య చేసుకున్న రామసుబ్బారెడ్డి పేకాట బాధితుడే ► జూదంతో వేలాది కుటుంబాలు ఛిన్నాభిన్నం ►అన్నీ తెలిసినా పట్టించుకోని పోలీసులు అనంతపురం : రామసుబ్బారెడ్డి వైఎస్సార్ జిల్లా కొండాపురం మండలం కోడూరు వాసి. వ్యవసాయంతో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఆధ్యాత్మిక చింతన ఉన్న వ్యక్తి. భార్య సులోచనతో పాటు ప్రసన్న, ప్రత్యూష, ప్రతిభ సంతానం. కొన్ని కారణాలతో నాలుగేళ్ల కిందట తాడిపత్రికి వచ్చి స్థిరపడ్డాడు. సొంతిళ్లు కొనుగోలు చేసి ఉన్నంతలో బాగానే ఉండేవాడు. అయితే కొద్దిరోజుల్లోనే పేకాట ఉచ్చులో చిక్కుకున్నాడు. ఆస్తులు పోగొట్టుకున్నాడు. ఇళ్లు అమ్మేశాడు. అయినా ఆట ఆగలేదు. అప్పులు తలకు మించిన భారమయ్యాయి. రుణదాతల ఒత్తిడి ఎక్కువైంది. దీంతో భార్య పేరుమీదున్న భూమి విక్రయించేందుకు సిద్ధమపడగా... ఆమె ససేమిరా అంది. ‘‘పేకాటతో రోడ్డున పడ్డాం. ఉన్న పొలం అమ్మితే ముగ్గురు ఆడపిల్లల గతేంటి?’’ అని వారించింది. ఈ అంశంపై రోజూ ఇంట్లో గొడవ.. అప్పులోళ్ల ఒత్తిడి తాళలేక మంగళవారం రాత్రి మద్యం సేవించి భార్య, ఇద్దరు పిల్లలను హత్య చేశాడు. తిరుపతిలో చదువుతున్న ప్రసన్ననూ పిలిచారు. సమయానికి రాలేకపోవడంతో బతికిపోయింది. అనాథగా మారింది. -ఈ ఒక్క ఉదాహరణ చాలు తాడిపత్రి ప్రజల జీవితాలను పేకాట ఎలా ఛిన్నాభిన్నం చేస్తోందో తెలుసుకోవడానికి. ఈ ఘటన తర్వాత సీఎంతో సహా రాష్ట్రవ్యాప్తంగా అందరూ రామసుబ్బారెడ్డి కుటుంబంపై సానుభూతి వ్యక్తం చేశారు. రామసుబ్బారెడ్డిని ఛీదరించుకున్నారు. కానీ అసలు ఈ కుటుంబం ఛిన్నాభిన్నం అయ్యేందుకు దారితీసిన పరిస్థితులు....కారకుల గురించి ఎవ్వరూ మాట్లాడటం లేదు. వ్యసనాలకు అడ్డా తాడిపత్రి రాష్ట్రంలోనే ‘బెస్ట్ మున్సిపాలిటీ తాడిపత్రి’ అని అక్కడి పాలకులు ఊదరగొడుతుంటారు. రోడ్ల వెడల్పు చేసి... ప్లాస్టిక్‌ను నిషేధించి తాడిపత్రి అగ్రగామిగా నిలిపామని చంకలు గుద్దుకుంటున్నారు. కానీ సామాన్యుడు ప్రశాంతంగా, సంతోషంగా, స్వేచ్ఛగా జీవించగలిగే పరిస్థితులు కల్పించలేకపోయారు. మొన్నటిదాకా తాడిపత్రి ప్రజలకు తాగునీటి వసతిని కూడా అక్కడి ఏలికలు కల్పించలేకపోయారు. ఇలాంటి తాడిపత్రిలో పేకాట, మట్కా, క్రికెట్‌బెట్టింగ్ మాత్రం జిల్లాలో ఎక్కడా లేని విధంగా యథేచ్ఛగా సాగుతోంది. పొరుగు జిల్లాలైన కర్నూలు, వైఎస్సార్ జిల్లాల నుంచి పేకాటరాయుళ్లు తాడిపత్రికి వస్తుంటారంటే ఇక్కడ జూద ఏస్థాయిలో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. ఆటకు రూ.వంద నుంచి రూ.లక్ష వరకూ చెల్లించి ఆడుతున్నారు. రోజూ లక్షల రూపాయల్లో ఇక్కడ పేకాట నడుస్తోంది. అక్కడి మున్సిపాలిటీ పాలకవర్గంలోని ఓ ప్రజాప్రతినిధి పేకాటను తన కనుసన్నల్లో నడిపిస్తున్నాడు. ఇతని ఇంట్లో కూడా పేకాట నడుస్తున్నట్లు తెలుస్తోంది. గ్రానైట్ పరిశ్రమ విస్తరించడం, సిమెంట్, స్టీలు కర్మాగారాలు ఉండటంతో ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చేవారు ఎక్కువగా ఉంటారు. ఆర్థికలావాదేవీలు కూడా అధికంగా జరుగుతుంటాయి. దీన్ని ఆసరగా చేసుకుని అధికారపార్టీనేతలు తమ అనుచరులతో పేకాటను ఆడిస్తున్నారు. దీన్ని కూడా ఆదాయమార్గంగా ఎంచుకున్నారు. ఇక ప్రొద్దుటూరు పక్కనే ఉండటంతో క్రికెట్ బెట్టింగ్ కూడా అధికంగా నడుస్తోంది. అనంతపురం జిల్లాలో జరిగే బెట్టింగ్ మొత్తం తాడిపత్రి కేంద్రంగానే నడుస్తోంది. పోలీసుల నిస్సహాయత తాడిపత్రిలో ఎవరు పేకాట ఆడిస్తున్నారు? ఎవరు మట్కా నిర్వహిస్తున్నారు? బెట్టింగ్ బుకీలు ఎవరు? అనే సంగతి అక్కడి పోలీసులకు పేరుపేరునా తెలుసు. అయినా ఎలాంటి చర్యలు ఉండవు. ఎందుకంటే ఇక్కడి పోలీసులు ఏమాత్రం జోక్యం చేసుకున్నా... తాడిపత్రిలోని ఓ పెద్దమనిషి నుంచి ఫోన్లు వస్తాయి. ఆయన పీఏ, ఆ పెద్దమనిషి కంటే మరింత రుబాబు చేస్తారు. వీరి దారికొస్తే నెలనెలా మామూళ్లు ఇస్తారు.. దారికి రాకపోతే బదిలీని బహుమానంగా ఇస్తారు... ఇక్కడ ఎవ్వరు పనిచేయాలన్నా ‘పెద్దింటిసిఫార్సు’ తప్పనిసరి! దీంతోనే ఇక్కడ జూదాలకు అడ్డుకట్ట పడలేకపోతోంది. నూతన ఎస్పీగా బాధ్యతలు తీసుకున్న అశోక్‌కుమార్ తాడిపత్రిపై తన మార్క్‌ను చూపిస్తే వేలాది కుటుంబాలకు మేలు చేసినవారవుతారు. అధికారులు కన్నెతి చూడడం లేదు తాడిపత్రిలో మట్కా, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ మూడేళ్లలో మరీ విపరీతమైంది. ఎంపీ, ఎమ్మెల్యే ఇద్దరూ జేసీ సోదరులే కావడంతో అధికార పెత్తనం పెరిగిపోయింది. అధికారులెవరూ తాడిపత్రి వైపు కన్నెత్తి చూడకుండా ఆదేశాలు జారీ చేశారు. ఫలితంగా గ్యాబ్లింగ్ పెరిగి అనేక కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయి. కలెక్టర్, పోలీసులు స్పందించి తాడిపత్రితో పాటు జిల్లా వ్యాప్తంగా అధికార పార్టీ కనుసన్నల్లో నడుస్తున్న పేకాట, గ్యాంబ్లింగ్‌ను కూకటివేళ్లతో పెకిలించాలి. – శంకరనారాయణ, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అధికారులు వెనకంజ వేస్తున్నారు. తాడిపత్రి ప్రాంతంలో మాట్కా, గాంబ్లిగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవఽడం లేదు. ఇతర ప్రాంతాల్లో కట్టడికి చర్యలు తీసుకుంటూ, ఇక్కడ మాత్రం నిర్లిప్తంగా ఉంటున్నారు. అన్నింటిలో మేము అంటూ ముందుకు వచ్చే స్థానిక ప్రజాప్రతినిధులూ ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక్కడ నడుస్తున్న జూదాన్ని నియంత్రించేందుకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలి. అలా కాకుండా మిన్నకుండి పోతే గ్లాంబ్లిగ్ నిర్వాహకులతో వారికి సంబంధాలున్నాయని అభిప్రాయపడాల్సి వస్తుంది. – డి.జగదీశ్, సీపీఐ జిల్లా కార్యదర్శి -
వ్యక్తి దారుణహత్య
బనగానపల్లె రూరల్: రామకృష్ణాపురం గ్రామానికి చెందిన ఆపతి నారాయణస్వామి(42) మంగళవారం హత్యకు గురయ్యాడు. పలుకూరు దేవనగర్ కాలనీ సమీపలో ఆయనను బండరాయితో కొట్టి దారుణంగా హత్య చేశారు. స్థానికుల కథనం మేరకు.. నాపరాయి డిపోలో గుమాస్తాగా పనిచేసే ఆపతి నారాయణస్వామికి పేకాట, మద్యం ఇతర దురలవాట్లున్నాయి. నారాయణ స్వామి అదే గ్రామానికి చెందిన మరో ముగ్గురితో కలిసి పేకాట ఆడేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో సాయంత్రం పలుకూరులో నలుగురూ మద్యం సేవించి మత్తులో గొడవ పడ్డారు. అనంతరం రామక్రిష్ణాపురం గ్రామానికి బైక్‌లపై బయల్దేరారు. దేవనగర్ సమీపంలో అందరూ ఆగి మళ్లీ ఘర్షణ పడ్డారు. ఆపతి నారాయణస్వామిని మిగతా ముగ్గురు బండరాయితో బాది దారుణంగా హత్య చేశారు. పాణ్యం సీఐ పార్థసార«థిరెడ్డి, నందివర్గం ఎస్ఐ హనుమంతరెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం బనగానపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. మృతుడికి భార్య పద్మావతి, ఇద్దరు కుమారులున్నారు.కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
కాయ్ రాజా..కాయ్
- పదికి రూ.100, వందకు రూ.1000 - వెంకటేశ్వరపురం కేంద్రంగా జోరుగా సింగిల్ నంబర్లాట - ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో విచ్చవిడిగా జూదం నెల్లూరు (వీఆర్సీసెంటర్) : నగరంలోని వెంకటేశ్వరపురం కేంద్రంగా సింగిల్ నంబరు నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. పదికి రూ.100, వందకు రూ.1000 వస్తుందని ఆశ చూపి కొందరు నిర్వాహకులు జూదాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నడుస్తున్నా ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఈ ఆట కొనసాగుతోంది. వెంకటేశ్వరపురంలో కేంద్రంగా జరుగుతున్న ఈ ఆట చుట్టు పక్కల ప్రాంతాలైన జనార్ధన్రెడ్డికాలనీ, పడుగుపాడు, కోవూరు, సాలుచింతల ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వందకు వెయ్యి వస్తుందన్న ఆశతో చిన్న, మధ్య తరగతి వారు ప్రధానంగా యువకులు ఆకర్షితులై ఈ ఆట ఆడుతూ అప్పుల పాలై నష్టపోతున్నారు. వెంకటేశ్వరపురంలో ఉన్న ఏజెంట్ల వద్ద వంద కడితే నంబరు తగిలితే రూ.1000 వస్తుంది. ఆ వెయ్యిలో ఏజెంట్ కమీషన్ రూపంలో రూ.200 పట్టుకొని రూ.800 ఇస్తున్నారు. రూ.10 నుంచి ఈ ఆట మొదలవుతోంది. వెంకటేశ్వరపురం సెంటర్లో ఉన్న ఏజెంట్లు ఈతంతగాన్ని నడిపిస్తూ కమీషన్లతో లబ్ధిపొందుతుంటే, దీని బారిన పడినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కష్టం చేసి కూలి డబ్బులు తెచ్చుకుని ఏజెంట్ల చేతుల్లో పెడుతున్నారు. ఓ వ్యక్తి ఇటీవల రూ.20 వేలు నంబర్ల ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిసింది. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో మరిన్ని అప్పులు చేస్తూ అప్పుల పాలైపోతున్న పరిస్థితిలో కూరుకుపోయాడు. ప్రతి రోజూ ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి నంబర్లను ఏజెంట్లు ప్రకటిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. తెల్లవారు జాము నుంచే సెంటర్లలో నిర్వాహకుల సందడి మొదలవుతోంది. ఏ నంబరుకు ఆడితే ఎంత వస్తుంది.. ఎంత మంది పందెం పెట్టారు అన్న అంశంపై చర్చతో వీరి ఆట ప్రారంభమవుతోంది. గతంలో సింగిల్ నంబర్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి వారే కాకుండా కొందరు వ్యాపారస్తులు సైతం ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. ఒక్క వెంకటేశ్వరపురంలోనే రోజుకు రూ.లక్ష వరకు ఈ ఆటలో లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో ‘కాటన్’ వలె ఇప్పుడు సింగిల్ నంబర్ల ఆటలో కూడా చాలా మంది డబ్బులు పొగొట్టుకొని బాధపడుతున్నారు. ముఖ్యంగా నిర్వాహకులు కొత్త వారిని ఆకర్షిస్తూ వారితో ఆట ఆడిస్తున్నారు. రూ. లక్షల్లో ఈ ఆట కొనసాగుతుందంటే ఈ వ్యసనం ఏ మేరకు వ్యాపించిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి నిషేధిత ఆటలను పోలీసులు గుర్తించి మరికొంత మంది దీని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
కాయ్ రాజా..కాయ్
► పదికి రూ.100, వందకు రూ.1000 ► వెంకటేశ్వరపురం కేంద్రంగా జోరుగా సింగిల్ నంబర్లాట ► ఏజెంట్ల మధ్యవర్తిత్వంతో విచ్చవిడిగా జూదం నెల్లూరు: నగరంలోని వెంకటేశ్వరపురం కేంద్రంగా సింగిల్ నంబరు నిర్వహణ జోరుగా కొనసాగుతోంది. పదికి రూ.100, వందకు రూ.1000 వస్తుందని ఆశ చూపి కొందరు నిర్వాహకులు జూదాన్ని కొనసాగిస్తున్నారు. కొన్ని నెలల నుంచి గుట్టుచప్పుడు కాకుండా ఈ తంతు నడుస్తున్నా ఈ మధ్య కాలంలో బహిరంగంగానే ఈ ఆట కొనసాగుతోంది. వెంకటేశ్వరపురంలో కేంద్రంగా జరుగుతున్న ఈ ఆట చుట్టు పక్కల ప్రాంతాలైన జనార్ధన్ రెడ్డి కాలనీ, పడుగుపాడు, కోవూరు, సాలుచింతల ప్రాంతాల్లోనూ విచ్చలవిడిగా నిర్వహిస్తున్నారు. వందకు వెయ్యి వస్తుందన్న ఆశతో చిన్న, మధ్య తరగతి వారు ప్రధానంగా యువకులు ఆకర్షితులై ఈ ఆట ఆడుతూ అప్పుల పాలై నష్టపోతున్నారు. వెంకటేశ్వరపురంలో ఉన్న ఏజెంట్ల వద్ద వంద కడితే నంబరు తగిలితే రూ.1000 వస్తుంది. ఆ వెయ్యిలో ఏజెంట్ కమీషన్ రూపంలో రూ.200 పట్టుకొని రూ.800 ఇస్తున్నారు. రూ.10 నుంచి ఈ ఆట మొదలవుతోంది. వెంకటేశ్వరపురం సెంటర్లో ఉన్న ఏజెంట్లు ఈతంతగాన్ని నడిపిస్తూ కమీషన్లతో లబ్ధిపొందుతుంటే, దీని బారిన పడినవారు తీవ్రంగా నష్టపోతున్నారు. రోజంతా కష్టం చేసి కూలి డబ్బులు తెచ్చుకుని ఏజెంట్ల చేతుల్లో పెడుతున్నారు. ఓ వ్యక్తి ఇటీవల రూ.20 వేలు నంబర్ల ఆటలో పోగొట్టుకున్నట్లు తెలిసింది. పోగొట్టుకున్న డబ్బులు తిరిగి వస్తాయన్న ఆశతో మరిన్ని అప్పులు చేస్తూ అప్పుల పాలైపోతున్న పరిస్థితిలో కూరుకుపోయాడు. ప్రతి రోజూ ఉదయం ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి నంబర్లను ఏజెంట్లు ప్రకటిస్తారు. తమ అదృష్టాన్ని పరీక్షించేందుకు ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. తెల్లవారు జాము నుంచే సెంటర్లలో నిర్వాహకుల సందడి మొదలవుతోంది. ఏ నంబరుకు ఆడితే ఎంత వస్తుంది.. ఎంత మంది పందెం పెట్టారు అన్న అంశంపై చర్చతో వీరి ఆట ప్రారంభమవుతోంది. గతంలో సింగిల్ నంబర్ల నిర్వాహకులను పోలీసులు అదుపులోకి తీసుకున్న సంఘటనలు ఉన్నాయి. ప్రస్తుతం పోలీసులు పట్టించుకోకపోవడంతో మళ్లీ యథావిధిగా వారి కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. పేద, మధ్య తరగతి వారే కాకుండా కొందరు వ్యాపారస్తులు సైతం ఈ నంబర్ల ఆటపై మొగ్గు చూపుతున్నారు. ఒక్క వెంకటేశ్వరపురంలోనే రోజుకు రూ.లక్ష వరకు ఈ ఆటలో లావాదేవీలు జరుగుతున్నాయి. గతంలో ‘కాటన్’ వలె ఇప్పుడు సింగిల్ నంబర్ల ఆటలో కూడా చాలా మంది డబ్బులు పొగొట్టుకొని బాధపడుతున్నారు. ముఖ్యంగా నిర్వాహకులు కొత్త వారిని ఆకర్షిస్తూ వారితో ఆట ఆడిస్తున్నారు. రూ. లక్షల్లో ఈ ఆట కొనసాగుతుందంటే ఈ వ్యసనం ఏ మేరకు వ్యాపించిదో తెలుసుకోవచ్చు. ఇప్పటికైనా ఇలాంటి నిషేధిత ఆటలను పోలీసులు గుర్తించి మరికొంత మంది దీని బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. -
పేకాటస్థావరంపై దాడి..ఒకరి మృతి
హైదరాబాద్‌సిటీ: పోలీసుల నుంచి తప్పించుకోబోయి ఇద్దరు పేకాటరాయుళ్లు భవనంపై నుంచి దూకారు. ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో గురువారం వేకువజామున చోటుచేసుకున్న ఈ సంఘటన ఆలస్యంగా సాయంత్రం వెలుగులోకి వచ్చింది. వివరాలు..గురువారం వేకువజామున ఒంటి గంట సమయంలో ఓ ఇంటి రెండో అంతస్తులో శబ్దం రావడంతో పాటు లైట్లు ఆన్ చేసి ఉండటంతో పోలీసులకు అనుమానం వచ్చి తలుపుతట్టారు. దీంతో కంగారు పడిపోయిన ఇద్దరు పేకాట రాయుళ్లు తప్పించుకోబోయి వెనకవైపు బాల్కనీలోకి వెళ్లారు. మరో బాల్కనీలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ కిందపడిపోయారు. ఇద్దరిని పోలీసులు దగ్గరలోని అనుపమా ఆసుపత్రికి తరలించగా.. చికిత్సపొందుతూ శ్రీనివాస్(36) అనే వ్యక్తి మృతిచెందారు. ఇద్దరిదీ పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలం మామిడిపల్లి గ్రామం. స్థానికంగా ఉంటూ పండ్ల వ్యాపారం చేసుకుంటున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జూదాల్లో జోరుగా దొంగనోట్లు
ఆకివీడు(ఉండి) : జూదాల్లో దొంగనోట్లు జోరుగా చలామణి అయ్యాయి. అయిభీమవరం గామంలోని ఎఫ్‌సీఐ గిడ్డంగి ప్రాంతంలోని కోడి పందేల బరిలో ఏర్పాటు చేసిన పేకాట కేంద్రంలో సోమవారం నకిలీ రూ.2వేల నోట్లు బయటపడ్డాయి. కోతాట ఆడుతుండగా కృష్ణా జిల్లా పెదలంక గ్రామానికి చెందిన ఒక యువకుడు రూ.2వేల నోటును పందెంగా కాశాడు. దీనిని దొంగనోటుగా గుర్తించిన తోటì జూదరులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేశారు. అప్పటికే పేకాట కేంద్రంలో సుమారు రూ.లక్షకుపైగా దొంగనోట్లు చలామణి అయ్యాయని తెలుస్తోంది. దీంతో అందరూ తమకు వచ్చిన నోట్లను చూసుకోగా, చాలామంది వద్ద దొంగనోట్లు కనిపించాయి. వారంతా లబోదిబోమన్నారు. ఇదే అదునుగా పేకాట కేంద్రాన్ని ఒక్కసారిగా ఎత్తివేసి కోతాటలో జూదరులు పందెంగా కాసిన రూ.3 లక్షలను నిర్వాహకులు స్వాహా చేశారు. భీమవరం గ్రామానికి చెందిన ముదుండి గణపతిరాజు మాట్లాడుతూ.. కోతాట కేంద్రాన్ని ఎత్తివేయడంతో తాను రూ.లక్షా50 వేలు నష్టపోయాయని ఆవేదన చెందాడు. కాళ్ల మండలం కాళ్లకూరు గ్రామానికి చెందిన చోడదాసి గంగయ్య కూడా దొంగనోట్లతో నష్టపోయినట్టు చెప్పాడు. పేకాట కేంద్రంలో గత మూడు రోజులుగా సుమారు రూ.10 లక్షల విలువైన దొంగనోట్లు చలామణి అయిపోయాయని సమాచారం. పట్టుబడిన వ్యక్తి ఏమయ్యాడు? దొంగనోటు పందెం కాసి పట్టుబడిన కృష్ణాజిల్లాకు చెందిన వ్యక్తి ఏమయ్యాడో ఎవరికీ తెలియడం లేదు. అతనికి దేహశుద్ధి చేసిన నిర్వాహకులు పంపించివేశారని కొందరు చెబుతుండగా, పోలీసులకు ఫోన్‌చేసి సమాచారం ఇచ్చామని ఇంకొందరు చెబుతున్నారు. కొంత మంది కష్ణాజిల్లా పోలీసులు వచ్చి తీసుకువెళ్లారని మరికొందరు చెబుతున్నారు. అయితే ఈ వ్యవహారమంతా జాద క్రీడ నిర్వాహకుల కన్నుసన్నల్లోనే జరిగిందని జూదరులు ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉం డగా కోతాటలో ఉండి మండలం పాందు వ్వకు చెందిన వ్యక్తి రూ.వెయ్యి పందెం కాయగా, రూ. 2 వేలు నోటు ఇచ్చారు. అది దొంగనోటని తరువాత తెలిసింది. దీంతో అతను లబోదిబోమంటున్నాడు. దొంగనోటు ఇలా.. పట్టుబడిన దొంగనోటులో తెల్లభాగం వద్ద గాంధీ బొమ్మ వాటర్ మార్క్ లేదు. కాగితం మధ్య భాగంలో మెరిసే థ్రెడ్(ఆర్బీఐ) సిల్కు దారం కూడా లేదు. కాగితం ఫోటోస్టాట్ పేపరుగా ఉంది. -
కొనసాగిన కోట్లాట
సాక్షి ప్రతిని«ధి, ఏలూరు : ప్రభుత్వ యంత్రాంగం ఓడిపోయింది. కోడి పందేలతోపాటు జూద క్రీడలను ముందుండి మరీ గెలిపించింది. జూదరుల సొమ్ములను కరిగించేసి.. పందేల నిర్వాహకులకు సిరుల వర్షం కురిపించింది. రాజకీయ క్రీడలో.. అధికార పార్టీ నేతలు అండదండలు అందించడంతో ప్రభుత్వం నుంచి ‘చూసీచూడనట్టు వెళ్లండి’ అంటూ మౌఖిక ఆదేశాలు వెలువడటంతో జిల్లా యంత్రాంగం చేష్టలుడిగి చూసింది. సుప్రీంకోర్టు, హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ టీమ్‌లు అడ్రస్ లేకుండా పోయాయి. మూడు రోజుల పండగ అయినా బోనస్‌గా నాలుగో రోజున కూడా పందేలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి పోలీసులు తమ ఉదారత చాటుకున్నారు. దీంతో సోమవారం కూడా జిల్లా వ్యాప్తంగా కోడిపందేలు, పేకాట, ఇతర జూద క్రీడలు యథేచ్ఛగా సాగాయి. కోట్లాది రూపాయలు చేతులు మారగా.. సందట్లో సడేమియా అన్నట్టుగా రూ.2 వేల నకిలీ నోట్లనూ చలామణి చేయడం కలకలం సృష్టించింది. అకివీడు మండలం ఐ.బీమవరం జూద శిబిరంలో పెద్దఎత్తున రూ.2 వేల నకిలీ నోట్లు చలామణి అయ్యాయి. దీనిని గుర్తించిన నిర్వాహకులు ఒకరిని పట్టుకుని దేహశుద్ధి చేసి పంపించి వేశారు. కొన్ని దొంగనోట్లను చించివేశారు. ఇంత జరిగినా పోలీసులు మాత్రం పట్టించుకోలేదు. కోడిపందేల మాటున జూద క్రీడలు, పేకాట పెద్దఎత్తున సాగినా ఖాకీలు మిన్నకుండటం విమర్శలకు తావిచ్చింది. అంతా అయిపోయాక పందేలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్టు ఉన్నతాధికారులు ప్రకటనలు ఇవ్వడం హాస్యాస్పదంగా మారింది. కోర్టు తీర్పును అనుసరించి ఏర్పాటు చేసిన జాయింట్ యాక్షన్ కమిటీలు పనిచేయలేదు. ఈ నెపాన్ని కిందిస్థాయి సిబ్బందిపై నెడతారా, వారికి నోటీసులు ఇస్తారా లేక ఉన్నతాధికారులు బాధ్యత వహిస్తారా అనేది వేచి చూడాల్సిందే. కోర్టుకు చూపడం కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకు 330 మందిపై కేసులు నమోదు చేసినట్టు పోలీసులు చెబుతున్నారు. అన్నిచోట్లా ఆడించారు ప్రధానంగా భీమవరం మండలం వెంప, వీరవాసరం మండలం కొణితివాడ, భీమడోలు మండలం గుండుగొలను, పెదవేగి మండలం కొప్పాకలో భారీస్థాయి పందేలు నిర్వహించగా, భీమవరం మండలం తోకతిప్ప, ఈలంపూడి, దిరుసుమర్రు, చినఅమిరం, రాయలం, యనమదుర్రు, లోసరి, దెయ్యాలతిప్ప, వీరవాసరం, అండలూరు, నందమూరుగరువు, మత్య్సపురి, నవుడూరు, ఉత్తరపాలెం, వడ్డిగూడెం తదితర గ్రామాల్లో ఒక మోస్తరు పందేలు జరిగాయి. నరసాపురం నియోజకవర్గంలో సోమవారం కూడా కోడిపందేలు, గుండాట, పేకాట విచ్చలవిడిగా సాగాయి. మొగల్తూరు పోలీస్ స్టేషన్‌కు కూతవేటు దూరంలో గుండాట, కోడి పందేలను రేయింబవళ్లు నిర్వహించారు. రామన్నపాలెం, తూర్పుతాళ్లు గ్రామాల్లోని శిబిరాలపై పోలీసులు సోమవారం పోలీసులు దాడులు చేశారు. లిఖితపూడి, రాజుల్లంక, వేములదీవి, లక్ష్మణేశ్వరం, రుస్తుంబాద, తూర్పుతాళ్లు, మత్స్యపురి, యర్రంశెట్టివారిపాలెం పందేలు యథావిదిగా జరిగాయి. పాలకొల్లు మండలం పూలపల్లి ప్రధాన బరులు కోలాహలంగా మారింది. దగ్గులూరు, తిల్లపూడి, చింతపర్రు, భగ్గేశ్వరం, వడ్లవానిపాలెం, గొల్లవానిచెరువులో జూద క్రీడలు అడ్డూఅదుపు లేకుండా సాగాయి. యలమంచిలి మండలం కలగంపూడి గ్రామంలో ఎట్టి పరిస్థితితుల్లోను కోడి పందాలను ఆపాలని అధికార పార్టీ నాయకుల నుంచి పోలీసులకు ఒత్తిడి రావడంతో సోమవారం ఉదయం పోలీసులు, గ్రామస్తులు మధ్య రెండు గంటలపాటు హైడ్రామా నడిచింది. భీమడోలు మండలం గుండుగొలను, కురెళ్లగూడెం, పోలసానిపల్లి, సూరప్పగూడెం, అంబర్‌పేట తదితర గ్రామాల్లో పందేలు భారీ ఎత్తున జరిగాయి. నిడమర్రు మండలం పత్తేపురంలోని పెద్ద బరితోపాటు రెండు చిన్నబరుల్లోనూ పందెంకోళ్లు కత్తులు దూశాయి. కాళ్ల మండలం సీసలి, జక్కరం, పెదఅమిరం, మాలవానితిప్ప, ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం, కొమడవోలు, జాలిపూడి, శ్రీపర్రు గ్రామాల్లో పందేలు, పేకాట శిబిరాలు జోరుగా సాగాయి. కాట్లంపూడి, మాదేపల్లి శివారు ప్రాంతాల్లోని చేపల చెరువులు, పంటభూముల మధ్య చెట్ల కింద కొత్తగా పేకాట స్థావరాలు నడిచాయి. జంగారెడ్డిగూడెం, సుబ్బంపేట రోడ్డు, శ్రీనివాసపురం, లక్కవరం, దేవులపల్లి, పేరంపేట, పంగిడిగూడెం తదితర గ్రామాల్లో పందేలు, జూదాలు జోరుగా నిర్వహించారు. కొయ్యలగూడెం మండలం రామానుజపురం, బయ్యనగూడెం, దిప్పకాయలపాడు, పరింపూడి గ్రామాల్లోనూ కొనసాగాయి. అధికార పార్టీకి చెందిన నాయకులు నిర్వహించే బరుల్లో సోమవారం పందేలు వేయగా, మిగిలిన చోట్ల నిలిచిపోయాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, ధర్మాజీగూడెం, కలరాయనగూడెం, ములగలంపాడు గ్రామాల్లోని ఆయిల్‌పామ్, మామిడి తోటల్లో నిర్వహించిన పందేలకు కృష్ణా, ఖమ్మం జిల్లాల నుంచి పందెగాళ్లు తరలివచ్చారు. తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, నిడదవోలు, కొవ్వూరు, గోపాలపురం, పోలవరం నియోజకవర్గాల్లోనూ పలుచోట్ల పందేలు కొనసాగాయి. -
వీఆర్‌లో ఉన్న ఎస్సైపై విచారణ
ఏలూరు (సెంట్రల్): ఇప్పటికే వీఆర్‌లో ఉన్న ఎస్సై సిబ్బందితో పేకాట స్థావరంపై దాడి చేసి కేసు నమోదు చేయకపోవడంపై జిల్లా ఎస్సీ విచారణకు ఆదేశించారు. విధుల్లో అలసత్వంగా వ్యవహరించారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా పోలీసు కార్యాలయంలో ఇటీవల జరిగిన సమీక్షలో పెదపాడు ఎస్సైను ఎస్పీ భాస్కర్‌భూషణ్ వీఆర్‌లో పెట్టారు. నాలుగు రోజు క్రితం జిల్లా సరిహద్దులోని అప్పనవీడులోని ఓ ఇంట్లో కొందరు నేతలు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనంతరం ఆ ఇంటినే పేకాట స్థావరంగా మార్చేశారు. విషయం తెలుసుకున్న పెదపాడు ఎస్సై నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డుతో కలిసి దాడి చేసినట్టు సమాచారం. అయితే పేకాటలో పట్టుబడిన వారిని పోలీస్‌స్టేçÙ¯ŒSలో అప్పగించకుం డా స్వాధీనం చేసుకున్న సుమారు రూ.2 లక్షల నగదు తీసుకుని వెళ్లినట్టు ఎస్పీకి తెలియడంతో ఎస్బీ అధికారులతో విచారణకు ఆదేశించారు. విచారణలో ఆరోపణలు నిజమని తెలితే పెదపాడు ఎస్సైను సస్పెండ్ చేస్తామని ఎస్పీ తెలిపారు. -
టీడీపీ అరాచకాలను అడ్డుకుంటాం
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రిరాజశేఖర్ 16వ తేదీ జగన్ సభను విజయవంతం చేయాలి చిలకలూరిపేటటౌన్: టీడీపీ అరాచకాలను అడ్డుకుంటామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ చెప్పారు. ఈ నెల 16వతేదీన మాజీ మంత్రి కాసు వెంకటకృష్ణారెడ్డి కుమారుడు మహేష్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరుతున్నారు. ఈ నేపథ్యంలో నరసరావుపేటలో నిర్వహించే పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి సభను విజయవంతం చేసేందుకు చిలకలూరిపేట పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ స్థాయి నాయకుల, కార్యకర్తల సమావేశం సోమవారం నిర్వహించారు. మర్రిరాజశేఖర్ మాట్లాడుతూ రోజురోజకు టీడీపీ అరాచకాలు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని వీటిని అడ్డుకొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. పాత నోట్లు కేంద్రప్రభుత్వం రద్దు చేశాక అవే పాత నోట్లతో రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తన అనుచరులతో భారీగా పత్తి కొనుగోళ్లు చేపట్టి నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకుంటున్నారని ఆరోపించారు. తమ పార్టీ నాయకులను కార్యకర్తలను పచ్చకండువా కప్పుకోవాలని అధికారం ఉపయోగించి దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఇందుకు పోలీసులను పావులుగా వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో తమ పార్టీకి చెందిన సాంబిరెడ్డి అతని సోదరుల ఇళ్లను హైకోర్టు స్టే ఉన్నప్పటికీ అర్ధరాత్రి దౌర్జన్యంగా కూల్చివేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై న్యాయపోరాటంతోపాటు ధర్నాలు ప్రజా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. 16వ తేదీన నరసరావుపేటలో జగన్మోహనరెడ్డి పాల్గొనే సభను విజయవంతం చేయాలని కోరారు. రాజన్న పాలన కోసం భేషరుతుగా.... కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాసు మహేష్‌రెడ్డి మాట్లాడుతూ జగన్మోహనరెడ్డి నాయకత్వంలో రాజన్నపాలన తెచ్చేందుకు భేషరుతుగా పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. ప్రజల కష్టాలు తొలగి పోవాలంటే మరో రెండేళ్లు జగన్ స్ఫూర్తితో కార్యకర్తలు పోరాటాలకు సిద్ధం కావాలని కోరారు. నిరంతరం ప్రజా సమస్యల కోసం ప్రజల్లో మమేకమై పోరాడుతున్న జగన్ స్ఫూర్తిదాయక నాయకుడని కొనియాడారు. జగన్ నాయకత్వంలో ప్రజా శ్రేయస్సు కోరే ప్రభుత్వం తెచ్చుకుందామని పేర్కొన్నారు. పార్టీలో చేరుతున్న తనకు ఆశీస్సులు అందజేయాలని కోరారు. నియంతృత్వ పాలనకు పరాకాష్ట ... పార్టీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు డైమండ్ బాబు మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో కక్ష సాధింపులకు పాల్పడి ఉంటే నేడు టీడీపీ మనుగడలోనే ఉండేది కాదని చెప్పారు. దుర్మార్గానికి పరాకాష్టగా నియంతృత్వ తరహా పాలన రాష్ట్రంలో కొనసాగుతున్నదని మండిపడ్డారు. పార్టీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు సయ్యద్ మాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఒక్క ముస్లింకు ఎమ్మెల్యే టికెట్, మంత్రి పదవి ఇవ్వని చంద్రబాబుకు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఎస్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బండారు సాయిబాబా మాట్లాడుతూ గిన్నిస్‌బుక్ రికార్డు స్థాయిలో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణి అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు చిన్నపరెడ్డి మాట్లాడుతూ సీబీఐ విచారణ నిర్వహిస్తే ప్రత్తిపాటి ఇంటి గోడల్లో అవినీతి డబ్బు బయట పడుతుందన్నారు. బీసీ విభాగం జిల్లా అ««ధ్యక్షుడు సునీల్‌కుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం బీసీలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుబాని, యడ్లపాడు , నాదెండ్ల పార్టీ అధ్యక్షులు కల్లూరి విజయకుమార్, గొంటు శ్రీనివాసరెడ్డి, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు నాయుడు శ్రీనివాసరావు, డిప్యూటి ఫ్లోర్‌లీడర్ షేక్‌అబ్దుల్‌రౌఫ్, నాయకులు కంజుల వీరారెడ్డి, షేక్ అల్లీమియా, బైరా వెంకటకోటి, జరీనాసుల్తానా తదితరులు పాల్గొన్నారు. -
మట్కా, గ్యాంబ్లింగ్‌పై ప్రత్యేక దృష్టి
- ఎస్పీ రామకృష్ణ అట్లూరుః జిల్లాలో మట్కా, గ్యాంబ్లింగ్ నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం అట్లూరు పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. ముందుగా స్టేషన్‌లోని పరిసరాలను పరిశీలించి సిబ్బంది సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కూడా క్వాటర్సు లేక రాత్రివేళ బస్సులు రాకపోకలు లేక ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో 4 వేల కేసులు పెండింగులో ఉండగా 3750 కేసులు పరిష్కరించామన్నారు. సివిల్‌తో పాటు కోర్టులో ఉన్న కేసులు మాత్రమే పెండింగులో ఉన్నాయన్నారు. ఎర్ర చందనం అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. అట్లూరు మండలంలో వలసపాలెం గ్రామంలో 2013లో చంద్రగిరి నరసింహులును నరబలి ఇచ్చి చంపారని ఆకేసుకు సంబందింధించి, నల్లగొండుగారిపల్లికి చెందిన ఆటో డ్రైవర్ రామకృష్ణను హత్యచేసిన కేసుల్లో ఎటువంటి పురోగతి లేదని విలేకరులు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎస్పీ స్పందిస్తూ ఇంతవరకు నరబలి కేసు తన దృష్టికి రాలేదని ఈ కేసుపై సమగ్ర విచారణ చేసి ముద్దాయిలను పట్టుకుంటామన్నారు. -
ట్రంప్ వీరాభిమాని నక్క తోక తొక్కాడా!
లండన్: ఎవరైనా తాము అభిమానించే వ్యక్తి కోసం ఏదైనా చేసేందుకు వెనుకాడరు. కొందరు ఫ్యాన్స్.. తమ ఫెవరెట్ సెలబ్రిటీ(ఆర్టిస్టులు, క్రికెటర్లు, రాజకీయ నేతలు)ల విజయావకాశాలపై బెట్టింగ్స్ లో పాల్గొంటారు. కొన్నిసార్లు ఉన్న ఆస్తిని కోల్పేయే వాళ్లుంటారు. అదే విధంగా అదృష్టం తలుపుతడితే ఒక్క రోజులోనే కోట్లాది రూపాయలు సొంతం చేసుకుంటారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలలో విజయం సాధించిన రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ వీరాభిమాని బెట్టింగ్స్ లో భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నాడు. బ్రిటీష్ వ్యాపారవేత్త జాన్ మాపిన్ కొన్ని నెలల కిందట ట్రంప్ అభిమానిగా మారిపోయాడు. గతేడాది జూన్ నుంచి బెట్టింగ్స్ లో మనీ ఇన్వెస్ట్ చేసిన మాపిన్.. ఏకంగా 1,24,000 డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు 82.52 లక్షల రూపాయలు) గెలుచుకున్నాడు. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధిస్తారని ఏకంగా తాను 30 బెట్టింగ్స్ లో డబ్బు పెట్టినట్లు స్థానిక మీడియాకు చెప్పాడు. ఇంగ్లండ్, కార్నివాల్లో కామెలాట్ లో ఆయనకు హోటల్స్ ఉన్నాయి. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తానని ట్రంప్ ప్రకటించినప్పటి నుంచీ తాను గాంబ్లింగ్స్ పై ఇంట్రెస్ట్ పెంచుకుని డబ్బు ఖర్చుచేసిననట్లు తెలిపాడు. తాను గతంలో ఏ విషయంలోనూ బెట్టింగ్ పెట్టలేదని, ట్రంప్ గెలుపుపై మాత్రమే తాను బెట్టింగ్స్ లో పాల్గొన్నానని.. లక్కీగా భారీ మొత్తాన్ని సొంతం చేసుకున్నానని హర్షం వ్యక్తం చేశాడు. డబ్బులు తనకు అంత ముఖ్యంకాదని, కేవలం అభిమాన నేత ట్రంప్ విజయమే తనకు కిక్ ఇచ్చిందంటున్నాడు. డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్‌పై రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి ట్రంప్ నెగ్గి నూతన అధ్యాయానికి తెరతీశారు. అమెరికా వాసులు కూడా ట్రంప్ విజయాన్ని జీర్ణించుకోలేకపోతుండగా.. మరోవైపు బ్రిటన్ వ్యాపారి మాపిన్ మాత్రం తన తలుపుతట్టిన డబ్బు కంటే కూడా ట్రంప్ విజయమే ఆనందాన్ని ఇచ్చిందని అంటున్నాడు. -
పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
-
పేకాటాడుతూ టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్టు
బాన్సువాడ: పేకాట ఆడుతూ టీడీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యే పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా బాన్సువాడ పట్టణంలో శుక్రవారం రాత్రి జరిగింది. తాడ్కోల్ రోడ్డులోని ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న ఈ వ్యవహారాన్ని పోలీసులు రట్టు చేశారు. వీరు పేకాట ఆడుతున్నట్టు పోలీసులకు సమాచారం అందడంతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీకి చెందిన బాన్సువాడ మాజీ ఎమ్మెల్యే కె. గంగాధర్, ఉప సర్పంచ్ తో సహా 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 1.06 లక్షల నగదు, 10 సెల్ ఫోన్లు, 4 బైకులను స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభినట్టు స్థానిక సీఐ శ్రీనివాస రెడ్డి తెలిపారు. -
కోడి పందేల స్థావరాలపై దాడులు
– 12 మంది పందెం రాయుళ్ల అరెస్టు హిందూపురం రూరల్ : మండలంలోని చెర్లోపల్లి గ్రామం సమీపం అటవీ ప్రాంతంలో కోడిపందేల స్థావరాలపై దాడులు చేసి 12 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేసినట్టు రూరల్ సీఐ రాజగోపాల్‌నాయకుడు తెలిపారు. శనివారం స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పెనుకొండ, సోమందేపల్లి, హిందూపురం, గుట్టూరు చెందిన పందెంరాయుళ్లు చెర్లోపల్లి వద్ద కోడిపందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం రావడంతో టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఆంజినేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారన్నారు. దాడుల్లో బోయ రాజప్ప, అక్కులప్ప, నగేష్, మురళికష్ణ, అశ్వర్థప్ప, నరసింహులు, సురేష్, ప్రసాద్‌బాబు, శివ, అశ్వర్థప్ప, ఆదినారాయణ, రామాంజి, 5 ద్విచక్రవాహనాలు, నాలుగు పందెం కోళ్లు, రూ.31,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. నిందితులను కోర్టుకు హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. మరో 8 మంది పందెం రాయుళ్లు పారిపోయారని వారి ఆచూకీSకోసం గాలిస్తున్నామన్నారు. కార్యక్రమంలో టాస్క్‌ఫోర్స్ పోలీసులు వెంక్రటామిరెడ్డి, రామాంజి, ఆంజినేయులు, మల్లి, శివ, శీన, రవి, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా పేకాట శిబిరాలు
కొంత మంది పోలీసుల సహకారం సామాజిక మాధ్యమంలో పోలీసుల ప్రమేయంపై కథనాలు హెచ్‌సీపై శాఖాపరమైన చర్యలు గన్నవరం : అధికార పార్టీ అండదండలతో నిర్వహిస్తున్న పేకాట శిబిరానికి సహకరిస్తున్న ఓ హెడ్ కానిస్టేబుల్‌పై శాఖ పరమైన చర్యలకు ఉన్నతాధికారులు సిద్ధమయ్యారు. వివరాలు.. మండలంలోని అల్లాపురంలో అధికార పార్టీ నాయకుల అండతో కొంత కాలంగా పెద్ద ఎత్తున్న పేకాట శిబిరం నడుస్తోంది. స్థానిక పోలీసులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసిన స్పందించిన దాఖలాలు లేదు. నాలుగు రోజుల క్రితం నేరుగా ఈస్ట్‌జోన్ ఏసీపీ విజయభాస్కర్‌కు ఫోన్లో సమాచారం అందించారు. దీంతో స్వయంగా ఏసీపీ రంగంలోకి దిగి కంకిపాడు సీఐ శ్రీధర్‌కుమార్, ఇతర సిబ్బందితో కలిసి అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పేకాట శిబిరంపై దాడికి వెళ్లారు. ఈ విషయం ముందుగానే తెలుసుకున్న గన్నవరం పోలీస్‌స్టేçÙన్లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న కె.వెంకటేశ్వరరావు పేకాట శిబిరం నిర్వాహకులకు సమాచారం అందించారు. దీంతో ఏసీపీ పేకాట శిబిరం వద్దకు చేరుకునేలోపే జూదరులు అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం ఇచ్చిన వారిపై విచారణ.. జూదరులకు సమాచారం చేరడంతో అనుమానం వచ్చిన అధికారులు విచారణ చేపట్టారు. హెడ్ కానిస్టేబుల్ ప్రమేయం ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తర్వాత రోజే హెడ్ కానిస్టేబుల్‌ను ఏసీపీ కార్యాలయానికి సరెండర్ చేశారు. అంతే కాకుండా శుక్రవారం సదరు హెడ్ కానిస్టేబుల్‌ను శాఖ పరమైన చర్యల్లో భాగంగా రైల్వేకు డూయింగ్ డ్యూటీకి పంపించారు. అయితే గన్నవరం ప్రాంతంలో జరుగుతున్న పేకాట శిబిరాలకు గన్నవరం సీఐతో పాటు హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వరరావు సహకరిస్తున్నట్లు ఏసీపీకి లిఖిత పూర్వకమైన ఫిర్యాదు కూడా అందినట్లు సమాచారం. ఈ ఫిర్యాదుపై వాస్తవాలను తెలుసుకునేందుకే ఏసీపీ స్వయంగా పేకాట శిబిరంపై దాడి చేసినట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమంలో.. పేకాట శిబిరం నిర్వాహకులతో గన్నవరం పోలీసులకు ఉన్న సంబంధలపై వాట్సాప్‌లో హల్చల్ చేస్తున్న ఓ ఆడియో రికార్డు ప్రస్తుతం కలకలం సృష్టిస్తోంది. ఓ కానిస్టేబుల్‌తో పేకాట శిబిరం నిర్వాహకుడు మాట్లాడిన ఏసీపీ దాడులకు సంబంధించిన సంభాషణలు ఈ వాయిస్ మేసేజ్‌లో ఉన్నాయి. సదరు నిర్వాహకుడు దాడి సంఘటనపై సీఐతో కూడా మాట్లాడినట్లు ఆడియో రికార్డుల్లో చెప్పుకు వచ్చాడు. ఏసీపీ తనతో ఒకమాటా కూడా చెప్పకుండా వచ్చాడు. ఆయన మీరేమి భయపడనవరసం లేదని సార్ హామీ ఇచ్చినట్లు సదరు పేకాట నిర్వాహకుడు మాట్లాడిన వాయిస్ రికార్డు ఉంది. ప్రస్తుతం ఈ వాట్సాప్ మేసేజ్ పోలీస్ శాఖలో పలువురు ఉన్నతాధికారులకు కూడా వెళ్లినట్లు సమాచారం. సరెండర్ చేసిన మాటా వాస్తవమే పేకాట శిబిరాలకు సహకరిస్తున్నారనే కారణంతో హెడ్ కానిస్టేబుల్ కె.వెంకటేశ్వరరావును ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఏపీసీ కార్యాలయంలో సరెండర్ చేసిన మాటా వాస్తవమే. ఉన్నతాధికారులకు సహకరిస్తున్నట్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందిన విషయం కూడా వాస్తవమేనన్నారు. – అహ్మద్అలీ, సీఐ -
అంతర్ జిల్లా పేకాట స్థావరంగా పీఏబీఆర్
అనంతపురం సెంట్రల్ : ఉరవకొండ నియోజకవర్గంలోని పీఏబీఆర్ డ్యాం పరిసర ప్రాంతం అంతర్జిల్లా పేకాట స్థావరానికి అడ్డాగా మారుతోంది. ఇక్కడ రోజూ రూ.కోట్లలో పేకాట సాగుతున్నట్లు సమాచారం. నియోజకవర్గ అధికార పార్టీ నేత ముఖ్య అనుచరుడు ఈ పేకాట నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. దాదాపు 30 మంది కాపలాదారులను నియమించుకొని రహస్యంగా సాగిస్తున్నట్లు సమాచారం. పోలీసులకు వాటాలు ముట్టజెప్పి వారి నోరు మూయించినట్లు తెలిసింది. -
షి'కారు'జూదం
నగరశివారు ప్రాంతాలు, బీకేఎస్ మండల కేంద్రమే అడ్డా ∙రోజూ రూ. కోట్లలో లావాదేవీలు ∙అధికారపార్టీ సానుభూతిపరులే అధికం జిల్లాలో పేకాట కొత్తపుంతలు తొక్కుతోంది. ఇప్పటి వరకూ మారుమూల ప్రాంతాల్లో మూడోకంటికి తెలియకుండా పేకాట ఆడడం తెలుసు. కానీ కార్లలో షి‘కారు’ చేస్తూ పేకాట ఆడడడం కొత్త విధానం. నగరశివారు ప్రాంతాలు, బీకేఎస్లే అడ్డా. జిల్లా కేంద్రంలో ఇలాంటి మొబైల్ కేంద్రాలు నడిపిస్తున్న వారు ఐదుగురు ఉన్నట్లు పోలీసు వర్గాలు చెప్తున్నాయి. నవోదయకాలనీ, బైపాస్ రోడ్డు లో ఉంటున్న మరో వ్యక్తి మొబైల్ వాహనాలకు నాయకత్వం వహిస్తున్నట్లు తెలి సింది. ఒక్కొక్కరి నుంచి రూ. 1500 చొప్పున వసూలు చేసి, ఇటు ధర్మవరం, అటు బళ్లారి వరకూ మొబైల్ వాహనాల్లో పేకాట ఆడిస్తున్నట్లు తెలుస్తోంది. పేకాట ఆడిస్తున్న వారిలో అధికారపార్టీకి చెందిన వారే అధికంగా ఉన్నట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఇటీవల విద్యార్థి విభాగం నాయకులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబట్టారు. అందులో చోటామోటా నేతలతో పాటు, వారి సానుభూతి పరులు ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో కొన్ని సందర్భాల్లో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నా ఎవరికీ తెలియకుండా వదిలేస్తున్నారన్న విమర్శలున్నాయి. చూసీ చూడనట్లు పోతున్న పోలీసులు ఈనెల 24న నగరంలోని కమలానగర్లో ఓ ఇంట్లో పేకాట నిర్వహిస్తుండగా వన్‌టౌన్ పోలీసులు దాడి చేశారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల్లో అధికార పార్టీకి చెందిన అనుబంధ టీఎన్ఎస్ఎఫ్ నేతలు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండా వారిని అరెస్టు చేసి, బెయిల్‌పై విడుదల చేశారు. గత నెలలో హౌసింగ్ బోర్డులో అర్ధరాత్రి పేకాట స్థావరంపై నిర్వహించిన పోలీసుల దాడుల్లో ఒకేసారి 30 మందికిపైగా పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 1.20 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పది రోజుల వ్యవధిలో నగరంలో నాలు గు పోలీస్ స్టేషన్ల పరిధిలో దాదాపు పది కేసులు నమోదు కాగా 50 మందికి పైగా నిందితులను అరెస్ట్ చేశారు. బీకేఎస్, శివారు ప్రాంతాల్లో యథేచ్ఛగా జూదం పేకాటకు నగర శివారు ప్రాంతాలు, బుక్కరాయసముద్రం మండలంలో పలు ప్రాంతాలను అడ్డాగా చేసుకున్నట్లు తెలుస్తోంది. సదరు మండలంలో జెడ్పీ ఉన్నతపాఠశాల పక్కన ఓ హోటల్లో పేకాట, మట్కా జోరుగా సాగుతోంది. మండలంలోని బీటర్లు అక్కడే మకాం వేస్తుంటారు. జిల్లా కేంద్రం నుంచి కూడా అక్కడికి వెళ్లి పేకాట ఆడుతున్న వారు చాలా మందే ఉన్నారు. అవసరమైతే రహస్య ప్రాంతానికి వెళతారు.. లేదంటే ఓ హోటల్లోనే నిర్వహిస్తారు. రూ. 10 వడ్డీతో డబ్బు పంపకాల్లో రెండ్రోజుల క్రితం భారీ గొడవ జరిగినా విషయం బయటకు పొక్కకుండా దాచారు. నగర శివారు ప్రాంతాల్లో జోరుగా పేకాట ఆడిస్తున్నారు. హెచ్చెల్సీ కాలువ వెంబడి పేకాట స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్లు తెలుస్తోంది. -
మత్తు చల్లి మాయ
♦ శ్రీరామపురంలో రూ.21 వేల దోపిడీ ♦ స్వాముల వేషదారణలో తతంగం వెంకటాచలం: ‘మీ ఇంట్లో పరిస్థితులు సరిగా లేవు. మీరు ఏం చేసినా కలిసి రావడంలేదు. గాలి(దెయ్యం) కారణంగా మీరు కష్టాలు అనుభవిస్తున్నారు. ఒక్క పూజ ద్వారా మీ ఇంట్లో పరిస్థితిని మార్చేస్తాం.’ అని అమాయకులను నమ్మించారు. స్వాముల ముసుగులో వచ్చిన ఇద్దరు పగటి వేషగాళ్లు అమాయకులపై మత్తు చల్లి రూ.21 వేలతో ఉడాయించారు. ఈ సంఘటన శ్రీరామపురంలో మంగళవారం చోటు చేసుకుంది. బాధితుల కథనం మేరకు వివరాలు.. శ్రీరామపురం హరిజనవాడకు చెందిన చెనగల రమణయ్య ఇంటికి ఇద్దరు స్వాములు వచ్చారు. రమణయ్య, అతని భార్య చెంగమ్మ అమాయకత్వాన్ని చూసి మీ ఇంటి పరిస్థితులు బాగాలేవని మాటల్లోకి దింపారు. మీ ఇంట్లో ఉన్న దెయ్యాన్ని బాబా పూజతో వదిలించేస్తామని నమ్మబలికారు. ఇంట్లో అరగంట పూజ చేస్తే దెయ్యం వదులుతుందని, డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు. మీకు తోచినంత బాబాకు ఇవ్వాలని చెప్పారు. రమణయ్య, చెంగమ్మ, చిన్న కుమారుడు మాధవ్ మాత్రమే ఇంట్లో ఉండాలని మిగిలిన వారిని బయటకు పంపేశారు. పసుపులో మత్తుమంది కలిపి ఆ పసుపులో అంక్షింతలు కాలిపారు. డబ్బులు దాచుకునేచోట అక్షింతలు చల్లాలని మాధవ్‌కు చెప్పడంతో మాధవ్ టేబుల్ డెస్కు తాళాలు తీసి అందులో ఉన్న రూ.21 వేల నగదుపై చల్లాడు. ఇంతలో మాదవ్ మత్తులోకి జారుకోవడంతో రూ.21వేలతో మోసగాళ్లు అక్కడ నుంచి పరారయ్యారు. దేవుని గదిలో ఉన్న రమణయ్య దంపతులు పూజ చేస్తామన్న వ్యక్తులు ఎలా వెళ్లారని వెతుకుతుండగా అప్పటికే గ్రామం దాటి వెళ్లి పోయారు. చిన్న కుమారుడు మాధవ్ పెళ్లి కోసం తెచ్చిన నగదు ఎత్తుకెళ్లడంతో రమణయ్య కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కే సు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ వెంకటేశ్వరరావు తెలిపారు. -
ఔనా.. అలా జరిగిందా?
పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు సాధారణమే. ఆడుతున్న వారిని పట్టుకుని వారి వద్ద ఉన్న నగదును స్వాధీనం చేసుకోవడం మామూలే. పట్టుబడ్డ వారిని కోర్టులో ప్రవేశపెట్టేలోపు దొరికిన సొమ్ములో కొంత పక్కదారిపడుతున్న విమర్శలు వింటున్నదే. ఈ తరహాలోనేగానీ... కాస్త అటు ఇటుగా... నీలకంఠాపురం పోలీసు స్టేషన్ పరిధిలోని మొండెంఖల్‌లో ఓ సంఘటన చోటు చేసుకుంది. దాడిలో పట్టుబడ్డ సొమ్ము పక్కదారి పట్టించే సందర్భంలో ఓ సీఐ కక్కుర్తి పడ్డారు. ఇప్పుడది పీకకు చుట్టుకుంది. సాక్షి ప్రతినిధి, విజయనగరం: కురుపాం మండలం నీలకంఠాపురం స్టేషన్ పరిధిలో గల మొండెంఖల్‌లో నెలరోజుల క్రితం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పేకాట ఆడుతున్న 12 మందిని పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ. 18వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో ప్రవేశపెట్టి, అపరాధ రుసుం విధించి వదిలేశారు. అక్కడితో ఆ చాప్టర్ ముగిసిపోయింది. కానీ దాడుల సమయంలో ఒక సంఘటన చోటు చేసుకుంది. పోలీసుల రాకను పసిగట్టిన పేకాట శిబిరంలోని ఒక వ్యాపారి తన వద్ద ఉన్న రూ.40 వేల నగదును పక్కనున్న ఖాళీ వాటర్ డ్రమ్‌లో పడేశారు. దీన్ని ఓ ముగ్గురు కానిస్టేబుళ్లు చూశారు. మామూలుగానే ఆ వ్యాపారితో కానిస్టేబుళ్లు సంప్రదింపులు చేసి, సెటిల్మెంట్ చేసుకుని కానిస్టేబుళ్లకు రూ. 10వేలు, వ్యాపారికి మిగతా రూ. 30వేలు వదిలేసినట్టు తెలిసింది. విషయం తెలుసుకున్న ఒక సీఐ రంగ ప్రవేశం చేసి, సదరు వ్యాపారికి ఫోన్ చేసి రూ. 30వేలు తెచ్చి ఇస్తావా? కటకటాల్లోకి తోసేయమంటావా అని గట్టిగా హెచ్చరించారు. భయపడిన ఆ వ్యాపారి తన స్నేహితుడి ద్వారా రూ. 30వేలు ఆయనకు ముట్టజెప్పారు. ఏఎస్పీ దృష్టికి వ్యవహారం వ్యవహారం వేగుల ద్వారా పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్ కౌశిల్ వద్దకు వెళ్లినట్టు తెలిసింది. తప్పుడు వ్యవహారాలపై రాజీ పడని ఆయన నేరుగా రూ. 30వేలు ముట్ట జెప్పిన వ్యాపారిని పిలిపించగా, ఆయన మొండెంఖల్ సర్పంచ్‌తో కలిసి వెళ్లారు. జరిగిన ఘటనపై ఏఎస్పీ ఆరాతీశారు. ఏం జరిగిందో చెప్పాలన్నారు. తొలుత వ్యాపారి తటపటాయిం చినా తరువాత పేకాట దాడుల సమయంలో చోటు చేసుకున్న సంఘట న, ఆ తర్వాత జరిగిన సీఐ నిర్వాకాన్ని వ్యాపారి వివరించినట్టు సమాచా రం. మళ్లీ ఆయన ఎక్కడ మాట మార్చకుండా జరిగినదంతా రాయించుకున్నట్టు తెలిసింది. అలాగే, వ్యాపారి ఎవరితోనైతే సీఐకి రూ. 30వేలు పంపించారో ఆ మధ్యవర్తిని కూడా ఏఎస్పీ విచారించినట్టు తెలిసింది. ఇదంతా చూస్తుంటే ఈ వ్యవహారంలో సంబంధంలో ఉన్న కానిస్టేబుళ్లతో పాటు సీఐపై చర్యలు తప్పేలా లేవని అన్పిస్తోంది. అయితే ఈ విషయమై పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్కౌశిల్ వద్ద సాక్షి ప్రస్తావించగా... అదేం లేదే అని దాటవేశారు. ఒకవేళ ఎదైనా జరిగితే తప్పకుండా చర్యలుంటాయని చెబుతూనే భవిష్యత్‌లో అంతా తెలుస్తుందని తేల్చారు. -
రెడ్ హ్యాండెడ్ గా దొరికిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే
పంజగుట్ట (హైదరాబాద్‌సిటీ): పేకాట ఆడుతున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే, మరో నలుగురిని సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.5.70 లక్షల నగదు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం టీడీపీ మాజీ ఎమ్మెల్యే వెంకట మధుసూదన్ రావు అలియాస్ నాని అతనితో పాటు మరో నలుగురు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న హోటల్ టూరిజం ప్లాజాలో బస చేశారు. రూం నంబర్ 508 లో మధుసూదన్‌తో పాటూ పలువురు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సెంట్రల్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడి నిర్వహించి వారిని పంజగుట్ట పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రమ్మీ... రమ్మటోందా?
శ్రీకాకుళం: ఈజీ మనీ... క్షణాల్లో లక్షాధికారుమైపోవాలనే ఆలోచన చాలా మంది జీవితాలను నాశనం చేస్తోంది. ఈ ఆలోచననే అదనుగా చేసుకుని ఊరిలో బెట్టింగ్ నుంచి ఆన్లైన్లో పేకాట వరకు అంతా మోసం చేయడానికి రెడీ అయిపోతున్నారు. యువత కూడా ఈజీగా వీరి ఉచ్చులో చిక్కుకుంటున్నారు. ఫేస్బుక్ తెరిస్తే చాలు ఊరూ పేరూ లేని వ్యక్తులు ‘మేం అంత గెలిచాం.. ఇంత గెలిచామంటూ’ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏదో వెబ్సైట్ బ్రౌజ్ చేద్దామన్న రమ్మీ అంటూ రమ్మంటూ ప్రకటనలు కనిపిస్తున్నాయి. క్షణాల్లో డబ్బులు సంపాదించాలనే యా వతో జిల్లాలోనూ చాలా మందికి వీటికి అలవాటు పడుతున్నారు. ఫలితంగా ఉన్న డబ్బులు క్షవరం చేయించుకుని మోసపోతున్నారు. బంగారు ఆభరణాలతోపాటు విలువైన వస్తువులను తనఖా పెట్టి మరీ జూదమాడి కుదేలవుతున్నారు. క్రికెట్ బెట్టింగ్ కూడా ఇలాగే తయారైంది. చాలా మంది పాకెట్ మనీగా ఇళ్లల్లో ఇచ్చింది ఇలాంటి బెట్టింగులపై పెట్టి డబ్బులు పోగొట్టుకుంటున్నారు. బైకులు, సెల్ఫోన్లు వంటి ఖరీదైన వస్తువులను అమ్మి జూదం, బెట్టింగ్‌లకు పెడుతున్న వారూ ఉన్నారు. ఇటీవలి కాలంలో పోలీసులకు చిక్కిన నేరస్తుల్లో ఎక్కువమంది యువకులే కావడం, వీరంతా బెట్టింగ్, జూదంలోనే పట్టుబడుతుండడమే దీనికి నిదర్శనం. బెట్టింగు నిర్వహిస్తున్న వారు అన్ని వర్గాల అధికారులను తమ దారిలోకి తెచ్చుకునేందుకు నెలనెలా లక్షల రూపాయలు ఇస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఆన్లైన్ జూదాన్ని అదుపులోకి ఎలా తేవాలన్నది ఎవరికీ తెలి యడం లేదు. అలాగే జిల్లా వ్యాప్తంగా 15 నుంచి 20 వరకు జూదశాలలు నడుస్తున్నట్లు అనధికారిక లెక్క ప్రకారం తెలుస్తోంది. వీటిలో కొన్ని ప్రజాప్రతినిధులు, కొందరి అధికారుల కనుసన్నల్లో నడుస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి వాటిని తక్షణంఅరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
పేకాట స్థావరంపై ఎస్వోటీ దాడి
హైదరాబాద్: సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని హుడా కాంప్లెక్స్ ఆదిత్య అపార్టుమెంట్‌లోని ఓ ప్లాట్‌పై ఎస్వోటీ పోలీసులు బుధవారం సాయంత్రం దాడి చేశారు. ఈ సందర్భంగా గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఐదుగురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.3,770తోపాటు ఐదు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి సరూర్‌నగర్ పోలీసులకు అప్పగించారు.