కడప అర్బన్ : జిల్లాలోని కడప నగరం, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, రాయచోటి, పులివెందుల, రైల్వేకోడూరు, బద్వేలు, రాజంపేట పట్టణాలలో, వాటి పరిసర ప్రాంతాల్లో అసాంఘిక నేరాలు విస్తరించాయి. క్రికెట్ బెట్టింగ్ నిర్వాహకులు ప్రొద్దుటూరు, కడప నగరాలకు చెందిన వారు విజయవాడ, హైదరాబాద్, చెన్నై, గుంటూరు, బెంగుళూరు నగరాలలో ఉంటూ మొబైల్ ఫోన్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. టెస్ట్ మ్యాచ్‌లు, ట్వంటీ-20, వన్డే మ్యాచ్‌లు ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంటే ప్రతి మ్యాచ్‌ను ఫాలో అవుతూ బెట్టింగ్ నిర్వహించడం గమనార్హం. మట్కా మూడు పువ్వులు ఆరు కాయలుగా విస్తరిస్తోంది.
కడప నగరంలోని తాలూకా, టు టౌన్, చిన్నచౌక్, చింతకొమ్మదిన్నె ప్రాంతాల్లో మట్కా ముమ్మరంగా జరుగుతోంది. అదేవిధంగా జిల్లాలో రాజంపేట, రాయచోటి, జమ్మలమడుగు, పులివెందుల పట్టణాలలో మట్కా జోరుగా జరుగుతోంది. నిర్వాహకుల్లో కొంతమంది స్థానికంగా బీటర్లను ఉంచి వారి ద్వారా మట్కా స్లిప్పులను తయారు చేయించి ఎప్పటికప్పుడు మొబైల్ ద్వారా తాడిపత్రి కేంద్రంగా మట్కా నిర్వహిస్తున్నారు.
మట్కా నిర్వహణలో కొందరు పోలీసు అధికారులు, సిబ్బంది, అధికార పార్టీకి చెందిన నేతల హస్తం ఉంద నే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలోని పలు పట్టణాల్లో ప్రత్యేకంగా స్థావరాలను ఏర్పాటు చేసుకొని గ్యాంబ్లింగ్ నిర్వహిస్తున్నారు. అసాంఘిక నేరాల అదుపు కోసం పోలీసులు ఇప్పటి నుంచైనా గట్టి ని ఘాతో పనిచేసి అదుపు చేసేం దుకు కృషి చేస్తే సామాన్య, మధ్య తరగతి కుటుంబాలలో వెలుగులు నింపిన వారవుతారు.
పేట్రేగిపోతున్న.. నేరాలు
Published Tue, Jul 22 2014 4:48 AM | Last Updated on Sat, Sep 2 2017 10:39 AM
Advertisement
Advertisement