jammalamadugu
-
పూలగుచ్ఛం అడ్డుపెట్టి.. కూటమి సర్కార్ నీచ రాజకీయం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులకు అవమానం జరిగింది. ఫ్లెక్సీపై ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఫోటోలు వేశారు. అయితే వారి ఫొటోలు కనిపించకుండా ముఖాలపై కూటమి నేతలు పూల గుచ్చం అడ్డుగా పెట్టారు. టీడీపి, బీజేపీ నేతల ఫోటోలు మాత్రమే కనిపించేలా డెకరేషన్లో ఎత్తుగడ వేశారు.జమ్మలమడుగులో మహిళా సంఘాలతో కేంద్రమంత్రి భేటీకాగా, కార్యక్రమంలో ఎంపీ, ఎమ్మెల్సీలను ప్రభుత్వ అధికారులు అవమానించారు. ప్రభుత్వ కార్యక్రమంలో ప్రోటోకాల్ ఉల్లంఘించడంపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక కార్యక్రమం కావడంతో ఫ్లెక్సీలపై ఎంపీ, ఎమ్మెల్సీ ఫొటోలు వేయక తప్పని పరిస్థితి. పూలగుచ్ఛం అడ్డుపెట్టి పట్టి కూటమి ప్రభుత్వం నీచ రాజకీయానికి ఒడిగట్టింది. జిల్లా అధికారుల తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇదీ చదవండి: బీజేపీ నేతలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు -
కొత్త సంవత్సర వేడుకలకు వస్తూ ప్రమాదం.. ముగ్గురు మృతి
జమ్మలమడుగు: ఏడాది చివరి రోజే వారి జీవితానికి ఆఖరు రోజు అవుతుందని అనుకోలేదు. అతివేగం వారి ప్రాణాలను హరించింది. సంఘటన స్థలంలోనే ఒకరు మరణించగా మరొకరు ఇద్దరు ప్రభుత్వాసుపత్రిలో మరణించారు. ఇంకొకరి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు ఇలా..పులివెందుల నియోజకవర్గంలోని వే ముల, లింగాల, పులివెందుల ప్రాంతాల కు చెందిన ఏడుగురు స్నేహితులు జనవరి వేడుకలను నిర్వహించుకునేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు పులివెందుల నుంచి బయలు దేరారు. వీరిలో లింగా ల మండలం పెద్దకుడాల గ్రామానికి చెందిన అబ్దుల్, వేముల మండలం భూమ య్యగారిపల్లికి చెందిన నందీష్, పులివెందులకు చెందిన జగన్, షాహుల్, సింహాద్రిపురం అగ్రహారానికి చెందిన చైతన్య, షాజహాన్, ప్రేమ్ ఉన్నారు. ముద్దనూరు కొండ దిగిన తర్వాత చిటిమిటి చింతల గ్రామానికి సమీపంలో ఉన్న దర్గా మలుపు వద్దకు రాగానే వేగంగా వస్తున్న స్కార్పియోను అదుపు చేయలేక రోడ్డు పక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొన్నారు. వేముల మండలం భూమయ్యగారిపల్లి గ్రామానికి చెందిన నందీష్(21) అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న లింగాల మండలం పెద్ద కుడాల గ్రామానికి చెందిన అబ్దుల్(25)ను జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తీసుకు రాగా చికిత్స పొందుతూ మరణించాడు. పులివెందులకు చెందిన జగన్ పరిస్థితి విషమించడంతో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు ఉదయం ఆసుపత్రిలో చిక్సిత పొందుతూ జగన్ మృతి చెందాడు . చైతన్య, షాజహాన్, ప్రేమ్, షాహుల్ జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అర్బన్ పోలీసులు కేసు నమో దు చేసుకుని విచారణ చేస్తున్నారు. -
కమీషన్ ఇవ్వకపోతే పింఛన్ తీసేస్తాం.. వృద్ధుల పింఛన్లపై కక్కుర్తి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఏపీలో వాలంటీర్ వ్యవస్థ లేకపోవడంతో ఉద్యోగులు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వృద్దుల పెన్షన్లపై కూడా కమీషన్లకు కక్కుర్తి పడుతున్నారు. ఒక్కో పెన్షన్ నుంచి రూ.300 వసూళ్లు చేస్తున్నారు. జమ్మలమడుగు 16వ వార్డులో సచివాలయం సిబ్బంది చేతివాటం బయటపడింది. కమీషన్ ఇవ్వకపోతే పెన్షన్ తీసేస్తామని బెదిరింపులకు దిగుతున్నారు. లంచం ఎందుకివ్వాలంటూ పింఛన్‌దారులు ప్రశ్నించినా కూడా సిబ్బంది బలవంతంగా వసూలు చేస్తున్నారు. వ్యవస్థను దారుణంగా దెబ్బ తీసి లంచాలంటూ పెన్షన్ దారులకు ఇబ్బందులకు గురిచేస్తున్నారు.కాగా, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే 50 ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలలో అర్హతున్న వారందరికీ వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేస్తామని టీడీపీ అధినేత చంద్రబాబు వాగ్దానం చేసిన సంగతి తెలిసిందే. కూటమి మేనిఫెస్టోలోనూ పొందుపరిచారు. అయితే కూటమి అధికారం చేపట్టి ఆరునెలలైనా ఇప్పటివరకు ఒక్క పింఛన్‌ను కూడా చంద్రబాబు సర్కారు మంజూరు చేయలేదు. పైగా అనర్హత పేరుతో ఉన్న పింఛన్లకు కోత విధిస్తోంది. ఫలితంగా పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆశ పడి భంగపడ్డామని విలపిస్తున్నారు.ఇదీ చదవండి: రెండెకరాల బాబూ.. వెయ్యి కోట్లు ఎలా సంపాదించావు?అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త పింఛన్లు ఇవ్వకపోగా ఉన్న పింఛన్లకు కూటమి సర్కారు మంగళం పాడుతోంది. అనర్హుల ఏరివేత పేరిట టీడీపీకి ఓటేయని వారందరినీ నాయకులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఏకంగా గత టీడీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన సామాజిక పెన్షన్లకూ నోటీసులు జారీ చేసి అర్హత నిరూపించుకోవాలని, లేకపోతే అనర్హులుగా ప్రకటిస్తామని రీవెరిఫికేషన్ పేరిట ఎంపీడీఓలతో నోటీసులిప్పిస్తున్నారు. -
జమ్మలమడుగులో టెన్షన్ టెన్షన్
-
రెచ్చిపోయిన పచ్చ మూక.. మాటువేసి వైఎస్సార్సీపీ కార్యకర్తపై దాడి
సాక్షి, వైఎస్సార్: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్ చేస్తూ దాడులకు పాల్పడుతున్నారు. ఇక, తాజాగా జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై దాడి చేశారు.అయితే, జమ్మలమడుగు మండల పరిధిలోని పెద్ద దండ్లూరుకు చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త హనుమంతు రెడ్డిపై 2018లో కొందరు టీడీపీ నేతలు దాడి చేశారు. దీంతో, ఈ దాడిపై పోలీసులు కేసు నమోదు చేయడంతో కోర్టులో విచారణ జరుగుతోంది. విచారణలో భాగంగా హనుమంతు రెడ్డి ఈరోజు జమ్మలమడుగు వచ్చాడు.ఈ నేపథ్యంలో ఈ కేసులో రాజీపడాలని హనుమంతుపై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చారు. హనుమంతు మాత్రం ఒప్పుకోకపోవడంతో ఆయన ఇంటికి వెళ్తుండగా మాటు వేసి మార్గమధ్యంలో టీడీపీ నేతలకు దాడులకు తెగబడ్డారు. పచ్చ మూక దాడిలో హనుమంతుకు తీవ్ర గాయాలు కావడంతో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే ఆదిమూలం కేసులో నాటకీయ పరిణామాలు.. -
గణేష్ మండపంలో దొంగ
-
జమ్మలమడుగు ఎమ్మెల్యేపై రాళ్ల దాడి
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఎన్డీఏ కూటమి అభ్యర్థి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో సోమవారం సాయంత్రం 6 గంటలు దాటాక నవాజ్ కట్ట సమీపంలోని 116, 117 పోలింగ్ బూత్‌లలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. అధికారులు వారికి స్లిప్పులు ఇచ్చి పోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదినారాయణరెడ్డి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. దీంతో డీఎస్పీ వైఎస్సార్సీపీ కార్యకర్తలపై లాఠీచార్జి చేశారు. ఇదే అదనుగా భావించిన ఆది, భూపేష్ వర్గీయులు రాళ్లతో దాడులు చేయించారు. ఈ దాడుల్లో ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి తలపై గాయమైంది. దీంతో వైఎస్సార్సీపీ నాయకులు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని కాపాడుకునేందుకు ఎదురు దాడి చేశారు. సుధీర్‌రెడ్డిపై రాళ్ల దాడి జరిగిందన్న విషయం తెలుసుకున్న పట్టణంలోని నాయకులు, కార్యకర్తలు భారీగా ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకున్నారు. పార్టీ సీనియర్ నాయకుడు హృషి కేశవరెడ్డి ఎమ్మెల్యేను పరామర్శించటానికి వెళుతున్న సమయంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న టీడీపీ కార్యాలయం వద్ద గూమిగూడి ఉన్న కార్యకర్తలు రాళ్లతో దాడులు చేశారు. ఈ దాడిలో కారు అద్దాలు పూర్తిగా ధ్వంసమయ్యాయి. మైలవరం మండలం చేరెడ్డి చెన్నకేశవరెడ్డికి చెందిన కారును ఎ.కంబాలదిన్నె గ్రామానికి చెందిన టీడీపీ, బీజేపీ కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిపై ఆదినారాయణరెడ్డి వర్గీయులు దాడి చేయగా.. ఎమ్మెల్యేకు బలమైన గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న పోలీసులు వెంకటేశ్వర కాలనీ వద్ద గల 116, 117 బూత్‌ల వద్దకు బలగాలను మోహరించారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలంతా ఎమ్మెల్యే కార్యాలయానికి భారీగా చేరుకున్నారు. ముద్దనూరు మండలం నుంచి మేనమామ అయిన మునిరాజారెడ్డి తన అనుచరులతో జమ్మలమడుగుకు చేరుకున్నారు. భారీగా కార్యకర్తలు వస్తుండటంతో టీఎన్ఆర్ థియేటర్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. -
డామిట్.. కథ అడ్డం తిరిగింది!
సాక్షి ప్రతినిధి, కడప: ఎంతటి సమావేశమైనా సరే, ఆయన వచ్చేంతవరకూ వేచి ఉండాల్సిందే. కుటుంబ సభ్యులకైనా, అనుచరులకైనా, సన్నిహితులైనా ఎవరికైనా సరే, ఆయన చెప్పిందే వేదం, సూచించిందే ఫైనల్. మరీ ముఖ్యంగా బాబాయ్ మాట కోసం అబ్బాయ్‌కి ఎదురుచూపులు ఉండేవి. ఇదంతా గతం. ప్రస్తుతం కథ అడ్డం తిరిగింది. అబ్బాయ్ లేనిదే బాబాయ్ బయటికెళ్లలేని దుస్థితి ఎదురవు తోంది. ‘అహం బ్రహ్మస్మీ’ అన్నట్లుగా వ్యవహారం తల్లకిందులయ్యింది. నా అనుకున్న వారంతా ఛీదరించుకునే పరిస్థితి ఉత్పన్నమైంది. అబ్బాయ్ కోసం బాబాయ్ వెయిట్ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఈమొత్తం వ్యవహారం జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థి చదిపిరాళ్ల ఆదినారాయణరెడ్డికి వర్తించనుంది. ‘ఆది మాట తప్పడు, మడమ తిప్పడు’ అనే నినాదంతో ఆదినారాయణరెడ్డి రాజకీయ ఆరంగ్రేటం చేశారు. అనతికాలంలోనే అవకాశవాదికి నిదర్శనం ‘ఆది’ అని ఆయన చర్యలు రుజువు చేశాయి. 2004లో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చలువ నీడలో ఎదిగిన ఆది తక్కువ కాలంలోనే సహజ సిద్ధమైన ప్రవర్తన బహిర్గతమవుతూ వచ్చింది. అప్పట్లో జిల్లాలోని నాయకులంతా వైఎస్ కుటుంబానికి అండగా పదవులు త్యజించేందుకు సిద్ధం అయ్యారు. అప్పటి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా నిలిచారు. ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులుపై అనర్హత వేటు పడింది. కానీ అప్పట్లో ‘అసెంబ్లీలో కిరణ్...బయట జగన్’ అంటూ ఆదినారాయణరెడ్డి కొత్త పల్లవి అందుకున్నారు. అధికారాన్ని కోల్పోయేందుకు ఇష్టపడని ఆయన వైఎస్ కుటుంబానికి అండగా నిలువలేకపోయారు. కానీ వైఎస్ కుటుంబం అండ లేకపోతే, గెలిచే పరిస్థితి లేదని 2014లో మళ్లీ వైఎస్సార్సీపీ అభ్యర్థిత్వం స్వీకరించి జమ్మలమడుగు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. కానీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావడంతో ఆ పారీ్టలో చేరి ..మంత్రి పదవి దక్కించుకున్నారు. అంతటితో ఆగకుండా వైఎస్ కుటుంబంపై ఇష్టమొచ్చినట్లు దుర్భాషలాడారు. తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టాలన్నారు. ఫలితంగా తర్వాత జరిగిన ప్రజాతీర్పులో ఆదినారాయణరెడ్డి కొట్టుకుపోయారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. కుటుంబంలోనూ ఏకాకిగా... కుటుంబంలో ఎప్పుడూ పైచేయిగా నిలిచే ఆదినారాయణరెడ్డి తాజా రాజకీయ పరిణామాల నేపధ్యంలో ఏకాకిగా మిగిలారు. విభజించు, పాలించు అన్న ధోరణిని వంటబట్టించుకున్న ఆయన దేవగుడి కుటుంబంలో అన్న కుమారుడు భూపేష్‌రెడ్డి రాజకీయ వారసత్వానికి బ్రేకులు వేశారు. మరో సోదరుల తనయులు గోవర్ధన్‌రెడ్డి, రాజే‹Ùరెడ్డిలను చేరదీశారు. ఒక్కమాటలో చెప్పాలంటే భూపేష్ రెడ్డికు ప్రత్యామ్నాయంగా తయారు చేశారు. ‘టీడీపీ ఇన్ఛార్జిగా తీసుకోవడం కాదు, టికెట్ తెచ్చుకోవడం గొప్ప. బీజేపీతో టీడీపీ పొత్తు పెట్టుకుంటుంది, బీజేపీ టికెట్ తనకే ఇస్తుందని’ ఏడాదికి ముందు నుంచే ఆదినారాయణరెడ్డి సన్నిహితులతో చెప్పుకుంటూ వచ్చారు. అచ్చం అదే తీరులో పొత్తు పొడవడం, ఆదికి బీజేపీ టికెట్ దక్కడం క్రమంగా తెరపైకి వచ్చాయి. అప్పటి వరకూ రాజకీయంగా బలోపేత చర్యలు చేపట్టిన భూపేష్ నిర్ఘాంతపోయారు. జమ్మలమడుగులో సీన్ రివర్స్ఆదికి బీజేపీ టికెట్ ప్రకటించిన తర్వాత నాలుగు రోజులైనా స్వగ్రామంలో అడుగు పెట్టని పరిస్థితి తలెత్తింది. కుటుంబం యావత్తు భూపేష్‌కు అండగా నిలిచింది. స్వతంత్ర అభ్యరి్థగా రంగప్రవేశం చేయాలనే ఆలోచనకు వచ్చినట్లు సమాచారం. ఈ పరిస్థితిని పసిగట్టిన ఆది కొంత ఓపిక పట్టారు. భూపే‹Ùకు టీడీపీ పార్లమెంటు టికెట్ అప్పగించేంత వరకూ వేచి ఉండి తర్వాత అడుగుపెట్టారు. ఇక తామంతా ఒక్కటేనంటూ చెప్పుకోవాల్సిన దుస్థితి ఆదినారాయణరెడ్డి వచ్చి చేరింది.జమ్మలమడుగు పర్యటనల్లో భూపేష్ కోసం ఆదినారాయణరెడ్డి ఎదురు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంతకు మనకు అండగా ఉంటున్నాడా? లేదా? అని సన్నిహితులతో క్రాస్ చెక్ చేసుకోవాల్సిన దౌర్భాగ్యం నెలకొంది. మరోవైపు గ్రామస్థాయి నాయకులు బీజేపీ అభ్యర్థి ఆదినారాయణరెడ్డిని విశ్వసించే పరిస్థితి లేదు. సన్నిహితులే కాదు, సమీప బంధువులు సైతం దూరమవుతున్నారు. ఈక్రమంలోనే జమ్మలమడుగుకు మాజీ మున్సిపల్ చైర్మన్ తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి సైతం వైఎస్సార్సీపీలో చేరిపోయారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆది పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారయ్యిందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. అడుగడుగునా అవకాశవాదం తెరపైకి వస్తుండడమే ఇలాంటి దుస్థితికి కారణమని పలువురు చెప్పుకుంటున్నారు. -
జమ్మలమడుగులో మారుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జమ్మలమడుగులో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. జమ్మలమడుగు బీజేపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డిని ప్రకటించగా, బీజేపీ ఒప్పుకుంటే జమ్మలమడుగులో పోటీకి సిద్ధమని భూపేష్‌రెడ్డి అంటున్నారు. బీజేపీ నుంచి కడప ఎంపీ అభ్యర్థిగా ఆదినారాయణరెడ్డి పేరును బీజేపీ అధిష్టానం పరిశీలన చేస్తోంది. పార్టీ అధిష్టానంతో ఇప్పటికే ఆదినారాయణ చర్చలు జరిపారు. జమ్మలమడుగు సీటును వదులుకుంటే టీడీపీకి మరో సీటు పెరగనుంది. ఇదీ జరిగింది.. కాగా, కడప పార్లమెంట్ బలిపీఠం ఎక్కించేందుకు టీడీపీ నానా హైరానా పడింది. అభ్యర్థి ఎంపికకు పలు రకాలుగా కసరత్తు చేసింది. క్రమం తప్పకుండా ఐవీఆర్ఎస్ ఫోన్ సర్వేలు నిర్వహిస్తూ రోజుకొక పేరు తెరపైకి తెచ్చింది. ఎట్టకేలకు జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి భూపేష్‌రెడ్డి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసింది. అసెంబ్లీ టికెట్ ఆశించిన భూపేష్‌ను ఏకంగా ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనుక కుయుక్తుల మంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది. అభ్యర్థి ఎవరైనా సరే, ఓటమి ఎదుర్కోవాల్సిన సీటుకు భూపేష్‌ను ఎంపిక చేయడం వెనుక ఆదినారాయణరెడ్డి తెరవెనుక వ్యూహం పన్నినట్లు సమాచారం. ఇదీ చదవండి: నాడు తండ్రి.. నేడు తనయుడికి ‘ఆది’పోటు -
కుటుంబ సభ్యుల నుంచే విమర్శలు.. ఆదినారాయణరెడ్డి భవితవ్యం ఏంటి?
ఏపీలో విపక్షాల మధ్య పొత్తుల వ్యవహారం కొంత మంది నేతల్ని అయోమయానికి గురి చేస్తోంది. ఎంపీగా పోటీ చేయాలా.. లేక ఎమ్మెల్యేగా పోటీ చేయాలా.. అసలు తన సీటు తనకు దక్కుతుందా అనే అనుమానాలు టీడీపీలో వ్యక్తం అవుతున్నాయి. అక్కడక్కడా టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి కాషాయ దళంలో చేరిన నేతలు కూడా తమకు అవకాశం వస్తుందా? రాదా? అన్న సందేహాలతో విలవిల్లాడుతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో ఈ పరిస్థితి మరీ ఎక్కువగా కనిపిస్తోంది. ఆ జిల్లాలో విపక్షాల పరిస్థితి ఎలా ఉంది? ఉమ్మడి కడప జిల్లాకు చెందిన బీజేపీ నేత, మాజీ మంత్రి అదినారాయణరెడ్డి రాజకీయ భవితవ్యం అయనకే అర్థం కావడంలేదు. పైగా ఆయన చేస్తున్న వ్యాఖ్యలు మరి కొంత మంది నేతలను గందరగోళంలోకి నెడుతున్నాయి. ఇందుకు కారణం టీడీపీ, జనసేన పార్టీలు బీజేపీతో పొత్తుల వ్యవహారమే కారణం అంటున్నారు. మూడు పార్టీల మధ్య పొత్తుల వ్యవహారంపై ఎంతకీ క్లారిటీ రావడం లేదు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయకపోతే రాజకీయంగా కనుమరుగు అవుతామనే అభద్రతాభావం ఆదినారాయణరెడ్డిని వెంటాడుతోంది. ఎన్నికల పొత్తు సాకుతో జమ్మలమడుగు నుంచి పోటీ చేస్తానంటూనే, బీజేపీ ఆదేశిస్తే ప్రొద్దుటూరు అసెంబ్లీ లేదా కడప పార్లమెంట్ సీటుకు అయినా పోటీ చేస్తానని ఆయన ఇటీవల ప్రకటించారు. ఈ ప్రకటనతో ఆదినారాయణ రెండు నియోజవర్గాల టీడీపీ నేతల కంట్లో నలుసులా తయారయ్యారు. గతంలో పొత్తు ఉన్నా లేకున్నా టీడీపీ టికెట్ ఖరారైందంటూ ఆది చేసిన ప్రచారం ఇతర నేతల్లో గుబులు రేపింది. ఆదినారాయణరెడ్డి చేసిన ప్రకటన ఆయన సొంత కుటుంబంలోనే అలజడి రేపుతోంది. అన్న కుమారుడు భూపేష్ రెడ్డి తన రాజకీయ వారసుడు అంటూ 2009 ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి ప్రకటించారు. అయితే ఇప్పుడు ఆయనే సైంధవుడిలా భూపేష్‌రెడ్డిని అడ్డుకుంటున్నారని కుటుంబ సభ్యులనుంచే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆదినారాయణ అన్న మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి పోటీ చేసి గతంలో ఓటమిపాలయ్యారు. తీరా 2004లో దివంగత మహానేత వైఎస్ఆర్ గాలి వీస్తున్న సమయంలో ఆది అడ్డు తగిలి అన్న బదులుగా తను పోటీ చేసి గెలుపొందారు. మళ్లీ ఇప్పుడు అయన తనయుడు విషమయంలోను అదే చేస్తున్నాడంటూ కుటుంబం నుంచి విమర్శలు ఎదుర్కొంటున్నారు. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయిన వెంటనే బీజేపీలో చేరిపోయారు. ఇక తనకు బాబాయ్ అడ్డు ఉండదని భావించిన భూపేష్‌రెడ్డి ఏడాది క్రితం జమ్మలమడుగు టీడీపీ ఇన్చార్జి బాధ్యతలను తీసుకున్నారు. ఇంతలో జమ్మలమడుగు స్థానం బీజేపీకి కేటాయించాలంటూ ఆదినారాయణ ప్రయత్నాలు ప్రారంభించారు. ఆది చర్యలు దేవగుడి కుటుంబంలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. భూపేష్ నాయకత్వాన్ని కాపాడుకునే ప్రయత్నంలో మెజార్టీ కుటుంబ సభ్యులు ఆయనకు మద్దతుగా నిలుస్తున్నారు. కుటుంబం నుంచి ఎదురవుతున్న వ్యతిరేకతను అంచనా వేసిన ఆది ప్రొద్దుటూరులో అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారనే ప్రచారం సాగుతోంది. ఆదినారాయణరెడ్డి జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరుకు మారతారనే ప్రచారం అక్కడ టిక్కెట్లు ఆశిస్తున్నవారిలో టెన్సన్ పెంచుతోంది.ప్రొ ద్దుటూరు టీడీపీటికెట్ కోసం నలుగురు పోటీ పడుతున్నారు. ఇన్చార్జి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు వరదరాజులరెడ్డి, లింగారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి సురేష్‌నాయుడు సీటు ఆశిస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆ సీటుపై బీజేపీ నేత ఆదినారాయణరెడ్డి కన్ను పడింది. ఇక్కడ టికెట్ కోసం నలుగురు పోట్లాడుకోవడం సాకుగా చూపించి..పొత్తులో భాగంగా బీజేపీకి ప్రొద్దుటూరు సీటు కేటాయించాలనే దిశగా ఆదినారాయణరెడ్డి ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఎత్తుగడలు వేయడంలో దిట్టగా పేరున్న ఆదినారాయణరెడ్డి కుయుక్తులు కలిసి వస్తాయో...లేక బెడిసి కొడతాయో వేచిచూడాల్సిందే.. -
వైఎస్సార్ సీపీనేత మునిరాజారెడ్డి వర్గీయులపై టిడిపి రాళ్లదాడి
-
ఆదినారాయణకు మంత్రి పదవి ఆశచూపించి టీడీపీలోకి లాక్కున్న చంద్రబాబు
-
జమ్మలమడుగు చంద్రబాబు రోడ్ షోలో అగ్ని ప్రమాదం
-
విషాదం.. స్కూల్ బస్సు కిందపడి ఒకరు.. ఆర్టీసీ బస్సు ఢీకొని మరో చిన్నారి
సాక్షి, తూర్పుగోదావరి: బైక్‌ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో ఆరేళ్ల చిన్నారి మృతి చెందిన ఘటన రాజమహేంద్రవరంలో చోటుచేసుకుంది. ఒకటో తరగతి చదువుతున్న ఈశ్వర్(6) తన తండ్రితో కలిసి బైక్‌పై స్కూల్‌కు వెళ్తున్నారు. ఈ క్రమంలో ఆల్కాట్ తోట సమీపంలోని ఐఓసి వద్ద రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన ఆర్టీసీ బస్సు వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బాలుడు బస్సు కిందపడి అక్కడికక్కడే మరణించాడు. బైక్ నుంచి పక్కకు పడిన బాలుడి తండ్రికి గాయాలయ్యాయి. దీంతో ఆగ్రహం చెందిన మృతుని బంధువులు రాళ్లతో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వైఎస్సార్ కడప: జిల్లాలోని జమ్మలమడుగులో విషాదం చోటుచేసుకుంది. ప్రైవేటు స్కూల్ బస్సు కింద పడి నాలుగేళ్ల చిన్నారి మృతి చెందింది. ఇంట్లో నుంచి చిన్నారి సఫినా స్కూల్ బస్సులో పాఠశాలకు బయల్దేరింది. అయితే పాఠశాలకు చేరుకున్నాక బస్సు దిగుతుండగా కాలు జారి కిందపడిపోయింది. ఈ విషయాన్ని గమనించని డ్రైవర్ బస్సును ముందుకు వెళ్లనివ్వడంతో చిన్నారి అక్కడికక్కడే మరణించింది. సమాచారం అందుకున్న పోలీసులు ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రస్తుతం బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కూతురు మరణంతో తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. చదవండి: మాజీ ఐఆర్ఎస్ అధికారి ఇంట్లో చోరీ వెనుక భారీ కుట్ర -
సీఎమ్ రమేష్ ఆదినారాయణరెడ్డి.. సీబీఐ విచారణను పక్కదారి పట్టిస్తున్నారు : సుధీర్ రెడ్డి
-
వైఎస్సార్: సొంత జిల్లాలో సీఎం జగన్ పర్యటన (ఫొటోలు)
-
సీఎం జగన్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పిన సజ్జన్ జిందాల్
-
75 శాతం ఉద్యోగాలు స్థానికులకే: సీఎం వైఎస్ జగన్
-
వైఎస్సార్ జిల్లాలో ముగిసిన సీఎం జగన్ పర్యటన
Updates: ► ముగిసిన సీఎం జగన్, వైఎస్సార్ జిల్లా పర్యటన. కడప ఎయిర్పోర్ట్ నుంచి గన్నవరం, ఆపై గన్నవరం నుంచి తాడేపల్లి నివాసానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్. ► పులివెందుల మండలం నల్లపురెడ్డి గ్రామానికి చెందిన వైఎస్సార్ సీపీ నేత బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్‌కు సీఎం జగన్ అతిథిగా హాజరయ్యారు. దేవుడి దయతో మనకు మంచి రోజులు: సీఎం జగన్ దేవుడి దయతో వైఎస్సార్ జిల్లాలో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఎన్నికల కోడ్ ఉన్నందున ఎక్కువ మందిని పిలవలేకపోయామన్నారు. ఎప్పట్నుంచో కలలుగన్న స్వప్నం ఈ స్టీల్‌ప్లాంట్. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలని వైఎస్సార్ కలలుగన్నారు. వైఎస్సార్ మరణంతో ఈ ప్రాంతాన్ని ఎవరూ పట్టించుకోలేదని సీఎం అన్నారు. ‘‘రూ.8,800 కోట్లతో 3 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తి అవుతుంది. స్టీల్ ప్లాంట్ ఏర్పాటుతో జిల్లా మరింత అభివృద్ధి చెందుతుంది. ఈ ప్లాంట్ రావడం కోసం కష్టాపడాల్సి వచ్చింది. అయినప్పటికీ దేవుడి దయతో మనకు మంచి రోజులు వచ్చాయి. స్టీల్ ప్లాంట్‌వస్తే ఈ ప్రాంతం స్టీల్ సిటీ తరహాలో అభివృద్ధి చెందుతుంది. గండికోట రిజర్వాయర్ నుంచి ప్రత్యేక పైపులైన్ ద్వారా నీటి సరఫరా అవుతుంది. తొలి విడతలో రూ. 3,300 కోట్లతో ఏటా 10 లక్షల టన్నుల ఉక్కు ఉత్పత్తి అవుతుంది’’ అని సీఎం జగన్ అన్నారు. వైఎస్సార్ చూపిన బాటలో సీఎం జగన్: సజ్జన్ జిందాల్ మహానేత వైఎస్సార్ తనకు మంచి మిత్రులు, గురువు అని సజ్జన్ జిందాల్ అన్నారు. ఏపీకి సంబంధించి వైఎస్సార్ ఎన్నో విషయాలు చెప్పారన్నారు. సీఎం జగన్‌తో చాలా కాలం నుంచి పరిచయం ఉంది. వైఎస్సార్ చూపిన బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారని సజ్జన్ జిందాల్ అన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారు: మంత్రి అమర్నాథ్ స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కొందరు అడ్డంకులు సృష్టించారని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధిపై కొందరు కుయుక్తులు పన్నారన్నారు. వైఎస్సార్ కన్న కలను సీఎం జగన్ నెరవేర్చారని, వైఎస్సార్ జిల్లా కూడా ఉక్కు నగరంగా మారబోతుందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ప్రజల కల సాకారం.. గర్వంగా ఉంది: ఎంపీ అవినాష్‌రెడ్డి.. రాయలసీమ ప్రజల కల సాకారమవుతోందని ఎంపీ అవినాష్‌రెడ్డి అన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను జగనన్న ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుందన్నారు. వేల మందికి ఉపాధి దొరుకుతుండటం గర్వంగా ఉందన్నారు. స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుతో యువతకు ఉద్యోగ అవకాశాలు కలుగనుందని, స్టీల్ ప్లాంట్ ద్వారా జిల్లా ముఖచిత్రం మారబోతుందని అవినాష్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినం: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలోనే ఈ రోజు శుభదినమని ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అన్నారు. సీఎం జగన్ కృషితో జిల్లా ప్రజల కల నెరవేరుతుందన్నారు. సాక్షి,అమరావతి: వైఎస్సార్ జిల్లాలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటిస్తున్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్ళపల్లెలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి సీఎం జగన్ భూమిపూజ చేశారు. అనంతరం స్టీల్‌ప్లాంట్ నమూనాను సీఎం పరిశీలించారు. స్టీల్ ప్లాంట్ మౌలిక సదుపాయాలపై జరిగే సమావేశంలో పాల్గొన్నారు. తర్వాత అక్కడి నుంచి బయలుదేరి పులివెందుల చేరుకుంటారు. పులివెందుల ఎస్సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో మూలి బలరామిరెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం పులివెందుల నుంచి బయలుదేరి సాయంత్రం తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు. చిరకాల స్వప్నం నెరవేరే రోజు ►రాయలసీమ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరే రోజు ఆసన్నమైంది. కడప సిగలో మరో కలికితురాయి వచ్చి చేరుతోంది. తన రాజకీయ భవిష్యత్తుకు అండగా నిలిచిన ప్రాంతం శాశ్వత అభివృద్ధి చెందాలనే సంకల్పం మొగ్గ తొడుగుతోంది. నిరుద్యోగాన్ని పారదోలి మెరుగైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జేఎస్‌డబ్ల్యూ స్టీల్స్ లిమిటెడ్ సంస్థ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నారు. తొలివిడతగా రూ.3,300 కోట్లతో 10 లక్షల టన్నుల సామర్థ్యంతో చేపట్టనున్న నిర్మాణ పనులకు సున్నపురాళ్లపల్లి గ్రామం వద్ద భూమి పూజ చేశారు. ►కడప గడపలో స్టీల్ ప్లాంట్ నిర్మించాలని విభజన చట్టంలో పొందుపర్చారు. తద్వారా నిరుద్యోగులకు ప్రత్యక్షంగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయని సంకల్పించారు. అలాగే అనుబంధ పరిశ్రమల ద్వారా వేలాది మందికి జీవనోపాధి లభిస్తుందని భావించారు. గత టీడీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించింది. అయితే ఎన్నికలకు ముందు 2018లో ఓ పునాది రాయితో చంద్రబాబు సర్కార్ సరిపెట్టింది. ►వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్టీల్ ప్లాంట్ నిర్మించాలనే ఆశయాన్ని భుజానికెత్తుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన చేశారు. ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట నిర్వహణకు సన్నాహాలు చేపట్టారు. కాగా 2020 ఫిబ్రవరి నుంచి కరోనా వైరస్ వ్యాప్తితో ప్రపంచమే అతలాకుతలమైంది. ప్రజలు బతుకు జీవుడా అంటూ తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. రెండేళ్ల పాటు ఇలాంటి పరిస్థితి కొనసాగడం వల్ల తక్షణ నిర్మాణానికి ప్రతిబంధకంగా మారిందని నిపుణులు వివరిస్తున్నారు. జేఎస్‌డబ్ల్యు స్టీల్స్ లిమిటెడ్చే భూమి పూజ.. చెప్పిన మాట ప్రకారం జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయనున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ డిసెంబర్లో జిల్లా పర్యటన సందర్భంగా జేఎస్‌డబ్లు్య స్టీల్స్ లిమిటెడ్ ద్వారా జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 751 ద్వారా ఎకరం రూ.1.65 లక్షలతో 3,148.68 ఎకరాలు కేటాయిస్తూ 2022 డిసెంబర్ 16న ఉత్తర్వులు జారీ చేశారు. తొలివిడతలో ఏడాదికి 1 మిలియన్ టన్నులు (10లక్షల టన్నులు) ఉత్పత్తి సామర్థ్యంతో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి జేఎస్‌డబ్లు్య సిద్ధమైంది. అందుకోసం ఫేజ్–1లో రూ.3,300 కోట్లు వెచ్చించి, 36 నెలల కాలపరిమితిలో ఫేజ్–1 పనులు పూర్తి కానున్నాయి. తొలివిడత ప్లాంట్‌లో వైర్ రాడ్స్, బార్ మిల్స్ ఉత్పత్తి చేయనున్నారు. మరో రూ.5,500 కోట్లతో ఫేజ్–2 నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. ఫేజ్–2 సైతం మార్చి 31, 2029 నాటికి పూర్తి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మౌలిక వసతులు కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి కావాల్సిన మౌలిక వసతుల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.720 కోట్లు వెచ్చిస్తోంది. నాలుగులేన్ల రహదారి, రైల్వే కనెక్టివిటీ, నీటి వసతి కోసం పైపు లైన్ ఏర్పాటు, నిల్వ చేసుకునేందుకు సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు, విద్యుత్ సరఫరా, కాంపౌండ్ వాల్, భవన సముదాయం నిర్మించనున్నారు. అందులోభాగంగా ఎన్‌హెచ్–67 నుంచి ముద్దనూరు టు జమ్మలమడుగు రోడ్డుకు అనుసంధానంగా రూ.145.3 కోట్ల తో 12 కిలోమీటర్లు నాలుగు లేన్ల రహదారి నిర్మించనున్నారు. అలాగే ఎర్రగుంట్ల టు ప్రొద్దుటూరు రైల్వేలైన్ నుంచి రూ.323.5 కోట్లతో 9.4 కిలో మీటర్లు రైల్వేలైన్ నిర్మాణం చేపట్టనున్నారు. మైలవరం జలాశయం నుంచి 2 టీఎంసీల నీరు సరఫరా చేయనున్నారు. అందుకోసం 15 కిలోమీటర్లు పైపులైన్ నిర్మించనున్నారు. ఇప్పటికే విద్యుత్ సరఫరాకు కావాల్సిన చర్యలు పూర్తి అయ్యాయి. రూ.76.42 కోట్లతో 27 కిలోమీటర్ల మేరకు విద్యుత్ లైన్ ఏర్పాటు, 33 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయింది. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
దూసుకొచ్చిన మృత్యువు
జమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: ఉదయాన్నే పొలం పనికి వచ్చి విరామ సమయంలో రోడ్డు వెంబడి కూర్చుని అన్నం తింటున్న రైతు, కూలీపై నుంచి టిప్పర్ లారీ దూసుకువెళ్లడంతో ఇద్దరూ మృతిచెందారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ పల్టీ కొట్టడంతో డ్రైవర్ కూడా మరణించాడు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగనూరు గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన జరిగింది. గొరిగనూరు గ్రామానికి చెందిన రైతు ఎనముల నాగసుబ్బారెడ్డి పొలంలో పని కోసం ఉదయం వ్యవసాయ కూలీలు వచ్చారు. కొద్దిసేపు పనిచేసిన తర్వాత ఎనిమిది మంది తమ వెంట తెచ్చుకున్న సద్దిమూటలు విప్పి అన్నం తినడానికి రోడ్డు పక్కన కూర్చున్నారు. ఆరుగురు కూలీలు అన్నం తినేసి మళ్లీ పనిలోకి వెళ్లారు. పొలం యజమాని ఎనముల నాగసుబ్బారెడ్డి(67), ధర్మాపురం గ్రామానికి చెందిన ఎనగలూరు ఓబులేసు(55) అనే కూలీ అన్నం తింటుండగా... జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వైపునకు వెళుతున్న టిప్పర్ వేగంగా వారి మీదుగా దూసుకువెళ్లింది. దీంతో వారి శరీరాలు ఛిద్రమయ్యాయి. ఇద్దరూ ఘటనాస్థలంలోనే మరణించారు. ఎస్.ఉప్పలపాడు గ్రామానికి చెందిన టిప్పర్ డ్రైవర్ విజయ్‌కుమార్(58) వేగాన్ని నియంత్రించలేకపోవడంతో అది పల్టీలు కొట్టి పొలంలో పడిపోయింది. డ్రైవర్ కూడా సీటు కింద నలిగిపోయి అక్కడికక్కడే చనిపోయాడు. మృతులు సుబ్బారెడ్డికి భార్య, ముగ్గురు పిల్లలు.. ఓబులేసుకు భార్య, ఇద్దరు పిల్లలు, డ్రైవర్ విజయ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఘటనాస్థలాన్ని డీఎస్పీ నాగరాజు పరిశీలించారు. డ్రైవర్ విజయ్‌కుమార్‌కు ఫిట్స్‌తోపాటు లోబీపీ ఉన్నట్లు తెలుసుకున్నారు. డ్రైవర్ నోట్లో నురగ రావడంతో ఫిట్స్ వచ్చినందువల్లే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని స్థానికులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతిచెందిన ఓబులేసు, నాగసుబ్బారెడ్డి కుటుంబాలకు వైఎస్సార్సీపీ తరఫున రూ.లక్ష చొప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు. ధర్నాకు దిగిన బాధిత కుటుంబాలు దేవగుడి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి టిప్పర్‌ను మరొకరి వద్ద కొనుగోలు చేశాడు. టిప్పర్‌కు సంబంధించిన రికార్డులను తన పేరు మీద మార్చుకోకపోవడంతో పాటు ఇన్సూరెన్సు కూడా రెన్యూవల్ చేయించలేదు. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే టిప్పర్‌కు ఉన్న నంబర్ ప్లేట్‌ను తొలగించేశారు. దీంతో బాధిత కుటుంబాలు తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై ధర్నాకు దిగారు. వీరికి మద్దతుగా సమీపంలోని ధర్మాపురం, గొరిగనూరు గ్రామాల మహిళలు స్వచ్ఛందంగా వచ్చి రోడ్డుపై బైఠాయించారు. రెండున్నర గంటలపాటు జాతీయ రహదారిపై ఇరువైపులా వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు వచ్చి బాధితులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. ముఖ్యమంత్రి దిగ్భ్రాంతి మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా సాక్షి, అమరావతి: వైఎస్సార్ జిల్లా గొరిగనూరులో టిప్పర్ లారీ దూసుకెళ్లిన ఘటనలో ఓ రైతు, కూలీ మృతి చెందడం పట్ల సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. వారికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసానిచ్చారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. -
ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాల మధ్య మరో హైవే.. కేంద్రం గ్రీన్ సిగ్నల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్–తెలంగాణ రాష్ట్రాలను అనుసంధానిస్తూ మరో జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లా కల్వకుర్తి నుంచి మన రాష్ట్రంలోని వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు 255 కి.మీ. మేర నాలుగు లేన్ల రహదారి నిర్మాణానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ ఆమోదించింది. రూ.4,706 కోట్ల అంచనా వ్యయంతో ఈ రహదారి నిర్మించనున్నారు. రహదారిలో అంతర్భాగంగా ఇప్పటికే కృష్ణా నదిపై వంతెన నిర్మాణానికి ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టింది. కాగా, రెండు రాష్ట్రాలను అనుసంధానిస్తూ నాలుగు లేన్ల రహదారి నిర్మాణ ప్రక్రియ కూడా తాజాగా చేపట్టింది. రహదారి నిర్మాణం ఇలా... తెలుగు రాష్ట్రాలను అనుసంధానించే 255 కి.మీ. రహదారి(ఎన్‌హెచ్167కె)ని ఏడు ప్యాకేజీల కింద నిర్మిస్తారు. అందులో తెలంగాణలో 91 కి.మీ. రహదారిని రూ.2,406 కోట్లతో నిర్మించేందుకు డీపీఆర్‌ను రూపొందించారు. మొదటి ప్యాకేజీ కింద రూ.886.69 కోట్లు, రెండో ప్యాకేజీ కింద రూ.1,082.40 కోట్లు, మూడో ప్యాకేజీ కింద రూ.436.91కోట్లతో పనులు చేపట్టేందుకు ఎన్హెచ్ఏఐ టెండర్ల ప్రక్రియ చేపట్టనుంది. ఇక ఏపీలో 164 కి.మీ. మేర రూ.2,300 కోట్ల అంచనా వ్యయంతో రహదారి నిర్మాణానికి ప్రణాళికను రూపొందించారు. మొత్తం నాలుగు ప్యాకేజీల కింద నంద్యాల జిల్లా సిద్ధేశ్వరం నుంచి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు వరకు ఈ రహదారిని నిర్మిస్తారు. అందులో మొదటి ప్యాకేజి కింద 62.57 కి.మీ. మేర రహదారి నిర్మాణానికి రూ.785 కోట్లతో పనులకు డీపీఆర్‌ను తాజాగా ఖరారు చేశారు. మిగిలిన మూడు ప్యాకేజీల కింద పనులను రూ.1,515 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించేందుకు ఎన్హెచ్ఏఐ డీపీఆర్‌ను రూపొందిస్తోంది. నాలుగు ప్యాకేజీల డీపీఆర్‌లు ఖరారు అయ్యాక 2023 ఫిబ్రవరి మొదటి వారంలో టెండర్ల ప్రక్రియ చేపట్టి ఏడాదిన్నరలో నిర్మాణాన్ని పూర్తి చేయాలని ఎన్హెచ్ఏఐ భావిస్తోంది. -
YSR Kadapa: చిన్న పాపకు పెద్ద జబ్బు.. గొప్ప మనసుతో ఆదుకోండి
సాక్షి, జమ్మలమడుగు: గాలిపోతుల పావని. కేవలం పదేళ్ల వయసు గల పాప. ప్రైవేట్ పాఠశాలలో చదువుతూ ఉన్న పాపను.. తల్లి గాలిపోతుల సునీత ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ పాఠశాలలో చేర్పించింది. ప్రస్తుతం బాలికల ఉన్నత పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది. ఇటీవల గాలిపోతుల పావనికి జ్వరం రావడంతో.. తిరుపతికి వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. అక్కడ రక్త పరీక్షలు చేసి బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించారు. కొంత కాలం హైదరాబాద్‌లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పాప కోలుకుందంటూ తిరిగి జమ్మలమడుగు వచ్చేశారు. పాపకు బాగుంది అనుకునేలోపే తిరిగి అనారోగ్యానికి గురి కావడంతో మళ్లీ బసవతారకం ఆసుపత్రిలో చూపించారు. బ్రెయిన్ క్యాన్సర్ అని గుర్తించారు. దీంతో తల్లి గాలిపోతుల సునీత ఎటూపోలేక పాపకు చికిత్స చేయించలేని ఆర్థిక పరిస్థితిలో కొట్టుమిట్టాడుతోంది. భర్త ఉన్నా తప్పని కష్టాలు గాలిపోతుల సునీతకు నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలోని చాగలమర్రి మండలం చింతలచెరువు గ్రామవాసి అయిన బాబుతో వివాహం జరిగింది. ఆయన బేల్దారి పని చేస్తూ వచ్చిన డబ్బుతో మద్యం తాగుతూ కుటుంబాన్ని పట్టించుకోవడం మానేశారు. దీంతో రెండేళ్ల నుంచి సునీత తనకున్న ఇద్దరు పిల్లలను పోషించుకుంటూ వస్తోంది. తన బిడ్డకు ఆరోగ్యం సక్రమంగా లేకపోవడంతో ఆసుపత్రుల చుట్టూ తిరుగుతుండటంతో.. చింతల చెరువులోని అంగన్వాడీ కేంద్రంలో ఆయాగా ఉన్న సునీతను తొలగించేశారు. దీంతో అక్కడ సునీతను, పిల్లలను పట్టించుకునే వారు లేకపోవడంతో పుట్టినిల్లు అయిన జమ్మలమడుగుకు వచ్చి చేరింది. అయితే ఇక్కడ కూడా నిరాదరణకు గురైంది. దీంతో తన బిడ్డను కాపాడుకునేందుకు నానా ఇబ్బందులు పడుతోంది. తన పాప పావనిని కాపాడాలంటూ తల్లి సునీత వేడుకుంటోంది. సాయం చేయదలచిన వారు సెల్ నంబర్: 9121393846ను సంప్రదించాలని ఆమె కోరుతోంది. -
గుంటూరు, తిరుపతి మధ్య కొత్త రైలు
జమ్మలమడుగు (వైఎస్సార్ జిల్లా): నంద్యాల– ఎర్రగుంట్ల మధ్య మరో రైలు పట్టాలెక్కబోతుంది. ఈనెల 18వ తేదీన గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ (17261/17262) రాబోతుంది. ఇప్పటికే నంద్యాల– ఎర్రగుంట్ల రహదారిలో డెమో రైలు నడుస్తోంది. ప్రస్తుతం మరొకటి రాబోతుండటం.. నేరుగా తిరుపతికి వెళ్లే అవకాశం రావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే కొత్తగా వస్తున్న ఎక్స్‌ప్రెస్ రైలుకు నంద్యాల, బనగాపల్లి, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం, కడపలో మాత్రమే స్టాపింగ్ పెట్టారు. కొవెలకుంట్ల, జమ్మలమడుగులో స్టాపింగ్ లేకపోవడంతో ప్రజలు నిరుత్సాహపడుతున్నారు. మూడో రైలు పరుగులు తీయబోతుంది... ఇప్పటికే డెమో.. ధర్మవరం–విజయవాడ ఎక్స్‌ప్రెస్‌లు ఎర్రగుంట్ల–నంద్యాల మీదుగా నడుస్తున్నాయి. కరోనా కారణంగా నంద్యాల– ఎర్రగుంట్ల డెమో రైలు దాదాపు రెండు సంవత్సరాలుగా నిలిపివేశారు. గత నెల 16వతేదీ నుంచి తిరిగి డెమో పునఃప్రారంభమైంది. అదేవిధంగా ధర్మవరం– విజయవాడ రైలు కూడా ఉదయం – రాత్రి పూట నడుస్తుంది. దీనికి అదనంగా రైల్వేశాఖ గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును నడపాలని సంకల్పించింది. గతంలో పాత రైలు నంబర్ 67232/67231 స్థానంలో 17261/17262 నంబర్ గల రైలును నడిపేందుకు ఏర్పాట్లు పూర్తిచేసింది. 18న గుంటూరులో, 19న తిరుపతిలో ప్రారంభం కడప మీదుగా గుంటూరు–తిరుపతి మధ్య రాకపోకలు సాగించేందుకు డైలీ రైలును దక్షిణ మధ్య రైల్వే అధికారులు ఏర్పాటు చేసినట్లు కడప రైల్వేస్టేషన్ మేనేజర్ డి.నరసింహారెడ్డి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుంటూరులో ఈనెల 18వ తేదీ ఈ రైలు (17261) ప్రతిరోజు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురంరోడ్డు, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, ప్రొద్దుటూరు, ఎర్రగుంట్ల, కమలాపురం మీదుగా కడపకు అర్ధరాత్రి 12.45 గంటలకు చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మరుసటిరోజు ఉదయం 4.25 గంటలకు చేరుతుందన్నారు. ఈనెల 19వ తేదీన సాయంత్రం 7.35 గంటలకు తిరుపతిలో బయలుదేరి కడపకు రాత్రి 9.55 గంటలకు చేరుకుంటుంది. ఇదేమార్గంలో మరుసటిరోజు ఉదయం 8.00 గంటలకు గుంటూరుకు చేరుతుందన్నారు. ఈ రైలులో ఏసీ త్రీ టైర్ ఒకటి, స్లీపర్ 10, జనరల్ బోగీలు 2, బ్రేక్వ్యాన్ రెండింటితో కలిపి మొత్తం 15 కోచ్‌లు ఉంటాయన్నారు. ప్రయాణీకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. డివిజన్ కేంద్రంలో రైలు ఆపాలి జమ్మలమడుగు ప్రాంతం నుంచి ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమల వెంకన్న దర్శనం కోసం,విద్యార్థులు చదువుకోవటానికి తిరుపతికి వెళుతుంటారు. గుంటూరు–తిరుపతి ఎక్స్‌ప్రెస్ రైలును ఈనెల 18న ప్రారంభించబోతున్నారు. జమ్మలమడుగు డివిజన్ కేంద్రంగా..నియోజకవర్గ హెడ్‌క్వార్టర్‌గా ఉంది. రైల్వేశాఖ అధికారులు ఇక్కడ రైలును ఆపితే అందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – పి.నాగేశ్వరరెడ్డి, ఎస్పీ డిగ్రీకాలేజీ కరస్పాడెంట్ -
నిమ్మ.. ధర అదిరెనమ్మ!
జమ్మలమడుగు: జిల్లాలో నిమ్మ సాగు చేసిన రైతులకు కాసుల పంట పండింది. ఈ ఏడాది నిమ్మ దిగుబడి తక్కువగా ఉన్నా ధర ఎక్కువగా ఉండటంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3527 ఎకరాల్లో నిమ్మతోటలను సాగుచేశారు. గత ఏడాది భారీ వర్షాల కారణంగా నిమ్మతోటలు చాలా వరకు దెబ్బతిన్నాయి. సాధారణంగా వేసవి కాలంలో ప్రతి ఏడాది భారీగా దిగుబడి వచ్చేది. అయితే ఈ ఏడాది భూమిలో తేమశాతం ఎక్కువ కావడంతో నిమ్మ చెట్లకు ఉన్న పూత రాలిపోయింది. దీంతో దిగుబడి కాస్త తగ్గిపోయింది. అయితే ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో నిమ్మకాయలకు భారీ గిరాకీ వచ్చింది. నిమ్మకాయల బస్తా రూ.7వేలు నిమ్మకాయల బస్తా ఏడు వేల రూపాయలు పలికింది. ప్రతి బస్తాలో 800 నుంచి 1000 నిమ్మకాయలు నింపి వరిగడ్డి వేసి బస్తాలను బెంగళూరుకు ఎగుమతి చేస్తూ వచ్చారు. జిల్లాలో పులివెందుల డివిజన్ ప్రాంతంలో అత్యధికంగా 1750 ఎకరాల్లో నిమ్మసాగును రైతులు సాగుచేస్తున్నారు. ఆ తర్వా త కడప డివిజన్లో 868 ఎకరాలు, జమ్మలమడుగు డివిజన్లో జమ్మలమడుగు, మైలవరం మండలాల్లో 549 ఎకరాల్లో, బద్వేలు డివిజన్లో 360 ఎకరాల్లో పంటను సాగుచేశారు. ప్రస్తుతం పంట తక్కువగా ఉండటంతో వచ్చిన దిగుబడిని ఏరోజుకారోజు బెంగళూరుకు ప్రత్యేక వాహనాలలో ఎగు మతి చేసి అత్యధికంగా లాభాలను ఆర్జిస్తున్నారు. అధికారులు సలహాలు ఇవ్వాలి ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్నా నిమ్మ కు మంచి గిరాకీ ఉంది. ప్రతి ఏడాది తోటలో 15 చెట్లు ఎండిపోతున్నాయి. దీంతో పంట దిగుబడి తగ్గిపోతోంది. అధికారులు క్షేత్రస్థాయిలో రైతులకు సూచనలు సలహాలు ఇస్తే పంట దిగుబడి పెంచుకుంటాము. – నరసింహ, నిమ్మరైతు, గండికోట ఎండుపుల్లలు కత్తిరించాలి ప్రస్తుతం నిమ్మకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంది. రైతులు మంచి దిగుబడి పొందాలంటే చెట్లపై ఉన్న ఎండు పుల్లలను కత్తిరించి సున్నం, మైలుతుత్తి కలిగిన బార్డోపేస్ట్, బోర్డో పిచికారీ చేస్తే ఎండు తెగులు, ఎండు పుల్లలను సమర్థవంతంగా నివారించుకోవచ్చు. –భరత్‌రెడ్డి, ఉద్యాన అధికారి -
తాగినమైకంలో కానిస్టేబుల్ వీరంగం
సాక్షి, జమ్మలమడుగు రూరల్ : తాగినమైకంలో ఓ కానిస్టేబుల్ వీరంగం సృష్టించాడు. ఓ ప్రైవేట్ బార్ వద్ద బీర్ సీసాతో యువకుడి తలపై కొట్టాడు.దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి.జమ్మలమడుగు ఎస్ఐ తీమోతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మైలవరం మండలం దొడియం గ్రామానికి చెందిన దళిత యువకుడు నడిపి చెన్నయ్య ఆటో నడిపేవాడు. ఈ క్రమంలో సోమవారం జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ బార్ అండ్ రెస్టారెంట్ వద్ద మరో వ్యక్తి కోసం వేచి ఉన్నాడు. అదే సమయంలోబార్ వద్ద మద్యం సేవిస్తు ఉన్న గంగాధర్ బాబు అనే కానిస్టేబుల్ యువకుడిని నీది ఏ ఊరు అని ప్రశ్నించాడు. మాది దొడియం అని చెప్పగానే అక్కడి నాయకుల గురించి ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగింది. ఈ క్రమంలో సహనం కోల్పోయిన గంగాధర్ బాబు బీర్ సీసా తీసుకొని చెన్నయ్య తలపై కొట్టాడు. దీంతో అతని తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు అతన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనంతరం ప్రొద్దుటూరుకు తీసుకెళ్లారు. ప్రస్తుతం చెన్నయ్య చికిత్స పోందుతున్నాడు. కాగా కానిస్టేబుల్ గంగాధర్ బాబు ఏడాది కాలంగా తలమంచిపట్నం పోలీస్‌స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. -
ముందే వేసుకొన్న పథకం.. భార్యను పెన్నా నదిలో తోసేసిన భర్త
సాక్షి, జమ్మలమడుగు : కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను పెన్నా నదిలోకి తోసేసిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లెకు చెందిన ప్రసాద్ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన తన అక్క రామాంజనమ్మ కుమార్తె రాధిక (19)ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. ఇటీవల భార్య మీద భర్తకు అనుమానం మొదలైంది. దీనికితోడు రాధిక తనకు ఆరోగ్యం బాగుండటం లేదని ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి వెళ్లి అక్కడ ఓ స్వామితో అంత్రాలు వేయించుకొని వచ్చేది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ రాధిక భర్తకు చెప్పకుండా తాళ్లమాపురం గ్రామానికి వెళ్లింది. అయితే అదే గ్రామంలో ఉన్న ప్రసాద్ మరో అక్క అక్ష్మీదేవి తాళ్లమాపురానికి నీ భార్య వచ్చిందని తమ్మునికి సమాచారం చేరవేసింది. దీంతో ప్రసాద్ తన తమ్ముడు నవీన్‌ను వెంట పెట్టుకుని అదే రోజు తాళ్లమాపురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యను పిలుచుకుని జమ్మలమడుగుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే భార్య రాధిక, భర్త ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై ప్రసాద్ చేయిచేసుకోవడంతో ఆమె కింద పడింది. అన్నదమ్ములు ఇద్దరు ముందే వేసుకొన్న పథకం ప్రకారం పెన్నానదిపై నుంచి ఆమెను నీటిలోకి తోసేశారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాధిక నదిలో కొట్టుకుని పోయింది. నాలుగు రోజులైనా కూతురు కనిపించకపోవడంతో అల్లుడు ప్రసాద్, నవీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 28వ తేదీ జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో రాధిక తల్లి రామాంజనమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్త ప్రసాద్, అతని తమ్ముడు నవీన్‌ను విచారించగా తామే పెన్నానదిలో తోసేశామని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
రాళ్ల వర్షం కురిసిందట.. ఆ ఊరిలో పొలాల నిండా రాళ్లే
వైఎస్సార్ జిల్లా (జమ్మలమడుగు): జమ్మలమడుగు పట్టణానికి తూర్పు దిశగా ఐదు కిలోమీటర్ల దూరంగా ఉన్న చిన్న గ్రామమైన రాళ్లగుళ్లకుంట ప్రత్యేకత చాటుకుంది. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ మాత్రమే పొలాల నిండా రాళ్లుతో నిండిపోయి ఉంటుంది. ఈ రాళ్లలోనే రైతులు భూమిని దున్ని పంటలను సాగుచేస్తున్నారు. కేవలం గ్రామానికి కిలోమీటరు చుట్టూ రాళ్లు ఉండటం ఈ గ్రామానికి ప్రత్యేకత తీసుకుని వచ్చింది. గ్రామానికి చుట్టూ కిలోమీటరు దూరం వరకు ఉన్న పొలాల్లో రాళ్లు మాత్రమే కనిపిస్తాయి తప్ప భూమి ఎక్కడ కనిపించదు. కిలోమీటరు దాటిన తర్వాత పూర్తిగా నల్లరేగటి భూమిలే. రాళ్లు ఎక్కువగా ఉండటంతో ఈ గ్రామానికి రాళ్ల గుల్లకుంటగా గుర్తింపు తీసుకుని వచ్చింది. ఈ గ్రామానికి మరో పేరు శేషారెడ్డిపల్లె. రాళ్లవర్షం కురిసిందంటా... త్రేతా యుగంలో గ్రామం చుట్టూ పరిసరా ప్రాంతాలలో రాళ్ల వర్షం పడ్డాయని గ్రామస్థులు కథలు చెబుతున్నారు. భూమిలోరాళ్లు ఎక్కువ ఉండటంతో రైతులు మొదట్లో రాళ్లను తొలగించే ప్రయత్నం చేశారు. భూమిని దున్నుతున్న ప్రతి సారి భూమిలో నుంచి రాళ్లు ఎక్కువగా వస్తుండటంతో శ్రమంతా నిరుపయోగం అవుతుండటంతో రాళ్లును తొలగించే ప్రయత్నం మానుకున్నారు. అయితే ఈ రాళ్లు రైతులకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. గ్రామంలో చుట్టూప్రక్కల భూములన్ని వర్షాధార ఆధారంగా పంటలను సాగుచేస్తున్నారు. అయితే వర్షాలు తక్కువగా పడిన సమయంలో భూమిలో రాళ్లు ఉండటంతో ఆ రాళ్ల చల్లదనానికి పంటలు ఎండకుండ కాస్త దిగుబడి ఎక్కువగా వస్తుందని రైతులు చెబుతున్నారు. -
నాడు తండ్రి.. నేడు తనయుడు
సాక్షి,జమ్మలమడుగు: కరువు కాటకాలకు నిలయమైన రాయలసీమను సస్యశ్యామలం చేసేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు కంకణబద్ధులయ్యారు. కృష్ణా జలాలు సముద్రం పాలు కాకుండా నిలువరించి వాటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా కరువు సీమకు మేలు చేకూర్చాలనే లక్ష్యంతో గాలేరు– నగరి కాలువ నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా కర్నూలు జిల్లాలో పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని పెంచారు. తద్వారా గాలేరు–నగరి వరద కాలువలో ఏకంగా 20వేల క్యూసెక్కుల నీరు ప్రవహించే విధంగా కాలువ నిర్మాణం పనులు చేపట్టారు. నాడు వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తిచేసిన గాలేరు–నగరి వరద కాలువ పనుల వల్ల నేడు గండికోట ప్రాజెక్టులో పుష్కలంగా నీరు నిల్వ ఉంది. ప్రస్తుతం మరో 16 మీటర్ల వెడల్పు.. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ప్రస్తుతం గాలేరు–నగరి వరద కాలువ విస్తరణపై దృష్టి సారించారు. 36 మీటర్ల వెడల్పుతో ఏకంగా 20వేల క్యూసెక్కుల వరద నీరు ప్రవహించే విధంగా ఉన్న ఈ కాలువలో అదనంగా మరో 10 వేల క్యూసెక్కుల నీరు ప్రవహించేలా చర్యలు చేపట్టారు. దీంతో కాలువను మరో 16 మీటర్లు వెడల్పు చేసి పనులకు శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం కర్నూలు జిల్లా అవుకు సమీపం నుంచి గండికోట టన్నెల్ సొరంగం వరకు 52 కిలోమీటర్ల మేర పనులను వేగవంతం చేశారు. అలాగే కాలువపై ఉన్న 52 వంతెనలను కూడా వెడల్పు చేసే పనులను ముమ్మరం చేశారు. రూ.1940 కోట్లతో పనులు.. గాలేరు– నగరి వరద కాలువ,, సొరంగం వెడల్పుతోపాటు గండికోట ప్రాజెక్టు నుంచి పులివెందుల వరకు పైప్‌లైన్ పనులు పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1940 కోట్లు కేటాయించింది. ఎంఆర్కేఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ ఈ పనులు ప్రారంభించింది. ఇప్పటికే కాలువకు పడమరవైపు ఉన్న మట్టిని తొలగించే కార్యక్రమం కొనసాగుతోంది. -
అప్పుడు నిద్రపోయారా.. మైసూరా!
ఒంగోలు: టీడీపీ హయాంలో నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతే ఎంవీ మైసూరారెడ్డి నిద్రపోయారా అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలదీశారు. ఒంగోలులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తున్న రోజుల్లో మౌనం దాల్చిన మాజీ మంత్రి మైసూరా ఇప్పుడు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గమన్నారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆ అంశంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి నోరు విప్పకపోవడం రాయలసీమపై ఆయనకున్న ప్రేమకు అతి పెద్ద సాక్ష్యమని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో బహిరంగ రహస్యమే అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మైసూరా అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల నాయకులు సైతం అక్కడ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను సక్రమమే అని చెబుతుంటే.. మన దౌర్భాగ్యం కొద్దీ ఒక బాబు, ఒక మైసూరా, ఒక రఘురామరాజుతోపాటు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 రాష్ట్రానికి శనిలా దాపురించాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం చర్చలు పెట్టాలి టీవీ చానళ్లలో చర్చలను ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహించాలని సుధీర్‌రెడ్డి సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, మైసూరారెడ్డి మధ్య జరిగిన చర్చా కార్యక్రమంలో ఏది పడితే అది మాట్లాడారని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీ అనేది సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
భార్యను చంపి.. ఆపై సెల్ఫీ తీసుకుని..
బద్వేలు అర్బన్: తన జల్సాలకు అడిగినంత డబ్బు ఇవ్వలేదన్న కారణంతోపాటు.. అనుమానం పెంచుకున్న ఓ శాడిస్టు కట్టుకున్న భార్యను అతి కిరాతకంగా చంపేసిన ఘటన వైఎస్సార్ జిల్లా బద్వేలు పట్టణం సుందరయ్య కాలనీలో సంచలనం సృష్టించింది. పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. జిల్లాలోని జమ్మలమడుగు పట్టణం వెంకటేశ్వరకాలనీకి చెందిన మంజుల (23)కు నాగరాజు అనే వ్యక్తితో గతంలో వివాహం జరిపించారు. అయితే మనస్పర్థలతో నెల రోజుల్లోనే వారు విడిపోయారు. అనంతరం మంజుల జీవనోపాధి నిమిత్తం కువైట్‌కు వెళ్లి 8 నెలల క్రితం జమ్మలమడుగులోని అమ్మగారింటికి వచ్చింది. ఈ సమయంలో కడప తిలక్‌నగర్‌కు చెందిన దూరపు బంధువు మన్నూరుహరి మంజులను ప్రేమించానని, ఆమెతో వివాహం జరిపించాలని పట్టుబట్టి గతేడాది నవంబర్‌లో వివాహం చేసుకున్నాడు. కడపలో కాపురముంటూ పెయింటింగ్ పని చేసుకునే హరి మద్యానికి బానిసవ్వడంతో పాటు అనుమానంతో మంజులను వేధించసాగాడు. ఇందుకు హరి తల్లి లక్ష్మి కూడా సహకరిస్తుండేది. అనుమానం ఓ వైపు.. డబ్బులు ఇవ్వడం లేదన్న కోపం మరో వైపుతో మంజులను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మూడు రోజుల క్రితమే కాపురాన్ని బద్వేలులోని సుందరయ్యకాలనీలోకి మార్చాడు. శుక్రవారం రాత్రి భార్యతో గొడవకు దిగిన హరి శనివారం తెల్లవారుజామున 1 గంట సమయంలో ఆమెను అత్యంత కిరాతకంగా కత్తితో పొడిచి చంపేశాడు. ఆపై తాను కూడా ఎడమవైపు చాతీపై చిన్నపాటి గాయమయ్యేలా పొడుచుకుని ఆత్మహత్య నాటకానికి తెరలేపాడు. అంతటితో ఆగక భార్య మృతదేహం పక్కనే పడుకుని సెల్ఫీ తీసుకుని కుటుంబ సభ్యులకు, మిత్రులకు పంపించాడు. తెల్లవారుజామున విషయం బయటకు పొక్కడంతో పోలీసులు వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకుని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి రామలక్షుమ్మ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘జమ్మలమడుగు’లో వారిద్దరు కలిసి పని చేస్తారు: సజ్జల
సాక్షి, అమరావతి: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మా పార్టీలోకి వచ్చారు.. కోవిడ్ తీవ్రమవడంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి కలిశారు, పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడారు.. ఎమ్మెల్యేగా గెలిచారు.. వచ్చే ఎన్నికల్లో కూడా సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ప్రకటించారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం.. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి రామసుబ్బారెడ్డి పనిచేస్తారు అని ప్రకటించారు. సీఎం జగన్ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని రామసుబ్బారెడ్డి తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది లేకుండా మేం పనిచేస్తాం, వచ్చే ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పారు. సుధీర్‌రెడ్డి కోసం నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని స్పష్టం చేశారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు -
చివరిశ్వాస వరకూ వైఎస్ జగన్‌తోనే: ఎమ్మెల్యే
సాక్షి, కడప : రాజకీయంగా తనపై వస్తున్న ఆరోపణలను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. ఇటీవల మీడియాలో తన పైన వచ్చినవ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను కడప జిల్లాకు చెందిన వ్యక్తినని, తన భాష ఇలాగే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని స్పష్టం చేశారు. తాను తొలినుంచీ వైఎస్సార్, జగన్ అభిమాని అని గుర్తుచేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో తనను పోల్చడం దారుణమని, ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. సీఎం జగన్‌కు తాను ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చొని వున్నారు. జమ్మలమడుగులో నా గెలుపుకు కారణం ఎంపీ అవినాష్ రెడ్డే. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు తిడతాను. నా మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగానే ఉంటాను. ఇకనైనా నాపై అసత్య ప్రచారాలు మానుకోండి’ అని అన్నారు. -
ఆందోళనకు గురికావొద్దు : ఎంపీ అవినాష్‌రెడ్డి
సాక్షి, కడప : లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. వైఎస్సార్‌జిల్లా జమ్మలమడుగు మండలం గొరిగెనూరు, ధర్మాపురం గ్రామాల్లో ఇంటింటికి 13వస్తువులతో కూడిన ప్యాకెట్లను ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పంపిణీ చేశారు. మండలంలోని 14 గ్రామాల్లో 14వేల కుటుంబాలకు నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నట్టు ఎంపీ అవినాష్‌రెడ్డి తెలిపారు. గొరిగెనూరు గ్రామానికి చెందిన రామయ్య అనే వ్యక్తి గ్రామంలోని పేదలు ఇబ్బంది పడుతున్నారని సమాచారం ఇవ్వడంతో వెంటనే స్పందించిన ఎంపీ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గ్రామానికి వచ్చి నిత్యావసరాలు పంపిణీ చేశారు. ఎవరూ ఆందోళనకు గురికావొద్దని, ప్రతిఒక్కరూ భౌతిక దూరం పాటించి వైరస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. -
మాజీ మంత్రి ఆది సోదరులపై కేసు నమోదు
జమ్మలమడుగు రూరల్: ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరులపై దాడి చేసిన కేసులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఆయన సోదరులు ఎమ్మెల్సీ శివనాథరెడ్డి, రామాంజనేయరెడ్డి, కుమారుడు గోవర్థన్‌రెడ్డి, మరో 80మందిపై కేసు నమోదు చేసినట్లు సీఐ మధుసూదన రావు తెలిపారు. తమపై దాడి చేసినట్లు బాధితులు రెడ్డయ్య, రామాంజనేయులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. అంతేకాకుండా దేవగుడి గ్రామంలో 30 యాక్టు చట్టాన్ని ఉల్లంఘించి సమావేశాన్ని నిర్వహించారన్నారు. శనివారం అర్ధరాత్రి బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు 324, 307,147,148,188 సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఆయన వివరించారు. -
కడప : స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
-
పేపర్లో కాదు..ప్రజల్లోకి వెళ్ళి చూడండి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: అభివృద్ధిని చూసి ఓర్వలేకే ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ధ్వజమెత్తారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల కాలంలోనే వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అనేక అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిందన్నారు. రాష్ట్రంలో ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందనేది పేపర్లో కాదని, స్వయంగా ప్రజల మధ్యకు వెళ్ళి చూసి ప్రభుత్వానికి మద్దతు పలకాలని ప్రతిపక్షాలకు సూచించారు. ప్రతిపక్ష నేతల పిల్లలు మాత్రం ఇంగ్లీష్ మీడియంలో చదవొచ్చు... కానీ పేదోళ్ల పిల్లల మాత్రం ఇంగ్లీష్ పాఠశాలలో చదవకూడదా అని మంత్రి సూటిగా ప్రశ్నించారు. ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా సీఎం నెరవేర్చుతున్నారని తెలిపారు. స్టీల్‌ప్లాంట్‌తో ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఏడాదికి 3 మిలియన్ మెట్రిక్ టన్నుల ఐరన్ ఉత్పత్తి జరుగుతుందన్నారు. దేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టేందుకు సీఎం జగన్ కృషి చేస్తున్నారన్నారు. అన్ని జిల్లాల అభివృద్ధిపై ముఖ్యమంత్రి దృష్టి పెట్టారని మంత్రి ఆదిమూలపు పేర్కొన్నారు. -
సున్నపురాళ్లపల్లికి చేరుకున్న సీఎం
-
స్టీల్‌ప్లాంట్‌కు శంకుస్థాపన చేసిన సీఎం జగన్
సాక్షి, అమరావతి : దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి ఆయన తనయుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేశారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఈ కర్మాగారాన్ని నిర్మిస్తున్నారు. అంతకు ముందు సున్నపురాళ్లపల్లెకు చేరుకున్న సీఎం వైఎస్ జగన్‌కు మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొంటారు. అలాగే నేటి నుంచి మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పర్యటనకు సంబంధించిన వివరాలు.. ► 1.35 గంటలకు దువ్వూరు మండలం నేలటూరు గ్రామానికి చేరిక. ► 1.45 గంటలకు బహిరంగ సభాస్థలికి చేరుకుంటా రు. మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసి బహిరంగసభలో పాల్గొంటారు. ► 3.40 గంటలకు కడప రిమ్స్‌కు వస్తారు. ► 3.55 నుంచి 4.05 గంటల వరకు కడప అసెంబ్లీ నియోజకవర్గ అభివృద్ది పనులకు శంకుస్థాపన చేస్తారు. ► 4.15 గంటలకు వైఎస్సార్ ఉచిత భోజన, వసతి భవనం వద్దకు చేరుకుంటారు. 4.20 నుంచి 4.25 గంటల వరకు భవన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. ► 4.45 గంటలకు కడప–రాయచోటి మార్గంలోని రైల్వే ఓవర్ బ్రిడ్జి వద్దకు చేరుతారు. 4.50 నుంచి 5.00 గంటల వరకు అక్కడి రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ► సాయంత్రం 5.55 గంటలకు ఇడుపులపాయ గెస్ట్‌హౌస్ వద్దకు చేరుకుంటారు. 24వ తేది కార్యక్రమాలు ► ఉదయం 9.10 నుంచి 9.40 గంటల వరకు వైఎస్ రాజశేఖరరెడ్డి సమాధి ఘాట్ వద్ద నివాళులు. ► 9.55 గంటలకు అక్కడున్న చర్చి వద్దకు వెళతారు. ► 10.00 నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు జరిగే ప్రార్థనా కార్యక్రమంలో పాల్గొంటారు. ► 1.40 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 2.00 గంటలకు రాయచోటి జూనియర్ కళాశాల గ్రౌండ్ వద్దకు చేరుకుంటారు. ► మధ్యాహ్నం 2.15 నుంచి 4.15 గంటల వరకు రాయచోటి నియోజకవర్గంలో చేపట్టనున్న వివిధ అభివృద్ది పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు నిర్వహించి బహిరంగ సభలో పాల్గొంటారు. ► 5.10 గంటలకు ఇడుపులపాయలోని గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 25వ తేది కార్యక్రమాలు ► ఉదయం 9.30 గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలిప్యాడ్‌లో దిగుతారు. ► 9.45 గంటలకు సీఎస్ఐ చర్చికి చేరుకుంటారు. 9.50 నుంచి 11.10 గంటల వరకు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. ► 11.25 నుంచి 12.10 గంటల వరకు పులివెందుల నియోజకవర్గానికి సంబంధించిన వివిధ అభివృద్ది కార్యక్రమాలకు శంకుస్థాపన చేస్తారు. ► వైఎస్సార్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు ► 12.30 గంటలకు భాకరాపురంలోని నివాస గృహానికి చేరుకుంటారు. ► 2.35 గంటలకు హెలికాఫ్టర్‌లో బయలుదేరి 3.00 గంటలకు కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. 3.10 గంటలకు ఎయిర్‌పోర్టులో విమానంలో బయలుదేరి 4.00 గంటలకు గన్నవరం వెళతారు. -
కడప ఉక్కు కల సాకారం
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి కడప: రాయలసీమ ప్రజల దశాబ్ధాల కల నేడు సాకారం కానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 25 వేల మందికి ఉపాధి కల్పించాలన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కలల ప్రాజెక్టు అయిన కడప ఉక్కు కర్మాగారానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. రూ.15 వేల కోట్ల పెట్టుబడి అంచనాతో ఏడాదికి 30 లక్షల టన్నుల ఉత్పత్తి సామర్థ్యంతో ఏర్పాటు చేయనున్న ఈ కర్మాగారానికి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి, పెదనందలూరు గ్రామాల్లో 3,275.66 ఎకరాలను కేటాయించారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే కడప ఉక్కు కర్మాగారం ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఇందుకోసం రూ.10 లక్షల మూల ధనంతో ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ లిమిటెడ్ పేరిట ఒక ప్రత్యేక కంపెనీ ఏర్పాటు చేశారు. విభజన హామీ చట్టం ప్రకారం వైఎస్సార్ జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఉక్కు కర్మాగారానికి సంబంధించి కేంద్రంతో పలుదఫాలు చర్చించి కీలకమైన ముడి ఇనుము సరఫరా కోసం ఎన్ఎండీసీతో డిసెంబర్ 18న ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ యూనిట్ ఏర్పాటుకు ప్రస్తుతం 4.8 మిలియన్ టన్నుల ముడి ఇనుము అవసరం కాగా, ఎన్ఎండీసీ 5 మిలియన్ టన్నులు సరఫరా చేయడానికి అంగీకరించింది. గండికోట రిజర్వాయర్ నుంచి 2 టీఎంసీల నీటిని సరఫరా చేయనున్నారు. ఈ యూనిట్‌కు కేటాయించిన స్థలం నుంచే కడప–నంద్యాల రైల్వే ట్రాక్ ఉండటంతో పాటు ఏడు కిలోమీటర్ల దూరంలోనే 400 కేవీ సబ్‌స్టేషన్ కూడా ఉంది. ఇలా కీలకమైన అన్ని వనరులు సమకూరిన తర్వాతే శంకుస్థాపన చేస్తుండటం.. ఈ ప్రాజెక్టుపై సీఎంకు ఉన్న చిత్తశుద్ధిని తెలియజేస్తోంది. ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో ఈ కర్మాగారానికి రూ.250 కోట్లు కేటాయించగా అందులో ఇప్పటికే రూ.62 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ యూనిట్‌కు శంకుస్థాపన చేసిన మూడేళ్లలో ఉత్పత్తి ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కేంద్రం నుంచి రాయితీల డిమాండ్ ఈ యూనిట్ ఏర్పాటుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీలకు అదనంగా కేంద్రం నుంచి కూడా పలు రాయితీలను కోరుతోంది. ఉత్పత్తి ప్రారంభించినప్పటి నుంచి తొలి ఏడేళ్లు ఐజీఎస్టీ మినహాయింపు, పదేళ్ల పాటు ఆదాయపు పన్ను మినహాయింపు, దిగుమతి చేసుకునే ముడి సరుకులపై సుంకాల మినహాయింపులను కోరుతోంది. ఇదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్ రూపాయికే ఇవ్వనుంది. స్టాంప్ డ్యూటీ, ట్రాన్స్ఫర్ డ్యూటీ, భూమి కొనుగోలు లేదా లీజు ఫీజుపై 100 శాతం మినహాయింపు, ఏడేళ్లపాటు ఎస్జీఎస్టీ వంటి అనేక రాయితీలను ఆఫర్ చేస్తోంది. కడపలో అభివృద్ధి పరుగులు వైఎస్ జగన్ ప్రభుత్వం ఆరు నెలల్లోనే వైఎస్సార్ జిల్లాలో రూ.వేల కోట్లతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం పట్ల జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కడప, పులివెందుల, జమ్మలమడుగు, మైదుకూరు, రాయచోటి నియోజకవర్గాల్లో పలు నీటి పారుదల ప్రాజెక్టులతోపాటు వైద్యశాలలు, రోడ్లు, డ్రైనేజీలు, గ్రామ సచివాలయ భవనాలతోపాటు పలు అభివృద్ధి పనులు ప్రారంభిస్తుండటంతో జిల్లా దశ తిరిగినట్లేనని అన్ని వర్గాల ప్రజలు భావిస్తున్నారు. ఉక్కు ఫ్యాక్టరీ వల్ల స్థానికంగా వేలాది మంది నిరుద్యోగులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి కలగనుంది. సీఎం శంకుస్థాపనలు, ప్రారంబోఉత్సవాలు ఇలా.. ►23వ తేదీ ఉదయం 10 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె వద్ద ఉక్కు ఫ్యాక్టరీకి శంకుస్థాపన. అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►కుందూనదిపై కుందూ – తెలుగుగంగ ఎత్తిపోతల పథకానికి, కర్నూలు – వైఎస్సార్ జిల్లాల సరిహద్దులో నిరి్మస్తున్న రాజోలి ఆనకట్ట నిర్మాణానికి, కర్నూలు జిల్లా కోయిలకుంట్ల మండలం జోలదరాశి వద్ద నిర్మించనున్న ఆనకట్టకు సంబంధించి దువ్వూరు మండలం నేలటూరు వద్ద శంకుస్థాపన శిలాఫలకాలు ఆవిష్కరిస్తారు. అనంతరం అక్కడ జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►సాయంత్రం కడపలో రిమ్స్ పరిధిలో రూ.107 కోట్లతో ఏర్పాటు చేయనున్న క్యాన్సర్ ఆస్పత్రి, రీసెర్చ్ సెంటర్, రూ.175 కోట్లతో నిర్మించే సూపర్ స్పెషాలిటీ విభాగం, రూ.40.80 కోట్లతో నిర్మించే మానసిక చికిత్సాలయం, ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్లకు శంకుస్థాపన చేస్తారు. ఇదే సందర్భంలో కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి సొంత నిధులతో నిరి్మంచిన ఉచిత అన్నదాన, వసతి భవనాన్ని ప్రారంభిస్తారు. ►రూ.20 కోట్లతో కడపలో నిరి్మంచనున్న డి్రస్టిక్ట్ పోలీసు కార్యాలయ భవనాలకు శంకుస్థాపన. ►కడప – రాయచోటి రోడ్డులో రూ.82.73 కోట్లతో నిరి్మంచిన రైల్వే ఓవర్ బ్రిడ్జిని ప్రారంభిస్తారు. ►24వ తేదీ రాయచోటి ప్రాంతంలో రూ.1,272 కోట్లతో ఎత్తిపోతల ద్వారా జీఎన్ఎస్ఎస్ (గాలేరు నగరి సుజల స్రవంతి) – హెచ్ఎన్ఎస్ఎస్ (హంద్రీ నీవా సుజల స్రవంతి) అనుసంధాన పథకానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం రాయచోటి నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు. రాయచోటి జూనియర్ కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ►25వ తేదీ పులివెందులలో రూ.347 కోట్లతో నిరి్మంచనున్న మెడికల్ కళాశాల, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన. రూ.17.50 కోట్లతో నిరి్మంచిన స్పోర్ట్స్ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తారు. -
ఆయనకు మ్యాన్షన్ హౌస్ గురించి బాగా తెలుసు!
సాక్షి, వైఎస్సార్ జిల్లా : మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డిపై జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన విలేకరు సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బెంగుళూరులో క్లబ్బులకు సెలవు కావడంతో జమ్మలమడుగుకు చుట్టపుచూపుగా వచ్చిన ఆదినారాయణరెడ్డి తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆయనకు తోడబుట్టిన అన్నదమ్ములే ఆయన నిజస్వరూపం తెలుసుకొని దూరంగా ఉంచారన్నారు. అన్నదమ్ముల నుంచి కూడా ప్రస్తుతం ఆదినారాయణకు ఎలాంటి సహకారం లేదన్నారు. ఆయనకు ఆసుపత్రిలో రోగులకు ఇచ్చే మందుల గురించి తెలియదు కానీ, ప్రతిరోజు తీసుకునే మాన్షన్ హౌస్ గురించి మాత్రం బాగా తెలుసన్నారు. తాను ఉద్యోగాలు అమ్ముకున్నానని ఆరోపణలు చేస్తున్న మాజీ మంత్రి వాటిని నిరూపిస్తే ఆ క్షణమే రాజీనామా చేస్తానని, దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. ఇప్పటికే అన్ని పార్టీలను మార్చిన ఆయనకు ఇక మిగిలింది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు. -
కమలం గూటికి.. ఆదినారాయణరెడ్డి
సాక్షి ప్రతినిధి కడప: అధికారం ఎక్కడ ఉంటే మాజీమంత్రి ఆదినారాయణరెడ్డి అక్కడే ఉంటారన్న ప్రచారం మరోసారి నిజమైంది. ఆయన సోమవారం ఢిల్లీలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ పార్టీ జాతీయ నాయకుల చేతుల మీదుగా ఆది ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. టీడీపీ అధికారం కోల్పోయిన వెంటనే ఆది బీజేపీలో చేరుతారన్న ప్రచారం సాగినా రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ అడ్డుకోవడంతో ఆలస్యమైంది. నైతిక విలువలను ఏమాత్రం పట్టించుకోరని ఆది రా జకీయ శైలి చెబుతుంది. దివంగత నేత వైఎస్ అధికారంలో ఉన్నంతకాలం ఆయనవద్దే ఉన్నారు. తరువాత టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేను చేసిన వైఎస్ జగన్‌ను కాదని చంద్రబాబు పంచన చేరారు. అధికారం పోయాక ఇప్పుడు బాబును వదిలేశారు. జగన్ పార్టీ ఎలాగూ పార్టీలో చేర్చుకోరని తెలియడంతో బీజేపీలో చేరిపోయారు. ఆలస్యం.. టీడీపీలో చేరి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేతతోపాటు ఆ పార్టీ నేతలపై అవాకులు చెవాకులు పేల్చారు. అవికాస్తా వికటించాయి. జమ్మల మడుగుతోపాటు కడప పార్లమెంటరీ ఓటర్లు గట్టిగా సమాధానం చెప్పారు. కొంతకాలంగా టీడీపీ అధినేత సూచనలతో బీజేపీలో చేరేందుకు మాజీ మంత్రి సిద్ధమయ్యారు. అయితే పరిణామాలు అనుకూలించలేదు. వివిధ చర్చల నేపథ్యంలో ఎట్టకేలకు ఆలస్యంగా బీజేపీలో చేరగలిగారు. అనుచరగణమెవరూ బీజేపీలో చేరేందుకు సుముఖంగా లేరు. ముఖ్య అనుచరులు, సమీప బంధువులుకూడా ఆయనతో కలిసి నడిచేందుకు ఇష్టపడడంలేదు. అధికారం లేకపోతే ఆయన ఉండలేరని ఆయన ధోరణి తెలిసినవారంతా చెబుతారు. ఫ్యాక్షన్ రాజకీయాలను నడిపేందుకు అధికారాన్ని అడ్డుపెట్టుకున్నారన్న విమర్శలు ఉన్నాయి. స్వార్ధం కోసం కింద క్యాడర్ ఏమైపోయినా పట్టించుకోరు. ఇప్పుడు ఆది మరోమారు తన సహజ రాజకీయ స్వభావాన్ని చాటుకున్నారు. దివంగత నేత వైఎస్ అనుచరుడిగా 2004,2009లో జమ్మలమడుగునుండి ఎన్నికయ్యారు. తరువాత జగన్మోహన్రెడ్డి టీంలో 2014లో ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ కుటుంబానికి జమ్మల మడుగు నియోజకవర్గంతో బలమైన అనుబంధం ఉంది. గెలుపోటములు నిర్దేశించేది వైఎస్ కుటుంబ అభిమానులే. గెలిచాక పార్టీ ఫిరాయించి టీడీపీలో చేరడాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన జనం ఆయనకు గుణపాటం నేర్పారు. జమ్మలమడుగులో ఆయన బలపర్చిన సుబ్బారెడ్డిని ఓడించారు. కడప ఎంపీగా పోటీచేసి పరాజయం మూటగట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో సీఎం వైఎస్ జగన్ దగ్గరకు రానిచ్చే అవకాశం లేకపోవడంతో టీడీపీ షెల్టర్ జోన్‌గా సెలక్ట్ చేసిన బీజేపీని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. బాబు మ్యాచ్ ఫిక్సింగ్ మనుగడకోసం తంటాలు పడుతున్న టీడీపీ నేతలకు బీజేపీ ప్రత్యామ్నాయంగా మారింది. చంద్రబాబే కీలక నేతలందరినీ బీజేపీలోకి పంపుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సీఎం రమేష్‌లు ఇదే పంథాలో ఆ పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఇప్పుడు ఆదినారాయణరెడ్డి వంతయింది. ఇన్నాళ్లు పార్టీలో అన్నిరకాల పదవులు అనుభవించి నేతలు పార్టీని వీడి వెళుతున్నా టీడీపీ నేతలెవరూ విమర్శిస్తున్న దాఖలాలు లేవు. దీన్నిబట్టి మ్యాచ్ పిక్సింగ్ వ్యవహారం ఇప్పుడు జనంలో హాట్ టాపిక్ గా మారింది. -
‘కన్నీటి’కుంట...
సాక్షి, జమ్మలమడుగు :నీటిని చూడగానే దిగి ఈతకొట్టాలనిపించింది. కానీ ఆ ఇద్దరు చిన్నారులకు కుంట లోతు తెలియదు..దీంతో వారు కుంటలో దిగిన కాసేపటికే ప్రాణాలు కోల్పోయారు. సోమవారం ఉదయం జమ్మలమడుగు మండలం గూడెంచెరువులో ఈ సంఘటన విషాదఛాయలు మిగిల్చింది. గూడెంచెరువు గ్రామానికి చెందిన లింగారెడ్డి..శివకల్యాణ్ వ్యవసాయ కూలీలు. రెక్కాడితేగాని డొక్కాడని బతుకులు. లింగారెడ్డికి సంజయ్ (9) ఒక్కడే సంతానం. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. శివకల్యాణ్‌కు ఇద్దరు పిల్లలు. పాప బాబు. బాబు లోకేష్(9) కూడా అదే స్కూలులో మూడో తరగతి చదువుతున్నాడు. సంజయ్, లోకేష్‌లు ఇద్దరూ మంచి మిత్రులు. వీరు సోమవారం మొహరం సెలవు వల్ల పాఠశాలకు వెళ్లలేదు. మరో ఇద్దరితో కలిసి కొండ ప్రాంతంలో కలిపండ్లు కోసుకుని వద్దామని గండికోట రహదారిలోకి వెళ్లారు. ఇటీవల కురిసిన వర్షాలతో నీరు చేరిన ఓ కుంట దారిలో కనిపించింది. దీంతో ఇందులో దిగి ఈత కొడదామని సంజయ్, లోకేష్‌లు ఉత్సాహపడ్డారు. ఇంకేమీ ఆ లోచించకుండా వెంటనే నీటిలో దూకారు. ఈ ఇ ద్దరు పిల్లలకు ఈత సరిగా రాదు. 20 అడుగుల లో తుగా ఉన్న కుంటలో చిన్నారులు ఇరుక్కుపోయా రు. ఈతకు దిగని ఇద్దరు మిత్రులు వీరిని చూసి ఆందోళన చెందారు. బయటకు రాలేకపోతున్నారని గ్రహించారు. దీంతో వెంటనే భయపడుతూ ఊళ్లోకి వచ్చి గ్రామస్తులకు విషయం చెప్పారు. గ్రామస్తులు పరుగున వచ్చి కుంటకు చేరుకునేలోగానే లోకేష్..సంజయ్‌లు విగతజీవులయ్యారు. దీంతో స్థానికులు నిశ్చేష్టులయ్యారు. అసువులు బాసిన చిన్నారుల మృతదేహాలను చూసి కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. లోకేష్ తల్లి రెండేళ్ల క్రితం చనిపోయింది. ఈ బాలుడి మృతదేహం వద్ద తండ్రి కుప్పకూలి రోదించాడు. చిన్నారుల మృతికి గ్రామస్తులంతా కంటతడి పెట్టారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ ఎన్.నాగరాజు, అర్బన్‌సీఐ కత్తి శ్రీనివాసులు కుంటవద్దకు చేరుకున్నారు. ఫైర్ అధికారులు,స్థానికులతో కలిసి కుంట నుంచి చిన్నారుల మృతదేహాలను బయటికి తీయించారు. పోస్టు మార్టం కోసం జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
కడపలో బాంబుల భయం.!
సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగుకు బాంబుల మడుగు ఉన్న అపవాదు తొలగిపోయి దశాబ్దాల కాలమైంది. ఈ మధ్య కాలంలో అక్కడక్కడా హత్యలు జరిగినప్పటికి బాంబులను వినియోగించిన సంఘటనలు లేవు. ఇక బాంబుల సంస్కృతి పూర్తిగా చరిత్రలో కలిసిపోయిందనుకుంటున్న తరుణంలో జమ్మలమడుగు ప్రాంతంలో మళ్లీ బాంబుల బకెట్లు బయటపడటం సామాన్య ప్రజానీకాన్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. జమ్మలమడుగు పట్టణ శివారు ప్రాంతంలో రెండు రోజుల క్రితం నాలుగు బకెట్లలో 54 నాటు బాంబులు బయటపడేసరికి స్థానికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. 20 ఏళ్ల క్రితం.. 1999వ సంవత్సరానికి ముందు జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబులు దొరకడం పెద్ద వింతేమీ కాదు. అప్పట్లో నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఫ్యాక్షన్ ఉండటంతో ఇరువర్గాల వద్ద నాటుబాంబులు విరివిగా లభించేవి. వీటి తయారీ కూడా జమ్మలమడుగు ప్రాంతంలోనే జరిగేది. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు సైతం బాంబులను సరఫరా చేసేవారు. బకెట్లలో, లెదర్ బ్యాగులలో బాంబులను తీసుకెళ్లేవారు. కాని 1999లో జమ్మలమడుగు సబ్ డివిజన్‌కు అడిషనల్ ఎస్పీగా వచ్చిన శంకరబాత్రా బాగ్చీ అప్పటి జిల్లా ఎస్పీ గోవింద్‌సింగ్‌ల ప్రత్యేక కృషి వల్ల నియోజకవర్గంలో స్వచ్ఛంద బాంబుల అప్పగింత కార్యక్రమం జరిగింది. ఫ్యాక్షనిస్టుల వద్ద నుంచి వేల సంఖ్యలో బాంబులను స్వాధీనం చేసుకుని అప్పట్లో పోలీసులు రికార్డు సృష్టించారు. ఆ తర్వాత బాంబుల వాడకం క్రమేపీ తగ్గుతూ వచ్చింది. ఇక వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామ స్థాయి నేతలు సైతం అభివృద్ధి, ఆదాయాలపై దృష్టి సారించడంతో గ్రామాల్లో ఫ్యాక్షనిజం దాదాపు కనుమరుగైపోయింది. గత పది సంవత్సరాలుగా జమ్మలమడుగు ప్రాంతంలో నాటుబాంబుల మాటే వినబడలేదు. ఇప్పుడు తాజాగా బయటపడుతున్న నాటుబాంబులు జమ్మలమడుగు ప్రాంతంలో కలకలం సృష్టిస్తున్నాయి. మొన్న రామచంద్రాయపల్లె..నిన్న జమ్మలమడుగు... ఇటీవల రెండు వారాల క్రితం మైలవరం మండలం రామచంద్రాయపల్లె గ్రామంలో రెండు దశాబ్దాల క్రితం దాచిపెట్టిన బాంబుల బకెట్ బయట పడింది. పొక్లెయిన్‌తో పొలం గట్లను చదును చేస్తున్న సమయంలో కనిపించిన బాంబుల బకెట్‌ను పరిశీలిస్తున్న సమయంలో అందులోని బాంబులు పగిలి పొలం యజమాని కుమారుడు గాయపడ్డాడు. ఆ సంఘటన మరువక ముందే మంగళవారం జమ్మలమడుగు పట్టణ శివార్లలో , ముద్దనూరు రహదారిలో భూములను కొనుగోలు చేసి వాటిని ఫ్లాట్లుగా మార్చుతున్న క్రమంలో భూమి లోపల నాలుగు బాంబుల బకెట్లు బయటపడటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వతేదీ జమ్మలమడుగుకు వచ్చిన సందర్భంగా ముద్దనూరు రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు కేవలం మూడు వందల మీటర్ల దూరంలోనే ఈ నాటు బాంబులు దొరకడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనకు వస్తున్నప్పుడు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలి. అలాంటిది హెలిప్యాడ్‌కు సమీపంలోనే ఉన్న పొలంలోనే నాటుబాంబులు బయటపడటం నిఘా వైఫల్యానికి పరాకాష్టగా నిలిచింది. ముఖ్యమంత్రి పర్యటనకు ప్రస్తుతం దొరికిన నాటుబాంబులకు ఎలాంటి సంబంధం లేకపోవచ్చు గాని శిక్షణ పొందిన బాంబ్‌స్క్వాడ్ సభ్యులు సీఎం పర్యటన సందర్భంలో వీటిని ఎందుకు పసిగట్టలేకపోయారనేది అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. ముఖ్యమంత్రి సభకు విచ్చేసిన ప్రజల్లో కొందరు మలమూత్ర విసర్జన నిమిత్తం ఆ పరిసరాలలో సంచరిస్తున్నప్పుడు పొరపాటున జరగరానిది ఏదైనా జరిగి ఉంటే బాధ్యులు ఎవరన్న ప్రశ్నకు నిఘా విభాగమే జవాబు చెప్పాలి. -
జమ్మలమడుగులో బాంబుల కలకలం
సాక్షి, కడప : వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో నాటు బాంబులు బయటపడ్డ ఘటన కలకలం రేపుతోంది. ముద్దనూరు రోడ్డులోని ఓ ఖాళీ స్థలంలో లే అవుట్ వేసేందుకు భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడటంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు బాంబులను జాగ్రత్తగా వెలికి తీస్తున్నారు. ఇప్పటివరకూ 54 నాటు బాంబులను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు మాట్లాడుతూ... జేసీబీతో భూమిని చదును చేస్తుండగా బక్కెట్లో నాటు బాంబులు బయటపడ్డాయి. వీటిని గతంలోనే భూమిలో పాతి పెట్టి ఉంటారని భావిస్తున్నామని, దీనిపై విచారణ చేస్తున్నట్లు వెల్లడించారు. కాగా వారం రోజుల క్రితం పొలం గట్లు కోసం తవ్వుతుండగా బాంబుల బయటపడిన విషయం తెలిసిందే. -
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
-
జమ్మలమడుగు సీఎం జగన్ సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న కలెక్టర్
-
రేపు వైఎస్సార్ జిల్లాలో సీఎం జగన్ పర్యటన
సాక్షి, కడప: రైతు దినోత్సవం సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్ఆర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జమ్మలమడుగులో నిర్వహించనున్న భారీ బహిరంగసభలో పాల్గొననున్నారు. ఈ మేరకు సీఎం టూర్ షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించారు. ఉదయం 7 గంటలకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తన నివాసగృహం నుంచి బయల్దేరి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. 7 గంటల 30 నిమిషాలకు గన్నవరం నుంచి విమానంలో కడప బయల్దేరి వెళ్తారు. 8 గంటల 15 నిమిషాలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 8గంటల 35 నిమిషాలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో బయల్దేరి వైఎస్ఆర్ సమాధి వద్దకు చేరుకుని నివాళులర్పిస్తారు. ఆ తర్వాత వైస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొంటారు. అనంతరం రోడ్డు మార్గంలో బయల్దేరి 9గంటల 35 నిమిషాలకు గండి వీరాంజనేయస్వామిని దర్శించుకుంటారు. పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు చేస్తారు. తిరిగి గండి టెంపుల్ నుంచి రోడ్డుమార్గంలో బయల్దేరి ఇడుపులపాయ చేరుకుంటారు. 10గంటల 20 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి 10గంటల 40 నిమిషాలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు చేరుకుంటారు. 10గంటల 50 నిమిషాలకు రైతు దినోత్సవ సభాస్థలికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. కార్యక్రమంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలిస్తారు. అనంతరం 11గంటల 15 నిమిషాల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట 15 నిమిషాల వరకు వైఎస్ఆర్ రైతు దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. అనంతరం తిరిగి తాడేపల్లికి పయనమవుతారు. సభ ముగిసిన వెంటనే ఒంటిగంట 35 నిమిషాలకు కన్నెలూరు నుంచి హెలికాప్టర్లో బయల్దేరి కడప విమానాశ్రయానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 2:00 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి బయల్దేరి 2గంటల 40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో తాడేపల్లిలోని తన నివాసానికి చేరుకుంటారు సీఎం వైఎస్ జగన్. సీఎం వైఎస్ జగన్ పర్యటన ఇలా సాగనుంది.. ఉదయం 7 గంటలకు సీఎం వైఎస్ జగన్ ఇంటి నుంచి గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు 7:30 గంటలకు గన్నవరం నుంచి విమానంలో కడపకు బయలుదేరుతారు 8:15 గంటలకు కడప ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో ఇడుపులపాయకు వెళ్తారు 8:35 గంటలకు ఇడుపులపాయ ఎస్టేట్‌కు సీఎం వైఎస్ జగన్ చేరుకుంటారు 8:45 గంటలకు రోడ్డుమార్గంలో వైఎస్ఆర్ సమాధి వద్దకు వెళ్తారు 8:50 నుంచి 9:10 గంటల మధ్య వైస్ఆర్ ఘాట్ వద్ద నిర్వహించే ప్రత్యేక ప్రార్థనల్లో వైఎస్ జగన్ పాల్గొంటారు 9:35 గంటలకు గండి వీరాంజనేయస్వామి దర్శనం చేసుకుంటారు 10:00 గంటలకు గండిలో పలు అభివృద్ధి పనులకు సీఎం వైఎస్ జగన్ శంకుస్థాపనలు చేస్తారు 10:05 గంటలకు గండి టెంపుల్ నుంచి రోడ్డుమార్గంలో ఇడుపులపాయకు వెళ్తారు 10:20 నిమిషాలకు ఇడుపులపాయ నుంచి హెలికాప్టర్లో బయల్దేరి.. 10:40 గంటలకు జమ్మలమడుగు మండలం కన్నెలూరు సీఎం జగన్ చేరుకుంటారు. 10:50 గంటలకు సభాస్థలి వద్దకు వెళ్తారు 10:55 గంటల నుంచి 11:15 స్టాళ్లను పరిశీలన 11:15 గంటల నుంచి మధ్యాహ్నం 1:15 పబ్లిక్ మీటింగ్ 1:35 గంటలకు కన్నెలూరు నుంచి హెలికాప్టర్లో కడప విమానాశ్రయానికి 2:00 గంటలకు కడప ఏయిర్పోర్ట్ నుంచి బయల్దేరి.. 2:40 నిమిషాలకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు 3:10 గంటలకు తాడేపల్లిలోని నివాసానికి సీఎం వైఎస్ జగన్ తిరిగి చేరుకుంటారు -
రైతు సంక్షేమమే మా ధ్యేయం: కన్నబాబు
సాక్షి, కడప : రైతు సంక్షేమమే తమ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని పునరుధ్ఘాటించారు వ్యవసామశాఖ మంత్రి కన్నబాబు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా సోమవారం రైతు దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించనున్నారు. జిల్లాలోని జమ్మలమడుగులో ముఖ్యమంత్రి జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖమంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్ జయంతి రోజున రైతు దినోత్సవం వేడుకలు జరపబోతున్నామని, రైతు మిషన్‌లో వ్యవసాయంపై ముఖ్యమంత్రి జగన్ సుదీర్ఘంగా చర్చలు జరిపారని తెలిపారు. గత ప్రభుత్వం వ్యవసాయంపై చేసిన అశ్రద్ధ వల్లే ప్రస్తుతం విత్తనాల కొరత ఏర్పడిందని మండిపడ్డారు. దీనికి పరిష్కారంగా ఒరిస్సా, బరోడా, కర్నాటక నుంచి విత్తనాలను తెప్పిస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది తగినంత వర్షపాతం నమోదు కాకపోవడం దురదృష్టకరమని, తీవ్రంగా నష్టపోయిన శనగ రైతులను ఆదుకుంటామని స్పష్టం చేశారు. కడపలో 78.5 మి.మీ వర్షపాతం నమోదైందని తెలిపిన మంత్రి కన్నబాబు చీని రైతులను ఆదుకునేందుకు ట్యాంకర్లతో నీటిని అందిస్తామని పేర్కొన్నారు. -
రైతు దినోత్సవానికి సన్నాహాలు
సాక్షి, అమరావతి: దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఈ నెల 8 తేదీన(సోమవారం) రాష్ట్రవ్యాప్తంగా రైతు దినోత్సవాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నద్ధమైంది. రైతు సాధికారత కోసం కృషి చేసిన వైఎస్సార్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర రైతు దినోత్సవంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. రైతు దినోత్సవ సందర్భంగా అన్ని జిల్లాల్లో కార్యక్రమాలు జరుగనున్నాయి. నియోజకవర్గానికి లక్ష రూపాయలు విడుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. అలాగే రైతు దినోత్సవం నిర్వహణకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. వైఎస్సార్ పింఛన్ పథకానికి శ్రీకారం రైతు దినోత్సవం సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం జమ్మలమడుగులో రైతు దినోత్సవ సభలో పాల్గొంటారు. వైఎస్సార్ పింఛన్ పథకాన్ని ఈ వేదిక నుంచే ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. అలాగే మరికొన్ని సంక్షేమ పథకాలను కూడా ఇక్కడి నుంచే ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ సభలో రైతన్నల సంక్షేమానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలను ప్రకటించే అవకాశం ఉంది. అన్నదాతల సంక్షేమం కోసం వైఎస్ జగన్ ఇప్పటికే వైఎస్సార్ రైతు భరోసా పథకాన్ని ప్రకటించారు. పెట్టుబడి సాయం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి రూ.12,500 చొప్పున అందించనున్నారు. వాస్తవానికి ఈ కార్యక్రమం వచ్చే ఏడాది ఖరీఫ్ నుంచి ప్రారంభం కావాల్సి ఉన్నా రైతు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది అక్టోబర్‌లో మొదలయ్యే రబీ నుంచే ప్రారంభిస్తున్నారు. ఉచిత బోర్ల పథకాన్ని, ఉచిత పంటల బీమా, పెట్టుబడి సాయాన్ని (ఇన్పుట్ సబ్సిడీ) కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన సంగతి తెలిసిందే. అలాగే వైఎస్సార్ జిల్లా పులివెందులలో అరటి పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నారు. జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్రలో ఈ మేరకు హామీ ఇచ్చారు. ఆ హామీని నిలబెట్టుకోబోతున్నారు. సభావేదిక ప్రాంతం ఖరారు జమ్మలమడుగులో నిర్వహించబోయే రైతు దినోత్సవ సభావేదిక ప్రాంతాన్ని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, కలెక్టర్ హరికిరణ్ గురువారం పరిశీలించారు. ముందుగా ముద్దనూరు రోడ్డులో ఉన్న పతంగే రామన్నరావు క్రీడా ప్రాంగణాన్ని పరిశీలించారు. అయితే వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో జమ్మలమడుగు పట్టణానికి మొదటిసారిగా వస్తుండటంతో ఈ సభకు వేలాది మంది ప్రజలు తరలివచ్చే అవకాశం ఉందని, అందువల్ల ఈ ప్రాంగణం సరిపోదని స్థానిక నాయకులు సూచించారు. దీంతో ముద్దనూరు రోడ్డులోని రోజా టవర్స్ వెనుక వైపు ఉన్న ఖాళీ ప్రదేశాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతం అందరికీ ఆమోద యోగ్యం కావడంతో అక్కడే ముఖ్యమంత్రి సభావేదికను ఖరారు చేశారు. హెలిప్యాడ్ కోసం సభావేదిక ప్రాంతం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రాంతాన్ని పరిశీలించారు. -
బాధితులపై కానిస్టేబుళ్ల దాడి
సాక్షి, జమ్మలమడుగు(కడప) : న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లిన బాధితులపై కానిస్టేబుళ్లు దాడి చేశారు. ఈ ఘటన గురువారం రాత్రి చోటు చేసుకుండి. నెహ్రూనగర్ వీధికి చెందిన మహిళా వలంటీర్ ఝాన్సీ కుటుంబ సభ్యులతో కలిసి తమని వేధిస్తున్న నరసింహులుపై ఫిర్యాదు చేయటానికి పోలీసు స్టేషన్‌కు వెళ్లింది. పోలీసులు బాధితులపై దాడి చేయడంతోపాటు అసభ్యపదజాలంతో దూషించారు. బాధితులు స్టేషన్ బయట బైఠాయించి న్యాయం చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరుకు చెందిన నరసింహులు పట్టణంలోని నెహ్రూనగర్‌కు చెందిన ఝాన్సీని వేధిస్తున్నాడు. గురువారం సాయంత్రం నరసింహులు ఝాన్సీ ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో గొడవ పడ్డాడు. ఇంట్లో ఉన్న ఝాన్సీ భర్త సురేష్‌పై దాడి చేశాడు..కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేసేందుకు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. కానిస్టేబుళ్లు ప్రకాశ్,వాసు తమపై దాడి చేసి అసభ్యపదజాలంతో దూషించినట్లు బాధితులు తెలిపారు. కానిస్టేబుల్ వాసు ఝాన్సీ అన్న చెన్నయ్యపై చేయి చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఝన్సీ మాట్లాడుతూ తమపై దాడి చేసిన కానిస్టేబుళ్లపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఝన్సీ ఇంటిపై దాడికి వెళ్లిన నరసింహులు, చెన్నయ్యపై చేయి చేసుకున్న కానిస్టేబుళ్లపై బాధితులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని డీఎస్పీ కోలా కృష్ణన్ సీఐ శ్రీనివాసులకు సూచించారు. బాధితుల ఇచ్చిన ఫిర్యాదు మేరకు రెండు కేసులను నమోదు చేస్తున్నట్లు సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. -
‘వరుణదేవుడి సాక్షిగా మరో 20 ఏళ్లు జగనే సీఎం’
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : వరుణదేవుడు సాక్షిగా మరో ఇరవై ఏళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధిర్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షమే లేకుండా అత్యధిక స్థానాలు దక్కించుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో అదరించడం వల్ల రాయలసీమ కులదేవుడైన వెంకన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారాయన. మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని కోనంపేటలోకి ప్రవేశించిన పాదయాత్ర బుధవారం రాత్రి రాయచోటి పట్టణం చేరుకోంది. ఈసందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాసాపేట లోని వేంపల్లి క్రాస్ వద్ద బాణసంచాలు కాల్చడంతో పాటు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. (చదవండి : జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర) ఈ సందర్భంగా సాక్షి తో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్ పాలనలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, రాయచోటి లకు సాగు, త్రాగు నీరు రావడంతో జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. తాను పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి వర్షం ఆగకుండా వస్తూనే వుందన్నారు. చంద్రబాబు పాలన పోయింనందుకు వానదేవుడు కరుణిస్తున్నాడని తెలిపారు. వేరుశనగ పంటకు 6.5 వేలు గిట్టుబాటు ధర కల్పించడం అలాగే గండికోట నిర్వాసితులకు పునారావసం క్రింద పది లక్షల ప్యాకేజి ప్రకటించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం నేంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయమన్నారు. రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడది చేసి సుండుపల్లి, వాయిలివడ్డు బిడికి మీదుగా పాదయాత్ర తిరుపతికి చేరుతుందన్నారు. -
జగన్ ‘ఉక్కు’సంకల్పం
వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టడంతో జిల్లాలో ఉక్కు కర్మాగారం నెలకొల్పడం తథ్యమని జిల్లావాసులు గట్టిగా నమ్ముతున్నారు. తాను ఎన్నికల్లో చెప్పిన విధంగా ఉక్కు కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కొత్త సీఎం చర్యలు ప్రారంభించారు. ఇటీవల ఓ విదేశీ సంస్థ ప్రతినిధులతో ఆయన చర్చలు జరిపారు. కొంత పురోగతి కనిపించింది. వైఎస్ రాజశేఖరరెడ్డి సారథ్యంలో గతంలో ఉక్కు కర్మాగారానికి శంకుస్థాపన జరిగి ఆయన మరణానంతరం పనులు నిలిచిపోయాయి. మళ్లీ ఆయన తనయుడు జగన్ నేతృత్వంలో ఉక్కు కర్మాగారం వచ్చి తీరుతుందని జిల్లాప్రజలు ఆశిస్తున్నారు. సాక్షి, జమ్మలమడుగు(కడప) : జమ్మలమడుగు మండలంలో స్టీల్‌ప్లాంట్ నిర్మాణంపై తాజాగా ఆశలు చిగురిస్తున్నాయి. 2007లో చిటిమిటి చింతల వద్ద బ్రాహ్మణి స్టీల్‌ప్లాంట్ నిర్మాణానికి అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. రూ.20వేల కోట్లతో దీనిని నిర్మించేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్‌రెడ్డి అప్పట్లో ముందుకు వచ్చారు. 10వేల మిలియన్ టన్నుల సామర్థ్యంతో నిర్మించాలని సంకల్పించారు. స్టీల్‌ప్లాంట్ నిర్మాణం కోసం 10,670 ఎకరాల భూమిని సేకరించారు. అక్కడే దీనికి అవసరమైన విమానాశ్రయం కోసం మరో 4వేల ఎకరాల భూమిని కేటాయించారు. ఎకరాకు రూ.18వేల వంతున నాటి యాజమాన్యం భూములను కొనుగోలు చేసింది. 2009లో అనూహ్య దుర్ఘటనలో వైఎస్ రాజశేఖరరెడ్డి అసువులు బాయడంతో స్టీల్‌ప్లాంట్ పనులు నిలిచిపోయాయి. రూ.1300 కోట్ల పనులు.. రూ.20వేల కోట్లతో నాలుగు దశల్లో స్టీల్ ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో నిర్మిస్తామని యాజమాన్యం ప్రకటించింది. మొదట రూ.5వేల కోట్లతో 2.5 మిలియన్ టన్నుల సామర్థ్యంగల ప్లాంటు నిర్మాణం పనులకు శ్రీకారం చుట్టింది. రూ.1300 కోట్లతో పనులు కూడా చేపట్టారు. ప్లాంట్ నీటి అవసరాలకు గండికోట ప్రాజెక్టు నుంచి రెండు టీఎంసీలను ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులను విడుదల చేసింది. మైలవరం జలాశయం నుంచి నీటిని ఇస్తామని వైఎస్ ప్రభుత్వం చెప్పింది. జరిగిన పనులివి 140 గదులతో అతిథి గృహాలను నిర్మించారు. బ్లాస్ట్‌ఫర్నేస్, కోకోవన్..స్లీట్ వెల్డింగ్‌షాపు, పవర్ ప్లాంట్..సబ్స్టేషన్ల పనులు పూర్తయ్యాయి. రిజర్వాయర్ సెంట్రల్ ప్లాంట్ పనులు కూడా పూర్తయ్యాయి. వైఎస్ చనిపోయినప్పటి నుంచి పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం 2012లో స్టీల్‌ప్లాంట్‌కు ఇచ్చినభూములను వెనక్కితీసుకుంది. వివాదం కోర్టుకు వెళ్లడంతో భద్రపరిచారు. దానికి సంబంధించిన భూమిని కాకుండ మిగతా భూమి అంతా ప్రభుత్వ ఆధీనంలో ఉంది. స్టీల్ఫ్లాంట్ యాజమాన్యం కొర్టుకు వెళ్లింది.దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.దీంతో ప్లాంటు కోసం విదేశాలనుంచి దిగుమతి చేసుకున్న సామగ్రిని బ్రహ్మిణిలో భద్రపరిచారు. దానికి సంబంధించిన భూమి కాకుండ మిగతా భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉంది. దీనికి సంబంధించిన వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న... రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మొదటి సారిగా 2014లో ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర విభజన సమయంలో కడప జిల్లాకు స్టీల్‌ప్లాంట్ ఏర్పాటు చేయాలని చట్టంలో పొందుపరిచారు. 2014లో ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్ నిర్మాణం గురించి పట్టించుకోలేదు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో కంటితుడుపుగా 2018 డిసెంబర్లో మైలవరం మండలంలోని కంబాలదిన్నె వద్ద స్టీల్ ప్లాంటు నిర్మాణం కోసం పైలాన్‌ను ఆవిష్కరించారు. పైలాను కోసం రెండుకోట్ల రూపాయలు వెచ్చించడం విశేషం. ఈ నేపథ్యంలో మొన్నటి ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అధినేతగా వైఎస్ జగన్మోహన్రెడ్డి స్టీల్‌ప్లాంటు నిర్మిస్తామని జిల్లా వాసులకు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీల అమలుకు సీఎంగా పగ్గాలు చేపట్టిన వెంటనే ఆయన వడివడిగా అడుగులు వె?స్తున్నారు. అందులో భాగంగానే స్టీల్‌ప్లాంటుపై కూడా ఆయన గట్టి సంకల్పంతో ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రూ.30వేల కోట్లతో రాష్ట్రంలో స్టీల్‌ప్లాంట్ ఏర్పాటుకు కొరియాకు చెందిన పోస్కో స్టీల్ కంపెనీ ఆసక్తి చూపింది. ముఖ్యమంత్రితో ఈ సంస్థ ప్రతినిధులు చర్చించారు. విశాఖ వంటి భారీ ప్లాంటు నిర్మిస్తామని సంస్థ ప్రతినిధులు చెప్పినట్లు తెలిసింది. అయితే ఈ తరహాలో కడపజిల్లాలో ఏర్పాటుకు తగిన పరిస్థితులు చూడాలంటూ ముఖ్యమంత్రి వారికి సూచించిట్లు తెలుస్తోంది. చర్చలన్ని సానుకూలంగా జరిగి సఫలమైతే మరో మూడు నెలలు లేదా డిశెంబర్ చివరిలోగా స్టీలుప్లాంటు శంకుస్థాపన జరుగుతుందని భావిస్తున్నారు. -
మొక్కు తీర్చుకుంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన మొక్కును తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర ద్వారా వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడంతో ఆయన కోరిక నెరవేరింది. దీంతో సుధీర్‌రెడ్డి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి నుంచి తిరుమల వరకు ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయంలో ఇప్పటికే రాష్ట్రం సువర్ణ పరిపాలన దిశగా అడుగు వేస్తోందన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి జమ్మలమడుగు అభివృద్ధి దిశగా పయనించడమే తన కోరిక అని సుధీర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
తలాక్ చెప్పావ్..మరి నా కట్నం తిరిగివ్వవా!
సాక్షి, జమ్మలమడుగు(కడప) : తనకు న్యాయం చేయాలంటూ ఓ వివాహిత పోలీస్ స్టేషన్ ముందు బైఠాయించింది. బాధితురాలి కథనం మేరకు.. పెద్దముడియం మండలం జంగాలపల్లెకు చెందిన మహబూబ్‌ప్యారీకి కర్నూల్‌జిల్లాకు చెందిన హుస్సేన్‌బాషాతో ఏడాది క్రితం పెళ్లయింది. పెళ్లి సమయంలో 20తులాల బంగారం, నగదు, తదితర సామగ్రి ఇతనికి కానుకలుగా ఇచ్చారు. ఏడాది తిరగకమునుపే భార్యపై అనుమానం పెంచుకుని వేధించేవాడు. దీంతో తల్లిదండ్రులు తమకుమార్తెను స్వగ్రామానికి తీసుకు వచ్చారు. ఈనేపథ్యంలో సంప్రదాయం ప్రకారం తలాక్ రాసిస్తే బంగారం తిరిగి ఇస్తామంటూ కొందరు పెద్దమనుషులు రంగంలోకి దిగారు. శుక్రవారం ఖాజీ సయ్యద్ మహమ్మద్‌జిలాని వద్ద పెద్దమనుషులు ఆమెతో తలాక్ రాయించారు. వివాహ సమయంలో ఇచ్చినవి తిరిగిస్తామని చెప్పిన మధ్యవర్తులు మాటమార్చి రూరల్‌సీఐ కార్యాలయం వద్ద పంచాయితి పెట్టారు. చివరకు తాము ఇవ్వమని.. ఏంచేసుకుంటారో చేసుకోండంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. పోలీసులు కూడా నిందితుల పక్షం వహించారని భావించిన మహబూబ్‌ప్యారీ పోలీసు స్టేషన్ ముందు బైఠాయించింది. హుస్సేన్ బాషాను పోలీసుల సంరక్షించడం చూస్తుంటే తమకు న్యాయం కలగడం లేదని బాధితురాలి కుటుంబ సభ్యులు వాపోతున్నారు. -
జమ్మలమడుగు పోలీసులా..?..మజాకా.?
సాక్షి, కడప: దివ్య (సామాజిక బాధ్యతా రీత్యా పేరు మార్చాం) వయస్సు 19 ఏళ్లు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని ఓ పల్లెకు చెందిన ఆమె తన తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె. తల్లిదండ్రులు కూలీ చేసుకుంటూ తమ స్థోమత కొద్ది అమ్మాయిని చదివిస్తున్నారు. ప్రస్తుతం ఆమె జమ్మలమడుగు డివిజన్లోని ఓ ప్రైవేటు నర్సింగ్ కళాశాలలో జీఎన్ఎం కోర్సు చదువుతోంది. ఈ నెల 1 నుంచి పది రోజులపాటు కళాశాలకు సెలవు ప్రకటించడంతో అమ్మాయి 1వ తేదీ శనివారం ఉదయం 8 గంటలకు ఊరికి వెళుతున్నట్లు కళాశాలలో సంతకం చేసి బయటికి వచ్చింది. సాయంత్రమైనా ఆమె ఊరు చేరలేదు. అమ్మాయి ఆచూకీ కోసం ఆమె తండ్రి బంధువులను ఆరా తీశారు. స్నేహితులకు ఫోన్ చేశారు. మీ అమ్మాయి కళాశాల బయటికి రాగానే ఎవరో ముగ్గురు అబ్బాయిలు ఆటోలో వచ్చి తీసుకెళ్లారని ఓ స్నేహితురాలు చెప్పడంతో 2వ తేదీ ఆదివారం ఉదయాన్నే అమ్మాయి తల్లిదండ్రులు జమ్మలమడుగు అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. పది రోజులు దాటింది. అమ్మాయి ఆచూకీ కోసం పోలీసులు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. దర్యాప్తు మాట అటుం చితే కనీసం ఆమె సొంత ఊరి వైపు కూడా కన్నెత్తి చూడలేదంటే అమ్మాయిల అదృశ్యాల పట్ల జమ్మలమడుగు పోలీసులు ఏ మేరకు శ్రద్ధ కలిగి ఉన్నారో ఇట్టే అర్థమవుతోంది. ఆ ఒక్క కారణంతోనే...... అమ్మాయి తన గ్రామానికి చెందిన మరో అబ్బాయితో కలిసి వెళ్లిందని..వారిద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారని బయట ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని అమ్మాయి తండ్రి కూడా ధ్రువీకరించారని పోలీసులు చెబుతున్నారు. అయితే అమ్మాయి ఇష్టపూర్వకంగానే వెళ్లిందా? లేక బలవంతంగా తీసుకెళ్లారా? బెదిరించి ఇంతకాలం తమ వద్దే ఉంచుకున్నారా? అన్న విషయాలపై పోలీసులు కనీసం ఆరా కూడా తీయలేదు. అమ్మాయి అదృశ్యం కేసులో జమ్మలమడుగు పోలీసులు ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ‘సాక్షి’పరిశీలించగా ఒకే ఒక్క అంశం స్పష్టంగా కనిపించింది. ఫిర్యాదు చేసిన అమ్మాయి తండ్రి పేదవాడు..పలుకుబడి లేని వాడు.....ఇంతవరకు ఏ ఒక్క నాయకుడితో కూడా ఫోన్ చేయించలేకపోయారు....ఈ ఒక్క కారణంతోనే అమ్మాయి అదృశ్యంపై పోలీసులు కనీస దర్యాప్తు కూడా చేపట్టలేదన్నది స్పష్టంగా తెలుస్తోంది. జరగరానిది ఏదైనా జరిగితే..... ఒక్కగానొక్క కూతురు. 19 ఏళ్లపాటు కంటికి రెప్పలా కాపాడుకున్నారు ఆ తల్లిదండ్రులు. ఇప్పుడు తమను కాదని వెళ్లిపోయింది. (బలవంతంగానో, ఇష్టపూర్వకంగానో తెలియదు) భవిష్యత్తులో ఆ కిడ్నాపర్లు తన బిడ్డను ఏమైనా చేసి తిరిగి ఆ నిందను తనపైనే నెడితే....ఇదీ ఆ కన్న తండ్రి ఆవేదన. ఎలాగూ తన బిడ్డ గడప దాటిపోయింది. ఒకవేళ ఇష్టపూర్వకంగానే వెళ్లి ఉంటే అదే విషయాన్ని పోలీసుల ఎదుట ధ్రువీకరిస్తే అంతే చాలంటున్నారు బాధిత తండ్రి. ఇదే విన్నపాన్ని పోలీసులతో చెబుతామని చివరిసారిగా బుధవారం స్టేషన్‌కు వెళ్లారు. అయితే పోలీసులు ఈసారి మరీ కటువుగా మాట్లాడారు. ఇదొక్క కేసైనా మాకు? ఇంకేవీ ఉండవా? అంటూ మరోమాటకు ఛాన్సు ఇవ్వకుండా బయటికి పంపించివేశారు. ఏనాడూ పోలీసు గుమ్మం మెట్లక్కని ఆ అభాగ్యుడికి ఇంతకంటే పెద్ద ఆఫీసర్ వద్దకు వెళ్లి తన గోడు వెళ్లబోసుకునే ధైర్యం లేదు. ఆర్థిక స్థోమత లేని, రాజకీయ అండదండలు అసలే లేని ఆ కన్న తండ్రికి ఈ జన్మలో న్యాయం జరగదా? ఏమో జమ్మలమడుగు పోలీసులే జవాబు చెప్పాలి. కాదు...కూడదంటే పిలిపిస్తాం! అమ్మాయి అదృశ్యం కేసు విషయమై ‘సాక్షి’జమ్మలమడుగు అర్బన్ ఎస్ఐ ధనుంజయుడును వివరణ కోరగా ‘అమ్మా యి, అబ్బాయి ఇష్టపూర్వకంగానే వెళ్లినట్లు మా దృష్టికి వచ్చింది. ఇద్దరూ మేజర్లేనని తెలిసింది. ఇంతవరకు వారిని స్టేషన్‌కు పిలిపించలేదు. అమ్మాయి తండ్రి కాదు....కూడదు..... అని పట్టుబడితే వారిద్దరినీ స్టేషన్‌కు తీసుకు వస్తాం. దీని కెందుకింత రాద్దాంతం’అంటూ సింపుల్‌గా జవాబిచ్చారు. -
జమ్మలమడుగులో గాలివాన బీభత్సం
-
‘ఆది’ నుంచి పార్టీ అంతం వరకూ...
సాక్షి ప్రతినిధి కడప : టీడీపీ నేలవిడిచి సాము చేసింది. ప్రజా శ్రేయస్సును విస్మరించి పాలకపక్షం స్వార్ధానికి అగ్రాసనమేసింది. పోల్ మేనేజ్మెంట్ నేర్పుంటే గెలుపొందుతామనే ధీమాతో వ్యవహరించింది. ఇదే? దిశగా టీడీపీ అధినేత పావులు కదిపారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆదినారాయణరెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. చంద్రబాబు అంచనాలకు తగ్గట్లుగా ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆదినారాయణ వ్యూహం పన్నారు. జిల్లాలోని 831 మంది సభ్యులున్న ఎన్నికల్లో సామ దాన దండోపాయాలను ప్రదర్శించారు. ఫలితంగా ఆ ఫలితాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. ప్రత్యక్షంగా పోలీసుల ద్వారా బెదిరింపులకు పాల్పడి, దాదాపు రూ.100కోట్లు పైగా ఖర్చు చేసి ఎమ్మెల్సీ స్థానాన్ని దక్కించుంది. అప్పట్లో 38ఏళ్లు రాజకీయ చరిత్రను 38ఓట్లతో కూల్చామని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి విర్రవీగేవారు. టీడీపీ నేతలు ‘వాపు చూసి బలుపు’అని భ్రమించారు. ఆపై నిస్సిగ్గుగా ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన్ప్పటికీ ఆదినారాయణరెడ్డికి మంత్రి పదవి కట్టబెట్టారు. అమాత్య పదవి రాగానే అంతా తానై టీడీపీలో చక్రం తిప్పారు. అదే ఇప్పుడు పార్టీని నాశనం చేసిందని ఆ పార్టీ సీనియర్లు బాహాటంగా వ్యాఖ్యానిస్తున్నారు. ఆది తీరుకు తీర్పు... పులివెందుల వేదికగా వైఎస్ కుటుంబాన్ని దూషిస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తనకు అగ్రపీఠం వేస్తారని ఆదినారాయణ రెడ్డి భావించారు. అధికారానికి ఆయనలోని అహంకారం జత కలిసింది. అప్పటినుంచి వైఎస్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. 2017 జనవరి 12న సింహాద్రిపురం మండలం పైడిపాళెం ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా జిల్లా అధికారులు, ప్రజలు సాక్షిగా వైఎస్ కుటుంబసభ్యుల్ని చెప్పుతో కొట్టాలని మంత్రి బాహాటంగా వ్యాఖ్యానించారు. ఈ మాటలకు యావత్తు ప్రజానీకం విస్తుపోయారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా ఎంపికై ఆ పార్టీ పదవి అనుభవిస్తూ ఆదిరించిన కుటుంబాన్ని దూషించడాన్ని జిల్లా వాసులు తట్టుకోలేకపోయారు. కలత చెందారు. తర్వాత కూడా ఆది మరింతగా రెచ్చిపోయారు. తాను మాత్రమే వైఎస్ కుటుంబానికి దీటుగా నిలవగలనే స్థాయిలో ప్రతిసందర్భంలోనూ విపరీత వ్యాఖ్యానాలు చే?సేవారు. సమయం కోసం జనం నిరీక్షించారు. తాజా ఎన్నికల్లో ప్రజలు తీర్పుతో బదులిచ్చారు. ఆదితో టీడీపీ అభ్యర్థులందరినీ దారుణంగా ఓడించారు. 2014 ఎన్నికల్లో వరకూ ప్రత్యక్ష రాజకీయాలకు ఏమాత్రం సంబంధం లేని శ్రీనివాసులరెడ్డి కడప ఎంపీ అభ్యర్థిగా పోటీచేసి వైఎస్సార్సీపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డి చేతిలో 1,90,323 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజా ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి స్వయంగా పోటీచేసి అవినాష్‌రెడ్డి చేతిలో 3,80,976 ఓట్లు తేడాతో ఓడిపోయారు. జమ్మలమడుగులోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. టీడీపీ అభ్యర్థి 51,641 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీనిని బట్టి ఆది పట్ల ప్రజలు ఏ స్థాయిలో కసితో ఉన్నారో అర్థం చేసుకోవచ్చని విశ్లేషకులంటున్నారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లుగా ప్రజలు వైఎస్ కుటుంబ సభ్యుల్ని కాకుండా దేవగుడి కుటుంబసభ్యుల్ని ఓట్ల ద్వారా తొమ్మిదిన్నర్ర చెప్పుతో కొట్టారని వారు విశ్లేషిస్తున్నారు. ఆదికి ఆరు గురు సోదరులు, ఇరువురు రాజకీయ వారసులు, బావ.. మొత్తం తొమ్మిది మంది ఒక్కో ప్రాంతానికి ఇన్ఛార్జిగా వ్యవహరించి రాజకీయాలు చేశారు. ఆదినారాయణరెడ్డి చెప్పినట్లే 9మందికి తొమ్మిది చెప్పులు, వీరినే నమ్ముకొని రాజకీయాలు చేసిన రామసుబ్బారెడ్డికి అరచెప్పు గుర్తుంచుకునేలా ప్రజలు తీర్పు చెప్పారని విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. కడపయాసలో చెప్పాలంటే టీడీపీ దిబ్బలమీద కోడిని తీసుకువచ్చి 2014లో పోటీచేయిస్తే రెండు లక్షల ఓట్ల తేడాతో ఓడిపోయింది. రాజకీయాల్లో తనకే చతురత ఉందని, వరుసగా మూడుసార్లు తాను కాబట్టే జమ్మలమడుగులో గెలిచానని భావించే ఆదినారాయణరెడ్డికి ఈసారి ఎంపీ ఎన్నికల్లో 3.80లక్షల ఓట్ల తేడా చిత్తుగా ఓడిపోయారు. దీనికి కారణం ఆయన వ్యవహారశైలేనని అభిప్రాయం పార్టీలో ఉంది. మదనపడుతున్న పీఆర్ వర్గీయులు... తొలినాళ్ల నుంచి టీడీపీని నమ్ముకొని రాజకీయాలు చేసిన కుటుంబాన్ని కాదనీ, వైరిపక్ష నేతను అధినేత చంద్రబాబు దరికి చేర్చుకున్నప్పుడే ధిక్కరించాల్సిందని సీనియర్లు ఇప్పుడు మదనపడుతున్నారు. ఎమ్మెల్యే సీటు కావాలంటే ఎమ్మెల్సీ పదవీత్యాగం చేయాలని షరతు పెట్టినప్పుడైనా ధిక్కరించి, పార్టీని వీడి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేస్తే మర్యాద దక్కేదని మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి వర్గీయులు మదనపడుతోన్నారు. ఆదినారాయణరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పీఆర్ కుటుంబసభ్యులు ప్రచారం చేయడంతోనే తమ కొంపమునిగిందంటున్నారు. వైఎస్ కుటుంబానికి జమ్మలమడుగులో అపారమైన అభిమానులున్నారు. వైఎస్ కుటుంబాన్ని ఆదినారాయణరెడ్డి టార్గెట్ చేస్తూ దూషించిన ఫలితం తమపై పడిందని వారు చెబుతున్నారు. జిల్లాలో టీడీపీ భారీ ఓటమికి ఆది ప్రధాన కారకుడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జమ్మలమడుగు పోలింగ్ కేంద్రంలో ఉద్రిక్తత
-
జమ్మలమడుగు బహిరంగ సభలో వైఎస్ జగన్
-
చంద్రబాబు ప్రతి అడుగులోనూ మోసం.. మోసం
-
నాన్న ఇచ్చిన కుటుంబం అండగా ఉంది: వైఎస్ జగన్
సాక్షి, జమ్మలమడుగు(కడప) : ‘జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీ నుంచి ఒకే కుటుంబం.. కాంగ్రెస్ నుంచి ఒకే కుటుంబం ఉండేది. వీరిద్దరు కూడా ఒకరినొకరు పొడుచుకున్నారు.. చంపుకున్నారు. వీరిద్దరి వల్ల ప్రతి గ్రామంలో కక్ష్యలు వచ్చాయి. ఈ ఇద్దరు ఇప్పుడు వారి స్వార్థ రాజకీయాల కోసం ఒక్కటయ్యారు. ఇలాంటి పెద్దపెద్ద నాయకులు నాకు తోడుగా లేరు. కానీ నాకు అండగా ఉంది నాన్న ఇచ్చిన కుటుంబమే.’ అని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో జరిగిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. అధికారంలోకి రాగానే బ్రాహ్మణి స్టీల్ ప్లాంట్‌ను తెరుస్తామని, చేనేత కుటుంబాలకు నవరత్నాలతో పాటు రూ. 24వేలు ఇస్తామని, శనగ రైతులకు గిట్టుబాటు ధరల కల్పిస్తామని హామీ ఇచ్చారు. అగ్రిగోల్డ్, కేశవరెడ్డి బాధితలను ఆదుకుంటామన్నారు. నవరత్నాలతో ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపుతామని భరోసా ఇచ్చారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎం.సుధీర్‌రెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్ రెడ్డిలను ఆదరించి, ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి, అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఈ సభలో ఆయన ఏమన్నారంటే.. మీ కడప బిడ్డగా ... ‘జమ్మలమడుగు నియోజకవర్గం పార్టీ ఇంచార్జ్‌గా చిన్నాన వైఎస్ వివేకానందరెడ్డి ఇక్కడ ఉండాల్సింది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని మనమంతా మౌనం పాటిద్దాం. మీ కడప బిడ్డగా రాష్ట్రవ్యాప్తంగా 3,648 కిలోమీటర్లు నా పాదయాత్ర సాగింది. దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఆ పాదయాత్రను పూర్తి చేశాను. పాదయాత్రలో మీరు చెప్పిన కష్టాలను విన్నాను. బాధలను చూశాను. ప్రభుత్వ సాయం అందక ఇబ్బంది పడుతున్నా.. ప్రతి పేదవాడికి చెబుతున్నా.. మీ అందరికీ నేనన్నానే భరోసా ఇస్తున్నా. గిట్టుబాటు ధరలేక రైతులు పడ్డ కష్టాలు చూశాను. పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందక తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక.. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు నేను విన్నాను. సకాలంలో 108 రాక ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల ఆవేదన విన్నా.. పక్షపాతం వచ్చి ఆరోగ్య శ్రీ అందక వీల్‌చైర్‌లో వచ్చి నాతో చెప్పుకున్న బాధితుల పరిస్థితిని ఎప్పటికీ మర్చిపోలేను. పిల్లలను చదివించడం కోసం కూలీ పనులకు వెళ్తున్న అక్కాచెల్లెమ్మల బాధలు విన్నా. మద్యం షాపులు ఎక్కవై చిన్నాభిన్నమైన కుటుంబాలను చూశాను. ఉద్యోగాలు రాక తల్లడల్లితున్న విద్యార్థులను చూశాను. కడప స్టీల్ కోసం ఎదురు చూస్తున్న పిల్లలను చూశాను. ప్రభుత్వంలో ఖాళీగా ఉన్న రెండు లక్షల 30వేల ఉద్యోగాలు భర్తీ అయ్యే పరిస్థితులు లేక పక్క రాష్ట్రాలకు వలసలు పోతున్న యువతను చూశాను. నాన్నగారు.. దివంగత మహానే వైఎస్సార్ చేసిన మంచి పనుల గురించి మీరు చెప్పిన మాటలను విన్నాను. పరిశ్రమలు కావాలని, ఉద్యోగాలు రావాలని నాన్నగారు. బ్రాహ్మణి స్టీల్‌ను తీసుకొచ్చారు. కానీ ఆ స్టీల్ కూడా ఇప్పుడు పూర్తిగా మూతబడింది. దేవుడి దయ, మీ అందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే 6 నెలల్లోనే స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేస్తాను.. 3 ఏళ్లలో పూర్తి చేస్తాను అని హామీ ఇస్తున్నాను. శనగ పంటకు మద్దతు ధర.. ఇక్కడ శనగ పంట సాగు ఎక్కువ. గత మూడేళ్లుగా దాని రేటంతా అని అడుగుతున్నా? గిట్టుబాటు ధర వచ్చిందా? శనగకు కనీస మద్దతు ధర రూ.5,200 అంటారు. కానీ రైతన్న దగ్గర రూ.4వేలకు కూడా కొనేపరిస్థితి లేదు. గోడౌన్లో పంట కుల్లిపోతుంటే.. వడ్డీలు కట్టలేక ఇంట్లోని బంగారు తాకట్టుపెట్టి రైతులు ఇబ్బంది పడుతున్నారు. శనగను సాగుచేసే ప్రతిరైతన్నకు చెబుతున్నా.. అధికారంలోకి రాగానే గోడౌన్లో ఉన్న మొత్తం శనగపంటను రూ. 6500 ఇచ్చి కొనుగోలు చేస్తాను. ఇబ్బంది పడుతున్న రైతన్నలకు అండగా ఉంటాను. పొతిరెడ్డి పాడు నుంచి 44 వేల క్యూసెక్కుల నీరు తీసుకురావడానికి వైఎస్సార్ గండికోట ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టారు. ఆయన హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పనులు 85 శాతం పూర్తయ్యాయి. కానీ చంద్రబాబు పాలనలో ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఆ పనులను అంచనా మాత్రం 100 శాతం పెంచారు. నామినేషన్ పద్దతిలో చంద్రబాబు బినామీ సీఎం రమేశ్‌కు ఇస్తారు. ఆ గండికోట ముంపు గ్రామాలకు ముష్టివేసినట్లు నష్టపరిహారం ఇస్తున్నారు. ఆ గండికోట బాధితులకు చెబుతున్నా.. అధికారంలోకి రాగానే రూ.10 లక్షలు నష్టపరిహారంగా ఇస్తానని హామీ ఇస్తున్నాను. ఐదేళ్లుగా మైలవరం రిజర్వాయర్‌కు నీరురాని పరిస్థితి ఉంది. మనపార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే పార్టీ ఫిరాయించి మంత్రి కూడా అయ్యారు. ఆ రాజోలు రిజర్వాయర్ పనులు జరిగాయా? చంద్రబాబుకు ఏ రోజు ప్రజలపై ప్రేమ లేదు. ఐదేళ్లు ఏం చేయని ఆయన ఎలక్షన్ ముందు వచ్చి టెంకాయ కొట్టి పోతారు. చేనేత కార్మికులు కూడా ఇక్కడ ఎక్కువే. ఈ ఐదేళ్లలో ఆ చేనేత కార్మికులు సంతోషంగా ఉన్నారా? నూలు సబ్సిడీ రావడం లేదు. గత ఎన్నికల వేళ.. చేనేతలకు మేనిఫెస్టోలో ఒక పేజీ కేటాయించారు. చేనేతల రుణమాఫీ అన్నాడు.. అయ్యాయా? ఇల్లు కట్టిస్తానన్నాడు కట్టించాడా? ప్రతి చేనేత కార్మీకుడికి చెబుతన్నా.. అధికారంలోకి వచ్చిన తరువాత నవరత్నాలతోనే కాకుండా ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేలు ఇస్తాం. అగ్రిగోల్డ్ బాధితులను అడుగుతున్నాను. కనీసం ఒక్కరూపాయి అయినా ఇచ్చారా? అగ్రిగోల్డ్ ఆస్తులను చంద్రబాబు, ఆయన కొడుకు, మంత్రులు, బినామీలు గద్దల్లా తీసుకోవాలని చూస్తున్నారు. రూ.1150 కోట్లను తొలి బడ్జెట్లో పెడ్తాం. మిగిలిన వారికి అగ్రిగోల్డ్ ఆస్థులను అమ్మి ఇస్తాం. ఈ నియోజకవర్గంలో కేశవరెడ్డి బాధితులు ఎక్కువే...బాధితులకు న్యాయం చేయకపోగా కేశవరెడ్డి వియ్యంకుడు ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇచ్చాడు. మన పోరాటం ఒక్క చంద్రబాబుతోనే కాదు.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5, టీవీ 9 అమ్ముడుపోయిన చానెళ్లన్నిటీతో చేయాలి. ఎన్నికలు వచ్చే సరికి చంద్రబాబు చేయని మోసం ఉండదు. కుట్రలతో ఈ ఎన్నికలు గెలవాలని చంద్రబాబు చూస్తున్నారు. ప్రతిగ్రామానికి మూటలు మూటలు డబ్బులు పంపిస్తారు. ఓటు కొనేందుకు ప్రతి ఒక్కరి చేతిలో రూ.3వేలు పెడతారు. మీరందరూ గ్రామాలకు వెళ్లండి ప్రతి ఒక్కరికి నవరత్నాల గురించి చెప్పండి.’ అని వైఎస్ జగన్ కోరారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రజాసేవే లక్ష్యం
ప్రశ్న: రాజకీయాల్లోకి రావాలన్న ఆసక్తి ఎలా కలిగింది.? జవాబు : నేను వైద్య వృత్తిలో ఉంటూ ప్రజలకు సేవ చేస్తున్నాను. చిన్నప్పటినుంచి లీడర్షిప్ అంటే నాకు చాలా ఇష్టం. చదువుకునేటప్పుడు స్నేహితులకు ఏ అవసరమొచ్చినా ముందుండి చూసుకునేవాణ్ణి. వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రజలకు మరింత సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను. ప్రశ్న: సేవా కార్యక్రమాలు ఏమైనా చేశారా..? జవాబు: మనకు ఉన్నంతలో తోటి వాళ్లకు సహాయ పడాలని, పదిమందికి మంచి చేసినప్పుడే దేవుడు మనల్ని చల్లగా చూస్తాడని మా పెద్దలు చెప్పేవారు.వారి మాటలు నా మనసులో అలాగే నిలిచిపోయాయి.ఆపద వచ్చిందని ఎవరు ఫోన్ చేసినా వెంటనే స్పందించి సాయం చేస్తా. స్వయంగా వైద్యసేవలు అందిస్తాను.పేదవారింట జరిగే వివాహాలకు ఆర్థిక సాయంతో పాటు చేయూతనందిస్తున్నాను.ఇవన్నీ ఎవరికీ తెలియకుండా జరిగింది. సందర్భం రావడంతో తప్పక చెబుతున్నా. ప్రశ్న : జమ్మలమడుగు నియోజకవర్గంలో మీరు గుర్తించిన ప్రధాన సమస్యలు..? జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ప్రధాన సమస్య నిరుద్యోగం. చాలా మంది యువత ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక ఇబ్బందులు పడుతున్నారు. పునరావాస నిర్వాసితులు కూడా కష్టాలు ఎదుర్కొంటున్నారు. రైతులకు గిట్టు బాటు ధర లభించక అనే మార్లు ధర్నాలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పలు గ్రామాల్లో నీటి ఎద్దడి నెలకొంది. ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మున్సిపాల్టీల్లో పన్నుల మోతతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఆర్టీపీపీలో వేలాది మంది కాంట్రాక్టు కార్మికులు క్రమబద్ధీకరణ కాక, సమాన పనికి సమాన వేతనం రాక ఇబ్బందులు పడుతున్నారు. నాపరాయి పరిశ్రమలపై పన్నుల మోతతో చాలా పరిశ్రమలు మనుగడ కోల్పోయే ప్రమాదం ఉంది. చేనేతలకు సబ్సిడీ రుణాలు, గుర్తింపు కార్డులు లేక పోవడం, మగ్గాల ఇళ్లకు కమర్షియల్ పన్నులు ఇలా ప్రజలు కష్టాలు పడుతున్నారు. ప్రశ్న: వీటిని ఎలా పరిష్కరిస్తారు..? జవాబు : రైతు సమస్యల పరిష్కారం కోసం వైఎస్సార్సీపీ అ«ధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. కాంట్రాక్టు కార్మికులను, అవుట్ సోర్సింగ్‌లను క్రమబద్ధీకరణ చేస్తామని హమీ ఇచ్చారు.పన్నుల తగ్గింపు కోసం ప్రయత్నం చేస్తాను. పెన్నానదికి ఏటా నీరు అందించే ఏర్పాటు చేస్తాను. నవరత్నాల పథకాలతో అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. ప్రజలకు సేవ చేయడానికి.. వారి సమస్యలను పరిష్కరించడానికి నిరంతరం అందుబాటులో ఉంటాను. ప్రశ్న : గెలుపునకు దోహదపడే అంశాలేవి..? జవాబు: టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలు, ప్రభుత్వ భూకబ్జాలు, ఇసుక దోపిడీ, జన్మభూమి కమిటీ సభ్యుల దౌర్జన్యాలు, నీరు చెట్టు పనుల్లో అవినీతి , సామాన్యులకు చేరువ కాని సంక్షేమ పథకాలు తదితరాలను అస్త్రాలుగా ఉపయోగించుకుని ప్రజల్లోకి వెళ్తాం.పేద ప్రజల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రవేశపెట్టిన నవరత్నాలను ఇంటింటీకీ తెలియజేస్తాం. వైఎస్ జగనన్న ముఖ్యమంత్రి అయితే రాజన్న పాలన తీసుకువస్తారని నమ్మకాన్ని కలగజేస్తాం. ప్రస్తుత పరిస్థితుల్లో వైఎస్ జగనన్న సీఎం కావడం చారిత్రక అవసరం. ప్రశ్న: ఇద్దరు ఫ్యాక్షనిస్టులతో పోటీ పడుతున్నారు..దీనిపై మీ స్పందన..? జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ఒకప్పుడు మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ అభ్యర్థి రామసుబ్బారెడ్డి ఇద్దరు కత్తులు దూసుకున్నారు. వారి అనుచరులు వీరిపై నమ్మకంతో జైలు పాలయ్యారు.కుటుంబాలు ఛిద్రం అయ్యాయి. ఇప్పుడు వారిద్దరు కలిíసి తిరుగుతున్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. వారిద్దరి వల్ల నష్టపోయిన కుటుంబాల వారు మార్పు కోరుతున్నారు. అందుకే వైఎస్సార్సీపీపై ఆదరణ చూపుతున్నారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని, ఇద్దరు ఫ్యాక్షనిష్టులను చిత్తుగా ఓడిస్తారు. ఇది సత్యం. -
జమ్మలమడుగులో వైఎస్ భారతి రోడ్ షో
-
జమ్మలమడుగులో వైఎస్ భారతి రోడ్ షో
-
జమ్మలమడుగులో వైఎస్ భారతి రోడ్ షో
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం జరుగుతుందని వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో ఆదివారం ఆమె రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ భారతిరెడ్డికి జమ్మలమడుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. వైఎస్ భారతిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ప్రచారానికి మంచి స్పందన లభిస్తోందని అన్నారు. చంద్రబాబుపై ప్రజలు విశ్వాసం కోల్పోయారని అన్నారు. వైఎస్ జగన్‌ను ప్రజలు బాగా నమ్ముతున్నారని ఆమె పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి మూల సుధీర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని భారతిరెడ్డి విజ్ఞప్తి చేశారు. కాగా వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయాన్ని కోరుతూ.. నిన్న పులివెందులలో వైఎస్ భారతిరెడ్డి ప్రచారాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో ఆమె ప్రతి ఇంటింటికి వెళ్లి ప్రచారం చేస్తున్నారు. ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్సార్ సీపీని గెలిపించాలని కోరారు. ఐదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రజలు అష్టకష్టాలు పడ్డారని.. వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా ఆమె విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్ 11న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినాష్‌రెడ్డికి ఓట్లు వేసి అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో పెరిగిన అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలను తిప్పికొట్టడానికి మార్పు అనివార్యంగా భావించి ప్రతి ఒక్కరూ వైఎస్సార్ సీపీకి ఓటు వేయాలని వైఎస్ భారతిరెడ్డి కోరారు. -
విజయం సాధిస్తా..అభివృద్ధి చేస్తా
జమ్మలమడుగు నియోజకవర్గంలో గత కొన్ని దశాబ్దాలుగా నాయకులు ఫ్యాక్షన్ భూతాన్ని చూపించి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు వారి నీచ రాజకీయాలను అర్థం చేసుకున్నారు. మార్పు కోరుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో నన్ను మంచి మెజార్టీతో గెలిపిస్తారు. ఎమ్మెల్యేగా నియోజకవర్గంలో నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తా.. ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేయిస్తా.. భూమిలేని వారికి ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పిస్తా.. నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా పరుగులు పెట్టిస్తా.. అని జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి తొలిసారి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నడాక్టర్ మూలే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు ప్రశ్న: రాజకీయాల్లోకి కొత్తగా వచ్చారు. తొలిసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎలా ఫీల్ అవుతున్నారు? జవాబు: ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆహ్వానం మేరకు నేను రాజకీయ రంగ ప్రవేశం చేశాను. మొదట డాక్టర్‌గా ప్రజలకు సేవలందిస్తూ వచ్చాను. మా కుటుంబం 40 ఏళ్ల నుంచి కమలాపురం, ఎర్రగుంట్లలో రాజకీయాల్లో ఉంది. ఆ అనుభవంతో ఎన్నికల బరిలోకి దిగాను. చాలా ఆనందంగా ఉంది. ప్రశ్న: ప్రచారంలో ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? జవాబు: నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో ప్రచారం చేస్తున్నాను. ప్రజలు వైఎస్ కుటుంబంపై చూపిన ప్రేమాభిమానాలు నాపై కూడా చూపిస్తున్నారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. ప్రశ్న: మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ మంత్రి రామసుబ్బారెడ్డిలు కలిసిపోయాం. గెలుపు మాదే అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం? జవాబు: ఓట్లు వేసేది.. గెలుపు ఓటములను నిర్ణయించేది ప్రజలు. మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిల కలయికను ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. వారి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టాం. జైలుకు వెళ్లాం. ఇప్పుడు వారిద్దరు కలిసిపోతే గ్రామాల్లో మేము కలిసి పనిచేసేది లేదంటూ బాహాటంగా చెబుతూ వస్తున్నారు. ఇద్దరు నాయకులు కలిసినా ప్రజల మద్దతు నాకే ఉంది. గెలుపు తథ్యం. ప్రశ్న: ఎమ్మెల్యేగా గెలిస్తే ప్రజలకు ఏమి చేయాలనుకుంటున్నారు? జవాబు: ఇంత వరకు ఉన్న నాయకులు కేవలం తమ స్వలాభం కోసమే రాజకీయాలు చేసుకున్నారు. ప్రజలు నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటు చేయించి దాదాపు 20వేల మంది నిరుద్యోగులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పిస్తాను. అంతేకాకుండా ఇళ్లు లేని నిరుపేదలకు కచ్చితంగా ఇంటి స్థలంతోపాటు, ఇంటి నిర్మాణం చేయిస్తాను. వైఎస్ జగన్మోహన్రెడ్డితో మాట్లాడి భూమి లేని రైతులకు ఒకటిన్నర ఎకరా భూమి ఇప్పించే బాధ్యత తీసుకుంటాను. ప్రశ్న: జమ్మలమడుగు ఫ్యాక్షన్ రాజకీయాలకు పెట్టింది పేరు. అలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలను ఎలా ఎదుర్కొంటారు? జవాబు: జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇంతకాలం ఫ్యాక్షన్‌ను అడ్డం పెట్టుకుని ఇరువర్గాల నాయకులు తమ పబ్బం గడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం ప్రజలు అన్నీ తెలుసుకున్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలకు కాలం చెల్లిపోయింది. ఇద్దరు నాయకులు కలిసినా నా గెలుపునకు ఎలాంటి ఢోకాలేదు. ఇంత వరకు ఇద్దరు నాయకులు ప్రజల జీవితాలతో ఆడుకున్నారు. రాజకీయం అంటే సేవ చేయడం. ఒక్కసారి ప్రజలు నాకు అవకాశం కలిస్తే నేను ప్రజలకు సేవ చేసి కనీసం 25 సంవత్సరాలపాటు ఎమ్మెల్యేగా ఉండే విధంగా చేసుకుంటాను. -
జమ్మలమడుగులో ఉద్రిక్తత : మహేషేరెడ్డి వాహనం ద్వంసం
-
సరిగ్గా 14 ఏళ్ల క్రితం..
సాక్షి ప్రతినిధి, కడప: అత్యంత సౌమ్యునిగా పేరుపొందిన వైఎస్ వివేకానందరెడ్డి రాజకీయ చాణక్యంలో తనకు తానే సాటి. జమ్మలమడుగు ఎమ్మెల్యేగా గెలిచిన ఆదినారాయణరెడ్డి 2005లో జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా అనవసర రాజకీయ సవాళ్లను విసిరి చిక్కులు కొనితెచ్చుకుని డీలా పడగా.. వివేకానందరెడ్డి జమ్మలమడుగుకు వెళ్లి ఆయన భుజం తట్టి ధైర్యం నూరిపోశారు. ఒకటిన్నర దశాబ్దంక్రితం జరిగిన ఈ సంఘటనను జమ్మలమడుగు వాసులు ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నారు. ఆ వివరాలిలా ఉన్నాయి.. 2005 సెప్టెంబర్‌లో గ్రామపంచాయతీ స్థాయి నుంచి నగర పంచాయతీగా ఎదిగిన జమ్మలమడుగు మున్సిపాలిటీకి తొలిసారి ఎన్నికలు జరిగాయి. అప్పట్లో ఆది రాజకీయ ప్రత్యర్థి అయిన రామసుబ్బారెడ్డి షాద్‌నగర్ జంట హత్య కేసులో చర్లపల్లి జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. నియోజకవర్గ టీడీపీ పగ్గాల్ని రామసుబ్బారెడ్డి సతీమణి ఇందిర నడిపిస్తోంది. ఆ పరిస్థితుల్లో 2005 సెప్టెంబర్ 24న జమ్మలమడుగు నగర పంచాయతీకి ఎన్నికలు జరిగాయి. మొత్తం 20 వార్డుల్లో టీడీపీ మూడు వార్డులు గెలుచుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఆది బహిరంగంగా ప్రకటించారు.(వెలుగులోకి మరో కుట్రకోణం!) ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ 17 వార్డులను గెలుచుకోగా.. టీడీపీకి సరిగ్గా మూడు స్థానాలే వచ్చాయి. దీంతో జమ్మలమడుగు టీడీపీ కార్యాలయం ముందు ఆ పార్టీ కార్యకర్తలు టపాసులు పేల్చడం, కేకలు, ఈలలతో సంబరాలు జరుపుకున్నారు. అంతేగాక ఆదినారాయణరెడ్డి రాజీనామా చేయాలంటూ అరుపులకు దిగారు. దీంతో 17 స్థానాలు గెలిచినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిశ్శబ్దం ఆవరించింది. ఆరోజు మధ్యాహ్నం కౌంటింగ్ కేంద్రం నుంచి నేరుగా తన బావమరిది సూర్యనారాయణరెడ్డి ఇంటికొచ్చిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి భోజనం కూడా చేయకుండానే నిరాశతో మంచంపై వాలిపోయాడు. రాజీనామా చేయాలా? వద్దా? చేస్తే పరిస్థితేంటి? అర్థం కాని స్థితిలో పడిపోయాడు.(మళ్లీ అదే తరహా కుట్ర..) ఆ పరిస్థితుల్లో అదేరోజు సాయంత్రం జమ్మలమడుగుకు వెళ్లిన వైఎస్ వివేకానందరెడ్డి దిగాలుపడ్డ ఆదినారాయణరెడ్డిని భుజం తట్టి లేపి కూర్చొబెట్టారు. ఇలాంటివి రాజకీయాల్లో సహజమని, అంతలా డీలా పడాల్సిన అవసరం లేదని గుండె నిబ్బరాన్ని నూరిపోశారు. భవిష్యత్తులో ఇంకెప్పుడూ ఇలా రాజకీయ సవాళ్లను విసరకూడదని సున్నితంగా మందలించారు. ఆరోజు సాయంత్రమే వైఎస్ వివేకానందరెడ్డి జమ్మలమడుగులో ప్రెస్‌మీట్ పెట్టి ‘‘మా ఆదినారాయణరెడ్డి సవాలు విసిరారు కానీ, ఆ సవాలును అటువైపు నుంచి ఎవరూ స్వీకరించలేదు. ఒకవేళ వాళ్లు స్వీకరించి ఉంటే మా ఆదినారాయణరెడ్డి తప్పక రాజీనామా చేసేవాడే. వాళ్లెవరూ ముందుకు రాలేదు కాబట్టి మా ఆదినారాయణరెడ్డి కూడా రాజీనామా చేయడు’ అంటూ రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. దీంతో గండం గట్టెక్కించారనుకుని ఆది ఊపిరి పీల్చుకున్నాడు. అంతవరకు ఆది రాజీనామా చేయాల్సిందేనంటూ పట్టుబట్టిన టీడీపీ కార్యకర్తలు వివేకా ప్రదర్శించిన రాజకీయ చాణక్యానికి సైలెంట్ అయిపోయారు. (వైఎస్ వివేకా దారుణ హత్య...) -
కడప జిల్లా జమ్మలమడుగులో ఉద్రిక్తత
-
సున్నపురాళ్లపల్లిలో ఉద్రిక్తత
-
మంత్రి ఆది కుటుంబంలో ఎమ్మెల్సీ చిచ్చు..!
సాక్షి, జమ్మలమడుగు : టీడీపీ మంత్రి ఆదినారాయణ రెడ్డికి కొత్త సమస్య వచ్చిపడింది. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన పదవిని ఆది సోదరుడి కుటుంబానికి ఇచ్చేందుకు నిర్ణయం జరిగింది. చంద్రబాబు వద్దనే నారాయణరెడ్డి తన కుటుంబానికే ఎమ్మెల్సీ పదవి అంటూ ప్రకటించారు కూడా. ఇదిలాఉండగా.. షాద్‌నగర్ జంట హత్యల కేసులో ఆది వర్గానికి చెందిన ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఆది బంధువు శంకర్ రెడ్డి ఒకరు. ఈ హత్యలకు కారణం రామసుబ్బారెడ్డి వర్గమేనని సుప్రీం కోర్టులో కేసు కూడా నడుస్తోంది. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆది, రామసుబ్బారెడ్డి రాజీ పడటం, దీనిలో భాగంగా శంకర్ రెడ్డి కుటుంబీకులు సుప్రీం కోర్టులో ఉన్న కేసులో రాజీ పడుతున్నట్లు ఒప్పుకోవడం జరిగింది. ఈ రాజీని చంద్రబాబు దగ్గరుండి చేశారని వినికిడి. దీంతో రామసుబ్బారెడ్డి రాజీనామాతో ఖాళీ అయిన ఎమ్మెల్సీ పదవిని ఆది కుటుంబానికి కాకుండా శంకర్ రెడ్డి కుటుంబానికి ఇవ్వాలనే డిమాండ్ మొదలయింది. నారాయణరెడ్డి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి అనుభవించారని, ఆయన కుమారుడు కూడా జడ్పీటీసీగా ఉన్నదని...మళ్లీ వాళ్ళకే ఎమ్మెల్సీ ఇవ్వడం సరికాదనే వాదన ప్రారంభమయ్యింది. అన్ని పదవులు అన్నదమ్ములకే ఇస్తే...ఇక ఆది వర్గం కోసం పనిచేసి హత్య కావించబడ్డ శంకర్ రెడ్డి కుటుంబానికి ఏం న్యాయం చేసినట్లు అవుతుందని కొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తం మీద రామసుబ్బారెడ్డి వదిలేసిన ఎమ్మెల్సీ సీటు ఆది కుటుంబంలో విభేదాలకు కారణం అవుతోంది. -
మంత్రి ఆదికి ఊహించని షాక్
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అధికార టీడీపీని వీడుతున్న నాయకుల సంఖ్య రోజుకు రోజుకు పెరుగుతోంది. తాజాగా వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ తగిలింది. మంత్రి ఆదినారాయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన కీలక నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వీరంతా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వీరిని వైఎస్ జగన్ సాదరంగా ఆహ్వానించారు. కొండాపురం, ముద్దనూరు, పెద్దముడియం మండలాలకు చెందిన మాజీ ఎంపీటీసీలు, ఎంపీపీలు, ముని రాజారెడ్డి, బొందల గుంట సుబ్బయ్య, స్టాల్ పిరా సోదరులు, పెద్దముడియం ఈశ్వర్ రెడ్డి, దస్తగిరి రెడ్డి, తదిరులు వైఎస్సార్ సీపీలో చేరారు. కడప మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జమ్మలమడుగు వైఎస్సార్ సీపీ ఇన్చార్జి డాక్టర్ సుధీర్ రెడ్డి ఆధ్వర్యంలో వీరంతా వైఎస్సార్ సీపీలోకి వచ్చారు. -
తేలని జమ్మలమడుగు పంచాయితీ
సాక్షి, విజయవాడ: టీడీపీ జమ్మలమడుగు పంచాయితీ సద్దుమణగడం లేదు. ఏకంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాజీ కుదిర్చేందుకు ప్రయత్నించినప్పటికీ.. ఈ వ్యవహారానికి తెరపడలేదు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి గట్టిగా పట్టుబడుతున్న నేపథ్యంలో ఆ ఇద్దరు నేతలను పిలిచి చంద్రబాబు మాట్లాడారు. ఒకరిరు ఎమ్మెల్యేగా, మరొకరు ఎంపీగా పోటీ చేయాలని రాజీ ఫార్ములాను చంద్రబాబు సూచించారు. అయితే, ఈ మేరకు రాజీపడటానికి ఆదినారాయణరెడ్డిగానీ, రామసుబ్బారెడ్డిగానీ అంగీకరించలేదు. చంద్రబాబు నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా ఇద్దరు నేతలు ఆయన మాటను వినిపించుకోలేదని తెలుస్తోంది. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకే ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మొగ్గు చూపుతున్నారు. జమ్మలమడుగు టికెట్ వదులుకుంటే కడప ఎంపీగా పోటీచేసే అవకాశం ఇస్తానని, కడప లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోతే.. ఎమ్మెల్సీ పదవీ ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. చంద్రబాబు ఎంత నచ్చజెప్పినా కడప నుంచి పోటీచేసేందుకు ఇద్దరు నేతలూ ముందుకు రాలేదు. -
చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ
సాక్షి, అమరావతి: తాత్కాలిక ప్రయోజనాలు ఆశించి, పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిన టీడీపీకి.. ప్రస్తుత పరిణామాలు మింగుడు పడటం లేదు. వైఎస్సార్ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకుని, రాజ్యాంగ విరుద్ధంగా మంత్రి పదవులు సైతం అప్పగించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకు.. వచ్చే ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు తలనొప్పిగా మారే అవకాశం కనిపిస్తుంది. తాజాగా చంద్రబాబు వద్దకు జమ్మలమడుగు పంచాయతీ చేరింది. చంద్రబాబు జమ్మలమడుగు అసెంబ్లీ సీటు ఎవరికి కేటాయిస్తారనే దానిపై గత కొంతకాలంగా అయోమయం నెలకొన్న సంగతి తెలిసిందే. దీనిపై చర్చించడానికి జమ్మలమడుగు టీడీపీ నేతలు బుధవారం చంద్రబాబుతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కడప పార్లమెంట్ స్థానంతోపాటు, జమ్మలమడుగు అసెంబ్లీ స్థానాల అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు వారితో చర్చలు జరిపారు. మంత్రి ఆదినారయణ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలో ఒకరిని ఎంపీ స్థానానికి, మరోకరిని అసెంబ్లీ స్థానానికి పోటీ చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఇందుకోసం ఈ నెలఖారున జమ్మలమడుగులో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆయన ఇరువురు నేతలకు సూచించారు. అయితే ఎంపీ స్థానానికి పోటీ చేసేందుకు ఇరువులు నేతలు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. పైకి చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెబుతున్న ఇరువురు నేతలు.. ఎమ్మెల్యే టికెట్ కోసం తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేపట్టారు. కాగా, గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ తరఫున గెలుపొందిన ఆదినారాయణ రెడ్డిని.. చంద్రబాబు అక్రమంగా పార్టీలో చేర్చుకుని మంత్రి పదవి కట్టబెట్టిన సంగతి తెలిసిందే. -
దండుకుంటున్నా..మీ సేవ
వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో కరువు కబలిస్తోంది. ఆరుగాలం శ్రమించి సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. దేవుడా ఏమిటీ దయనీయ పరిస్థితి అని రైతులు వేడుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై గ్రామస్థాయిలో అవగాహన కల్పించాలని ఆదేశించింది. నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సభలు నిర్వహిస్తున్నారు.తమకు కొంతైనా ఊరటగా ఉంటుందని బీమా చేయించడానికి ఆసక్తి కనబరుస్తుండగా కరువు రైతులను కూడా మీ–సేవా కేంద్రాల నిర్వాహకులు దండుకుంటున్నారు. అధికారులు చేష్టలుడిగి చూస్తున్నారు. ప్రొద్దుటూరు : ఓ వైపు కరువు పరిస్థితులు ఉన్నా వరుణదేవుడు కరుణించక పోతాడా అన్న ఆశతో రబీ సీజన్లో రైతులు పంటలను సాగు చేశారు. జమ్మలమడుగు రెవెన్యూ డివిజన్ పరిధిలోని అత్యధికంగా శనగ పంటను సాగు చేయగా మిగతా ప్రాంతాల్లో శనగ, వరి, జొన్న తదితర పంటలు వేశారు. వీటిని రక్షించుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. ఇటీవల వచ్చిన తిత్లీ, గజ తుపాన్లపై పెట్టుకున్న ఆశలు అడియాశలయ్యాయి. వేలెడు లోతున కూడా భూమిలోకి నీరు ఇంక లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీమా ప్రీమియం చెల్లిస్తున్న రైతులు ఇది ఇలా ఉండగా పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకంపై నవంబర్ 26వ తేదీ నుంచి డిసెంబర్ 2వ తేదీ వరకు గ్రామాలకు వెళ్లి రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయాధికారులను ఆదేశించింది. డిసెంబర్ 15 వరకు శనగ పంటకు, జొన్న, వేరుశనగ, ఉల్లి, మిరప, పొద్దుతిరుగుడు పంటలకు డిసెంబర్ 31, వరి పంటకు 2019 జనవరి 15 వరకు బట్టి ప్రీమియం చెల్లించేందుకు గడువు విధించింది. కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులంతా బీమా ప్రీమియం చెల్లించేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. వీరిలో ఎక్కువగా శనగ రైతులు ప్రీమియం చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 46వేల మంది ప్రీమియం చెల్లించగా జిల్లాకు సంబం«ధించిన రైతులే 21వేల మంది ఉన్నారు. తర్వాత ప్రకాశం జిల్లాలో 10వేల మంది, అనంతపురం జిల్లాలో 9,300 మంది, కర్నూలు జిల్లాలో 4,800 మంది, విజయనగరం జిల్లాలో 552 మంది, కృష్ణాజిల్లాలో 74 మంది, గుంటూరు జిల్లాలో 25, చిత్తూరు జిల్లాలో 7 మంది ఇప్పటి వరకు ప్రీమియం చెల్లించారు. అదనపు వసూళ్లు.. బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న రైతులకు అక్కడే బీమా ప్రీమియంను వసూలు చేయడం జరుగుతుంది. బ్యాంకు రుణం పొందనివారు, కౌలు రైతులు ఎంపిక చేసిన మీ–సేవా కేంద్రాల్లో (సీఎస్సీ) చెల్లిస్తున్నారు. దండుకుంటున్నారు. జిల్లా వ్యాప్తంగా 284 మీ–సేవా కేంద్రాలు ఉండగా ఎంపిక చేసిన కేంద్రాల్లోనే వీటికి అనుమతి మంజూరు చేశారు. నిబంధనల ప్రకారం ప్రతి రైతు బీమా ప్రీమియానికి సంబంధించిన దరఖాస్తుపై రూ.24 మాత్రమే వసూలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే మీ–సేవా కేంద్రం నిర్వాహకులు ప్రతి ఎకరాకు ప్రీమియంతోపాటు రూ.30 నుంచి రూ.100 వరకు వసూలు చేస్తున్నారు. ఉదాహరణకు ఎకరా శనగ పంట ప్రీమియం రూ.270 కాగా రూ.300 చొప్పున ప్రొద్దుటూరులో వసూలు చేస్తున్నారు. జమ్మలమడుగు, ఎర్రగుంట్లలో కూడా ఈ విధంగానే ఫిర్యాదులు అందుతున్నాయి. ఎక్కువ మంది రైతులు ప్రొద్దుటూరుకు వచ్చి ప్రీమియం చెల్లిస్తున్నారు. పలువురు రైతులు ప్రొద్దుటూరు మండల వ్యవసాయాధికారి ఆర్వీ సాగర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేశారు. ఆయన నిబంధనలను వివరించారు. సమస్యను వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు మురళీకృష్ణకు ఫిర్యాదు చేయగా ఆయన కూడా ఇదే విషయాన్ని తెలిపారు. మిగతా వరి, జొన్న పంటలకు కూడా ఇలానే అదనపు వసూళ్లు చేస్తున్నారు. వేసిన పంటలు ఎండిపోయి తాము ఇబ్బందులు పడుతుంటే మీ–సేవా నిర్వాహకులు దోచుకోవడం ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
‘వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మినవారికి అండగా ఉంటాం’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్‌లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సమక్షంలో ఓబులేసు, భాస్కర్‌రెడ్డి, నీలకంఠ అనుచర వర్గం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓబులేసుతో సహా పలువురు నేతలు తమ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. తమను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ప్రజలు అంత చూశారని అన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఏం జరిగిన మంత్రి ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలని అన్నారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు గొరిగెనూరుకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వైఎస్సార్ సీపీ నేతల రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తుల అంక్షలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. -
కడప ఉక్కు-ఏపీ హక్కు
-
పెదదండ్లూరు ఘటనపై స్పందించిన మంత్రి ఆది
వైఎస్సార్ జిల్లా: పెద దండ్లూరు సంఘటనపై మంత్రి ఆదినారాయణ రెడ్డి మంగళవారం స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ.. అక్కడ విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తే మా టీమ్ హెచ్చరించడానికి వెళ్లిందన్నారు. వాళ్లు వ్యతిరేకించడంతో అక్కడ ఘర్షణ జరిగిందని చెప్పారు. గొడవ జరిగిన మాట వాస్తవమేనని తెలిపారు. మా పది గ్రామాల్లో మీరు(వైఎస్సార్ కాంగ్రెస్) ఏజెంట్స్‌ను కూడా పెట్టుకోలేరని హెచ్చరించారు. సంఘటనలో మా కుటుంబ సభ్యులు ఎవరూ లేరని చెప్పారు. ఇటీవల వివాహం అయిన వధూవరులు తమను ఆశీర్వదించాలని కోరుతూ.. వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని రిసెప్షన్ కార్యక్రమానికి ఆహ్వానించిన సంగతి తెల్సిందే. దీనిని సహించలేక, వైఎస్సార్సీపీకి ఆదరణ పెరుగుతుందనే భయంతో మంత్రి అనుచరులు జమ్మలమడుగు నియోజకవర్గంలోని సుగుమంచిపల్లె, పెద్దదండ్లూరు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కార్యకర్తలైన సంపత్, అజరయ్య, అయ్యవారు, సుబ్బిరామిరెడ్డి ఇళ్లపై దాడులు చేసి, వారిని తీవ్రంగా గాయపరిచిన సంగతి తెల్సిందే. -
మంత్రి ఆది భార్య దగ్గరుండిమరీ..
సాక్షి, జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు మండలం పెదదుండ్లూరులో దళిత కుటుంబాలపై దాడి, ఇళ్ల విధ్వంసం ఘటనలో మంత్రి ఆదినారాయరణ రెడ్డి కుటుంబం ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు లభ్యమయ్యాయి. మంత్రి ఆది భార్య అరుణతోపాటు మంత్రి సోదరుడి భార్య సైతం దగ్గరుండిమరీ తమ అనుచరులకు ఆదేశాలిస్తోన్న వీడియోలు బహిర్గతమయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను ఇంటికి ఆహ్వానించారన్న కారణంతో నవవరుడు, పెద్దదండ్లూరు గ్రామానికి చెందిన ఏపీఎస్పీ కానిస్టేబుల్ సంపత్ ఇంటి మంత్రి అనుచరులు, టీడీపీ శ్రేణులు దాడికి తెగబడ్డారు. సుగమంచిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ అభిమానులను కూడా తీవ్రంగా కొట్టారు. ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిలో సోమవారం కూడా పోలీస్ పికెట్ కొనసాగుతున్నది. (చదవండి: మంత్రి ఆది వర్గీయుల అరాచకం) అనుచరులను పురమాయిస్తూ..: పెద్దదుండ్లూరు గ్రామంలో ఇటీవలే వివాహం చేసుకున్న కానిస్టేబుల్ సంపత్ దంపతులను ఆశీర్వదించేందుకు వైఎస్సార్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఆ పార్టీ కీలక నేతలు ఆదివారం గ్రామానికి తరలివెళ్లారు. ఎంపీ వస్తున్నారన్న సమాచారం అందడంతో ఆయా గ్రామాల్లో తమ ఆధిపత్యానికి సవాలుగా భావించిన మంత్రి వర్గీయులు ధ్వంసరచన చేశారు. ముందుగా రౌడీమూకలను వెంటేసుకుని మంత్రి తనయుడు సుధీర్‌రెడ్డి, మంత్రి భార్య అరుణలు గ్రామంలో బీభత్సం సృష్టించారు. ‘మాకు తెలియకుండా వైఎస్సార్సీపీ నాయకులను ఆహ్వానిస్తారా?’ అంటూ దళిత కుటుంబాలపై దాడికి దిగారు. పెళ్లింటి ముందు వేసిఉన్న షామియానాలను చించిపారేశారు. పక్కనే ఉన్న సుగుమంచిపల్లి గ్రామంలో వైఎస్సార్సీపీలో చేరేందుకు సిద్ధమైన వీరారెడ్డి, అతని కుటుంబీకులను ఆది వర్గీయులు చావబాదారు. మంత్రి భార్య అరుణ, మంత్రి సోదరుడి భార్య.. సుగమంచిపల్లిలో ఓ ఇంట్లో కూర్చొని అనుచరులను పురమాయిస్తోన్న వీడియో దృశ్యాలు బయటికొచ్చాయి. అర్ధరాత్రి తర్వాత ఎంపీకి అనుమతి..: పెద్దదండ్లూరు వెళ్లకుండా తనను అడ్డుకున్న పోలీసులపై ఎంపీ అవినాష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతగల ఎంపీగా తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కుందని, తనను అడ్డుకోవడం సరికాదని అన్నారు. అయినాసరే పట్టించుకోని పోలీసులు.. వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీచార్జి చేసి, నేతలను చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఎట్టకేలకు ఆదివారం అర్ధరాత్రి తర్వాత ఎంపీ అవినాష్, వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలోకి వెళ్లి బాధితులను పరామర్శించారు. (చూడండి: మంత్రి బెదిరిస్తే భయపడం) పోలీసులకు ఫిర్యాదు: పెద్దదుండ్లూరు, సుగమంచిపల్లిల్లో మంత్రి ఆదివర్గీయుల దాష్టీకాలపై బాధితులు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి వెంటరాగా, బాధితులు సుబ్బరామిరెడ్డి, సంపత్ జమ్మలమడుగు డీఎస్పీకి ఫిర్యాదు చేశారు. దళిత కుటుంబంపై దాడి చేయించిన మంత్రి ఆదినారాయణరెడ్డిపై కుల వివక్షవ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) సైతం ఆగ్రహం వ్యక్తం చేసింది. తక్షణమే మంత్రిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. -
ప్రజాక్షేత్రంలోనే మంత్రి ఆదికి బుద్ధి చెప్తాం