వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి.. ముందు తన పదవికి రాజీనామా చేసి తరువాత మాట్లాడాలని ఆ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎంవీ సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు.
ఎర్రగుంట్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి.. ముందు తన పదవికి రాజీనామా చేసి తరువాత మాట్లాడాలని ఆ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎంవీ సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం సాయంత్రం వైఎస్‌ఆర్‌సీపీ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత ఆదినారాయణరెడ్డికి లేదన్నారు.
టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి సత్తా చూపించాలని అన్నారు. ఎన్నికల హామీలను నెరవేర్చకపోతే ప్రజలే చంద్రబాబును చెప్పులతో కొడుతారని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారని అన్నారు. వైఎస్ జగన్ ఏమి అన్నారో ముందు తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. ముందు ఎమ్మెల్యే ఆది, టీడీపీ నేతల మధ్య ఉన్న వైరాన్ని సరి చేసుకోవాలని సూచించారు. వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌రెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ విశ్వభార్గవరెడ్డి, కౌన్సిలర్లు పద్మనాభయ్య, ఎరికల్‌రెడ్డి, జయరామక్రిష్ణారెడ్డి, మహబూబ్‌వలి, ఆర్టీపీపీ తులసీనాథ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఎస్ బీకారి, లక్ష్మీరెడ్డి పాల్గొన్నారు.