
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన మొక్కును తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర ద్వారా వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడంతో ఆయన కోరిక నెరవేరింది. దీంతో సుధీర్‌రెడ్డి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి నుంచి తిరుమల వరకు ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయంలో ఇప్పటికే రాష్ట్రం సువర్ణ పరిపాలన దిశగా అడుగు వేస్తోందన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి జమ్మలమడుగు అభివృద్ధి దిశగా పయనించడమే తన కోరిక అని సుధీర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు.