sudheer reddy
-
ఎమ్మెల్యే బొజ్జల నుంచి ప్రాణహాని ఉంది: స్క్రాప్ వ్యాపారి
-
టీడీపీ నేతను సస్పెండ్ చెయ్యాలని బాబుకు వాలెంటీర్ల వార్నింగ్
-
వాలంటీర్ల సేవలను ప్రధాని మోడీ ప్రశంసించారు..!
-
బొజ్జల సుధీర్ రెడ్డిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని ప్రజల డిమాండ్
-
బొజ్జల సుధీర్ రెడ్డిపై మండిపడుతున్న ప్రజలు
-
'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలో తెలుసా!?
'దేహ నిర్మాణంలోనూ, దారుఢ్యంలోనూ ఎముకలది కీలక పాత్ర. ఎముకలు బలంగా ఉంటేనే మనిషి బలంగా ఉంటాడు. ఆరోగ్యంగానూ ఉంటాడు. చిన్న వయసులో ఎముకలు చాలా ఫ్లక్సిబుల్గా ఉంటాయి. వయసు పెరుగుతున్నకొద్దీ ఎముకల్లోకి క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు నిండుతూ పోతుంటాయి. ఫలితంగా ముప్ఫయిల వయసు నాటికి ఎముకల సాంద్రత గరిష్ఠ స్థాయికి చేరుకుంటుంది. అయితే ఆ గరిష్ఠ స్థాయికి చేరాక మళ్లీ ఎముక సాంద్రత క్రమంగా తగ్గుతూ పోతుంది. ఇలా తగ్గడాన్ని ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ అంటారు. మెల్లగా తగ్గుతూపోతుంటే చాలాకాలం బలంగా ఉంటుంది. లేదంటే బలహీనపడుతుంది. ఈ 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ కథా కమామిషు చూద్దాం.' 'ప్రోగ్రెసివ్ బోన్ లాస్’ ఎందుకు నివారించాలంటే...? మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి ఖనిజాలు సిమెంటు అనుకుంటే... సూర్యరశ్మి నుంచి దొరికే విటమిన్ ‘డి’ ఈ కాంక్రీటును కలిపే నీరుగా భావిస్తే.. ఇదంతా ఎముకలో బలంగా కూరేలా చేసేది మనం చేసే వ్యాయామం. ఈ మూడు గరిష్ఠంగా కలగలిసి ఎంత బలంగా కూరినట్లు అయితే ఎముక అంత బలంగా మారుతుంది. అలా రూపొందే ఎముక సాంద్రత మీద ఎముక బలం ఆధారపడి ఉండటంతో.. ఎముక ఆరోగ్యానికి ‘బోన్ మినరల్ డెన్సిటీ’ అన్నది ఓ సూచికగా ఉంటుంది. 18 ఏళ్ల వయసు నుంచి ఈ బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతూ పెరుగుతూ 30వ ఏటికి వచ్చేసరికి దాదాపుగా గరిష్టంగా కొంతకాలం పాటు ఉండి, మళ్లీ అప్పటి నుంచి క్రమంగా తగ్గుతుంటుంది. ప్రోగ్రెసివ్ బోన్ లాస్ మహిళల్లో మరింత ఎక్కువ. ఎముకలు తమ సాంద్రత కోల్పోయే కండిషన్ పురుషుల కంటే మహిళల్లో చాలా వేగంగా జరుగుతుంది. సాధారణంగా వాళ్లలో వ్యాయామం చేసే పరిస్థితి చాలా తక్కువగా ఉండటం, అదీగాక 45 ఏళ్లు దాటాక రుతుస్రావం ఆగిపోవడం, దాంతో మెనోపాజ్ తర్వాత ఎముక సాంద్రత కోల్పోయే వేగం బాగా పెరుగుతుంది. ఈ కారణంగానే మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆస్టియోపోరోసిస్ రిస్క్ ఎక్కువ. ఎముక సాంద్రత తగ్గడానికి కారణాలు.. మన ప్రమేయం లేనివి.. కొందరికి జన్యుపరంగానే ఎముక సాంద్రత ఎక్కువగా ఉంటుంది. వారిలో వంశపారం పర్యంగానే చాలా పెద్దవయసు వచ్చేవరకు ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇది పుట్టుకతో వచ్చే మార్చలేని అంశం. ∙కొందరిలో కుషింగ్ సిండ్రోమ్, హైపోగొనాడిజమ్, థైరోటాక్సికోసిస్, అనొరెక్సియా నర్వోజా (తిండిపై ఆసక్తిలేకపోవడంతో ఆహారానికి దూరంగా ఉండటం), మాల్ అబ్షార్‌ప్షన్ సిండ్రోమ్, దీర్ఘకాలిక కాలేయ వ్యాధులు, దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు, రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి దీర్ఘకాలిక ఇన్ఫ్లమేటరీ వ్యాధుల వల్ల కూడా ఎముక సాంద్రత తగ్గి, ఆ తర్వాత ఇది సెకండరీ ఆస్టియోపోరోసిస్‌కు దారితీస్తుంది. కొందరు తరచూ కొన్ని ఆరోగ్య సమస్యల బారిన పడుతుండటం, అవి తగ్గడం కోసం గ్లూకోకార్టికాయిడ్స్, యాంటీ ఎపిలెప్టిక్ వంటి మందులు వాడుతుండటం... ఎముక సాంద్రతను తగ్గిస్తాయి. జెండర్ కారణాలు.. మహిళల విషయంలో.. అందునా వాళ్లలో మెనోపాజ్ తర్వాత ఎముకల సాంద్రత కోల్పోవడం ఎక్కువ. ఎత్తు తక్కువగా ఉన్న మహిళల్లో రిస్క్ ్రపోగ్రెసివ్ బోన్లాస్ ముప్పు మరింత ఎక్కువ. (అంటే.. బరువు అరవై కిలోల లోపు ఉండి, 155 సెం.మీ. కంటే తక్కువ ఎత్తున్న మహిళల్లో ఎముక సాంద్రత తగ్గడం చాలా త్వరగా, వేగంగా జరుగుతుంటుంది). మన చేతుల్లో/ నియంత్రణలో ఉండే అంశాల విషయానికి వస్తే.. మన నియంత్రణలో ఉండే కొన్ని అంశాలు పాటించడం ద్వారా ప్రోగ్రెసివ్ బోన్ లాస్‌ను నివారించవచ్చు. అదెలాగంటే.. క్యాల్షియమ్, ఫాస్ఫరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండే ఆకుకూరలు, పాలు, నట్స్ వంటి ఆహారాలు తీసుకుంటూ ఉండటం. దేహానికి విటమిన్–డి సమకూరేలా లేత ఎండలో వ్యాహ్యాళిగా తగినంత వ్యవధి పాటు తిరగడం. (నేరుగా పడే, తీవ్రమైన ఎండలో తిరగకూడదు). రోజుకు 30 – 45 నిమిషాల పాటు వారంలో కనీసం ఐదు రోజులు వ్యాయామం చేయడం. మన జీవనశైలి మార్చుకోవడం అంటే కాఫీ వంటివి పరిమితంగా తీసుకోవడం. పొగతాగడం, మద్యం వంటి దురలవాట్లకు దూరంగా ఉండటం. కంటినిండా తగినంతగా నిద్రపోవడం. ఒకవేళ కౌమార, యౌవన దశల్లో వ్యాయామానికి దూరంగా ఉండటం, మద్యం, పొగతాగడం వంటి అలవాట్లకు లోనైతే ఎముక సాంద్రత తగ్గిపోవడంలో వేగం పెరుగుతుంది. ఎముకలు త్వరగా గుల్లబారిపోయి, ఆస్టియోపోరోసిస్, ఆర్థరైటిస్ వంటి సమస్యలు త్వరగా వచ్చేందుకు అవకాశం పెరుగుతుంది. ఎముక సాంద్రత తెలిసేదెలా..? ‘డ్యుయల్ ఎనర్జీ ఎక్స్–రే అబ్జార్షియోమెట్రీ’ అనే ఆస్టియోపోరోసిస్ నిర్ధారణ పరీక్షే ఎముక సాంద్రత తెలుసుకోవడానికీ ఉపయోగపడుతుంది. బాధితుల వయసు ఆధారంగా ఎముక సాంద్రతను లెక్కగడతారు. దీన్ని ‘టీ’ స్కోర్‌గా చెబుతారు. దాంతో పాటు సీరమ్ లెవల్స్ ఆఫ్ క్యాల్షియమ్, ఫాస్ఫరస్, ఆల్కలైన్ ఫాస్ఫేట్స్, ఇన్‌టాక్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ (పీటీహెచ్) వంటి పరీక్షలూ అవసరం పడవచ్చు. ఎముక సాంద్రత పెంచుకోవడం కోసం.. ప్రోగ్రెసివ్ బోన్లాస్ నివారణకు మన చేతిలో ఉన్న అంశాల విషయంలో జాగ్రత్తే... ఎముక సాంద్రత పెంచుకోడానికి దోహదపడుతుంది. యుక్తవయసు పిల్లల్ని ఆరుబయట ఎండలో ఆడేలా ్రపోత్సహించడం. పెరిగే వయసు నుంచే క్యాల్షియమ్ ఎక్కువగా ఉండే ఆహారాలైన పాలు, పెరుగు, ముదురు ఆకుపచ్చరంగులో ఉండే ఆకుకూరలతోపాటు బ్రాకలీ వంటివి ఎక్కువగా తీసుకునేలా చూడటం. చిన్న వయసు నుంచి లేత ఎండలో ఎక్కువసేపు ఆడేలా ప్రోత్సహించాలి. దీనివల్ల దేహంలో విటమిన్ ‘డి’ ఎక్కువగా తయారవుతుంది. అది ఆహారాన్ని ఎముకల్లోకి ఇంకిపోయేలా చేయడంతో సాంద్రత పెరుగుతుంది. ఫలితంగా ఎంత చిన్న వయసు నుంచి ఈ అలవాట్లు నేర్పితే.. అంత సుదీర్ఘకాలం సాంద్రత నిలిచి ఉండి, ప్రోగ్రెసివ్ బోన్ లాస్ తగ్గుతుంది. దాంతో వృద్ధాప్యంలో పడిపోవడం (ఫాల్), ఇతర ఎముకలతో పాటు ప్రధానంగా తుంటి ఎముకల వంటివి విరగడాన్ని నివారించవచ్చు. — డాక్టర్ సుధీర్‌రెడ్డి, సీనియర్ ఆర్థోపెడిక్ సర్జన్. -
మూడోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు: సుధీర్ రెడ్డి
-
కీలక పరిణామం.. కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, మేడ్చల్: ఎన్నికల వేళ రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. బీఆర్ఎస్కు మరో నేత గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మల్లిపెద్ది సుధీర్‌రెడ్డి హస్తం గూటికి చేరనున్నారు. టీపీసీసీ ఛీప్ రేవంత్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరనున్నారు. రేవంత్‌రెడ్డి ఇవాళ సుధీర్‌రెడ్డి నివాసానికి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. మలిపెద్ది సుధీర్ రెడ్డి 2014లో బీఆర్ఎస్ తరఫున మేడ్చల్ ఎమ్మెల్యేగా గెలిచారు. అయితే 2018లో జరిగిన ఎన్నికల్లో మాత్రం ఆయనకు మళ్లీ సీటు దక్కలేదు. పార్టీ అధిష్టానం అప్పట్లో పార్లమెంటు సభ్యుడిగా ఉన్న మల్లారెడ్డిని మేడ్చల్ నుంచి బరిలోకి దింపింది. ఎన్నికల్లో విజయం సాధించిన తరువాత మల్లారెడ్డిని ఏకంగా మంత్రి వర్గంలోకి చేర్చుకుంది. తరువాతి కాలంలో మల్లారెడ్డి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవితలకు దగ్గరయ్యారు. బీఆర్ఎస్లో తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. ఈ నేపథ్యంలోనే ఐదేళ్ల నుంచి మల్లారెడ్డికి, సుధీర్‌రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరువురు నేతలూ బహిరంగంగానే విమర్శలకు దిగిన సందర్భాలూ ఉన్నాయి. సుధీర్ రెడ్డి అసంతృప్తిని చల్లార్చేందుకు అప్పట్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి చర్చలు జరిపి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవి, కుమారుడు శరత్‌చంద్రారెడ్డికి జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవి దక్కే ప్రయత్నం చేశారు. సమయం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు.. 2023 ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో సుధీర్ రెడ్డి బీఆర్ఎస్లో కొనసాగే విషయంలో మల్లగుల్లాలు పడుతుండగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగింది. బీఆర్ఎస్లో తాను ఎంతకాలమున్నా తాను మళ్లీ ఎమ్మెల్యే కాలేని, నియోజకవర్గంలోనూ పట్టు సాధించలేనని సుధీర్‌రెడ్డి చాలా కాలంగా భావిస్తున్నట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డితో సుధీర్‌రెడ్డికి బంధుత్వం కూడా ఉంది. అయితే, తనకు అసెంబ్లీ టికెట్ ఇస్తేనే కాంగ్రెస్ పార్టీలోకి వస్తానని సుధీర్ రెడ్డి తేల్చి చెప్పినట్లు సమాచారం. కానీ మేడ్చల్ నియోజకవర్గంలో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ తరఫున హరివర్ధన్‌రెడ్డి, జంగయ్య యాదవ్, నక్క ప్రభాకర్ గౌడ్ వంటి నేతలు టికెట్ కోసం పోటీ పడుతున్నారు. మరోవైపు సుధీర్‌రెడ్డి మాత్రం తనకు టికెట్ ఇస్తే విజయం సాధించి తీరతానని కాంగ్రెస్ నేతల వద్ద ధీమా వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఉన్న సంప్రదాయ ఓట్లతోపాటు రెడ్డి సామాజిక వర్గం ఓట్లు, బీఆర్ఎస్ ఓట్లూ తాను పొందగలనని, టికెట్ ఆశిస్తున్న మిగిలిన నేతలకు ఈ అవకాశం లేదన్నది ఆయన విశ్లేషణగా ఉంది. ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా.. నల్లగొండ మున్సిపాలిటీలో మరో ఇద్దరు కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేశారు. కోమటిరెడ్డి సమక్షంలో వారు కాంగ్రెస్‌లోకి చేరారు. ఇప్పటి వరకు ఎనిమిది మంది కౌన్సిలర్లు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి చేరారు. మరో నలుగురు కౌన్సిలర్లు కూడా కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉంది. చదవండి: మన పార్టీలో కూడా ఫ్యామిలీ ప్యాకేజీలుంటాయా? -
సమావేశానికి పిలవాల్సిన అవసరమేంటి? వారే రావాలి: మంత్రి మల్లారెడ్డి
సాక్షి, మేడ్చల్ జిల్లా: రానున్న సాధారణ ఎన్నికల దృష్ట్యా భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) బలోపేతమే లక్ష్యంగా చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు కాస్తా.. నేతల మధ్య చాపకింద నీరులా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు బహిర్గతమవడంతో కేడర్ తీవ్ర అయోమయానికి గురవుతోంది. మంగళవారం దేవరయాంజల్లో జరిగిన మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మలిపెద్ది సుధీర్‌రెడ్డి, ఆయన తనయుడు జెడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి దూరంగా ఉండటంపై కార్యకర్తల్లో చర్చ సాగుతోంది. అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం.. సమ్మేళనానికి ఆహ్వానం లేకపోవటం వల్లే హాజరు కాలేదని సుధీర్‌రెడ్డి, శరత్‌చంద్రారెడ్డి పేర్కొంటుండగా, వారిని పిలవాల్సిన అవసరమేంటి..? వారే రావాలని మంత్రి మల్లారెడ్డి వాదిస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాల్లో అందరూ పాల్గొనాలని అధిష్టానమే ఆదేశించిందని, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిని తాను పిలవడం ఏంటని.. వారే రావాలి కదా అని మంత్రి మల్లారెడ్డి పేర్కొంటున్నారు. గతంలో మండల, పురపాలక స్థాయి సమావేశాల్లో పాల్గొన్న వారిని.. ఎవరు పిలిస్తే వచ్చారని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంపై జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డి మాట్లాడుతూ ఆ సమావేశాలకు ఆహ్వానం ఉండటం వల్లే పాల్గొన్నామని తెలిపారు. మంత్రి మల్లారెడ్డి వ్యవహారాన్ని, ఆత్మీయ సమ్మేళనాలకు ఆహ్వానించని విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఆత్మీయ సమ్మేళనాలు ఇలా.. మేడ్చల్ జిల్లాలో దాదాపు నెల రోజులుగా మండల, పురపాలక సంఘాలు, అసెంబ్లీ నియోజకవర్గం స్థాయిల్లో ఆత్మీయ సమ్మేళనాలను నిర్వహిస్తున్నారు. ఆతీ్మయ సమ్మేళనాల విజయవంతం కోసం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాకు పార్టీ సమన్వయకర్తగా ఎమ్మెల్సీ, రైతు బంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని అధిష్టానం నియమించింది. మార్చి 24 నుంచి జిల్లాలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు జరుగుతుండగా, మేడ్చల్ నియోజకవర్గంలో మాత్రం 10 పురపాలక సంఘాలు, 5 మండలాల సమావేశాలకు 6 పురపాలికలు, 4 మండలాల్లో మాత్రమే జరిగాయి. ఇంకా పీర్జాదిగూడ, ఘట్కేసర్, నాగారం, దమ్మాయిగూడ పురపాలక సంఘాలతోపాటు ఎంసీపల్లి మండలంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించాల్సి ఉంది. గతంలో ఐదుగురు ఎమ్మెల్యేల తిరుగుబాటు.. మేడ్చల్ జిల్లాలో బీఆర్ఎస్ నేతల మధ్య అంతర్గంగా కొనసాగుతున్న విభేదాలు ఆత్మీయ సమ్మేళనాలతో పోతాయని భావించినా.. మరింత ముదురుతుండటంతో పరిస్థితి ఎక్కడి దారి తీస్తుందోనని పార్టీ కేడర్ ఆందోళన చెందుతోంది. గతంలోనే మంత్రి మల్లారెడ్డిపై జిల్లాకు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఇంత వరకు ఇది ఓ కొలిక్కివచ్చిన దాఖలాలు లేవు. గతంలో మల్కాజిగిరి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నేత హన్మంతరావు ఇంట్లో సమావేశమైన ఐదుగురు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి నిధుల విషయంలో మంత్రి మల్లారెడ్డి జోక్యాన్ని తప్పుబట్టారు. ఈ వ్యవహారాన్ని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్తామని వారు పేర్కొన్న విషయం తేల్సిందే. అలాగే, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆదేశాలను ఖాతర్ చేయకుండా నామినేటెడ్ పదవులను కూడా మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గం వారికి కట్టబెట్టారని ఆ సందర్భంలో ఎమ్మెల్యేలు ఆరోపించిన విషయం తేల్సిందే. ఈ వ్యవహారం ఇంకా చక్కబడకపోగా, నివురుగప్పిన నిప్పులా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా.. జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలో మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సు«దీర్‌రెడ్డి, ఉప్పల్‌లో ఎమ్మెల్యే భేతి సుభా‹Ùరెడ్డి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కుత్బుల్లాపూర్‌లో ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్సీ, ప్రభుత్వ విప్ శంభీపూర్ రాజు మధ్య విభేదాలు తారస్థాయిలో ఉన్నాయి. కూకట్‌పల్లిలో కూడా ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ తమ గ్రూపులను ప్రోత్సహిస్తున్నట్లు పార్టీ కేడర్‌లో గుసగుసలు వ్యక్తం అవుతున్నాయి. జిల్లాలోని 13 పురపాలక సంఘాలోŠల్ అధికార పార్టీ మేయర్లు, డిప్యూటీ మేయర్లు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు ఉన్నప్పటికీ వారి మధ్యనే విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా కొనసాగుతున్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలోని డివిజన్లతో సహా పలు గ్రామాల్లో కూడా పార్టీ ప్రజాప్రతినిధుల మధ్య అంతర్గత విభేదాలు చాపకింద నీరులా కొనసాగుతున్నాయి. మూడింటిలో తారస్థాయిలో.. మేడ్చల్ జిల్లాలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, ఇందులో మేడ్చల్, ఉప్పల్, కుత్బుల్లాపూర్ మినహాయించి మిగతా కూకట్పల్లి, మల్కాజిగిరి నియోజకవర్గాల్లో పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు సాఫీగానే కొనసాగుతున్నాయి. ఉప్పల్, కుత్బుల్లాపూర్ నియోజకవర్గాల్లో చాపకింద నీరులా నాయకుల మధ్య అంతర్గత విభేదాలు కొనసాగుతున్నా.. ఆత్మీయ సమ్మేళనాలు మాత్రం సజావుగా నిర్వహిస్తున్నారు. మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఆత్మీయ సమ్మేళనాల తీరు నేతల మధ్య ఆధిపత్య పోరుకు ఆజ్యం పోస్తోంది. ఇటీవల బోడుప్పల్ పురపాలక సంఘంలో జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం దీనికి నిదర్శంగా నిలుస్తోంది. బోడుప్పల్ సమ్మేళనంలో మంత్రి చామకూర మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నాలుగేళ్లుగా కొనసాగుతున్న విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా సమన్వయకర్త, పార్టీ ఇన్చార్జి ఎమ్మెల్సీ, రాష్ట్ర రైతుబంధు చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమక్షంలోనే ఇరువురు నేతలు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతూ.. వాగ్వాదాలకు దిగడం పార్టీ కేడర్‌ను తీవ్ర అయోమయానికి గురిచేసింది. -
బీఆర్ఎస్లో రగులుతున్న అసమ్మతి.. మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిగా మేడ్చల్ బీఆర్ఎస్ పార్టీ తయారైంది. మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిల మధ్య పార్టీలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇద్దరు ప్రధాన నాయకులు చెరో గ్రూపుగా మారడంతో మేడ్చల్ బీఆర్ఎస్లో అసమ్మతి బయటపడుతోంది. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి ఈ విషయం బయటపడింది. మొదటి నుంచీ ఇద్దరి మధ్య ఆధిపత్య పోరే.. 2014లో మేడ్చల్ నుంచి కారు గుర్తుపై సుధీర్‌రెడ్డి పోటీ చేసి ఎమ్మెల్యేగా ఎన్నికై ఐదేళ్లు పని చేశారు. 2014 ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్‌కు టీడీపీ తరఫున మంత్రి మల్లారెడ్డి ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధన కోసం బీఆర్ఎస్లో చేరారు. ఎంపీగా ఉన్న సమయంలోనే మల్లారెడ్డి మేడ్చల్ నియోజకవర్గంలో తన అనుచరుల ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించారు. అదే సమయంలో నాటి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి మల్లారెడ్డి మధ్య పలు మార్లు భేదాభిప్రాయాలు వచ్చినా అవి అప్పటి వరకే పరిమితమయ్యాయి. 2019 ఎన్నికల్లో బీఆర్ఎస్ అధిష్టానం సుధీర్‌రెడ్డిని కాదని ఎంపీగా ఉన్న మల్లారెడ్డికి టికెట్ ఇవ్వడంతో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆ సమయంలో అలకబూనిన సుధీర్‌రెడ్డిని ప్రస్తుత రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అధిష్టానం దూతగా వచ్చి బుజ్జగించి ఆయనకు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి బుజ్జగించారు. ఆ తర్వాత మంత్రిగా మల్లారెడ్డి కావడం, ఆయన అర్థ బలం ముందు సుధీర్‌రెడ్డి తట్టుకోలేకపోవడంతో ఆయన కొంతమేర వెనకడుగు వేశారు. ఆ తర్వాత వచ్చిన స్థానిక సంస్థల ఎన్నికల్లో సు«దీర్‌రెడ్డి తన తనయుడు శరత్‌చంద్రారెడ్డిని ఘట్కేసర్ నుంచి పోటీలో దింపి గెలిపించుకున్నారు. అదే ఎన్నికల్లో మంత్రి మల్లారెడ్డి తన బావమరిది మద్దుల శ్రీనివాస్‌రెడ్డిని మూడుచింతలపల్లి మండలం నుంచి పోటీలో దింపగా ఆయన ఓటమిపాలయ్యారు. దీంతో సు«దీర్‌రెడ్డి తనయుడు శరత్‌చంద్రారెడ్డి జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికయ్యారు. నాటి నుంచి నియోజకర్గంలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. సుధీర్‌రెడ్డి తన అనుచరులతో తనకూ ఓ గ్రూపును ఏర్పాటు చేసుకోగా మంత్రి మల్లారెడ్డి తన కోటరిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో మరోసారి రచ్చ.. బీఆర్ఎస్ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలతో బీఆర్ఎస్లో వర్గ విభేదాలు జోరుగా బయట పడ్డాయి. మొదట్లో సర్పంచ్, ఎంపీటీసీ స్థాయి, గ్రామ, వార్డుస్థాయి నాయకులు తమ అసమ్మతి వెల్లగక్కినా అది బయటపడకుండా మంత్రి తనయుడు మహేందర్‌రెడ్డి మేనేజ్ చేశారు. చాలామంది నాయకులు ఆత్మీయ సమ్మేళనాలకు డుమ్మా కొట్టినా మంత్రి బలం ముందు తమ అసమ్మతిని బహిరంగంగా వెల్లడించలేకపోయారు. ఆత్మీయ సమ్మేళనాలకు హాజరైన సుధీర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ శరత్‌చంద్రారెడ్డిలు తమ ప్రసంగాల్లో అధిష్టానం ఎవరికి టికెట్ కేటాయించినా వారి గెలుపు కోసం అందరూ పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సుధీర్‌రెడ్డి ఈ అంశాన్ని పదేపదే నాయకుల ముందు ఉంచడంతో చిర్రెత్తిన మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మండల ఆత్మీయ సమ్మేళనంలో టికెట్ తనకు సీఎం కేసీఆర్ ఖరారు చేశారని, గెలుపు తనదేనని అన్నారు. ఆ తర్వాత జరిగిన బోడుప్పల్ ఆత్మీయ సమ్మేళనంలో ఇదే అంశం ఇద్దరి నేతల మధ్య అగ్గి రాజేసింది. పార్టీ ఎవరికి టికెట్ ఖరారు చేయలేదని సుధీర్‌రెడ్డి అనగా తనకే కేటాయించిందని మంత్రి మల్లారెడ్డి అనడం వారి మధ్య వాగ్వాదానికి తేరలేపింది. మొదటి నుంచీ ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న నేతలకు మరోసారి అవకాశం రావడంతో పార్టీ పరువును జవహర్‌నగర్ డంపింగ్ యార్డులో కలిపారు. రంగంలోకి ఎవరు..? వీరి మధ్య ఆధిపత్య పోరు జోరుగా ఉండటంతో అధిష్టానం మేడ్చల్ గెలుపుకోసం చురుగ్గా పావులు కదుపుతున్నట్లు తెలుస్తోంది. సీఎంకు అత్యంత సన్నిహితంగా ఉండే జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును, రైతుబంధు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డిని రంగంలోకి దించాలనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. మల్లారెడ్డి స్థాయిలో కాకున్నా ఇద్దరు నేతలు అర్థబలం గట్టిగా ఉన్నవారు కావడం, సీఎంకు నమ్మి న బంట్లుగా ఉండటంతో వీరిద్దరిలో ఒకరికి మేడ్చల్ బీఆర్ఎస్ టికెట్ కేటాయించే అవకాశం ఉన్నట్లు పార్టీ శ్రేణుల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
ఓటుకు కోట్లు కేసులో దొరికిన దొంగ రేవంత్ రెడ్డి: ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి
-
రేవంత్ మాపై పిర్యాదు చేయడం హాస్యాస్పదం: సుధీర్ రెడ్డి
హైదరాబాద్: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి. బీఆర్ఎస్లో చేరిన 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని రేవంత్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ రేవంత్ అని ధ్వజమెత్తారు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి ఎమ్మెల్యేలు మారలేదా? అని సుధీర్ రెడ్డి ప్రశ్నించారు. వాళ్లంతా ముడుపులిస్తే మేం కూడా ఇచ్చినట్లే అని వ్యాఖ్యానించారు. బీజేపీకి బీ టీంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పనిచేస్తోందని సుధీర్ రెడ్డి ఫైర్ అయ్యారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉండి రేవంత్ కాంగ్రెస్‌ను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. చదవండి: ఇన్ని రోజులు నిద్రపోయారా.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఫైర్ -
మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నారాజ్!
సాక్షి, మేడ్చల్: పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని.. మాజీ ఎమ్మెల్యే అయినా తన ఫొటోలు ఎక్కడా ఫ్లెక్సీల్లో పెట్టడం లేదంటూ మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి నిరసన వ్యక్తం చేశారు. మేడ్చల్ పట్టణంలో 50 పడకల ఆస్పత్రి శంకుస్థాపనకు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు వచ్చిన విషయం విదితమే. శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు పూర్తి చేసుకుని మంత్రులు వేదిక వద్దకు వచ్చారు. సమావేశ ఉపన్యాసకులు మంత్రులను వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వేదికపైకి రావాలని కోరారు. కానీ సుధీర్‌రెడ్డి వేదిక పైకి వెళ్లకుండా కార్యకర్తల మధ్యే కూర్చుకున్నారు. మంత్రి మల్లారెడ్డి సైతం పుండుమీద కారం చల్లినట్లు తన ప్రసంగం ప్రారంభ సమయంలో అందరి పేర్లు చెప్పి చివరిలో మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేరు పలకలేదు. మంత్రి హరీష్‌రావు అసలు ఆయన ఊసే ఎత్తకపోవడం గమనార్హం. చదవండి: చర్చకు రమ్మంటే ముఖం చాటేస్తున్న ఈటల: ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి -
సంక్షేమ పథకాలు జగనన్నతోనే సాధ్యం
మైలవరం (జమ్మలమడుగు రూరల్): రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు జరగాలంటే జగనన్నతోనే సాధ్యమవుతుందని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి అన్నారు. గురువారం మైలవరం మండలంలోని వేపరాలలో ఎంపీటీసీ–2 ప్రాంతంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి సంక్షేమ పథకాలు అందుతున్నాయా లేదా అని ప్రతి ఒక్కరినీ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులుగా ఉన్న వారందరికీ సంక్షేమ పథకాలు అందజేశారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో వారి కార్యకర్తలకే పథకాలు లభించేవని విమర్శించారు. అంతే కాకుండ తెదేపా పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది చెనేతలు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగిందన్నారు. జగనన్న చెనేతల కష్టాలను గుర్తించి అర్హులైన ప్రతి చెనేతకు ప్రతి ఏడాది రూ.24 వేలు వారి ఖాతాల్లో వేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హస్తకళల అభివృద్ధి చైర్మన్ బడిగించల విజయలక్ష్మీ, ఎంపీటీసీలు నారే రాము, కుమారస్వామి, బడిగించల చంద్రమౌళి, ఎంపీడీఓ వై.రామచంద్రారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ ధన్నవాడ మహేశ్వర్‌రెడ్డి, స్థానిక నాయకులు బాలక్రిష్ణ, నాగేంద్ర, శంకర్, శ్రీనివాసులురెడ్డి, విష్ణువర్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వీడిన మిస్టరీ: నీటి కుంటలో శవమై తేలిన జయశీల్‌రెడ్డి
నల్లగొండ క్రైం: సోమవారం తన వ్యవసాయ క్షేత్రంలో అదృశ్యమైన దేవిరెడ్డి జయశీల్‌రెడ్డి (42) మంగళవారం నీటి కుంటలో శవమై తేలారు. ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి బాబాయ్ కుమారుడు జయశీల్‌రెడ్డి నల్లగొండ మండలంలోని మేళ్లదుప్పలపల్లి గ్రామంలో తన వ్యవసాయ క్షేత్రాన్ని పరిశీలించేందుకు వచ్చి అక్కడే కుంటలో కాలుజారి పడి మృతిచెందారు. మంగళవారం జాలర్ల వలకు అతడి మృతదేహం చిక్కింది. జయశీల్‌రెడ్డి సోమవా రం హైదరాబాద్ నుంచి తన వ్యవసాయ క్షేత్రానికి వచ్చా రు. కుంటపైనుంచి వ్యవసాయ క్షేత్రంలోకి మట్టి రోడ్డు ఉంది. కట్టపై నుంచి నడుచుకుంటూ వెళ్తున్న క్రమంలో వర్షం కారణంగా కాలు జారి నీటి కుంటలో పడిపోయా రు. ఈత రాకపోవడంతో నీటిలో నుంచి బయటికి రాలేక ప్రాణాలు విడిచారు. కుంటలోనుంచి బయటికి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా మృతదేహం కాళ్లకు, చేతులకు బురద అంటి ఉంది. నీటిలో నుంచి పైకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. బంక మట్టి కావడం, కాళ్లకు బూట్లు ఉండటంతో నీటిలో నుంచి పైకి అడుగు వేయలేకపోయినట్లుగా భావిస్తున్నారు. నీటి బుడగలతో గుర్తించారు.. జయశీల్‌రెడ్డి కోసం కుంటలో, పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో సోమవారం నుంచి గాలించారు. జాలర్లు చేపలు పట్టే తెప్పతో గాలిస్తుండగా కట్టకు సమీపంలో నీటి బుడ గలు పైకి వస్తుండటంతో అనుమానం వచ్చి వల విసిరా రు. తల భాగం వలకు చిక్కి పైకి కనిపించడంతో మృతదేహాన్ని బయటికి తీసుకొచ్చారు. జయశీల్‌రెడ్డి మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించిన అనంతరం హైదరాబాద్‌లోని విద్యానగర్‌కు తరలించారు. ఎల్బీనగర్ ఎమ్మె ల్యే సుధీర్‌రెడ్డి, జయశీల్‌రెడ్డి తల్లిదండ్రులు సునంద, జగదీశ్వర్‌రెడ్డి, కుటుంబ సభ్యులంతా రెండు రోజులుగా వ్యవసాయ క్షేత్రం వద్దనే ఉన్నారు. అమెరికా వెళ్లాల్సిన కుమారుడు విగతజీవిగా కనిపించడంతో వారు గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి నల్లగొండ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, వైస్ చైర్మన్ రమేష్‌గౌడ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. -
అప్పుడు నిద్రపోయారా.. మైసూరా!
ఒంగోలు: టీడీపీ హయాంలో నదీ జలాలను తెలంగాణ ప్రభుత్వం తరలించుకుపోతే ఎంవీ మైసూరారెడ్డి నిద్రపోయారా అని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి నిలదీశారు. ఒంగోలులో గురువారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సర్కారు ఏపీకి అన్యాయం చేస్తున్న రోజుల్లో మౌనం దాల్చిన మాజీ మంత్రి మైసూరా ఇప్పుడు న్యాయం చేస్తున్న ప్రభుత్వంపై రాళ్లు వేయడం దుర్మార్గమన్నారు. 2014–19 మధ్య శ్రీశైలం జలాశయం వద్ద 800 అడుగుల్లోపే నీటిమట్టం ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించేందుకు శ్రీకారం చుట్టిందన్నారు. ఆ అంశంపై చంద్రబాబు ఐదేళ్ల పాలనలో మైసూరారెడ్డి నోరు విప్పకపోవడం రాయలసీమపై ఆయనకున్న ప్రేమకు అతి పెద్ద సాక్ష్యమని పేర్కొన్నారు. ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు.. అక్రమ ప్రాజెక్టులు కడుతున్నా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించలేకపోయారని గుర్తు చేశారు. సొంత ప్రయోజనాల కోసం చంద్రబాబు రాష్ట్ర ప్రయోజనాలను, ప్రత్యేకించి రాయలసీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతుంటే నోరెత్తని మైసూరా ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వంపై నోటికొచ్చినట్టు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. రాయలసీమకు అన్యాయం చేసిన చంద్రబాబును 2019 ఎన్నికలకు ముందు మైసూరా ఎందుకు కలిశారో, ఏం మంతనాలు జరిపారో బహిరంగ రహస్యమే అన్నారు. చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడుతుంటే.. చంద్రబాబుకు మైసూరా అనుకూలంగా మాట్లాడుతున్నారన్నారు. తెలంగాణలో ఇతర పార్టీల నాయకులు సైతం అక్కడ కడుతున్న అక్రమ ప్రాజెక్టులను సక్రమమే అని చెబుతుంటే.. మన దౌర్భాగ్యం కొద్దీ ఒక బాబు, ఒక మైసూరా, ఒక రఘురామరాజుతోపాటు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ–5 రాష్ట్రానికి శనిలా దాపురించాయని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం కోసం చర్చలు పెట్టాలి టీవీ చానళ్లలో చర్చలను ప్రజల్ని రెచ్చగొట్టేందుకు కాకుండా.. అభివృద్ధి, సంక్షేమం కోసం నిర్వహించాలని సుధీర్‌రెడ్డి సూచించారు. ఏబీఎన్ రాధాకృష్ణ, మైసూరారెడ్డి మధ్య జరిగిన చర్చా కార్యక్రమంలో ఏది పడితే అది మాట్లాడారని మండిపడ్డారు. నదీ జలాల పంపిణీ అనేది సీఎంలు కూర్చొని మాట్లాడుకుంటే పరిష్కారమయ్యే సమస్య కాదన్నారు. కృష్ణా, గోదావరి నదీ జలాల బోర్డులు చేయాల్సి ఉంటుందన్నారు. కరోనా సమయంలో ప్రభుత్వ పథకాల ద్వారా పేదలను ఆదుకున్నా కూడా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మండిపడ్డారు. -
ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు వరద ఎఫెక్ట్..
-
ఎల్బీనగర్ ఎమ్మెల్యేకు వరద ఎఫెక్ట్..
సాక్షి, హైదరాబాద్: ఎల్బీ నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కారు వరదనీటిలో చిక్కుకుంది. హస్తినాపురం డివిజన్ సాగర్ ఎంక్లేవ్‌లో ఆయన పర్యటిస్తుండగా వరదలో ఎమ్మెల్యే కారు చిక్కుకుపోయింది. సెక్యూరిటీతో పాటు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కూడా కారును తోశారు. అతికష్టం మీద వరదలో చిక్కుకున్న కారు బయటకొచ్చింది. హైదరాబాద్‌లో ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలకు పలు కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి. నాగోల్ అయ్యప్పనగర్ కాలనీ నీట మునిగింది. మల్లికార్జునగర్, త్యాగరాజనగర్ కాలనీల్లోకి వరద నీరు చేరింది. 60 మందిని పునరావాస కేంద్రాలకు అధికారులు తరలించారు. రామంతాపూర్‌లో భారీ వర్షానికి ఇళ్లలోకి వర్షపు నీరు చేరింది. వనస్థలిపురం చింతలకుంట జాతీయ రహదారిపై వర్షపునీరు నిలిచిపోయింది. ఏకధాటిగా కురుస్తున్న వర్షానికి రహదారులు జలమయం అయ్యాయి. -
‘మమ్మల్ని రాళ్లతో కొడితే.. నిన్ను చెప్పులతో కొట్టాలి’
-
‘జమ్మలమడుగు’లో వారిద్దరు కలిసి పని చేస్తారు: సజ్జల
సాక్షి, అమరావతి: ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మా పార్టీలోకి వచ్చారు.. కోవిడ్ తీవ్రమవడంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. ఈరోజు సీఎం జగన్‌ను రామసుబ్బారెడ్డి కలిశారు, పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నిలబడి పోరాడారు.. ఎమ్మెల్యేగా గెలిచారు.. వచ్చే ఎన్నికల్లో కూడా సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని ప్రకటించారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం.. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తామని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారని చెప్పారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి రామసుబ్బారెడ్డి పనిచేస్తారు అని ప్రకటించారు. సీఎం జగన్ నాయకత్వంపై మాకు సంపూర్ణ విశ్వాసం ఉంది అని రామసుబ్బారెడ్డి తెలిపారు. పార్టీలో క్రియాశీలకంగా తగిన గుర్తింపు ఇస్తామని సీఎం చెప్పారని పేర్కొన్నారు. మొదటి నుంచి పార్టీ కోసం పనిచేసిన వారికి ఇబ్బంది లేకుండా మేం పనిచేస్తాం, వచ్చే ఎన్నికల్లో సుధీర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు అని చెప్పారు. సుధీర్‌రెడ్డి కోసం నేను, మా కార్యకర్తలు కష్టపడి పనిచేస్తారని స్పష్టం చేశారు. చదవండి: డ్రగ్స్ ఎమ్మెల్యేలు, వసూల్ మంత్రిని తొలగించండి చదవండి: వాళ్ల కాళ్లు పట్టుకుని చంద్రబాబు సీఎం అయ్యారు -
సూర్యుడి కంటే ముందే సుధీరన్న..
సాక్షి, ఎల్బీనగర్: మార్నింగ్ వాక్ పాదచారిగా పేరుగాంచిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి హయత్‌నగర్‌లో శనివారం చేసిన పాదయాత్రతో 34 ఏళ్లు పూర్తయ్యాయి. కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో చేసిన మార్నింగ్ వాక్కు మంచి ఆదరణ రావడంతో మొదటిసారిగా హుడా చైర్మన్‌గా, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికైన సమయంలో మార్నింగ్ వాక్ చేసి ప్రజల మన్ననలను పొందారు ఆయన. ఆదే స్ఫూర్తితో పదవిలో ఉన్నా లేకున్నా సమస్యల కోసం నియోజకవర్గంలో మార్నింగ్ వాక్ చేసేవారు. ఇలా 34 సంవత్సరాల పాటు మార్నింగ్‌వాక్ చేసిన ఘనత సుధీర్‌రెడ్డికే దక్కింది. ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు 1987 జనవరి 23న అప్పట్లో అక్బర్‌బాగ్ డివిజన్ కార్పొరేటర్‌గా ఉన్న సమయంలో మంచినీటి సమస్య పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. సూర్యుడి కంటే ముందే సుధీరన్న అనే కార్యక్రమం ద్వారా తొలిసారిగా ఆంధ్ర కాలనీలో తెల్లవారుజామున 4.30 గంటలకు మార్నింగ్ వాక్ చేపట్టారు. దీనికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించింది. సమస్యలు సైతం సత్వరమే పరిష్కారమయ్యేవి. ఇలా ఎల్బీనగర్ నియోజకవర్గంలో 100కుపైగా కాలనీల్లో మార్నింగ్ వాక్ చేసిన ఘనత ఆయనది. తొలుత మంచినీటి కోసం చేసిన మార్నింగ్ వాక్ ప్రస్తుతం రోడ్లు, డ్రైనేజీ, పారిశుద్ధ్యం, కాల్వలు, చెరువుల సుందరీకరణ తదితర అంశాలపై ఆయన దృష్టి సారించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. మార్నింగ్ వాక్కు ప్రజల నుంచి వచ్చిన ఆదరణ ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటన
సాక్షి, కడప: ముంపు గ్రామాల బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం ఆయన వైఎస్సార్ జిల్లా గండికోట ముంపు గ్రామాల్లో పర్యటించారు. ఆందోళన నిర్వహిస్తున్న తాళ్ల పొద్దుటూరు గ్రామస్తులతో చర్చించారు. దీంతో ఇళ్లు ఖాళీ చేయడానికి గ్రామస్తులు ఒప్పుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే ప్రభుత్వం 900 కోట్లు పరిహారం చెల్లిందని తెలిపారు. గత ఏడాది కంటే ఎక్కువ టీఎంసీల నీరు నింపుకుంటే మేలు జరుగుతుందన్నారు. కలెక్టర్, జేసీల సమక్షంలో ముంపు వాసుల చర్చలు సానుకూల వాతావరణంలో జరిగాయని సుధీర్‌రెడ్డి తెలిపారు. (చదవండి: అంతరాష్ట్ర బస్సులు: 14న కీలక భేటీ) -
చివరిశ్వాస వరకూ వైఎస్ జగన్‌తోనే: ఎమ్మెల్యే
సాక్షి, కడప : రాజకీయంగా తనపై వస్తున్న ఆరోపణలను జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. ఇటీవల మీడియాలో తన పైన వచ్చినవ వార్తలన్నీ అవాస్తవాలేనని కొట్టిపారేశారు. తాను కడప జిల్లాకు చెందిన వ్యక్తినని, తన భాష ఇలాగే ఉంటుందని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేకపోతే తనకు రాజకీయ భవిష్యత్తే లేదని, అసలు రాజకీయాల్లోకి వచ్చేవాడినే కాదని స్పష్టం చేశారు. తాను తొలినుంచీ వైఎస్సార్, జగన్ అభిమాని అని గుర్తుచేశారు. నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజుతో తనను పోల్చడం దారుణమని, ఆయన అలా ఎందుకు వ్యవహరిస్తున్నారో అర్థంకావడంలేదని అన్నారు. సీఎం జగన్‌కు తాను ఎప్పుడూ విధేయుడిగా ఉంటానని, ఎప్పుడు రాజీనామా చేయమన్నా చేస్తానని పేర్కొన్నారు. మంగళవారం వైఎస్సార్ కడప జిల్లాలో నిర్వహించిన మీడియా సమావేశంలో సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘నాపై అసత్య ప్రచారాలు వద్దు. వైఎస్ కుటుంబాన్ని ఎదిరించినోళ్లు ఇంతవరకు ఎవరూ బాగుపడలేదు. రఘురామ కృష్ణంరాజు, ఆదినారాయణ రెడ్డి లాంటోళ్లే ఇళ్లలో కూర్చొని వున్నారు. జమ్మలమడుగులో నా గెలుపుకు కారణం ఎంపీ అవినాష్ రెడ్డే. అలాంటి కుటుంబాన్ని నేనెందుకు తిడతాను. నా మీద వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నాను. తుదిశ్వాస వరకు వైఎస్ కుటుంబానికి కార్యకర్తగానే ఉంటాను. ఇకనైనా నాపై అసత్య ప్రచారాలు మానుకోండి’ అని అన్నారు. -
ఆదిత్య బిల్డర్స్ కోటారెడ్డిపై కేసు
సాక్షి, హైదరాబాద్: ఆదిత్య బిల్డర్స్ అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. ఆదిత్య బిల్డర్స్‌తో కలిసి తాము ఏర్పాటు చేసిన ‘శ్రీ ఆదిత్య వంశీరామ్ హోమ్స్ ఎల్ఎల్పీ జాయింట్ వెంచర్లో చేసుకున్న ఒప్పందానికి విరుద్ధంగా మోసపూరితంగా వ్యవహరిస్తూ అక్రమంగా విల్లాలు విక్రయిస్తుస్తున్న ఆదిత్య అధినేత వీరపరెడ్డి కోటారెడ్డిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని వంశీరామ్ అధినేత సుబ్బారెడ్డి బంజారాహిల్స్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. (నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి) ఈ మేరకు పోలీసులు కోటారెడ్డిపై 420, 406 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే నందగిరి హిల్స్‌లో నివసించే సుబ్బారెడ్డి నార్సింగిలోని సర్వే నంబర్ 155, 156లో ఉన్న 16 ఎకరాల 24 గుంటల స్ధలంలో విల్లాల నిర్మాణానికి ఆదిత్య హోమ్స్ సంస్థతో 2014లో డెవలప్మెంట్ ఒప్పందం కుదుర్చుకున్నారు. నిర్మాణ బాధ్యతలు స్వీకరించిన ఆదిత్య సంస్థ అధినేత కోటారెడ్డి ఉద్దేశ పూర్వకంగా 23 విల్లాల విక్రయంలో అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ కారణంగా తనకు రూ. 79.36 కోట్ల మేర నష్టం వచ్చిందని సుబ్బారెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. (100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం) యువతి హత్యకేసులో నిందితుడి అరెస్ట్ నాగోలు: ఎల్బీనగర్ పరిధిలోని ధనాపూర్ జనప్రియ కాలనీలో ఉన్న ఫ్యామిలీ కేర్ సర్వీస్ సెంటర్లో పనిచేసే యువతిని హత్య చేసి పారిపోయిన మరో ఉద్యోగిని ఎల్బీనగర్ పోలీసులు అరెస్టు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నూజివీడు మండలం కొత్తపేట గ్రామానికి చెందిన వెంకటేశ్వరరావుకు వివాహం అయ్యింది. అతనిపై భార్య వేధింపుల కేసు పెట్టినట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో ఆయన మూడు నెలల క్రితమే స్థానికంగా ఈ ఉద్యోగంలో చేశాడు. ఓ రోజు వెంకటేశ్వరావు మద్యం సేవించి వచ్చి యువతితో కలసి గదిలో వంటచేశాడు. యువతి ఒక్కతే ఉండటంతో ఆమెను లోబరుచుకోవాలని ఆమెపై లైంగిక దాడికి యత్నించాడు. ఆమె ప్రతిఘటించడంతో అప్పటికే మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్వరరావు తన గురించి బయట చెబుతుందోమోననే భయంతో ఆమెపై దాడి చేసి నోరు గట్టిగా మూసి చున్నీని మెడకు బిగించి హత్య చేశాడు. అనంతరం ఓ ప్రైవేట్ వాహనాన్ని బుక్ చేసుకుని పారిపోతుండగా సెంటర్ నిర్వాహకుడు చంద్రశేఖర్‌రెడ్డి నిందితుడిని గుర్తించి ఎల్బీనగర్ పోలీసులకు సమచారం ఇచ్చారు. దీంతో పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారణ చేయడంతో తాను చేసిన నిర్వాకాన్ని ఆ యువతి ఎవరితోనైనా చెబుతుందేమోననే భయంతో మద్యం మత్తులో హత్య చేసినట్లు వెంకటేశ్వరరావు అంగీకరించాడని సమాచారం. (ఎల్బీ నగర్లో యువతి దారుణ హత్య) -
చంపేస్తాడనే భయంతో డీజీపీకి ఫిర్యాదు చేశా
-
నేను ‘బావ’ బాధితుడిని : సుధీర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్ : ఆదిత్యా హోమ్స్ డైరెక్టర్, చైర్మన్ మధ్య నెలకొన్న వివాదం తారా స్థాయికి చేరింది. ఇంటి సమస్య కాస్తా తీవ్ర విభేదాలతో రచ్చకెక్కింది. 100 కోట్ల రూపాయలు విలువచేసే డాక్యుమెంట్ల చోరీతో మొదలైన వివాదం మరింత ముదిరింది. తన బావ కోటారెడ్డి తనను జైలుకు పంపేందుకు కుట్రలు పన్నుతున్నారని సుధీర్‌రెడ్డి ఆరోపించారు. వ్యాపారం పేరుతో తన కుటుంబాన్ని నిలువునా మోసం చేశారని, కంపెనీ లాభాలు తీసుకుని తమను దోచుకున్నారని వాపోయారు. కొడుకుతో తనకు ప్రాణహాని ఉందని సుధీర్‌రెడ్డి తల్లి అజంతా సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన మీడియా ముందుకు వచ్చారు. (ఆ చోరీ చేసింది నా కొడుకే.. ప్రాణాహాని ఉంది) ‘15 ఏళ్లుగా కోటారెడ్డి కుటుంబంతో మాకు మాటల్లేవు. 1995లో నేను అమెరికా వెళ్లాను. నేను, నా భార్య కలిసి డబ్బు సంపాదించి తిరిగి ఇండియా వచ్చాం. మా నాన్న చనిపోతూ కుటుంబమంతా కలిసి ఉండాలని కోరుకున్నారు. 2016లో నేను ఆదిత్యా హోమ్స్‌లో డైరెక్టర్‌గా చేరాను. అప్పటి నుంచి అమ్మ, అక్క.. నన్ను వేధించడం మొదలుపెట్టారు. ఇంటిని మా అమ్మకు ఇచ్చేందుకు అక్కా,బావ ప్లాన్ వేశారు. 2014లో వంశీరామ్ బిల్డర్స్‌తో కలిసి.. గండిపేట్‌లో మా బావ కోటారెడ్డి విల్లా ప్రాజెక్ట్ ప్రారంభించారు. అందులో 25 విల్లాలకు నా ద్వారానే రిజిస్ట్రేషన్లు జరిగాయి. రిజిస్ట్రేషన్లు చేసే అధికారం ఎవరిచ్చారంటూ.. వంశీరామ్ బిల్డర్స్ సుబ్బారెడ్డి నన్ను ప్రశ్నించారు. సుబ్బారెడ్డికి తెలియకుండా విల్లాల రిజిస్ట్రేషన్లు చేసే అధికారం మా బావ కోటారెడ్డే నాకు ఇచ్చారు. ఈ విషయంలో కోటారెడ్డి నన్ను మోసం చేశారు. సుబ్బారెడ్డి అనుమతి లేకుండా నేను సేల్ డీల్స్ చేయడం తెలీకుండా చేసిన తప్పు. (100 కోట్ల విలువైన డాక్యుమెంట్లు అపహరణ) ఆదిత్యా హోమ్స్‌పై కేసులు పెడతానని ఆనాడే సుబ్బారెడ్డి హెచ్చరించారు. వాళ్లు చేసిన తప్పులను నాపై నెట్టేశారు. నేను సుబ్బారెడ్డితో కుమ్మక్కయ్యాననేది మా బావ అపోహ.. నా ఇంటిని కాజేయాలని, నన్ను ఇంటి నుంచి గెంటేసే కుట్ర చేశారు. పోలీసుల పేరుతో నా ఇంట్లో సోదాలు చేసేందుకు కోటారెడ్డి కొందరు మనుషుల్ని పంపించారు. నాకు, మా బావకు వ్యక్తిగతంగా గన్ లైసెన్స్‌లు ఉన్నాయి. ఎన్నికల సమయంలో తన గన్ సరెండర్ చేయడానికి మా బావే నాకు ఆథరైజేషన్ ఇచ్చారు. 2019 ఎన్నికల సమయంలో ఇద్దరి గన్స్ సరెండర్ చేస్తే పోలీసులు మా బావ గన్ మాత్రమే తిరిగి ఇచ్చారు. ఇదంతా కుట్రలో భాగంగానే సాగుతోంది. నేను బావ బాధితుడిని’ అని తెలిపారు. -
100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం
-
100 కోట్ల డాక్యుమెంట్ల చోరీ కేసులో కొత్త కోణం
సాక్షి, హైదరాబాద్ : నగరంలో సంచలనం సృష్టించిన 100 కోట్ల రూపాయలు విలువ చేసే డాక్యుమెంట్ల చోరీలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. చోరీకి పాల్పడినట్టు అనుమానిస్తున్న సుదీర్‌రెడ్డి తల్లి అజంతా మరో వివాదాన్ని తెరపైకి తీసువచ్చారు. చోరీకి గురైన డాక్యుమెంట్లు, రివాల్వర్లు అన్నీ తన అల్లుడు కోటారెడ్డివే అని, వాటిని తన కుమారుడు సుదీర్ రెడ్డినే దొంగలించాడని పోలీస్ స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా రూ.30 కోట్లు విలువ చేసే ఆస్తులను తన పేరు మీదకు మార్చేలా బెదిరింపులకు దిగుతున్నాడని, మాట వినకపోతే ఇంట్లో బందించి కుక్కలను వదిలి భయాందోళనకు గురిచేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. తండ్రిని కూడా విపరీతంగా వేధించేవాడని, ఆ చిత్రహింసలు తట్టుకోలేని తన భర్త చనిపోయాడని వాపోయారు. తన కుమారుడితో ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. ‘30 కోట్లు విలువ చేసే ఇళ్లను తన పేరు మీద రాయాలని రివాలర్వ్ తో తనని బెదిరిస్తున్నాడు. నాపైన రివాలర్వ్ ఎక్కు పెట్టి చంపుతాను అంటూ బెదిరింపులు దిగాడు. నా భర్త చనిపోక ముందే 30 కోట్లు ఇల్లు నా పేరు మీద రాశారు. ఆ ఇల్లు సుదీర్ రెడ్డికి ఇవ్వలేదని ఇంట్లో బంధించి కుక్కలను వదలి భయాందోళనకు గురి చేస్తున్నాడు. విదేశాల నుంచి అక్రమంగా ఆయుధాలు తీసుకొచ్చి ఇంట్లో భద్ర పరిచాడు. ఈ విషయం పై ఎన్నో సార్లు నిలదీసినా మాట వినట్లేదు. చిత్రహింసలు భరించలేక నా భర్త చనిపోయాడు. నా కుమారుడు నుంచి ప్రాణహాని ఉందని నాలుగు రోజులు క్రితమే డీజీపీ మహేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశాను. నా పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం రామకృష్ణ పరమహంస ఆశ్రమానికి రాశిస్తున్నా. ఇంట్లో ఇంకా 8 ఆయుధాలు ఉన్నాయి.’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాగా తన కార్యాలయంలోకి చొరబడి సుదీర్ రెడ్డి కీలక డాక్యుమెంట్లు చోరీ చేశాడని ఆదిత్యా హోం చైర్మన్ కోటారెడ్డి ఇప్పటికే ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. (బంజారాహిల్స్‌లో భారీ చోరీ) -
సంక్షోభం నుంచే కొత్త అవకాశాలు
‘లాక్డౌన్ ప్రారంభానికి ముందే ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కొంటున్న సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల రంగం (ఎంఎస్ఎంఈ), కరోనాతో పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్రంలో సుమారు 40 వేల ఎంఎస్ఎంఈ పరిశ్రమలు ఉండగా, రాష్ట్ర జీడీపీలో 35 శాతం, ఎగుమతుల్లో 40 శాతం మేర వాటా కలిగి ఉంది. వ్యవసాయ రంగం తర్వాత ఎంఎస్ఎంఈ రంగం రాష్ట్రంలో ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. కరోనాతో ఆర్థిక వ్యవస్థ గాడి తప్పడంతో, ఈ రంగం పూర్తిగా చతికిల పడింది. అందువల్ల సూక్ష్మ, చిన్న పరిశ్రమలపై కేంద్రం దృష్టి పెట్టాలి’ అని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) అధ్యక్షుడు కొండవీటి సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా సంక్షోభం నేపథ్యంలో రాష్ట్రంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, భవిష్యత్తుపై సుధీర్‌రెడ్డి ‘సాక్షి’తో ఏమన్నారంటే.. ► సుమారు 50 రోజుల పాటు లాక్డౌన్ మూ లంగా పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో నిలిచిపోయింది. అయినా వేతనాలు, విద్యుత్ బిల్లులు, పీఎఫ్, ఈఎస్ఐ, జీఎస్టీ చెల్లింపుతో పాటు బ్యాంకు రుణాలు, వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది. మామూలు పరిస్థితుల్లోనే ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పరిశ్రమలకు ఇప్పుడు మరింత భారం మోపుతోంది. ► లాక్డౌన్ నిబంధనలను సడలించి పరిశ్రమలకు అనుమతి ఇచ్చినా 30 నుంచి 40 శాతం సామర్థ్యంతో మాత్రమే పనిచేసే అవకాశం ఉంది. మరోవైపు ఎంఎస్ఎంఈ ఉత్పత్తుల మార్కెట్ ఇంకా తెరుచుకోలేదు. కొనుగోళ్లు పెరిగితేనే ఎంఎస్ఎంఈ రంగం పుంజుకుంటుంది. కార్యకలాపాలు పూర్తి స్థాయిలో ప్రారంభం కాకున్నా ప్రభుత్వ ఆదేశాల ప్రకారం కార్మికులందరికీ పూర్తి వేతనాలు చెల్లించాల్సి ఉంది. పూర్తిస్థాయిలో పరిశ్రమల కార్యకలాపాలకు మరో 4 నెలలు పట్టే అవకాశం ఉంది. ► పారిశ్రామికరంగంలో పనిచేస్తున్న వలస కార్మికుల్లో సుమారు 30, 40 శాతం మంది తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు చేసుకుంటున్నారు. ముడిసరుకు లేకపోవడం కూడా పూర్తి స్థాయి లో పరిశ్రమలు ఉత్పత్తి ప్రారంభించేందుకు ఆటంకం కలిగిస్తున్నాయి. ► పరిశ్రమలు తిరిగి గాడిన పడేందుకు వర్కింగ్ క్యాపిటల్ కోసం 20 నుంచి 30 శాతం రుణాలు తక్కువ వడ్డీ రేటుకు ఇవ్వాలని కోరినా, బ్యాంకింగ్ రంగం కూడా సంక్షోభంలో ఉండటంతో ఆచితూచి స్పందిస్తోంది. ఇలాంటి రుణాలకు కేంద్రం క్రెడిట్ గ్యారంటీ ఇస్తే తప్ప ఎంఎస్ఎంఈ పరిశ్రమలు గట్టెక్కే పరిస్థితి లేదు. ► పరిశ్రమలు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించకపోతే నిరర్ధక ఆస్తుల (ఎన్పీఏ) జాబితాలోకి వెళ్తాయి. దీంతో పరిశ్రమల సిబిల్ రేటు తగ్గి రుణ పరిమితి పెంచడం, కొత్తగా రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు నిరాకరిస్తాయి. రూ.5 కోట్ల రుణ పరిమితి లోపల ఉన్న అన్ని రకాల ఎంఎస్ఎంఈలను ఎన్పీఏ జాబితాలో చేర్చడానికి ఉన్న గడువును ఏడాది పాటు వాయిదా వేయాలి. ► సాధారణ పరిస్థితుల్లో అనారోగ్యానికి గురయ్యే కార్మికులకు ఈఎస్ఐ కార్పొరేషన్ 70 శాతం వేతనం చెల్లిస్తుంది. ప్రస్తుత పరిస్థితులు అంతకంటే ఏమీ భిన్నంగా లేవు కాబట్టి ఎంఎస్ఎంఈ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు మూడు, నాలుగు నెలల పాటు ఈఎస్ఐ కార్పొరేషన్ నుంచి చెల్లించాలని ఇటీవల కేంద్రానికి ప్రతిపాదించాం. కొన్ని చిన్న తరహా పరిశ్రమలు ఈఎస్ఐ పరిధిలో లేవు. ఆంక్షలు తొలగించినా వీటిలో సుమారు 30 శాతం పరిశ్రమలు తిరిగి తెరుచుకోవడం కష్టమే. ఇలాంటి పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్రమే 6 నెలల పాటు నేరుగా వేతనాలు చెల్లించాలి. ► జీఎస్టీ చెల్లింపుపై ప్రభుత్వం 3 నెలల పాటు డిఫర్మెంట్ ఇచ్చినా 9 శాతం వడ్డీ చెల్లించాలని ఆదేశించింది. డబ్బులే లేనప్పుడు వడ్డీ చెల్లించడం ఎలా సాధ్యమవుతుంది. వడ్డీ లేకుండా జీఎస్టీ చెల్లింపు గడువును కనీసం 6 నెలల పాటు పొడిగించాలి. ► పరిశ్రమలు పనిచేయని కాలానికి సంబంధించి ఏపీ తరహాలో ఫిక్స్డ్ విద్యుత్ చార్జీలు రద్దు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.2,700 కోట్ల సబ్సిడీలు రావాల్సి ఉంది. ఇందులో ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు సంబంధించి రూ.600 కోట్ల వరకు ఉండొచ్చు. చిన్న పరిశ్రమలకు గుర్తించి రాయితీలు విడుదల చేస్తే సుమారు ఐదారు వేల పరిశ్రమలకు ఊరట లభిస్తుంది. ► ఎంఎస్ఎంఈ రంగం స్థితిగతులపై ఇటీవల సిడ్బీ, క్రిసిల్ సంస్థలు అధ్యయనం చేసి కేంద్రానికి నివేదిక ఇచ్చాయి. ఈ నివేదిక ప్రకారం రూ.కోటి కంటే తక్కువ రుణాలు తీసుకున్న చిన్న పరిశ్రమల ఆస్తుల విలువ సుమారు రెండు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. అందువల్లే గతంలో జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దు వంటి సందర్భాల్లోనూ సవాళ్లను ఈ రంగం అధిగమించగలిగింది. రుణాలు తిరిగి చెల్లించడంలోనూ చిన్న పరిశ్రమలు మెరుగ్గా ఉన్నట్లు సిడ్బీ, క్రిసిల్ నివేదిక వెల్లడించింది. పెద్ద పరిశ్రమల నిరర్ధక ఆస్తులు (ఎన్పీఏ) 19.1 శాతం కాగా, ఎంఎస్ఎంఈలు 11.3 శాతం మాత్రమే ఎన్పీఏ జాబితాలో ఉన్నాయి. కాబట్టి ఎంఎస్ఎంఈ రంగానికి అదనపు రుణాలు ఇచ్చినా బ్యాంకులు నష్టపోయే అవకాశం ఉండదు. ► ఫార్మా, వైద్య ఉపకరణాలు, ఆరోగ్య రంగం లో మౌలిక వసతుల రంగాల్లో మనకు అపారమైన అవకాశాలు ఉన్నాయి. కొత్త అవకాశాలు అందిపుచ్చుకుంటేనే సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు మనుగడ సాగించగలుగుతాయి. ఈ దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధానాలు రూపొందిస్తే చైనా నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకునే శక్తి వస్తుంది. ► కరోనా సంక్షోభంలోనూ ఎంఎస్ఎంఈ పరిశ్రమల రంగం కొత్త పుంతలు తొక్కేందుకు అనువైన మార్గాలు ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రంలో ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, మెడికల్ డివైజెస్, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో మంచి అవకాశాలు ఉండే అవకాశం ఉంది. నైపుణ్య శిక్షణ, సరళీకృత విధానాలతో తెలంగాణ రాబోయే రోజుల్లో పారిశ్రామిక రంగంలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. -
లాక్డౌన్ నుంచి పరిశ్రమలను మినహాయించండి
సాక్షి, హైదరాబాద్: టీఎస్ఐఐసీ పారిశ్రామిక వాడల్లోని ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు లాక్డౌన్ నిబంధనల నుంచి మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ పారిశ్రామికవేత్తల సమాఖ్య (టిఫ్) రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను ప్రయోగాత్మకంగా నడిపేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ టిఫ్ అధ్యక్షులు కె.సుధీర్‌రెడ్డి బుధవారం సీఎంకు వినతిపత్రం అందజేశారు. రాష్ట్రంలోని 10 వేలకు పైగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్ఎంఈ) ఐదు వేల రకాల ఉత్పత్తుల ద్వారా సుమారు 15 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నాయని వినతి పత్రంలో పేర్కొన్నారు. టీఎస్ఐఐసీ పారిశ్రామిక పార్కుల్లో పరిశ్రమలు, వాటి కార్యాలయాలు ఒకే ఆవరణలో ఉండటంతో వేతనాల చెల్లింపు, సరఫరాదారులు, కొనుగోలుదారులతో సమన్వయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఐటీ రంగం తరహాలో ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు లేకపోవడంతో కార్మికులకు జీవనోపాధి కరువైందన్నారు. దేశవ్యాప్త లాక్డౌన్ ఎత్తివేతపై సంప్రదింపులు జరుగుతున్న ప్రస్తుత సమయంలో తమకు కొన్ని వెసులుబాట్లు కల్పించాలని టిఫ్ వినతిపత్రంలో సీఎంను కోరింది. వినతిపత్రంలోని ముఖ్యాంశాలు ► రోజుకు ఒక షిఫ్ట్ చొప్పున పనిచేసేందుకు అవసరమైన సిబ్బందికి అనుమతివ్వాలి. పరిశ్ర మలకు 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న కార్మికులకు అనుమతి ఇవ్వాలి. ఈ మేరకు పోలీసు, జీహెచ్ఎంసీ అధికారులు నిర్దేశిత కాల వ్యవధితో పాస్‌లు జారీ చేయాలి. రవాణా సౌకర్యాలు, ముడిసరుకులు, ఉత్పత్తికి సంబంధించిన వివరాలను కంపెనీలు ఎప్పటికప్పుడు సమర్పిస్తాయి. ► ఫ్యాక్టరీ పరిసరాలను శానిటైజ్ చేయడం, కార్మికుల రోజూ వారీ ఆరోగ్యంపై పర్యవేక్షణ, పనిప్రదేశంలోనూ సామాజిక దూరం పాటించే లా యాజమాన్యాలు జాగ్రత్తలు తీసుకుంటాయని ప్రభుత్వానికి హామీ ఇస్తాయి. -
సాక్షి టీవీ కథనానికి స్పందించిన ఎమ్మెల్యే
-
ఎంసెట్ దరఖాస్తులో ‘ఈడబ్ల్యూఎస్’ నంబర్ ఆప్షనల్ మాత్రమే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్, మెడికల్, ఫార్మా, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్–2020 ఆన్లైన్ దరఖాస్తులో ఎకనమికల్లీ వీకర్ సెక్షన్ (ఈడబ్ల్యూఎస్) కేటగిరీ అభ్యర్థులు ధ్రువపత్రం నంబర్‌ను నమోదు చేయడం తప్పనిసరి కాదని సెట్స్ ప్రత్యేకాధికారి ఎం.సుధీర్‌రెడ్డి సాక్షితో తెలిపారు. - అర్హులైన అభ్యర్థులు సంబంధిత ధ్రువపత్రాలు తీసుకొని ఉంటే ఆన్లైన్ దరఖాస్తులో ‘ఎస్’ అని టిక్ చేసి నంబర్‌ను నమోదు చేయవచ్చు. - సర్టిఫికెట్లు అందుబాటులో లేని అభ్యర్థులు ‘ఎస్’ అని టిక్ చేస్తే సరిపోతుంది. నంబర్ నమోదు కేవలం ఆప్షన్ మాత్రమే. - ఇటువంటి అభ్యర్థులు అడ్మిషన్ల కౌన్సెలింగ్ సమయంలో తమ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను పరిశీలనకు చూపించాల్సి ఉంటుంది. - ఈడబ్ల్యూఎస్ కోటాకు చెందిన పలువురు అభ్యర్థుల నుంచి అందిన విన్నపాల మేరకు ఈ మార్పులు చేశాం. - ఎంసెట్‌కు ఇప్పటి వరకు 1,41,491 దరఖాస్తులు అందాయి. వీటిలో 58 వేల దరఖాస్తులు మెడికల్ కాగా తక్కినవి ఇంజనీరింగ్ విభాగానికి అందాయి. -
మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం
జమ్మలమడుగు: వైఎస్సార్ జిల్లాలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి తిరిగి ఫ్యాక్షన్‌ను ప్రొత్సహించే విధంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మూలె సుధీర్‌రెడ్డి అనుచరులపై వీరంగం సృష్టించారు. శనివారం రాత్రి సుధీర్‌రెడ్డి అనుచరుడైన రెడ్డయ్యపై దగ్గరుండి మరీ దాడి చేయించారు. ఆదినారాయణరెడ్డి ప్రజాస్వామ్యబద్ధంగా కాకుండా రౌడీయిజం చెలాయించి రాజకీయాలు చేస్తున్నారని, ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు పోలీసుస్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. శనివారం రాత్రి మండల పరిధిలోని సుగుమంచిపల్లె వద్ద వాహనం నిలబెట్టి మరో మనిషి కోసం వేచి ఉన్న రెడ్డయ్యను ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో కొట్టించడం పట్ల ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. సుధీర్‌రెడ్డి కథ చూస్తామంటూ బెదిరించారు అంకాలమ్మ గూడురుకు వెళ్లడం కోసం వాహనంలో సుగుమంచిపల్లె మీద వెళ్లామని, అయితే మరో వ్యక్తి వస్తుండటంతో వేచి ఉన్నామని, ఇంతలో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి నీవు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అనుచరుడైన చిలంకూరు మోహన్‌రెడ్డి మనిషివి కదా అంటూ తనపై దాడి చేశారని బాధితుడు రెడ్డయ్య తెలిపారు. ఎమ్మెల్యే మనుషులం కాదని, వేరే వ్యక్తి కోసం వేచి ఉన్నామని చెప్పినా వినకుండా కొట్టారని వాపోయారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి కథ కూడా చూస్తామంటూ బెదిరించారని బాధితుడు రెడ్డయ్య చెప్పారు. -
చంద్రబాబువి తోకపత్రిక ఆరోపణలు
సాక్షి, కడప : ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రికార్డు స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేయడాన్ని జీర్ణించుకోలేకనే మాజీ సీఎం చంద్రబాబు, ఆయన తోకపత్రిక ఆరోపణలు చేస్తున్నట్లు జమ్మలమడుగు ఎమ్మెల్యే డా. సుధీర్‌రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం కడపలోని ఆర్అండ్బి అతిథిగృహంలో వైఎస్ఆర్సీపీ నేతలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేందుకు కొంతమంది దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. పేపర్ ఎక్కడ లీకైందో, అందుకు గల కారణాలేంటో చెప్పకుండా ఫలితాలు వచ్చిన తర్వాత బుదరజల్లడం సరి కాదన్నారు. సచివాలయాల్లో 1.26లక్షల ఉద్యోగాల భర్తీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకే అధికంగా ఉద్యోగాలు వస్తాయని తట్టుకోలేక చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని తెలిపారు. వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి పాల్గొన్నారు. పునరావాస స్థలం ఏర్పాటు చేయాలి కొండాపురం: గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి వెంటనే పునరావాస స్థలం ఏర్పాటు చేయాలని జాయింట్ కలెక్టర్ గౌతమికి ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి సూచించారు. సోమవారం కలెక్టరేట్లో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నిర్వాసితులు ఈ విషయంపై జేసీ గౌతమి, గాలేరు నగరి సుజల స్రవంతి (జీఎన్ఎస్ఎస్) ప్రత్యేక కలెక్టర్ సతీష్‌చంద్ర చర్చించారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ పునరావాసస్థలం కేటాయిస్తే నిర్వాసితులు ఇళ్లు నిర్మించుకుంటారని జేసీతో అన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి ఎస్ .చిన్న అంకిరెడ్డి ,జిల్లా యూత్ ప్రదాన కార్యదర్శి ఆర్. హరినారాయణరెడ్డి, రైతులు ప్రతాప్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు తప్పుడు ప్రచారంపై మండిపాటు కడప కార్పొరేషన్: రాష్ట్రంలోని నాలుగు లక్షలకు టుంబాల్లో వెలుగులు నింపిన ఏకైక ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చరిత్ర సృష్టిం చారని వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు అలూరు ఖాజా రహమతుల్లా అన్నా రు. సోమవారం వైఎస్‌ఆర్‌ఎస్‌యూ ఆధ్వర్యం లో ర్యాలీ నిర్వహించి, నైట్రోజన్ బెలూన్లు ఎగురవేసి ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. సచివాలయ పరీక్షలపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా ఖాజా మాట్లాడుతూ అ«ధికారంలోకి వచ్చిన వందరోజుల్లోనే 4లక్షల ఉద్యోగాలు ఇవ్వడం సాధారణమైన విషయం కాదన్నారు. ఎక్కడా ఒక్క తప్పు జరక్కుండా పటిష్ట చర్యలు చేపట్టారన్నారు. ఇది ఓర్వలేని చంద్రబాబు, ఆయన తోకపత్రిక అసత్య కథనాలు రాస్తూ నిరుద్యోగులను రెచ్చగొట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు పులి సునీల్ కుమార్, యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకా సురేష్, జిల్లా అధ్యక్షుడు బి. నిత్యానందరెడ్డి, డా. సొహైల్, కరిముల్లా, యూనుస్, దత్తసాయి, లోకేష్, ఆయుబ్, రహీమ్, జఫ్రుల్లా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలన చారిత్రాత్మకం కడప రూరల్: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వంద రోజుల పరిపాలన చారిత్రాత్మకమని జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ గూడూరు రవి అన్నారు. సోమవారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ టీడీపీ ఐదేళ్ల పరిపానలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయిన సంగతిని గుర్తు చేసుకోవాలన్నారు. గడిచిన స్థానిక సంస్ధల ఎన్నికల్లో ఆ పార్టీ ఇష్టారాజ్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆగడాలకు అంతులేకుండా పోయిందని చెప్పారు. ఆయన స్ధానిక సంస్ధలను నిర్వీర్యం చేయడంతో పాటు సర్పంచ్ల చెక్ పవర్‌ను రద్దు చేయడం దారుణమన్నారు. రాష్ట ఖజానా ఖాలీగా ఉన్న సమయంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టారన్నారు. ఎలాంటి ఆదాయ వనరులు లేనప్పటికీ సంక్షేమ పాలన సాగించడం అభినందనీయమని అన్నారు. జనరంజక పాలనను చూసి ఓర్వలేని టీడీపీ నేతలు ఆరోపణలు చేయడం హస్యాస్పదంగా ఉందన్నారు. అప్పుడే పుట్టిన పిల్లాడు పరగెత్తలేడని అందరికీ తెలిసిందేనని, అయితే సీఎం వైఎస్ జగన్ 100 రోజుల పాలనలోనే సంక్షేమ రథన్ని పరుగులెత్తించడం ఆయనకు మాత్రమే సాధ్యమన్నారు. - జెడ్పీ మాజీ ఛైర్మెన్ గూడూరు రవి -
వైఎస్ చొరవతో సీమకు కృష్ణా జలాలు
సాక్షి, కడప : రాయలసీమ ప్రాంతానికి కృష్ణజలాలు వస్తున్నాయంటే ఆది కేవలం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషేనని ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ మూలే సుధీర్‌రెడ్డిలు పేర్కొన్నారు. బుధవారం మైలవరం జలాశయం నుంచి రెండు గేట్ల ద్వార 1000 క్యూసెక్కుల నీటిని పెన్నానదిలోనికి విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ నేడు రాష్ట్రంలోని ప్రాజెక్టులన్నీ నీటితో కళకళలాడుతున్నాయని సంతోషం వ్యక్తంచేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుచూపుతో వ్యవహరించి శ్రీశైలంతో గండికోటకు కృష్ణజలాలు తరలించే ఏర్పాటు చేశారన్నారు. పెన్నానదిలోనికి నీరు వదలడం ద్వారా కుందూ పెన్నా నదులు ఎంతవరకు ఉన్నాయో అంతవరకు ఉన్న పరివాహక ప్రాంతాలకు తాగునీటి సమస్య ఉత్పన్నం కాదన్నారు. రాయలసీమలో వర్షాలు పడకపోయినా కర్నాటక, మహారాష్ట్ర రాష్ట్రలలో వర్షాలు విస్తారంగా వర్షాలు పడటంతో అల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు నిండుకుండాలా మారిపోయి అదనంగా పైనుంచి ఇంకా వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోనికి వదులుతున్నారన్నారు. దీని ద్వారా రైతుల పంటలసాగుకు నీరు అందే అవకాశం ఉందన్నారు. 2005లో దివంగతనేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హాయంలో అన్నిపార్టీల సమావేశాన్ని నిర్వహించారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 44వేల క్యూసెక్కుల నీటిని ఒక్కసారిగా తీసుకుని వెళ్లేవిధంగా చర్యలు చేపడితే అప్పట్లో మాజీ మంత్రి దేవినేని ఉమ ఇలా తీసుకుని పోవడం వల్ల నాగార్జున సాగర్‌కు నీరు వచ్చే అవకాశంలేదంటూ అడ్డుకోవడం జరిగిందన్నారు. నాడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రాయలసీమ వాసులు తాగు,సాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మొండిగా హెడ్‌రెగ్యులేటర్ స్థాయిని పెంచి గాలేరు–నగరి సుజలస్రవంతి ద్వార గండికోట ప్రాజెక్టుకు నీటిని రప్పించే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలోరాజన్నరాజ్యం ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో జగన్ పాలనలో రాజన్నరాజ్యం ఆవిష్కృతమవుతోందన్నారు. గతంలో టీడీపీ హాయంలో ఒక్కసారి మాత్రమే ఎన్నికల ముందు కృష్ణజలాలను గండికోటకు నీటిని రప్పించారన్నారు. జగన్ పాలనలో మూడు నెలల కాలంలోనే గండికోట, మైలవరం, పైడిపాలెం, సర్వారాయసాగర్, వామికొండ ప్రాజెక్టులలో సైతం నీటిని నింప డం జరుగుతుందన్నారు. ఇది చదవండి : వైఎస్ హయాంలో రైతే రాజు జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూరు, కమలాపురం ప్రాం తాల ప్రజలకు తాగునీటికి ఇబ్బందిలేకుండా చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో కరు వు కాటకాలతో ప్రజలు అల్లాడిపోయారన్నారు. నేడు జగన్ పాలనలో ప్రాజెక్టులన్ని నీటితో కళకళలాడుతున్నాయన్నారు. మరో రెండునెలల కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని తిరిగి శ్రీశైలం నిండిపోయి మరోసారి గండికోట, మైలవరం జలాశయాలలోనీటిని నింపుతామన్నారు. -
మానవత్వం చాటిన ఎమ్మెల్యే
సాక్షి, ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని ముద్దనూరు రోడ్డులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల సమీపంలో రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిన చంద్ర అనే వ్యక్తిని జమ్మలమడుగు ఎమ్మెల్యే డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డి తన సొంత కారులో చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. సంఘటన స్థలాన్ని పోలీసులు సందర్శించారు. సోమవారం రాత్రి ట్యూషన్ నుంచి తమ పిల్లలను ఇంటికి తీసుకుని వెళుతుండగా ఎదురుగా మరో బైక్ రావడంతో రెండూ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్రకు తీవ్ర గాయాలయ్యాయి. అదే సమయంలో ఆ మార్గంలో వెళుతున్న ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్‌రెడ్డి స్పందించి సంఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వ్యక్తిని తన సొంత కారులో ఆస్పత్రికి తరలించారు. -
కడపకు నీళ్లొచ్చేశాయ్
సాక్షి, కడప : జిల్లాలో కరువు పరిస్థితులు ఉన్నా.. కృష్ణా జలాలను యుద్ధప్రాతిపదికన జిల్లాకు తరలించి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలిచింది. ఇప్పటికే కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టుల ద్వారా జిల్లాకు చేరగా, తాజాగా కర్నూలు జిల్లాలోని అవుకు నుంచి గండికోటకు సైతం ప్రభుత్వం కృష్ణా జలాలను తరలించింది. ఆదివారం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి గండికోట పరిధిలోని నీటి వనరులకు జలాన్ని విడుదల చేశారు. దీంతో ఆయకట్టు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎగువన భారీ వర్షాలు కురవడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండింది. జిల్లాలో కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతులను ఆదుకునేందుకు తక్షణమే తెలుగుగంగ, కేసీ కెనాల్తోపాటు గండికోట ప్రాజెక్టు పరిధిలోని నీటి వనరులకు కృష్ణా జలాలు విడుదల చేయాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జిల్లాలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే స్పందించిన జగన్ ప్రభుత్వం శ్రీశైలం నుంచి పోతిరెడ్డిపాడు, బానకచర్ల మీదుగా జిల్లాకు నీటిని విడుదల చేసింది. ఆదివారం నాటికి గండికోటలో ఐదు టీఎంసీలు చేరాయి. దీంతో దిగువనున్న నీటి వనరులకు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నీటిని విడుదల చేశారు. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు 500 క్యూసెక్కులు, మైలవరానికి 500, సర్వరాయసాగర్‌కు 500, పైడిపాలెంకు 200 క్యూసెక్కుల చొప్పున తొలిరోజు ప్రజాప్రతినిధులు నీటిని విడుదల చేశారు. సోమవారం సర్వరాయసాగర్‌కు కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి 200 క్యూసెక్కులు విడుదల చేయనున్నారు. ప్రస్తుతం గండికోటకు పది వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ఒకటి, రెండు రోజుల్లో ఇన్‌ఫ్లో మరికొంత పెరగనుందని గాలేరు–నగరి ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. గండికోట పరిధిలోని మొత్తం ఆయకట్టుకు సాగునీరు అందించనున్నట్లు చెప్పారు. అన్నదాతలను ఆదుకుంటాం ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు పడటంతో శ్రీశైలం జలాశయంలో నీళ్లు నిల్వ ఉన్నాయి. దీంతో జిల్లాలోని అన్ని ప్రాజెక్టులను నీటితో నింపి రైతులకు మేలుచేసే కార్యక్రమం చేపట్టినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం గండికోట ప్రాజెక్టు వద్ద రెండు గేట్లు ఎత్తి మైలవరానికి, గండికోట ఎత్తిపోతల పథకం స్టేజ్–1 ద్వారా పైడిపాళెంకు, స్టేజి–2 ద్వారా చిత్రవతి బ్యాలెన్స్ రిజర్వాయర్‌కు మోటర్లు ఆన్ చేసి ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీఎన్ఎస్ఎస్ ఎస్ఈ మధుసూదన్‌రెడ్డి, ఈఈ రామంజినేయులు నీరు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీరు ఇచ్చి ఆదుకోవాలనే సంకల్పంతో నాడు గండికోట ప్రాజెక్టును నిర్మించిన మహనీయుడు వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సహకారంతో గండికోట ప్రాజెక్టు ద్వారా మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోకి విడుదల చేసి ప్రొద్దుటూరు, కమలాపురం నియోజకవర్గాల్లోని గ్రామాల్లో నీటి ఎద్దడి లేకుండా చేస్తామని చెప్పారు. జిల్లాలోని వామికొండ, సర్వారాయసాగర్, చిత్రావతి బ్యాలెన్స్రిజర్వాయర్, మైలవరం ప్రాజెక్టుల్లో నీటిని నింపుతామన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మంసాగర్‌లో 10 టీఎంసీల నీళ్లు నిల్వ చేశారు. ఈ ఏడాది 12 టీఎంసీలు నిల్వ చేసి చరిత్ర తిరగరాస్తామని చెప్పారు. ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముంపు గ్రామాల సమస్యలు పరిస్కారం కాలేదని అన్నారు. ముంపు గ్రామాల్లోని తాళ్లప్రొద్దుటూరు, యర్రగుడి, చామలూరు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరిలించేదాకా ఇబ్బందుకు గురిచేయమన్నారు. పేజ్–2 గ్రామాల్లో పునరావాస కేంద్రాలు ఏర్పాట చేస్తామని చెప్పారు. ప్రజలను అన్ని విధాలా ఆదుకుంటామని పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి దండ్లాగు శంకర్‌రెడ్డి, ముద్దనూరు మునిరాజారెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ నిరంజన్‌రెడ్డి, కొండాపురం సింగిల్‌విండో అధ్యక్షుడు కొండువాసుదేవారెడ్డి, కొండాపురం నీలకంఠారెడ్డి,రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎల్. రామమునిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. హరినారాయణరెడ్డి,జిల్లా కార్యదర్శి ఎస్ చిన్నఅంకిరెడ్డి, మండల మైనార్టీ అధ్యక్షుడు ఖాదర్‌భాషా,రామసుబ్బారెడ్డి, మండల యూత్ కన్వీనర్ లక్ష్మికాంత్‌రెడ్డి, గండ్లూరు బాలనాగిరెడ్డి, రామం జి, పెద్దిరెడ్డి, రమేష్‌రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
సోలార్ పరికరాలను సందర్శించిన సుధీర్‌రెడ్డి
-
‘వరుణదేవుడి సాక్షిగా మరో 20 ఏళ్లు జగనే సీఎం’
సాక్షి, వైఎస్సార్‌జిల్లా : వరుణదేవుడు సాక్షిగా మరో ఇరవై ఏళ్లు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధిర్ రెడ్డి అన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రతిపక్షమే లేకుండా అత్యధిక స్థానాలు దక్కించుకోవడం, అలాగే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి అఖండ మెజారిటీతో అదరించడం వల్ల రాయలసీమ కులదేవుడైన వెంకన్న సన్నిధి వరకు పాదయాత్ర చేపట్టారాయన. మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా రాయచోటి నియోజకవర్గంలోని కోనంపేటలోకి ప్రవేశించిన పాదయాత్ర బుధవారం రాత్రి రాయచోటి పట్టణం చేరుకోంది. ఈసందర్భంగా ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాసాపేట లోని వేంపల్లి క్రాస్ వద్ద బాణసంచాలు కాల్చడంతో పాటు పూలమాలలతో సత్కరించి ఘనంగా స్వాగతం పలికారు. (చదవండి : జగనన్న పాలన సజావుగా సాగాలంటూ.. ఎమ్మెల్యే పాదయాత్ర) ఈ సందర్భంగా సాక్షి తో మాట్లాడిన ఆయన సీఎం వైఎస్ జగన్ పాలనలో కడప జిల్లాలోని జమ్మలమడుగు, రాయచోటి లకు సాగు, త్రాగు నీరు రావడంతో జిల్లా సస్యశామలం అవుతుందన్నారు. తాను పాదయాత్ర చేపట్టినప్పటి నుంచి వర్షం ఆగకుండా వస్తూనే వుందన్నారు. చంద్రబాబు పాలన పోయింనందుకు వానదేవుడు కరుణిస్తున్నాడని తెలిపారు. వేరుశనగ పంటకు 6.5 వేలు గిట్టుబాటు ధర కల్పించడం అలాగే గండికోట నిర్వాసితులకు పునారావసం క్రింద పది లక్షల ప్యాకేజి ప్రకటించడం ఆనందదాయకమని హర్షం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రం నేంబర్ వన్ స్థానానికి చేరడం ఖాయమన్నారు. రాయచోటి ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో విడది చేసి సుండుపల్లి, వాయిలివడ్డు బిడికి మీదుగా పాదయాత్ర తిరుపతికి చేరుతుందన్నారు. -
తిరుమలకు పాదయాత్రగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
మొక్కు తీర్చుకుంటున్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తన మొక్కును తీర్చుకునేందుకు సిద్దమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయితే తిరుమలకు పాదయాత్ర ద్వారా వస్తానని ఆయన మొక్కుకున్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ఘన విజయం సాధించడం వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతు చేపట్టడంతో ఆయన కోరిక నెరవేరింది. దీంతో సుధీర్‌రెడ్డి మొక్కు చెల్లించుకునేందుకు ఆదివారం కాలినడకన తిరుమలకు బయలుదేరారు. ఎర్రగుంట్ల మండలం నిడిజివ్వి నుంచి తిరుమల వరకు ఆయన పాదయాత్ర సాగనుంది. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాయంలో ఇప్పటికే రాష్ట్రం సువర్ణ పరిపాలన దిశగా అడుగు వేస్తోందన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర నుంచి జమ్మలమడుగు అభివృద్ధి దిశగా పయనించడమే తన కోరిక అని సుధీర్‌రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. -
మంత్రి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే
సాక్షి, సిటీబ్యూరో: మేడ్చల్ నియోజకవర్గంలో ఎన్నికల వేడి ఇంకా చల్లారలేదు. పరిషత్ ఎన్నిక అధికార పార్టీలో అగ్గి రాజేసింది. ఇదికాస్త మంత్రి మల్లారెడ్డి, మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్‌రెడ్డి మధ్య నువ్వా..నేనా అనే స్థాయికి చేరింది. టీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్న సుధీర్‌రెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ మంత్రి మల్లారెడ్డి అనుచరుడు, ఘట్కేసర్ ఎంపీపీగా ఇటీవల ఎన్నికైన సుదర్శన్‌రెడ్డి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో పార్టీ అభ్యర్థి ఓటమి నుంచి ఇద్దరు నాయకుల మధ్య మొదలైన ప్రత్యక్ష యుద్ధం మండల పరిషత్ ఎన్నికల వివాదంతో పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది. ఘట్కేసర్ మండల పరిషత్ అధ్యక్ష పదవికి తాను సూచించిన వ్యక్తిని కాదని, ఇతర పార్టీల ఎంపీటీసీలతో కలిసి మంత్రి మల్లారెడ్డి తన వర్గీయుడైన సుదర్శన్‌రెడ్డికి పదవీ కట్టబెట్టడాన్ని సు«ధీర్‌రెడ్డి తీవ్రంగా తప్పుపడుతున్నారు. తన సొంత మండలంలో పార్టీని నిలువునా చీల్చే ప్రయత్నాలు మొదలుపెట్టారని ఆరోపిస్తూ మంత్రిని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటానని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా నియోజకవర్గంలో పూర్తి పట్టు కోసం మంత్రి ఓవైపు... తన ఆధిపత్యం చేజారకూడదన్న లక్ష్యంతో మాజీ ఎమ్మెల్యే మరోవైపు ఎవరికి వారుగా ఎత్తుకు పైఎత్తులు వేసే పనిలో ఉండడంతో పార్టీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఉప్పు.. నిప్పు ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి మంత్రి మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర్‌రెడ్డి పోటీ చేసిన విషయం విదితమే. అయితే సుధీర్‌రెడ్డి వర్గం పని చేయకపోవడంతోనే నియోజకవర్గంలో మెజారిటీ పూర్తిగా తగ్గిపోయిందని మంత్రి అనుచరులు ఆరోపిస్తుండగా... మేడ్చల్ జిల్లా పరిషత్ చైర్మన్‌గా తన కుమారుడు శరత్‌ను అడ్డుకునేందుకే మంత్రి తన బంధువు శ్రీనివాసరెడ్డిని మూడు చింతలపల్లిలో పోటీ చేయించారని సుధీర్‌రెడ్డి వర్గం పేర్కొంటోంది. అంతే కాకుండా మంత్రి ప్రోత్బలంతోనే తన సొంత మండలమైన ఘట్కేసర్లో తనను కాదని, తన వ్యతిరేకి సుదర్శన్‌రెడ్డిని ఇతర పార్టీలతో కలిసి ఎంపీపీ చేశాడని సుధీర్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఆపై తనను రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి తనపై తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని, తాను ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్తానని సుధీర్‌రెడ్డి ‘సాక్షి’ ప్రతినిధికి తెలిపారు. -
‘ఆ పదవి పాముల పుట్ట వంటిది.. అందుకే’
సాక్షి, అమరావతి : వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్ తెలిపారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డికి జలీల్‌ఖాన్ అభినందనలు తెలిపారు. తన రాజీనామా నేపథ్యంలో వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి అనేది పాముల పుట్టవంటిదని పేర్కొన్నారు. తమ నియోజకవర్గంలో టీడీపీ గట్టి పోటీ ఇచ్చిందని.. నువ్వా నేనా అన్నట్లుగా ఓట్లు వచ్చాయని వ్యాఖ్యానించారు. ఇతరుల వల్ల కొంత నష్టం జరిగిందని.. ఓడిపోయినా ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని తెలిపారు. ఎన్నికలు మొత్తం కులరాజకీయాల మీద నడిచాయని పేర్కొన్నారు. కాగా గత ఎన్నికల్లో విజయవాడ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచిన జలీల్‌ఖాన్ ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై స్థానికంగా వ్యతిరేకత రావడంతో.. టీడీపీ అధినేత చంద్రబాబు.. ఈసారి జలీల్‌ఖాన్ కుమార్తెకు టికెట్ ఇచ్చారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా జోరుగా ఫ్యాను హవా వీచిన నేపథ్యంలో ఆమె ఓటమి పాలయ్యారు. నామినేటెడ్ పదవుల రాజీనామా పర్వం రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన నేపథ్యంలో జలీల్‌ఖాన్‌తో పాటు మరికొంత మంది టీడీపీ నాయకులు కూడా నామినేటెడ్ పదవులకు రాజీనామా చేస్తున్నారు. ఇందులో భాగంగా జమ్మలమడుగు ఏరియా ఆస్పత్రికి చైర్మన్‌గా ఉన్న మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి తనయుడు సుధీర్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. అదే విధంగా టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పదవి నుంచి అంబికా కృష్ణ వైదొలిగారు. ఇక ఇప్పటికే దుర్గ గుడి పాలక మండలి చైర్మన్ సభ్యులు రాజీనామా సమర్పించగా.. ఎస్వీబీసీ ఛానెల్లో పోస్టు దక్కించుకున్న రాఘవేంద్రరావు కూడా రాజీనామా చేశారు. అదే విధంగా.. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ కార్పోరేషన్ చైర్మన్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు వేమూరి ఆనంద్ సూర్య తెలిపారు. -
‘ఏజెంట్లను పెట్టుకునేందుకు అనుమతివ్వండి’
అమరావతి: వైఎస్సార్ జిల్లాలో అత్యంత ఫ్యాక్షన్ ప్రభావిత నియోజకవర్గం జమ్మలమడుగు. ఒకప్పుడు రామసుబ్బారెడ్డి, ఆదినారాయణ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇద్దరూ టీడీపీలో సర్దుకుపోయారు. ఇద్దరు నేతలు పాత కక్షలు మర్చిపోయి పర్సంటేజీలు మాట్లాడుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. వైఎస్సార్సీపీ గెలిస్తే తమ ఆటలు సాగవని భావించి ఎన్నికలు దగ్గర పడే కొద్దీ గ్రామాల్లో మళ్లీ భయోత్పాతం సృష్టించడానికి కుట్రలు పన్నుతున్నారు. గ్రామాలను తమ అదుపులో పెట్టుకుని పోలింగ్ రోజును రిగ్గింగ్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వీరిని కాదని కొన్ని గ్రామాల్లో ఏం చేయలేని పరిస్థితి కూడా ఉంది. స్వతంత్ర్యంగా ఓటు వేసే పరిస్థితి కూడా లేదు. కొన్ని గ్రామాల్లో వీరిని కాదని ఏజెంట్లుగా కూర్చునే సాహసం కూడా చేయటం లేదు. పోలీసులను అడ్డం పెట్టుకుని అధికారంలో ఉన్న టీడీపీ నాయకులు అరాచకానికి పాల్పడుతున్నారు. ప్రచారం నిమిత్తం వచ్చిన వైఎస్సార్సీపీ జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి సుధీర్‌రెడ్డిని గ్రామాల్లోకి రానివ్వకుండా పలుమార్లు టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. పక్కన పోలీసులున్నా చూస్తూ మిన్నకుండిపోయారు. ఎన్నికల వేళ వీరి ఆగడాలు మితిమీరి పోతాయని భావించి సుధీర్‌రెడ్డి తరపు న్యాయవాది రఘురామిరెడ్డి ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదీని కలిసి ఫిర్యాదు చేశారు. జమ్మలమడుగులోని సమస్యాత్మక గ్రామాల్లో పోలింగ్ బూత్‌లో వెళ్లేందుకు ఏజెంట్లు భయపడుతున్నారని, ఆ గ్రామాలు టీడీపీ నేతల కంట్రోల్లో ఉండటంతో ఏజెంట్లుగా కూర్చునేందుకు స్థానికులు సాహసం చేయటం లేదని తెలిపారు. బయటి గ్రామాల నుంచి ఏజెంట్లను తెచ్చిపెట్టుకునేందుకు అనుమతి ఇవ్వమని ఎన్నికల ప్రధానాధికారిని కోరినట్లు రఘురామి రెడ్డి తెలిపారు. -
టీఆర్ఎస్లోకి సుధీర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎల్బీ నగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి కూడా ‘కారు’ఎక్కేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ఆయన భేటీ అయ్యారు. త్వరలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలవనున్నట్లు వెల్లడించారు. మరోవైపు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్ రావు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోబోతున్నట్లు తెలిసింది. లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎత్తుగడలతో కాంగ్రెస్ కలవరం చెందుతోంది. ఫిరాయింపులను ఆపలేక చిత్తుచిత్తవుతోంది. తెల్లారితే చాలు ఏ ఎమ్మెల్యే ‘చే’జారిపోతారో తెలియని అయోమయం ఆ పార్టీలో నెలకొంది. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది మొదలు ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితి ఉంది. ఇప్పటికే పార్టీకి చెందిన ఏడుగురు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వెల్లడించగా, మరికొందరు అదే బాటలో ఉన్నారన్న ప్రచారం కాంగ్రెస్ నేతలకు నిద్రపట్టనీయడం లేదు. కాంగ్రెస్‌కు షాక్‌మీద షాక్... శాసనసభ ఎన్నికల్లో తీవ్ర ఓటమి పాలైన కాంగ్రెస్‌కు టీఆర్ఎస్ వరుస షాక్‌లు ఇస్తోంది. కాంగ్రెస్ పార్టీ నుంచి 19 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. వీరిలో ఆరుగురు టీఆర్ఎస్లో చేరుతున్నట్లు ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన తర్వాత సబితా ఇంద్రారెడ్డి, ఉపేందర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేరారు. ఇక కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు, ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సైతం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో సంప్రదింపులు జరిపినట్లుగా శుక్రవారం ఉదయం వార్తలొచ్చాయి. దీనిపై గాంధీభవన్ వర్గాలను ఆరా తీయగా వనమా తిరుపతిలో ఉన్నట్లుగా తెలిపారు. సుధీర్‌రెడ్డి మాత్రం తాను టీఆర్ఎస్ చేరబోతున్నట్లు శుక్రవారం రాత్రి మీడియాకు వెల్లడించారు. మరోవైపు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజుల సురేందర్ సైతం పార్టీ మారతారని, 19న సీఎం కేసీఆర్ సభలో టీఆర్ఎస్లో చేరతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఖమ్మంలోనూ ఖతం... అలాగే శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పరువు నిలిచింది ఒక్క ఖమ్మం జిల్లాలోనే కాగా, ప్రస్తుతం అక్కడ కూడా పార్టీ ఖాళీ అయ్యే సూచనలే కనిపిస్తున్నాయి. ఇక్కడ 10 స్థానాలకు గాను టీడీపీ 2, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించింది. ఒకచోట ఇండిపెండెంట్ గెలవగా, ఒక్కచోట మాత్రమే టీఆర్ఎస్ గెలిచింది. అయితే ప్రస్తుతం అక్కడ సీన్ మారుతోంది. ఇండిపెండెంట్ ఎమ్మెల్యే రాములు నాయక్ అందరికంటే ముందే టీఆర్ఎస్లో చేరగా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, బానోతు హరిప్రియ నాయక్, కందాల ఉపేందర్‌రెడ్డితో పాటు టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అంతా కారెక్కేందుకు సిద్ధమయ్యారు. ఇప్పుడు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్రావు కారు ఎక్కితే.. ఇక జిల్లాలో ప్రతిపక్ష నేత భట్టి విక్రమార్క (మధిర), పొడెం వీరయ్య (భద్రాచలం), టీడీపీ నుంచి గెలిచిన మెచ్చా నాగేశ్వర్రావు (అశ్వారావుపేట) మాత్రమే జిల్లాలో టీఆర్ఎస్యేతర ఎమ్మెల్యేలుగా మిగలనున్నారు. ఈ ప్రభావం ఖమ్మం పార్లమెంట్‌పై పడుతుందని కాంగ్రెస్ నేతలే వ్యాఖ్యానిస్తున్నారు. అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లోకి.. నియోజకవర్గ అభివృద్ధి కోసమే టీఆర్ఎస్లో చేరబోతున్నట్లు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. పార్టీ మారుతున్నారన్న ప్రచారంపై శుక్రవారం రాత్రి ఆయన స్పందించారు. కేటీఆర్‌తో తాను సమావేశమైన మాట వాస్తవమేనని అన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కూడా కలవబోతున్నట్లు వెల్లడించారు. తన నియోజకవర్గాన్ని ఏళ్ల తరబడి పట్టిపీడిస్తున్న సమస్యల పరిష్కారానికే పార్టీ మారుతున్నానని స్పష్టం చేశారు. నియోజకవర్గ అభివృద్ధిపై కేటీఆర్ తనకు పూర్తిస్థాయిలో హామీ ఇచ్చారని వివరించారు. ఆరా తీసిన అధిష్టానం.. పార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్లోకి జారిపోతుండటంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీసింది. పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక కు ఢిల్లీలోనే ఉన్న రాష్ట్ర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్కతో దీనిపై చర్చించింది. రాష్ట్ర పార్టీ, సీఎల్పీ నాయకత్వం ఎమ్మెల్యేలకు ఎందుకు భరోసా కల్పించలేకపోతోందన్న అంశంపై చర్చించినట్లుగా తెలిసింది. ఈ మొత్తం ప్రభావం పార్లమెంట్ ఎన్నికలపై తీవ్ర ప్రభావం చూపనుండటంతో ఇప్పటికైనా చర్యలు తీసుకొని, గట్టి పోటీ ఇస్తామన్న ఐదారు స్థానాల్లో అయినా పార్టీ శ్రేణులకు మనోస్థైర్యాన్ని నింపాలని సూచించినట్లుగా సమాచారం. -
ఎన్నాళ్లీ ‘ఆది’పత్యం?
టీడీపీ సర్కారు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. అధికారం చేతిలో పెట్టుకుని అడ్డగోలుగా వ్యవహరిస్తోంది. ప్రాథమిక హక్కులను కాలరాస్తోంది. తన నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ నాయకులను పర్యటించకుండా గృహ నిర్బంధం చేసిన సంఘటన మంత్రి ఆదినారాయణరెడ్డి దురహంకారానికి దర్పణం పడుతోంది. పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డిని.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని నిడుజివ్విలో పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం. సుధీర్‌రెడ్డిని శనివారం తెల్లవారుజామునే గృహ నిర్బంధం చేసిన సంఘటన ప్రజాస్వామిక వాదులను కలవర పరుస్తోంది. ప్రచారానికి ముందస్తు అనుమతి తీసుకున్నా జిల్లా మంత్రి ఒత్తిళ్లకు తలొగ్గి పోలీసులు ఈ చర్యలకు పాల్పడి చట్టానికి తూట్లు పొడిచారు. –పులివెందుల / ఎర్రగుంట్ల పులివెందుల/ఎర్రగుంట్ల : జమ్మలమడుగు నియోజకవర్గంలోని సున్నపురాళ్లపల్లె, సుగుమంచిపల్లెలలో మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి.. నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డితో కలిసి శనివారం ‘రావాలి జగన్ – కావాలి జగన్’ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉంది. మూడు రోజుల క్రితమే వారు పోలీసుల అనుమతి కోరారు. అయినా ఆకస్మికంగా మంత్రి కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తారనే సాకు చూపుతూ పోలీసులు ప్లేటు ఫిరాయించారు. శనివారం ఉదయం 5గంటలకే పులివెందుల స్వగృహంలో ఉన్న అవినాష్‌రెడ్డిని డీఎస్పీ నాగరాజ, సీఐలు శంకరయ్య, రామకృష్ణుడు, ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీసు బలగాలతో వెళ్లి హౌస్ అరెస్టు చేశారు. అదే సమయంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త డాక్టరు ఎం సుధీర్‌రెడ్డిని కూడా గృహ నిర్బంధం చేశారు. ఇద్దరు సీఐలు, ఎస్ఐల నేతృత్వంలో ప్రత్యేక పోలీస్ బలగాలు ఆయన ఇంటిని చుట్టుముట్టాయి. గతంలో కూడా వైఎస్ అవినాష్‌రెడ్డి, డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డిని, ఎం.హర్షవర్దన్రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కాగా ప్రస్తుతం అవినాష్ రెడ్డి, సుధీర్‌రెడ్డిలతో పాటు జమ్మలమడుగుకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డిలను కూడా ముందస్తుగా హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాభిమానం చూసి ఓర్వలేక.. మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ అవినాష్‌రెడ్డి, సుధీర్‌రెడ్డిల రాకను సాదరంగా ఆహ్వానించేందుకు వైఎస్సార్ అభిమానులు సిద్ధమయ్యారు. ఓర్వలేని మంత్రి ఆదినారాయణరెడ్డితోపాటు ఆయన సోదరులు శుక్రవారం రాత్రి ఆయా గ్రామాల ప్రజలను ప్రలోభాలకు గురి చేసినట్లు తెలిసింది. వారి మాటలను స్థానికులు లెక్క చేయలేదు. వైఎస్సార్సీపీ నాయకులు గ్రామాల్లో పర్యటిస్తే తమ పట్టు కోల్పోతామోనన్న భయంతో అడ్డుకోవాలని ఆదినారాయణరెడ్డి కుటిల రాజకీయానికి తెర లేపారు. శుక్రవారం అర్ధరాత్రి 12గంటలకు తాము కూడా ఆ గ్రామాల్లో పర్యటిస్తామని పోలీసులకు చెప్పినట్లు తెలిసింది. దీంతో పోలీసులు శాంతి భద్రతలు సాకు చూపుతూ అవినాష్‌రెడ్డిని, సుధీర్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారు. నేతల పర్యటన అడ్డుకునేందుకు మంత్రి పోలీసులను అడ్డుపెట్టుకున్నట్లుగా ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. అవినాష్‌రెడ్డిని హౌస్ అరెస్టు చేశారని తెలియగానే పులివెందుల నియోజకవర్గంలోని పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన స్వగృహానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులతో వైఎస్ అవినాష్‌రెడ్డి వాగ్వాదానికి దిగారు. అనుమతి ఇచ్చి అడ్డుకోవడం మంచి పద్దతి కాదన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడికైనా పర్యటించే హక్కు ఉంటుందన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారన్నారు. సాయంత్రం 5గంటల వరకు గృహ నిర్బంధం చేశారు. మధ్యలో ఆయన పట్టణంలో వివాహ కార్యక్రమాలు, వాటర్ ప్లాంట్ల ప్రారంభోత్సవాలకు హాజరయ్యారు. ఆయన వెంట పోలీసు బలగాలు అనుసరించారు. దమ్ముంటే తిరగనివ్వండి మంత్రి ఆదినారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలకు 30 ఏళ్ల రాజకీయ జీవితం ఉంది.. నాకు మూడేళ్ల రాజకీయ జీవితం మాత్రమే ఉంది.. అయినా ఆ ఇద్దరు భయపడుతున్నారెందుకో అర్థం కావడం లేదు.. దమ్మూ, ధైర్యం ఉంటే æతనను స్వేచ్ఛగా తిరగనివ్వాలని సమన్వయకర్త డాక్టర్ ఎం సుధీర్‌రెడ్డి సవాలు విసిరారు. గృహ నిర్బంధం చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. పదవుల కోసం రామసుబ్బారెడ్డి మాదిరిగా దిగజారుడు రాజకీయాలు చేయనన్నారు. 2004, 2009, 2014లలో ఆ గ్రామాలలో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోలేదు. సున్నపురాళ్లపల్లె గ్రామంలో ప్రచారానికి డీఎస్పీ షరతులతో కూడిన అనుమతి ఇచ్చారన్నారు. తర్వాత అదే ఊరిలో మంత్రి ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలు కూడా ప్రచారం చేస్తారంటూ తమ అనుమతులను డీఎస్పీ రద్దు చేయడం కక్షపూరిత చర్య అన్నారు. నియోజకవర్గంలో మంత్రి ఆది, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్సీ శివనాధ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులున్నారు. ఇంతమంది ఉన్నా భయపడుతూ తనను ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని ఎద్దేవా చేశారు. తమ గ్రామమైన సిర్రాజుపల్లెకు మంత్రి ఆదినారాయణరెడ్డి వచ్చినా ఏం కాలేదని గుర్తు చేశారు. గుండ్లకుంటలోకి కూడా పోతాం.. నమ్మకం లేక భయపడుతున్నావని రామసుబ్బారెడ్డిని దృష్టిలో పెట్టుకుని సుధీర్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి వైపు పార్టీ నాయకులు.. కార్యకర్తలు.. ప్రజలు ఉన్నారనే భయంతో ఇలా వ్యవహరిస్తున్నారన్నారు. ఇద్దరూ ఫిఫ్టీ ఫిఫ్టీ తరహాలో లాభాలు పంచుకుని చెట్టపట్టాలు వేసుకోని తిరుగుతున్నారని విమర్శించారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి హర్షవర్దన్‌రెడ్డితో పాటు నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. హైకోర్టుకు వెళ్లయినా గ్రామాల్లో పర్యటిస్తాం వైఎస్ అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. గతంలో గొనిగెనూరు వెళ్లాలనుకున్నప్పుడు ఇదేవిధంగా అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టును ఆశ్రయించి పర్యటించామని చెప్పారు. హైకోర్టు సూచలను పాటిస్తూ పర్యటించామన్నారు. అప్పుడు ఆ గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికి తమకు, వైఎస్సార్సీపీకి అండగా ఉంటామని చెప్పడం జరిగిందన్నారు. మంత్రి ఆదినారాయణరెడ్డికి ప్రజాబలంపై, ఓటర్ల బలంపై నమ్మకంలేదన్నారు. అందువల్లే ఈ విధంగా పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. ఆదినారాయణరెడ్డి అనేకసార్లు పులివెందులకు వస్తే ఏరోజు కూడా తాము గానీ, కార్యకర్తలు గానీ అడ్డుకోలేదనే సంగతి గుర్తుంచుకోవాలన్నారు. ఆదినారాయణరెడ్డి వచ్చినా, రాకున్నా పులివెందుల ప్రాంత ప్రజలు వైఎస్సార్సీపీకి పూర్తి అండగా ఉన్నారన్న విశ్వాసం తమకు ఉండటమేనన్నారు. ఆ నమ్మకం ఆదినారాయణరెడ్డికి జమ్మలమడుగు ప్రజలపై లేదన్నారు. ఆదినారాయణరెడ్డికి నిజంగా ఆయా గ్రామాల్లో బలంలేదన్నారు. కేవలం భయపెట్టి రాజకీయం చేస్తున్నారన్నారు. జమ్మలమడుగు ప్రజలు వైఎస్సార్సీపీని గెలిపించాలని కోరుకుంటున్నారని.. ఈ నేపథ్యంలో తాము అక్కడ పర్యటించి మద్దతు కూడగడితే ఆయనకున్న దేవగుడి పరిసరాలలోని రిగ్గింగ్ బూత్‌లు పూర్తిగా వైఎస్సార్సీపీ వశమవుతాయని భయపడి పోలీసులను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారన్నారు. ఏదీ ఏమైనా ఆయా గ్రామాల్లో పర్యటించి తీరుతామన్నారు. సమన్వయం కోల్పోకుండా, లాఅండ్ఆర్డర్ సమస్య లేకుండా ముందుకు వెళతామన్నారు. అవసరమైతే హైకోర్టును ఆశ్రయించి ఆ గ్రామాల్లో ప్రశాంతంగా పోలింగ్ జరిపిస్తామని మాజీ ఎంపీ స్పష్టం చేశారు. -
రౌడీలుగా మెలగడం మానుకోండి..
-
‘ఏక్ నిరంజన్‌ని.. నాతో మీకు భయమేంటి?’
సాక్షి, వైఎస్సార్ : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎంతో మంది నాయకులు ఉన్న మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిలు ఏక్ నిరంజన్ అయిన తనంటే భయమెందుకని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. వారికి ఓటమి భయం పుట్టుకొచ్చినందుకే తనను ప్రచారం చేసుకోనివ్వడం లేదన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో గడచిన మూడు ఎలక్షన్లు చూస్తే.. 2004, 2009, 2014లో కూడా అక్కడి ప్రజలు ఓటు హక్కు వినియోగించుకోలేదు. అక్కడి ప్రజలను మోటివేట్ చేయడానికి జమ్మలమడుగు డీఎస్పీ 2వ తేదీ ప్రచారం చేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఆ తర్వాత మంత్రి ఆదినారాయణరెడ్డి ఒత్తిళ్లకు లొంగి నన్ను హౌస్ అరెస్ట్ చేయడం దారుణం. ఓటమి భయంతోనే నా ప్రచారాన్ని అడ్డుకుంటున్నారు. మీరు నా సొంత ఊరిలో ప్రచారం చేసుకున్నారు నేను అడ్డుకున్నానా. మంత్రి ఆదినారాయణ, మాజీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల ఫ్యాక్షన్ వల్ల ఎన్నో అమాయక కుటుంబాలు నాశనం అయ్యాయి. ప్రజలకు సేవచేసే నాయకుల్లా మెలగాలి.. రౌడీలుగా మెలగడం మానుకోండి. అడ్డుకుంటే భయపడే వాడిని కాదు. రామసుబ్బారెడ్డి సొంత ఊరు గుర్లకుంటలో ప్రచారం చేస్తా. మీ ఇద్దరిదీ 30 ఏళ్ల రాజకీయ జీవితం. నా మూడేళ్ల రాజకీయ జీవితంతో భయపడడం ఏంటి. గత ఎలక్షన్లలో దేవగుడికి పోవాలన్న రామసుబ్బారెడ్డి, సీఎం రమేష్‌పై రాళ్లు విసిరిన ఆదినారాయణరెడ్డి ఇప్పుడు సిగ్గు లేకుండా ఫిఫ్టీ, ఫిఫ్టీ బాటలో నడుస్తూ ప్రజలను మోసం చేస్తున్నారు. రాబోయే ఎలక్షన్లలో ప్రజలు వీరికి తగిన గుణపాఠం చెబుతార’న్నారు. -
వైఎస్సార్ సీపీ నేతల హౌస్ అరెస్ట్.. జమ్మలమడుగులో హైటెన్షన్
-
జమ్మలమడుగులో హైటెన్షన్
సాక్షి, వైఎస్సార్ : జిల్లాలో అధికార తెలుగుదేశం పార్టీ మరోసారి తన జులుం ప్రదర్శించింది. ప్రచారానికి సిద్ధమైన వైఎస్సార్ సీపీ నేతలను మంత్రి ఆదినారాయణరెడ్డి ఆదేశాల మేరకు హౌస్ అరెస్ట్ చేయటంతో జమ్మలమడుగులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లిలో ఎంపీ అవినాష్‌రెడ్డి, జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్ రెడ్డిలు శనివారం ప్రచారానికి సమయత్తమయ్యారు. ఈ నేపథ్యంలో సున్నపురాళ్లపల్లిలో మంత్రి ఆదినారాయణ ప్రభావం ఉందంటు సుధీర్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పులివెందులలో వైఎస్ అవినాష్‌రెడ్డి ఇంటికి చేరుకున్న పోలీసులు ఆయనను కూడా హౌస్ అరెస్ట్ చేశారు. నిన్న వైఎస్సార్ సీపీ నేతల ప్రచారానికి అనుమతించిన పోలీసులు నేడు నిరాకరించటం గమనార్హం. -
‘దమ్ము, ధైర్యం ఉంటే వారు పోటీ చేసి గెలవాలి’
సాక్షి, వైఎస్సార్ కడప : దమ్ము, ధైర్యం ఉంటే జమ్మల మడుగు అసెంబ్లీ స్థానం నుంచి .. రామ సుబ్బారెడ్డి, ఆది నారాయణ రెడ్డిలు పోటీ చేసి గెలవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ సుధీర్ రెడ్డి సవాల్ విసిరారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఈ ఇద్దరు నేతలు కమీషన్ల కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. వారు వృద్ధాప్యంలో ఉన్నారని, విశ్రాంతి తీసుకోవాలని హితపు పలికారు. గత ఎన్నికల్లో ఏడువందల హామీలిచ్చిన చంద్రబాబు ఒక్కటి కూడా అమలు చేయలేదని విమర్శించారు. ఎన్నికలకు మూడు నెలల ముందు ఓట్లను డబ్బులతో కొంటామని చంద్రబాబు ప్రగల్బాలు పలుకుతున్నారని మండిపడ్డారు. డెబ్బై ఏళ్ల చంద్రబాబు కంటే వైఎస్ జగన్మోహన్రెడ్డిపైనే ప్రజల ఆదరాభిమానులున్నాయని, ఈసారి వైఎస్సార్సీపీ విజయం సాధిస్తుందన్నారు. జమ్మలమడుగు అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ టికెట్ తమకే కేటాయించాలంటూ మంత్రి ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి చంద్రబాబు వద్ద పంచాయితీ పెట్టుకున్న సంగతి తెలిసిందే. -
‘వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మినవారికి అండగా ఉంటాం’
సాక్షి, వైఎస్సార్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులను జమ్మలమడుగు మండలం గొరిగెనూర్‌లో అడుగుపెట్టకుండా మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన కుట్రలు విఫలమయ్యాయి. హైకోర్టు ఉత్తర్వులతో వైఎస్సార్ సీపీ నేతలు శుక్రవారం గొరిగెనూరులో అడుగుపెట్టారు. గ్రామానికి చెందిన పలువురు నేతలు నేడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎంపీ అవినాశ్‌రెడ్డి సమక్షంలో ఓబులేసు, భాస్కర్‌రెడ్డి, నీలకంఠ అనుచర వర్గం పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు ఇంచార్జ్ సుధీర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శంకర్‌రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఓబులేసుతో సహా పలువురు నేతలు తమ పార్టీలో చేరినట్టు వెల్లడించారు. తమను ఇక్కడికి రాకుండా అడ్డుకోవడానికి ఎన్ని అడ్డంకులు సృష్టించారో ప్రజలు అంత చూశారని అన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మే ప్రతి ఒక్కరికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ.. స్థానికంగా ఏం జరిగిన మంత్రి ఆదినారాయణ రెడ్డి బాధ్యత వహించాలని అన్నారు. ప్రతి గ్రామంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగరాలని అన్నారు. గత కొద్ది రోజులుగా వైఎస్సార్ సీపీ జిల్లా నేతలు గొరిగెనూరుకు వెళ్లకుండా పోలీసులు నియంత్రించిన సంగతి తెలిసిందే. దీనిపై వైఎస్సార్ సీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం వైఎస్సార్ సీపీ నేతల రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం.. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాస్వామ్య దేశంలో ఒక గ్రామానికి వెళ్లకుండా వ్యక్తుల అంక్షలు విధించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. -
కనకారెడ్డి, సుధీర్‌రెడ్డికి ‘ఎమ్మెల్సీ’ అభయం
సాక్షి,సిటీబ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థులు ప్రకటించని నియోజకవర్గాల్లో పరిస్థితి అంత సులువుగా దారికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి, మల్కాజిగిరి స్థానాన్ని ఎమ్మెల్సీ హన్మంతరావుకు ఖరారు చేస్తూ.. తాజా మాజీ ఎమ్మెల్యేలు సుధీర్‌రెడ్డి, కనకారెడ్డిలకు ఎమ్మెల్సీ ఇస్తామంటూ పంపిన రాయబారం ఫలించేలా లేదు. తొమ్మిదో తేదీ అనంతరం రెండో జాబితా అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈలోగా మేడ్చల్, మల్కాజిగిరి, ముషీరాబాద్, ఖైరతాబాద్, గోషామహల్ తదితర స్థానాల్లో ఏకాభిప్రాయం సాధించేందుకు పార్టీ నాయకులు కసరత్తు చేస్తున్నారు. అయితే మేడ్చల్ స్థానాన్ని ఎంపీ మల్లారెడ్డికి ఖరారు చేసి ఆయనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీంతో మల్లారెడ్డి ప్రచారాన్ని ప్రారంభించినా.. నియోకవర్గంలో అందరిమధ్యా సయోధ్య కుదిరే వరకు ప్రచారం చేయవద్దని సూచించి ఈ మేరకు మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిని చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. సర్వేల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జరిగిందని, పార్టీ అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవిని ఇస్తామని మంత్రులు కేటీఆర్, మహేందర్‌రెడ్డి స్వయంగా సుధీర్‌రెడ్డికి నచ్చచెప్పే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. అయితే, తాను కేసీఆర్‌ను కలిసిన తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తానని సుధీర్‌రెడ్డి అసంతృప్తినిగానే వెనుదిరిగినట్లు తెలిసింది. మరోవైపు మల్కాజిగిరిని మైనంపల్లి హన్మంతరావుకు ఖరారు చేసి ఈ మేరకు ఆయనకు సమాచారం కూడా ఇచ్చారు. దీంతో మాజీ ఎమ్మెల్యే చింతల కనకారెడ్డి తీవ్ర అంసతృప్తితో ఉన్నారు. తొలుత తన కోడలు విజయశాంతికి టికెట్ ఇస్తామని ప్రకటించి ఇప్పుడు ఎలా మారుస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. కనకారెడ్డికి కూడా ఎమ్మెల్సీ పదవి ఇస్తామని నేతలు హామీ ఇచ్చినా ఆయన శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. ముషీరాబాద్, ఖైరతాబాద్‌లో ఢీ అంటే ఢీ నగరంలోని ముషిరాబాద్ నియోజకవర్గం నుంచి ముఠా గోపాల్, ఖైరతాబాద్‌లో దానం నాగేందర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు పార్టీ వర్గాలు గురువారం సాయంత్రం లీక్ ఇచ్చాయి. అయితే, ముషిరాబాద్లో తన అల్లుడు శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వాలని, వీలుకాకపోతే తానే పోటీ చేస్తానని హోంమంత్రి నాయిని భీష్మించుకు కూర్చున్నారు. పార్టీ మాత్రం ముఠా గోపాల్ వైపే మొగ్గు చూపింది. ఈ నేపథ్యంలో నాయిని వైఖరి ఎలా ఉండబోతుందన్న ఉత్కంఠ నియోజకవర్గంలో నెలకొంది. ఖైరతాబాద్ నియోకజవర్గం నుంచి మాజీ మంత్రి దానం నాగేందర్ పేరును దాదాపు ఖరారు చేశారన్న వార్తల నేపథ్యంలో బుధవారం పార్టీ నాయకులు పి.విజయారెడ్డి, మన్నె గోవర్ధన్‌రెడ్డి మంత్రి కేటీఆర్‌ను కలిసి తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీనిపై కేటీఆర్ స్పందిస్తూ అభ్యర్థిని ఎవరినీ ఖరారు చేయలేదని, మీరు తొందరపడవద్దని వారించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా గురువారం సాయంత్రానికి తనకు టికెట్ ఖరారైందని దానం సన్నిహితులకు చెప్పినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ నియోజకవర్గంలో టికెట్ తనకే వస్తుందన్న ధీమాను వ్యక్తం చేస్తున్న విజయారెడ్డి.. దానం నాగేందర్‌ను ఎలాగైనా ఢీ కొట్టే లక్ష్యంతో పావులు కదుపుతున్నట్లు సమాచారం. గోషామహల్ స్థానాన్ని ప్రేమ్‌సింగ్ రాథోడ్‌కు కేటాయించే అవకాశం ఉంది. -
బాబు సర్కార్ అన్నింటా వైఫల్యం!
వైఎస్ఆర్ జిల్లా: చంద్రబాబు సర్కార్ అన్నింటా వైఫల్యం చెందిందని కడప మేయర్, వైఎస్సార్సీపీ నేత సురేష్ బాబు వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద కరవుపై పోరు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి, ఎమ్మెల్యేలు రఘురామి రెడ్డి, రవీంద్రనాథ్, అంజద్ బాషా, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్సీ గోవింద రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..రైతులను ఆదుకోవడంలో ఈ ప్రభుత్వం విఫలమైందన్నారు. ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్ ఇవ్వడంలో వైఫల్యం కనబడుతోందని విమర్శించారు. జిల్లాలో 50 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించినా ఇంతవరకు సాయం అందించలేదని వెల్లడించారు. నాలుగేళ్లుగా కరవు విలయతాండవం చేస్తుంటే రైతులను ఆదుకోవడం లేదని మండిపడ్డారు. కేంద్రం ఇచ్చే బీమా, బాబు ఇవ్వాల్సిన మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా ఆగిపోయిందని అన్నారు. అన్నదాతలకు అండగా కరవుపై పోరాటం చేపట్టామని వ్యాఖ్యానించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అంజాద్ బాషా మాట్లాడుతూ.. జిల్లాకు సాగునీరు ఇవ్వడంలో వివక్ష చూపుతున్నారని తెలిపారు. కరువు రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం అయిందని విమర్శించారు. మంచి పరిపాలకుడు ఉంటే భగవంతుడు కరుణిస్తాడని వ్యాఖ్యానించారు. వైఎస్సార్ ఉన్నపుడు వర్షాలు పడ్డాయి...బాబు పాలనలో వర్షం జాడే లేదని ఎద్దేవా చేశారు. రాయలసీమ కరువు కోరల్లో చిక్కుకుందని, రైతులను, ప్రజా సమస్యలను చంద్రబాబు గాలికి వదిలేశారని విమర్శించారు. దేశ వ్యాప్తంగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. జమ్మలమడుగు వైఎస్సార్సీపీ సమన్వయకర్త సుధీర్ రెడ్డి మాట్లాడుతూ..ఇంత వరకు జమ్మలమడుగులో ఒక్క విత్తనం కూడా వేయలేదని తెలిపారు. మా దగ్గర ఒక మంత్రి, ఒక విప్, ఒక రాజ్యసభ సభ్యుడు ఉన్నారు. వారు ఒక్క రోజు కూడా కరువు గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. మంత్రి సాగునీరు తెచ్చేందుకు ప్రయత్నం చేయడం లేదని, కేవలం కమీషన్ల కోసం వెంపర్లాట తప్ప రైతుల గురించి ఆలోచించడం లేదని తీవ్రంగా ధ్వజమెత్తారు. జగనన్న సీఎం అయితేనే రైతులకు న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించారు. గోవింద రెడ్డి మాట్లాడుతూ..వంద టీఎంసీ నీళ్ల కోసం కడపలో జలాశయాలు కట్టానని చంద్రబాబు అంటున్నారు..మరి ఈ కరువు పరిస్థితి ఎందుకు వచ్చింది చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది మీరు కాదా అని సూటిగా అడిగారు. వైఎస్సార్ కట్టిన ప్రాజెక్టులను చంద్రబాబు తన ఘనతగా చెప్పుకుంటున్నారని, ఆయన చర్యల వల్ల రైతులు ఖరీఫ్ సాగు మర్చిపోయారని ఎద్దేవా చేశారు. మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..జిల్లాలో సకాలంలో వర్షాలు లేక కనీసం పశువులకు మేత కూడా కరువైందని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు కపట ప్రేమను చూపిస్తున్నారని విమర్శించారు. కుందూ నదిలో నెల్లూరుకి 20 వేల క్యూసెక్కుల నీరు వృధాగా పోతుందని, ఆ నీటిని తెలుగుగంగ ప్రాజెక్టుకు తరలిస్తే రైతులకు ఎంతో మేలు జరుగుతుందని తెలిపారు. దీని పై రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు...ఇలాంటి ముఖ్యమంత్రి మనకు ఉండటం మన ఖర్మ అని వ్యాఖ్యానించారు. బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నారు... కానీ ఏమైంది బాబు కుమారుడికి మాత్రమే జాజ్ వచ్చిందన్నారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే వైఎస్సార్ జిల్లా అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం దారుణమన్నారు. కరవు కోరల్లో కొట్టుమిట్టాడుతున్న వైఎస్సార్ జిల్లాను కాపాడుకోవాల్సిన బాధ్యత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ భుజస్కందలపై వేసుకుందని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు ఆయన బంధువులకు న్యాయం చేస్తున్నారు తప్ప రైతులకు ఎలాంటి న్యాయం చేయడం లేదు..ముఖ్యమంత్రి పదవికి చంద్రబాబు పూర్తి అనర్హుడు..మంత్రి ఆదినారాయణ రెడ్డి చంద్రబాబు భజన మనుకుని తన సొంత నియోజకవర్గంలో నీటి సమస్యను పరిష్కరించాలని హితవు పలికారు. -
నేను మీ పల్లెలకు వస్తా.. నువ్వు మా పల్లెలకు రా
ఎర్రగుంట్ల : ‘మంత్రి ఆదినారాయణరెడ్డి ఊళ్లకు నేను ఒంటరిగా వస్తాను.. ఇంటింటికి తిప్పమను, అదే మంత్రి ఆదినారాయణరెడ్డిని మా పల్లెలకు రమ్మనండి.. నేను ఒక్కడిని తిప్పుతాను.. మంత్రి మంచి చేయలేదనే ఆ పల్లెలకు చెందిన వాళ్లు మమ్మల్ని మంచితనంతో పిలిచారు. రాజకీయంగా 15 ఏళ్ల నుంచి ఉన్నామని గొప్పలు చెప్పుకుంటున్నావే... ఆ పల్లెల్లోని యువతకు ఉద్యోగాలు ఇచ్చావా.. నీవు మంచి చేయకపోతేనే వారు మమ్మల్ని పిలుస్తున్నారు’.. అని వైఎస్సార్ సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ ఎం.సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన నిడుజివ్వి గ్రామంలో విలేకరులతో మాట్లాడారు. మా నిడుజివ్వి గ్రామంలో నీటి సమస్యలేదు. మంత్రి మా గ్రామానికి ట్యాంక్ కట్టించానని చెబుతున్నారు. ప్రపంచ బ్యాంక్ నిధులతో కట్టారు. మా ఊరిలో గత 50 ఏళ్ల నుంచి నీటి సమస్యలేదు. మా కుటుంబం స్వాతంత్య్రం కాలం నుంచి రాజకీయంలో ఉంది. మా తాత రామిరెడ్డి అప్పట్లోనే ఎంపీగా పోటీ చేశారు. తర్వాత పెద్దనాన్న మైసురారెడి,్డ ఆ తర్వాత మేం రాజకీయంలోకి వచ్చాం. మాకంటూ ఒక రాజకీయ చరిత్ర ఉంది. నన్ను కొత్త బిచ్చగాడు అని సంబోధిస్తావా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి శివారెడ్డి హత్య జరిగిన తర్వాత వీరందరు వచ్చి మా ఇంటి వద్ద కాపలాగా కూర్చునేవారు. ఇలాంటి పరిస్థితి వారిది. నేను వైద్యుడిగా సేవ చేసి గుర్తింపు పొందాను. ఆదినారాయణరెడ్డికి ఏం గుర్తింపు ఉంది. మీ నాన్న ఫ్యాక్షన్‌లో చనిపోయిన తర్వాత వైఎస్ఆర్ భిక్ష పెట్టాడు. తర్వాత మీ నారాయణరెడ్డి మా ఇళ్ల చుట్టు తిరిగాడు. 2004 వరకు రాజకీయాల్లో లేవు. ఎక్కడో బడి పంతులుగా ఉన్నావు. లేదా క్లబ్‌ల్లో పేకాట ఆడుతు ఉండేవాడివి. 2004లో వైఎస్సార్ పుణ్యంతో మీ అన్నను బెదిరించి టిక్కెట్ తెచ్చుకున్నావు అని పేర్కొన్నారు. నాకు నిధుల గురించి తెలియదు అంటున్నావు. నీవు మామూళ్ల కోసమే నిధులు తెచ్చుకున్నావు. మా పెద్దనాన్న నిధులు తెచ్చి అభివృద్ధి పనులు ఎన్నో చేశారు. నీకేం ఘనత ఉంది. 1996 ఎన్నికలలో మా ఊర్లో రిగ్గింగ్ జరిపినారు అని చెబుతున్నావే.. ఆ రోజు వైఎస్సార్ కోసమే ప్రజలు ఓట్లు వేశారు. ఆ రోజు స్వయాన అల్లుడైన రాజమోహన్‌రెడ్డికి కాకుండా వైఎస్సార్ కు మద్దతు తెలిపిన ఘనత పేర్ల శివారెడ్డికి దక్కిందన్నారు. మీరేం చేశారు అని ప్రశ్నించారు. 1990లో మీ అన్న నారాయణరెడ్డికి మా పెద్దనాన్న మైసురారెడ్డి డీసీసీ చైర్మన్ పదవి ఇప్పించారని, దీనిని గుర్తుంచుకోవాలన్నారు. నీ ట్రస్టు ద్వారా రూ.2500 కట్టించుకొని కుట్టుమిషన్లు ఇచ్చావు. ఆ రోజు తెల్లరేషన్ కార్డులు కల్గిన వారికి రూ.1200లకే ఇస్తున్నారు. నీవేమైనా ఉచితంగా ఇచ్చావా అని నిలదీశారు. రిజర్వాయర్ల ఏర్పాటు.. పాదయాత్ర చేసిన ఘనత వైఎస్సార్, మైసూరారెడ్డిలదే.. రిజర్వాయర్లు కట్టించామని చెబుతున్నావు. ఆరోజు గండికోట, వామికొండ రిజర్వాయర్ల కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి, మా పెద్దనాన్న మైసూరారెడ్డిలు పాద యాత్ర చేశారు. నీవేం చేశావు. వైఎస్సార్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కమీషన్లు మేసినావు. నేను ఊర్ల పేర్లు చెప్పలేనని అంటున్నావు. నేను నీ పల్లెలకు వస్తాను, నీవు నా పల్లెలకు రా తిప్పుతాను అన్నారు. ఎర్రగుంట్ల అభివృద్ధి వైఎస్సార్ హయాంలోనే జరిగింది ఎర్రగుంట్లలో ఏమి చేశావు..? ఎర్రగుంట్లకు ఓవర్ బ్రిడ్జి, కళాశాలలు ఎప్పుడు వచ్చింది తెలుసు. 2008కు ముందు ఆదినారాయణరెడ్డి ఎవరో తెలియదు. ఆనాడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఇంటర్, డిగ్రీ, ఐటీఐ కళాశాలలు వచ్చాయి. ఎర్రగుంట్లను ఎవరు మున్సిపాలిటీ చేయమని అడిగారు. దీనిపై నాలుగు రోడ్ల కూడలిలో ఓటింగ్ పెడదాం.. చర్చకు రండి మేం సిద్ధం. అతని లాభం కోసం, వ్యాపార వేత్తలకోసం మున్సిపాల్టీ చేశారు. పన్నులు పెరిగాయి అని తెలిపారు. పెద్దదండ్లూరు గ్రామంలో మంత్రి భార్య.. ఆయన కుమారుడు ఘర్షణలకు ఆజ్యం పోశారన్నారు. 2014లో ఎర్రగుంట్ల మండల ప్రజలు వేసిన ఓట్లతోనే ఆ ఎన్నికల్లో బయటపడ్డావన్న విషయం గుర్తు చేసుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి మైసురారెడ్డి తనయుడు హర్షవర్దన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు సురేంద్రనాథ్‌రెడ్డి, కౌన్సిలర్ డి. సూర్యనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా ప్రధాన కార్యదర్శి జయరామకృష్ణారెడ్డి, పట్టణ, జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షులు షర్పుద్దీన్, మహబూబ్ వలి, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి సుధాకర్, పట్టణ, మండల యూత్ ప్రెసిడెంట్లు దివాకర్‌రెడ్డి, జగన్మోహన్రెడ్డిలు, స్థానిక నాయకులు మల్లు నాగార్జునరెడ్డి, వర్రా డేవిడ్ తదితరులు పాల్గొన్నారు. -
పేదవారిపై కాదు నీబలం..మాపై చూపించు
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్: పేదవారిపై నీ బలం చూపడం కాదు..తమపై చూపించు..ఏదైనా ఉంటే పట్టణంలోని గాంధీ విగ్రహం వద్ద చూసుకుందాం అంటూ వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గసమన్వయకర్త డాక్టర్ సుధీర్‌రెడ్డి మంత్రి ఆదినారాయణరెడ్డికి సవాల్ విసిరారు. మా కార్యకర్తలను ఏమైనా జరిగితే చూస్తూ ఉరుకునేది లేదన్నారు. సోమవారం స్థానిక డీఎస్పీ బంగ్లాలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పెద్దదండ్లూరు గ్రామంలో సంపత్ తమ గ్రామానికి రావాలని పిలిస్తే.. ఎందుకు పిలిచావంటూ మంత్రి వర్గీయులు దళితుడైన సంపత్‌పై దాడి చేయడం దారుణం అన్నారు. ఏమైనా ఉంటే తమపైన ప్రతాపం చూపించాలే తప్ప పేద ప్రజలపై కాదన్నారు. మంత్రి ఆది చర్చకు వచ్చినా ఇంకేదానికి వచ్చినా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఎక్కడో కూర్చొని తమ కుటుంబ సభ్యులు, కుమారుడి చేత ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదన్నారు. నీవే రంగంలోకి దిగితే తాము కూడా దిగుతామని ఘాటుగా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంది. కానీ పోలీసులు ఎంపీ వైఎస్ ఆవినాష్రెడ్డిని, తనను పెద్దదండ్లూరు గ్రామంలో పర్యటించకుండా అడ్డుకోవడం మంత్రి ఆదేశాల మేరకు పోలీసులు నడుచుకున్నట్లు ఉందన్నారు. ఆది మంత్రి పదవికి అనర్హుడు. క్లబ్బులు, పేకాటలకు పరిమితమైన ఆయనను మంత్రి పదవి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే తొలగించాలన్నారు. ఆదివారం జరిగిన సంఘటన ప్రజాస్వామ్యంలో ఒక బ్లాక్‌డేగా మిగిలిపోతుందన్నారు. తమ వారికి ఏమైనా జరిగితే మంత్రి కుటుంబ సభ్యులే బాధ్యత వహించాల్సి ఉంటుందని అన్నారు. గ్రామంలో మంత్రి ఆదినారాయణరెడ్డి సతీమణి అరుణ దగ్గరుండి దాడులు చేయించడం ఆమెకు తగదన్నారు.కుమారుడు ఇప్పటికే చెడుదారిలో పయనిస్తున్నాడని, అతన్ని చక్కదిద్దాల్సిన బాధ్యత తల్లిపై ఉందని సూచించారు. మహిళలంటే తమకు గౌరవం అన్నారు.అరుణమ్మ మంచి తల్లిగా గుర్తింపు తెచ్చుకోవాలే తప్ప ఇలా గూండాయిజం చేయించడం మంచిది కాదన్నారు. -
మంత్రికి క్లబ్, పేకాట శాఖలపైనే పట్టుంది
జమ్మలమడుగు/మైలవరం : మంత్రి ఆదినారాయణరెడ్డి తనకు కేటాయించిన శాఖల కంటే క్లబ్, పేకాట శాఖలపైనే పట్టు ఉందని ప్రభుత్వం ఆ శాఖలను కేటాయించి ఉంటే బాగుండేదని వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్సుధీర్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మైలవరం మండల కేంద్రం పాతబస్టాండ్ వద్ద నుంచి జగన్ పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటినందుకు ఆయనకు మద్దతుగా మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డి, కార్యకర్తలు, నాయకులతో కలిసి సంఘీభావ పాదయాత్రను చేపట్టారు. ఈ సందర్భంగా ఆయనకు అడుగడుగునా ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ సందర్భంగా వేపరాల గాంధీ విగ్రహం వద్ద, దొమ్మరనంద్యాల గ్రామంలోని చావిడి వద్ద జరిగిన బహిరంగ సభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంత్రి ఆదినారాయణరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచి తన స్వార్థప్రయోజనం కోసం పార్టీ ఫిరాయించాడు. పైగా పార్టీ మారింది ప్రజల అభివృద్ధి కోసమంటూ అసత్యప్రచారం చేస్తున్నారన్నారు. ఆయన పార్టీ మారింది కేవలం ఆయన అభివృద్ధి చెందడానికే అన్నారు. చేనేత కార్మికుల కోసం మైలవరం మండలంలోని నార్జాంపల్లి గ్రామ రహదారిలో చేనేతల కోసం టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేశారు. దాదాపు తొమ్మిది సంవత్సరాలైన ఇంత వరకు ఎటువంటి ప్రారంభానికి నోచుకోలేదు. చేనేత కార్మికులపైనే ఏమాత్రం శ్రద్ధ తీసుకోవడం లేదన్నారు. అంతేకాకుండా మోరగుడి, దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో తయారైన చేనేత వస్త్రాలకు ఎటువంటి పేటెంట్ లేదు. ఇక్కడ తయారు చేసిన వస్త్రాలు ధర్మవరం, కంచి పట్టుచీరలంటూ అమ్ముకుంటున్నారన్నారు. మైలవరం మండలంలో 29వేల మంది ఓటర్లు ఉన్నారు. వారికందరికి ప్రభుత్వం సంక్షేమ పథకాల కింద 200 ఇళ్లను కేటాయించింది. మండలంలో నిరుపేదలకు కనీసం రెండు వందల ఇళ్లు ఏమాత్రం సరిపోతాయని విమర్శించారు. మంత్రి ఆదినారాయణరెడ్డి కేవలం తనస్వార్థ ప్రయోజనాలు చూసుకుంటూ ప్రజల సంక్షేమాన్ని పూర్తిగా గాలికి వదిలేశారన్నారు. ఎన్నికల సమయంలో ప్రజల ఓట్లును నోటుతో కొంటానని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటువంటి వ్యక్తికి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయితే చేనేత కార్మికులకు 45 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి రూ.2000 పెన్షన్ ఇస్తారన్నారు. దానితో పాటు మైలవరం జలాశయంపై ఆధారపడి ఉన్న మత్స్యకారులను ఆదుకుంటామన్నారు. ఆదేవిధంగా చేనేత కార్మికుల సమస్యలను దారి పొడవున అడిగి తెలుసుకుంటూ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే సమస్యలను పరిష్కరిస్తామని వైఎస్సార్సీపీకి ప్రజలు అండగా నిలవాలంటూ ఆయన కోరుతూ వచ్చారు. నీరాజనాలు పలికిన ప్రజలు ప్రతిపక్షనాయకుడు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు దాటిన సందర్భంగా ఆయనకు మద్దతుగా డాక్టర్ సుధీర్‌రెడ్డి, మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్రెడ్డిల ఆధ్వర్యంలో జరిగిన పాదయాత్రకు ప్రజలు నీరాజనాలు పలికారు. దాదాపు ఐదున్నర కిలోమీటర్ల దూరం జరిగిన ఈ పాదయాత్ర మైలవరం మండల కేంద్రం నుంచి ప్రజలు నీరాజనాలు పలికారు. ఈ పాదయాత్రలో సీనియర్ నాయకుడు మాజీ జెడ్పీటీసీ అల్లె చెన్నారెడ్డి, రామాంజనేయ యాదవ్, రాష్ట్ర యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి, పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శులు జయరామకృష్ణారెడ్డి, దేవిరెడ్డి మహేశ్వరరెడ్డి, జిల్లా మైనార్టీ కార్యదర్శి మున్నా, మాబాష, ఇస్మాయిల్, దళిత నాయకుడు మంగదొడ్డి సింగరయ్య, పెద్దముడియం నాయకులు చవ్వాక్రిష్ణారెడ్డి, ప్రకాష్‌రెడ్డి, బీసీ జిల్లా కార్యదర్శి పాలూరి నరసింహులు, రామకృష్ణ, గురుమూర్తి, దొమ్మరనంద్యాల సుబ్బిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పార్టీ జెండానుఆవిష్కరించిన సుధీర్‌రెడ్డి మైలవరం : మండల కేంద్రంలో నాలుగురోడ్ల కూడలిలో వైఎస్సార్ సీపీ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి సోమవారం పార్టీ జెండాను ఆవిష్కరించారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన పాదయాత్ర 2000 కీలోమీటర్ల మైలురాయిని దాటడంతో మండలంలో పాదయాత్రను చేపట్టారు. నాలుగు రోడ్ల కూడలి నుంచి ఉదయం 9 గంటలకు ప్రారంభమైన పాదయాత్ర 5 కిలోమీటర్లు కొనసాగి దొమ్మరనంద్యాల ఉన్నత పాఠశాల వరకు చేరి పాదయాత్ర విజయవంతంగా ముగిసింది. ఈ కార్యక్రమంలో మైసూరారెడ్డి తనయుడు హర్షవర్థన్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అల్లె చిన్నచెన్నారెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్, వైఎస్సార్సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి మహేశ్వరరెడ్డి, చిన్నకొమెర్ల శివగురివిరెడ్డి, జమ్మలమడుగు పట్టణ అధ్యక్షులు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి జయరామక్రిష్ణారెడ్డి, రామక్రిష్ణ, మున్నా, ఇస్మాయిల్, ఆయా గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ముందు రాజీనామా చేయ్!
కడప సిటీ: ‘ఆ మొగోడు ముందు రాజీనామా చేసి ఎన్నికలకు రమ్మనండి.. జగన్‌యాత్రకు వచ్చింది పెళ్లిజనమో.. ఓట్ల జనమో అప్పుడు తెలుస్తుంది’ అని వైఎస్సార్సీపీ జమ్మలమడుగు సమన్వయకర్త సుధీర్‌రెడ్డి ధ్వజమెత్తారు. పెళ్లిళ్లకు, బహిరంగ సభలకు వచ్చే వారంతా ఎన్నికల్లో ఓట్లు వేయరంటూ వైఎస్ జగన్ ప్రజాసంకల్ప యాత్రను ఉద్దేశించి మంత్రి ఆదినారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన ఘాటుగా స్పందించారు. యాత్రలో భాగంగా శనివారం ఉదయం వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల శివారులో ఏర్పాటు చేసిన బస వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. రాజీనామా చేస్తే 60 వేల మెజారిటీతో గెలుస్తానని కోతలు కోయడం మాని, రాజీనామాను ఆమోదింపజేసుకోవాలని సవాల్ చేశారు. వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరడంతో ఆదినారాయణరెడ్డి ఎంత పెద్ద దొంగో జనమందరికీ అర్థమైపోయిందన్నారు. చప్పిడి మాటలు మానుకుంటే ఆదినారాయణరెడ్డికే మంచిదన్నారు. గ్రామానికి చెందిన పదిమంది కార్యకర్తల పేర్లు కూడా తెలియని వ్యక్తి నాయకుడు ఎలా అవుతారని ప్రశ్నించారు. -
రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ కుటుంబంపైనే విమర్శలు
-
రోడ్డు ప్రమాదంలో వైఎస్ఆర్సీపీ నేతకు గాయాలు
కర్నూలు: నంద్యాల సమీపంలో ఆదివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో జమ్మలమడుగు వైఎస్ఆర్సీపీ ఇంచార్జ్ సుధీర్ రెడ్డికి గాయాలయ్యాయి. ఆయన ప్రయాణిస్తున్న కారు టైర్ పంక్చర్ కావడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో ఆయనతో పాటు మరో ఐదుగురికి గాయాలయినట్లు తెలుస్తోంది. చికిత్స కోసం సుధీర్‌రెడ్డిని కర్నూలులోని ఆసుపత్రికి తరలించారు. -
ఎర్రగుంట్లలో టీడీపీ దాష్టీకం.. ఉద్రిక్తత
-
ఎర్రగుంట్లలో టీడీపీ దాష్టీకం.. ఉద్రిక్తత
వైఎస్సార్సీపీ కౌన్సిలర్‌ను ఎమ్మెల్యే ఆది తీసుకెళుతుండగా తిరగబడిన జనం ఎర్రగుంట్ల (వైఎస్సార్ జిల్లా): ఎర్రగుంట్లలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి అనుచరులు దాడిచేయడంతో పట్టణంలో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. తెలుగుదేశం కార్యకర్తల దౌర్జన్యానికి నిరసనగా వేలాదిమంది ప్రజలు స్వచ్ఛందంగా రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. సోమవారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు...వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి పార్టీ ఫిరాయించిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తన అనుచరులతో సోమవారం ఉదయం ఎర్రగుంట్లకు వచ్చి వైఎస్సార్సీపీకి చెందిన 17వ వార్డు కౌన్సిలర్ దివ్య, ఆమె తండ్రి ఎరికలరెడ్డిని వెంట తీసుకుని వెళుతుండగా దివ్యను ప్రజలు నిలదీశారు. వైఎస్సార్సీపీ తరపున నిలబడిన నీకు మేము ఓటువేసి గెలిపిస్తే ఇప్పుడు తెలుగుదేశంలోకి వెళ్లడం ఎంతవరకు సమంజసమని సుబ్బారెడ్డి అనే వ్యక్తి ప్రశ్నించాడు. పార్టీఫిరాయించేందుకు వీలులేదని ఆ వార్డు ప్రజలు అడ్డుకున్నారు. దాంతో కాస్త ఘర్షణ జరిగింది. ప్రజలు అడ్డుకోవడంతో ఆదినారాయణరెడ్డి వర్గం వెనక్కివెళ్ళిపోయింది. కాసేపటి తరువాత వచ్చిన టీడీపీ కార్యకర్తలు మమ్మల్నే ఎదురు ప్రశ్నిస్తావా అంటూ సుబ్బారెడ్డిపై దాడిచేశారు. దాంతో సుబ్బారెడ్డి ఎర్రగుంట్ల పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై, ఆయన అనుచరులపై ఫిర్యాదుచేశారు. ఇదే సందర్బంగా జమ్మలమడుగు వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త సుధీర్‌రెడ్డి పోలీస్‌స్టేషన్‌కు వెళ్ళి సుబ్బారెడ్డికి అండగా నిలిచారు. తమపై కేసు పెట్టేందుకు సుబ్బారెడ్డి పోలీస్ స్టేషన్‌కు వెళ్లాడని తెలుసుకున్న జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కోపంగా స్టేషన్‌కు వచ్చారు. అక్కడ సుధీర్‌రెడ్డికి, ఆదినారాయణరెడ్డికి మధ్య వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో పోలీస్‌స్టేషన్ వెలుపల వేలాదిమంది జనం గుమిగూడారు. దాంతో లో ఉద్రిక్తపరిస్థితి నెలకొంది. విషయం తెలిసిన కడప ఎంపీ అవినాష్‌రెడ్డి హుటాహుటినఎర్రగుంట్లకు చేరుకుని వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడిచేసిన టీడీపీ కార్యకర్తలను అరెస్టుచేయాలని పోలీస్‌స్టేషన్‌లో బైఠాయించారు. -
ముద్దనూరులో ఉద్రిక్తత
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరులో మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. చౌటుపల్లి ముంపువాసులను కలిసేందుకు బయలుదేరిన వైఎస్ఆర్సీపీ నేత డా. సుధీర్ రెడ్డిని ముద్దనూరు వద్ద పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. పరిహారం చెల్లించకుండానే ముంపు గ్రామాలను నిర్బంధంగా ఖాళీ చేయించేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని ఆరోపించారు. -
100 కుటుంబాలు వైఎస్సార్సీపీలో చేరిక
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో అదివారం గడపగడపకు వైఎస్సార్ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా సుమారు 100 కుటుంబాల వారు వార్డుకు చెందిన చీపాడు ప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు. వీరికి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టరు ఎం సుధీర్‌రెడ్డి కండవాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రభుత్వం కేవలం టీడీపీ కార్యకర్తలకు కోసమే పనిచేస్తోందన్నారు. అందుకే యువకులు పార్టీలో చేరుతున్నారని చెప్పారు. పార్టీలో చేరిన వారిలో కె. హరిక్రిష్ణ, కె. వేణుగోపాల్, ఎం వెంకటక్రిష్ణ, పవన్‌కుమార్, సాయి, మస్తాన్, మణి, వినయ్, కమల్, శివ, సుమన్‌ల తదితరులు ఉన్నారు. -
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
-
జమ్మలమడుగులో పోలీసుల ఓవరాక్షన్
వైఎస్ఆర్ జిల్లా: జమ్మలమడుగు నియోజకవర్గంలో పోలీసుల ఓవరాక్షన్ చేశారు. నేడు (గురువారం) ఏసీసీ సిమెంట్స్ కోసం ప్రజాభిప్రాయ సేకరణ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ నేత సుధీర్ రెడ్డి, మానవహక్కుల వేదిక కన్వీనర్ జయ, సీపీఐ జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్యలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలిసింది. జమ్మలమడుగు పరిసర గ్రామాల్లో భారీగా పోలీసులు మోహరించినట్టు సమాచారం. -
ఎమ్మెల్యేరాజ్..!
కొందరు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జుల హల్చల్ - కింది స్థాయి ప్రజాప్రతినిధులకు అవమానాలు, బెదిరింపులు - అధికారులతో ఘర్షణలు.. తమ ‘పని’ చేయకుంటే బదిలీ చేయిస్తామని బెదిరింపులు - ఓ కాలేజీ యజమానిని చంపుతానని బెదిరించిన నకిరేకల్ ఎమ్మెల్యే వీరేశం - మాట వినకపోతే జైలులో పెట్టిస్తా.. కాంట్రాక్టర్‌కు వేణుగోపాలాచారి హెచ్చరిక - కాంట్రాక్టర్‌ను నోటికొచ్చిన బూతులు తిట్టిన మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి - ఫ్లెక్సీలో తన ఫొటో పెట్టలేదంటూ సొంత పార్టీ కార్పొరేటర్‌పైనే ఎల్బీనగర్ ఇన్చార్జి రామ్మోహన్ వీరంగం - అధికారులపై దౌర్జన్యానికి దిగిన మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల ఎమ్మెల్యేలు - 25 మంది ఎమ్మెల్యేల కర్ర పెత్తనంపై సర్కారుకు నిఘా వర్గాల నివేదిక సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం తమదనే తెంపరితనం.. మంత్రులు తమ వాళ్లనే మిడిసిపాటు.. తామేం చేసినా చెల్లుతుందనే అహంకారంతో కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు రెచ్చిపోతున్నారు. ప్రజాప్రతినిధులమని మరిచిపోయి విచ్చలవిడిగా.. వ్యవహరిస్తున్నారు. తమ మాట వినని అధికారులు, కింది స్థాయి ప్రజా ప్రతినిధులను బెదిరిస్తున్నారు. ‘అంతుచూస్తాం.. చంపేస్తాం.. జైలుకు పంపుతా’మంటూ హింసిస్తున్నారు. కమీషన్లు ముట్టజెప్పనిదే పనులు చేయడానికి వీల్లేదంటూ కాంట్రాక్టర్లను దోచుకుంటున్నారు. అంతేకాదు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకాలకూ తమ ‘కక్కుర్తి’తో అడ్డం పడుతున్నారు. ఒకరిద్దరు కాదు ఏకంగా 25 మంది అధికార పార్టీ శాసనసభ్యులు, మరో డజను మంది వరకూ నియోజకవర్గ ఇన్చార్జులు ఇలా వ్యవహరిస్తున్నట్లుగా నిఘా వర్గాలు ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. సామంత రాజులా..?: ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జులు తమ నియోజకవర్గాల్లో సామంత రాజులుగా చలామణి అవుతున్నారు. ఎమ్మెల్యేల పనితీరును తెలుసుకునేందుకు నిఘా వర్గాలు చేసిన ప్రయత్నంతో ఈ నేతల అవినీతి, అక్రమ వ్యవహారాలెన్నో బయటపడ్డాయి. గ్రామాల్లో సర్పంచ్ అయినా, నగరాల్లో కార్పొరేటర్ అయినా వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. మండలంలో ఎమ్మార్వో, పట్టణాల్లో మున్సిపల్ కమిషనర్ ఎవరైనా సరే వారి మాటను వేదంగా పరిగణించాల్సిందే. లేదంటే బదిలీ వేటు పడుతుందని బెదిరిస్తారు. అప్పటికీ వినకపోతే అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారని ప్రచారం చేస్తారు. దాదాపు అన్ని జిల్లాల్లో ఇలాంటివి జరుగుతున్నాయి. ఇక పంచాయితీల్లో సెటిల్మెంట్లు చేయడం, పంచాయితీకి పిలిచినా రానివారిని బూతులు తిట్టడం, వాట్సప్‌లో తమకు వ్యతిరేకంగా వచ్చే పత్రికల క్లిప్పింగ్‌లు పెడుతున్నారని బెదిరించడం, చెప్పినట్లు చేయకపో తే జైలులో పెట్టిస్తానని బెదిరించడం నిత్యకృత్యంగా మారిపోయాయి. చెప్పిన పని చేయలేదని అధికారులపై చేయి చేసుకున్న మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల తీరు ఇప్పటికే వివాదాస్పదమైంది. ఓ ఎమ్మెల్యే అటవీ అధికారిపై చేయి చేసుకుంటే, మరో మహిళా ఎమ్మెల్యే స్థానిక ఎమ్మార్వోను ఇంటికి పిలిచి బూతులు తిట్టారు. ఇప్పుడు మరికొందరు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతల బెదిరింపు ఫోన్ సంభాషణలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నీ సంగతి తేలుస్తా.. చంపుతా.. కాలేజీ యజమానికి నకిరేకల్ ఎమ్మెల్యే బెదిరింపులు నకిరేకల్ నియోజకవర్గంలో ఓ కాలేజీ నిర్వాహకుడు వీరయ్యను పంచాయితీకి రావాలని అక్కడి ఎమ్మెల్యే వీరేశం హుకుం జారీ చేశారు. ఆ పంచాయితీకి బాధ్యులైన వారితో పరిష్కరించుకుంటామని వీరయ్య చెప్పాడు. దీంతో ఎమ్మెల్యే వీరేశం ఆగ్రహంతో ‘అంతు తేలుస్తా’నంటూ బెదిరించారు. మొత్తం 3 సార్లు వీరయ్యకు ఫోన్లో చేసిన బెది రింపుల సంభాషణలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ‘రమ్మంటే రావడం లేదు. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడకు వస్తా. డ్రామాలు ఆడుతున్నావారా... కొడుకా నీ సంగతి తేలు స్తా’ అంటూ హెచ్చరించారు. ‘నువ్వెక్కడున్నా వచ్చి కొడతా.. తెలుసుకో నా గురించి.. వచ్చి చంపుతా..’ అని బెది రించారు. నియోజకవర్గంలో కింది స్థాయి ప్రజాప్రతినిధులను ఈ ఎమ్మెల్యే బెదిరిస్తున్నారని, అధికారులను అవమానిస్తున్నారని ఆరోపణలున్నాయి. ‘చెప్పినట్లు వినకపోతే జైలుకు పంపుతా..’ ఓ కాంట్రాక్టర్‌ను బెదిరించిన సీనియర్ నేత వేణుగోపాలాచారి ఆదిలాబాద్ జిల్లాకు చెందిన సముద్రాల వేణుగోపాలాచారి సీనియర్ నేత. మాజీ కేంద్రమంత్రి. ప్రస్తుతం ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధిగా ఉన్న ఆయన ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో టెండర్ తీసుకుని పనులు చేస్తున్న ఓ కాంట్రాక్టర్‌ను పని ఆపేయాలని ఒత్తిడి తెచ్చారు. చెప్పినట్లు వినకపోతే లోపలకు (జైలుకు) పంపుతానంటూ బెదిరించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చెబితే పని ఆపేస్తానని కాంట్రాక్టర్ పేర్కొనడంతో.. ‘నేను చెపితే వినవా.. అంతు చూస్తా.. నేను చెపుతున్నా. ప్రభుత్వం మాది. మేము చెప్పినట్లు విను. ఇష్టం లేకపోతే కోర్టుకు పో. అంతేగానీ తమాషా చేయకు. చెప్పినట్లు వినలేదో ఇబ్బంది పడతావు’ అంటూ తీవ్రంగా హెచ్చరించారు. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు: రామ్మోహన్ ఎల్బీనగర్ నియోజకవర్గం హయత్‌నగర్ కార్పొరేటర్ తిరుమల్‌రెడ్డి తన డివిజన్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో నియోజకవర్గ ఇన్చార్జి రామ్మోహన్‌గౌడ్ ఫొటోను చిన్నగా పెట్టారట. దీంతో రామ్మోహన్ తిరుమల్‌రెడ్డికి ఫోన్ చేసి ‘ఫ్లెక్సీలో నా ఫొటో పెట్టవా’ అని దబాయించారు. ఫొటో ఉంది కదాని కార్పొరేటర్ సమాధానమిస్తే... ‘చిన్నగా పైన పెడుతవా.. నీది, జగదీశ్‌రెడ్డి (మంత్రి) ఫొటోలు పెద్దగా పెట్టుకుని నన్ను అవమానిస్తావా.. ఇదిగో చెబుతున్నా.. నీకు జగదీశ్‌రెడ్డి ఉండొచ్చు. నా వెంట సీఎం ఉన్నడు. ఏం ఎమ్మెల్యే అయితనని చెప్పుకుంటున్నవంట. హుషారీ చేస్తే పరేషాన్ అయితవు. నువ్వు కార్పొరేటర్ టికెట్ కొనుకున్నవని నాకు తెలుసు. ఈ సంగతి మీడియాను పిలిచి చెబుతా..’ అని బెదిరించారు. ‘కొడుకా నీ సంగతి చెపుతా..’ కాంట్రాక్టర్‌పై మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి వీరంగం మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి అసైన్డ్ భూములపై కన్నేశారంటూ ఓ పత్రికలో వచ్చిన కథనాన్ని స్థానికంగా ఉండే కాంట్రాక్టర్ ప్రసాద్‌గౌడ్ వాట్సప్ గ్రూపులో పెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సదరు కాంట్రాక్టర్‌కు ఫోన్ చేసి బెదిరించారు. ‘ఎవడో పేపరోడు రాస్తే దానిని వాట్సప్‌లో పెడతవా.. ఎవరి ఏరియా అనుకుంటున్నావు. నా కొడుకా... ఎట్లా పెట్టినవురా, నీ సంగతి చెప్తా, ఫిర్యాదు చేసి లోపల (జైల్లో) వేయిస్తా..’ అంటూ బూతు పురాణం అందుకున్నారు. పత్రికల్లో వచ్చిన వార్తలు వాట్సప్ గ్రూపుల్లో పెట్టడం ఇటీవల సాధారణమైపోయింది. అది నేరంకూడా కాదు. కానీ మేడ్చల్ ఎమ్మెల్యే ఇదేమీ పట్టించుకోకుండా ‘నా ఏరియాలో ఉంటూ ఇలా చేస్తావా..’ అంటూ ఆవేశంతో ఊగిపోయారు. మిషన్ కాకతీయకూ ఆటంకాలు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ పనులకూ పలువురు ఎమ్మెల్యేలు అడుగడుగునా అడ్డుపడుతున్నారు. అంచనా కంటే 20 శాతానికిపైగా లెస్‌కు టెండర్లు తీసుకున్న కాంట్రాక్టర్లు సైతం స్థానిక ఎమ్మెల్యేకు సొమ్ము ముట్టజెపితే తప్ప పని మొదలుపెట్టలేరు. ఇటీవలే రాష్ట్రస్థాయి అధికారిక పదవి చేపట్టిన నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యే ఒకాయన దెబ్బకు కాంట్రాక్టర్లు పారిపోతున్నారు. పనిచేయకపోయినా ఫర్వాలేదుగానీ ఆ ఎమ్మెల్యే బెదిరింపులు భరించలేమంటూ చాలా మంది పనులే ప్రారంభించలేదు. నల్లగొండ జిల్లాలో రెండు నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి. మహబూబ్‌నగర్ జిల్లాలో మిషన్ కాకతీయ టెండర్లో పాల్గొనడం కోసం కూడా అక్కడి ఓ ఎమ్మెల్యేకు ముడుపులు సమర్పించుకోవాలి. ఇలా అన్ని జిల్లాల్లో కొందరు ఎమ్మెల్యేలు, ఇన్చార్జులు విచ్చలవిడిగా వసూళ్లకు పాల్పడుతున్నారు. -
వైఎస్ జగన్‌కు అండగా ఉంటాం: సుధీర్‌రెడ్డి
- మైసూరా సోదరుడి కుమారుడు సుధీర్‌రెడ్డి యర్రగుంట్ల (కడప): వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి అండగా ఉంటామని జమ్మలమడుగు పార్టీ ఇన్చార్జి సుధీర్ రెడ్డి తెలిపారు. వైఎస్ఆర్ సీపీకి మైసూరారెడ్డి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన బుధవారం రాత్రి ఆయన సోదరుడు కుమారుడు సుధీర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ఈ సంద్భరంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. తమ కుటుంబం వైఎస్ఆర్ సీపీకి, వైఎస్ జగన్‌కు ఎల్లవేళలా అండగా ఉంటామన్నారు. తన పెదనాన్న మైసూరారెడ్డి పార్టీకి రాజీనామా చేయడం దురదృష్టకరమన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల ఆయన రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సుధీర్ రెడ్డి తెలిపారు. పెదనాన్నతో ఇప్పటికీ నాలుగు సార్లు మాట్లాడానని, త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని సుధీర్‌రెడ్డి చెప్పారు. వైఎస్ జగన్ ...మైసూరారెడ్డికి మర్యాద ఇవ్వకపోవడం అనేది అవాస్తవమని అన్నారు. తమ కుటుంబం అంతా చివరి వరకు వైఎస్ జగన్ వెంటే నడుస్తామని చెప్పారు. వైఎస్ జగన్ చేసే ప్రజా పోరాటాలు తమకు బాగా నచ్చాయని తెలిపారు. ఎన్ని కష్టాలు వచ్చినా జగన్ నాయకత్వం వీడేది లేదని స్పష్టం చేశారు. ఇప్పటికీ మైసూరా రెడ్డి వైఎస్ఆర్ సీపీలోనే కొనసాగాలని కోరుకుంటున్నామని సుధీర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. -
కుళాయిల నుంచి మురికి నీరు: ప్రజల ఆగ్రహం
ఎర్రగుంట్ల: తాగునీటి కుళాయిల నుంచి పురుగులతో కూడిన మురికి నీరు వస్తుండడంపై వైఎస్సార్ జిల్లా ఎర్రగుంట్ల పట్టణంలోని 14వ వార్డు ప్రజలు శుక్రవారం ఆందోళనకు దిగారు. పన్నులు భారీగా వసూలు చేస్తూ మురికి నీరు సరఫరా చేస్తుండడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికుల ఆందోళన విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నాయకుడు సుధీర్‌రెడ్డి ఎర్రగుంట్ల చేరుకుని మున్సిపల్ అధికారులతో మాట్లాడాడు. తాత్కాలికంగా సొంత నిధులతో 14వ వార్డు ప్రజలకు మినరల్ వాటర్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకున్నారు. -
'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు'
-
'టీఆర్ఎస్ ప్రెషర్ కుక్కర్..ఎప్పుడైనా పేలొచ్చు'
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ పై కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మండిపడ్డారు. మంత్రి కేటీఆర్ ప్రాధాన్యతను చూసి మరో మంత్రి హరీష్ రావు ఆందోళనకు గురవుతున్నారని సుధీర్ రెడ్డి ఆరోపించారు. పార్టీలో తన ఉనికి కాపాడుకునేందుకు హరీష్ రావు అదే పనిగా కాంగ్రెస్ పార్టీ పై విమర్శలు చేస్తున్నారన్నారు. అధికార టీఆర్ఎస్ పార్టీలో విభేదాలు ప్రెషర్ కుక్కర్ మాదిరిగా ఉడుకుతున్నాయని, అవి ఎప్పుడైనా పేలొచ్చని ఏద్దేవా చేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 45 డివిజన్లను గెలుచుకుంటుందని సుధీర్ రెడ్డి తెలిపారు. -
నిత్యావసర ధరల పెరుగుదలపై కాంగ్రెస్ ధర్నా
హైదరాబాద్: నిత్యావసర వస్తువుల ధరల పెరుగుదలపై ఖైరతాబాద్‌లో బుధవారం పౌరసరఫరాల భవన్ వద్ద కాంగ్రెస్ ధర్నాకు దిగింది. ధర్నాలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉల్లి సహా నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్నా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ నేత సుధీర్ రెడ్డి మండిపడ్డారు. సామాన్యులకు నిత్యావసర ధరలు అందుబాటులో లేవని అన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గించుకునేందుకు తెలంగాణ సర్కార్ చర్యలు చేపట్టాలని సుధీర్ రెడ్డి డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్సీపీ నేతది హత్యే..!
* విషమిచ్చి చనిపోయేలా చేశారు * సుధీర్‌రెడ్డి పోస్టుమార్టం నివేదికలో వెల్లడి * దోషులను తేల్చాల్సింది పోలీసులే... సాక్షి ప్రతినిధి, వరంగల్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వరంగల్ జిల్లా నేత భీంరెడ్డి సుధీర్‌రెడ్డి మృతిపై నెలకొన్న అనుమానాలు వీడాయి. రోడ్డు ప్రమాదానికి ముందు సుధీర్‌రెడ్డి తీసుకున్న ఆహారంలో విషపూరిత పదార్థాలు ఉన్నట్లుగా ఫోరెన్సిక్ నివేదిక స్పష్టం చేసింది. సుధీర్‌రెడ్డికి ఆస్తులు ఉండడంతో పాటు రాజకీయంగా శత్రువులు ఉండడంతో పక్కా ప్రణాళికతో కొందరు ఈ పని చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుధీర్‌రెడ్డికి దగ్గరగా ఉండే వ్యక్తుల సహకారంతోనే ఆయన శత్రువులు ఈ పని చేసినట్లుగా తెలుస్తోంది. సుధీర్‌రెడ్డి మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను పరీక్షించిన ఫోరెన్సిక్ సైన్స్ లేబోరేటరీస్ నివేదిక ఆయన రోడ్డు ప్రమాదంలో మరణించలేదని స్పష్టం చేసింది. ఆర్గనోఫాస్ఫేట్ అనే పురుగుమందుల ఆనవాళ్లు సుధీర్‌రెడ్డి శరీంలో ఉన్నట్లు ఫోరెన్సిక్ పరీక్షలో తేలింది. మృతదేహం నుంచి సేకరించిన నాలుగు నమూనాలను పరీక్షించగా... మూడింటిలోనూ ఆర్గనోఫాస్ఫేట్ ఆనవాళ్లు ఉన్నటు ఫోరెన్సిక్ నివేదిక పేర్కొంది. ఫోరెన్సిక్‌కు సంబంధించిన నివేదికను సోమవారం వెల్లడించింది. ఈ నివేదిక ప్రతిని కాజీపేట డీఎస్పీకి, పోస్టుమార్టం చేసిన వైద్యుడికి పంపింది. విషం కారణంగా సుధీర్‌రెడ్డి శరీరం నిస్సత్తువకు గురైందని... అదే సమయంలో ప్రయాణంలో ఉండడంతో ప్రమాదం జరిగినట్లు స్పష్టమవుతోంది. సుధీర్‌రెడ్డికి ఉన్న శత్రువులు ఎవరనే కోణంలో పోలీసులు విచారణ జరిపితేనే దోషులు ఎవరనేది తేలనుంది. మొదట రోడ్డు ప్రమాదం కారణంగానే సుధీర్‌రెడ్డి మృతి చెందినట్లుగా పోలీసులు భావించారు. తాజాగా ఫోరెన్సిక్ నివేదికతో ఇప్పుడు దోషులను గుర్తించాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. వైఎస్సార్ కాంగ్రెస్ యువజన విభాగం వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న భీంరెడ్డి సుధీర్‌రెడ్డి 2014 డిసెంబర్ 23న రోడ్డు ప్రమాదంలో చనిపోయారు. మడికొండ పరిధిలోని తరాలపల్లి వద్ద ఈ ప్రమాదం జరిగింది. సుధీర్‌రెడ్డి ఆ రోజు ఉదయం మల్లక్కపల్లిలో క్వారీ పనులను చూసేందుకు ద్విచక్ర వాహనంపై వెళ్లారు. పనులు ముగించుకుని హన్మకొండ వైపు వస్తుండగా ప్రమాదం జరిగింది. తలకు బలమైన గాయం కావడంతో సుధీర్‌రెడ్డి అక్కడిక్కడే మృతిచెందారు. రోడ్డు ప్రమాదమే మృతికి కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రోడ్డు ప్రమాదమే అయినా సుధీర్‌రెడ్డి మృతిపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. తాజాగా ఫోరెన్సిక్ నివేదిక ఇదే విషయాన్ని స్పష్టం చేసింది. -
భూముల వివరాలు ఇప్పించండి
సభా సంఘం చైర్మన్‌ను కోరిన సభ్యులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ భూముల లెక్క తేల్చేందుకు తమకు రెండు వారాల్లో వివరాలు అందించాలని ప్రభుత్వ భూముల కబ్జాలపై ఏర్పాటైన అసెంబ్లీ సభాసంఘం (హౌస్ కమిటీ) సభ్యులు కమిటీ చైర్మన్‌ను కోరారు. సంఘం చైర్మన్ సుధీర్‌రెడ్డి అధ్యక్షతన అసెంబ్లీ సమావేశ మందిరంలో బుధవారం కమిటీ సమావేశం జరిగింది. గత ఏడాది నవంబర్‌లో జరిగిన బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వ భూముల అన్యాక్రాంతంపై పలువురు సభ్యులు ప్రశ్నించిన నేపథ్యంలో ప్రభుత్వం ఈ కమిటీని నియమించింది. భూదాన్ భూములు, ఎస్సీ, ఎస్టీలకు అసైన్ చేసిన భూములు, ఇనాం భూములు, సీలింగ్ భూములు, దేవాదాయ భూములతో పాటు అప్పటి ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో జరిగిన అక్రమాలు, అక్రమ విక్రయాలు, కబ్జాల పాలైన భూముల నిగ్గు తేలాల్సి ఉంది. అయితే, తమ వద్ద ప్రాథమిక సమాచారం కూడా లేకుండా సమావేశంలో ఏం మాట్లాడలేమని కొందరు సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. కనీసం రెండు వారాల్లోగా తమకు ఆయా భూముల వివరాలు అందించి, మరో వారం రోజులు ఆ వివరాలు చదివేందుకు గడువు ఇవ్వాలని, ఆతర్వాతే మరో సమావేశం పెట్టాలని వీరు చైర్మన్ దృష్టికి తీసుకువెళ్లారు. అన్ని రకాల భూముల మొత్తం విస్తీర్ణం ఎంతన్న వివరాలను సర్వే నెంబర్లతో సహా జిల్లాల వారీగా తమకు అందించాలని వీరు కోరారు. ఏపీఐఐసీకి కేటాయించిన భూముల విషయంలో అనుకున్న లక్ష్యం నెరవే రిందా? అర్హులకే భూములు అందాయా, అవి వారి నుంచి ఇతరులకు బదిలీ అయ్యాయా అన్న వివరాలను సభ్యులు సేకరించనున్నారు. ప్రభుత్వం భూదాన్ యజ్ఞ బోర్డును రద్దు చేయడం, ఆ తర్వాత హైకోర్టు బోర్డుకే అనుకూలంగా తీర్పు ఇచ్చినందున, అసలు భూదాన్ భూముల వ్యవహారం ప్రభుత్వం పరిధిలో ఉందా లేదా అని సభ్యులు ప్రశ్నించినట్లు సమాచారం. , ఏపీఐఐసీ భూములతో పాటు, ఎస్సీ, ఎస్టీ అసైన్డు భూములను తీసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య భూముల వ్యవహారం కూడా కమిటీ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. -
వీఐపీ రిపోర్టర్ : మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి
-
ది ఎండ్ మూవీ స్టిల్స్
-
‘ది ఎండ్ ’ టైలర్ లాంచ్
-
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల బాహాబాహీ
హైదరాబాద్ : మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. నాగోల్ గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ గౌడ్ మధ్య పూలమాల వేసి విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
దండయాత్ర
ఎర్రగుంట్ల: ప్రభుత్వమేమో డ్వాక్రా రుణాలు రద్దు చేస్తున్నామని ప్రకటించింది. దీనిపై పూర్తి మార్గదర్శకాలు ఇంకా విడుదల చేయలేదు. అధికారులేమో తాళిబొట్లు తాకట్టు పెట్టయినా సరే బ్యాంకులకు రుణాలు చెల్లించాల్సిందేనని ఒత్తిడి చేస్తున్నారు. మమ్మల్ని ఇలా వేధిస్తే ఎలా అంటూ నిడుజివ్వి గ్రామానికి చెందిన వందలాది డ్వాక్రా మహిళలు గురువారం ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకును ముట్టడించి, ధర్నా చేపట్టారు. వైఎస్సార్సీపీ నాయకుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి వీరికి అండగా నిలిచారు. వివరాల్లోకెళితే.. నిడుజివ్వి గ్రామంలో 26 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాలకు మండల సమాఖ్య సీసీగా గురివిరెడ్డి, యానిమేటర్‌గా పద్మ కొనసాగుతున్నారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు డ్వాక్రా రుణలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో మహిళలు గత నాలుగా నెలలుగా పొదుపు సంఘాలకు చెందిన రుణాలు చెల్లించలేదు. అయితే సీసీ గురివిరెడ్డి బుధవారం రాత్రి గ్రామానికి వచ్చి బ్యాంకు రుణాలు కచ్చితంగా చెల్లించాలని, ఈ నెల 31లోగా చెల్లిస్తేనే వడ్డీ మాఫీ అవుతుందని ఒత్తిడి చేసినట్టు మహిళలు తెలిపారు. లేక పోతే బ్యాంకు నుంచి నోటీసులు వస్తాయని హెచ్చరించారు. ఈ విషయాన్ని వారు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు, ఎంపీపీ కుమారుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే ఆయన 26 గ్రూపులకు చెందిన మహిళలతో కలిసి చిలంకూరులోని ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్దకు చేరుకుని ధర్నా చేపట్టారు. టీడీపీ ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించిందని. మీరెందుకు మహిళలను ఒత్తిడి చేస్తున్నారని బ్యాంకు ఇన్చార్జి మేనేజర్ రామన్నను సుధీర్‌రెడ్డి ప్రశ్నించారు. తాము రుణాలు కట్టమని మహిళలను ఒత్తిడి చేయలేదని వారు కట్టకుంటే వడ్డీలు పెరుగుతాయని బ్యాంకు మేనేజర్ అన్నారు. బ్యాంకు నుంచి తీసుకున్న రుణాలు ప్రభుత్వంతో సంబంధం లేకుండా నిదానంగా కట్టుకోవాలని మహిళలకు ఆయన సూచించారు. నగలు కుదువ పెట్టి డబ్బులు చెల్లించమని సీసీ ఒత్తిడి మండల సమాఖ్య సీసీ గురివిరెడ్డి మాత్రం ఈనెల 31లోగా కచ్చితంగా రుణాలు కట్టాలని ఒత్తిడి చే స్తున్నారని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రుణాలు తీసుకునే సమయంలో, పాసుబుక్‌లు రాసేటప్పుడు యానిమేటర్ డబ్బులు తీసుకుంటుందని మహిళలు ఆరోపించారు. వెలుగు సంఘంలోని అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని మహిళలు వాపోయారు. రుణాలు కట్టకుంటే ఊరివేసుకోండని చెబుతున్నారని మహిళలు కన్నీళ్లు పెట్టుకున్నారు. తాళిబొట్లు, ఒంటి మీద ఉన్న బంగారు ఆభరణాలు కుదవ పెట్టి రుణాలు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని వారు ఆవేదనతో చెప్పారు. నే ను డబ్బులు తీసుకోలేదు.. పాసుబుక్‌లు రాసేటప్పుడు, రుణాలు ఇప్పించే సమయంలో గ్రూపు సభ్యులు ఇస్తేనే డబ్బులు తీసుకుంటాను. ఒత్తిడి చే యలేదు. - పద్మ (యానిమేటర్, నిడుజివ్వి) రుణాలు కట్టమని తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం రుణ మాఫీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తోంది. ఈ సమయంలో వెలుగు సంఘం వారు, బ్యాంకు అధికారులు రుణాలు కట్టమని ఒత్తిడి చేస్తున్నారు. కుటుంబాలు గడవక ఇబ్బందులు పడుతున్న సమయంలో వీరి ఒత్తిడితో అల్లాడుతున్నాం. - ఫాతిమా (గండిఆంజనేయ గ్రూపు, నిడుజివ్వి) మాట మార్చిన ప్రభుత్వం డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వస్తూనే మాట మార్చారు. అయినా ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అటు బ్యాంకర్లు, ఇటు వెలుగు సంఘం వారు తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడి ఉండాలి. - హుస్సేన్‌బీ, వెంకటలక్షుమ్మ, నిడుజివ్వి) తాళిబొట్లు కుదువ పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం మాట మార్చడంతో బంగారు ఆభరణాలతో పాటు తాళిబొట్లు కుదవ పెట్టి రుణాలు చెల్సించాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకుని ఆదుకోవాలి. -నాగసుబ్బమ్మ(నారాయణ స్వామి గ్రూపు) -
టీఆర్ఎస్లో చేరటం లేదు, అవన్ని పుకార్లే
హైదరాదాబాద్ : టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న కథనాలను మాజీ మంత్రి దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఖండించారు. తాము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామని వారు స్పష్టం చేశారు. టీఆర్ఎస్లో చేరుతున్నట్లు వస్తున్న కథనాలు అవాస్తవాలని కొట్టిపారేశారు. కష్టకాలంలో పార్టీకి అండగా ఉంటామని, చచ్చినా, బతికినా కాంగ్రెస్ పార్టీలోనే ఉంటామన్నారు. 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకు వచ్చేందుకు కృషి చేస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. వలసలను ప్రోత్సహించటం మంచిది కాదని వారు అభిప్రాయపడ్డారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే తమ ముందున్న బాధ్యత అని దానం, సుధీర్ రెడ్డి అన్నారు. ఇస్కాన్ దేవాలయం భూముల వ్యవహారంపై టీఆర్ఎస్ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలుస్తామని దానం, సుధీర్ రెడ్డి తెలిపారు. కాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్సీలు టీఆర్ఎస్లో చేరిన విషయం తెలిసిందే.