మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
హైదరాబాద్ : మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. నాగోల్ గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ గౌడ్ మధ్య పూలమాల వేసి విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.