gandhi statue
-
పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవం
సాక్షి, హైదరాబాద్: మూసీ పునరుజ్జీవంపై ప్రతిపక్ష పార్టీలు రాద్దాంతం చేస్తూ లేనిపోని ప్రచారాలతో ప్రజల మనసులను కలుíÙతం చేస్తున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పైసా ఖర్చు లేకుండా మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. మంగళవారం మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ ప్రాజెక్టు గురించి ముఖ్యమంత్రి మాట్లాడారు. ‘గత ప్రభుత్వం తరహాలో కాకుండా మేం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరిస్తాం. ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా వేయిసార్లు ఆలోచిస్తా. అలా ఆలోచించే మూసీ పునరుజ్జీవంపై నిర్ణయం తీసుకున్నా.ఇక ముందడుగే. వెనుకడుగు వేసేది లేదు. పైసా ఖర్చు లేకుండా ప్రైవేటు భాగస్వామ్యంతో పనిచేస్తాం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఐదు సంస్థల కన్సారి్టయంకు మూసీ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ బాధ్యతలు అప్పగించాం. రివర్ బెడ్ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుందనే కోణంలో, అన్ని సాధ్యాసాధ్యాలకు సంబంధించిన అంశాలతో 18 నెలల్లో ఈ డీపీఆర్ వస్తుంది. ప్రభుత్వ, పీపీటీ, హైబ్రిడ్.. ఈ మూడు పద్ధతుల్లో వస్తుంది. దీని ఆధారంగా ప్రపంచంలోనే మేలైన మోడల్‌ను ఎంచుకుని మూసీ పునరుజ్జీవ పనులకు శ్రీకారం చుడతాం..’ అని సీఎం తెలిపారు. తొలిదశలో 21 కిలోమీటర్లు ‘తొలిదశలో బాపూఘాట్ వరకు మూసీ పునరుజ్జీవం చేపడతాం. జంట జలాశయాల నుంచి బాపూ ఘాట్ త్రివేణి సంగమం వరకు ఈ పనులు మొదలు పెడతాం. మల్లన్నసాగర్ నుంచి గండిపేట, హిమాయత్‌సాగర్‌కు గోదావరి జలాలు తరలిస్తాం. ఆలోపు వంద శాతం నీటిని శుద్ధి చేస్తాం. అక్కడికి 21 కిలోమీటర్ల మేర పునరుజ్జీవం పూర్తవుతుంది. నవంబర్ తొలివారంలో మల్లన్నసాగర్ నుంచి జంట జలాశయాలకు నీటి తరలింపు ట్రంక్ లైన్ పనులకు టెండర్లను పిలుస్తాం.బాపూఘాట్ దగ్గర బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మిస్తాం. అతిపెద్ద బాపూ విగ్రహం ఏర్పాటు చేస్తాం. లండన్ ఐ (అతిపెద్ద జెయింట్ వీల్) ఏర్పాటు చేస్తాం. అక్కడి నుంచి నగరమంతా వీక్షించేలా సియోల్ టవర్ తరహాలో పెద్ద టవర్ నిర్మిస్తాం. మూసీ వెంట అంతర్జాతీయ వర్సిటీ, గాంధీ ఐడియాలజీ..రీ క్రియేషన్ సెంటర్, నేచర్ క్యూర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం..’ అని రేవంత్ చెప్పారు. ప్రజలనే అడుగుదాం రండి ఈ ప్రాజెక్టుపై అనుమానాలున్నా, ప్రతిపక్షాలకు ఏదైనా ఆలోచన ఉన్నా నాకందజేయాలి. ఒకవేళ కేటీఆర్, హరీశ్, ఈటల లాంటి నేతలకు నా దగ్గరకు రావడం మొహమాటం అనిపిస్తే సీఎస్‌ను లేదంటే మంత్రులను కలిసి ఇవ్వొచ్చు. మూసీని నగర జీవనాడిగా మార్చేందుకు కలిసి రండి. వాడపల్లి నుంచి వికారాబాద్ వరకు పాదయాత్ర చేస్తా. కేటీఆర్, ఈటల, హరీశ్ కూడా నాతో కలిసి రావాలి. మూసీని అభివృద్ధి చేయాలో లేదో ప్రజలను అడుగుదాం. రూ.లక్షన్నర కోట్ల ఖర్చు కేవలం మూసీకే కాదు.. విశ్వనగర అభివృద్ధి కోసం. ట్రిపుల్ ఆర్, మెట్రో, గోదావరి జలాల తరలింపు, ఎస్టీపీల నిర్మాణం, రేడియల్ రోడ్ల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తాం..’ అని ముఖ్యమంత్రి చెప్పారు. -
అట్లాంటాలోని గాంధీ విగ్రహానికి తెలంగాణ ఐటీ మంత్రి నివాళులు
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి డి శ్రీధర్‌బాబు అట్లాంటాలోని మహాత్మాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. గాంధీ ఫౌండేషన్ ఆఫ్ యూఎస్ఏ (ఎఊ్ఖ అ) ఆహ్వానం మేరకు అట్లాంటా వెళ్లిన ఆయన డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్ సెంటర్లోని గాంధీ కాంస్య విగ్రహానికి పూలమాల వేశారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ హాల్, గాంధీ రూమ్, కింగ్ రూమ్, ఎటర్నల్ ఫ్లేమ్, ప్రసిద్ధ ఎబినేజర్ బాప్టిస్ట్ చర్చి, కింగ్స్ బర్త్ హోమ్, విజిటర్స్ సెంటర్, కింగ్ క్రిప్ట్‌లను సందర్శించారు.అట్లాంటాలో గాంధీ విగ్రహ ఏర్పాటుకు సాకారం చేసినందుకు ఇండియన్ ఎంబసీ, ఇండియా కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్, వివిధ కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్‌తో పాటు నేషనల్ పార్క్ సర్వీస్‌కు శ్రీధర్ బాబు ధన్యవాదాలు తెలిపారు. ఈ స్మారక చిహ్నం ఏటా కింగ్ పార్క్‌ను సందర్శించే లక్షలాది మంది పర్యాటకులకు అహింస, శాంతి కోసం పోరాడాలనే విషయం గుర్తుకుతెస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ జర్నలిస్ట్, జీఎఫ్‌యూఎస్‌ఏ మీడియా డైరెక్టర్ రవి పోణంగి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆంటోనీ థాలియాత్, ఛైర్మన్ సుభాష్ రజ్దాన్ తదితరులు పాల్గొన్నారు. అమెరికాలోని గాంధీ ఫౌండేషన్‌ను 1997 అక్టోబర్ 26న స్థాపించారు. -
హిండెన్‌బర్గ్ నివేదికపై నోరు విప్పాలి
సాక్షి, న్యూఢిల్లీ: అదానీ అంశంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ చేత విచారించాలన్న డిమాండ్‌తో ఆప్, శివసేనతో కలసి బీఆర్ఎస్ పార్టీ బుధవారం సైతం తమ నిరసనను కొనసాగించింది. సభా కార్యక్రమాల ప్రారంభానికి ముందు బీఆర్ఎస్ సభాపక్ష నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్‌రావులతో కలసి మిగతా ఎంపీలు గాంధీ విగ్రహం వద్ద నిరసనకు దిగారు. హిండెన్‌బర్గ్ నివేదికపై ప్రధాని నరేంద్ర మోదీ నోరు విప్పాలని నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అదానీ షేర్ల పతనంతో ప్రజల పొదుపు సొమ్ము ప్రమాదంలో పడిందన్నారు. ఎల్ఐసీ, ప్రభుత్వ రంగ బ్యాంకులపై పడే ప్రభావంపై కేంద్రం సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా ఎంపీలు డిమాండ్ చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే కేంద్రం దీనిపై దాటవేత ధోరణి అవలంబిస్తోందని ఆరోపించారు. అనంతరం ఎంపీలు నామా, కేకేలు ఉభయసభల్లో ఇదే అంశంపై వాయిదా తీర్మానాలు ఇచ్చినా వాటిని సభాధ్యక్షుడు తిరస్కరించారు. దీంతో ఉభయ సభల నుంచి ఎంపీలు వాకౌట్ చేశారు. కాగా, రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానం ఇచ్చేందుకు ప్రధాని మోదీ సిద్ధమవుతుండగా సభలో ఉన్న ఎంపీ నామా అదానీ అంశాన్ని లేవనెత్తారు. అదానీ అంశంపై జేపీసీ వేయాలని పట్టుబట్టారు. దీంతో స్పీకర్ ఓం బిర్లా కలి్పంచుకుని ‘మీరు ఇదివరకే వాకౌట్ చేశారు కదా?’అని ప్రశ్నించగా...మోదీ సమక్షంలో మరోమారు తమ డిమాండ్ వినిపించేందుకే ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెబుతూ వాకౌట్ చేశారు. -
గాంధీ ఆసుపత్రిలో గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం కేసీఆర్
-
అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: గాంధీ జయంతిని (అక్టోబర్ 2) పురస్కరించుకొని సీఎం కేసీఆర్ మహత్ముడి విగ్రహాన్ని ఆవిష్కరించారు. గాంధీ ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన 16 ఫీట్ల గాంధీజీ విగ్రాహాన్ని ఆదివారం ఆవిష్కరించారు. అంతకుముందు గాంధీ జయంతి సందర్భంగా సికింద్రాబాద్ ఎంజీరోడ్‌లో గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. విగ్రహావిష్కరణ అనంతరం.. ఆసుపత్రి వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో కేసీఆర్ ప్రసంగిస్తూ.. కరోనా సమయంలో గాంధీ ఆసుపత్రి వైద్యులు విశేష సేవలు అందించారని గుర్తు చేశారు. గాంధీ వైద్యులు కరోనాపై యుద్ధం చేశారన్నారు. మంచి జరిగితే తప్పక ప్రశంసలు వస్తాయన్నారు. ‘మహాత్ముడి సిద్ధాంతం విశ్వజనీనం. మహాత్ముడు జన్మించిన దేశంలో మనం పుట్టడం ఎంతో పుణ్యం. ఆనాడు యావత్తు భారతాన్ని నడిపించిన సేనాని మహాత్మా గాంధీ. గాంధీ ఏ కార్యక్రమం చేసినా అద్భుతమే, గొప్ప సందేశమే. గాంధీ ప్రతి మాట, పలుకు ఆచరణాత్మకం. పట్టణ, పల్లె ప్రగతికి ప్రేరణ గాంధీయే. గాంధీ మార్గంలోనే తెలంగాణ సాధించుకున్నాం. ఈ మధ్య వేదాంత ధోరణిలో నా మాటలు ఉన్నాయని చాలా మంది అంటున్నారు. ప్రపంచంలో శాంతి ఉంటేనే మనమంతా సుఖంగా ఉంటాం. ఎన్ని ఆస్తులు ఉన్నా శాంతి లేకపోతే, జీవితం ఆటవికమే. ఈ మధ్య మహాత్ముడినే కించపరిచే మాటలు మనం వింటున్నాం. ఆయనను కించపరిచే మాటలు విన్నప్పుడు చాలా బాధ కలుగుతుంది. అలాంటి వాళ్ల వల్ల మహాత్ముడి ఔన్నత్యం ఏమాత్రం తగ్గదు’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో గాంధీ వర్ధంతి
సాక్షి, హైదరాబాద్: మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసన మండలి ప్రొటెమ్ చైర్మన్ అమీనుల్ హసన్ జాఫ్రీ శాసనసభ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో శాసనసభ వ్యవహారాల శాఖమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలిలో ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్‌రావు, అసెంబ్లీ కార్యదర్శి వి.నరసింహా చార్యులు పాల్గొన్నారు. -
గాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మహాత్మాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగుతోందని, ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మనమందరం పునరంకితం కావాలని అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మండలి ప్రొటెం చైర్మన్ భూపాల్‌రెడ్డి, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎంపీ సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు కల్వకుంట్ల కవిత, వీజీ గౌడ్, తేరా చిన్నపరెడ్డి, కుర్మయ్యగారి నవీన్‌కుమార్, దయానంద్, శాసనసభ కార్యదర్శి వి.నరసింహాచార్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ మహాత్మాగాంధీ అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం తెచ్చారని గుర్తు చేశారు. గాంధీ ఆశయాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని, గత ఏడేళ్ళలో రాష్ట్రం పరిపాలన పరంగా దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు. -
పార్లమెంట్లో రైతు గర్జన
సాక్షి, న్యూఢిల్లీ: వ్యవసాయ చట్టాల ఉపసంహరణ డిమాండ్‌తో సుదీర్ఘకాలంగా రైతులు చేస్తున్న ఆందోళన గురువారం పార్లమెంట్లో ప్రతిబింబించింది. రైతుల డిమాండ్లను ప్రస్తావిస్తూ విపక్షాలు ఆందోళన నిర్వహించాయి. తొలుత పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేపట్టాయి. తర్వాత ఉభయ సభలు సమావేశమయ్యాక వెల్‌లోకి దూసుకెళ్లి విపక్ష సభ్యులు సభాకార్యకలాపాలను స్తంభింపజేశారు. రైతులు డిమాండ్లు నెరవేర్చాలని, నల్ల చట్టాలు రద్దు చేయాలని నినదించారు. రైతుల ఉద్యమం, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ వ్యవహారంపై లోక్‌సభలో కాంగ్రెస్ తదితర విపక్షాలు వాయిదా తీర్మానానికి నోటీసులు ఇవ్వగా, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పక్ష నేత మిథున్‌రెడ్డి పోలవరం అంశంపై సావధాన తీర్మానం కోసం నోటీసులు ఇచ్చారు. ఇక రాజ్యసభలో విపక్షాలు రైతు ఆందోళన, పెగసస్ ఫోన్ల హ్యాకింగ్ అంశాలపై చర్చకు నోటీసులిచ్చారు. లోక్‌సభ సభాపతి ఓం బిర్లా, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య ఆయా నోటీసులను తిరస్కరించారు. వాయిదాల పర్వం.. గురువారం ఉదయం లోక్‌సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ తదితర పార్టీల ఎంపీలు ఆందోళన ప్రారంభించారు. ప్రశ్నోత్తరాల సమయంలో సభా కార్యక్రమాలు కొద్దిసేపు కొనసాగినా తర్వాత పదేపదే సభ వాయిదాపడింది. తొలుత 12 గంటల వరకు, తర్వాత మధ్యాహ్నం రెండు గంటల వరకు, ఆ తర్వాత నాలుగు గంటలకు వాయిదాపడింది. నాలుగింటికి సభ మొదలైనా నిరసనలు ఆగకపోవడంతో సభను శుక్రవారానికి వాయిదావేశారు. అటు రాజ్యసభలో ఇదే గందరగోళం నెలకొంది. ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగానే కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు ఆందోళన చేపట్టాయి. పోడియం చుట్టుముట్టి ప్లకార్డులు ప్రదర్శిస్తూ విపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ ఆందోళన మధ్య చైర్మన్ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తర్వాత సభ ప్రారంభమైనప్పటికీ ప్రతిపక్షాల ఆందోళన కొనసాగింది. దీంతో కొద్దిసేపటికే 2 గంటలకు వాయిదాపడింది. తర్వాత మొదలైనా గందరగోళం నెలకొనడంతో శుక్రవారానికి వాయిదా వేశారు. గాంధీ విగ్రహం వద్ద ఆందోళన నూతన వ్యసాయ చట్టాలకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో గురువారం ఉదయం ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి. కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్, సీపీఎం, సీపీఐ, ఆర్జేడీ, డీఎంకే తదితర పార్టీలు వేర్వేరుగా ఆందోళన చేపట్టాయి. తొలుత కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, లోక్‌సభ పక్షనేత అధిర్ రంజన్, శశి థరూర్, మనీష్ తివారీ తదితరులు పాల్గొన్నారు. మరోవైపు, రక్షణ రంగ ఉపకరణాలు, ఉత్పత్తుల్ని తయారుచేసే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల్లో సిబ్బంది సమ్మెలను నిరోధించడానికి ఉద్దేశించిన ఎసెన్షియల్ డిఫెన్స్ సర్వీసెస్ బిల్లును ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. దేశీయజల్లాల్లో సరకు రవాణాకు ఉద్దేశించిన ఇన్‌ల్యాండ్ వెసెల్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టారు. ఆంక్షల నడుమ ‘కిసాన్ సంసద్’ కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు సుమారు ఎనిమిది నెలలుగా పోరాటం చేస్తున్న రైతన్నలు ఎట్టకేలకు పార్లమెంట్‌కు కూతవేటు దూరానికి చేరుకున్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా తమ గళాన్ని తీవ్రతరం చేసే దిశలో సంయుక్త కిసాన్ మోర్చా పిలుపులో భాగంగా ఏర్పాటుచేసిన కిసాన్ సంసద్(రైతు పార్లమెంట్) కార్యక్రమం గురువారం పోలీసు ఆంక్షల నడుమ ప్రారంభమైంది. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కిసాన్ సంసద్ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రశాంతంగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో 200 మంది రైతులు పాల్గొన్నారు. కిసాన్ సంసద్‌కు స్పీకర్‌గా ఏఐకేఎస్ ప్రధాన కార్యదర్శి హన్నన్ మొల్లా వ్యవహరించగా డిప్యూటీ స్పీకర్‌గా మన్జీత్ సింగ్ ఉన్నారు. తమ నిరసనల వాడి తగ్గలేదనీ, పార్లమెంట్ సమావేశాలు ఎలా నిర్వహించాలో తమకు కూడా తెలుసుననే విషయం ప్రభుత్వానికి తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ తికాయత్ చెప్పారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతు సమస్యలను ప్రస్తావించని అధికార, ప్రతిపక్ష సభ్యుల నియోజకవర్గాల్లో వారికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామన్నారు. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు పూర్తయ్యే వరకు కిసాన్ పార్లమెంట్ వేదిక వద్దే ఉంటామని తెలిపారు. తెలంగాణ, మహారాష్ట్ర, ఒడిశా, కేరళ, పశ్చిమబెంగాల్, గుజరాత్, పంజాబ్, హరియాణా, యూపీలకు చెందిన రైతులు వచ్చి సంఘీభావం తెలిపారు. -
ప్రైవేటీకరణను ఆపాల్సిందే..
ద్వారకానగర్ (విశాఖ దక్షిణ): కేంద్ర ప్రభుత్వం భేషజానికి పోకుండా స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కార్మిక నాయకులు డిమాండ్ చేశారు. స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నగరంలోని సరస్వతి పార్కు నుంచి జీవీఎంసీ గాంధీ విగ్రహం వరకు శనివారం భారీ ర్యాలీ నిర్వహించారు. స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ కోసం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు శనివారం నాటికి 100వ రోజుకు చేరుకున్నాయి. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గఫూర్ మాట్లాడుతూ..ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేట్ వారికి కారుచౌకగా అమ్మేసేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం యత్నిస్తోందన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మాటలను పెడచెవిన పెట్టి.. కేంద్రం విశాఖ ఉక్కును అమ్మకానికి పెట్టడం దుర్మార్గమన్నారు. ర్యాలీలో కార్మిక సంఘాల నేతలు ఓబులేసు, సి.హెచ్.నర్శింగరావు, జె.వెంకటేశ్వరరావు, పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు డి. ఆదినారాయణ, జె. అయోధ్యరామ్, గంధం వెంకటరావు, కె.ఎస్.ఎన్.రావు, వై. మస్తానప్ప, మంత్రి రాజశేఖర్, డి.ఆదినారాయణ కార్మికులు పాల్గొన్నారు. -
గాంధీ విగ్రహ ధ్వంసం: అమెరికా తీవ్ర విచారం
వాషింగ్టన్: అమెరికాకు బహుమానంగా ఇచ్చిన జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం కూల్చివేసిన ఘటనపై అమెరికా స్పందించింది. ఈ ఘటన విచారకరమని పేర్కొంటూ శ్వేతసౌధం క్షమాపణలు కోరింది. అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలో ఉన్న సెంట్రల్ పార్క్‌లో జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై కాలిఫోర్నియా అధికారులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి అమెరికా అధ్యక్ష భవనం స్పందించింది. (చదవండి: అమెరికాలో గాంధీ విగ్రహ ధ్వంసంపై భారత్ ఆగ్రహం) ‘‘గాంధీ స్మారక కట్టడాలపై దాడులపై మేం ఆందోళన చెందుతున్నాం. కాలిఫోర్నియా ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ దుర్ఘటనపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాం. దుండగులను గుర్తించి శిక్షస్తాం’’ అని శ్వేతసౌధ మీడియా కార్యదర్శి జెన్ సాకీ తెలిపారు. 2016లో ఆరడుగుల ఎత్తు, 4 అంగుళాల వెడల్పు, 294 కిలోల బరువున్న గాంధీ కాంస్య విగ్రహాన్ని భారత్ అమెరికాకు బహుమతిగా ఇచ్చింది. ఈ విగ్రహాన్ని కాలిఫోర్నియా రాష్ట్రం డేవిస్ పట్టణంలోని సెంట్రల్ పార్క్‌లో ప్రతిష్టించారు. అయితే జనవరి 27వ తేదీన కొందరు దుండగులు గాంధీ విగ్రహాన్ని కూల్చివేశారు. ఈ ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించి ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. భారత రాయబారి కార్యాలయంతో సంప్రదింపులు చేస్తున్నామని వెంటనే చర్యలు తీసుకుంటామని గతంలో డేవిస్ పట్టణ మేయర్ ప్రకటించారు. -
గాంధీజీ విగ్రహాన్నీ వదల్లేదు
వాషింగ్టన్: నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మరణానంతరం హింసాకాండకు పాల్పడిన నిరసనకారులను ‘బందిపోటు ముఠా’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. చివరకు వారు, వాషింగ్టన్ డీసీలోని మహాత్మాగాంధీ విగ్రహాన్నీ విడిచిపెట్టలేదన్నారు. శ్వేతజాతి పోలీసు అధికారి డెరెక్ చౌవిన్ మే 25న జార్జ్ ఫ్లాయిడ్ మెడపైన మోకాలితో తొక్కిపట్టగా, ఊపిరాడక ఫ్లాయిడ్ మరణించారు. ఈ విషయం వీడియో ద్వారా వెలుగులోకి వచ్చింది. దీనిపై అమెరికాలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. కొందరు ఆందోళనకారులు దేశవ్యాప్తంగా విధ్వంసానికి పాల్పడ్డారు. దీనిపై, అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా మిన్నెసోటాలో ట్రంప్ మాట్లాడారు. ఆందోళనకారులను ఉద్దేశించి ‘వారు అబ్రహం లింకన్ విగ్రహాన్ని కూల్చివేశారు. గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియలేదు. మన గత చరిత్రని వారు ధ్వంసం చేస్తున్నారు. నేను అధికారంలో ఉన్నంత కాలం అమెరికా చరిత్రను వారేమీ చేయలేరు’ అని వ్యాఖ్యానించారు. అందుకే విగ్రహాల విధ్వంసానికి పాల్పడే వారికి పదేళ్ళు జైలు శిక్ష విధించేలా ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్‌పై సంతకం చేసినట్లు ట్రంప్ వెల్లడించారు. దీంతో విగ్రహాల విధ్వంసం ఆగిపోయిందని ట్రంప్ అన్నారు. కూల్చి వేసిన గాంధీ విగ్రహాన్ని భారత ఎంబసీ సాయంతో పునర్నిర్మించినట్టు తెలిపారు. -
రష్యా, భారత్, చైనా త్రైపాక్షిక భేటీ
మాస్కో/న్యూఢిల్లీ: ప్రపంచ దేశాలన్నీ అన్ని రకాల మార్గాల్లోనూ అత్యున్నతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని భారత విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ అన్నారు. రెండో ప్రపంచ యుద్ధం జరిగి 75 ఏళ్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని రష్యా, భారత్, చైనా విదేశాంగ మంత్రులు మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమావేశమై చర్చలు జరిపారు. భారత్, చైనా మధ్య సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తారస్థాయికి చేరుకున్న వేళలోనే ఈ సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ సమావేశానికి హాజరైన జైశంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సమక్షంలోనే ఆ దేశంపై పరోక్షంగా విమర్శలు చేశారు. అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ, భాగస్వామ్య పక్షాలకు చట్టబద్ధంగా కలిగే ప్రయోజనాలకు పెద్ద పీట వేస్తూ, అన్ని దేశాలకు మంచి జరిగేలా, పటిష్టమైన కొత్త ప్రపంచం ఏర్పాటు దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అంతర్జాతీయ సంబంధాల్లో నైతికత ఉండాలని చెప్పారు. భారత్, చైనా మధ్య ఉద్రిక్తతల్ని చల్లార్చడానికి తాము ఎలాంటి మధ్యవర్తిత్వం వహించబోమని రష్యా విదేశాంగ మంత్రి సెర్జే లారోవ్ స్పష్టం చేశారు. అందరి ప్రయోజనాలు కాపాడాలి : వాంగ్ యీ రష్మా, భారత్, చైనా కలసికట్టుగా సమస్యాత్మక అంశాలను ఎదుర్కోవాలని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌యీ అన్నారు. 3 దేశాల సంబంధాల పరిరక్షణ కోసం అన్నిదేశాల ప్రయోజనాలు కాపాడేలా వ్యహరించాలన్నారు. మహాత్ముడికి రాజ్‌నాథ్ నివాళులు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం మాస్కోలో భారత రాయబార కార్యాలయ ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజ్‌నాథ్.. చైనా రక్షణమంత్రి వీ ఫెంగ్‌తో సమావేశం కావడం లేదని విదేశాంగ శాఖ తెలిపింది. రెండో ప్రపంచ యుద్ధంలో నాజీ జర్మనీపై సోవియెట్ సేనల విజయానికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని జరిగే 11 దేశాల సైనిక బలగాల పెరేడ్లో పాల్గొనేందుకు రాజ్‌నాథ్ రష్యా వెళ్లిన విషయం తెలిసిందే. -
ఈ ఘటన దురదృష్టకరం
వాషింగ్టన్: అమెరికా రాజధానిలోని భారతీయ దౌత్యకార్యాలయం ఎదుట ఉన్న గాంధీ విగ్రహాన్ని ఆగంతకులు ధ్వంసం చేయడాన్ని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తోపాటు పలువురు రాజకీయ నేతలు తీవ్రంగా ఖండించారు. ఇలాంటి సంఘటనలు ప్రజలను ఏకం చేయవని వారు స్పష్టం చేశారు. ఈ ఘటన దురదృష్టకరమైందని అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్‌లోని భారత దౌత్యకార్యాలయం సమీపంలో ఉన్న ఈ విగ్రహాన్ని కొందరు దుండగులు బుధవారం ధ్వంసం చేసి, రంగులు పూసిన విషయం తెలిసిందే. ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న తరుణంలో ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అయితే, ఈ ఘటనకు ఆందోళనలతో సంబంధం లేదని మార్కో రూబియో అనే సెనెటర్ గురువారం తెలిపారు. నార్త్ కరొలినా సెనేటర్ టామ్ టిల్లిస్ కూడా ఇది అమర్యాదకరమైందని అభివర్ణించారు. శాంతికి మారుపేరుగా చెప్పుకునే గాంధీ ప్రతిరూపాన్ని ధ్వంసం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు ట్రంప్ సలహాదారు కింబర్లీ గుయిఫోలే చెప్పారు. మా గొంతులపై మీ మోకాళ్లు తీయండి.. ‘‘మా గొంతులపై మీ మోకాళ్లు తొలగించం డి’’అన్న నినాదాల మధ్య మినియాపోలిస్‌లో గురువారం జార్జ్ ఫ్లాయిడ్ సంస్మరణ సభలు జరిగాయి. శవపేటిక చుట్టూ గుమికూడిన పలువురు సెలబ్రిటీలు, రాజకీయ నేతలు ఫ్లాయిడ్ మృతికి సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఒకవైపు ఈ సభ జరుగుతూండగా కొంత దూరంలోనే ఉన్న న్యాయస్థానంలో ఫ్లాయిడ్ హత్యకు కారణమైన ముగ్గురు పోలీసు అధికారులకు న్యాయమూర్తి బెయిల్ మంజూరు చేస్తూ.. పూచీకత్తుగా సుమారు రూ.5 కోట్ల చొప్పున చెల్లించాలని ఆదేశాలు జారీ చేయడం గమనార్హం. ఇదిలా ఉండగా.. ఫ్లాయిడ్ ఘటనకు నిరసనగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. ప్యారిస్, లండన్, సిడ్నీ, రియో డిజెనిరోల్లో నిరసనలు జరిగాయి. అదే సమయంలో ఆమెరికాలోని కాలిఫోర్నియాలో ఇప్పటివరకూ ఉన్న కర్ఫ్యూను సడలించారు. కొన్ని చెదురుమ దురు సంఘటనలు మినహా అమెరికా నగరాల్లో ప్రశాంతత నెలకొంది. కొన్నిచోట్ల శాంతియుత ప్రదర్శనలు జరిగాయి. ట్రంప్ ట్వీట్‌కు కత్తెర... సామాజిక మాధ్యమ సంస్థ ట్విట్టర్.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు మధ్య జరుగుత్ను పరోక్ష యుద్ధంలో ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. ఫ్లాయిడ్‌కు నివాళులర్పిస్తూ ట్రంప్ విడుదల చేసిన ఓ ప్రచార వీడియోను ట్విట్టర్ బ్లాక్ చేసింది. ఈ వీడియోపై ట్విట్టర్ ఒక లేబుల్‌ను పెడుతూ వీడియో తమదని ఇతరులు ఫిర్యాదు చేసిన కారణంగా దాన్ని బ్లాక్ చేస్తున్నట్లు పేర్కొంది. జోధ్‌పూర్‌లో ‘ఫ్లాయిడ్’ ఘటన! జో«ద్‌పూర్: జార్జ్ ఫ్లాయిడ్ తరహా ఘటనే భారత్‌లోనూ చోటు చేసుకుంది. రాజస్తాన్‌లోని జోధ్‌పూర్ నగరంలో ఓ పోలీస్ అధికారి ఒక వ్యక్తిని కిందకు పడదోసి మోకాళ్లతో అదిమి పట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. మాస్కు లేకుండా బయట తిరుగుతున్న ముఖేష్ ప్రజాపతి అనే వ్యక్తిని పోలీసులు ప్రశ్నించగా అతడు తీవ్రంగా ప్రతిఘటించాడు. ఈ మేరకు ప్రతాప్‌నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. -
గాంధీ విగ్రహానికి విద్యార్థుల వ్యతిరేకత
సాక్షి, న్యూఢిల్లీ: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని లండన్‌లోని మాన్చెస్టర్ క్లథడ్రల్ చర్చి ఆవరణలో ప్రతిష్టించాలనే ప్రతిపాదనను మాన్చెస్టర్ యూనివర్శిటీ విద్యార్థులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రతిపాదనను తక్షణం ఉపసంహరించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ సిటీ కౌన్సిల్‌కు విద్యార్థులు ఓ లేఖ కూడా రాశారు. మహాత్మా గాంధీ దక్షిణాఫ్రికాలో ఉన్నప్పుడు నల్ల జాతీయులకు వ్యతిరేకంగా పనిచేశారని, ఆ జాతీయుల పట్ల ఆయనకు విద్వేషం ఉందని విద్యార్థి నాయకులు కొందరు ఆరోపిస్తున్నారు. ‘శాంతి, ప్రేమ, సామరస్యం’ సందేశంతో గుజరాత్‌కు చెందిన ‘శ్రీమద్ రాజ్‌చంద్ర మిషన్’ తొమ్మిది అడుగుల గాంధీజీ విగ్రహాన్ని మాన్చెస్టర్ సిటీ కౌన్సిల్‌కు బహూకరించింది. 2017, మాన్చెస్టర్ ఎరినాలో పేలుడు సంభవించి 22 మంది మరణించిన నేపథ్యంలో అహింసా వాది అయిన గాంధీజీ విగ్రహాన్ని ఆ మిషన్ అందజేసింది. దీన్ని నవంబర్ 25వ తేదీన ప్రతిష్టించేందుకు నగర మున్సిపాలిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో విద్యార్థులు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. -
30ఏళ్లుగా చెట్టు కిందే మహాత్ముడు..
సాక్షి, జడ్చర్ల: ప్రజలనే కాదు.. చివరికి మహాత్ముడి విగ్రహాన్ని కూడా మూడనమ్మకాలు వెంటాడుతున్నాయి. దీంతో దాదాపు మూడు దశాబ్దాలుగా గాంధీ విగ్రహం ఏర్పాటుకు నోచుకోక.. పట్టించుకునే వారే కరువై చెట్టు కిందే శిథిలావస్థకు చేరింది. మండలంలోని గురుకుంటలో గాంధీ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని ఉపాధ్యాయులు, గ్రామస్తులు తెప్పించారు. ఈ క్రమంలో సదరు ఉపాధ్యాయుడు రోడ్డు ప్రమాదంలో గాయాలపాలయ్యాడు. దీంతో కీడు శంకించిన గ్రామస్తులు విగ్రహాన్ని గ్రామం నుంచి పోమాల్‌కి తరలించారు. అక్కడ సైతం విగ్రహ ఏర్పాటుకు ప్రయత్నిస్తున్న తరుణంలో ఆ గ్రామ పెద్ద అనారోగ్యాంతో ఇబ్బందులు పడ్డాడు. దీంతో అక్కడ కూడా విగ్రహాన్ని ఏర్పాటుచేయకుండా మండల కేంద్రానికి తీసుకొచ్చారు. 30ఏళ్లుగా చెట్టు కిందే.. మండల కేంద్రంలో ఓ మర్రి చెట్టు కింద ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని దాదాపు 30ఏళ్లుగా అలాగే వదిలేశారు. ప్రస్తుతం పెట్టిన చోటే శిథిలావస్థకు చేరింది. మూడ నమ్మకాలతో గాంధీజీ విగ్రహం ప్రతిష్టకు నోచుకోలేదంటే మారుమూల ప్రాంతాల్లో నమ్మకాలు ఎలా ఉన్నాయో ఇట్టే అర్థం అవుతుంది. -
మహాత్మగాంధీ విగ్రహానికి మరమ్మతులు చేసిన ఆర్కే
-
ప్రత్యేకత చాటుకున్న ఎమ్మెల్యే ఆర్కే
సాక్షి, అమరావతి: మంగళగిరి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి(ఆర్కే) తన ప్రత్యేకత చాటుకున్నారు. దుండగులు ధ్వంసం చేసిన జాతిపిత మహాత్మగాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేశారు. తాడేపల్లి వద్ద ఉన్న పోలకంపాడులో గుర్తు తెలియని వ్యక్తులు గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అక్కడికి చేరుకుని విగ్రహాన్ని పరిశీలించారు. విగ్రహం కాళ్లు దెబ్బతినడంతో స్వయంగా తాపీ పట్టి సిమెంట్ చేశారు. తర్వాత మహాత్ముడి విగ్రహానికి పూలమాలలు వేసి నమస్కారం చేశారు. గాంధీ విగ్రహానికి స్వయంగా మరమ్మతులు చేపట్టిన ఎమ్మెల్యేను స్థానికులు అభినందించారు. స్వతహాగా రైతు అయిన ఆర్కే నిరాడంబర జీవితం గడుపుతుంటారు. గతంలో లైనులో నిలబడి 5 రూపాయల భోజనాన్ని రుచి చూశారు. అంతేకాదు తన నియోజకవర్గంలోనూ ఈ సదుపాయం కల్పించి ప్రజల మన్ననలు పొందారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ నేత నారా లోకేశ్‌పై ఆర్కే విజయం సాధించిన సంగతి తెలిసిందే. -
గాంధీని అవమానించిన వారిపై చర్యలు: పొన్నం
సాక్షి, హైదరాబాద్: ఉత్తరప్రదేశ్‌లోని హిందూ మహాసభ కార్యకర్తలు గాంధీ విగ్రహాన్ని అవమానించినా ఇంతవరకు మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం దారుణమని, వెంటనే నింది తులపై కఠిన చర్యలు తీసుకోవాలని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత నెల 30న గాంధీ విగ్రహాన్ని హిందూ మహాసభ కార్యకర్తలు అవమానపర్చినందుకు నిరసనగా సోమవారం గాంధీభవన్‌లో నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ గాంధీ విగ్రహానికి జరిగిన అవమానం భారత జాతికి జరిగిన అవమానమని అన్నారు. గాంధీ విగ్రహంపై దాడితోనే హిందూ మహాసభ బీజేపీ అనుబంధ సంఘమని తేలిపోయిందని అన్నారు. కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్‌కుమార్ యాదవ్, ఉపాధ్యక్షుడు కుమార్‌రావు, మహేశ్‌కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
-
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
⇒ రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆందోళనలు ⇒ గవర్నర్‌కు ఫిర్యాదు ⇒ ఇక ప్రజాఉద్యమం: స్టాలిన్ సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ నిరసనకారుల్ని అరెస్టు చేయడంతో ఏదేని అల్లర్లు బయలు దేరవచ్చన్న ఉత్కంఠ బయలుదేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన స్టాలిన్ అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి నేరుగా మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టడం ఉత్కంఠను రేపింది. ఆయన్ను ఆగమేఘాలపై అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేసినా, ఒక్కసారిగా ఆ పరిసరాల్లో డీఎంకే వర్గాలు దూసుకురావడంతో పోలీసులు సంయమనం పాటించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలను అరెస్టు చేసినా, స్టాలిన్‌ను అరెస్టు చేయడానికి వెనక్కు తగ్గారు. వేలాదిగా మెరీనా వైపుగా జనసందోహం సైతం తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న ఆందోళన బయలు దేరింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్టాలిన్‌ను బుజ్జగించారు. మరో జల్లికట్టు ఉద్యమం బయలు దేరనున్నదా అన్నంతగా జనం తరలి వస్తుండడం, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదాన్ని గ్రహించిన స్టాలిన్ పోలీసులకు సహకరించక తప్పలేదు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీలో పాతిపెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలను ఏకంచేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. -
హోదా కోసం డల్లాస్‌లో కొవ్వొత్తులతో నిరసన
డల్లాస్: ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర యువత ప్రత్యేక హోదా కోసం గణతంత్ర దినోత్సవం రోజున చేసిన నిరసనకి సంఘీబావంగా అమెరికాలోని వైఎస్ఆర్సీపీ డల్లాస్ విభాగం నేతలు డల్లాస్ మెట్రో అర్వింగ్ లో ఉన్న గాంధీ పార్కులో గాంధీ విగ్రహం వద్ద కొవ్వొత్తులతో నిరసన తెలిపారు. ఎముకలు కొరికే చలిలో సైతం డల్లాస్ లో ఉన్న తెలుగువారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారు. కోడూరు కృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని విభజించేటపుడు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంటు సాక్షిగా చెప్పారని, గత ప్రభుత్వం 5 సంవత్సరాలు ఇస్తామంటే బీజేపీ 10 సంవత్సరాలు కావాలని అడిగారని గుర్తుచేశారు. టీడీపీ, బీజేపీ రెండూ కూడా ఎన్నికల సందర్భంగా 10-15 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పడంతో పాటు వారి మేనిఫెస్టోలో కూడా చేర్చి నేడు రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నారని ఇది తగదని చెప్పారు. రాష్ట్ర యువతకి ఉపాధి దొరకాలంటే పరిశ్రమలు రావాలని, పరిశ్రమలు రావాలంటే రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఉండాలన్నారు. ప్రత్యేక ప్యాకేజీ వల్ల రాజకీయ నాయకుల ప్యాకెట్లు నిండుతాయేమో కాని ప్రజలకు ఒనకురేదేమి లేదన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ప్రతిపక్ష నాయకులను, ఇతర రాజకీయ పార్టీ నేతలను కలుపుకొని అఖిల పక్షం ఏర్పాటు చేసి వీరిని డిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గరకు తీసుకెళ్ళి రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ప్రయత్నించాలని డాక్టర్ పవన్ పామదుర్తి డిమాండ్ చేసారు. డాక్టర్ ఇస్మాయిల్ మాట్లాడుతూ.. తెలుగువారి ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే రాజకీయ నాయకులు కావాలని మోదీ దగ్గర మోకరిల్లి స్వప్రయోజనాలకోసం రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టవద్దని హితవు పలికారు. అన్నపూర్ణగా వర్దిల్లిన రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసారని, ముఖ్యమంత్రి స్పందించి ప్రత్యేక హోదా కోసం ప్రతిపక్ష నాయకుడు చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని లేకపోతే ప్రజలు మిమ్మల్ని క్షమించరని రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, సుబ్బారెడ్డి కొండు, శివమణి అన్నపురెడ్డి సూచించారు. ఈ కార్యక్రమానికి కృష్ణారెడ్డి కోడూరు, డాక్టర్ పవన్ పామదుర్తి, బాస్కర్ గండికోట, కృష్ణమోహన్ రెడ్డి, రవి కోన, సుబ్బారెడ్డి కొండు, రమణ పుట్లూరు, డాక్టర్ ఇస్మాయిల్ పెనుకొండ, రమణ పుట్లూరు, పల్గున రెడ్డి, డాక్టర్ రామిరెడ్డి, రఘు కుమ్మెత్త, శశి పల్లా, శ్రీనివాస్ బర్రె, రామకృష్ణ జాజుల, యుగంధర్ తిప్పిరెడ్డి, వెంకట్ తిప్పిరెడ్డి, రవితేజ సిద్ది, రమణ కిష్టపాటి, నరసింహా రెడ్డి టంగుటూరి, ఉమా మహేష్ కుర్రి, ఉమా మహేష్ పార్నపల్లి, శివ మణి అన్నపురెడ్డి, తిరుమల కంభం, ప్రబంద్ తోపుదుర్తి, రవి అరిమండ, శ్రీనివాసుల రెడ్డి వీరభద్ర, మహేష్ ఆదిబట్ల, శ్రీకాంత్ జొన్నల, చందు చింతల, అవినాష్, ప్రవీణ్, హేమంత్ నల్లా, వెంకటరెడ్డి, దేవేందర్, సుధాకర్ విప్పాల, మోహన్ మల్లంపాటి తదితరులు పాల్గొన్నారు. -
గాంధీ విగ్రహం ఎదుట విపక్షాల ఆందోళన
-
గాంధీ విగ్రహం తీసేస్తారట!
ఘనా దేశ రాజధాని అక్రాలోని ఒక యూనివర్సిటీ ప్రాంగణంలో ఉన్న గాంధీజీ విగ్రహాన్ని తీసేయాలని ఆ దేశ ప్రభుత్వం భావిస్తోంది. ఇది జాతి దురహంకారమే అవుతుందని విమర్శకులు మండిపడుతున్నా, ప్రభుత్వం మాత్రం ససేమిరా అంటోంది. యూనివర్సిటీ ఆఫ్ ఘనాలోని కొందరు ప్రొఫెసర్లు.. ఆ విగ్రహాన్ని తీసేయాలంటూ గత నెలలో పిటిషన్ల ఉద్యమం మొదలుపెట్టారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఈ సంవత్సరం జూన్ నెలలోనే ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. విగ్రహం భద్రత కోసం దాన్ని యూనివర్సిటీ ప్రాంగణం నుంచి వేరే చోటుకు తరలించాలని భావిస్తున్నట్లు ఘనా విదేశాంగ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే విగ్రహాన్ని తీసేస్తారా లేదా అన్న విషయంపై ఇప్పటివరకు కచ్చితమైన నిర్ణయం ఏమీ తీసుకోలేదని పిటిషన్ ఉద్యమానికి నేతృత్వం వహించిన ఆబాదెల్ కాంబోన్ చెప్పారు. ఘనాలోనే మరేదైనా ప్రాంతానికి విగ్రహాన్ని తరలిస్తే చాలదని, దాన్ని భారతదేశానికి తిప్పి పంపేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఘనాలో ఎక్కడైనా ఈ విగ్రహానికి ఆదరణ ఉంటుందని తాను అనుకోవట్లేదని తెలిపారు. గాంధీకి బదులు స్థానిక నాయకులైన యా అసంటెవా లేదా ఘనా తొలి అధ్యక్షుడు క్వామే ఎన్క్రుమా లాంటి వాళ్ల విగ్రహాలు పెట్టాలని కోరుతున్నారు. -
గాంధీ విగ్రహానికి రాఖీ కట్టిన విద్యార్థినులు
అనంతపురం ఎడ్యుకేషన్ : రాఖీ పండుగ సందర్భంగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థినులు గురువారం స్థానిక మునిసిపల్ కాంప్లెక్స్ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి రాఖీలు కట్టారు. అనంతరం విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు కుమార్‌నాయుడు, రమేష్, బాలికల విభాగం కన్వీనర్ సుశీల మాట్లాడారు.స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్లు అవుతున్నా నేటికీ విద్యార్థినులు, మహిళలపై దాడులు జరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినుల వసతి గృహాలకు ప్రత్యేక రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు పాల్గొన్నారు. -
'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'
-
'బాబు దాష్టికానికి దేవుడి మొట్టికాయలు తప్పదు'
విజయవాడ: ఆరు దశాబ్దాల చరిత్ర ఉన్న మహాత్ముడి విగ్రహాన్ని పగులగొట్టి బుడమేరు కాల్వలో పడేయటం ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడి దాష్టికానికి నిదర్శనం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. బాబు పాలనలో గాంధీజీ, వైఎస్ఆర్ విగ్రహాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం కృష్ణపుష్కరాల్లో భాగంగా పున్నమి ఘాట్ లో స్నానమాచరించిన ఆయన అనంతరం ఇబ్రహీం పట్నం వెళ్లారు. అక్కడ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు దుర్మార్గాలకు ఆ దేవుడే మొట్టికాయలు వేయాలని అన్నారు. చంద్రబాబు ఆగడాలకు అడ్డూ అదుపులేకుండా పోతుందని, ఆయనకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెప్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
గాంధీగిరి గెలిచింది
యథాస్థానంలో గాంధీజీ విగ్రహం ఏర్పాటు ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం ఇబ్రహీంపట్నం : వైఎస్సార్ సీపీ ఆందోళనకు అధికారులు దిగొచ్చారు. తమ తప్పును తెలుసుకున్నారు. కూల్చివేసిన స్థానంలోనే మహాత్మా గాంధీ విగ్రహాన్ని తిరిగి ఆదివారం ఏర్పాటుచేశారు. పుష్కర పనుల నేపథ్యంలో ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్లో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహాన్ని ఇటీవల అర్ధరాత్రి అధికారులు తొలగించి సమీపంలో ఉన్న బుడమేరు కాలువలో పడేశారు. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మహాత్మా గాంధీ విగ్రహాన్ని టీడీపీ ప్రభుత్వం కూల్చివేయించడాన్ని ప్రజలు తీవ్రంగా ఖండించారు. ఫలించిన వైఎస్సార్ సీపీ పోరాటం మహాత్మా గాంధీ విగ్రహాన్ని కూల్చివేయడంపై వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జోగి రమేష్ నేతృత్వంలో మహాత్ముడు చూపిన బాటలోనే శాంతియుతంగా నిరసన తెలిపారు. ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, ప్రజలు సహకారం అందించంతో పోరాటం ఫలించింది. సబ్ కలెక్టర్ సృజన, వెస్ట్ జోన్ ఏసీపీ జి.రామకృష్ణ తదితరులు జోగి రమేష్‌తో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా తొలగించిన ప్రాంతంలోనే గాంధీజీ విగ్రహం ఏర్పాటుకు అంగీకరించారు. ఈ మేరకు రింగ్ సెంటర్లో ఆరున్నర అడుగుల గాంధీజీ విగ్రహాన్ని రెవెన్యూ అధికారులు ఆదివారం పునర్ప్రతిష్టించారు. దీంతో స్థానిక నాయకులు, ప్రజలు ఆనందం వ్యక్తంచేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి : జోగి రమేష్ గాంధీజీ నూతన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం జోగి రమేష్ మాట్లాడుతూ మహాత్ముని విగ్రహాన్ని కూల్చివేసి కాలువలో పడేసిన వారిని గుర్తించాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. మహాత్ముని విగ్రహం పునర్ ప్రతిష్టించేందుకు నిర్వహించిన ప్రజాందోళనలో పాల్గొన్న నాయకులు, ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. మాజీ ఎంపీపీలు జోగి మోహనరావు, చెరుకు మాధవరావు, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ బొమ్మసాని వెంకటచలపతి, సీనియర్ నాయకుడు మేడపాటి నాగిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కరుకుమల్లి శ్రీనివాసరావు, ఆ పార్టీ నాయకులు ఆవుల సీతారామయ్య, కరుకుమల్లి వీరాంజనేయులు, సింగలూరి కేథారేశ్వరరావు, వార్డు సభ్యులు తదితరులు గాంధీజీకి నివాళులర్పించారు. నేడు ఇబ్రహీంపట్నం రానున్న వైఎస్సార్ సీపీ నేతలు మహాత్మా గాంధీ విగ్రహాన్ని పరిశీలించేందుకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర స్థాయి నేతలు సోమవారం ఇబ్రహీంపట్నం రానున్నారని జోగి రమేష్ తెలిపారు. ఆ పార్టీ జిల్లా ఇన్చార్జి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాష్ట్ర నేతలు బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబు, జిల్లా అధ్యక్షుడు కేపీ సారథి వస్తారని చెప్పారు. -
విజయవాడలో గాంధీ విగ్రహం కూల్చివేత
-
టీడీపీ ధర్నాకు కేంద్ర మంత్రుల డుమ్మా
-
ఈరోజు రాజధానిలో ఏం జరగబోతోంది?
న్యూఢిల్లీ: పార్లమెంట్ లో రాజకీయ ప్రకంపనలకు కారణమైన కీలక అంశాల్లో ప్రభుత్వ వైఫల్యాన్నిఎత్తి చూపుతూ కాంగ్రెస్ పక్షం, విపక్ష ఆరోపణలకు తిప్పికొడుతూ అధికార పక్షం ఒకే రోజు, ఒకే చోట నిరసనలకు దిగడంతో ఈ రోజు ఢిల్లీలో ఏం జరగబోతుందోనని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అగస్టా వెస్ట్ లాండ్ హెలికాప్టర్ల కుంభకోణం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీ అవినీతికి పాల్పడిందంటూ, ఆరోపితులపై చర్చలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అధికార బీజేపీ ఎంపీలు శుక్రవారం ఉదయం నుంచి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట నిరసనకు దిగారు. పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్న బీజేపీ సభ్యులు కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాగా, సరిగ్గా అదే ప్రదేశానికి (గాంధీ విగ్రహం వద్దకు) కాంగ్రెస్ ఎంపీలు ర్యాలీ రానుంది. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్ లలో రాష్ట్రపతి పాలలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఈ ఉదయం జంతర్ మంతర్ నుంచి పార్లమెంట్ వరకు 'సేవ్ డెమోక్రసీ' పేరుతో ర్యాలీని చేపట్టింది. చీఫ్ సోనియా గాంధీ, వీపీ రాహుల్ గాంధీ, మాజీ పీఎం మన్మోహన్ సహా ముఖ్యనాయకులంతా ర్యాలీలో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం పార్లమెంట్ లోని గాంధీ విగ్రహం వద్ద బైఠాయిస్తారు. ఇరు పక్షాలు గాంధీ విగ్రహం వద్ద ఎదురుపడే అవకాశం ఉండటంతో ఎవరో ఒకరు పక్కకు తప్పుకుంటేతప్ప ఉద్రిక్తత తప్పే అవకాశం లేదు. మరోవైపు ఇవే అంశాలపై వైరిపక్షాన్ని సభలోనూ నిలదీయాలని కాంగ్రెస్, బీజేపీలు భావిస్తున్నాయి. -
పార్లమెంట్ ఆవరణలో వైఎస్ఆర్ సీపీ ఎంపీల ధర్నా
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన హామీలన్నింటినీ నెరవేర్చాలని కేంద్రప్రభుత్వాన్ని లోక్‌సభలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సీపీ ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పార్లమెంట్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వారు కేంద్ర ప్రభుత్వానికి సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగి 18 నెలలు అయింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై కేంద్రం నీమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. అంతే కాకుండా ఈ అంశాన్ని నీతి ఆయోగ్ కి అప్పగించినట్లు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ప్రకటించారు. ప్రత్యేక హోదాపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ఆర్ సీపీ ఎంపీలు గురువారం ధర్నా నిర్వహించారు. -
కళ్లు తెరిచారు.. కల్లు మానేశారు!
కోహీర్: కల్తీకల్లును పారదోలేందుకు మనియార్‌పల్లి గ్రామస్తులు సిద్ధమయ్యారు. ఇకపై కల్లు విక్రయాలు జరగనివ్వమని గాంధీ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ కూడా చేశారు. ఈ మేరకు శుక్రవారం గ్రామంలోకి వచ్చిన కల్లు లారీని తరిమికొట్టారు. ఇటీవల కల్లు రేటు విషయమై చెలరేగిన వివాదం నిషేధానికి దారితీసింది. ఇదివరకు మనియార్‌పల్లి గ్రామంలో రూ.8కు కల్లు సీసా అమ్మేవారు. గిట్టుబాటు లేక కాంట్రాక్టర్ సీసా రేటు రూ.10కి పెంచాడు. దీంతో మద్యంప్రియులు, కాంట్రాక్టరు మధ్య వివాదం చెలరేగడంతో పంచాయితీ గ్రామపెద్దల వద్దకు చేరింది. శుక్రవారం ఉదయం వారంతా సమావేశ మై.. కల్తీకల్లు వల్ల జరిగే అనర్థాలను ప్రజలకు వివరించారు. దీంతో కల్లును నిషేధించాలన్న ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ విషయాన్ని కోహీర్ పోలీసులకు తెలిపారు. ఏఎస్ఐ రాములు గ్రామానికి చేరుకొని కల్లును నిషేధంపై ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. సంపూర్ణ మద్య నిషేధం కోసం వచ్చే ఆదివారం తిరిగి సమావేశ మవుతామని గ్రామపెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఖదీర్, ఉపసర్పంచ్ ఎం.రాములు, గ్రామపెద్దలు సాయిరెడ్డి, నవాజ్ పటేల్, ఇస్మాయిల్, పాండునాయక్, నర్సిములు, అంజయ్య, మల్లప్ప, పోచయ్య, కిష్టయ్య, ఆశయ్య, గోపాల్, అనంత్రామ్, సత్యమ్మ, పోచమ్మ, నర్సమ్మ తదితరులున్నారు. గాంధీ విగ్రహం ఎదుట ప్రజల ప్రతిజ్ఞ -
ఢిల్లీలో కొనసాగుతున్నకాంగ్రెస్ నిరసనల పర్వం
-
బ్రాందీ కోసం గాంధీ మాయం..!
సాక్షి, గుంటూరు: బ్రాందీ షాపు ముందు గాంధీ విగ్రహం ఉండడంపై విమర్శలు రావడంతో గాంధీ విగ్రహాన్నే అక్కడ లేకుండా చేసేశారు. బార్ షాపు యజమానులు అధికార పార్టీకి చెందిన వారు కావడంతో తమ చేతులకు మట్టి అంటకుండా అధికారికంగానే గాంధీని మాయం చేయగలిగారు. జాతిపిత విగ్ర హం అని తెలిసినా అధికారులు ఏమాత్రం ఆలోచించలేదు. గాంధీ విగ్రహాన్ని తీసుకువెళ్లి ఆయన పేరుతోనే ఏర్పాటు చేసిన గాంధీ పార్కులో ఉంచారు. సంఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి... గుంటూరు నగరంలోని పట్టాభిపురం జూట్‌మిల్లు పక్కనే ఉన్న ఓ బార్ షాపు ఎదురుగా అనేక ఏళ్లుగా జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహం ఉంది. విగ్రహం ఎదురుగా బార్‌షాపు ఎలా అనుమతిస్తారంటూ అనేకసార్లు స్థానికులు ఆందోళనకు సైతం దిగారు. అయితే రాజకీయ అండదండలు ఉన్న సదరు బార్‌షాపు యాజమాన్యం మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా తమ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. ఎప్పుడు తీశారో ఏమో తెలియదుగానీ గాంధీ విగ్రహాన్ని తొలగించేశారు. రెండు మూడు రోజులుగా గాంధీ విగ్రహం మాయమవడంపై స్థానికులు గందరగోళానికి గురై ఆరా తీయగా నగరపాలక సంస్థ అధికారులే దాన్ని తొలగించినట్లు తెలుసుకుని అవాక్కయ్యారు. అదేమని ప్రశ్నిస్తే సుప్రీంకోర్టు ఆదే శాలను అనుసరించి ఉన్నతాధికారుల అనుమతి తీసుకునే గాంధీ విగ్రహాన్ని తొలగించామని చెబుతుండడం గమనార్హం. మార్చి నెల 24వ తేదీన గాంధీ విగ్రహంతో పాటు నగరంలో మరో 20 విగ్రహాల వరకూ తొలగించామని వారు చెబుతున్నారు. రోడ్డు విస్తరణకు అడ్డుగా మారిందనే నెపంతో బార్ షాపు యజమానులతో కుమ్మక్కై ఎవ్వరికీ చెప్పకుండా తొలగించడంపై స్థానికులు, ప్రజాసంఘాల నాయకులు మండిపడుతున్నారు. గాంధీ విగ్రహం తొలగింపుపై ప్రభుత్వం స్పందించి విచారణ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న అర్బన్ ఎస్పీ సర్వశ్రేష్ట త్రిపాఠి ఈ విషయంపై నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళికా విభాగం అధికారులను ఆరా తీసినట్లు తెలిసింది. -
బ్రాందీ కోసం గాంధీని లేపేశారు
-
మహాత్మా.. మా మొర ఆలకించవా..!
గాంధీ విగ్రహానికి 108 ఉద్యోగుల వినతిపత్రం సంగారెడ్డి క్రైం : తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చొరవ తీసుకోవాలని 108 ఉద్యోగులు డిమాండ్ చేశారు. సమ్మెలో భాగంగా ఉద్యోగులు మంగళవారం జెడ్పీలోని గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ 108 సర్వీసులకు వంద శాతం నిధులు ప్రభుత్వమే చెల్లిస్తున్నందున ప్రభుత్వమే నిర్వహించాలని, కనీస వేతన చట్టం అమలు చేస్తూ రూ.20వేలు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. పని గంటలు తగ్గించి, తొలగించిన ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవాలని, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగుల సొంత జిల్లాలకు బదిలీ చేయాలని, ప్రమాదంలో చనిపోయిన వారికి ప్రభుత్వమే రూ.20 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేశారు. -
ప్రత్యేక హోదా హామీని నెరవేర్చండి
కేంద్రాన్ని డిమాండ్ చేసిన వైఎస్సార్సీపీ పార్లమెంటు ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద ఆందోళన సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ ఎంపీలు పార్లమెంటులో మంగళవారం పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. తక్షణం ప్రత్యేక హోదా ప్రకటించి ఏపీని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఉదయం 10.30 గంటలకు పార్లమెంటు ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ప్లకార్డులతో ఎంపీలు నిరసన తెలిపారు. పార్లమెంటులో ఇచ్చిన హామీని నెరవేర్చాలని, ప్రత్యేకహోదా ఆంధ్రుల హక్కని, తక్షణం ప్రకటించాలని పార్టీ లోక్‌సభాపక్షనేత మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ విప్ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీలు వెలగపల్లి వరప్రసాదరావు, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాశ్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి నినదించారు. అనంతరం లోక్‌సభలోనూ ఆందోళన కొనసాగించారు. వాయిదా తీర్మానంపై తామిచ్చిన నోటీసుకనుగుణంగా సభాకార్యక్రమాలను వాయిదా వేసి ప్రత్యేకహోదాపై చర్చించాలని డిమాండ్ చేశారు. అయితే మేకపాటి ఇచ్చిన నోటీసును తిరస్కరిస్తున్నట్టు స్పీకర్ సుమిత్రామహాజన్ ప్రకటించారు. దీంతో వైఎస్సార్సీపీ ఎంపీలు పోడియం వద్ద ప్లకార్డులు ప్రదర్శిస్తూ.. ప్రత్యేకహోదా కోసం డిమాండ్ చేశారు. ఇదేసమయంలో అమేథీ మెగా ఫుడ్ పార్క్‌పై కేంద్ర మంత్రి హర్‌సిమ్రత్‌కౌర్ చేసిన ప్రకటనను నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభ రెండుసార్లు వాయిదాపడింది. తిరిగి 12 గంటలకు జీరోఅవర్‌ను ప్రారంభించిన స్పీకర్.. మేకపాటి మాట్లాడేందుకు అవకాశమిచ్చారు. మీరు పదేళ్లన్నారు.. మేకపాటి ఈ అంశంపై మాట్లాడుతూ.. విభజన బిల్లుపై చర్చ సందర్భంగా రాజ్యసభలో నాటి ప్రధాని మన్మోహన్సింగ్ ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటించడాన్ని ప్రస్తావించారు. అప్పట్లో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ మద్దతు ప్రకటించడమేగాక ప్రత్యేకహోదా పదేళ్లపాటు ఇవ్వాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. తాము అధికారంలోకొస్తే ప్రత్యేకహోదా పదేళ్లు కొనసాగిస్తామని చెప్పారని, కానీ రాష్ట్రం విడిపోయి ఏడాదవుతున్నా ఇవ్వలేకపోయారని విమర్శించారు. ఏపీ ప్రజలు ప్రత్యేకహోదా కోసం ఎదురుచూస్తున్నారని, దాంతోనే రాష్ట్రం అభివృద్ధికి నోచుకోగలుగుతుందని, లేదంటే ప్రస్తుతమున్న ఆర్థిక చిక్కుల్లో నుంచి రాష్ట్రం బయటపడే పరిస్థితి లేదన్నారు. అందువల్ల ఇచ్చిన మాటకు కట్టుబడి పదేళ్లపాటు ప్రత్యేకహోదా వర్తించేలా కేంద్రం ప్రకటన చేయాలనికోరారు. అంతకుముందు మహాత్మాగాంధీ విగ్రహం వద్ద మేకపాటి మాట్లాడుతూ.. ప్రత్యేకహోదాపై తమ కార్యాచరణ కొనసాగుతుందన్నారు. ప్రత్యేకహోదా ఇప్పించడంలో టీడీపీదే ప్రధాన బాధ్యతన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో ప్రభుత్వ భాగస్వామిగా ఉన్నందున టీడీపీ ప్రత్యేక హోదాకు కట్టుబడి ఉండాలని, లేనిపక్షంలో ప్రజలు క్షమించరని అన్నారు. ఇదిలా ఉండగా ఇదే అంశంపై లోక్‌సభలో టీడీపీ సభ్యుడు గల్లా జయదేవ్ మాట్లాడుతూ.. ‘మేకపాటి లేవనెత్తినట్టుగానే ఈ అంశం ఏడాదిగా నలిగిపోతోంది. మేం కేంద్రం నుంచి ఏ సాయం పొందబోతున్నామో స్పష్టత కావాలి. ఎప్పుడు పొందుతామో? ఎలా పొందుతామో స్పష్టత కావాలి’ అని కోరారు. -
సరూర్‌నగర్ లో గాంధీ విగ్రహం ధ్వంసం
సరూర్‌నగర్: ఒక పక్క విదేశాల్లో గాంధీ విగ్రహాలను ప్రతిష్టిస్తుంటే.. మన దేశంలో మాత్రం ప్రతిష్టించిన గాంధీ విగ్రహలను కూల్చుతున్నారు. వివరాలు బుధవారం రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని వెంకటేశ్వర కాలనీ రోడ్ నంబర్ 10లో ఉన్న గాంధీ విగ్రహన్ని గుర్తుతెలియని దుండగులు కూల్చివేశారు. అనంతరం విగ్రహన్ని చెత్తకుప్పల్లో వేసి పరారయ్యారు. విషయం తెలిసిన కాలనీ వాసులు వెంటనే దోషులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. -
కాంగ్రెస్, టీఆర్ఎస్ వర్గీయుల బాహాబాహీ
హైదరాబాద్ : మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాల వేసే విషయంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య గురువారం ఘర్షణ చోటుచేసుకుంది. నాగోల్ గాంధీ విగ్రహం వద్ద ఇరు పార్టీల కార్యకర్తలు బాహాబాహీకి దిగారు. పరస్పరం రాళ్లు, చెప్పులతో దాడి చేసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రామ్మోహన్ గౌడ్ మధ్య పూలమాల వేసి విషయంపై వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ తారాస్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. -
ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం
* ఒక్కరోజులో 510 మంది లోకసభ సభ్యుల ప్రమాణం * రికార్డు స్థాయిలో లోక్‌సభ సభ్యుల ప్రమాణం * సంప్రదాయ దుస్తులు, పలకరింపులు, అభినందనలతో ఉల్లాస వాతావరణం * మోడీ సహా 300 మందికిపైగా తొలిసారి ఎన్నికైన వారే * నేడు మిగతా వారితో ప్రమాణం.. ఆ తర్వాత స్పీకర్ ఎన్నిక గురువారం లోక్‌సభలో ప్రమాణస్వీకారం అనంతరం పార్లమెంటు ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి నివాళులర్పించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు.. మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మిథున్‌రెడ్డి, వైఎస్ అవినాశ్ రెడ్డి, కొత్తపల్లి గీత, బుట్టా రేణుక న్యూఢిల్లీ: ప్రధానితో సహా రికార్డు స్థాయిలో 510 మంది కొత్త ఎంపీల ప్రమాణ స్వీకారాలు, నేతల పలకరింపులు, పరస్పర శుభాకాంక్షలతో 16వ లోక్‌సభ సమావేశాల రెండో రోజు పండుగ వాతావరణం నెలకొంది. ఈసారి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు 300 మందికిపైగా ఎంపీలు తొలిసారి పార్లమెంటులోకి అడుగుపెట్టిన వారే కావడం విశేషం. దీంతో సభలో ఏకత్వంలో భిన్నత్వం ప్రస్ఫుటించింది. ప్రొటెం స్పీకర్ కమల్‌నాథ్ గురువారం భారీ సంఖ్యలో ఎంపీలతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఒక్క రోజులోనే 510 మంది ప్రమాణం చేయడం మరో విశేషం. చాలా మంది తమ మాతృభాషలోనే ప్రమాణం చేశారు. సంప్రదాయ దుస్తుల్లో తళుక్కుమంటూ ఒకరినొకరు పలకరించుకున్నారు. తెల్లటి కుర్తా పైజామాలో సభకు వచ్చిన ప్రధాని మోడీ సభ్యుల హర్షధ్వానాల మధ్య తొట్టతొలిగా దేవునిసాక్షిగా హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. తర్వాత బీజేపీ అగ్ర నేత ఎల్కే అద్వానీ, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ ప్రమాణం చేశారు. పలువురు కేంద్ర మంత్రులు హిందీలో ప్రమాణం చేయగా.. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, జలవనరుల మంత్రి ఉమాభారతి, మరో మంత్రి హర్షవర్ధన్ సంస్కృతంలో ప్రమాణం చేశారు. అలాగే ఇతర కేంద్ర మంత్రులు సదానంద గౌడ, అనంత్‌కుమార్, సిద్ధేశ్వర కన్నడలో... సర్వానంద సోనోవాల్ అస్సామీలో.. జుయల్ ఓరం ఒడియాలో ప్రమాణ పత్రాన్ని చదివారు. వరుసకు సోదరులైన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, బీజేపీ నేత వరుణ్ గాంధీ కూడా ఒకరి తర్వాత మరొకరు హిందీలో ప్రమాణం చేశారు. ప్రమాణం పూర్తయ్యాక వరుణ్ తన సీటు వద్దకు వెళ్తూ సోనియాకు వందనం చేశారు. అయితే ఆయన రిజిస్టర్లో సంతకం చేయకపోవడంతో సోనియా ఆ విషయాన్ని గుర్తు చేశారు. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ ములాయం సింగ్ యాదవ్‌తో పాటు ఆయన కోడలు డింపుల్, ఇద్దరు మేనల్లుళ్లు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇక అన్నాడీఎంకే సభ్యుల్లో అత్యధికులు తమిళంలో.. పశ్చిమబెంగాల్, పంజాబ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల నుంచి ఎన్నికైన వారిలో చాలా మంది తమ మాతృభాషల్లోనే ప్రమాణం చేశారు. కొత్త రాష్ర్టం తెలంగాణ నుంచి ప్రమాణం చేసిన మొదటి ఎంపీగా జి. నగేశ్ (టీఆర్ఎస్) ప్రత్యేకంగా నిలిచారు. మొత్తానికి అధికార, విపక్ష సభ్యులు పరస్పరం అభినందనలు తెలుపుకోవడంతో లోక్‌సభలో ప్రజాస్వామ్యం పరిఢవిల్లింది. శుక్రవారం మిగతా సభ్యుల ప్రమాణ స్వీకారం పూర్తయిన తర్వాత షెడ్యూల్ ప్రకారం స్పీకర్ ఎన్నిక జరగ నుంది. రెండో రోజు దాదాపు 30 మంది సభ్యులు గైర్హాజరయ్యారు. తెలంగాణకు చెందిన మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్ గిరిజన సంప్రదాయ దుస్తులు ధరించి ప్రత్యేకతను చాటుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి 37 మంది ప్రమాణం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల లోక్‌సభ సభ్యులు కూడా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 25 మంది ఎంపీలకు గాను తెలుగుదేశం సభ్యుడు శివప్రసాద్ హాజరుకాలేదు. తెలంగాణలో 17 స్థానాలుండగా.. మెదక్ లోక్‌సభ సభ్యత్వానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మిగిలిన 16 మంది ఎంపీల్లో ఇద్దరు గైర్హాజరయ్యారు. ముందుగా కేంద్ర మంత్రులు ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ఆంధ్రప్రదేశ్ నుంచి అశోక్‌గజపతి రాజు హిందీలో ప్రమాణం చేశారు. తర్వాత మధ్యాహ్న సమయంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మిగతా ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీలు కొత్తపల్లి గీత, ముత్తంశెట్టి శ్రీనివాసరావు, డాక్టర్ రవీంద్రబాబు, గోకరాజు గంగరాజు, మాగంటి వెంకటేశ్వరరావు, కేశినేని శ్రీనివాస్, జయదేవ్ గల్లా, మాల్యాద్రి శ్రీరాం, వై.వి.సుబ్బారెడ్డి, ఎస్పీవై రెడ్డి, బుట్టా రేణుక, వి.వరప్రసాద్‌రావు ఆంగ్లంలో ప్రమాణ స్వీకారం చేయగా.. డాక్టర్ కంభంపాటి హరిబాబు, తోట నర్సింహం, మురళీమోహన్, కొనకళ్ల నారాయణ రావు, రాయపాటి సాంబశివరావు, జేసీ దివాకర్‌రెడ్డి, మేకపాటి రాజమోహన్‌రెడ్డి, ైవె..ఎస్.అవినాశ్ రెడ్డి, పెద్దిరెడ్డి వెంకట మిథున్‌రెడ్డి తెలుగులో ప్రమాణం చేశారు. ఇక కింజారపు రామ్మోహన్నాయుడు, నిమ్మల కిష్టప్ప హిందీలో ప్రమాణ స్వీకారం చేశారు. సాయంత్రం 4.25 గంటలకు తెలంగాణ ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు. బాల్క సుమన్, బి.వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత , కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎ.పి.జితేందర్‌రెడ్డి, డాక్టర్ బూర నర్సయ్య గౌడ్, కడియం శ్రీహరి ఆంగ్లంలో ప్రమాణం చేయగా సి.హెచ్.మల్లారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలుగులో.. జి.నగేశ్, బండారు దత్తాత్రేయ, నంది ఎల్లయ్య హిందీలో.. అసదుద్దీన్ ఒవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేశారు. -
సమైక్య గర్జన
సాక్షి, నెల్లూరు: సమైక్యాంధ్రకు మద్దతుగా సింహపురి వాసులు సింహాలై గర్జించారు. విభజన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలంటూ ఢిల్లీ దద్దరిల్లేలా నినాదాలతో హోరెత్తించారు. నిరసన కార్యక్రమాలతో నెల్లూరు దద్దరిల్లింది. 54వ రోజూ ఉద్యమం ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, మానవహారాలు, దిష్టిబొమ్మల దహనాలు కొనసాగాయి. నెల్లూరులో బలిజ, తెలగ, కాపు సంఘం ఆధ్వర్యంలో సింహగర్జన పేరుతో భారీ ర్యాలీ జరిగింది. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బలిజ సంఘీయులు సమైక్యవాణి వినిపించారు. ఏబీఎం కాంపౌండ్ నుంచి బయలుదేరిన ర్యాలీ పొట్టిశ్రీరాములు విగ్రహం, కనకమహల్ సెంటర్, గాంధీబొమ్మ మీదుగా వీఆర్సీ వరకు సాగింది. ర్యాలీలో శ్రీకృష్ణదేవరాయలు తదితర వేషధారణలో ఉన్న వ్యక్తులు ఆకట్టుకున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముస్లింలు కోటమిట్ట నుంచి గాంధీబొమ్మ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించి, నిరాహారదీక్షలో కూర్చున్నారు. వీరి కార్యక్రమాన్ని మాజీ కార్పొరేటర్ ఆనం జయకుమార్‌రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా మానవహారం నిర్వహించారు. వీఆర్సీ కూడలిలో యూటీఎఫ్, ప్రైవేటు విద్యాసంస్థల ఆధ్వర్యంలో వేర్వేరుగా రిలేదీక్షలు కొనసాగాయి. గాంధీబొమ్మ సెంటర్లో ఎస్‌యూపీఎస్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు రిలేదీక్షలు కొనసాగించారు. వీఆర్సీ సెంటర్లో సోనియా దిష్టిబొమ్మను టీఎన్ఎస్ఎఫ్ నాయకులు, దిగ్విజయ్‌సింగ్ దిష్టిబొమ్మను సమైక్యాంధ్ర విద్యార్థి జేఏసీ నాయకులు దహనం చేశారు. పొదలకూరురోడ్డులోని నేతాజీనగర్ వాసులు వాటర్‌ట్యాంకు సెంటర్ వద్ద వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. వెంకటగిరిలో యాదవ శంఖారావం జరిగింది. స్థానిక అడ్డరోడ్డు సెంటర్ నుంచి కాశీపేట సెంటర్ వరకు భారీ ర్యాలీ చేశారు. ర్యాలీలో శ్రీకృష్ణుడు వేషధారి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉదయగిరి బస్టాండ్ ఆవరణలో వైఎస్సార్సీపీ కార్యకర్తలు దీక్ష కొనసాగించారు. సీతాతామపురంలో ఉద్యోగ, ఉపాధ్యాయ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష కొనసాగించడంతో పాటు బైక్ ర్యాలీ నిర్వహించారు. వింజమూరులో విద్యార్థి జేఏసీ, దుత్తలూరులో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో దీక్షలు కొనసాగాయి. వరికుంటపాడులో వెంగమాంబపురం వివేకానంద యూత్ సభ్యులు దీక్షలో కూర్చున్నారు. గూడూరు టవర్‌క్లాక్ సెంటర్లో ఆర్టీసీ కార్మికులు రిలేదీక్ష చేశారు. జేఏసీ నాయకులు గుంజీలు తీస్తూ నిరసన తెలిపారు. ఆత్మకూరులో ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. రెవెన్యూ ఉద్యోగులు ఆత్మకూరు నుంచి పెంచలకోన వరకు బైక్ ర్యాలీ నిర్వహించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోవూరు ఎన్జీఓ హోంలో భారత్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు, సిబ్బంది దీక్షలో కూర్చున్నారు. వైఎస్సార్ విగ్రహ కూడలిలో చేనేత కార్మికులు రోడ్డుపైనే మగ్గం నేశారు. కావలిలో ఉద్యోగులు, ఆర్టీసీ, సమైక్యాంధ్ర జేఏసీలు, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే దీక్షలు కొనసాగాయి. -
సమైక్యాంధ్రకు మద్దతుగా నేడు వైఎసార్సిపి ధర్నా
-
ప్రజల జీవితాలతో చెలగాటం వద్దు
నెల్లూరు(కలెక్టరేట్), న్యూస్‌లైన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని ఐద్వా నాయకురాలు దుగ్గిరాల అన్నపూర్ణమ్మ మండిపడ్డారు. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని కోరుతూ బుధవారం డీవైఎఫ్ఐ, ఐద్వా, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో స్థానిక గాంధీ విగ్రహం నుంచి కలెక్టరేట్ వరకు వివిధ కూరగాయలు, గ్యాస్ సిలిండర్లతో ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా అన్నపూర్ణమ్మ మాట్లాడారు. కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు కూరలు చేసుకునే పరిస్థితుల్లో లేరని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం రైతు బజార్లలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటుచేసి తక్కువ ధరలకే కూరగాయల విక్రయాలు జరపాలన్నారు. పెంచిన గ్యాస్ ధరను తగ్గించాలని కోరారు. రెండు నెలలుగా ఉపాధి కూలీలకు బకాయిలు చెల్లించలేదని, వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రేషన్ దుకాణాల్లో అమ్మహస్తం సరుకులను ఇవ్వడంలేదని ఆరోపించారు. తక్షణమే సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కలెక్టర్ లేకపోవడంతో ఆయన చాంబర్‌లోని కుర్చీలో వినతిపత్రాన్ని ఉంచారు. నాయకులు అరిగెల రమమ్మ, షాహినాబేగం, విజయమ్మ, సెల్వమ్మ, యాదగిరి, ప్రసాద్ పాల్గొన్నారు. -
తప్పుదోవ పట్టిస్తున్న కాంగ్రెస్, టీడీపీ
టపెదవాల్తేరు, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నిర్ణయం ఎవరిది? ప్రత్యేక తెలంగాణ ప్రకటించినప్పుడు ఏం చేస్తున్నారు? రాష్ట్ర విభజనకు నిరసనగా ఒక్కరైనా రాజీనామా ఆమోదించుకోగలిగారా? కాంగ్రెస్ నిర్ణయాన్ని తిప్పికొట్టకుండా సమైక్యాంధ్ర ఉద్యమాలంటూ ఎందుకు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ ప్రజాప్రతినిధులను వైఎస్సార్సీపీ నగర కన్వీనర్ వంశీకృష్ణ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద గురువారం సమైక్యాంధ్ర కోరుతూ వంశీకృష్ణ ఆధ్వర్యంలో నాయకులు రిలే నిరహారదీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీల్చిన సోనియాగాంధీ, కేంద్ర మంత్రుల ఇళ్ల ముందు నిరసనలు చేయాలని నగర కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. కేంద్రంలో కాంగ్రెస్‌పార్టీ రాష్ట్ర విభజన చేస్తే నగరంలో ఆ పార్టీ నాయకులు సమైక్యాంధ్ర ఉద్యమాలు చేయడాన్ని ప్రజలు తప్పుపడుతున్నారని శ్రీనివాస్ విమర్శించారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చిన చంద్రబాబుది ఆత్మగౌరవ యాత్ర కాదు ఆత్మవంచన యాత్ర అని ధ్వజమెత్తారు. ముందు మీరు మారండి మీ నాయకులను మార్చండి తర్వాత ఉద్యమాల్లోకి రావాలని ఆయా పార్టీల నాయకులకు హితవు పలికారు. రూరల్ కన్వీనర్ చొక్కాకుల వెంకటరావు మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారన్నారు. కాంగ్రెస్, టీడీపీ మంత్రులు రాజీనామా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. కొయ్య ప్రసాదరెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ ప్రాపకం కోసం కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్న తీరుపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ప్రజా గాయకుడు దేవిశ్రీప్రసాద్ ఆలపించిన సమైక్యాంధ్ర పాటలు అలరించాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్షలో అనుబంధ సంఘ కన్వీనర్లు పక్కి దివాకర్, కాళిదాసురెడ్డి, నాయకులు సత్తి రామకృష్ణరెడ్డి ఉన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సమన్వయకర్తలు కోరాడ రాజబాబు, జి.వి.రవిరాజు, తిప్పల నాగిరెడ్డి, కోలా గురువులు, అధికార ప్రతినిధి కంపా హనోకు, కన్వీనర్లు పసుపులేటి ఉషాకిరణ్, గుడ్ల పోలిరెడ్డి, భూపతిరాజు శ్రీనివాస్, రవిరెడ్డి, నౌషాద్, రాధ, ఏవీఎస్ నాయుడు, మాజీ కార్పొరేటర్లు కండిపిల్లి అప్పారావు, ఉరుకూటి అప్పారావు, చొప్పా నాగరాజు నాయకులు పాల్గొన్నారు.