డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ నిరసనకారుల్ని అరెస్టు చేయడంతో ఏదేని అల్లర్లు బయలు దేరవచ్చన్న ఉత్కంఠ బయలుదేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు.