Tamil Nadu Assembly
-
Tamil Nadu Assembly: కుల గణన చేపట్టండి
చెన్నై: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తమిళనాడు అసెంబ్లీ బుధవారం ఏకగ్రీవ తీర్మానం చేసింది. 2021 నుంచి వాయిదాపడుతున్న జన గణనను వెంటనే చేపట్టాలని, ఇందులో భాగంగా కుల గణన కూడా చేయాలని తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానంలో కోరారు. ‘భారత్‌లోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, విద్య, ఉద్యోగాలు, ఆర్థికంగా సమాన అవకాశాలు అందాలంటే కుల గణన తప్పనిసరి అని శాసనసభ భావిస్తోంది’ అని తీర్మానంలో పేర్కొన్నారు. -
Tamil Nadu: గవర్నర్ వెనక్కి పంపిన బిల్లులకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం
తమిళనాడు ప్రభుత్వం, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య రగులుతున్న వివాదం మరింత ముదురుతోంది. అసెంబ్లీ తీర్మానించిన బిల్లులను గవర్నర్ ఆమోదించడంలో జాప్యం చేస్తున్నారంటూ స్టాలిన్ ప్రభుత్వం ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంలో సర్కార్ వర్సెస్ గరర్నర్ మధ్య వైరం తారాస్థాయికి చేరింది. తాజాగా గవర్నర్‌కు వ్యతిరేకంగా సీఎం స్టాలిన్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ.. గతంలో తీర్మానించిన 10 బిల్లులను మరోసారి ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇటీవల రాష్ట్ర అసెంబ్లీ తీర్మానించిన 10 బిల్లులను ఆమోదించకుండా గవర్నర్ వెనక్కి పంపిన నేపథ్యంలో ఆర్ఎన్ రవి చర్యపై తమిళనాడు ప్రభుత్వం శనివారం ప్రత్యేక అసెంబ్లీ సమావేశం నిర్వహించింది. అయితే ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలకు అన్న డీఎంకే, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. బిల్లులపై చర్చ సందర్భంగా అసెంబ్లీలో స్టాలిన్ మాట్లాడుతూ గవర్నర్‌పై నిప్పులు చెరిగారు. ప్రజాప్రతినిధులతో కూడిన అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడం గవర్నర్ బాధ్యత అని తెలిపారు. అయనకు ఏవైనా సందేహాలు ఉంటే దానిని ప్రభుత్వానికి తెలియజేయవచ్చని సూచించారు. గతంలో గవర్నర్ కొన్ని బిల్లులపై ప్రశ్నలు లేవనెత్తినప్పుడు రాష్ట్రం వెంటనే స్పందించించి వివరణ ఇచ్చిందని గుర్తు చేశారు. గవర్నర్ కోరిన వివరణను ప్రభుత్వం ఇవ్వని సందర్భం ఎప్పుడూ లేదని ప్రస్తవించారు. గవర్నర్ వద్ద 12 బిల్లులు పెండింగులో ఉన్నామని, ఎలాంటి కారణం చెప్పకుండా బిల్లులను నిలిపివేయడం తమిళనాడు ప్రజలను అవమానించడం, రాష్ట్ర అసెంబ్లీని అవమానించారని దుయ్యబట్టారు. చదవండి: వరల్డ్‌కప్ ఫైనల్.. క్రికెట్ అభిమానులకు భారతీయ రైల్వే శుభవార్త గవర్నర్ ప్రజలకు, ప్రజాస్వామ్యానికి, చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని స్టాలిన్ మండిపడ్డారు. గవర్నర్‌గా నియమితులైన వ్యక్తి రాష్ట్ర సంక్షేమం కోసం పని చేయాలని, ప్రభుత్వానికి అండగా ఉండాలని సూచించారు. అలా కాకుండా రాష్ట్ర పథకాలను ఎలా నిలిపివేయాలనే దాని గురించే గవర్నర్ ఆలోచిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇది అప్రజాస్వామికం, ప్రజావ్యతిరేకమని విమర్శించారు. బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లను అడ్డం పెట్టుకొని కేంద్రం కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి కారణాలు చెప్పకుండా గవర్నర్ తిప్పి పంపిన 10 బిల్లులను మరోసారి అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. తాజాగా ఆమోదం పొందిన బిల్లులలో 2020, 2023లో అసెంబ్లీ తీర్మానించిన రెండేసి బిల్లులు ఉండగా.. మరో ఆరు బిల్లులు 2022లోనే ఆమోదించినవి ఉన్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తగ్గించేలా తీసుకొచ్చిన తీర్మానం, వ్యవసాయం, ఉన్నత విద్య వంటి అంశాలకు చెందినవి ఉన్నాయి. . ఇదిలా ఉండగా అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో గవర్నర్ జాప్యం చేస్తున్నారంటూ తమిళనాడు ప్రభుత్వం ఇటీవల సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు.. బిల్లుల విషయంలో గవర్నర్లు వ్యవహరంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. గవర్నర్లు నిప్పుతో చెలగాటం ఆడుతున్నారని.. వారికి ఆత్మపరిశీలన అవసరమని పేర్కొంది. ఇది తీవ్ర ఆందోళనకరమైన అంశమని పేర్కొంది. అసెంబ్లీ ఆమోదించి పంపిన బిల్లులపై నిర్దేశిత సమయంలో నిర్ణయం తీసుకోవాలని గవర్నర్లను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశ పరిచి గత బిల్లులను ఆమోదించడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
తమిళనాడు అసెంబ్లీలో వైఎస్ జగన్‌కు జేజేలు
తమిళనాడు అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేరు ప్రతిధ్వనించింది. తీవ్రకరువు పరిస్థితుల్లో తెలుగుగంగ నీరిచ్చి ఆదుకున్నారంటూ అధికార, ప్రతిపక్ష సభ్యుల సాక్షిగా ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఏపీ సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: చెన్నై ప్రజల దాహార్తిని చెంబరబాక్కం, పూండి, పుళల్, చోళవరం జలాశయాలు తీరుస్తున్నాయి. 2018లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో 2019లో చెన్నై నగరం, శివారు ప్రాంతాలు నీటి కటకటను ఎదుర్కొన్నాయి. జోలార్‌పేట నుంచి రైలుద్వారా చెన్నైకి నీటిని సరఫరా చేయాల్సి వచ్చింది. ఈ పరిస్థితుల్లో రుతుపవనాల ప్రవేశం, ఆంధ్రప్రదేశ్ నుంచి కృష్ణానీటి రాకతో నాలుగు జలాశయాల్లో నీటి మట్టం పెరిగింది. నగర శివారు ప్రాంతాల్లోని చివరి ఇంటి వరకూ మెట్రోవాటర్ సరఫరా చేయాలని అధికారులు తీర్మానించారు. ఇంతవరకు కృష్ణానది నుంచి తెలుగుగంగ పథకం కింద నాలుగు టీఎంసీల నీరువచ్చింది. ఈ నీటితో ఐదు నెలలపాటు నీటిని సరఫరా చేయవచ్చు. ఈ ఏడాది నీటి కొరత ఉండకపోవచ్చు. కృష్ణా నీరు ఆదుకోవడం వల్లనే చెన్నై నలుమూలలా మెట్రో వాటర్‌ను సరఫరా చేయగలిగామని సీఎం ఎడపాడి అన్నారు. ఫిబ్రవరి ఆఖరు వరకు పూండికి కృష్ణా నీటిని సరఫరా చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించినట్లు మెట్రోవాటర్ అధికారి ఒకరు చెప్పారు. ధన్యవాద తీర్మానం ఈనెల 6వ తేదీన ప్రారంభమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాలు గురువారం ముగిశాయి. గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్ ప్రసంగానికి సీఎం ఎడపాడి ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. గత ఏడాది వేసవిలో తీవ్రమైనకరువు పరిస్థితులు నెలకొనగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర మంత్రులు స్వయంగా కలుసుకుని తెలుగుగంగ పథకం కింద తమిళనాడుకు కేటాయించిన నీటిని విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తెలుగుగంగ నీటితో గ్రేటర్ చెన్నై ప్రజల దాహార్తిని తీరుస్తున్నామన్నారు. తమ కోర్కెను మన్నించి సకాలంలో సహకరించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. తమిళనాడు నీటి అవసరాలను మరింత మెరుగుపరిచేలా గోదావరి–కావేరీ నదుల అనుసంధానం పథకం అమలు కోసం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులతో సమావేశాన్ని నిర్వహించి వీలైనంత త్వరగా వారి అంగీకారాన్ని పొందాలని కోరుతూ ఉత్తరాల ద్వారా, స్వయంగా కలిసినపుడు ప్రధాని నరేంద్రమోదీకి విజ్ఞప్తి చేశానని ఎడపాడి పేర్కొన్నారు. ఒకే ఏడాది 9 వైద్యకళాశాలను మంజూరు చేయించుకున్న ఘనతను సాధించామని సీఎం అన్నారు. ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాల గురించి సీఎం ప్రసంగిస్తూ తిరువళ్లూరు జిల్లాలో ఓ యువతిని కాపాడే ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన యువకుడి కుటుంబానికి రూ.10 లక్షల చెల్లించనున్నట్లు చెప్పారు. కొత్త పథకాలకు రూ.6,580 కోట్లను కేటాయించినట్లు ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం తెలిపారు. కొత్తగా ఏర్పడిన తొమ్మిది జిల్లాల్లో ప్రత్యేకాధికారుల పదవీ కాలాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు మంత్రి ఎస్పీ వేలు ప్రకటించారు. పౌరచట్ట సవరణపై వాకౌట్ పౌరహక్కు చట్టం సవరణను ఖండిస్తూ తీర్మానం ప్రవేశ పెట్టేందుకు స్పీకర్ అంగీకరించక పోవడంతో డీఎంకే సహా ప్రతిపక్ష సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అసెంబ్లీ సమావేశం గురువారం ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగా ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగే ప్రశ్నలకు ఆయా శాఖల మంత్రులు సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయం ముగిసిన తరువాత జీరో అవర్‌లో ప్రధాన ప్రతిపక్ష ఉపనేత దురైమురుగన్ మాట్లాడుతూ పౌరహక్కు చట్టం సవరణ అంశాన్ని ప్రస్తావిస్తూ ఖండన తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించాలని స్పీకర్‌కు ప్రతిపక్ష నేత స్టాలిన్ ఒక్క ఉత్తరాన్ని ఇచ్చారు. ఈ ఉత్తరం పరిశీలనలో ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీ సమావేశాలు గురువారంతో ముగుస్తున్నందున ఈరోజైనా తీర్మానం ప్రవేశపెడతారా అని స్పీకర్‌ను ప్రశ్నించారు. స్టాలిన్ ఉత్తరం ఇంకా పరిశీలనలో ఉందని స్పీకర్ బదులిచ్చారు. మరలా దురైమురుగన్ మాట్లాడుతూ పౌరచట్టం సవరణకు వ్యతిరేకంగా కేరళ ప్రభుత్వం ఇప్పటికే ఒక తీర్మానాన్ని ఆమోదించింది, ఇక మాతీర్మానాన్ని ఎప్పుడు ప్రవేశపెడతారని నిలదీస్తూ సభ నుంచి సహ సభ్యులతో కలిసి వాకౌట్ చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించేందుకు అన్నాడీఎంకే ప్రభుత్వానికి ధైర్యం లేదని వాకౌట్ అనంతరం మీడియా వద్ద దురైమురుగన్ ఎద్దేవా చేశారు. -
పళని సర్కార్‌కు 20 వరకూ గడువు
-
పళని సర్కార్‌కు 20 వరకూ గడువు
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కాగా ప్రభుత్వానికి మెజార్టీ లేదనందున పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం తమదేనంటూ టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు .. బలపరీక్ష విషయంలో పళనిస్వామి ప్రభుత్వానికి ఆరురోజుల వెసులుబాటు కల్పించింది. మరోవైపు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా పళిని సర్కార్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించాలన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్టాలిన్‌తో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఇవాళ సమావేశం అయ్యారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని భేటీ అనంతరం హెచ్.రాజా తెలిపారు. కాగా వీరి ఇరువురి సమావేశం చర్చనీయంశంగా మారింది. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
వెంటనే బలపరీక్ష నిర్వహించాలి గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వండి రాష్ట్రపతిని కోరిన ప్రతిపక్ష సభ్యులు న్యూఢిల్లీ: తమిళ రాజకీయ ప్రకంపనలు ఢిల్లీకి చేరాయి. సీఎం పళనిస్వామికి మెజారిటీ లేదని, తమిళనాడు అసెంబ్లీని వెంటనే సమావేశపరిచి.. బలపరీక్షను నిర్వహించాలంటూ ప్రతిపక్ష నేతల బృందం గురువారం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసింది. రాష్ట్రపతిని కలిసినవారిలో డీఎంకే, వామపక్షాలు, కాంగ్రెస్ నేతలు ఉన్నారు. అన్నాడీఎంకేలో దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు ఎదురుతిరగడంతో పళని సర్కారు మైనారిటీలో పడిన సంగతి తెలిసిందే. సీఎం పళని వర్గానికి మెజారిటీ లేకపోయినా.. అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నిర్వహించకుండా గవర్నర్ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని, అధికార పార్టీకి అనుకూలంగా ఆయన వైఖరి ఉందని ప్రతిపక్ష సభ్యులు రాష్ట్రపతి దృష్టికి తీసుకొచ్చారు. దినకరన్ వర్గం ఎమ్మెల్యేల తిరుగుబాటు నేపథ్యంలో వెంటనే అసెంబ్లీ సమావేశపరిచి.. బలపరీక్ష నిర్వహించేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ రాష్ట్రపతిని కోరారు. అనంతరం సీపీఎం నేత ఏచూరి, సీపీఐ నేత రాజా, డీఎంకే నేత స్టాలిన్ తదితరులు మీడియాతో మాట్లాడారు. తమిళనాడులో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. గవర్నర్ వైఖరికి లేఖే కారణమా? దినకరన్ వర్గం పళనిస్వామికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినప్పటికీ.. గవర్నర్ విద్యాసాగర్‌రావు చర్య తీసుకోకపోవడం చర్చనీయాంశమైంది. అయితే, పళనిస్వామికి వ్యతిరేకంగా గవర్నర్‌కు దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు అందించిన లేఖలో పొరపాట్లు ఉన్నాయని, అందువల్లే తాము చర్య తీసుకోవడం లేదని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. తాము అన్నాడీఎంకే ఎమ్మెల్యేలమే అయినప్పటికీ, పళనిస్వామి నాయకత్వంపై తమకు విశ్వాసం లేదని, బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు కోరారు. అయితే, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నాయకత్వం తిరుగుబాటు చేస్తే.. అది పార్టీ అంతర్గత విషయం అవుతుందని, అప్పుడు పార్టీ ఎమ్మెల్యేలు అంతర్గతంగా సమావేశమై.. కొత్త నాయకత్వాన్ని ఎన్నుకొని గవర్నర్‌కు తెలియజేయవచ్చునని రాజ్‌భవన్ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమకు మెజారిటీ లేదన్న విపక్షాల వాదనను అన్నాడీఎంకే తోసిపుచ్చుతోంది. పళనికి పూర్తిస్థాయిలో సంఖ్యాబలముందని చెప్తోంది. -
ఢిల్లీకి చేరిన తమిళ ప్రకంపన!
-
అసెంబ్లీలో మళ్లీ బలపరీక్ష జరపాలి
- గవర్నర్‌కు ప్రతిపక్ష డీఎంకే వినతి - అనుకూల నిర్ణయం వస్తే అన్నాడీఎంకే పని ఢమాల్! చెన్నై: ఎమ్మెల్యేలకు ముడుపుల వ్యవహారంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష డీఎంకే పోరాటాన్ని ఉధృతం చేసింది. అక్రమ మార్గంలో విశ్వాసపరీక్ష నెగ్గిన పళని స్వామికి ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదని విమర్శించింది. ఈ క్రమంలోనే ప్రతిపక్షనేత స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే ఎమ్మెల్యేల బృందం శనివారం ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిసింది. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష నిర్వహించాలని వినతిపత్రం అందించింది. గవర్నర్‌తో భేటీ అనంతరం తమిళనాడు ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ‘పళని స్వామిని ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు ఎమ్మెల్యేలకు భారీగా ముడుపులు ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని గవర్నర్‌కు ఇచ్చాం. అసెంబ్లీలో మరోసారి బలపరీక్ష జరిగేలా ఆదేశాలివ్వాల్సిందిగా కోరాం’ అని స్టాలిన్ తెలిపారు. అటు అసెంబ్లీ సమావేశాల్లోనూ ఈ వ్యవహారంపై డీఎంకే దూకుడుగా వెళుతోంది. ముడుపుల వ్యవహారంపై చర్చ చేపట్టాలంటూ శుక్రవారం సభలో పట్టుపట్టింది. అందుకు స్పీకర్ ధన్పాల్ అంగీకరించకపోవడంతో సభను స్థంభింపజేసే ప్రయత్నం చేసింది. స్టింగ్ ఆపరేషన్‌లో అడ్డంగా బుక్కైన ఎమ్మెల్యే శరవణన్ మాత్రం వీడియోలోని గొంతు తనదికాదని వాదిస్తున్నారు. (తప్పక చదవండి: ఇదిగో సాక్ష్యం) -
ఎమ్మెల్యేల కొనుగోలుపై రచ్చరచ్చ
- అసెంబ్లీ లోపల, బయట డీఎంకే ఆందోళనలు - స్టాలిన్ సహా పలువురు ఎమ్మెల్యేల అరెస్ట్ చెన్నై: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహరం తమిళనాడు అసెంబ్లీని కుదిపేసింది. ప్రస్తుత ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా ఎమ్మెల్యేలకు భారీ ఎత్తున డబ్బు, బంగారం ఇచ్చినట్లు స్టింగ్ ఆపరేషన్‌లో బట్టబయలైన నేపథ్యంలో ప్రభుత్వాన్ని రద్దు చేయాల ప్రతిపక్ష డీఎంకే డిమాండ్ చేసింది. మంగళవారం అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే డీఎంకే ఎమ్మెల్యేలు లేచినిలబడి పన్నీర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వాకౌట్ చేసిన అనంతరం అసెంబ్లీ బయట కూడా ప్రభుత్వ వ్యతిరేక స్లోగన్లతో హోరెత్తించారు. రంగంలోకి దిగిన పోలీసులు ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్‌ను, డీఎంకేకు చెందిన ఎమ్మెల్యేలను అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యేలను కొనుగోలుచేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని సీఎం పళనిపై స్టాలిన్ మండిపడ్డారు. అక్రమంగా బలపరీక్షలో నెగ్గిన ప్రభుత్వాన్ని తక్షణమే రద్దుచేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఆందోళన, పోలీస్ అరెస్టులతో అసెంబ్లీ ఆవరణలో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
సభలో శశికళ పేరెత్తడంతో పెద్ద రగడ!
చెన్నై: కే పళనిస్వామి ప్రభుత్వం గురువారం తమిళనాడు అసెంబ్లీలో తన తొలి బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థికమంత్రి డీ జయకుమార్ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి వీకే శశికళ పేరు ప్రస్తావించడం సభలో దుమారం రేపింది. శశికళ పేరును ప్రస్తావించడాన్ని తప్పుబడుతూ ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో తీవ్ర ఆందోళనకు దిగారు. శశికళ పేరు ప్రస్తావనను సభ రికార్డుల నుంచి తొలగించాలని డీఎంకే డిమాండ్ చేసింది. అందుకు అంగీకరించకపోవడంతో స్పీకర్ పీ ధన్‌పాల్‌కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు ప్రయత్నించింది. అయితే, గురువారం అసెంబ్లీ ఎజెండా ప్రకారం బడ్జెట్ సమర్పణకు మాత్రమే స్పీకర్ అవకాశమిచ్చారు. మిగతా వ్యవహారాలు తర్వాత చేపట్టవచ్చునని పేర్కొన్నారు. బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తూ ఆర్థికమంత్రి జయకుమార్ మొదట దివంగత నేత జయలలితకు నివాళులర్పించారు. ఆ తర్వాత 'గౌరవనీయులైన చిన్నమ్మ' అంటూ శశికళను ప్రస్తావించారు. దీంతో ఆగ్రహించిన ప్రతిపక్ష నేత స్టాలిన్ వెంటనే లేచి నిలబడి నిరసన తెలిపారు. అక్రమాస్తుల కేసులో జైలుపాలైన వ్యక్తి పేరును సభలో ఎలా ప్రస్తావిస్తారని ఆయన అధికారపక్షాన్ని నిలదీశారు. అయితే, తమ పార్టీ అధినేత్రి అయిన శశికశ పేరును ప్రస్తావించడంలో తప్పేమీ లేదని జయకుమార్ సమర్థించుకున్నారు. ఈ రగడ అనంతరం ఆయన బడ్జెట్ ప్రసంగాన్ని యథాతథంగా కొనసాగించారు. -
పళని విశ్వాస పరీక్షపై రాష్ట్రపతికి నివేదిక
- ఇప్పటికే పంపిన గవర్నర్ విద్యాసాగర్‌రావు - ‘అసెంబ్లీలో’ ఆరోపణలపై డీఎంకేను ఆధారాలు చూపాలన్న కోర్టు చెన్నై/ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా ఈ నెల 18న అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఆ రాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు నివేదిక పంపారు. ఈ విషయాన్ని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా.. తమిళనాడు అసెంబ్లీలో నిబంధనలకు విరుద్ధంగా విశ్వాస పరీక్ష జరిగిందన్న దానిపై వీడియో క్లిప్పింగ్లుగాని, ఇతర ప్రామాణికాలుగాని సమర్పించాలని ప్రతిపక్ష డీఎంకేకు మద్రాస్ హైకోర్టు సూచించింది. విశ్వాస పరీక్షను రద్దు చేయాలంటూ ఈ నెల 20న డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హులువాది జి రమేశ్, జస్టిస్ ఆర్ మాధవన్‌లతో కూడిన ధర్మాసనం డీఎంకే ఆరోపణలపై ఆధారాలను సమర్పిం చాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ప్రజాస్వామ్యం ఖూనీ: స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో అన్నా డీఎంకే సభ్యులు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, విపక్ష నేత స్టాలిన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలకు నిరసనగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆధ్వర్యంలో నిరాహార దీక్షలు జరిపారు. తిరుచ్చి తెన్నూర్ ఉళవర్ సంత మైదానంలో జరిగిన నిరాహార దీక్షలో స్టాలిన్ ప్రసంగిస్తూ.. పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన స్పీకర్ ధనపాల్ అధికార పార్టీ సభ్యుడిగా మారిపోయారని మండిపడ్డారు. -
తమిళసభలో తన్నులాట
మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో ఒక కీలక ఘట్టం ముగిసింది. ముఖ్యమంత్రి పళనిస్వామి శనివారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష నెగ్గి మెజారిటీ ఎమ్మెల్యేలు తన పక్షానే ఉన్నారని నిరూపించుకున్నారు. కీలక సమయాల్లో బలంగా, దృఢంగా వ్యవహరించలేనివారు అనుకున్నది సాధించలేరని పన్నీర్‌సెల్వానికి తెలిసొచ్చింది. అయితే ఈ విశ్వాస పరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలు దురదృష్టకరమైనవి. స్పీకర్‌పై దాడిచేసి ఆయన చొక్కా చించి, దౌర్జన్యం చేస్తుంటే మార్షల్స్ ఆయనను అతి కష్టం మీద అక్కడినుంచి తరలించాల్సివచ్చింది. తనపైనే దౌర్జన్యం జరిగిందని ప్రధాన ప్రతిపక్షం నాయకుడు స్టాలిన్ అంటున్నారు. డీఎంకే సభ్యుల్ని సభ నుంచి సస్పెండ్ చేశాక తీర్మానంపై ఓటింగ్ సాధ్యమైంది. అధికారం కోసం ఈ మాదిరి కాట్లాటలు మన దేశంలో సర్వసాధారణంగా మారాయి. ఇతర సమయాల్లో ఎంతో సంస్కారవంతంగా ఉన్నట్టు కనబడేవారు చట్టసభల్లో బలా బలాలు తేల్చుకోవాల్సివచ్చేసరికి ప్రత్యర్థులపైకి లంఘించడం, దూషణలకు దిగడం... గూండాయిజానికి కూడా సిద్ధపడటం తరచు కనబడుతుంది. జయలలిత మరణానంతరం అన్నా డీఎంకే సంక్షోభంలో పడింది. దీనికితోడు శశికళ జైలుపాలుకావడంతో ఆమె ఆశీస్సులతో లెజిస్లేచర్ పార్టీ నేతగా ఎన్నికైన పళనిస్వామి బలనిరూపణ చేసుకోగలుగుతారా అన్న సందేహాలు చాలామందిలో ఏర్పడ్డాయి. శశికళ శిబిరంలోనివారు నిర్బంధంలో మగ్గుతున్నారన్న ప్రచారం జరి గింది. వారికి స్వేచ్ఛనిస్తే గెలుపు తనదేనని పన్నీర్ కూడా చెబుతూ వచ్చారు. తనకు మరో అవకాశం ఇవ్వాలని వేడుకున్నారు. ఒకసారి రాజీనామా చేశాక, దాన్ని ఆమో దించాక రాజ్యాంగపరంగా అది సాధ్యంకాని విషయం. రాజీనామా చేసిన రోజునే పన్నీర్ ఆమాట చెప్పి ఉంటే వేరుగా ఉండేది. అదే జరిగితే పన్నీర్ రాజీనామాపై గవర్నర్ సీహెచ్ విద్యాసాగరరావు నిర్ణయాన్ని వాయిదా వేసేవారేమో! నిజానికి సుబ్రహ్మణ్యస్వామిని మినహాయిస్తే బీజేపీ నేతలంతా పన్నీర్‌సెల్వానికి మద్దతు పలికారు. కనుక కేంద్ర ప్రభుత్వ అండదండలు, గవర్నర్ సానుభూతి ఆయనకే ఉన్నాయని అందరికీ తెలుస్తూనే ఉంది. కానీ సారాంశంలో అధికారం అన్నది నంబర్ గేమ్! మెజారిటీ సభ్యులు ఎవరి పక్షాన ఉన్నారని తేలితే వారికి అది దక్కు తుంది. ఎవరికి ఇష్టం ఉన్నా, లేకున్నా తమిళనాడులో జరిగింది అదే. ప్రజలంతా శశికళపై ఆగ్రహంతో ఉన్నారని, ఎమ్మెల్యేలను చెరవిడిపిస్తే వారు కూడా పన్నీర్ వైపు వస్తారన్న ప్రచారం జరిగింది. ప్రముఖ సినీ నటులు సైతం పన్నీర్నే సమర్ధించారు. నిజంగా అలాంటి పరిస్థితే ఉంటే విశ్వాసపరీక్షలో అది వ్యక్తమయ్యేది. పార్టీ నిలువునా చీలిపోకపోయినా కనీసం కొద్దిమందైనా మనసు మార్చుకునేవారు. బల నిరూపణ సమయంలో డీఎంకే వైఖరే అందరినీ ఆశ్చర్యపరి చింది. అధికారం కోసం అన్నా డీఎంకేలోని వైరి వర్గాలు ఘర్షణ పడటంలో అర్ధ ముంది. వారివల్ల సభా నిర్వహణకు ఆటంకాలెదురైతే వేరుగా ఉండేది. ఈ గొడ వతో సంబంధమే లేని ప్రతిపక్షం డీఎంకే దౌర్జన్యానికి పూనుకోవడం ఊహించని పరిణామం. సభలో తాము ఎవరినీ సమర్ధించబోమని ముందురోజు చెప్పిన మాటకే డీఎంకే నేత స్టాలిన్ కట్టుబడి ఉంటే ఆ పార్టీ పరువు నిలిచేది. కనీసం బలపరీక్షనాడు పన్నీర్‌కు మద్దతుగా ఓటేసి ఉన్నా ఎవరూ వేలెత్తిచూపరు. ఆ రెండు ప్రత్యామ్నాయాలనూ విడిచిపెట్టి రహస్య ఓటింగ్ జరపాలని డిమాండ్ చేయడం, అందుకు స్పీకర్ అంగీకరించలేదని ఆగ్రహించి వీరంగం వేయడం ఎలా సమర్ధ నీయం? పన్నీర్ సైతం రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టలేదు. గైర్హాజర్ కాలేదు. ఆయన వర్గంలోని వారంతా బలపరీక్షలో పాల్గొన్నారు. వారికి లేని అభ్యంతరం డీఎంకేకు ఎందుకు? తాము రహస్య ఓటింగ్ ప్రతిపాదన తెస్తే పన్నీర్ వర్గం చెలరేగి పోతుందని, తాము కూడా తలదూర్చి సభా నిర్వహణను అడ్డుకుంటే తీర్మానం ప్రతిపాదన అసాధ్యమై, చివరకు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టకతప్పదని ఆ పార్టీ అనుకుని ఉండొచ్చు. బలనిరూపణ మరికొన్నాళ్లు వాయిదా పడితే అన్నాడీఎంకే బీటలు వారుతుందని కలగని ఉండొచ్చు. నిజానికి శశికళ వర్గానికి సైతం అలాంటి అనుమానాలున్నాయి. రోజులు గడుస్తున్నకొద్దీ ఎమ్మెల్యేలు చేజారతారేమోనన్న దిగులుంది. అందుకే గవర్నర్ ఇచ్చిన పక్షం రోజుల గడువును కాదని, వెనువెంటనే ఓటింగ్‌కు సిద్ధపడింది. అయితే ఇప్పుడు గెలుపు సాధించినంతమాత్రాన పళనిస్వామి ప్రభుత్వం సుస్థిరంగా ఉంటుందని... రాష్ట్రంలో అనిశ్చితికి తెరపడుతుందని భావించడానికి లేదు. ఇప్పటికైతే తన వారసుణ్ణి శశికళ గెలిపించుకోగలిగారు. కానీ ఇంతమంది ఎమ్మెల్యేలను ఎల్లకాలమూ చెదిరిపోకుండా ఆమె కాపాడుకోగలరా? వారిలో అసం తృప్తి రగలకుండా చూసుకోగలరా? జైలుకెళ్తూ తన బంధువు దినకరన్‌కు శశికళ పార్టీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన ద్వారా ప్రభు త్వాన్ని నియంత్రణలో పెట్టుకోవాలన్నది శశికళ ఎత్తుగడ కావొచ్చు. మరికొన్ని నెలల్లోనే తమిళనాడులో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. వివిధ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు కూడా జరగాల్సి ఉంది. అప్పటికల్లా పళనిస్వామి నిల దొక్కుకోగలగాలి. సమర్థుడన్న పేరు తెచ్చుకోవాలి. ఇదంతా దినకరన్‌పై ఆధారపడి ఉంటుంది. పాలనలో శశికళ జోక్యం ఉన్నదన్న ముద్ర పడితే, పళనిస్వామి బల హీనుడన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. వాస్తవానికి ఇప్పటికీ ప్రజాబలం పన్నీర్‌కే ఉన్నదని సినీ నటులు ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉప ఎన్ని కలు, స్థానిక ఎన్నికలు కీలకమైనవి. అందులో ఫలితాలు ప్రతికూలంగా ఉంటే పళ నిస్వామి నుంచి వలసలు మొదలవుతాయి. ఎమ్మెల్యేలు అటు డీఎంకే వైపు... ఇటు పన్నీర్ వైపు చూడొచ్చు. అలాంటి పరిణామాలేమైనా జరిగితే వేరుగానీ ఈలోగానే పళనిస్వామికి శాపనార్థాలు పెట్టడం భావ్యం కాదు. అసెంబ్లీలో జరిగిన పరిణా మాలను సాకుగా చూపి పరిస్థితిని తిరగదోడటం మంచిది కాదు. బలపరీక్షలో ఆయన విజయం సాధించారు. దాన్ని గౌరవించి పాలన సజావుగా సాగేందుకు సహకరించడమే అందరి కర్తవ్యం. -
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
-
తమిళ అసెంబ్లీలో ఐపీఎస్‌లు!
బలపరీక్ష సమయంలో సభలోకి రావడంపై వివాదం ► పళని విశ్వాస పరీక్షపై సమగ్ర నివేదిక సమర్పించండి ► తమిళనాడు అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ ఆదేశం ► స్టాలిన్ , పన్నీర్ ఫిర్యాదుల నేపథ్యం సాక్షి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా శనివారం ఆ రాష్ట్ర అసెంబ్లీలో చోటు చేసుకున్న పరిణామాలపై సమగ్ర నివేదిక ఇవ్వాల్సిందిగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశించారు. వాస్తవానికి అసెంబ్లీలో చోటు చేసుకున్న సంఘటనలపై అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఆదివారం ఉదయమే ఓ లేఖను గవర్నర్‌కు పంపించారు. అయితే ప్రధాన ప్రతిపక్ష నేత ఎంకే స్టాలిన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంలు వేర్వేరుగా తనతో భేటీ అయ్యి ఇచ్చిన ఫిర్యాదుల్ని గవర్నర్ పరిగణనలోకి తీసుకున్నారు. పూర్తి వివరాలతో సమగ్ర నివేదికను సమర్పించాలని అసెంబ్లీ కార్యదర్శికి ఆదివారం రాత్రి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా సభలో ప్రతిపక్ష సభ్యులు లేకుండా జరిగిన ఓటింగ్‌పై వివరాలు అందజేయాలని కోరినట్లు తెలిసింది. మరోవైపు శనివారం నిబంధనలు ఉల్లంఘించి ఏకంగా తొమ్మిది మంది ఐపీఎస్‌లు సభలోకి రావడం వివాదానికి తెరతీసింది. ముందస్తు వ్యూహం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దించారనే డీఎంకే వర్గాలు ఆరోపిస్తున్నాయి. ఆదివారం డీఎంకే ఎంపీలు తిరుచ్చి శివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్ ఉదయం రాజ్‌భవన్ లో గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. స్టాలిన్ తరఫున వినతిపత్రాన్ని సమర్పించారు. స్టాలిన్ పై దాడిని వివరించడంతో పాటు బలపరీక్షలో పళనిస్వామి గెలుపును రద్దు చేయాలని, మరోమారు బల పరీక్షకు ఆదేశించాలని విన్నవించారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం సైతం గవర్నర్‌ను కలసి అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, స్పీకర్ వ్యవహరించిన తీరును వివరించారు. పళనిస్వామి గెలుపు చెల్లదంటూ ప్రకటించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. సీఎం పళని స్వామి కూడా ఆదివారం గవర్నర్‌తో భేటీ అయ్యారు. అసెంబ్లీలో డీఎంకే పనిగట్టుకుని వీరంగాన్ని సృష్టించిందని విద్యాసాగర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్ మీద జరిగిన దాడిపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్ష నిర్వహించాలని నిర్ణయించారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. రాష్ట్రపతిని కలసి ఫిర్యాదు చేసేందుకు అపాయింట్మెంట్ కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. మెరీనా తీరంలో నిషేధాజ్ఞల్ని ఉల్లంఘించి నిరసన దీక్ష నిర్వహించారంటూ ఇద్దరు డీఎంకే ఎంపీలు, స్టాలిన్ తో పాటు 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై కేసులు నమోదు చేశారు. ఐపీఎస్‌ల గుర్తింపు! తమిళనాడు అసెంబ్లీలో ఐపీఎస్ అధికారులు ప్రవేశించారనే వార్త సంచలనం సృష్టిస్తోంది. శనివారం నాడు డీఎంకే సభ్యులను అసెంబ్లీ నుంచి బయటకు తరలించేందుకు మార్షల్స్ రంగ ప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. అయితే మార్షల్స్ యూనిఫామ్‌లో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు అసెంబ్లీలోకి అడుగు పెట్టినట్లుగా గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో తేలినట్టు తెలిసింది. సభలో ప్రవేశించిన 9 మంది ఐపీఎస్ అధికారులను గుర్తించినట్టు కూడా తెలిసింది. ముందస్తు పథకం ప్రకారమే ఐపీఎస్‌లను రంగంలోకి దింపారని, ప్రతిపక్ష నేత స్టాలిన్ పై దాడి కూడా పథకం ప్రకారమే జరిగిందన్న ఆరోపణలు విన్పిస్తున్నాయి. శనివారం నాటి పరిణామాలపై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. మార్షల్స్ యూనిఫామ్ ధరించి పలువురు ఐపీఎస్ అధికారులు సభలో ప్రవేశించారని, అదికూడా స్పీకర్ సభలో లేని సమయంలో ప్రవేశించారని తెలుస్తోంది. వీరిలో చెన్నైలో అసిస్టెంట్, డిప్యూటీ, సహాయ కమిషనర్లుగా పనిచేస్తున్న శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్.సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్‌లను గుర్తించినట్లు తెలిసింది. సభలో చెలరేగిన గందరగోళం నేపథ్యంలో ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి తన లేఖలో పేర్కొన్నట్టు తెలిసింది. ఇలావుండగా కొద్ది రోజులుగా చెన్నైలోనే ఉన్న గవర్నర్ ముంబైకి బయలుదేరి వెళ్లారు. -
పథకం ప్రకారమే స్టాలిన్‌పై దాడి?
- వెలుగులోకి వాస్తవాలు - దాడికి నిరసనగా డీఎంకే దీక్షలు - రాష్ట్రపతికి ఫిర్యాదు చేయనున్న స్టాలిన్ సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా దాడి చేయించిందా? ఈ ప్రశ్నకు డీఎంకే నాయకులు అవుననే అంటున్నారు. మార్షల్స్ ముసుగులో నిబంధనలు ఉల్లంఘించి తొమ్మిది మంది ఐపీఎస్‌లు తమిళనాడు అసెంబ్లీలోకి అడుగు పెట్టడమే ఇందుకు బలమైన రుజువని చెబుతున్నారు. సభా నిబంధనలకు విరుద్ధంగా ఐపీఎస్‌లను రంగంలోకి దించి, పథకం ప్రకారం ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్‌పై దాడి చేయించారన్న ఆరోపణలకు బలం చేకూరే ఆధారాలు దొరికినట్టు సమాచారం. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు ఆదేశాల మేరకు సాగిన విచారణలో ఆ తొమ్మిది మంది ఐపీఎస్‌లను గుర్తించినట్టు తెలిసింది. ఈ విషయమై స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గవర్నర్ విచారణకు ఆదేశించినట్టు సమాచారం. సభలో స్పీకర్ కూడా లేని సమయంలో చొరబడ్డ ఆ అధికారులు బలవంతంగా స్టాలిన్‌ను బయటకు ఎత్తుకెళ్లినట్టు ఆధారాలు బయట పడ్డాయి. శ్రీధర్, సంతోష్‌కుమార్, జోషి నిర్మల్ కుమార్, ఆర్ సుధాకర్, రవి, గోవిందరాజ్, ముత్తలగు, శివ భాస్కర్, దేవరాజ్ అనే ఐపీఎస్‌లు సభలోకి వచ్చినట్టు గుర్తించారు. జల్లికట్టు ఉద్యమంలో సాగిన అల్లర్ల వ్యవహారంలో వీరిపై పలు ఆరోపణలు ఉన్నాయి. సభలో సాగుతున్న గందరగోళం మేరకు ఆగమేఘాలపై ఐపీఎస్‌లను రంగంలోకి దించాల్సి వచ్చినట్టు అసెంబ్లీ కార్యదర్శి వివరణ ఇచ్చారు. అయితే, హఠాత్తుగా ఐపీఎస్‌లకు మార్షల్స్ యూనిఫారాలు ఎక్కడి నుంచి వచ్చాయని, సభలో స్పీకర్ లేని సమయంలో ఎలా మార్షల్స్ ముసుగులో ఆ అధికారులు ప్రవేశించారని డీఎంకే ప్రశ్నించింది. దీంతో ఈ తొమ్మిది మంది మెడకు నిబంధనల ఉల్లంఘన వ్యవహారం చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. 22న డీఎంకే దీక్షలు స్టాలిన్‌కు జరిగిన అవమానంపై డీఎంకే వర్గాలు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నాయి. తనను బలవంతంగా ఎత్తుకు వచ్చి, దాడి చేశారని స్టాలిన్ ప్రకటించారు. దీంతో ప్రభుత్వంపై పోరాటానికి డీఎంకే శ్రేణులు సిద్ధమయ్యాయి. దూకుడు ప్రదర్శించి ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలని స్టాలిన్ నిర్ణయించారు. ఆదివారం తేనాంపేటలోని పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలు, ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు. దాడికి నిరసనగా ఈనెల 22న అన్ని జిల్లా కేంద్రాల్లో ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు నిరసన దీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా అనుమతి కోరనున్నామని స్టాలిన్ తెలిపారు. దీక్షకు డీఎంకే సిద్ధం అవుతోంటే, మెరీనా తీరంలో నిషేదాజ్ఞల్ని ఉల్లంఘించి ఆందోళన నిర్వహించారని పేర్కొంటూ, స్టాలిన్, ఇద్దరు ఎంపీలు, 69 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై అక్కడి పోలీసులు కేసులు నమోదు చేశారు. గవర్నర్ వద్ద పంచాయితీ - అసెంబ్లీని రద్దు చేయాలన్న డీఎంకే - సభలో పరిస్థితులను వివరించిన స్వామి చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి తెరపడినా.. అధికార, ప్రతిపక్ష పార్టీలు పోరాటాన్ని కొనసాగిస్తున్నాయి. ఆదివారం ఇరు పార్టీల నాయకులు గవర్నర్ విద్యాసాగర్ రావును కలసి ఒకరిపై మ రొకరు ఫిర్యాదు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పళనిస్వామి బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో జరిగిన పరిణామాలను వివరించారు. కాసేపటి తర్వాత డీఎంకే ప్రతినిధి బృందం గవర్నర్‌ను కలసి అధికార పార్టీ తీరుపై ఫిర్యాదు చేసింది. అసెంబ్లీలో తమ పార్టీ ఎమ్యెల్యేలపై జరిగిన దౌర్జన్యంపై గవర్నర్‌కు వినతిపత్రం అందజేశామని, పరి శీలిస్తానని ఆయన హామీ ఇచ్చారని డీఎంకే ఎంపీ తిరుచ్చి శివ చెప్పారు. ప్రతిపక్ష పార్టీలను బయటకు గెంటి బలపరీక్షలో ముఖ్యమంత్రి గెలవడం చట్టవిరుద్ధమని అన్నారు. శాసనసభలో శనివారం జరిగిన కార్యకలాపాలను రద్దు చేయాలని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ గవర్నర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్షాల సభ్యులు లేకుండానే విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారని సభలో విపక్ష నాయకుడు కూడా అయిన ఆయన పేర్కొన్నారు. శనివారం తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్బంగా రణరంగాన్ని తలపించిన సంగతి తెలిసిందే. డీఎంకే సభ్యులు కుర్చీలు, మైకులు విరగ్గొట్టి స్పీకర్ ధనపాల్‌పై విసిరివేశారు. సభ రెండుసార్లు వాయిదా పడిన అనంతరం స్పీకర్ డీఎంకే ఎమ్మెల్యేలను బయటకి పంపి ఓటింగ్ ప్రక్రియను పూ ర్తి చేశారు. ఇదిలా ఉంటే స్వామిని బలపర్చినందుకు తనకు బెది రింపులు వస్తున్నాయని కోయంబత్తూరు ఎమ్మెల్యే అమ్మన్ అర్జునన్ ఆరోపించారు. గుర్తుతెలియని వ్యక్తులు ఫోన్ చేసి దుర్భాషలాడారని చెప్పారు. వికీపిడియాలో 'పళనిస్వామి: శశికళ బానిస' ప్రజా మద్దతుకు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి పేరు వికీపీడియాలో మారిపోయింది. పళనిస్వామి పేరును కొట్టేసి ఆ స్థానంలో ‘శశికళ బానిస’ అని రాశారు. శశికళకు వ్యతిరేకంగా పన్నీర్ సెల్వం గళమెత్తడంతో అన్నాడీఎంకేలో మొదలైన ఆధిపత్య పోరులో చివరికి చివరికి నాటకీయ పరిణామాల మధ్య పళనిస్వామి గద్దెనెక్కారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ, ఇళవరసి, సుధాకరన్ జైలుకు వెళ్లారు. అయితే శశికళ మద్దతుదారుడైన పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం ఎక్కడాన్ని జీర్ణించుకోలేని కొందరు వికీపీడియాలో ఆయన పేరును శశికళ బానిస అని మార్చేసి తమ కోపాన్ని చల్లార్చుకున్నారు. ఫిబ్రవరి 16నే దీనిని ఎడిట్ చేశారు. దీనిని చూసిన నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో సంచలనం సృష్టించింది. అయితే ఇప్పుడు ఆ పేరును సరిచేశారు. ఇది మాఫియా సర్కార్: కమల్ హాసన్ పళనిస్వామి ప్రభుత్వంపై ప్రముఖ హీరో కమల్‌హాసన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం తమిళనాడులో ఏర్పాటైన ప్రభుత్వానికి, నేరగాళ్ల గ్యాంగ్‌నకు పెద్ద తేడా ఏమీ లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో శనివారం నాటి పరిణామాలను, సభ జరిగిన తీరును తనతో సహా ప్రజలు ఎవరూ అంగీకరించడం లేదన్నారు. జైలులో ఉన్న శశికళ ఎంచుకున్న వ్యక్తి ముఖ్యమంత్రి కావడం బాధాకరమన్నారు. తమిళ అసెంబ్లీని శుద్ధి చేయాల్సిన సమయం ఆసన్నమైందని, దానిని మనమే శుద్ధి చేయాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ అరంగేట్రంపై మరోమారు స్పందించిన కమల్ తాను రాజకీయాలకు పనికిరానని స్పష్టం చేశారు. -
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
-
స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు
⇒ రాష్ట్రవ్యాప్తంగా డీఎంకే ఆందోళనలు ⇒ గవర్నర్‌కు ఫిర్యాదు ⇒ ఇక ప్రజాఉద్యమం: స్టాలిన్ సాక్షి, చెన్నై: డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌కు శాసనసభలో అవమానం జరిగిందన్న సమాచారం తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తతలకు దారితీసింది. చిరిగిన చొక్కాతో స్టాలిన్ మీడియా ముందుకు రావడాన్ని చూసి డీఎంకే శ్రేణులు తట్టుకోలేకపోయాయి. రాష్ట్రవ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలతో ఆందోళనలు చేపట్టాయి. పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ రాస్తారోకోలు, ధర్నాలకు దిగడంతో వాతావరణం వేడెక్కింది. చెన్నై, మదురై, కోయంబత్తూరు, ఈరోడ్, నామక్కల్, తిరునల్వేలి, తిరుచ్చిల్లో భారీ ఎత్తున నిరసనలు రాజుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా హైఅలెర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ నిరసనకారుల్ని అరెస్టు చేయడంతో ఏదేని అల్లర్లు బయలు దేరవచ్చన్న ఉత్కంఠ బయలుదేరింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నిఘాను కట్టుదిట్టం చేశారు. గాంధీ విగ్రహం వద్ద నిరసన స్టాలిన్ అసెంబ్లీ నుంచి నేరుగా ఎనిమిదిమంది ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌కు వెళ్లారు. అసెంబ్లీలో తనకు జరిగిన అవమానం, మార్షల్స్ దురుసుతనం గురించి గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అక్కడినుంచి నేరుగా మెరీనా తీరంలోని గాంధీ విగ్రహం వద్ద ఎమ్మెల్యేలు, పార్టీ ఎంపీలతో కలిసి స్టాలిన్ నిరసన చేపట్టడం ఉత్కంఠను రేపింది. ఆయన్ను ఆగమేఘాలపై అరెస్టు చేయడానికి ప్రయత్నాలు చేసినా, ఒక్కసారిగా ఆ పరిసరాల్లో డీఎంకే వర్గాలు దూసుకురావడంతో పోలీసులు సంయమనం పాటించాల్సి వచ్చింది. ఎమ్మెల్యేలను అరెస్టు చేసినా, స్టాలిన్‌ను అరెస్టు చేయడానికి వెనక్కు తగ్గారు. వేలాదిగా మెరీనా వైపుగా జనసందోహం సైతం తరలిరావడంతో పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం ఉందన్న ఆందోళన బయలు దేరింది. దీంతో పోలీసు ఉన్నతాధికారులు స్టాలిన్‌ను బుజ్జగించారు. మరో జల్లికట్టు ఉద్యమం బయలు దేరనున్నదా అన్నంతగా జనం తరలి వస్తుండడం, పరిస్థితి అదుపు తప్పే ప్రమాదాన్ని గ్రహించిన స్టాలిన్ పోలీసులకు సహకరించక తప్పలేదు. ఈ సందర్భంగా స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యాన్ని అసెంబ్లీలో పాతిపెట్టారని ధ్వజమెత్తారు. ప్రజలను ఏకంచేసి మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నామని ప్రకటించారు. -
విజేత పళని
అనుకూలం 122.. ప్రతికూలం 11 - 29 ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం - రణరంగంగా మారిన తమిళనాడు శాసనసభ... రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టిన డీఎంకే - కుదరదన్న స్పీకర్ ధన్పాల్... విపక్ష సభ్యుల వాగ్వివాదం - అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ - తోపులాటలో విరిగిన మైక్‌లు.. చిరిగిన చొక్కాలు - అసెంబ్లీలో యుద్ధ వాతావరణం.. రెండుసార్లు వాయిదా - డీఎంకే సభ్యుల బహిష్కరణ... కాంగ్రెస్, ముస్లింలీగ్ వాకౌట్ - విపక్ష సభ్యులెవరూ లేకుండానే బలపరీక్ష చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, చెన్నై: అరుపులు, కేకలు.. ఎగిరిపడిన కుర్చీలు.. విరిగిన మైకులు.. పడిన బెంచీలు.. చిరిగిన చొక్కాలు.. ఎగిరిన కాగితాలు.. ఎమ్మెల్యేల బాహాబాహీ.. మార్షల్స్ బలప్రయోగంతో తమిళనాడు శాసనసభ రణరంగంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష రణరంగాన్ని తలపించింది. బలపరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుబట్టింది. అందుకు స్పీకర్ తిరస్కరించడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ మైక్ విరిగింది. ఎమ్మెల్యేల చొక్కాలు చిరిగాయి. శాసనసభ యుద్ధవాతావరణాన్ని తలపించింది. స్పీకర్ ధన్పాల్, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పరాభవం పాలయ్యారు. ఎట్టకేలకు ప్రతిపక్ష డీఎంకే సభ్యుల బహిష్కరణ.. కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యుల వాకౌట్ తర్వాత... ప్రతిపక్షంలేని సభలో సీఎం పళనిస్వామి విజయం సాధించారు. అన్నాడీఎంకేలోని వైరి వర్గాల నడుమ సాగిన బలపరీక్షలో అనేక ఉద్రిక్త పరిణామాల మధ్య పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 122 ఓట్లతో నెగ్గింది. ఆయనకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గానికి చెందిన కేవలం11మంది ఓటు వేశారు. ఎట్టకేలకు రెండువారాల ఉత్కంఠకు తెరపడింది. అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గడంతో పదిరోజులపాటు ఎమ్మెల్యేల నివాసంగా మారిన గోల్డన్బే రిసార్టు ఖాళీ అయింది. సీఎంకు వ్యతిరేకంగా ఈరోడ్, కాంగేయం, భవానీల్లోని అన్నాడీఎంకే కార్యాలయాల ముందు పన్నీర్, దీప వర్గీయులు ఆందోళన చేశారు. సీఎం ఇంటిని స్టానికులు ముట్టడించే యత్నం చేశారు. విశ్వాసతీర్మానం ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొనడంతో ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, పార్కులు జనం లేక బోసిపోయాయి. జయ మరణంతో ముసలం... పురచ్చి తలైవి జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సీఎం కావటం.. కొద్దిరోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తరువాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై పన్నీర్ తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన నాలుగో రోజు హైకోర్టు సంచలన తీర్పుతో శశికళ జైలు పాలవడం చకచకా జరిగిపోయాయి. సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య జరిగిన పోటీలో అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇచ్చినా, సీఎం ప్రమాణస్వీకారం చేసిన రెండవ రోజే పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమేరకే శనివారం ఉదయం 9–10:30 గంటల మధ్య రాహుకాలం కావడంతో 8.45 గంటలకే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూవత్తూరు క్యాంపు నుంచి బయలుదేరారు. ఒక్కో మంత్రి కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున 30 మంది మంత్రుల కారుల్లో 120 మంది ఎమ్మెల్యేలు, సీఎం కారులో ఇద్దరు కూర్చోగా పోలీసు బందోబస్తు నడుమ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో రచ్చ రచ్చ... తమిళనాడు అసెంబ్లీ శనివారం ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ధనపాల్ ప్రకటనతో సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ లేచి అధికార అన్నాడీఎంకే పార్టీ విప్ ఎవరో ప్రకటించాలని పట్టుబట్టారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం సెమ్మలైని విప్‌గా ప్రకటించగా... పళనిస్వామి వర్గం విప్‌ను ప్రకటించకుండానే విశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. దీంతో ప్రతిపక్ష డీఎంకే విశ్వాస పరీక్షను అడ్డుకుంది. ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని స్టాలిన్, పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలని వారిద్దరూ పట్టుబట్టారు. స్పీకర్ అందుకు నిరాకరించడంతో స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. తన అధికారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని స్పీకర్ ప్రకటించి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ఒంటిగంటకు అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం మద్దతుదారులు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టారు. స్పీకర్ ససేమిరా అనడంతో అన్నాడీఏంకే, డీఏంకే ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో బల్లలు ధ్వంసమయ్యాయి... మైక్‌లు విరిగాయి... పేపర్లు చిరిగాయి. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకానొక సమయంలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కుక సెల్వం, రంగనాథన్ స్పీకర్ సీటు వద్ద నిల్చొని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కొన్ని క్షణాలపాటు స్పీకర్ సీట్లో కూర్చొన్నారు. తనను కిందకు లాగేసి, చొక్కా చించారంటూ స్పీకర్ ధనపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే డీఎంకే సభ్యులందరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సభను నుంచి బయటకు వెళ్లేందుకు డీఎంకే సభ్యులు నిరాకరించారు. తాము ప్రజలకోసం పోరాడుతున్నామని, తమను బలవంతంగా బయటకు తీసుకెళ్తే ఆత్మహత్యలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు మార్షల్స్ 2.50 గంటలకు ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి ఖాళీ చేయించగలిగారు. సుమారు 25 మంది మార్షల్స్ ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను చేతుల్తో పైకి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. సభలో తమపై జరిగిన దౌర్జన్యం గురించి ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. డీఎంకేకు మద్దతుగా వారి మిత్రపక్షం కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా బలనిరూపణను బాయ్‌కాట్ చేశాయి. ప్రతిపక్షాలు లేకుండా తీర్మానం... ప్రతిపక్ష సభ్యులెవరూ లేకుండా సభ మూడు గంటలకు మళ్లీ ప్రారంభమైంది. సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ చదివి వినిపించారు. తీర్మానంపై సభ్యులు ప్రసంగించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పరిపాటైనా... నేడు అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లేచి నిలబడితే లెక్కించే ప్రక్రియను ప్రవేశపెడుతున్నానని స్పీకర్ చెప్పారు. ముందువైపున మూడు లైన్లలో అన్నాడీఎంకే, వెనుకవైపున్న మిగిలిన మూడులైన్లలో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ప్రతిపక్ష సభ్యులెవ్వరూ సభలో లేరు. పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానంపై అసెంబ్లీలో సభ్యులు లేచి నిలబడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే అనుకూలంగా 122, ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చినట్లు స్పీకర్ ప్రకటించారు. చరిత్ర పునరావృతం... తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షను ఎదుర్కొన్న పార్టీగా అన్నాడీఎంకే మరోసారి చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్ మరణం తరువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తింది. 1988 జనవరి 27న ముఖ్యమంత్రి పీఠానికి బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సభ్యులు సభలోనే కొట్టుకున్నారు. తప్పని పరిస్థితుల్లో తొలిసారి పోలీసులు సభలోకి ప్రవేశించాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్పీకర్‌గా ఉన్న పీహెచ్ పాండియన్ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష సభ్యులపై అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. అదే విధంగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ చొక్కా చిరిగిపోయింది. ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కాను చించివేశారు. తమకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఇటు స్పీకర్, అటు ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద ఎప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించినా తమిళనాడు శాసనసభలో యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం. తీరని అవమానం: స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ చరిత్రలో ఎవ్వరూ ఎరగని, జరగకూడని అవమానానికి తాను లోనైనానని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బలనిరూపణ తర్వాత ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల్లో అట్టడుగు ఆది ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన తాను అమ్మ దయవల్ల ఇంతటి ఉన్నతస్థితికి చేరుకున్నానని చెప్పారు. ప్రధానప్రతిపక్ష నేత నడుచుకున్న తీరు ఎంతో బాధాకరమని, ఆయన వైఖరికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నానని స్పష్టంచేశారు. అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ ప్రభుత్వం నిలబడింది: సీఎం పళనిస్వామి తమిళనాడులో అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తంచేశారు. విశ్వాసతీర్మానం నెగ్గగానే మంత్రివర్గ సహచరులతో కలిసి మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... విశ్వాస తీర్మానాన్ని విఫలం చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎంజీఆర్, జయలలితల ఆశయాల సాధన కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చిన్నమ్మ చేసిన శపథం నెరవేరిందన్నారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయినవారంతా డీఎంకేతో చేతులు కలిపారని, అసెంబ్లీ చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. నెగ్గిన విశ్వాస తీర్మానాన్ని గవర్నర్‌కు పంపామని తెలిపారు. బలపరీక్ష సమయానికి సభలో 133మందే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుండగా శనివారం 230 మంది హాజరయ్యారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 136 సభ్యుల బలం ఉండగా జయ మరణంతో 135 మంది ఉన్నారు. ఇందులో శశికళ వర్గానికి చెందిన 122 మంది, పన్నీర్‌సెల్వానికి చెందిన 11 మంది హాజరయ్యారు. పన్నీర్ వర్గానికి చెందిన కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ గైర్హాజరుతో మొత్తం 133గా మిగిలింది. డీఎంకేకు 89 మంది సభ్యులుండగా అస్వస్థత కారణంగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అసెంబ్లీకి రానందున 88 మంది సభ్యులు హాజరయ్యారు. అలాగే 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముస్లింలీగ్ ఎమ్మెల్యే వచ్చారు. అయితే డీఎంకే సభ్యులను బహిష్కరించడం... కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు బహిష్కరించడంతో ఓటింగ్ సమయానికి సభలో అన్నాడీఎంకేకు చెందిన 133మంది సభ్యులు మాత్రమే మిగిలారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
ఇపుడే ధర్మయుద్ధం మొదలైంది
-
ఇపుడే ధర్మయుద్ధం మొదలైంది- పన్నీరు
చెన్నై: నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. అరాచకశక్తులు ఇపుడు విజయం సాధించినా తమ పోరాటం కొనసాగుతుందని సెల్వం స్పష్టం చేశారు. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఖూనీ చేశారన్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోరితే దాడిచేశారనీ, అన్యాయంగా కొట్టి, బలవంతంగా సభనుంచి లాగి పడేశారని విమర్శించారు. మాఫియా చర్యల్లో భాగంగా విశ్వాస పరీక్షను ముగించారని దుయ్యబట్టారు. అసలైన యుద్ధం మొదలైందని పన్నీరువర్గం ప్రకటించింది. డీఎంకే, కాంగ్రెస్,ఇ తరప్రతిపక్ష సభ్యులు లేకుండా ఓటింగ్ నిర్వహించడం అప్రజాస్వామికమని ఆరోపించింది. అసలైన ధర్మ యుద్ధం ఇపుడే మొదలైంది. తమపోరాటం కొనసాగుతుందని పన్నీరు వర్గం స్పష్టం చేసింది. కాగా మధ్యాహ్నం 3గంటలకు వాయిదా తరువాత తిరిగి ప్రారంభమైన అసెంబ్లీలో మూజువాణి ఓటింగ్‌ను కొనసాగించిన స్పీకర్ సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్షలో నెగ్గినట్టు ప్రకటించారు. పళనికి మద్దతుగా 122, వ్యతిరేకంగా 11 ఓట్లు నమోదైనట్టు ప్రకటించారు. -
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
-
కొట్టి, తిట్టి లాగి పడేశారు- స్టాలిన్
చెన్నై: డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ అసెంబ్లీ రగడపై తీవ్రంగా స్పందించారు. తమిళనాడు అసెంబ్లీలో ఒక ప్రతిపక్ష నాయుడికి తీరని అవమానం జరిగిందని ధ్వజమెత్తారు. స్పీకర్ సభా మర్యాదలు పాటించడంలో విఫలమయ్యారని మండిపడ్డారు. తన చిరిగిన చొక్కాను చూపిస్తూ కొట్టి, తిట్టి తమను బలవంతంగా బయటకు లాగిపడేశారని ఆరోపించారు. సభలో జరిగిన పరిణామాలు, పరిస్థితులను వివరించేందుకు గవర్నర్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు. దీనిపై ఫిర్యాదు చేయనున్నట్టు ఆయన తెలిపారు. రహస్య ఓటింగ్ జరగాలని మరోసారి డిమాండ్ చేశారు. ఇందుకోసం అవసరమైతే రాష్ట్రపతిని కూడా కలుస్తామని పేర్కొన్నారు. సభలోతీవ్రం గందరగోళ పరిస్థితుల మధ్య బయటికువచ్చిన డీఎంనే నేత స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యేలను అవమానించారని మండిపడ్డారు. సభా మర్యాదలు పాటించలేదనిని మండిపడ్డారు. తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నడుమ ప్రారంభంనుంచీ అసెంబ్లీలో రహస్య ఓటింగ్ పై రగడ నెలకొంది. దీంతో అసెంబ్లీ నుంచి డీఎంకే నేతలపై మార్షల్స్ రంగంలోకి దిగారు. ఒక్కొక్కర్నీ చేతులపై ఎత్తిపట్టుకునే బయటకు లాగి పడేశారు. కొంతమంది ఎమ్మెల్యే చొక్కాలు చిరిగా పోయాయి. పలువురికి గాయాలయ్యాయి. ముఖ్యంగా డీఏంకు నేత స్టాలిన్ కు చొక్కా చిరిగిపోయింది. దీంతో ఆందోళన మరింత ముదిరింది. డీఎంకే ఎమ్మెల్యేల బహిష్కరణ, స్పీకర్ పోడియం వద్ద స్టాలిన్ చేపట్టిన ధర్నా లాంటి ఉద్రిక్త పరిస్థితులమధ్య మార్షల్స్‌ను ఎమ్మెల్యేలను బయటకు లాగి పడేయడం కనిపించింది. దీంతో మరింత గందరగోళం చెలరేగింది. -
అసెంబ్లీలో మీడియా కష్టాలు
తమిళనాడు అసెంబ్లీలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని విధ్వంసం ఏర్పడింది. దాంతో అదేదీ ప్రెస్ గ్యాలరీలోకి వినిపించకుండా ఉండేందుకు గ్యాలరీలో ఉన్న స్పీకర్ కనెక్షన్‌ను స్పీకర్ కట్ చేశారు. డీఎంకే సభ్యులు తీవ్ర గందరగోళ పరిస్థితులు సృష్టించారు. దీంతో స్పీకర్ కుర్చీ, మైకు విరిగిపోయాయి. సీఎం పళనిస్వామి విశ్వాస పరీక్షపై అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ ప్రక్రియపై ప్రతిపక్షం డీఎంకే తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఆ విషయాలేవీ మీడియాకు ఎక్కకుండా ఉంటే మంచిదని భావించిన స్పీకర్ ధనపాల్.. ప్రెస్ గ్యాలరీలో ఉన్న స్పీకర్ కనెక్షన్ తీసేశారు. దాంతో మీడియా వర్గాలకు అసలు సభలో ఏం జరుగుతోందో, ఎవరు ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. అయితే సభలో కొంతమంది సభ్యలు బెంచీలు ఎక్కి నిలబడటం, స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టడం లాంటివి మాత్రం కళ్లకు స్పష్టంగా కనిపించాయి. -
నేడే బల పరీక్ష.. పది ఓట్లే కీలకం
-
‘మ్యాజిక్’ చేసేదెవరు?
తమిళనాడులో నేడే బలపరీక్ష... పది ఓట్లే కీలకం - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. పన్నీర్ గూటికి మైలాపూర్ ఎమ్మెల్యే - పళని క్యాంప్‌లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు - హుటాహుటిన రిసార్ట్స్‌కు సీఎం.. ఎమ్మెల్యేల బుజ్జగింపు - పళని శిబిరంలో 123.. పన్నీర్ వద్ద 12 మంది ఎమ్మెల్యేలు - పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న డీఎంకే - అధిష్టానం ఆదేశానుసారం నడుస్తామన్న కాంగ్రెస్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయ పరిమాణాలు చివరిఘట్టంలోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న బలపరీక్షపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆయన శనివారమే బలం నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. తాజాగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠగా తమిళ రాజకీయాలు పురట్చితలైవి జయలలిత మరణం తరువాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదిరోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలుకావడం... పన్నీర్ పదవీచ్యుతుడవ్వడం.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... 18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. ఆ తరువాత మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించినట్లు తెలిసింది. 20 మంది తిరుగుబాటు నటరాజన్ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో పళనిస్వామి బెంగళూరు పర్యటను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశకళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రహస్య ఓటింగ్‌కు డిమాండ్ అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు. 30 ఏళ్ల తరువాత బలపరీక్ష రిపీట్ తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
జల్లికట్టు బిల్లుకు ఆమోదం
చెన్నై: జల్లికట్టు కోసం తమిళులు చేస్తున్న ఆందోళనలకు కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాలు దిగివచ్చాయి. సోమవారం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశమై.. జల్లికట్టు బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించింది. సభలో అన్నా డీఎంకే ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి. కొన్ని నిమిషాల్లోనే ఈ బిల్లుకు ఆమోదం లభించింది. జల్లికట్టు నిర్వహణకు తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన ఆర్డినెన్స్ ముసాయిదాలో కొద్దిపాటి మార్పులుచేసి కేంద్ర హోం, న్యాయ, పర్యావరణ మంత్రిత్వ శాఖలు ఆమోదించిన సంగతి తెలిసింది. కేంద్రం ఈ ఆర్డినెన్స్‌ను తిరిగి తమిళనాడుకు పంపగా, ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు శనివారం ఆమోదం తెలిపారు. కాగా జల్లికట్టుపై ఆర్డినెన్స్ ఒక్కటే సరిపోదని, శాశ్వత పరిష్కారం కావాలని డిమాండ్ చేస్తూ తమిళనాడులో చేస్తున్న ఆందోళనలు హింసాత్మకంగా మారుతున్నాయి. జల్లికట్టుపై సుప్రీం కోర్టు నిషేధం విధించడంతో తమిళులు శాశ్వత పరిష్కారం కోరుతూ ఆందోళనలు చేస్తున్నారు. -
డీఎంకే ఎమ్మెల్యేలకు దక్కని ఊరట
చెన్నై: తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలకు మద్రాస్ హైకోర్టులో ఊరట లభించలేదు. ఎమ్మెల్యేల సస్పెన్షన్ నిలుపుదల చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. అసెంబ్లీ స్పీకర్ పి. ధనపాల్ కు నోటీసు జారీ చేసింది. ఈ వ్యవహారంపై వారం రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది. స్టాలిన్ సహా 89 మంది డీఎంకే ఎమ్మెల్యేలను ఈ నెల 18న అసెంబ్లీ నుంచి వారం రోజుల పాటు సస్పెండ్ చేశారు. దీంతో మార్షల్స్ రంగప్రవేశం చేసి డీఎంకే సభ్యులను బలవంతంగా బయటకు పంపివేశారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈనెల 19న డీఎంకే సభ్యులు శాసనసభ ప్రాంగణంలో మాక్ అసెంబ్లీ నిర్వహించారు. అనుమతి లేకుండా ప్రవేశించినందుకు స్టాలిన్ సహా 60 మంది డీఎంకే ఎమ్మెల్యేలపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిరంకుశ అన్నాడీఎంకే ప్రభుత్వం ప్రతిపక్షంపై వేధింపులకు పాల్పడుతోందని, తమను అరెస్ట్ చేసినా ఆశ్చర్య పడాల్సిన అవసరం లేదని స్టాలిన్ అన్నారు. జైలు కెళ్లేందుకు తామంతా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. -
సస్పెన్షన్ రగడ
నిరసనలతో దద్దరిల్లిన జార్జ్‌కోట స్పీకర్ తీరుపై సర్వత్రా ఆగ్రహం దిష్టిబొమ్మల దహనం, ఆందోళనలు 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు డీఎంకే పిలుపు ప్రత్యేక ప్రసారానికి భయం ఏల...?కరుణ, స్టాలిన్ల ప్రశ్న డీఎంకే సభ్యుల సస్పెన్షన్ వ్యవహారం నిరసనలకు దారి తీశాయి. స్పీకర్ ధనపాల్ తీరును ఖండిస్తూ రాజకీయ పక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. డీఎంకే సభ్యులు ఏకంగా జార్జ్‌కోట అసెంబ్లీ ఆవరణలోని నాలుగో నంబర్ గేటు వద్ద ధర్నాకు దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అసెంబ్లీ సమావేశాల ప్రత్యేక ప్రసారాలకు భయం ఎందుకో అని ప్రభుత్వాన్ని డీఎంకే అధినేత కరుణానిధి, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రశ్నించారు. చెన్నై: అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం చోటు చేసుకున్న పరిణామాలతో డీఎంకే సభ్యులు మెజారిటీ శాతం మందిపై వారం రోజుల పాటు సస్పెన్షన్ వేటు పడ్డ విషయం తెలిసిందే. ఐదారుగురు డీఎంకే సభ్యులు సభకు రాని దృష్ట్యా, వారు మాత్రం సస్పెన్షన్ వేటుకు గురి కాలేదు. వీరిని మాత్రం గురువారం సభలోకి అనుమతి ఇచ్చారు. మిగిలిన వారు జార్జ్కోటలోకి అడుగు పెట్టకుండా, అడ్డుకునేందుకు తగ్గట్టుగా అధికార పక్షం సర్వం సిద్ధం చేసింది. అసెంబ్లీ సమావేశ మందిరంలోకి కాకుండా, తన చాంబర్‌కు ఎమ్మెల్యేలతో కలిసి వెళ్లేందుకు ఉదయం తొమ్మిదిన్నర, పది గంటల సమయంలో ప్రధాన ప్రతి పక్ష నేత స్టాలిన్ వచ్చారు. నాలుగో నంబర్ గేట్ ప్రవేశ మార్గం వద్ద వారిని లోనికి అనుమతించకుండా మార్షల్స్ అడ్డుకున్నారు. తాము అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనకుండా వారం రోజులు సస్పెన్షన్ విధించారేగానీ, తమ చాంబర్లకు వెళ్ల కూడదన్న నిబంధనలు లేదంటూ మార్షల్స్‌ను నిలదీశారు. తమ చాంబర్‌కు వెళ్లేందుకు అధికారం ఉందని వారించినా మార్షల్స్ అనుమతించలేదు. దీంతో ప్రవేశ మార్గంలో డతఎంకే సభ్యులు అందరూ బైటాయించడంతో ఉత్కంఠ నెలకొంది. తమను అనుమతి కల్పించాలని డిమాండ్ చేస్తూ, డీఎంకే వర్గాలు నిరసనకు దిగడంతో ఆగమేఘాలపై జార్జ్‌కోటలో భద్రతను పోలీసు యంత్రాంగం కట్టుదిట్టం చేసింది. వీరిని నిరసన నినాదాలతో జార్జ్ కోట దద్దరిల్లింది. సుమారు గంటన్నర పాటు ప్రవేశ మార్గంలో డీఎంకే సభ్యులు బైఠాయించి నిరసన తెలియజేసినానంతరం మీడియా ముందుకు వచ్చారు. స్టాలిన్ మాట్లాడుతూ తమను సస్పెండ్ చేస్తూ స్పీకర్ జారీ చేసిన ఉత్తర్వులను వివరించారు. ఇందులో కేవలం సభా వ్యవహారాల్లో పాల్గొనేందుకు వీలు లేదని స్పష్టంచేశారేగానీ, సచివాలయంలో ఎక్కడికైనా వెళ్లేందుకు తనకు అనుమతి ఉన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కేబినెట్ హోదా కల్గిన తనను తన చాంబర్లోకి వెళ్లకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. దీన్ని బట్టి చూస్తే ఏ మేరకు పాలకుల సభలో ప్రతి పక్షానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారో అర్థం చేసుకోవాలన్నారు. సభలో తమకు వ్యతిరేకంగా సాగే వ్యవహారాలకు సమాధానాలు ఇచ్చుకునే అవకాశాన్ని స్పీకర్‌కు ఇవ్వడం లేదని మండి పడ్డారు. అసెంబ్లీ సమావేశాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తే సభలో తప్పులు చేస్తున్నదెవరో బయట పడుతుందన్నారు. ఆ భయంతో ప్రసార వ్యవహారంలో వెనక్కు తగ్గుతున్నారని విమర్శించారు. నిరసనల హోరు : తమ పార్టీ సభ్యుల్ని అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ డీఎంకే వర్గాలు రాష్ట్రంలో పలుచోట్ల ఆందోళనకు దిగారు. స్పీకర్ దిష్టిబొమ్మల్ని దహనం చేశారు. ధర్మపురి, కోయంబత్తూరు, ఈరోడ్లలో అయితే, నిరసనలు ఉద్రిక్తతకు దారి తీశాయి. దిష్టిబొమ్మల దహనం ప్రయత్నాన్ని పోలీసులు అడ్డుకోవడంతో వాగ్యుద్ధం, తోపులాటలు చోటు చేసుకున్నాయి. ఇక, స్పీకర్ తీరును సర్వత్రా ఖండిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ప్రధాన ప్రతి పక్షం, ఇతర ప్రతిపక్ష సభ్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని రాజకీయ పక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, సీపీఎం నేత జి. రామకృష్ణన్, బీజేపీ నేత తమిళి సై సౌందరరాజన్ స్పీకర్ తీరును ఖండిస్తూ, సస్పెన్షన్‌ను ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. ఇక , డీఎంకే అధినేత ఎం కరుణానిధి మాట్లాడుతూ... తమ పార్టీ శాసనసభ సభ్యులతో స్పీకర్ వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అసెంబ్లీ సమావేశాల్ని ప్రత్యక్ష ప్రసారం చేయడానికి చర్యలు తీసుకుంటే, సభలో ఎవరి తీరు ఏమిటో స్పష్టం అవుతుందన్నారు. డీఎంకే సభ్యుల సస్పెన్షన్‌ను ఖండిస్తూ ఈనెల 22న రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు ఆ పార్టీ పిలుపునిచ్చింది. -
22న అసెంబ్లీ ?
సాక్షి ప్రతినిధి, చెన్నై: రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈనెల 22వ తేదీన ప్రారంభం అవుతాయని అనధికార సమాచారం. అయితే ప్రభుత్వాధికారులు బడ్జెట్ సమావేశాలపై తీవ్రస్థాయిలో కసరత్తు జరపడం ఆరంభమైంది.అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఆరోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ ఏడాది మే 25వ తేదీన తొలి అసెంబ్లీ సమావేశం కేవలం ఒక్కరోజు మాత్రమే జరిగింది. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల ప్రమాణ స్వకారంతోనే ఆనాటి సమావేశం ముగిసింది. ఆ తరువాత గత నెల 3వ తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక కోసం మరోసారి అసెంబ్లీ సమావేశమైంది. గత నెల 16వ తేదీన కొత్త ప్రభుత్వాన్ని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించగా, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై నాలుగురోజుల పాటూ సమావేశాలు సాగాయి. బడ్జెట్ సమావేశం:ఇదిలా ఉండగా, బడ్జెట్ సమావేశాల కోసం ప్రభుత్వం సన్నద్దం అవుతోంది. అయితే బడ్జెట్ సమావేశాలు ఎప్పుడు ఆరంభమయ్యేదీ అధికారిక తేదీ వెల్లడికాలేదు. ఈనెల 22వ తేదీన సమావేశాలు ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. బడ్జెట్ దాఖలు చేయడం, శాఖల వారిగా మంత్రుల ప్రసంగాలు, జవాబులు చోటుచేసుకునే అవకాశం ఉంది. అలాగే కొత్త చట్టాలపై బిల్లు దాఖలు చేస్తారని చెబుతున్నారు. దశలవారీ మద్య నిషేధంలో భాగంగా ఇప్పటికే 500 టాస్మాక్ దుకాణాలు ఎత్తివేశారు. మరో వెయ్యి టాస్మాక్‌లకు తాళాలు వేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ వెయ్యి టాస్మాక్ దుకాణాలపై సీఎం జయ ఒక ప్రకటన చేస్తారని ఆశిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో లోపించిన శాంతి భద్రతలు, నేరాలు, జాలర్ల సమస్య, పాలారు నదీ వివాదం త దితర అంశాలపై రసవత్తరమైన వాదోపవాదాలు చోటు చేసుకుంటాయని తెలుస్తోంది. -
జోరందుకున్న ఎన్నికల ప్రచారం
ప్రచారంలో స్టార్ క్యాంపైనర్లు హొసూరు : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచారం ముమ్మరం చేశారు. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ, క్రిష్ణగిరిలో స్టాలిన్, హొసూరులో డీఎండీకే నేత విజయ్‌కాంత్, డీఎండీకే మహిళా విభాగ రాష్ట్ర అక్ష్యక్షురాలు ప్రేమలత, డీఎంకే నేత, రాజ్యసభ సభ్యురాలు కణిమొళి హొసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున స్టార్ క్యాంపైనర్లుగా నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఐ నాయకుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఎంకే పార్టీ తరఫున అన్బుమణి రామదాస్ ప్రచారం చేశారు. హొసూరులో : హొసూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాలక్రిష్ణన్కు మద్దతుగా ప్రధానమంత్రి హొసూరులో ప్రచారం చేశారు. పీఎంకే తరఫున ఆ పార్టీ నేతలు డాక్టర్ రామదాస్, అన్బుమణిరామదాస్లు ప్రచారం చేశారు. డీఎంకే కూటమి కాంగ్రెస్ తరఫున కణిమోళి హొసూరులో ఎన్నికల ప్రచారం చేశారు. అన్నాడీఎంకే తరఫున సినీ స్టార్స్ వింద్య, ఆర్తి, గుండు కళ్యాణంలు ప్రచారం చేశారు. డీఎండీకే కూటమిలో డీఎంకే అభ్యర్థికి ప్రచారానికి కెప్టెన్ విజయ్‌కాంత్, ప్రేమలత ప్రచారం నిర్వహించారు. తళిలో : తళినియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి వై. ప్రకాష్‌కు మద్దతుగా కణిమొళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే అభ్యర్థి నాగేష్కు మద్దతుగా క్రిష్ణగిరి ఎంపి కే. అశోక్‌కుమార్, సినీ నటులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ నాయకుడు నారాయణ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి అశోక్ బీజేపీ అభ్యర్థికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వేపనహళ్లిలో వేపనహళ్లి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి కణిమొళి, అన్నాడీఎంకే అభ్యర్థికి వింద్య, గుండు కల్యాణం ఎన్నికల ప్రచారం నిర్వహంచారు. డీఎండీకే అభ్యర్థికి విజయకాంత్, ప్రేమలతలు, పీఎంకే అభ్యర్థికి అన్బుమణి రామదాస్, రామదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. -
హోరెత్తిన ఎన్నికల ప్రచారం
దూసుకెళుతున్న అన్నా డీఎంకే, పీఎంకే పార్టీలు హొసూరు: తమిళనాడు శాసనసభకు మే 16న సాధారణ ఎన్నికలు జరుగునున్నాయి. నామినేషన్ల ఘట్టం 22వ తేదీ నుండి ప్రారంభమైంది. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో అన్నాడీఎంకే ముందంజలో ఉంది. డీఎంకే కూటమిలో డీఎంకే పోటీ చేసే నియోజకవర్గాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. డీఎండీకే కూటమిలో పోటీ చేస్తున్న సీపీఐ ప్రచారం వేగంగా సాగుతోంది. మండుటెండలు అభ్యర్థులను ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. హొసూరు: హొసూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, పీఎంకే పార్టీలు ప్రచారంలో నువ్వా, నేనా అనే విధంగా పోటీ పడుతున్నాయి. బీజేపీ మూడవ స్థానంలో, డీఎండీకే నాల్గవ స్థానంలో ప్రచారంలో ఉన్నాయి. డీఎంకే కూటమిలోని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించలేదు. హొసూరులో అన్నాడీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య పోటీ ఉంటుందంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంకా ప్రచారాన్ని ప్రారంభించలేదు. తళి: తళి నియోజకవర్గంలో సీపీఐ, డీఎంకే పార్టీలు ప్రచారాన్ని హోరాహోరీగా సాగిస్తున్నాయి. అన్నాడీఎంకే అభ్యర్థి ప్రచారంలో మూడవ స్థానంలో ఉన్నారు. బీజేపీ ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. పీఎంకే అభ్యర్థిని మార్చడంతో పీఎంకే ప్రచారం ఒక్క అడుగు కూడా ముందుకెళ్లలేదు. కన్యాకుమారి జిల్లా అంత విస్తీర్ణంలో ఉన్న తళి నియోజకవర్గంలోప్రచారం కష్టం అంటున్నారు రాజకీయ పార్టీల నాయకులు. వేపనహళ్లి: వేపనహళ్లి నియోజకవర్గంలో అన్నాడీఎంకే ఎన్నికల ప్రచారంలో మొదటి స్థానంలో, డీఎంకే రెండవ స్థానంలో, పీఎంకే, డీఎండీకే పార్టీలు మూడు, నాల్గవ స్థానంలో నిలిచాయి. క్రిష్ణగిరి: క్రిష్ణగిరి నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీలు ఎన్నికల ప్రచారంలో పోటీ పడుతున్నాయి. డీఎండీకే తదితర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. బర్గూరు: బర్గూరు నియోజకవర్గంలో అన్నాడీఎంకే, డీఎంకే పార్టీల ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. ఇతర పార్టీల ప్రచారం అంతంత మాత్రంగానే ఉంది. ఊత్తంగేరి: ఊత్తంగేరి రిజర్వ్ నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి మనోరంజితం నాగరాజుపై అసంతృప్తి ఉన్నా ఎన్నికల ప్రచారంలో ముందున్నారు. ఇక డీఎంకే అభ్యర్థి కూడా అన్నాడీఎంకేకు దీటుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డీఎండీకే కూటమిలో విడుదలై చిరుత పార్టీ ప్రచారం ప్రారంభించింది. -
హొసూరులో బీజేపీ ఎన్నికల ప్రచారం షురూ
హొసూరు : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మొట్టమొదటి సారిగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందు నేతలు, కార్యకర్తలు ఇక్కడి గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హొసూరు నియోజకవర్గం అభ్యర్థి బాలక్రిష్ణను ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రచారం చేపట్టారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
ఆరుగురు ఎమ్మెల్యేల అజ్ఞాతవాసం
అధికార (అమ్మ) పార్టీని నిందిస్తే ఆగ్రహం ఏ స్థాయిలో ఉంటుందో డీఎండీకే ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ రుచి చూపించారు. ఎమ్మెల్యేలమనే విషయాన్నే ఏడాదిపాటు మరిచిపోయేలా నిషేధం విధించారు. పంచపాండవుల అజ్ఞాతవాసాన్ని తలపించేలా అనేక ఆంక్షలను అమలులోకి తెచ్చారు. సస్పెన్షన్ మాత్రమే కాదు షరతులు వర్తిస్తాయి అంటూ ఉత్తర్వులు జారీచేశారు. చెన్నై, సాక్షి ప్రతినిధి: గత అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టడం, గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం సమయంలో డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో రగడ సృష్టించారు. బడ్జెట్ ప్రతులను చింపివేయడం, స్పీకర్ పోడియం వద్దకు దూసుకెళ్లడం, మాజీ ముఖ్యమంత్రి జయలలితపై విమర్శనాస్త్రాలు సంధించడం వంటి గందరగోళాలకు పాల్పడ్డారు. చంద్రకుమార్, మోహన్‌రాజ్, పార్తిబన్, వెంకటేశన్, శేఖర్, దినకరన్ ఈ ఆరుగురు ఎమ్మెల్యేలు ప్రస్తుత, రాబోయే అసెంబ్లీ సమావేశాలకు సైతం హాజరుకాకుండా స్పీకర్ సస్పెన్షన్ విధించారు. ఆనాటి సస్పెన్షన్ ఉత్తర్వుల ప్రకారం ఈనెల 1వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేదు. అయితే సచి వాలయం ప్రాంగణంలో ప్రతిరోజూ ధర్నా చేపట్టి తమ నిరసన తెలిపారు. అంతేగాక డీఎంకే, కాంగ్రెస్ తదితర ప్రతిపక్షపార్టీల మద్దతు కూడగట్టుకున్నారు. ఇదిలా ఉండగా, డీఎండీకే ఎమ్మెల్యేలపై విధించిన నిషేధాన్ని మరో పదిరోజుల పాటూ పొడిగిస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అంటే రాబోయే శీతాకాల అసెం బ్లీ సమావేశాల్లో సైతం పాల్గొనే వీలులేకుండా చేశారు. ఇక ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలు 2016 జనవరి లేదా ఫిబ్రవరిలోనే జరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడా ది అసెంబ్లీ ఎన్నికలు సైతం ముంచుకొస్తున్న కారణం గా ఆనాటి అసెంబ్లీ సమావేశాలను ఇప్పుడే అంచనా వేయలేని పరిస్థితి. ఈ కారణాల వల్ల సస్పెన్షన్ వేటుకు గురైన ఆరుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు ఇక అసెంబ్లీ ముఖం చూస్తారా అనేది అనుమానంగా మారింది. అవమానంతోపాటూ ఆర్థికపోటు: దాదాపు ఏడాది నిషేధం డీఎండీకే ఎమ్మెల్యేలను అవమానంతోపాటు ఆర్థికపోటుకు గురిచేసింది. ఒక్కో ఎమ్మెల్యే నెలసరి వేతనం కింద మొత్తం రూ.55 వేలు పొందుతుంటారు. సస్పెన్షన్ వేటు పడిన ఎమ్మెల్యేలు సుమారు ఏడాది పాటు ఈ మొత్తాన్ని కోల్పోనున్నారు. అలాగే ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల వైద్య ఖర్చుల కింద రూ.5వేలు, అసెంబ్లీ సమావేశాలకు హాజరైనపుడు చెల్లించే సిట్టింగ్ చార్జీ 500 కోల్పోనున్నారు. అంతేకాదు ఎమ్మెల్యే హోదాలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం వినియోగించుకునేందుకు వీలులేదు. అంతేకాదు అసెంబ్లీ ప్రాంగణంలోని గ్రంథాలయం ప్రవేశం కూడా నిషిద్ధమే. నియోజకవర్గంలోని ఎమ్మెల్యే కార్యాలయంలోకి వెళ్లకూడదు, అధికారిక కార్యక్రమాలకు హాజరుకారాదని షరతులు ఉన్నాయి. ఏడాది పాటూ ఆరుమంది సభ్యులు తాము ఎమ్మెల్యేమనే విషయాన్ని మర్చిపోవాలి. అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో తిరుగుతూ పలుకుబడి పెంచుకునే వీలులేకుండా అధికారపక్షం ఎత్తుగడవేసింది. బహుశా ఎమ్మెల్యేలపై ఇంత పెద్ద వేటు, ఆర్థికపోటు మరే రాష్ట్రంలోనూ చోటుచేసుకోలేదని భావించవచ్చు.