ఇపుడే ధర్మయుద్ధం​ మొదలైంది | true war now beigns-aidmk | Sakshi
Sakshi News home page

Published Sat, Feb 18 2017 3:54 PM | Last Updated on Thu, Mar 21 2024 8:11 PM

నాటకీయ పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ముగిసిన అనంతరం తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం మీడియాతో మాట్లాడారు. అరాచకశక్తులు ఇపుడు విజయం సాధించినా తమ పోరాటం కొనసాగుతుందని సెల్వం స్పష్టం చేశారు. ధర్మాన్నీ, న్యాయాన్నీ ఖూనీ చేశారన్నారు. అమ్మ ఆశయాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపించారు. న్యాయం కోరితే దాడిచేశారనీ, అన్యాయంగా కొట్టి, బలవంతంగా సభనుంచి లాగి పడేశారని విమర్శించారు. మాఫియా చర్యల్లో భాగంగా విశ్వాస పరీక్షను ముగించారని దుయ్యబట్టారు.

Related Videos By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement