
హొసూరులో బీజేపీ ఎన్నికల ప్రచారం షురూ
హొసూరు : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో భాగంగా బీజేపీ మొట్టమొదటి సారిగా రెండు నియోజకవర్గాలకు సంబంధించి అభ్యర్థులను ప్రకటించిన నేపథ్యంలో శనివారం ఆ పార్టీ కార్యకర్తలు, నేతలు ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. అంతకు ముందు నేతలు, కార్యకర్తలు ఇక్కడి గాంధీ విగ్రహం సమీపంలో ఉన్న వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హొసూరు నియోజకవర్గం అభ్యర్థి బాలక్రిష్ణను ఘనంగా సన్మానించారు.అనంతరం ప్రచారం చేపట్టారు. బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని కరపత్రాలు పంచారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున బీజేపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.