జోరందుకున్న ఎన్నికల ప్రచారం
ప్రచారంలో స్టార్ క్యాంపైనర్లు
హొసూరు : తమిళనాడు శాసనసభ ఎన్నికల్లో అభ్యర్థుల ప్రచారం జోరందుకుంది. ఎన్నికల తేదీ సమీపిస్తుండటంతో అభ్యర్థులు తమ ప్రచారం ముమ్మరం చేశారు. క్రిష్ణగిరి జిల్లాలోని ఆరు నియోజకవర్గాలలో ఎన్నికల ప్రచారానికి ప్రధాని నరేంద్రమోదీ, క్రిష్ణగిరిలో స్టాలిన్, హొసూరులో డీఎండీకే నేత విజయ్‌కాంత్, డీఎండీకే మహిళా విభాగ రాష్ట్ర అక్ష్యక్షురాలు ప్రేమలత, డీఎంకే నేత, రాజ్యసభ సభ్యురాలు కణిమొళి హొసూరులో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ తరఫున స్టార్ క్యాంపైనర్లుగా నరేంద్రమోదీ, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి నియోజకవర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సీపీఐ నాయకుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పీఎంకే పార్టీ తరఫున అన్బుమణి రామదాస్ ప్రచారం చేశారు.
హొసూరులో :
హొసూరు నియోజకవర్గంలో బీజేపీ తరఫున పోటీ చేస్తున్న బాలక్రిష్ణన్‌కు మద్దతుగా ప్రధానమంత్రి హొసూరులో ప్రచారం చేశారు. పీఎంకే తరఫున ఆ పార్టీ నేతలు డాక్టర్ రామదాస్, అన్బుమణిరామదాస్‌లు ప్రచారం చేశారు. డీఎంకే కూటమి కాంగ్రెస్ తరఫున కణిమోళి హొసూరులో ఎన్నికల ప్రచారం చేశారు. అన్నాడీఎంకే తరఫున సినీ స్టార్స్ వింద్య, ఆర్తి, గుండు కళ్యాణంలు ప్రచారం చేశారు. డీఎండీకే కూటమిలో డీఎంకే అభ్యర్థికి ప్రచారానికి కెప్టెన్ విజయ్‌కాంత్, ప్రేమలత ప్రచారం నిర్వహించారు.
తళిలో : తళినియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థి వై. ప్రకాష్‌కు మద్దతుగా కణిమొళి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అన్నాడీఎంకే అభ్యర్థి నాగేష్‌కు మద్దతుగా క్రిష్ణగిరి ఎంపి కే. అశోక్‌కుమార్, సినీ నటులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సీపీఐ అభ్యర్థికి మద్దతుగా ఆంధ్ర ప్రదేశ్ సీపీఐ నాయకుడు నారాయణ తదితరులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తళి బీజేపీ అభ్యర్థికి మద్దతుగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి అశోక్ బీజేపీ అభ్యర్థికి ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
వేపనహళ్లిలో
వేపనహళ్లి నియోజకవర్గంలో డీఎంకే అభ్యర్థికి కణిమొళి, అన్నాడీఎంకే అభ్యర్థికి వింద్య, గుండు కల్యాణం ఎన్నికల ప్రచారం నిర్వహంచారు. డీఎండీకే అభ్యర్థికి విజయకాంత్, ప్రేమలతలు, పీఎంకే అభ్యర్థికి అన్బుమణి రామదాస్, రామదాస్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు.