పళని సర్కార్‌కు 20 వరకూ గడువు
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కాగా ప్రభుత్వానికి మెజార్టీ లేదనందున పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే.
పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం తమదేనంటూ టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు .. బలపరీక్ష విషయంలో పళనిస్వామి ప్రభుత్వానికి ఆరురోజుల వెసులుబాటు కల్పించింది.
మరోవైపు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా పళిని సర్కార్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించాలన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్టాలిన్‌తో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఇవాళ సమావేశం అయ్యారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని భేటీ అనంతరం హెచ్.రాజా తెలిపారు. కాగా వీరి ఇరువురి సమావేశం చర్చనీయంశంగా మారింది.