floor test
-
జార్ఖండ్: బలపరీక్షలో నెగ్గిన హేమంత్ సోరెన్ ప్రభుత్వం
జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది.భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు హేమంత్ సోరెన్ ఆ తరువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు.జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1). బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు. -
హేమంత్ సోరెన్ ప్రభుత్వం బలపరీక్ష.. అసెంబ్లీలో ఎవరి బలం ఎంత?
జార్ఖండ్‌లో కొత్తగా కొలువు దీరిన సీఎం హేమంత్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం నేడు (జూలై 8) అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కోనుంది. ఈ క్రమంలో సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. సభలో విశ్వాస పరీక్ష పూర్తయిన వెంటనే సోరెన్ తన మంత్రివర్గాన్ని కూడా విస్తరించనున్నారు. కొత్త క్యాబినెట్లో సీఎం సతీమణి కల్పనా సోరెన్‌కు చోటు దక్కే అవకాశాలున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.ఎవరి బలం ఎంత?కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 41 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు దీంతో సునాయసంగా సోరెన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి.కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్(ఆర్జేడీ)తో కూడిన జేఎంఎం నేతృత్వంలోని కూటమికి 45 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. బీజేపీకి 24 మంది ఉన్నారు. అధికార కూటమిలో జేఎంఎం 27 మంది ఎమ్మెల్యేలతో అతిపెద్ద పార్టీగా ఉంది, కాంగ్రెస్ పార్టీ 17 మంది ఎమ్మెల్యేలతో రెండవ స్థానంలో ఉంది. జార్ఖండ్‌లో ఆర్జేడీకి ఒకే ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు.ఇద్దరు ఎమ్మెల్యేలు నలిన్ సోరెన్, జోబా మాఝీ ప్రస్తుతం ఎంపీలుగా ఎన్నికవ్వడంతో జేఎంఎం బలం 27కు తగ్గింది, అదే విధంగా జామా శాసనసభ్యురాలు సీతా సోరెన్ బీజేపీలో చేరారు. ఇక ఇటీవల జేఎంఎం మరో ఇద్దరు ఎమ్మెల్యేలను (బిషున్‌పూర్ ఎమ్మెల్యే చమ్రా లిండా, బోరియో ఎమ్మెల్యే లోబిన్ హెంబ్రోమ్) పార్టీ నుంచి బహిష్కరించింది.అదేవిధంగా, జార్ఖండ్ అసెంబ్లీలో బీజేపీ బలం 24కి తగ్గింది, పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు.. బగ్మారా నుంచి ధులు మహ్తో, హజారీబాగ్‌కు ప్రాతినిధ్యం వహించిన మనీష్ జైస్వాల్ లోక్‌సభ ఎన్నికల్లో ఎంపీలుగా గెలిచారు. ఇక కాంగ్రెస్‌లో చేరిన మండు ఎమ్మెల్యే జైప్రకాష్ భాయ్ పటేల్‌ను కాషాయ పార్టీ బహిష్కరించింది.కాగా జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) నేత హేమంత్ సోరెన్ మూడోసారి ముఖ్యమంత్రిపీథాన్ని అధిరోహించిన విషయం తెలిసిందే. భూకుంభకోణం కేసులో అరెస్టయి ఇటీవలే బెయిలుపై విడుదలైన హేమంత్.. 5 నెలల తర్వాత మళ్లీ జూలై 4న సాయంత్రం జార్ఖండ్ 13వసీఎంగా ప్రమాణం చేశారు. ఝార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ ఆయనతో ప్రమాణం చేయించారు.ఇక 2013లో తొలిసారిగా జార్ఖండ్‌కు హేమంత్ ముఖ్యమంత్రి అయ్యారు. 2019లో రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గురువారం మూడోసారి ముఖ్యమంత్రి అయ్యారు. -
హర్యానాలో మరో ట్విస్ట్.. గవర్నర్‌కు లేఖ రాసిన జేజేపీ
చండీగఢ్: ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరించుకోవటంతో నయాబ్ సింగ్ సైనీ నేతృత్వంలోని ప్రభుత్వం మైనార్టీలో పడిపోయింది. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం, మాజీ మిత్ర పక్షం జననాయక్ జనతా పార్టీ చీఫ్ దుష్యంత్ సింగ్ చౌతాలా అసెంబ్లీలో ఫోర్ టెస్ట్ (విశ్వాస పరీక్ష) నిర్వహించాలని గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు.‘‘మేజార్టీని లేని బీజేపీ కూటమిని విశ్వాస పరీక్షకు పిలవాలని కోరుతున్నాం. ఇటీవల ఒక బీజేపీలో ఎమ్మెల్యే, ఒక స్వతంత్ర ఎమ్యెల్యే రాజీనామా చేశారు. అదేవిధంగా ప్రస్తుతం మరో ముగ్గురు స్వతంత్ర ఎమ్యెల్యేలు బీజేపీ కూటమికి మద్దతు ఉపసంహరిచుకున్నారు. దీంతో బీజేపీ కూటమి ప్రభుత్వం మైనార్టీలో పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విశ్వాస పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టండి. మేము ఫ్లోర్ టెస్ట్ తీర్మానికి మా పార్టీ తరఫున మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ చౌతాలా గవర్నర్‌కు రాసిన లేఖలో తెలిపారు.మరోవైపు.. ‘‘మేము గవర్నర్‌కు ఫ్లోర్ టెస్ట్ చేపట్టాలని లేఖ రాశాం. విశ్వాస పరీక్షలో జేజేపీ.. బీజేపీ కూటమికి వ్యతిరేకంగా ఓటు వేస్తుంది. మేము బహిరంగా మరో ప్రభుత్వం ఏర్పాటు చేసే పార్టీకి మా మద్దతు ఇస్తాం’’ అని దుష్యంత్ సింగ్ ఓ వీడియో విడుదల చేశారు.ఇక.. మంగళవారం స్వతంత్ర ఎమ్మెల్యేలు సోంబిర్ సంగ్వాన్ (దాద్రీ), రణధీర్ సింగ్ గొల్లెన్ (పుండ్రి), ధరంపాల్ గోండర్ (నీలోఖేరి)లు.. రోహ్తక్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రతిపక్ష కాంగ్రెస్ నేత భూపిందర్ సింగ్ హుడా, రాష్ట్ర పీసీసీ చీఫ్ ఉదయ్ భాన్ సమక్షంలో బీజేపీకి తమ మద్దతును ఉపసహరించున్న విషయాన్ని వెల్లడించిన విషయం తెలిసిందే.హర్యానాలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. మ్యాజిక్ ఫిగర్ 45 స్థానాలు. మనోర్ లాల్, రంజిత్ చౌతాలా రాజీనామాల కారణంగా రెండు స్థానాలు ఖాళీ అయ్యాయి. దీంతో మొత్తం సభ్యుల సంఖ్య 88. ప్రస్తుతం బీజేపీకి 40 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ హర్యానా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే ఒకరు, మరో ఇద్దరు స్వతంత్ర ఎమ్మెల్యేలు ఇస్తున్నారు. అయితే ముగ్గరు స్వతంత్ర ఎమ్మెల్యేలు మద్దతు ఉపసంహరించగా.. బీజేపీకి మరో ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంది.ఇక.. జేజేపీకి 10 మంది ఎమ్యెల్యేలు ఉన్నారు. ప్రస్తుతం ముగ్గరు స్వతంత్ర అభ్యర్థులతో కలిపి కాంగ్రెస్ పార్టీ కూటమికి 33 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. ఒకవేళ జేజేపీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చినా మొత్తం సంఖ్య 43 కు చేరుంది. ఇలా అయితే.. కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పాటచేయాలంటే కూడా మరో ఇద్దరు ఎమ్యెల్యేలు అవసరం అవుతారు. ఎలా చూసినా కాంగ్రెస్‌కు ఛాన్స్ లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. -
బలపరీక్షలో నెగ్గిన హర్యానా కొత్త సీఎం
చండీగఢ్: హర్యానా కొత్త సీఎం నాయాబ్ సింగ్ సైనీ రాష్ట్ర అసెంబ్లీలో జరిగిన బల పరీక్షలో విజయం సాధించారు. మూజువాణీ ఓటు ద్వారా విశ్వాస పరీక్షలో నెగ్గారు. బీజేపీ ప్రభుత్వానికి అయిదుగురు జేజేపీ ఎమ్మెల్యేలు, ఆరుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు మద్దతిచ్చారు. ఇక 90 మంది సభ్యులున్న అసెంబ్లీలో 41 మంది బీజేపీ సభ్యులున్నారు. జేజేపీకి 10 మంది, కాంగ్రెస్‌కు 30 మంది, ఇండియన్ నేషనల్ లోక్‌దళ్‌కు ఒక ఎమ్మెల్యే, హరియాణా లోఖిత్ పార్టీ ఎమ్మెల్యే, ఏడుగురు స్వతంత్ర్య ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా మనోహర్ లాల్ ఖట్టర్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడంతో అనూహ్యంగా.. సైనీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. తమ ప్రభుత్వానికి 48 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, బలనిరూపణకు బుధవారం అసెంబ్లీ ప్రత్యేక సెషన్ నిర్వహణకు అనుమతి ఇవ్వాలంటూ నూతన సీఎం సైనా గవర్నర్ బండారు దత్తాత్రేయకు లేఖ రాశారు. హరియాణాలో గడిచిన 48 గంటల్లో రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. మంగళవారం రాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి బీజేపీ సీనియర్ నేత మనోహర్‌లాల్ ఖట్టర్, మంత్రి వర్గం మొత్తం రాజీనామా చేయడం మొదలు ఓబీసీ నేత నాయబ్ సైనీ నూతన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడందాకా మంగళవారం అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్ధుబాటు విషయంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ)తో విభేదాలు ముదరడంతో ఖట్టర్ సీఎం పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అయితే ఖట్టర్‌ను లోక్‌సభ ఎన్నికల్లో బరిలో నిలిపేందుకే బీజేపీ ఆయనను సీఎం పీఠం నుంచి దింపేసిందని మరో వాదన వినిపిస్తోంది. -
బలపరీక్షలో నితీశ్ ప్రభుత్వం విజయం
-
బీహార్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై నేడు బలపరీక్ష
-
Jharkhand: గవర్నర్‌పై జేఎంఎం నేత కీలక వ్యాఖ్యలు
రాంచీ: జార్ఖండ్‌లో అధికార పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఆ రాష్ట్ర గవర్నర్‌పై ఫైర్ అయ్యింది. తమ ప్రభుత్వాన్ని మళ్లీ బల నిరూపణ చేసుకోవాలని గవర్నర్ నేరుగా ఎందుకు ఆదేశించారని, ఈ విషయంలో ఆయనను ఎవరు ప్రభావితం చేశారో చెప్పాలని జేఎంఎం జనరల్ సెక్రటరీ సుప్రియో భట్టాచార్య డిమాండ్ చేశారు. ‘ఎక్కడైనా ముఖ్యమంత్రి రాజీనామా చేస్తే గవర్నర్ కేర్‌టేకర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ ఇక్కడ గవర్నర్ అలాంటిదేమీ చేయలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు జనవరి 31వ తేదీనే మేం సంసిద్ధతను వ్యక్తం చేశాం. మా లెజిస్లేచర్ పార్టీ నేతను ప్రమాణస్వీకారం చేయాల్సిందిగా గవర్నర్ ఎందుకు ఆహ్వానించలేదు. ప్రజల నుంచి ఉన్న ఒత్తిడి వచ్చిన తర్వాతే గవర్నర్ మమ్మల్ని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా పిలిచారు. కానీ అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకోవాలని ఫ్లోర్ టెస్ట్‌కు ఎందుకు ఆదేశించారు. దీనికి హేతుబద్దత ఏంటో తెలియదు. మాకు ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన 47 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది’ అని సుప్రియో భట్టాచార్య తెలిపారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభుత్వం సోమవారం(ఫిబ్రవరి 5) మెజార్టీ నిరూపించుకోవాల్సి ఉంది. మెజార్టీ నిరూపించుకోవడానికి కావాల్సిన సభ్యుల బలం ఇండియా కూటమి ప్రభుత్వానికి ఉందని జేఎంఎం, కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదీచదవండి.. విమానంలో మహిళతో అసభ్య ప్రవర్తన -
జార్ఖండ్ ప్రభుత్వ బలపరీక్షకు డేట్ ఫిక్స్.. ఎవరి బలమెంత?
జార్ఖండ్‌లో కొత్తగా కొలువుదీరిన సీఎం చంపయ్ సోరెన్ నేతృత్వంలోని ప్రభుత్వం బలపరీక్షకు తేదీ ఖరారైంది. సోమవారం జార్ఖండ్ అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని స్పీకర్ ప్రభుత్వాన్ని ఆదేశించారు. జార్ఖండ్ ముక్తి మోర్చా కూటమి ప్రభుత్వానికి చెందిన 40 మంది ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఓ రిసార్ట్‌లో బస చేస్తున్నారు. తమ సంఖ్యా బలాన్ని కాపాడుకునేందుకు, ఇతర పార్టీల వలలో చిక్కుకోకుండా జాగ్రత్తపడుతున్నారు. సోమవారం ఫ్లోర్ టెస్ట్ జరిగే వరకు కూటమి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌లో ఉండనున్నట్లు జార్ఖండ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గులాం అహ్మద్ మీర్ తెలిపారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమ ప్రభుత్వాన్ని బలహీనపరిచేందుకు కేంద్రంలోని బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు. ఇక భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో జార్ఖండ్ సీఎం హేమంత్ సొరెన్‌ను ఈడీ విచారించడం, అరెస్ట్ చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో అనిశ్చితి నెలకొన్న విషయం తెలిసిందే. ఈడీ అరెస్టుకు ముందే సోరెన్ రాజీనామా చేసి స్పీకర్‌కు సమర్పించారు. పార్టీ శాసనసభాపక్ష నేతగా చంపయ్ సోరెన్‌ను ఎన్నుకున్న తరువాత శుక్రవారం జార్ఖండ్ నూతన సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, జేఎంఎం, ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఆయనకు మద్దతు తెలిపారు. తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునేందుకు ఆయన తన ఎమ్మెల్యేలతో కలిసి సోమవారం అసెంబ్లీ బల పరీక్షను ఎదుర్కోనున్నారు. కాగా జార్ఖండ్ అసెంబ్లీలో మొత్తం 81 స్థానాలు ఉన్నాయి. మెజార్జీని నిరూపించుకోవాలంటే 41 మంది ఎమ్మెల్యే మద్దతు కూడగట్టుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం జేఎంఎం(28)-కాంగ్రెస్(16)- ఆర్జేడీ(1), సీపీఎంఎల్(1) కూటమికి 46 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. బీజేపీ, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్, అజిత్ పవార్ నేతృత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీతో కూడిన ప్రతిపక్ష ఎన్డీయే కూటమికి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ క్రమంలో జార్ఖండ్ రాజకీయాలు ఏ మలుపు తిరుగనున్నాయో.. ఎవరూ అధికారం చేపట్టనున్నారో మరో రెండు రోజుల్లో తేలిపోనుంది. చదవండి: కేజ్రీవాల్ జైలుకెళ్తే.. ‘ఆప్’ ఏం చేయనుంది? -
మైనారిటీలో రాజస్థాన్ సర్కార్.. త్వరలో విశ్వాసపరీక్ష!
జైపూర్: రాజస్థాన్‌లో రాజకీయాలు మరోసారి వెడెక్కాయి. అసెంబ్లీ స్పీకర్ సీపీ జోషిని బీజేపీ నేతల బృందం మంగళవారం ఉదయం కలవడం చర్చనీయాంశమైంది. గత నెలలో రాజీనామా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నిర్ణయం తీసుకోవాలని బీజేపీ నేతలు స్పీకర్‌ను కోరినట్లు తెలుస్తోంది. వాళ్లందరి రాజీనామాలను ఆమోదించాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. దాదాపు గంట పాటు ఈ భేటీ జరిగింది. బీజేపీ ఎమ్మెల్యే రామ్‌లాల్ శర్మ మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గత నెలలో రాజీనామాలు చేసినట్లు ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. స్పీకర్ ఈ రాజీనామాలపై ఏదో ఒకటి తేల్చాలని, ఆమోదిస్తున్నారో లేదో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిబంధనల ప్రకారమే తాము ఈ డిమాండ్ చేస్తున్నట్లు స్పష్టం చేశారు. రాజస్థాన్ ప్రతిపక్షనేత గులాబ్ చంద్ కటారియా కూడా రాజస్థాన్‌లో రాజకీయ అస్థిరత నెలకొందని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. రాజీనామా చేసిన మంత్రులకు ఇంకా ఆ హోదా ఉందా? అని ప్రశ్నించారు. దీనిపై ప్రజలకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ సంక్షోభం కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు ముందు రాజస్థాన్‌లో సంక్షోభం తలెత్తిన విషయం తెలిసిందే. అశోక్ గహ్లోత్ కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తే సీఎం పదవికి రాజీనామా చేయాలని పార్టీ అధిష్ఠానం తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే సచిన్ పైలట్‌ను కొత్త ముఖ్యమంత్రిగా నిర్ణయిస్తారని ప్రచారం జరిగింది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన గహ్లోత్ వర్గంలోని 91 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ శాసనసభాపక్షం సమావేశాన్ని బహిష్కరించి మరీ వేరుగా భేటీ అయ్యారు. అనంతరం రాజీనామా లేఖలను స్పీకర్‌కు సమర్పించినట్లు ప్రచారం జరిగింది. ఈ విషయంపైనే ఇప్పుడు బీజేపీ నేతలు స్పీకర్‌ను కలిశారు. ప్రస్తుతం గహ్లోత్ సర్కార్ మైనారిటీలో పడిందని, అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: జయలలిత మరణం...శశికళను విచారణకు ఆదేశించాలన్న కమిషన్ -
బలపరీక్షలో నెగ్గిన బిహార్ సీఎం నితీశ్ కుమార్
-
బిహార్: బల పరీక్షలో నెగ్గిన నితీష్ ప్రభుత్వం.. బీజేపీపై అటాక్
పాట్నా: బిహార్ అసెంబ్లీలో బుధవారం జరిగిన బలపరీక్షలో నితీష్ కుమార్ ప్రభుత్వం నెగ్గింది. బల పరీక్షలో నితీష్ సారథ్యంలోని మహాఘట్ బంధన్ సర్కార్‌కు 160 ఓట్లు వచ్చాయి. అయితే విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా నితీశ్ చేసిన ప్రసంగంపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. ఓటింగ్‌కు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు. విశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టిన సందర్భంగా అసెంబ్లీలో సీఎం నితీష్ మాట్లాడుతూ బీజేపీపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యానించారు. 2015లో బీజేపీని తానే గెలిపించానని అన్నారు. 2024లో బీజేపీకి తానేంటో నిరూపిస్తానని చాలెంజ్ చేశారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు. 2017లో తేజస్వీ యాదవ్‌పై విమర్శలు చేశారని, ఇప్పటి వరకు ఎందుకు నిరూపించలేదని ప్రశ్నించారు. పాట్నా యూనివర్సిటీ కేంద్ర హోదా కల్పించాలని విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని మండిపడ్డారు. సమాజంలో అలజడి సృష్టించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని దుయ్యబట్టారు. చదవండి: బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా ప్రజలను భయబ్రాంతులకు గురిచేయడం, డబ్బు ఆశ చూపి వారిని కొనుగోలు చేయడం బీజేపీ ఫార్ములా అని డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ ధ్వజమెత్తారు. ఆర్జేడీ-జేడీయూ కొత్త భాగస్వామ్యం చారిత్రాత్మకమని అన్నారు. తమ భాగస్వామ్యం సుదీర్ఘ కాలం నిలవనుందని, దీనిని ఎవరూ పడగొట్టలేరని ధీమా వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా బీజేపీ అధిష్టానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జేడీయూ అధినేత నితీష్ కుమార్ ఈ నెల ప్రారంభంలో ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అనంతరం బిహార్ సీఎం పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష ఆర్జేడీతో జట్టుకట్టి.. ఆగస్టు 10న ఎనిమిదోసారి బిహార్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.చదవండి: నితీశ్ బలపరీక్ష రోజే.. ఆర్జేడీ నేతల ఇళ్లలో సీబీఐ సోదాలు -
బెట్టువీడిన బీజేపీ నేత.. ఎట్టకేలకు రాజీనామా
పాట్నా: బీజేపీ నేత విజయ్ కుమార్ సిన్హా.. ఎట్టకేలకు బెట్టువీడారు. అవిశ్వాస తీర్మానం పెట్టినా బీహార్ అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదంటూ భీష్మించుకున్న ఆయన.. చివరికి తగ్గాడు. బుధవారం మహాఘట్బంధన్ కూటమి ప్రభుత్వ బలనిరూపణ కంటే ముందే.. అసెంబ్లీ స్పీకర్ పదవికి రాజీనామా సమర్పించారాయన. రాజీనామా సమర్ఫణకు ముందుగా అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా సమర్పించిన అవిశ్వాస తీర్మానం అస్పష్టంగా, అసంబద్ధంగా ఉందని, రూల్స్ ప్రకారం తీర్మానం సమర్పించలేదని సభ్యులను ఉద్దేశించి తెలిపారు. అయితే.. కొత్త కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే తాను రాజీనామా చేయాల్సి ఉందని, కానీ, తనపై తప్పుడు ఆరోపణల నేపథ్యంలో తాను ఆ పని చేయకూడదని నిర్ణయించుకున్నానని సభకు తెలిపారు. ఇదీ చదవండి: బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్ -
బలపరీక్ష రోజే తేజస్వీకి షాక్.. ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు
పాట్నా: బిహార్‌లో నితీశ్ కూమార్ నేతృత్వంలోని మహా గట్బంధన్ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్న కొన్ని గంటల ముందు ఆర్జేడీ సీనియర్ నేతల ఇళ్లపై దాడులు జరగటం సంచలనంగా మారింది. ముగ్గురు సీనియర్ నేతల నివాసాల్లో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ బుధవారం తనిఖీలు చేపట్టింది. యూపీఏ ప్రభుత్వ హయాంలో రైల్వే శాఖ మంత్రిగా లాలూప్రసాద్ ఉన్న రోజుల్లో జరిగిన ‘ల్యాండ్ ఫర్ జాబ్స్’ కుంభకోణం దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. పాట్నాలోని ఆర్జేడీ ఎమ్మెల్సీ సునీల్ సింగ్ నివాసం సహా ఆర్జేడీ రాజ్యసభ ఎంపీ అహ్మద్ అష్ఫాఖ్ కరీమ్, ఆర్జేడీ మాజీ ఎమ్మెల్సీ సుబోధ్ రాయ్ నివాసాల్లో ఈ సోదాలు జరిగాయి. ‘ఈ సోదాలు ఉద్దేశపూర్వకంగానే చేస్తున్నారు. అందులో ఎలాంటి అర్థం లేదు. భయంతో మా ఎమ్మెల్యేలు వారితో చేరతారనే కారణంగా చేస్తున్నారు.’అని పేర్కొన్నారు ఎమ్మెల్సీ సునీల్ సింగ్. ముందే ట్వీట్.. దాడులకు కొన్ని గంటల ముందు ఆర్జేడీ అధికార ప్రతినిధి సీబీఐ దాడులపై ట్వీట్ చేయటం ప్రాధాన్యం సంతరించుకుంది. బిహార్‌లో అధికారం కోల్పోవటంపై బీజేపీ కోపంగా ఉందని, అందుకే సీబీఐ, కేంద్ర ఏజెన్సీలతో దాడులు చేపట్టేందుకు సిద్ధమైందన్నారు. బుధవారం కీలకమైన రోజుగా ఆయన పేర్కొనటం గమనార్హం. ఇదీ చదవండి: అవిశ్వాస తీర్మానం పెట్టినా.. రాజీనామా చెయ్యను! బీహార్ స్పీకర్ మొండిపట్టు -
కూటమిలోనూ నేనే సీఎం కావాల్సింది!: సీఎం షిండే
బీజేపీ మద్దతుతో బలపరీక్షలో అలవోకగా నెగ్గిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సోమవారం మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్షలో గెలిచిన అనంతరం.. చనిపోయిన తన ఇద్దరు కొడుకులను తల్చుకుని సభలోనే భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారాయన. బలనిరూపణలో భాగంగా 164 మంది ఎమ్మెల్యేల మద్దతుతో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని కొనసాగించే అర్హతను సంపాదించుకున్నారు ఏక్నాథ్ షిండే. పరీక్షలో 99 వ్యతిరేక ఓట్లు పోలైన సంగతి తెలిసిందే. అయితే విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం సీఎం షిండే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహా వికాస్ అగాఢి కూటమిలోనూ సీఎంగా తన పేరే ముందుగా తెరపైకి వచ్చిందని, కానీ, ఎన్సీపీ నేత ఒకరు ఆ ప్రయత్నాన్ని అడ్డుకున్నారని షిండే వ్యాఖ్యలు చేశారు. సోమవారం బలనిరూపణ అనంతరం ఆయన మాట్లాడుతూ.. అజిత్ దాదా(అజిత్ పవార్‌ను ఉద్దేశించి)నో ఇంకెవరో నన్ను ముఖ్యమంత్రిని చేయకుండా అడ్డుకున్నారు. ఆ టైంలో నాకేం ఇబ్బంది లేదని, ఉద్దవ్‌తోనే ముందుకు వెళ్లాలని తాను చెప్పానని, అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్నానని, సీఎం పదవి మీద తనకు ఎలాంటి వ్యామోహం షిండే వ్యాఖ్యానించారు. మేం శివ సైనికులం.. బాలాసాహెబ్(బాల్ థాక్రే), ఆనంద్ దిఘే సైనికులం మేమంతా. ఆరేళ్ల పాటు బాలాసాహెబ్‌ను ఓటు వేయకుండా నిషేధించారో మీకు గుర్తు చేయాలనుకుంటున్నా(కాంగ్రెస్‌ను ఉద్దేశిస్తూ..1995-2001 మధ్య) అని షిండే వ్యాఖ్యానించారు. శివ సేనను రక్షించేందుకే తాను తిరుగుబాటు బావుటా ఎగరేశారనని చెప్పారు. బాలాసాహెచ్ ఆశయాలను బీజేపీ మాత్రమే నెరవేర్చగలదని వ్యాఖ్యానించారాయన. థానే కార్పొరేటర్‌గా పని చేస్తున్నప్పుడు నా ఇద్దరు కొడుకులను కోల్పోయా. అంతా అయిపోయిందనుకున్నా. రాజకీయాలు వదిలేయాలనుకున్నా. ఆనంద్ దిఘే సాహెబ్.. నన్ను రాజకీయాల్లో కొనసాగాలని కోరారు అంటూ సీఎం షిండే గుర్తు చేసుకుంటూ గద్గద స్వరంతో ప్రసంగించారు. #WATCH | Maharashtra CM Eknath Shinde breaks down as he remembers his family in the Assembly, "While I was working as a Shiv Sena Corporator in Thane, I lost 2 of my children & thought everything is over...I was broken but Anand Dighe Sahab convinced me to continue in politics." pic.twitter.com/IVxNl16HOW — ANI (@ANI) July 4, 2022 -
మహారాష్ట్ర: షిండే జయకేతనం
ముంబై: మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే శాసనసభలో తన ప్రభుత్వ బలాన్ని నిరూపించుకున్నారు. శివసేన తిరుగుబాటువర్గం–బీజేపీ సర్కారుపై తన పట్టును మరింత పెంచుకున్నారు. సోమవారం బల నిరూపణ(విశ్వాస) పరీక్షలో సునాయాసంగా విజయం సాధించారు. ప్రస్తుతం 287 మంది సభ్యులున్న అసెంబ్లీలో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి అనుకూలంగా 164 మంది, వ్యతిరేకంగా 99 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. దాదాపు 263 మంది సభ్యులు ఓటింగ్‌లో పాల్గొన్నారు. పలువురు వివిధ కారణాలతో గైర్హాజరయ్యారు. రెండు రోజులపాటు జరిగిన అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు సోమవారం ముగిశాయి. షిండే ప్రభుత్వానికి వరుసగా రెండో రోజు రెండో విజయం దక్కింది. ఆదివారం నిర్వహించిన స్పీకర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి రాహుల్ నర్వేకర్ నెగ్గిన సంగత తెలిసిందే. బలనిరూపణ కంటే ముందు ఉద్ధవ్ ఠాక్రే వర్గానికి పెద్ద షాక్ తగిలింది. ఠాక్రే వర్గంలోని శివసేన ఎమ్మెల్యే సంతోష్ బంగార్ షిండే వర్గంలో చేరిపోయారు. దాంతో వారి సంఖ్యకు 40కి పెరిగింది. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఎన్సీపీ ఎమ్మెల్యే అజిత్ పవార్ వ్యవహరించనున్నారు. పార్టీలో నన్ను అణచివేశారు: షిండే ఓటింగ్‌లో నెగ్గాక షిండే ప్రసంగిస్తూ ఒక దశలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నేరుగా శివసేన పేరెత్తకుండా ఒక పార్టీలో తాను చాలాకాలం అణచివేతకు గురయ్యానని ఆవేదన వ్యక్తం చేశారు. తగిన మర్యాద దక్కకపోగా అవమానాలే మిగిలాయని అన్నారు. అందుకే తిరుగుబాటు చేయాల్సి వచ్చిందని చెప్పారు. శివసేనతో తన సుదీర్ఘ అనుబంధాన్ని పరోక్షంగా ప్రస్తావించారు. ‘‘ఈ రోజు జరిగిన పరిణామాలు(విశ్వాస పరీక్షకు దారితీసిన పరిస్థితులు) ఒక్కరోజులో సంభవించినవి కావు. ఒక పార్టీలో నాకు జరిగిన అవమానాలకు ఈ సభలో ఉన్న సభ్యులే సాకు‡్ష్యలు. నన్ను చాలారోజులపాటు అణగదొక్కారు. సునీల్ ప్రభు(ఉద్ధవ్ ఠాక్రే వర్గం ఎమ్మెల్యే) సైతం అందుకు సాక్షి’’ అని షిండే ఉద్ఘాటించారు. 2014–19లో బీజేపీ–శివసేన ప్రభుత్వంలో తనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. చివరకు మాట తప్పారని విమర్శించారు. 2019లో ముఖ్యమంత్రి పదవి ఆఫర్ చేసి, చివరకు మొండిచేయి చూపారని మండిపడ్డారు. నా నాయకత్వంలో పనిచేయడానికి కాంగ్రెస్, ఎన్సీపీ నేతలు ఇష్టపడడం లేదని శరద్ పవార్ తనతో చెప్పారని అన్నారు. ‘మీరు ముఖ్యమంత్రి కావడానికి మేము వ్యతిరేకంగా కాదు. మీ పార్టీ(శివసేన)లో ఒక యాక్సిడెంట్ జరిగింది’’ అని అజిత్ పవార్ అన్నారని షిండే వివరించారు. అధికారిక గుర్తింపుందా?: సంజయ్ రౌత్ తిరుగుబాటు వర్గానికి అధికారిక గుర్తింపు ఉందా? అని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ ప్రశ్నించారు. ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. రెబల్ వర్గం అసలైన శివసేనను సొంతం చేసుకోలేదని చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవు పలికారు. ఎన్నికల్లో నెగ్గడానికి శివసేన గుర్తును వాడుకున్నారని, గెలిచిన తర్వాత ఎన్నో ప్రయోజనాలు పొందారని, చివరకు అదే పార్టీని చీల్చారని ధ్వజమెత్తారు. శివసేన పేరు, గుర్తు ఠాక్రే వర్గానికే దక్కుతుందని, అందుకోసం కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. శివసేనకు మరో పేరు ఠాక్రే అని స్పష్టం చేశారు. శివసేనను అంతం చేసేందుకు కుట్రలు: ఉద్ధవ్ తమ పార్టీని అంతం చేసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని శివసేన అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. షిండే ప్రభుత్వానికి నిజంగా దమ్ముంటే మధ్యంతర ఎన్నికలు నిర్వహించాలని సవాలు విసిరారు. సోమవారం శివసేన జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఉద్ధవ్ మాట్లాడారు. శాసనసభను ఏకపక్షంగా నిర్వహించుకోవడం రాజ్యాంగాన్ని అవమానించినట్లేనని అన్నారు. ఇకనైనా ఆటలు కట్టిపెట్టాలని బీజేపీకి సూచించారు. ప్రజాక్షేత్రంలోకి వెళ్దామని అన్నారు. తప్పు ఎవరిదైతే ప్రజలు వారిని ఇంటికి పంపుతారని స్పష్టం చేశారు. తాను త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని, ప్రజల్లోకి వెళ్తానని ఉద్ధవ్ ఠాక్రే వివరించారు. ఠాక్రే వర్గం తాజా పిటిషన్‌పై 11న ‘సుప్రీం’ విచారణ శివసేన రెబల్ ఎమ్మెల్యే భరత్ గోవాలేను పార్టీ కొత్త చీఫ్ విప్‌గా గుర్తిస్తూ అసెంబ్లీ నూతన స్పీకర్ తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సోమవారం పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై ఈ నెల 11న విచారణ చేపడతామని జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ జేకే మహేశ్వరితో కూడిన వెకేషన్ వెంచ్ వెల్లడించింది. చదవండి: ‘మహా’ స్పీకర్‌గా నర్వేకర్.. అత్యంత పిన్నవయస్కుడిగా రికార్డు! -
ఎల్లుండి బలపరీక్ష
ముంబై/గోవా: మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే సారథ్యంలో కొత్తగా కొలువుదీరిన శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం సోమవారం బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇందుకోసం ఆది, సోమవారాల్లో అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. ముఖ్యమంత్రి షిండే సోమవారం విశ్వాస తీర్మానాన్ని సభలో ప్రవేశపెడతారని అసెంబ్లీ వర్గాలు వెల్లడించాయి. అంతకుముందే కీలకమైన స్పీకర్ ఎన్నిక ప్రక్రియ పూర్తి కానుంది. ఆ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ పేరు ఖాయమైంది. కొలాబా నుంచి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికైన ఆయన శుక్రవారం నామినేషన్ కూడా దాఖలు చేశారు. శివసేన–ఎన్సీపీ–కాంగ్రెస్ మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) కూటమి తరఫున అభ్యర్థి పోటీకి దిగితే ఆదివారం ఎన్నిక జరుగుతుంది. ఎంవీఏ హయాంలో ఎన్నిసార్లు కోరినా స్పీకర్ ఎన్నికకు ఒప్పుకోని గవర్నర్ ఇప్పుడెందుకు అనుమతించారంటూ కాంగ్రెస్ మండిపడింది. గత ఫిబ్రవరిలో కాంగ్రెస్ ఎమ్మెల్యే నానా పటోలే రాజీనామా చేసినప్పటి నుంచీ స్పీకర్ పోస్టు ఖాళీగా ఉంది. ఫడ్నవీస్‌ది పెద్ద మనసు: షిండే ‘‘బాల్ ఠాక్రే అనుయాయుడైన శివ సైనికుడు సీఎం అయినందుకు నా తోటి ఎమ్మెల్యేలు మాత్రమే గాక మహారాష్ట్ర అంతా ఆనందంగా ఉంది’’ అని షిండే అన్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత గురువారం అర్ధరాత్రి గోవా తిరిగి వెళ్లారు. ఆయన శిబిరంలోని 50 మంది ఎమ్మెల్యేలు సాదర స్వాగతం పలికారు. షిండేకు, బాల్ ఠాక్రేకు అనుకూల నినాదాలతో హోరెత్తించారు. గౌహతిలో 8 రోజుల క్యాంపు అనంతరం వారంతా బుధవారం రాత్రి గోవా చేరుకోవడం, గురువారం షిండే ఒక్కరే ముంబై వెళ్లి నాటకీయ పరిణామాల మధ్య సీఎం పదవి చేపట్టడం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తనపై నమ్మకముంచి సీఎం చేసినందుకు ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ముఖ్యంగా రాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్‌కు కృతజ్ఞతలన్నారు. ‘‘నన్ను సీఎంగా అంగీకరించి ఫడ్నవీస్ పెద్ద మనసు చాటుకున్నారు. ఇది నిజంగా ఫడ్నవీస్ మాస్టర్‌స్ట్రోక్. బీజేపీకి 106 మంది ఎమ్మెల్యేలున్నా ఇలాంటి నిర్ణయం తీసుకోవాలంటే ఎంతో పెద్ద మనసుండాలి. మహారాష్ట్రలో అధికారం కోసం బీజేపీ తపించిపోతోందని భావిస్తున్న వాళ్లందరికీ ఇదో కనువిప్పు’’ అన్నారు. సోమవారం జరిగే బల పరీక్ష లాంఛనం మాత్రమేనని, తనకు 175 మంది ఎమ్మెల్యేల మద్దతుందని ప్రకటించారు. ఈ ఆలోచన అప్పుడేమైంది: ఉద్ధవ్ బీజేపీ తనకు వెన్నుపోటు పొడిచిందని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే దుయ్యబట్టారు. శివసైనికున్ని సీఎం చేశామన్న బీజేపీ వాదనను ఎద్దేవా చేశారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన తొలిసారిగా మీడియాతో మాట్లాడారు. ‘‘రెండున్నరేళ్లకు సీఎంను మార్చుకుందామంటూ 2019 అసెంబ్లీ ఎన్నికలప్పుడు నాకిచ్చిన మాటకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా కట్టుబడి ఉంటే మా సారథ్యంలో మహా వికాస్ అఘాడీ సంకీర్ణం అధికారంలోకి వచ్చేదే కాదు. పైగా రెండున్నరేళ్లు పూర్తయింది గనుక ఇప్పుడు మహారాష్ట్రలో బీజేపీ నేతే సీఎం అయేవాడు’’ అన్నారు. బీజేపీ సీఎం పదవి చేపట్టకపోవడాన్ని ప్రస్తావిస్తూ, తమ ప్రభుత్వాన్ని కూల్చి ఆ పార్టీ ఏం బావుకుందని ప్రశ్నించారు. షిండేను శివసేన సీఎం అనడాన్ని తీవ్రంగా ఖండించారు. ముంబైలో ప్రతిపాదిత మెట్రో కార్ షెడ్ ప్రాజెక్టును కంపూర్మార్గ్ నుంచి ఆరే కాలనీకి మారుస్తూ షిండే తన తొలి కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘‘మీకు చేతులెత్తి మొక్కుతా. నాపై కోపాన్ని ముంబైపై తీర్చుకోవద్దు’’ అని విజ్ఞప్తి చేశారు. ‘శివసేన నేత’ పదవి నుంచి షిండేను తొలగిస్తున్నట్టు పేర్కొంటూ ఆయనకు ఉద్ధవ్ లేఖ రాశారు. అనైతిక బీజేపీ: సామ్నా రాష్ట్రంలో అనైతిక మార్గంలో బీజేపీ అధికారం చేజిక్కించుకుందంటూ శివసేన పార్టీ పత్రిక సామ్నా తూర్పారబట్టింది. కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉందనే అహంకారంతో విపక్షాలను ఇలా మింగేస్తూ పోతే ప్రజాస్వామ్యానికి మనుగడేదని ప్రశ్నించింది. ‘‘నిండు సభలో ద్రౌపదిని కౌరవులు అవమానిస్తుంటే ధర్మరాజు నిస్సహాయంగా చూస్తుండిపోవాల్సి వచ్చింది. రాష్ట్రంలోనూ అలాంటిదే జరిగింది. అప్పుడు ద్రౌపది మానాన్ని రక్షించిన కృష్ణుడు ఇప్పుడు రాష్ట్ర ప్రజల రూపంలో సుదర్శన చక్రం అడ్డేసి మహారాష్ట్ర గౌరవాన్ని కాపాడతాడు’’ అని ఆశాభావం వెలిబుచ్చింది. మరోవైపు, షిండేతొ రాజీకి రావాల్సిందిగా ఉద్ధవ్‌పై ఎంపీలు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. పార్టీకి 19 మంది లోక్‌సభ, ముగ్గురు రాజ్యసభ సభ్యులున్నారు. చదవండి: గోవా హోటల్లో చిందులు.. రెబెల్ ఎమ్మెల్యేలపై సీఎం షిండే అసంతృప్తి.. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు కాగా ఈ నెల 2,3 తేదీల్లో మహారాష్ట్ర అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం కానుంది. అసెంబ్లీ స్పీకర్ పదవికి బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నర్వేకర్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు. ఒకవేళ స్పీకర్ పదవికి ఎన్నిక అవసరమైతే జూలై 3న నిర్వహించనున్నారు. కాగా గత ఏడాది ఫిబ్రవరిలో కాంగ్రెస్‌కు చెందిన నానా పటోలే తన పదవికి రాజీనామా చేసినప్పటి నుంచి ఆ స్థానం ఖాళీగా ఉంది. -
ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన.. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసిన కొద్ది సేపటికే ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే సంచలన ప్రకటన చేశారు. బలపరీక్షపై స్టే విధించలేమని అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో బలపరీక్షకు ముందే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11 గంటలకు బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. -
తుది అంకానికి ‘మహా’ సంక్షోభం.. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం చివరి అంకానికి చేరింది. బలపరీక్షపై సుప్రీంకోర్టులో వాదనలు ముగిసాయి. ఉద్దవ్ ఠాక్రే ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గవర్నర్ నిర్ణయాన్ని సమర్థించిన సుప్రీంకోర్టు.. బలపరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బలపరీక్షపై స్టే విధించేందుకు నిరాకరించిన ధర్మాసనం.. ఫ్లోర్ టెస్ట్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చిచెప్పింది. దీంతో రేపు(గురువారం) ఉదయం 11 గంటలకు మహారాష్ట్ర అసెంబ్లీలో ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం బలపరీక్ష ఎదుర్కోనుంది. చదవండి: నా వల్ల ఏమైనా తప్పు జరిగితే మన్నించండి: సీఎం ఉద్దవ్ భావోద్వేగం -
మహారాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష.. ఏక్నాథ్ షిండే ప్లాన్ ఇదే!
ముంబై: మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రస్తుతం గోవాలో ఉన్న విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ భగత్ సింగ్ కోష్యారీ మహా వికాస్ అఘాడీ కూటమిని అసెంబ్లీలో బలం నిరూపించుకోవాలని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు సూచించారు. దీంతో ఏక్నాథ్ షిండే బృందం ముంబైకి వెళ్లేందుకు సిద్ధమైంది. అయితే నేరుగా కాకుండా గౌహతి నుంచి గోవా వెళ్లి అక్కడి నుంచి ముంబైకు చేరి నేరుగా అసెంబ్లీకి చేరుకోవాలని ఏక్నాథ్ షిండే బృందం నిర్ణయించింది. రూట్ మ్యాప్ ఈ మేరకు షిండే వర్గం రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నట్లు సమాచారం. షిండే ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన తర్వాత నేరుగా అసెంబ్లీకి వెళ్లేలా ప్లాన్ సిద్దం చేశారు. అయితే గౌహతి నుంచి ముంబైకి విమానంలో వెళ్లేందుకు మూడు గంటల సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో ఆలస్యంగా అసెంబ్లీకి చేరుకోకూడదని షిండే వర్గం భావిస్తోంది. అందుకే ఈ విధంగా రూట్ మ్యాప్ ఖరారు చేసుకున్నారు. దీంతో షిండే వర్గం గౌహతి నుంచి మరో బీజేపీ పాలిత రాష్ట్రమైన గోవాకు బుధవారం మకాం మార్చి అక్కడే బుధవారం రాత్రి ఓ హోటల్లో బస చేయనున్నారు. అనంతరం గురువారం ఉదయం ప్రత్యేక విమానంలో గోవా నుంచి బయలుదేరి ముంబైకి పయనమవుతారు. ఇదిలా ఉండగా గవర్నర్ బలపరీక్షను ఎదుర్కోవాలన్న ఆదేశాన్ని శివసేన సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం సాయంత్రం 5 గంటలకు విచారణ జరగనుంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ షిండే వర్గం ముంబైకి తిరిగి వచ్చే ప్లాన్ అత్యున్నత న్యాయస్థానం ఉత్తర్వులపై ఆధారపడి ఉంటుంది. చదవండి: maharashtra Political Crisis: ఉత్కంఠ రేపుతోన్న మహారాష్ట్ర రాజకీయాలు.. ఏం జరగవచ్చు? -
బలపరీక్ష ఆదేశాలు.. సుప్రీంకోర్టులో శివసేన పిటిషన్
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర రాజకీయ పరిణామాలు శరవేగంగా ముందుకు సాగుతున్నాయి. అధికార పక్షం శివసేన.. తాజాగా సుప్రీం కోర్టును ఆశ్రయించింది. బలపరీక్షపై గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తూ.. పార్టీ చీఫ్ విప్ సునీల్ ప్రభు బుధవారం ఉదయం ఈ పిటిషన్ దాఖలు చేశారు. శివ సేన దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు అంగీకరించింది కోర్టు. జస్టిస్ సూర్యకాంత్, పర్దివాలా నేతృత్వంలోని బెంచ్ సాయంత్రం విచారణ చేపట్టనుంది. గవర్నర్ ఆదేశాలపై సుప్రీంను ఆశ్రయిస్తామని శివ సేన కీలక నేత సంజయ్ రౌత్ ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం విశేషం. బలపరీక్ష నిర్వహించకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని సుప్రీంలో శివసేన అభ్యర్థిస్తోంది. శివ సేన తరపున అభిషేక్ సింఘ్వి వాదిస్తుండగా.. షిండే వర్గం తరపున నీరజ్‌కిషన్ కౌల్ వాదించనున్నారు. గవర్నర్ బలపరీక్ష ఆదేశాలు చట్టవిరుద్ధం అంటూ వాదించిన సింఘ్వితో ఏకీభవించిన బెంచ్.. ఈ మేరకు పిటిషన్‌ను విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. బల నిరూపణ డాక్యుమెంట్లపై ప్రశ్నించిన బెంచ్‌కు సాయంత్రంలోగా సమర్పిస్తామని సింఘ్వి చెప్పడంతో.. సాయంత్రం ఐదు గంటలకు శివసేన పిటిషన్‌పై విచారణ చేపట్టనున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే.. ఎట్టిపరిస్థితుల్లో గురువారం బలపరీక్ష చేపట్టి తీరాలని ఉద్దవ్‌థాక్రే సర్కార్‌ను ఆదేశించారు గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారి. ఇందుకోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించాలని అసెంబ్లీ కార్యదర్శికి రాజేంద్ర భగవత్‌కు బుధవారం ఉదయం గవర్నర్ లేఖరాశారు. గురువారం సాయంత్రం లోగా.. అసెంబ్లీలో బలనిరూపణ పరీక్ష పూర్తి చేయాలని, అందుకు సంబంధించిన రికార్డులను భద్రపర్చాలని గవర్నర్ ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. చదవండి: రెబెల్స్ ఎమ్మెల్యేలకు సీఎం ఉద్దవ్ భావోద్వేగ లేఖ! -
మహా మలుపు.. బలనిరూపణకు గవర్నర్ ఆదేశం
సాక్షి, ముంబై: మహారాష్ట్ర రాజకీయం ఈ ఉదయం కీలక మలుపు తిరిగింది. శివ సేన నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు బయటకు వెళ్లిపోవడం.. మహా వికాస్ అగాడి కూటమి ప్రభుత్వం నుంచి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడం తెలిసిందే. ఈ పరిణామాలను ఆసరాగా చేసుకుని బీజేపీ, మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారిని కలిసి ఫ్లోర్ టెస్ట్ నిర్వహించాలని కోరింది. ఈ తరుణంలో.. మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, గవర్నర్‌ను కలిసి ఉద్దవ్ థాక్రే ప్రభుత్వం మైనార్టీలో పడిపోయిందని నివేదించారు. ఈ మేరకు.. మహారాష్ట్ర గవర్నర్ బలనిరూపణకు సీఎం ఉద్దవ్‌థాక్రే ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించారు. గురువారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించి.. అదే రోజు సాయంత్రంలోగా బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆ ఆదేశాల్లో పేర్కొన్నారు. అంతేకాదు.. సాయంత్రం ఐదు గంటల వరకే డెడ్‌లైన్ విధిస్తూ.. ఆ బలపరీక్షను రికార్డ్ చేయాలని ఆదేశించారాయన. ఇదిలా ఉండగా బలనిరూపణ నేపథ్యంలో.. రేపు సాయంత్రం షిండే వర్గం గువాహతి నుంచి ముంబైకి చేరుకోనున్నట్లు తెలుస్తోంది. బలనిరూపణ తర్వాతే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని షిండే ఈ మేరకు ఒక ప్రకటన చేశారు. సభలో మొత్తం సభ్యులు: 285/288 (శివసేన ఎమ్మెల్యేల్లో ఒకరు మరణించగా ఇద్దరు అరెస్టై జైల్లో ఉన్నారు) మెజారిటీ మార్కు: 144 పాలక కూటమి వాస్తవ బలం: 168 షిండే తిరుగుబాటు తర్వాత: 119 షిండే కూటమిలోని ఎమ్మెల్యేలు: 49 మంది బీజేపీ కూటమి వాస్తవ బలం: 113 షిండే కూటమి మద్దతిస్తే: 162 చదవండి: దమ్ముంటే ఆ పేర్లు చెప్పండి- షిండే -
కాంగ్రెస్‌లో సంక్షోభం: సీఎం రాజీనామా..!
సాక్షి, యానాం : కేంద్రపాలిత ప్రాంతం పుదుచ్చేరిలో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యమంత్రి నారాయణస్వామిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వరుసగా రాజీనామాలు చేస్తున్నారు. ఇప్పటికే ఐదుగురు శాసససభ్యులు పదవులకు రాజీనామాలు సమర్పించగా.. ఆదివారం మరో ఇద్దరు ఎమ్మెల్యే సీఎంకు షాక్ ఇచ్చారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా సమర్పిస్తున్నట్లు లక్ష్మీనారాయణన్, డీఎంకే ఎమ్మెల్యే వెంకటేషన్ ప్రకటించారు. రాజీనామా లేఖలను స్పీకర్‌కు పంపించారు. బలపరీక్షకు ముందే వీరు వైదొలగడం ప్రభుత్వంలో కలకలం రేపుతోంది. పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈనెల 22న బలపరీక్షకు సిద్ధం కావాలని పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్(ఎల్జీ) తమిళిసై సౌందరరాజన్ గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. బలపరీక్ష 22న సాయంత్రం 5 గంటలలోపు ముగించాలని, విశ్వాస పరీక్ష అనే ఏకైక ఎజెండాతో జరిగే ఈ సమావేశంలో సభ్యులు చేతులెత్తి మద్దతు తెలపాలని తమిళసై పేర్కొన్నారు. కాగా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజీనామాలతో పుదుచ్చేరిలోని కాంగ్రెస్ ప్రభుత్వం మెజార్టీ కోల్పోయింది. 30 మంది సభ్యులు కలిగిన అసెంబ్లీలో 15 మంది సభ్యులతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇటీవల ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యేపై అనర్హత వేటు, మరో నలుగురు రాజీనామాలతో ఆ సంఖ్య 10కి పడిపోయింది. తాజాగా మరో ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో కాంగ్రెస్ వైపు కేవలం 9 మంది మాత్రమే మిగిలిపోయారు. అయితే ఇద్దరు డీఎంకే, ఒక స్వతంత్ర సభ్యుడు అధికార పక్షం వైపు ఉన్నారు. అలాగే, ప్రతిపక్షంలో ఎన్ఆర్ కాంగ్రెస్ 7, అన్నాడీఎంకే 4, నామినేటెడ్ (బీజేపీ) ఎమ్మెల్యేలు 3లతో కలుపుకుని మొత్తం 14 మంది సభ్యుల బలం ఉంది. దీంతో అసెంబ్లీ బలపరీక్షకంటే ముందే నారాయణస్వామి రాజీనామా చేస్తారనే ప్రచారం ఊపందుకుంది. బలపరీక్ష నిర్వహించిన సరిపడ బలం లేకపోవడంతో ముందుగానే రాజీనామాను సమర్పిస్తారని తెలుస్తోంది. -
రాజ్‌భవన్ ఎదుటే బైటాయింపు
జైపూర్: రాజస్తాన్‌లో రాజకీయ డ్రామా కొనసాగుతోంది. తాజాగా, గవర్నర్ అధికార నివాసమైన రాజ్‌భవన్‌కు వేదిక మారింది. సోమవారం నుంచి అసెంబ్లీని సమావేశపర్చాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద శుక్రవారం సాయంత్రం ధర్నాకు దిగారు. రాజ్‌భవన్‌లోనికి వెళ్లిన గహ్లోత్ గవర్నర్ కల్రాజ్ మిశ్రాతో మాట్లాడారు. ఆ తరువాత గవర్నర్ రాజ్‌భవన్ ప్రాంగణంలో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వచ్చి మాట్లాడారు. అసెంబ్లీ భేటీపై ప్రకటన చేసే వరకు ధర్నా చేస్తా్తమని ఎమ్మెల్యేలు తేల్చిచెప్పారు. అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇవ్వడంతో ఐదు గంటల అనంతరం ఎమ్మెల్యేలు ధర్నా విరమించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 174 ప్రకారం నడుచుకుంటానని గవర్నర్ హామీ ఇచ్చారని కాంగ్రెస్ నేత రణ్‌దీప్ సూర్జేవాలా వెల్లడించారు. అయితే, సీఎం నుంచి గవర్నర్ కొన్ని వివరణలు కోరారని, వాటిపై ఈ రాత్రి కేబినెట్ భేటీలో గహ్లోత్ నిర్ణయం తీసుకుంటారని వివరించారు. అయితే, అసెంబ్లీని సమావేశపర్చే విషయంలో మంత్రి మండలి సిఫారసులను ఆమోదించడం మినహా గవర్నర్‌కు వేరే మార్గం లేదని న్యాయ నిపుణులు తెలిపారు. జైపూర్ శివార్లలోని ఒక హోటల్లో ఉంటున్న ఎమ్మెల్యేలు నాలుగు బస్సుల్లో అక్కడి నుంచి గహ్లోత్ నేతృత్వంలో రాజ్‌భవన్ చేరుకున్నారు. అంతకుముందు, ఆ హోటల్ వద్ద గహ్లోత్ మీడియాతో మాట్లాడుతూ గవర్నర్‌పై విమర్శలు గుప్పించారు. గవర్నర్‌ను తన రాజ్యాంగబద్ధ విధులు నిర్వర్తించనివ్వకుండా ‘పై’నుంచి ఒత్తిడి వస్తోందని పరోక్షంగా కేంద్ర ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కోరుతూ గురువారమే గవర్నర్‌కు లేఖ రాశామని, ఇప్పటివరకు స్పందించలేదన్నారు. ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే తమది బాధ్యత కాబోదన్నారు. 103 మంది ఎమ్మెల్యేలు రాజ్‌భవన్ వద్ద ధర్నా చేస్తున్నారని, ఇకనైనా గవర్నర్ అసెంబ్లీని సమావేశపర్చేందుకు ఆదేశాలను ఇవ్వాలని రాష్ట్ర మంత్రి సుభాష్ గార్గ్ డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ వద్ద ఘర్షణ వద్దని, గాంధీ మార్గంలో నిరసన తెలపాలని ఎమ్మెల్యేలకు గహ్లోత్ విజ్ఞప్తి చేశారు. తన ప్రభుత్వానికి స్పష్టమైన మెజారిటీ ఉందని, అసెంబ్లీ వేదికగానే ఆవిషయాన్ని రుజువు చేస్తామని గహ్లోత్ పేర్కొన్నారు. బీజేపీ అధికారంలో ఉన్న హరియాణాలో ఆ ఎమ్మెల్యేలను బౌన్సర్లను పెట్టి వారిని ఎక్కడికి వెళ్లకుండా నిర్బంధించారని ఆరోపించారు. ఇప్పుడే అసెంబ్లీని సమావేశపర్చవద్దని గవర్నర్‌పై ఒత్తిడి వస్తోందని గహ్లోత్ ఆరోపించారు. ‘రాష్ట్రంలో రాజకీయ పరిస్థితి, కరోనా వైరస్ విస్తృతి, ఆర్థిక రంగ దుస్థితిపై చర్చించేందుకు అసెంబ్లీని సోమవారం నుంచి సమావేశపర్చాలని కేబినెట్ భేటీ అనంతరం గవర్నర్‌ను కోరాం. కానీ, ఇప్పటివరకు గవర్నర్ నుంచి స్పందన లేదు. పైలట్ వర్గం ప్రస్తుతానికి సేఫ్ సచిన్ పైలట్ వర్గం ఎమ్మెల్యేలపై స్పీకర్ జారీ చేసిన అనర్హత నోటీసులపై శుక్రవారం హైకోర్టు కీలక ఉత్తర్వులిచ్చింది. ఎమ్మెల్యేలపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని, తదుపరి ఉత్తర్వులిచ్చేవరకు యథాతథ స్థితి కొనసాగించాలని స్పష్టం చేసింది. తాజాగా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఈ కేసులో ప్రతివాదిగా చేర్చడానికి కోర్టు ఆమోదం తెలిపింది. హైకోర్టులో రిట్ పిటషన్‌పై విచారణ సాగుతుండగానే.. అసెంబ్లీ స్పీకర్ జోషి బుధవారం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. మరోవైపు, కాంగ్రెస్‌లో కొన్ని నెలల క్రితం ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు చేరడాన్ని చట్ట విరుద్ధంగా పేర్కొంటూ, ఆ విలీనాన్ని రద్దు చేయాలని కోరుతూ బీజేపీ ఎమ్మెల్యే మదన్ దిలావర్ శుక్రవారం హైకోర్టులో కేసు వేశారు. ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని స్పీకర్‌ను అభ్యర్థించానని, దానిపై స్పీకర్ ఏ నిర్ణయం తీసుకోలేదని ఆ ఎమ్మెల్యే పిటిషన్లో వివరించారు. ఈ కేసుపై సోమవారం విచారణ జరగనుంది. ఆ బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంతోనే గహ్లోత్ సర్కారు పూర్తి మెజారిటీ సాధించగలిగింది. -
కమల్‌నాథ్ రాజీనామా
భోపాల్: మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ తన పదవికి రాజీనామా చేశారు. బలపరీక్షకు ముందే మీడియా సమావేశాన్ని ఏర్పాటుచేసి కమల్‌నాథ్ తన నిర్ణయాన్ని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ లాల్జీ టాండన్‌కి కమల్‌నాథ్ తన రాజీనామా పత్రాన్ని సమర్పించినట్టు రాజ్‌భవన్ అధికారులు వెల్లడించారు. దీంతో గత కొద్దిరోజులుగా మధ్యప్రదేశ్‌లో నెలకొన్న నాటకీయ పరిణామాలకు తెరపడింది. కమల్ నాథ్ రాజీనామాతో 15 నెలల కాంగ్రెస్ పాలన అర్థాంతరంగా ముగిసే పరిస్థితి ఏర్పడింది. 22 మంది శాసనసభ్యుల రాజీనామా చేయడంతో బలపరీక్షకు సుప్రీంకోర్టు శుక్రవారం సమయమిచ్చింది. కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్‌పార్టీ శుక్రవారం సాయంత్రం ఐదుగంటలకు అసెంబ్లీలో తన మెజారిటీ నిరూపించుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు గడువునిచ్చిన మరునాడే కమల్‌నాథ్ రాజీనామాకు ఉపక్రమించారు. గవర్నర్‌కి సమర్పించిన రాజీనామా పత్రంలో ‘నా 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ప్రజాస్వామిక విలువలతో కూడిన, స్వచ్ఛమైన రాజకీయాలు నెరపాను. వాటికే ప్రాముఖ్యతనిచ్చాను. ఐతే గత రెండు వారాల్లో ప్రజాస్వామ్య విలువలకు స్వస్తిపలికే సరికొత్త అధ్యాయానికి బీజేపీ తెరతీసింది’ అని కమల్‌నాథ్ ఆరోపించారు. గవర్నర్‌కి రాజీనామా సమర్పించిన కమల్‌నాథ్ మధ్యప్రదేశ్‌కి కాబోయే నూతన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తన తోడ్పాటునందిస్తానని తెలిపారు. ఈ రాజీనామా పత్రాన్ని గవర్నర్‌కి అందజేయడానికి ముందు కమల్‌నాథ్ మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ కుట్రపన్ని ప్రజాస్వామిక విలువలను ఖూనీ చేసిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్ రాజకీయ సంక్షోభానికి జ్యోతిరాదిత్య సింధియా కారకుడంటూ నిందించారు. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరడంతో ఆయనకు అనుకూలంగా 22 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేలు తమ పదవికి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు బలపరీక్షకు సిద్ధం కమ్మంటూ సుప్రీంకోర్టు కమల్‌నాథ్ ప్రభుత్వానికి గురువారం గడువునిచ్చింది. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ శాసనసభలో 16 మంది కాంగ్రెస్ తిరుగుబాటు ఎమ్మెల్యేల రాజీనామాలను స్పీకర్ ప్రజాపతి ఆమోదించడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం మైనారిటీలో పడిపోయింది. విశ్వాసపరీక్ష కోసం మధ్యాహ్నం రెండు గంటలకు మధ్యప్రదేశ్ అసెంబ్లీ సమావేశమైంది. కమల్‌నాథ్ రాజీనామాతో రాష్ట్ర అసెంబ్లీ వాయిదాపడింది. ఒంటిగంట ప్రాంతంలో కమల్‌నాథ్ గవర్నర్‌కి తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. అయితే కోర్టు ఆదేశాల మేరకు అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటుచేసినట్టు తెలిపిన స్పీకర్ ఎన్.పి. ప్రజాపతి, కమల్‌నాథ్ రాజీనామాతో ఆ ఆవశ్యకత లేదని వెల్లడించారు. -
స్పీకర్ కీలక నిర్ణయం: కమల్ రాజీనామా..!
భోపాల్ : ఓ వైపు దేశ వ్యాప్తంగా కరోనాపై పెద్ద చర్చ జరుగుతుండగా... మధ్యప్రదేశ్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి నెలకొంది. 20 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామాతో ఇబ్బందుల్లో పడ్డ కమల్‌నాథ్ సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నేడు (శుక్రవారం) కఠిన పరీక్షను ఎదుర్కొనుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు మధ్యప్రదేశ్ అసెంబ్లీలో స్పీకర్ ఎస్పీ ప్రజాపతి నేడు బలపరీక్షను చేపట్టనున్నారు. గత నెల రోజులుగా సాగుతున్న ఈ తతంగానికి ముగింపు పలకే విధంగా గురువారం సాయంత్రం సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వంపై ఎమ్మెల్యేలకు విశ్వాసం లేదన్న పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. వెంటనే సభలో విశ్వాసాన్ని నిరూపించుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఈ క్రమంలోనే శుక్రవారం సాయంత్రంలోగా అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ హేమంత్ గుప్తాల ధర్మాసనం సభాపతిని ఆదేశించింది. (నేడు మధ్యప్రదేశ్‌లో బలపరీక్ష) రాజీనామాల ఆమోదం.. ఈ నేపథ్యంలోనే గురువారం అర్థరాత్రి రాష్ట్రంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటికే ఆరుగురు మంత్రుల రాజీనామాలను ఆమోదించిన స్పీకర్ ప్రజాపతి.. గత రాత్రి మిగిలిన 16మంది శాసనసభ్యుల రాజీనామాలను ఆమోదించారు. దీంతో అసెంబ్లీలో సంఖ్యాపరంగా భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. సభలో మెజార్టీకి కావాల్సిన సభ్యలు సంఖ్య 104కి పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ 92 మంది సభ్యుల మద్దతు మాత్రమే ఉండగా.. ప్రతిపక్ష బీజేపీకి సొంతగా 107 ఎమ్మెల్యేలతో పాటు, నలుగురు స్వతంత్రులు, ఇద్దరు బీస్పీ, ఓ ఎస్పీ సభ్యుడి మద్దతుగా కూడా ఉంది. దీంతో సభలో మారిన సమీకరణల దృష్ట్యా బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం గెలుపొందడం అంతతేలిక కాదు. (బలపరీక్షపై వైఖరేంటి?) కమల్‌నాథ్ రాజీనామా..? ఈ పరిస్థితుల్లో విశ్వాస పరీక్ష కంటే ముందే ముఖ్యమంత్రి పదవికి కమల్‌నాథ్ రాజీనామా చేస్తారనే ఊహాగానాలు వినిస్తున్నాయి. ప్రభుత్వానికి మద్దతు లేకపోవడంతో.. బలపరీక్ష వరకూ వెళ్లి భంగపడటం కన్నా ముందే రాజీనామా చేయడం సబబు అని ప్రభుత్వ వర్గాలు సూచించినట్టు తెలుస్తోంది. అయితే దీనిపై స్పీకర్ ప్రజాపతి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. శుక్రవారం మధ్యాహ్నాం కమల్‌నాథ్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి.. కీలక ప్రకటన చేస్తారని అన్నారు. దీంతో రాజీనామా చేస్తారనే వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ నేపథ్యంలో మంత్రులు, పార్టీ ముఖ్యనేతలతో సీఎం మంతనాలు చేస్తున్నారు. కాగా కాంగ్రెస్‌కు చెందిన కీలక నేత జ్యోతిరాదిత్య సింధియా కాషాయ దళంలో చేరడం, ఆయనతోపాటు 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు శాసన సభ్యత్వానికి రాజీనామా చేయడంతో కమల్‌నాథ్ ప్రభుత్వం సంక్షోభంలో పడిన విషయం తెలిసిందే. -
బలపరీక్షపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్ శాసనసభలో రేపే(శుక్రవారం) బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని సుప్రీంకోర్టులో బీజేపీ ఎమ్మెల్యేలు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. సింగిల్ పాయింట్ ఎజెండాతో బలపరీక్ష జరపాలని స్పీకర్‌ను ఆదేశించింది. అదేవిధంగా బలపరీక్ష నిర్వహణను వీడియో తీయాలని పేర్కొంది. బలపరీక్ష సమయంలో శాంతి భద్రతల విషయంలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, నిబంధనలు ఉల్లంఘించకుండా అసెంబ్లీ కార్యదర్శి చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం సూచనలు ఇచ్చింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు చేతులు పైకి ఎత్తడం ద్వారా బలపరీక్ష జరపాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కాగా రేపు(శుక్రవారం) సాయంత్రం 5 గంటల లోపు బలపరీక్ష పక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఇటీవల 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పుపై బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ స్పందించారు. ‘బలపరీక్షపై సుప్రీంకోర్టు ఆదేశాలను స్వాగతిస్తున్నాం. శుక్రవారం జరపబోయే బలపరీక్షలో కమల్‌నాథ్ ప్రభుత్వం కూలిపోతుంది. ఎందుకంటే కమల్‌నాథ్ రాష్ట్ర ప్రజలను మోసం చేశారు’ అని శివరాజ్‌సింగ్ అన్నారు. -
మధ్యప్రదేశ్ హైడ్రామా : స్పీకర్, గవర్నర్లకు నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్‌లో తక్షణమే బలపరీక్ష చేపట్టాలని బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, స్పీకర్, గవర్నర్లకు మంగళవారం సర్వోన్నత న్యాయస్ధానం నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లో బదులివ్వాలని ఆదేశిస్తూ తదుపరి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. కాగా మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ ప్రభుత్వం సోమవారం బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ ఆదేశించినా రాష్ట్ర ప్రభుత్వం ఖాతరు చేయలేదు. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సోమవారం సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. మరోవైపు సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా సారథ్యంలో బీజేపీ గూటికి చేరడంతో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో పడిన సంగతి తెలిసిందే. చదవండి : రాజ్యసభకు మాజీ సీజేఐ -
కమల్‌నాథ్ బలపరీక్షకు బ్రేక్
భోపాల్ : మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సోమవారం ఎదుర్కోవాల్సిన బలపరీక్షకు బ్రేక్ పడింది. అసెంబ్లీ సమావేశాలను స్పీకర్ ప్రజాపతి ఈనెల 26వరకూ వాయిదా వేశారు. అంతకుముందు బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా సభను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ లాల్జీ టాండన్ రాజ్యాంగం నిర్ధేశించిన నియమాలను అందరూ గౌరవించి మధ్యప్రదేశ్ ప్రతిష్టను నిలపాలని సూచిస్తూ బలపరీక్ష తక్షణమే చేపట్టాలని స్పీకర్‌ను కోరారు. కాగా స్పీకర్ విధుల్లో జోక్యం చేసుకోరాదని ముఖ్యమంత్రి కమల్‌నాథ్ గవర్నర్ లాల్జీ టాండన్‌కు రాసిన లేఖలో కోరారు. ఇక సభను గౌరవించాలని కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలు చేస్తుండగా సోమవారం బలపరీక్ష జరపాలని పట్టుపట్టిన గవర్నర్ అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బీజేపీ సభ్యుల అభ్యంతరాలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేల నినాదాల మధ్య సభను ఈనెల 26కు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్ ప్రకటించారు. 22 మంది కాంగ్రెస్ రెబెల్ ఎమ్మెల్యేలు ఆ పార్టీకి రాజీనామా చేసి జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో బీజేపీ గూటికి చేరడంతో విశ్వాస పరీక్షపై ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. మరోవైపు రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకూ ఆరుగురు ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదించడంతో సభలో సభ్యుల సంఖ్య 222కు పడిపోగా.. ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ మార్క్ 112. దీంతో మిగిలిన ఎమ్మెల్యేల రాజీనామాలపై స్పీకర్ తీసుకునే నిర్ణయం కీలకంగా మారింది.ఇక తమ ప్రభుత్వానికి ఢోకా లేదని బలపరీక్షకు తాను సిద్ధమని మధ్యప్రదేశ్ సీఎం కమల్‌నాథ్ పేర్కొనగా, ప్రభుత్వం పడిపోతుందనే భయంతోనే బలపరీక్షకు కాంగ్రెస్ ప్రభుత్వం వెనుకాడుతోందని మాజీ సీఎం, బీజేపీ నేత శివరాజ్‌సింగ్ చౌహాన్ వ్యాఖ్యానించారు. చదవండి : కమల్‌నాథ్‌కు ‘కోవిడ్’ ఊరట? -
ఉత్కంఠగా బలపరీక్ష.. క్యాంపులకు ఎమ్మెల్యేలు
భోపాల్ : రాజకీయ సంక్షోభం నేపథ్యంలోనే మధ్యప్రదేశ్‌లో అనుహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 22 మంది ఎమ్మెల్యేలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడంతో ముఖ్యమంత్రి కమల్‌నాథ్ సర్కార్ సంకటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో గవర్నర్ లాల్జీ టాండన్ ఆదేశాల మేరకు సోమవారం శాసనసభలో విశ్వాసపరీక్ష జరుపనున్నారు. దీంతో రాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠగా మారాయి. కమల్‌నాథ్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేసిన 22 మంది ఎమ్మెల్యేలు ఆదివారం భోపాల్ చేరుకున్నారు. జ్యోతిరాదిత్యా సింధియా అనుకూల వర్గంగా భావిస్తున్న వీరంతా బెంగళూరులోని రిసార్టులో ఇన్నిరోజులు గడిపారు. మరోవైపు ప్రస్తుతం కాంగ్రెస్ వెంట ఉన్న శాసన సభ్యులను సీఎం కమల్‌నాథ్ జైపూర్ క్యాంపుకు తరలించారు. విశ్వాస పరీక్షకు ఒక్కరోజు మాత్రమే గడువు ఉండటంతో బీజేపీ భేరసారాలు నుంచి తమ సభ్యులను కాపాడుకునేందుకు కాంగ్రెస్ నాయకత్వం తగిన జాగ్రత్తలు తీసుకుంటోంది. (విశ్వాస పరీక్షకు సిద్ధం) సోమవారం అసెంబ్లీలో స్పీకర్ నర్మద ప్రసాద్ ప్రజాపతి సమక్షంలో బలపరీక్ష జరుగనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం కమల్‌నాథ్ మంత్రిమండలి సమావేశం ఏర్పాటు చేసి.. బలపరీక్షపై అనుసరించాల్సిన వ్యూహాలపై మంత్రులతో చర్చించారు. బల పరీక్ష నేపథ్యంలో కాంగ్రెస్ తమ పార్టీ సభ్యులకు విప్ జారీచేసింది. మరోవైపు తమ ఎమ్మెల్యేలతో బీజేపీ నేత, మాజీ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ భోపాల్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యారు. విశ్వాస పరీక్షలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు. అయితే రాజీనామా చేసిన 22 మంది ఎమ్మెల్యేల మద్దతు ఏ పార్టీకి ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. తమకు సింధియాపై అభిమానం మాత్రమే ఉందని, ఆయనతో పాటు బీజేపీలో చేరే ప్రసక్తే లేదని ఓ తిరుగుబాటు ఎమ్మెల్యే వ్యాఖ్యానించడంతో రాష్ట్ర రాజకీయాలు మరింత ఉత్కంఠ రేకిత్తిస్తున్నాయి. దీంతో 22 మంది కాంగ్రెస్ సభ్యుల మద్దతు లభిస్తుందని భావించిన కమళ దళానికి భంగపాటు ఎదురైంది. (ఆ 22 మందికి నోటీసులు) మరోవైపు కాంగ్రెస్‌కు మద్దతు తెలుపుతున్న ఎస్పీ, బీఎస్సీ, స్వతంత్ర ఎమ్మెల్యేలతో శివరాజ్‌సింగ్ చౌహాన్ ఇదివరకే సంప్రదింపులు జరిపి.. వారిని బీజేపీ గూటికి చేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న ఆరుగురు మంత్రులను కమల్‌నాథ్ ఇదివరకే మంత్రిమండలి నుంచి తొలగించిన విషయం తెలిసిందే. వీరంతా తమ రాజీనామా పత్రాలను స్పీకర్‌కు సమర్పించారు. కాగా మొత్తం 228 సభ్యులు గల మధ్యప్రదేశ్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 114, బీజేపీకి 107 మంది సభ్యుల మద్దతు ఉంది. అయితే 22 మంది కాంగ్రెస్ సభ్యుల రాజీనామాతో కమల్‌నాథ్ సర్కార్ మైనార్టీలో పడిపోయింది. (జ్యోతిరాదిత్య సింధియాకు షాక్..!) -
గవర్నర్‌తో కమల్‌నాథ్ భేటీ
భోపాల్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్‌నాథ్ రాష్ట్ర గవర్నర్ లాల్జీ టాండన్‌తో శుక్రవారం సమావేశమై అసెంబ్లీ వేదికగా జరిగే బలపరీక్షపై చర్చించారు. జ్యోతిరాదిత్య సింధియా నేతృత్వంలో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన క్రమంలో కమల్‌నాథ్ సర్కార్ సంక్షోభంలో కూరుకుపోయిన సంగతి తెలిసిందే. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తే కమల్‌నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనారిటీలో పడనుంది. మరోవైపు స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతి ఎదుట హాజరై రాజీనామాలు సమర్పించేందుకు రెబెల్ ఎమ్మెల్యేలకు ఇచ్చిన డెడ్‌లైన్ దగ్గరపడటంతో హోలీ విరామం అనంతరం గవర్నర్ లాల్జీ టాండన్ భోపాల్‌కు చేరుకోవడంతో రాజకీయ పరిణామాలు జోరందుకున్నాయి. ఇక బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురిచేస్తూ బేరసారాలకు పాల్పడుతోందని గవర్నర్‌కు రాసిన లేఖలో సీఎం కమల్‌నాథ్ ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ అనైతిక, చట్టవిరుద్ధంగా బేరసారాలకు దిగుతోందని లేఖలో దుయ్యబట్టారు. స్పీకర్ నిర్ణయం ప్రకారం ఈ నెల 16న అసెంబ్లీలో జరగనున్న బలపరీక్షకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నానని ఈ లేఖలో సీఎం పేర్కొన్నారు. ప్రజాస్వామ్య, శాసన వ్యవస్థలను పరిరక్షిస్తూ రాజ్యాంగ విలువలను కాపాడటంలో ఏ ఒక్క అవకాశాన్నీ జారవిడువబోమని తాను మధ్యప్రదేశ్ ప్రజలకు హామీ ఇస్తున్నానని అన్నారు. కాగా రాజీనామా చేసిన 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల్లో ఆరుగురు మంత్రులు సహా 13 మందికి శుక్ర, శనివారాల్లో తన ఎదుట హాజరు కావాలని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ ప్రజాపతి నోటీసులు జారీ చేశారు. ఎమ్మెల్యేలు వ్యక్తిగతంగా తనను కలిసి రాజీనామాలు సమర్పించాలని ఆయన చెబుతున్నారు.నిబంధనలు, ఆధారాలను పరిశీలించిన మీదట వారి రాజీనామాలపై ఓ నిర్ణయం తీసుకుంటామని స్పీకర్ చెప్పారు. చదవండి : ఆపరేషన్ కమల్.. కాంగ్రెస్‌కు రంగుపడింది -
మహా బలపరీక్ష: అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్
సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే కీలకమైన బలపరీక్షకు సిద్ధమయ్యారు. అధికార విపక్షాల నిరసనలు, నినాదాల మధ్య అసెంబ్లీలో చర్చ ప్రారంభమైంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ముందుగా సభలో ప్రసంగం ప్రారంభించిన బీజేపీ శాసనసభపక్ష నేత దేవేంద్ర ఫడ్నవిస్ కూటమి ప్రభుత్వంపై విమర్శలు వర్షం కురిపించారు. గవర్నర్ ఆదేశాల మేరకు అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన కాళిదాస్ కొలంబకర్‌ను నియమించారని.. ఉద్ధవ్ ప్రభుత్వం కాళిదాసును తొలగించడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. ఆయన స్థానంలో ఎన్సీపీకి చెందిన దిలీప్‌ను నూతన ప్రభుత్వం ఎంపిక చేసిన విషయం తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా కనీసం వందేమాతరం కూడా ఆలపించలేదని ప్రభుత్వంపై పఢ్నవిస్ విరుచుకుపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా స్పీకర్ సభను నడుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే విశ్వాస పరీక్షను ప్రారంభిస్తున్నామని, సభ్యులంతా తమ స్థానాల్లో కూర్చోవాలని ప్రొటెం స్వీకర్ కోరారు. అనంతరం సభ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా మొత్తం 288 స్థానాలకు గత మహారాష్ట్రలో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సభ్యుల మద్దతు ఉంది. 29 మంది స్వతంత్ర సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం నిలబడాలంటే 145 మంది సభ్యులు మద్దతు కావాలి. అయితే తమకు 170 మంది సభ్యులకు పైగా మద్దతు ఉందని మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వం సభలో ప్రకటించింది. అనంతరం ఇటీవల మంత్రులుగా ప్రమాణం చేసిన వారికి ఉద్ధవ్ సభకు పరిచయం చేశారు. కాగా కీలకమైన బలపరీక్ష నేపథ్యంలో అన్ని పార్టీలు సభ్యులకు విప్ జారీచేశాయి. -
మహారాష్ట్ర: వాళ్లంతా తిరిగి వచ్చేందుకు సిద్ధం!
ముంబై : ఉద్ధవ్ ఠాక్రే సర్కారు అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. మహా వికాస్ అఘాది(శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీ) అధికారం చేపట్టిన క్రమంలో అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ కాళిదాస్‌ను తొలగించి.. ఆయన స్థానంలో దిలీప్ వాల్సే పాటిల్‌ను ఆ పదవిలో నియమించారు. ఆయన నేతృత్వంలోనే నేడు ప్రభుత్వ విశ్వాస పరీక్ష జరగనుంది. ఈ క్రమంలో కాళిదాస్‌ను తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్ పాటిల్.. ఇది నిబంధనలకు విరుద్ధమంటూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. అదే విధంగా అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా కిసాన్ కాథోడ్ను బీజేపీ ప్రకటించింది. మరోవైపు కూటమి సర్దుబాటులో భాగంగా స్పీకర్ పదవి దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ నానా పటోలేను తమ అభ్యర్థిగా ప్రకటించింది. ఇదిలా ఉండగా... ఠాక్రే తొలి కేబినెట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ రెవెన్యూ, పీడబ్ల్యూడీ, ఎక్సైజ్ శాఖలను దక్కించుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. అదే విధంగా ఎన్సీపీకి హోం, ఆర్థిక, ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ వంటి కీలక శాఖలు దక్కే అవకాం ఉంది. ఇక సీఎం ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేనకు పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణం, నీటి పారుదల శాఖలు కేటాయించినట్లు తెలుస్తోంది. విద్య, పరిశ్రమలు వంటి శాఖలకు సంబంధించిన పంపకాల్లో తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ స్పీకర్ అభ్యర్థిగా కిసాన్ కాథోడ్ను ప్రకటించిన బీజేపీ ఇక ఠాక్రే సర్కారు శనివారం మధ్యాహ్నం విశ్వాస పరీక్ష ఎదుర్కోనున్న వేళ ఎన్సీపీ నేత అజిత్ పవార్.. బీజేపీ ఎంపీ ప్రతాపరావు చికాలికర్‌తో సమావేశంతో కావడంతో రాజకీయ వర్గాల్లో అలజడి రేగింది. అయితే తాను మర్యాపూర్వకంగానే ప్రతాపరావును కలిశానని అజిత్ స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అదే విధంగా ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ మాట్లాడుతూ.. ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు తిరిగి సొంతగూటికి చేరుకునే అవకాశం ఉందని పేర్కొన్నారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 105, శివసేన 56, ఎన్సీపీ 54, కాంగ్రెస్ 44 సీట్లు కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. కాగా తాజా పరిణామాల నేపథ్యంలో హోం మంత్రి అమిత్ షా ఆదివారం రాష్ట్ర పర్యటనకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. -
బల పరీక్ష: బీజేపీ ఎంపీతో అజిత్ పవార్ భేటీ
ముంబై: ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వం మహారాష్ట్ర అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు సిద్ధమైన వేళ ఎన్సీపీ నేత అజిత్ పవార్ బీజేపీ ఎంపీ ప్రతాప్రావు చికాలికర్‌తో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. అజిత్ మరోమారు తిరుగుబాటు బావుటా ఎగురవేసేందుకు సన్నద్ధమవుతున్నారా అనే సందేహాలు రేకెత్తాయి. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన అజిత్ పవార్.. ప్రతాప్రావును మర్యాదపూర్వకంగా మాత్రమే కలిశానని స్పష్టం చేశారు. తాము వేర్వేరు పార్టీల్లో ఉన్నప్పటికీ.. తమ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆయనతో భేటీలో విశ్వాస పరీక్షకు సంబంధించి ఎటువంటి చర్చ జరగలేదని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా... శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ మాట్లాడుతూ... శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమి విశ్వాస పరీక్షలో నెగ్గి తీరుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కాగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేపీ శాసనసభ పక్షనేత, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ గత శనివారం ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో డిప్యూటీ సీఎంగా ఎన్సీపీ సీనియర్ నేత అజిత్ పవార్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. శివసేనతో కలిసి ఎన్సీపీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని శరద్ పవార్ ప్రకటించిన తరుణంలో అజిత్ పవార్ ఆయనకు ఊహించని షాకిచ్చారు. అనంతరం శరద్ పవార్ తన చాణక్యంతో అజిత్ పవార్ వెనక్కి వచ్చేలా చేసి.. బీజేపీకి మద్దతు ఉపసంహరించుకునేలా ప్రణాళికలు రచించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీల కూటమి ‘మహా వికాస్ ఆఘాది’ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలకంగా వ్యవహరించారు. దీంతో ఫడ్నవిస్ సీఎం పదవికి రాజీనామా చేయగా.. శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ అసెంబ్లీలో బలనిరూపణకు ఠాక్రేకు డిసెంబర్ 3 వరకు గడువు ఇచ్చారు. అయితే ఠాక్రే శనివారమే మెజారిటీని నిరూపించుకునేందుకు సమాయత్తమయ్యారు. ఈ క్రమంలో ఠాక్రే సర్కారు నేడు అసెంబ్లీలో విశ్వాస పరీక్ష ఎదుర్కోనుంది. -
రంగంలోకి దిగిన శరద్ పవార్ భార్య
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీలో రేపే (బుధవారం) బలపరీక్ష నిర్వహించాలంటూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇవ్వడంతో రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. బలపరీక్షను ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు వేగంగా సమాయత్తమవుతున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నివాసంలో బీజేపీ కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ భేటీ అనంతరం బీజేపీ తన ఎమ్మెల్యేలకు విప్ జారిచేసింది. రేపటి బలపరీక్షలో విజయం సాధిస్తామని బీజేపీ ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేయడం గమనార్హం. అంతకుముందు ఫడ్నవిస్‌తో ఎన్సీపీ రెబల్ నేత, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ భేటీ అయ్యారు. ముంబైలోని లెమన్ ట్రీ హోట్‌లో శివసేన నేతలు, మరియట్ హోటల్లో కాంగ్రెస్ నేతలు సమావేశమై.. బలపరీక్ష సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. అజిత్ పవార్‌పై ఎన్సీపీ ఒత్తిడి శివసేన, కాంగ్రెస్‌తో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైన ఎన్సీపీకి ఆ పార్టీ సీనియర్ నేత అజిత్ పవార్ చివరిక్షణంలో ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. బీజేపీతో చేతులు కలిపి డిప్యూటీ సీఎం పదవి చేపట్టిన అజిత్.. రేపటి బలపరీక్షలో కీలకం కానున్నారు. అజిత్ పవార్‌పైనే బీజేపీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు అజిత్‌ను బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఎన్సీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అజిత్ పవార్‌తో మంగళవారం శరద్ పవార్ కుటుంబసభ్యులు మంతనాలు జరిపారు. శరద్ పవార్ భార్య రంగంలోకి దిగి.. అజిత్‌తో మాట్లాడారు. ప్రస్తుత డిప్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి.. తిరిగి ఎన్సీపీ గూటికి వస్తే.. శివసేన కూటమి ప్రభుత్వంలో తిరిగి డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని అజిత్‌కు వారు హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇటు ఎన్సీపీ నేతలు ఒత్తిడి.. అటు బీజేపీ నేతలు ఆశల నేపథ్యంలో అజిత్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారని అంటున్నారు. బుధవారం నాటి బలపరీక్షలో అజిత్ ఎలాంటి పాత్ర పోషిస్తారనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అజిత్ బీజేపీ సర్కారును కూల్చుతారా? లేక నిలబెడతారా? అన్నది ఉత్కంఠ రేపుతోంది. -
వెంటనే బలపరీక్ష జరగాలి!
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్రలో వెంటనే బలపరీక్ష నిర్వహించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు పట్టుబట్టాయి. బీజేపీ ఉద్దేశపూరితంగానే బలపరీక్షను జాప్యం చేయాలని చూస్తోందని, ఈ రోజు లేదా రేపటిలోగా బలపరీక్షకు ఆదేశించాలని సుప్రీంకోర్టును కోరాయి. మహారాష్ట్ర సంక్షోభంపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణ సందర్భంగా శివసేన పార్టీ తరఫున కపిల్ సిబల్, ఎన్సీపీ, కాంగ్రెస్ తరఫున అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మహారాష్ట్రలో హడావిడిగా బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించడం ద్వారా ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు పొడిచారని సింఘ్వీ దుయ్యబట్టారు. అజిత్ పవార్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకుంటున్నట్టు ధ్రువీకరిస్తూ ఎన్సీపీ ఎమ్మెల్యేలు లేఖ ఇచ్చారని, బీజేపీ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నట్టు వారు లేఖ ఎంతమాత్రం ఇవ్వలేదని సింఘ్వీ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అజిత్ వద్ద ఉన్న లేఖతో బీజేపీ అతి తెలివి ప్రదర్శించిందని, గవర్నర్ ఈ విషయాన్ని ఎందుకు విస్మరించారని ప్రశ్నించారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ కూటమికి 154 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని, వారు సంతకాలు చేసిన అఫిడవిట్లను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. అయితే, విచారణ పరిధిని పెంచడం ఇష్టంలేని సుప్రీంకోర్టు ఈ అఫిడవిట్లను స్వీకరించడానికి నిరాకరించింది. ఉద్ధవ్ ఠాక్రేకు 48మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు, 56మంది శివసేన ఎమ్మెల్యేలు, 44మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉందని, మరో ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా తమకు మద్దతునిస్తున్నారని సింఘ్వీ స్పష్టం చేశారు. చదవండి: మహా సంక్షోభంపై సుప్రీం కీలక వ్యాఖ్యలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు, బేరసారాలను నిరోధించాలంటే తక్షణమే బలపరీక్ష జరగాలని, 24 గంటల్లో అసెంబ్లీ బలనిరూపణ చేసుకునేందుకు ఫడ్నవిస్ ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని సింఘీ ధర్మాసనాన్ని అభ్యర్థించారు. బలపరీక్షకు ఎక్కువ సమయం ఇవ్వవద్దని, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం శివసేన కూటమికి ఉందని తెలిపారు. బలపరీక్షకు సిద్ధంగా ఉన్నామని బీజేపీ కూడా పేర్కొంటున్నదని, ఇరుపక్షాలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా జాప్యమెందుకని, వీలైనంత త్వరగా బలపరీక్షకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. బలపరీక్ష జరగడం ముఖ్యమని, గెలుపోటములు కాదని అన్నారు. చదవండి: ఒక పవార్ బీజేపీతో.. మరొక పవార్ ఎన్సీపీతో! శివసేన తరఫున కపిల్ సిబల్ వాదనలు వినిపిస్తూ.. 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతు తనకు ఉందన్న అజిత్ పవార్ వ్యాఖ్యల్లో వాస్తవం లేదన్నారు. బీజేపీ సర్కారుకు మద్దతు ఇస్తున్నట్టు ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఇచ్చిన లేఖ ఏదని ప్రశ్నించారు. తమ వద్ద 54మంది ఎన్సీపీ ఎమ్మెల్యేల మద్దతుకు సంబంధించి అఫడవిట్లు ఉన్నాయని, ఎన్సీపీ ఎమ్మెల్యేలు తమతో ఉన్నారని స్పష్టం చేశారు. కేవలం శాసనసభాపక్ష నేత అజితే ఫిరాయించారని ఆరోపించారు. సభలో బలముంటే నిరూపించుకోవడానికి బీజేపీ ఎందుకు భయపడుతోందని సిబల్ నిలదీశారు. తెల్లవారుజామునే హడావిడిగా రాష్ట్రపతి పాలన ఎందుకు ఎత్తివేశారని, చడీచప్పుడు లేకుండా హడావిడిగా ఉదయం 5.47 గంటలకు రాష్ట్రపతి పాలన ఎత్తేయడం వెనుక దురుద్దేశం ఉందని విమర్శించారు. సభలో వీడియో రికార్డింగ్ ద్వారా బలపరీక్ష జరగాలని కోరారు. ఉత్తరాఖండ్, కర్ణాటకలో జరిగిన తీరుగానే మహారాష్ట్రలోనూ బలపరీక్ష జరగాలని కోర్టును కోరారు. ఈ కేసులో అన్ని పక్షాల వాదనలు విన్న అనంతరం తన తీర్పును రిజర్వ్‌లో ఉంచిన ధర్మాసనం.. మంగళవారం ఉదయం 10.30 గంటలకు తీర్పును వెలువరించినున్నట్టు తెలిపింది. -
విశ్వాస పరీక్షలో నెగ్గిన యడ్డీ సర్కార్
సాక్షి, బెంగళూరు: కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప విశ్వాస పరీక్షలో నెగ్గారు. సోమవారం జరిగిన బలపరీక్షలో ప్రభుత్వానికి మద్దతుగా 106 మంది సభ్యులు ఓటేశారు. దీంతో మ్యాజిక్ ఫిగర్‌ను యడ్డీ సునాయాసంగా ఛేదించగలిగారు. సభకు కాంగ్రెస్-బీజేఎస్ సభ్యులు కూడా హాజరయ్యారు. వీరంత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ.. విశ్వాస పరీక్షలో సర్కార్ విజయం సాధించింది. బీజేపీకి ఉన్న 105 మందితో పాటు ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో కలుసుకుని బలం 106కి చేరింది. దీంతో మ్యాజిక్ ఫిగర్ 104 కంటే రెండు ఓట్లను ఎక్కువగా సాధించి బలపరీక్షలో గెలుపొందింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా 99 మంది సభ్యులు ఓటు వేశారు. మూజువాణి పద్దతిలో స్పీకర్ రమేష్ కుమార్ ఓటింగ్‌ను చేపట్టారు. ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉండడంతో విశ్వాస పరీక్షలో ప్రభుత్వం విజయం సాధించిందని స్పీకర్ ప్రకటించారు. అనంతరం సీఎం యడియూరప్ప సభలో సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజల విజయమన్నారు. విశ్వాస పరీక్షకు ముందు సభలో యడియూరప్ప మాట్లాడుతూ.. బల నిరూపణలో తమ ప్రభుత్వం విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో పాలనలో ముందుకు వెళ్తామని ఆయన అన్నారు. రైతులకు పెద్దపీఠ వేస్తామని స్పష్టం చేశారు. ప్రజల, ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటామని సీఎం పేర్కొన్నారు. చర్చలో భాగంగా కాంగ్రెస్ నేత సిద్దరామయ్య మాట్లాడుతూ.. యడియూరప్ప వ్యాఖ్యలను తాము పూర్తిగా స్వాగతిస్తున్నామని అన్నారు. ప్రజల విశ్వాసాలకు అనుగుణంగా ప్రభుత్వాన్ని నడపాలని సూచించారు. రైతుల సమస్యల పరిష్కారానికి గత ప్రభుత్వాలు ఎంతో చేశాయని ఆయన గుర్తుచేశారు. కాగా బలపరీక్షలో ప్రభుత్వం విజయం సాధించడంతో.. గత కొంత కాలంగా సాగుతోన్న రాజకీయ సంక్షోభానికి తెరపడినట్టయింది. కుమారస్వామి ప్రభుత్వం కుప్పకూలడానికి కారణమయిన 17 మంది సభ్యులపై స్పీకర్ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. స్పీకర్ చర్యతో సభలో మ్యాజిక్ ఫిగర్ 104కి పడిపోయింది. దీంతో విశ్వాస పరీక్షలో యడియూరప్ప సునాయాసంగా విజయం సాధించారు. -
కర్ణాటకం : యడ్డీకి చెక్ ఎలా..?
బెంగళూర్ : కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప అసెంబ్లీలో సోమవారం విశ్వాస పరీక్షను ఎదుర్కొంటున్న క్రమంలో యడ్డీకి చెక్ పెట్టేందుకు చిట్టచివరి అస్త్రాలకు కాంగ్రెస్ పదును పెట్టింది. యడియూరప్పను సవాల్ చేసే ఎలాంటి చిన్న అవకాశాన్ని విడిచిపెట్టని కాంగ్రెస్ విశ్వాస పరీక్షకు ముందు పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించింది. ఫిరాయింపు నిరోధక చట్టం కింద కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన 14 మంది రెబెల్ ఎమ్మెల్యేలపై కర్ణాటక అసెంబ్లీ స్పీకర్ కేఆర్ రమేష్ కుమార్ అనర్హత వేటు వేసిన నేపథ్యంలో సీఎల్పీ భేటీ జరగడం గమనార్హం. అనర్హత వేటుకు గురైన నేతలు ప్రస్తుత అసెంబ్లీ గడువు ముగిసేవరకూ ఎన్నికల్లో పోటీ చేసే వెసులుబాటు ఉండదు. మరోవైపు తమపై స్పీకర్ అనర్హత వేటు వేయడాన్ని సవాల్ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించాలని రెబెల్ ఎమ్మెల్యేలు నిర్ణయించారు. కాగా బలపరీక్షలో నెగ్గితీరుతామని సీఎం యడియూరప్ప ధీమా వ్యక్తం చేశారు. బలపరీక్షలో నెగ్గిన అనంతరం గత ప్రభుత్వం రూపొందించిన ఫైనాన్స్ బిల్లును సభ ముందుంచుతామని చెప్పారు. ఇక పార్టీకి చెందిన 105 మంది ఎమ్మెల్యేలతో పాటు ఒకరిద్దరి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలు సైతం తమకు మద్దతు ఇస్తారని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రవికుమార్ పేర్కొన్నారు. ఫైనాన్స్ బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన జేడీఎస్, కాంగ్రెస్‌లను కోరారు. -
‘కర్నాటకం’లో కొత్త మలుపు
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ అనిశ్చితి కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి ఈరోజు మధ్యాహ్నం 1.30 గంటల్లోగా మెజారిటీ నిరూపించుకోవాలన్న గవర్నర్ ఆదేశాలను శాసనసభ పట్టించుకోలేదు. గవర్నర్ ఆదేశాల ప్రకారం బలపరీక్ష నిర్వహించేందుకు స్పీకర్ కేఈఆర్ రమేశ్‌కుమార్ తిరస్కరించారు. తనను సుప్రీంకోర్టు, గవర్నర్ శాసించలేరని అన్నారు. బలపరీక్షలకు ఆదేశాలు ఇవ్వాలని బీజేపీ సభ్యులు పదేపదే డిమాండ్ చేసినా ఆయన తలొగ్గలేదు. తనను ఒత్తిడికి గురిచేసే వాడు ఇంకా పుట్టలేదని వ్యాఖ్యానించారు. బలపరీక్షపై స్పీకర్ ఆదేశాలకు కట్టుబడతానని సీఎం కుమారస్వామి తెలిపారు. ‘మధ్యాహ్నం 1.30 గంటల్లోగా బలం నిరూపించుకోవాలని నన్ను స్పీకర్ ఆదేశించారు. రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలపై నిర్ణయాధికారాన్ని స్పీకర్‌కే సుప్రీంకోర్టు వదిలిపెట్టింది. ఇప్పటికే నేను అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాను. బలనిరూపణపై నాకు గవర్నర్ ఇచ్చిన ఆదేశాలపై స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. ఈ అంశాన్ని ఆయనకే వదిలిపెడుతున్నాన’ని కుమారస్వామి అన్నారు. (చదవండి: యడ్యూరప్ప చేతులు జోడించి వేడుకున్నారు కానీ..) తాను నిప్పుల కుంపటిపై కూర్చున్నట్టుగా ఉందని అంతకుముందు స్పీకర్ కేఆర్ రమేశ్ కుమార్ అన్నారు. గౌరవంతో బతికే తనను కించపరిచే విధంగా కొంత మంది మాట్లాడుతున్నారని వాపోయారు. అసెంబ్లీలో సభ్యులు మాట్లాడే ప్రతి మాట రికార్డవుతుందని హెచ్చరించారు. హడావుడిగా నిర్ణయాలు తీసుకోబోనని, చర్చ తర్వాతే బలపరీక్ష జరుగుతుందని స్పష్టం చేశారు. భోజన విరామం కోసం సభను స్పీకర్ మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేయడంతో హైడ్రామా కొనసాగుతోంది. గవర్నర్ ఏమంటారో..? డెడ్‌లైన్ విధించే అధికారం గవర్నర్‌కు ఉంటుందని బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. అసెంబ్లీ వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం చేసుకోవడం తగదని కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. ఎన్నిరోజులైనా సరే చర్చ కొనసాగించాలి, సభ్యులందరికీ మాట్లాడే అవకాశం కల్పించాలని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అన్నారు. అందరి అభిప్రాయాల తర్వాతే విశ్వాస పరీక్ష జరపాలని సూచించారు. తన నిర్ణయాన్ని స్పీకర్ ధిక్కరించిన నేపథ్యంలో గవర్నర్ వజూభాయ్‌వాలా ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. (చదవండి: కర్నాటకం క్లైమాక్స్ నేడే) -
కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం
సాక్షి, బెంగళూరు : కర్ణాటక అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. విశ్వాస పరీక్ష వాయిదా వేయాలంటూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఈరోజే నిర్వహించాలంటూ బీజేపీ నేతలు పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను 30 నిమిషాలు వాయిదా వేశారు. తమ ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేశారని కాంగ్రెస్ పార్టీ సభలో సంచలన ఆరోపణలు చేసింది. కిడ్నాప్‌కు సంబంధించి ఎమ్మెల్యేల కుటుంబ సభ్యులు తమకు సమాచారం ఇచ్చారని మంత్రి డీకే శివకుమార్ అన్నారు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని స్పీకర్‌కు కోరారు. కిడ్నాప్ వ్యవహారంపై స్పీకర్ రమేష్ కుమార్ సీరియస్‌గా స్పందించారు. కిడ్నాప్ అయిన విషయం వాస్తవమేనా కాదా? ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు లాంటి వివరాలతో శుక్రవారం తనకు నివేదిక ఇవ్వాలని హోంమంత్రిని ఆదేశించారు. మరోవైపు విప్ విషయంలో క్లారిటీ లేనందున విశ్వాస పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నిన్నటి సుప్రీంకోర్టు తీర్పు గందరగోళంగా ఉందని, విప్ జారీచేయడంపై క్లారిటీ ఇచ్చాకనే విశ్వాస పరీక్ష నిర్వహించాలని స్పీకర్‌కు కాంగ్రెస్ నేత సిద్ధరామయ్య విజ్ఞప్తి చేశారు. విప్‌పై స్పష్టత వచ్చేవరకు విశ్వాస పరీక్ష వాయిదా వేయాలని కోరారు. కాగా ఈరోజే విశ్వాస పరీక్ష నిర్వహించాలని బీజేపీ పట్టుబడుతోంది. ఓటింగ్ నుంచి తప్పించుకునేందుకే కాంగ్రెస్, జేడీఎస్ నాటకాలు ఆడుతున్నాయని బీజేపీ నేత యడ్యూరప్ప ఆరోపించారు. ఈ రోజే అవిశ్వాస తీర్మానం పెట్టాలంటూ బీజేపీ ఎమ్మెల్యే స్పీకర్ పోడియం వద్దకు దూసుకొచ్చారు. దీంతో స్పీకర్ రమేష్ కుమార్ సభను 30 నిమిషాల పాటు వాయిదా వేశారు. గవర్నర్‌ను కలిసిన బీజేపీ నేతలు కర్ణాటక అసెంబ్లీలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. అవిశ్వాస పరీక్ష ఎటూ తేలడం లేదు. దీంతో బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్ర గవర్నర్‌ను కలిశారు. ఈ రోజే విశ్వాస పరీక్ష జరిపించాల్సిందిగా స్పీకర్‌ను ఆదేశించాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కోరారు. బీజేపీ ఎమ్మెల్యేల ఫిర్యాదుపై గవర్నర్ స్పందించారు. బలపరీక్షను ఈ రోజే నిర్వహించాలని స్పీకర్‌కు సూచించారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు ఓ సందేశాన్ని పంపారు. గవర్నర్ పంపిన సందేశాన్ని స్పీకర్ రమేష్ కుమార్ సభలో చదివి వినిపించారు. -
కుమారస్వామి ఉద్వేగం
సాక్షి, బెంగళూరు/న్యూఢిల్లీ: కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్షపై చర్చ కొనసాగుతోంది. ముఖ్యమంత్రి కుమారస్వామి గురువారం అసెంబ్లీలో విశ్వాస పరీక్ష తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై చర్చ సందర్భంగా సీఎం కుమారస్వామి ఉద్వేగభరితంగా మాట్లాడారు. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర పన్నుతున్నది ఎవరో సభలో చెప్పాల్సిన అవసరముందని ఆయన పేర్కొన్నారు. పరోక్షంగా బీజేపీని వేలెత్తి చూపుతూ.. ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీస్తున్న కుట్ర గురించి ఈ సభలో చర్చించాల్సిన అవసరముందని, సంకీర్ణ ప్రభుత్వం మనుగడ సాధించినా.. సాధించకపోయినా ప్రస్తుతం విధానసభ జరిగిన తీరు తప్పకుండా పార్లమెంటరీ చరిత్రలో నిలిచిపోవాలని అన్నారు. ఇక బీజేపీ నేత యడ్యూరప్ప మాట్లాడుతూ ఒకే రోజులో విశ్వాసపరీక్షపై చర్చ పూర్తిచేసి.. బలపరీక్ష నిర్వహించాలని స్పీకర్‌ను అభ్యర్థించారు. అయితే, రెబెల్ ఎమ్మెల్యేలు ఎంతమంది సభ్యకు హాజరయ్యారనేది ఇంకా స్పష్టత రాలేదు. ఇక, మరోవైపు విశ్వాస పరీక్షలో విజయం తమదేనంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప మరోసారి విశ్వాసం వ్యక్తం చేశారు. అసెంబ్లీ వద్ద గురువారం ఉదయం ఆయన విలేకరులతో మాట్లాడారు. సంకీర్ణ కూటమికి వంద కన్నా తక్కువ సంఖ్యలో ఎమ్మెల్యేలు ఉన్నారని పేర్కొన్నారు. ‘మేం 101శాతం కాన్ఫిడెన్స్‌తో ఉన్నాం. వారికి వంద కన్నా తక్కువ మంది మద్దతు ఉంది. మాకు 105మంది మద్దతు ఉంది. సర్కార్ పెట్టిన విశ్వాస పరీక్ష వీగిపోతుంది’ అని స్పష్టం చేశారు. బలాబలాలివి..! అధికార కాంగ్రెస్-జేడీఎస్ సంకీర్ణ కూటమికి చెందిన 15 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేసిన నేపథ్యంలో కుమారస్వామి ప్రభుత్వం కొనసాగడంపై నీలినీడలు కమ్ముకున్న సంగతి తెలిసిందే. మొత్తం 225 మంది సభ్యులున్న కర్ణాటక అసెంబ్లీలో అధికార కూటమికి 117 ఎమ్మెల్యేల బలం ఉంది. బీజేపీకి 105 మంది సభ్యులు ఉండగా, ఇటీవల ఇద్దరు స్వతంత్రులు మద్దతు ప్రకటించడంతో అది 107కు చేరుకుంది. ప్రస్తుతం రామలింగారెడ్డిని మినహాయించి 15 మంది రెబెల్ ఎమ్మెల్యేల రాజీనామాలను ఆమోదించినా లేక వారు గైర్హాజరైనా అసెంబ్లీలో అధికార కూటమి బలం 102కి పడిపోనుంది. రాజీనామాల ఆమోదంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన ఎమ్మెల్యేల సంఖ్య 106కు చేరుకుంటుంది. ఈ పరిస్థితుల్లో సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో కొనసాగడం కష్టమేనని విశ్లేషకులు చెబుతున్నారు. బీజేపీ 107 మంది ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం తథ్యమని వ్యాఖ్యానిస్తున్నారు. -
ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసింది
-
కుమారస్వామిని సీఎం చేసినందుకు..
సాక్షి, బెంగళూర్ : కాంగ్రెస్, జేడీఎస్‌లది అపవిత్ర పొత్తని బీజేపీ నేత యడ్యూరప్ప అభివర్ణించారు. ప్రభుత్వ ఏర్పాటు కోసం కుమారస్వామి దిగజారారని, అధికారం కోసం అర్రులు చాస్తున్న ఆయన రాజ్యాంగ ద్రోహి అని విమర్శించారు. కర్ణాటక శాసనసభలో శుక్రవారం కుమారస్వామి సర్కార్‌పై విశ్వాసతీర్మానంపై చర్చ సందర్భంగా ప్రజాభీష్టానికి కాంగ్రెస్ ద్రోహం చేసిందని మండిపడ్డారు. కుమారస్వామితో గతంలో కలిసి పనిచేసినందుకు బాధపడుతున్నానని వ్యాఖ్యానించారు. 37 సీట్లు సాధించిన జేడీఎస్ ప్రభుత్వం ఎలా ఏర్పాటు చేస్తుందని ప్రశ్నించారు. 16 జిల్లాల్లో జేడీఎస్‌కు ఒక్క సీటు కూడా రాలేదని, అలాంటి పార్టీతో కాంగ్రెస్ పొత్తు పెట్టుకుందని ఎద్దేవా చేశారు. అధికారం కోసం రెండు పార్టీలూ దిగజారాయని ఆరోపించారు. కుమారస్వామిని ముఖ్యమంత్రిని చేసినందుకు డీకే శివకుమార్ చింతిస్తారని అన్నారు. తన పోరాటం కాంగ్రెస్‌పై కాదని, అవినీతిపరులైన దేవెగౌడ, కుమారస్వామిలపైనేనని స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరిస్తామని హామీ ఇచ్చారు. స్పీకర్ ప్రతిపక్షాలకూ అవకాశం ఇస్తారని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, బలపరీక్షకు ముందే అసెంబ్లీ నుంచి బీజేపీ వాకౌట్ చేసింది. -
కాంగ్రెస్‌కు 22.. జేడీఎస్‌కు 12
బెంగళూరు: మంత్రి పదవుల పంపకంపై కాంగ్రెస్–జేడీఎస్‌ల మధ్య అంగీకారం కుదిరింది. కర్ణాటక కేబినెట్లో మొత్తం 34 మంది మంత్రులకు గాను కాంగ్రెస్‌కు 22, సీఎంతో కలిపి జేడీఎస్‌కు 12 మంత్రి పదవులు ఇవ్వాలని ఇరు పార్టీల నేతలు అంగీకారానికి వచ్చారు. ఉప ముఖ్యమంత్రి పదవి కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు జి.పరమేశ్వరను వరించింది. స్పీకర్ పదవి కాంగ్రెస్‌కు, డిప్యూటీ స్పీకర్ జేడీఎస్‌కు దక్కనున్నాయి. అయితే బలనిరూపణ తర్వాతే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మంత్రి పదవులు దక్కని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయవచ్చన్న సంకేతాల నేపథ్యంలో వీలైనంత త్వరగా బలపరీక్ష ముగించుకుని మంత్రి వర్గాన్ని విస్తరించాలనే ఆలోచనలో కాంగ్రెస్, జేడీఎస్ ఉన్నాయి. మంత్రివర్గ కూర్పుపై కాంగ్రెస్ నేతలతో భేటీ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ.. నేను, పరమేశ్వర బుధవారం ప్రమాణస్వీకారం చేస్తాం. కేబినెట్ విస్తరణకు సంబంధించి ఈ రోజు నిర్ణయం తీసుకున్నాం. మే 25న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ఉంటుంది. అసెంబ్లీలో బల పరీక్ష అనంతరం కూటమిలోని మంత్రుల పేర్లను వెల్లడిస్తాం. అంతా సజావుగానే ఉంది. ఎలాంటి విభేదాలు లేవు’ అని పేర్కొన్నారు. మంత్రివర్గ కూర్పుపై మంగళవారం సాయంత్రం కాంగ్రెస్, జేడీఎస్ నేతలు సుదీర్ఘంగా చర్చించారు. తమకే ఎక్కువ పదవులు దక్కాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో ఆ పార్టీకి 22 మంత్రి పదవులు ఇచ్చేందుకు జేడీఎస్ అంగీకరించింది. జేడీఎస్‌కు సీఎంతో కలిసి 12 మంత్రి పదవులే దక్కనున్నాయి. బలనిరూపణ అనంతరం శాఖల కేటాయింపు ఉంటుందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కేసీ వేణుగోపాల్ చెప్పారు. అసెంబ్లీ స్పీకర్‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే కేఆర్ రమేష్ పేరు దాదాపు ఖరారైంది. ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం కర్ణాటక ముఖ్యమంత్రిగా కుమారస్వామి నేడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు ఆ రాష్ట్ర 24వ ముఖ్యమంత్రిగా బెంగళూరులోని అసెంబ్లీ భవనం విధానసౌధ ముందు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆయనతో పాటు కాంగ్రెస్ నేత జి.పరమేశ్వర డిప్యూటీ సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఉంటారని ప్రచారం జరిగినా.. జేడీఎస్ అంగీకరించకపోవడంతో చివరకు ఒకరికే అవకాశం కల్పించారు. ప్రమాణ స్వీకారానికి కుమారస్వామి సిల్కు చొక్కా, పట్టు పంచెతో హాజరవుతారు. తొలుత విధానసభ ప్రాంగణంలో పూజలు నిర్వహించనున్నారు. ప్రమాణస్వీకార ప్రాంగణంలో వీఐపీలు కూర్చోడానికి వీలుగా మూడు వేలకు పైగా కుర్చీలు ఏర్పాటు చేశారు. ఈ నెల 17న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు యడ్యూరప్ప సీఎంగా ప్రమాణం చేయడం, బల నిరూపణకు ముందే 19వ తేదీన రాజీనామా చేయడం తెలిసిందే. దీంతో 37 సీట్లున్న జేడీఎస్, 78 సీట్లున్న కాంగ్రెస్ కలసి కర్ణాటకలో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నాయి. ఒకే వేదికపై విపక్ష నేతలు, సీఎంలు బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ ఏకమయ్యేందుకు, రాజకీయ శక్తుల పునరేకీకరణకు ఈ కార్యక్రమం వేదికగా మారనుంది. కుమారస్వామి ప్రమాణస్వీకారానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, పశ్చిమబెంగాల్, ఢిల్లీ, కేరళ, ఏపీ, ఒడిశా సీఎంలు మమతా బెనర్జీ, కేజ్రీవాల్, విజయన్, చంద్రబాబు, నవీన్ పట్నాయక్, ఎస్పీ చీఫ్ అఖిలేశ్, బీఎస్పీ చీఫ్ మాయావతి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, ఎంఎన్ఎం నేత కమల్ హాసన్ తదితరులు హాజరవుతున్నారు. వీరితో పాటు పవన్ కల్యాణ్, అంబరీష్ కూడా హాజరవుతారని సమాచారం. ఈ నేపథ్యంలో సుమారు రెండు వేల మందికి పైగా పోలీసులతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.ప్రమాణ స్వీకారానికి హాజరవుతానని డీఎంకే నేత ఎంకే స్టాలిన్ మొదట ప్రకటించినా.. తూత్తుకూడిలో అల్లర్ల నేపథ్యంలో తాను రావడం లేదని ట్వీట్ చేశారు. యూపీలో గోరక్‌పూర్, పూల్పూరు ఉప ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఒక్కటైన సమాజ్‌వాదీ, బీఎస్పీ అధినేతలు అఖిలేశ్, మాయావతిలు ఒకే వేదికపై కనిపించనున్నారు. శివకుమార్‌ని నేను వ్యతిరేకించలేదు: దేవెగౌడ డీకే శివకుమార్‌ని డిప్యూటీ సీఎంగా తాను వ్యతిరేకించానంటూ వచ్చిన వార్తల్ని జేడీఎస్ అధినేత హెచ్డీ దేవెగౌడ తోసిపుచ్చారు. వాళ్ల పార్టీ నుంచి ఎవరు డిప్యూటీ సీఎం లేదా మంత్రి అవ్వాలన్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీనే నిర్ణయించుకుంటుందని చెప్పారు. మరోవైపు, శివకుమార్ స్పందిస్తూ.. పదవి విషయంలో హైకమాండ్ ఆదేశాల్ని పాటిస్తానని స్పష్టంచేశారు. సంకీర్ణం సవాలే: కుమార స్వామి ఐదేళ్లపాటు కాంగ్రెస్–జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని నడపడం తనకు పెద్ద సవాలని కుమారస్వామి పేర్కొన్నారు. మంగళవారం శృంగేరీ పీఠాన్ని దర్శించుకున్న అనంతరం మాట్లాడుతూ ‘నా జీవితంలో ఇదో పెద్ద సవాలు. ముఖ్యమంత్రిగా నా బాధ్యతల్ని సులువుగా నిర్వర్తించగలనని నేను భావించడం లేదు. ఈ ప్రభుత్వం సజావుగా సాగుతుందా? లేదా? అని కర్ణాటక ప్రజలకు కూడా అనుమానం ఉంది. అయితే దేవుని దయ వల్ల అంతా సక్రమంగా జరుగుతుందని నాకు నమ్మకముంది’ అని చెప్పారు. ధర్మస్థలలోని మంజునాథ స్వామిని కూడా ఆయన దర్శించుకున్నారు. కింగ్‌మేకర్ కాదు.. కింగే! సాక్షి, బెంగళూరు: కుమారన్న అలియాస్ హెచ్‌డీకే అలియాస్ కుమారస్వామి రెండోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకున్న బీజేపీ, మొన్నటి దాకా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కాకుండా కింగ్‌మేకర్ అంటూ అందరి దృష్టిలో పడిన జేడీఎస్ నేతృత్వంలో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడబోతోంది. అనేక నాటకీయ పరిణామాల మధ్య కేవలం 37 సీట్లు గెలుచుకున్న జేడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కుమారస్వామిని ముఖ్యమంత్రి కుర్చీ వెతుక్కుంటూ వచ్చింది. మాజీ ప్రధాని హెచ్డీ దేవెగౌడ, చెన్నమ్మ దంపతులకు మూడో సంతానంగా 1959 డిసెంబర్ 16న హాసన్ జిల్లా హరదనహళ్లిలో కుమారస్వామి జన్మించారు. బాల్యం, విద్యాభ్యాసం మొత్తం హాసన్ జిల్లాలోనే సాగింది. అనంతరం బెంగళూరులోని నేషనల్ కాలేజీలో బీఎస్సీ పూర్తి చేశారు. 1986 మార్చి 13న అనితతో వివాహమైంది. ఏడాదిలో కొడుకు నిఖిల్‌గౌడ జన్మించారు. అనంతరం 2006లో సినీ నటి రాధికతో కుమారస్వామికి రెండో వివాహమైంది. వారికి షమిక అనే కుమార్తె ఉంది. కుమారకు రేవణ్ణ, బాలకృష్ణగౌడ అనే ఇద్దరు అన్నలు ఉన్నారు. అయితే, చిన్నవాడైన కుమారపై దేవెగౌడకు గురి ఎక్కువ. కారణం.. కుమారస్వామి పట్టుదల, రాజకీయ వ్యూహాలు. కుమారస్వామి ‘చెన్నాంబిక’ బ్యానర్‌పై పలు కన్నడ హిట్ సినిమాలు నిర్మించారు. రామనగర జిల్లా కనకపుర స్థానం నుంచి 1996లో తొలిసారిగా ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. 1998లో జరిగిన ఎన్నికల్లో తన తండ్రి హెచ్డీ దేవెగౌడ ప్రధానిగా ఉన్న సమయంలో కుమారస్వామి కనకపుర నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత 1999 అసెంబ్లీ ఎన్నికల్లో సాతనూరు నుంచి, 2004లో రామనగర నుంచి గెలుపొంచారు. 2006లో బీజేపీతో జతకట్టి ముఖ్యమంత్రి అయ్యారు. సుమారు 20 నెలల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు. -
బలపరీక్ష: బీజేపీకి ఆప్షన్స్ ఇవే...
సాక్షి, బెంగళూరు: కాసేపట్లో కర్ణాటక అసెంబ్లీలో సీఎం యెడ్యూరప్ప బలపరీక్షను ఎదుర్కొనున్నారు. ఈ ఉదయం వరకు గెలుపుపై బీజేపీ ధీమాతో ఉండగా.. ఎమ్మెల్యేలను నిలువరించే పనిలో కాంగ్రెస్-జేడీఎస్‌లు ఉన్నాయి. కానీ, మధ్యాహ్ననికి ఎటూ అర్థంకానీ పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉంటే బలపరీక్షలో నెగ్గాలంటే బీజేపీ ముందు ఐదు మార్గాలున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 1. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడటం.. తద్వారా బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటి విశ్వాస పరీక్షలో నెగ్గుతుంది. 2. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను ఓటింగ్‌లో పాల్గొనకుండా నిలువరించగలిగాలి.. అప్పుడు మెజార్టీ సంఖ్య ఆటోమేటిక్‌గా తగ్గిపోతుంది. 3. ఎమ్మెల్యేలు సభకు గైర్హాజరు కావటం.. తద్వారా మెజార్టీ మార్క్‌పై ప్రభావం చూపుతుంది. 4. కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలను రాజీనామాలు చేయించటం.. సంఖ్యా బలం తగ్గిపోయి బీజేపీ మెజార్టీ మార్క్‌ను దాటేస్తుంది. 5. సభ కార్యాకలాపాలకు అవాంతరం కలిగించి.. సభను వాయిదా వేయించటం. అప్పుడు విశ్వాస పరీక్ష జరగదు. ప్రస్తుతానికి యెడ్యూరప్పనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారు. -
రాజీనామా ఆలోచనలో యడ్యూరప్ప..??
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ(బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాజీనామా ఆలోచనలో ఉన్నారా?. బల పరీక్షకు తగిన మెజారిటీ లేకపోవడంతో వాజ్‌పేయి తరహాలోనే యడ్యూరప్ప కూడా రాజీనామా చేస్తారనే ఊహాగానాలు పెల్లుబిక్కుతున్నాయి. 13 పేజీల ప్రసంగం చదివి రాజీనామాపై ప్రకటన చేస్తారనే వార్తలు కర్ణాటకలో సంచలనం రేపుతున్నాయి. కాగా, అసెంబ్లీని మధ్యాహ్నం 03.30 గంటల వరకూ వాయిదా వేసిన తర్వాత యడ్యూరప్ప పార్టీ నేతలతో అత్యవసరంగా భేటీ అయ్యారు. మెజార్టీ రాకపోతే ఏం చేయాలన్న దానిపై ఆయన చర్చించినట్లు తెలిసింది. అయితే మరో వైపు విపక్షాల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు బీజేపీలోకి జంప్ కొడతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. -
యడ్యూరప్ప బేరసారాలు వెలుగులోకి..!!
సాక్షి, బెంగళూరు : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శాసనసభా పక్ష నేత, కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి యడ్యూరప్ప కాంగ్రెస్ ఎమ్మెల్యేతో బేరసారాలు జరిపిన ఆడియో టేప్ సంచలనం రేపుతోంది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీసీ పాటిల్‌కు ఫోన్ చేసిన యడ్యూరప్ప బీజేపీకి మద్దతు తెలిపితే మంత్రి పదవి ఇస్తానని, అన్ని విధాలుగా అండగా ఉంటానని చెబుతున్న ఆడియో టేపును కాంగ్రెస్ పార్టీ బయటపెట్టింది. బల పరీక్షకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ బీజేపీ పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. యడ్యూరప్ప తనయుడికి సంబంధించిన మరో టేపును కూడా కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది. కాగా, ఇప్పటివరకూ విపక్ష శిబిరం నుంచి మొత్తం 10 మందికి బీజేపీ గాలం వేసినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏడుగురు, జేడీఎస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెట్లను బీజేపీ తనవైపు ఆకర్షించిందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ, నారాయణరావు, రాజశేఖర్ పాటిల్, మహాతేజ, హోళగెరి, బయ్యాపూర్ అమెరగడలు, జేడీఎస్ నుంచి వెంకట రావ్ నడగడ, స్వతంత్రులు నరేష్, శంకర్లు ఇందులో ఉన్నట్లు సమాచారం. కాగా, ఇప్పటివరకూ ప్రొటెం స్పీకర్ 210 మంది ఎమ్మెల్యేలతో ప్రమాణస్వీకారం చేయించారు. మధ్యాహ్నం 03.30 గంటలకు అసెంబ్లీని వాయిదా వేశారు. దీంతో మిగతావారి ప్రమాణస్వీకారంపై ప్రతిష్టంభన నెలకొంది. -
మారుతున్న పార్టీల సమీకరణాలు
సాక్షి, బెంగళూరు : కన్నడనాట అధికారం చేపట్టబోయే పార్టీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీల సమీకరణాలు క్షణక్షణానికి మారుతుండటంతో ఎప్పుడు ఏమవుతుందో తెలియని స్థితి ఏర్పడింది. ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు మద్దతు కూడా తమకే ఉందని భారతీయ జనతా పార్టీ(బీజేపీ) పేర్కొంది. కాంగ్రెస్, జేడీఎస్‌ల నుంచి ఇద్దరు చొప్పున నలుగురు రెబెల్స్‌గా మారారు. దీంతో బీజేపీ సంఖ్యా బలం 109కి చేరినట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి మిస్సింగ్‌లో ఉన్న ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడలు అసెంబ్లీకి గైర్హాజరు అయ్యారు. అయితే, ప్రమాణస్వీకారానికి ఇంకా హాజరుకాని కాంగ్రెస్ ఎమ్మెల్యేలను అసెంబ్లీకి తీసుకెళ్లేందుకు ఐజీ నీలమణి రాజు వారు బస చేస్తున్న హోటల్‌కు వెళ్లారు. బీజేపీకి చెందిన ఎమ్మెల్యే సోమశేఖర్ రెడ్డి కూడా విధానసభకు హాజరుకాలేదు. కాగా, ఎమ్మెల్యేలు ఫిరాయించకుండా ఉండేందుకు పార్టీలు తిప్పలుపడుతున్నాయి. విధానసభలోకి ఎమ్మెల్యేలు మొబైల్స్‌ను తీసుకురానివ్వకుండా పార్టీలు చర్యలు తీసుకున్నాయి. ఒక్కో ఎమ్మెల్యే వద్ద ఇద్దరు పార్టీ వ్యక్తులను ఉంచాయి. కాగా, బలపరీక్షలో నెగ్గుతామని అధికార బీజేపీ ధీమాతో ఉంది. ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ వైపే ఉన్నారని బీజేపీ వర్గాలు అంటున్నాయి. మరోవైపు తమ ఎమ్మెల్యేలను బీజేపీ ప్రలోభపెడుతోందని కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. మద్దతు పలికిన వారికి రూ. 50 కోట్లు, మంత్రి పదవి ఆఫర్ చేస్తున్నారని ఆరోపిస్తోంది.ýకాగా, ప్రలోభాల పేరుతో కాంగ్రెస్ విడుదల చేసిన టేపులన్నీ తప్పేనని కేంద్ర మంత్రి సదానంద గౌడ అన్నారు. బీజేపీ నేతల గొంతును మిమిక్రీ చేశారని ఆరోపించారు. బీజేపీ ఎన్ని కుట్రలు పన్నినా బల పరీక్షలో సంఖ్యాబలం కలిగిన మేమే నెగ్గుతామని కాంగ్రెస్ నేత శివ కుమార్ అన్నారు. పార్టీ ఎమ్మెల్యేలను కాపాడుకునే వ్యూహం కాంగ్రెస్‌కు ఉందని పేర్కొంది. -
డివిజన్, వాయిస్ ఓటింగ్ అంటే ఏమిటి?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభలో జరగనున్న బలపరీక్షతో హైడ్రామాకు ఇవాళ సాయంత్రం తెరపడనుంది. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం డివిజన్ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కాల్సి ఉంది. ఇప్పటికే రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు నో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిస్ ఓటింగ్ లేదా, డివిజన్ ఓటుద్వారా బలాన్ని లెక్కించే అవకాశం ఉంది. వాయిస్ ఓటింగ్, డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. మూజువాణి (వాయిస్)ఓటు అసెంబ్లీలోని సభ్యుల అభిప్రాయాన్ని మూజువాణి ఓటు విధానంలో వెల్లడించడం. విశ్వాస పరీక్షకు సమాధానంగా ఎస్, లేదా నో అని సమాధానం చెప్పాలి. మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత ఎస్ అని, వ్యతిరేకించే వారు నో అని సమాధానం ఇవ్వాలి. అనంతరం ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది లెక్కిస్తారు. ఇక్కడ స్పీకర్ నిర్ణయమే కీలకం. డివిజన్ ఓటు చట్టసభలో సభ్యులు డివిజన్ ఓటు ద్వారా విశ్వాసాన్ని ప్రకటించడం.. దీనినే హెడ్ కౌంట్ అని కూడా అంటారు. శనివారం కర్ణాటక శాసనసభలో జరగనుంది ఇదే. ఈ అంశంపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని డివిజన్ ఓటింగ్ విధానంలో కోరుతారు. ఇందులో భాగంగా అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకించేవారిని, తటస్థంగా ఉండేవారిని వేర్వేరు సార్లు చేతులెత్తడం లేదా లేచినిలబడడం ద్వారా అభిప్రాయం కోరుతారు. అంటే అనుకూలంగా ఉన్నవారిని ఒకసారి లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. తర్వాత వ్యతిరేకించేవారిని లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. చివరగా తటస్థంగా ఉండేవారి సంఖ్యను లెక్కిస్తారు. అంతిమంగా ఆ అంశానికి ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకమనేది లెక్కించి.. నిర్ణయం తీసుకుంటారు. కాగా ప్రోటెం స్పీకర్ ఎన్నికపై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తాత్కాలిక స్పీకర్‌గా బోపయ్య ఎన్నిక సరైనదేనని తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన బోపయ్యకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ వర్గాలు ముందస్తు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే ఉదయం 11 గంటలనుంచి అసెంబ్లీ మొత్తం కార్యకలాపాలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన సింఘ్వీ విజయం తమదేనని చెప్పారు. ప్రజాస్వామ్యానిదే తుది విజయమని తాము నమ్ముతున్నామన్నారు. -
ప్రొటెం స్పీకర్‌గా బోపయ్యకే గ్రీన్ సిగ్నల్
-
కర్ణాటకలో బోపయ్యే ప్రొటెం స్పీకర్
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం(తాత్కాలిక) స్పీకర్‌గా భారతీయ జనతా పార్టీ(బీజేపీ) ఎమ్మెల్యే కేజీ బోపయ్య కొనసాగేందుకు సుప్రీం కోర్టు శనివారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కర్ణాటకలో ప్రొటెం స్పీకర్‌గా సభ్యుల్లో సీనియర్‌ను కాకుండా బోపయ్యతో ప్రమాణం చేయించడంపై కాంగ్రెస్ పార్టీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శనివారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాబ్డే సీనియర్‌ను కాకుండా వేరే వ్యక్తిని సైతం ప్రొటెం స్పీకర్‌గా నియమించిన ఘటనలు ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాం జెఠ్మలానీ, సింఘ్వీ, కపిల్ సిబల్‌లు కోర్టులో వాదనలు వినిపించారు. రాజ్యాంగ పరిషత్ ప్రారంభం నుంచి సభ్యుల్లో సీనియర్‌ను మాత్రమే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేస్తున్నారని సిబల్ కోర్టుకు నివేదించారు. ఇందుకు స్పందించిన న్యాయమూర్తి సీనియర్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించని ఘటనలు కూడా ఉన్నాయన్నారు. అయితే, బోపయ్య గతంలో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించిన తీరు సరిగా లేదని, బల పరీక్షకు ఆయన అధ్యక్షత వహించకుండా చూడాలని సిబల్ న్యాయమూర్తిని అభ్యర్థించారు. కేవలం ప్రమాణస్వీకారాల వరకూ బోపయ్య ఉంటే అభ్యంతరం లేదని చెప్పారు. దీనిపై స్పందించిన జస్టిస్ ఎస్ బాబ్డే ఇందుకు బోపయ్య వాదనలు కూడా వినాల్సివుంటుందని పేర్కొన్నారు. ఈ వ్యక్తినే ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేయాలని గవర్నర్‌ను న్యాయస్థానం ఆదేశించలేదని చెప్పారు. అసెంబ్లీ ప్రొసీడింగ్స్‌ను ఉదయం 11 గంటల నుంచి బలపరీక్ష ముగిసేవరకూ చానళ్లలో లైవ్ టెలికాస్ట్ చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీని వల్ల పారదర్శకత ఉండేట్లు చూడొచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో సుప్రీం మొట్టికాయలు 2008లోనూ బోపయ్య ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. అప్పుడు ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయనే ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం జగదీశ్ షెట్టర్ స్పీకర్‌గా నియమితులు కాగా, బోపయ్య డిప్యూటీ స్పీకర్ అయ్యారు. షెట్టర్ రాజీనామా అనంతరం 2009 నుంచి 2013 మధ్య స్పీకర్‌గా పనిచేశారు. బోపయ్య స్పీకర్ పదవిలో ఉండగా బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం వచ్చింది. విశ్వాసపరీక్షలో యడ్యూరప్పను గెలిపించేందుకు 11 మంది బీజేపీ తిరుగుబాటు ఎమ్మెల్యేలు, ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలు సహా మొత్తం 16 మందిపై బోపయ్య అనర్హత వేటు వేశారు. ఈ నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు కూడా సమర్థించగా, సుప్రీంకోర్టు 2011లో కొట్టివేసింది. బోపయ్య ప్రాథమిక రాజ్యాంగ విలువలు, సిద్ధాంతాలను పట్టించుకోకుండా ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించారనీ, ఆయనకు రాజ్యాంగం, ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని సుప్రీంకోర్టు అప్పట్లో తీవ్రంగా ఆక్షేపించింది. -
బీజేపీలో కొత్త ధీమా, బోపయ్యకు ఓకే..
సాక్షి, బెంగళూరు : బలపరీక్ష నిరూపణ సమయం దగ్గర పడుతున్న కొద్దీ భారతీయ జనతా పార్టీలో కొత్త ధీమా కనిపిస్తోంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం 10 నుంచి 15మంది కాంగ్రెస్-జేడీఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తారంటూ బీజేపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. బలపరీక్షలో ఎలాగైనా నెగ్గేందుకు బీజేపీ తన విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందులో భాగంగా కాంగ్రెస్-జేడీఎస్‌కు చెందిన పదిమంది ఎమ్మెల్యేలను తనవైపుకు తిప్పుకోవడం, మరోవైపు 14మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయ్యే విధంగా చేసేందుకు పావులు కదుపుతోంది. సాయంత్రం జరిగే బలపరీక్షలో తాము గెలిచి తీరుతామని ముఖ్యమంత్రి యడ్యూరప్ప ధీమా వ్యక్తం చేశారు. ఆదివారమే మంత్రివర్గ సమావేశం ఉంటుందని, రైతులకు ఇచ్చిన రుణాలు మాఫీ చేస్తామని తెలిపారు. సాయంత్రం సంబురాలు జరుపుకుంటామని ఆయన అన్నారు. కాగా బలపరీక్ష చేపట్టేందుకు ప్రొటెం స్పీకర్ బోపయ్యకే సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. కొత్త ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం కర్ణాటక అసెంబ్లీ శనివారం ప్రత్యేకంగా సమావేశం అయింది. ఈ సందర్భంగా ప్రొటెం స్పీకర్ బోపయ్య...నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తున్నారు. ఎమ్మెల్యేలుగా ముఖ్యమంత్రి యడ్యూరప్ప, సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం మధ్యాహ్నం వరకూ కొనసాగనుంది. కర్ణాటక అసెంబ్లీలో బలబలాలు బీజేపీ 104, కాంగ్రెస్ 78, జేడీఎస్ 36, ఇతరులు 3 మొత్తం 222 సీట్లు, మ్యాజిక్ ఫిగర్ 111 రెండు స్థానాల్లో గెలిచిన కుమారస్వామికి ఒకే ఓటు బలపరీక్షలో విజయంపై రెండు పక్షాల్లో ధీమా ఇంకా తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెడుతున్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ సాయంత్రం 4 గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బలపరీక్ష తమకు 116 ఎమ్మెల్యేలు ఉన్నారంటున్న కాంగ్రెస్-జేడీఎస్ భద్రతా వలయంలో కర్ణాటక విధాన సౌధ రంగంలోకి 200మంది మార్షల్స్ -
అజ్ఞాతంలోనే ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు!
సాక్షి, బెంగళూరు : ఓవైపు బలపరీక్షకు కొద్ది గంటల సమయం మాత్రమే ఉండగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఇంకా అజ్ఞాతం వీడలేదు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యేలు ఆనంద్ సింగ్, ప్రతాప్ గౌడ ఇంకా హాజరు కాలేదు. గత రెండు రోజులుగా వీరిద్దరు అందుబాటులో లేని విషయం తెలిసిందే. కాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామలింగారెడ్డి శనివారం ఉదయం ఇక్కడ మాట్లాడుతూ... ఆనంద్ సింగ్ విధాన సభకు వస్తారని, ఆయన కాంగ్రెస్‌కు ఓటు వేస్తారని అంతకు ముందు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. బలపరీక్షపై ఆయన మాట్లాడుతూ... సూర్యుడు తూర్పున ఉదయించడం ఎంత వాస్తవమో కాంగ్రెస్ నెగ్గడం అంతే నిజమన్నారు. యడ్యూరప్ప ముందుగానే రాజీనామా చేస్తే మంచిదని సూచించారు. 117 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం తమకు ఉందన్నారు. యడ్యూరప్పతో సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించి గవర్నర్ వాజుభాయ్ వాలా మొదటి తప్పు చేశారని, ఇక ప్రోటెం స్పీకర్ ఎంపిక విషయంలో రెండో తప్పు చేశారని రామలింగారెడ్డి విమర్శించారు. మస్కి ఎమ్మెల్యే కోసం కాంగ్రెస్ విశ్వ ప్రయత్నాలు రెండు రోజులుగా తమకు అందుబాటులో లేకుండాపోయిన మస్కి నియోజకవర్గ ఎమ్మెల్యే ప్రతాప్ గౌడ తిరిగి కాంగ్రెస్‌లోకి తీసుకురావడానికి పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. శనివారం సాయంత్రంలోపు విధానసభలో బలనిరూపణ చేసుకోవాలంటూ సుప్రీంకోర్టు ఆదేశించడంతో ఎమ్మెల్యే ప్రతాప్ గౌడను తిరిగి సొంత గూటికి తీసుకు వచ్చేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే హంపన గౌడ బాదర్లి, కేపీసీసీ ప్రధాన కార్యదర్శి వసంతకుమార్...ఎమ్మెల్యే ప్రతాప్ గౌడతో ఫోన్‌తో సంభాషించినట్లు సమాచారం. కాంగ్రెస్ నేతల సూచనల మేరకు ఆయన తిరిగి పార్టీలోకి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. -
క్లైమాక్స్‌లో కర్ణాటక రాజకీయం
-
బల పరీక్షకు మరికొద్ది గంటలే..
-
బెంగుళూరులో టెన్షన్.. టెన్షన్..
సాక్షి, బెంగుళూరు : కర్ణాటకలో రాజకీయ సంక్షోభం తుది దశకు చేరుకుంది. బల పరీక్షకు మరికొద్ది గంటలే మిగిలివున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర రాజధాని బెంగళూరులో గల విధానసౌధ వద్ద ఏ క్షణాన ఏం జరగుతుందోనన్న టెన్షన్ నెలకొంది. ప్రొటెం స్పీకర్ బోపయ్య, ముఖ్యమంత్రి యడ్యూరప్ప ఇప్పటికే విధానసౌధకు చేరుకున్నారు. బెంగళూరులో బస చేస్తున్న హోటళ్ల నుంచి అన్ని పార్టీల ఎమ్మెల్యేలు అసెంబ్లీకి చేరుకున్నారు. మిస్సింగ్‌గా ఉన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆనంద్ సింగ్ తిరిగి ఆ పార్టీ గూటికి వచ్చి చేరారు. అసెంబ్లీలోనే బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్-జేడీఎస్‌లు సైతం అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎమ్మెల్యేలతో చర్చించనున్నాయి. విధానసౌధ పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర డీజీపీ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 03.55 నిమిషాల వరకూ ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణస్వీకారం చేయిస్తారు. 4 గంటలకు అసెంబ్లీ తలుపులు మూసిన అనంతరం ముఖ్యమంత్రి యడ్యూరప్పను బల నిరూపణ చేసుకోవాలని ప్రొటెం స్పీకర్ కోరనున్నారు. బీజేపీకి 104 ఎమ్మెల్యేల మద్దతు ఉండగా, కాంగ్రెస్-జేడీఎస్‌లకు 116 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. విధానసౌధలో ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం ప్రారంభమైంది. ఎమ్మెల్యేగా బీజేపీ శాసనసభాపక్ష నేత, కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య నియామకంపై కాంగ్రెస్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. బోపయ్యనే ప్రొటెం స్పీకర్‌గా కొనసాగుతారని పేర్కొంది. ఎమ్మెల్యేలుగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్-జేడీఎస్‌ల నుంచి 10 మంది ఎమ్మెల్యేలు వెళ్లిపోతారని బీజేపీ శ్రేణుల్లో ప్రచారం జరగుతోంది. -
కర్ణాటక పీఠం ఎవరిది? విజేత ఎవరు?
సాక్షి, బెంగళూరు: గత నాలుగు రోజులుగా క్షణ క్షణానికి మారుతున్న కన్నడ రాజకీయాలు హైదరాబాద్ నుంచి తిరిగి బెంగళూరుకు షిఫ్ట్ అయ్యాయి. వ్యూహాలు, ప్రతివ్యూహాల కసరత్తు అనంతరం క్యాంప్ రాజకీయాలు మరింత వేడిగా మారాయి. కర్ణాటక పీఠం దక్కించుకోవడం అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్‌కు ప్రతిష్టాత్మకంగా పరిణమించింది. దీంతో ఎవరు వ్యూహాలు పై చేయి సాధించనున్నాయి. కర్ణాటక పీఠం ఎవరికి దక్కనుంది? విజేత ఎవరు? ఇపుడిదే బిగ్ డిబేట్. ఈ రోజు(శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు జరగనున్న బలపరీక్ష నేపథ్యంలో బెంగళూరు విధాన సౌధ వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు. మరోవైపు సీనియర్ సభ్యులను పక్కన పెట్టి ప్రొటెం స్పీకర్‌గా బోపయ్య ఎన్నికపై కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేయడంతో పాటు సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై ఉదయం 10. 30 నిమిషాలకు సుప్రీంలో విచారణ జరగనుంది. దీంతో సుప్రీం నిర్ణయంపై మరోసారి తీవ్ర ఉత్కంఠ నెలకొంది. బీజేపీ అసెంబ్లీలో బలనిరూపణ నేపథ్యంలో శనివారం ఉదయం 11 గంటలకు ఎమ్మెల్యేలందరూ ప్రమాణ స్వీకారం చేసేందుకు రడీ అవుతున్నారు. అనంతరం సాయంత్రం 4గంటలకు బలపరీక్ష జరగనుంది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి యడ్యూరప్ప పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు బెంగళూరులోని హోటల్ షాంఘ్రిలాకి చేరుకున్నారు. అక్కడ పార్టీ ఎమ్మేల్యేలకు దిశా నిర్దేశనం అనంతరం అసెంబ్లీకి పయనమవుతారు. ఇది ఇలా ఉంటే కర్ణాటక అసెంబ్లీలో విశ్వాసపరీక్ష సందర్భంగా నెంబర్లు బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నాయనీ తమదే విజయమని కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ అజాద్ విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేల మద్దతు తమకు ఉందని కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నామన్నారు. బలపరీక్షలో బీజేపీకి భంగపాటు తప్పదని, ఫ్లోర్ టెస్ట్‌లో తాము మెజారిటీ నిరూపించుకుంటామని చెప్పారు. విజయం తమదేనని కాంగ్రెస్ మరో సీనియర్ నేత మల్లిఖార్జున ఖర్గే పేర్కొన్నారు. -
బలపరీక్షలో నెగ్గేది కాంగ్రెసే
-
తాజ్‌కృష్ణలో ముగిసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్ - జేడీఎస్ అధినేతలు తాజ్‌కృష్ణ హోటల్లో ఏర్పాటు చేసిన కర్ణాటక సీఎల్పీ సమావేశం ముగిసింది. కర్ణాటక సీఎల్పీ నేతగా సిద్ధారామయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. డిన్నర్ తరువాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరనున్నారు. వారికి టీ కాంగ్రెస్ ఏపీ సరిహద్దు వరకు 200 వాహనాల కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. అక్కడి నుంచి ఏపీసీసీ, కర్ణాటక నాయకుల కాన్వాయ్ జత చేరనుంది. -
యడ్యూరప్ప నోటివెంట అసలు నిజం..
బెంగళూరు: బలపరీక్షలో బీజేపీనే నెగ్గుతుందని ఆ పార్టీ నాయకులు బల్లగుద్దిమరీ చెబుతున్నారు. ఎలా గెలుస్తారంటే మాత్రం.. ‘రేపు మీరే చూస్తారుగా..’. అని తప్పించుకుంటున్నారు. కానీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప మాత్రం అసలు నిజం కక్కేశారు. శుక్రవారం రాత్రి బెంగళూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. నూటికి నూటాఒక్కశాతం బలపరీక్షలో తమదే విజయమన్నారు. అంతటితో ఆగకుండా.. ‘‘అవును. కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేల మద్దతు లేకుంటే మేమెలా గెలవగలం..’’ అని అనేశారు. రేపు రాష్ట్రంలో సంబురాలు: ‘‘ఊహించినదానికంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తాం. రేపు సాయంత్రం కర్ణాటకలో సంబురాలు జరుగుతాయి. ఆ విజయాన్ని ఆరుకోట్ల కన్నడిగులకు అంకితం చేస్తాం. జేడీఎస్-కాంగ్రెస్‌లది అపవిత్రపొత్తు, వాళ్లు జాతి విద్వేషాలను రెచ్చగొట్టారు. కులాల మధ్య గొడవలు పెట్టాలని చూశారు. ప్రజలు బుద్ధిచెప్పినా, దొడ్డిదారిలో అధికారం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఏదిఏమైనా చివరికి గెలుపుమాదే’’ అని సీఎం యడ్యూరప్ప అన్నారు. -
అసంతృప్తితో వెళ్లిపోయిన కుమారస్వామి
సాక్షి, హైదరాబాద్ : ఇటీవల కొన్ని రాష్ట్రాల్లో జరిగిన తరహాలో కర్ణాటకలోనూ బీజేపీ పాచిక పారేలా కనిపిస్తోంది. కులాల ప్రాతిపదికగా ఎమ్మెల్యేలకు ఎర చూపుతూ బీజేపీ లింగాయత్ అస్త్రాన్ని ప్రయోగిస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ దూకుడు పెంచడంతో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి మధ్య సఖ్యత కొరవడుతున్నట్లు తెలుస్తోంది. సీఎల్పీ భేటీకి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కొందరు డుమ్మా కొట్టడంతో జేడీఎస్ నేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి సీరియస్‌గా ఉన్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం తర్వాత కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడిన ఆయన తీవ్ర అసంతృప్తితో హోటల్ నుంచి నోవాటెల్‌కు వెళ్లిపోయారు. మీ ఎమ్మెల్యేలను మీరే కాపాడుకోలేక పోతున్నారంటూ పెదవి విరిచారు. జాగ్రత్తగా ఉంటే మంచిదంటూ మాజీ సీఎం సిద్దరామయ్య, పరమేశ్వరలకు సూచించారు. నోవాటెల్‌లో జేడీఎస్ ఎమ్మెల్యేలతో కుమారస్వామి భేటీ కానున్నారు. చుక్కలు చూపిస్తోన్న 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోని 8 మంది లింగాయత్ ఎమ్మెల్యేలను బీజేపీ ఆకర్షించేయత్నం చేయడం కారణంగా.. తాజ్‌కృష్ణలో జరిగిన సీఎల్పీ భేటీలో వీరి నుంచి సమావేశంలో వ్యతిరేకత వచ్చింది. మరోవైపు సీఎల్పీ భేటీకి ఐదుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం గమనార్హం. వీరిలో రాయచూర్ జిల్లా మక్కి ఎమ్మెల్యే ప్రతాఫ్ గౌడ, బళ్లారి జిల్లా హోస్పేట్ ఎమ్మెల్యే ఆనంద్‌సింగ్ ఉన్నారు. దీంతో బీజేపీ తమ నేతలను ప్రలోభాలకు గురిచేసిందంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇతర నేతలపై కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా దృష్టి సారించే పరిస్థితి నెలకొంది. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక భేటీ
సాక్షి, హైదరాబాద్ : కర్ణాటక అసెంబ్లీలో శనివారం బల నిరూపణను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై కాంగ్రెస్- జేడీఎస్ అధినేతలు చర్చిస్తున్నారు. ఇక్కడి తాజ్‌కృష్ణ హోటల్లో కర్ణాటక సీఎల్పీ సమావేశం నిర్వహించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలతో మాజీ సీఎం సిద్దరామయ్య, కర్ణాటక పీసీసీ చీఫ్ కీలక భేటీలో పాల్గొన్నారు. మెజార్టీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న కాంగ్రెస్-జేడీఎస్ కూటమి బలపరీక్షలో నెగ్గాలని నేతలకు సూచించారు. తమ కూటమి అభ్యర్థి కుమారస్వామికే సీఎం పీఠం దక్కేలా చూసేందుకు అంతా సంసిద్ధం కావాలని సూచించారు. శనివారం బల నిరూపణ సందర్భంగా అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు జైపాల్‌రెడ్డి, మధుయాష్కీ, కుంతియలు పాల్గొన్నారు. మరోవైపు జేడీఎస్ అధినేత, కూటమి సీఎం అభ్యర్థి కుమారస్వామి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చారు. తాజ్‌కృష్ణకు కుమారస్వామి చేరుకుని కాంగ్రెస్ నేతలను కలుసుకున్నారు. నోవాటెల్ నుంచి జేడీఎస్ ఎమ్మెల్యేలు తాజ్‌కృష్ణకు రానున్నారు. అక్కడ కాంగ్రెస్, జేడీఎస్ కీలక సమావేశం అనంతరం రాత్రి బెంగళూరుకు పయనం అవుతారు. రెండు ప్రత్యేక విమానాల్లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు బెంగళూరు వెళ్లనున్నట్లు సమాచారం. కాగా, కర్ణాటక గవర్నర్ వజుభాయ్ వాలా ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపన్నను నియమించి మరో వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. ఆర్డర్ ఇచ్చిన ఐదు నిమిషాల్లోనే బోపన్నతో ప్రమాణ స్వీకారం చేయించిన విషయం తెలిసిందే. అయితే 8సార్లు ఎమ్మెల్యేగా నెగ్గిన దేశ్‌పాండేను పక్కనపెట్టి బోపన్నను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. -
బలపరీక్షలో గెలిచేది బీజేపీనే! ఎలాగో తెలుసా..
న్యూఢిల్లీ: కర్ణాటక పొలిటికల్ థ్రిల్లర్‌లో నిమిషానికో మలుపు.. సెకనుకో ఊహాగానం! శుక్రవారం నాటి సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి కర్ణాటక అసెంబ్లీలో శనివారం జరుగనున్న బలపరీక్షలో ఏం జరుగుతుందోనని సర్వత్రా ఎదురుచూస్తున్నవేళ.. జేడీయూ-కాంగ్రెస్ కూటమికి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు ఢిల్లీలోనే ఉన్నారని, గవర్నర్‌కు సమర్పించిన 115 సంతకాల్లో ఆ ఎనిమిది మందివి ఫోర్జరీ చేసిఉండొచ్చని ‘రిపబ్లిక్ టీవీ’ మరో సంచలన కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం ప్రకారం.. సుప్రీంకోర్టుకు ఫోర్జరీ సంతకాల జాబితా: కాంగ్రెస్‌కు చెందిన ఐదుగురు, జేడీఎస్‌కు చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు ప్రస్తుతం హైదరాబాద్ శిబిరంలో లేరు. వారంతా ఢిల్లీలో బీజేపీ నేతల సంరక్షణలో ఉన్నారు. శనివారం బలపరీక్ష సమయానికి వారిని బెంగళూరుకు తరలించనున్నారు. నిజానికి బెంగళూరు ఈగిల్టన్ రిసార్ట్స్, షాంగ్రీ-లా హోటల్ల్లో శిబిరాలు ఏర్పాటేచేసేనాటికే ఆ ఎనిమిది మంది జంప్ అయ్యారట. గవర్నర్‌కు సమర్పించిన ఎమ్మెల్యేల జాబితాలోనూ ఈ ఎనిమిది మంది సంతకాలు చేయలేదట. దీంతో ఎన్నికల కమిషన్ వెబ్సైట్ నుంచి సంతకాలను సేకరించి.. ఫోర్జరీ చేశారట. ఆ ఎనిమిది ఫోర్జరీ సంతకాల జాబితానే కాంగ్రెస్, జేడీఎస్‌లు గవర్నర్‌కు, ఆపై సుప్రీంకోర్టుకు పంపాయని ‘రిపబ్లిక్’ కథనంలో వెల్లడించింది. అలా 104కు మరో ఎనిమిది మంది జంప్ జిలానీలు తోడుకాగా బీజేపీ బలం మ్యాజిక్ ఫిగర్(112)కు చేరుకుంటుంది కాబట్టి బలపరీక్షలో యడ్యూరప్ప సునాయాసంగా గెలుస్తారన్నది ఆ కథనం సారాంశం. కాంగ్రెస్ ఏమంటోంది?: తమ కర్ణాటక కాంగ్రెస్ ఎమ్మెల్యే ఒకరిని.. బీజేపీ నేతలు ఢిల్లీలో బంధించారని కాంగ్రెస్ ఆరోపించింది. ఆ ఎమ్మెల్యే (ఆనంద్ సింగ్) పేరును కూడా వెల్లడించింది. అయితే, ‘రిపబ్లిక్’ కథనం చెప్పినట్లు 8 మంది ఎమ్మెల్యేల ఫిరాయింపుపై కాంగ్రెస్ వర్గాలు ఎక్కడా ఏమీ మాట్లాడకపోవడం గమనార్హం. -
తాజ్‌కృష్ణలో కర్ణాటక కాంగ్రెస్ కీలక సమావేశం
-
బీజేపీ 200 కోట్లు ఆఫర్ చేసినా..!
సాక్షి, హైదరాబాద్ : సుప్రీంకోర్టు తీర్పు అనంతరం కర్ణాటక రాజకీయాలు దేశ వ్యాప్తంగా మరింత ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. యడ్యూరప్ప బలపరీక్షలో నెగ్గుతారా.. లేక కాంగ్రెస్-జేడీఎస్ అధికారం హస్తగతం చేసుకుంటుందా అన్నదానిపై చర్చ జరుగుతోంది. గవర్నర్ వజుభాయ్ వాలా సీఎం యడ్యూరప్పకు 15 రోజుల గడువు ఇవ్వగా, శనివారం బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. మరోవైపు కర్ణాటక కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు శుక్రవారం హైదరాబాద్‌కు మకాం మార్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జేడీఎస్ సీనియర్ నేత, చాముండేశ్వరి ఎమ్మెల్యే జీటీ దేవెగౌడ మీడియాతో మాట్లాడుతూ.. బల పరీక్షలో కాంగ్రెస్-జేడీఎస్ కూటమి కచ్చితంగా నెగ్గి తీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ ప్రలోభాలకు మా ఎమ్మెల్యేలు లొంగలేదు. బీజేపీ 100 కోట్లు కాదు 200 కోట్ల రూపాయలు ఇచ్చినా మా ఎమ్మెల్యేలు కమలం గూటికి చేరలేదని గ్రహించాలి. మా ఎమ్మెల్యేలు అంతా ఇక్కడే మా వద్దే ఉన్నారు. శుక్రవారం సాయంత్రం లేదా శనివారం వేకువజామున బెంగళూరుకు తిరిగి వెళ్లనున్నట్లు వివరించారు. చాముండేశ్వరి నియోజకవర్గంలో మాజీ సీఎం సిద్దరామయ్యపై నెగ్గిన వ్యక్తి టీజీ దేవెగౌడ కావడం గమనార్హం. శనివారం సాయంత్రం 4 గంటలకు బలనిరూపణ చేసుకోవాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ప్రొటెం స్పీకర్ ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తారని, ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేయవద్దని సుప్రీం ఆదేశించింది. అసెంబ్లీలో రహస్య బ్యాలెట్ ద్వారా బలపరీక్ష నిర్వహించాలన్న అభ్యర్థనను సుప్రీంకోర్టు తిరస్కరించింది. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్‌లో పాల్గొనాలని సూచించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లో కాంగ్రెస్, జేడీఎస్ ఎమ్మెల్యేలు సమావేశమై బల పరీక్షలో నెగ్గడంపై చర్చించనున్నట్లు సమాచారం. -
‘సుప్రీంకోర్టు తీర్పు చారిత్రక విజయం’
న్యూఢిల్లీ : కర్ణాటకలో బీజేపీ శనివారం బలనిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్ధానం ఆదేశించిన నేపథ్యంలో ధర్మాసనం తీర్పును చారిత్రక విజయంగా వర్ణించారు సీనియర్ న్యాయవాది జంధ్యాల రవిశంకర్. ఈ సందర్భంగా ఆయన శుక్రవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ... ప్రస్తుతం కర్ణాటకలో ఏర్పడిన హంగ్ పరిస్థితుల దృష్ట్యా సర్కారియా కమిషన్ సూచనలను తెరపైకి తీసుకురావడం వల్ల మేలు జరుగుతుందని తెలిపారు. సర్కారియా కమిషన్ మూడో పేరాలో పేర్కొన్న ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశం’ లోతుగా పరిశీలించడానికి అవకాశం దొరికిందన్నారు. సర్కారియా కమిషన్ సూచించిన ఈ ‘అతిపెద్ద రాజకీయ పార్టీ అంశానికి’ ఉన్న న్యాయబద్దతను పరిశీలించడానికి గాను సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణను 10 వారాల పాటు వాయిదా వేసిందని తెలిపారు. ఈ అంశాన్ని పూర్తిగా పరిశీలించి, మార్గదర్శకాలను రూపొందిస్తే ఇక భవిష్యత్తులో ఎటువంటి రాజకీయ అనిశ్చిత పరిస్థితులు ఏర్పడకుండా చూడవచ్చని పేర్కొన్నారు. కాగా కర్ణాటక అసెంబ్లీలో బీజేపీని శనివారం బలనిరూపణ చేసుకోవాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని, చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలని బీజేపీ అడగడాన్ని తప్పుబట్టిన సుప్రీం ధర్మాసనం... యడ్యూరప్ప ఎటువంటి విధానపర నిర్ణయాలు తీసుకోవడానికి వీలులేదని ఆదేశాలు ఇచ్చింది. -
ప్రోటెం స్పీకర్ ఎవరు?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ తాత్కాలిక స్పీకర్ ఎవరు అనే విషయం ఇపుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ పదవికి బీజేపీ నేత ఎంపికవుతారా లేక కాంగ్రెస్ నేత ఎన్నికవుతారా అనేది కీలక చర్చగా మారింది. ఇప్పటికే ఉన్న అంచనాల ప్రకారం కాంగ్రెస్‌కు చెందిన ఆర్వీ దేశ్ పాండే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికయితే.. బలపరీక్ష నిరూపించుకునే సమయంలో యడ్యూరప్పకు మరో తలనొప్పి తప్పదా అనే చర్చ కూడా తీవ్రంగా నెలకొంది. అంతేకాదు శనివారం నాటి ఫ్లోర్ టెస్ట్‌లో ఫలితం టై అయిన సందర్భంలో తాత్కాలిక స్పీకర్ ఓటు నిర్ణయాత్మకం కానుంది. ఈ నేపథ్యంలో ప్రోటెం స్పీకర్ ఎంపిక హాట్ టాపిక్‌గా నిలిచింది. చట్టప్రకారం అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికవుతారు. అయితే సీనియారిటీ ప్రకారం చూస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన దేశేపాండే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికయ్యే అవకాశం ఉంది. ఈ నియామకాన్ని గవర్నర్ చేపడతారు. తాత్కాలిక ప్రాతిపదికన లేదా, అసెంబ్లీ స్పీకర్ ఎంపిక పూర్తయ్యేదాకా ఆయన పదవిలో ఉంటారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని కూడా ప్రోటెం స్పీకర్ చేపడతారు. ఇది ఇలా ఉంటే కర్ణాటక శాసన సభ సెక్రటేరియట్ గురువారం కాంగ్రెస్ పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ఆర్ వీ దేశ్ పాండ్ పేరును తాత్కాలిక స్పీకర్ గా గవర్నర్ కు సిఫారసు చేసింది. మరోవైపు ప్రో-టెం స్పీకర్‌గా ఎంపిక అయ్యే అర్హత తనకే వుందని కాంగ్రెస్ నేత దేశ్‌పాండే చెబుతున్నారు. తానే ఈ పదవికి ఎంపికయ్యే అవకాశం ఉందన్నారు. సుప్రీం ఎలాగూ సీక్రెట్ ఓటింగ్‌పై స్పష్టత ఇచ్చింది కనుక వాయిస్ ఓట్, లేదా ఓట్ల విభజన ద్వారా బలనిరూపణ ఉండే అవకాశం ఉందన్నారు. దేశ్‌పాండే 1983 నుండి ఎన్నికలలో తొమ్మిది సార్లు పోటీ చేస్తే ఎనిమిది సార్లు విజయం సాధించారు. ఇక ఈ వరుసలో బీజేపీకి చెందిన ఉమేష్ విశ్వనాథ్ కట్టి కూడా రెండవ సీనియర్‌గా రేసులో ఉన్నారు. 1985 నుండి ఎనిమిదిసార్లు ఎన్నికల్లో పాల్గొనగా ఏడుస్లారు అసెంబ్లీకి ఎంపికయ్యారు. కాగా ఇప్పటికే సుప్రీం ఆదేశాలతో ఖంగుతున్న బీజేపీకి కాంగ్రెస్ సీనియర్ దేశ్‌పాండే తాత్కాలిక స్పీకర్‌గా ఎంపికయితే మరో ఎదురు దెబ్బ తప్పదనీ యడ్యూరప్ప బల నిరూపణ సమయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తాత్కలిక స్పీకర్ ఎంపికపై చర్చించేందుకు కర్ణాటక గవర్నర్ రాజ్యాంగ నిపుణులతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. -
నంబర్ గేమ్‌లో నెగ్గేదెవరు..?
సాక్షి, బెంగళూర్ : కర్ణాటక అసెంబ్లీలో బలనిరూపణకు కౌంట్‌డౌన్ మొదలవడంతో అసెంబ్లీ సాక్షిగా వెలువడే ఫలితంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. యడ్యూరప్ప సర్కార్ శనివారం సాయంత్రం 4 గంటలకు శాసనసభలో బలం నిరూపించుకోవాలని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక అసెంబ్లీలో బీజేపీకి 104 మంది ఎమ్మెల్యేల సంఖ్యాబలం ఉండగా, కాంగ్రెస్‌కు 78, జేడీఎస్‌కు 37 మంది ఎమ్మెల్యేలున్నారు. జేడీఎస్‌తో పొత్తున్న బీఎస్పీ నుంచి ఓ ఎమ్మెల్యే ఎన్నికయ్యారు. కాంగ్రెస్, జేడీఎస్, బీఎస్పీల కూటమికి 116 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. ఇద్దరు ఇండిపెండెంట్లు కూడా తమకు మద్దతు ఇస్తారని చెబుతుండటంతో కూటమి బలం 118కి పెరిగింది. ఇది సాధారణ మెజారిటీ అయిన 111 కంటే అధికం కావడం గమనార్హం. ప్రస్తుతం 222 మంది ఎమ్మెల్యేలున్న కర్ణాటక అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ సభా కార్యకలాపాలు చేపడుతున్నందున సభ్యుల సంఖ్య 221కు తగ్గుతుంది. ఇక ఇరు పక్షాల బలం సమానమైతే తప్ప ప్రొటెం స్పీకర్ ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఉండదు. ఇక 104 మంది ఎమ్మెల్యేల మద్దతున్న యడ్యూరప్ప బలనిరూపణలో గట్టెక్కాలంటే మరో ఏడుగురు ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ఓటింగ్‌కు కొందరు ఎమ్మెల్యేలు దూరంగా ఉంటే మేజిక్ మార్క్ మరింత దిగివస్తుంది. మరోవైపు యడ్యూరప్ప బలనిరూపణ ముగిసేవరకూ ఆంగ్లో ఇండియన్ ప్రతినిధిని నామినేట్ చేయరాదని, ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోరాదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇరు పక్షాలు స్పష్టమైన మెజారిటీ తమకే ఉందంటూ తెరచాటు మంత్రాంగాలు నెరుపుతున్న క్రమంలో కన్నడ సభలో బలనిరూపణపై సర్వత్రా ఉత్కఠ నెలకొంది. -
యడ్యూరప్ప 3 రోజుల ముఖ్యమంత్రేనా?
సాక్షి, వెబ్ డెస్క్ : కర్ణాటకలో రాజకీయ నాటకీయత తుది దశకు చేరుకుంది. రేపు (శనివారం) సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవాలని అధికార భారతీయ జనతా పార్టీ (బీజేపీ)ని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శనివారం బల పరీక్ష జరగనుంది. బల పరీక్ష బీజేపీకి శరాఘాతమనే చెప్పుకోవాలి. సుప్రీంకోర్టులో ఆ పార్టీ తరఫు న్యాయవాది చేసిన ఏ వాదనతో ముగ్గరు న్యాయమూర్తుల ధర్మాసనం ఏకీభవించలేదు. కచ్చితంగా బల పరీక్ష జరిగి తీరాలని తీర్పునిచ్చింది. గతంలోనూ ఇలాంటి పరిస్థితుల్లోనే కొన్ని రాష్ట్రాలు న్యాయం కోసం అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది 1997 ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాటు ఘటన. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం-1997 1997 ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకుడు జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఒక్క రోజులోనే ఆ ప్రభుత్వం కుప్పకూలింది. ఉత్తరప్రదేశ్ చరిత్రలో అత్యంత ప్రముఖ ఘటన ఇది. ఒక్క రోజు సీఎంగా ఉత్తరప్రదేశ్‌లో ఇప్పటికీ జగదాంబిక పాల్‌ను స్థానికులు చెప్పుకుంటుంటారు. ఎన్నికల్లో మెజారిటీ సాధించిన భారతీయ జనతా పార్టీ(బీజేపీ) నాయకుడు కళ్యాణ్ సింగ్‌ను ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించకపోవడం అప్పట్లో ఉత్తరప్రదేశ్‌లో వివాదాస్పదంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటుకు జగదాంబిక పాల్‌ను ఆహ్వానించిన గవర్నర్ రోమేష్ భండారీ బల నిరూపణ చేసుకోవాలని సూచించారు. విశ్వాస పరీక్ష సమయంలో అసెంబ్లీలో హింస చెలరేగి రక్తపాతం జరగడంతో రాష్ట్రపతి పాలన విధించాలని భండారీ కేంద్రానికి సూచించారు. అయితే, ఇందుకు కేంద్రం నిరాకరించడంతో బీజేపీకి చెందిన కళ్యాణ్ సింగ్ ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. బయట పార్టీల ఎమ్మెల్యేలను కేబినేట్ సభ్యులుగా గుర్తించేందుకు గవర్నర్ నిరాకరించడంతో బీజేపీ ప్రభుత్వం కుప్పకూలింది. ఆ వెంటనే కాంగ్రెస్‌కు చెందిన జగదాంబిక పాల్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే, పాల్ ప్రభుత్వం ఒక్క రోజుకు మించి నిలబడలేదు. పాల్ బీజేపీ తరఫున లోక్‌సభలో ఎంపీగా ఉన్నారు. ప్రస్తుతం కర్ణాటకలో బీజేపీకి 104 ఎమ్మెల్యేలు, బయట నుంచి ఒక స్వతంత్ర అభ్యర్థి మద్దతు ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్-జేడీఎస్‌లకు 116 (కాంగ్రెస్ :78, జేడీఎస్ : 38) మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, అజ్ఞాతంలో ఉన్న ఇద్దరు ఎమ్మెల్యేలు తమతోనే ఉన్నారని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. ఈ నేపథ్యంలో రేపు విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప నెగ్గుతారా? లేక మూడు రోజుల ముఖ్యమంత్రిగా మిగిలిపోతారా? అనేది వేచి చూడాల్సిందే. -
కన్నడ రాజకీయం : కౌంట్ డౌన్ స్టార్ట్
సాక్షి, న్యూఢిల్లీ : కన్నడ నాట రాజకీయాలు అనూహ్య మలుపులు తిరుగుతున్నాయి. క్షణక్షణానికి మారుతున్న పరిణామాలు తీవ్ర ఉత్కంఠతను రాజేస్తున్నాయి. కర్ణాటక ప్రధాన పార్టీల ఎత్తులకు పైఎత్తులు, రాజకీయాలు నాటకీయతను సంతరించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు కన్నడ రాజకీయాలను మరో కీలక మలుపు తిప్పింది. ఒకవైపు అసెంబ్లీలో బలనిరూపణకు ఎవరికి వారు గేమ్‌ప్లాన్‌లో మునిగి ఉండగానే, బేరసారాలు జోరుగా సాగుతుండగానే సుప్రీంకోర్టు సంచలన సూచన చేసింది. దీంతో కన్నడ రాజకీయం మరింత రసకందాయంలో పడింది. తగిన సంఖ్యాబలం ఉన్నప్పుడు శనివారం శాసనసభలో బల నిరూపణ చేపట్టడం ఉత్తమమని సుప్రీంకోర్టు శుక్రవారం నాటి వాదనల సందర్భంగా స్పష్టం చేసింది. అంతేకాదు బీజేపీకి మద్దతిస్తున్న ఎమ్మెల్యేల పేర్లను ఎందుకు చెప్పలేకపోతున్నారని కూడా కోర్టు ప్రశ్నించింది. విశ్వాస పరీక్షలో గవర్నర్ నిర్ణయమే కీలకమని, ఇది ఓ నెంబర్ గేమ్ అని, ఎవరికి మెజార్టీ ఉంటే వారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొంది. అటు తక్షణ విశ్వాస పరీక్షపై బీజేపీ నీళ్లు నములుతున్న సమయంలో ఫ్లోర్ టెస్టుకు తాము సిద్ధమని కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేస్తూ చకచకా పావులు కదిపింది. ఎట్టకేలకు బీజేపీ అభ్యంతరాలను తోసిపుచ్చిన సుప్రీంకోర్టు శనివారం సాయంత్రం నాలుగు గంటలకు బలనీరూపణకు ముహూర్తాన్ని ఖరారు చేసింది. అదీ కూడా ప్రో టెం స్పీకర్ (తాత్కాలిక స్పీకర్) ఆధ్వర్యంలో ఈ పరీక్ష జరగాల్సి ఉంటుందని తేల్చి చెప్పింది. విశ్వాస పరీక్ష ఎలా నిర్వహించాలనేది ప్రోటెం స్పీకర్ నిర్ణయానికే వదిలేసింది. సభలో బలనిరూపణ పూర్తయ్యే వరకు ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని ముఖ్యమంత్రి యడ్యూరప్పకు సుప్రీం కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పూర్తి భద్రత కల్పించాలని చెప్పింది. దీంతోపాటు యడ్యూరప్ప నియమించిన ఆంగ్లో ఇండియన్ ఎమ్మెల్యే నియామకాన్నికూడా నిలిపి వేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయాన్ని కాంగ్రెస్ స్వాగతించింది. చారిత్రాత్మక తీర్పుగా అభివర్ణించింది. జేడీఎస్ మద్దతుతో తమకు విజయం ఖాయమనే ధీమా వ్యక్తం చేసింది. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ప్రో టెం స్పీకర్ ఎంపిక, నిర్ణయం ప్రధానం. ఇది ఇలా ఉంటే ఈ విశ్వాస పరీక్షలో యడ్యూరప్ప అసెంబ్లీ విశ్వాసాన్ని నిరూపించుకోలేకపోతే 3రోజుల ముఖ్యమంత్రిగా యడ్యూరప్ప చరిత్రలో నిలిచిపోతారు. ఒకవేళ విజయం సాధిస్తే దక్షిణాదిలో పాగా వేయాలన్న బీజేపీ కల సాకారమైనట్టే. కాంగ్రెస్, బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారిన బలనిరూపణకు కౌంట్ డౌన్ మొదలైంది. శనివారం సాయంత్రం ఏం జరగబోతుందనేది సర్వత్రా ఉత్కంఠకు గురిచేస్తోంది. మరోవైపు హైదరాబాద్‌లో హోటళ్లలో బస చేసిన కర్ణాటక ఎమ్మెల్యేలు అసెంబ్లీ బలనిరూపణ కారణంగా తిరిగి వెంటనే బెంగళూరుకు బయలుదేరాల్సి ఉంది. కీలక సమావేశం అనంతరం ఈ రోజు అర్థరాత్రి వారు కర్ణాటకకు బయలుదేరి వెళ్లనున్నట్టు సమాచారం. -
బల నిరూపణకు మేం సిద్దం: యడ్యూరప్ప
బెంగళూరు : కర్ణాటక ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన బీఎస్ యడ్యూరప్ప బల నిరూపణకు సిద్దంగా ఉన్నట్లు తెలిపారు. అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. సుప్రీం కోర్టు ఆదేశాలను బీజేపీ పాటిస్తుందన్నారు. మెజార్టీ సాధించేంతా ఎమ్మెల్యేల మద్దతు తమకుందని స్పష్టం చేశారు. బలపరీక్షలో 100 శాతం నెగ్గుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రేపు అసెంబ్లీ సమావేశం నిర్వహించేలా చీఫ్ సెక్రటరీతో చర్చిస్తానన్నారు. సుప్రీం ఆదేశాలను స్వాగతిస్తున్నాం.. రేపే బలనిరూపణ చేసుకోవాలనే ఆదేశాలను స్వాగతిస్తున్నామని బీజేపీ ఎంపీ శోభా కరాండ్లజే అన్నారు. రేపు అసెంబ్లీలో తమ బలాన్ని నిరూపించుకుంటామని ఆశాభావం వ్యక్తం చేశారు. బల నిరూపణకు తమ పార్టీ సిద్దంగా ఉన్నట్లు స్పష్టం చేశారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కర్ణాటక అసెంబ్లీలో బీజేపీ శనివారం బల నిరూపణ చేసుకోవాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో కర్ణాటక రాజకీయం రసవత్తరంగా మారింది. రేపు సాయంత్రం నాలుగు గంటలకు బలపరీక్ష జరగనుంది. -
రేపు బలాన్ని నిరూపించుకోండి : సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ : కర్ణాటక అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) శనివారం బల నిరూపణ చేసుకోవాలని దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. శుక్రవారం కాంగ్రెస్-జేడీఎస్‌ల పిటిషన్లను విచారించిన జస్టిస్ ఏకే సిక్రి, జస్టిస్ భూషణ్, జస్టిస్ బాబ్డేలతో కూడిన ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం తీర్పును వెలువరించింది. కాంగ్రెస్-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది తమకు 116 మంది ఎమ్మెల్యేల మద్దుతు ఉందని ధర్మాసనానికి తెలుపగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి తమకూ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన బలం ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్ఆర్ బొమ్మై కేసును, సర్కారియా కమిషన్ సూచనలను సైతం ప్రస్తావించారు. కాంగ్రెస్-జేడీఎస్‌ల కూటమి అపవిత్రమైనదని వాదించారు. ఇందుకు ప్రతిగా స్పందించిన అభిషేక్ సింఘ్వీ ఏ పార్టీ అధికారాన్ని చేపట్టాలో? ఏ పార్టీ చేపట్టకూడదో? సుప్రీం కోర్టు నిర్ణయించాలని కోరారు. సర్కారియా కమిషన్ సూచనలకు న్యాయబద్దత లేదని పేర్కొన్నారు. ప్రభుత్వ ఏర్పాటును గురించి గవర్నర్‌కు ముఖ్యమంత్రి యడ్యూరప్ప రాసిన లేఖలను ధర్మాసనం పరిశీలించింది. ఎంతమంది మద్దతు ఉందో వారి వివరాలను ఎందుకు పేర్కొనలేదని ప్రశ్నించింది. పూర్తిగా నంబర్ గేమ్‌పై కర్ణాటకలో ప్రభుత్వ ఏర్పాటు ఆధారపడి ఉందని వ్యాఖ్యానించింది. శనివారం బలపరీక్ష నిర్వహిస్తే బావుంటుందని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కాంగ్రెస్ తరఫు న్యాయవాది సింఘ్వీ సంసిద్ధత వ్యక్తం చేయగా, బీజేపీ తరఫు న్యాయవాది రోహత్గి వారం రోజులు గడువు ఇవ్వాలని కోరారు. అంత సమయం ఇవ్వడం వల్ల ఎమ్మెల్యేల కొనుగోళ్లకు దారి తీసే అవకాశం ఉందని రోహత్గి అభ్యర్థనపై ధర్మాసనం వ్యాఖ్యానించింది. దీనివల్ల రాజ్యాంగం, ప్రజాస్వామ్యం అపహాస్యమయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. శనివారం సాయంత్రం నాలుగు గంటలకు కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష జరగాలని తీర్పు నిచ్చింది. సీక్రెట్ బ్యాలెట్ పద్దతిలో ఓటింగ్ నిర్వహించాలన్న ప్రతిపాదనను సైతం తిరస్కరించింది. ఎమ్మెల్యేలు అందరికీ రక్షణ కల్పించాలిని, బల పరీక్ష సజావుగా సాగాలని కర్ణాటక డీజీపీని సుప్రీంకోర్టు ఆదేశించింది. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన బలపరీక్ష నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినట్లు కాంగ్రెస్-జేడీఎస్‌ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వెల్లడించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని వ్యాఖ్యానించారు. చేతులు ఎత్తడం ద్వారా ఓటింగ్ జరుగుతుందని చెప్పారు. బల పరీక్ష అయ్యేంత వరకూ బీజేపీ ప్రభుత్వం ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశించినట్లు చెప్పారు. అయితే, బల పరీక్షను వీడియో షూట్ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను త్రిసభ్య ధర్మాసనం తిరస్కరించినట్లు వెల్లడించారు. -
పళని సర్కార్‌కు 20 వరకూ గడువు
-
పళని సర్కార్‌కు 20 వరకూ గడువు
సాక్షి, చెన్నై : ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రభుత్వానికి మద్రాస్ హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఈ నెల 20 వరకూ ఎలాంటి బలపరీక్ష నిర్వహించవద్దని న్యాయస్థానం గురువారం ఆదేశించింది. కాగా ప్రభుత్వానికి మెజార్టీ లేదనందున పళనిస్వామి ప్రభుత్వాన్ని బలనిరూపణకు ఆదేశించాలంటూ టీటీవీ దినకరన్ వర్గ ఎమ్మెల్యేలు న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. పళని ప్రభుత్వం మైనార్టీలో ఉందని, తమదే అసలైన అన్నాడీఎంకే వర్గం తమదేనంటూ టీటీవీ దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు తమ పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు .. బలపరీక్ష విషయంలో పళనిస్వామి ప్రభుత్వానికి ఆరురోజుల వెసులుబాటు కల్పించింది. మరోవైపు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ కూడా పళిని సర్కార్‌ను విశ్వాస పరీక్షకు ఆదేశించాలన్న పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు స్టాలిన్‌తో బీజేపీ జాతీయ కార్యదర్శి హెచ్.రాజా ఇవాళ సమావేశం అయ్యారు. అయితే తాము మర్యాదపూర్వకంగానే కలిశామని భేటీ అనంతరం హెచ్.రాజా తెలిపారు. కాగా వీరి ఇరువురి సమావేశం చర్చనీయంశంగా మారింది. -
నితీశ్ ఆ విషయం మరిచారు: తేజస్వీ
పట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రజల నిర్ణయాన్ని అగౌరవపరిచారని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ అన్నారు. సీఎంగా గురువారం ప్రమాణ స్వీకారం చేసిన నితీశ్.. శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించారు. అనంతరం తేజస్వీ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల నిర్ణయాన్ని సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తే గౌరవించకపోవడం వారిని కించపరచడమేనని, ప్రజాస్వామ్యానికి నితీశ్ తూట్లు పొడిచారని వ్యాఖ్యానించారు. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ఏర్పడిన మహాకూటమి (ఆర్జేడీ, జేడీయూ, కాంగ్రెస్) నే గెలిపించారు తప్ప.. నితీశ్‌ను కాదని అభిప్రాయపడ్డారు. సీఎం నితీశ్‌కు రానున్న రోజుల్లో బిహార్ ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. తన ప్రశ్నలకే సమాధానం చెప్పిన నితీశ్ ప్రభుత్వం ఇక ప్రజలకు ఏ ముఖం పెట్టుకుని బదులిస్తారని తేజస్వీ ప్రశ్నించారు. నితీశ్ ఒంటరిగా ఎన్నికల బరిలో నిలవగా 1995లో ఏడు సీట్లు, 2014లో రెండు సీట్లు వచ్చాయని, 2015 ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏను మాత్రం మహాకూటమి బలంతోనే ఎదురించిన విషయం నిజంకాదా అని ప్రశ్నించారు. అయితే నితీశ్ మాత్రం ప్రజలు తననే సీఎం చేశారని భ్రమ పడుతున్నారని తేజస్వీ యాదవ్ ఎద్దేవా చేశారు. 243 సీట్లున్న బిహార్‌లో సాధారణ మేజార్టీ 122 సీట్లు కాగా, అసెంబ్లీలో నేడు జరిగిన విశ్వాసపరీక్షలో నితీశ్ ప్రభుత్వానికి అనుకూలంగా 131 ఓట్లు, వ్యతిరేకంగా 108 ఓట్లు పోలయ్యాయి. దీంతో జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదని తేలిపోయింది. -
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
-
బలపరీక్షలో నెగ్గిన నితీశ్ కుమార్
పాట్నా: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో ఎదుర్కొన్న బలపరీక్షలో విజయం సాధించింది. మేజిక్ ఫిగర్ 122 కాగా ఆయనకు అనుకూలంగా 131, వ్యతిరేకంగా 108 ఓట్లు వచ్చాయి. బలపరీక్షలో భారీగా క్రాస్ ఓటింగ్ చేసినట్లు తెలుస్తోంది. గురువారం జనతా దళ్ యూనైటెడ్(జేడీయూ), భారతీయ జనతా పార్టీల కూటమి రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. బిహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ స్ధానాలు ఉన్నాయి. జేడీయూ, బీజేపీలకు 132 మంది ఎమ్మెల్యేల(జేడీయూ 71, బీజేపీ 53, ఆర్ఎల్ఎస్పీ 2, ఎల్జేపీ 2, హెచ్ఏఎం 1, ముగ్గురు స్వతంత్రులు) మెజారిటీ ఉంది. నితీశే తమ ముఖ్యమంత్రిగా ఉండాలని భావించిన కొందరు విపక్ష ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. దీంతో నితీశ్ కుమార్ ప్రభుత్వం బలనిరూపణ పరీక్షలో గెలుపొందింది. కాగా బలపరీక్షకు ముందు విపక్ష కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు ప్లకార్డులతో నితీశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
బలపరీక్షకు సీఎం డుమ్మా!
కోహిమా: పదవీగండాన్ని ఎదుర్కొంటున్న నాగాలాండ్ ముఖ్యమంత్రి షుర్హోజెలీ లీజీట్సు బుధవారం అసెంబ్లీ వేదికగా జరిగిన బలపరీక్షకు డుమ్మాకొట్టారు. ఆయన, ఆయన మద్దతుదారులు బలపరీక్షకు హాజరుకాకపోవడంతో స్పీకర్ సభను నిరవధికంగా వాయిదా వేశారు. అధికార నాగాలాండ్ పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్) ఎమ్మెల్యేలు సీఎం లీజీట్సుపై తిరుగుబాటు చేశారు. ముఖ్యమంత్రిపై వారు ఎదురుతిరగడంతో గవర్నర్ పీబీ ఆచార్య అసెంబ్లీ వేదిక విశ్వాసపరీక్ష నిర్వహించాలని స్పీకర్ ఇంటివపాంగ్కు ఆదేశించారు. ఈ మేరకు బుధవారం ఉదయం నిర్వహించిన బలపరీక్షకు మాజీ సీఎం టీఆర్ జెలియంగ్తోపాటు ఎన్పీఎఫ్ రెబల్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. సీఎం లీజీట్సు, ఆయన మద్దతుదారులు మాత్రం రాలేదు. దీంతో ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానాన్ని చేపట్టకుండానే స్పీకర్ అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తూ సైన్ డై చేశారు. -
బలపరీక్షలో నెగ్గిన సీఎం బీరేన్ సింగ్
మణిపూర్: మణిపూర్‌లో కొత్తగా ఏర్పాటైన బీజేపీ సర్కార్ తొలి పరీక్షను విజయవంతంగా ఎదుర్కొంది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన బీరేన్ సింగ్ సోమవారం అసెంబ్లీలో బలపరీక్షలో నెగ్గారు. 32మంది ఎమ్మెల్యేలు బీరేన్ సింగ్‌కు మద్దతు పలికారు. ఈ నెల 15న మణిపూర్‌లో బీజేపీ ప్రభుత్వం కొలువుదీరిన విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను... కాంగ్రెస్‌కు 28, బీజేపీకి 21 స్థానాలు వచ్చాయి. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్లు చెరో నాలుగు సీట్లు గెలుచుకున్నాయి. ఎల్జేపీ,టీఎంసీ చెరోక సీటు, ఒక స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. నేషనల్ పీపుల్స్ పార్టీ, నేషనల్ పీపుల్స్ ఫ్రంట్, ఎల్జేపీ,టీఎంసీ మద్దతును కూడగట్టి... బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. -
తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు
-
తమిళనాడు ముఖ్యమంత్రికి నోటీసులు
చెన్నై : తమిళనాడు అసెంబ్లీలో జరిగిన బలపరీక్షపై ప్రతిపక్ష డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు సోమవారం విచారణ జరిపింది. ఈ మేరకు తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి సహా, హోంసెక్రటరీ, అసెంబ్లీ స్పీకర్‌తో పాటు అసెంబ్లీ కార్యదర్శికి న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. ఇందుకు సంబంధించి మార్చి 10లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. కాగా ఈ నెల 18న అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభ నియమాలను అనుసరించి జరగలేదని పేర్కొంటూ డీఎంకే న్యాయస్థానాన్ని ఆశ్రయించిన విషయం తెలిసిందే. బల పరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోకుండా తమను సభ నుంచి బయటకు గెంటేశారని, ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదంటూ తన పిటిషన్లో పేర్కొంది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు ఈ నోటీసులు ఇచ్చింది. మరోవైపు బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు నివేదిక కోరారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. -
జయ మృతిపై సీఎం పళని కామెంట్!
చెన్నై: దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తమిళనాడు సీఎం ఎడప్పాడి కె.పళనిస్వామి స్పందించారు. చెన్నైలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అమ్మ జయలలిత మృతి విషయంలో ఎలాంటి వివాదాలు, రహస్యాలు లేవని.. కొంతమంది వ్యక్తులు ఈ విషయంపై అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. గతేడాది డిసెంబర్ 5న చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ జయ కన్నుమూసిన విషయం విదితమే. కరువు వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతులకు ఐదు రోజుల్లోగా పరిహారం అందిస్తామని పళనిస్వామి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ నెల 27న ఢిల్లీకి వెళ్లనున్నట్లు సీఎం పళనిస్వామి తెలిపారు. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) వివాదంపై ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చించనున్నట్లు వెల్లడించారు. నీట్ నుంచి తమిళనాడును మినహాయించాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎంగా తన బలపరీక్ష సమయంలో అంతా రాజ్యాంగబద్ధంగానే జరిగిందని, చట్ట ప్రకారమే సభ సజావుగా సాగిందని పళనిస్వామి చెప్పారు. శశికళకు జైలుశిక్ష ఖరారు కాగానే ఆమె విధేయుడు పళనిస్వామిని అన్నాడీఎంకే పక్షనేతగా ఎన్నుకోవడం అనంతరం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు పళని సహా మంత్రివర్గంతో ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. సభలో విశ్వాసపరీక్షలోనూ పళనిస్వామి 122 ఓట్లతో నెగ్గారు. ఆయనకు వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటేశారు. అన్నాడీఎంకే తిరుగుబాటు వర్గం, మాజీ సీఎం పన్నీర్ సెల్వం మద్ధతుదారులతో పాటు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకె.స్టాలిన్, ఆ పార్టీ ఎమ్మెల్యేలు విశ్వాసపరీక్ష అంశంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పన్నీర్ సెల్వం, స్టాలిన్ ఇదివరకే గవర్నర్ విద్యాసాగర్ రావును వేర్వేరుగా కలసి ఈ విషయంపై ఫిర్యాదు చేశారు. పార్టీ నేతలతో సహా ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్లారు. మరోవైపు పళనిస్వామి బలపరీక్ష చెల్లదంటూ దాఖలైన పిటిషన్ ను విచారించిన మద్రాస్ హైకోర్టు తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. కోర్టు తీర్పుపైనే డీఎంకే, అన్నాడీఎంకే తిరుగుబాటు నేతలు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. -
రాష్ట్రపతి వద్దకు తమిళ రాజకీయాలు!
-
రాష్ట్రపతి వద్దకు తమిళ రాజకీయాలు!
చెన్నై: అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి ఇంకా కొనసాగుతోంది. తమిళ రాజకీయాలు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు వెళ్లనున్నాయి. డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.కే స్టాలిన్ పార్టీ నేతలతో ఢిల్లీకి పయనమయ్యారు. ఇప్పటికే గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి బలపరీక్ష సమయంలో తమపై వ్యవహరించిన తీరును వివరించిన స్టాలిన్.. నేటి సాయంత్రం రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలుసుకుని ఇటీవల అసెంబ్లీలో సీఎం పళనిస్వామి విశ్వాసపరీక్ష సందర్భంగా తలెత్తిన పరిస్థితులను వివరించనున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు లేకుండానే సభను సజావుగా సాగిస్తూ కేవలం అన్నాడీఎంకే నేతలతోనే స్పీకర్ విశ్వాసపరీక్ష నిర్వహించడంపై రాష్ట్రపతికి స్టాలిన్ ఫిర్యాదు చేయనున్నారు. విశ్వాసపరీక్షను నిరసిస్తూ చెన్నైలో స్టాలిన్ బుధవారం ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్ తీరును స్టాలిన్ సహా డీఎంకే ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. జయలలిత మృతి చెందిన తీరుపై సరైన రీతిలో విచారణ జరిపితే.. ఇప్పుడు నాలుగేళ్ల జైలుశిక్ష మాత్రమే అనుభవిస్తున్న శశికళకు జీవిత ఖైదు పడొచ్చని స్టాలిన్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. మరోవైపు బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన మద్రాస్ హైకోర్టు తన తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. -
వీడియో ఆధారాలు సమర్పించండి!
చెన్నై: బలపరీక్ష సందర్భంగా జరిగిన పరిణామాలపై తమిళనాడులో రాజకీయ వేడి కొనసాగుతోంది. అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే దాఖలు చేసిన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు తన విచారణను సోమవారానికి వాయిదా వేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీలో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించిన వీడియో దృశ్యాలను ఆధారాలుగా సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా డీఎంకే సభ్యుల విధ్వంస, నిరసన, ఆ పార్టీ అధినేత స్టాలిన్ సహా ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేయడం వంటి తీవ్ర ఉద్రిక్త పరిణామాలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పళనిస్వామి విజయం సాధించిన బలపరీక్ష చెల్లదంటూ డీఎంకే కోర్టుకు ఎక్కింది. అంతేకాకుండా ఈ బలపరీక్షను వ్యతిరేకిస్తూ.. తమిళనాడు అంతటా డీఎంకే ఆందోళనలకు పిలుపునిచ్చింది. స్టాలిన్ నేతృత్వంలో ఆ పార్టీ బుధవారం ఒకరోజుపాటు నిరాహార దీక్షలకు కూర్చుంది. మరోసారిఅసెంబ్లీ వేదికగా బలపరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తూ డీఎంకే అధినేత స్టాలిన్ సైతం నిరాహార దీక్షలో కూర్చున్నారు. మరోవైపు చట్టప్రకారమే అసెంబ్లీ బలపరీక్ష జరిగిందని, డీఎంకే కావాలనే పళనిస్వామిపై దుష్ప్రచారం చేస్తున్నదని అన్నాడీఎంకే మండిపడుతోంది. -
తమిళ సీఎం ఎక్కువ కాలం కొనసాగరు!
చెన్నై: అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ విధేయుడు, తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన కె.పళనిస్వామి ఎంతో కాలం పదవిలో కొనసాగరని కేంద్ర మంత్రి పోన్ రాధాక్రిష్ణన్ అన్నారు. సొంతింట్లో మన కుర్చీలో కూర్చోవడం.. అద్దె కుర్చీలో కూర్చోవడం రెండు ఒకటి కాదంటూ పళనిస్వామిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇంకా చెప్పాలంటే తమిళనాడు కొత్త సీఎం కె.పళనిస్వామి అద్దె కుర్చీ (వేరొకరి స్థానం)లో ఉన్నారని తాను భావిస్తున్నట్లు మంత్రి చెప్పారు. విశ్వాసపరీక్షలో పళనిస్వామి నెగ్గడంపై మంత్రి రాధాక్రిష్ణన్ స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 'అసెంబ్లీలో విశ్వాసపరీక్ష జరిగిన తీరు నిజంగా సిగ్గుచేటు. ప్రతిపక్షాలు లేకుండానే స్పీకర్ ధన్ పాల్ బలపరీక్ష నిర్వహించడం దారుణం. ఈ ఘటనతో రాష్ట్రమంతా సిగ్గుతో తలదించుకోవాల్సి వచ్చింది. బలనిరూపణ సమయంలో ప్రతిపక్ష డీఎంకే నేతలపై దాడి విషయంపై ఎంక్వరీ కమిషన్ వేయాలని' ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ ఎల్.గణేషన్ మాట్లాడుతూ.. పళనిస్వామి అంకెల్లో మాత్రమే మెజార్టీ నిరూపించుకున్నా.. నైతికంగా ఆయన ఓడిపోయారని చెప్పారు. అన్నాడీఎంకే నేతలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేయడానికి అవకాశం లేకుండా పోయిందని అభిప్రాయపడ్డారు. -
పళని బలపరీక్ష చెల్లదు!
మద్రాస్ హైకోర్టులో డీఎంకే పిటిషన్ బలపరీక్ష రద్దు చేయాలని విజ్ఞప్తి చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో గత శనివారం నిర్వహించిన బలపరీక్ష చెల్లదంటూ ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కోర్టుకెక్కింది. ప్రతిపక్షాలు లేకుండానే అసెంబ్లీలో నిర్వహించిన బలపరీక్ష చెల్లదని ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బలపరీక్ష సందర్భంగా అసెంబ్లీ నుంచి డీఎంకే సభ్యులను బలవంతంగా గెంటేసిన విషయాన్ని పిటిషన్లో ప్రస్తావించింది. బలపరీక్షలో భాగంగా రహస్య ఓటింగ్‌ను చేపట్టాలని కోరినా స్పీకర్ ధన్పాల్ పట్టించుకోలేదని, తమను సభ నుంచి బయటకు గెంటేశారని, మార్షల్స్ తమపై దాడికి పాల్పడ్డారని డీఎంకే పిటిషన్లో ఆరోపించింది. ప్రతిపక్ష సభ్యులు లేకుండా సభలో జరిగిన విశ్వాస పరీక్ష ఏ రకంగానూ చెల్లదని స్పష్టం చేసింది. ఈ వ్యాజ్యాన్ని అత్యవసరంగా స్వీకరించాలని డీఎంకే తరపు న్యాయవాది కోరగా మంగళవారం విచారణ చేపడతామని న్యాయమూర్తులు జస్టిస్ జి.రమేష్, మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఇప్పటికే తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు నివేదిక కోరిన సంగతి తెలిసిందే. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా ఈ అంశంపై న్యాయపోరాటం చేయాలని డీఎంకే నిర్ణయించింది. అందులో భాగంగానే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. -
బ్రేకింగ్: పళని బలపరీక్ష చెల్లదు!
-
బలపరీక్ష గలాటాపై స్పందించిన గవర్నర్!
చెన్నై: తమిళనాడు అసెంబ్లీలో శనివారం బలపరీక్ష సందర్భంగా చోటుచేసుకున్న తీవ్ర గందరగోళ పరిస్థితులపై ఆ రాష్ట్ర ఇన్చార్జి గవర్నర్ విద్యాసాగర్‌రావు స్పందించారు. బలపరీక్ష సందర్భంగా సభలో చోటుచేసుకున్న ఘటనలపై నివేదిక ఇవ్వాలని ఆయన ఆదివారం ఆదేశించారు. శనివారం శాసనసభలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర నాటకీయ పరిణామాలు, ఘర్షణ వాతావరణం చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు సభలో విధ్వంసానికి దిగడంతో అసెంబ్లీ రణరంగాన్ని తలపించింది. ఈ నేపథ్యంలో డీఎంకే అధినేత స్టాలిన్ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి గెంటేసి.. విపక్షం లేకుండానే స్పీకర్ విశ్వాస పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ విశ్వాసపరీక్షలో 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో సీఎం పళనిస్వామి గట్టెక్కారు. అయితే, స్పీకర్ చట్టబద్ధంగా వ్యవహరించలేదని, రహస్య ఓటింగ్ నిర్వహించాలన్న తమ డిమాండ్‌కు ఆయన అంగీకరించలేదని, తమను బలవంతంగా సభ నుంచి తరిమేశారని స్టాలిన్ గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో తొలిసారి స్పందించిన గవర్నర్ బలపరీక్ష సందర్భంగా సభలో జరిగిన పరిణామాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
-
నాడూ.. నేడూ.. అదే డ్రామా!
తమిళనాట చరిత్ర పునరావృతం - 30 ఏళ్ల కిందట ఎంజీఆర్ చనిపోయినపుడూ ఇదే సంక్షోభం - ఆనాడు జానకి, జయలలితల మధ్య ఆధిపత్య పోరాటం - ఇరు వర్గాలు మద్దతుదారులతో శిబిరాలు నిర్వహించిన వైనం - జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ ఖురానా - విశ్వాస పరీక్ష సందర్భంగా శాసనసభలో ఇరు వర్గాల ఘర్షణ - ఓటింగ్ చెల్లదంటూ జానకి సర్కారును రద్దు చేసిన గవర్నర్ - అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే గెలుపు ‘చరిత్ర పునరావృతమవుతుంది.. మొదట విషాదంగా, తర్వాత ప్రహసనంగా!’ అన్నాడు కార్ల్ మార్క్స్. తమిళనాట ఇప్పుడు అదే జరుగుతోంది. సరిగ్గా ముప్పై ఏళ్ల కిందట అన్నా డీఎంకే అధినేత, ముఖ్యమంత్రి ఎం.జీ.ఆర్ చనిపోయినపుడు.. పార్టీలో, ప్రభుత్వంలో ఆధిపత్యం కోసం ఇద్దరి మధ్య పోరాటం జరిగింది. ఎంజీఆర్ భార్య జానకి, ఆయన రాజకీయ శిష్యురాలు జయలలితల మధ్య ఉత్కంఠ భరిత హైడ్రామా సాగింది. నాడు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు జానకి, జయలలితల వెనుక రెండుగా చీలిపోయారు. అయితే జానకి వైపే ఎక్కువ మంది ఉన్నారు. ఇప్పటిలాగానే ఇరు వర్గాలూ ఎమ్మెల్యేల శిబిరాలు నిర్వహించాయి. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న జానకిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్ సభలో బలాన్ని నిరూపించుకోవాలని నిర్దేశించారు. ఆ విశ్వాసపరీక్ష సందర్భంగా సభలో హింస చెలరేగింది. రెండు వర్గాల ఎమ్మెల్యేలు ఘర్షణ పడ్డారు. స్పీకర్ పోలీసులను పిలిపించి మరీ సభలో లాఠీచార్జి చేయించిన పరిస్థితి. చివరికి జయ వర్గం ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు వేసి విశ్వాసపరీక్ష నిర్వహించారు. నాడు కూడా ప్రతిపక్షంలో ఉన్న డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఆ విశ్వాస పరీక్షలో జానకి గెలుపొందినట్లు ప్రకటించారు. కానీ.. గవర్నర్ ఆ విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించారు. కేంద్రం జోక్యంతో జానకి ప్రభుత్వం రద్దయింది. అనంతరం జరిగిన ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో జానకి రాజకీయాల నుంచి తప్పుకుని అన్నా డీఎంకే రెండు వర్గాలూ ఏకమవడం, కేంద్రం డీఎంకే సర్కారును రద్దు చేయటం, రాజీవ్‌గాంధీ హత్యానంతర ఎన్నికల్లో జయ నేతృత్వంలోని అన్నా డీఎంకే గెలుపొందటం చరిత్ర. సరిగ్గా 30 ఏళ్ల తర్వాత అదే డిసెంబర్ నెలలో జయలలిత చనిపోయారు. ఇప్పుడు కూడా.. అన్నా డీఎంకేలో మళ్లీ అదే చరిత్ర పునరావృతమయింది. జయలలిత నెచ్చెలి శశికళకు, అమ్మ నమ్మినబంటు పన్నీర్‌సెల్వంకు మధ్య అధికారం కోసం పోరాటం సాగుతోంది. నాడు ఎంజీఆర్ తెరచాటున ఉన్న జానకి కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు. నేడు జయలలిత స్నేహితురాలిగా తెరవెనుక ఉన్న శశికళ తెరపైకి వచ్చే ప్రయత్నం చేశారు. నాడు ఎంజీఆర్ ఆశీస్సులతో పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా క్రియాశీలంగా ఉండగా.. నేడు జయ నమ్మినబంటుగా ఆమె పరోక్షంలో ఆమె ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా పనిచేసిన పన్నీర్‌సెల్వం అధికారం తనకే దక్కుతుందని ప్రకటించారు. శశికళ తన వర్గం ఎమ్మెల్యేలందరినీ రిసార్టుకు తరలించి శిబిరం నడిపారు. పన్నీర్‌సెల్వం వైపు కేవలం పది మంది మాత్రమే నిలిచారు. అయితే.. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అనూహ్యంగా దోషిగా నిర్ధారితురాలై శశికళ జైలుకు వెళ్లడంతో.. ఆమె తన స్థానంలో పళనిస్వామిని అధికార రేసులోకి పంపారు. ఎక్కువ మంది ఎమ్మెల్యేల మద్దతున్న పళనిస్వామితో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు.. సభలో 15 రోజుల్లోగా బలనిరూపణ చేసుకోవాలని నిర్దేశించారు. ఆ మేరకు శనివారం సభలో విశ్వాసపరీక్ష నిర్వహించగా.. మళ్లీ ఆనాటి గందరగోళమే చెలరేగింది. అయితే.. ఈసారి పన్నీర్ సెల్వం బలం తక్కువగా ఉండటంతో.. బలంగా ఉన్న ప్రతిపక్షం ‘క్రియాశీల’మవటమే తేడా. రహస్య బ్యాలెట్ ఓటింగ్‌కు పట్టుబడుతూ ఆందోళనకు దిగిన డీఎంకే సభ్యులను బయటకు పంపించిన స్పీకర్.. విశ్వాసపపరీక్షలో పళనిస్వామి నెగ్గినట్లు ప్రకటించారు. ఇక తదనంతర పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచిచూడాలి. ఈ నేపథ్యంలో ఎంజీఆర్ మరణించినపుడు తమిళనాడులో జరిగిన రాజకీయ పరిణామాలను ఒకసారి వీక్షిస్తే... ఎంజీఆర్ మృతదేహం వద్ద..: డీఎంకే నుంచి చీలిపోయి అన్నా డీఎంకే పార్టీని స్థాపించి రాష్ట్రంలో ఎదురులేని నేతగా.. తమిళుల ఆరాధ్యదైవంగా పూజలందుకున్న ఎం.జి.రామచంద్రన్ 1987 డిసెంబర్ 24న కన్నుమూశారు. అప్పటికే ఆయనతో కలిసి అత్యధిక సినిమాల్లో హీరోయిన్గా నటించిన జయలలిత.. ఆయన ఆశీస్సులతోనే పార్టీ ప్రచార కార్యదర్శిగా, ఎంపీగా పనిచేస్తూ ప్రజాదరణ పొందారు. కానీ.. ఎంజీఆర్ భార్య జానకికి ఆమె అంటే పడదు. దీంతో ఎంజీఆర్ చనిపోయినపుడు ఆయన స్వగృహం ‘గార్డెన్స్’లో మృతదేహాన్ని సందర్శించేందుకు వచ్చిన జయలలితను లోనికి కూడా రానివ్వలేదు. అయితే.. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం రాజాజీ హాల్‌కు తరలించినపుడు మాత్రం జయలలిత ఆయన తల వద్ద కదలకుండా కూర్చుండిపోయారు. ఆ తర్వాత అంతిమయాత్ర సందర్భంగా ఎంజీఆర్ భౌతికకాయం ఉంచిన వాహనం పైకి జయలలిత ఎక్కినప్పుడు కూడా.. ఆమెను ఆ వాహనం నుంచి కిందికి తోసేసిన ఘటనను ప్రజలందరూ వీక్షించారు. రాజకీయ చదరంగం షురూ..: ఎంజీఆర్ అంత్యక్రియలు పూర్తయిన తర్వాత.. రాజకీయ చదరంగం మొదలైంది. జానకి వయసు 62 ఏళ్లు. జయలలిత వయసు 39 సంవత్సరాలు. ఇద్దరూ శాసనసభ్యలు కారు. అప్పటికే రాజ్యసభ ఎంపీ అయిన జయలలిత కొద్ది రోజుల్లోనే అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శిగా పదవి చేపట్టారు. ప్రభుత్వ పగ్గాలు చేపట్టడానికి జానకి సిద్ధమయ్యారు. జయలలిత ఆమెకు సవాల్ విసిరారు. ఈ క్రమంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు రెండు శిబిరాల్లో చీలిపోయారు. జానకి శిబిరంలో 95 మంది ఎమ్మెల్యేలు చేరితే.. జయ శిబిరంలో 30 మంది జమయ్యారు. కానీ.. తమకు 70 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించుకుంది. జానకికి మద్దతుగా ఎంజీఆర్ అనుచరుడు ఆర్.ఎం.వీరప్పన్ నిలిస్తే.. జయలలితకు మద్దతుగా ఎస్.తిరునావుక్కరసర్ పనిచేశారు. వీరప్పన్.. జానకి వర్గం ఎమ్మెల్యేలను నగరంలోని త్రీస్టార్ హోటల్ ‘ప్రెసిడెంట్’కు తరలించారు. తిరునావుక్కరసర్.. జయ వర్గం ఎమ్మెల్యేలను ఫైవ్ స్టార్ హోటల్ ‘అడయార్ పార్క్’లో ఉంచారు. ఆ తర్వాత వారిని అక్కడి నుంచి ‘భారత దర్శన్’ యాత్ర పేరుతో పర్యటనకు కూడా పంపించారు. ఇండోర్, ముంబై తదితర ప్రాంతాల సందర్శన అనంతరం బెంగళూరు సమీపంలోని నంది హిల్స్‌కు వారిని తరలించారు. రణరంగమైన శాసనసభ..: అప్పటి గవర్నర్ ఎస్.ఎల్.ఖురానా.. ఇరు పక్షాలనూ ఆహ్వానించారు. తమ బలాలను చూపించమని కోరారు. జానకి మద్దతుదారులను వీరప్పన్ రాజ్ భవన్‌కు తీసుకెళ్లి గవర్నర్ ముందు నిలిపారు. కానీ.. జయ ఆ పని చేయలేదు. ఎందుకంటే అవసరమైనంత మంది సభ్యులు ఆమెవైపు లేరు. దీంతో 1998లో జానకిని ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఖురానా ఆహ్వానించారు. కానీ.. ఆ ప్రభుత్వం కేవలం రెండు వారాలే సాగింది. విశ్వాస పరీక్ష కోసం శాసనసభ సమావేశమైనపుడు.. జయ, జానకి వర్గాల మధ్య ఘర్షణ తలెత్తింది. అప్పటి శాసనసభ స్పీకర్ పి.హెచ్.పాండ్యన్.. అనూహ్యంగా పోలీసులను పిలిపించి ఆందోళనకు దిగిన ఎమ్మెల్యేలపై లాఠీచార్జీ కూడా చేయించడం సంచలనం సృష్టించింది. అసమ్మతి ఎమ్మెల్యేలను బలవంతంగా బయటకు గెంటేసిన తర్వాత స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రతిపక్ష డీఎంకే ఓటింగ్‌లో పాల్గొనలేదు. దీంతో జానకి విశ్వాసపరీక్ష నెగ్గినట్లు స్పీకర్ పాండ్యన్ ప్రకటించారు. అయితే.. ఆ ఓటింగ్ ప్రక్రియ పద్ధతిగా జరగలేదంటూ గవర్నర్ ఖురానా.. జానకి ప్రభుత్వాన్ని రద్దు చేశారు. ఎన్నికల్లో డీఎంకే గెలుపు.. బర్తరఫ్..: ఆ తర్వాతి ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో.. అన్నా డీఎంకేలో వర్గ పోరు ప్రతిపక్ష డీఎంకేకు లాభించింది. ఆ పార్టీ 13 ఏళ్ల విరామం అనంతరం మళ్లీ అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో జానకి రాజకీయాల నుంచి వైదొలగగా.. అన్నా డీఎంకే చీలిక వర్గాలు రెండూ జయలలిత నాయకత్వంలో ఏకమయ్యాయి. ఆ తర్వాత కేంద్రంలో కాంగ్రెస్ మద్దతుతో ఏర్పడిన చంద్రశేఖర్ ప్రభుత్వం.. రాజీవ్ గాంధీ ఒత్తిడితో 1991 జనవరిలో తమిళనాడులో కరుణానిధి సర్కారును బర్తరఫ్ చేసింది. ఆ ఏడాది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో అన్నా డీఎంకే పొత్తు పెట్టుకుంది. ఎన్నికల ప్రచారం సందర్భంగా తమిళనాడులో రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో ఎన్నికల్లో వీచిన సానుభూతి పవనాలతో అన్నా డీఎంకే భారీ విజయం సాధించింది. జయలలిత 1991లో ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? విజేత పళని అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
విజేత పళని
అనుకూలం 122.. ప్రతికూలం 11 - 29 ఏళ్ల తరువాత చరిత్ర పునరావృతం - రణరంగంగా మారిన తమిళనాడు శాసనసభ... రహస్య ఓటింగ్ కోసం పట్టుబట్టిన డీఎంకే - కుదరదన్న స్పీకర్ ధన్పాల్... విపక్ష సభ్యుల వాగ్వివాదం - అధికార, విపక్ష సభ్యుల బాహాబాహీ - తోపులాటలో విరిగిన మైక్‌లు.. చిరిగిన చొక్కాలు - అసెంబ్లీలో యుద్ధ వాతావరణం.. రెండుసార్లు వాయిదా - డీఎంకే సభ్యుల బహిష్కరణ... కాంగ్రెస్, ముస్లింలీగ్ వాకౌట్ - విపక్ష సభ్యులెవరూ లేకుండానే బలపరీక్ష చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి/సాక్షి ప్రతినిధి, చెన్నై: అరుపులు, కేకలు.. ఎగిరిపడిన కుర్చీలు.. విరిగిన మైకులు.. పడిన బెంచీలు.. చిరిగిన చొక్కాలు.. ఎగిరిన కాగితాలు.. ఎమ్మెల్యేల బాహాబాహీ.. మార్షల్స్ బలప్రయోగంతో తమిళనాడు శాసనసభ రణరంగంగా మారింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష రణరంగాన్ని తలపించింది. బలపరీక్షను రహస్య ఓటింగ్ ద్వారా నిర్వహించాలని ప్రతిపక్ష డీఎంకే పట్టుబట్టింది. అందుకు స్పీకర్ తిరస్కరించడంతో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ మైక్ విరిగింది. ఎమ్మెల్యేల చొక్కాలు చిరిగాయి. శాసనసభ యుద్ధవాతావరణాన్ని తలపించింది. స్పీకర్ ధన్పాల్, ప్రధాన ప్రతిపక్షనేత స్టాలిన్ పరాభవం పాలయ్యారు. ఎట్టకేలకు ప్రతిపక్ష డీఎంకే సభ్యుల బహిష్కరణ.. కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యుల వాకౌట్ తర్వాత... ప్రతిపక్షంలేని సభలో సీఎం పళనిస్వామి విజయం సాధించారు. అన్నాడీఎంకేలోని వైరి వర్గాల నడుమ సాగిన బలపరీక్షలో అనేక ఉద్రిక్త పరిణామాల మధ్య పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానం 122 ఓట్లతో నెగ్గింది. ఆయనకు వ్యతిరేకంగా పన్నీర్ వర్గానికి చెందిన కేవలం11మంది ఓటు వేశారు. ఎట్టకేలకు రెండువారాల ఉత్కంఠకు తెరపడింది. అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తం చేశారు. సీఎం ప్రవేశపెట్టిన తీర్మానం నెగ్గడంతో పదిరోజులపాటు ఎమ్మెల్యేల నివాసంగా మారిన గోల్డన్బే రిసార్టు ఖాళీ అయింది. సీఎంకు వ్యతిరేకంగా ఈరోడ్, కాంగేయం, భవానీల్లోని అన్నాడీఎంకే కార్యాలయాల ముందు పన్నీర్, దీప వర్గీయులు ఆందోళన చేశారు. సీఎం ఇంటిని స్టానికులు ముట్టడించే యత్నం చేశారు. విశ్వాసతీర్మానం ఫలితాలు ఎలా ఉంటాయోనని ఉత్కంఠ నెలకొనడంతో ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. నిత్యం రద్దీగా ఉండే సినిమా థియేటర్లు, పార్కులు జనం లేక బోసిపోయాయి. జయ మరణంతో ముసలం... పురచ్చి తలైవి జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం సీఎం కావటం.. కొద్దిరోజులకే ఆయన తన పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. ఆ తరువాత అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళపై పన్నీర్ తిరుగుబాటుతో తమిళనాడు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యేల క్యాంప్ రాజకీయాలకు శ్రీకారం చుట్టిన నాలుగో రోజు హైకోర్టు సంచలన తీర్పుతో శశికళ జైలు పాలవడం చకచకా జరిగిపోయాయి. సీఎం పీఠం కోసం శశికళ, పన్నీర్ సెల్వం మధ్య జరిగిన పోటీలో అనూహ్యంగా పళనిస్వామి ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్నారు. బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజులు సమయం ఇచ్చినా, సీఎం ప్రమాణస్వీకారం చేసిన రెండవ రోజే పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఆమేరకే శనివారం ఉదయం 9–10:30 గంటల మధ్య రాహుకాలం కావడంతో 8.45 గంటలకే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు కూవత్తూరు క్యాంపు నుంచి బయలుదేరారు. ఒక్కో మంత్రి కారులో నలుగురు ఎమ్మెల్యేల చొప్పున 30 మంది మంత్రుల కారుల్లో 120 మంది ఎమ్మెల్యేలు, సీఎం కారులో ఇద్దరు కూర్చోగా పోలీసు బందోబస్తు నడుమ అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో రచ్చ రచ్చ... తమిళనాడు అసెంబ్లీ శనివారం ఉదయం 11గంటలకు ప్రారంభమైంది. స్పీకర్ ధనపాల్ ప్రకటనతో సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఆ వెంటనే ప్రతిపక్షనేత ఎంకే స్టాలిన్ లేచి అధికార అన్నాడీఎంకే పార్టీ విప్ ఎవరో ప్రకటించాలని పట్టుబట్టారు. మాజీ సీఎం పన్నీర్‌సెల్వం వర్గం సెమ్మలైని విప్‌గా ప్రకటించగా... పళనిస్వామి వర్గం విప్‌ను ప్రకటించకుండానే విశ్వాస తీర్మానానికి సిద్ధమైంది. దీంతో ప్రతిపక్ష డీఎంకే విశ్వాస పరీక్షను అడ్డుకుంది. ఎమ్మెల్యేలంతా ఆయా నియోజకవర్గాలకు వెళ్లి ప్రజాభిప్రాయం తీసుకున్న తరువాతే ఓటింగ్‌కు అనుమతి ఇవ్వాలని స్టాలిన్, పన్నీర్‌సెల్వం డిమాండ్ చేశారు. అందుకు స్పీకర్ తిరస్కరించారు. అయితే రహస్య ఓటింగ్ నిర్వహించాలని వారిద్దరూ పట్టుబట్టారు. స్పీకర్ అందుకు నిరాకరించడంతో స్టాలిన్‌తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు అసెంబ్లీలో నేలపై కూర్చొని నిరసన తెలియజేశారు. తన అధికారాల్లో ఇతరుల జోక్యాన్ని సహించేది లేదని స్పీకర్ ప్రకటించి సమావేశాన్ని గంటపాటు వాయిదా వేశారు. తిరిగి ఒంటిగంటకు అసెంబ్లీ ప్రారంభమైనా ప్రతిపక్ష డీఎంకే ఎమ్మెల్యేలు, పన్నీర్‌సెల్వం మద్దతుదారులు రహస్య ఓటింగ్‌కు పట్టుబట్టారు. స్పీకర్ ససేమిరా అనడంతో అన్నాడీఏంకే, డీఏంకే ఎమ్మెల్యేల మధ్య వాగ్వివాదం మొదలైంది. ఈ సందర్భంగా జరిగిన తోపులాటల్లో బల్లలు ధ్వంసమయ్యాయి... మైక్‌లు విరిగాయి... పేపర్లు చిరిగాయి. సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఒకానొక సమయంలో ఇద్దరు ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు కుక సెల్వం, రంగనాథన్ స్పీకర్ సీటు వద్ద నిల్చొని నినాదాలు చేస్తున్నారు. ఆ సమయంలో జరిగిన తోపులాటలో కొన్ని క్షణాలపాటు స్పీకర్ సీట్లో కూర్చొన్నారు. తనను కిందకు లాగేసి, చొక్కా చించారంటూ స్పీకర్ ధనపాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తనకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలంటూ ఆవేదన వ్యక్తం చేస్తూనే డీఎంకే సభ్యులందరిపైనా సస్పెన్షన్ వేటు వేశారు. అయితే సభను నుంచి బయటకు వెళ్లేందుకు డీఎంకే సభ్యులు నిరాకరించారు. తాము ప్రజలకోసం పోరాడుతున్నామని, తమను బలవంతంగా బయటకు తీసుకెళ్తే ఆత్మహత్యలకైనా సిద్ధమంటూ హెచ్చరించారు. ఎట్టకేలకు మార్షల్స్ 2.50 గంటలకు ప్రతిపక్ష సభ్యులను బలవంతంగా సభనుంచి ఖాళీ చేయించగలిగారు. సుమారు 25 మంది మార్షల్స్ ప్రతిపక్ష నేత స్టాలిన్‌ను చేతుల్తో పైకి ఎత్తుకుని బయటకు తీసుకొచ్చారు. ఈ సమయంలో జరిగిన పెనుగులాటలో స్టాలిన్ చొక్కా చిరిగిపోయింది. తమ పార్టీ ఎమ్మెల్యేలతో స్టాలిన్ నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ విద్యాసాగర్‌రావును కలిశారు. సభలో తమపై జరిగిన దౌర్జన్యం గురించి ఫిర్యాదు చేశారు. అనంతరం మెరీనా బీచ్‌లోని గాంధీ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. డీఎంకేకు మద్దతుగా వారి మిత్రపక్షం కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా బలనిరూపణను బాయ్‌కాట్ చేశాయి. ప్రతిపక్షాలు లేకుండా తీర్మానం... ప్రతిపక్ష సభ్యులెవరూ లేకుండా సభ మూడు గంటలకు మళ్లీ ప్రారంభమైంది. సీఎం పళనిస్వామి విశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టగా స్పీకర్ చదివి వినిపించారు. తీర్మానంపై సభ్యులు ప్రసంగించి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం పరిపాటైనా... నేడు అసెంబ్లీలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా లేచి నిలబడితే లెక్కించే ప్రక్రియను ప్రవేశపెడుతున్నానని స్పీకర్ చెప్పారు. ముందువైపున మూడు లైన్లలో అన్నాడీఎంకే, వెనుకవైపున్న మిగిలిన మూడులైన్లలో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. అయితే తీర్మానం ప్రవేశపెట్టే సమయానికి ప్రతిపక్ష సభ్యులెవ్వరూ సభలో లేరు. పళనిస్వామి ప్రవేశపెట్టిన విశ్వాసతీర్మానంపై అసెంబ్లీలో సభ్యులు లేచి నిలబడి తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయగానే అనుకూలంగా 122, ప్రతికూలంగా 11 ఓట్లు వచ్చినట్లు స్పీకర్ ప్రకటించారు. చరిత్ర పునరావృతం... తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షను ఎదుర్కొన్న పార్టీగా అన్నాడీఎంకే మరోసారి చరిత్ర సృష్టించింది. ఎంజీఆర్ మరణం తరువాత జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తింది. 1988 జనవరి 27న ముఖ్యమంత్రి పీఠానికి బలపరీక్ష నిర్వహించారు. అప్పుడు కూడా అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. సభ్యులు సభలోనే కొట్టుకున్నారు. తప్పని పరిస్థితుల్లో తొలిసారి పోలీసులు సభలోకి ప్రవేశించాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. ఆ సమయంలో స్పీకర్‌గా ఉన్న పీహెచ్ పాండియన్ ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు ప్రతిపక్ష సభ్యులపై అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. అదే విధంగా శనివారం జరిగిన విశ్వాస పరీక్షలోనూ తీవ్ర గందరగోళం నెలకొంది. స్పీకర్ చొక్కా చిరిగిపోయింది. ప్రతిపక్ష నేత స్టాలిన్ చొక్కాను చించివేశారు. తమకు జరిగిన అవమానాన్ని ఎవరికి చెప్పుకోవాలని ఇటు స్పీకర్, అటు ప్రతిపక్ష నేత ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి మీద ఎప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించినా తమిళనాడు శాసనసభలో యుద్ధవాతావరణం నెలకొనడం గమనార్హం. తీరని అవమానం: స్పీకర్ ధనపాల్ అసెంబ్లీ చరిత్రలో ఎవ్వరూ ఎరగని, జరగకూడని అవమానానికి తాను లోనైనానని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. బలనిరూపణ తర్వాత ఆయన మాట్లాడుతూ.. బడుగు, బలహీనవర్గాల్లో అట్టడుగు ఆది ద్రావిడ సామాజిక వర్గానికి చెందిన తాను అమ్మ దయవల్ల ఇంతటి ఉన్నతస్థితికి చేరుకున్నానని చెప్పారు. ప్రధానప్రతిపక్ష నేత నడుచుకున్న తీరు ఎంతో బాధాకరమని, ఆయన వైఖరికి సిగ్గుపడుతున్నానని ఆవేదన వ్యక్తంచేశారు. తాను నిబంధనలకు అనుగుణంగానే నడుచుకున్నానని స్పష్టంచేశారు. అనంతరం అసెంబ్లీని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అమ్మ ప్రభుత్వం నిలబడింది: సీఎం పళనిస్వామి తమిళనాడులో అమ్మ ప్రభుత్వాన్ని పరిరక్షించుకున్నామని సీఎం పళనిస్వామి ఆనందం వ్యక్తంచేశారు. విశ్వాసతీర్మానం నెగ్గగానే మంత్రివర్గ సహచరులతో కలిసి మెరీనాబీచ్‌లోని అమ్మ సమాధి వద్దకు వచ్చి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... విశ్వాస తీర్మానాన్ని విఫలం చేసేందుకు డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు విశ్వప్రయత్నం చేశారని ఆరోపించారు. ఎంజీఆర్, జయలలితల ఆశయాల సాధన కోసం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామంటూ చిన్నమ్మ చేసిన శపథం నెరవేరిందన్నారు. అన్నాడీఎంకే నుంచి విడిపోయినవారంతా డీఎంకేతో చేతులు కలిపారని, అసెంబ్లీ చోటుచేసుకున్న సంఘటనలే ఇందుకు సాక్ష్యమని చెప్పారు. నెగ్గిన విశ్వాస తీర్మానాన్ని గవర్నర్‌కు పంపామని తెలిపారు. బలపరీక్ష సమయానికి సభలో 133మందే తమిళనాడు అసెంబ్లీలో మొత్తం 235 మంది సభ్యులుండగా శనివారం 230 మంది హాజరయ్యారు. అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 136 సభ్యుల బలం ఉండగా జయ మరణంతో 135 మంది ఉన్నారు. ఇందులో శశికళ వర్గానికి చెందిన 122 మంది, పన్నీర్‌సెల్వానికి చెందిన 11 మంది హాజరయ్యారు. పన్నీర్ వర్గానికి చెందిన కోయంబత్తూరు ఎమ్మెల్యే అరుణ్‌కుమార్ గైర్హాజరుతో మొత్తం 133గా మిగిలింది. డీఎంకేకు 89 మంది సభ్యులుండగా అస్వస్థత కారణంగా డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అసెంబ్లీకి రానందున 88 మంది సభ్యులు హాజరయ్యారు. అలాగే 8 మంది కాంగ్రెస్ సభ్యులు, ముస్లింలీగ్ ఎమ్మెల్యే వచ్చారు. అయితే డీఎంకే సభ్యులను బహిష్కరించడం... కాంగ్రెస్, ముస్లింలీగ్ సభ్యులు బహిష్కరించడంతో ఓటింగ్ సమయానికి సభలో అన్నాడీఎంకేకు చెందిన 133మంది సభ్యులు మాత్రమే మిగిలారు. మరిన్ని తమిళనాడు విశేషాలు చూడండి జయ కేసుల ఖర్చు కర్ణాటక ఖాతాలోకి చెన్నైకు చిన్నమ్మ? అన్నీ ఉన్నా.. ‘పరీక్ష’లో ఫెయిల్ నాడూ.. నేడూ.. అదే డ్రామా! చిన్నమ్మ శపథం నెరవేర్చాం: దినకరన్ స్టాలిన్‌కు అవమానం.. డీఎంకే ఆందోళనలు -
శపథం చేసిన శశికళ పంతం నెగ్గింది
-
ఓడినా బుసలు కొడుతున్న పన్నీర్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటి బలపరీక్షతో పూర్తిగా తెరపడింది. సీఎం కుర్చీ కోసం జరిగిన పోరులో అమ్మ జయలలిత వీర విధేయుడు, మాజీ సీఎం ఓ.పన్నీర్ సెల్వం ఓటమి పాలయ్యారు. అసెంబ్లీలో జరిగిన విశ్వాసపరీక్షలో సీఎం ఎడపాటి పళనిస్వామి విజయం సాధించగా.. పన్నీర్ మాత్రం కుర్చీ పోరులో ఓటమిని జీర్ణించు కోలేకపోతున్నారు. నేడు సభలో జరిగిన బలపరీక్ష అప్రజాస్వామికమని, న్యాయబద్ధం కాదన్నారు. డీఎంకే ఎమ్మెల్యేలను బలవంతంగా సభ నుంచి బయటకు పంపించివేశారని, సభ జరిగేతీరు ఇలాగేనా అని ప్రశ్నించారు. ఆపై జరిగిన ఓటింగ్ ద్వారా అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అమ్మ జయలలితకు ద్రోహం చేశారని విమర్శించారు. అమ్మ ఆశయాలకు వ్యతిరేకంగా సభలో నిర్ణయం వెలువడిందని పన్నీర్ సెల్వం వ్యాఖ్యానించారు. తనకు మద్ధతుగా ఓటేసిన 11 మంది ఎమ్మెల్యేలు మాత్రమే అమ్మకు, ఆమె ఆశయాలకు విధేయులని చెప్పారు. తమిళనాడు అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి 13వ సీఎంగా తన పీఠాన్ని ఖరారు చేసుకున్న పళనిస్వామి మాత్రం ఇది ప్రజాస్వామ్య విజయమని చెప్పారు. బలపరీక్షలో నెగ్గిన పళనిస్వామి, మంత్రి వర్గసహచరులు, ఎమ్మెల్యేలతో కలిసి అమ్మ సమాధి వద్దకు వెళ్లి మరోసారి నివాళులర్పించారు. అమ్మ సమాధి వద్ద సీఎం పళనిస్వామి కన్నీరు పెట్టారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ జయ ఆశయాలకు వ్యతిరేకంగా పనిచేయడం వల్లనే పన్నీర్ వర్గీయులు ఓటమి పాలయ్యారని ఎద్దేవా చేశారు. తన విజయాన్ని.. అమ్మకు నిజమైన మద్ధతుదారులు, అభిమానుల విజయంగా అభివర్ణించారు. ఆయన మద్ధతుదారులు, పార్టీ కార్యకర్తలు 'అమ్మ గెలించింది' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. -
ఓపీఎస్‌కు వెల్లువెత్తిన 'సినీ' మద్దతు!
చెన్నై: బలపరీక్షలో ఓడిపోయినప్పటికీ తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వానికి సినీ ప్రముఖుల నుంచి మద్దతు వెల్లువెత్తడం గమనార్హం. బలపరీక్షను తీవ్రంగా తప్పుబట్టిన ప్రముఖ సినీ నటి గౌతమి నేరుగా ఓపీఎస్‌కు మద్దతు ప్రకటించారు. బలపరీక్షలో గెలిచిన శశికళ నమ్మినబంటు పళనిస్వామి బృందాన్ని ఖండించారు. 'అంకెల గారడీ' ద్వారా ప్రజాస్వామ్యాన్ని వంచించలేరని, ఇది ప్రజల చేత, ప్రజల కొరకు ప్రజాస్వామ్యం కొనసాగుతుందని ఆమె ట్వీట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని కాడాపాండి.. ముఖ్యమంత్రి ఓపీఎస్సే కావాలంటూ ఆమె యాష్‌ట్యాగ్ జోడించారు. Democracy can't be manipulated by "Number Games" It's the VOICE OF the PEOPLE. BY the PEOPLE. FOR the PEOPLE #SaveDemocracy #OPSForCM — Gautami (@gautamitads) 16 February 2017 ఇక సీనియర్ నటుడు కమల్ హాసన్ కూడా పరోక్షంగా పన్నీర్ సెల్వానికి మద్దతు పలికారు. బలపరీక్ష జరిగిన తీరును వ్యంగ్యంగా ఎండగట్టిన ఆయన.. బలపరీక్షపై గవర్నర్‌కు తమ గళాన్ని వినిపిస్తూ ఈమెయిళ్లు పంపించాలని, ఈ మెయిళ్లలో హుందాగా, అసభ్యత లేకుండా చక్కని భాషతో తమ అభిప్రాయాన్ని తెలియజేయాలంటూ.. గవర్నర్ ఈమెయిల్ ఐడీ (Rajbhavantamilnadu@gmail.com) ట్వీట్ చేశారు. ఇక మరో నటుడు అరవింద స్వామి అయితే.. ఏకంగా మరోసారి ఎన్నికలు నిర్వహించాలంటూ డిమాండ్ చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రీ ఎలక్షన్ ఒక్కటే మార్గమని, బలపరీక్ష ప్రజాతీర్పును ప్రతిఫలించడం లేదని పేర్కొన్నారు. In my opinion, The only solution that is acceptable under the circumstances is a re- election. This is not the people's mandate. — arvind swami (@thearvindswami) 18 February 2017 Rajbhavantamilnadu@gmail.com ங்கற விலாசத்துக்கு நம் மன உளைச்சலை மின் அஞ்சலா அனுப்புங்க. மரியாதையா பேசணும் அது அசம்பளியில்ல Governor வீடு — Kamal Haasan (@ikamalhaasan) 18 February 2017 -
బలపరీక్షపై సినీ స్టార్స్ మండిపాటు!
తమిళనాడు అసెంబ్లీలో చోటుచేసుకున్న హైవోల్టెజ్ డ్రామా అనంతరం జరిగిన బలపరీక్షలో ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 122 మంది సభ్యుల మద్దతుతో ఆయన మెజారిటీ నిరూపించుకున్నారు. అయితే, అంతకుముందు తమిళనాడు శాసనసభలో తీవ్ర నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. ప్రతిపక్ష సభ్యుల ఆందోళన, అల్లరితో సభ గందరగోళంగా మారిపోయింది. రెండుసార్లు వాయిదా పడింది. ప్రతిపక్ష డీఎంకే సభ్యులు మైక్‌లు, బల్లాలు విరిచివేయడమే కాకుండా..స్పీకర్‌ను నెట్టేసి ఆయన స్థానంలో కూర్చున్నారు. తీవ్ర గలాటా సృష్టించారు. ఈ పరిణామాలపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కమల్ హాసన్ సహా రాధిక, ఖుష్బూ, అరవింద స్వామి తదితరులు తీవ్రంగా స్పందించారు. 'మరో కొత్త ముఖ్యమంత్రి వచ్చినట్టే కనిపిస్తోంది. జై డె'మాక్'క్రేజీ అంటూ ప్రజాస్వామ్యం అపహాస్యం పాలైంద'ని కమల్ హాసన్ ట్వీట్ చేశారు. గౌరవనీయులైన ఎమ్మెల్యేలకు తమిళనాడు ప్రజలు సరైనరీతిలో స్వాగతం పలుకుతారంటూ హెచ్చరించారు. సినీ నటి ఖుష్బూ స్పందిస్తూ ప్రజాస్వామ్యానికి ప్రతిపక్షమే బలం, ప్రతిపక్ష సభ్యులు లేకుండా బలపరీక్ష నిర్వహించడమంటే ప్రజాస్వమ్యానికి అది విరుద్ధమేనని వ్యాఖ్యానించారు. ప్రస్తుత పరిణామాలు అవమానకరంగా ఉన్నాయని, గవర్నర్ రంగంలోకి దిగి చర్య తీసుకోవాలని సినీ రాధికా శరత్‌కుమార్ కోరారు. ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వని ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ బలపరీక్షను ఎవరూ అంగీకరించబోరని, ఎమ్మెల్యేలు కలువాల్సింది ప్రజలను కానీ, రిసార్టులో పార్టీ నేతలను కాదని సినీ నటుడు అరవింద స్వామి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాలు కవర్ చేయకుండా మీడియాను బ్లాక్ చేసి.. ఎంచుకున్న దృశ్యాలను మాత్రమే విడుదల చేయడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. -
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
-
శశికళ ప్లాన్ గ్రాండ్ సక్సెస్!
చెన్నై: తమిళనాడు రాజకీయ సంక్షోభానికి నేటితో తెరపడింది. విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. మొత్తంగా 133 మంది ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనగా, పళనికి అనూకూలంగా 122 మంది ఎమ్మెల్యేలు, వ్యతిరేకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఓటేశారు. దీంతో మెజార్టీ ఓట్లు సాధించిన పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ప్రతిపక్ష పార్టీలైన డీఎంకే ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఓటింగ్ లో పాల్గొనలేదు. దీంతో పళని విజయం నల్లేరుపై నడకగా మారింది. రిసార్ట్ రాజకీయాలు నెగ్గాయంటూ రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పది రోజుల కిందటి వరకూ ఎవరికీ తెలియని కువతూర్కు సమీపంలోని గోల్డెడ్ బే రిసార్టులో చిన్నమ్మ శశికళ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను అక్కడ నిర్బంధించారని కథనాలు వచ్చాయి. ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఎక్కడ లాగేసుకుంటారోనని శశికళ చేసిన ప్రయత్నం నేడు ఫలించింది. అయితే ఆ ప్రయోజనాన్ని మాత్రం పళనిస్వామి పొందనున్నారు. సుప్రీంకోర్టు శశికళను దోషీగా తీర్పివ్వడంతో బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు కోర్టులో లొంగిపోయి అక్కడే మరో మూడున్నరేళ్ల జైలు శిక్ష అనుభవించనున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ ఆశలు గల్లంతు కాగా.. అమ్మ జయలలితకు, తనకు విధేయుడైన పళనిస్వామిని గోల్డెన్ బే రిసార్ట్ లోని అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు శాసనసభాపక్షనేతగా ఎన్నుకున్నారు. ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వానికి మద్ధతు ఇవ్వకుండా చేయడంలోనూ శశికళ పన్నిన గోల్డెన్ బే రిసార్ట్ క్యాంపు వ్యూహం సక్సెస్ అయింది. అన్నాడీఎంకే మెజార్టీ ఎమ్మెల్యేలు తనకే మద్ధతు ఇవ్వాలని కోరుతూ రిసార్టులో శశికళ చేసిన ప్రసంగాలు వారిని ఐకమత్యంగా ఉంచాయనడంలో సందేహమే అక్కర్లేదు. గవర్నర్ విద్యాసాగర్ రావును పళనిస్వామి కలుసుకోవడం.. మెజార్టీ ఎమ్మెల్యేల మద్ధతు ఉందని వివరించడం.. ఆపై పళనితో గవర్నర్ ప్రమాణం చేయించడం చకచకా జరిగిపోయాయి. నేడు తమిళనాడు అసెంబ్లీలో విశ్వాసపరీక్షలో సీఎం పళనిస్వామి నెగ్గారు. ఈ ఓటింగ్ లో పాల్గొన్న వారిలో శశికళ క్యాంపులోని రిసార్ట్ ఎమ్మెల్యేల ఓటింగే పళనిస్వామి సీఎం పీఠాన్ని అందించింది. పన్నీర్ క్యాంపులోని ఆరుగురు ఎమ్మెల్యేలు సహా మరో ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేశారు. దాదాపు వారం రోజులపాటు గోల్డెన్ బే రిసార్ట్ లో ఉన్న ఎమ్మెల్యేలలో 122 మంది ఆయనకు మద్ధతు తెలుపుతూ ఓటేయడంతో మెజార్టీ సాధించి చిన్నమ్మ శశికళ విధేయుడు పళనిస్వామి.. జయ వీర విధేయుడు పన్నీర్ సెల్వంపై మరోసారి విజయం సాధించారు. -
విపక్షం లేకుండా.. వ్యూహాత్మకంగా..!
చెన్నై: తీవ్ర గందరగోళ పరిస్థితులు, నాటకీయ పరిణామాల నడుమ జరిగిన బలపరీక్షలో పళనిస్వామి విజయం సాధించారు. ప్రతిపక్ష సభ్యులు లేకుండానే నిర్వహించిన ఓటింగ్‌లో ఆయనకు అనుకూలంగా 122మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఓటేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. అంతకుముందు తీవ్ర ఉత్కంఠభరిత పరిస్థితుల నడుమ డీఎంకే అధినేత స్టాలిన్ సహా.. ఆ పార్టీ సభ్యులను స్పీకర్ ఆదేశాల మేరకు మార్షల్ బయటకు గెంటేశారు. దీంతో స్టాలిన్ చొక్కా చినిగిపోయింది. స్పీకర్ తీరు, మార్షల్స్ బలవంతంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ స్టాలిన్ తన ఎమ్మెల్యేలను తీసుకొని గవర్నర్ వద్దకు వెళ్లారు. ఇంతలోనే స్పీకర్ ధనపాల్ సభను సమావేశపరిచి.. ఓటింగ్ ప్రక్రియను ప్రారంభించారు. దీంతో డీఎంకే మిత్రపక్షం కాంగ్రెస్‌తోపాటు, ముస్లింలీగ్ తదితర విపక్ష సభ్యులు కూడా అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించారు. విపక్షం లేకుండానే స్పీకర్ బలపరీక్ష చేపట్టి ఓటింగ్ ప్రక్రియ ప్రారంభించడంతో పళనిస్వామి విజయం నల్లేరు మీద నడకే అయింది. ప్రతిపక్ష సభ్యులు సభలో లేకపోవడంతో సునాయసంగా పళనిస్వామి బలపరీక్షలో విజయం సాధించారు. ముఖ్యమంత్రిగా తన పదవిని సుస్థిరం చేసుకున్నారు. ప్రజల నుంచి ఒత్తిడి తీసుకొచ్చి.. తాను ముఖ్యమంత్రి కావాలనుకున్న పన్నీర్ సెల్వం ఆశలు అడియాసలయ్యాయి. -
విశ్వాపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
-
విశ్వాసపరీక్షలో గెలిచిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి కె. పళనిస్వామి బలపరీక్షలో నెగ్గారు. మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వర్గీయులు వ్యతిరేకించినా, తన శిబిరంలో ఉన్న కొంతమంది ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నట్టు వార్తలు వచ్చినా, ప్రతిపక్ష పార్టీలన్ని వ్యతిరేకంగా నిలబడినా పళనిస్వామి సభలో మెజార్టీ నిరూపించుకున్నారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో విపక్షం సభ్యులు లేకుండానే నిర్వహించిన బలపరీక్షలో పళనిస్వామికి మద్దతుగా 122 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. 11మంది వ్యతిరేకంగా ఓటేశారు. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
స్పీకర్ కు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా..?
చెన్నై: విశ్వాసపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో నేటి ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్ధతుదారులు సభ సజావుగా సాగకుండా యత్నిస్తుండటంతో సభను స్పీకర్ ధన్ పాల్ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలో నేడు పళనిస్వామి ప్రభుత్వానికి అజెండా అంటూ ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి మద్ధతు ఉందని పళనిస్వామి సభలో నిరూపించుకుంటే.. దానిపై సభాపతి గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదిక అందించాల్సి ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమన్నారు. విశ్వాసపరీక్ష రహస్య ఓటింగ్ ప్రకారమే జరిపించాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవన్నారు. సభలోకి పోలీసులు ఎలా వస్తారంటూ డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.. కానీ మార్షల్స్ వచ్చినా, నేతలు వచ్చినా, ఇతర ఏ సిబ్బంది వచ్చినా సభాపతి ఆదేశాల మేరకు ఇలా జరుగుతుందన్నారు. సభ సజావుగా సాగకుండా, ఇబ్బందులకు గురిచేస్తూ.. తీవ్ర ఆటంకం కలిగించిన నేపథ్యంలో సభాపతి మార్షల్స్ కు కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. సభాపతి ఆదేశాల మేరకు ఆయా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు లాక్కెళ్తారని చెప్పారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగ పరంగా విశ్వాస పరీక్ష లేదా బలనిరూపణలో నెగ్గాల్సి ఉంటుందని, అప్పటినుంచీ పూర్తిస్థాయి ప్రభుత్వం కార్యరూపం దాల్చినట్లని వివరించారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో అలాగే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
-
మళ్లీ గందరగోళం.. సభ మళ్లీ వాయిదా
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సభ వాయిదా పడి, మళ్లీ మరోసారి సమావేశం అయినప్పుడు కూడా అదే పరిస్థితి తలెత్తింది. దాంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు. సభలో గందరగోళం సృష్టించిన డీఎంకే ఎమ్మెల్యేలందరూ సభను ఖాళీ చేసి వెళ్లాల్సిందిగా స్పీకర్ ధనపాల్ ఆదేశించడంతో వాళ్లంతా ఒక్కసారిగా మళ్లీ పోడియం వద్దకు దూసుకెళ్లారు. స్పీకర్ స్థానం వద్ద ఎదురుగా వెళ్లి ధర్నా చేశారు. వాళ్లను ఖాళీ చేయించాలని, బయటకు తీసుకెళ్లాలని మార్షల్స్‌ను స్పీకర్ ఆదేశించినా.. వాళ్లు కూడా అసలు సభ్యులను బయటకు తీసుకెళ్లలేకపోయారు. దాంతో ఏం జరుగుతోందో తెలియని పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా సభ్యులెవరూ తమ తమ సీట్లలో కూర్చోకపోవడం.. సభలో అదే గందరగోళ పరిస్థితులు ఉండటంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం 3 గంటల వరకు వాయిదా వేశారు. -
బలపరీక్ష ఎప్పుడు పెట్టినా ఇంతే!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి మీద విశ్వాస పరీక్ష ఎప్పుడు నిర్వహించినా ఇదే పరిస్థితి కనిపిస్తోంది. తీవ్ర గందరగోళం, సభలో సభ్యుల కేకలు, అరుపులు.. సభను సజావుగా నడవనివ్వకపోవడం లాంటివి ఎప్పుడూ ఉంటూనే ఉన్నాయి. ఇంతకుముందు ఎంజీఆర్ మరణం అనంతరం జానకీ రామచంద్రన్, జయలలిత వర్గాల మధ్య పోటీ తలెత్తినప్పుడు విశ్వాస పరీక్ష నిర్వహించారు. 1988 జనవరి 27వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించారు. అప్పుడు అసెంబ్లీలో తీవ్ర ఘర్షణ వాతావరణం ఏర్పడి, అసెంబ్లీలో కొట్టుకుంటున్న సభ్యులను నియంత్రించేందుకు తొలిసారి సభలోకి పోలీసులను కూడా పిలవాల్సి వచ్చింది. జయలలిత వర్గానికి నెడుంజెళియన్ నాయకత్వం వహించారు. సభ్యులు తీవ్రస్థాయిలో కొట్టుకున్నారు కూడా. అప్పుడు స్పీకర్ పీహెచ్ పాండియన్ చాలామంది ప్రతిపక్ష సభ్యులపై ఓటింగ్ ప్రారంభం కావడానికి ముందు అనర్హత వేటు వేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. చివరకు జానకీ రామచంద్రన్ విశ్వాస పరీక్షలో నెగ్గినట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా విశ్వాస పరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొనడం, స్పీకర్ చొక్కా చించి అవమానించడం లాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. తనకు జరిగిన అవమానానికి తాను ఎవరికి చెప్పుకోవాలని స్పీకర్ ధనపాల్ ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ముందున్న టేబుల్‌ను పడగొట్టేసి, ఆయన కుర్చీలో కూర్చుని, బెంచీల మీదకు ఎక్కి, స్పీకర్‌ను నెట్టేసి.. ఇలా పలు రకాలుగా విధ్వంసం సృష్టించడంతో సభను దాదాపు గంట సేపు వాయిదా వేశారు. ఆ తర్వాత మళ్లీ సభ సమావేశమైనప్పుడు డీఎంకే సభ్యులందరినీ బయటకు వెళ్లాల్సిందిగా స్పీకర్ ఆదేశించారు. వాళ్లను బయటకు తీసుకెళ్లాల్సిందిగా మార్షల్స్‌కు సూచించారు. అయితే డీఎంకే ఎమ్మెల్యేలు మళ్లీ పోడియం వద్దకు వెళ్లి స్పీకర్‌ను ఘెరావ్ చేసి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. -
షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!
-
షాకింగ్: స్పీకర్ కుర్చీలో డీఎంకే ఎమ్మెల్యేలు!
తమిళనాడు అసెంబ్లీలో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. సభలో ఎప్పుడూ కనీ వినీ ఎరుగని రీతిలో సంఘటనలు చోటుచేసుకున్నాయి. స్పీకర్ ధనపాల్ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడిన తర్వాత డీఎంకే సభ్యులు కొందరు ఆయనను తోసేసే ప్రయత్నం కూడా చేశారు. దాంతో ఆయన మార్షల్స్ సాయంతో జాగ్రత్తగా సభ నుంచి బయటకు వెళ్లారు. ఈ సమయంలో ఇద్దరు డీఎంకే ఎమ్మెల్యేలు స్పీకర్ కుర్చీలో కూడా కూర్చున్నారు. డీఎంకేకు చెందిన కు కా సెల్వం, రంగనాథన్ అనే ఇద్దరు ఎమ్మెల్యేలు ఇలా కూర్చున్నారు. ఈ పరిస్థితి ఇంతవరకు దేశంలో ఎక్కడా చోటుచేసుకున్న దాఖలాలు లేవు. స్పీకర్ కుర్చీలో ప్రతిపక్ష సభ్యులు కూర్చోవడం, అది కూడా అధికారికంగా కాకుండా అనధికారికంగా గొడవ చేసి, స్పీకర్‌ను పంపేసి ఆయన స్థానంలో ఒక నిమిషం కంటే కూడా తక్కువ సేపు కూర్చోవడం ఎప్పుడూ లేదు. తమిళనాడు అసెంబ్లీ మాత్రమే ఈ ఘటనకు అద్దం పట్టింది. -
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
-
స్పీకర్ మీదకు కుర్చీల విసిరివేత
తమిళనాడు అసెంబ్లీలో బలపరీక్ష సందర్భంగా తీవ్ర గందరగోళం ఏర్పడింది. అది నిజంగానే ఎవరి 'బలం' ఎంత ఉందో నిరూపించుకునేలా మారింది. రహస్య ఓటింగ్ నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న డీఎంకే ఎమ్మెల్యేలు .. స్పీకర్ ధనపాల్ మీదకు కుర్చీలు విసిరేశారు. స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. ఆయన ఎదురుగా ఉన్న కుర్చీని విరగ్గొట్టి, మైక్రోఫోన్లు కూడా విరిచేశారు. ఆయన టేబుల్ కూడా విరగ్గొట్టినట్లు తెలుస్తోంది. ఆయన మీదకు ముందుగా కాగితాలు విసిరేశారు. అసెంబ్లీ నిబంధనల ప్రకారం రహస్య ఓటింగ్ నిర్వహించడానికి వీల్లేదని స్పీకర్ ధనపాల్ చెప్పడంతో... డీఎంకే ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో స్పీకర్ ధనపాల్ సభను మధ్యాహ్నం ఒంటిగంటకు వాయిదా వేసి సభ నుంచి బయటకు వచ్చేశారు. అంతలో స్పీకర్ తీరుకు నిరసనగా.. డీఎంకే ఎమ్మెల్యే కు కా సెల్వం నేరుగా వెళ్లి స్పీకర్ కుర్చీలో కూర్చున్నారు. -
విశ్వాపరీక్షలో ఓడిన సీఎం పళనిస్వామి
తమిళనాడు ముఖ్యమంత్రిగా రెండు రోజుల క్రితమే ప్రమాణస్వీకారం చేసిన ఎడప్పాడి కె. పళనిస్వామి విశ్వాసపరీక్షలో ఓడిపోయారు. శనివారం ఉదయం తమిళనాడు అసెంబ్లీ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. అందులో ముఖ్యమంత్రి పళనిస్వామి విశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. శనివారం ప్రత్యేకంగా సమావేశమైన తమిళనాడు అసెంబ్లీకి మొత్తం 230 మంది ఎమ్మెల్యేలు హాజరయ్యారు. దాంతో ప్రభుత్వం నిలబడాలంటే 116 ఓట్లు కావల్సి వచ్చాయి. బహిరంగ పద్ధతిలో డివిజన్ ఓటింగ్ నిర్వహించారు. ఇందులో పళనిస్వామి ప్రభుత్వానికి అనుకూలంగా ... ఓట్లు, వ్యతిరేకంగా ... ఓట్లు వచ్చాయి. దాంతో రెండురోజుల వయసున్న పళనిస్వామి ప్రభుత్వం పడిపోయింది. బలపరీక్ష సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. పన్నీర్ సెల్వం వర్గానికి మాట్లాడే అవకాశం ఇవ్వాలని, అలాగే రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గంతో పాటు డీఎంకే, కాంగ్రెస్, ముస్లింలీగ్ కూడా డిమాండ్ చేశాయి. అయితే పళనిస్వామి వర్గం మాత్రం బహిరంగ ఓటింగుకే పట్టుబట్టింది. స్పీకర్ ధనపాల్ తొలుత మూజువాణీ ఓటింగు చేపట్టి, తర్వాత డివిజన్ ఓటింగ్ చేపట్టారు. దాన్ని బహిరంగ పద్ధతిలో నిర్వహించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ తలుపులు మూసేశారు. -
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
-
తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం
విశ్వాస పరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో గందరగోళం మొదలైంది. తాము నియమించిన విప్‌ను ఒప్పుకోవాలని, రహస్య ఓటింగ్ నిర్వహించాలని పన్నీర్ సెల్వం వర్గం డిమాండ్ చేస్తోంది. వాళ్లకు డీఎంకే కూడా అండగా నిలిచింది. ఎమ్మెల్యేలను ఖైదీల్లా తీసుకొచ్చారని డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ అన్నారు. అయితే పన్నీర్ సెల్వం వర్గం నియమించిన విప్‌ను ఒప్పుకోడానికి పళనిస్వామి వర్గం ఒప్పుకోలేదు. అలాగే రహస్య ఓటింగుకు కూడా వాళ్లు అంగీకరించలేదు. తమ ఎమ్మెల్యేలకు రక్షణ కల్పించాలని పన్నీర్ సెల్వం అన్నారు. తాము ఫ్లోర్ లీడర్‌గా ఎన్నుకున్న ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం కల్పించాలని పన్నీర్ వర్గం డిమాండ్ చేస్తోంది. -
మొన్నటివరకు గవర్నర్.. నేడు స్పీకర్!
► నిర్ణయంపై అందరిలో ఉత్కంఠ ► బలపరీక్షకు ఎలాంటి పద్ధతి అనుసరిస్తారో ► పన్నీర్ సెల్వం వర్గంలోనే స్పీకర్ ధనపాల్ ► అన్నాడీఎంకే వ్యవస్థాపక సభ్యుడు, ఎంజీఆర్ మనిషి చెన్నై నిన్న మొన్నటి వరకు తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోననే ఉత్కంఠ అన్ని వర్గాల్లోనూ కనిపించింది. చివరకు ఆయన పళనిస్వామికే మొదటి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. ఇప్పుడు అంత సమయం అయితే లేదు గానీ.. స్పీకర్ ధనపాల్ ఏం చేస్తారనే విషయంలో కూడా అంతకు మించిన ఉత్కంఠ కనిపిస్తోంది. మొత్తం 235 మంది సభ్యులున్న తమిళనాడు అసెంబ్లీలో జయలలిత మృతితో ఒక స్థానం ఖాళీగా ఉంది. ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే కావడంతో 233 మంది సభ్యులుంటారు. మొత్తం వీళ్లందరి దృష్టి కూడా స్పీకర్ ధనపాల్ మీదే ఉంది. పన్నీర్ సెల్వం కోరినట్లుగా ఆయన రహస్య ఓటింగ్ నిర్వహిస్తారా.. లేక బహిరంగ బలపరీక్ష వైపు మొగ్గుతారా అనేది మరికొన్ని గంటల్లోనే తేలిపోతుంది. ఎవరీ ధనపాల్? డీఎంకే నుంచి చీలిపోయి ఎంజీ రామచంద్రన్ అన్నాడీఎంకేను 1972లో స్థాపించినప్పుడు ఆయన పార్టీలో చేరిన కొద్దిమందిలో ధనపాల్ కూడా ఒకరు. 1977 ఎన్నికలకు సేలం జిల్లాలోని శంకరగరి (రిజర్వుడు) నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఎంజీఆర్ ఆయనకు అవకాశం కల్పించారు. సి. పొన్నయన్, పన్రుట్టి ఎస్ రామచంద్రన్, కేఏ సెంగొట్టయన్లతో కలిసి ఆయన తొలిసారి అన్నాడీఎంకే తరఫున ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో ఆయన నెగ్గారు. ఆ తర్వాత 1980, 84లలో జరిగిన ఎన్నికల్లోనూ గెలిచారు. ఎంజీఆర్ మరణం తర్వాత పార్టీ రెండు వర్గాలుగా చీలిపోయినప్పుడు ఆయన జయలలితకు మద్దతుగా ఉన్నారు. కానీ, తర్వాత జరిగిన ఎన్నికల్లో శంకరగిరి నుంచి తొలిసారి ఓడిపోయారు. 2001లో అక్కడే గెలిచిన తర్వాత శంకరగిరి జనరల్ స్థానంగా మారడంతో 2011లో ఆయన రాశిపురం నియోజకవర్గానికి మారారు. ఒక ఏడాది తర్వాత స్పీకర్ పదవికి జయకుమార్ రాజీనామా చేయడంతో సీనియర్ నాయకుడైన ధనపాల్‌ను జయలలిత స్పీకర్‌గా చేశారు. జయకుమార్ మద్దతుదారులైన ఆరుగురిని కూడా పదవుల నుంచి జయలలిత తప్పించారు. ఆ తర్వాత కూడా రెండోసారి జయలలిత వరుసగా అధికారం చేపట్టినప్పుడు ఆయనకే స్పీకర్‌గా అవకాశం కల్పించారు. ఇలా రెండు వరుస అసెంబ్లీలలో ఒకే స్పీకర్ ఉండటం అరుదుగా జరుగుతుంది. ఒకే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా స్పీకర్లను మార్చిన సందర్భాలున్నాయి. ఇక శనివారం ఉదయం 11 గంటలకు జరిగే బలపరీక్షలో స్పీకర్‌గా ధనపాల్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న దానిపై కూడా ప్రభుత్వం ఉంటుందా పడిపోతుందా అనేది ఆధారపడుతుంది. ఇటీవల ఉత్తరాఖండ్‌లో బహిరంగ బలపరీక్ష నిర్వహించారు. అలాగే చేస్తారా లేక రహస్య ఓటింగ్ పెడతారా అనేది చూడాల్సి ఉంది. మరిన్ని తమిళనాడు విశేషాలు.. భారీ భద్రతతో బయల్దేరిన ఎమ్మెల్యేలు పళని శిబిరం నుంచి మరో ఎమ్మెల్యే జంప్ బలపరీక్షకు కరుణానిధి దూరం! ఎవరీ సైనైడ్ మల్లిక! పళనిస్వామిని ఓడించండి: రాహుల్ అమ్మకు ఓటేయండి నన్ను చూసి నవ్వొద్దు ‘మ్యాజిక్’ చేసేదెవరు? -
నేడే బల పరీక్ష.. పది ఓట్లే కీలకం
-
పన్నీర్.. సీఎం బంగ్లా ఖాళీచెయ్యండి
-
పళనిస్వామికి వ్యతిరేకంగా ‘ఓటు’
-
పళనిస్వామికి వ్యతిరేకంగా ‘ఓటు’
- డీఎంకే నిర్ణయం - పరిస్థితిని బట్టి అడుగులు: స్టాలిన్ సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు పడుతున్న అష్టకష్టాలను పరిగణలోకి తీసుకుని బలనిరూపణలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే శాసనసభాపక్షం నిర్ణయించింది. పరిస్థితిని బట్టి తమ అడుగులు ఉంటాయని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ప్రకటించారు. అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ పరిణామాల్ని తనకు అనుకూలంగా మలచుకునేందుకు స్టాలిన్ తీవ్ర ప్రయత్నాల్లో ఉన్న విషయం తెలిసిందే. ప్రభుత్వాన్ని కూల్చడమా, పరిస్థితిని బట్టి అధికార పావులు కదపడమా, లేదా మళ్లీ ఎన్నికలకు వెళ్లడమా అన్న వ్యూహాలతో స్టాలిన్ అడుగులు సాగుతున్నాయి. శాసనసభలో శనివారం బల పరీక్ష సాగనున్న నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం ఆగమేఘాలపై ఎమ్మెల్యేలను చెన్నైకు పిలిపించారు. సాయంత్రం ఐదు గంటల నుంచి గంటపాటు జరిగిన సమావేశంలో పళనిస్వామి ప్రభుత్వాన్ని కుప్పకూల్చడం లక్ష్యంగా చర్చించారు. సందర్భాన్ని బట్టి తాను, ఉపనేత, విప్ సూచించే మేరకు నడుచుకోవాలని ఎమ్మెల్యేలకు స్టాలిన్ సూచించినట్లు సమాచారం. దీంతో శనివారం స్టాలిన్ ఎత్తులెలా ఉంటాయోనన్న ఆసక్తి నెలకొంది. మనమూ క్యాంప్ పెడుదామన్నట్టు పలువురు ఎమ్మెల్యేలు చమత్కరించగా, అందుకు సమయం వస్తుందేమో చూద్దామని స్టాలిన్ సమాధానం ఇచ్చినట్టు తెలిసింది. వ్యతిరేకంగా ఓటు అన్నాడీఎంకే వైఫల్యాలతో రాష్ట్రంలో ప్రజల్ని అష్టకష్టాలకు గురి చేసిందని స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశానంతరం ఆయన మాట్లాడుతూ... తమిళనాడులో శాంతిభద్రతలు క్షీణించాయని, తమిళ ప్రజల జీవనాధారం మీద తీవ్ర ప్రభావం పడే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అందుకే అన్నాడీఎంకే పాలకుల వైఖరిని నిరసిస్తూ, సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి నిర్ణయించా మని ప్రకటించారు. రహస్య ఓటింగ్‌కు అవకాశం దక్కితే ఆహ్వానిస్తామని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తదుపరి అడుగులు ఎలా ఉంటాయి... పళనిస్వామి నెగ్గేనా అన్న ప్రశ్నలకు సమాధామిస్తూ... ‘వెయిట్ అండ్ సీ, ఒక్క రోజేగా’ అని ముగించారు. -
కాంగ్రెస్‌లో గందరగోళం
- బలపరీక్షలో పార్టీ వైఖరిపై సందిగ్ధత - అధిష్టానం నిర్ణయం మేరకే పయనం: తిరునావుక్కరసర్ - ఏఐఏడీఎంకేలో చేరేందుకే అలా వ్యవహరిస్తున్నారు: ఇళంగోవన్ సాక్షి, చెన్నై: తమిళనాడు కాంగ్రెస్‌లో శుక్రవారం చోటుచేసుకున్న పరిణామాలు రాజకీయంగా చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్ ప్రకటన గందరగోళానికి దారితీసింది. బలపరీక్షలో పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి డీఎంకే నిర్ణయించగా, అందుకు భిన్నంగా తిరునావుక్కరసర్ చర్యలు ఉండడం తమిళ కాంగ్రెస్‌లో మరోమారు వివాదానికి దారితీసింది. రాయపేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయం సత్యమూర్తిభవన్‌లో కాంగ్రెస్ శాసనసభాపక్షం శుక్రవారం సాయంత్రం ఐదున్నర గంటలకు సమావేశమైంది. అనంతరం తిరునావుక్కరసర్ మీడియాతో మాట్లాడుతూ... అవిశ్వాస తీర్మానంపై అందరి అభిప్రాయాలు ఢిల్లీకి పంపుతున్నామని తెలిపారు. తమ అధిష్టానం నిర్ణయం మేరకు పయనమని చెప్పారు. కాంగ్రెస్ భవిష్యత్తును దృష్టితో పెట్టుకొని చర్చ సాగిందని, ఇందుకు తగ్గట్టు అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని ఆ పార్టీ ఎమ్మెల్యే విజయధరణి తెలిపారు. అయితే తిరునావుక్కరసర్ వైఖరిని సీనియర్లు తీవ్రంగా ఖండించారు. తిరునావుక్కరసర్ త్వరలో అన్నాడీఎంకేలో చేరబోతున్నారని, అందుకే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ మండిపడ్డారు. డీఎంకేతో మిత్రభేదం లక్ష్యంగా ఆయన చర్యలు ఉన్నాయని ధ్వజమెత్తారు. గత వారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో తాను, చిదంబరం, కేఆర్ రామస్వామి, తంగబాలు, మణిశంకర్ అయ్యర్ పాల్గొన్నామని వివరించారు. డీఎంకే తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ముందుకు సాగాలని రాహుల్ గాంధీ సూచించారని తెలిపారు. అయితే, ఇప్పుడు తిరునావుక్కరసర్ చర్యలు చూస్తుంటే, ఎమ్మెల్యేల్ని గందరగోళానికి గురిచేయడానికి సిద్ధపడ్డట్టుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధిష్టానం ఇప్పటికే తన నిర్ణయాన్ని స్పష్టం చేసిందని, అందుకు తగ్గట్టు ఎమ్మెల్యేలు నడుచుకోవాలని ఆయన కోరారు. డీఎంకే నిర్ణయం మేరకే తమ అడుగులని సమావేశానికి ముందు మీడియాతోనూ, ట్విట్టర్లోనూ పేర్కొన్న తిరునావుక్కరసర్, సమావేశానంతరం మాట మార్చడం గమనార్హం. -
అమ్మకు ఓటేయండి
ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పిలుపు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజలు అమ్మను చూసి అన్నాడీఎంకేను గెలిపించారు... విశ్వాస తీర్మానంపై ఓటేసే ముందు ఒక్కసారి అమ్మను తలచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు జయలలిత పూర్తిగా వ్యతిరేకమని గుర్తుచేసుకోండి, రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించండని విజ్ఞప్తి చేశారు. విశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తే అది ప్రజలకు, అమ్మ ప్రభుత్వానికి చేసిన ద్రోహమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్నవారికే రెండాకుల చిహ్నం సొంతమన్నారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాన్యాయస్థానంలోనే ఎమ్మెల్యేలను నిలదీసేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు. ర్యాలీకి పోలీసుల బ్రేక్ ప్రజామద్దతును కూడగట్టుకుని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు పన్నీర్‌సెల్వం వర్గం శుక్రవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు బ్రేకు వేశారు. మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు జల్లికట్టు తరహా ఉద్యమానికి యువత మెరీనా బీచ్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మెరీనాతీరమంతా భారీగా బారికేడ్లు ఏర్పాటుచేసి, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తన కుటుంబం సహా నివసిస్తున్న చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రజాపనుల శాఖ ఆయనకు నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌సెల్వం, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులను బహిష్కరిస్తున్నట్లు గతంలో శశికళ ప్రకటించారు. ఇప్పుడు శశికళ, సీఎం పళనిస్వామి, మంత్రుల హోదాలో ఉన్నవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పన్నీర్వైపున్న ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. విద్యార్థిని ఆడియో హల్చల్ శశికళా వద్దూ... ఆమెకు మద్దతు పలుకుతున్న మీరూ వద్దంటూ విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్‌ను ఉద్దేశించి ఒక విద్యార్థిని చేసిన విమర్శల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గోపిచెట్టి పాళయంకు చెందిన కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని సెంగోట్టయన్‌కు ఫోన్ చేయగా మీటింగ్‌లో ఉన్నారని ఆయన అనుచరుడు బదులిచ్చాడు. దీంతో మంత్రికి తన అసంతృప్తిని చేరవేయమని చెబుతూ జరిగిన సంభాషణలను సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. -
‘మ్యాజిక్’ చేసేదెవరు?
తమిళనాడులో నేడే బలపరీక్ష... పది ఓట్లే కీలకం - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. పన్నీర్ గూటికి మైలాపూర్ ఎమ్మెల్యే - పళని క్యాంప్‌లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు - హుటాహుటిన రిసార్ట్స్‌కు సీఎం.. ఎమ్మెల్యేల బుజ్జగింపు - పళని శిబిరంలో 123.. పన్నీర్ వద్ద 12 మంది ఎమ్మెల్యేలు - పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న డీఎంకే - అధిష్టానం ఆదేశానుసారం నడుస్తామన్న కాంగ్రెస్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయ పరిమాణాలు చివరిఘట్టంలోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న బలపరీక్షపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆయన శనివారమే బలం నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. తాజాగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠగా తమిళ రాజకీయాలు పురట్చితలైవి జయలలిత మరణం తరువాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదిరోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలుకావడం... పన్నీర్ పదవీచ్యుతుడవ్వడం.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... 18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. ఆ తరువాత మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించినట్లు తెలిసింది. 20 మంది తిరుగుబాటు నటరాజన్ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో పళనిస్వామి బెంగళూరు పర్యటను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశకళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రహస్య ఓటింగ్‌కు డిమాండ్ అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు. 30 ఏళ్ల తరువాత బలపరీక్ష రిపీట్ తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
ఎల్లుండే బలనిరూపణ.. రిసార్ట్‌కు ఎమ్మెల్యేలు!
చెన్నై: తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి పళనిస్వామి ఈ నెల 18న (శనివారం) అసెంబ్లీ వేదికగా బలాన్ని నిరూపించుకోబోతున్నారు. ఈమేరకు బలనిరూపణ తేదీ ఖరారైంది. శనివారం ప్రత్యేకంగా రాష్ట్ర శాసనసభ ఇందుకోసం సమావేశం కానుంది. ఈ సమావేశంలో పళనిస్వామి మెజారిటీ నిరూపించుకోవాల్సి ఉంటుంది. మరోవైపు పళనిస్వామి ప్రమాణస్వీకార వేడుకలో పాల్గొన్న అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు తిరిగి కువత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు. బలనిరూపణ జరిగేవరకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు ఇక్కడ బస చేయనున్నట్టు తెలుస్తోంది. రాజ్‌భవన్‌లో కొత్త సీఎం, మంత్రుల ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు అక్కడి నుంచి నేరుగా రిసార్ట్‌కు వచ్చేశారు. పన్నీర్ సెల్వం తిరుగుబాటు చేసిననాటి నుంచి శశికళ వర్గం అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఇక్కడ ఉంచిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వేదికగా బలపరీక్షకు గవర్నర్ 15రోజుల గడువు ఇచ్చినప్పటికీ.. ఈ తంతును సాధ్యమైనంత తొందరగా పూర్తిచేసి.. మెజారిటీ చాటుకోవాలని పళనివర్గం భావిస్తున్నది. తమకు ప్రస్తుతం 124 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆ వర్గం చెబుతున్నది. బలపరీక్ష నాటికి పన్నీర్ గూటికి చేరిన మిగత ఎమ్మెల్యేలు కూడా తమవైపు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నది. మరోవైపు చివరివరకు ముఖ్యమంత్రి పదవి కోసం చివరివరకు ప్రయత్నిస్తానని ప్రకటించిన పన్నీర్ సెల్వం.. పళని బలపరీక్షలో నెగ్గకుండా ఏమైనా ఎత్తులు వేస్తారా? మరింత మంది ఎమ్మెల్యేలను తనవైపు లాక్కోగలుగుతారా? అన్నది వేచి చూడాలి. -
అరుణాచల్ ప్రదేశ్ లో బలపరీక్ష వాయిదా
ఇటానగర్: అరుణాచల్ ప్రదేశ్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆ రాష్ట్ర సీఎం, శాసన సభా పక్ష నాయకునిగా ఉన్న నబమ్ టుకీ అనూహ్యంగా తన పదవికి రాజీనామా చేశారు. కొత్త శాసనసభా నాయకునిగా ఎన్నికైన పెమా ఖండు ఈ రోజు బలపరీక్ష నిరూపించుకోవాల్సి ఉంది. కాగా బలపరీక్ష వాయిదా పడింది. మొత్తం 58 మంది సభ్యులున్న శాసనసభలో కాంగ్రెస్ కు 45 మంది సభ్యులున్నారు. మరో ఇద్దరు ఇండిపెండెండ్ సభ్యుల మద్ధతు ఆపార్టీకి ఉంది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఈ రోజు బలపరీక్ష నిర్వహించాల్సి ఉంది. బలపరీక్షకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా లేనందువల్లే వాయిదా పడినట్టు సమాచారం. -
టుకీ బలపరీక్షపై ఉత్కంఠ
-
టుకీ బలపరీక్షపై ఉత్కంఠ
- అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు - 10 రోజుల గడవు కోరిన టుకీ; తిరస్కరించిన గవర్నర్ ఈటానగర్/న్యూఢిల్లీ: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలంటూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో.. అరుణాచల్ ప్రదేశ్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. తీర్పు అనంతరం ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన నబమ్ టుకీ.. అసెంబ్లీలో బలనిరూపణకు మరింత సమయం కోరుతుండగా.. శనివారం రోజే బలపరీక్ష తప్పదని గవర్నర్ తథాగతరాయ్ స్పష్టం చేశారు. విశ్వాస పరీక్షను ఎదుర్కొనేందుకు కనీసం నెల రోజుల సమయమివ్వాలని, గవర్నర్ తనకుతానుగా అసెంబ్లీని సమావేశపర్చలేరని కాంగ్రెస్ వాదిస్తోంది. హోంమంత్రి తంగ బ్యాలింగ్తో కలిసి శుక్రవారం గవర్నర్ రాయ్‌ని కలిసిన టుకీ.. బల నిరూపణకు తనకు కనీసం 10 రోజుల సమయమివ్వాలన్న అభ్యర్థనను, పరీక్షను వాయిదా వేయాలన్న కేబినెట్ తీర్మానాన్ని తిరస్కరించిన గవర్నర్.. శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందేనని తేల్చిచెప్పారు. పదవీచ్యుత సీఎం కలిఖో పుల్ తనకు 60 మంది సభ్యుల అసెంబ్లీలో కాంగ్రెస్ రెబల్స్, 11 బీజేపీ సభ్యులు సహా 43 మంది ఎమ్మెల్యేల మద్దతుందంటున్న పరిస్థితుల్లో.. టుకీ ఇప్పటికిప్పుడు మెజారిటీని నిరూపించుకోవడం కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెబల్స్‌ను తిరిగి కాంగ్రెస్‌లోకి రావాల్సిందిగా టుకీ కోరుతున్నారు. ‘నబమ్ టుకీని శనివారం మెజారిటీని నిరూపించుకోవాల్సిందిగా గవర్నర్ ఆదేశించార’ని శుక్రవారం రాజ్‌భవన్ ఒక ప్రకటన విడుదల చేసింది. అంతకుముందు రాష్ట్ర కేబినెట్ సమావేశమై బలపరీక్షను కనీసం 10 రోజులు వాయిదా వేయాల్సిందిగా గవర్నర్‌ను అభ్యర్థిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. మరోవైపు, కలిఖొ నేతృత్వంలోని పీపీఏకు పూర్తి మద్దతిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర శాఖ ప్రకటించింది. ఏకపక్ష ప్రకటన కుదరదు: కాంగ్రెస్ అసెంబ్లీ సమావేశాల నిర్ణయాన్ని గవర్నర్ ఏకపక్షంగా తీసుకోవడం కుదరదని కాంగ్రెస్ పేర్కొంది. సుప్రీంకోర్టు గత తీర్పులను, సర్కారియా కమిషన్ సిఫారసులను ఉటంకిస్తూ.. బల నిరూపణకు కనీసం నెల రోజుల సమయమివ్వాలంది. ‘బలపరీక్షకు సిద్ధంగానే ఉన్నాం. అయితే, ప్రభుత్వ సిఫారసు మేరకే సమావేశాలను ప్రారంభించాల్సి ఉంటుంది’ అని సీనియర్ నేత కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. అలాగే, శనివారం బలపరీక్ష జరగకుండా కాంగ్రెస్ వ్యూహాన్ని సిద్ధం చేసిందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అలాగే, గవర్నర్ అధికారాలకు సంబంధించి సుప్రీంకోర్టు నుంచి కూడా కాంగ్రెస్ వివరణ కోరే అవకాశముందన్నాయి. -
ఇద్దరు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు
విశ్వాస పరీక్షలో క్రాస్ ఓటింగ్ చేసినందుకు ఇద్దరు ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ అసెంబ్లీ స్పీకర్ గోవింద్‌సింగ్ కుంజ్వల్ అనర్హత వేటు వేశారు. వేటు పడిన వారిలో ఒకరు కాంగ్రెస్ పార్టీకి చెందినవారు కాగా, మరొకరు బీజేపీ ఎమ్మెల్యే. హరీష్ రావత్ సర్కారుపై మే 10వ తేదీన నిర్వహించిన విశ్వాసపరీక్షలో కష్టమ్మీద అధికార కాంగ్రెస్ పార్టీ నెగ్గిన విషయం తెలిసిందే. బీజేపీ రెబెల్ ఎమ్మెల్యే భీమ్ లాల్ ఆర్య కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఓటు వేయగా, కాంగ్రెస్ ఎమ్మెల్యే రేఖా ఆర్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు. వీళ్లిద్దరిపైనా అనర్హత వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు స్పీకర్ గురువారం తెలిపారు. వాళ్ల చర్య ఫిరాయింపుల నిరోధక చట్టం కింద శిక్షార్హమని ఆయన అన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూలు ప్రకారం.. తమ పార్టీ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఎవరైనా సభ్యుడు ఓటు వేసినా, ఓటింగుకు గైర్హాజరైనా వాళ్ల మీద అనర్హత వేటు వేయొచ్చు. కాంగ్రెస్, బీజేపీ రెండూ తమ తమ నిర్ణయాలకు అనుకూలంగా విప్‌లు జారీచేశాయి. అయినా కూడా ఆ ఎమ్మెల్యేలిద్దరూ వాటిని ఉల్లంఘించారు. ఇద్దరిపై వేటు వేయడంతో.. ఇప్పుడు 61 మంది సభ్యులున్న సభలో కాంగ్రెస్ పార్టీకి 26 మంది, బీజేపీకి 27 మంది సభ్యులు ఉన్నట్లయింది. అయితే ఆరుగురు సభ్యులున్న ప్రోగ్రెసివ్ డెమొక్రాటిక్ ఫ్రంట్ (పీడీఎఫ్) మద్దతుతో కాంగ్రెస్ గట్టెక్కుతోంది. -
ఆ ఎమ్మెల్యేలకు ఓటుహక్కు లేదు!
ఉత్తరాఖండ్ అసెంబ్లీలో హరీష్ రావత్ ఈనెల 10వ తేదీన విశ్వాసపరీక్ష ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు తెలిపింది. తప్పో.. ఒప్పో గానీ, అక్కడ రాష్ట్రపతి పాలన విధించడానికి కొద్ది ముందుగా స్పీకర్ అనర్హత వేటు వేసిన 9 మంది రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆరోజు విశ్వాసపరీక్షలో ఓటు వేయడానికి అనర్హులని కూడా కోర్టు స్పష్టం చేసింది. ఆరోజు ఒక పరిశీలకుడిని నియమిస్తామని, మొత్తం సభా కార్యకలాపాలు అన్నింటినీ వీడియో తీయిస్తామని చెప్పింది. మొత్తం 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ తన మెజారిటీని నిరూపించుకుంటుందని హరీష్ రావత్ ధీమా వ్యక్తం చేశారు. అయితే బీజేపీ మాత్రం హరీష్ రావత్ సర్కారు మైనారిటీలోనే ఉందని ఇప్పటికీ వాదిస్తోంది. బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు దానిపై ఓటింగులో 9 మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసిన విషయాన్ని గుర్తుచేస్తోంది. అలాగే, రెబెల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను మళ్లీ తన గూటికి తెచ్చుకోడానికి వాళ్లకు లంచం ఇవ్వజూపుతూ హరీష్ రావత్ వీడియోలో చిక్కారని, అందులో ఉన్నది తానేనని కూడా ఆయన ఒప్పుకొన్నారని బీజేపీ అంటోంది. పదో తేదీన విశ్వాస పరీక్ష జరగనుండటం, అందులో రెబెల్ ఎమ్మెల్యేలకు ఓటుహక్కు లేకపోవడంతో.. సర్కారు గట్టెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతానికి రావత్ వెనక ఉన్నారని భావిస్తున్న కాంగ్రెస్ సభ్యులలో ఇంకా ఎవరైనా ఆయనకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం చెప్పలేని పరిస్థితి ఏర్పడుతుంది. -
విశ్వాస పరీక్షకు కేంద్రం సిద్ధం
ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ అసెంబ్లీలో విశ్వాస పరీక్షకు కేంద్ర ప్రభుత్వం అంగీకారం తెలిపింది. దీంతో బలనిరూపణ పరీక్షను పర్యవేక్షించనున్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. రిటైర్డ్ సీఈసీని పరిశీలకుడిగా నియమించాలని సుప్రీంకోర్టును కేంద్ర ప్రభుత్వం కోరిన నేపథ్యంలో అందుకు ఉన్నత న్యాయస్థానం అంగీకరించింది. ఉత్తరాఖండ్ లో రాష్ట్రపతి పాలనపై సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ఈ నిర్ణయం జరిగింది. -
విశ్వాస పరీక్ష నిర్వహించాల్సిందే: హైకోర్టు
ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి హైకోర్టులో ఊరట లభించింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కొనసాగాలా వద్దా అన్న విషయాన్ని తేల్చుకోడానికి గురువారం.. అంటే ఈనెల 31వ తేదీన విశ్వాస పరీక్ష నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లో రాష్ట్రపతి పాలన విధించాలంటూ నిర్ణయం తీసుకున్న కేంద్రప్రభుత్వానికి ఇది పెద్ద ఎదురుదెబ్బే అవుతుంది. గత కొన్ని నెలలుగా ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగలు కక్కుతోంది. తొమ్మిది మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కీలకమైన ఆర్థికబిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేశారు. దాంతో ప్రభుత్వం మైనారిటీలో పడిందన్న విషయం రుజువైందని కేంద్రం చెప్పింది. అయితే.. మార్చి 28న తాను విశ్వాసపరీక్ష ఎదుర్కొంటానని గవర్నర్ కేకే పాల్‌ను కోరినా, ఈలోపే కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. 70 మంది సభ్యులున్న ఉత్తరాఖండ్ అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చి బీజేపీ పక్షాన చేరిన తొమ్మిది మంది రెబెల్ ఎమ్మెల్యేలపై ఉత్తరాఖండ్ స్పీకర్ సస్పెన్షన్ వేటు వేశారు. దీంతో అసెంబ్లీలో విశ్వాస పరీక్షను రావత్ ప్రభుత్వం అలవోకగా ఎదుర్కొని నిలబడగలుగుతుంది. స్పీకర్ సస్పెన్షన్ నిర్ణయంతో సభలో మొత్తం సంఖ్య 61 పడిపోయింది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి 27 మంది సభ్యులుండగా, మరో ఆరుగురు స్వతంత్ర సభ్యులు కూడా సర్కారుకు మద్దతిస్తారని అంటున్నారు. అదే నిజమైతే 33 మంది సభ్యుల బలంతో రావత్ సర్కార్ విశ్వాస పరీక్షలో గట్టెక్కే అవకాశం ఉంటుంది. కానీ ఒకవేళ స్వతంత్ర సభ్యులు సర్కారుకు వ్యతిరేకంగా ఓటు వేస్తే మాత్రం హరీష్ రావత్ ఇంటిదారి చూసుకోక తప్పదు. -
విశ్వాస పరీక్ష అంటే భయం లేదు: కేజ్రీవాల్
అసెంబ్లీలో విశ్వాస పరీక్ష గురించి తానేమీ భయపడట్లేదని, ప్రభుత్వం ఎన్నాళ్లున్నా తమకొచ్చిన ఇబ్బందేమీ లేదని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. అసెంబ్లీకి వచ్చిన సందర్భంగా మీడియా ఆయన్ను చుట్టుముట్టి ప్రశ్నలు సంధించినప్పుడు ఆయనిలా స్పందించారు. తమకు ఏమైనా భయం ఉంటే ఈరోజు గుడికి వెళ్లి ప్రార్థించేవాడినని నవ్వుతూ చెప్పారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్షపై ఓటింగ్ సాయంత్రం ఐదు గంటలకు జరిగే అవకాశముంది. 70 మంది సభ్యులున్న ఢిల్లీ అసెంబ్లీలో మేజిక్ మార్కు 36 కాగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి 28 మంది సభ్యులున్నారు. సర్కారుకు బయటినుంచి మద్దతిస్తున్న కాంగ్రెస్ పార్టీకి 8 మంది సభ్యులున్నారు. కాగా, తమ పార్టీ ఎమ్మెల్యేలందరికీ కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే విప్ జారీచేసింది.