సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభలో జరగనున్న బలపరీక్షతో హైడ్రామాకు ఇవాళ సాయంత్రం తెరపడనుంది. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం డివిజన్ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కాల్సి ఉంది. ఇప్పటికే రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు నో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిస్ ఓటింగ్ లేదా, డివిజన్ ఓటుద్వారా బలాన్ని లెక్కించే అవకాశం ఉంది. వాయిస్ ఓటింగ్, డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం.
మూజువాణి (వాయిస్)ఓటు
అసెంబ్లీలోని సభ్యుల అభిప్రాయాన్ని మూజువాణి ఓటు విధానంలో వెల్లడించడం. విశ్వాస పరీక్షకు సమాధానంగా ఎస్, లేదా నో అని సమాధానం చెప్పాలి. మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత ఎస్ అని, వ్యతిరేకించే వారు నో అని సమాధానం ఇవ్వాలి. అనంతరం ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది లెక్కిస్తారు. ఇక్కడ స్పీకర్ నిర్ణయమే కీలకం.
డివిజన్ ఓటు
చట్టసభలో సభ్యులు డివిజన్ ఓటు ద్వారా విశ్వాసాన్ని ప్రకటించడం.. దీనినే హెడ్ కౌంట్ అని కూడా అంటారు. శనివారం కర్ణాటక శాసనసభలో జరగనుంది ఇదే. ఈ అంశంపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని డివిజన్ ఓటింగ్ విధానంలో కోరుతారు. ఇందులో భాగంగా అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకించేవారిని, తటస్థంగా ఉండేవారిని వేర్వేరు సార్లు చేతులెత్తడం లేదా లేచినిలబడడం ద్వారా అభిప్రాయం కోరుతారు. అంటే అనుకూలంగా ఉన్నవారిని ఒకసారి లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. తర్వాత వ్యతిరేకించేవారిని లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. చివరగా తటస్థంగా ఉండేవారి సంఖ్యను లెక్కిస్తారు. అంతిమంగా ఆ అంశానికి ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకమనేది లెక్కించి.. నిర్ణయం తీసుకుంటారు.
కాగా ప్రోటెం స్పీకర్ ఎన్నికపై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తాత్కాలిక స్పీకర్‌గా బోపయ్య ఎన్నిక సరైనదేనని తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన బోపయ్యకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ వర్గాలు ముందస్తు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే ఉదయం 11 గంటలనుంచి అసెంబ్లీ మొత్తం కార్యకలాపాలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన సింఘ్వీ విజయం తమదేనని చెప్పారు. ప్రజాస్వామ్యానిదే తుది విజయమని తాము నమ్ముతున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment