జార్ఖండ్ అసెంబ్లీలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ప్రభుత్వం బల పరీక్షలో నెగ్గింది. జార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) నేతృత్వంలోని పాలక కూటమికి అనుకూలంగా 45 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలపడంతో సోరెన్ ప్రభుత్వం బలపరీక్షలో సునాయాసంగా గట్టెక్కింది.
భూ కుంభకోణం కేసులో అరెస్ట్ అయి.. దాదాపు 5 నెలల తర్వాత బెయిల్‌పై బయటకు వచ్చారు హేమంత్ సోరెన్ ఆ తరువాత జూలై 4న మూడోసారి జార్ఖండ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. సోమవారం అసెంబ్లీలో బల పరీక్షను ఎదుర్కొన్నారు.
జార్ఖండ్ స్పీకర్ రవీంద్రనాథ్ మహ్తో విశ్వాస తీర్మానంపై చర్చకు గంట సమయం కేటాయించారు. అసెంబ్లీలో విశ్వాస తీర్మానం ఆమోదం పొందడంతో..హేమంత్ సోరెన్ తన మంత్రివర్గాన్ని విస్తరించే అవకాశం ఉంది.
కాగా 81 సీట్లున్న అసెంబ్లీలో ప్రస్తుతం 76 మంది సభ్యులున్నారు. అసెంబ్లీ బల పరీక్షలో నెగ్గాలంటే 338 ఎమ్మెల్యేల మద్దతు ఉంటే సరిపోతుంది. ప్రస్తుతం అసెంబ్లీలో జేఎంఎం కూటమికి 45 మంది ఎమ్మెల్యేలున్నారు (జేఏఎంఎం 27, కాంగ్రెస్ 17, ఆర్జేడీ1). బీజేపీ నేతృత్వంలోని ప్రతిపక్షానికి 30 మంది సభ్యులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment