pro-tem speaker
-
Parliament Special Session: సభ్యుల ప్రమాణ స్వీకారం
న్యూఢిల్లీ: లోక్‌సభ తొలిరోజు సమావేశాల్లో ప్రమాణస్వీకార పర్వం కొనసాగింది. సోమవారం ప్రొటెం స్పీకర్ భర్తృహరి మెహతాబ్ ప్యానెల్ స్పీకర్లు రాధా మోహన్ సింగ్, ఫగన్ సింగ్ కులస్తేలు నూతన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అంతకుముందు రాష్ట్రపతిభవన్‌లో భర్తృహరి చేత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణంచేయించారు. ఆ తర్వాత లోక్‌సభ ప్రారంభం అయిన వెంటనే వయనాడ్ స్థానానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన రాజీనామాను ఆమోదించినట్లు ప్రొటెం స్పీకర్ మెహతాబ్ ప్రకటించారు. అనంతరం 11:07 గంటలకు ప్రధాని మోదీ వరుసగా మూడోసారి ఎంపీగా హిందీలో ప్రమాణం చేయడంతో లోక్‌సభ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ఆరంభమైంది. ప్రధాని తర్వాత ప్యానెల్ స్పీకర్లు రాధామోహన్, కులస్తేలు ప్రమాణం చేశారు. తర్వాత మంత్రిమండలి సభ్యులు ఒకరి తర్వాత ఒకరు ప్రమాణం చేశారు. ముందుగా కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా, గడ్కరీ, శివరాజ్‌సింగ్ చౌహాన్, మనోహర్ లాల్ ఖట్టర్ తదితర మంత్రులు ప్రమాణం చేశారు. తర్వాత స్వతంత్ర హోదా ఉన్న సహాయకమంత్రులు తర్వాత సహాయక మంత్రులు ప్రమాణంచేశారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ప్రమాణం చేసేందుకు వెళ్తున్న సమయంలో ‘నీట్ ఫెయిల్డ్ మినిస్టర్’, నీట్–నెట్ అంటూ ప్రతిపక్ష ఎంపీలు నినాదాలు చేశారు. తర్వాత మెహతాబ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించినందుకు నిరసనగా కాంగ్రెస్ సభ్యుడు కె.సురేశ్, డీఎంకే సభ్యుడు టీఆర్ బాలు, టీఎంసీ సభ్యుడు సుదీప్ బంధోపాధ్యాయ్లు స్పీకర్ప్యానెల్ సభ్యులుగా ప్రమాణంచేయలేదు. ఎనిమిదిసార్లు ఎంపీగా గెలిచిన దళిత నేత సురేశ్‌ను ప్రొటెం స్పీకర్‌గా ఎంపికచేయనందుకు నిరసన తెలపాలని విపక్షపార్టీలు నిర్ణయించిన నేపథ్యంలో ఈ ముగ్గురు ప్యానెల్ స్పీకర్ల పదవులకు దూరంగా ఉండిపోయారు. ప్రమాణస్వీకారం మొదలుకాగానే సురేశ్, టీఆర్ బాలు, సుదీప్‌లు సభ నుంచి వాకౌట్‌చేశారు. ప్యానెల్ సభ్యుల ప్రమాణంవేళ ‘ రాజ్యాంగ ఉల్లంఘన’ అని విపక్షసభ్యులు నినాదాలు చేశారు. తర్వాత అక్షరమాల ప్రకారం రాష్ట్రాలవారీగా సభ్యులు ప్రమాణంచేశారు. మిగతా సభ్యులు మంగళవారం ప్రమాణం చేయనున్నారు.పలు భాషల్లో ప్రమాణాలుప్రమాణస్వీకారం వేళ సభలో భాషా వైవిధ్యం కనిపించింది. పలువురు ఎంపీలు తమ మాతృభాషలో ప్రమాణంచేశారు. ఇంగ్లిష్‌తోపాటు సంస్కృతం, డోగ్రీ, బెంగాలీ, అస్సామీ, ఒడియా, మరాఠీ, తదితర భాషల్లో ప్రమాణంచేశారు. అమిత్ షా, రాజ్‌నాథ్, గడ్కరీ, జ్యోతిరాదిత్య సింధియా, ఖట్టర్ హిందీలో ప్రమాణంచేశారు. ఉక్కు, భారీ పరిశ్రమల మంత్రి హెచ్డీ కుమారస్వామి కన్నడలో, విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఒడియాలో, పోర్ట్‌లు, నౌకాయాన మంత్రి సర్బానంద సోనోవాల్ అస్సామీలో, విద్యుత్, పునరుత్పాదక ఇంధన సహాయ మంత్రి శ్రీపాద్ వై నాయక్ సంస్కృతంలో, పర్యాటకం, పెట్రోలియం మంత్రి సురేష్ గోపి మలయాళంలో సభ్యులుగా ప్రమాణంచేశారు. లోక్‌సభ ప్రారంభానికి శుభసూచకంగా సభ్యులంతా తొలుత లేచి నిలబడి కొద్దిసేపు మౌనంగా ఉన్నారు.తొలి వరుసలో రాహుల్, అఖిలేశ్సభలో విపక్షాలకు కేటాయించిన కుర్చీల్లో మొదటి వరుసలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, టీఎంసీ నేత కళ్యాణ్ బెనర్జీ, ఎస్పీ నేతలు అఖిలేశ్ యాదవ్, అవధేశ్ ప్రసాద్‌లు కూర్చున్నారు. మాజీ లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా మూడో వరుసలో కూర్చున్నారు. తొలిసారి సభకు ఎన్నికైన దివంగత సుష్మాస్వరాజ్ కుమార్తె భాన్సురీ స్వరాజ్ సభలో అందరినీ పలకరిస్తూ కనిపించారు. సెల్ఫీలు దిగారు. ఎస్పీ సభ్యులు ఎర్రని టోపీలు, ఎర్ర కండువాలు ధరించి హిందీలో ముద్రించిన రాజ్యాంగ ప్రతులను పట్టుకొచ్చారు.సభలో హైలైట్స్→ రైతు నేత, సీపీఐ (ఎం) ఎంపీ ఆమ్రా రామ్ ట్రాక్టర్లో పార్లమెంట్‌కు వచ్చారు.→ కొందరు సభ్యులు తమ రాష్ట్ర సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు.→ ‘రేసుగుర్రం’ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ధోతీలో అలరించారు.→ తొలిసారి ఎంపీగా గెలిచిన మధ్యప్రదేశ్ బీజేపీ నాయకురాలు అనిత నగర్‌సింగ్ చౌహాన్ వేళ్లకు పెద్ద ఉంగరాలు, మెడలో భారీ సంప్రదాయ నగలతో సభకు వచ్చారు. → శ్వేతవర్ణ చీరకట్టులో మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.→ తిహార్ జైలులో ఉన్న బారాముల్లా స్వతంత్ర ఎంపీ, నిందితుడు అబ్దుల్లా రషీద్ షేక్ బెయిల్ దొరక్కపోవడంతో ప్రమాణం చేయలేకపోయారు. → టీవీ రాముడు అరుణ్ గోవిల్ అందరితో మాట్లాడుతూ కనిపించారు. → మోదీ ప్రమాణం చేసేటపుడు ఎన్డీఏ నేతలంతా జైశ్రీరాం అని నినాదాలు చేశారు. అప్పుడు విపక్ష సభ్యులంతా లేచి రాజ్యాంగ ప్రతిని చూపించారు. కొందరు సభ్యులు పార్లమెంట్ ప్రధాన ద్వారం వద్ద సాష్టాంగ నమస్కారం చేసి లోపలికి వచ్చారు -
తెలంగాణ 3వ శాసన సభకు ప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ఓవైసీ
-
బిహార్ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా మాంజీ
పట్నా: బిహార్ మాజీ ముఖ్యమంత్రి, హిందుస్తానీ ఆవామ్ మోర్చా పార్టీ వ్యవస్థాపకుడు జితన్‌రామ్ మాంజీ ఆ రాష్ట్ర నూతన అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ఎన్నికయ్యారు. ఈ మేరకు రాష్ట్ర గవర్నర్ ఫగుచౌహాన్ ఆయనతో ప్రమాణస్వీకారం చేయించినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 23 లేదా 24న కొత్త స్పీకర్‌ను ఎన్నుకునే అవకాశం ఉండటంతో అప్పటి వరకు ఆయన ఈ పదవిలో కొనసాగనున్నారు. అసెంబ్లీ మెదటి సమావేశాలు నవంబర్ 23 నుంచి ఐదు రోజుల పాటు కొనసాగుతాయని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. తూర్పు బిహార్‌కు చెందిన 76 ఏళ్ల జితన్ రామ్ బిహార్ 23వ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2014 మే20 నుంచి 2015 ఫిబ్రవరి 20 వరకు ఆయన సీఎం పదవిలో కొనసాగారు. అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన జితన్ రామ్.. చంద్రశేఖర్ సింగ్, బిందేశ్వరీ దూబే, సత్యేంద్ర నారాయణ సిన్హా, జగన్నాథ్ మిశ్రా, లాలూప్రసాద్ యాదవ్, రబ్రీదేవిల క్యాబినెట్లో మంత్రిగా పనిచేశారు. -
లోక్‌సభ స్పీకర్‌గా వీరేంద్ర కుమార్?
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌కు చెందిన బీజేపీ సీనియర్ దళిత నేత, గత మంత్రి వర్గ సభ్యుడైన వీరేంద్ర కుమార్ ఖతిక్(65) 17వ లోక్‌సభ స్పీకర్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏడు పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన ఈ దళిత నేతను లోక్‌సభ ప్రొటెం స్పీకర్‌గా మంగళవారం ప్రభుత్వం నియమించింది. కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసేందుకు వీలుగా ఎంపీలు భర్తృహరి మహ్తాబ్, కొడికునిల్ సురేశ్, బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌లను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నియమించారని అధికార వర్గాలు తెలిపాయి. ఎంపీ వీరేంద్రకుమార్ ఖతిక్ 17వ లోక్‌సభ మొట్ట మొదటి సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణస్వీకారం చేయించడంతోపాటు స్పీకర్ ఎన్నికను ఆయన పర్యవేక్షిస్తారు. ఎనిమిది పర్యాయాలు ఎంపీగా ఎన్నికైన మనేకా గాంధీ ప్రొటెం స్పీకర్ అవుతారని మొదట్లో వార్తలు వచ్చినప్పటికీ మంత్రి వర్గంలో చోటుతోపాటు ప్రొటెం స్పీకర్ పదవి కూడా ఆమె తిరస్కరించినట్లు సమాచారం. దీంతో మధ్యప్రదేశ్‌లోని టికమ్‌గఢ్ నుంచి ఎంపీగా ఎన్నికైన సీనియర్ నేత వీరేంద్రకుమార్ వైపు ప్రభుత్వం మొగ్గు చూపింది. స్పీకర్ పదవి కూడా వీరేంద్ర కుమార్‌కే దక్కే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ పదవి రేసులో కేంద్ర మాజీ మంత్రులు రాధా మోహన్ సింగ్, జుయెల్ ఓరమ్, ఎస్ఎస్ అహ్లూవాలియా కూడా ఉన్నారు. 17వ లోక్‌సభ సమావేశాలు ఈ నెల 17వ తేదీ నుంచి జూలై 26 వరకు జరగనున్నాయి. 17, 18వ తేదీల్లో కొత్త సభ్యులతో ప్రమాణస్వీకారం, 19వ తేదీన స్పీకర్ ఎన్నిక ఉంటుందని సమాచారం. -
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్‌తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
-
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
-
ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు. -
డివిజన్, వాయిస్ ఓటింగ్ అంటే ఏమిటి?
సాక్షి, బెంగళూరు: కర్ణాటక శాసనసభలో జరగనున్న బలపరీక్షతో హైడ్రామాకు ఇవాళ సాయంత్రం తెరపడనుంది. యడ్యూరప్ప నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం డివిజన్ ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని గట్టెక్కాల్సి ఉంది. ఇప్పటికే రహస్య ఓటింగ్‌కు సుప్రీంకోర్టు నో చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాయిస్ ఓటింగ్ లేదా, డివిజన్ ఓటుద్వారా బలాన్ని లెక్కించే అవకాశం ఉంది. వాయిస్ ఓటింగ్, డివిజన్ ఓటింగ్ అంటే ఏమిటో ఒకసారి చూద్దాం. మూజువాణి (వాయిస్)ఓటు అసెంబ్లీలోని సభ్యుల అభిప్రాయాన్ని మూజువాణి ఓటు విధానంలో వెల్లడించడం. విశ్వాస పరీక్షకు సమాధానంగా ఎస్, లేదా నో అని సమాధానం చెప్పాలి. మద్దతుగా ఉండే సభ్యులంతా తొలుత ఎస్ అని, వ్యతిరేకించే వారు నో అని సమాధానం ఇవ్వాలి. అనంతరం ఎంతమంది మద్దతిచ్చారు, ఎంతమంది వ్యతిరేకించారు అనేది లెక్కిస్తారు. ఇక్కడ స్పీకర్ నిర్ణయమే కీలకం. డివిజన్ ఓటు చట్టసభలో సభ్యులు డివిజన్ ఓటు ద్వారా విశ్వాసాన్ని ప్రకటించడం.. దీనినే హెడ్ కౌంట్ అని కూడా అంటారు. శనివారం కర్ణాటక శాసనసభలో జరగనుంది ఇదే. ఈ అంశంపై స్పీకర్ సభ్యుల అభిప్రాయాన్ని డివిజన్ ఓటింగ్ విధానంలో కోరుతారు. ఇందులో భాగంగా అనుకూలంగా ఉన్నవారిని, వ్యతిరేకించేవారిని, తటస్థంగా ఉండేవారిని వేర్వేరు సార్లు చేతులెత్తడం లేదా లేచినిలబడడం ద్వారా అభిప్రాయం కోరుతారు. అంటే అనుకూలంగా ఉన్నవారిని ఒకసారి లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. తర్వాత వ్యతిరేకించేవారిని లేచి నిలబడాలని కోరి.. వారి సంఖ్యను లెక్కిస్తారు. చివరగా తటస్థంగా ఉండేవారి సంఖ్యను లెక్కిస్తారు. అంతిమంగా ఆ అంశానికి ఎంతమంది అనుకూలం, ఎంత మంది వ్యతిరేకమనేది లెక్కించి.. నిర్ణయం తీసుకుంటారు. కాగా ప్రోటెం స్పీకర్ ఎన్నికపై దేశ అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టు సంచలన తీర్పును వెలువరించింది. తాత్కాలిక స్పీకర్‌గా బోపయ్య ఎన్నిక సరైనదేనని తీర్పు చెప్పింది. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నియామకంపై గవర్నర్‌కు ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని సుప్రీం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ప్రొటెం స్పీకర్‌గా బీజేపీకి చెందిన బోపయ్యకే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో బీజేపీ వర్గాలు ముందస్తు సంబరాల్లో మునిగిపోయాయి. అయితే ఉదయం 11 గంటలనుంచి అసెంబ్లీ మొత్తం కార్యకలాపాలను లైవ్ టెలీకాస్ట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు సుప్రీం తీర్పు అనంతరం మీడియాతో మాట్లాడిన సింఘ్వీ విజయం తమదేనని చెప్పారు. ప్రజాస్వామ్యానిదే తుది విజయమని తాము నమ్ముతున్నామన్నారు. -
కర్నాటకం: బోపయ్యతో బేఫికర్!
సాక్షి, బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కేజీ బోపయ్యను గవర్నర్ వాజుభాయ్ వాలా ఎంపిక చేయడాన్ని కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గతంలో సరిగ్గా ఇలాంటి పరిస్థితులే ఎదురైనప్పుడు బీఎస్ యడ్యూరప్పను ఆయన కాపాడటమే దీనికి కారణమని తెలుస్తోంది. 2009-13 మధ్యకాలంలో కర్ణాటక శాసనసభా స్పీకర్‌గా బోపయ్య పనిచేశారు. 2011, అక్టోబర్‌లో ఐదుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతో కలిసి 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రిగా ఉన్న యడ్యూరప్పపై తిరుగుబాటు చేశారు. దీంతో శాసనసభలో యడ్యూరప్ప అవిశ్వాస పరీక్ష ఎదుర్కొవాల్సి వచ్చింది. స్పీకర్‌గా ఉన్న బోపయ్య తిరుగుబాటు చేసిన 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించి యెడ్డీ సర్కారును కాపాడారు. బోపయ్య నిర్ణయాన్ని కర్ణాటక హైకోర్టు సమర్థించగా, సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ విషయంలో ఆయన అతి వేగంగా స్పందించారని వ్యాఖ్యానించింది. సర్వత్రా ఉత్కంఠ.. గతానుభవాన్ని దృష్టిలో పెట్టుకుని బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్‌కు నియమించివుంటారన్న అనుమానాన్ని కాంగ్రెస్, జేడీఎస్ వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పుడు కూడా యడ్యూరప్ప సర్కారుకు ఆయన అనుకూలంగా వ్యవహరించే అవకాశముందని ఆరోపించాయి. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ప్రమాణస్వీకారం చేసేటప్పుడు అత్యంత అనుభవశాలి అయిన ఎమ్మెల్యే ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తుండటం ఆనవాయితీగా వస్తోంది. కర్ణాటక ప్రస్తుత శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఆర్వీ దేశ్‌పాండే అత్యంత సీనియర్ సభ్యుడు. ఆయనను పక్కనపెట్టేసి బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. కర్ణాటక అసెంబ్లీలో రేపు ఏం జరుగుతుందనే దానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. -
కర్ణాటక: ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే
సాక్షి, బెంగళూరు: కర్ణాటకలో రాజకీయ పరిణామాలు అత్యంత ఉత్కంఠ రేకిస్తున్నాయి. ముఖ్యమంత్రి యడ్యూరప్ప శాసనసభలో రేపు బలనిరూపణకు సిద్ధమవుతున్న తరుణంలో రాష్ట్ర గవర్నర్ వాజూభాయ్ వాలా వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కేజీ బోపయ్యను ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ఉత్తర్వులు వెలువరించిన 5 నిమిషాల్లోనే ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. గవర్నర్ వాజూభాయ్ వాలా నిర్ణయంపై కాంగ్రెస్, జేడీఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. సంప్రదాయం ప్రకారం సీనియర్ అయిన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించాలని, ఎనిమిదిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన తమ పార్టీ నేత ఆర్వీ దేశ్‌పాండేను విస్మరించడం సరికాదని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ప్రొటెం స్పీకర్‌గా బీజేపీ ఎమ్మెల్యే కేజే బోపయ్యను నియమిస్తూ గవర్నర్ తీసుకున్న నిర్ణయంపై సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నట్టు సమాచారం. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విరాజ్‌పేట స్థానం నుంచి బోపయ్య గెలిచారు. 2009లోనూ ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించారు. నియమ నిబంధనల ప్రకారమే ప్రొటెం స్పీకర్ నియామకం జరిగిందని కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్ అన్నారు. ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గతంలోనూ ఆయనను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ ఆరోపణల్లో పసలేదని కొట్టిపారేశారు. -
ప్రొటెం స్పీకర్‌గా చౌదరి ఫతే సింగ్
సాక్షి, న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, గోకుల్‌పురి ఎమ్మెల్యే చౌదరి ఫతే సింగ్ ఢిల్లీ అసెంబ్లీ ఆరో ప్రొటెం స్పీకర్ కానున్నారు. ఎమ్మెల్యేలందరిలోకి సీనియర్ అయిన ఆయనను ప్రొటెం స్పీకర్ చేయాలని ఆప్ నిర్ణయించింది. చౌదరి 1993 తొలి అసెంబ్లీలో బీజేపీ తరఫున నందనపురి ఎమ్మెల్యేగా పనిచేశారు. ఫిబ్రవరి 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు ఢిల్లీ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్నాయి. మొదటి రోజు ప్రొటెం స్పీకర్ శాసనసభకు ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఫిబ్రవరి 24న స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరగనుంది. షహదరా ఎమ్మెల్యే రామ్ నివాస్ గోయల్‌ను స్పీకర్‌గా, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే వందనా కుమారిని డిప్యూటీ స్పీకర్‌గా నియమించాని ఆప్ నిర్ణయించింది. -
ప్రొటెం స్పీకర్‌పై పీటముడి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రభుత్వం ఏర్పాటు తరువాత విధానసభ ప్రొటెం స్పీకర్ ఎవరవుతారనే విషయంపై పీటముడిపడింది. ప్రొటెం స్పీకర్ పదవీబాధ్యతలు స్వీకరించడానికి బీజేపీ సీనియర్ నాయకుడు జగ్దీశ్ముఖి తిరస్కరించారు. మరోవైపు ఈ పదవిని స్వీకరించడానికి జనతాదళ్ యూ సభ్యుడు షోయబ్ ఇక్బాల్ కూడా సిద్ధంగా లేరు. జనవరి ఒకటో తేదీ నుంచి విధానసభ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రొటెం స్పీకర్ నియామకం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్.. బీజేపీ ఎమ్మెల్యే జగ్దీశ్ముఖిని ప్రొటెం స్పీకర్‌గా నియమించినప్పటికీ ఆయన ఈ పదవీ బాధ్యతలు స్వీకరించ డానికి నిరాకరించారు. పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ ప్రొటెం స్పీకర్ పదవిని స్వీకరించరాదని అధిష్టానం నిర్ణయించిందని ముఖి చెప్పారు. దీంతో ఈ విషయాన్ని విధానసభ కార్యదర్శికి తెలియజేసినట్లు ఆయన చెప్పారు. విధానసభ లో అత్యంత సీనియర్ శాసనసభ్యుడిని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఈమేరకు ఎల్జీ... జగ్దీశ్ ముఖిని ప్రొటెం స్పీకర్‌గా నియమించారు. ప్రొటెం స్పీకర్‌తో ఎల్జీ ప్రమాణస్వీకారం చేయిస్తారు ఆ తరువాత ప్రొటెం స్పీకర్ కొత్తగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రమాణస్వీకారం చేయిస్తారు. ఆ తరువాత శాసనసభ్యులు స్పీకర్‌ను ఎన్నుకుంటారు. అయితే ఈ ఆనవాయితీకి భిన్నంగా స్పీకర్ ఎన్నికకు మునుపే విధానసభలో తమ బలాన్ని నిరూపించుకోవాలని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన ప్రభుత్వం అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోరాదనే నిబంధన ఏదీ లేనప్పటికీ సాధారణంగా స్పీకర్, డిప్యూటీ స్పీకర్ల ఎన్నిక పూర్తయ్యాక ప్రభుత్వం విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. అయితే ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టిన తరువాత స్పీకర్ ఎన్నిక జరిపించాలని ఆప్ ప్రభుత్వం నిర్ణయించడం రాజకీయ పండితులకు కూడా ఆశ్చర్యం కలిగించింది. 2005లో జార్ఖండ్‌లో కోర్టు ఆదేశాల మేరకు ప్రొటెం స్పీకర్ విశ్వాస తీర్మాన ప్రక్రియను నిర్వహించారని రాజకీయ పండితులు ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు. జనవరి ఒకటి నుంచి ఏడో తేదీ దాకా విధానసభ సమావేశాలు జరగనున్నా యి. ఒకటో తేదీన ప్రొటెం స్పీకర్ అధ్యక్షతన శాసనసభ్యుల ప్రమాణ స్వీకారం జరుగనుంది. రెండో తేదీన విశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాలని, మూడో తేదీన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక జరిపించాలని ఆప్ మంత్రిమండలి నిర్ణయించింది. స్పీకర్, డిప్యూటీ ఎన్నిక సమయంలో కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేయొచ్చనే భయంతో ఆప్ ప్రభుత్వం స్పీకర్ ఎన్నికను బలనిరూపణ తరువాత నిర్వహించాలని నిర్ణయించిందని అంటున్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేని ప్రొటెం స్పీకర్‌గా నియమించడం వల్ల శాసనసభ్యుల సంఖ్య 31కి తగ్గుతుందని, బలనిరూపణ సమయంలో తమ సంఖ్యాబలం తగ్గితే వారికి అనుకూలంగా ఉంటుందనే ఉద్దేశంతోనే స్పీకర్ ఎన్నికను మూడో తేదీన నిర్వహించాలని ఆప్ నిర్ణయించిందని బీజేపీ వర్గాలు అంటున్నాయి.మతీన్‌కు పదవికాంగ్రెస్ ఎమ్మెల్యే మతీన్ అహ్మద్ ప్రొటెం స్పీక ర్ అవుతారని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా ల్ మంగళవారం ప్రకటించారు. ‘మేము మతీన్ పేరును ప్రతిపాదించాం. ఆయనే ప్రొటెం స్పీకర్ అవుతారు’ అని పేర్కొన్నారు.