
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు.
సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్‌లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment