Mumtaz Ahmad khan
-
చార్మినార్ నియోజకవర్గం తదుపరి అధికార పార్టీ..?
చార్మినార్ నియోజకవర్గం మజ్లిస్ పార్టీ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్ పురాకు మారి నాలుగోసారి విజయంసాదించగా, అహ్మద్‌ఖాన్ చార్మినార్ నుంచి గెలవడం విశేషం. అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచారు. ఆతర్వాత మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తున్నారు. అహ్మద్ ఖాన్ తన సమీప బిజెపి ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మహ్మద్ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్ ఖాన్ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్ పక్షంవారే. మజ్లిస్ పక్షానికి ఎన్నికల సంఘం గుర్తింపు లేనప్పుడు వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలుపొందారు. మజ్లిస్ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఓవైసీ 1967, 1978, 83లలో చార్మినార్ నుంచి, 1962లో ఫత్తర్‌గట్టి నుంచి, 1972లో యాకుత్‌పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడిరచి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి, ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు. సలావుద్దీన్ ఓవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు శాసనసభకు హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నాలుగుసార్లు గెలుపొందారు. రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీ 1999 నుంచి ఐదుసార్లు చాంద్రా యణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా చట్టసభలలో ఉండడం కూడా ఒక అరుదైన రికార్డు. 1989లో చార్మినార్‌లో గెలుపొందిన విరాసత్ రసూల్‌ఖాన్ అంతకుముందు రెండుమార్లు అసిఫ్‌నగర్ నుంచి 2009లో నాంపల్లి నుంచి విజయం సాధించారు. చార్మినార్‌లో గెలిచినవారంతా ముస్లింలే కావడం విశేషం. చార్మినార్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే..
-
ఏసీపీని అడ్డుకున్న ఎమ్మెల్యే; తీవ్ర విమర్శలు
సాక్షి, హైదరాబాద్ : చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విధుల్లో భాగంగా పాతబస్తీలోని శాలిబండలో కార్డెన్ సెర్చ్ నిర్వహిస్తున్న ఫలక్‌నుమా ఏసీపీ మహ్మద్ మజీద్‌ని ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్, ఎంఐఎం నేతలు సీఏఏ వంకతో అడ్డుకున్నారు. ప్రజలందరి ముందే ఎమ్మెల్యే ఏసీపీ మహ్మద్ మజీద్‌ని నిలదీశారు. దీంతో ఏసీపీ, సిబ్బంది చేసేదేం లేక తిరిగి వెనక్కి వెళ్లిపోయారు. కాగా, పోలీసుల తీరుపైనా ప్రజలు మండిపడుతున్నారు. ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. తెలంగాణ పోలీసులకే తలవంపులు వచ్చాయని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండానే పోలీసులు వెనుదిరిగారని ఎద్దేవా చేస్తున్నారు. -
ప్రమాణ స్వీకారానికి రాజాసింగ్ దూరం!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో గురువారం జరుగనున్న ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారోత్సవానికి దూరంగా ఉంటా నని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పునరుద్ఘాటించారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే, ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ ముందు తాను ప్రమాణం చేయనని బుధవారం ‘సాక్షి’తో పేర్కొన్నారు. ఇదే అంశంపై ఈనెల 6న వాట్సాప్ వీడియోను విడుదల చేసిన రాజాసింగ్ బుధవారం పునరుద్ఘాటించారు. తాను గురువారం అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు. -
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: శాసనసభ ప్రొటెం (తాత్కాలిక) స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్‌ఖాన్ బుధవారం సాయంత్రం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌హాల్‌లో నిరాడంబరంగా జరిగిన ఈ కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ ఇ.ఎస్.ఎల్ నరసింహన్ ప్రమాణం చేయించారు. అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహాచార్యులు తాత్కాలిక స్పీకర్ నియామకానికి సంబంధించిన నోటిఫికేషన్‌ను చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్ ‘ప్రమాణపత్రం’పై గవర్నర్ సమక్షంలో సంతకం చేశారు. గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు, మాజీ స్పీకర్ ఎస్. మధుసూదనాచారి తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శాసనమండలి చైర్మన్ వి. స్వామిగౌడ్, హోంమంత్రి మహమూద్ అలీ, ఎంపీలు అసదుద్దీన్ ఒవైసీ, బి. వినోద్ కుమార్, జి. సంతోష్ కుమార్, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బి. వెంకటేశ్వర్లు, అమీన్ జాఫ్రీ, ఎమ్మెల్యేలు కొప్పుల ఈశ్వర్, సయ్యద్ అహ్మద్ పాషాఖాద్రీ, మహ్మద్ మోజంఖాన్, కౌసర్ మోహినుద్దీన్, అహ్మద్ బలాల, వి. శ్రీనివాస్‌గౌడ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. ఎస్.కె. జోషి, సాధారణ పరిపాలనశాఖ ముఖ్య కార్యదర్శి అధర్ సిన్హా, ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ మహేందర్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం
సాక్షి, హైదరాబాద్: ఎంఐఎం పార్టీ సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్ తెలంగాణ అసెంబ్లీకి ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ అహ్మద్ ఖాన్‌తో బుధవారం సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీలో సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీగా వస్తోంది. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించిన సంగతి తెలిసిందే. జనవరి 17 నుంచి నాలుగు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ స్పీకర్ మధుసూధనాచారి, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ తదితరులు పాల్గొన్నారు. (ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్) కాగా, నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ముంతాజ్ అహ్మద్ ఖాన్ రేపు (గురువారం) ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారానికి ముందు ఉదయం 11 గంటలకు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్ద కేసీఆర్ నివాళులు అర్పిస్తారు. కేసీఆర్‌తో పాటు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అసెంబ్లీలో జరిగే కార్యక్రమాల్లో కేసీఆర్ పాల్గొంటారు. రేపు స్పీకర్ ఎన్నికల షెడ్యుల్ ప్రకటన విడుదల చేస్తారు. ఎల్లుండి స్పీకర్‌ను ఎన్నుకుంటారు. 19వ తేదీన తెలంగాణ అసెంబ్లీని ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. గవర్నర్ ప్రసంగంపై 20 తేదీన అసెంబ్లీలో ధన్యవాద తీర్మానం ప్రవేశపెడతారు. -
రేపు ప్రోటెం స్పీకర్ ప్రమాణం
సాక్షి, హైదరాబాద్: మజ్లిస్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ బుధవారం ప్రోటెం స్పీకర్‌గా ప్రమాణస్వీకారం చేయనున్నారు. చార్మినార్ స్థానం నుంచి గెలిచిన ముంతాజ్ అహ్మద్.. గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ రాజ్‌భవన్‌లో సాయంత్రం 5 గంటలకు ప్రమాణస్వీకారం చేయించనున్నారు. ప్రోటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ అధ్యక్షతన గురువారం 11.30 గంటలకు కొత్త శాసనసభ కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. నూతనంగా ఎన్నికైన శాసనసభ సభ్యులతో ప్రోటెం స్పీకర్ ప్రమాణం చేయించనున్నారు. రెండుగంటల పాటు కొనసాగే ఈ కార్యక్రమం తర్వాత.. మధ్యాహ్నం జూబ్లీహాల్ ప్రాంగణంలోని కౌన్సిల్ లాన్స్‌లో శాసనసభ సభ్యులకు ప్రభుత్వం విందు ఏర్పాటుచేసింది. అనంతరం అదేరోజు.. స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ల స్వీకరణ జరపనున్నారు. జనవరి 18న స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారు. తర్వాత కొత్త స్పీకర్ అధ్యక్షతన సభాకార్యక్రమాలు సాగుతాయి. స్పీకర్ అధ్యక్షతన శాసనసభ సలహా సంఘం (బీఏసీ) సమావేశమై ఉభయసభలనుద్దేశించి గవర్నర్ ప్రసంగంపై (19న) నిర్ణయం తీసుకోనుంది. జనవరి 20న గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం జరుగుతుంది. మొత్తంగా జనవరి 17 నుండి 20 వరకు శాసనసభ కార్యకలాపాలు జరగనున్నాయి. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం సాధించి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కేసీఆర్.. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఏకాదశినాడు (జనవరి 17న) శాసనసభ కార్యకలాపాలు ఆరంభించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. -
శాసనసభ స్పీకర్‌గా పోచారం!
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డిని శాసనసభ స్పీకర్‌గా నియమించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు భావిస్తున్నారు. బాన్సువాడ అసెంబ్లీ స్థానం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన పోచారం శ్రీనివాస్‌రెడ్డి పలు కీలక శాఖలకు మంత్రిగా పనిచేశారు. సీనియర్ శాసనసభ్యుడిగా శ్రీనివాస్‌రెడ్డికి ఉన్న అనుభవం శాసనసభ నిర్వహణకు బాగా ఉపయోగపడుతుందని కేసీఆర్ యోచిస్తున్నారు. ఆంగ్లంపై శ్రీనివాస్‌రెడ్డికి పట్టు ఉండటంతో సభ నిర్వహణలో కూడా ఇబ్బందులు ఉండవనే ఉద్దేశంతో టీఆర్ఎస్ అధినేత ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరిన పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉంటున్నారు. కేసీఆర్ గత ప్రభుత్వంలోనూ పోచారానికి కీలకమైన వ్యవసాయ శాఖను అప్పగించారు. శ్రీనివాస్‌రెడ్డిని ఉన్నతమైన పదవిలో నియమించే యోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ రోజు దగ్గర పడుతుండటంతో కొత్త స్పీకర్ ఎన్నికపై కేసీఆర్ దృష్టి సారించారు. స్పీకర్ పదవి కోసం పోచారంతో పాటు మరో నలుగురు సీనియర్ ఎమ్మెల్యేల పేర్లను కూడా ఆయన పరిశీలిస్తున్నారు. మహిళలకు ఈ పదవిని ఇవ్వాలని భావిస్తే మెదక్ ఎమ్మెల్యే ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, బీసీ వర్గాలకు అయితే ఈటల రాజేందర్, ఎస్సీ వర్గానికి ఇవ్వాల్సి వస్తే కొప్పుల ఈశ్వర్, ఎస్టీ వర్గం నుంచి డి.ఎస్. రెడ్యానాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, కేసీఆర్ మాత్రం పోచారం వైపే మొగ్గు చూపుతున్నారని, చివరి నిమిషంలో సమీకరణలు మారితే తప్ప శ్రీనివాస్‌రెడ్డి నియామకం ఖాయమేనని టీఆర్ఎస్ అధిష్టాన వర్గాలు చెబుతున్నాయి. తాత్కాలిక స్పీకర్ నియామకం ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను తాత్కాలిక స్పీకర్‌గా నియమిస్తూ రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తిస్థాయి స్పీకర్ ఎన్నిక జరిగే వరకు ముంతాజ్‌ఖాన్ ఈ బాధ్యతలను నిర్వహిస్తారని, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహిస్తారని మంగళవారం ఇచ్చిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా తాత్కాలిక స్పీకర్ ముంతాజ్ అహ్మద్‌ఖాన్‌ను అసెంబ్లీ కార్యదర్శి వి.నర్సింహచార్యులు కలసి శుభాకాంక్షలు తెలిపారు. -
ఎంఐఎం ఎమ్మెల్యే ముందు ప్రమాణం చేయను
సాక్షి, హైదరాబాద్: ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ఎంపిక చేయడం సరైంది కాదని, ఆయన ముందు తాను ప్రమాణం చేయనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ప్రకటించారు. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉండే ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో తాను ప్రమాణం చేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన వాట్సాప్‌లో ఓ వీడియోను విడుదల చేశారు. ఆ వీడియోలో ఏముందంటే...! ‘ప్రొటెం స్పీకర్‌గా ఒక ఎంఐఎం ఎమ్మెల్యేను పెడుతున్నారు. ఆ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో అందరూ ప్రమాణ స్వీకారం చేయాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు. ఎలాంటి పార్టీకి ఓటేశారో, ఎలాంటి వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశారో ఇప్పుడు ప్రజలు గమనించాలి. రానున్న కాలంలో ఇంకా ఏం జరుగుతుందో మీరే చూస్తారు. ఈనెల 17న అందరు ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ, ఆయన ముందు నేను ప్రమాణ స్వీకారం చేయను. నేను అసెంబ్లీకే పోను. లీగల్‌గా ఏమవుతుందో చూసుకుంటా. హిందూ ధర్మం పట్ల వ్యతిరేకంగా ఉన్న పార్టీ, దేశంలో ఉన్న 100 కోట్ల మంది హిందువులను చంపేస్తా అని చెప్పిన ఎమ్మెల్యేలున్న పార్టీ నుంచి ఓ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్ చేయడం సిగ్గుచేటు. నేనయితే ఎట్టి పరిస్థితుల్లో అలాంటి వ్యక్తుల ముందు ప్రమాణం చేయను. ఏకపక్షంగా మీరు గెలిచారు. ఎలాంటి వ్యక్తులను ముందుకు తీసుకెళ్లాలో, ఎలాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయాలో సీఎం ఆలోచించాలి. తెలంగాణలో హిందువులు, ముస్లింలను కలుపుకుని వెళ్లాలి. కానీ, దేశం పట్ల, హిందూ ధర్మం పట్ల వారి విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవాలి. సీఎం నిర్ణయాన్ని మార్చుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి’అని వాట్సాప్ వీడియోలో రాజాసింగ్ చెప్పారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
-
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే.. రాజాసింగ్ తీవ్ర నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: తాజాగా జరిగిన ఎన్నికల్లో బీజేపీ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి వివాదాస్పద నిర్ణయం తీసుకున్నారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు, ప్రసంగాలతో కరడుగట్టిన హిందుత్వవాదిగా ముద్రపడిన ఆయన.. ప్రొటెం స్పీకర్ ఆధ్వర్యంలో ప్రమాణం స్వీకారం చేయరాదని నిర్ణయించారు. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ఎంఐఎం సీనియర్ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంఐఎం హిందూధర్మానికి వ్యతిరేకమైన పార్టీ అని, అందుకే ఆ పార్టీ నేత ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేయరాదని నిర్ణయించానని ఆయన ఒక వీడియోలో తెలిపారు. అవసరమైతే ఈ విషయాన్ని చట్టబద్ధంగా ఎదుర్కోవడానికీ సిద్ధంగా ఉన్నానన్నారు. కొత్త స్పీకర్ ఎన్నికైన తర్వాత ఆయన ఆధ్వర్యంలో ప్రమాణస్వీకారం చేస్తానని రాజాసింగ్ తెలిపారు. -
ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్
-
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల షెడ్యూల్ విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నూతన అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. జనవరి 17 నుంచి 20 వరకు నూతనంగా ఏర్పడిన సభ తొలిసారి సమావేశం కానుంది. ఈ మేరకు సీఎం కార్యాలయం నుంచి శనివారం ప్రకటన విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందుగా శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం నేత, చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు నియమితులుకానున్నారు. జనవరి 16న సాయంత్రం 5 గంటలకు రాజ్‌భవన్‌లో ఆయనచే గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించనున్నారు. మర్నాడే (జనవరి 17న) నూతనంగా ఎన్నికైన సభ్యులతో అసెంబ్లీలో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ప్రమాణ స్వీకారం అనంతరం జూబ్లీహాల్లో సభ్యులకు విందు కార్యక్రమం ఉంటుంది. అదే రోజున శాసనసభ స్పీకర్ ఎన్నిక షెడ్యూల్ ప్రకటన, నామినేషన్ స్వీకరణ కార్యక్రమాలు జరుగుతాయి. జనవరి 18న సభ్యులు శాసనసభ స్పీకర్‌ను ఎన్నుకుంటారు. ఎన్నిక అనంతరం నూతన స్పీకర్ అధ్యక్షతన సభా కార్యక్రమాలు సాగుతాయి. అనంతరం స్పీకర్ బీఎసీ సమావేశాన్ని నిర్వహిస్తారు. జనవరి 19న నూతనంగా ఏర్పడిన సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆ మర్నాడే గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదం తెలిపే తీర్మానాన్ని ప్రవేశపెట్టడం, దానికి సభ ఆమోదం తెలపడం కార్యక్రమం జరుగుతుంది. కాగా డిసెంబర్ 11న వెలువడిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ 88 స్థానాల్లో విజయం సాధించి చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 13న కేసీఆర్ రెండోసారి సీఎంగా పదవీ ప్రమాణస్వీకారం చేశారు. వివిధ కారణాల వల్లన శాసన సభ్యుల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తూ వచ్చారు. -
ఎంఐఎం ఎమ్మెల్యేకు అరుదైన చాన్స్.. కేసీఆర్‌కు ఒవైసీ థాంక్స్
సాక్షి, హైదరాబాద్: చార్మినార్ నియోజకవర్గం నుంచి వరుసగా ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీనియర్ ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. తెలంగాణ అసెంబ్లీలో ఆయన ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారు. నూతనంగా ఎన్నికైన శాసనసభ్యులతో ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. అంతేకాకుండా కొత్త స్పీకర్ ఎన్నికయ్యేవరకు ప్రొటెం స్పీకర్ సభను నిర్వహిస్తారు. సాధారణంగా సీనియర్ ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ. ఆ సంప్రదాయాన్ని పాటిస్తూ.. ఆరుసార్లు ఎమ్మెల్యే అయిన ముంతాజ్ అహ్మద్ ఖాన్‌ను సీఎం కేసీఆర్ ప్రొటెం స్పీకర్‌గా ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అసదుద్దీన్ ఒవైసీ ట్విటర్లో ధ్రువీకరించారు. ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరించనున్నారని, ఇందుకుగాను ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞుడినై ఉంటానని ఆయన ట్విట్ చేశారు. -
నుమాయిష్ కళకళ