చార్మినార్ నియోజకవర్గం
మజ్లిస్ పార్టీ నేత ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్ నియోజకవర్గం నుంచి ఆరోసారి గెలిచారు. అంతకుముందు ఆయన యాకుత్ పుర నుంచి ఐదుసార్లు గెలిచారు. చార్మినార్‌లో గతంలో మూడుసార్లు గెలిచిన ఖాద్రీ పాషా యాకూత్ పురాకు మారి నాలుగోసారి విజయంసాదించగా, అహ్మద్‌ఖాన్ చార్మినార్ నుంచి గెలవడం విశేషం. అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచారు. ఆతర్వాత మజ్లిస్‌లో చేరి వరసగా గెలుస్తున్నారు.
అహ్మద్ ఖాన్ తన సమీప బిజెపి ప్రత్యర్ది ఉమా మహేంద్ర పై 32886 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక్కడ కాంగ్రెస్ ఐ తరపున పోటీచేసిన మహ్మద్ గౌస్‌కు 15700 ఓట్లు వచ్చాయి. ముంతాజ్ అహ్మద్ ఖాన్‌కు 53808 ఓట్లు రాగా, ఉమా మహేంద్ర కు 21222 ఓట్లు వచ్చాయి.అహ్మద్ ఖాన్ ముస్లిం నేత. హైదరాబాద్‌లోని చారిత్రాత్మకమైన చార్మినార్ శాసనసభ నియోజకవర్గంలో 1967 నుంచి కేవలం మజ్లిస్ పక్షమే గెలుస్తోంది. కొన్నిసార్లు ఇండిపెండెంట్లు గెలిచినట్లు రికార్డులు చెబుతున్నా, ఆ ఇండిపెండెంట్లు కూడా మజ్లిస్ పక్షంవారే.
మజ్లిస్ పక్షానికి ఎన్నికల సంఘం గుర్తింపు లేనప్పుడు వారు ఇండిపెండెంట్లుగా పోటీచేసి గెలుపొందారు. మజ్లిస్ ప్రధాన నాయకుడు, దివంగత సలావుద్దీన్ ఓవైసీ 1967, 1978, 83లలో చార్మినార్ నుంచి, 1962లో ఫత్తర్‌గట్టి నుంచి, 1972లో యాకుత్‌పురా నుంచి గెలుపొందారు. 1962లో అప్పటి మంత్రి మాసూనా బేగంను ఓడిరచి చట్టసభలో ప్రవేశించారు. అప్పటి నుంచి ఓటమి ఎరుగని నేతగా ఐదుసార్లు అసెంబ్లీకి, ఆ తర్వాత 1984 నుంచి 1999 వరకు జరిగిన లోక్‌సభ ఎన్నికలలో ఆరుసార్లు గెలుపొందారు.
సలావుద్దీన్ ఓవైసీ పెద్దకుమారుడు అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్‌లో రెండుసార్లు శాసనసభకు హైదరాబాద్ లోక్‌సభ స్థానానికి నాలుగుసార్లు గెలుపొందారు. రెండో కుమారుడు అక్బరుద్దీన్ ఓవైసీ 1999 నుంచి ఐదుసార్లు చాంద్రా యణగుట్ట నుంచి శాసనసభకు ఎన్నికయ్యారు. 1999లో తండ్రి, ఇద్దరు కుమారులు కూడా చట్టసభలలో ఉండడం కూడా ఒక అరుదైన రికార్డు. 1989లో చార్మినార్‌లో గెలుపొందిన విరాసత్ రసూల్‌ఖాన్ అంతకుముందు రెండుమార్లు అసిఫ్‌నగర్ నుంచి 2009లో నాంపల్లి నుంచి విజయం సాధించారు. చార్మినార్‌లో గెలిచినవారంతా ముస్లింలే కావడం విశేషం.
చార్మినార్ నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment