యాకూత్‌పుర నియోజకవర్గం
యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మజ్లిస పక్ష అభ్యర్దిగా అహ్మద్ పాషా ఖాద్రి నాలుగోసారి గెలిచారు. ఆయన అంతకుముందు మూడుసార్లు చార్మినార్ నుంచి విజయం సాదించారు. యాకుత్‌పుర నుంచి ఐదుసార్లు గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్‌కు మారి ఆరోసారి గెలవగా, అక్కడ నుంచి యాకుత్‌పురాకు ఖాద్రి మారి నాలుగో సారి గెలిచారు. ఫాషా ఖాద్రి తన సమీప టిఆర్‌ఎస్ అభ్యర్ది సామా సుందర్ రెడ్డిపై 46978 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. ఫాషా ఖాద్రీకి 59595 ఓట్లు రాగా, సుందర్‌రెడ్డికి 22517 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్.బి.టి పక్షాన పోటీచేసిన మజీదుల్లాఖాన్‌కు 20400 ఓట్లు వచ్చాయి.
అహ్మద్ పాషా ఖాద్రి ముస్లిం వర్గం నేత. 1957, 1962లలో మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. 1962 నుంచి ఇక్కడ ఆ పార్టీకి అవకాశం రాలేదు. 1972లో ఇక్కడ గెలిచిన సలాఉద్దీన్ ఓవైసీ చార్మినార్, పత్తర్‌గట్టిల నుంచి మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆరుసార్లు గెలుపొందారు. 1985, 89లలో గెలిచిన మస్కతి, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి దూరం అయి, తర్వాతకాలంలో టిడిపి తరుపున శాసన మండలికి ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచి, ఆ తర్వాత ఐదుసార్లు మజ్లిస్ పక్షాన గెలిచారు.
యాకూత్‌పుర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే..
Comments
Please login to add a commentAdd a comment