pasha
-
యాకుత్‌పురా నిజయోకవర్గానికి తదుపరిగా ఎన్నికయ్యేది ఎవరు..?
యాకూత్‌పుర నియోజకవర్గం యాకుత్‌పురా నియోజకవర్గం నుంచి మజ్లిస పక్ష అభ్యర్దిగా అహ్మద్ పాషా ఖాద్రి నాలుగోసారి గెలిచారు. ఆయన అంతకుముందు మూడుసార్లు చార్మినార్ నుంచి విజయం సాదించారు. యాకుత్‌పుర నుంచి ఐదుసార్లు గెలిచిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ చార్మినార్‌కు మారి ఆరోసారి గెలవగా, అక్కడ నుంచి యాకుత్‌పురాకు ఖాద్రి మారి నాలుగో సారి గెలిచారు. ఫాషా ఖాద్రి తన సమీప టిఆర్ఎస్ అభ్యర్ది సామా సుందర్ రెడ్డిపై 46978 ఓట్ల మెజార్టీతో విజయం సాదించారు. ఫాషా ఖాద్రీకి 59595 ఓట్లు రాగా, సుందర్‌రెడ్డికి 22517 ఓట్లు వచ్చాయి. ఇక్కడ ఎమ్.బి.టి పక్షాన పోటీచేసిన మజీదుల్లాఖాన్‌కు 20400 ఓట్లు వచ్చాయి. అహ్మద్ పాషా ఖాద్రి ముస్లిం వర్గం నేత. 1957, 1962లలో మాత్రమే కాంగ్రెస్ ఇక్కడ గెలిచింది. 1962 నుంచి ఇక్కడ ఆ పార్టీకి అవకాశం రాలేదు. 1972లో ఇక్కడ గెలిచిన సలాఉద్దీన్ ఓవైసీ చార్మినార్, పత్తర్‌గట్టిల నుంచి మరో నాలుగుసార్లు గెలిచారు. ఈయన హైదరాబాద్ లోక్‌సభ స్థానం నుంచి ఆరుసార్లు గెలుపొందారు. 1985, 89లలో గెలిచిన మస్కతి, ఆ తర్వాత కాలంలో ఆ పార్టీకి దూరం అయి, తర్వాతకాలంలో టిడిపి తరుపున శాసన మండలికి ఎన్నికయ్యారు. ముంతాజ్ అహ్మద్ ఖాన్ 1994లో ఎమ్.బి.టి తరపున గెలిచి, ఆ తర్వాత ఐదుసార్లు మజ్లిస్ పక్షాన గెలిచారు. యాకూత్‌పుర నియోజకవర్గంలో గెలిచిన.. ఓడిన అభ్యర్థులు వీరే.. -
నెట్‌బాల్ జట్ల సారథులుగా పాషా, హారిక
సాక్షి, హైదరాబాద్: జాతీయ సీనియర్ నెట్‌బాల్ చాంపియన్‌షిప్‌లో పాల్గొనే రాష్ట్ర జట్లను గురువారం ప్రకటించారు. పురుషుల జట్టుకు సయ్యద్ అథర్ పాషా, మహిళల జట్టుకు ఆనంద హారిక సింగ్ కెప్టెన్లుగా వ్యవహరిస్తారు. ఈ టోర్నీ ఢిల్లీలో డిసెంబర్ 31 నుంచి జనవరి 3 వరకు జరుగుతుంది. జట్ల వివరాలు: పురుషుల జట్టు: అథర్ పాషా (కెప్టెన్), నిజామ్, సాయి కిషోర్, రాజేందర్, శ్రీకాంత్, ఓంప్రకాశ్, విజయ్ కుమార్, నాగ హర్ష, ప్రసన్న, రాజశేఖర్, సందీప్, పవన్, బాలరాజు (కోచ్), సమ్మయ్య (మేనేజర్). మహిళల జట్టు: హారిక (కెప్టెన్), పావని, శైలజ, సహజ, సంజన, నందిని, సంగీత, శిరీష, సుప్రియ, రజిత, భావన, శ్రీజ, షేక్ అహ్మద్ (కోచ్), నందు కుమార్ (మేనేజర్). -
విజేతలు పాషా, సుభాష్
జాతీయ కుంగ్-ఫు చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ కుంగ్-ఫు-వుషూ చాంపియన్‌షిప్‌లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నాసిక్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సహా ఆరు పతకాలను సాధించారు. అండర్-14 విభాగంలో 45-50 కేజీ కేటగిరీలో అబ్దుల్ పాషా... 41-45 కేజీ కేటగిరీలో పీఆర్‌ఎస్‌వీ సుభాష్ విజేతలుగా నిలిచి పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. 35-40 కేజీ కేటగిరీలో కేశవ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అండర్-15 విభాగంలో నరేశ్ (50-55కేజీ) రజతాన్ని సంపాదించగా... వెంకటేశ్ (65-75కేజీ), మొహమ్మద్ ఖాజా పాషా (50-55 కేజీ) కాంస్య పతకాలను గెలుచుకున్నారు. -
లారీ-ఆటో ఢీ.. ఇద్దరి మృతి
ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ఘటనలో ఇద్దరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తిరుమలగిరి మండలం తొండ గ్రామ సమీపంలో బుధవారం చోటుచేసుకుంది. తిరుమలగిరి నుంచి తొర్రూరు వైపు వె ళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ప్రయాణికుల ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో డ్రైవర్ పాషా(30)తో పాటు ఐలమ్మ(58) అనే మహిళ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
నర్సాపూర్ పోస్టాఫీసులో చోరీ
నర్సాపూర్ రూరల్, న్యూస్‌లైన్ : పట్టణంలోని పోస్టాఫీసులో దొంగలు చొరబడి కొంత నగదు, స్టాంపులు ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు.. సోమవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పోస్టాఫీసు వెనుక వైపు గల ప్రహారీ నుంచి దిగి తలుపులు ధ్వంసం చేసి లోనికి చొరబడ్డారు. ఈ సందర్భంగా రూ. 19 వేల 750 చినిగిన నోట్లు భద్ర పరిచిన బాక్స్‌ను ఎత్తుకెళ్లగా మరో బాక్స్‌ను ధ్వంసం చేసి రూ. 5,600 నగదును తీసుకెళ్లారు. దీంతో పాటు రూ.740 విలువ గల రెవెన్యూ స్టాంపులు, రూ. 6,370 పోస్టల్ స్టాంపులతో పాటు సుమారు రూ.74 వేల విలువ గల సేవింగ్ బాండ్లను ఎత్తుకెళ్లారు. ఉదయం స్వీపర్ పాష డోరు తాళాలు తీసి కార్యాలయాన్ని శుభ్రం చేసేందుకు ఉపక్రమించిగా వెనుక డోర్లు తెరుచుకుని ఉండడాన్ని గమనించి పోస్టుమాస్టర్ రాంకుమార్‌కు ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. ఆయన పోస్టాఫీసుకు చేరుకుని పోయిన వస్తువులను పరిశీలించి వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి పోస్టాఫీసును పరిశీలించారు. పోస్టాఫీసును పరిశీలించిన సూపరింటెండెంట్ చోరీ జరిగిన విషయాన్ని తెలుసుకున్న సంగారెడ్డి హెడ్ పోస్టాఫీసు సూపరింటెండెంట్ జనార్దనరెడ్డి ఇతర సిబ్బంది స్థానిక పోస్టాఫీసుకు చేరుకుని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు.