విజేతలు పాషా, సుభాష్ | pasha, subhash clinch kung fu titles | Sakshi
Sakshi News home page

విజేతలు పాషా, సుభాష్

Published Thu, Nov 10 2016 11:10 AM | Last Updated on Mon, Sep 4 2017 7:44 PM

pasha, subhash clinch kung fu titles

జాతీయ కుంగ్-ఫు చాంపియన్‌షిప్


సాక్షి, హైదరాబాద్: జాతీయ కుంగ్-ఫు-వుషూ చాంపియన్‌షిప్‌లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నాసిక్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సహా ఆరు పతకాలను సాధించారు. అండర్-14 విభాగంలో 45-50 కేజీ కేటగిరీలో అబ్దుల్ పాషా... 41-45 కేజీ కేటగిరీలో పీఆర్‌ఎస్‌వీ సుభాష్ విజేతలుగా నిలిచి పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. 35-40 కేజీ కేటగిరీలో కేశవ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అండర్-15 విభాగంలో నరేశ్ (50-55కేజీ) రజతాన్ని సంపాదించగా... వెంకటేశ్ (65-75కేజీ), మొహమ్మద్ ఖాజా పాషా (50-55 కేజీ) కాంస్య పతకాలను గెలుచుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement