subhash
-
ఆచ్ఛాదనతో అధిక దిగుబడి!
సుభాష్ శర్మ(Subhash Sharma) కృషిపై 2018లో, హారిమన్ శర్మ విశేష కృషి గురించి 2017లోనే ‘సాక్షి సాగుబడి’లో కథనాలు ప్రచురించాం. ఈ ఏడాది వీరు పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన సందర్భంగా ఆ కథనాలను పునర్ముద్రిస్తున్నాం.మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేర్లు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన వేలాది మంది పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, ఈ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న అతి కొద్ది మంది ప్రకృతి వ్యవసాయదారులు కూడా అదృష్టవశాతూ అక్కడ ఉన్నారు. రసాయనాలను త్యజించి, నేల తల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్న అద్భుత ప్రకృతి వ్యవసాయదారుల్లో సుభాష్ శర్మ ఒకరు. ప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పోలం అంతా ఇలాగే వేయడం ద్వారా అధిక దిగుబడిని సాధించేవినూత్న పద్ధతిని ఆయన దీర్ఘకాలంగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మతో ‘సాక్షి సాగుబడి’ ముచ్చటించింది. ముఖ్యాంశాలు..సుభాష్ శర్మకు 66 ఏళ్లు. వ్యవసాయంలో 46 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడు, రైతుశాస్త్రవేత్త. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన ప్రజ్ఞతో ప్రకృతికి అనుగుణమైన సాగు పద్ధతులను రూపొందించుకున్నారు. కరువుకు, పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన మహారాష్ట్ర విదర్భలోని యవత్మాల్ జిల్లా (చోటి గుజారి) వితస గ్రామ వాస్తవ్యుడైన ఆయనకు 19 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న సుభాష్ శర్మ 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దరశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. ఆయనకున్న 3 ఎకరాలను ఆవులు, ఎద్దులు మేయడానికి కేటాయించి మిగతా పోలంలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేస్తున్నారు. ఏడాది పోడవునా ఏవో కొన్ని రకాల పంటలు సాగు చేస్తుంటారు.పత్తి/కంది సాళ్ల మధ్యలో పచ్చి రొట్ట పంటల సాగుపత్తి లేదా కంది సాగులో సుభాష్ శర్మ అధిక దిగుబడులు పొందుతున్న పద్ధతి ఆసక్తికరంగానే కాదు.. రైతులెవరైనా సులభంగా అనుసరించడానికి వీలుగానూ ఉంది. రెండు సాళ్లలో పత్తి లేదా కంది పంట, వాటి పక్కనే మూడు సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలను సాగు చేస్తారు. ప్రతి సాలుకు మధ్య 2 అడుగుల దూరం ఉంటుంది. ఈ ఐదు సాళ్లు 10 అడుగుల స్థలంలో ఉంటాయి. అంటే.. 4 అడుగుల్లో పంట, 6 అడుగుల్లో పచ్చిరొట్ట పంటలు పెరుగుతాయి. పత్తి లేదా కంది సాళ్ల మధ్య 2 అడుగులు, మొక్కల మధ్య అడుగున్నర దూరం ఉంటుంది. సాధారణంగా పత్తి సాగు చేసే రైతులు 4“2 అడుగుల దూరం పాటిస్తారు. 2“1.5 అడుగుల దూరాన వేస్తున్నందున ఎకరానికి వేసే మొక్కల సంఖ్య గానీ దిగుబడి గానీ తగ్గబోదని, ఎకరానికి కిలో పత్తి విత్తనాలు అవసరమవుతాయని సుభాష్ శర్మ అన్నారు. పచ్చిరొట్ట పంటలుగా ఎకరానికి 4 కిలోల సజ్జ, 6 కిలోల అలసంద, 15 కిలోల జనుము విత్తనాలను కలిపి వరుసలుగా బోదెలపై విత్తుతారు. పత్తి లేదా కంది సాళ్లలో కలుపును అతి చిన్నగా ఉన్నప్పుడే మనుషులు పీకేస్తారు లేదా కుర్ఫీతో తీసేస్తారు. నెలకోసారి కలుపు తీసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. మరీ అవసరమైతే పంట తొలిదశలో గుంటక తోలుతారు. కలుపు మొక్కలు చిన్నగా ఉన్నప్పుడే తీసేస్తే కలుపు తీత ఖర్చు 80% తగ్గుతుందని సుభాష్ శర్మ తెలిపారు. పచ్చిరొట్ట పంటలున్న సాళ్లలో కలుపు తియ్యరు. 45–50 రోజులు పెరిగిన తర్వాత పచ్చిరొట్ట పంట మొక్కలను, కలుపును కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఆ తర్వాత 30–35 రోజులు గడచిన తర్వాత మరోసారి కోసి అక్కడే ఆచ్ఛాదనగా వేస్తారు. ఈ రెండు సార్లూ ఆచ్ఛాదనగా వేసే పచ్చిరొట్ట మూరెడు ఎత్తున వస్తుంది. కాబట్టి, ఆచ్ఛాదనతో సత్ఫలితాలు వస్తున్నాయి.పచ్చిరొట్ట ఆచ్ఛాదనతో ప్రయోజనాలు..1. పంట పక్కనే పచ్చిరొట్టను కూడా పెంచడం వల్ల సూర్యరశ్మి పూర్తిగా వినియోగమవుతుంది. ఆచ్ఛాదన వల్ల నేలలో సేంద్రియ కర్బనంతో పాటు భూసారం పెరుగుతుంది. 2. పోలం అంతటా వత్తుగా పంటలు ఆవరించి ఉండటం వల్ల, ఆచ్ఛాదన వల్ల వర్షాలకు భూమి పైపోర మట్టి కొట్టుకుపోకుండా రక్షింపబడుతుందని తెలిపారు. 3. పచ్చిరొట్ట పంటలు ఎర పంటగా పనిచేస్తాయి. జీవ నియంత్రణ వల్ల చీడపీడలు కూడా అదుపులో ఉంటాయి. ప్రతి 75 మిత్రపురుగులకు 25 శతృపురుగుల చొప్పున పెరుగుతుంటాయి. మిత్రపురుగులు శతృపురుగులను తింటూ వాటి సంతతిని అదుపు చేస్తూ ఉంటాయి. పురుగుల మందులు, కషాయాలు కూడా చల్లాల్సిన అవసరం లేదని, ఆ ఖర్చంతా రైతుకు మిగిలిపోతుందని సుభాష్ శర్మ తెలిపారు. సూరజ్ సూటి రకం పత్తి గులాబీ పురుగును సైతం తట్టుకుంటుందన్నారు. 4. భూమిలో తేమ ఆరిపోకుండా ఎక్కువ కాలం నీటి ఎద్దడి రాకుండా చూస్తుంది. పత్తి వేర్లకు బోజనంతోపాటు తేమ కూడా దొరుకుతుంది. వర్షాలు మొహం చాటేసి మరీ ఇబ్బంది అయినప్పుడు ఒకటి లేక రెండు తడులు ఇస్తున్నామని సుభాష్ శర్మ వివరించారు. ఒక పంట కాలంలో పత్తి లేదా కంది సాళ్లు వేసిన చోట తదుపరి పంట కాలంలో పచ్చిరొట్ట పంటలు వేస్తామని, ఇప్పుడు పచ్చిరొట్ట విత్తనాలు చల్లిన చోట పత్తి లేదా కంది పంటలు వేస్తూ.. విత్తిన ప్రతిసారీ పంట మార్పిడి చేస్తారు.పత్తి 12, కంది 15 క్వింటాళ్ల దిగుబడిపత్తిని పచ్చిరొట్టతో కలిపి సాగు చేసే ప్రయోగంలో.. సూరజ్ (సూటి రకం) పత్తి తొలి ఏడాది ఎకరానికి 8 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. మూడో ఏడాదికి 12 క్వింటాళ్లకు పెరిగింది. మరో రెండు, మూడేళ్లలో 20 క్వింటాళ్లకు పెరుగుతుందని సుభాష్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. నల్లరేగడి నేలలో ఇది ఒకటి, రెండు తడులు ఇచ్చే పద్ధతిలో దిగుబడి వివరాలు. పూర్తిగా వర్షాధారంగా ప్రయోగాత్మక సాగు వచ్చే ఏడాది ప్రారంభిస్తామన్నారు సుభాష్ శర్మ. అదేవిధంగా, కంది స్థానిక సూటి రకాలను విత్తి 15–20 క్వింటాళ్ల దిగుబడి సాధిస్తున్నామని తెలిపారు. రైతులు ఈ పద్ధతి వెనుక దాగి ఉన్న శాస్త్రీయతను అర్థం చేసుకొని సాగు చేస్తే చక్కటి ఫలితాలు వస్తాయని, తక్కువ ఖర్చుతోనే అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందవచ్చని తెలిపారు. (సుభాష్ శర్మతో 94228 69620 హిందీలో మాట్లాడవచ్చు)ఆచ్ఛాదనలోని శాస్త్రీయతను అర్థం చేసుకోవాలిపత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో అనేక రకాల పచ్చిరొట్టను సాగు చేస్తే దిగుబడి పెరగడంతోపాటు భూసారం పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పత్తి మాదిరిగానే కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు. ప్రకృతి వ్యవసాయంలో ఈ విషయాలు చాలా కీలకం. రైతులు మనసుపెట్టి దీనిలో దాగి ఉన్న శాస్త్రీయతను సరిగ్గా అర్థం చేసుకోవాలి. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పోరబడకూడదు. రసాయనిక వ్యవసాయంలో కన్నా ప్రకృతి వ్యవసాయంలో అధిక దిగుబడి, అధికాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రసిద్ధ ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రఆచ్ఛాదన వల్ల అనేక ప్రయోజనాలుపంటల సాళ్ల పక్కనే పచ్చిరొట్ట పంటలను పెంచటం వల్ల చాలా స్థలం వృథా అయినట్లు పైకి కనిపిస్తుంది. కానీ, నిజానికి బహుళప్రయోజనాలు నెరవేరతాయి. దీని వెనుక ఉన్న శాస్త్రీయతను రైతులు సరిగ్గా అర్థం చేసుకోవాలని సుభాష్ శర్మ అంటారు. పోలం బెట్టకు రాకుండా భూమిలో తేమను పచ్చిరొట్ట పంటలు కాపాడతాయి. ఆ పంటలను కోసి, అక్కడే ఆచ్ఛాదనగా వేస్తే నేలలోని తేమ ఆరిపోకుండా ఉంటుంది. వాతావరణంలో నుంచి నీటి తేమను ఆచ్ఛాదనగా వేసిన గడ్డీ గాదం గ్రహించి భూమికి అందిస్తుంది. ఫలితంగా వానపాములు, సూక్ష్మజీవులు తమ కార్యకలాపాలను సజావుగా నిర్వర్తిస్తూ నేలను సారవంతం చేస్తూ ఉంటాయి. పత్తి లేదా కంది మొక్కల వేర్లు పక్క సాళ్లలో ఉన్న ఆచ్ఛాదన కిందికే చొచ్చుకు వచ్చి దాహాన్ని తీర్చుకోవడంతోపాటు పోషకాలను గ్రహిస్తాయి. ఈ విధంగా పచ్చిరొట్ట సాగు వల్ల పత్తి లేదా కంది పంట దిగుబడి పెరుగుతుంది. -
వికసించిన వ్యవసాయ పద్మాలు
వ్యవసాయ రంగంలో విశేష కృషి చేస్తున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త సుభాష్ శర్మ (మహారాష్ట్ర)తో పాటు హారిమన్ శర్మ (హిమాచలప్రదేశ్), ఎస్. హాంగ్‌థింగ్ (నాగాలాండ్)లకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. సుభాష్ శర్మ పత్తి రైతుల ఆత్మహత్యలకు నిలయమైన యవత్మాల్ జిల్లాలో అనేక దశాబ్దాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ, రైతులకు ఆచరణాత్మక శిక్షణ ఇస్తున్నారు. హిమాచలప్రదేశ్‌కు చెందిన హారిమన్ శర్మ ఆపిల్ సాగును కొండప్రాంతాల నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. సాధారణ ఉష్ణోగ్రతలోనూ పండే ఆపిల్ వంగడాలను అభివృద్ధి చేశారు. నాగాలాండ్‌కు చెందిన హాంగ్‌థింగ్ అధికాదాయాన్నిచ్చే కొత్త పంటలను అక్కడి రైతులకు అందుబాటులోకి తెచ్చారు. పద్మశ్రీ పురస్కారాన్ని అందుకోబోతున్న ఈ భూమిపుత్రులకు తెలుగు రైతుల తరఫున శుభాకాంక్షలు చెబుతోంది ‘సాక్షి సాగుబడి’. వారి కృషి గురించి కొన్ని వివరాలు.కరువు సీమలో కాంతిరేఖ.. సుభాష్ శర్మ! మహారాష్ట్ర.. విదర్భ.. యవత్మాల్.. ఈ పేరు వినగానే అప్పుల్లో కూరుకుపోయి బలవన్మరణాల పాలైన ఎందరో పత్తి రైతుల విషాద గాథలు మదిని బరువెక్కిస్తాయి. అయితే, యవత్మాల్ వ్యవసాయ కథ అంతటితో ముగిసిపోలేదు. ఎడారిలో ఒయాసిస్సు మాదిరిగా సేద్యాన్ని ఆనందమయంగా మార్చుకున్న ప్రసిద్ధ రైతు శాస్త్రవేత్త, సీనియర్ ప్రకృతి వ్యవసాయ నిపుణులు సుభాష్ శర్మ కూడా అక్కడ దీర్ఘకాలంగా సేద్యం చేస్తున్నారు. యవత్మాల్ జిల్లా వితస గ్రామ వాస్తవ్యుడైన శర్మ.. నేలతల్లికి ప్రణమిల్లుతూ భూసారాన్ని పరిరక్షించుకుంటూనే అధిక దిగుబడులు సాధిస్తున్నారు. సుభాష్ శర్మకు 67 ఏళ్లు. ఆరుతడి పంటల సాగులో 47 ఏళ్ల అనుభవం ఉన్న రైతు. రసాయనిక సేద్యపు చేదు అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకొని దిశను మార్చుకున్నారు. సేద్యంలో గడ్డు సమస్యలకు అద్భుతమైన పరిష్కారాలను వెదికిన తలపండిన ప్రకృతి వ్యవసాయదారుడాయన. అంతేకాదు, నల్లరేగడి పొలాల్లో అనేక వినూత్న సుస్థిర వ్యవసాయ పద్ధతులను స్వీయానుభవంలో కనుగొని, అనుసరిస్తున్న విశిష్ట రైతు శాస్త్రవేత్త కూడా. క్షేత్రస్థాయిలో వ్యవసాయ సమస్యలను లోతుగా పరిశీలిస్తూ.. తన అనుభవంతో, ప్రజ్ఞతో మెట్టప్రాంతాల్లో ప్రకృతి సేద్యానికి అనుగుణమైన సాగు పద్ధతులను సుభాష్ శర్మ రూపొందించుకున్నారు. 30 ఏళ్లుగా ప్రకృతి సేద్యంసుభాష్ శర్మకు 13 ఎకరాల నల్లరేగడి భూమి ఉంది. 1975 నుంచి వ్యవసాయం చేస్తున్న ఆయనకు 20 ఏళ్ల పాటు రసాయనిక ఎరువులు, పురుగుమందులతోనే వ్యవసాయం చేశారు. ఫలితంగా ఆర్థికంగా నష్టాలపాలవటమే కాకుండా భూసారం సర్వనాశనమైపోయింది. 1986 తర్వాత ఖర్చులు పెరుగుతున్నా దిగుబడులు తగ్గిపోతూ వచ్చాయి. ఆ దశలో రసాయనిక వ్యవసాయ పద్ధతే నష్టదాయకమైనదన్న సత్యాన్ని గ్రహించారు. 1994 నుంచి ప్రకృతి వ్యవసాయ పద్ధతుల వైపు మళ్లారు. నిశిత పరిశీలనతో ప్రకృతికి అనుగుణమైన ఆచరణాత్మక సుస్థిర వ్యవసాయ పద్ధతులను రూపొందించుకొని అనుసరిస్తూ మంచి నికరాదాయాన్ని పొందుతున్నారు. 13 ఎకరాల నల్లరేగడి భూమిలో 3 ఎకరాలను ఆవులు, ఎద్దుల మేతకు కేటాయించి మిగతా పది ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ముఖ్యంగా కంది, పత్తి, కూరగాయలు, ఆకుకూరలను ఏడాది పొడవునా సాగు చేస్తుంటారు. మార్కెట్లో ఎప్పుడు, ఏయే పంట ఉత్పత్తులకు గిరాకీ ఉంటుందో గమనించుకుంటూ రైతులు బహుళ పంటలు సాగుకు ప్రణాళికను రూపొందించుకుంటే మంచి ఆదాయం పొందవచ్చంటారాయన.పత్తి సాగులో వినూత్న పద్ధతిప్రకృతి వ్యవసాయంలో ఆచ్ఛాదన అతి ముఖ్యపాత్ర పోషిస్తుంది. అయితే, ఆచ్ఛాదనగా వేయడానికి గడ్డీ గాదం ఎక్కడ దొరుకుతుంది అని రైతులు ప్రశ్నిస్తుంటారు. ఈ సమస్యకు సుభాష్ శర్మ అద్భుతమైన పరిష్కారాన్ని కనుగొన్నారు. రెండు సాళ్లు పత్తి వేస్తారు (కందిని కూడా ఇలాగే సాగు చేయవచ్చు). ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట మొక్కలు పెంచి, వాటినే కత్తిరించి ఆచ్ఛాదనగా వేస్తారు. పత్తిని, కందిని కూడా ఈ పద్ధతిలోనే సాగు చేయడం ఆయన ప్రత్యేకత. అధిక దిగుబడిని సాధించే ఈ వినూత్న పద్ధతిని గత కొన్నేళ్లుగా అనుసరిస్తున్నారు. ప్రకృతి వ్యవసాయదారుడిగా, పరిశోధకుడిగా ప్రయోగాలు చేస్తూ అధిక దిగుబడులు సాధిస్తున్న సుభాష్ శర్మ పై ప్రత్యేక కథనాన్ని 2018 డిసెంబర్లోనే ‘సాక్షి సాగుబడి’ ప్రచురించింది. సుభాష్ శర్మ తన యూట్యూబ్ చానల్లో వీడియోలు అందుబాటులో ఉంచారు.@naturalfarmingbysubhashsharma9@KrishiTVఅధిక దిగుబడి, అధిక నికరాదాయం!ప్రకృతి సేద్యంలోని శాస్త్రీయతను అర్థం చేసుకొని రైతులు అనుసరించినప్పుడే సత్ఫలితాలు సాధించగలుగుతారు. పత్తి 2 సాళ్లు వేసి.. ఆ పక్కనే 3 సాళ్లలో పచ్చిరొట్ట పంటలను సాగు చేస్తే.. భూసారంతో పాటు దిగుబడి కూడా పెరగడం, బెట్టను తట్టుకోవడం వంటి ఎన్నో ప్రయోజనాలు నెరవేరతాయి. చీడపీడల బెడద కూడా తీరిపోతుంది. పచ్చిరొట్ట సాగుకు స్థలం వృథా అవుతున్నదని పొరబడకూడదు, శాస్త్రీయతను అర్థం చేసుకోవాలి. ప్రకృతి సేద్యంలో అధిక దిగుబడి, అధిక నికరాదాయం పొందటం ముమ్మాటికీ సాధ్యమే. – సుభాష్ శర్మ, ప్రకృతి వ్యవసాయ నిపుణులు, మహారాష్ట్రకొత్త పంటల హాంగ్థింగ్నాగాలాండ్లోని కోక్లక్కు చెందిన ఎల్. హాంగ్‌థింగ్ అనే 58 ఏళ్ల రైతు శాస్త్రవేత్త అధికాదాయాన్నిచ్చే కొత్త ఉద్యాన పంటలను రైతులకు అందుబాటులోకి తేవటంలో విశేష కృషి చేశారు. ఆప్రాంత రైతాంగానికి తెలియని లిచి, నారింజ వంటి కొత్త పండ్ల రకాలను వారికి అందుబాటులోకి తెచ్చారు. 30 ఏళ్లుగా ఉద్యాన తోటలను సాగు చేస్తున్నారు. ఆయన కృషి వల్ల 40 గ్రామాల్లో 200 మంది రైతులు కొత్త రకాల పండ్ల చెట్ల పెంపకం ద్వారా తమ ఆదాయాన్ని పెంచుకోగలిగారు. తిని పారేసిన పండ్ల విత్తనాలను సేకరించి మొలకెత్తించటం వంటి ప్రయోగాలను ఆయన బాల్యం నుంచే చేపట్టటం విశేషం. ఆయన రూపొందించిన అనేక మెళకువలను వందలాది మంది రైతులు అనుసరిస్తూ ఆదాయం పెంచుకుంటున్నారు.ఆపిల్ సాగును దేశవ్యాప్తం చేసిన హారిమన్ఆపిల్ పండ్ల తోటలను హారిమన్ శర్మ మంచు కొండల మీద నుంచి మైదానప్రాంతాల్లోకి తీసుకొచ్చారు. హిమాచల్ ప్రదేశ్‌లోని గల్లసిన్ గ్రామంలో 1956లో ఆయన పుట్టారు. మూడేళ్ల వయసులో తల్లిని కోల్పోయిన ఆయన వ్యవసాయ పనులు చేస్తూ పెరిగారు. కష్టాల్లో పెరిగినప్పటికీ వ్యవసాయంలో కొత్తపోకడలను కనిపెట్టాలన్న తపన ఆయనలో ఉండేది. 1992లో విపరీతమైన మంచు వల్ల ఆప్రాంతంలో మామిడి చెట్లు నాశనమైనప్పుడు ఆపిల్ సాగు గురించి ఆలోచించారు. చల్లని కొండప్రాంతాల్లో మాత్రమే ఆపిల్ చెట్లు పెరుగుతాయని మనకు తెలుసు. అయినా, తమప్రాంతంలో వాటిని ఎందుకు పెంచకూడదన్న ఆలోచనతో హారిమన్ ప్రయోగాలు చేయటంప్రారంభించారు.పట్టువిడవకుండా కృషి చేసి సముద్రతలం నుంచి 700 మీటర్ల ఎత్తులోని మైదానప్రాంతాల్లో, వేసవిలో 40–45 డిగ్రీల సెల్షియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యే వాతవరణంలో కూడా, ఆపిల్ పండ్లను సాగు చేయవచ్చని రుజువు చేశారు. 2007లో హెఆర్‌ఎంఎన్–99 అనే గ్రాఫ్టెడ్ ఆపిల్ వంగడాన్ని రూపొందించారు. అప్పటి ముఖ్యమంత్రి ప్రేమ్‌కుమార్ ధుమల్ దృష్టికి వెళ్లటంతోప్రాచుర్యంలోకి వచ్చారు. ఈ రకం ఆపిల్ పండ్లను ఇప్పుడు దేశంలో తెలుగు రాష్ట్రాలు సహా 29 రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, నేపాల్, జర్మనీలోనూ సాగు చేస్తున్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖకు అనుబంధంగా ఉన్న నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ పురస్కారాన్ని అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ నుంచి అందుకున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో రైతులకు శిక్షణ ఇవ్వటంతో పాటు లక్ష గ్రాఫ్టెడ్ ఆపిల్ మొక్కలను అందించిన ఘనత ఆయనది. -
పాత స్నేహితుడిని అరెస్ట్ చేయించిన మంత్రి సుభాష్
సాక్షి టాస్క్‌ఫోర్స్: గడచిన సార్వత్రిక ఎన్నికల్లో తన విజయం కోసం కృషి చేసిన వ్యక్తిని ఆ మంత్రి పండగ రోజుల్లో కటకటాలు లెక్కించేలా చేశారు. ఆ వివరాలివీ.. ప్రస్తుత రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌కు రామచంద్రపురం నియోజకవర్గం కె.గంగవరం మండలం మసకపల్లికి చెందిన మేడిశెట్టి ఇశ్రాయేల్ గతంలో మంచి స్నేహితుడు. దీంతో గత సార్వత్రిక ఎన్నికల ముందు మండపేటలో చంద్రబాబు నిర్వహించిన శ్రీరా..కదలిరా..శ్రీ సభలో సుభాష్‌తో పాటు మేడిశెట్టి ఇశ్రాయేల్ కూడా టీడీపీలో చేరారు. ఎన్నికల్లో సుభాష్ రామచంద్రపురం ఎమ్మెల్యేగా గెలిచి, మంత్రి అయిన తరువాత దొంగల బ్యాచ్‌ను ప్రోత్సహిస్తూ.. అటు టీడీపీకి, ఇటు శెట్టిబలిజ కులానికి చెడ్డ పేరు తెస్తున్నారంటూ ఇశ్రాయేల్ సోషల్ మీడియాలో పోస్టింగులు పెట్టేవారు. ఫేస్బుక్ లైవ్ ద్వారా ప్రజలకు వివరించేవారు. శెట్టిబలిజ పెద్దలకు మెదడు మోకాళ్లలో ఉందంటూ.. రామచంద్రపురంలోని శెట్టిబలిజ సామాజిక భవనానికి తొలిసారి వచ్చిన సందర్భంగా మంత్రి సుభాష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కులానికి సుభాష్ క్షమాపణ చెప్పాలని ఇశ్రాయేల్ డిమాండ్ చేశారు. అక్కడి నుంచి మంత్రి సుభాష్ ప్రధాన అనుచరులుగా ఉన్న వ్యక్తులు ఇసుక దొంగతనాలు, సెటిల్మెంట్ల వంటి వాటికి పాల్పడుతున్నారని ప్రశ్నిస్తూనే, ఆ పార్టీ అగ్రనాయకులను ఇశ్రాయేల్ నేరుగా కలసి ఫిర్యాదులు చేశారు. దీంతో టీడీపీ అధిష్టానం నుంచి నేరుగా హెచ్చరికలు రావడంతో తన ప్రధాన అనుచరుడు దొంగల శ్రీధర్‌ను మంత్రి దూరం పెట్టాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో మంత్రి సుభాష్‌కు ఇశ్రాయేల్ మెయిన్ టార్గెట్ అయిపోయారు. దీంతో తాళ్లపొలం గ్రామానికి చెందిన భూ వివాదం ఆధారంగా ఇప్పటికే అతడిపై రెండు కేసులు నమోదయ్యాయి. వీటిలో ఒకటి ఎస్సీ, ఎస్టీ కేసు. అలాగే, బైకులు, చిల్లర దొంగతనాలు చేసే ఓ వ్యక్తిని తీసుకుని వచ్చి సినీఫక్కీలో తాళ్లపొలంలో స్కూటర్ తగులబెట్టించి, ఈ కేసులో ఆ గ్రామ సర్పంచ్, ఆయన కుమారులతో పాటు ఇశ్రాయేల్‌ను ఇరికించారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గానికి చెందిన శెట్టిబలిజ సంఘ పెద్దలను వెంటపెట్టుకుని ఇశ్రాయేల్, తాళ్లపొలం సర్పంచ్‌లు ఈ నెల 10న అమలాపురంలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లారు. తమను తప్పుడు కేసుల నుంచి కాపాడాలని అభ్యర్థించారు. శనివారం రామచంద్రపురానికి కొత్త సీఐ బాధ్యతలు చేపట్టారు. శ్రీసీఐ గారు మాట్లాడి పంపించేస్తారశ్రీని చెప్పి ఇశ్రాయేల్‌ను అదే రోజు సాయంత్రం తీసుకుని వెళ్లిన పోలీసులు అతడిపై కొత్త కేసులు నమోదు చేసి అర్ధరాత్రి సబ్ జైలుకు తరలించారు. నియోజకవర్గంలో శెట్టిబలిజలపై తప్పుడు కేసులు మోపి, జైలు పాలు చేస్తున్న అదే వర్గానికి మంత్రి సుభాష్ వైఖరిపై ఆ సామాజిక వర్గీయులు మండిపడుతున్నారు. -
మంత్రి వాసంశెట్టి సుభాష్ వ్యాఖ్యలపై ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆగ్రహం
-
మహిళా కూలీలకు నోటీసులు
రామచంద్రపురం రూరల్ : వ్యవసాయ కూలీలకు అందులోనూ మహిళలకు రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ లీగల్ నోటీసులు పంపించారు. ఈ అంశం రామచంద్రపురం నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశమైంది. రోజువారీ కూలిపని చేసుకునే మహిళలకు మంత్రి నోటీసులు పంపడంపై ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. ఇది పిచ్చుక మీద బ్రహ్మాస్త్రంలా ఉందని.. మంత్రి చేసిన పని సరైంది కాదని వారంటున్నారు. వివరాలివీ..డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలోని తాళ్లపొలెం గ్రామ సర్పంచ్ కట్టా గోవిందుకు, ఆయన ఆడపడుచులకు కొంతకాలంగా 2.40 ఎకరాల పంట భూమి విషయమై కోర్టులో వివాదం నడుస్తోంది. కోర్టులో వివాదం సాగుతున్నప్పటికీ సర్పంచ్ కట్టా గోవిందు స్వాధీనంలోనే భూమి ఉంది. ఆయనే పంటలు పండించుకుంటున్నారు. అదే భూమిలో కొంతభాగం ఇటీవల మంత్రి అనుచరుడు దొంగల శ్రీధర్, అతని భార్య దొంగల సునీత పేరున రిజిస్టర్ అయ్యింది. ఇటీవల సర్పంచ్ గోవిందు పంట కోసుకోగా దానిపై ద్రాక్షారామ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఈ కేసులో కట్టా గోవిందు, అతని సోదరి జానకమ్మ, మేడిశెట్టి ఇజ్రాయేలుతో పాటు 8 మంది వ్యవసాయ కూలీలు అందులోనూ మహిళలపై అక్రమంగా పంట కోసుకుపోయారని ఒక కేసు నమోదైంది. దీనిపై గతనెల 24న రామచంద్రపురం తహసీల్దార్ కార్యాలయం వద్ద మీడియా సమక్షంలో అక్రమ కేసులు ఎత్తివేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఎవరైతే పోలీసు కేసులో ఉన్నారో అదే వ్యవసాయ కూలీలకు మంత్రి సుభాష్ లీగల్ నోటీసులు పంపారు. వారు మీడియాతో మాట్లాడటంవల్ల తన పరువుకు భంగం కలిగిందని.. వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతామంటూ ఇచ్చిన ఆ నోటీసులను చూసి కూలీలు లబోదిబోమంటున్నారు. తమను ఇబ్బంది పెట్టవద్దని మంత్రి సుభాష్‌ను వారు కోరుతున్నారు. -
కార్తీక వనసమారాధనలో గలాటా
బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): కార్తీక వన సమారాధనలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కాకినాడలో ఆదివారం జరిగిన ఒక సామాజికవర్గ వన సమారాధనలో పాల్గొన్న ఆయన రాజకీయాలు ప్రస్తావించడం వివాదానికి ఆజ్యం పోసింది. ఒకే సామాజిక వర్గానికి చెందిన ఇద్దరు ఎన్నికల్లో పోటీ చేస్తే.. కుల సంఘ నాయకులు దూరంగా ఉండాలని, ఎవరు నచ్చిన వ్యక్తికి వారు ఓటు వేసుకోవాలని చెప్పాలే తప్ప ఒక పార్టీకి కొమ్ము కాయకూడదని, ఎవరో సిద్ధం అంటే వారికి మద్దతు తెలపడం తగదని మంత్రి సుభాష్ అన్నారు. దీంతో వనసమారాధనలో గలాటా మొదలైంది. కుల సంఘ నాయకులను తప్పు పడుతూ మంత్రి చేసిన వ్యాఖ్యలపై పలువురు నిరసన తెలిపారు. దీంతో మంత్రి నోరు జారి సంస్కార హీనులను దూరంగా ఉంచాలని, సంస్కారం లేని వెధవలను పట్టించుకోవద్దని అనడంతో ఒక్కసారిగా తోపులాట మొదలైంది. మంత్రి మాటలతో ఆగ్రహించిన కొందరు కుర్చిలు సైతం విసిరారు. అక్కడున్న వారు రెండు వర్గాలుగా చీలిపోయి పరస్పరం ఒకరినొకరు నెట్టుకున్నారు. బాహాబాహీకి దిగారు.పోలీసులు రంగప్రవేశం వేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ రామచంద్రపురం కో–ఆర్డినేటర్ పిల్లి సూర్యప్రకాశరావు మాట్లాడుతూ తన సామాజికవర్గానికి తాను అండగా ఉంటానన్నారు. శెట్టిబలిజ సామాజికవర్గం నేడు కలుసుకుంటుందంటే దానికి కారణం దొమ్మేటి వెంకటరెడ్డి అని చెప్పారు. -
పారని మంత్రి సుభాష్ పాచిక
సాక్షి ప్రతినిధి, కాకినాడ: ద్రాక్షారామం జగనన్న కాలనీలో ఇసుక చోరీ వ్యవహారం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ అనుచరుల మెడకే చుట్టుకుంది. ఈ వ్యవహారం నుంచి తన అనుచరులను తప్పించేందుకు మంత్రి రెండు రోజులుగా చేస్తున్న తీవ్ర ప్రయత్నాలు బెడిసికొట్టాయి. ఆయన అనుచరులే ఇసుకను చోరీ చేశారని తేటతెల్లమవటంతో చేసేది లేక అధికార యంత్రాంగం కేసు నమోదు చేసింది. మంత్రి ప్రధాన అనుచరుల్లో ఒకరైన టీడీపీ నేత దొంగల శ్రీధర్, మరి కొందరిపై పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఇదే విషయాన్ని రామచంద్రపురం ఆర్డీవో ఎస్.సుధాసాగర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 26న ద్రాక్షారామ జగనన్న కాలనీ లేఅవుట్–04లో జరిగిన ఇసుక దోపిడీపై ‘జగనన్న కాలనీలో టీడీపీ దొంగలు’ అనే శీర్షికతో ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. ఈ కథనం అధికారులను, అధికార పార్టీ నేతలను పరుగులు పెట్టించింది. ఈ కేసు నుంచి మంత్రి సుభాష్ అనుచరుడు దొంగల శ్రీధర్‌ను తప్పించే ప్రయత్నాన్ని కూడా ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చిం ది. అయినా అతనిపైన, ఇతర అనుచరులపైన కేసు నమోదు కాకుండా మంత్రి సుభాష్ తీవ్రంగా ప్రయతి్నంచారు. అధికార బలాన్ని ఉపయోగించారు. మంత్రి ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇసుక వ్యవహారంలో తమ పార్టీ నేతల ప్రమేయం లేదని చెప్పేందుకు విశ్వప్రయత్నం చేశారు. ఇదంతా వైఎస్సార్సీపీ నేతల పనేనంటూ నమ్మించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ బెడిసికొట్టాయి. ఆయన మీడియా సమావేశం పెట్టిన రెండు గంటలకే అధికారులు దొంగల శ్రీధర్‌పై కేసు నమోదు చేశారు. ఆయనే ఇసుక చోరీలో నిందితుడని స్పష్టం చేశారు. కాగా, ఈ ఇసుక దోపీడిపై పోలీసులు కేసు నమోదు చేసిన వాసంశెట్టి బాల, కాండ్రేగుల సాయిరాంలను టీడీపీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు మంత్రి సుభాష్ ప్రకటించారు. ప్రధాన అనుచరుడైన దొంగల శ్రీధర్‌పై మంత్రి ఏ రకమైన చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. -
నిషా కళ్ల వయ్యారి.. చేస్తోంది జాదూగరి (ఫొటోలు)
-
కథ సెట్.. కాంబో రిపీట్
ఒక హీరో... ఒక డైరెక్టర్... వీరి కాంబినేషన్లో ఓ బ్లాక్‌బస్టర్... ఇది చాలు... ప్రేక్షకులు ఆ కాంబో రిపీట్ కావాలని కోరుకోవడానికి. అయితే కారణాలేమైనా కొన్ని హిట్ కాంబినేషన్స్ రిపీట్ కావడానికి ఇరవయ్యేళ్లకు పైగా పట్టింది.ఇప్పుడు కథ సెట్ అయింది.. కాంబో రిపీట్ అవుతోంది. రిపీట్ అవుతున్న ఆ హిట్ కాంబినేషన్స్ గురించి తెలుసుకుందాం. బిగిన్ ది బిగిన్ కమల్‌హాసన్ కెరీర్లో ‘నాయగన్’ (1987) బ్లాక్‌బస్టర్ ఫిల్మ్. మణిరత్నం దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం తెలుగులో ‘నాయకుడు’గా విడుదలైంది. ఇంతటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ ఇచ్చిన కమల్–మణిరత్నం కాంబోలో మరో సినిమా ప్రకటన రావడానికి మూడు దశాబ్దాలకు పైగా సమయం గడిచిపోయింది. ముప్పైఐదేళ్ల తర్వాత.. అంటే గత ఏడాది నవంబరులో తన పుట్టినరోజు సందర్భంగా మణిరత్నంతో సినిమాను ప్రకటించారు కమల్. మణిరత్నం, కమల్‌హాసన్, ఉదయనిధి స్టాలిన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నటుడిగా కమల్ కెరీర్లో 234వ సినిమాగా తెరకెక్కనుంది. ఈ సినిమా ప్రారంబోత్సవాన్ని నిర్వ హించి, బిగిన్ ది బిగిన్ అంటూ వీడియోను షేర్ చేశారు మేకర్స్. దుల్కర్ సల్మాన్, త్రిష, ‘జయం’ రవి ఈ చిత్రంలో కీ రోల్స్ చేస్తారని సమాచారం. వచ్చే ఏడాది ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. మరోవైపు ‘ఇండియన్’ (‘భారతీయుడు’) చిత్రం కూడా కమల్‌హాసన్ కెరీర్లో ఓ బ్లాక్‌బస్టర్. ఈ సినిమాకు శంకర్ దర్శకుడు. 1996లో వచ్చిన ‘ఇండియన్’ తర్వాత కమల్, శంకర్ల కాంబినేషన్లోపాతికేళ్లకు ‘ఇండియన్ 2’ రూపొందుతోంది. సుభాస్కరన్, ఉదయనిధి స్టాలిన్ నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. లక్నో టు లాహోర్ దాదాపు పాతికేళ్ల క్రితం బాలీవుడ్లో హీరో సన్నీ డియోల్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ అంటే సెన్సేషన్. వీరి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘ఘాయల్’ (1990) సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఆ ఏడాది బాక్సాఫీస్ టాప్ కలెక్షన్స్ సాధించిన మొదటి ఐదు చిత్రాల్లో ‘ఘాయల్’కు చోటు దక్కడం అనేది ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించిన తీరుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు . ఆ తర్వాత ‘దామిని’ (1993) చిత్రం కోసం సన్నీడియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి పని చేశారు. కానీ ఇది ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్. మీనాక్షీ శేషాద్రి మెయిన్ లీడ్ రోల్ చేయగా, సన్నీ డియోల్, రిషీ కపూర్, అమ్రిష్ పూరి ఇతర లీడ్ రోల్స్ చేశారు. ఈ చిత్రం కూడా సూపర్‌హిట్. ఇక ముచ్చటగా మూడోసారి సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిలు కలిసి చేసిన చిత్రం ‘ఘాతక్’. ‘దామిని’ చిత్రంలో నటించిన సన్నీ డియోల్, మీనాక్షీ చౌదరి, ఓమ్ పురి ఈ సినిమాలో కూడా నటించారు. 1996లో విడుదలైన ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్‌గా నిలిచింది. ఇలా మూడు వరుస హిట్స్ ఉన్నప్పటికీ ఎందుకో కానీ సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ఈ సినిమా తర్వాత మరో సినిమా సెట్స్ పైకి వెళ్లలేదు. ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది. సన్నీ డియోల్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో ‘లాహోర్ 1947’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాను హీరో ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. భారతదేశం,పాకిస్తాన్ విభజన నాటి పరిస్థితుల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని, లక్నో నుంచి లాహోర్‌కు వలస వెళ్లిన ఓ ముస్లిం కుటుంబం కథే ఈ చిత్రం అని టాక్. ఈ చిత్రం 2024లో విడుదల కానుంది. మరోవైపు హీరోగా ఆమిర్ ఖాన్, దర్శకుడు రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్ కూడా రిపీట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయట. ఇదే నిజమైతే... 1994లో వచ్చిన ‘అందాజ్ అ΄్నా అ΄్నా’ తర్వాత ఆమిర్, రాజ్‌కుమార్ సంతోషిల కాంబినేషన్లో వచ్చే చిత్రం ఇదే అవుతుంది. అంటే.. 30 ఏళ్లకు ఆమిర్, రాజ్‌కుమార్ కలిసి సినిమా చేసినట్లవుతుంది. ఎప్పటికీ హీరోయే! జాకీ ష్రాఫ్‌ను ‘హీరో’ను చేసింది దర్శకుడు సుభాష్ ఘయ్. జాకీ ష్రాఫ్, సుభాష్ కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ‘హీరో’ (1983) సూపర్ హిట్‌గా నిలిచింది. హీరోగా జాకీకి ఇదే తొలి సినిమా. ‘హీరో’ సూపర్‌హిట్ అయినప్పటికీ వీరి కాంబోలో తర్వాతి చిత్రం ‘యాదేం’ (2001) తెరకెక్కడానికి 18 ఏళ్లు పట్టింది. జాకీ ష్రాఫ్‌తోపాటు హృతిక్ రోషన్ కూడా ఓ లీడ్ రోల్ చేసిన ఈ చిత్రం ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు జాకీ ష్రాఫ్ హీరోగా ‘వన్స్ ఏ హీరో.. ఆల్వేస్ ఏ హీరో’ అంటూ తాజా చిత్రాన్ని ప్రకటించారు సుభాష్. ఇలా ఇరవై, ముప్పైఏళ్ల తర్వాత రిపీట్ అవుతున్న హీరో–డైరెక్టర్ కాంబినేషన్స్ ఇంకా ఉన్నాయి. -
బీజేపీలో దరఖాస్తుల వెల్లువ!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బీజేపీలో ఎన్నికల సందడి నెలకొంది. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి ఉన్న వారు మొదటిరోజే ఏకంగా 182 దరఖాస్తులు సమర్పి చారు. ఐతే కొందరు ఒకటికి మించి స్థానాలకు తమ దరఖాస్తులను సమర్పి చడంతో... వాస్తవానికి 63 నియోజకవర్గాలకే అభ్యర్థులు అప్లికేషన్లు ఇచ్చినట్లు భావించాల్సి ఉంటుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. దర ఖాస్తుల స్వీకరణ నిమిత్తం మాజీ ఎమ్మెల్సీ మాగం రంగారెడ్డి, పార్టీనేతలు సుభాష్చందర్జీ, మల్లేశం గౌడ్లతో రాష్ట్ర పార్టీ కమిటీ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. 4 చోట్ల పోటీకి దరఖాస్తు చేసిన శ్రీవాణి: సికింద్రాబాద్ నుంచి పోటీకి రవిప్రసాద్‌గౌడ్ మొదటగా ఈ కమిటీకి దరఖాస్తు సమర్పి చారు. భద్రాచలం స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి, వేములవాడ సీటుకు కరీంనగర్ మాజీ జడ్పీ చైర్పర్సన్ తుల ఉమ అప్లికేషన్ పెట్టుకున్నారు. సరూర్‌నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి ఏకంగా నాలుగు చోట్ల పోటీకి దరఖాస్తు చేసుకున్నారు. మహేశ్వరం, ఎల్బీనగర్, సనత్‌నగర్, ముషీరాబాద్ నియోజకవర్గాల నుంచి పోటీకి అవకాశమివ్వాలంటూ వేర్వేరు దరఖాస్తులు సమర్పించారు. ఎల్బీనగర్ అసెంబ్లీ టికెట్ కోసం సామా రంగారెడ్డి దరఖాస్తు చేశారు. – కిషన్‌రెడ్డి పరిశీలన కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి సోమవారం ఎన్నికల దరఖాస్తుల స్వీకరణ కేంద్రాన్ని పరిశీలించారు. అప్లికేషన్ ఇచ్చి న వారు మీడియాతో మాట్లాడకుండా నేరుగా నియోజకవర్గం వెళ్లి పనిచేసుకోవాలని ఆయన సూచించారు. మీడియా ముందు హంగామా చేసే వారి దరఖాస్తులు పక్కన పెట్టాలని పార్టీనాయకులను ఆయన ఆదేశించారు. ఇదిలా ఉంటే... ఈ నెల 10వ తేదీ వరకు ఆశావాహుల నుంచి బీజేపీ దరఖాస్తులను స్వీకరించనుంది. ఇది ముగిశాక మూడు స్థాయిల్లో అంటే జిల్లా, రాష్ట్ర, జాతీయపార్టీ స్థాయిలలో వడపోత కార్యక్రమం నిర్వహిస్తారని పార్టీ నేతల సమాచారం. – 25 స్థానాలకు ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా పార్టీ ముఖ్యనేతలు, కచ్చి తంగా గెలిచే అవకాశాలున్న వారిని దాదాపు 25 స్థానాల వరకు కేవలం ఒక్కో అభ్యర్థితోనే తొలిజాబితా సిద్దం చేసే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. మిగతా స్థానాల్లో ఒక్కో సీటుకు ముగ్గురు లేదా నలుగురు చొప్పున ప్రతిపాదిత పేర్లతో రఫ్ జాబితా సిద్ధం చేసి రాష్ట్రపార్టీ నుంచి పార్లమెంటరీ బోర్డుకు సమర్పి చవచ్చునని సమాచారం. ఇప్పటికే అధికార బీఆర్ఎస్ 113మంది అభ్యర్థులను ప్రకటించడంతో ఎక్కడికక్కడ నేతలంతా అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్‌పార్టీ సైతం పోటీచేసేందుకు ఆసక్తి ఉన్న వారి నుంచి దరఖాస్తులను స్వీకరించింది. ఈ నేపథ్యంలో బీజేపీలోనూ ఎన్నికల్లో పోటీకి దరఖాస్తుల ప్రక్రియ మొదటిరోజే వేగం పుంజుకుంది. రాబోయే ఆరు రోజుల్లో (ఈ నెల 10 వరకు) భారీగానే దరఖాస్తులు అందుతాయని పార్టీనాయకులు అంచనా వేస్తున్నారు. -
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
పకడ్బందీగా కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) ఎలాంటి లోపాలకు తావు లేకుండా అత్యంత పకడ్బందీగా నిర్వహిస్తారని కేంద్ర విద్యా శాఖ సహాయ మంత్రి సుభాశ్ సర్కార్ తెలిపారు. సీయూఈటీ తాత్కాలిక ఆన్సర్ కీలో పొందుపర్చిన అనేక సమాధానాలు తప్పులు తడకగా ఉన్న విషయం వాస్తవమేనా అని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు బుధవారం కేంద్ర మంత్రి సమాధానమిస్తూ.. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈ పరీక్ష నిర్వహిస్తుందన్నారు. ఉమ్మడి యూనివర్సిటీ ప్రవేశ పరీక్షకు సంబంధించి వెబ్సైట్లో అప్లోడ్ చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలో 570 జవాబులను సబ్జెక్టు నిపుణులు పరిష్కరించి సవరించారన్నారు. కామన్ వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో మొత్తం 61 సబ్జెక్టులకు సంబంధించి 2,305 ప్రశ్నపత్రాల్లో 1,48,520 ప్రశ్నలు ఉన్నట్టు మంత్రి తెలిపారు. ఈ ప్రశ్నలకు సంబంధించి విడుదల చేసిన తాత్కాలిక ఆన్సర్ కీలలో అభ్యర్థులు 3,886 ఆన్సర్ కీలను చాలెంజ్ చేశారన్నారు. తప్పు జవాబులపై అభ్యర్థులు చేసిన చాలెంజ్‌లను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నియమించిన సబ్జెక్ట్ నిపుణులు పరిష్కరించిన అనంతరం రూపొందించిన ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా మాత్రమే ఫలితాల విడుదల జరుగుతుందని మంత్రి వివరించారు. ఏపీలో 662 రైజింగ్ ఇండియా పాఠశాలలు ఆంధ్రప్రదేశ్‌లో 662 పాఠశాలలను ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా (పీఎం ఎస్హెచ్ఆర్ఐ)లో భాగంగా గుర్తించినట్టు కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి అన్నపూర్ణాదేవి తెలిపారు. వీటి కోసం 2023–24లో కేంద్ర, రాష్ట్ర వాటాలు కలిపి రూ.354.85 కోట్లు (212.91కోట్లు+141.94 కోట్లు) ప్రోగ్రామ్ అప్రూవల్ బోర్డు అనుమతించినట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 10,834 గ్రామాల్లో డ్రోన్ సర్వే ఆంధ్రప్రదేశ్‌లోని 10,834 గ్రామాల్లో ఇప్పటివరకూ పీఎం స్వమిత్వలో భాగంగా డ్రోన్ సర్వే నిర్వహించినట్టు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కపిల్ మోరేశ్వర్ పాటిల్ తెలిపారు. గ్రామాల్లో గృహ యజమానులు రికార్డ్ ఆఫ్ రైట్స్ అందించడానికి ఈ సర్వే చేస్తున్నట్టు వైఎస్సార్సీపీ సభ్యుడు నిరంజన్‌రెడ్డి ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2031 వరకూ నెల్లూరు హైవేకు రాయితీ జాతీయ రహదారి–16లోని నెల్లూరు–తడ నాలుగు లేన్ల రహదారి నిర్మాణం, నిర్వహణ, బదిలీ(బీవోటీ) టోల్ పద్ధతిలో నిర్మించారని, దీని రాయితీ కాలం సెపె్టంబర్ 2031 వరకూ ఉంటుందని కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. వైఎస్సార్సీపీ సభ్యుడు బీద మస్తాన్‌రావు అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానమిస్తూ.. టోల్ వసూలు ఏజెన్సీతో ధరల సవరణ ఎంవోయూ ఏదీ పరిశీలనలో లేదన్నారు. -
విద్యలో వెనకబడిన 7 జిల్లాలకు రూ.317 కోట్లు
సాక్షి, న్యూఢిల్లీ: ఉన్నత విద్యారంగంలో వెనకబడిన ఏపీలోని ఏడు జిల్లాల్లో మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం రూ.317 కోట్ల్ల గ్రాంట్ విడుదలకు ఆమోదం తెలిపినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ చెప్పారు. రాజ్యసభలో బుధవారం వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలో 374 జిల్లాలు విద్యాపరంగా వెనకబడినట్లు యూజీసీ నిపుణుల సంఘం గుర్తించిందని తెలిపారు. ఏపీలోని అనంతపురం, తూర్పు, పశ్చిమ గోదావరి, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలు విద్యలో వెనకబడిన జిల్లాలుగా గుర్తించినట్లు చెప్పారు. ఈ జిల్లాల్లో విద్యార్థుల స్థూల నమోదు నిష్పత్తి (జీఈఆర్) జాతీయ సగటు అయిన 12.4 శాతం కంటే తక్కువగా ఉన్నట్లు యూజీసీ నిపుణుల సంఘం నిర్ధారించినట్లు తెలిపారు. విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో పరిస్థితిని మెరుగుపరచేందుకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సాయం అవసరమని గుర్తించి అనేక పథకాలను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఉన్నత విద్యను సమాజంలోని అన్ని వర్గాలకు అందుబాటులోకి తీసురావడానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రీయ ఉచ్ఛతర్ శిక్షా అభియాన్ (రూసా)ను ప్రారంభించిందన్నారు. దీనికింద విద్యాపరంగా వెనకబడిన జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం మోడల్ డిగ్రీ కాలేజీల ఏర్పాటుకు, కాలేజీలు, యూనివర్సిటీల్లో మౌలిక వసతుల కల్పనకు కేంద్ర ప్రభుత్వం నిధులను గ్రాంట్‌గా మంజూరు చేస్తుందని తెలిపారు. అందులో భాగంగానే ఏపీలో గుర్తించిన ఏడు జిల్లాల్లో ఉన్నత విద్యావకాశాలు మెరుగుపరచడానికి రూ.317 కోట్లు విడుదల చేయాలని రూసా (ప్రాజెక్ట్ ఆమోదం బోర్డు) నిర్ణయించిందని మంత్రి తెలిపారు. పౌష్టికాహార లోపం నివారణే లక్ష్యంగా.. చిన్నారులు, యుక్తవయసు బాలికలు, గర్భిణులు, బాలింతల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించడమే లక్ష్యంగా సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 పథకాలను తీసుకొచ్చినట్లు కేంద్ర మహిళ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ తెలిపారు. ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. దేశంలో పౌష్టికాహార లోపాన్ని సమర్థంగా ఎదుర్కొని ఉత్తమ ఫలితాలను రాబట్టే విధంగా కేంద్ర ప్రభుత్వం 2018లో పోషణ్ అభియాన్‌ను ప్రారంభించిందన్నారు. ఆరేళ్లలోపు పిల్లల్లో ఎదుగుదల, బరువు, రక్తహీనత లోపాల నివారణను 2 నుంచి 3 శాతం తగ్గించడం లక్ష్యంగా సాక్షం అంగన్వాడీ, పోషణ్ 2.0 అభియాన్ అమలు చేస్తున్నట్లు చెప్పారు. పారా మిలటరీలో మహిళలకు 33శాతం పోస్టులు పారా మిలటరీలో మహిళలకు 33 శాతం పోస్టుల రిజర్వు చేయాలని 2016 జనవరిలో నిర్ణయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. వైఎస్సార్సీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ.. సరిహద్దు కాపలా దళాల పోస్టుల్లో 14 నుంచి 15 శాతం పోస్టులు మహిళలకు రిజర్వు చేసినట్లు చెప్పారు. సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్, అస్సాం రైఫిల్స్‌లో ప్రస్తుతం 34,151 మంది మహిళా సిబ్బంది ఉన్నారని తెలిపారు. ఎస్పీపీఈఎల్లో తోటి, గోరుం భాషలు దేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ, సంరక్షణ పథకంలో ఏపీకి చెందిన తోటి, గోరుం భాషలు చేర్చినట్లు కేంద్ర విద్యాశాఖ సహాయమంత్రి సుభాష్ సర్కార్ తెలిపారు. దేశంలో అంతరించిపోతున్న భాషల రక్షణ నిమిత్తం 2015–16 నుంచి 2021–22 వరకు యూజీసీ, సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ రూ.48.90 కోట్లు విడుదల చేసినట్లు ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి ప్రశ్నకు జవాబిచ్చారు. అసెంబ్లీ సీట్లు ఇప్పుడే పెంచలేం ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం–2014లోని సెక్షన్ 26కు అనుగుణంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ 170ని సవరించేవరకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచలేమని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానందరాయ్ తెలిపారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 170(3) ప్రకారం 2026వ సంవత్సరం తర్వాత మొదటి జనాభా గణనను ప్రచురించేవరకు ప్రతి రాష్ట్ర అసెంబ్లీలో మొత్తం సీట్ల సంఖ్యను తిరిగి సర్దుబాటు చేయరాదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ప్రశ్నకు జవాబిచ్చారు. -
Subhash Patriji: ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ ఇకలేరు
సాక్షి, రంగారెడ్డి జిల్లా/కడ్తాల్: ధ్యాన మంటే శ్వాసమీద ధ్యాస అని 40 ఏళ్ల పాటు అలుపెరగని ప్రచారం చేసి, కోట్లాది మందిని ఆధ్యాత్మికతవైపు మళ్లించిన ప్రముఖ ధ్యాన గురువు సుభాష్ పత్రిజీ (74) ఆదివారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్ ధ్యాన కేంద్రంలో తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతికకాయానికి సోమవారం సాయంత్రం 5 గంటలకు అదే ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు పిరమిడ్ ధ్యాన్ ట్రస్ట్ సభ్యులు ప్రకటించారు. పత్రీజీకి భార్య స్వర్ణమాల, కుమార్తెలు పరిణత, పరిమళ ఉన్నారు. కోట్లాది మందిని ధ్యానం వైపు.. సుభాష్ పత్రీజీ 1947లో బోధన్‌లోని శక్కర్‌నగర్‌లో పీవీ రమణారావు, సావిత్రీదేవిలకు జన్మించారు. తొలుత 1975లో ఓ బహుళజాతి ఎరువుల కంపెనీలో ఉద్యోగంలో చేరారు. ఆధ్యాత్మిక సాధనలో భాగంగా 1980లో జ్ఞానోదయం పొందారు. ఆయన పొందిన జ్ఞానాన్ని, ధ్యానాన్ని ఇతరులకు పంచాలని భావించారు. ఈ మేరకు 1990లో కర్నూల్ స్పిరిచ్యువల్ సొసైటీ (పిరమిడ్ కేంద్రాన్ని) స్థాపించారు. అనేక మందిని ధ్యానులుగా, జ్ఞానులుగా మార్చారు. ధ్యానంతో పాటు జ్ఞానాన్ని ప్రజలకు పంచాలని భావించిన ఆయన రంగారెడ్డి జిల్లా కడ్తాల్ సమీపంలో 2008లో మహేశ్వర మహాపిరమిడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. 2009 ఆగస్టు 15న పనులు ప్రారంభించారు. 2012 నుంచి ధ్యానమహా చక్రాలు ప్రారంభించారు. ఏటా లక్షలాది మందితో నిర్వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 50 వేలకుపైగా పిరమిడ్లను నిర్మించారు. దేహాన్ని విడిచి వెళ్తున్నట్లు ప్రకటన.. కొంతకాలంగా ఆయన మూత్ర పిండాల సంబంధిత సమస్యతో బాధపడుతున్నారు. 15 రోజుల క్రితం బెంగళూర్ నుంచి మహాపిరమిడ్ కేంద్రానికి చేరుకున్నారు. రెండు రోజుల క్రితం ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ‘తాను ఆధ్యాత్మిక సేవ చేసేందుకే ఇక్కడికి వచ్చానని.. తాను లేకపోయినా తాను అందించిన ఈ ఆధ్యాత్మిక ప్రచారం నిర్విరామంగా కొనసాగుతుందని.. ఈ దేహాన్ని విడిచి వెళ్లే సమయం ఆసన్నమైంది’అని ప్రకటించారు. ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. సంతాప సూచికగా సంబురాలు పత్రీజీ నిష్క్రమణ ఆయన శిష్యులను ఆందోళనకు గురి చేసినా.. మరణాన్ని సైతం సంబురం చేసుకోవాలని ఆయన చేసిన సూచన ప్రకారం 3 రోజుల పాటు సంబురాలు నిర్వహించనున్నట్లు ధ్యానగురువులు ప్రకటించారు. -
నాకు లవర్‌ను వెతికి పెట్టండి: ఎమ్మెల్యేకు యువకుడి లేఖ
ముంబై: ప్రజాప్రతినిధులకు సమస్యలపై విజ్ఞప్తి చేయడం చూస్తుంటాం. కానీ ఓ యువకుడు మాత్రం తన నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యేకు తనకు ప్రేయసి (గర్ల్‌ఫ్రెండ్)ను ఏర్పాటు చేయాలని లేఖ రాశాడు. ఆ లేఖ ఒక్కసారిగా సోషల్ మీడియాలో వైరలవుతోంది. ‘నేను మంచోడిని.. నన్నెవరు పట్టించుకోవడం లేదు.. మీ నియోజకవర్గ అమ్మాయిలను ప్రేమించేలా ప్రోత్సహించండి’ ఆ యువకుడు లేఖ రాశాడు. అయితే ఆ లేఖ ఎవరూ రాశారో కనుక్కుంటే విస్తుగొల్పే నిజం తెలిసింది. చదవండి: మంత్రి కేటీఆర్ మత్తులో ఉండి ట్వీట్ చేశారా?: రేవంత్‌రెడ్డి మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలోని రాజూరా ఎమ్మెల్యే సుభాశ్ ధొతేకు ఇటీవల ఓ లేఖ వచ్చింది. మరాఠీలో రాసిన ఆ లేఖ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరిట వచ్చింది. ఆ లేఖ తెరచి చూడగా.. ‘మన ప్రాంతంలో చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. ఏ అమ్మాయి కూడా నాతో మాట్లాడడానికి ఇష్టపడడం లేదు. గద్‌చందూర్ నుంచి రాజురా మధ్య నిత్యం ప్రయాణిస్తుంటా. భవిష్యత్‌లో నాకు ప్రేయసి దొరుకుతుందనే నమ్మకం నాకు లేదు. తాగుబోతులకు తప్ప ఎలాంటి చెడు అలవాట్లు లేని నాలాంటివారికి ప్రేయసి దొరకడం లేదు. దయచేసి మీ నియోజకవర్గంలో ఉన్న అమ్మాయిలను ప్రోత్సహించండి’ అంటూ ఆ లేఖలో ఎమ్మెల్యేకు సూచిస్తూ పంపాడు. ఆ లేఖను చూసిన ఎమ్మెల్యే వెంటనే ఆరా తీశారు. చదవండి: లవ్ ఫెయిలైన యువకుడి ప్రాణం నిలిపిన ఫేస్బుక్ భూషణ్ జాంబవంత్ రాఠోడ్ పేరుగల వారిని ఆరా తీయగా అలాంటి పేరుతో ఉన్నవారెవరూ లేరు. వైరల్‌గా మారడానికి ఇలా లేఖ రాశారని తెలుస్తోంది. ఏది ఏమైనా ఈ లేఖపై సోషల్ మీడియా ఫన్నీగా స్పందిస్తోంది. నీదే కాదు బ్రదర్ నా పరిస్థితి అంతే అంటూ సింగిల్ కింగ్‌లు పేర్కొంటున్నారు. ఫన్నీ మీమ్స్, కామెంట్లు వస్తున్నాయి. ఇలాంటి లేఖ రావడం ఇదే మొదటిసారిని ఎమ్మెల్యే పేర్కొన్నాడు. ఆ అబ్బాయి ఎవరో తెలిస్తే అతడికి కౌన్సిలింగ్ ఇస్తామని ఎమ్మెల్యే సుభాష్ చెప్పాడు. -
స్వస్తిక్
‘‘స్వస్తిక్.. పూజలప్పుడు, దసరాకి బండి పూజ చేసేప్పుడు తప్ప ఈ సింబల్‌ని, ఈ పేరుని నేను ఎక్కడా వినలేదు తెల్సా?’’ ఆశ్చర్యం. ‘‘హ్మ్... యు నో ముగ్ధా! మా క్లాస్‌లో అప్ టు పీజీ, ఈవెన్ ఎట్ ఆఫీస్.. నాదే యూనిక్ నేమ్’’ సేమ్ సర్ప్రయిజ్ అవతలి వైపు నుంచి కూడా!‘‘చిన్నప్పుడు రాత్రిళ్లు నైట్‌మేర్స్‌తో భయపడితే .. మా నాన్నమ్మ నా బెడ్ కింద పసుపు, కుంకుమతో స్వస్తిక్ ముగ్గు వేసేది...’’ నవ్వు ఎమోజీతో. ‘‘ఇప్పుడూ వస్తాయా.. నైట్ మేర్స్?’’మళ్లీ నవ్వు ఎమోజీ.. తర్వాత తనే ‘‘అవునూ నీకు దయ్యాలంటే భయమా?’’ ‘‘హేయ్.. ఆ క్వశ్చన్ నేను అడగాలి.. ’’ స్వస్తిక్. వరుసగా ఓ నాలుగు నవ్వు ఎమోజీలు ముగ్ధ నుంచి.‘‘ఇప్పుడా..? భయమా? నాకా?’’ మళ్లీ నవ్వు ఎమోజీ.థమ్స్ అప్ పెట్టాడు స్వస్తిక్‘‘అమ్మ వస్తున్నట్టుంది. ఉంటా మరి బై..’’ ముగ్ధ. ‘‘మళ్లీ ఎప్పుడు ఆన్‌లైన్‌కి?’’ స్వస్తిక్.‘‘ఎప్పుడూ ఆన్లైనే..’’ముగ్ధ.ఈసారి స్వస్తిక్ నుంచి నవ్వు ఎమోజీ‘‘సరే.. బై ఫర్ నౌ’’ అని పెడ్తూ ఆఫ్ అయిపోయింది ముగ్ధ. ఆమె షట్‌డౌన్ చేసేకంటే కొన్ని నిమిషాల ముందు.. తలుపులు వేసున్న కూతురు గది దగ్గరికి వచ్చి తలుపు తట్టబోయింది నందిత. ‘‘నందితా.. ఏమైంది’’ అంటూ భుజమ్మీద చేయి పడేసరికి వెనక్కి తిరిగింది. ‘‘అమ్మాయి గదిలో అలికిడి వినపడితే...’’ అంటూ ఆగిపోయింది. ఆమె భుజాలు పట్టుకొనితమ గది వైపు మరలిస్తూ ‘‘అమ్మాయి పడుకుంది నందితా’’ అంటూ ఆమెను గదిలోకి తీసుకెళ్లాడు భర్త.‘‘లేదు.. పడుకోలేదు’’ అంటూ మళ్లీ కూతురు గదివైపు తిరిగే ప్రయత్నం చేసింది. ఆమె బయటకు వెళ్లకుండా తలుపులేస్తూ ‘‘పడుకో నందితా...’’ అన్నాడు అనునయంగా. కానీ నందితలో ఆందోళన ఆమెను నిద్రపోనివ్వలేదు. ‘‘శ్లోకా.. ముగ్ధ ఎఫ్బీలో ఫోటోస్ అప్డేట్ అవుతున్నాయే’’ షాకింగ్‌గా ఉంది నూర్‌కి.‘‘వ్వాట్?’’ అదిరిపడింది శ్లోక. ‘‘యెస్. స్వస్తిక్ లైక్స్ కొడ్తున్నాడు, కామెంట్స్ కూడా పెడ్తున్నాడే’’ అదే షాక్ కంటిన్యూ అవుతూ నూర్. ‘‘ఏదీ.. చూద్దాం’’ అంటూ గబగబా తన సెల్ఫోన్లో ఎఫ్బీ ఓపెన్ చేసి చూసింది. నిజమే. కూర్గ్‌కి వెళ్తూ దిగిన ఫోటోస్. ఈ పొద్దునే పోస్ట్ చేసినట్టుంది. దిమ్మ తిరిగింది శ్లోకకి. సన్నగా కాళ్లలో వణుకు. స్వస్తిక్కి ఫోన్ ట్రై చేసింది. స్విచ్డ్ ఆఫ్. అంతా అనుకున్నట్టే జరిగి ఉంటే కూర్గ్‌లో స్వస్తిక్‌ని కలిసేవాళ్లు. ముగ్ధ అతనితో ఫోన్లో మాట్లాడ్తున్నప్పుడు పక్కనుంచి వీళ్లూ ‘‘హాయ్, హలో’’ అంటూఆటపట్టించడమే తప్ప అతణ్ణి చూడలేదు, మాట్లాడలేదు ఇంతవరకు.తర్వాత రోజూ పనిగట్టుకొని మరీ ఎఫ్బీ చెక్ చేశారు నూర్, శ్లోక. ఇంకొన్ని ఫోటోస్ అప్డేట్ అయ్యున్నాయి. ఇద్దరి మొహంలో నెత్తురు చుక్కలేదు. ‘‘ఆంటీ వాళ్లు అబ్జర్వ్‌చేసి ఉంటారా? చెబ్దామా?’’ అంది నూర్. తలూపింది శ్లోక ఏదో లోకంలో ఉన్నట్టు. అదే రోజు రాత్రి..‘‘ఏమండీ... ఏమండీ’’ కలవరం నందిత స్వరంలో. ‘‘ఊ.. ’’ అంటూ బద్ధకంగా అటు తిరిగి పడుకున్నాడు ఆమె భర్త. ‘ మళ్లీ చప్పుడండీ..లేవండీ’’ భర్తను తట్టి లేపుతోంది. ‘‘ఏంలేదు .. పడుకో’’ కళ్లు మూసుకునే జవాబు చెప్పాడు భర్త. ‘‘కాదండీ.. ల్యాప్‌టాప్ కీబోర్డ్ శబ్దం వినిపిస్తోంది’’ అంటూ ఆయన వీపు తడుతోంది. ‘‘అబ్బబ్బ..నీ అనుమానంతో చంపుతున్నావ్! నిద్రపోనివ్వవా?’’ విసుక్కుంటూనే లేచి కూర్చున్నాడు. అదేమీ పట్టించుకోకుండా ‘‘వినండీ’’ అంటూ తలను కాస్త వంచి చెవులు రిక్కించింది నందిత. నిర్లక్ష్యంగా కుడిచేతి చిటికెన వేలును కుడి చేవిలో పెట్టుకొని తిప్పుకుంటూ ముసుగుదన్నబోతూ ఆగాడు. ఆమె ఏదో చెప్పబోతుంటే ‘‘ష్...’’ అని నోటి మీదవేలువేసుకుంటూ నెమ్మదిగా మంచం దిగాడు. గది తలుపులు తెరిచాడు. ‘‘స్లక్.. స్లక్.. స్లక్.. స్లక్.. ’’ల్యాప్‌టాప్ కీబోర్డ్ టైప్ చేస్తున్న శబ్దం చాలా స్పష్టంగా వినపడుతోంది. ఆ నిశ్శబ్ద రాత్రిలో. అడుగులోఅడుగు వేసుకుంటూ కూతురి గది దగ్గరకు వెళ్లాడు. వెనకాలే భార్య కూడా. టక్కున కీబోర్డ్ శబ్దం ఆగిపోయింది. భార్య వంక చూశాడు. ‘‘నేను చెప్పలేదా?’’ అన్నట్టు చూసింది భర్తను. ‘‘ఉదయం నూర్ వాళ్లూ ఫోన్‌చేశారు.. ముగ్ధ ఎఫ్బీలో యాక్టివ్‌గా ఉందని’’ యాడ్ చేసింది నందిత.కూతురి గది తలుపు తెరిచాడు. స్టడీ టేబుల్ మీదున్న ల్యాప్‌టాప్ ఆన్‌లో ఉంది. ఆమె ఫేస్బుక్లో చాట్ విండో ఓపెన్ చేసి ఉంది. కుర్చీలో కూర్చున్నాడు విష్ణు. పక్కనే నందిత నిలబడింది.వణుకుతున్న చేతులతో కర్సర్‌ను కదిలిస్తూ చాట్ చదవడం ఆరంభించాడు. దాదాపు రెండు మూడు నెలల నుంచి ఆ కిందటి క్షణం దాకా చాటింగ్ సాగుతూనే ఉంది. ఎముకలు కొరికే చలిలోకూడా చెమటలను పుట్టిస్తోంది భయం. సెకన్లలోనే తేరుకుని మంచం కింద, కప్బోర్డ్ పైన, బాత్రూమ్లో.. ఇల్లంతా.. ఇంటి ముందు వాకిలి, వెనక పెరడు.. అంతా వెదికాడు భర్త. ఎక్కడా ఏ అనవాలూ లేదు. మరి ఈ చాటింగ్ ఏంటీ? నందిత అయితే స్థాణువైంది.ఇన్నాళ్లూ తన భార్యది భ్రమ, భ్రాంతి అనుకున్నాడు.కానీ కాదు. గబగబా స్వస్తిక్ ఎఫ్బీ ఎకౌంట్ చూశాడు. ఫోన్ నంబర్ ఉంది. తలుపులు తెరిచాడు సుభాష్. ఎదురుగా ఉన్న జంటను చూసి త్వరగానే పోల్చుకున్నాడు ఆ ఉదయం ఫోన్ చేసిన వారే అయ్యుంటారని. అయినా ‘‘నేను విష్ణు.. తను నా మిసెస్ నందిత’’ అంటూ పరిచయం చేసుకున్నాడు విష్ణు.‘‘అనుకున్నానండీ మీరే అని.. రండి.. రండి’’ అంటూ సాదరంగా లోపలకి ఆహ్వానించాడు సుభాష్. ‘‘కూర్చోండి’’ అని సోఫా చూపిస్తూ వాళ్లావిడను కేకేశాడు. నందిత వయసున్న స్త్రీయే వచ్చింది లోపలి నుంచి. పరిచయం చేశాడు సుభాష్. ఆ జంట కూడా నందితా వాళ్లకు ఎదురుగా ఉన్న సోఫాలో కుర్చున్నారు. గొంతు సవరించుకున్నాడు విష్ణు ఏదో గంభీరమైన విషయం చెప్పడానికి నాందిగా. ‘‘సర్.. మా అమ్మాయి ముగ్ధ. టీసీఎస్‌లో పనిచేసేది’’ చెప్తూన్నాడు. ఆసక్తిగా వింటున్నారు సుభాష్, అతని భార్య. ‘‘మా అమ్మాయికి మీ అబ్బాయి ఎప్పుడు పరిచయమయ్యాడో తెలీదు కానీ రెండుమూడు నెలల నుంచి చాటింగ్ చేసుకుంటున్నట్టున్నారు. మాకు నిన్ననే తెలిసిందండీ.. నిన్న కూడా మా అమ్మాయి మీ అబ్బాయితో చాట్ చేసింది’’ అంటూ ఆపాడు చిన్న నిట్టూర్పుతో విష్ణు. ఇప్పుడు సుభాష్ తన భార్య వంక చూశాడు. ఆమె.. నందిత, విష్ణుల వైపు విస్మయంగా చూసింది.‘‘ఒక్కసారి లోపలికి వస్తారా?’’ ఆ ఇద్దరినీ అడిగింది సోఫాలోంచి లేస్తూ. ఆ ఇద్దరికీ అయోమయం.సుభాష్‌ను చూశారు. ‘‘రండి’’అంటూ తనూ సోఫాలోంచి లేస్తూ ముందుకు సాగాడు. ఆ జంటను అనుసరిస్తూ నందిత, విష్ణూ ఓ గదిలోకి వెళ్లారు. అశనిపాతం తగిలినట్టు చేష్టలుడిగిపోయారు. ఎదురుగా గోడ మీద లైఫ్ సైజ్ ఫోటోకి దండ వేసి ఉంది. ‘‘ఈ అబ్బాయి..’’ అంటూ ఆగింది నందిత. ‘‘మా అబ్బాయే! స్వస్తిక్. యేడాది అవుతోంది...’’ గొంతు పెగల్లేదు ఆమెకు బాధతో.‘‘మా అమ్మాయి కూడా. ఇరవై రోజులకిందట కూర్గ్‌కి వెళుతూ యాక్సిడెంట్లో’’ పూర్తిచేయలేకపోయింది నందిత ఈసారి ఆ ఇద్దరూ అప్రతిభులయ్యారు. - సరస్వతి రమ -
రూపాయి రికవరీ.. 72.18 వద్ద ముగింపు..
ముంబై: కొత్త కనిష్ట స్థాయికి పడిపోతున్న రూపాయి బుధవారం కొంత కోలుకుంది. డాలర్‌తో దేశీ కరెన్సీ మారకం విలువ 51 పైసలు బలపడి 72.18 వద్ద ముగిసింది. రూపాయి మరీ పడిపోకుండా తగు చర్యలు తీసుకుంటామని ఆర్థిక శాఖ భరోసా కల్పించడం దీనికి తోడ్పడింది. మొదట్లో ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ బుధవారం కూడా 72.91 స్థాయికి పడిపోయి కొత్త కనిష్టాన్ని నమోదు చేసింది. ఈ వారాంతంలో ప్రధాని మోదీ ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ ట్వీట్ చేయడం కొంత ఊతమిచ్చింది. పతనాన్ని అడ్డుకుంటాం..: డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ‘అసంబద్ధ స్థాయి’కి పడిపోకుండా ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ అన్ని చర్యలు తీసుకుంటాయని గర్గ్ స్పష్టం చేశారు. రూపాయి ఆల్‌టైమ్ కనిష్టానికి పతనం కావడం వెనుక హేతుబద్ధత లేదని, మార్కెట్ ఆపరేటర్ల ఓవర్రియాక్షన్ను ఇది ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్లో ఈ మేరకు ఆయన పోస్ట్ చేశారు. క్రూడ్ ధరలు పెరుగుతుండటం, విదేశీ ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటుండటం తదితర అంశాల నడుమ రూపాయి క్షీణత కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. -
క్రికెట్ బెట్టింగ్ కేసులో సుభాష్ అరెస్ట్
నెల్లూరు(సెంట్రల్): క్రికెట్ బెట్టింగ్ కేసులో టీడీపీ నేత దువ్వూరు శరత్చంద్ర కుమారుడు దువ్వూరు సుభాష్‌ను ఆరోనగర పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. సుభాష్ అరెస్ట్‌లో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. పది రోజుల క్రితమే సుభాష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నప్పటికీ రాజకీయ ఒత్తిళ్లతో నామమాత్రపు కేసులు పెట్టి అరెస్ట్ చూపించినట్లు తెలుస్తోంది. సుభాష్ వద్ద నుంచి రెండు సెల్ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, రూ.1,540 నగదును కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు బాలాజీనగర్ పోలీసులు తెలిపారు. -
బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు..
సాక్షి, నల్గొండ : జిల్లాలోని దేవరకొండ మండలం ముదిగొండలో దారుణం జరిగింది. సందగళ్ల సుభాష్(28) అనే యువకుడిని అతి కిరాతకంగా బతికుండగానే పెట్రోల్ పోసి చంపేశారు. మృతుని మానసిక స్థితి సరిగా ఉండదని గ్రామస్థులు చెపుతున్నారు. కాగా దుండగులు అర్ధరాత్రి సమయంలో సుభాష్ కాళ్ళు, చేతులు కట్టేసి ఊరి బయట పొలాల్లో ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. మృతుని కుటుంబ సభ్యులు అంతా దేవరకొండలో ఉంటారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
విజేతలు పాషా, సుభాష్
జాతీయ కుంగ్-ఫు చాంపియన్‌షిప్ సాక్షి, హైదరాబాద్: జాతీయ కుంగ్-ఫు-వుషూ చాంపియన్‌షిప్‌లో ఎస్వీ మోడల్ స్కూల్ విద్యార్థులు సత్తా చాటారు. నాసిక్‌లో జరిగిన ఈ చాంపియన్‌షిప్‌లో రెండు స్వర్ణాలు, రెండు రజతాలు, రెండు కాంస్యాలు సహా ఆరు పతకాలను సాధించారు. అండర్-14 విభాగంలో 45-50 కేజీ కేటగిరీలో అబ్దుల్ పాషా... 41-45 కేజీ కేటగిరీలో పీఆర్‌ఎస్‌వీ సుభాష్ విజేతలుగా నిలిచి పసిడి పతకాలను కై వసం చేసుకున్నారు. 35-40 కేజీ కేటగిరీలో కేశవ్ రజత పతకాన్ని దక్కించుకున్నాడు. అండర్-15 విభాగంలో నరేశ్ (50-55కేజీ) రజతాన్ని సంపాదించగా... వెంకటేశ్ (65-75కేజీ), మొహమ్మద్ ఖాజా పాషా (50-55 కేజీ) కాంస్య పతకాలను గెలుచుకున్నారు. -
కిరాణాషాపులో ఉరివేసుకుని వ్యక్తి ఆత్మహత్య
జగద్గిరిగుట్టలోని లక్ష్మీట్రేడర్స్ కిరాణా షాపులో సుభాష్(45) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు అదే కిరాణా షాపు యజమానిగా గుర్తించారు. మంగళవారం రాత్రి సమయంలో ఉరివేసుకుని ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
328 ఒప్పందాలు
-
సక్సెస్‌కి నిజమైన సింబల్
దేడ్ కహానీ - ఇక్బాల్ * లక్ష్యం విలువను చెప్పే చిత్రం * లక్ష్య సాధనను నేర్పే చిత్రం * విజయానికి అర్థం చెప్పే చిత్రం 1967, మార్చి 30న హైదరాబాద్‌లో కె.ఎస్.నాయుడు, కుసుమా సుదర్శన్ అనే దంపతులకి కుకునూరు నగేష్‌నాయుడు కొడుకుగా పుట్టాడు. మామూలుగా అందరిలో ఒకడిగా పెరిగాడు. పెరుగు తూనే ఇంటి దగ్గరే ఉన్న నారాయణగూడ థియేటర్లలో తెలుగు, హిందీ, ఇంగ్లిషు సినిమాలు చూస్తుండేవాడు. హైస్కూలు అయ్యాక ఇంజినీరింగ్ చేశాడు. అమెరికా లోని అట్లాంటాలో మాస్టర్స్ చేశాడు. అక్కడే ఫిల్మ్ స్కూల్లో యాక్టింగ్, డెరైక్షన్ కోర్సులు చదివాడు. చదువుకుంటున్న రోజుల్లో అమెరికాలో మాస్టర్స్ చదివే చాలామంది విద్యార్థుల్లాగే చిన్నా చితకా పనులు చేస్తూ, ఆ వచ్చిన సంపాదనలో మిగిల్చిన డబ్బు (డాలర్లు) తీసుకుని హైదరాబాద్ వచ్చేశాడు. ఇక్కడిదాకా మామూలు కథే. ఇక్కడే ఉంది కీలకం. అతని దగ్గర నలభై వేల డాలర్లు ఉన్నాయి... 2000వ సంవత్సరంలో. అప్పుడు భారతదేశంలో రూపాయల్లో కొలిస్తే సుమారు పదిహేడు లక్షల రూపాయలు. ఒక సినిమా తీయాలి అని కసిగా అనుకున్నాడు. కథ రాసుకున్నాడు. పుట్టిన గడ్డమీద మమకారంతో, అక్కడి జీవన విధానం మీద ఉన్న అవగాహనతో ‘హైదరాబాద్ బ్లూస్’ సినిమా నిర్మించి, రచించి, దర్శకత్వం వహించి, తనే హీరోగా నటించేశాడు. మొదటిసారి హైదరాబాదీ ఉర్దూని తెలుగు, ఇంగ్లిషు మిక్సీ చేసిన టింగ్లిషు సినిమాలో రుచి చూపించాడు. ఒక ఎన్నారై చాలాకాలం తర్వాత హైదరాబాద్ వస్తే, తనే తన సొంత ఊళ్లో ఫారిన్ వచ్చినట్టు ఫీలౌతాడు. సహజత్వంతో గుబాళించిన ఆ చిత్రం ఆ టైమ్‌లో హైదరాబాద్, బెంగళూర్, ముంబై లాంటి మహా నగరాలలో ఆరేసి నెలలు ఆడేసింది. దాదాపు ఎనిమిది కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇది అంతర్జాతీయ దర్శకునిగా ఎదిగిన కుకునూరు నగేష్ నాయుడు అలియాస్ నగేష్ కుకునూర్ ఘనత. ప్రతి తెలుగువాడూ గర్వించదగ్గ తెలంగాణ ముద్దుబిడ్డ నగేష్. తన మొదటి చిత్రంతోనే ఇంటర్నేషనల్ అవార్డులు, జాతీయ అవార్డులు అందుకున్న దర్శకుడు, చిన్న మొత్తంతో పెద్ద లాభం వచ్చే సినిమా తీయడం ఎలాగో తెలిస్తే ఇక ఆగుతాడా? దూసుకుపోయాడు. కమర్షియల్ సినిమాకి, ప్యారలల్ సినిమాకి మధ్యస్థంగా కమర్షియల్ ప్యారలల్ సినిమాలని రూపొందించడం నేర్చుకున్నాడు. దర్శకుడి గురించిన కథే ఇంత ఇన్స్పైరింగ్గా ఉంది. ఇక అతను, ఒక సామాన్య నిరుపేద యువకుడు భారతీయ క్రికెట్ టీమ్‌లో ఫాస్ట్ బౌలర్ అవ్వాలని కలగని, అవి నెరవేర్చుకున్న కథని సినిమాగా తీస్తే ఇంకెంత ఇన్స్పైరింగ్గా ఉంటుంది? నిజంగానే ఇన్స్పైర్ చేసింది. అదే, ‘‘ఇక్బాల్’’ చిత్రం. శ్రేయాస్ తల్పాడే అనే నూతన నటుడు ఇక్బాల్‌గా జీవించిన చిత్రం. ఈనాటి కథానాయిక శ్వేతాబసు ప్రసాద్ ఇక్బాల్ చెల్లెలిగా అందరినీ ఎంతగానో అలరించిన చిత్రం. నసీరుద్దీన్ షా, గిరీష్ కర్నాడ్ లాంటి మహామహు లంతా అలవోకగా, అద్భుతంగా పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసిన చిత్రం. మన దేశంలో అనధికారిక మతమైన క్రికెట్ నేపథ్యంగా నడిచే కథ అది. ఎన్నేళ్ల తర్వాత చూసినా, ఎన్నిసార్లు చూసినా మళ్లీ మళ్లీ స్ఫూర్తిని నింపే కథ. అలాగని చాలా సీరియస్‌గానో, ఏడిపించే లాగానో ఉంటుందనుకుంటే పొరపాటు. ఎంటర్టైనింగ్గా ఉంటూనే మనసుల్ని కదిలిస్తుంది. చెవులు వినపడని, నాలుక మాట్లాడని కుర్రాడు ఇక్బాల్. అతని సైగల్ని చెల్లెలు అందరికీ అర్థమయ్యేలా ట్రాన్స్‌లేట్ చేస్తుంటుంది. అలాంటివాడు క్రికెట్లో ఎదగాలని కలగనడం, దానికోసం కష్టపడడం - ఈ ఆలోచన ఎంత అసహజంగా, ఇల్లాజికల్‌గా, కల్పనగా, తోస్తుందో అంత సహజంగా, లాజికల్‌గా, కథగా మలిచాడు దర్శకుడు. 1983లో కపిల్‌దేవ్ మ్యాచ్ ఆడు తుంటే, ఒక మారుమూల కుగ్రామంలో చెట్టుకి ట్రాన్సిస్టర్ కట్టేసుకుని ఊరి ప్రజలంతా ఆసక్తిగా హిందీలో కామెంటరీ వినడంతో ఇక్బాల్ చిత్రం మొదలౌతుంది. ఆ మ్యాచ్‌ని అమితాసక్తిగా వింటున్న ఓ నిండు గర్భిణి, భారత్ గెలిచిందన్న వార్తతో ఊరివాళ్లతో బాణసంచాల మధ్య డ్యాన్స్ చేస్తూ చేస్తూ గర్భం దాల్చుతుంది. ఆ ఆనందోత్సాహాల ఫలితమే కడుపులో ఉన్న శిశువుకి చెవుడు, మూగతనం రావడం. ఆ తల్లి అమితాసక్తికి ఫలితమే ఆ శిశువుకి క్రికెట్ ఆటే ప్రాణప్రదంగా, జీవితంగా, ఊపిరిగా తోచడం. ఇక్బాల్ తండ్రి సన్నకారు రైతు. ఇక్బాల్ తనకి పొలం పనుల్లో సాయం చేసి రోజూ రొట్టె తింటూ, అందరి మధ్య గౌరవంగా బతకాలని భావిస్తాడు తండ్రి. క్రికెట్ ఆటతో జీవితాన్ని పాడుచేసుకోవద్దని హితవు చెప్తూ కొడుకు ఇక్బాల్‌కి, భార్యకి, కూతురికి, ఇక్బాల్ గురువు మోహిత్ (నసిరుద్దీన్‌షా)కి విలనౌతాడు. తండ్రి నిరుత్సాహ పరచినా వెనకడుగు వేయని మొండివాడు ఇక్బాల్. అనేకానేక మలుపుల తర్వాత స్వచ్ఛమైన ప్రదర్శన ఆధారంగా, జాతీయ సెలెక్టర్‌గా అతిథి పాత్ర పోషించిన కపిల్‌దేవ్ మూలంగా రంజీ టీమ్‌లో చోటు దక్కించుకుంటాడు. చివరికి భారత జట్టుకి ఎంపికవడం, తండ్రి పొలం బ్యాంకువారు జప్తు చేస్తుంటే తనే డబ్బివ్వగలిగే స్థాయికి రావడంతో చిత్రం ముగుస్తుంది. తల్లికి క్రికెట్ అంటే ప్రేమ. కొడుకు ఇక్బాల్ అంటే ప్రేమ. ఇక్బాల్ క్రికెట్ ఆడుతుంటే చూడాలని కోరిక. పల్లెటూరి ప్రజల మనస్తత్వాలు, భావోద్వేగాలు, ఆటగాడిగా జీవితంలో ఓడిపోయి ఆ ఫ్రస్ట్రేషన్లో తాగుబోతుగా మారిన మోహిత్ (నసీరుద్దీన్ షా) ఇక్బాల్ పట్టుదల వలన మంచి గురువుగా ఎదగడం అంతర్లీనంగా ఇంకో కథ. అడ్డదారిలో ఇండియన్ టీమ్‌లో ఓ వెలుగు వెలిగి ఆ పరిచయాలతో అకాడమీ నెలకొల్పి డబ్బుకి అమ్ముడుపోయి, తన శిష్యుడు కమల్‌కి (ఆదర్శ్ బాలకృష్ణ) భారత జట్టులో చోటు దక్కించే ప్రయత్నంలో ఇక్బాల్ చేతిలో ఓడిపోయిన గురువుగా గిరీష్ కర్నాడ్ నటన అద్భుతంగా ఉంటుంది. ఒక ఆటలో ఒకరి ఉత్థానం, ఇంకొకరి పతనం ఒకే కథలో పెనవేసుకుపోవడం వలన ఈ కథని బలంగా అల్లినట్టు అనిపిస్తుంది. ఈ చిత్రం తర్వాత కథకుడు విపుల్.కె.రావల్‌కి, దర్శకుడు నగేష్ కుకునూర్కి బాలీవుడ్లో చాలా అవకాశాలు వచ్చాయి. చిత్రం ఏమిటంటే, వ్యక్తిగత కారణాల వల్ల నగేష్‌తో కలిసి పనిచేయనని విపుల్.కె.రావల్ ప్రకటించడం! కథ కన్నా ఆ కథని మలచిన దర్శకుడికే ఎక్కువ మార్కులు రావడం కొన్ని సినిమాలకి జరుగుతుంటుంది. అప్పుడు రచయితలు ఆ దర్శకులతో మళ్లీ జత కట్టడానికి ఆసక్తి చూపరు. ఇలాంటి కినుకులు ఈ పరిశ్రమలో సాధారణం. సలీమ్ - సులేమాన్, హిమేష్ రేషమియా కలిసి రూపొందించిన ఈ చిత్రం ఆడియో కూడా బాగానే ఉంటుంది. సాధారణంగా ఏ సినిమాలో అయినా సన్నివేశాలుంటాయి. కానీ చాలా తక్కువ సినిమాల్లో సన్నివేశాలు ఉండవు. మూమెంట్స్ ఉంటాయి. ఆ అనుభూతులు మనకు గొప్ప అనుభూతిని మిగులుస్తాయి. ఇక్బాల్ అదే చేస్తుంది. ఈ చిత్రంలో చాలా సందర్భాల్లో మాటలు, హావభావాలు నేరుగా మనసుకి తగిలేస్తూ ఉంటాయి. అన్నిటికన్నా గొప్ప విషయం ఏంటంటే, ఈ చిత్రాన్ని సుభాష్ ఘాయ్ స్వయంగా తన ‘ముక్తా సెర్చ్‌లైట్ ఫిల్మ్స్’ పతాకంపై నిర్మించడం. భారతదేశం గర్వించదగ్గ మోడరన్ షో మ్యాన్ ఆఫ్ బాలీవుడ్ సినిమాగా సుభాష్‌కి పేరు. అలాంటి ఆయన ఇలాంటి చిత్రం తీయడం నిజంగా విశేషమే! ఏ గొప్పవాడి ప్రమేయమూ దర్శకుడి పనితనాన్ని, ప్రతిభని దాటిపోకపోవడం ఈ చిత్రం ప్రత్యేకత. అందుకే ‘ఇక్బాల్’ పెట్టిన డబ్బుకి ఆరు రెట్లు ఎక్కువ వసూలు చేసింది. కమర్షియల్ ప్యారలల్ సినిమాగా ప్రపంచవ్యాప్తంగాను, మనదేశ వ్యాప్తంగానూ పలు అవార్డులు అందుకొంది. కొసమెరుపు: నగేష్ కుకునూర్ మాస్టర్స చదివిన అట్లాంటాలో... మా బంధువులైన శ్రీ శివ గడ్డమణుగు గారింట్లో కూర్చుని... నేను ఈ సినిమాని మళ్లీ చూడడం, ఈ వ్యాసం రాయడం యాదృచ్ఛికం. కానీ నాకో గొప్ప అనుభవం. అంత మంచి సినిమాను మళ్లీ చూడటం, అనుభూతి చెందడం, ఆ సినిమా విశేషాలను మీతో పంచుకోవడం నిజంగా విశేషం! -
9వ తరగతి.. 6వ నెల
పసుపు శుభానికి చిహ్నం. ఒక ఆడపిల్ల పుట్టి, ఎదిగి, విద్యాబుద్ధులతో ప్రయోజకురాలయ్యి, వివాహం చేసుకొని కళకళలాడుతుంటే అది శుభం. శుభప్రదం. కాని- ఈ చిన్నారికి జరిగింది శుభం కాదు. తీవ్ర అన్యాయం. అందుకే ఇవాళ పేజీకి పసుపుపూత పూయలేకపోయాము. నిరసనగా నలుపునే వదిలేశాము. ఈ నిరసన సమాజం నుంచి కూడా రావాలి. ఒక అక్షరానికి వేయి కాగడాలు తోడైనప్పుడే చీకటి నలుపు పోతుంది. పసుపు విరబూస్తుంది. పిల్లలను రంగులు ఆకర్షిస్తాయి. కాని- ఊసరవెల్లి ఒంటి మీద కూడా రంగులుంటాయి. భద్రం... జర భద్రం!! అది నిజామాబాద్ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఊరి చివర రచ్చబండ దగ్గర జనం గుమిగూడి ఉన్నారు. అంతలో అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చి వారి ముందు నిలబడిందో అమ్మాయి. ఆమె ముఖంలో ఏదో భయం. కళ్ల నిండా దైన్యం. ఆ అమ్మాయిని చూస్తూనే కొన్ని కనుబొమలు పైకి లేచాయి. కొన్ని నోళ్లు పక్కవారి చెవుల్లో గుసగుసలాడటం మొదలుపెట్టాయి. అది చూసి ఆ పిల్ల మరింత ముడుచుకుపోయింది. పొంగుకొస్తోన్న దుఃఖాన్ని పంటి బిగువున అదిమిపెట్టి... పొట్ట తడుముకుంది. తొమ్మిదో తరగతి చదువుతోన్న తన కడుపులో ఆరు నెలల బిడ్డ. తప్పు చేశానన్న భావన ఓపక్క, ఆ తప్పు వల్ల ఈరోజు తను, తన తల్లిదండ్రులు ఇంతమంది ముందు తలవంచుకోవాల్సి వచ్చిందన్న బాధ మరోపక్క చిత్రవధ చేస్తుంటే... నీళ్లు నిండిన కళ్లతో నిస్సహాయంగా చూస్తూ నిలబడింది. వాదనలు మొదలయ్యాయి. వాదోపవాదాలు పూర్తయ్యాయి. చివరికి ఒక పెద్దాయన గొంతు సవరించుకున్నాడు. ‘చిన్న వయసులో చేయకూడని తప్పు చేసింది సరిత (పేరు మార్చాం). కానీ ఆ తప్పులో తనకు భాగం లేదంటున్నాడు సుభాష్ (అసలు పేరు కాదు). కాబట్టి ఇక చేసేదేమీ లేదు. సరితకు అబార్షన్ చేయించి, ఇక మీదటైనా ఆమెని అదుపులో పెట్టుకోవాలని పంచాయతీ తల్లిదండ్రుల్ని ఆదేశిస్తోంది’ అంటూ తీర్పు వెల్లడించాడు. ఉలిక్కిపడింది సరిత. ఎదురుగా నుంచుని ఉన్న ఇరవై రెండేళ్ల అబ్బాయి వైపు దీనంగా చూసింది. అతడు అప్పటికైనా తనను అంగీకరిస్తే బాగుణ్ను అన్న చిన్న ఆశ కొడిగడుతూ కనిపించింది ఆమె కళ్లల్లో. కానీ అతడికి ఆమె చూపుల్లోని భావం అర్థం కాలేదు. అర్థం చేసుకునే ప్రయత్నమూ చేయలేదు. తను తప్పు చేశానన్న పశ్చాత్తాపం కానీ, తనను నమ్మిన అమ్మాయికి అన్యాయం చేస్తున్నానన్న బాధ కానీ అతడిలో కాస్తయినా లేవు. అతనినా తను నమ్మింది? ఏం చేయాలో తోచక, ఎలా స్పందించాలో అర్థం కాక, ఇది అన్యాయం అంటూ అరిచే ధైర్యం లేక అక్కడే కూలబడిపోయింది. సరితే కాదు. ఇవాళ మన దేశంలోని చాలామంది ఆడపిల్లల పరిస్థితి ఇదే. సుభాష్‌లాంటి మాయగాళ్లు విసిరిన ప్రేమ వలలో అమాయకంగా చిక్కుకున్న చిట్టితల్లులెందరో. ఛిద్రమైన కలలను, చితికిపోయిన జీవితాలను చూసుకుని కన్నీళ్లతో బతకలేక, ధైర్యం చేసి చావలేక... ప్రతిక్షణం చస్తూ బతుకుతోన్న బంగారుతల్లులెంతమందో. లోపం ఎక్కడుంది?! మైనర్ ఆడపిల్లలు ప్రేమలో పడి మోసపోతున్న కేసులు గత పదేళ్లలో బాగా పెరిగిపోయాయని నేషనల్ క్రైమ్ రికార్డులు చెబుతున్నాయి. ఆడపిల్లల కోసం ఇప్పటివరకూ ఎన్నో చట్టాలు వచ్చాయి. కానీ ఏ చట్టమూ వారిని ఎందుకు సంరక్షించలేకపోతోంది? అమ్మాయిలను కాపాడేందుకు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు, హక్కుల సంఘాలు కృషి చేస్తున్నాయి. అయినా మన ఆడపిల్ల ఇప్పటికీ ఎందుకు మోసానికి గురవుతోంది? ఎక్కడ ఉంది లోపం? సరిత చిన్నపిల్ల. అంత చిన్నపిల్లని తల్లిని చేశాడు సుభాష్. అది నేరమని తెలియకే అతడలా చేశాడనుకోవాలా? పైగా ఆ అమ్మాయి ఎవరో తెలీదని పంచాయతీ ముందు చెప్పాడు. అంత దారుణంగా మోసం చేసినందుకు అతడిని తప్పుబట్టాలా లేక ఇలాంటి ఎన్నో కేసుల్లో నేరస్థుడి తరఫువాళ్లు చెప్పినట్టు తెలీక చేశాడనో, పరిస్థితులలా వచ్చాయనో నమ్మాలా? కూతురికి అన్యాయం జరిగిందని తెలియగానే సరిత తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లలేదు. పంచాయతీకి వెళ్లారు. ఆ తర్వాతే పోలీసులను ఆశ్రయించారు. అంటే వారికి చట్టాల గురించి తెలీదనుకోవాలా లేక వాటిపై నమ్మకం లేదనుకోవాలా? ఓ ఆడపిల్ల బతుకు అన్యాయమైపోయింది. పెళ్లి కాకుండానే తల్లి కాబోతోంది. ఆమె పట్ల జరిగిన దారుణాన్ని తీవ్రంగా పరిగణించకుండా, ఆరోనెలలో అబార్షన్ చేస్తే ఆమె ప్రాణానికే ప్రమాదమని కూడా ఆలోచించకుండా తీర్పు ఇచ్చిన పంచాయతీ పెద్దలది అమాయకత్వమనుకోవాలా? చట్టాల గురించిన అవగాహనా రాహిత్యమనుకోవాలా? తమ కొడుకు ఓ ఆడపిల్లని మోసం చేశాడని తెలిసి కూడా సుభాష్ తల్లిదండ్రులు అతణ్ని మందలించలేదు. పైగా పంచాయతీ పెద్దలను, పోలీసులను ప్రలోభపెట్టడానికి ప్రయత్నించారు. పోలీసులకు దొరక్కుండా కొడుకు తప్పించుకుపోవ డానికి సాయపడ్డారు. దీన్ని కొడుకు మీద ప్రేమ అనుకని వదిలేయాలా లేక నేరమని శిక్షించాలా? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరు చెబుతారు! సరితకు న్యాయం ఎవరు చేస్తారు! విలువలు తెలిసినవాళ్లమని విర్రవీగుతాం. ఆడవాళ్లను దేవతలుగా కొలిచే దేశం మనదని విదేశాలకు వెళ్లి మరీ గొప్పలు చెప్పుకుంటాం. ఎక్కడి నుంచో ఓ రాబందు వచ్చి, మన గడపలో పూసిన పసిమొగ్గను తన పాదాల కింద నలిపేస్తుంటే చూస్తూ ఊరుకుంటున్నాం. ఆడుకునే వయసులో తమ కడుపున బిడ్డను మోస్తుంటే... జరిగిన అన్యాయాన్ని తుడిచేయలేక, జరగాల్సిన న్యాయాన్ని సాధించుకోలేక మౌనంగా ఏడుస్తున్నాం. ప్రేమ అనే పవిత్రమైన పదానికి మోసం అనే కొత్త అర్థాన్ని కల్పిస్తున్న కామాంధులని చట్టపరంగా శిక్షించలేక నిస్సహాయంగా నిలబడిపోతున్నాం. ఎవరు తీరుస్తారు మన ఆడపిల్లల కష్టాన్ని! ఎవరు తుడుస్తారు మన ఆడపడుచుల కన్నీళ్లని! ఎవరు సృష్టిస్తారు నిర్భయ భారతాన్ని!! - సమీర నేలపూడి, సాక్షి ఫ్యామిలీ ప్రతినిధి ఇది ముమ్మాటికీ నేరం! ఐపీసీ సెక్షన్ 376, నిర్భయ చట్టాల దృష్ట్యా ఇది తీవ్రవైన నేరం. ఆ అమ్మాయి తన ఇష్ట ప్రకారమే దగ్గరైనా, ఆమె మైనర్ కాబట్టి దీన్ని రేప్‌గానే పరిగణిస్తుంది చట్టం. ఇలాంటి కేసుల్లో నేరస్థులు చార్జిషీటును బలహీనపర్చి తప్పించుకుంటున్నారు. అలా జరక్కుండా ఉండాలంటే విచారణ మెజిస్ట్రేట్ పర్యవేక్షణలో జరగాలి. - ఎస్.ప్రదీప్‌కుమార్, న్యాయవాది ఇది వారి వైఫల్యమే! పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు, టీచర్లు ఎప్పటికప్పుడు గమనించాలి. సరిత ఒక అబ్బాయిని చాటుగా కలిసింది. దగ్గరైంది. ఆ నిజాలు దాచిపెట్టింది. భయంతోనో, అపరాధభావంతోనో ఆమె ప్రవర్తనలో తప్పక తేడా వచ్చి ఉంటుంది. అది గమనించకపోవడం ఆమె తల్లిదండ్రులు, టీచర్ల వైఫల్యమే. - ప్రజ్ఞారష్మి, సైకాలజిస్టు భరోసా కల్పించాలి! సరితకి తల్లిదండ్రులు, టీచర్లు, చుట్టూ ఉండేవారి సపోర్ట్ చాలా అవసరం. జరిగినదానికి నిందించకుండా, మరోసారి అలా జరక్కుండా చూసుకొమ్మని లాలనగా చెప్పాలి. భవిష్యత్తు మీద ఆశ, భరోసా కల్పించాలి. లేదంటే తను మానసికంగా కుంగిపోతుంది. - శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక వైద్యాలయం, ఎర్రగడ్డ పోలీసులు సెన్సిటివ్‌గా ఉండాలి! ఇలాంటి సమస్యల పరిష్కారానికి పంచాయతీకి వెళ్లడమే తప్పు. ఇదేమీ ప్రేమ వ్యవహారం కాదు. లైంగిక నేరం. పోలీస్ కంప్లయింట్ ఇవ్వడమే సరైన పద్ధతి. పోలీసులు కూడా ఇలాంటి కేసుల విషయంలో సెన్సిటివ్‌గా ఆలోచించాలి. ఒత్తిళ్లకు తలొగ్గకుండా ఆ అబ్బాయికి శిక్ష పడేలా చేయాలి. - పద్మావతి, సామాజిక కార్యకర్త, కస్తూర్బా ఆశ్రమ నిర్వాహకులు -
ధ్యానం జ్ఞానం
కడ్తాల/ఆమనగల్లు: ధ్యానం చేయడం వల్ల మనస్సులోని దివ్యత్వం బయటికి వచ్చి, స్వానుభవం పొందడమే ధ్యానమని ధ్యాన గురువు సుభాష్ పత్రీజీ అన్నారు. ఆమనగల్లు మండలం కడ్తాల సమీపంలోని మహేశ్వర మహాపిరమిడ్‌లో నిర్వహిస్తున్న ధ్యాన సంబరాలు శుక్రవారం తొమ్మిదో రోజుకు చేరుకున్నాయి. తెల్లవారుజామున 5 నుంచి 7గంటల వరకు పత్రీజీ ఆధ్వర్యంలో సామూహిక వేణుగాన ధ్యానం నిర్వహించారు. ఈ సందర్భంగా ధ్యానులను ఉద్దేశించి పత్రీజీ సందేశమిచ్చారు. ధ్యానం అంటే శ్వాసమీద ధ్యా స, గొప్పపుస్తకాలు చదవడం, మంచివారితో స్నేహం చేయడం, మౌనం, శాఖాహారం తదితర పనులతో చిన్నప్పటి నుండే సాధన చేయడంతో ధ్యానం నేర్చుకోవచ్చని చెప్పారు. ధ్యానం చేస్తే వారికి వారే మిత్రుడని, ధ్యానం తెలిసినవారు యోగిలా ఉండాలన్నారు. వైరాగ్యాన్ని తిప్పికొట్టేందుకు ధ్యానం పుట్టిందన్నారు.సూక్ష్మశరీరం అనేక లోకాలు తిరిగి జ్ఞానం నేర్చుకోవడమే ధ్యానమన్నారు. భూలోకం గొప్ప ఆధ్యాత్మీక పాఠశాల అని, ఆధ్యాత్మిక అనుభవాలు పొం దడానికి మనమంతా భూలోకానిక వచ్చామని పత్రీజీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన పుస్తకాలు ఆవిష్కరించడంతో పాటు వివిధ దేశాల నుంచి వచ్చిన పిరమిడ్ మాస్టార్లు తమధ్యాన అనుభవాలను వివరించారు. రాత్రి నిర్వహించిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు ధ్యానుల ను ఆకట్టుకున్నాయి. ముంబైకి చెందిన పండిత్ మిలింద్ రాయ్కర్ వాయలెన్ సంగీతం, ఖమ్మంకు చెందిన వికలాంగుడు అరుణ్‌కుమార్ నృత్యం, స్నేహలత భరతనాట్యం, అశ్వని కూచిపూడి నృత్యం అలరించాయి. క్రిస్మస్ సందర్భంగా రెండు రోజులు సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో జనం పిరమిడ్‌ను సందర్శించేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు సాంబశివరావు, నందప్రసాద్, జెవీ రమణ, ప్రేమయ్య, రవిశాస్త్రి, నిర్మల, మాధవి, మల్లిఖార్జున్, సురేష్‌కుమార్ పాల్గొన్నారు.