ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి! | - | Sakshi
Sakshi News home page

ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!

Published Sat, Jul 29 2023 6:30 AM | Last Updated on Sat, Jul 29 2023 12:33 PM

- - Sakshi

సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్‌ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్‌ రాష్ట్రం సమస్తీపూర్‌ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్‌ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది.

ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్‌ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్‌, ఎస్‌ఐ సుభాష్‌ ప్రకటించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement