kumar
-
గురువులకు నిర్బంధ శిక్షణా?
సాక్షి, అమరావతి/నూజివీడు/నూజివీడు, ఆగిరిపల్లి: నాయకత్వ లక్షణాల అభివృద్ధిపై ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల్లో హెచ్ఎం టి.వి.రత్నకుమార్ (55) గుండెపోటుతో మృతి చెందిన ఘటన ఏలూరు జిల్లా, ఆగిరిపల్లి మండలం, తోటపలి్లలోని హీల్ ప్యారడైజ్ స్కూల్లో బుధవారం చోటుచేసుకుంది. పశ్చిమగోదావరి జిల్లా, ఉండి మండలం, ఉణుదుర్రు హైసూ్కల్ ఇన్చార్జి హెచ్ఎంగా పనిచేస్తున్న రత్నకుమార్ ఈనెల 4వ తేదీ నుంచి ఇక్కడ శిక్షణ తరగతుల్లో పాల్గొంటున్నారు.బుధవారం వేకువజామున రత్నకుమార్‌కు గుండెపోటు రాగా, తోటి ఉపాధ్యాయులు గన్నవరంలోని ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి చెందారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఇంగ్లిష్ టీచర్‌గా పనిచేస్తున్నారు. మృతుడి స్వగ్రామం గణపవరం మండలం, కేశవరం కాగా భౌతికకాయాన్ని స్వగ్రామానికి తీసుకెళ్లారు. రత్నకుమార్ ఆకస్మిక మృతితో సమగ్ర శిక్ష, అదనపు స్పెషల్ ప్రాజెక్టు డైరెక్టర్ (ఏఎస్పీడీ) కేవీ శ్రీనివాసులరెడ్డి, సీమ్యాట్ డైరెక్టర్ మస్తానయ్య, హెచ్ఎంలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో చర్చించి శిక్షణ తరగతులను రద్దు చేశారు. కాగా ఈనెల 4న ప్రారంభమైన ఈ శిక్షణ తరగతులు 9వ తేదీతో ముగియనున్నాయి. ఆగిరిపల్లిలో ప్రధానోపాధ్యాయుల ఆందోళనటీవీ రత్నకుమార్ మృతికి నిరసనగా హెచ్ఎంలు బుధవారం ఉదయం హీల్ ప్యారడైజ్ స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ ఆందోళన మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. తీవ్రమైన ఒత్తిడి, భయం, ఆందోళన, సమయానికి అందని వైద్యసాయం వల్లే రత్నకుమార్ మృతి చెందారని హెచ్ఎంలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు రోజులుగా ఉదయం 5.30 నుంచి రాత్రి 7 గంటల వరకూ నిర్విరామంగా, నిర్బంధంగా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారని వాపోయారు. 200 మందికి పైగా హెచ్ఎంలు శిక్షణ పొందుతుంటే కనీసం వైద్య సదుపాయాలు కూడా కల్పించకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎం మృతికి కారణమైన అధికారులను తక్షణమే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం కంటే టీడీపీ కూటమి ప్రభుత్వంలో మరిన్ని యాప్‌లు ఎక్కువయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. నిర్బంధ శిక్షణ నిలిపివేయాలి: ఉపాధ్యాయ సంఘాల డిమాండ్కనీస మౌలిక వసతులు లేకుండా శిక్షణల పేరిట ఉపాధ్యాయుల ప్రాణాలతో చెలగాటమాడొద్దని ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి హితవు పలికాయి. హెచ్ఎం రత్నకుమార్ మృతిపై ఉపాధ్యాయ సంఘాలు ఆవేదన వ్యక్తం చేశాయి. నిర్బంధ శిక్షణలతో ఉపాధ్యాయులను ప్రభుత్వం శిక్షిస్తోందని షెడ్యూల్డ్ ట్రైబ్స్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు జి.సుధాకర్, కార్యదర్శి కె. కుమార్ ఒక ప్రకటనలో మండిపడ్డారు. ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని, జీవో 117 రద్దు చేస్తామని ఉపాధ్యాయులను నమ్మించి, మోసగించారని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బి. మనోజ్‌కుమార్ తెలిపారు. రత్నకుమార్ మృతిని తమను కలచి వేసిందని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) రాష్ట్ర అధ్యక్షుడు ప్రకాశ్ రావు వెల్లడించారు. కుంటి సాకులతో నిర్లక్ష్యపూరితంగా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారని ఏపీ ఉపాధ్యాయ సంఘం (ఆపస్) విమర్శించింది. విశ్రాంతి లేని పని ఒత్తిడి కారణంగానే ఈ ఘటన చోటు చేసుకుందని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ స్పష్టం చేశారు. ఆగిరిపల్లి శిక్షణ కేంద్రంలో కనీస వైద్య సౌకర్యం కూడా లేదని ఫ్యాప్టో చైర్మన్ ఎల్. సాయి శ్రీనివాస్ తెలిపారు. -
ధర్మవరంలో బీజేపీ దౌర్జన్యకాండ
ధర్మవరం: శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో బీజేపీకి చెందిన మంత్రి సత్యకుమార్ అనుచరుల దౌర్జన్యాలు మితిమీరిపోతున్నాయి. నియోజకవర్గంలో షాడో ఎమ్మెల్యేగా చలామణి అవుతున్న మంత్రి అనుచరుడు హరీ‹Ùకుమార్ నేతృత్వంలో వందలాది గూండాలు, వారికి వత్తాసు పలుకుతున్న కూటమి పార్టీల నాయకులతో కలిసి సోమవారం పట్టణంలో వీరంగం సృష్టించారు. వారి దాడిలో వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, సాక్షి టీవీ విలేకరి సండ్ర రమే‹Ùతో పాటు శీలా విజయ్ కుమార్ అనే కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు.ధర్మవరం నియోజకవర్గం వెంకటగారిపల్లెలో ఇటీవల టీడీపీ నాయకుల చేతిలో దాడికి గురై.. అక్రమ కేసులతో రిమాండ్‌లో ఉన్న కార్యకర్తలను పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సోమవారం మ«ధ్యాహ్నం ధర్మవరం సబ్‌జైలుకు వెళ్లారు. కేతిరెడ్డి ఆయన వాహనాన్ని తానే నడుపుతుండగా, ఆయన డ్రైవర్ రామాంజి మరో వాహనంలో ఉన్నారు. అప్పటికే పక్కా ప్రణాళికతో అక్కడికి చేరుకున్న హరీష్‌కుమార్ నేతృత్వంలోని గూండాలు వారి వాహనాలను అడ్డుకున్నారు. కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి డ్రైవర్ రామాంజిని దుర్భాషలాడుతూ దాడికి యత్నించారు. దీంతో రామాంజి అక్కడి నుంచి వాహనంలో వెళ్లిపోయారు. అంతటితో ఆగని బీజేపీ, కూటమి శ్రేణులు సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారు. కేతిరెడ్డి సబ్‌జైలులో ఉండగా లోపలకు చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడ్డారు.వైఎస్సార్ విద్యార్థి విభాగం రాష్ట్ర సహాయ కార్యదర్శి వేముల అమర్నాథ్రెడ్డి, కార్యకర్త శీలా విజయ్‌కుమార్‌పై మూకుమ్మడిగా దాడి చేశారు. ఈ దృశ్యాలను చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్ సండ్ర రమే‹Ùపైనా పోలీసు వద్దనున్న లాఠీలను లాక్కుని మరీ బీజేపీ నాయకులు దాడి చేశారు. అనంతరం కేతిరెడ్డి కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలను పగులగొట్టారు. చోద్యం చూసిన పోలీసులు మధ్యాహ్నం 3 గంటల నుంచి కూటమి శ్రేణులు వీరంగం సృష్టిస్తున్నా పోలీసులు చోద్యం చూశారు. అంత గొడవ జరుగుతున్నా అక్కడికి ఇద్దరు కానిస్టేబుళ్లు కూడా రాలేదు. ఆ తర్వాత తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో ఏఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మరికొందరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ భద్రత మధ్య కేతిరెడ్డిని ఇంటికి తరలించారు. ధర్మవరంలో దౌర్జన్యకర సంస్కృతికి బీజం వేస్తున్నారు: మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రశాంతతకు పేరొందిన ధర్మవరంలో కూటమి నేతలు దౌర్జన్యాలు, దాడుల సంస్కృతికి బీజం వేస్తున్నారని కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సబ్‌జైలు ఘటనల అనంతరం ఆయన ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ.. మూడు నెలల్లో మంత్రి సత్యకుమార్ అనుచరులు, కూటమి పార్టీల నాయకుల దందాలు, దౌర్జన్యాలను త్వరలోనే బట్టబయలు చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ శ్రేణులను పరామర్శించేందుకు తాను ఐదుగురితో కలసి సబ్‌జైల్ వద్దకు వెళ్లానని, ఆ సమయంలో మంత్రి సత్యకుమార్ అనుచరులు తన డ్రైవర్ రామాంజిపై హత్యాయత్నానికి పాల్పడ్డారన్నారు. బీజేపీతోపాటు కూటమి పార్టీల నాయకులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన గూండాలతో సబ్ జైలు వద్ద వీరంగం సృష్టించారన్నారు. దివ్యాంగుడు, ఆరోగ్యం సరిగా లేని అమర్నాథ్రెడ్డిని, విజయ్‌ని దారుణంగా కొట్టారన్నారు. దాడిని చిత్రీకరిస్తున్న సాక్షి టీవీ రిపోర్టర్‌పైనా పోలీస్ లాఠీలతో కొట్టారని తెలిపారు. ఇంత జరుగుతున్నా పోలీసులు రాలేదని, పోలీసు స్టేసన్ కూడా సబ్ జైలు పక్కనే ఉన్నప్పటికీ పట్టించుకోలేదని తెలిపారు. మూడు గంటల పాటు పోలీసులు వారి దౌర్జన్యాలకు పూర్తిగా సహకరించారన్నారు. ధర్మవరంలో ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు మంత్రి సత్యకుమార్ తగిన గుణపాఠం చెబుతున్నారని అన్నారు. ధర్మవరంలో శాంతి నెలకొల్పేందుకు తమ ప్రభుత్వంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులో ఉంచామని, ఇప్పుడు అదే తప్పని తేలిందని కేతిరెడ్డి అన్నారు. తాజా ఘటన నేపథ్యంలో సైతం వేలాది వైఎస్సార్సీపీ కార్యకర్తలు ధర్మవరం వస్తామంటూ ఫోన్లు చేసినా శాంతింపజేశామన్నారు. కూటమి నేతలకు తగిన సమయంలో సమాధానం చెబుతామని హెచ్చరించారు. -
Anupam Kumar: 'మినీ మైన్స్'తో.. క్లీన్ ఎనర్జీ అండ్ క్లైమెట్ చేంజ్..
‘లో కాస్ట్ – జీరో వేస్ట్’ నినాదంతో ‘మినీ మైన్స్’ స్టార్టప్‌కు శ్రీకారం చుట్టారు అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్. ఈ–వ్యర్థాల నుంచి లిథియం ఎక్స్ట్రాక్షన్ చేస్తూ ఎలక్ట్రిక్ వెహికిల్(ఈవి) పరిశ్రమకు ఖర్చులు తగ్గిస్తున్నారు. దిగుమతులకు ప్రత్నామ్యాయంగా స్వావలంబనకు ప్రాధాన్యత ఇస్తూ విజనరీ ఫౌండర్స్‌గా పేరు తెచ్చుకున్నారు.. ఎలక్ట్రిక్ వెహికిల్స్ (ఈవీ)కి సంబంధించి అతి పెద్ద ఖర్చు లిథియం–అయాన్ బ్యాటరీ. మన దేశంలో లిథియం వోర్ తక్కువగా ఉంది. దీంతో దిగుమతులపై ఆధారపడాల్సిన పరిస్థితి. మరోవైపు చూస్తే ఎలక్ట్రిక్ వాహనాలు, మొబైల్ ఫోన్లు, లాప్టాప్ల బ్యాటరీలకు సంబంధించి ఈ–వ్యర్థాలు కొండలా పేరుకు పోయాయి. ఈ కొండల్లో నుంచి లిథియం వెలికి తీయగలిగితే నికెల్, కోబాల్టును సేకరించగలిగితే దిగుమతులపై అతిగా ఆధారపడాల్సిన అవసరం ఉండదు. బ్యాటరీల ఖర్చు తగ్గుతుంది. బెంగళూరు కేంద్రంగా అనుపమ్ కుమార్, అరవింద్ భరద్వాజ్లుప్రారంభించిన ‘మినీ మైన్స్’ మన దేశంలోని ఈ–వ్యర్థాల నుంచి లిథియం, నికెల్, కోబాల్ట్‌లను సేకరించి వాటిని బ్యాటరీ తయారీదారులకు విక్రయిస్తుంది. మైనింగ్ కంటే లీ–అయాన్ బ్యాటరీల నుండి భాగాలను వెలికితీయడం మంచి రాబడి ఇస్తుంది. ఒక టన్ను లిథియం ఖనిజాన్ని తవ్విప్రాసెసింగ్ చేయడం వల్ల 2–3 కిలోల లిథియం లభిస్తుందని, ఒక టన్ను బ్యాటరీలను రీసైక్లింగ్ చేయడం వల్ల 20–30 కిలోల లిథియం లభిస్తుందని, నీటిని ఆదా చేస్తుందని, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గిస్తుందని అంటున్నారు అనుపమ్, అరవింద్. ‘మన దేశంలోని స్పెంట్ బ్యాటరీల నుంచి 66 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలకు సరిపడా లిథియం అయాన్, నికెల్, కోబాల్ట్‌లను వెలికితీయవచ్చు’ అంటున్నాడు అనుపమ్ కుమార్. మొబైల్ ఫోన్, బటన్ సెల్స్, ల్యాప్‌టాప్ బ్యాటరీల తయారీకి కూడా లి–అయాన్‌ను ఉపయోగిస్తారు. లిథియం కార్బోనేట్‌ను ఫార్మాస్యూటికల్ రంగంలో, గ్లాస్ మాన్యుఫాక్చరింగ్లో ఉపయోగిస్తారు. బిర్లా ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో కెమికల్ ఇంజనీరింగ్ చేసిన అనుపమ్ కుమార్ బాబా ఆటోమిక్ రిసెర్చ్ సెంటర్లో కెరీర్ప్రారంభించాడు. అక్కడ రియాక్టర్ల వ్యర్థాల నుంచి యురేనియం, నికెల్లను వేరు చేసేవాడు. ‘లాగ్9 మెటరీయల్స్’లో అనపమ్, అరవింద్ భరద్వాజ్‌లకు పరిచయం జరిగింది. అక్కడ భరద్వాజ్ లిథియం–అయాన్ బ్యాటరీస్ డివిజన్ హెడ్‌గా ఉండేవాడు. వీరి మధ్య జరిగిన సంభాషణల్లో ‘యురేకా’ మూమెంట్ ఆవిష్కారం అయింది. అది ‘మినీ మైన్స్’ స్టార్టప్ అయింది. తమ పొదుపు మొత్తాలు 6.5 కోట్లతో కంపెనీప్రారంభించారు. మినీమైన్స్ టెక్నాలజీని నీతి ఆయోగ్ ధృవీకరించింది. ఆయిల్ ఇండియా లిమిటెడ్, ది యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రీయల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లు గ్రాంట్ ఇచ్చాయి. ‘ఎలక్ట్రిక్ వెహికిల్స్ రంగం ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటుంది. ఈ నేపథ్యంలో మినీ మైన్స్ విలువైన లోహాలను పునర్వినియోగ రూపంలో ఈవీ పరిశ్రమకు మేలు చేస్తుంది’ అంటున్నాడు ఆవాజ్ ఫౌండేషన్ కన్వీనర్ సుమైరా అబ్దులాలీ. కమాడిటీ సేల్స్, లైసెన్సింగ్/రాయల్టీ....మొదలైన వాటితో కంపెనీకి సంబంధించిన రెవెన్యూ మోడల్‌ను రూపొందించుకుంది మినీ మైన్స్. ‘ఈ–వ్యర్థాలను రీసైకిల్ చేయగలిగితే మన దేశం మరింత స్వావలంబన దిశగా పయనించడమే కాదు ఎలక్ట్రిక్ వాహన పరిశ్రమకు ఖర్చును తగ్గించవచ్చు అనుకున్నాం’ అంటాడు కంపెనీ సీయివో అనుపమ్ కుమార్. అతడి మాటలు వృథా పోలేదు అని చెప్పడానికి ‘మినీ మైన్స్’ సాధించిన విజయమే సాక్ష్యం. ఇవి చదవండి: Shambhavi Choudhary: అతి చిన్న వయసు దళిత అభ్యర్థి -
1,300 కిలోల పేలుడు పదార్థాల పట్టివేత
మహబూబాబాద్ రూరల్ : పోలీసులు 1300 కిలోల పేలుడు పదార్థాలను పట్టుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేయగా, మరొకరు పరారయ్యారు. బుధవారం మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ రాంనాథ్ కేకన్ ఈ కేసు వివరాలు వెల్లడించారు. మరిపెడ ఎస్సై తాహేర్ బాబా ఆధ్వర్యంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. వీరారం క్రాస్‌రోడ్డు వద్ద పోలీసులను గమనించిన బొలెరో వాహన డ్రైవర్ పారిపోయేందుకు ప్రయత్నించాడు. దీంతో అనుమానం వచ్చి వెంటనే వాహనం ఆపి తనిఖీ చేయ గా, అందులో బాక్సులు కనిపించాయి. అందులో పేలుడు పదార్థాలకు సంబంధించిన జిలెటిన్ స్టిక్స్, ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు లభించాయి. జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట గ్రామానికి చెందిన కస్తూరి కుమార్, మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం దంటకుంట తండాకు చెందిన బాదావత్ కిశోర్‌లను అదుపులోకి తీసుకున్నారు. కుమార్‌కు వెంకటరమణ ఎంటర్ ప్రైజెస్ పేరు మీద లైసెన్స్ ఉంది. ఆ లైసెన్స్ ప్రకారం కేవలం నిర్ణీత పరిధిలో మాత్రమే పేలుడు పదార్థాలను అమ్ముకోవాలి. కానీ తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో అక్రమంగా పేలుడు పదార్థాలను అనుమతి లేని వారికి అమ్ముతూ పట్టుబడ్డారు. కాగా, ఈ ఘటనలో జగిత్యాల జిల్లా వెలగటూరు మండలం జయదేవపేట కస్తూరి సారయ్య పరారీలో ఉన్నాడని ఎస్పీ తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ జోగుల చెన్నయ్య, తొర్రూరు డీఎస్పీ సురేష్, మరిపెడ సీఐ హతీరాం, ఎస్సై తాహేర్ బాబా, పోలీసు సిబ్బంది క్రాంతికుమార్, వెంకన్న పాల్గొన్నారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
పదహారేళ్లకు తల్లి, కొడుకులను కలిపిన బేకరీ షాప్..
ఆదిలాబాద్: పద్నాలుగేళ్ల వయస్సులో తప్పిపోయిన బాలుడు పదహారేళ్ల తర్వాత తల్లి చెంతకు చేరాడు. చిన్నతనంలోనే దూరమైన కొడుకు ఇక తమకు దొరకడేమోనని నిత్యం కన్నీటి పర్యంతమైన ఆ తల్లికి ఎదిగిన కొడుకు దరిచేరడంతో ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. ఈ సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో శనివారం చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజీపూర్ జిల్లా మహ్మదాబాద్ తహసీల్ పరిధిలోని యూసుఫ్పూర్ గ్రామానికి చెందిన సంత్రదేవి, మున్నాకుమార్ బింద్ దంపతులకు నలుగురు కుమారులు, కూతురు సంతానం. వీరిలో పెద్ద కుమారుడు మహేందర్ బింద్ అలియాస్ మనోజ్‌ను చిన్నతనంలో దగ్గరి బంధువు ముంబయి తీసుకెళ్లి హోటల్లో పనికి కుదిర్చాడు. కొద్ది రోజుల తర్వాత హోటల్లో పని మానేసి వెళ్లిపోయాడు. ఆ క్రమంలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన శివ్‌కుమార్ యాదవ్ అనే యువకుడికి తారసపడ్డాడు. తనదీ అదే రాష్ట్రమని, పని కోసం వెతుకుతున్నానని మహేందర్ బింద్ చెప్పడంతో వెంట తీసుకొచ్చి బెల్లంపల్లిలోని బేకరీలో పనికి కుదిర్చాడు. అప్పటి నుంచి ఇక్కడే పని చేస్తుండగా ఓ రోజు ఇంటిపై ధ్యాస మళ్లి బేకరీ యజమాని సుశీల్‌కుమార్ యాదవ్‌కు తన ఇంటి అడ్రస్ కనుక్కోవాలని కోరాడు. దీంతో సుశీల్‌కుమార్ ఆ రాష్ట్రంలోని తన బంధువులకు చెప్పి ఆరా తీశాడు. ఘజీపూర్ జిల్లా పోలీసులకు సమాచారం ఇవ్వడంతో యూసుఫ్‌పూర్‌లో ఉంటున్న తల్లిదండ్రుల వివరాలు ఇచ్చారు. దీంతో తల్లి సంత్రదేవి, బాబాయ్ కమలేష్బింద్, పిన్నీ బసంత్ బింద్ శుక్రవారం బెల్లంపల్లికి చేరుకున్నారు. ఆపరేషన్ చేసిన గాయం చూసి... కొడుకును వెతుక్కుంటూ రాష్ట్రాలు దాటొచ్చిన తల్లి అతడిని చూసి ఒక్కసారిగా తీవ్ర భావోద్వేగానికి గురైంది. కొడుకూ కన్నీటి పర్యంతమయ్యాడు. కొద్దిసేపటి తర్వాత తేరుకుని యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. చిన్నతనంలో గొంతుకింద చేసిన ఆపరేషన్ గాయాన్ని పరిశీలించి మహేందర్ బింద్ తన కొడుకేనని సంత్రదేవి మురిసిపోయి ముద్దాడింది. కుటుంబసభ్యులను కలిసేలా చేసిన బేకరీ షాప్ యజమాని సుశీల్ కుమార్‌యాదవ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మహేందర్ బింద్ తల్లి, బంధువులతో కలిసి రైలులో ఉత్తరప్రదేశ్‌కు బయల్దేరి వెళ్లాడు. -
ఆచూకీ తెలిపితే.. నగదు బహుమతి!
సంగారెడ్డి: నాలుగు రోజుల క్రితం బాలిక ఇంటి నుంచి వెళ్లి అదృశ్యం కాగా, ఆచూకీ తెలిపిన వారికి నజరానా ఇస్తామని జిన్నారం సీఐ వేణు కుమార్ శుక్రవారం ప్రకటించారు. ఆయన కథనం ప్రకారం.. బిహార్ రాష్ట్రం సమస్తీపూర్ జిల్లా పులహరానికి చెందిన సత్యకుమారి, శత్రుధన్ ముఖియా భార్యాభర్తలు. 6 నెలలుగా మండలంలోని మల్కాపూర్‌లో నివాసం ఉంటున్నారు. సత్యకుమారి సోదరి మనీషా కుమారి (11) 2 నెలలుగా ఆమె వద్దే ఉంటోంది. ఈనెల 25న మనీషా కుమారి తెల్లవారుజాము ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు ఎక్కడ వెతికిన ఆచూకీ లభించలేదు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాలిక బిహారీ, హిందీ మాత్రమే మాట్లాడగలదు. ఆమె ఆచూకీ తెలిస్తే 87126 56752, 87126 56730, 91775 15983 నంబర్లకు గానీ డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలని, 5 వేల నజనారా అందిస్తామని సీఐ వేణు కుమార్, ఎస్ఐ సుభాష్ ప్రకటించారు. -
సర్కారు స్కూలు పిల్లలకు ఫ్రీ
సాక్షి, హైదరాబాద్ః రాష్ట్రపతి నిలయం సందర్శనకు వచ్చే ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా ప్రవేశం కల్పించనున్నట్టు రాష్ట్రపతి భవన్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కుమార్ సమ్రేశ్ వెల్లడించారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయాన్ని ఏడాది పొడవునా సందర్శనకు అనుమతిస్తూ, ఆ మేరకు మార్చి 22 నుంచి సందర్శనకు అవకాశం కలి్పస్తూ రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈనెల 14 వరకు రాష్ట్రపతి నిలయాన్ని దాదాపు 10 వేల మంది సందర్శకులు దర్శించారని పీఆర్ఓ సమ్రేశ్ తెలిపారు. రాష్ట్రపతి నిలయ సందర్శన సమాచారాన్ని ప్రజల్లోకి మరింత తీసుకెళ్లే ఉద్దేశంతో గురువారం రాష్ట్రపతి నిలయంలో ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి నిలయంలో తీసుకువచ్చిన మార్పులు, బుకింగ్ తదితర వివరాలను రాష్ట్రపతి నిలయం మేనేజర్ డా.కె రజనీప్రియతో కలిసి ఆయన వెల్లడించారు. డిసెంబర్ మినహా ఏడాది పొడవునా.. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పర్యటన జరిగే డిసెంబర్ నెల మినహా ఏడాది పొడవునా సాధారణ పౌరుల సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతి సోమవారం, ప్రభుత్వ సెలవు దినాల్లో మినహా ఏ రోజైనా ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు సందర్శనకు అవకాశం ఉంటుందని తెలిపారు. ఆన్లైన్లో టికెట్ బుకింగ్ కోసం http:// visit.rashtrapatibhavan.gov.in వెబ్సైట్లో లేదంటే నేరుగా రాష్ట్రపతి నిలయానికి వచ్చి అక్కడి రిసెప్షన్ సెంటర్లోనూ టికెట్ తీసుకోవచ్చన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రవేశం పూర్తిగా ఉచితం అని, మిగిలిన వారికి ఒక్కొక్కరికి రూ.50 ప్రవేశ రుసుం ఉంటుందని తెలిపారు. అదేవిధంగా సందర్శకుల బృందం 30 మందికి పైగా ఉంటే వారికి టికెట్ రుసుంలో 20 శాతం రాయితీ ఇస్తామన్నారు. సందర్శకులకు రాష్ట్రపతి నిలయంలోని విశేషాలను వివరించేందుకు 20 మంది గైడ్లను ప్రత్యేకంగా నియమించినట్టు వారు తెలిపారు. -
ప్రముఖ నటుడు సంచలన వ్యాఖ్యలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
ప్రముఖ కన్నడ నటుడు చేతన్ కుమార్‌ను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. హిందువుల మనోభవాలను దెబ్బతీసే విధంగా ఇటీవల ఆయన చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. దీంతో చేతన్ కుమార్‌పై హిందుమత సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మంగళవారం ఆయనను అరెస్ట్ చేశారు. వివరాలు.. స్వయాన హిందువైన కన్నడ నటుడు చేతన్ కుమార్ అహింస మత విశ్వాసాలను కించపరుస్తూ సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. మార్చి 20న ఆయన ట్వీట్ చేస్తూ ‘సావర్కర్: రాముడు రావణుడిని ఓడించి, అయోధ్యకు తిరిగి చేరుకున్న తర్వాత భారతదేశ జాతి ప్రారంభమైంది అనేది ఒక అబద్ధం. 1992: బాబ్రీ మసీదు రాముడి జన్మస్థలం అనేది ఒక అబద్ధం. 2023: ఉరిగౌడ-నంజిగౌడ కులస్తులు టిప్పుని చంపిన హంతకులు అనేది ఒక అబద్ధం’ అంటూ ట్వీట్ చేశాడు. అలాగే అంతేకాదు హిందుత్వం అనేది సత్యం చేత ఓడించబడుతుందంటూ హిందు మతాన్ని, హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసేలా అభ్యంతరకర కామెంట్స్ చేశాడు. దీంతో చేతన్ కుమార్‌పై పలు హిందు మతసంఘాలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కులాలు, మతాల మధ్యనే శత్రుత్వం పెరిగిలా ఆయన ట్వీట్ ఉందంటూ చేతన్‌పై ధ్వజమెత్తారు. ఈ మేరకు ఆయనకు వ్యతిరేకంగా పలు హిందు సంఘాలు బెంగళూరులోని శేషాద్రిపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదుతో పోలీసులు చేతన్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కాగా చేతన్ కుమార్ తరచూ తన తీరుతో, కామెంట్స్‌తో వివాదానికి తెరలేపుతుంటాడు. గతంలో ఇలానే అభ్యంతరకర కామెంట్స్ చేసి ఒకసారి అరెస్ట్ అయ్యాడు. 2022 ఫిబ్రవరిలో హిజాబ్ కేసులో తీర్పు ఇచ్చిన కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి కృష్ణ దీక్షిత్ పై అభ్యంతర కామెంట్స్ చేసిన కేసులో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చాడు. Hindutva is built on LIES Savarkar: Indian ‘nation’ began when Rama defeated Ravana & returned to Ayodhya —> a lie 1992: Babri Masjid is ‘birthplace of Rama’ —> a lie 2023: Urigowda-Nanjegowda are ‘killers’ of Tipu—> a lie Hindutva can be defeated by TRUTH—> truth is EQUALITY — Chetan Kumar Ahimsa / ಚೇತನ್ ಅಹಿಂಸಾ (@ChetanAhimsa) March 20, 2023 -
ఫిలింనగర్ భూవివాదంలో కొత్త మలుపు
-
LIC IPO: ఎల్ఐసీ కొత్త రూల్.. వారికి మాత్రమే ఐపీఓలో రాయితీ..!
LIC IPO: లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎల్ఐసీ) వచ్చే నెలలో ఐపీఓకు వచ్చేందుకు సిద్దం అవుతున్న సంగతి మనకు తెలిసిందే. అయితే, తన ఎల్ఐసీ ఐపీఓలో పాలసీదారులకు 10 శాతం రాయితీ ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ఈ రాయితీ ఇచ్చేందుకు ఇంతకముందు ఒక నిబంధన పెట్టింది. ఎవరైతే, ఫిబ్రవరి 28లోపు తమ పాలసీలకు పాన్-నెంబర్ లింకు చేస్తారో వారికి మాత్రమే 10 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు తెలిపింది. ఈ ప్రకటనతో ఇప్పటివరకు 60-70 లక్షల మంది తమ పాన్(శాశ్వత ఖాతా నంబర్లు) కార్డు నెంబర్లను వెబ్సైట్లో అప్డేట్ చేసినట్లు చైర్మన్ ఎంఆర్.కుమార్ తెలిపారు. ఎల్ఐసీ ఐపీఓకు ముందు పాలసీదారుల నుంచి అద్భుతమైన స్పందన వస్తున్నట్లు చైర్మన్ పేర్కొన్నారు. మార్చిలో ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్(ఐపీఓ)కు వచ్చేందుకు సిద్ధంగా ఉన్న ప్రభుత్వ యాజమాన్యంలోని జీవిత బీమా ఎల్ఐసీ డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు కూడా సహాయం చేయనున్నట్లు అన్నారు. "మా పాలసీదారులు తమ పాన్ నెంబర్ లింక్ చేయడంలో సహాయపడటానికి మేము అన్ని కార్యాలయాలతో సమావేశాలు జరుపుతున్నాము. డీమ్యాట్ ఖాతాలు లేని పాలసీదారులకు సహాయం చేయడానికి ఎన్.ఎస్.డీ.ఎల్, సీడిఎస్ఎల్ సహకారం తీసుకుంటున్నాము" అని ఎల్ఐసీ చైర్మన్ ఎంఆర్.కుమార్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలిపారు. తాజాగా, ఫిబ్రవరి 13కు ముందు ఎల్ఐసీ పాలసీలను కొనుగోలు చేసిన వారు మాత్రమే(డ్రాఫ్ట్ రెడ్ హెర్రింగ్ ప్రాస్పెక్టస్ దాఖలు చేసిన తేదీ) ఈ కోటాకు అర్హులు అని చైర్మన్ పేర్కొన్నారు. గత సంవత్సరం ఎల్ఐసీ చట్టం, 1956కు చేసిన సవరణ చేసి ఐపీఓలో పాల్గొనే పాలసీదారులు & వాటాదారులకు రాయితీ ఇచ్చేందుకు ఎల్ఐసీ మార్గం సుగమం చేసింది. (చదవండి: మూడు సహకార బ్యాంకులకు గట్టి షాకిచ్చిన ఆర్బీఐ..!) -
1.62 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ శిక్షణ
గాంధీనగర్ (విజయవాడ సెంట్రల్): సీఎం వైఎస్ జగన్ పరిపూర్ణ సహకారం, మైక్రోసాఫ్ట్ సౌజన్యంతో ఏపీలోని 1.62 లక్షల మంది విద్యార్థులకు ఎండ్ టు ఎండ్ స్కిల్ ట్రైనింగ్ అందించనున్నట్టు ఏపీ ప్రభుత్వ విదేశీ విద్య సలహాదారు డాక్టర్ అన్నవరపు కుమార్ తెలిపారు. విద్యార్థులకు ఈ శిక్షణను మైక్రోసాఫ్ట్ సంస్థ అందిస్తోందన్నారు. రూ.69 వేల విలువైన కోర్సును రూ.350 నామమాత్రపు ఫీజుతో 400 కళాశాలల్లో అందిస్తోందని, ఇది సాధారణ విషయం కాదని పేర్కొన్నారు. ఈ ఫీజును కూడా విద్యార్థుల తరఫున రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తోందని తెలిపారు. ఇందుకు రూ.25 కోట్లు మంజూరు చేస్తూ కేబినెట్ ఆమోదం తెలిపిందన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో విదేశీ విద్య సలహాదారు డాక్టర్ అన్నవరపు కుమార్‌తో ‘అమెరికాలో ఉన్నత విద్య’ అనే అంశంపై మంగళవారంఇష్టాగోష్టి నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ విదేశీ విద్యను అభ్యసించడానికి విద్యార్థులకు తొలుత అవగాహన అవసరమని, ఆ తర్వాత వారు అనుకున్న లక్ష్య సాధనకు పట్టుదల ముఖ్యమన్నారు. డబ్బులున్న వారు మాత్రమే విదేశాల్లో చదువుకోగలరన్నది కేవలం అపోహ మాత్రమేనన్నారు. అమెరికాలో 4 వేలకు పైగా వర్సిటీలు ఉన్నాయని, వాటిలో 350 పైగా యూనివర్సిటీలు స్కాలర్ షిప్ సౌకర్యం కల్పిస్తున్నాయని వివరించారు. ‘అమెరికన్ కార్నర్’ కీలక పరిణామం ఇటీవల విశాఖలోని ఆంధ్రా యూనివర్సిటీ ప్రాంగణంలో అమెరికా ప్రభుత్వం అమెరికన్ కార్నర్‌ను నెలకొల్పిందని అన్నవరపు కుమార్ చెప్పారు. దేశంలోనే ఇది రెండోదని, దీనిద్వారా మన విద్యార్థులకు అమెరికాలో విద్య, అక్కడ అవకాశాల గురించి తరచూ నిపుణులతో సదస్సులు నిర్వహిస్తారని పేర్కొన్నారు. మన రాష్ట్రంలో విదేశీ విద్యకు సంబంధించి ఇదో కీలక పరిణామమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో భారీ అవినీతి టీడీపీ హయాంలో విదేశీ విద్యలో కోట్లాది రూపాయల అవినీతి జరిగిందని కుమార్ గుర్తు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు, ఐ20లు, బ్యాంక్ ఖాతాలతో కోట్ల రూపాయలు కాజేశారని పేర్కొన్నారు. ఇదంతా అప్పటి ప్రభుత్వ పెద్దలకు తెలిసే జరిగిందన్నారు. దీని వెనుక ఎవరెవరు ఉన్నారన్న విషయంపై విజిలెన్స్ సమగ్ర విచారణ చేస్తోందన్నారు. -
బిగ్‌బాస్ : అఖిల్‌పై పగ తీర్చుకున్న కుమార్ సాయి
బిగ్ బాస్ నాల్గో సీజన్లోకి మొదటి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా అడుగుపెట్టిన కుమార్ సాయి అనూహ్యంగా ఆరోవారంలో ఎలిమినేట్ అయ్యాడు. మోనాల్ కోసమే కుమార్ సాయిని బలి చేశారని అప్పట్లో విమర్శలు కూడా వచ్చాయి. ఒక ఎలిమినేట్ అయినప్పటికీ కుమార్ సాయికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాల్గో సీజన్ మొత్తంలో ‘మంచోడు’ అని పేరు సంపాదించుకున్న ఏకైక వ్యక్తి కుమార్ అనే చెప్పాలి. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నన్ని రోజులు ఒంటరిగానే ఆతను గేమ్ ఆడాడు. ఇంటి సభ్యులంతా అతన్ని వేరుగా చూసినా.. ఆయన మాత్రం ఎవరిపైనా కోపం కానీ ద్వేషం కానీ ప్రదర్శించలేదు. ఎలిమినేట్ అయిన రోజు కూడా ఈ ‘మంచోడు’ని హౌస్మేట్స్ సరిగా సాగపంపలేదు. ముఖ్యంగా ‘కరివేపాకు’ గొడవను ఇప్పటికీ మర్చిపోలేదు. లిమినేషన్ ఎపిసోడ్లో.. నాగార్జున వెజిటబుల్స్ ఇచ్చి ఇది ఎవరికి సూట్ అవుతుందో చెప్పాలని అడగడంతో హౌస్ మేట్స్ ఒక్కొక్కర్నీ ఒక్కో విజిటబుల్తో చక్కని పోలిక ఇచ్చాడు. అందులో భాగంగా అఖిల్‌ని కరివేపాకుతో పోల్చుతూ.. పాజిటివ్‌గా మాట్లాడాడు. కానీ దీన్ని నెగిటివ్‌గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్ పట్ల సానుభూతి చూపించాల్సింది పోయి.. ఇంత దారుణంగా హేళన చేస్తారా? అని అప్పట్లో అఖిల్‌ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. ఇదిలా ఉంటే...అఖిల్‌పై ఉన్న పగను కుమార్ సాయి తీర్చుకున్నాడు. రీ యూనియన్‌లో భాగంగా ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ తిరిగి హౌస్‌కి వస్తుండగా.. కుమార్ సాయి ఎంట్రీ ఇచ్చి నవ్వుతూనే అఖిల్, హారికపై ఉన్న పగను తీర్చుకున్నాడు. సిల్లీ రీజన్స్‌తో తనను నామినేట్ చేసిన హారికను..‘నువ్వు నామినేట్ చేసేటప్పుడు ఎప్పుడైనా పెద్ద రీజన్ చెప్పావా? టీ ఇవ్వలేదని లాంటి సిల్లీ రీజన్ చెప్పావ్’అని తన మనసులో ఉన్న పగను తీర్చుకున్నాడు. ఆ తర్వాత సొహైల్‌తో జరిగిన గొడవలో వేలు సింటీ మీటర్ దిగింది.. సరిపోతుందా? అంటూ మళ్లీ పంచ్ వేశాడు. ఇక అఖిల్‌ని‘నీకు ఇష్టమైనది నాకు ఇష్టమైనది ఒకటి ఉంది.. అది ఏంటంటే పులిహోర’ అంటూ పులిహోరా రాజాకి గట్టిగానే ఇచ్చేశాడు. అయితే ఇవన్ని ఇంటి సభ్యులు సరదాగానే తీసుకున్నట్లు తాజా ప్రోమో చూస్తే తెలుస్తోంది. ఇంకా కుమార్ సాయి ఎవరెవరిపై పంచ్‌లో వేశాడో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే. -
బిగ్‌బాస్ : అఖిల్‌కి అంత పొగరా?
బిగ్‌బాస్ హౌజ్‌లో ఇన్నాళ్లు అఖిల్‌కి అంతో ఇంతో మంచి పేరు ఉండేది. ఒక్క మోనాల్ విషయం తప్ప హౌజ్‌మేట్స్ అందరికి అఖిల్‌పై మంచి ఒపినియన్ ఉంది. ఇక ప్రేక్షకులు కూడా మోనాల్ వల్లే అఖిల్ టాస్క్‌లు సరిగా ఆడటం లేదనే సానుభూతి ఉండేది. అయితే ఆదివారం ఎపిసోడ్లో జరిగిన ఒక్క సీన్‌తో అఖిల్‌పై ఉన్న అభిప్రాయం మొత్తం మారిపోయింది. సోషల్ మీడియాలో నెటిజన్లు అఖిల్‌పై దుమ్మెత్తిపోస్తున్నారు. (చదవండి : బిగ్‌బాస్: టూ మచ్ బిగ్‌బాస్.. ఓట్లు ఎందుకు మరి?) అసలు ఏం జరిగిందంటే..ఆరోవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి కుమార్‌సాయి ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఇంటి సభ్యులను కూరగాయలతో పోల్చమని హోస్ట్ నాగార్జున చెపాపడు. దీంతో కుమార్ సాయి ఒక్కో ఒక్క కూరగాయను ఒక్కో వ్యక్తితో పోలుస్తూ చాలా పాజిటివ్‌గా చెప్పుకొచ్చాడు. అలా అఖిల్‌ని కరివేపాకుతో కంపేర్ చేశాడు. అయితే వాడుకుని తీసిపారేసే కరివేపాకులా కాకుండా పాజిటివ్ వివరణ ఇచ్చాడు కుమార్. ‘అఖిల్ నువ్ ఆడుతున్నావ్ కానీ, రిజల్ట్ రావడం లేదు, నువ్ కష్టపడుతున్నావ్.. బట్ ఫోకస్ ఉండటం లేదు.ఎనర్జీతో ఆడుతున్నావ్ గ్రేట్.. అయినా ఫెయిల్ అవుతున్నావ్.. కరివేపాకు వేస్తున్నావ్ కానీ ఆ ఫ్లేవర్ రావడం లేదు’ అని చాలా పాజిటివ్ వేవ్‌తో కుమార్ సాయి చెప్పాడు. అయితే దీన్ని నెగిటివ్‌గా తీసుకున్న అఖిల్.. ‘మీరు గెలిచి కూడా బయట ఉన్నారు.. మీరు బయటకు వెళ్లిపోయారు బ్రో’ అంటూ తన యాటిట్యూట్ చూపించాడు. బిగ్‌బాస్ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా.. ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్‌పై అఖిల్ సీరియస్ కావడం ప్రేక్షకులకు మింగుడుపడటం లేదు. ఇక నెటిజన్లు అయితే అఖిల్‌పై ఓ రేంజ్లో ఫైర్ అవుతున్నారు. ‘మరీ ఇంత పొగరా?, పాపం కుమార్ సాయి.. పాజిటివ్‌గా చేస్తే అఖిల్ అలా అంటాడా?, అఖిల్ ఓవరాక్టింగ్ పీక్స్‌కి వెళ్లిపోయింది. మోనాల్ మాయలో పడి ఏం మాట్లాడుతున్నాడో మర్చిపోయాడు, ‘అఖిల్‌కి సరైన మెగుడు అభి, ఆ యాటిట్యూట్, బలుపు సంగతి త్వరలోనే తీర్చేస్తాం.. నామినేషన్స్‌లోకి రా అంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక ఎలిమినేట్ అయిన కుమార్ సాయికి మాత్రం నెటిజన్లు మద్దతుగా నిలిచారు. ఓడినా.. అందరి మనసును గెలిచావ్ అంటూ అతనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. #Akhil is one of the worst contestant in the history of BB 👎#BiggBossTelugu4 pic.twitter.com/pU6mUbxKMs — change seeker ✊ (@changeseeeker) October 18, 2020 Assale #KumarSai elimination meedha mandipoi unna janalani .. ee #Akhil gadu baagaa kelikesadu.. inka veedu fasak..!! 🤣🤣🤣#BiggBossTelugu4 pic.twitter.com/T6u1YL4VBU — భరత్ అనే నేను!!™ 🇺🇸🇮🇳 (@iBharathGupta) October 18, 2020 Today its confirmed #Akhil is the worst contestant, IDK what #Kumarsai did wrong to him, antha maata analsindi emi ledu akkada velletappudu you have to send them on good note, #Akhil ala anna kuda #kumarsai em anledu, inka eedni #Abhijeet tho compare ata #BiggBossTelugu4 — Gopi (@_GTweets_) October 18, 2020 #BIGGBOSSTELUGU4 At least #KumarSai played his own game and came out of the house. What are you doing My #CurryLeaf #Akhil ? Will your parents be happy seeing you like this in the house? — Sye Raa! (@SuryaAdityaSun) October 18, 2020 Eedi OverAction 😟😟🤮🤮 #BiggBossTelugu4 pic.twitter.com/UGcPKD1msE — R A M (@Ram_Sayzz) October 18, 2020 -
కంచి ఆలయంలో పోలీసుల దాష్టీకం
-
కంచిలో విషాదం
సాక్షి, చెన్నై: కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి ఆలయం వద్ద మహిళా పోలీస్ దాడి చేయడంతో రాజమండ్రికి చెందిన ఓ యువకుడు దుర్మరణం పాలవగా.. పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ ఆటో డ్రైవర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళితే.. కాంచీపురంలో అత్తి వరదరాజ స్వామి దర్శన మహోత్సవం కనులపండువగా సాగుతోంది. స్వామి దర్శనం కోసం రాజమండ్రికి చెందిన శక్తి ఆకాశ్ అనే యువకుడు తల్లి నాగేశ్వరితో కలిసి సోమవారం కాంచీపురం వెళ్లాడు. బుధవారం వరదరాజ స్వామిని దర్శంచుకున్న తర్వాత శక్తి ఆకాశ్ ఆలయంలో ఉన్న మూలవిరాట్ విగ్రహాన్ని సెల్ఫోన్లో ఫొటో తీసే ప్రయత్నం చేశాడు. దీనిని గమనించిన మహిళా పోలీస్ అడ్డుకుని లాఠీతో అతడి తలపై బలంగా కొట్టింది. దీంతో ఆకాశ్ స్పృహ తప్పి పడిపోయాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందాడు. పోలీసుల తీరుతో ఆటోడ్రైవర్ ఆత్మాహుతి భక్తుల తాకిడి అధికంగా ఉండటంతో కాంచీపురంలో వాహనాల రాకపోకలపై పోలీసులు ఆంక్షలు విధించారు. కాంచీపురం కరుసపేటకు చెందిన కుమార్ అనే ఆటో డ్రైవర్ పాస్ తీసుకుని భక్తులను ఆలయానికి తరలిస్తున్నాడు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి ఆటోను ఆలయం వద్దకు అనుమతించలేదు. దీంతో పోలీసులకు, ఆటోడ్రైవర్ కుమార్‌కు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో కుమార్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని మృతి చెందాడు. అతడు మంటల్లో కాలిపోతున్నా పోలీసులు చోద్యం చూస్తూ ఉండిపోయారు. -
మరో హీరోయిన్ సెంట్రిక్ చిత్రానికి ఓకే!
సంచలన తార నయనతార మరో హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దక్షిణాది అగ్ర కథానాయకిగా వెలిగిపోతున్న నటి నయనతార. ఈ బ్యూటీ ఒక పక్క హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రాలు చేస్తూనే మరో పక్క స్టార్ సీనియర్ హీరోల నుంచి యువ హీరోల వరకూ జత కట్టేస్తోంది. ఇంతకు ముందు కోలమావు కోకిల, ఇమైకా నొడిగళ్ వంటి చిత్రాల సక్సెస్‌లు నయనతార ఖాతాలో పడ్డాయి. అజిత్‌తో జత కట్టిన విశ్వాసం చిత్రం ఇటీవల విడుదలై విజయం సాధించింది. త్వరలో నయన్ నటించిన హీరోయిన్ ఓరియెంటెడ్ కథా చిత్రం ఐరా, శివకార్తికేయన్‌కు జంటగా నటించిన మిస్టర్ లోకల్ చిత్రాలు విడుదలకు ముస్తాబవుతున్నాయి. ఇక తెలుగులో చిరంజీవితో నటిస్తున్న భారీ చారిత్రాత్మక కథా చిత్రం సైరా నరసింహారెడ్డి నిర్మాణంలో ఉంది. ఇక అదే హీరోతో మరో చిత్రం కమిట్ అయ్యింది. అదే విధంగా తన ప్రియుడిగా ప్రచారంలో ఉన్న దర్శకుడు విఘ్నేశ్‌శివన్‌కు నిర్మాణ బాధ్యతలను అప్పగించి తాను నిర్మించే చిత్రంలోనూ నటించనుందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విజయ్‌తో అట్లీ దర్శకత్వంలో నటిస్తోంది. కాగా తాజాగా మరో చిత్రానికి పచ్చజెండా ఊపిందన్నది తాజా సమాచారం. పునీత్ రాజ్‌కుమార్ మేనేజర్ కుమార్ నిర్మించనున్న నూతన చిత్రంలో నయనతార నటించబోతోంది. ఈయన నిర్మిస్తున్న తమిళ చిత్రానికి సీ.వేల్మతి దర్శకత్వం వహించనున్నారు. ఈయన ఇంతకు ముందు అండావ కానోమ్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం విడుదల కావలసి ఉంది. నయనతార హీరోయిన్గా నటించే చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. -
మైండ్ గేమ్
‘సర్! మా నాన్నగారిది సహజ మరణం కాదు. హత్యేనని నేను కచ్చితంగా చెప్పగలను’ ఇన్స్పెక్టర్ కుమార్‌కు చేతులు జోడించి చెప్పాడు ప్రణీత్. ‘ఏమిటి ప్రణీత్ బాబూ మీరనేది? నీరజ్‌గారు గుండెపోటుతో పోయారని డాక్టర్లు చెబుతుంటే’ ముసలి జావేద్ తన తెల్లటి గడ్డాన్ని సవరించుకుంటూ అన్నాడు. సీఐ కుమార్ అక్కడే నిలబడి ఏడుస్తూ ఉన్న పనివాడు యాభయ్యేళ్ల కోటయ్య వంక చూశాడు. ‘కోటయ్యా! నువ్వు నిన్న ఇక్కడే ఉన్నావు కదా... ఏం జరిగిందో చెప్పు’ అన్నాడు. కోటయ్య గొంతు సవరించుకున్నాడు. చెస్ చాంపియన్ల ఖిల్లాగా ఆ పట్టణానికి పేరుంది. ఐదారేళ్ల నుంచి వరుసగా ఆ పట్టణవాసులే రాష్ట్ర చెస్ చాంపియన్‌షిప్ గెలుస్తూ ఉన్నారు. ప్రస్తుత చాంపియన్ నీరజ్, మాజీ చాంపియన్ సరోజ్ ఆ పట్టణవాసులే. ప్రస్తుత చాంపియన్ నీరజ్ తండ్రి కూడా చదరంగ ప్రవీణుడే. తాతలనాటి పురాతన భవంతిలోనే నీరజ్ నివసిస్తూ ఉంటాడు. చదరంగమే లోకంగా ఉంటూ ఉద్యోగమేమీ చేయకపోవడంతో అతనికి పెద్దగా ఆదాయం లేదు. నీరజ్‌కు, మరికొందరికీ చిన్ననాటి నుంచి చదరంగం తర్ఫీదు ఇచ్చి చాంపియన్లుగా తీర్చిదిద్దిన జావేద్ ముసలివాడయ్యాడు. కంటిచూపు మందగించినా, ఆటపై మక్కువ చంపుకోలేక రోజూ చదరంగం ఆడటానికి తన శిష్యుడు నీరజ్ ఇంటికి వస్తూ ఉంటాడు. ఇంకా మాజీ చాంపియన్ సరోజ్, మరికొందరు కూడా నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వస్తూ ఉంటారు. నీరజ్‌తో చదరంగం ఆడటానికి రోజూ వచ్చేవారిలో మదన్, మోహిని ముఖ్యులు. మదన్‌ది జమీందార్ల వంశం. డబ్బుకు, అతిశయానికీ లోటు తక్కువేం లేదు. రాష్ట్రస్థాయిలో అతను చదరంగంలో మొదటి పది ర్యాంకుల్లో ఉన్నాడు. కానీ ఇంతవరకు ఏ పోటీలోనూ విజేతగా నిలవలేదు. మోహిని రాష్ట్రస్థాయి మహిళా చదరంగ పోటీల్లో రన్నరప్‌గా నిలిచింది. ఈసారి ఆ పోటీలో గెలవాలని కసిగా ప్రాక్టీస్ చేస్తోంది. కొంతకాలంగా గుండెజబ్బుతో బాధపడుతున్న నీరజ్ చదరంగం ఆడటం తగ్గించాడు. రాత్రి ఎనిమిదిన్నరకు పాములు, తేళ్ల భయంతో ఇంటి తలుపులు, కిటికీలన్నీ మూసి నిద్రిస్తాడు. నీరజ్ భార్య గత ఏడాది మరణించింది. కొడుకు ప్రణీత్ ఆ ఊళ్లోనే బీ టెక్ చదువుతున్నాడు. పనివాడు కోటయ్య వంటచేసి రాత్రి ఎనిమిది గంటలకు వెళ్లిపోతుంటాడు. ‘నిన్న సాయంత్రం ఐదు గంటలకు సరోజ్గారు ఇంటికి వచ్చారు. ప్రణీత్ ఇంట్లో లేడు. నీరజ్‌గారి గదిలోకి వెళ్లి సరోజ్ గారు చదరంగం ఆడారు. అప్పుడు అయ్యగారు ఉల్లాసంగానే కనిపించారు’ అన్నాడు కోటయ్య. ‘నేను మంచి ఫామ్‌లో ఉన్నాను. ఏడు నిమిషాల్లోనే నీరజ్‌పై గెలిచాను. ఆ శుభవార్త బయటనే వెయిట్ చేస్తూ ఉన్న మోహినికి చెప్పి ఆనందంగా వెళ్లిపోయాను’ అన్నాడు సరోజ్. ఇన్స్పెక్టర్ కుమార్ మోహిని వంక చూశాడు. ‘ఔను! సరోజ్ ముఖం గెలుపు ఆనందంతో మతాబాలాగా వెలుగుతోందప్పుడు. నా కాన్ఫిడెన్స్ కొద్దీ బ్లైండ్ఫోల్డ్గా ఆడతానని నిన్ననే నీరజ్గారికి చెప్పి వారి పర్మిషన్ తీసుకున్నా. కళ్లకు గంతలు కట్టుకుని ఆయనతో చదరంగం ఆడాను’ చెప్పింది మోహిని. ‘మరి గెలిచారా?’ అడిగాడు ఇన్స్పెక్టర్. ‘లేదు. కానీ గెలిచినంత పని చేశా. నన్ను నిలువరించడానికి నీరజ్‌గారు ఇరవై నిమిషాలు కష్టపడాల్సి వచ్చింది. చివరికెలాగో నన్ను ఓడించారు’ చెప్పింది మోహిని. ‘సాయంత్రం ఐదు నలభైకి నీరజ్‌గారు ఎందుకో గట్టిగా కేక పెట్టారు. బయట తోటలో ఉన్న నేను పరుగున ఆయన గదిలోకి వెళ్లాను. అప్పుడు సార్ మదన్గారితో గేమ్ ఆడుతున్నారు. ఏదో వస్తువు కిందపడ్డట్లు అనిపించింది’ అన్నాడు కోటయ్య. ‘టేబుల్ మీద ఉన్న నా లెదర్ బ్యాగ్ కింద పడిందంతే. కోటయ్యను కాఫీ తీసుకు రమ్మని చెప్పారు నీరజ్ గారు. ఎందుకో ఆయన భయపడినట్లు అనిపించింది’ చెప్పాడు మదన్. ‘మరి ఆట ముగిశాక మీరు వెళ్లిపోయారా?’ ‘లేదు. ఎందుకో నీరజ్‌గారు అసౌకర్యంగా ఉన్నట్లు అనిపించడంతో నేను ఆయన పక్కనే ఉన్న చెయిర్లో కూర్చున్నాను. ఇంతలో జావేద్‌గారు లోనికి వచ్చారు’ అన్నాడు మదన్. ‘నేను గదిలోకి వచ్చేసరికి బెడ్‌లైట్ వెలుగుతోంది. ఆట మొదలెడదామా అని నేను అడిగే సరికి సరేనన్నాడు నీరజ్. మదన్‌గారు పక్కనే కుర్చీలో ఉన్నారు. కోటయ్య వచ్చి మా ముగ్గురికీ కాఫీ కప్పులు టేబుల్ మీద పెట్టి వెళ్లిపోయాడు. ఐదు నిమిషాల్లోనే నేను గెలిచాను. ఆ ఆనందంతో నీరజ్‌తో కరచాలనం చేసి వెళ్లిపోయాను’ చెప్పాడు జావేద్. ‘ఆ తర్వాత మదన్‌గారు వెళ్లిపోయారు. నేను గదిలోకి వెళ్లి చూసే సరికి మూడు కప్పుల్లో కాఫీ అలాగే ఉంది. కప్పులు తీసుకుని వెళ్లిపోయాను. పది నిమిషాల తర్వాత ఏదో అనుమానం వచ్చి నీరజ్‌గారి గదిలోకి వెళ్లి పిలిస్తే పలకలేదు. శరీరంలో చలనం లేదు. భయంతో డాక్టర్గారికి, ప్రణీత్‌కు ఫోన్ చేశాను’ అన్నాడు కోటయ్య. ఇన్స్పెక్టర్ కుమార్‌కు మరుసటి రోజు ఏదో అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు ప్రణీత్. చదరంగంలో రాష్ట్ర చాంపియన్‌గా నీరజ్‌కు ఉన్న పేరు ప్రఖ్యాతుల బట్టి వెంటనే ఇద్దరు కానిస్టేబుల్స్‌తో వచ్చి దర్యాప్తు చేశాడు కుమార్. డాక్టర్తోను, ముందురోజు నీరజ్‌తో చదరంగం ఆడిన నలుగురితోనూ మాట్లాడాడు. ‘నాకు అర్జెంట్‌గా విజయవాడలో పని ఉంది. నేను వెళ్లి సాయంత్రం నాలుగింటికి తిరిగొస్తాను’ అన్నాడు మదన్. మిగిలిన ముగ్గురూ కూడా తమకేదో పని ఉందంటూ చెప్పారు. ఇన్స్పెక్టర్ కుమార్ ప్రణీత్ గదిలోకి వెళ్లి ఐదు నిమిషాల తర్వాత తిరిగొచ్చాడు. సరే, మీరందరూ మీ మీ పనులు చూసుకొని రండి. సాయంత్రం ఐదింటికి మళ్లీ మనం ఇక్కడే కలుద్దాం. నీరజ్‌ది సహజ మరణమే అనిపిస్తోంది’ అన్నాడు. నలుగురూ బయటకు వెళ్లిపోయారు. కుమార్ తనతో వచ్చిన కానిస్టేబుల్స్‌కు పనులు పురమాయించాడు. ‘మిస్టర్ మదన్! మీరు నీరజ్ మరణానికి కారకులయ్యారు. మిమ్మల్ని అరెస్టు చేస్తున్నాం’ అన్నాడు కుమార్. మదన్ ముఖం కళ తప్పింది. ‘సార్! ఇది అన్యాయం. నీరజ్‌గారు గుండెపోటుతో మరణించారని డాక్టర్లే చెప్పారు’అన్నాడు ఆవేశంగా. ‘కావచ్చు. కానీ గుండెపోటు వచ్చేలా చేసింది నువ్వే’ అన్నాడు కుమార్. ‘ఇది చాలా అన్యాయం సార్’ దీనంగా అన్నాడు మదన్. ‘నిన్ను అరెస్టు చేయడానికి ఈ రుజువు చాలు’ అని కుమార్ ఒక చిన్న టేప్‌రికార్డర్ తీసి ఆన్ చేశాడు. అందులో మదన్, నీరజ్‌ల సంభాషణ ఉంది. ‘ఆ రోజు సాయంత్రం నీరజ్ ఎప్పటిలాగానే చదరంగం ఆడటానికి తన గదిలో కూర్చున్నాడు. ముందు వచ్చిన సరోజ్ బాగా ఆడి గెలిచి సంతోషంగా వెళ్లిపోయాడు. తర్వాత వచ్చిన మోహిని కళ్లకు రిబ్బన్ కట్టుకుని బ్లైండ్‌ఫోల్డ్ గేమ్ ఆడింది. ఆమెకు తెలియడం కోసం నీరజ్ ఆమె, తాను వేసే ప్రతి ఎత్తునూ గట్టిగా బయటకు చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు ఆట తర్వాత వివాదాలు రాకుండా రికార్డు ఆన్ చేయడం ఆయనకు అలవాటు. మోహినితో ఆట పూర్తయ్యాక టేప్ రికార్డర్ ఆఫ్ చేయడం మరచి, అలాగే ఉంచేశాడు నీరజ్.తర్వాత వచ్చిన మదన్‌కు రాష్ట్ర చాంపియన్ కావాలని తగని కోరిక ఉంది. ఎలాగైనా నీరజ్‌ను అంతమొందిస్తే సరోజ్‌ను డబ్బుతో కొనవచ్చని, అలా ఇద్దరు ప్రత్యర్థులను అడ్డు తొలగించుకోవచ్చని పథకం వేశాడు. నీరజ్ గుండెజబ్బు మనిషని మదన్‌కు తెలుసు. అందుకే సరోజ్‌తో ఘోరంగా ఓడావని, మోహిని బ్లైండ్‌ఫోల్డ్ ఆడినా ఓడినంత పనైందని నీరజ్‌ను రెచ్చగొట్టాడు. తర్వాత తనతో తెచ్చిన బొమ్మ పామును జేబులోంచి తీసి నీరజ్ కాలిపై వేసి ‘పాము... పాము’ అని చిన్నగా అరిచాడు. దాంతో షాక్ తిన్న నీరజ్ గుండెపోటుకు గురై మరణించాడు. అదంతా టేప్రికార్డర్లో రికార్డయింది. మదన్ ఇల్లు శోధిస్తే ఆ బొమ్మ పాము దొరికింది. పథకం ప్రకారం మదన్ నీరజ్ శవాన్ని పక్కనే ఉన్న కుర్చీలో కూర్చోబెట్టి తాను నీరజ్ కుర్చీలో కూర్చున్నాడు. మదన్‌కు మిమిక్రీ వచ్చు. ట్యూబ్‌లైట్ ఆఫ్ చేసి, గదిలో బెడ్‌లైట్ వేశాడు. గదిలోకి వచ్చిన కోటయ్యకు కాఫీ తెమ్మని నీరజ్ గొంతుతో చెప్పాడు. తర్వాత జావేద్ వచ్చాడు. కంటిచూపు బాగులేని జావేద్ బెడ్‌లైట్ వెలుతురులో మదన్నే నీరజ్ అనుకున్నాడు. జావేద్‌తో ఆట ఓడిపోయి, నీరజ్ గొంతుతో అతన్ని అభినందించాడు. జావేద్ వెళ్లగానే నీరజ్‌ను అతని కుర్చీలో కూర్చోబెట్టి వెళ్లిపోయాడు మదన్.’ అని ముగించాడు కుమార్. మదన్ తలదించుకుని పోలీసులకు లొంగిపోయాడు. -
గొడవ చేయొద్దన్నందుకు.. చెవి కొరికి మింగాడు
న్యూఢిల్లీ : 28 ఏళ్ల యువకుడిపై దాడి చేసి చెవి కొరికి మింగేశాడో తాగుబోతు. ఈ దారుణ సంఘటన ఢిల్లీలోని సుల్తాన్‌పరిలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కుమార్(28) ఢిల్లీలోని సుల్తాన్‌పురిలో నివాసముంటున్నాడు. మంగళవారం రాత్రి అదే ప్రాంతానికి చెందిన దీపక్, సంతోష్ అనే ఇద్దరు వ్యక్తులు తప్పతాగి కుమార్ ఇంటి వద్దకు చేరుకున్నారు. కుమార్‌ను గమనించిన ఆ ఇద్దరు అతన్ని తిట్టడం మొదలుపెట్టారు. కుమార్ వారిని గొడవ చేయొద్దని, అక్కడి నుంచి వెళ్లిపోవాలని బతిమాలాడు. దీంతో ఆ ఇద్దరు వ్యక్తులు అతనిపై దాడికి దిగి ముఖంపై పిడిగుద్దులు గుద్దటం ఆరంభించారు. దెబ్బలకు తాళలేకపోయిన అతడు సహాయం కోసం బిగ్గరగా అరవటం మొదలు పెట్టాడు. విచక్షణ కోల్పోయిన సంతోష్ దాదాపు సెంటీమీటర్ మేర కుమార్ చెవి భాగాన్ని కొరికి దాన్ని నమిలి మింగేశాడు. విషయం తెలుసుకున్న అక్కడి వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. పోలీసులు చేరుకునే ముందే కుమార్‌ను ఆస్పత్రిలో చేర్పించారు అక్కడి వారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ధర్యాప్తు చేపట్టారు. కుమార్‌కు ఆ ఇద్దరు వ్యక్తులతో ఎటువంటి గొడవలు లేవని దర్యాప్తులో తేలింది. మరిన్ని ఆధారాల కోసం అన్వేషిస్తున్నారు పోలీసులు. -
టెక్కీ అజితాబ్ ఆచూకీ చెబితే రూ. 10 లక్షలు
సాక్షి, బెంగళూరు: కొన్ని నెలల క్రితం అదృశ్యమైన సాఫ్ట్వేర్ టెక్కీ కుమార్ అజితాబ్ ఆచూకీ తెలిపిన వారికి రూ. 10 లక్షలు ఇస్తామని సీఐడీ అధికారులు ప్రకటించారు. గతేడాది డిసెంబర్ 18న ఓఎల్ఎక్స్లో అమ్మకానికి పెట్టిన తన కారును కొనుగోలుదారుడికి అమ్మేందుకు బయటకు వెళ్లిన అజితాబ్ అప్పటి నుంచి కనిపించకుండా పోయాడు. అజితాబ్ అదృశ్యంపై వైట్‌ఫీల్డ్‌లో కేసు నమోదైంది. కేసులో ఎలాంటి పురోగతి లేకపోవడంతో అతని తండ్రి అశోక్‌కుమార్ సిన్హా హైకోర్టును ఆశ్రయించారు. దీంతో హైకోర్టు సిట్ దర్యాప్తునకు నగర కమిషనర్‌ను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తర్వాత కూడా ఎంత విచారించినా, సుదీర్ఘంగా గాలించిన అజితాబ్ ఆచూకీ లభించలేదు. ఐదు నెలలు గడుస్తున్నా అజితాబ్ ఆచూకీ పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారు. ఈ క్రమంలో సీఐడీ ఈ కేసును స్వీకరించి దర్యాప్తు చేపట్టింది. ఈ నేపథ్యంలో అజితాబ్ ఆచూకీ చెప్పిన వారికి రూ. 10 లక్షల నగదు బహుమతిని అందజేస్తామని లుక్ఔట్ నోటీసు జారీ చేసింది. అజితాబ్ ఆచూకీ తెలిసిన వారు సీఐడీ కంట్రోల్ రూమ్ 080–2204498, 22942444 ఫోన్ నంబర్లకు సమాచారం అందజేయాలని సూచించింది. -
పద్ధతి మార్చుకోలేదని ప్రాణం తీశాడు
- ప్రియురాలిని చంపిన ప్రియుడు - శవం సహా పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు తనకల్లు: వివాహేతర సంబంధం వద్దని చెప్పినా పద్ధతి మార్చుకోనందుకు ప్రియురాలిని అంతమొందించిన ప్రియుడి ఉదంతం తనకల్లు మండలంలో మంగళవారం వెలుగుచూసింది. శవం సహా పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. వివరాల్లోకి వెళితే.. కదిరి పట్టణానికి చెందిన అశోక్‌కు భార్య సుభాషిణి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అశోక్ డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. స్థానిక ఎన్జీఓ కాలనీలో నివాసముంటున్న కుమార్ బ్రిక్స్, టైల్స్ వర్క్ చేసేవాడు. కుమార్ అప్పుడుప్పుడు సిమెంట్ ఇటుకలు, టైల్స్‌ని అశోక్‌కు చెందిన టాటా ఏస్ వాహనంలో తరలించేవాడు. దీంతో ఇద్దరి మధ్య పరిచయం పెరిగింది. ఈ నేపధ్యంలో కుమార్ ఇంట్లో లేని సమయంలో వారి ఇంటికి వచ్చి వెళ్తూ అతని భార్య మల్లీశ్వరి(40)తో ఏడాది నుంచి వివాహేతర సంబంధాన్ని కొనసాగించేవాడు. విషయం తెలుసుకున్న కుమార్.. అశోక్‌తో గొడవపెట్టుకున్నాడు. కొద్దిరోజుల తర్వాత అశోక్ తిరుపతికి వెళ్లి కారును బాడుగుల కోసం పెట్టుకొని అక్కడే ఉంటున్నాడు. అయినా ఇద్దరి మధ్య వివాహేతర సంబంధం అలాగే కొనసాగేది. మంగళవారం మల్లీశ్వరిని కొక్కంటిక్రాస్‌కు రప్పించుకున్నాడు. అక్కడి నుంచి తన కారు(ఏపీ 03 టీవీ 5788)లో ఆమెను కూర్చోబెట్టుకొని పెట్రోల్ బంకు ఎదురుగా రోడ్డు పక్కన ఆపి కారులోనే గొడవపెట్టుకున్నాడు. ‘నువ్వు నాతోనే కాదు.. ఇంకా ఆరుగురితో వివాహేతర సంబంధం పెట్టుకున్నావు. వెంటనే వాటన్నింటినీ వదులుకో’ అని అశోక్ హుకుం జారీ చేయడంతో ఆమె ఒప్పుకోలేదు. ఇద్దరి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. కోపోద్రిక్తుడైన అశోక్ కారులో ఉంచిన కొడవలితో మల్లీశ్వరి మెడపై ఐదుసార్లు నరికాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అనంతరం శవాన్ని కారులోనే పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయాడు. తానే ఆమెని హతమార్చినట్లు ఒప్పుకున్నాడు. మృతురాలికి ఇద్దరు పిల్లులు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ సూర్యనారాయణ తెలిపారు. -
గరగపర్రు వెళ్ళేందుకు అనుమతి ఇవ్వాలంటూ సీఎంకు లేఖ
–బాధితులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ మాజీ ఎంపీ హర్షకుమార్ తాడితోట, (రాజమహేంద్రవరం సిటీ): గరగపర్రు వెలి జరిగి ఆగస్టు 5వ తేదీ నాటికి మూడు నెలలు కావస్తున్నా ఇప్పటి వరకూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ గ్రామాన్ని సందర్శించ లేదని మాజీ ఎంపీ జీవీ హర్ష కుమార్ విమర్శించారు. గురువారం ఆయన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి బహిరంగ లేఖ రాశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత జరిగిన అతిపెద్ద వెలి గరగపర్రు గ్రామంలోనిదేనని ఆ లేఖలో పేర్కొన్నారు. మంత్రులు ఆ గ్రామాన్ని సందర్శించి ఇచ్చిన హామీలు నేటికీ నెరవేరలేదని తెలిపారు. సమస్యలు అలానే వెంటాడుతున్నా మీ కుమారుడు లోకేష్ మాత్రం అన్ని సమస్యలూ పరిష్కరించినట్లు అబద్దాలు చెబుతున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆగస్టు 5వ తేదీన గరపర్రు వెళ్ళేందుకు నిర్ణయించుకున్నానని, అనుమతి కోసం లేఖ రాస్తున్నానని, నాతోపాటు పోలీసులను పంపిచినాఅభ్యంతరం లేదని లేఖలో పేర్కొన్నారు. ఆగస్టు 5, ఉదయం 10 గంటలకు గరగపర్రు బయలుదేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
డి.హీరేహాళ్ (రాయదుర్గం), తాడిపత్రి రూరల్ : కుటుంబాలను పోషించే ఓ యువతి, ఓ యువకుడిని రోడ్డు ప్రమాదాల రూపంలో మృత్యువు కబళించింది. రెండు కుటుంబాల్లోనూ తీరని విషాదం మిగిల్చింది. శుక్రవారం జరిగిన ఈ రెండు ప్రమాదాలకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు. డి.హీరేహాళ్ మండలం మురడి నుంచి పలువురు కూలీలు శుక్రవారం బొమ్మనహాళ్ మండలం శ్రీరంగాపురం వద్ద పొలాల్లో కలుపుతీసే పనికి వెళ్లారు. పని ముగించుకుని తిరిగి ఆటోలో స్వగ్రామానికి వస్తుండగా ఎస్.ఆర్.కోట సమీపంలో మలుపువద్దకు రాగానే ఆటోలో కూర్చున్న కూలీ శాంతమ్మ (19) తను పట్టుకున్న ఇనుప కడ్డీ ఊడిరావడంతో కిందపడింది. ఆ వెంటనే వెనుకచక్రం ఆమె తలపై వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. మురడి గ్రామానికి చెందిన రుద్రప్ప భార్య గంగమ్మ ఇదివరకే మృతి చెందడంతో కుమార్తె శాంతమ్మే ఆ ఇంటికి పెద్ద దిక్కుగా ఉండేది. ఇప్పుడు ఆమె కూడా మృత్యువాత పడటంతో తండ్రి, తమ్ముళ్లు గుండెలవిసేలా రోదించారు. తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్ఐ శేఖర్ తెలిపారు. తాడిపత్రి మండలం వీరాపురానికి చెందిన వీణయ్య, జయమ్మ దంపతుల రెండో కుమారుడు కుమార్ (21) తాడిపత్రిలో ఓ అడిటర్ వద్ద పని చేస్తున్నాడు. విధుల్లో భాగంగా హైదారాబాద్‌కు వెళ్లి తిరిగి వచ్చిన కుమార్ శుక్రవారం తాడిపత్రి నుంచి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గం మధ్యలోని అక్కన్నపల్లి పెట్రోల్ బంక్ వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. రూరల్ పోలీసులు సంఘటన స్థలం పరిశీలించి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతుని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. -
పాడుబుద్ధికి 10 నెలల జైలు
బాలుడి కిడ్నాప్ కేసులో కటకటాలు గోపాలపట్నం: గంజాయి వ్యసనం ఓ వ్యక్తిని కిడ్నాప్‌కి ప్రేరేపించింది. సొంత మేనమామే ఓ బాలుడిని ఆడిస్తున్నట్లుగా నటించాడు. తల్లి దగ్గరకు తీసుకెళ్తానని నమ్మించి ఆ బాలుడిని రైల్వేస్టేషన్లో వదిలేశాడు. గంజాయి మత్తులో పడి ఎటో వెళ్లిపోయాడు. పోలీసుల అప్రమత్తతతో ఆ బాలుడు దొరికాడు. ఆ నిందితుడు ఇపుడు కటకటాల పాలయ్యాడు. పెందుర్తికి చెందిన డోలా కిరణ్‌కుమార్ అనే వ్యాను డ్రైవరు మద్యం, గంజాయికి బానిసయ్యాడు. గోపాలపట్నం లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్న తన సోదరి బోనెల విజేత ఇంటికి గత నవంబరు 18న వచ్చాడు. ఆమె రెండున్నరేళ్ల కొడుకు తిలక్‌ని ఆడిస్తూ.. పెందుర్తిలో ఉన్న తన అమ్మ ఇంటికి తీసుకెళ్తానని నమ్మించాడు. బాలుడిని బైక్‌పై తీసుకెళ్లాడు. రాత్రయినా తిరిగిరాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఆందోళనతో గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ వైకుంఠరావు నేతృత్వాన ఎస్ఐ దుంపల శ్రీనివాస్ ఆగమేఘాలమీద నాలుగు బందాలతో గాలింపు చర్యలు ప్రారంభించారు. వాట్స్యాప్లలో అన్ని పోలీస్స్టేషన్ల ఇన్చార్జిలకు నిందితుడి ఫొటోలు, బాలుడి ఫొటోలూ పంపారు. చివరకు విశాఖ రైల్వే స్టేషన్లో ఆ మర్నాడు వేకువజామున రిజర్వేషన్ కౌంటర్లో అనుమానంగా తిరుగుతున్న కిరణ్‌కుమార్‌ని అదుపులోకి తీసుకున్నారు. మైకంలో రోడ్డు పక్కన ఉన్న చుక్కా చిట్టమ్మ అనే వృద్ధురాలి ఒడిలో తిలక్‌ని పెట్టానని చెప్పాడు. ఆ వృద్ధురాలి అడ్రసు గాలించి మధురవాడలో వాంబే కాలనీలో పట్టుకున్నారు. ఇలా తిలక్‌ని తీసుకుని కుటుంబసభ్యులకు అందజేశారు. కిరణ్‌కుమార్‌ను అరెస్టు చేసి కేసు పెట్టారు. ఈ కేసులో రెండవ మెట్రోపాలిటన్ మెజిస్రేట్ శుక్రవారం తీర్పు వెలువరించారు. కిరణ్‌కుమార్‌కి పది నెలల జైలు, రెండువేల జరిమానా విధించారు. -
ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన ప్రియుడి పెళ్లి
గొల్లపల్లి(జగిత్యాల): ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించిన ప్రియుడు వేరే యువతిని వివాహం చేసుకుంటున్నాడనే విషయం తెలిసి ప్రియురాలు తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రియుడి పెళ్లిని నిలిపివేసి అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లిలో బుధవారం వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే.... కొడిమ్యాల మండలం రామకృష్ణాపూర్ గ్రామానికి చెందిన దీప(24)కు ఓ ఫోటో స్టూడియోలో నాలుగేళ్ల క్రితం తూర్పాటి కుమార్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి ఇద్దరి మధ్య అనుబంధాన్ని పెంచింది. నాలుగేళ్లుగా ప్రేమిస్తున్న దీపను కాదని కుమార్ మరో పెళ్లికి సిద్ధమయ్యాడు. గుట్టుచప్పుడు కాకుండా గొల్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఓ యువతిని ఇవాళ పెళ్లి చేసుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకున్నాడు. ఈ విషయాన్ని కుమార్ స్నేహితుల ద్వారా తెలుసుకున్న దీప ‘తనను అన్ని విధాలుగా వాడుకొని చివరకు పెళ్లి చేసుకోకుండా.. వేరే అమ్మాయి జీవితం నాశనం చేస్తున్నాడని’ గొల్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు కుమార్‌ను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.