కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుని కథనం ప్రకారం... పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన ఏలబోతరం కుమార్(30), కలవేని అశోక్ (28), పొన్నల రవి ఆదివారం రాత్రి ట్రాక్టర్‌లో వెళ్లి చిన్నబోంకూర్ సమీపంలోని శాలివాహన పవర్‌ప్లాంట్‌లో సామగ్రిని దించి వేశారు. తిరుగు ప్రయాణంలో రోడ్డు దాడుతున్న ట్రాక్టర్‌ను కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో కుమార్, అశోక్ అక్కడికక్కడే చనిపోయారు. తీవ్రంగా గాయపడిన రవిని 108లో కరీంనగర్‌కు తరలించారు.