ashok
-
అశోకుడి కాలం నాటి కోట.. ఏకంగా ఏథెన్స్ నగరాన్నే..!
ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి. అశోకుడు కళింగ యుద్ధం చేసేనాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది కాలంలో ఈ నగరం అద్భుతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాల వల్ల తెలుస్తోంది. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోని ఏథెన్స్ నగరానికి మించి ఉండేదని చరిత్రకారులు ఎం.ఎల్.స్మిత్, ఆర్.మహంతి తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు. అప్పట్లో శిశుపాలగడ జనాభా దాదాపు పాతికవేల వరకు ఉంటే, అదేకాలంలో ఏథెన్స్ జనాభా పదివేల వరకు మాత్రమే ఉండేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిరక్షిస్తున్నారు. (చదవండి: రోబో చిత్రానికి రూ.9 కోట్లు) -
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
ఆ నినాదాల కథేమిటి?
‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’, ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలను ట్రంప్ ఇచ్చారు గానీ,వాటిని నిర్వచించలేదు. ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు బలంగా ఆకర్షించాయి. ఈ విడతలో ట్రంప్ పాలన ఈ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న.అమెరికా అధ్యక్షునిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో ‘మాగా’ (మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్), ‘అమెరికా ఫస్ట్’ అనే రెండు ఆకర్షణీయమైన నినాదాలు అయితే ఇచ్చారు గానీ, వాటికి నిర్వచనం ఏమిటో చెప్పకపోవటం ఆసక్తికరమైన విషయం. తన 2016 ఎన్నికలలోనూ ఈ నినాదాలు ఇచ్చిన ఆయన అపుడు గెలిచి, తర్వాతసారి ఓడి, ఈసారి తిరిగి గెలిచారు. అయినప్పటికీ ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆ మాటలకు ఎప్పుడూ నిర్వచనాలు చెప్ప లేదు. తన సమర్థకులు, వ్యతిరేకులు, మీడియా, ఇతరులు అయినా అడిగినట్లు కనిపించదు. ఇది ఆశ్చర్యకరమైన స్థితి.పై రెండు నినాదాలు ట్రంప్ ఉబుసుపోకకు ఇచ్చినవి కావు.అందువల్లనే ఇన్నేళ్ళుగా వాటిని ఇస్తూనే ఉండటమేగాక, ‘మాగా’ను ఒక ఉద్యమంగా ప్రకటించారు. దీనిని బయటి ప్రపంచం అంతగా పట్టించుకోక సాధారణమైన ఎన్నికల నినాదాలుగా పరిగణించటం ఒకటైతే, అమెరికాలోని ట్రంప్ ప్రత్యర్థులు, అకడమీషియన్లలోని అధిక సంఖ్యాకులు, ప్రధాన మీడియా సైతం అదే వైఖరి తీసుకోవటం గమనించదగ్గది. అట్లాగని అందరూ వదలివేశారని కాదు. అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఈ నినాదాలు, అవి ఎంత అస్పష్టంగా ఉన్నప్పటికీ, బలంగా ఆకర్షించటాన్ని గుర్తించిన కొద్ది మంది పరిశీలకులు మాత్రం దాని లోతుపాతులలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి అధ్యయనాలను గమనించినట్లయితే ఈ రెండు నినాదాలు ఏ పరిస్థితులలో ఎప్పుడు రూపు తీసుకున్నాయి? వాటి పరస్పర సంబంధం ఏమిటి? అవి ఏ తరగతులపై ఎందుకు ప్రభావాలు చూపుతున్నాయి? ఆ నినాదాల స్వభావం ఏమిటి? ట్రంప్ వంటి నాయకుల జయాపజయాలతో నిమిత్తం లేకుండా వారి వెంట బలంగా ఎందుకు నిలబడు తున్నారు? ‘మాగా’ను ట్రంప్ అసా ధారణమైన రీతిలో ఒక ఉద్యమమని ఎందుకు అంటు న్నారు? చివరిగా చూసినట్లయితే, ఈ ఉద్యమం అనేది అమెరికన్ సమాజంలో ఎందుకు ఇంకా విస్తరిస్తున్నది? అనే విషయాలు ఒక మేరకైనా అర్థమవుతాయి.ఆ పరిశీలకులు చెప్తున్నది ముందు యథాతథంగా చూసి, ఈ నినాదాల లక్ష్యాల సాధనకు ట్రంప్ తన మొదటి విడత పాలనలో చేసిందేమిటి? చేయలేక పోయిందేమిటి? చేసిన వాటి ఫలితాలేమిటి? ఈసారి చేయగలదేమిటి? అనే విషయాలు తర్వాత విచారిద్దాము. విశేషం ఏమంటే, ట్రంప్ రిపబ్లికన్ కాగా, తన ‘మాగా’ తరహా నినాదాన్ని అదే పార్టీకి చెందిన అధ్యక్షుడు రొనాల్డ్ రీగన్ (1981–89) మొదటిసారిగా 1980లోనే మరొక రూపంలో ఇచ్చారు. ఆయన నినాదం ‘లెట్ అజ్ మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’. ఈ నినాదంలో రీగన్ ఆలోచనలకు ట్రంప్ ఉద్దేశాలతో పోలిక లేదన్నది అట్లుంచితే, రీగన్ తర్వాత ఆ నినాదం వెనుకకు పోయింది. తర్వాత 22 సంవత్సరాలకు రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీ 2012లో డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బరాక్ ఒబామా చేతిలో ఓడినప్పుడు, ట్రంప్ తన ‘మాగా’ నినాదం తయారు చేశారు. అంతేకాదు, ఉత్పత్తులకు కాపీరైట్ పద్ధతిలో దీనిని రిజిస్టర్ కూడా చేయించారు. మరొక మూడేళ్లకు 2015లో అధ్యక్ష పదవి పోటీకి నామినేషన్ వేసి, ‘మాగా’ నినాదాన్ని ప్రకటించటంతోపాటు, అది ఒక ‘ఉద్యమ’మని కూడా అన్నారు.‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలు వెంటనే అమెరికన్ సమాజంలోని కొన్ని తరగతులను ఆకర్షించాయి. వారిలో శ్వేతజాతీయులైన కార్మికులు, మామూలు పనులు చేసుకునేవారు, గ్రామీణ–పట్టణ ప్రాంత పేదలు, కన్సర్వేటివ్‌లు, సాంప్రదాయిక క్రైస్తవులు, డెమోక్రటిక్ పార్టీ సంపన్నుల కోసం పనిచేస్తుందనీ అందువల్ల తాము నష్ట పోతున్నామనీ భావించేవారు, తమ నిరుద్యోగ సమస్యకు ఆ పార్టీ విధానాలే కారణమనేవారూ ఉన్నారు. ఆ చర్చలోనే భాగంగా విదేశీ యుల సక్రమ, అక్రమ వలసలు ముందుకొచ్చాయి. గమనించ దగినదేమంటే, 2012లో గానీ, 2015లో నామినేషన్ వేసిన సమ యానికిగానీ ట్రంప్ తన నినాదాలకు నిర్వచనం చెప్పలేదు. అయి నప్పటికీ వారంతా, ‘అనిర్వచనీయ అనుభూతి’ అన్న పద్ధతిలో ట్రంప్ నినాదాలలో తమ సమస్యలకు ‘అనిర్వచనీయ పరిష్కారం’ ఏదో చూసుకున్నారు. ట్రంప్ అన్నట్లు అదొక ఉద్యమంగా, లేక రహస్యోద్యమంగా వ్యాపించింది. దాని కదలి కలను డెమోక్రాట్లు, మీడియా, ఉదార వాదులు, అకడమిక్ పండి తులు ఎవరూ గమనించలేదు. తీరా 2016 ఎన్నికలో హిల్లరీ క్లింటన్ ఓడి ట్రంప్ గెలవటంతో వీరికి భూకంపం వచ్చినట్లయింది.ట్రంప్ స్వయంగా నిర్వచించకపోయినా, ఆయన నినాదాలలో తన సమర్థకులకు కని పించిందేమిటి? అవి అమెరికాలో మొదటి నుంచిగల నేటివ్ అమెరికన్లకు ఉపయోగ పడతాయి. అమెరికా ఒకప్పుడు గొప్ప దేశం కాగా తర్వాత తన ప్రాభవాన్ని కోల్పోయింది. అందుకు కారణాలు విదేశీ ప్రభావాలు. ఆ ప్రభావాలు వలసలు, బహుళ సంస్కృతుల రూపంలో, అదే విధంగా ప్రపంచీకరణల ద్వారా కనిపిస్తూ స్థానిక జనాన్ని, సంస్కృతులను, ఆర్థిక పరిస్థితులను దెబ్బ తీస్తున్నాయి.అందువల్లనే ఉద్యోగ ఉపాధులు పోవటం, ధరలు పెరగటం వంటివి జరుగుతున్నాయి. ఈ పరిస్థితులలో విదేశీ ఆర్థిక ప్రభావాలను, వలసలను అరికట్టినట్లయితే, ‘అమెరికా ఫస్ట్’ నినాదం ప్రకారం తమకు రక్షణ లభిస్తుంది, తమ సంస్కృతి వర్ధిల్లుతుంది. ఈ తరగతుల ఈ విధమైన ఆలోచనల నుంచి వారికి ఈ నినాదాల ద్వారా, కొన్ని లక్షణాలు లేదా స్వభావం ఏర్పడ్డాయి. నాయకత్వం నుంచి నినాదాలకు స్పష్టమైన నిర్వచనాలు లేకపోవటం అందుకు దోహదం చేసింది. అట్లా కలిగిన లక్షణాలు తీవ్రమైన వైఖరి తీసుకోవటం, వలసలు వచ్చే వారిపై, ముస్లిం తదితర మైనారిటీలపై ఆగ్రహం, జాతివాదం, మహిళా వ్యతిరేకత, ఉదారవాద వ్యతిరేకత, మెయిన్ స్ట్రీమ్ మీడియా అనేదానిపట్ల వ్యతిరేకత, తీవ్రంగా వివాదా స్పదంగా మాట్లాడటం, చట్టాల ఉల్లంఘన, హింసకు వెనుకాడక పోవటం వంటివి వారిలో తలెత్తి నానాటికీ పెరుగుతూ పోయాయి.విశేషం ఏమంటే, ట్రంప్ స్వయంగా ఒక ధనిక కుటుంబం నుంచి వచ్చి తాను కూడా బిలియన్లకొద్దీ ధనం సంపాదించి కూడా తన భావజాలం ప్రభావంతో పై విధమైన తరగతులకు ప్రతినిధిగా మారారు. వారి ఆలోచనలూ, ఆకాంక్షలకు, తన ఆలో చనలకు తేడా లేనందున ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ప్రత్యేకంగా నిర్వచనాలు చెప్పవలసిన అవసరమే రాలేదు. ఒకరినొకరు అప్రకటితమైన రీతిలో అర్థం చేసుకుని సహజ మిత్రులయ్యారు. గత పర్యాయం ట్రంప్ ప్రచారాంశాలు, మొదటి విడత పాలనలో తను తీసుకున్న కొన్ని చర్యలు వారి బంధాన్ని మరింత బలపరిచాయి. ఉదాహరణకు, ముస్లింల రాకను ‘పూర్తిగా’ నిషేధించగలనని 2015 నాటి ప్రచారంలోనే ప్రకటించిన ఆయన, అధ్యక్షుడైన తర్వాత పట్టుదలగా మూడుసార్లు ప్రయత్నించి కొన్ని అరబ్ దేశాల నుంచి వలసలను నిషేధించారు. అమెరికాకు, మెక్సికోకు మధ్య గోడ నిర్మాణం మొదలుపెట్టారు. వీసాలపై పరిమితులు విధించారు. యూరప్‌తో సహా పలు దేశాల దిగుమతులపై సుంకాలు పెంచారు. తమకు ఆర్థిక ప్రత్యర్థిగా మారిన చైనాపై ఆర్థిక యుద్ధం ప్రకటించారు. తమ ఉత్పత్తులపై భారీగా సుంకాలు విధిస్తున్నదంటూ ఇండియాను నిందించారు. చైనా నుంచి అమెరికాకు తిరిగి రావాలంటూ అమెరికన్ కంపెనీలను బెదిరించారు. ఆ దేశం తమ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, ఉద్యోగాలను ‘దొంగిలిస్తూ’ తమ యువకులకు ఉద్యోగాలు లేకుండా చేస్తున్నదన్నారు.ఈ చర్యల వల్ల అమెరికాకు అంతిమంగా కలిగిన ప్రయోజనాలు స్వల్పమన్నది వేరే విషయం. కానీ, గమనించవలసింది దీనంతటిలోని అంతరార్థం. అది గమనించినందువల్లనే, నినాదాలకు నిర్వచనాలంటూ లేకున్నా ఆ తరగతులు ఇప్పటి ఎన్నికల వరకు ట్రంప్‌కు అండగా నిలిచాయి. చివరకు, పోయినసారి ట్రంప్ ఓడిపోయి కూడా అధికార బదిలీకి వెంటనే అంగీకరించని అసాధారణ స్థితి గానీ, ఆయన ప్రోత్సా హంతో అనుచరులు క్యాపిటల్ హిల్ వద్ద హింసకు పాల్పడటంగానీ, పైన పేర్కొన్న స్వభావాల నుంచి పుట్టుకొచ్చినవే.ట్రంప్ పాలన ఈ విడతలో ‘మాగా’, ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఎంతవరకు అనుగుణంగా ఉండవచ్చునన్నది ప్రశ్న. గత పర్యాయపు పాలనానుభవాలు ఆయనకు ఉన్నాయి. అది గాక, ప్రపంచ పరిస్థితులు ఆర్థికంగా, రాజకీయంగా, సైనికంగా అప్పటి కన్నా మారాయి.అందువల్ల, వాస్తవ పాలన ఏ విధంగా సాగేదీ వేచి చూడవలసిందే.టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
‘రక్తపు కన్నీరు కారుస్తారు’.. పోలీసులకు కాంగ్రెస్ ఎమ్మెల్యే వార్నింగ్
జైపూర్: మాజీ మంత్రి, హర్యానా కాంగ్రెస్ ఎమ్మెల్యే బుండీ అశోక్ చందనా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత ‘మీరు రక్తపు కన్నీరు కారుస్తారు’ అంటూ హెచ్చరించారు. రాజస్థాన్‌లోని కోటాలో బుండి నియోజకవర్గంలో బుధవారం కోటాలో జరిగిన రైతుల ట్రాక్టర్ ర్యాలీలో ప్రసంగింస్తూ పోలీసులపై బెదిరింపు వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తలను వేధిస్తున్నదని ఆరోపించారు. ‘ఈ ప్రభుత్వం త్వరలో మారుతుంది. కాబట్టి ఎవరి ఆదేశాల మేరకు కాంగ్రెస్ కార్యకర్తలను వారు (పోలీసులు) ఇబ్బంది పెట్టకూడదు. వారు ఎంతగా హింసిస్తారో.. అంతగా రక్తంతో కన్నీళ్లు పెట్టుకుంటారు’ అని పోలీసులను హెచ్చరించారు.తాజా వ్యాఖ్యలపై రాజస్థాన్ బీజేపీ ప్రధాన కార్యదర్శి మోతీ లాల్ మీనా తీవ్రంగా స్పందించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పోలీసు, రెవెన్యూ అధికారులను పిలిపించి వారి పార్టీ పని కోసం వినియోగించారని విమర్శించారు. అయితే ఇప్పుడు పరిపాలన కోసం, ప్రజల మేలు కోసం అధికార యంత్రాంగం పని చేస్తోందని తెలిపారు. బీజేపీ సుపరిపాలనకు ఇది ఒక ఉదాహరణ అని అన్నారు. ‘ఇది స్పష్టంగా కాంగ్రెస్‌కు బాగా నచ్చదు. కాంగ్రెస్ కేంద్ర నాయకత్వం ఆదేశం లేకపోతే ఆ పార్టీ ఏమి చెబుతుంది. అప్పుడు స్థానిక నాయకుల నుంచి మీరు ఏమి ఆశిస్తారు?’ అని మండిపడ్డారు.కాగా, అశోక్ గహ్లోత్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అశోక్ చందనా.. ఈ విధంగా వ్యాఖ్యానించడం తొలిసారి కాదు. గతేడాది చంద్రయాన్ మిషన్ ప్రయోగించిన సమయంలో వ్యోమగాములకు అభినందనలు అంటూ పేర్కొన్నారు. వాస్తవానికి అది మానవ రహిత మిషన్ అని అతనికి తెలీదు. -
ఇది కెమిస్ట్రీ లేని కూటమి
దాదాపు ఏడాది క్రితం 38 పార్టీలతో ఏర్పడిన ‘ఇండియా’ కూటమికి ఇప్పటికీ ఒక ఉమ్మడి మేనిఫెస్టో లేదు. మేనిఫెస్టోలు పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగలవనే సందేహాలు ప్రజలకుంటాయి. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలిక వేదిక. 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన సీరియస్‌గా ఉన్నదా, లేక ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం కేవలం ఒక తతంగమా?‘ఇండియా’ కూటమి 38 పార్టీలతో ఏర్పడి సంవత్సరం కావస్తున్నది. భౌతికంగా చూసిన ట్లయితే అది బలమైన రాజకీయ వేదికే. కానీ, గత సెప్టెంబర్ 22న ఆ కూటమి ఏర్పడినప్పటి నుంచి ఇంతవరకు వారికి ఒక ఉమ్మడి మేని ఫెస్టో లేకపోవటం గమనించదగ్గది. ఏ విధంగా ఆలోచించినా అది ఒక పెద్ద లోటు. వాస్తవానికి అటువంటి మేనిఫెస్టో ఎన్నికలకు ముందే రావాలి. తమ కూటమి అధికారానికి వచ్చినట్లయితే వివిధ రంగాలకు, సమస్యలకు, ప్రజల కోరికలకు సంబంధించి ఏమి చేయగలరో, అధికార పక్షపు వైఫల్యాలను ఏ విధంగా సరిదిద్దగలరో దేశం ఎదుట ఎన్నికలకు ముందే ఉంచాలి. కానీ, వారు ఆ పని చేయలేదు. ఎన్నికలు మార్చి–మే 2024 కాలంలో జరిగాయి. ‘ఇండియా’ కూటమి ఏర్పాటు ప్రయత్నాలు అంతకు 10 నెలల క్రితం నుంచి మొదలయ్యాయి. తర్వాత 4 నెలలకు, అనగా ఎన్నికలకన్న 6 నెలల ముందు కూటమి ఏర్పడింది. అయినా ఇంత సుదీర్ఘ కాలంలో ఉమ్మడి మేనిఫెస్టో లేక పోయింది. ఎన్నికలు ముగిసి 3 నెలలు గడిచి 4వ నెల నడుస్తున్నది. అయినప్పటికీ అటువంటి డాక్యుమెంట్‌ను రూపొందించక పోవటం సరికదా, ఆ ప్రయత్నాల మాటైనా వినిపించక పోవటం ఆశ్చర్యం.ఈ మాటలు ఇంతగా చెప్పుకోవటానికి కొన్ని ముఖ్యమైన కారణాలున్నాయి. యథాతథంగా మేనిఫెస్టోలు ఒక పార్టీకి గానీ, కూట మికిగానీ ఎంత అవసరమో చెప్పనక్కర లేదు. పార్టీ కన్నా కూటమికి మరింత అవసరం. ఎందుకంటే, వేర్వేరు ఆలోచనలు, లక్ష్యాలు ఉండే పార్టీలు ఒక కూటమిగా ఏర్పడినప్పుడు, కలిసి ఎట్లా పని చేయగల వనే సందేహాలు ప్రజలకుంటాయి. అది కిచిడీ కూటమిగా మారి పదవుల కోసం కీచులాడుకుంటారు తప్ప ప్రజల కోసం స్థిరంగా పని చేయరనీ, కొద్ది కాలానికే కుప్పగూలుతారనీ ప్రత్యర్థులు ప్రచారం చేసే అవకాశం కూడా ఉంటుంది. లోగడ ఏర్పడిన ఫ్రంట్ల విషయంలో అట్లా జరిగింది కూడా! ఈ పరిస్థితుల దృష్ట్యా ‘ఇండియా’ కూటమికి ఒక ఉమ్మడి మేనిఫెస్టో అన్నది, కనీసం ప్రజలకు చూపేందుకైనా, ముందస్తుగా అవసరం. అధమ పక్షంలో, ఎన్నికలు ముగిసిన ఈ దశలోనైనా రాగల కాలం కోసం. కానీ వారికి ఇది ఆలోచనలో ఉన్నట్లయినా తోచటం లేదు.ఉమ్మడి మేనిఫెస్టో అవసరాన్ని వారు ఎన్నికలకు ముందు గుర్తించలేదని కాదు. అందుకోసం కొన్ని సంప్రదింపులు జరిగాయి కూడా! కొన్ని అంశాలపై ఏకాభిప్రాయం కుదరక పోవటంతో ఆ ప్రయత్నాలు విఫలం అయ్యాయి. మేనిఫెస్టో లేకుండానే సీట్లు మాత్రం సర్దుబాటు చేసుకుని పోటీలు చేశారు. ఎవరి అజెండాలు వారు ప్రచారం చేసు కున్నారు. కొన్ని అంశాలపై ఏకీభావం వ్యక్తం కాగా, కొన్నింటిపై పర స్పర విరుద్ధ ప్రచారాలు సాగాయి. కొన్ని ముఖ్యాంశాలపై ఏమీ మాట్లాడక మౌనం వహించారు. ఆ పరిణామాలన్నింటిని గమనించిన వారికి ‘ఇండియా’ కూటమిలో భౌతికమైన ఐక్యత కాకుండా రసాయ నిక ఐక్యత ఏమైనా ఉందా, ఉండగలదా అనే సందేహాలు కలగటం మొద లైంది. మరొకవైపు కాంగ్రెస్ పార్టీ మాత్రం తన సొంత మేనిఫెస్టోను విడుదల చేసింది. ‘న్యాయ్ పత్ర’ పేరిట గల అందులో ఎప్పటివలెనే అనేక అంశాలున్నాయి. పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మాట్లా డుతూ తమ వైఖరి ప్రధానంగా అభివృద్ధి, సమ్మిళితత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామిక విలువల పరిరక్షణ,సంక్షేమం వంటి అంశా లను కేంద్రంగా చేసుకుని ఉందన్నారు. ఆ పార్టీ ఇవన్నీ షరా మామూలుగా చెప్పేవే. అమలు విషయం వేరే. కానీ మౌలికంగా మేనిఫెస్టో అంటూ ఒకటుందన్నది ప్రధానం.‘ఇండియా’ కూటమికి అది లేకపోయింది. కూటమి పార్టీల మధ్య పైన పేర్కొన్నట్లు భిన్నాభిప్రాయాలు అనేకం ఉన్నాయి. వాటిలో కొన్ని చాలా ముఖ్యమైన విషయాలు. పాత పెన్షన్ స్కీం పునరుద్ధరణ, పౌర సత్వ చట్ట సవరణ, చట్ట విరుద్ధ కార్యకలాపాల నిషేధ చట్టం (ఉపా) రద్దు, ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు, గవర్నర్ పోస్ట్ రద్దు, రాష్ట్రాలలో రాష్ట్రపతి పాలన విధించే ఆర్టికల్ 356 రద్దు, జమ్మూ–కశ్మీర్‌కు తిరిగి ప్రత్యేక హోదా వంటివి అందులో ఉన్నాయి. ఇవన్నీ కీలకమైనవి. వీటిపై ఏకాభిప్రాయం దాదాపు అసాధ్యం. ‘ఇండియా’ కూటమి అనే సంక్షిప్త నామానికి పూర్తి పేరు ఏమిటో తక్కువమందికి తెలిసి ఉంటుంది. అది– ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్ ఇంక్లూజివ్ అలయన్స్. పేరు బాగున్నది. కానీ ఇటువంటి కీలకమైన అంశాలపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పుడు ఏదైనా ఎట్లా వీలవుతుందన్నది ప్రశ్న.కూటమి పార్టీలకు కొంత వెసులుబాటు ఇస్తూ, ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ఒత్తిడి వల్ల ఉమ్మడి మేనిఫెస్టోకు తగినంత సమయం లేకపోయిందనుకుందాం. కూటమి ఏర్పడింది కేవలం లోక్‌సభ ఎన్నికలు, వాటితోపాటు జరిగిన కొన్ని అసెంబ్లీ ఎన్నికల కోసం కాదు. అదొక దీర్ఘకాలికమనుకునే వేదిక. ఇప్పటి నుంచి తిరిగి 2029లో జరిగే లోక్‌సభ ఎన్నికలు, ఈలోగా పలు అసెంబ్లీ ఎన్నికలు వారి అజెండాలో ఉండాలి. అటువంటప్పుడు, కనీసం మొన్నటి లోక్ సభ ఎన్నికలు ముగిసిన తర్వాతనైనా ఉమ్మడి మేనిఫెస్టో ప్రయత్నాలు తిరిగి ఎందుకు చేయటం లేదు? కొత్త సభ్యుల ప్రమాణ స్వీకారాలు, పార్టమెంట్ సమావేశాల హడావిడి ముగిసిన వెనుకనైనా? అసలు ఆ శిబిరం నుంచి ఈ ప్రస్తావన నామమాత్రంగానైనా వినిపించటం లేదు. విచిత్రమేమంటే కూటమిలోని 38 పార్టీలలో ఎవరూ ఆ పని చేయటం లేదు. చివరకు తమది సైద్ధాంతికమైన, దీర్ఘకాలికమైన దృక్పథమని చెప్పే వామపక్షాలు సైతం కూటమిలోని 38 పార్టీలలో సగం పేర్లు మనం ఎన్నడూ విననివి. కూటమి గెలిచిన మొత్తం స్థానాలు 234 కాగా, వాటిలో ఇవి తెచ్చుకున్నవి ఒకటి కూడా లేదు. ఆ యా రాష్ట్రా లలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినపుడు వాటికి కూటమి బలంతో ఒకటీ అరా వస్తాయేమో తెలియదు. ఏమైనా ఐక్యత అన్నది ఐక్యతే గనుక వారంతా అక్కడ ఉండటం మంచిదే. అంతిమంగా లెక్కకు వచ్చేది మాత్రం కూటమిలో ఎన్ని పార్టీలు ఉన్నాయనే దానితో పాటు, లేదా అంతకన్నా ముఖ్యంగా, వాటి మధ్య గల ఐక్యత ఏమిటి? కెమిస్ట్రీ ఏమిటి? ఆ కెమిస్ట్రీని సృష్టించే ఉమ్మడి మేనిఫెస్టో ఏమిటి? అన్నవి.ఇక్కడ చెప్పుకోవలసింది మరొకటి ఉంది. అటువంటి ఉమ్మడి మేనిఫెస్టో ఒకటి వివరమైనది ఉండి కూడా, ‘కామన్ మినిమమ్ ప్రోగ్రాం’ పేరిట కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని కూడా, 1989–91 కాలపు ‘నేషనల్ ఫ్రంట్’ కుప్పగూలింది. వాస్తవానికి వీపీ సింగ్ పార్టీ జనతాదళ్‌తో పాటు, సోషలిస్టు నేపథ్యం గల కొన్ని కుల పార్టీలు, వామపక్షాలు, ప్రాంతీయ పార్టీలు కలిసి, కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా లెఫ్ట్ ఆఫ్ ద సెంటర్ సిద్ధాంతంతో స్థాపించిన బలమైన ఫ్రంట్ అది. ఆ మేనిఫెస్టో ప్రకారం మంచి పనులు అనేకం చేశారు కూడా! కానీ కేవలం దేవీలాల్, చంద్రశేఖర్‌ల అధికార దాహానికి అది బలైంది. లేనట్లయితే, రథయాత్ర కారణంగా అద్వానీని లాలూ యాదవ్ అరెస్ట్ చేసి వీపీ సింగ్ ప్రభుత్వానికి జనసంఘ్ మద్దతు ఉపసంహరించుకున్నా నేషనల్ ఫ్రంట్ కొనసాగి బలపడేది.ఇండియా కూటమికి అసలు ఉమ్మడి మేనిఫెస్టో అన్నది లేక పోయింది. అందుకోసం ప్రయత్నాలయినా జరగటం లేదు. ఉమ్మడి మేనిఫెస్టో అవసరమనే ఆలోచన కాంగ్రెస్‌కు సీరియస్‌గా ఉన్నదా లేక, ఎన్నికల ముందు చేసిన ప్రయత్నం ఒక తతంగమా? ఈ అనుమానం ఎందుకంటే, కాంగ్రెస్‌కు కావలసింది ఏకచ్ఛత్రాధిపత్యం తప్ప ఇతరు లతో అధికారాన్ని పంచుకోవటం ఇష్టముండదు. కూటమి పేరిట చేయజూసేది తక్కిన పార్టీలను నిచ్చెన మెట్లవలె ఉపయోగించు కోవడం మాత్రమే. ఇది ఊహాగానం కాదు. 2004లో, 2009లో గెలిచి నపుడు వారు చేయజూసింది అదేననీ, అందువల్ల సమస్యలు తలెత్తి కొన్ని పార్టీలు దూరమైనాయనీ తెలిసిందే. ఇటువంటి స్వభావం కాంగ్రెస్‌కు ఇప్పటికీ మారలేదు. కనుక ఉమ్మడి మేనిఫెస్టో ఉండక పోవచ్చు కూడా!టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
ప్రేమ విఫలం... బలవన్మరణం
నెక్కొండ/శాంతినగర్: ప్రేమ విఫలం కావడంతో రెండు వేర్వేరు ఘటనల్లో ఇద్దరు యువకులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వరంగల్ జిల్లా నెక్కొండ ఎస్ఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. నెక్కొండకు చెందిన చింతల జయంత్ (22) ఓ గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఉద్యోగం వచ్చాక పెళ్లి గురించి ఆలోచించాలని జయంత్‌ను యువతి తల్లిదండ్రులు మందలించారు. యువతి సైతం అతన్ని దూరం పెట్టింది. దీంతో ఈ నెల 27న తన సెల్ఫోన్లో సెల్ఫీ వీడియో తీసుకుంటూ గడ్డి మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపించాడు. వీడియో చూసిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జయంత్‌ను ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ బుధవారం చనిపోయాడు. మృతుడి తండ్రి తిరుపతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. వీడియో తీసి.. సూసైడ్ నోట్ రాసి.. ప్రేమించి మోసపోవద్దని, తాను మోసపోయి ఆ త్మహత్య చేసుకుంటున్నా అంటూ ఓ యువకుడు పంపిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. జోగులాంబ–గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ స్టేజీకి చెందిన తెలిగి అశోక్ (22) మంగళవారం రాత్రి కర్నూలులోని ఓ లాడ్జిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు అతడు.. తాను ప్రేమించిన యువతికి మరో వ్యక్తితో వివాహం నిశ్చయమైందని, యువతి తండ్రి కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నందున తనపై తీవ్ర ఒత్తిడి చేస్తున్నారని, తన చావుకు కారణమైన వారిని వదలొద్దంటూ వీడియోలో పేర్కొన్నాడు. సూసైడ్ నోట్ రాసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు బుధవారం అశోక్ మృతదేహాన్ని తీసుకొ చ్చి అలంపూర్–రాయచూర్ రోడ్డుపై బైఠాయించి ఆత్మహత్యకు కారణమైన వారిని శిక్షించాలని డిమాండ్ చేశారు. బాధితుడి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తుచేస్తామని సీఐ రవిబాబు చెప్పారు. -
రాష్ట్రపతి భవన్‌లోని దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్ల మార్పు
న్యూఢిల్లీ: రాష్ట్రపతి భవన్‌లోని ముఖ్యమైన రెండు హాళ్ల పేర్లను కేంద్రం మార్చింది. పలు ముఖ్యమైన కార్యక్రమాలకు వేదికగా ఉన్న దర్బార్ హాల్, అశోక్ హాల్ పేర్లను పేర్లను.. ఇకపై ‘గణతంత్ర మండపం’,‘అశోక్ మండపం’గా పిలవనున్నారు. ఈ మేరకు ప్రెసిడెంట్ సెక్రటేరియట్ గురువారం వెల్లడించింది. భారతీయ సాంస్కృతిక విలువలు, నైతికతలను ప్రతిబింబించేలా చేయడంలో భాగంగా ఈ పేర్లు మార్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.కాగా జాతీయ అవార్డుల ప్రదానం వంటి కీలక కార్యక్రమాలు దర్బార్ హాల్లో జరుగుతుంటాయి. ‘దర్బార్’ అనే పదం కోర్టు, అసెంబ్లీ అనే అర్థాలను ప్రతిబింబిస్తుంది. గతంలో ఆంగ్లేయులు, భారత పాలకులు సమావేశాలు నిర్వహించిన ప్రాంతాన్ని దర్బార్ అనేవారు. అయితే భారత్ గణతంత్ర రాజ్యంగా మారిన తర్వాత ఆ పదం ప్రాముఖ్యతను కోల్పోయింది. గణతంత్ర అనే పదం స్వతంత్ర భారతంలో లోతుగా పాతుకుపోయింది. అందుకే ఈ హాల్‌కు గణతంత్ర మండపంగా మారుస్తున్నాం’ అని అధికారిక ప్రకటనలో పేర్కొంది.ఇకపోతే ‘అశోక్ హాల్’ పేరును ‘అశోక్ మండపం’ అని మార్చడంపై కూడా కేంద్రం వివరణ ఇచ్చింది.‘ అశోక్ హాల్ నిజానికి ఒక బాల్రూమ్. అశోక్ అంటే అన్ని బాధల నుంచి విముక్తుడైన వ్యక్తి అని అర్థం. అలాగే 'అశోక' అనేది అశోక్ చక్రవర్తిని సూచిస్తుంది. ఇది ఐక్యత, శాంతియుత సహజీవనానికి చిహ్నం. అశోక పదం భారతీయ మత సంప్రదాయాలు, కళలు, సంస్కృతిలో లోతైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. సమాజంలో అశోక చెట్టుకున్న ప్రాముఖ్యత దృష్ట్యా దానికి అశోక్ మండపం అని మార్చినట్లు వివరించింది. -
‘బ్రిక్స్’ పార్లమెంట్ రానున్నదా?
ఈ నెల 11–12 తేదీలలో జరిగిన బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం సమావేశాల్లో రష్యా అ«ధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలిక్కిపడింది. ఆ కొత్త సంస్థ యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా అన్న ప్రశ్న ఉత్పన్నమయ్యింది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు ఇప్పటికే బ్రిక్స్ బ్యాంక్ ఏర్పడింది. బ్రిక్స్ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మారకాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీలలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళ ధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి.ప్రస్తుతం ప్రపంచమంతటా చర్చ జరుగు తున్న సరికొత్త విషయం బ్రిక్స్ పార్లమెంట్ నిజంగా ఏర్పడవచ్చునా అన్నది! ‘బ్రిక్స్’ గురించి తెలిసిందే. ‘బ్రిక్స్’ పార్లమెంటరీ ఫోరం మాట విన్నదే. కానీ ‘బ్రిక్స్’ పార్లమెంట్ కొత్త మాట. పార్లమెంటరీ ఫోరం సమావేశాలు ఈ నెల 11–12 తేదీలలో రష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో జరిగినప్పుడు, మొదటి రోజున ప్రారంభోపన్యాసం చేసిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్, ఉరుములేని పిడుగువలె బ్రిక్స్ పార్లమెంట్ ఏర్పాటు ప్రస్తావన చేశారు. ఆ మాట విని ప్రపంచమంతా ఉలికి పడింది. ఆయన ఆలో చనలోని ఉద్దేశమేమిటి? ‘బ్రిక్స్’ దేశాలు అందుకు సమ్మతిస్తాయా? ఆ కొత్త సంస్థ లక్ష్యాలేమిటి? అది యూరోపియన్ పార్లమెంటుకు, లేదా అసలు ఐక్యరాజ్య సమితికే పోటీ కాకున్నా సమాంతర సంస్థ కాగలదా? అనే ప్రశ్నలు శరపరంపరగా తలెత్త్తటం మొదలైంది. ఇది ముఖ్యంగా పాశ్చాత్య దేశాలకు కలవరపాటు కలిగిస్తున్నదనేది గమనించవలసిన విషయం.ఇందుకు సంబంధించి తెలుసుకోవలసిన సమాచారాలు కొన్నున్నాయి. అంతకన్నా ముఖ్యంగా అర్థం చేసుకోవలసిన అంత ర్జాతీయ విషయాలు చాలా ముఖ్యమైనవి కొన్నున్నాయి. ఇందులో మొదటగా సమాచారాలను చూద్దాం. ‘బ్రిక్స్’ అనే సంస్థ మొదట ‘బ్రిక్’ (బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా) అనే పేరిట 2006లో ఏర్పడింది. తర్వాత 2011లో సౌత్ ఆఫ్రికా చేరికతో ‘బ్రిక్స్’ అయింది. ఈ సంవత్సరం ఈజిప్టు, ఇథియోపియా, ఇరాన్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరాయి. తమను కూడా చేర్చుకోవాలంటూ మరొక పాతిక దేశాల వరకు దరఖాస్తు చేసుకున్నాయి. ‘బ్రిక్స్’ సభ్యదేశాలు 2009లో పార్లమెంటరీ ఫోరంను ఏర్పాటు చేసుకున్నాయి. ఈ ఫోరం 10వ సమావేశాలు ఈ నెలలో జరిగినపుడే పుతిన్ తన ప్రతిపాదన చేశారు. ఆ సమావేశంలో మన లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. నిజానికి బ్రిక్స్ పార్లమెంటరీ ఫోరం అన్నది సభ్య దేశాల పార్లమెంట్ స్పీకర్ల ఫోరం. అందుకు భిన్నంగా, పుతిన్ ప్రతిపాదన కొత్తగా ఒక ఉమ్మడి పార్లమెంటును ఏర్పాటు చేసుకోవటం. ‘బ్రిక్స్’ శిఖరాగ్ర సమావేశాలు వచ్చే అక్టోబర్‌లో రష్యాలోని కజాన్ నగరంలో జరగ నున్నాయి. ఈ ప్రతిపాదన అపుడు అధికారికంగా చర్చకు వచ్చి,అందరూ ఆమోదించే పక్షంలో ఆచరణకు వస్తుంది. ఈలోగా ఈ విషయమై ప్రపంచమంతటా చర్చలు సాగుతాయి. మరొకవైపు సభ్య దేశాల మధ్య ముందస్తు సంప్రదింపులు జరగగలవని వేరే చెప్ప నక్కరలేదు. పోతే, బ్రిక్స్ లక్ష్యాలే బ్రిక్స్ పార్లమెంటు లక్ష్యాలు, విధులు కాగలవని భావించవచ్చు. బ్రిక్స్ 2006లో ఏర్పడింది. ఎందుకు? ఈ 18 సంవత్సరాలలో ఆ సంస్థ చేసిందేమిటి? అన్నవి మొదట ఉత్పన్న మయే ప్రశ్నలు. ఇది ప్రధానంగా ఆర్థిక, వాణిజ్యపరమైన సంబంధాల కోసం ఏర్పడినటువంటిది. పరస్పర సంబంధాలతో పాటు ఇతర దేశా లతో ఆర్థిక, వాణిజ్య సంబంధాల అభివృద్ధి కూడా ఈ పరిధిలోకి వస్తుంది. బ్రిక్స్‌కు రాజకీయపరమైన, సైనికమైన, వ్యూహాత్మకమైన లక్ష్యాలు ఏవీ లేవని, గత 18 సంవత్సరాలుగా అదే ప్రకారం పని చేస్తున్నదనేది గమనించవలసిన విషయం. అంతే గమనించవలసిందేమంటే తన ఆర్థిక లక్ష్యాల ప్రకారం బ్రిక్స్ చాలా సాధించింది. ఉదాహరణకు తాజా లెక్కల ప్రకారం, పాశ్చాత్య దేశాల కూటమి అయిన జీ–7 జీడీపీ ప్రపంచంలో 29 శాతం మాత్రమే కాగా, బ్రిక్స్ జీడీపీ 36.8 శాతానికి చేరింది. ఆర్థిక రంగంలో జరుగుతున్నదాని సూచనలను బట్టి చూడగా ఈ వ్యత్యాసం ఇంకా పెరుగుతూ పోగలదన్నది నిపుణుల అంచనా. అది చాల దన్నట్లు మునుముందు సౌదీ అరేబియా, ఇండోనేషియా, మెక్సికో తదితర దేశాలు చేరినపుడు పరిస్థితి ఏమిటో ఊహించవచ్చు. అమె రికా శిబిరానికి బ్రిక్స్ అంటే సరిపడకపోవటానికి ముఖ్యకారణం ఇదే. లోగడ ఆసియాలో ఏషియాన్, ఆఫ్రికాలో ఎకోవాస్, ఇఎసి, లాటిన్ అమెరికాలో సదరన్ కామన్ మార్కెట్ వంటివి ఏర్పడ్డాయి. ఏషియాన్ గొప్పగా విజయవంతం కాగా తక్కినవి అంతగా కాలేదు. పైగా వాటిలో అమెరికా జోక్యాలు బాగా సాగినందున తమకు పోటీగా మారలేదు. తమను అధిగమించటం అంతకన్నా జరగలేదు. బ్రిక్స్ రికార్డు వీటన్నిటికి భిన్నంగా మారింది. ఆ సంస్థ ఆమెరికా జోక్యానికి సమ్మతించలేదు. ఇండియాతో సహా ఎవరూ ఒత్తిళ్లకు లొంగలేదు. ఇది చాలదన్నట్లు అర్థికాభివృద్ధిలో తమను మించిపోతున్నారు. ఒత్తిళ్లను కాదని ఇదే సంవత్సరం ఈజిప్టు, యూఏఈ వంటివి చేరాయి. ఇరాన్‌ను చేర్చుకోరాదన్న ఒత్తిడికి బ్రిక్స్ సమ్మతించలేదు. అదే పద్ధతిలో సౌదీ, టర్కీ, ఇండోనేషియా, లిబియా, మెక్సికో వంటివి ముందుకు వస్తున్నాయి. ఇదంతా చాలదన్నట్లు, ప్రపంచంపై పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యాన్ని సవాలు చేసే పరిణామాలు మరికొన్ని జరుగుతున్నాయి. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌కు పోటీయా అన్నట్లు బ్రిక్స్ బ్యాంక్ ఒకటి 2014 లోనే ఏర్పడింది. అమెరికన్ డాలర్ ప్రాబల్యాన్ని అరికట్టేందుకు బ్రిక్స్ కరెన్సీ అయితే ఇంకా రూపొందలేదు గానీ, బ్రిక్స్ దేశాలకు చెల్లింపుల కోసం బ్రిక్స్ చెయిన్ పేరిట ఒక సాధనం చలామణీలోకి వచ్చింది. అట్లాగే ఈ దేశాల మధ్య, దానితో పాటు తమ ద్రవ్య మార కాలను అంగీకరించే దేశాలతో అమెరికన్ డాలర్ బదులు తమ కరెన్సీ లలోనే లావాదేవీలు జరపటం పెరిగిపోతున్నది. బ్రిక్స్ బ్రిడ్జ్ పేరిట మరొక చెల్లింపుల పద్ధతి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. వీటన్నింటి ప్రభావాలతో పాశ్చాత్య ప్రపంచపు ఆర్థిక ప్రాబల్యం, పారిశ్రామికాభివృద్ధి, వాణిజ్యం క్రమంగా బలహీనపడుతున్నాయి. ఉదాహరణకు ప్రస్తుత సంవత్సరంలో బ్రిక్స్ సగటు అర్థికాభివృద్ధి 3.6 శాతం మేర, జీ–7 దేశాలది కేవలం 1 శాతం మేర ఉండగలవని అంచనా. ప్రపంచంలో ఇప్పటికే రెండో అతిపెద్ద ఆర్థికశక్తిగా మారిన చైనా మరొక దశాబ్దం లోపలే అమెరికాను మించగలదన్నది అంతటా వినవస్తున్న మాట. ఈ పరిణామాలన్నీ అమెరికా ఆధిపత్యాన గల ఏకధ్రువ ప్రపంచాన్ని బహుళధ్రువ ప్రపంచంగా తిరుగులేకుండా మార్చుతున్నాయి. ఈ శతాబ్దం ఆసియా శతాబ్దం కాగలదనే జోస్యాలు ఆ విధంగా బలపడుతున్నాయి. చైనా ప్రారంభించిన బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టులో అమెరికా ఒత్తిళ్లను కాదని ఇప్పటికి 150 దేశాలు చేరటం, అందులో వారి శిబిరానికి చెందినవి కూడా ఉండటం ఈ ఆర్థిక ధోరణులకు దోహదం చేస్తున్నది.ఈ విధమైన ప్రభావాలను ముందుగానే అంచనా వేసి కావచ్చు అమెరికన్లు, యూరోపియన్లు మొదటినుంచే బ్రిక్స్‌ను, బెల్ట్ అండ్ రోడ్ ఇనీషియేటివును అడ్డుకునేందుకు, బ్రిక్స్‌లోని సభ్య దేశాలను ఒత్తిడి చేసేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తూ వస్తున్నాయి. రకరకాల ఆంక్షలు ఏదో ఒక సాకుతో విధించటం (ఇండియాపై కూడా), వివిధ దేశాల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలను భంగపరచజూడటం అందులో భాగమే. భారత, రష్యాల విషయంలోనూ అదే వైఖరి చూపటానికి తాజా ఉదాహరణ ఈ నెల ఎనిమిదిన ప్రధాని మోదీ, పుతిన్‌ను కలవటంపై ఆగ్రహించటం. అమెరికా శిబిరం ప్రజాస్వామ్యమనీ, ఆసియా దేశాల స్వేచ్ఛ అనీ, అంతర్జాతీయ నియమాలకూ, ఐక్య రాజ్యసమితి ఛార్టర్‌కూ కట్టుబడటమనీ నీతులు చాలానే చెప్తుంది. కానీ అందుకు విరుద్ధమైన తమ చర్యల గురించి ఎన్ని రోజుల పాటైనా చెప్పవచ్చు.వీటన్నింటికి విరుగుడుగా తక్కిన ప్రపంచ దేశాలు తీసుకుంటున్న వివిధ చర్యలలో, బ్రిక్స్ పార్లమెంట్ అనే కొత్త ప్రతిపాదన ఒక ముందడుగు కాగల అవకాశం ఉంది. ప్రపంచ దేశాల మధ్య సమా నత్వ ప్రాతిపదికగా పరస్పర సహకారానికి, ఇతోధికాభివృద్ధికి అవస రమైన చర్చలు బ్రిక్స్ పార్లమెంటులో జరగాలన్నది తన ఆలోచన అయినట్లు పుతిన్ చెప్తున్నారు. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకులు -
ఇంజక్షన్ వికటించి బాలుడి మృతి?
నెక్కొండ/ఎంజీఎం, వరంగల్: కొందరి ఆర్ఎంపీల వైద్యానికి నిత్యం ఏదో ఒక చోట అయాయకులు బలవుతున్నారు. తాజాగా మండలంలోని ముదిగొండకు చెందిన కావటి మణిదీప్ (10) కూడా ఆర్ఎంపీ చేసిన వైద్యం వికటించి మృతి చెందినట్లు సామాజిక మాధ్యమాల్లో సోమవారం వైరలైంది.వివరాల్లోకి వెళ్తే.. గ్రామానికి చెందిన కావటి కోటేశ్వర్, సరిత దంపతులకు ముగ్గురు సంతానం. పెద్ద కుమారుడు మణిదీప్ ఇటీవల కుక్క కాటుకు గురయ్యాడు. దీంతో గ్రామానికి చెందిన ఆర్ఎంపీ అశోక్.. ఈ నెల 11వ తేదీన యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశాడు. దీంతో బాలుడు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందాడు. దీనిపై సదరు ఆర్ఎంపీ.. గుట్టుచప్పడు కాకుండా మృతుడి కుటుంబ సభ్యులతో రహస్య ఒప్పంద కుదుర్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ వైద్య మండలి (టీజీఎంసీ) వెంటనే స్పందించి సుమోటోగా స్వీకరించింది. దీంతో వరంగల్ జిల్లా యాంటీ క్వాకరీ బృందానికి జరిగిన ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాలని చైర్మన్ మహేశ్‌కుమార్, రిజిస్ట్రార్ లాలయ్య సోమవారం ఆదేశించారు.కాగా, వరంగల్ టీజీఎంసీ సభ్యుడు శేషుమాధవ్, టీజీఎంసీ రిలేషన్ కమిటీ చైర్మన్ నరేశ్‌కుమార్, రాష్ట్ర ఐఎంఏ వైస్ ప్రెసిడెంట్ అశోక్‌రెడ్డి, వరంగల్ ఐఎంఏ ప్రెసిడెంట్ అన్వర్‌మియా, వరంగల్ హెచ్ఆర్డీఏ అధ్యక్షుడు కొలిపాక వెంకటస్వామి, తానా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాకేశ్ నేతృత్వంలోని వైద్య బృందం మృతుడి కుటుంబాన్ని పరామర్శించి విచారణ చేయనుందని ఆదేశాల్లో పేర్కొంది. -
ముగ్గురు పిల్లలతో సహా చనిపోవాలని..
అబ్దుల్లాపూర్‌మెట్: మార్నింగ్ వాక్ చేసేందుకు ముగ్గురు పిల్లలతో కలిసి బయటకు వచ్చిన ఓ తండ్రి.. తన పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ పీఎస్ పరిధిలో బుధవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్ జిల్లా అడ్డాకులకు చెందిన అశోక్ వ్యాపార నిమిత్తం నగరానికి వలస వచ్చి మీర్‌పేట పరిధిలోని అల్మాస్గూడ శ్రీహోమ్స్ కాలనీలో నివాసముంటున్నాడు. బిజినెస్‌లో నష్టం రావడం, ఆర్థిక ఇబ్బందులు ఎక్కువ కావడంతో ఆత్మహత్యే శరణ్యమని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో ఉదయం 6గంటలకు తన పిల్లలు 14 ఏళ్ల అవిఘ్నశ్రీ , 13 ఏళ్ల శ్రీధర్, తొమ్మిదేళ్ల వయసున్న సహస్రను తీసుకుని కారులో బయటకు వెళ్లాడు. నేరుగా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం ఇనాంగూడలోని బైరాన్ఖాన్ చెరువు వద్దకు చేరుకున్నాడు. ద్విచక్ర వాహనాలు మాత్రమే వేళ్లేందుకు అనువుగా ఉండే చెరువు కట్టపై నుంచి కారును వేగంగా చెరువులోకి దింపాడు. సమీపంలోని తాటి చెట్లపై ఉన్న గీత కార్మికులు, రోడ్డు పక్కనే ఉన్న స్థానికులు చూస్తుండగానే కారు నీళ్లలో మునుగుతుండగా.. భయంతో వణికిపోయిన బాలుడు శ్రీధర్.. తనవైపు కిందకు దించి ఉన్న కారు అద్దం నుంచి బయటకు వచ్చి, వాహనం పైకి ఎక్కాడు. మిగిలిన ఇద్దరు పిల్లలు సైతం అతన్ని అనుసరించారు. ఆ తర్వాత అశోక్ సైతం బయటకు వచ్చాడు. కారు పూర్తిగా నీటిలో మునుగుతున్న సమయంలో.. వేగంగా స్పందించిన స్థానికులు తాడు, ట్యూబ్ సాయంతో చెరువులోకి వెళ్లి.. ముగ్గురు పిల్లలతో పాటు అశోక్‌ను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. సివిల్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్న అశోక్‌కు ఆర్థిక సమస్యలకు తోడు పాటు భార్యతో సైతం గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. తాను చనిపోతే తన పిల్లలు అనాథలవుతారనే ఉద్దేశంతోనే అశోక్ ఇలా వ్యవహరించి ఉంటాడని ఘటనా స్థలంలో ఉన్నవారు తెలిపారు. మీర్పేట్ పీఎస్‌లో ఫిర్యాదుకాగా, మార్నింగ్ వాక్ కోసం పిల్లలను తీసుకెళ్లిన అశోక్ చాలా సమయం గడిచినప్పటికీ తిరిగి రాకపోవడంతో అతని తమ్ముడు సంజీవ మీర్పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఇనాంగూడ చెరువు వద్ద ఉన్నట్లు గుర్తించారు. పోలీసులు అక్కడకు చేరుకునేలోపే స్థానికులు వారిని బయటకు తీశా రు. అనంతరం మీర్పేట్ పీఎస్‌కు తరలించి.. అశోక్ భార్యతో పాటు అతని సో దరుడికి కౌన్సెలింగ్ ఇచ్చి పంపించారు. -
టీటీడీ.. మాకే కావాలి! పట్టుబడుతున్న టీడీపీ, జనసేన
సాక్షి, అమరావతి: తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) చైర్మన్ పదవి కోసం కూటమి పార్టీలు పోటీ పడుతున్నాయి. టీడీపీ, జనసేన నేతలు ఆ పదవి కోసం గట్టిగా పట్టుపడుతున్నారు. టీడీపీ నుంచి అశోక్ గజపతిరాజు, వేమిరెడ్డి ప్రశాంతి, రఘురామకృష్ణరాజు రేసులో నిలవగా.. జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకే టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలంటూ ఆ పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తమ పారీ్టకి చెందిన సీనియర్ నేత ఎవరికైనా ఆ పదవి ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు పేరును ఆయన పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరిగింది. అశోక్ గజపతిరాజు ఇటీవల జరిగిన ఎన్నికల్లో తన కుమార్తె అదితికి అవకాశం కలి్పంచి.. తాను పోటీ నుంచి వైదొలిగారు. దీంతో ఆయనకే ఈ పదవి ఇస్తారనే ప్రచారం జరిగింది. కానీ ఆయన పూర్తికాలం ఆ పదవి కోసం సమయం కేటాయించకపోవచ్చని, అలాగే అందరికీ అందుబాటులో ఉండడం కష్టమనే అభిప్రాయం టీడీపీ నేతల్లో నెలకొంది.ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లా ఉండి ఎమ్మెల్యే కె.రఘురామకృష్ణరాజు పేరును కూడా పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. మంత్రివర్గంలో స్థానం దక్కకపోవడం.. స్పీకర్ పదవి ఆశించినా అదీ రాకపోవడంతో ఆయన తనకు తగిన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి కూడా రేసులో ఉన్నట్లు తెలిసింది. నెల్లూరు జిల్లాలో పార్టీ గెలుపు కోసం చాలా కష్టపడ్డామని.. తమకు టీటీడీ చైర్మన్ పదవి ఇవ్వాలని ఆమె కోరుతున్నట్లు టీడీపీ వర్గాలు తెలిపాయి. నాగబాబు కోసం ఒత్తిడి! టీడీపీలోనే టీటీడీ చైర్మన్ పదవి కోసం ఎంతో మంది ఆశలు పెట్టుకోగా.. దాన్ని ఎలాగైనా దక్కించుకునేందుకు జనసేన పార్టీ పావులు కదుపుతోంది. ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ సోదరుడైన నాగబాబుకు ఆ పదవి ఇవ్వాల్సిందేనని జనసేన పార్టీ చంద్రబాబుపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆయనకు టీటీడీ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. అనంతరం ఆ ప్రచారాన్ని ఖండించిన నాగబాబు.. అధికారిక ప్రకటన వస్తేనే ఇలాంటి వాటిని నమ్మాలన్నారు. దీంతో నాగబాబుకు టీటీడీ చైర్మన్ పదవిపై ఆశ ఉన్నట్లు బయటపడింది.ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనకాపల్లి ఎంపీగా పోటీ చేయడానికి సిద్ధమైన నాగబాబు.. సర్దుబాటులో భాగంగా ఆ సీటును వదులుకున్నారు. దీంతో అన్నకు ఏదైనా మంచి పదవి ఇప్పించాలనే ఉద్దేశంలో పవన్‌కళ్యాణ్ ఉన్నట్లు తెలిసింది. అందులో భాగంగానే టీటీడీ చైర్మన్ పదవిని అడుగుతున్నట్లు సమాచారం. నెల రోజులుగా ఆ పోస్టు ఖాళీగా ఉన్నా కూడా ఆ పదవికి ఉన్న ప్రాధాన్యత.. పోటీ నేపథ్యంలో చంద్రబాబు ఏమీ తేల్చట్లేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు టీటీడీ బోర్డులో కూడా తమ పారీ్టకి చెందిన వారిని సగం మందిని నియమించాలని జనసేన కోరుతున్నట్లు తెలిసింది. బీజేపీ కూడా మూడుకు తగ్గకుండా తమ వారిని బోర్డులో సభ్యులుగా నియమించాలని డిమాండ్ చేస్తోందని సమాచారం. -
అద్దేపల్లిలో వైఎస్సార్ విగ్రహం పునఃప్రతిష్ట
భట్టిప్రోలు: బాపట్ల జిల్లా భట్టిప్రోలు పంచాయతీ అద్దేపల్లిలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఆదివారం పునఃప్రతిష్టించారు. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని టీడీపీ వర్గీయులు పెట్రోలు పోసి దహనం చేసిన విషయం విదితమే. ఈ చర్యను నిరసిస్తూ, ఆ స్థానంలో మరో విగ్రహం ఏర్పాటు చేయాలంటూ వైఎస్సార్సీపీ వేమూరు నియోజకవర్గ ఇన్చార్జి వరికూటి అశోక్‌బాబు శనివారం రాత్రి మౌనదీక్షకు దిగారు. దీక్షను భగ్నం చేసేందుకు ప్రయత్నించిన పోలీసులు లాఠీచార్జి చేయడంతో పలువురు గాయపడ్డారు. డీఎస్పీ మురళీకృష్ణ ఆధ్వర్యంలో పోలీసులు అశోక్‌బాబును రేపల్లె తరలించారు.ఆయన రాత్రి 12 గంటల వరకు రేపల్లె పోలీస్‌స్టేషన్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను దీక్ష విరమించేది లేదని చెప్పడంతో బాపట్ల ఎస్పీ వకుల్‌జిందాల్ ఆదేశాల మేరకు అశోక్‌బాబును పోలీసులు బలవంతంగా చెరుకుపల్లిలోని ఆదిశంకర వ్యాలీలోగల ఆయన నివాసానికి రాత్రి ఒంటిగంట సమయంలో తరలించారు. అశోక్‌బాబు ఆదివారం కూడా తన నివాసంలో దీక్షను కొనసాగించారు. ఆదివారం ఉదయం ధ్వంసమైన వైఎస్సార్ విగ్రహం స్థానంలో కొత్త విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. మధ్యాహ్నం మూడుగంటలకు దళితవాడ వాసులు పూలమాలలు వేసి విగ్రహాన్ని ఆవిష్కరించారు.దళిత హోంమంత్రి, దళిత డీజీపీని పెట్టి పోలీసులతో దళితులపై లాఠీఛార్జి చేయించిన ఘనత సీఎం చంద్రబాబుకే చెల్లుతుందని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్ విగ్రహాన్ని దహనం చేసిన నిందితులను, వారిని నడిపించిన టీడీపీ రాష్ట్ర కార్యదర్శి తూనుగుంట్ల సాయిబాబాను అరెస్టు చేయాలని అశోక్‌బాబు డిమాండ్ చేశారు. వైఎస్సార్ విగ్రహం ఏర్పాటు చేసిన వీడియో, ఫొటోలు చూసిన అనంతరమే దీక్షను విరమిస్తామని అశోక్‌బాబు చెప్పడంతో వాటిని చూపించారు. మాజీ ఎంపీ నందిగం సురేష్ నిమ్మరసం ఇచ్చి అశోక్‌బాబుతో దీక్ష విరమింపజేశారు. -
ఆధునిక జాతీయవాదమే గెలిచింది!
ఏ జాతికైనా ఒక జాతీయవాదం ఉండాలనే మాటలో సందేహం లేదు. కానీ ఆ జాతీయవాదానికి ఆధారం ఏమిటన్నది ప్రశ్న. ఫ్యూడలిజం, రాచరికం కాలమేలినపుడు ఒక ప్రధాన భాష, నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు అందుకు పనికొచ్చాయి. జాతీయవాదానికి మతం ఆధారం కావాలనేది సంఘ్ పరివార్ సిద్ధాంతం. మత ఆధారిత జాతీయ వాదాన్ని భారతీయులు స్వాతంత్య్రోద్యమ సమయంలో గానీ, 1947 నుంచి నేటి వరకు గానీ అమోదించలేదు. మోదీ తిరిగి అధికారానికి వచ్చి ఉండవచ్చుగాక. కానీ బీజేపీ సంపూర్ణమైన మెజారిటీ పొందలేకపోయింది. అంతిమంగా ప్రజలు తమకు కావలసింది ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధికర జాతీయవాదం తప్ప, మత ఆధారిత జాతీయవాదం కాదని తేల్చి చెప్పారు.లోక్‌సభ ఫలితాలు చెప్పిన పాఠాలలో ముఖ్యమైనది ఒకటి చర్చకు రావటం లేదు. మత ఆధారిత జాతీయవాద నిర్మాణం జరగాలనే దృష్టి సరైనది కాదనీ, ప్రజాస్వామ్యాన్ని, అభివృద్ధిని ఆధారం చేసుకుంటూ జాతీయవాద నిర్మాణం జరగాలనే ఆధునిక దృష్టి మాత్రమే సరైనదనీ ప్రజలు తీర్పు చెప్పారు. ఏ జాతికైనా ఒక జాతీయవాదం ఉండాలనే మాటలో సందేహం లేదు. అటువంటి జాతీయవాదానికి ఆధారం కావలసింది ఏమిటన్నది ప్రశ్న. మతం ఆధారం కావాలనేది సంఘ్ పరివార్‌కు వందేళ్ల క్రితం 1925లో ఆర్ఎస్ఎస్ ఏర్పడినప్పటినుంచి గల సిద్ధాంతం. అదే సిద్ధాంతాన్ని ఆ సంస్థ రాజకీయ విభాగాలైన జన సంఘ్, బీజేపీలు ప్రభుత్వాధికారం ద్వారా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేశాయి. నరేంద్ర మోదీ మొదట గుజరాత్ ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానిగా ఆ ప్రయత్నాలను ఉధృతంగా సాగించారు. ఈ క్రమంలో 2014, 2019 ఎన్నికలు గెలవటంతో, ఇక దేశ ప్రజలు మత ఆధారిత జాతీయవాదాన్ని బలపరుస్తున్నారనే భావన బీజేపీలో, సంఘ్ పరివార్‌లో బాగా ఏర్పడసాగింది. ఈ 2024లో కూడా (సంపూర్ణ మెజారిటీతో) గెలిచినట్లయితే ఇక తమ తరహా జాతీయ వాద సిద్ధాంతానికి ఎదురులేదని నమ్మేవారు. వాస్తవానికి అటువంటి అజెండాను ఈ ఎన్నికల తర్వాత మరింత బలంగా ముందుకు తీసుకుపోయేందుకు వారు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు కూడా. కానీ, ఎన్నికలలో ప్రజలు అందుకు విరుద్ధమైన తీర్పునిచ్చారు. ప్రపంచంలో మధ్య యుగాల కాలంలో ఫ్యూడలిజం, రాచరికం, మత వ్యవస్థలు కాలమేలినపుడు, నెమ్మదిగా జాతిభావనలు కూడా వచ్చినప్పుడు, జాతీయవాదానికి ఆధారంగా మతం, ఒక ప్రధాన భాష, నిర్దిష్టమైన భౌగోళిక సరిహద్దులు తప్ప మరొకటి కనిపించలేదు వారికి. జాతులు కేంద్రంగా గల ఆయా రాజ్యాలలో వైవిధ్యత తక్కువ. ఫ్రెంచ్ విప్లవం, రెనైజాన్స్, పారిశ్రామిక విప్లవాల వంటివి గానీ, ఆధునికతకు అనుగుణమైన సామాజికాభివృద్ధి సిద్ధాంతాలు గానీ అప్పటికి లేవు. బ్రిటిష్ వలస పాలనలో ఉండిన భారతదేశం విషయానికి వస్తే, ఇక్కడ అత్యధిక ప్రజలు హిందూ అనే ఒక మతానికి చెందిన వారైనా, రాచరికాలు, ఫ్యూడల్ వ్యవస్థలే రాజ్యమేలుతుండినా, 1857 నాటి ప్రథమ భారత స్వాతంత్య్రోద్యమం అనంతరం మరొక 15–20 సంవత్సరాలు గడిచేసరికి దేశంలో ఆధునిక భావనలు ప్రవేశించసాగాయి. అది ఎందుకు, ఏ విధంగా ఏ వర్గాలలో అనే వివరాలను పక్కన ఉంచితే, అటువంటి ఆధునిక, ప్రజాస్వామిక భావనల ప్రతిఫలితమే 1885లో కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు. తర్వాత గాంధీజీ రంగ ప్రవేశంతో ఈ భావనలు మరింత ఆధునికం, ప్రజాస్వామికం అయ్యాయి. ఆ సరికి ప్రపంచ దేశాలు కూడా ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధి దశలోకి ప్రవేశించాయి. ఆ మొత్తం ధోరణులకు భిన్నంగా, మరికొన్ని సంవత్సరాలు గడిచే సరికి సావర్కార్, ఆర్ఎస్ఎస్లు మత ఆధారిత జాతీయ వాదనను ముందుకు తెచ్చారు.యధాతథంగా మత ఆధారిత జాతీయ వాదాన్ని భారతీయులు స్వాతంత్య్రోద్యమ సమయంలో గానీ, 1947 నుంచి నేటి వరకు గానీ ఏదశలోనూ అమోదించలేదు. మధ్యలో జరిగిందేమంటే, రాజ్యాంగంలో, చట్టాలలో చెప్పుకున్న తరహా పరిపాలన, అభివృద్ధి, ప్రజాస్వామిక విధివిధానాలలో కాంగ్రెస్ తదితర పార్టీలు పదే పదే విఫలమైనందువల్ల మాత్రమే బీజేపీ అనే మరొక పార్టీకి ఆ శూన్యంలోకి ప్రవేశించే అవకాశం లభించింది. ఆ విధంగా ప్రత్యామ్నాయ రూపంలో వచ్చిన పార్టీ సందర్భవశాత్తు ఒక మతతత్త్వ పార్టీ అయింది. తమ సిద్ధాంతం ప్రకారం మత ఆధారిత జాతీయవాదాన్ని నిర్మించేందుకు ప్రయత్నించింది. ఎన్నికలలో గెలిచే కొద్దీ, అటువంటి వాదానికే ప్రజామోదం లభిస్తున్నట్లు నమ్మసాగింది. కానీ, నిజానికి, అంతకన్న ముందటి పార్టీల వైఫల్యం వల్ల ఏర్పడిన శూన్యంలో తనది అతి«థి పాత్ర మాత్రమే.ఈ స్థితి గురించి అర్థం చేసుకోవలసిన విషయాలు కొన్నున్నాయి. ఒకవేళ బీజేపీ నాయకత్వం ఒక ప్రభుత్వంగా, తమ కన్న ముందటి ప్రభుత్వాలు విఫలమైన లోటుపాట్లను తీర్చి ప్రజలను సంతోషపెట్ట గలిగి ఉంటే, అదే తమ ప్రాథమిక బాధ్యత అని గుర్తించి ఉంటే, హిందూత్వ భావనను అందుకు సమాంతరంగా ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేసి ఉంటే, ఆ లక్ష్యానిది రెండవ ప్రాధాన్యతే తప్ప మొదటి ప్రాధాన్యత కాదనుకుని ఆ ప్రకారం ముందుకు వెళ్లి ఉంటే, ఏమి జరిగేదో చెప్పలేము. వాజ్‌పేయి, అద్వానీల హయాం వరకు బహుశా అదే విధమైన వ్యూహంతో వ్యవహిరించినట్లు ఇపుడు వెనుకకు తిరిగి చూస్తే అనిపిస్తుంది. కానీ వారికీ, మోదీకీ స్పష్టమైన తేడాలున్నాయి. వారి వ్యక్తిత్వాలు రూపు తీసుకున్న పరిస్థితులు, గుజరాత్ కాలం నుంచి మోదీ వ్యక్తిత్వం రూపు తీసుకున్న పరిస్థితులు వేరు. ‘హిందూ హృదయ సామ్రాట్’ అనే బిరుదును గుజరాత్ ముఖ్యమంత్రిగా సంపాదించుకున్న మోదీ (ఆ బిరుదు తన కన్న ముందు బాల్ ఠాకరే, కేశూభాయ్ పటేల్‌లకు ఉండేది), దేశాన్ని ఒక మత ఆధారిత జాతీయవాద రాజ్యంగా మార్చివేసే బాధ్యతను ప్రధానమంత్రిగా తన భుజాలపై వేసుకున్నారు. అది కూడా వీలయినంత వేగంగా చతురోపాయాలను ప్రయోగించి అయినా సరే. వాజ్‌పేయి, అద్వానీ వంటి వారికి భిన్నంగా తన నేపథ్యం, వ్యక్తిత్వం, స్వభావం అటువంటివి. అందువల్ల పద్ధతులూ భిన్నమైనవే. ఆ ప్రకారం పదేళ్ళలో ఏమేమి జరిగాయో, చివరకు మొన్నటి ప్రచార సమయంలో ఏమి జరిగిందో తెలిసిందే గనుక ఇక్కడ జాబితాలు అక్కరలేదు. అంతిమంగా ప్రజలు తమకు కావలసింది ఆధునిక, ప్రజాస్వామిక, అభివృద్ధికర జాతీయవాదం, అటువంటి వ్యవస్థలే తప్ప, మత ఆధారిత జాతీయవాదం కాదని తేల్చి చెప్పారు. మోదీ తిరిగి అధికారానికి వచ్చి ఉండవచ్చుగాక. కానీ సాక్షాత్తూ రామాలయమే గల ఫైజాబాద్ నియోజక వర్గంలో ఓటమి, అయోధ్య డివిజన్లోని మొత్తం ఐదు అసెంబ్లీ స్థానాలలో పరాజయం, కాశీపురాధీశుడినని నమ్మిన మోదీ మెజారిటీ సగానికి పైగా పడిపోవటం, హిందూత్వకు గుజరాత్ తర్వాతి ప్రయోగశాల అని చాటిన ఉత్తరప్రదేశ్‌లో సీట్లు సగానికి తగ్గిన పరాభవం చెప్తున్నదేమిటి? హిందూ మెజారిటీ దేశానికి కూడా కావలసింది ఆధునిక ప్రజాస్వామిక జాతీయవాదమే తప్ప, మతవాద ఆధారిత జాతీయవాదం కాదు. అంతెందుకు, ఈ 10వ తేదీన జరిగిన యూరోపియన్ యూనియన్ ఎన్నికల ఫలితాలను చూడండి. మితవాద పార్టీల బలం కొంత పెరిగిన మాట నిజం. కానీ ఆ పార్టీల అజెండాలో ఉన్నవి ఇతర అంశాలే తప్ప మతం కాదు.మరొక విశేషాన్ని గమనించాలి. మోదీ నాయకత్వాన బీజేపీ బలం పెరుగుతుండిన దశలో కొందరు మేధావులు ‘నిమ్న వర్గాల హిందూయిజం’ (సబ్ ఆల్టర్న్ హిందూయిజం) అనే సూత్రీకరణలు చేశారు. ఆ వర్గాలు ఆ పార్టీకి ఓటు చేశాయి గనుక వారిలో హిందూత్వ వ్యాపిస్తున్నదని వారి మాట. ఇపుడు ఇందులోనే ఆ వర్గాలు వ్యతిరేకంగా ఓటు చేశాయి. ఇందుకు వారి వివరణ ఏమిటో చూడాలి. వారు గుర్తించవలసిందేమంటే, పైన చెప్పుకున్నట్లు, ఈ వర్గాలు గత ్రçపభుత్వాల వైఫల్యం వల్ల కలిగిన జీవిత సమస్యలతో బీజేపీకి ఓటు చేశారు. ఆ పార్టీ విఫలమవుతున్నట్లు అర్థమై ఇపుడు దూరమవుతున్నారు. నిమ్న వర్గాల మత విశ్వాసాలు గానీ, జాతీయతా భావనలు గానీ ఏవిధంగా ఉంటాయో ఈ ఫలితాల వెలుగులో అర్థం చేసుకోవలసి ఉంటుంది. అదే విధంగా తిరిగి అధికారానికి వచ్చిన తర్వాత అమలు చేయదలచిన అల్ప సంఖ్యాక వర్గాల వ్యతిరేక చట్టాలు, ఆ వర్గాలపై మరింత విజృంభించాలనుకున్న సంఘ్ పరివార్ ప్రణాళికల విషయంలో పునరాలోచనలు అవసరమవుతాయి. టంకశాల అశోక్ వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు -
టెస్లా విజయం వెనుక ఇండియన్.. థాంక్స్ చెప్పిన మస్క్
గ్లోబల్ మార్కెట్లో అమెరికన్ కంపెనీ టెస్లా ఎంత ఎత్తుకు ఎదిగిందో అందరికి తెలుసు. అయితే ఆ సంస్థ నేడు ఈ స్థాయికి రావడానికి కారణమైన వారిలో భారతీయ సంతతికి చెందిన వ్యక్తి ఒకరు ఉన్నారని బహుశా చాలా మందికి తెలియకపోవచ్చు. ఆయనే 'అశోక్ ఎల్లుస్వామి'. ఈయనకు మస్క్ కృతజ్ఞతలు చెబుతూ తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో ట్వీట్ చేశారు.టెక్ బిలియనీర్ అశోక్ ఇటీవల తన ఎక్స్ (ట్విటర్) వేదికగా టెస్లా సీఈఓ 'ఇలాన్ మస్క్'ను ప్రశంసించారు. కంపెనీలో ఏఐ / ఆటోపైలెట్ విభాగాలు అభివృద్ధి చెందడం వెనుక మస్క్ పాత్ర అనన్యసామాన్యమని అన్నారు. ప్రారంభంలో ఈ టెక్నాలజీ స్టార్ట్ చెయ్యాలనే ఆలోచనను మస్క్ చెప్పినప్పుడు.. అసలు అది సాధ్యమవుతుందా అని అందరు అనుకున్నారు. కానీ మస్క్ ఏ మాత్రం వెనుకడుగు వేయకుండా.. టీమ్‌ను ముందుకు నడిపించారు.అనుకున్న విధంగా ముందుకు వెళుతూ 2014లో ఆటోపైలట్‌ను ఓ చిన్న కంప్యూటర్‌తో స్టార్ట్ చేసాము. అది కేవలం 384 KB మెమరీ మాత్రమే కలిగి ఉంది. ఆ తరువాత లేన్ కీపింగ్, లేన్ ఛేంజింగ్, లాంగిట్యూడినల్ కంట్రోల్ ఫర్ వెహికల్స్ వంటి వాటిని అమలు చేయాలని మస్క్ ఇంజనీరింగ్ టీమ్‌కు చెప్పారు. ఇది మాకు చాలా క్రేజీగా అనిపించింది. అయినా పట్టు వదలకుండా 2015లో టెస్లా ప్రపంచంలోనే మొట్టమొదటి ఆటోపైలట్ సిస్టమ్‌ను తీసుకువచ్చాము.https://t.co/yUqvdS7JOf— Ashok Elluswamy (@aelluswamy) June 9, 2024ఆటోఫైలెట్ కోసం ఇతరుల మీద ఆధారపడకుండా.. కంపెనీలోనే చేయడం ప్రారంభించాము. కేవలం పదకొండు నెలల్లోనే ఈ లక్ష్యాన్ని సాధించాం. ఇది టెస్లా బలమైన ఏఐ బృందం సాధించిన గొప్ప విజయం. మస్క్ కేవలం బలమైన ఏఐ సాఫ్ట్వేర్ కోసం మాత్రమే కాకుండా, శక్తివంతమైన AI హార్డ్‌వేర్ కోసం కూడా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే న్యూరల్ నెట్‌వర్క్‌లను సమర్థవంతంగా అమలు చేయడానికి సిలికాన్‌ను తయారు చేసాము.మొత్తం మీద ఏఐలో టెస్లా విజయానికి మస్క్ కీలకమైన వ్యక్తి. ఇది ఆయనకు టెక్నాలజీ మీద ఉన్న అవగాహన, పట్టుదల వల్ల సాధ్యమైంది. గొప్ప గొప్ప టెక్నాలజీలను ఇతరులు చూడకముందే మస్క్ కనిపెడుతున్నారు. అదే టెస్లాను వాస్తవ ప్రపంచ AIలో అగ్రగామిగా నిలిపింది. రాబోయే రోజుల్లో ఫుల్లీ అటానమస్ కార్లు, హౌస్ హోల్డ్ రోబోట్స్ సర్వ సాధారణమైపోతాయని అశోక్ ఎల్లుస్వామి.. మస్క్‌ను గొప్పగా ప్రశంసించారు.థాంక్యూ అశోక్ అని ప్రారంభించి.. అశోక్ టెస్లా ఆటోపైలట్ బృందంలో చేరిన మొదటి వ్యక్తి. నేడు ఆటోపైలట్ సాఫ్ట్వేర్లకు నాయకత్వం వహించే స్థాయికి ఎదిగారు. అతడు.. మా అద్భుతమైన టీమ్ లేకుండా మేము విజయాలను సాధించి ఉండేవారము కాదేమో.. అంటూ ఎల్లుస్వామి ట్వీట్‌కు రిప్లై ఇచ్చారు.Thanks Ashok! Ashok was the first person to join the Tesla AI/Autopilot team and ultimately rose to lead all AI/Autopilot software. Without him and our awesome team, we would just be another car company looking for an autonomy supplier that doesn’t exist. Btw, I never… https://t.co/7eBfzu0Nci— Elon Musk (@elonmusk) June 9, 2024 -
జై బోలో కృష్ణ
సూపర్ స్టార్ కృష్ణ మనవడు అశోక్ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. అర్జున్ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వారణాసి మానస హీరోయిన్. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.శుక్రవారం సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘దేవకి నందన వాసుదేవ’ మూవీ నుంచి ‘జై బోలో కృష్ణ...’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్ చేశారు. ఈ పాటకి రఘురామ్ సాహిత్యం అందించగా, స్వరాగ్ కీర్తన్ పాడారు. యష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ‘‘భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో తన బ్యాచ్‌తో కలిసి కృష్ణుడి జన్మాష్టమిని సెలబ్రేట్ చేసుకునే సందర్భంలో ‘జై బోలో కృష్ణ...’ పాట వస్తుంది. ఈ సినిమా రిలీజ్ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. -
కేఆర్ఎంబీ చైర్మన్‌గా అశోక్ గోయల్
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) చైర్మన్‌గా అశోక్ ఎస్.గోయల్‌ను కేంద్ర జల్ శక్తి శాఖ నియమించింది. పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ(పీపీఏ) సీఈవోగా పనిచేస్తున్న శివ్‌నందన్‌కుమార్ రెండేళ్లుగా కృష్ణా బోర్డు చైర్మన్‌గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.ఆయన ఈ నెల 31న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో కేఆర్ఎంబీ చైర్మన్‌గా అశోక్‌ను కేంద్రం నియమించింది. జూన్ 1న ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. పీపీఏ సీఈవోగా మరొకరిని నియమిస్తారా లేదా అశోక్‌కే అదనపు బాధ్యతలు అప్పగిస్తారా అనేది తేలాల్సి ఉంది. -
కర్రలతో కొట్టి.. గాయాలపై కారం చల్లి
కొత్తగూడ: చోరీకి పాల్పడ్డాడనే అనుమానంతో ఓ దళిత యువకుడిని కర్రలతో చావకొట్టి.. రక్తం కారుతున్న గాయాలపై కారం చల్లి చిత్ర హింసలు పెట్టిన అమానవీయఘటనకు సంబంధించిన వీడియో శనివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం జంగవానిగూడెం(రాంపూర్) గ్రామానికి చెందిన యువకుడు వంకాయల కార్తీక్‌ను అదే మండలం పొగుళ్లపల్లి గ్రామానికి చెందిన టెంట్‌హౌస్ యజమాని గద్ద అశోక్ పనికి పెట్టుకున్నాడు. ఈ క్రమంలో డీజే(సౌండ్ బాక్స్)లో ఉపయోగించే యాంప్లిఫైయర్ చోరీకి గురైందని, దాన్ని ఖానాపూర్‌లో విక్రయించారని యజమాని అశోక్ గుర్తించాడు. దీంతో అశోక్ కొందరు వ్యక్తులను తీసుకుని ఈ నెల 19వ తేదీన జంగవానిగూడెం వెళ్లి కార్తీక్‌తో పని ఉందని చెప్పి కారులో ఎక్కించుకుని పొగుళ్లపల్లి సమీప అటవీప్రాంతానికి తీసుకెళ్లి కర్రలతో చితకబాదారు. తప్పించుకుని పారిపోయే క్రమంలో మళ్లీ పట్టుకుని పొగుళ్లపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్దకు తీసుకువచ్చారు. ఒంటిపై షర్ట్ విప్పి కార్యాలయ కిటికీకి కట్టి కర్రలతో బాదారు. రక్తం కారుతుండగా గాయాలపై కారం చల్లుతూ చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనను మొత్తం వీడియో తీశారు. స్పృహ కోల్పోయిన కార్తీక్‌ను ఇంటి వద్ద వదిలేశారు. గాయాలతో మూలుగుతున్న యువకుడిని బంధువులు నర్సంపేట పట్టణంలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. కార్తీక్‌పై దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 20వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరువర్గాలపై కేసులు టెంట్‌హౌస్ యజమాని ఫిర్యాదు మేరకు కార్తీక్‌పై చోరీ కేసు, కార్తీక్‌పై దాడి చేసిన ఘటనలో అశోక్‌తోపాటు మరికొంత మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కానీ విషయాన్ని గోప్యంగా ఉంచారు. సమాచారం తెలుసుకున్న దళిత సంఘాలు మహబూబాబాద్ డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో శుక్రవారం రాత్రి దాడి ఘటన వివరాలు బయటికి వచ్చాయి. -
మానవత్వమే అతడి పాలిట మృత్యువై..
మహబూబ్‌నగర్: మానవత్వమే అతడి పాలిట మృత్యువైంది. రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న యువకుడితో పాటు అతడిని కాపాడేందుకు వెళ్లిన మరో వ్యక్తిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో దుర్మరణం చెందారు. రోడ్డు ప్రమాదం ఇద్దరి జీవితాలను ఛిద్రం చేయడమే గాక.. వారి కుటుంబసభ్యుల ఆశలను సమాధి చేసింది. ఈ విషాదకర ఘటన నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం మార్చాల సమీపంలో గురువారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. ప్రత్యక్ష సాక్షి నర్సింహులు, ఎస్ఐ రమేష్ వివరాల మేరకు.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరానగర్ కాలనీకి చెందిన నవాజ్ (25) టైలరింగ్ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి 11 నెలల కిందట వివాహం కాగా.. 10 రోజుల క్రితం కూతురు జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు గురువారం మధ్యాహ్నం బైక్‌పై తన అత్తగారి ఊరైన జడ్చర్ల పట్టణానికి వెళ్లాడు. అక్కడి నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరగా.. మండలంలోని మార్చాల సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అతడికి తీవ్రగాయాలయ్యాయి. అదే సమయంలో హాలియా నుంచి కొత్తకోట మండలం కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ (30) ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న నవాజ్‌ను గమనించి కాపాడే ప్రయత్నం చేస్తుండగా.. కల్వకుర్తి వైపు వేగంగా వెళ్తున్న మరో గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో నవాజ్‌తో పాటు అశోక్‌కు తీవ్రగాయాలై దుర్మరణం చెందారు. అశోక్‌ది వనపర్తి జిల్లా కొత్తకోట మండలం కనిమెట్ట గ్రామం. పాల వ్యాన్ డ్రైవర్ నర్సింహులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకొని ఇద్దరి మృతదేహాలను కల్వకుర్తి మార్చురీకి తరలించారు. కాగా.. స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద ఇరువురి కుటుంబసభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ రమేష్ తెలిపారు. కనిమెట్టలో విషాదఛాయలు.. కొత్తకోట మండలంలోని కనిమెట్టకు చెందిన చీర్ల నాగమ్మ, వెంకటయ్య దంపతుల కుమారుడు అశోక్ కొంత కాలంగా గ్రామ సమీపంలోని ఓ డెయిరీ మిల్క్ ఫ్యాక్టరీకి చెందిన లారీ క్లీనర్‌గా పనిచేస్తున్నాడు. కల్వకుర్తి మండలం మార్చాల వద్ద చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదంలో అశోక్ దుర్మరణం చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇవి కూడా చదవండి: బైక్‌ను వెనక నుంచి ఢీకొట్టిన లారీ.. యువకుల దుర్మరణం! -
కాంగ్రెస్ గెలిస్తే సీఎం ఎవరు? ఓడితే బాధ్యులెవరు?
రాజస్థాన్ ఎన్నికలకు సంబంధించిన ఎగ్జిట్ పోల్స్ అంచనాలు గందరగోళానికి దారితీస్తున్నాయి. కొన్ని ఎగ్జిట్ పోల్స్‌లో బీజేపీ ఆధిక్యంలో ఉన్నట్లు తేలగా, కొన్నింటిలో కాంగ్రెస్ ముందంజలో ఉంది. అయితే ఇప్పుడు గెలుపు ఓటములు రెండూ కాంగ్రెస్‌కు కొత్త సవాళ్లను సృష్టించనున్నాయి. గత కొన్నేళ్లుగా రాజస్థాన్‌లో కాంగ్రెస్ నేతలు అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్యుద్ధం జరుగుతోంది. ఈ పోరుకు పునాది సీఎం కుర్చీ. ప్రస్తుత ఎగ్జిట్ పోల్ అంచనాలు ఈ పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చాయి. రాజస్థాన్‌లో ఒకవేళ కాంగ్రెస్ గనుక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మరోమారు ముఖ్యమంత్రి పదవి కోసం యుద్ధం మొదలుకానున్నదని తెలుస్తోంది. దీనిని చూస్తుంటే మరోసారి 2018 ఎన్నికల ఫలితాల తరహా పరిస్థితి ఏర్పడవచ్చని రాజకీయ నిపుణులు అంటున్నారు. 2018లో రాజస్థాన్‌లో కాంగ్రెస్ గెలుపొందినప్పుడు పార్టీలోని ఒక వర్గం సచిన్ పైలట్‌కు మద్దతు ఇచ్చింది. అయితే పార్టీలో అశోక్ గెహ్లాట్ సీనియారిటీని దృష్టిలో ఉంచుకుని ఆయనకు మరోమారు సీఎం అయ్యే అవకాశం కల్పించారు. ఈ నేపధ్యంలో ఆయన రెండున్నరేళ్ల పాటు సీఎంగా ఉండాలనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చనే వార్తలు కూడా వినిపించాయి. ఆ దిరిమిలా 2020లో సచిన్ పైలట్ తనను ముఖ్యమంత్రిని చేయాలని కాంగ్రెస్ హైకమాండ్‌పై ఒత్తిడి తెచ్చి, తిరుగుబాటుకు దిగారు. ఈ నేపధ్యంలో పైలెట్ డిప్యూటీ సీఎం పదవిని కోల్పోవలసి వచ్చింది. అయితే ఇప్పుడు ఎన్నికల వేళ గెహ్లాట్, పైలట్ల మధ్య టెన్షన్ కాస్త తగ్గినట్లు కనిపించినా, ఫలితాల వెల్లడి తర్వాత మళ్లీ సమస్యలు తలెత్తడం ఖాయం అని పలువురు అంటున్నారు. అయితే ఈ ఎన్నికల్లో ఒకవేళ కాంగ్రెస్ ఓటమిపాలైనా గెహ్లాట్-పైలట్ అంశం కాంగ్రెస్‌కు పెద్ద తలనొప్పిగా మారనుంది. అప్పుడు ఆటంతా ఆరోపణలు, ప్రత్యారోపణల మధ్య తిరుగుతుంది. అలాంటి పరిస్థితిలో వీరిద్దరి మధ్య సంబంధాలు చెడిపోతే.. పార్టీ మళ్లీ వారిని బుజ్జగించే పని చేయాల్సి వస్తుంది. రాజస్థాన్ ఎగ్జిట్ పోల్స్ విషయానికొస్తే కాంగ్రెస్‌కు 86 నుంచి 106 సీట్లు వస్తాయని, బీజేపీకి 80 నుంచి 100 సీట్లు వస్తాయని పలు మీడియా సంస్థలు అంచనా వేశాయి. ఇది కూడా చదవండి: ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం -
విజయానికి ఏడు హామీలు
రాజస్థాన్‌లో గత 30 ఏళ్లలో అధికార పార్టీ నెగ్గిన దాఖలా లేదు. ప్రతి అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రభుత్వం మారుతూ వస్తోంది. ఈసారి మాత్రం వరుసగా రెండో విజయంతో చరిత్రను తిరగరాసేందుకు సీఎం అశోక్ గహ్లోత్ సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. ఈ విషయంలో ‘ఏడు హామీ’లపై బాగా ఆశలు పెట్టుకున్నారు. ఆ పథకాలు తనను కచ్చితంగా గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు...! రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల పర్వం క్లైమాక్స్‌కు చేరుతోంది. అధికార కాంగ్రెస్, బీజేపీ హోరాహోరీగా తలపడుతున్నాయి. పోలింగ్‌కు మరో మూడు రోజులే ఉంది. గురువారం సాయంత్రంతో ప్రచారానికి కూడా తెర పడనుంది. ఈ నేపథ్యంలో ప్రచారాన్ని సీఎం గహ్లోత్ టాప్ గేర్‌లోకి తీసుకెళ్లారు. కాంగ్రెస్ తరఫున అంతా తానై వ్యవహరిస్తున్నారు. రాష్ట్రమంతటా సుడిగాలి పర్యటనలతో హోరెత్తిస్తున్నారు. ఈ రెండు రోజుల్లో వీలైనన్ని అసెంబ్లీ స్థానాలను కవర్ చేయనున్నారు. ముఖ్యంగా మహిళలకు రూ.10 వేల భృతి మొదలుకుని రూ.25 లక్షల వైద్య సాయం దాకా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న, అందించబోయే పథకాలను ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారు. ప్రతి ప్రచార సభలోనూ అవి ప్రధానంగా ప్రస్తావనకు వచ్చేలా జాగ్రత్త పడుతున్నారు. జీవన్మరణ సమస్య! 72 ఏళ్ల గహ్లోత్‌కు ఒకరకంగా ఈ అసెంబ్లీ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా మారాయి. గత అసెంబ్లీ ఎన్నికల విజయంలో కీలక పాత్ర పోషించిన కాంగ్రెస్ యువ నేత సచిన్ పైలట్‌ను ఈసారి ఆయన పూర్తిగా పక్కన పెట్టారు. కనుక ఫలితాలు ఏ మాత్రం వికటించినా గహ్లోత్ రాజకీయ జీవితానికి తెర పడవచ్చన్న అభిప్రాయముంది. అందుకే కొద్ది రోజులుగా ఆయన దూకుడు పెంచారు. రోజుకు కనీసం నాలుగైదు సభల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో ఒక్క రోజు ఏకంగా 800 కిలోమీటర్లు పర్యటిస్తున్నారు! తన ఓబీసీ సామాజిక వర్గ మూలాలను కూడా సమయానుకూలంగా ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతి ప్రచార సభలోనూ ప్రధాని మోదీపై విమర్శలతో విరుచుకుపడుతున్నారు. ఆయన ప్రసంగాల్లో కాంగ్రెస్ పథకాలనే యథాతథంగా కాపీ కొడుతున్నారంటూ ఎద్దేవా చేస్తున్నారు. తమ ఏడు హామీలకు పోటీగా బీజేపీ తెరపైకి తెచ్చిన ‘మోదీ హామీ’లను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ, అవన్నీ కాంగ్రెస్ హామీలకు నకళ్లేనని పదేపదే చెబుతున్నారు. ‘‘ఇది బీజేపీకి బాగా మైనస్‌గా మారుతోంది. ఈసారి కచ్చితంగా గెలుపు కాంగ్రెస్‌దే. ఓటర్లు ఈ మేరకు నిర్ణయించుకున్నారు కూడా’’ అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. రోజూ క్రమం తప్పకుండా స్వీయ ప్రచార వీడియోలను కూడా విడుదల చేస్తూ, అవి వీలైనంత మందికి చేరేలా జ్రాగత్తలు తీసుకుంటున్నారు గహ్లోత్. అధిష్టానం అనుగ్రహం కోసం... రాష్ట్రస్థాయిలో గెలుపు కోసం శాయశక్తులా ప్రయత్నాలు చేస్తూనే, అధిష్టానంతో సంబంధాలను కూడా సరిదిద్దుకునే పనిలో పడ్డారు గహ్లోత్. గతేడాది కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల బరిలో దిగాల్సిందిగా సోనియా ఆదేశించినా ఆయన బేఖాతరు చేయడం తెలిసిందే. దీనిపై గాంధీ కుటుంబం గుర్రుగా ఉన్న నేపథ్యంలో, వీలు దొరికినప్పుడల్లా సోనియా, రాహుల్, ప్రియాంకలను ఆయన ఆకాశానికెత్తుతూ వస్తున్నారు. రాష్ట్ర ప్రచార పర్వమంతా రాహుల్, ప్రియాంక కనుసన్నల్లోనే జరుగుతోందని పదేపదే చెప్పుకొస్తున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ రాజస్థాన్‌లో కాంగ్రెస్ ఏడు హామీలు... 1. కుటుంబ పెద్ద అయిన మహిళకు ఏటా రూ.10,000 భృతి 2. ప్రభుత్వ కాలేజీలో చేరే ప్రతి విద్యార్థికి ల్యాప్‌టాప్ లేదా ట్యాబ్ 3. చిరంజీవి ఆరోగ్య బీమా పథకం ద్వారా రూ.25 లక్షల దాకా వైద్య సాయం. ఇందులో భాగంగా రూ.15 లక్షల ప్రమాద బీమా 4. అందరికీ ఉచితంగా ఇంగ్లిష్ మీడియం విద్య 5. రాష్ట్రంలో కోటి కుటుంబాలకు రూ.500కే వంట గ్యాస్ సిలిండర్ 6. పాత పెన్షన్ పథకానికి చట్టబద్ధత 7. రైతుల నుంచి రూ.2కు కిలో చొప్పున పేడ కొనుగోలు -
భారత అమెరికన్లకు అత్యున్నత పురస్కారాలు
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ శాస్త్రవేత్తలు అశోక్ గాడ్గిల్, సుబ్రా సురేశ్ అమెరికా అత్యున్నత శాస్త్ర సాంకేతిక రంగ అవార్డులు అందుకున్నారు. గాడ్గిల్‌కు వైట్ హౌస్ నేషనల్ మెడల్ ఫర్ టెక్నాలజీ అండ్ ఇన్నొవేషన్, సురేశ్‌కు నేషనల్ మెడల్ ఆఫ్ సైన్స్ అవార్డులు దక్కాయి. అధ్యక్షుడు జో బైడెన్ వారికి ఈ ప్రతిష్టాత్మక అవార్డులతో అందజేశారు. మానవ జీవితాన్ని సుఖవంతం చేసే పలు అమూల్య పరికరాలను కనిపెట్టిన ఘనత గాడ్గిల్ది అంటూ కొనియాడారు. ఇక మెటీరియల్ సైన్స్, ఇతర రంగాల్లో దాని వాడకాన్ని సురేశ్ కొత్త పుంతలు తొక్కించారన్నారు. ఈ అవార్డులను అగ్ర శ్రేణి అమెరికా ఇన్నొవేటర్లకు అందిస్తుంటారు. కింది స్థాయి నుంచి... ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్న శాస్త్రవేత్తలిద్దరిదీ కష్టించి కింది స్థాయి నుంచి ఎదిగిన నేపథ్యమే. గాడ్గిల్ 1950లో ముంబైలో జని్మంచారు. అక్కడ, ఐఐటీ కాన్పూర్‌లో ఫిజిక్స్‌లో డిగ్రీలు పొందారు. యూసీ బర్కిలీ యూనివర్సిటీలో పీహెచ్డీ చేశారు. 1980లో లారెన్స్ బర్కిలీ ల్యాబ్‌లో చేరారు. ఈ ఏడాదే రిటైరయ్యారు. అక్కడే సివిల్ అండ్ ఎని్వరాన్మెంటల్ గౌరవ ప్రొఫెసర్‌గా సేవలందిస్తున్నారు. చౌకైన, సురక్షిత తాగునీటి సదుపాయాలు, తక్కువ ఇంధనంతో సమర్థంగా పని చేసే గ్యాస్ స్టౌలు, మెరుగైన విద్యుద్దీపాల అభివృద్ధిలో ఆయన పరిశోధనలు ఎంతగానో దోహదపడ్డాయి. ముంబైకే చెందిన సురేశ్ నేషనల్ సైన్స్ ఫౌండేషన్ సారథిగా వ్యవహరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఆసియన్ అమెరికన్‌గా నిలిచారు. 1956లో పుట్టిన ఆయన ఐఐటీ మద్రాస్ నుంచి బీటెక్ పూర్తి చేశారు. మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి రెండేళ్లలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1983లో బ్రౌన్ వర్సిటీలో ఇంజనీరింగ్ విభాగంలో అత్యంత పిన్న వయస్కుడైన ప్రొఫెసర్‌గా రికార్డులకెక్కారు. -
ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ కొత్త చైర్మన్‌గా ప్రొ.అశోక్
రాయదుర్గం (హైదరాబాద్): ట్రిపుల్ఐటీ హైదరాబాద్ నూతన చైర్మన్‌గా ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా నియమితులయ్యారు. ఈ మేరకు శుక్రవారం నిర్వహించిన పాలక మండలి ప్రత్యేక సమావేశంలో ఒక ప్రకటన చేశారు. 1998లో ఆరంభం నుంచి ట్రిపుల్ఐటీ హైదరాబాద్ చైర్మన్‌గా కొన సాగిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి పదవీ విరమణ చేశారు. శుక్రవారం సాయంత్రం గచ్చిబౌలిలో ట్రిపుల్ఐటీ హైదరాబాద్ సిల్వర్ జూబ్లీ వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్త చైర్మన్ అశోక్ ఝన్‌ఝన్‌వాలా, పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్ రాజ్‌రెడ్డి, డైరెక్టర్ ప్రొఫెసర్ పీజే నారాయణన్, ఇతర ప్రొఫెసర్లతో కలసి నూతనంగా రూపొందించిన సిల్వర్‌జూబ్లీ శిల్పాన్ని ఆవిష్కరించారు. ప్రొఫెసర్ అశోక్ ఝన్‌ఝన్ వాలా మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ హైదరాబాద్‌ను జాతీయ, అంతర్జాతీ య స్థాయిలో మంచి గుర్తింపు పొందేలా తీర్చిదిద్దు తానని తెలిపారు. ప్రొఫెసర్ పీజే నారాయణన్ మీడియాతో మాట్లాడుతూ, ట్రిపుల్ఐటీ హైదరా బాద్.. దేశంలో నంబర్‌వన్ స్థానంలో ఉందన్నారు. -
రియల్ ఎస్టేట్ మోసాలను ఎత్తిచూపేలా ‘శంకుస్థాపన’
ప్రముఖ రాజకీయ నాయకుడు బాసెట్టి అశోక్ సినీ రంగంలోకి అడుగుపెడుతున్నాడు. ‘అశోక చక్ర మూవీస్’పేరిట ఓ నిర్మాణ సంస్థను నెలకొల్పి ‘శంకుస్థాపన’ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ‘తారకాసుర-2’చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న విజయ్ భాస్కర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో జరుగుతున్న మోసాలు, అవకతవకల నేపథ్యంలో ఈ చిత్రం రూపొందనుండడం గమనార్హం. అశోకచక్ర మూవీస్ అధినేత బాసెట్టి అశోక్ మాట్లాడుతూ..."ఈరోజు ఎకరా 100 కోట్లు పలుకుతున్న పుడమితల్లిని పది పదిహేను వేలకు అమ్ముకుని, ఇప్పుడు కుమిలి కుమిలి ఏడుస్తున్న పుడమిపుత్రులు (రైతులు) ఎందరో నాకు తెలుసు. మధ్యవర్తులు సైతం మధ్యంతర సిరితో కోట్లకు పడగలెత్తారు. కానీ రైతుల పరిస్ఠితి అగమ్యగోచరంగా ఉంది. స్థిరాస్తి వ్యాపారంలోని లొసుగులను బహిర్గతం చేస్తూనే... మానవీయ కోణంలో భావోద్వేగాలను సమ్మిళితం చేసి "శంకుస్థాపన" చిత్రాన్ని తీర్చిదిద్దనున్నాం. మా దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి ఈ చిత్రాన్ని అత్యద్భుతంగా తెరకెక్కిస్తాడనే నమ్మకం నాకుంది" అన్నారు. ప్రస్తుతం ప్రి ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో వెల్లడి చేస్తామని దర్శకుడు విజయ్ భాస్కర్ రెడ్డి తెలిపారు. -
అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్
జోధ్ పూర్లో నూతనంగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవం సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీకి చేసిన "ఇంద్రజాలికుడు" వ్యాఖ్యలకు స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పొట్టకూటి కోసం అవసరమైతే మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ జోధ్ పూర్ ప్రజలకు మచ్చ తెచ్చే పని మాత్రం చేయనని అన్నారు. రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో... 15వ శతాబ్దానికి చెందిన మెహరాన్ ఘడ్ కోటకు సందర్శకుల రాకపోకలు సాగేందుకు వీలుగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకప్పుడు జోధ్ పూర్ ఎలా ఉండేది? ఇక్కడ నీళ్లు ఉండేవి కాదు, రైలు సదుపాయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య ఇలా ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 42 ఏళ్లలో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా చేశానని అన్నారు. మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటా... ఈ సందర్భాంగా కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకుంటూ ఇంద్రజాలం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అవును నేను ఇంద్రజాలికుడినే.. అవసరమైతే పొట్టకూటి కోసం మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ... జోధ్ పూర్ ప్రజలు తలదించుకునే పనిని ఎన్నడూ చేయనని అన్నారు. మాయ చేస్తోంది మీరు. మీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే రావు జోధా మార్గ్ ఉదాహరణ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆలస్యం చేశారు. ఖర్చు కూడా 39 వేల కోట్ల నుండి 72 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కొనసాగించకుండా జాప్యం చేశారన్నారు. -
సౌర కాంతుల సిటీ
సాక్షి, హైదరాబాద్ : భాగ్యనగరం సౌరకాంతులు వెదజల్లుతోంది. నగరంలోని పలు గేటెడ్ కమ్యూనిటీలు, బహుళ అంతస్తుల భవనాలు, ప్రభుత్వ..ప్రైవేటు సంస్థల కార్యాలయాలు, ఇళ్లపై సౌర ఫలకాలు (సోలార్ ప్యానెళ్లు) ఏర్పాటవుతున్నాయి. ఇవి సొంతింటి విద్యుత్ అవసరాలను తీర్చడమే గాకుండా ఇతరత్రా అవసరాలకు కూడా ఉపయోగపడుతున్నాయి. అదనపు ఆదాయాన్ని సమకూర్చి పెడుతున్నాయి. సాధారణ విద్యుత్ బిల్లుల మోత మోగుతుండడంతో ‘సిటీ’జనులు సౌర విద్యుత్ వైపు మొగ్గు చూపుతున్నారు. మొదట్లో దీనిపై అంతగా అవగాహన లేకున్నా.. క్రమేణా సౌర విద్యుత్‌పై ప్రజలకు ఆదరణ పెరుగుతోంది. ♦ నగరంలోని 34 బల్దియా కార్యాలయాలపై రూ.4.5 కోట్ల వ్యయంతో 941 కిలోవాట్ల సామర్థ్యం గల సౌర ఫలకాలు ఏర్పాటు చేశారు. ఒక్కో ప్యానెల్ ఏడాదికి సగటున 1,500 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది. ఈవిధంగా జీహెచ్ఎంసీ సోలార్ విద్యుత్ ఉత్పత్తితో తన కరెంటు బిల్లుల వ్యయాన్ని ఏడాదికి రూ.1.50 కోట్ల మేర తగ్గించుకుంది. ♦ బండ్లగూడ నగరపాలిక పరిధి గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్‌లోని పది బహుళ అంతస్తుల్లో 518కుటుంబాలు నివసిస్తున్నాయి. వ్యక్తిగత, ఉమ్మ డి అవసరాలకు నెలకు రూ.12 లక్షల విలువ చేసే కరెంట్ వినియోగించేవారు. ఈ ఖర్చును తగ్గించుకునేందుకు రూ.2.60 కోట్లతో 750 కిలోవాట్ల సామర్థ్యంతో రూఫ్‌టాప్ సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. వీటిద్వారా నెలకు 85వేల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. ఫలితంగా వారి నెలవారీ విద్యుత్ బిల్లు రూ.6 లక్షలకు తగ్గిపోయింది. ♦ఈయన పీవీ రంగనాయకులు. కాప్రాలోని వెస్ట్రన్ బ్లీస్ విల్లాస్‌లో నివసిస్తున్నారు. 2022 నవంబర్‌లో రూ.3 లక్షలు ఖర్చు చేసి ఇంటిపై ఐదు కిలోవాట్ల సామర్ధ్యం కలిగిన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకున్నారు. రోజుకు సగటున 25 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. దీంతో అప్పటివరకు నెలకు రూ.5,000 వచ్చే కరెంటు బిల్లు రూ.150 నుంచి రూ.200కు పడిపోయింది. పాఠశాలలకూ సోలార్ హంగులు సర్కారీ పాఠశాలలను కరెంట్ బిల్లుల భారం నుంచి తప్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ‘మన ఊరు– మన బడి’లో భాగంగా 11 జిల్లాల పరిధిలో తొలి విడతగా 1,521 ప్రభుత్వ పాఠశాలలపై రూ.32.02 కోట్లతో 3,072 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే ఆయా పాఠశాలల భవనాలపై సౌర ఫలకాల ఏర్పాటు ప్రక్రియను ప్రారంభించింది. మరికొన్ని ప్రాజెక్టులు ♦ శంషాబాద్ విమానాశ్రయంలో 2015లో ఐదు మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంటును ఏర్పాటు చేశారు. ఆ తర్వాత 2021 జూలైలో అదనంగా మరో ఐదు కిలోవాట్ల సామర్థ్యం ఉన్న ప్లాంటును అమర్చారు. ప్రస్తుతం విమానాశ్రయం విద్యుత్ అవసరాలు 50% సౌరశక్తి ద్వారానే తీరుతుండటం గమనార్హం. కాచిగూడ రైల్వేస్టేషన్ సైతం సోలార్ ఎనర్జీతో నెలవారీ విద్యుత్ బిల్లుల భారం నుంచి గట్టెక్కింది. ♦ రాజేంద్రనగర్ వ్యవసాయ వర్సిటీలోవార్షిక విద్యుత్ బిల్లు రూ.కోటికి పైగా వచ్చేది. భవనాలపై సోలార్ ప్లాంట్ల ఏర్పాటు తర్వాత ఈ బిల్లు రూ.40 లక్షలకు తగ్గింది. ♦ శామీర్‌పేట జినోమ్ వ్యాలీలో 952, జవహర్‌నగర్‌లో 947, కోకాపేట్ ఓపెన్ స్పేస్‌లో 100, కిమ్స్ రెసిడెన్సీలో 275, హిమాయత్‌సాగర్ ఓనర్స్ అసోసియేషన్ పరిధిలో 710 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెల్స్ ఏర్పాటయ్యాయి. విద్యుత్ బిల్లులు తగ్గిపోయాయి. నిథమ్ క్యాంపస్‌లో 200 కిలోవాట్ల సామర్థ్యం గల ప్యానెళ్ల ద్వారా నెలకు 2.50 లక్షల బిల్లు ఆదా చేస్తున్నారు. అదనపు విద్యుత్ డిస్కంకు.. ♦ గ్రేటర్ పరిధిలోని తొమ్మిది సర్కిళ్ల పరిధిలో 220 మెగావాట్ల సామ ర్థ్యం కలిగిన మినీ సోలార్ పవర్ ప్లాంట్లు ఉన్నాయి. వీటి ద్వారా రోజుకు సగటున 170 నుంచి 180 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. వేసవిలో మరో 30% అదనంగా ఉత్పత్తి జరిగే అవకాశం ఉంది. నగరంలో రోజుకు సగ టున 2,500 మెగావాట్లకు పైగా విద్యుత్ డిమాండ్ ఉండగా, ఇందులో థర్మల్, జల విద్యుత్ 2,300 మెగావాట్లు, సోలార్ ద్వారా 220 మెగావాట్ల వరకు రికార్డవుతోంది. నగరంలో సౌర విద్యుత్‌కు సంబంధించి మొత్తం 11,968 రూఫ్ టాప్ నెట్ మీటర్ కనెక్షన్లు ఉన్నాయి. మిద్దెలపై సౌర ఫలకాలు ఏర్పాటు చేసుకున్న వినియోగదారులు వీటి ద్వారా తమ రోజువారీ అవసరాలు తీర్చుకుంటూ, మిగిలిన విద్యుత్‌ను నెట్ మీటరింగ్ ద్వారా దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)కు సరఫరా చేస్తున్నారు. తద్వారా ఇంటి విద్యుత్ బిల్లు గణనీయంగా తగ్గించుకోవడంతో పాటు అదనపు ఆదాయాన్ని పొందుతున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాల్లో వెలుస్తున్న విల్లా ప్రాజెక్టుల్లో అధికశాతం గ్రీన్ ఎనర్జీకి ప్రాధాన్యతనిస్తున్నాయి. సోలార్ విద్యుత్‌ను అదనపు ఫెసిలిటీగా కస్టమర్లకు చూపుతూ వారిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి. ♦ మల్కాజ్‌గిరికి చెందిన శ్యామ్‌సుందర్ సింగ్ తన ఇంటిపై 6 కిలోవాట్ల సామర్థ్యంతో సోలార్ ప్యానళ్లు ఏర్పాటు చేశారు. రోజుకు సగటున 30 యూనిట్లు ఉత్పత్తి అవుతుంది. ఇంటి అవసరాలు పోను మిగిలిన విద్యుత్‌ను డిస్కంకు విక్రయిస్తున్నారు. ఒక్కసారి బిగిస్తే.. 25 ఏళ్ల పాటు ఉత్పత్తి గేటెడ్ కమ్యూనిటీలు, టౌన్‌షిప్‌లు, ఇతర రెసిడెన్షియల్ కాలనీలకు డిస్కం వ్యక్తిగతంగా కాకుండా అందరికీ కలిపి ఒకే కనెక్షన్ (హెచ్‌టీ) జారీ చేస్తుంది. ఆ తర్వాత వ్యక్తిగత మీటర్లు అమర్చుకుని ఎవరికి వారు బిల్లులు చెల్లిస్తుంటారు. ఇందుకు ఆయా వినియోగదారుల నుంచి డిస్కం యూనిట్‌కు రూ.6.30 పైసల చొప్పున వసూలు చేస్తుంది. అదే వారి ఇంటిపై ఉత్పత్తి అయిన విద్యుత్‌కు రూ.4.09 పైసలు చెల్లిస్తుంది. ఒకసారి ఇంటిపై ప్లాంటు ఏర్పాటు చేసుకుంటే 25 ఏళ్లపాటు విద్యుత్ ఉత్పత్తికి ఢోకా ఉండదు. అంతేకాదు ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం 25 నుంచి 50 శాతం రాయితీ కూడా ఇస్తుంది. – బి.అశోక్, అధ్యక్షుడు, తెలంగాణ సోలార్ ఎనర్జీ అసోసియేషన్ -
భద్రాద్రి: నా బిడ్డకు న్యాయమేది?.. అశోక్ భార్య కన్నీటి ఆక్రోశం
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని టేకుపల్లి మండలంలో జరిగిన దారుణ ఘటన.. తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాఫ్ట్వేర్ ఇంజనీర్ అశోక్(24) దారుణ హత్య కలకలం రేపింది. ఇచ్చిన అప్పు తిరిగి అడుగుతున్నాడనే కారణంతో అతన్ని గొంతు కోసి, నరికి చంపారు దుండగులు. దీంతో ముత్యాలంపాడు గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. ముత్యాలంపాడు క్రాస్ రోడ్‌కు చెందిన ప్రేమ్ కుమార్‌కు రూ. 80 వేలు అప్పు ఇచ్చాడు ధారావత్ అశోక్. ఈ వ్యవహారంలో మరో మధ్వవర్తి కూడా ఉన్నాడు. అయితే తిరిగి ఆ డబ్బు ఇవ్వమని అడగడంతో.. కక్ష పెంచుకుని హత్యకు ప్లాన్ వేశారు. శనివారం రాత్రి అప్పు తీరుస్తాం రమ్మంటూ పిలిచి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డారు. అశోక్ తండ్రి బీజేపీ మండల అధ్యక్షుడు బాలాజీ. అయితే తన కొడుకు హత్య వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని తాను అనుకోవడం లేదని ఆయన తెలిపారు. నిందితులను పట్టుకుని ఎన్కౌంటర్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు అశోక్‌కు ఏడాది కిందటే వివాహం అయ్యింది. నెలల పాప ఉంది. దీంతో ఒళ్లో పసికందుతో అశోక్ భార్య కన్నీరు మున్నీరుగా రోదిస్తోంది. అశోక్‌ను చంపిన వాళ్లను శిక్షించి.. తన బిడ్డకు న్యాయం చేయాలని కోరుతోందామె. తన భర్తను దూరం చేసి.. చిన్న వయసులో తన జీవితాన్ని ఇలా మార్చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని, పోలీసుల వల్ల కాకపోతే తమ ఎదుటకు తీసుకొస్తే తామే శిక్షిస్తామని ఆక్రోశంతో నిండిన ఆవేదనను వెల్లగక్కింది ఆమె. ఇదిలా ఉంటే.. హత్యపై తమకు పలు అనుమానాలు ఉన్నాయని అంటోందామె. ఒక్కడి వల్లే ఈ హత్య సాధ్యం కాదని, ఈ ఘటనలో మరికొందరి ప్రమేయం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రామస్థులు కూడా అశోక్ శారీరకంగా ధృడమైన మనిషిని అని, ప్రతిఘటించే అవకాశం కావడంతో.. ఈ హత్యలో తమకూ అనుమానాలు ఉన్నాయని అంటున్నారు. ఈ హత్యకు గ్రామంలో ఉండే గంజాయి బ్యాచ్‌కు సంబంధం ఉందన్న భావిస్తున్నారు వాళ్లు. మరోవైపు ఇది రూ. 80 వేల వ్యవహారమేనా? హత్యకు ఇంకేమైనా కారణాలు ఉన్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. -
ఐకానిక్ అశోక్ హోటల్@ రూ.7,409 కోట్లు
న్యూఢిల్లీ: ఆతిథ్య రంగ సుప్రసిద్ధ సంస్థ అశోక్ హోటల్ అంచనా విలువను ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఆస్తుల మానిటైజేషన్‌లో భాగంగా ఢిల్లీలోని కీలక ప్రాంతంలోగల అశోక్ హోటల్‌కు రూ. 7,049 కోట్ల సంకేత విలువను ఖరారు చేసినట్లు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం 25 ఎకరాలలో విస్తరించిన ఈ ఆస్తి విక్రయాన్ని పబ్లిక్, ప్రయివేట్ భాగస్వామ్యం(పీపీపీ)లో చేపట్టనుంది. పెట్టుబడిదారులతో చర్చలు(ఇన్వెస్టర్ కన్సల్టేషన్) ఇప్పటికే ప్రారంభంకాగా.. క్యాబినెట్ నోట్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన ఆస్తుల మానిటైజేషన్(ఎన్ఎంపీ) జాబితాలో అశోక్ హోటల్, సమీపాన గల సామ్రాట్సహా టూరిజం అభివృద్ధి కార్పొరేషన్‌కు చెందిన 8 ఆస్తులున్నాయి. 2021 ఆగస్ట్‌లోనే సీతారామన్ నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల విలువైన ఎన్ఎంపీ కార్యాచరణకు తెరతీసిన సంగతి తెలిసిందే. తద్వారా విభిన్న మౌలిక రంగ ఆస్తుల విలువను అన్‌లాక్ చేసేందుకు నిర్ణయించారు. ప్రస్తుతం రూ. 33,422 కోట్లు మౌలిక సంబంధ శాఖలతో చర్చల ద్వారా నీతి ఆయోగ్ ఎన్ఎంపీ నివేదికను రూపొందించింది. ఈ నెల 14న నీతి ఆయోగ్ సీఈవో పరమేశ్వరన్ అయ్యర్‌తో సమావేశంలో ఆర్థిక మంత్రి ఎన్ఎంపీ పురోగతిపై సమీక్షించారు. ఈ ఆర్థిక సంవత్సరం(2022-23)లో ఇప్పటివరకూ ప్రభుత్వం రూ. 33,422 కోట్ల విలువైన ఎన్ఎంపీని సాధించింది. 2021-22లో ప్రభుత్వం రూ. లక్ష కోట్ల లావాదేవీలు పూర్తిచేయడం ద్వారా తొలి ఏడాది లక్ష్యం రూ. 88,000 కోట్లను అధిగమించడం గమనార్హం! -
వీఆర్ఏలకు పేస్కేల్ అమలు అంశం: కామారెడ్డి వీఆర్ఏ ఆత్మహత్య
సాక్షి, కామారెడ్డి: తమ డిమాండ్ల సాధన కోసం గత కొన్ని రోజులుగా నిర్విరామ నిరసన కార్యక్రమాలకు దిగారు తెలంగాణ విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్లు (వీఆర్ఏలు). ముఖ్యమంత్రి కేసీఆర్ నిండు శాసనసభలో ప్రకటించినట్టుగా పేస్కేల్ అమలు చేయాలని కోరుతున్నారు. ఈక్రమంలో వీఆర్ఏల పోరాటంలో చురుకుగా పాల్గొన్న నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ అశోక్ తనువుచాలించాడు. పేస్కేల్ అమలు చేస్తారో లేదోనని మనస్తాపానికి గురైన అశోక్ బలవన్మరణానికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. గ్రామంలోని చెరువుకట్ట వద్ద వీఆర్ఏ అశోక్ ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నట్టుగా స్థానికులు చెప్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్న వీఆర్ఏలు అశోక్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆస్పత్రి ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. దీంతో ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. (చదవండి: మామ బాగా రిచ్..స్నేహితులను ఉసిగొల్పి దోపిడీ చేయించిన అల్లుడు) -
ఫ్యామిలీ కోసం సొంతంగా విమానం తయారు చేశాడు!
కరోనా కట్టడికి విధించిన లాక్డౌన్ సమయం ఎంతో భారంగా గడిచింది. కొంత మంది మాత్రం ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుని రకరకాల వ్యాపకాలతో తమ సృజనకు పదునుపెట్టుకున్నారు. కేరళకు చెందిన ఎన్నారై అశోక్ అలిసెరిల్ తమరాక్షన్ అయితే ఏకంగా చిన్నపాటి విమానాన్నే తయారు చేశాడు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. తాను సొంతంగా తయారు చేసిన ఫోర్ సీటర్ విమానంలో కుటుంబంతో కలిసి యూరప్ యాత్ర చేస్తున్నాడు అశోక్. కేరళలోని అలప్పుజా ప్రాంతానికి చెందిన ఆయన లండన్‌లో స్థిరపడ్డాడు. మాస్టర్స్ డిగ్రీ చేయడానికి 2006 యూకే వచ్చిన అశోక్ ప్రస్తుతం ఫోర్డ్ మోటార్ కంపెనీలో పనిచేస్తున్నాడు. 18 నెలలు శ్రమించి.. కరోనా సమయంలో విధించిన లాక్డౌన్ విధించడంతో విమాన తయారీకి ఉపక్రమించాడు. దాదాపు 18 నెలలు శ్రమించి ‘స్లింగ్ టీఎస్ఐ’ మోడల్లో చిన్న విమానాన్ని తయారు చేశాడు. తన చిన్న కూతురు దియా పేరు కలిసొచ్చేలా విమానానికి ‘జి-దియా’ అని నామకరణం చేశాడని ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. కేరళ మాజీ ఎమ్మెల్యే ఏవీ తమరాక్షన్ కుమారుడైన అశోక్‌కు పైలట్ లైసెన్స్ కూడా ఉంది. దీంతో కుటుంబంతో కలిసి తన విమానంలో ఇప్పటివరకు జర్మనీ, ఆస్ట్రియా, చెక్ రిపబ్లిక్ దేశాలను చుట్టేసి వచ్చాడు. విమానాన్ని ఎలా తయారు చేశానంటే.. ‘2018లో పైలట్ లైసెన్స్ పొందిన తర్వాత ప్రయాణాల కోసం రెండు సీట్ల విమానాలను అద్దెకు తీసుకునేవాడిని. నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకెళ్లడానికి నాలుగు సీట్ల విమానం అవసరం. కానీ అవి చాలా అరుదుగా దొరుకుతాయి. జోహన్నెస్‌బర్గ్(దక్షిణాఫ్రికా)కు చెందిన స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ కంపెనీ 2018లో టీఎస్ఐ మోడల్ విమానాన్ని తయారు చేయనున్నట్టు ప్రకటించింది. దీంతో ఒకసారి నేను స్లింగ్ ఎయిర్‌క్రాఫ్ట్ ఫ్యాక్టరీని కూడా సందర్శించాను. ఆ తర్వాత నా సొంత విమాన తయారీకి అవసరమైన వస్తువులను ఆర్డర్‌పై అక్కడి నుంచి తెప్పించాను. లాక్‌డౌన్‌తో సమయం దొరకడంతో విమాన తయారీపై దృష్టి పెట్టాన’ని అశోక్ వివరించాడు. విమాన తయారీకి దాదాపు రూ.1.8 కోట్లు వెచ్చించినట్టు తెలుస్తోంది. కలల విమానంలో గగన విహారంతో వార్తల్లోకి ఎక్కారు అశోక్ అలిసెరిల్ తమరాక్షన్. అతడిని గురించి విన్నవారంతా ‘సూపర్’ అంటూ మెచ్చుకుంటున్నారు. (క్లిక్: స్పైస్‌జెట్‌కు షాక్.. ఆంక్షలు విధించిన డీజీసీఏ) -
రూ.45 లక్షల మోసం.. ప్రేమగా మాట్లాడే ఇందుష ఎన్నిసార్లు కోరినా రాదే!
సాక్షి, హైదరాబాద్: యూట్యూబ్ చానల్లో చూసిన క్రైమ్ న్యూస్ స్ఫూర్తితో ఫేస్బుక్లో యువతి మాదిరిగా ప్రొఫైల్ క్రియేట్ చేసి, నగరానికి చెందిన వ్యక్తితో ఆన్లైన్ ప్రేమాయణం సాగించి, వివిధ అవసరాల పేర్లు చెప్పి రూ.45 లక్షలు స్వాహా చేసిన నిందితుడిని సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు పట్టుకున్నారు. జేసీపీ డాక్టర్ గజరావ్ భూపాల్, ఏసీపీ కేవీఎం ప్రసాద్‌లతో కలిసి బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో కొత్వాల్ సీవీ ఆనంద్ వివరాలు వెల్లడించారు. మోథె అశోక్ ►ఏపీలోని నూజివీడుకు చెందిన మోథె అశోక్ బీటెక్ ఆఖరి సంవత్సరంలో ఆపేశాడు. ఆవారాగా తిరిగే ఇతడికి ప్రస్తుతం భార్య, కుమార్తె ఉన్నారు. యూట్యూబ్ చానల్స్ చూసే అలవాటున్న ఇతడిని ఓ దాంట్లో వచ్చిన క్రైమ్ న్యూస్ ఆకర్షించింది. ఓ వ్యక్తి ఫేస్బుక్ ద్వారా పరిచయమైన యువతి ప్రేమలో పడి మోసపోయాడన్నది దాని సారాంశం. ►ఇది చూసిన అశోక్ తానే యువతిగా ‘మారి’ మోసాలు చేయాలని పథకం వేశాడు. 2020 ఫిబ్రవరిలో ఫేస్బుక్లో ఇందుష తుమ్మల పేరుతో ప్రొఫైల్ క్రియేట్ చేసి, ఇంటర్నెట్ నుంచి సేకరించిన యువతి ఫొటోను ప్రొఫైల్ పిక్‌గా పెట్టాడు. ఈ ఖాతా నుంచి అనేక మందికి ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పంపాడు. ఇలా అందుకున్న జూబ్లీహిల్స్ వాసి ప్రవీణ్ కుమార్ యాక్సెప్ట్ చేయడంతో అసలు కథ మొదలైంది. ►కొన్ని రోజులు ఇందుష మాదిరిగా ప్రవీణ్‌తో చాట్ చేసిన అశోక్ ఆపై ప్రేమ పేరుతో ఎర వేశాడు. వాయిస్ చేంజ్ యాప్‌ను వినియోగించి ప్రవీణ్‌కు కాల్స్ చేసిన అశోక్ ఆకర్షణీయంగా మాట్లాడాడు. ఈ యాప్ కారణంగా అశోక్ గొంతు యువతిదిగా మారి ప్రవీణ్‌కు వినిపించేది. కొన్నాళ్లకు అశోక్ అలియాస్ ఇందుష పెళ్లి ప్రస్తావన చేయడంతో ప్రవీణ్ అంగీకరించాడు. కాలేజీ ఫీజు, కరోనా పేరుతో.. ►అశోక్ 2020 నుంచి ఈ పరిచయాన్ని ‘కమర్షియల్’గా వాడుకోవడం మొదలెట్టాడు. తొలుత కాలేజీ ఫీజు కట్టాలంటూ రూ.3 లక్షలు తన ఖాతాలో వేయించుకున్నాడు. కరోనా మొదటి వేవ్‌లో తల్లికి కోవిడ్ సోకిందని రూ.10 లక్షలు, రెండో వేవ్‌లో తనకూ వచ్చిందంటూ రూ.15 లక్షలు వైద్య ఖర్చుల పేరుతో కాజేశాడు. ఇలా రెండేళ్లలో రకరకాల అవసరాలు చెప్పి రూ.45 లక్షలు ప్రవీణ్ నుంచి గుంజాడు. ►ఓ సందర్భంలో ప్రవీణ్ తన ఆన్లైన్ ప్రేమ విషయాన్ని సమీప బంధువుకు చెప్పాడు. ఇది అనుమానించాల్సిన అంశంగా భావించిన ఆయన ఆ విషయం బాధితుడికి చెప్పి, నిజం తెలియాలంటే సదరు ఇందుషను కలుస్తానని అడగమన్నాడు. దీంతో ప్రవీణ్ ఎన్నిసార్లు కోరినా ఇందుషగా చెప్పుకుంటున్న అశోక్ దాటవేస్తూ, డబ్బు అడుగుతూ వచ్చాడు. ►ఇలా తాను మోసపోయానని గుర్తించిన ప్రవీణ్ ఫిర్యాదుతో సైబర్ ఠాణాలో కేసు నమోదైంది. ఇన్స్పెక్టర్ జి.వెంకట్రామిరెడ్డి నేతృత్వంలో ఎస్సై కె.మధుసూదన్‌తో కూడిన బృందం దీన్ని దర్యాప్తు చేసింది. అశోక్‌ను నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసింది. రూ.45 లక్షల్లో రూ.43 లక్షలు ఆన్లైన్ గేమింగ్‌లో ఖర్చు చేశాడని పోలీసులు గుర్తించారు. మిగిలిన రూ.2 లక్షలతో పాటు నేరానికి వాడిన ఫోన్ రికవరీ చేశారు. -
రైతు బిడ్డకు నాలుగు గోల్డ్ మెడల్స్
చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే చక్కని వ్యవసాయ పరికరాలను రూపొందించి శభాష్ అనిపించుకున్న యువకుడు గొర్రె అశోక్‌కు ‘ఇ–న్నోవేట్’ ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఇన్నొవేషన్ షో లో ఇటీవల నాలుగు బంగారు పతకాలు దక్కాయి. పోలెండ్‌లోని జకపొనె నగరంలో ప్రతి ఏటా ఈ పోటీ జరుగుతుంది. ఈ ఏడాది పోటీకి ప్రపంచ దేశాల నుంచి 2 వేలకు పైగా ఎంట్రీలు వచ్చాయి. ఈ పోటీలో రెండుకు మించి బంగారు పతకాలు గెల్చుకున్న ఇన్నోవేటర్ అశోక్ ఒక్కరే కావటం విశేషం. వ్యవసాయం, ఆక్వాకల్చర్ విభాగంలో 12 ఆవిష్కరణలకు బంగారు పతకాలు దక్కగా.. అందులో తొలి 4 అశోక్‌వి కావటం మరో విశేషం. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం అంజలీపురంలో చిన్న రైతు కుటుంబంలో పుట్టిన అశోక్.. దేవరకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో వ్యవసాయ వృత్తి విద్యా కోర్సు పూర్తి చేశారు. చిన్న, సన్నకారు రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేయటం ఆయనకు ఇష్టం. కేవలం రూ. 250 ఖర్చుతో వరి పొలంలో కలుపు తీతకు ఉపయోగపడే చేతి పరికరాన్ని రూపొందించి ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్–2019’లో ప్రథమ బహుమతి పొందారు. ఈ నేపథ్యంలో వరి పొలంలో కలుపు తీత పరికరంతో పాటు తాను రూపొందించిన మరో మూడు పరికరాలను అశోక్ ఈ ఏడాది ‘ఈ–న్నోవేట్’ పోటీకి పంపారు. ఏకంగా నాలుగు బంగారు పతకాలు గెల్చుకున్నారు. విత్తనం వేసుకునే చేతి పరికరం: పత్తి, కంది, పెసర వంటి పంటల విత్తనాలను నడుము వంచే పని లేకుండా నిలబడే వేసుకునే ఒక చిన్న పరికరాన్ని అశోక్ రూపొందించారు. 3 అడుగుల ఎత్తున ఉండే ఈ పరికరంతో వేగంగా, సులువుగా, పురుషులు /మహిళలు /పెద్దలు / పిన్నలు ఎవరైనా సమాన దూరంలో విత్తనాలు వేసుకోవచ్చు. 4 రకాలుగా ఉపయోగపడే పరికరం అశోక్ తయారు చేసిన మరో పరికరం చిన్న రైతులకు నాలుగు రకాలుగా ఉపయోగపడుతుంది. పత్తి, మిరప పొలాల్లో సాళ్ల మధ్య దున్నుతూ కలుపు తొలగించడానికి, విత్తనాలు వేసుకునే సమయంలో అచ్చు తీయడానికి, ఆరబోసిన ధాన్యాలను కుప్ప చేయడానికి, కళ్లాల్లో గడ్డిని పోగు చేయడానికి చిన్న మార్పులతో ఈ పరికరాన్ని ఉపయోగించుకోవచ్చు. బహుళ ప్రయోజనకర యంత్రం అశోక్ మొట్టమొదటిసారిగా పెట్రోలుతో నడిచే పెద్ద వ్యవసాయ యంత్రాన్ని రూపొందించారు. ఏ పంటలోనైనా ఎకరంలో 15 నిమిషాల్లో పిచికారీని పూర్తి చేయడం, ఎరువు వంటి బరువులను ఇంటి నుంచి పొలానికి రవాణా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అందుకే మల్టీపర్సస్ యుటిలిటీ వెహికల్ అని దీనికి పేరు పెట్టారు. ‘ఈ–న్నోవేట్’ పోటీలో దీనికి కూడా బంగారు పతకం వచ్చింది. ప్రభుత్వం లేదా దాతలు ఆర్థిక సాయం చేస్తే పేటెంట్ పొంది, ఆ తర్వాత ఈ యంత్రాన్ని రైతులకు అందిస్తానని కొండంత ఆశతో చెబుతున్న అశోక్‌కు ఆల్ ద బెస్ట్ చెబుదామా! ashokgorre17@gmail.com -
ఉసా, గస్తీ సంస్మరణ సభ రేపు
సాక్షి, హైదరాబాద్: ఉద్యమాల ఉపాధ్యాయుడు ఉప్పుమావులూరి సాంబశివరావు(ఉసా), రాజ్యసభ సభ్యుడు అశోక్ గస్తీ సంస్మరణ ఆదివారం జరగనుంది. కర్మాన్‌ఘాట్ దుర్గానగర్‌లోని జేవీఆర్ ట్రస్ట్ భవన్లో ఆదివారం ఉదయం 10.30 గంటలకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, మాజీ ఐఏఎస్ అధికారి ఆర్ వీ చంద్రవదన్, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, ప్రజాశక్తి మాజీ సంపాదకులు ఎస్. వినయ్‌కుమార్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని నిర్వాహకులు తెలిపారు. దుగ్యాల అశోక్, సీఎల్ఎన్ గాంధీ, ఎస్. రామానందస్వామి, ఎం గంగాధర్, కె. వెంకటేశ్వరరావు, ఆర్. వెంకటేశ్వర్లు, డాక్టర్ సారంగపాణి ఆధ్వర్యంలో సంస్మరణ సభ జరగనుంది. దళిత బహుజనుల ఆత్మగౌరవం కోసం జీవిత కాలం పోరాడిన ఉసా కరోనా బారిన పడి కన్నుమూశారు. జూలై 25న హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా బ్రాహ్మణ కోడూరులో జన్మించిన ఉసా దళిత, బహుజన, ఉద్యమ మేధావిగా ఎదిగారు. పీడిత ప్రజల హక్కుల కోసం అవిశ్రాంత పోరాటం చేసి ఉద్యమాల ఉపాధ్యాయుడిగా మన్ననలు అందుకున్నారు. కర్ణాటక నుంచి బీజేపీ తరపున రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన అశోక్ గస్తీ(55) సెప్టెంబర్ 17న కరోనాతో చనిపోయారు. కర్ణాటకలో నాయీ బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆరెస్సెస్)లో అంచెలంచెలు ఎదిగి రాజ్యసభ సభ్యుడు అయ్యారు. కర్ణాటక బీసీ కమిషన్ చైర్మన్‌గా కూడా పనిచేశారు. రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేసిన కొద్దిరోజులకే ఆయన కన్నుమూయడంతో కుటుంబ సభ్యులతో పాటు బీజేపీ అగ్ర నాయకులు షాక్‌కు గురయ్యారు. పార్లమెంట్ సమావేశాలకు హాజరుకాకుండానే అశోక్ గస్తీ ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేసింది. -
బర్త్‌డే లుక్
నటుడు కృష్ణ మనవడు, గుంటూరు ఎంపీ జయదేవ్ గల్లా కుమారుడు అశోక్ గల్లా హీరోగా పరిచయమవుతున్న చిత్రంలో నిధీ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. అమరరాజా మీడియా అండ్ ఎంటర్టైన్ మెంట్ బ్యానర్‌పై పద్మావతి గల్లా ఈ సినిమా నిర్మిస్తున్నారు. కాగా సోమవారం నిధీ అగర్వాల్ పుట్టినరోజుని పురస్కరించుకుని ఈ చిత్రంలోని ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ‘‘ఈ సినిమా కోసం చేసిన కృష్ణగారి ‘యమలీల’ చిత్రంలోని ‘జుంబారే..’ సాంగ్ రీమిక్స్ వీడియోకు మంచి స్పందన వచ్చింది.. ఇప్పటి వరకూ 60 శాతం షూటింగ్ పూర్తయింది’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రంలో నరేష్, సత్య, అర్చనా సౌందర్య తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, కెమెరా: రిచర్డ్ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: చంద్రశేఖర్ రావిపూటి. -
వైరల్: జూనియర్ ఎన్టీఆర్ పాటకు స్టెప్పులు
జూనియర్ ఎన్టీఆర్, సమీరారెడ్డి నాయకానాయికలుగా నటించిన చిత్రం అశోక్. స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి దర్శకుడు. 2006లో వచ్చిన ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. అయితే, జపాన్‌లోని జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జంట అశోక్ సినిమాలోని ‘గోలాగోలా రంగోలా గుండెల్లోనా రాగాలా.. గోదారేదో పొంగే వేళ’పాటకు స్టెప్పులేసి అదరగొట్టింది. క్యాస్ట్యూమ్స్ కూడా హీరోహీరోయిన్లను పోలినట్టుగా ఉండటం విశేషం. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కామెంట్ల వర్షం కురుస్తోంది. అచ్చం జూనియర్ ఎన్టీఆర్, సమీరాలాగానే స్టెప్పులేశారంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఇక తెలుగు సినిమాల్లోని పాపులర్ పాటలకు ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్ ఇటీవల టిక్‌టాక్ చేసి అభిమానులను అలరించిన సంగతి తెలిసిందే. ‘అల వైకుంఠపురములో..’ సినిమాలోని బుట్టబొమ్మ, సరిలేరు నీకెవ్వరూ సినిమాలోని మైండ్ బ్లాక్ పాటలకు వార్నర్ దంపతులు డ్యాన్సుల వైరల్ అయ్యాయి. (చదవండి: యంగ్ టైగర్ అభిమానులకు గుడ్ న్యూస్!) -
‘దాయాది’ని గెలిచి... ప్రపంచాన్ని జయించి...
హాకీలో మన గతం ఎంతో ఘనం. ప్రత్యేకించి ఒలింపిక్స్‌లో అయితే భారతే చాంపియన్. ఏ దేశమేగినా... ఎవరెదురైనా... ఎగిరింది మన తిరంగానే. అందుకేనేమో మిగతా జట్లు కసిదీరా ఆడినా పసిడి కోసం మాత్రం కాదు! రజతమో లేదంటే కాంస్యమో వాళ్ల లక్ష్యం అయి ఉండేది. సుమారు మూడున్నర దశాబ్దాల పాటు భారత్‌దే స్వర్ణయుగం. విశ్వక్రీడల్లో ఇంతటి చరిత్ర ఉన్న భారత్‌కు ప్రపంచకప్ మాత్రం అంతగా కలసిరాలేదు. 1975లో ఒకసారి మాత్రమే భారత్ విశ్వవిజేతగా నిలిచింది. ఆ తర్వాత ఎన్నిసార్లు ప్రయత్నించినా టీమిండియా మళ్లీ ప్రపంచాన్ని గెలవలేకపోయింది. ఒలింపిక్స్‌లో భారత్‌కు స్వర్ణ సంబరాలెన్ని ఉన్నా... ప్రపంచకప్‌లో అంతగా లేవు. ఈ వెలితి తీరేలా... ‘ప్రపంచ’ పుటలకు ఎక్కేలా భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌ను చిత్తు చేసి మరీ ‘కప్’ కొట్టింది. మలేసియా ఆతిథ్యమిచ్చిన మూడో మెగా ఈవెంట్ ఫైనల్ కౌలాలంపూర్‌లో జరిగింది. టోర్నీలోని హేమాహేమీ జట్లను ఓడించి భారత్, పాకిస్తాన్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. ఈ రెండు జట్లకిది రెండో ప్రపంచకప్ ఫైనల్. 1971లో స్పెయిన్‌పై ఫైనల్లో నెగ్గి పాక్ తొలిసారి ప్రపంచకప్ టైటిల్ సాధించగా... 1973లో నెదర్లాండ్స్‌తో జరిగిన అంతిమ సమరంలో భారత్ షూటౌట్లో ఓటమి చవిచూసి రన్నరప్‌గా నిలిచింది. చిరకాల ప్రత్యర్థిని ఓడించడం... ప్రపంచకప్ సాధించడం... ఈ రెండింటిని రెండు కళ్లతో చూస్తే మాత్రం ఒత్తిడంతా భారత్‌పైనే! మరి టీమిండియా ఏం చేసింది? ఒకేసారి ఇద్దరు ప్రత్యర్థుల్ని (పాక్, ఒత్తిడి) ఎలా జయించింది? పోరు హోరెత్తిందిలా... సరిగ్గా 45 ఏళ్ల క్రితం సంగతి. 1975, మార్చి 15న కౌలాలంపూర్‌లోని మెర్డెకా ఫుట్‌బాల్ స్టేడియం (అప్పట్లో ఆస్ట్రోటర్ఫ్‌పై కాకుండా పచ్చిక మైదానంలో హాకీ మ్యాచ్‌లను నిర్వహించేవారు). దాయాదుల ‘ప్రపంచ’ యుద్ధానికి వేదిక. సహజంగా మలేసియాలో హాకీకి క్రేజ్ ఎక్కువ. పైగా ప్రపంచకప్ ఫైనల్! అందుకే ఆ రోజు జరిగిన మ్యాచ్‌కు ప్రేక్షకులు పోటెత్తారు. మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది. ఇరు జట్ల మేనేజర్లు, ప్రేక్షకులే కాదు క్షణాలు, నిమిషాలు కూడా ఎదురుచూస్తున్నాయి... తొలి పైచేయి ఎవరిదని! ఈ ఎదురుచూపుల్లోనే 16 నిమిషాలు గడిచిపోయాయి. ఆ మరు నిమిషమే భారత రణ శిబిరాన్ని నిరాశపరిచింది. బోణీతో దాయాది దరువేసింది. పాక్ స్ట్రయికర్ మహమ్మద్ జాహిద్ షేక్ (17వ నిమిషంలో) సాధించిన గోల్‌తో తొలి అర్ధభాగంలో ప్రత్యర్థి ఆధిక్యంలోకి వెళ్లింది. దీంతో భారత సేనపై మరింత ఒత్తిడి పెరిగింది. ఆట పాక్ ఆధిక్యంతోనే సాగుతూ ఉంది. భారత్ దాడులకు పదును పెట్టినా... ఆ ప్రయత్నాలేవీ ఫలించకుండా 43 నిమిషా ల ఆట ముగిసింది. ఆ తర్వాత నిమిషమే భారత విజయానికి తొలి అడుగు పడేలా చేసింది. డిఫెండర్, పెనాల్టీ కార్నర్ స్పెషలిస్ట్ సుర్జీత్ సింగ్ (44వ నిమిషంలో) చక్కని ఏకాగ్రతతో గోల్ చేశాడు. తండ్రికి తగ్గ తనయుడు అశోక్... సుర్జీత్ చేసిన ఒకే ఒక్క గోల్‌తో భారత్ మూడడుగులు ముందుకేసింది. స్కోరు 1–1తో సమమైంది. ఒత్తిడి తగ్గింది. టైటిల్‌పై కన్ను పడింది. సరిగ్గా ఏడు నిమిషాల వ్యవధిలోనే దీనికి సంబంధించిన సానుకూలత ఫీల్డ్‌లో కనిపించింది. ఒకప్పుడు భారత హాకీ దిగ్గజం ధ్యాన్‌చంద్ ఒలింపిక్స్ స్వర్ణాలను సాకారం చేస్తే... ఈసారి ఆయన తనయుడు అశోక్ కుమార్ (51వ నిమిషంలో) ప్రపంచకప్ టైటిల్‌ను ఖాయం చేసే గోల్ సాధించి పెట్టాడు. కానీ ఈ గోల్‌పై పాక్ వివాదం రేపినా... బంతి నిబంధనల ప్రకారం గోల్‌పోస్ట్‌లోకి వెళ్లిందని రిఫరీ పాక్ అప్పీల్‌ను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. ఆధిక్యం 2–1కు చేరిన ఈ దశలో భారత్ కట్టుదిట్టంగా ఆడింది. రక్షణ పంక్తి పాక్‌కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా నిరోధించింది. మిగిలున్న నిమిషాలన్నీ పాక్‌ను ముంచేయగా... భారత్ తొలిసారి విజేతగా నిలిచింది. ఆ మురిపెమే... ఇప్పటికీ అపురూపం తొలి ప్రపంచకప్ (1971)లో భారత్ కాంస్యంతో పతకాల బోణీ చేసింది. రెండో ఈవెంట్ (1973)లో రజతం గెలిచింది. మూడో ప్రయత్నంలో పసిడి నెగ్గింది. ఇలా వరుసగా మూడు ప్రపంచకప్‌లలో 3, 2, 1 స్థానాలకు ఎగబాకిన భారత్ చిత్రంగా... ఆ తర్వాత ప్ర‘గతి’ మార్చుకుంది. పతకానికి దూరమైంది. 1975 మెగా ఈవెంట్ తర్వాత 11 సార్లు ప్రపంచకప్ టోర్నీలు జరిగినా... ఇందులో మూడుసార్లు (1982, 2010, 2018లలో) ఈ మెగా ఈవెంట్‌కు భారత్ ఆతిథ్యమిచ్చినా సెమీఫైనల్ చేరలేకపోయింది. -
మందుబాబులకు సందేశం
ఆనందకృష్ణ, స్వాతిమండల్, అశోక్, యాంకర్ ఇందు, వెంకటేష్ ముఖ్య తారలుగా కొమారి జానకీరామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయింది. జానకీరామ్ మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్, థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌తో పాటు సందేశం ఇస్తుంది. బాచుపల్లి దగ్గర వేసిన ప్రత్యేకమైన సెట్లో ప్రత్యేక పాట చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ పాట మద్యానికి బానిసైన వారికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. శ్రష్టి వర్మ డాన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: యు.వి.నిరంజన్. -
అడవి పిలిచింది
స్పెయిన్ దేశానికి ఉత్తర భాగంలో ఫ్రాన్స్ దేశాన్ని ఆనుకొని వున్న నవర్రా (navarra) ప్రాంతం అందానికి మారుపేరు. నిత్యం చినుకుతూ, పచ్చగా కళకళలాడుతుంటే ఈ నవర్రాలో ఉంది మరో అందమైన ప్రపంచం. అదే సెల్వా ఇరాతి. స్పానిష్ భాషలో ‘సెల్వా’ అంటే అరణ్యం అని అర్థం. ఆ ప్రాంతంలో మాట్లాడే వాస్క్ భాషలో ‘ఇరాతి’ అంటే అడవి మొక్కలు పెరిగే వనం అని అర్థం. ఇంత అందమైన అర్థం వున్న ‘ఇరాతి’ అనే పేరుతో నవర్రా ప్రాంతంలో అనేక మంది ఆడపిల్లలుంటారంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. జర్మనీలో వున్నా బ్లేక్ఫారెస్ట్ తర్వాత ఐరోపా ఖండంలో వున్న అతి పెద్ద ‘బీచ్వుడ్ అరణ్యం’ ఇదే. ఆకురాలు కాలంలో, ముఖ్యంగా నవంబర్ నెలలో ఇరాతి అరణ్యం ఒక అందమైన రంగుల కలగా రూపాంతరం చెందుతుంది. కేవలం రెండు వారాల పాటు ఉండే ఈ ఆకురాలు కాలం చూడడానికి చుట్టుపక్కల దేశాల నుంచి వేలాదిమంది యాత్రికులు వస్తారు. అడవికి 26 కిలోమీటర్ల దూరంలో వున్న ఎప్పినాల్ అనే గ్రామంలో బస చేసి ఉదయాన్నే ఇరాతి అరణ్యానికి కాలి నడకన బయల్దేరాను. ఈ అడవి మార్గం అందాల్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఇదొకటే మార్గం, గ్రామం దాటగానే అడవి మొదలవుతుంది. ముందురాత్రి వచ్చిన గాలిదుమారానికి చెట్ల ఆకులన్నీ దాదాపుగా రాలిపోయాయి. ఒళ్లంతా ఉన్ని కప్పుకున్న గొర్రెలు క్రిస్మస్ బొమ్మల్లా వున్నాయి. తెల్లమచ్చల నల్లావుల మెళ్ళో నుంచి వచ్చే గంటారావం, పక్షుల కిలకిలారావంతో అడవి నిండింది. రకరకాల పండ్ల చెట్లు సువాసనలు వెదజల్లుతున్నాయి. వర్షానికి తడిసిన మట్టివాసన మత్తెక్కిస్తుంది. ఈ మట్టివాసనకు తెలుగులో ఏం పేరుందో తెలీదుగాని ఆంగ్లంలో పెట్రికోర్ (petrichor) అనే పదం దీన్ని బాగా వర్ణిస్తుంది. ఈ మార్గంలో నేను ఒంటరిగా ప్రయాణం చేస్తున్నాను అనే సంగతి మర్చిపోయాను. ఎత్తుపల్లాల కొండమార్గంలో ఓ ఆరు కిలోమీటర్లు నడిచాక ఒక సన్నటి బాట కనిపించింది. బాటనానుకొని వున్న పచ్చటి మైదానం, ఆ మైదానంలో అందమైన గుర్రాలు నా దృష్టిని ఆకర్షించాయి. ‘బుర్లేతె’ అనే జాతికి చెందిన గుర్రాలు పొట్టిగా, బలంగా ఉంటాయి. తలపైన, తోకపైనా వుండే దట్టమైన వెంట్రుకలు నల్లగా పొడవుగా అందంగా అలలు తీరిన కురుల్లా వుంటాయి. వర్షం జోరు పుంజుకుంది. చలి కూడా విపరీతంగా వుండటంతో దగ్గర్లోనే వున్న ‘బుర్గెతే’ అనే గ్రామం చేరుకున్నాను. తెరచి వున్న ఒక బార్లోకి దూరాను. ఇక్కడ మనలా కాఫీహోటళ్ళూ, టీస్టాల్లూ వుండవు. బార్లోనే కాఫీ, టీలు దొరుకుతాయి. టీ తాగుతూ గోడ మీద రెండు చిన్న ఫోటోల్ని గమనించాను. ఆ రెంటిలోనూ వున్న వ్యక్తి ఒకరే–సుప్రసిద్ధ రచయిత, అమెరికన్ నవలాకారుడు, 1954 నోబెల్ బహుమతి గ్రహీత ఎర్నెస్ట్ హెమింగ్వే. సంభాషణ కోసం ‘‘మీ కుటుంబంలో ఎవరైనా రచయితలు ఉన్నారా?’’ అని అడిగాను నాకు టీ అందించిన మహిళను. బార్లో నా ఎదురుగా కూర్చున్న ఓ పెద్దాయన నవ్వుతూ ‘‘మీరు కూర్చున్న చోటే హెమింగ్వే కూర్చునే వారు’’ అని చెప్పాడు. ముందు వెటకారం అనుకున్నా, కాని ఇంతలో ఆ మహిళ నా ప్రక్కనే పియానో కవర్ తీసింది. పియానో మీద ‘ఇ.హెమింగ్వే, 25–7–1923’ అని ఆయన చేత్తో చెక్కిన సంతకం వుంది. హెమింగ్వే గొప్ప రచనలు చదివిన నాకు కొంచెంసేపు ఆనందంతో మాట రాలేదు. హెమింగ్వే గొప్ప రచయిత మాత్రమే కాదు ఎంతో సాహస జీవితాన్ని గడిపిన వ్యక్తి. కేవలం పద్దెనిమిదేళ్ల వయసులోనే మొదటి ప్రపంచ యుద్ధంలో మిలిటరీ ట్రక్ డ్రైవర్‌గా తన జీవితాన్ని మొదలుపెట్టిన హెమింగ్వేకు స్పెయిన్ దేశం అంటే చాలా ఇష్టం. నవర్రా ప్రాంతం అంటే ప్రత్యేక అభిమానం. స్పెయిన్‌లో ఆయన చూడని స్థలం లేదు. అందుకే కొందరు తమాషాకి వాళ్ళ హోటల్ బయట ‘హెమింగ్వే ఈ హోటల్‌కి రాలేదు’ అని బోర్డులు పెట్టుకుంటారు. సముద్రమట్టానికి దాదాపు మూడువేల అడుగుల ఎత్తు ఉన్న కొండమార్గంలో నడక కొనసాగింది. కింద లోయలో ఇరాతీనది ప్రవహిస్తుంది. నదికి రెండు వైపులా కొండచరియల్లో ఎల్తైన చెట్లు రకరకాల పసుపు, ఎరుపు, పచ్చ ఛాయల్లో వున్న పత్రాలతో అప్పుడే వేసిన ‘క్లవుద్ మోనె’ తైలవర్ణచిత్రంలా వుంది. నది పక్కనే నడుస్తూ ‘అరీబే’ అనే గ్రామం చేరుకున్నాం. అక్కడ కూడా హెమింగ్వే మళ్లీ ప్రత్యక్షమయ్యాడు. ‘బుర్గెతే’ గ్రామం నుంచి ఆయన కూడా కాలి నడకన ఇక్కడకు వచ్చారని, ఇరాతి నది ఒడ్డున గంటల తరబడి కూర్చునే వారని తెలిసింది. ఆయనకు గేలంతో చేపల పట్టడం చాలా ఇష్టం. ఈ నదిలో ఆయన ‘ట్రౌట్’ అనే చేపను పట్టేవాడు. ఆహ్లాదకరమైన ప్రకృతి, అందమైన ప్రజలు, అందమైన అనుభూతులు వున్నంత సేపూ కాళ్లకు నొప్పి తెలియదు. మరో నాలుగు గ్రామాలు దాటి 26 కిలోమీటర్లు నడిచాక ఇరాతీ అరణ్యం ప్రత్యక్షమైంది. అడవికి చేరే ముందు మార్గమంతా అత్యద్భుతమైన ప్రకృతి సౌందర్యంతో ఒళ్ళు పులకరింపజేస్తుంది. అడవి చుట్టూ వున్న పచ్చని మైదానాల్లో దాదాపు ఇరవై వేల గొర్రెలు, రెండు వేలకు పైగా ఆవులు స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అనేకమంది పాడిపరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తుంటారు. గొర్రె పాలతో చేసిన పనీర్ ఇక్కడ బాగా ప్రసిద్ధి. విశేషం ఏమిటంటే పచ్చగా ప్రశాంతంగా వుండే ఇరాతి ప్రాంతంలో పరిశ్రమలు కూడా బాగా అభివృద్ధి చెందాయి. ఇక్కడ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో వున్న ‘ఎవ్గీ’ అనే గ్రామంలో 18వ శతాబ్దంలో నిర్మించిన ఆయుధ కర్మాగారం ప్రస్తుతం శిథిలమైపోయింది. ఇనుప ఖనిజానికి, కలపకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. స్పెయిన్‌లో జరిగిన అంతర్యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధ సమయాల్లో ప్రతిఘటన యోధులు స్పెయిన్, ఫ్రాన్స్ దేశాల మధ్య రహస్య రాకపోకలను ఈ దట్టమైన అరణ్యం ద్వారా నడిపారు. నలభైమూడు వేల ఎకరాల విస్తీర్ణం వున్న ఇరాతి అడవిలో అడుగుపెట్టేసరికి ఒళ్లు జలదరిస్తుంది. కేవలం బొమ్మల్లో మాత్రమే కనిపించే అందం కళ్ల ముందు కనిపిస్తుంటే ఎంత సంతోషమేసిందో! అడవి అంతా కళ్ళ ముందు పరిచిన అపురూపవర్ణచిత్రంలా వుంది. కుప్పలు కుప్పలుగా పడి ఉన్న ఎరుపు పత్రాల మధ్య నుంచి ప్రవహిస్తున్న సన్నని సెలయేరు, ఇంకా రాలడానికి సిద్ధంగా వున్న ఎర్రటి పత్రాలు, అక్కడక్కడా పసుపు, ఆకుపచ్చ, కాషాయ ఛాయలతో ఇరాతి అరణ్యం ఒక ఫెయిరీ టేల్ సెట్టింగ్లా వుంది, ఒక పక్కన ఫ్రాన్స్ దేశం. మరో పక్క స్పెయిన్. రెంటీనీ కలుపుతూ అందమైన పిరినీస్ పర్వతాలు. వర్షానికి తడిచిన మెత్తటి మట్టిలో జారుతూ, పడుతూ లేస్తూ ఎంతదూరం నడిచామో కూడా తెలియదు. ఇక్కడ ప్రకృతి సరిహద్దులుండవు. జంతువులకు కూడా సరిహద్దులు కనిపించవు. -
యువ ఆవిష్కర్తకు కేటీఆర్ అభినందన
సాక్షి, హైదరాబాద్: తక్కువ ఖర్చుతో వరి కలుపు తీసే పోర్టబుల్ యంత్రాన్ని కనిపెట్టిన యువ ఆవిష్కర్త అశోక్‌ను పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు ప్రశంసించారు. వ్యవసాయ రంగంలో ఇలాంటి ఆవిష్కరణలు మరిన్ని రావాలని మంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వపరంగా అశోక్‌కు అవసరమైన సహకారాన్ని అందించాలని ఆదేశించారు. రాష్ట్ర చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ ఫణీంద్ర సామతో కలిసి అశోక్ శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిశారు. సూర్యాపేట జిల్లాకు చెందిన 17 ఏళ్ల అశోక్ ప్రస్తుతం దేవరకొండ ఒకేషనల్ కాలేజీలో అగ్రికల్చర్ కోర్సు చదువుతున్నాడు. రైతుల కోసం వరిలో కలుపు మొక్కలను తీసే యంత్రాన్ని తక్కువ ఖర్చుతో తయారు చేశాడు. ఈ ఆవిష్కరణకు కోల్‌కతాలోని విజ్ఞాన భారతి (విభ) సహకారంతో సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ నిర్వహించిన ‘ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ 2019’లో వ్యవసాయ రంగం కేటగిరీలో మొదటి బహుమతి లభించింది. గతంలో వినికిడి లోపంతో బాధపడే వారికి ఉపయోగపడేలా నిరీ్ణత సమయంలో వాసన విడుదల చేసే అలారం యంత్రం, చిన్న రైతుల కోసం బహుళార్థ సాధక హ్యాండ్ టూల్ తదితరాలను అశోక్ రూపొందించాడు. తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్, పల్లె సృజన ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదర్శనల్లో తన ఆవిష్కరణలను అశోక్‌కు ప్రస్తుతం కలుపు యంత్రానికి సంబంధించి 17కు పైగా తయారీ ఆర్డర్లు వచ్చాయి. భవిష్యత్తులో మరిన్ని ఆవిష్కరణల ద్వారా రైతులు, వ్యవసాయ రంగం అభివృద్ధికి తోడ్పాటునందించాలని మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. దక్షిణాఫ్రికాకు రావాలని కేటీఆర్‌కు ఆహా్వనం దక్షిణాఫ్రికా పర్యటనకు రావాల్సిందిగా కేటీఆర్‌ను ఆ దేశ టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు ఆహ్వానించారు. శనివారం ప్రగతిభవన్‌లో కేటీఆర్‌ను కలిసిన నాగరాజు.. ఏడాది కాలంలో టీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా విభాగం ద్వారా చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, సేవలను కేటీఆర్‌కు వివరించారు. సౌతాఫ్రికా విభాగం చేపట్టిన పనులతో ముద్రించిన మేగజైన్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. -
గుర్తింపు లేని కాలేజీలు.. 1,338
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ కాలేజీల అనుబంధ గుర్తింపులో ఏటా తంటాలు తప్పడం లేదు. అనుబంధ గుర్తింపు కోసం ఏయే సర్టిఫికెట్లు అందజేయాలన్న విషయం కాలేజీ యాజమాన్యాలకు తెలిసినా పట్టించుకోవడం లేదు. రాష్ట్రంలో నిబంధనల ప్రకారం అత్యధిక ప్రైవేటు జూనియర్ కాలేజీలు వ్యవహరించడం లేదు. బోర్డు ఆదేశాలను పట్టించుకోవడం లేదు. 2019–20 విద్యా సంవత్సరంలో ప్రవేశాలు చేపట్టే కాలేజీల అనుబంధ గుర్తింపు కోసం గతేడాది డిసెంబర్లోనే నోటిఫికేషన్ జారీ చేసి, దరఖాస్తులను స్వీకరించినా కాలేజీలన్నీ నిర్దేశిత సర్టిఫికెట్లను అందజేయలేదు. దీంతో రాష్ట్రంలో అనుబంధ గుర్తింపు వ్యవహారం గందరగోళంగా మారింది. ఇప్పటివరకు కూడా వాటిని ఇవ్వకపోవడంతో 1,338 కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేకుండా పోయింది. అయితే ఆయా కాలేజీల్లో ఇప్పటికే ప్రవేశాలు పూర్తయ్యాయి. చివరకు విద్యార్థులు భవిష్యత్ పేరుతో అనుబంధ గుర్తింపు పొందేందుకు ఆయా యాజమాన్యాలు చర్యలు వేగవంతం చేశాయి. అందులో 75 కార్పొరేట్ కాలేజీలు ఉండగా, అత్యధికంగా నారాయణ, శ్రీచైతన్య యాజమాన్యాలకు చెందినవే కావటం గమనార్హం. కాగా, రాష్ట్రంలో ఇంటర్ బోర్డు పరిధిలోని 405 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు కాకుండా పాఠశాల విద్యా శాఖ, సంక్షేమ శాఖల పరిధిలో మరో 558 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. అందులో 492 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇచ్చింది. మరో 66 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల గుర్తింపు ప్రాసెస్ కొనసాగుతోంది. ప్రైవేటు కాలేజీలు 2,155 ఉండగా, వాటిల్లో 1,699 కాలేజీలే అనుబంధ గుర్తింపు కోసం దరఖాస్తు చేసుకున్నాయి. వాటిల్లో 361 కాలేజీలకు షరతులతో కూడిన అనుబంధ గుర్తింపును బోర్డు జారీ చేసింది. వాటిలోనూ ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్లు లేరు. 3 నెలల్లో నియమించుకుంటామన్న షరతుతో వాటికి అనుబంధ గుర్తింపును జారీ చేసింది. మిగతా 1,338 కాలేజీలకు ఇంకా అనుబంధ గుర్తింపును ఇవ్వలేదు. చివరకు శానిటేషన్ సర్టిఫికెట్లూ లేవు.. రాష్ట్రంలోని ఎక్కువ శాతం ప్రైవేటు కాలేజీలకు రిజిస్టర్ లీజ్ డీడ్, ఫిక్స్డ్ డిపాజిట్ రెన్యువల్, స్ట్రక్చరల్ సౌండ్ నె‹స్, ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు, ఆట స్థలాలు లేవు. సరిగ్గా ఫ్యాకల్టీ లేరు. గతేడాది అంతకుముందు ఇచ్చి న అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించలేదు. శానిటరీ, హైజీన్ సర్టిఫికెట్లు ఇవ్వడం లేదు. ఈ కారణాలతో 1,338 కాలేజీలకు ఇంటర్ బోర్డు అనుబంధ గుర్తింపు ఇవ్వలేదు. ఇందులో ఐదారు ఫ్లోర్లు కలిగిన భవనాల్లో నడుపుతున్న 75 కార్పొరేట్ కాలేజీలున్నా యి. వాటికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్లు లేవు. అందులో శ్రీచైతన్య విద్యా సంస్థలకు చెందినవి 25, నారాయణ విద్యా సంస్థలకు చెందినవి 26, శ్రీగాయత్రి విద్యా సంస్థలకు చెందినవి 8, ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందినవి 4, ఇతర విద్యా సంస్థలకు చెందినవి 12 ఉన్నాయి. అవన్నీ హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చెల్ జిల్లాల పరిధిలోనే ఉన్నట్లు బోర్డు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ కాలేజీలు అన్నింటికి అనుబంధ గుర్తింపు లేకపోవడం, విద్యార్థులను చేర్చుకున్న నేపథ్యంలో విద్యార్థుల భవిష్యత్ పేరుతో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధమయ్యాయి. మరో వారం సమయం ఇస్తాం: అశోక్ అనుబంధ గుర్తింపు తీసుకోని విద్యా సంస్థలకు మరో వారం గడువు ఇస్తామని ఇంటర్ బోర్డు కార్యద ర్శి అశోక్ పేర్కొన్నారు. ఆ తర్వాత అనుబంధ గుర్తిం పు ప్రక్రియను నిలిపివేస్తామని చెప్పారు. ఇప్పటికే చాలా సమయం ఇచ్చామని తెలిపారు. ఆయా విద్యా సంస్థలన్నీ తమకు కాలేజీలకు సంబంధించిన నిర్ధేశి త సర్టిఫికెట్లను అందజేసి అనుబంధ గుర్తింపు పొం దాలన్నారు. అలా గుర్తింపు పొందని విద్యా సంస్థల విషయంలో ప్రభుత్వంతో చర్చించి తదుపరి చర్యలు చేపడతామని చెప్పారు. అందులో 194 కాలేజీలకు అనుబందంగా హాస్టళ్లు ఉన్నాయని వివరించారు. హాస్టళ్ల గుర్తింపు విషయంలో కేసు కోర్టులో ఉన్నందు న ఆ విషయం జోలికి వెళ్లడం లేదన్నారు. -
ఇంటర్ ఫస్టియర్‌లో 28.29% ఉత్తీర్ణత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప్రథమ సంవత్సర పరీక్షల ఫలితాలు బుధవారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో కార్యదర్శి అశోక్ ఫలితాలను విడుదల చేశారు. గత వార్షిక పరీక్షల్లో ఫెయిలై, ప్రస్తుతం అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల్లో 28.29 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంప్రూవ్మెంట్ రాసిన విద్యార్థులను కలుపుకుంటే 64.31 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు మొత్తంగా 3,00,607 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో గత వార్షిక పరీక్షల్లో ఫెయిలైన వారు 1,49,605 మంది ఉండగా, వారిలో 42,331 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంప్రూవ్‌మెంట్‌కు 1,51,002 మంది విద్యార్థులు హాజరై మార్కులను మెరు గు పరుచుకున్నట్లు బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. 30 నాటికి మార్కుల జాబితాలు.. మార్కుల జాబితాలు, మెమోలు సంబంధిత జిల్లా విద్యాదికారులకు పంపించనున్నట్లు అశోక్ తెలిపారు. వాటిని కాలేజీల ప్రిన్సిపాళ్లు ఈనెల 30న తీసుకొని విద్యార్థులకు అందజేయాలన్నారు. విద్యార్థులు ఈనెల 31వ తేదీలోగా రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం ఆన్లైన్ ద్వారా (tsbie. cgg.gov.in స్టూడెంట్ సర్వీసెస్) దరఖాస్తు చేసుకో వచ్చని తెలిపారు. రీకౌంటింగ్‌కు ఒక్కో సబ్జెక్టుకు రూ. 100, రీవెరిఫికేషన్ కమ్ స్కాన్డ్ కాపీ కోసం ఒక్కో పేపరుకు రూ. 600 చెల్లించాల్సి ఉంటుందని వివరించారు. -
‘ఐటీ గ్రిడ్స్’ నిందితులకు బెయిల్
సాక్షి, హైదరాబాద్: ఓటర్ల డేటా, ఆధార్ వంటి వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారనే ఆరోపణలున్న కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండి డి.అశోక్, ఆ సంస్థ డైరెక్టరైన ఆయన భార్య శ్రీలక్ష్మికి షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వారిపై హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్, మాదాపూర్ పోలీస్ స్టేషన్లల్లో కేసులు నమోదయ్యాయి. ఈ కేసుల్లో పోలీసుల దర్యాప్తునకు సహకరిస్తామని, తమకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని వారిద్దరూ దాఖలు చేసిన వ్యాజ్యాలను సోమవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గండికోట శ్రీదేవి విచారించారు. ఇద్దరికీ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశారు. రూ.25 వేల విలువైన పూచీకత్తులను ఇద్దరూ సమర్పించాలని, సంబంధిత పోలీస్స్టేషన్లలో రోజూ హాజరుకావాలని, ఏదైనా కోర్టులో పాస్‌పోర్టులు సరెండర్ చేయాలని, కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని హైకోర్టు షరతులు విధించింది. ఐటీ గ్రిడ్స్‌తో టీడీపీ చేతులు కలిపి కీలకమైన ఓటర్ల వివరాలను ఆ కంపెనీకి అందజేసిందని, అందులో తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వారి ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారని లోకేశ్వర్‌రెడ్డి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో గత నెల 25న రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ దరఖాస్తులను తిరస్కరించగా ఇప్పుడు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. -
ఐటీ గ్రిడ్స్ స్కాం : అశోక్‌కు బెయిల్ మంజూరు
సాక్షి, హైదరాబాద్ : ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్‌కు బెయిల్ మంజూరు అయింది. షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు చేసింది. వారానికి ఒక రోజు పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాలని ఆశోక్‌ను ఆదేశించింది. అత్యంత కీలకమైన ఓటర్, ఆధార్, వ్యక్తిగత సమాచారాన్ని చోరీ చేశారని ఐటీ గ్రిడ్స్‌పై డేటా విశ్లేషకులు టి.లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అశోక్‌పై సంజీవ్‌రెడ్డినగర్, మాదాపూర్ పోలీస్స్టేషన్లలో కేసులు నమోదైన విషయం తెలిసిందే. -
‘అనామిక’పై అశోక్ నిర్లక్ష్యపు సమాధానం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక విషయంలో ఇంటర్ బోర్డు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. తాము చేసిన తప్పును ఒప్పుకో కుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల జవాబు పత్రాలు, మార్కులపై మంగళ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నం. ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కుల విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేక రులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధా నాలు చెప్పారు. అనామికకు జవాబుపత్రంలో 21 మార్కులు వస్తే 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో ఎలా పొందుపరిచారని విలేకరులు ప్రశ్నించగా అశోక్ చిరాకుపడ్డారు. (అశోకా.. ఏంటీ లీల!) ‘వెబ్సైట్లో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోం. జవాబు పత్రాల్లో ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకుంటాం. ఆ మార్కులే ఫైనల్. జవాబుపత్రాల మూల్యాంకనం గాలిలో చేయరు. ఆ జవాబు పత్రాలు నేను కరెక్షన్ చేయను. నాకు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పకుండా తప్పించుకునే సమాధానం ఇచ్చారు. అనామిక విషయంలో బోర్డు తప్పే చేయనట్లు ఆయన మాట్లాడడం గమనార్హం. ఏ విద్యార్థి అయినా తమ ఫలితాలను ముందుగా వెబ్సైట్లో ఇచ్చే మెమోలోనే చూసుకుంటారు. అలా అనామికకు మొదట 20 మార్కులు వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆమె జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేసి 21 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. చివరకు మరోసారి ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసిన సమయంలో అనామికకు 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో గందరగోళం నెలకొంది. దానిపై బోర్డు స్పష్టౖ మెన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవై పు ఓఎంఆర్ షీట్లలో బోర్డు తప్పుగా ముద్రించే పొరపాట్లను విద్యార్థులు సరిచూసుకొని ఇన్విజిలే టర్లకు చెప్పి సరిచేయించుకోవాలని, లేదంటే అందు లోని తప్పులకు విద్యార్థులదే బాధ్యత అంటూ వారిని ఆందోళన పడేసే చర్యలకు బోర్డు దిగింది. బాధ్యులపై చర్యలు.. మూల్యాంకనంలో పొరపాట్లకు బా«ధ్యులైన లెక్చరర్లపై చర్యలు చేపడతామని అశోక్ పేర్కొన్నారు. అలాగే తొలుత ఫెయిలై, ఆ తర్వాత రీ వెరిఫికేషన్‌లో పాసైన విద్యార్థుల జవాబుపత్రాలు మొదట మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్‌లో 1,155 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ లెక్కన గమనిస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రీ వెరిఫికేషన్‌లో ఐదు లేదా అంతకన్నా మార్కులు పెరిగిన పేపర్లను మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు రూ. 5 వేల జరిమానాతోపాటు మూల్యాంకన విధుల నుంచి మూడేళ్లు డీబార్ చేయనున్నట్లు అశోక్ తెలిపారు. గత నెల విడుదల చేసిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో 1,137 మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు ప్రకటించింది. వారం తిరిగే సరికి ఆ సంఖ్య మారిపోయింది. ఉత్తీర్ణుల సంఖ్య 1,155కి చేరింది. అంటే మరో 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 800 మంది ఫలితాల ప్రాసెసింగ్ ఇంకా పూర్తి కాలేదు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో వేచి చూడాల్సిందే. -
7 నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఈ నెల 7 నుంచి నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ తెలిపారు. ప్రధాన పరీక్షలు ఈ నెల 12తో ముగుస్తాయన్నారు. బోర్డు కార్యాలయంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. తొలి ఏడాది పరీక్షలు ప్రతిరోజూ ఉదయం 9 నుంచి 12 వరకు, రెండో ఏడాది పరీక్షలు మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5:30 వరకు జరుగుతాయన్నారు. గంటముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, పరీక్ష సమయానికి నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని స్పష్టం చేశారు. పరీక్షలను పక్కాగా నిర్వహించేందుకు 040–24601010, 040–247 32369 నంబర్లతో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు తెలి పారు. పరీక్షలకు 4,63,236 మంది విద్యార్థులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఇందులో ప్రథమ, ద్వితీయ సంవత్సరాల్లో ఫెయిలైన విద్యార్థులు 3,14,773 మంది ఉండగా, ప్రథమ సంవత్సరంలో ఇంప్రూవ్మెంట్ రాసే వారు 1,48,463 మంది ఉన్నట్లు వివరించారు. పరీక్షల నిర్వహణకు 857 కేంద్రాలను ఏర్పాటు చేశామని ప్రతి కేంద్రంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశామన్నారు. వెబ్సైట్లో హాల్‌టికెట్లు... విద్యార్థులకు ఇప్పటికే హాల్‌టికెట్లను పంపించామని, అయినా ఇంకా అందకుంటే bie.telangana.gov.in నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని అశోక్ సూచించారు. వాటిపై కాలేజీ ప్రిన్సిపాళ్ల సంతకాలు లేకపోయినా అనుమతించాలని చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఓంఆర్‌ఎర్ షీట్లలో విద్యార్థులకు సంబంధించిన వివరాల్లో ఏమైనా పొరపాట్లు ఉంటే విద్యార్థులు చూసుకొని ఇన్విజిలేటర్ దృష్టికి తీసుకెళ్లాలని, ఒకవేళ సరిగ్గా చూసుకోకపోతే ఆ తరువాత విద్యార్థులదే బాధ్యతని ఆయన స్పష్టం చేశారు. -
హైకోర్టును ఆశ్రయించిన ఐటీ గ్రిడ్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత డాటాను చోరీ చేసిన కేసులో నిందితుడైన ఐటీ గ్రిడ్స్ సంస్థ సీఈవో అశోక్ మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. డాటా చోరీ వ్యవహారంలో మాదాపూర్ పోలీసులు తనపై నమోదు చేసిన కేసులలో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని అశోక్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం జూన్ 4వ తేదీకి వాయిదా వేసింది. ఇప్పటికే రంగారెడ్డి కోరక్టు ఆయన బెయిల్ పిటిషన్ కొట్టివేసింది. దీంతో అశోక్, అతని భార్య శ్రీ లక్ష్మీ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే కేసుల రద్దు కోసం ఆయన హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో కోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్‌పై న్యాయస్థానం బుధవారం విచారణ చేపట్టనుంది. ప్రస్తుతం పరారీలో ఉన్న అశోక్ కోసం నాలుగు ప్రత్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. విజయవాడ, విశాఖపట్నం , ముంబై , బెంగళూరులో అతని కోసం గాలిస్తున్నారు. -
వెబ్సైట్లో ఇంటర్ జవాబు పత్రాలు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల స్కాన్డ్ కాపీలు, మార్కుల వివరాలను బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు చేపట్టిన రీ వెరిఫికేషన్‌లో సున్నా మార్కులు వచ్చిన సమాధానాలు, అసలు దిద్దని సమాధానాలను మాత్రమే పరిశీలించి మార్కులు వేశారని పేర్కొన్నారు. అలాగే మార్కుల మొత్తాన్ని కూడా సరిచూశారని తెలిపారు. బోర్డు నిబంధనల ప్రకారం ఒకసారి మార్కులు వేసిన జవాబులను పునఃపరిశీలన చేయడం మాత్రం జరగదని స్పష్టంచేశారు. అంటే రీ వాల్యుయేషన్ ఉండదని, ఈ విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు గమనించాలని ఆయన కోరారు. రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన ఫస్టియర్ విద్యార్థులు ఇంప్రూవ్మెంట్ పరీక్ష రాయడానికి సబ్జెక్టుకు రూ.150 చొప్పున కాలేజీలో ఫీజు చెల్లించి, ప్రిన్సిపాల్ ద్వారా బోర్డుకు మాన్యువల్ నామినల్ రోల్ పంపించాలని సూచించారు. ఎంఈసీ విద్యార్థులు ఇది గమనించాలి... ఎంఈసీ విద్యార్థులు గణితంలో 75 మార్కుల ప్రశ్నపత్రానికే సమాధానాలు రాసినప్పటికీ, వారికి వచ్చిన మార్కులను 50 మార్కులకు అనుగుణంగా గుణించి మెమోలో వేస్తారని అశోక్ వివరించారు. ఉదాహరణకు ఓ విద్యార్థికి గణితం పేపర్లో 18 మార్కులు వస్తే.. వాటిని 2/3తో గుణించి 12 మార్కులుగా నిర్ధారించి, ఆ మేరకు మెమోలో ప్రింట్ చేస్తారని తెలిపారు. అందువల్ల విద్యార్థులు తమకు వచ్చిన మార్కుల కంటే మెమోలో తక్కువ వచ్చాయని ఆందోళన చెందకుండా ఈ విషయాన్ని గమనించాలని ఆయన సూచించారు. -
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
ఆ ముగ్గురు కనబడుట లేదు!
-
నిందితులకు షెల్టర్‌జోన్‌గా అమరావతి
సాక్షి, అమరావతి: సంచలనం రేకెత్తించిన కీలక కేసుల్లో నిందితులకు అమరావతి షెల్టర్ జోన్‌గా మారిపోయిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణలో అడ్డగోలుగా దొరికిపోయి, కేసుల్లో చిక్కుకున్న నిందితులు ఆంధ్రప్రదేశ్‌లో దాగుడుమూతలు ఆడుతున్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వారికి ఉన్న సన్నిహిత సంబంధాలే కారణమన్నది బహిరంగ రహస్యం. ఓటుకు నోటు కేసు, డేటా స్కామ్, టీవీ 9కు సంబంధించిన చీటింగ్ కేసు వంటి వాటిలో సాక్ష్యాధారాలతో అడ్డంగా దొరికి పోయిన వారికి చంద్రబాబు అభయం ఇచ్చి ఆశ్రయం కల్పిస్తున్నారనే ఆరోపణలున్నాయి. చంద్రబాబు ప్రమేయం ఉన్న కేసుల నుంచి, తన ప్రయోజనం కోసం పనిచేసే వారి కేసుల వరకు నిందితులను కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించేలా పరిణమిస్తున్నాయి. అనేక కేసుల్లో నింది తులను కాపాడేందుకు ప్రయత్నాలు చేసినట్టుగానే తాజాగా టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడైన సినీ నటుడు శివాజీలకు ఏపీలో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. పరారీలో ఉన్న రవిప్రకాశ్‌పై ఇప్పటికే ఉన్న ఫోర్జరీ కేసుతోపాటు నిధుల దుర్వినియోగంపై తెలంగాణా పోలీసులకు ఫిర్యాదులు అందాయి. రవిప్రకాశ్, ఆయన సన్నిహితుడు శివాజీలు టీడీపీ పెద్దల సంరక్షణలో విజయవాడ, ప్రకాశం జిల్లాలో ఉన్నట్టు తెలంగాణ పోలీసులు అనుమానిస్తున్నారు. సీఎం సొంత సామాజికవర్గానికి చెందిన వీరిని ప్రకాశం జిల్లాలోని ఒక రిసార్ట్స్‌లోను, మరో ఫామ్‌హౌస్‌లోను రెండు రోజుల క్రితం వరకు సకల సౌకర్యాలతో సాకినట్టు తెలంగాణ పోలీసులకు సమాచారం అందింది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రకాశం జిల్లాలో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ మంత్రి సంరక్షణలోనే రవిప్రకాశ్ ఉన్నారని పోలీసులు చెబుతున్నారు. శివాజీకి కూడా విజయవాడ, ప్రకాశం జిల్లాల్లో షెల్టర్ ఇచ్చినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇప్పటికే తనపై పోలీసులు సీఆర్పీసీ 154 కింద కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌ను (భోజన విరామం) విచారణకు చేపట్టాలన్న రవిప్రకాశ్ తరఫు న్యాయవాది వినతిని హైకోర్టు తోసిపుచ్చిన సంగతి తెల్సిందే. ఇది ఇలా ఉంటే అజ్ఞాతంలో ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ విచారణకు హాజరయ్యేందుకు మరో పది రోజులు గడువు కావాలంటూ రెండు రోజుల క్రితం సైబర్ క్రైమ్ పోలీసులకు ఈ మెయిల్ పంపించడం గమనార్హం. ఈ కేసుతో సంబంధం ఉన్న సినీనటుడు శివాజీ కూడా తనకు ఆరోగ్యం సరిగా లేదని మెయిల్ పంపించారు. అయితే వీరిద్దరి ఈ మెయిల్స్‌పై సంతృప్తి చెందని తెలంగాణ పోలీసులు వారు ఎక్కడ ఉన్నా అదుపులోకి తీసుకునేందుకు రంగంలోకి దిగడం గమనార్హం. ఇప్పటికే రెండు పర్యాయాలు రవిప్రకాశ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేసిన సంగతి తెల్సిందే. రవిప్రకాశ్ అరెస్టుకు రంగం సిద్ధమైన తరుణంలో ఆయన్ను కాపాడేందుకు నేరుగా ఏపీ సీఎం చంద్రబాబు పావులు కదుపుతుండటం విమర్శలకు తావిస్తోంది. రవిప్రకాశ్ అరెస్టు కాకుండా చూడటంతో పాటు ఆయనను ఈ కేసు నుంచి తప్పించేందుకు చంద్రబాబు నేరుగా రామోజీరావును కలవడం కలకలం రేపుతోంది. తన రాజగురువు రామోజీరావు ద్వారా టీవీ 9 యాజమాన్యానికి చెందిన రామేశ్వర్‌కు నచ్చజెప్పేలా చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని చెబుతున్నారు. ఇప్పటికీ దొరకని అశోక్ ఆచూకీ.. తెలుగుదేశం పార్టీ సేవామిత్ర యాప్‌ను నిర్వహిస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థ అడ్డగోలుగా డేటా స్కామ్‌కు పాల్పడిన వ్యవ హారంలో ప్రధాన పాత్రధారి ఐటీ గ్రిడ్స్ ఎండీ దాకవరపు అశోక్ ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే ఆంధ్రప్రదేశ్‌లోని పెద్దల బండారం బయట పడుతుందనే భయంతో అతన్ని చంద్రబాబు సర్కారే కాపాడుతోందనే అనుమానాలున్నాయి. ఆధార్ డేటాబేస్కు ఏపీ, తెలంగాణకు ప్రజల 7,82,21,397 రికార్డులు లింక్ అయ్యాయని, ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి, ఇప్పటికే ప్రా«థమిక రిపోర్టు ఇచ్చింది. అశోక్‌ను కాపాడేందుకు ఏపీఎస్పీ 6 బెటా లియన్తోపాటు ఇతర రహస్య ప్రాంతాలకు తరలిస్తూ షెల్టర్ ఇస్తున్నట్టు సమాచారం. అశోక్ తెలంగాణ పోలీసులకు దొరక్కుండా ఏపీ సర్కార్ షెల్టర్ ఇవ్వడంతోపాటు ఇంటె లిజెన్స్‌కు చెందిన ఇద్దరు గన్మెన్లను కూడా ఇచ్చి వీఐపీ భద్రత కల్పించినట్టు ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు. ఓటుకు నోటు కేసులో మత్తయ్యకు షెల్టర్ తెలంగాణలో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఓటుకు కోట్లు వ్యవహారంలో అడ్డంగా దొరికేసిన చంద్రబాబు..ఆ కేసులో నిందితుడిగా ఉన్న టీడీపీకి చెందిన జెరుసలేం మత్తయ్యకు అప్పట్లో విజయవాడలో షెల్టర్ ఇచ్చారు. ఓటుకు కోట్లు కేసును రాజకీయం చేసి దాని నుంచి తప్పించుకునేలా ఏపీలోనూ చంద్రబాబు కేసులు పెట్టించి ప్రత్యేక దర్యాప్తు సంస్థ(సిట్)ను ఏర్పాటు చేసి అది కూడా రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం గమనార్హం. గరుడ పురాణం శివాజీకి దన్ను ఇటీవల బీజేపీ, వైఎస్సార్సీపీలపై అనేక కట్టుకధలు అల్లిన గరుడ పురాణం సృష్టికర్త శివాజీ కొంతకాలం పాటు అజ్ఞాతంలో వెళ్లిపోయి ఎన్నికల సమయంలో ప్రత్యక్షమయ్యారు. చంద్రబాబుకు నమ్మిన బంటులా వ్యవహరిస్తున్న సినీనటుడు శివాజీ గరుడ పురాణం స్క్రిప్ట్ అంతా టీడీపీ పెద్దల కనుసన్నల్లో ఒక మంత్రి సహకారంతో సిద్ధం చేసినట్టు ప్రచారం జరిగింది. రాష్ట్రంలో రాజకీయపరమైన అనిశ్చితిని కల్పించేలా, ప్రతిపక్షం, కేంద్ర ప్రభుత్వంపైన అభూతకల్పనలతో ఆయన చెప్పిన గరుడ పురాణం గుట్టు విప్పేలా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించాలన్న డిమాండ్ రావడంతో ముందు జాగ్రత్తగా ఆయన అదృశ్యమయ్యారు. ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం జరగబోతోందని ముందే చెప్పిన శివాజీ ఆ విషయం ఎలా గుర్తించారు? ఆయనకు టీడీపీ పెద్దలు ముందే లీకులు ఇచ్చి చెప్పించి నెపం వేరొకరిపై నెట్టే ప్రయత్నం చేశారా? అనే అనేక ప్రశ్నలకు ఆయన్ను విచారిస్తేనే జవాబులు తెలుస్తాయనే బలమైన వాదన ఉంది. ఈ నేపథ్యంలోనే విజయవాడలో కొంతకాలం, అమెరికాలో మరికొద్ది రోజులు ఆయన తలదాచుకోవడం వెనుక టీడీపీ పెద్దల దన్ను ఉందనేది బహిరంగ రహస్యం. -
అమ్మను కోల్పోయినా బాధ్యత మరచిపోలేదు
మధ్య ప్రదేశ్‌లోని సత్నా... ఐదో దశలో అక్కడ పోలింగు జరిగింది. అందరిలాగే సత్నా మాజీ కార్పొరేటర్ అశోక్ గుప్తా కుటుంబీకులు కూడా ఓటు వేసేందుకు పోలింగు కేంద్రానికి వెళ్లడానికి సిద్ధపడుతున్నారు.అయితే, అంతలోనే అనుకోని విషాదం... కార్పొరేటర్ తల్లి అకస్మాత్తుగా కన్ను మూసింది. కుటుంబ సభ్యులంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు.ఒకవైపు తల్లి అంత్యక్రియలు నిర్వహించాలి. మరోవైపు ఓటు వేసి రావాలి. అంత్యక్రియలు పూర్తి చేసి వచ్చాక ఓటు వేయడానికి సమయం ఉంటుందో...ఉండదో... అశోక్ గుప్తా కుటుంబ సభ్యులంతా దీనిపై చాలా సేపు మల్లగుల్లాలు పడ్డారు. చివరికి ముందు ఓటు వేసి వచ్చి ఆ తర్వాత అంతిమ యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఒకవైపు ఆ ఏర్పాట్లు చూస్తోంటే ఓటు అర్హత కలిగిన 19 మంది పొద్దున్నే వెళ్లి ఓటు వేసి వచ్చారు. మృతురాలి భర్త కూడా కొడుకు సాయంతో పోలింగు కేంద్రానికి వెళ్లి ఓటు వేసి వచ్చారు.‘ఎన్నికలు ఐదేళ్లకొకసారి వస్తాయి. ఎన్నికల్లో ఓటు వేయడం మన బాధ్యత కాబట్టి ముందు ఓటు వేసి రావాలని నిర్ణయించుకున్నాం’అన్నారు మృతురాలి మనవడు కైలాష్ గుప్తా. ఓటు వేసి వచ్చాక అందరూ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. -
రీ వెరిఫికేషన్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ పట్ల విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందవద్దని ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సూచించారు. రాష్ట్ర ప్రభుత్వ సూచనల ప్రకారం ఇంటర్మీడియెట్‌లో ఫెయిలైన విద్యార్థుల జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ ప్రక్రియ రాష్ట్రంలోని 12 మూల్యాంకన కేంద్రాల్లో జరుగుతోందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. రీ వెరిఫికేషన్‌తో గ్లోబరీనా సంస్థకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత ఆ మార్కులను ఇంటర్ బోర్డుకు పంపిస్తారన్నారు. ఇలా వచ్చిన మార్కులతో ఫలితాల ప్రాసెసింగ్ చేయడానికి త్రిస భ్య కమిటీ సూచనల మేరకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ సంస్థ ద్వారా ‘డేటాటెక్ మెథడెక్స్’అనే ఓ కంప్యూటర్ ఏజెన్సీని ఎంపిక చేశామన్నారు. ఈ సంస్థ, గ్లోబరీనా సంస్థ రెండూ వేర్వేరుగా జవాబు పత్రాల రీ వెరిఫికేషన్ చేపట్టిన తర్వాత వచ్చిన మార్కులతో రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రక్రియను సమాంతరంగా నిర్వహిస్తాయని తెలిపారు. -
సున్నా మార్కుల ఉదంతంలో ఎగ్జామినర్‌పై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పేపర్లో ఓ విద్యార్థినికి 99 మార్కులు రాగా సున్నా మార్కులు వేసిన ఉదంతంలో ఎగ్జామినర్, పర్యవేక్షకుడిపై వేటు పడింది. ఇటీవల విడుదలై తీవ్ర దుమారం లేపిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో బాగా చర్చనీయాంశంగా మారిన వాటిల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన నవ్య అనే యువతికి తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. తాను పరీక్ష బాగా రాసినా, సున్నా మార్కులు రావటమేంటని ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పునర్మూల్యాంకనం చేయగా ఆమెకు 99 మార్కులు వచ్చాయి. దీనిపై బోర్డు అ«ధికారులు విచారణ జరిపారు. ఎగ్జామినర్ బబ్లింగ్ చేసే సమయంలో జరిగిన పొరపాటుగా తేల్చారు. ఎగ్జామినర్ ఉమాదేవి (తెలుగు అధ్యాపకురాలు) 99 మార్కులకుగాను 00గా నమోదు చేసినట్టు గుర్తించారు. దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తూ ఆమెకు రూ.5 వేల జరిమానా విధించగా ఆమె బోర్డుకు చెల్లించారు. శంషాబాద్ ఆర్బీనగర్లోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నందున ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలానగర్ కొత్తూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎస్.విజయకుమార్ స్క్రూటినైజర్ హోదాలో ఉండి ఈ తప్పిదాన్ని గుర్తించలేదు. దీంతో ఆయనను కూడా బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసేందుకు, తదుపరి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు అశోక్ వెల్లడించారు. -
ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్ చేసేప్పుడు ఒకటికి రెండు, మూడుసార్లు చెక్ చేసుకోకుండా ఎలా వెల్లడిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు పనులను ఎలా అప్పగించారని మండిపడ్డారని సమాచారం. దీంతోపాటుగా.. ఆయన్ను రీ–వెరిఫికేషన్ కమ్ ఫొటో స్కాన్డ్ కాపీ, రీ–కౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. తక్కువ కోట్ చేశారన్న సాకుతో నిబంధనలను కూడా సరిగ్గా అమలు చేయకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ 2017–18 విద్యాసంవత్సరంలో వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాసెసింగ్‌ను సరిగా చేసి చూపించనపుడు.. ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తినపుడు సదరు సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, పైగా ఆ సంస్థ ప్రవేశాల ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదని ఆ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించిన సమయంలోనే.. ఆ సంస్థతో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటినుంచి హాల్‌టికెట్ల జనరేషన్, ఆన్లైన్లో ప్రాక్టికల్ మార్కుల అంశం సరిగాచేయలేని సంస్థను ఎందుకు కొనసాగించారని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం పక్కాగా జరిగేందుకు చర్యలు చేపట్టడంతోపాటు అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందం, దాని ప్రకారమే పని చేసిందా? లేదా? అన్న దానిపైనా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు తక్కువ మార్కులు వేయడం, పరీక్షలకు హాజరైనా గైర్హాజరైనట్లు చూపడం వంటివి సాఫ్ట్వేర్ సమస్యల కారణంగానే దొర్లినట్లు స్పష్టమైంది. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనుంది. ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. సందేహాలుంటే డీఐఈవోలను సంప్రదించండి ఆర్వీ, ఆర్సీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్(ఆర్వీ), రీకౌంటింగ్(ఆర్సీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు bie.telangana.gov.in వెబ్సైట్ లేదా టీఎస్ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రీవాల్యుయేషన్‌కు రూ.600, రీకౌంటింగ్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం కోసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. డీఐఈవో హైదరాబాద్–9848781805, డీఐఈవో రంగారెడ్డి– 9848018284, డీఐఈవో మేడ్చల్– 9133338584 లోనూ సంప్రదించవచ్చంది -
బ్లాక్‌స్టోన్ చేతికి ఎస్సెల్ ప్రోప్యాక్
ముంబై: అమెరికన్ ప్రైవేట్ ఈక్విటీ దిగ్గజం బ్లాక్‌స్టోన్ తాజాగా స్పెషాలిటీ ప్యాకేజింగ్ కంపెనీ ఎస్సెల్ ప్రోప్యాక్‌లో మెజారిటీ వాటాలు కొనుగోలు చేయనుంది. ఇందుకోసం సుమారు రూ.3,211 కోట్లు (462 మిలియన్ డాలర్లు) వెచ్చించనుంది. ఎఫ్ఎంసీజీ, ఫార్మా కంపెనీల్లో ఉపయోగించే లామినేటెడ్ ట్యూబ్స్‌ను ఎస్సెల్ ప్రోప్యాక్ తయారుచేస్తోంది. ఈ డీల్ రెండంచెల్లో ఉండనుంది. తొలి దశలో ప్రమోటరు అశోక్ గోయల్ ట్రస్ట్ నుంచి బ్లాక్‌స్టోన్ 51% వాటా కొనుగోలు చేస్తుంది. షేరు ఒక్కింటికి రూ.134 రేటుతో ఈ డీల్ విలువ సుమారు రూ.2,157 కోట్లుగా ఉంటుంది. రెండో దశలో మరో 26% వాటాలను కొనుగోలు చేసేందుకు బ్లాక్‌స్టోన్ ఓపెన్ ఆఫర్ ప్రకటిస్తుంది. ఒక్కో షేరుకి రూ.139.19 చొప్పున ఓపెన్ ఆఫర్ విలువ రూ.1,054 కోట్లుగా ఉంటుందని ఇరు సంస్థలు ఒక ప్రకటనలో తెలిపాయి. 37 ఏళ్ల క్రితం నెలకొల్పిన ఎస్సెల్ ప్రోప్యాక్‌కు 10 దేశాల్లో 20 పైగా ప్లాంట్లు, 3,150 మంది పైగా ఉద్యోగులు ఉన్నారు. ఏటా 700 కోట్ల ల్యామినేటెడ్ ట్యూబ్స్‌ను తయారు చేస్తోంది. ఓపెన్ ఆఫర్ సబ్స్క్రిప్షన్ ఆధారంగా ఎస్సెల్ ప్రోప్యాక్ కొనుగోలు విలువ రూ.2,157 కోట్ల నుంచి రూ. 3,211 కోట్ల దాకా ఉండవచ్చని బ్లాక్‌స్టోన్ సీనియర్ ఎండీ అమిత్ దీక్షిత్ చెప్పారు. ఎస్సెల్ గ్రూప్‌తో సంబంధం లేదు: అశోక్ గోయల్ దాదాపు రూ.17,174 కోట్ల రుణాల భారంతో ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఎస్సెల్ గ్రూప్ ప్రమోటరు సుభాశ్ చంద్ర సోదరుడు అశోక్ గోయల్‌కు చెందినదే ఈ ఎస్సెల్ ప్రోప్యాక్. అశోక్ గోయల్ ట్రస్టుకు ఇందులో 57 శాతం వాటాలుండగా.. అందులో 51 శాతం వాటాలను బ్లాక్‌స్టోన్ కొనుగోలు చేస్తోంది. డీల్ ద్వారా వచ్చిన నిధులను ముంబైలో తాము నిర్వహిస్తున్న అమ్యూజ్మెంట్ పార్క్ ఎస్సెల్ వరల్డ్‌ను, వాటర్ కింగ్డమ్ను అభివృద్ధి చేసేందుకు వెచ్చిస్తామని, మరికొన్ని నిధులను దాతృత్వ కార్యకలాపాలకు ఉపయోగిస్తామని గోయల్ చెప్పారు. సోదరుడు సుభాశ్‌చంద్రకు చెందిన ఎస్సెల్ గ్రూప్ రుణభారం తగ్గించేందుకు ఈ నిధులేమైనా ఉపయోగిస్తారా అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తమ సంస్థ ఎస్సెల్ గ్రూప్‌లో భాగం కాదని.. గోయల్ ట్రస్టుకు గానీ ఎస్సెల్ ప్రోప్యాక్‌కు గానీ దానితో ఎలాంటి వాణిజ్యపరమైన సంబంధాలు లేవని ఆయన తెలిపారు. ‘మాదంతా ఒకే కుటుంబం. ఒకరి బాగోగులు మరొకరు చూసుకుంటూ ఉంటాం. అయితే రెండు గ్రూపుల మధ్య ఆర్థిక, వాణిజ్య సంబంధాలు గానీ క్రాస్ హోల్డింగ్స్ గానీ లేవు‘ అని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఎండీగా ఉన్న అశోక్ గోయల్ ఒప్పందం పూర్తయ్యాక 6 శాతం వాటాలతో కంపెనీలో సలహాదారుగా కొనసాగుతారు. ఇందుకు గాను అయిదేళ్ల పాటు ఏటా రూ.16 కోట్లు అందుకుంటారు. డీల్ నేపథ్యంలో బీఎస్ఈలో సోమవారం ఎస్సెల్ ప్రోప్యాక్ షేరు 0.91 శాతం పెరిగి రూ. 132.65 వద్ద క్లోజయ్యింది. -
ఆపరేషన్ అశోక్ ముమ్మరం
సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో కీలక నిందితుడు ఐటీ గ్రిడ్స్ ఎండీ డాకవరం అశోక్ కోసం సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. తమ డేటా కూడా చోరీ చేశారని ఆధార్ సంస్థ కూడా తాజాగా మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ వేగవంతం చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారిక ‘సేవా మిత్ర’యాప్ కోసం దాన్ని నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఆధార్ సర్వర్ నుంచే సమాచారాన్ని తస్కరించి ఉంటుందన్న అనుమానాలు తీవ్ర చర్చకు దారితీశాయి. తెలుగు రాష్ట్రాలతోపాటు ఉత్తర, దక్షిణాది రాష్ట్రాల ప్రజల ఆధార్ సమాచారం కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉందని సిట్ బృందం గుర్తించింది. అశోక్ కోసం ప్రత్యేక బృందాలు.. గత ఫిబ్రవరి 27 తరువాత అశోక్ ఫోన్ స్విచ్చాఫ్ అయింది. అప్పుడే ఏపీకి పారిపోయిన అతను అక్కడ ఏపీ పెద్దల సంరక్షణలో ఉన్నాడన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే విచారణకు రావాలని పోలీసులు మూడుసార్లు నోటీసులు జారీ చేయడంతో పాటు పత్రికల్లో ప్రకటనలు కూడా ఇచ్చారు. అయినా ఫలితం లేకపోవడంతో సిట్ కొన్ని ప్రత్యేక బృందాలను ఏపీకి, కర్ణాటకకు పంపింది. ఐటీ గ్రిడ్స్ సంస్థలపై దాడులు చేసినప్పుడు పోలీసులు దాదాపు 60 హార్డ్ డిస్క్‌లు, పెన్‌డ్రైవ్‌లు, మెమొరీ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో చాలా వాటిలో సమాచారం డిలీట్ చేసి ఉంది. దాదాపు 40 హార్డ్ డిస్క్‌ల నుంచి ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) సమాచారాన్ని రీట్రైవ్ చేయగలిగింది. తెలంగాణ, ఏపీ ప్రజల ఆధార్ వివరాలు తీసుకున్నట్లు ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు తేల్చడంతో మిగిలిన డిస్క్‌ల్లో ఏముందోనన్న ఉత్కంఠ నెలకొంది. వాటిలో కీలక అంశాలు ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. -
డేటా దొంగలకు ఢిల్లీ లింక్!
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. 2019 ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడేందుకు దీర్ఘకాలిక పన్నాగాన్ని పక్కాగా అమలు చేసినట్లు అధికార వర్గాలు గుర్తించాయి. సీఎం చంద్రబాబు ఢిల్లీ స్థాయిలో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించినట్లు విశ్వసనీయ సమాచారం. అందువల్లే రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల సమాచారాన్ని అంత పక్కాగా తస్కరించగలిగారని అధికార వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. 2015 నుంచే పన్నాగం... 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రజల వ్యక్తిగత సమాచారం మొత్తం టీడీపీ గుప్పిట్లోకి వచ్చేలా 2015లోనే చంద్రబాబు పథక రచన చేశారు. ముందస్తు వ్యూహంతోనే ఆధార్ అథారిటీ ఛైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను రాష్ట్ర ప్రభుత్వ ఈ–గవర్నెన్స్, ఐటీ సలహాదారుగా నియమించడం గమనార్హం. ఇలా జోడు పదవుల్లో ఉండటం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందకు వస్తుందని పలువురు అభ్యంతరం వ్యక్తం చేసినా చంద్రబాబు లెక్క చేయలేదు. టీడీపీ కార్యాలయానికి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు.. రాష్ట్ర ప్రభుత్వం 2016లో ప్రజాసాధికార సర్వే నిర్వహించి ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించింది. దాన్ని రియల్ టైమ్ గుడ్ గవర్నెన్స్(ఆర్టీజీఎస్) ద్వారా టీడీపీకి అనుబంధంగా పని చేస్తున్న ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరవేసింది. సాధికారిక సర్వేలో సేకరించిన సమాచారాన్ని మించి ప్రజల వ్యక్తిగత వివరాలు తమ గుప్పిట్లో పెట్టుకోవడం ద్వారా 2019 ఎన్నికల్లో ఓటరు జాబితాలో అక్రమాలకు పాల్పడేందుకు వ్యూహం రచించింది. తెలంగాణ ప్రజల సమాచారం ఏపీ ప్రభుత్వం వద్ద లేకపోవడంతో ఏకంగా ఆధార్ అథారిటీ నుంచే కథ నడిపించాలని చంద్రబాబు నిర్ణయించారు. అనుకున్న విధంగానే ఢిల్లీలోని ఆధార్ అథారిటీ నుంచి టీడీపీకి పూర్తి స్థాయిలో సహకారం లభించినట్లు సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గుట్టుచప్పుడు కాకుండా టీడీపీకి చేరవేశారు. పేర్లు, చిరునామా, బ్యాంకు ఖాతాలు, ఓటరు కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డ్, కుటుంబ సభ్యుల వివరాలు ఇలా మొత్తం వ్యక్తిగత సమాచారం అనధికారికంగా టీడీపీ కార్యాలయానికి చేరిపోయింది. సైబర్ నేరాలకు ఊతం తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత సమాచారం నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు సంస్థలకు చేరడంపై దేశవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. వీరిలో శాస్త్రవేత్తలు, రక్షణ పరిశోధనా సంస్థలు, త్రివిధ దళాల అధికారులు, సిబ్బంది వివరాలు కూడా ఉండటంతో ఈ వ్యవహారం అత్యంత సున్నితంగా మారింది. ఇది సైబర్ నేరాలకు ఊతమివ్వడంతోపాటు దేశ రక్షణకు ప్రమాదకరంగా మారిందని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. శత్రు దేశాలకు ఈ సమాచారం చేరితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయనే ఆందోళన వ్యక్తమవుతోంది. మంత్రి లోకేష్‌తో అశోక్ (ఫైల్) ఇంటి దొంగల హస్తం! ప్రజల వ్యక్తిగత సమాచారం అనధికారిక వ్యక్తుల చేతికి చిక్కడం అంటే పార్లమెంటులో చేసిన ఆధార్ చట్టాన్ని ఉల్లంఘించడమే అవుతుంది. ఆధార్ సమాచారం బయటకు పొక్కడంపై ఇప్పటికే సుప్రీం కోర్టులో పలు వ్యాజ్యాలు విచారణలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ అథారిటీ రంగంలోకి దిగి కోట్ల మంది వ్యక్తిగత వివరాలు ప్రైవేట్ సంస్థల చేతుల్లోకి ఎలా వెళ్లాయనే అంశాన్ని నిశితంగా పరిశీలిస్తోంది. దీని వెనుక ఇంటి దొంగల హస్తం ఉండవచ్చని అంచనా వేస్తోంది. ఇందుకు బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ఆధార్ అథారిటీ డేటా చోరీపై ఇటీవల హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు అంతర్గత విచారణ కూడా చేపట్టినట్లు తెలుస్తోంది. దర్యాప్తు వేగవంతం.. డేటా చోరీపై తెలంగాణా పోలీసుల దర్యాప్తుతోపాటు ఆధార్ అథారిటీ అంతర్గత విచారణ కూడా ముమ్మరంగా సాగుతోంది. దోషులను గుర్తించి కఠినంగా శిక్షించాలని కేంద్ర హోంశాఖ పట్టుదలతో ఉంది. కొద్ది రోజుల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆధార్ అథారిటీ, పోలీసు వర్గాలు అంచనా వేస్తున్నాయి. డేటా తస్కరించిన పార్టీపై కఠిన చర్యలు తీసుకోవాలి – ఈఏఎస్ శర్మ,, కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి తెలుగు రాష్ట్రాల్లోని 7.82 కోట్ల మంది వ్యక్తిగత సమాచారం ఐటీ గ్రిడ్స్ సంస్థకు చేరడం వెనుక ఆధార్ అథారిటీ పెద్దల పాత్ర కచ్చితంగా ఉంటుందని కేంద్ర ఇంధన శాఖ రిటైర్డ్ కార్యదర్శి ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఆధార్ అథారిటీ అధికారుల పాత్ర లేకుండా కీలక సమాచారం అనధికారిక వ్యక్తుల చేతుల్లోకి చేరడం అసంభవమని అభిప్రాయపడ్డారు. ఈమేరకు ఆయన కేంద్ర ఐటీ శాఖకు ఓ లేఖ రాశారు. ఆధార్ అథారిటీ చైర్మన్‌గా ఉన్న జె.సత్యనారాయణను ఏపీ ప్రభుత్వ ఐటీ సలహాదారుగా నియమించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తాను గతంలోనే కేంద్ర ఐటీ శాఖకు లేఖ రాసినట్లు గుర్తు చేశారు. అయినప్పటికీ సత్యనారాయణ నియామకాన్ని పునఃసమీక్షించకపోవడాన్ని తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్స్‌తోపాటు ఆధార్ అథారిటీ అధికారుల పాత్రపైనా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించిన రాజకీయ పార్టీపై కేంద్ర ఎన్నికల సంఘం, ఆధార్ అథారిటీ కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మా సర్వర్లు భద్రం: యూఐడీఏఐ తమ సర్వర్లు పూర్తి భద్రంగానే ఉన్నాయని ఆధార్ విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యూఐడీఏఐ బుధవారం ‘పీటీఐ’ వార్తా సంస్థకు విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. సెంట్రల్ ఐడెంటిటీస్ డేటా రిపోసిటరీ (సీఐడీఆర్), ఇతర సర్వర్లు సురక్షితంగానే ఉన్నాయని తెలిపింది. తమ సర్వర్ల నుంచి ఎలాంటి డేటా చౌర్యానికి గురి కాలేదని అందులో పేర్కొంది. ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు టీడీపీ సర్కార్ షెల్టర్ డేటా చోరీ కేసులో టీడీపీ సేవామిత్ర యాప్‌ను నిర్వహించే ఐటీ గ్రిడ్స్ సంస్థపై ఉచ్చు బిగుస్తోంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ప్రక్రియ ముగియడంతో డేటా చోరీ కేసులో దర్యాప్తును తెలంగాణ పోలీసులు ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ ఎండీ డి.అశోక్ కుమార్‌తోపాటు తెరవెనుక సూత్రధారులపై తెలంగాణ సిట్ దృష్టి సారించింది. ఆధార్‌తోపాటు మరో 17 రకాల వ్యక్తిగత సమాచారం చోరీకి గురైనట్లు కొద్ది రోజుల క్రితం ఆధార్ అథారిటీ డిప్యూటీ డైరెక్టర్ భవానీప్రసాద్ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధార్‌తోపాటు ప్రజల వ్యక్తిగత సమాచారం కూడా చోరీకి గురైనట్టు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) నిగ్గు తేల్చి ఇప్పటికే ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఈ నేపథ్యంలో పక్కా ఆధారాలతో అశోక్ కోసం తెలంగాణ పోలీసులు అన్వేషిస్తున్నారు. ఇప్పటికే మూడు సార్లు నోటీసులు ఇచ్చినా అశోక్ లొంగిపోకపోవడంతో అరెస్టు చేసేందుకు రంగం సిద్ధమైంది. అశోక్‌తోపాటు ఆయనకు సహకరించిన మరికొంత మందిని కూడా అరెస్టు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. ఏబీ పర్యవేక్షణలోనే ఆశ్రయం! మరోవైపు అశోక్ తెలంగాణ పోలీసులకు చిక్కితే తమ బండారం బయటపడుతుందనే భయంతో ఆయన్ను టీడీపీ సర్కారే కాపాడుతోందనే అనుమానాలు బలపడుతున్నాయి. ప్రభుత్వం వద్ద ఉండాల్సిన ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తమ రాజకీయ ప్రయోజనాల కోసం సేవామిత్ర యాప్ కోసం తరలించి ముఖ్యమంత్రి చంద్రబాబు, ఐటీ మంత్రి లోకేశ్ దోషులుగా నిలబడే పరిస్థితి రావడంతో అశోక్‌ను రహస్య ప్రదేశంలో దాచినట్లు చెబుతున్నారు. ఎన్నికల ముందు వరకు ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న ఏబీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలోనే అశోక్‌కు ప్రభుత్వం షెల్టర్ ఇచ్చినట్టు ఆరోపణలున్నాయి. సీఎం సామాజిక వర్గానికి చెందిన విజయవాడ వ్యక్తి మేఘాలయ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్‌గా ఉండటంతో ఆయన పర్యవేక్షణలో తొలుత అశోక్‌ను ఉంచినట్టు ప్రచారం జరిగింది. అనంతరం విజయవాడ గొల్లపూడిలోని ఇంటెలిజెన్స్ అతిధిగృహంలో అశోక్‌ను పోలీసుల రక్షణ నడుమ కొద్ది రోజులు దాచినట్టు తెలిసింది. తరువాత ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో అశోక్‌కు షెల్టర్ ఇచ్చినట్టు పోలీసు వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తరువాత నిఘా చీఫ్‌గా ఏబీ వెంకటేశ్వరరావును తప్పించినా చంద్రబాబు కోసం అశోక్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని షెల్టర్ ఇచ్చినట్లు చర్చ జరుగుతోంది. పోలింగ్‌కు ముందు రోజు సేవామిత్రతో సూచనలు డేటా స్కామ్ బయట పడిన మరుక్షణమే మూసివేసిన టీడీపీ సేవామిత్ర యాప్‌ను పోలింగ్‌కు ఒక రోజు ముందు మళ్లీ పని చేయించడం గమనార్హం. టీడీపీ కార్యకర్తలు, బూత్ కన్వీనర్లకు ఓటింగ్‌పై సూచనలు ఇచ్చేందుకు సేవామిత్ర యాప్‌ను వినియోగంలోకి తెచ్చారు. అజ్ఞాతంలో ఉన్న అశోక్ డైరెక్షన్లోనే మళ్లీ సేవామిత్ర యాప్ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలంగాణ పోలీసు వర్గాలు అనుమానిస్తున్నాయి. గత నాలుగు రోజులుగా అశోక్‌ను ఎక్కడకు తరలించారనే అంశంపై తెలంగాణ పోలీసు ప్రత్యేక బృందాలు దృష్టి సారించినట్టు తెలిసింది. ఈ కేసులో కీలకంగా మారిన అశోక్ ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, ఆయన స్వచ్ఛందంగా లొంగిపోతే మంచిదనే చర్చ ఏపీ పోలీసు వర్గాల్లోనే జరుగుతోంది. ఇతర రాష్ట్రాల డేటా సైతం చోరీ సాక్షి, హైదరాబాద్: డేటా చౌర్యం కేసులో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) ఇచ్చిన నివేదికలో ఏపీ, తెలంగాణతోపాటు ఇతర రాష్ట్రాల ఆధార్ వివరాలు కూడా ఉన్నట్లు తెలంగాణ సిట్ బృందం గుర్తించింది. దీంతో ఇన్నాళ్లూ భావించినట్లుగా ఇది కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన డేటా కూడా ఉండటంతో కేసు మరింత తీవ్రరూపం దాల్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నేరస్థుల గాలింపు కోసం పలు జాతీయ దర్యాప్తు సంస్థలు ఆధార్ వివరాలు కోరినా యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (యూఐడీఏఐ) అంగీకరించలేదు. నేషనల్ క్రైమ్ బ్యూరో ఆఫ్ రికార్డ్స్ (ఎన్సీఆర్బీ) కూడా దాదాపుగా ఇలాంటి విజ్ఞప్తే చేసినా నిరాకరించింది. ఆధార్ సెక్షన్ 29 ప్రకారం పౌరుల వేలిముద్రలు, వ్యక్తిగత వివరాలు ఇవ్వడం సాధ్యం కాదని తేల్చిచెప్పింది. జాతీయ భద్రతకు ముప్పు వాటిల్లే అత్యంత అరుదైన కేసుల్లో సెక్షన్ 33 ప్రకారం మాత్రమే పరిమిత సమాచారం ఇస్తామని పేర్కొంది. -
డేటా చోర్‌పై నిఘా?
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాల ప్రజల వ్యక్తిగత డేటా చోరీలో కీలక సూత్రధారిగా ఉన్న డాకవరం అశోక్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటన వెలుగు చూసిన రెండు నెలల నుంచి అతను అజ్ఞాతంలోనే ఉన్న విషయం తెలిసిందే. తెలంగాణ సిట్ బృందం అశోక్ జాడను గుర్తించడం కోసం రంగంలోకి టీమ్‌లు దింపిన క్రమంలో అతని స్వస్థలం అల్లూరులో మళ్లీ అలజడి రేగింది. అశోక్ జిల్లాకు చెందిన వ్యక్తి కావడంతో అతని మూలాలపై జిల్లాలో చర్చ సాగుతోంది. అనతి కాలంలలో బడా వ్యక్తిగా ఎదగడం వెనుక రాజకీయంగా జిల్లాలో ఎవరి సహకారం ఉంది. స్థానికంగా సహకరిస్తున్నది ఎవరనే దానిపై జిల్లా రాజకీయాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల ప్రజల ఆధార్ కార్డులతో పాటు వ్యక్తిగత డేటా చోరీ చేసిన డాకవరం అశోక్ కావలి నియోజకవర్గం అల్లూరుకు చెందిన వ్యక్తి. సాధారణ రైతు కుటుంబం నుంచి అనతి కాలంలోనే రూ.కోట్లకు పడగలెత్తాడు. ముఖ్యంగా అశోక్ ఆర్థికంగా స్థిరపడిన తర్వాత జిల్లాలో పొలాలు భారీగా కొనుగోలు చేశాడు. అశోక్ తల్లిదండ్రులు, కుటుంబ నేపథ్యం, బీద సోదరులతో ఉన్న సంబంధాలు తదితర అంశాలపై చర్చ సాగుతోంది. రాష్ట్రంలోని ఓటర్ల ఆధార్ డేటాతో పాటు వ్యక్తిగత వివరాల డేటాను నిబంధనలకు విరుద్ధంగా వాడుకున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా లిమిటెడ్ తస్కరించిదనితెలంగాణ సిట్ బృందం నిర్ధారించి కేసు నమోదు చేశారు. దాదాపు రెండు నెలల క్రితం కేసు నమోదైంది. ఎన్నికల నోటిఫికేషన్ రావడ, ఎన్నికల ప్రక్రియ జరగటంతో పోలీసులు కేసును పక్కన పెట్టారు. తాజాగా ఎన్నికలు ముగిసిపోవడంతో ఆధార్ డేటా వ్యవహారం తెరపైకి రావడంతో అశోక్ కోసం అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా అశోక్ గడిచిన నాలుగు నెలల కాలంలో జిల్లాకు వచ్చారా? అనే దానిపై పోలీసుల నుంచి ప్రాథమిక సమాచారం సేకరించినట్లు సమాచారం. వాస్తవంగా గతంలో అశోక్ ఏటా మూడు నాలుగు సార్లు అల్లూరుకు వచ్చి వెళ్తుండేవాడు. గడిచిన నాలుగు నెలలుగా జిల్లాకు రాలేదని ప్రాథకంగా నిర్ధారించారు. అల్లూరులో అశోక్ బంధువులు, సన్నిహితులు ఎవరున్నారనే దానిపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. బీద టూ నారా లోకేష్ అల్లూరు మండలం ఇస్కపల్లికి చెందిన బీద సోదరుల సహకారంతో సీఎం తనయుడు, మంత్రి నారా లోకేష్‌కు అశోక్ సన్నిహితుడుగా మారాడు. టీడీపీకి సంబంధించిన సేవా మిత్ర యాప్‌ను అశోక్ సంస్థే రూపొందించింది. అల్లూరుకు చెందిన డాకవరం బుజ్జయ్య కుమారుడు అశోక్. కాంగ్రెస్ పార్టీ నుంచి సర్పంచ్‌గా గెలిచిన బుజ్జయ్య మండలంలో ఉప్పు సాగు చేసే సాధారణ రైతు. ఆర్థికంగా నష్టపోయాడు. ఈక్రమంలో బుజ్జయ్య కుమారుడు అశోక్ కు టీడీపీ నాయకులైన బీద మస్తాన్‌రావు, బీద రవిచంద్రతో సంబంధాలు ఏర్పడ్డాయి. దీంతో బుజ్జయ్య కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరాడు. అశోక్ అల్లూరులో ఇంటర్మీడియట్, కర్ణాటకలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. కొత్త టెక్నాలజీ పేరుతో బీద రవిచంద్ర ద్వారా సీఎం చంద్రబాబునాయుడ్ని, ఆయన కుమారుడు లోకేష్‌ను కలిశారు. తద్వారా కొద్ది నెలలకే వారికి సొంత మనిషిగా మారిపోయాడు. దీనికి టీడీపీ నేతలుగా ఉన్న బీద సోదరులు వారధిగా నిలిచారు. పదేళ్ల క్రితం హైదరాబాద్‌లోని మాదాపూర్ అయ్యప్ప సొసైటీలో ‘ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్’ అనే సంస్థను ప్రారంభించాడు. లోకేష్ మంత్రిత్వ శాఖలోని విభాగాలకు సంబంధించి సాంకేతిక సహకారం అందించే యాప్‌లను కూడా ఇదే సంస్థ డెవలప్ చేసింది. ప్రధానంగా ఏపీ ప్రభుత్వ యాప్, పంచాయతీరాజ్ విభాగం, డ్రిప్ ఇరిగేషన్, గ్రామీణ నీటిసరఫరా, పారిశుధ్య విభాగం తదితర ప్రభుత్వ వైబ్‌సైట్లతో పాటు వాటికి సంబంధించి సాంకేతిక సహకారం వీరే అందిస్తున్నారు. అందులో భాగంగానే టీడీపీకి ‘సేవామిత్ర’ అనే యాప్‌ను తయారు చేసి, ఈ యాప్‌ను టీడీపీ నాయకుల వద్ద ఉన్న మొబైల్ ఫోన్లలో పని చేసే విధంగా సాంకేతికతను తయారు చేశారు. -
డేటా దొంగ ఎక్కడ?
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో తీవ్ర సంచలనం సృష్టించిన ప్రజల వ్యక్తిగత డేటా, ఆధార్ వివరాల చౌర్యం కేసులో మళ్లీ కదలిక వచ్చింది. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లోనూ ఎన్నికలు ముగియడం, ఈ కేసులో అదనంగా ఆధార్ కేసు కూడా తోడవడంతో నేరం తీవ్రత మరింత పెరిగింది. అశోక్‌ను అరెస్టు చేసేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ప్రణాళిక కూడా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటికే పలు రకాల వ్యూహాలను సిద్ధం చేసుకున్న సిట్... న్యాయస్థానం ఆదేశాలతోనే ముందుకు వెళ్లాలన్న యోచనలో ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ యాప్ ‘సేవామిత్ర’ను రూపొందించిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పౌరుల డేటా చోరీ చేసేలా ఏపీ ప్రభుత్వం వీలు కల్పించడం తెలిసిందే. అరెస్టుకు సరిపడా ఆధారాలు.. ఈ కేసులో సిట్ అధికారులు పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్‌సంస్థ అధినేత దాకవరం అశోక్ అరెస్టుకు సరిపడా సాక్ష్యాలు, ఆధారాలు సేకరించారు. పలుమార్లు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసినా.. అశోక్ అజ్ఞాతం వీడటం లేదు. పైగా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం పాత్ర స్పష్టంగా కనిపిస్తుండటం, సాక్షాత్తూ ప్రభుత్వ పెద్దలే నిందితుడిని వెనకేసుకు రావడంతో ఇది రెండు రాష్ట్రాల మధ్య వివాదంగా మారింది. అప్పట్లో అశోక్‌ను అరెస్టు చేసేందుకు సిట్ అధికారులు ప్రయత్నించారు. విజయవాడ, నెల్లూరులో అశోక్ ఉన్నట్లు సమాచారం కూడా అందింది. నిందితులెవరైనా వదిలిపెట్టబోమని, న్యాయస్థానం ముందు ప్రవేశపెడతామని సిట్ చీఫ్ ఐజీ స్టీఫెన్ రవీంద్ర వ్యాఖ్యానించడంతో అశోక్ అరెçస్టు తప్పదన్న వాదనలు బలపడ్డాయి. అదే సమయంలో లోక్‌సభ ఎన్నికల కోడ్ రావడంతో ఇంతకాలం ఈ కేసు కాస్త నెమ్మదించింది. ఇప్పుడు ఆధార్ ఫిర్యాదుతో మళ్లీ సిట్ దర్యాప్తు వేగం పుంజుకుంది. రాజకీయ కారణాలతోనే ఆగుతున్నారా? ఈ కేసులో నిందితుడికి ఏపీ ప్రభుత్వ పెద్దలు ఆశ్రయమిస్తున్నారంటూ ప్రచారం జరగడం సమస్యగా మారింది. అశోక్ ఆచూకీ తెలిసినా అతన్ని అరెస్టు చేయడానికి తెలంగాణ సిట్ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారని సమాచారం. ఇంకొన్ని రోజులు వేచి చూసి న్యాయస్థానం ద్వారానే అశోక్‌ను పట్టుకోవాలన్నది సిట్ యోచనగా తెలుస్తోంది. వారి జాప్యానికి రాజకీయ పరిణామాలు కూడా కారణమన్న వాదనలు వినిపిస్తున్నాయి. గతంలో ఓటుకు కోట్లు కేసులోనూ నిందితులను వెనకేసుకొచ్చిన సీఎం చంద్రబాబు, అతని కుమారుడు లోకేశ్‌లు ఈ కేసులోనూ అదే తరహాలో వ్యవహరిస్తుండటం గమనార్హం. లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడు..! మొదటి నుంచి ఏపీ మంత్రి లోకేశ్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్రపడ్డ అశోక్... ఆ సాన్నిహిత్యంతోనే పార్టీ కార్యక్రమాల నిర్వహణ దక్కించుకున్నాడని సమాచారం. సేవామిత్ర యాప్‌లో సర్వే కోసం ఉపయోగించిన ప్రతి అంశం ఎలాగైనా తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొచ్చేలా ఉందన్న ఆరోపణలు ముమ్మరమయ్యాయి. చంద్రబాబు, లోకేశ్‌లతో ఉన్న పరిచయాల కారణంగానే ప్రభుత్వం... సంక్షేమ పథకాల లబ్ధిదారుల జాబితా, ఆధార్ సమాచారం, ఓటరు లిస్టు తదితరాలు అశోక్‌కు యాక్సెస్ చేసుకునే వీలు కల్పించిందన్న విషయాన్ని ఈ పరిణామాలు రుజువు చేస్తున్నాయి. ఐటీ గ్రిడ్స్కే పరిమితమా..? ఈ కేసులో అత్యంత గోప్యంగా ఉండాల్సిన పౌరుల వ్యక్తిగత సమాచారం వివరాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించడం ఆధార్ సెక్షన్ల ప్రకారం నేరం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విషయం కాదు. తెలంగాణ రాష్ట్ర పౌరుల ఆధార్ డేటా కూడా ఐటీ గ్రిడ్స్ వద్ద ఉండటంతో ఇది జాతీయస్థాయిలో చర్చకు దారితీసింది. గోప్యతను భద్రంగా ఉంచాల్సిన ప్రభుత్వాలే ఇలా ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తే వ్యక్తిగత సమాచారానికి రక్షణ ఎక్కడని పలువురు వాపోతున్నారు. ఒకవేళ ఈ డేటా శత్రు దేశాల చేతిలో పడితే అది దేశ భద్రతకే ముప్పు అని యూఐడీఐఏ ఆందోళన వ్యక్తం చేసింది. ఐటీ గ్రిడ్స్ దాదాపు రెండు రాష్ట్రాలకు చెందిన 7 కోట్ల మందికిపైగా సమాచారం సేకరించి ఆమెజాన్ క్లౌడ్ స్టోరేజీలో దాచింది. ఐటీ గ్రిడ్స్ డేటా చౌర్యానికి పాల్పడిన విషయం వాస్తవమేనని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ (ఎఫ్ఎస్ఎల్) కూడా ధ్రువీకరించింది. ఇప్పుడు ఈ డేటా ఐటీ గ్రిడ్స్ కంపెనీ నుంచి ఇంకెక్కడికైనా లీక్ అయిందా? ఎవరితోనైనా షేర్ చేసుకున్నారా? అన్న విషయాలపైనా సిట్ అధికారులు దృష్టి సారించారు. దేశ పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని విదేశాలకు చెందిన క్లౌడ్ కంపెనీలో స్టోర్ చేయడం చట్ట విరుద్ధం. ఇది జాతీయ భద్రతకు పెనుముప్పుగా పరిణమించే ప్రమాదం ఉండటంతో అధికారులు ఈ కేసును సీరియస్‌గా తీసుకున్నారు. -
పిస్టోలు దొంగ
అశోక్ పోలీస్ స్టేషన్లోకి అడుగుపెడుతూనే ఇన్స్పెక్టర్ విజయ్‌కి నమస్కరిస్తూ, ‘‘సార్! నిన్న రాత్రి నా ఇంట్లో దొంగతనం జరిగింది’’ అన్నాడు.‘‘వివరంగా చెప్పండి’’ కుర్చీ చూపిస్తూ అన్నాడు విజయ్. అశోక్ కుర్చీలో కూర్చున్నాడు. ‘‘నా పేరు అశోక్ కుమార్. ఆర్మీలో పనిచేసి ఏడాది కిందటే రిటైరయ్యాను. ప్రస్తుతం స్టేట్‌బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాను. నిన్న రాత్రి నేను నైట్ డ్యూటీలో ఉన్నాను. నా ఇల్లు గుండమ్మ కాలనీలో ఉంది. ఇంట్లో నా భార్య, పదేళ్ల కొడుకు రాజు మాత్రమే ఉన్నారు. రాత్రిపూట ఎవడో దొంగ మా పెరట్లోని చెట్టెక్కి మేడపై ఉన్న గదిలోకి దూరాడు. నా భార్య, కొడుకు కింద ఉన్న బెడ్ రూమ్‌లో పడుకోవడం వల్ల దొంగ సునాయాసంగా గదిలోని బీరువా తాళం పగలగొట్టి, అందులో ఉన్న నాలుగు తులాల బంగారం, పదివేల నగదు దోచుకున్నాడు. వాటితో పాటు బీరువాలోనే ఉన్న నా పిస్తోలును కూడా తీసుకెళ్లాడు’’ అని బాధగా చెప్పాడు. ‘‘మీ పిస్తోలుకు లైసెన్స్ ఉందా?’’ అడిగాడు విజయ్.‘‘ఉంది. తీవ్రవాదుల నుంచి ఆత్మరక్షణ కోసం ప్రభుత్వం ఇచ్చిన పిస్తోలు అది’’ అంటూ అశోక్ జేబులోంచి లైసెన్స్ తీసి చూపించాడు. ‘‘ముందుగా దొంగతనం జరిగిన మీ ఇంటిని పరిశీలిద్దాం. పదండి’’ అంటూ లేచాడు.కాసేపట్లోనే విజయ్ ఇన్వెస్టిగేషన్ టీమ్‌తో అశోక్ ఇంటికి చేరుకున్నాడు. ఆ ఇల్లు కాలనీ చివర్లో ఉంది. పెరట్లోని వేపచెట్టు కొమ్మ బాల్కనీ పక్క నుంచి వెళ్లింది. ఆ కొమ్మ పైనుంచి దొంగ మేడ మీదకు చేరుకున్నాడని విజయ్ గ్రహించాడు. మేడ మీది గదిలో తాళం పగులగొట్టి బీరువా తెరిచిన గుర్తులు ఉన్నాయి. బీరువాలోని సామానంతా నేల మీద చెల్లాచెదురుగా పడి ఉంది. ఫోరెన్సిక్ నిపుణులు బీరువా మీద ఉన్న వేలిముద్రలను సేకరించారు.అశోక్ భార్య మాలతిని, కొడుకును ఇన్స్పెక్టర్ విజయ్ ప్రశ్నించాడు. మాలతి జరిగినదంతా వివరించింది. ‘‘మా ఆయన ఇంట్లో లేకపోవడంతో నేను, రాజు కింద హాల్లోనే పడుకున్నాం. ఉదయం నిద్ర లేచాక రాజు ఆడుకోవడానికి మేడ మీదకు వెళ్లాడు. అప్పుడే దొంగతనం జరిగిన విషయం తెలిసింది. నేను వెంటనే మా ఆయనకు ఫోన్ చేసి విషయం చెప్పాను. ఏమేం పోయాయో చూశాక ఆయన మీ దగ్గరకొచ్చారు’’ అంది. సంఘటనా స్థలంలో ఫోరెన్సిక్ నిపుణులు సేకరించిన వేలిముద్రల్లో అశోక్ కుటుంబ సభ్యుల వేలిముద్రలతో పాటు ఒక కొత్త వ్యక్తి వేలిముద్రలు కూడా ఉన్నాయి. అవి దొంగ వేలిముద్రలని గ్రహించాడు విజయ్.కానీ ఆ వేలిముద్రలు పోలీసు రికార్డుల్లో లేకపోవడంతో అతని పరిశోధన ముందుకు సాగలేదు. గుండమ్మ కాలనీకి దగ్గర్లో ఒక మురికివాడ ఉంది. అక్కడ నివసించే నాగరాజు అనే తాగుబోతు చిన్న చిన్న దొంగతనాలు చేస్తుంటాడని ఇన్ఫార్మర్ల ద్వారా విజయ్‌కి తెలిసింది. వెంటనే అనుమానంతో నాగరాజును అదుపులోకి తీసుకున్నాడు. థర్డ్ డిగ్రీ ప్రయోగించాడు. ఎంత కొట్టినా నాగరాజు అశోక్ ఇంట్లో దొంగతనం చెయ్యలేదనే వాదించాడు. పైగా అతని వేలిముద్రలు కూడా సంఘటనా స్థలంలో లభించిన వేలిముద్రలతో మ్యాచ్ కాలేదు. చేసేదిలేక నాగరాజును విజయ్ వదిలేశాడు.మరుసటి రోజు ఒక అనూహ్య సంఘటన జరిగింది. అశోక్ కొడుకు రాజు చదివే మిల్టన్ ప్రైవేట్ స్కూల్లో ఒక హత్య జరిగింది. మ్యాథ్స్ టీచర్ అయిన రంగారావుని ఎవరో అతి దగ్గర నుంచి పిస్తోల్‌తో కాల్చి చంపారు. ఇంటర్వెల్ సమయంలో పిల్లలు, టీచర్లు అంతా స్కూలు బయట ఉన్నప్పుడు ఈ హత్య జరిగింది. అప్పుడు రంగారావు స్టాఫ్రూములో ఒంటరిగా ఉన్నాడు. తూటా నేరుగా ఛాతీలోకి దూసుకుపోవడంతో అతను కూర్చున్న కుర్చీలోనే ప్రాణం వదిలాడు. హంతకుణ్ణి ఎవరూ చూడలేదు. ఇన్స్పెక్టర్ విజయ్ స్కూల్లోని టీచర్లు, విద్యార్థులను ప్రశ్నించాడు. రంగారావు శత్రువుల గురించి కూపీ లాగాడు. రంగారావు స్వభావరీత్యా కోపిష్టి అని, విద్యార్థులతో పాటు సహోద్యోగులపై కూడా తరచుగా చిర్రుబుర్రులాడే వాడని తెలిసింది. రెండు రోజుల కిందటే అతను ప్యూన్ గోవిందును అందరి ముందూ చెడామడా తిట్టాడని కొందరు చెప్పారు. విజయ్‌కి గోవిందుపై అనుమానం కలిగింది. అతడే అశోక్ ఇంట్లో దొంగతనం చేసి ఉండవచ్చని, అక్కడ దొంగిలించిన పిస్తోలుతోనే రంగారావుని ఉండవచ్చని అనుకున్నాడు. వెంటనే గోవిందును అదుపులోకి తీసుకుని, థర్డ్‌డిగ్రీ ప్రయోగించాడు. ఎంత బలప్రయోగం చేసినా, తాను నిర్దోషినని వాదించాడు గోవిందు. అతని వేలిముద్రలు కూడా అశోక్ ఇంట్లో లభించిన వేలిముద్రలతో మ్యాచ్ కాలేదు. గోవిందు ఇంకా కస్టడీలో ఉండగానే మరో హత్య జరిగింది. ఈసారి హత్యకు గురైనదెవరో కాదు, తాగుబోతు నాగరాజు. అతను ఒంటరిగా వెళుతున్నప్పుడు ఎవరో అతన్ని పిస్తోలుతో కాల్చి చంపారు. ఈసారి కూడా హంతకుణ్ణి ఎవరూ చూడలేదు.ఫోరెన్సిక్ రిపోర్టుల ప్రకారం నాగరాజు, రంగారావుల చావుకు కారణమైన బుల్లెట్లు ఒకే పిస్తోలు నుంచి వెలువడ్డాయి. ఆ పిస్తోలు అశోక్ ఇంట్లో చోరీ అయిన పిస్తోలే అని విజయ్‌కి అర్థమైంది. ఇంకో హత్య జరగక ముందే హంతకుణ్ణి పట్టుకోవాలనుకున్నాడు. అశోక్ ఇంట్లో దొంగతనం జరిగిన రోజే విజయ్ నగరంలోని పాత బంగారు నగలు కొనే వ్యాపాస్తులందరికీ చోరీ అయిన నగల వివరాలు అందించాడు. త్వరలోనే దాని ఫలితం కనిపించింది. వీరేష్ అనే చిల్లరదొంగ ఆ నగలు అమ్మబోతూ పట్టుబడ్డాడు. అతని వేలి ముద్రలు కూడా అశోక్ ఇంట్లో లభించిన వేలిముద్రలతో సరిపోయాయి. దాంతో జంట హత్యల మిస్టరీ కూడా విడిపోతుందనుకున్నాడు ఇన్స్పెక్టర్ విజయ్.కానీ వీరేష్ దొంగతనం నేరం ఒప్పుకున్నాడు గానీ, హత్యల గురించి తనకు తెలియదన్నాడు. అశోక్ ఇంటి బీరువాలోని డబ్బు, నగలు మాత్రమే తీసుకుని, పిస్తోలును అక్కడే వదిలేశానన్నాడు. ఎంత బలప్రయోగం చేసినా వీరేష్ పోలీసులకు ఇదే స్టేట్మెంట్ ఇచ్చాడు. కథ మళ్లీ మొదటికొచ్చింది. దొంగ దొరికినా హంతకుడు దొరకలేదు. అశోక్ పిస్తోలును ఎవరు దొంగిలించారు? ఈ హత్యలెందుకు చేస్తున్నారు? ఇన్స్పెక్టర్ విజయ్‌కి ఏమీ అంతుబట్టలేదు.రాత్రి ఎనిమిది గంటలకు పోలీస్ స్టేషన్లో ఫోన్ మోగింది. విజయ్ ఫోనెత్తాడు. అవతల అశోక్ కంగారుగా చెప్పాడు. ‘‘సార్, నేను బాత్రూంలో ఉన్నప్పుడు హఠాత్తుగా మా ఇంటి వెనుక వైపు పిస్తోలు పేలిన శబ్దం వినిపించింది. నేను వెంటనే అక్కడకు వెళ్లి చూస్తే ఒక పిచ్చికుక్క చచ్చి పడి ఉంది. ఎవరో దాన్ని కాల్చి చంపారు. అది నా పిస్తోలు కావచ్చు. పిస్తోలు పేల్చిన వ్యక్తి మా వీధి దాటి పోలేదు. ఏదో ఒక ఇంట్లో దాక్కుని ఉంటాడని నా అనుమానం. మీరు వెంటనే ఇక్కడికొస్తే వాణ్ణి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవచ్చు’’ అన్నాడు అశోక్.విజయ్ ఆగమేఘాల మీద గుండమ్మ కాలనీకి చేరుకున్నాడు. అశోక్‌తో కలసి వీధిలోని ఇళ్లన్నీ గాలించినా, పిస్తోలు పేల్చిన వ్యక్తి చిక్కలేదు. నిరాశగా అశోక్ ఇంటికి తిరిగొచ్చాడు. అప్పుడు అనుకోకుండా విజయ్ దృష్టి అశోక్ కొడుకు రాజుపై పడింది. రాజు కంగారుపడుతున్నాడు. మాటిమాటికీ తన స్కూలు బ్యాగు వైపు చూస్తున్నాడు. విజయ్ కళ్లు మెరిశాయి. వెంటనే ఆ బ్యాగు అందుకుని, దాన్ని తెరిచి చూశాడు. బ్యాగులో పుస్తకాల మధ్య పిస్తోలు కనిపించింది. అది చూసి విజయ్‌తో పాటు అశోక్, మాలతి కూడా నివ్వెరపోయారు. ‘‘మీ నాన్న పిస్తోలు దొంగిలించింది నువ్వా?’’ విజయ్ రాజును గద్దిస్తూ అడిగాడు. రాజు ఔనన్నట్లు తల ఊపి, జరిగినదంతా చెప్పేశాడు.‘‘నాకు పిస్తోలుతో ఆడుకోవడమంటే ఇష్టం. ప్రతిసారీ దీపావళి పిస్తోలుతో ఆడుకుని విసుగు పుట్టింది. నిజం పిస్తోలుతో ఆడుకోవాలనిపించింది. ఒకసారి ఇంటర్నెట్లో పిస్తోలును ఎలా పేలుస్తారో చూశాను. అది చూశాక డాడీ పిస్తోలుతో ఆడుకోవాలనిపించింది. కానీ డాడీ తన పిస్తోలును ఎవరినీ ముట్టుకోనివ్వడు. అందుకే ఆ రోజు దొంగతనం జరిగినప్పుడు ఎవరూ చూడకుండా బీరువాలో డాడీ పిస్తోలును నా బ్యాగులో దాచేశాను. దాంతోనే మా టీచర్ని, తాగుబోతుని, పిచ్చికుక్కని కాల్చాను. వీళ్లంతా చెడ్డవాళ్లు. సినిమాల్లో మీరో చెడ్డవాళ్లని చంపినట్టే నేను కూడా వాళ్లను కాల్చి చంపేశాను.’’ అమాయకంగా చెప్పాడు రాజు.ఇన్స్పెక్టర్ విజయ్ రాజుని కస్టడీలోకి తీసుకుని, మర్నాడు కోర్టులో హాజరుపరచాడు. రాజు మైనర్ కావడంతో కోర్టు అతన్ని బాల నేరస్తుల కేంద్రానికి పంపింది. - మహబూబ్ బాషా -
రౌడీరాజ్యమా.. ప్రజాస్వామ్యమా?
సాక్షి, కంచిలి/కవిటి (శ్రీకాకుళం): ఎన్నికల వేళ ఇచ్ఛాపురం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, ఆయన అనుచరవర్గం వ్యవహరించే తీరును పరిశీలిస్తే .. రౌడీ రాజ్యమా లేక ప్రజాస్వామ్యం ఇక్కడ నడుస్తుందా అనే అనుమానం కలుగుతోంది. పోలింగ్ సమీపిస్తున్న కొద్దీ ఎమ్మెల్యే అభ్యర్థి అశోక్ వ్యవహర శైలిపై స్థానికులు ధ్వజమెత్తుతున్నారు. మంగళవారం రాత్రి కవిటిలో అనుమానస్పదంగా రాత్రి సంచరిస్తున్న టీడీపీ నాయకుల వాహనాలపై వీడియో షూట్ చేసి ఎన్నికల కమిషన్ సివిజల్ యాప్‌లో పంపించేందుకు ప్రయత్నించిన వ్యక్తిని తీవ్రంగా గాయపర్చిన సంఘటన నియోజకవర్గ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. సోంపేటకు చెందిన జనసేన పార్టీ కార్యకర్త మణిసంతోష్‌ను టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్, అనుచరులు స్పృహతప్పేలా చితక్కొట్టారని, స్పృహ వచ్చాక బెదిరించి వారికి అనుకూలంగా మొబైల్లో వీడియో షూట్‌చేసి, కవిటి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి ఎస్ఐ పి.పారినాయుడుతో తప్పుడు కేసు నమోదు చేస్తామని బెదిరించి, తెల్లకాగితం మీద సంతకాలు తీసుకొన్నారని ఆరోపించారు. ఈ సంఘటన వివరాలను బాధితులైన జనసేన పార్టీ కార్యకర్తలు బుధవారం మధ్యాహ్నం కుసుంపురం వద్ద విలేకరుల సమావేశంలో వెల్లడించారు. అశోక్ తీరుపై ధ్వజం కవిటిలో మంగళవారం రాత్రి 9.30 గంటల సమయంలో అనుమానాస్పదంగా నంబర్‌లేని కారు, మరికొన్ని మోటారు సైకిళ్లు సంచరిస్తుండడాన్ని సోంపేట, కవిటి మండలాలకు చెందిన జనసేన కార్యకర్తలు గమనించినట్టు బాధితుడు మణిసంతోష్, కార్యకర్తలు కె.ప్రశాంత్, మిన్నారావు, బి.కృష్ణారావు తెలిపారు. పట్టణంలో శివాలయం వద్ద గల ఒక ఇంట్లో ఈ తతంగమంతా జరుగుతుండడడంతో బాధ్యతగల ఒక పౌరుడిగా సాక్ష్యాధారాలతో వీడియో తీసి, ఎన్నికల కమీషన్‌కు సివిజిల్ యాప్‌లో పొందుపరిచేందుకు ప్రయత్నించానని సోంపేటకు చెందిన జనసేన కార్యకర్త మణిసంతోష్ చెప్పారు. దీన్ని గమనించిన స్థానికులు తనను ఈడ్చుకొని ఒక ఇంట్లో బంధించి, టీడీపీ అభ్యర్థి అశోక్, అనుచరులు సుమారు 15 మంది కలిసి ఎందుకొచ్చావంటూ చితక్కొట్టడంతో స్పృహ కోల్పోయానన్నారు. స్పృహ వచ్చిన తర్వాత తమకు అనుకూలంగా తనతో కొన్ని మాటలు చెప్పించే వీడియోను షూట్ చేశారని వాపోయాడు. తర్వాత మిగిలిన జనసేన పార్టీ కార్యకర్తల్ని కవిటి స్టేషన్‌కు తీసుకెళ్లారన్నారు. ఎస్ఐ పారినాయుడు తమను ఆ ప్రాంతానికి ఎందుకెళ్లారని ప్రశ్నించారన్నారు. దీనిపై వారు మాట్లాడుతూ పారదర్శకమైన ఎన్నికల నిర్వహణకు మద్యం, నగదు పంపిణీని అడ్డుకోవడమే ధ్యేయంగా సివిజల్ యాప్‌లో అక్కడ జరుగుతున్న తతంగాన్ని అధికారులకు చేరవేసేందుకు ప్రయత్నించామని, మా ప్రయత్నాన్ని ఆదిలోనే గండికొట్టారని ఎస్ఐతో చెప్పినట్టు మీడియా ముందు వెల్లడించారు. ఇకపై ఇటువంటి పనులు చేయకుండా ఉండాలని హెచ్చరిస్తూ తెల్ల కాగితంపై సంతకాలు తీసుకున్నారని, వీడియోలో బంధించడం తమను ఆందోళనకు గురిచేస్తున్నాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేశారు. రక్షణ కల్పించాలి పత్రికల్లో రాయడానికి వీల్లేని పదజాలంతో తమ ను దూషించి, ఎన్నికలైన తరువాత మా ఆరుగురు తలలు నరికి తన ఇంటి గుమ్మానికి వేలాడదీస్తానని తీవ్ర స్వరంతో టీడీపీ అభ్యర్థి అశోక్ హెచ్చరికలు జారీచేశారని, దీంతో తమకు ప్రాణ హాని ఉందని, ప్రభుత్వమే రక్షణ కల్పించాలని బాధితులు మీడియాకు వివరించారు. ఈ విషయమై కవిటి ఎస్ఐ. పారినాయుడు ‘సాక్షి’తో మాట్లాడుతూ మంగళవారం రాత్రి టీడీపీ అభ్యర్థి బెందాళం అశోక్ నుంచి అనుమానాస్పదంగా కొందరు యువకులు తిరుగుతున్నారని ఫిర్యాదు చేయడంతో , సోంపేటకు చెందిన మణిసంతోష్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించి విచారించామన్నారు. తీరా ఆ యువకుడు సోంపేటకు చెందిన వ్యక్తిగా తేలిందని, తర్వాత కొందరు యువకులు వచ్చి తమకు తెలుసునని చెప్పడంతో పూచీకత్తుగా తెల్లకాగితాలు మీద సంతకాలు తీసుకొని విడిచిపెట్టామని ఎస్ఐ.పారినాయుడు తెలిపారు. -
డబ్బులు పంచుతూ పట్టుబడ్డ టీడీపీ ఎమ్మెల్యే
శ్రీకాకుళం: కవిటిలో ఓటర్లకు డబ్బులు పంచుతూ ఇచ్చాఫురం టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్ వీడియోకు చిక్కారు. ఈ తతంగాన్ని వీడియో తీసిన యువకులను ఎమ్మెల్యే అనుచరులు చితకబాదారు. ఈ ఘటనలో మణిసంతోష్, ప్రశాంత్, రేవతీపతి, మిన్నారావు, దశరథ అనే యువకులకు గాయాలు అయ్యాయి. ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువకులను పోలీసులే బెదిరించడంతో అవాక్కవడం వారివంతైంది. ఫిర్యాదు ఉపసంహరించుకోవాలని యువకులను పోలీసులు తీవ్రంగా వేధిస్తున్నారు. పోలీసుల తీరుపై యువకుల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. -
సేవా భావమా...అరాచక పాలనా..?
సాక్షి, కంచిలి (శ్రీకాకుళం): అధికార పార్టీ ఎమ్మెల్యే ఒకరు...మంచితనం కలిగిన వ్యక్తి మరొకరు. ఐదేళ్ల టీడీపీ పాలనలో జరిగిన అవినీతి, అన్యాయం, అరాచకాలపై నిరసనలు, నిలదీతలు ఎదుర్కొన్న అభ్యర్థి ఒకరు.. జగనన్న స్ఫూర్తితో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ప్రతిచోటా నీరాజనాలు అందుకున్న అభ్యర్థి మరొకరు. వీరే టీడీపీ బెందాళం అశోక్, వైఎస్సార్సీపీ అభ్యర్థి పిరియా సాయిరాజ్. ఇచ్ఛాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలకు చెందిన ఈ అభ్యర్థుల గుణగణాలను ఓసారి పరిశీలిస్తే.. పిరియా సాయిరాజ్ ♦ సేవాభావం గల వ్యక్తిత్వం. ♦ సొంత లాభం ఆశించరు. ♦ 2009లో ఎమ్మెల్యేగా వ్యవహరించిన కాలంలో అవినీతి మచ్చలేకుండా పరిపాలన చేశారు. ♦ వచ్చిన గౌరవ వేతనం కూడా పూర్తిగా కిడ్నీబాధితుల కోసం కేటాయించారు. ♦ ఎందరో నిరుద్యోగ యువకులకు తనకు పరిచయాలున్న ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగాల్లో వేయించారు. ♦ మెడికల్ అవసరాలు ఉన్నవారికి వ్యక్తిగతంగా సహాయం చేస్తుంటారు. ♦ గల్ఫ్ దేశాల్లో కాలం చెల్లిన వీసాలతో చిక్కుకున్న వారిని తిరిగి రప్పించారు. ♦ ఉద్దానం ఫౌండేషన్ అనే స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి కిడ్నీ ప్రభావిత గ్రామాల్లో రక్షిత మంచినీటి సరఫరా ప్లాంట్లను నెలకొల్పారు. ♦ సోంపేటలో తన సొంత నిధులతో డయాలసిస్ యూనిట్ మెషీన్ ఏర్పాటు చేశారు. ♦ రెండు అంబులెన్స్ వాహనాలు ఏర్పాటు చేసి ఉచితంగా రోగులకు సేవలందిస్తున్నారు. ♦ సోంపేటలో టెలీమెడిసిన్ సెంటర్‌ను ఏర్పాటు చేసి విశాఖపట్నంలో ఉన్న పలువురు వైద్యనిపుణులతో ఇక్కడి నుంచే రోగులకు అవసరమైన సలహాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అందించుతున్నారు. ♦ ఒక్క పైసా కూడా ఆశించకుండా పరిపాలన చేసిన పేరుంది. బెందాళం అశోక్ ♦ 2014లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ♦ ప్రజాసమస్యలు పరిష్కరించడంలో కంటే సొంత లాభమే చూసుకొంటారనే ఆరోపణలు ఉన్నాయి. ♦ వృత్తిపరంగా వైద్యుడు అయినప్పటికీ సేవాగుణం అంతగా లేదు. ♦ ఐదేళ్ల పదవీకాలంలో బందుప్రీతి, సొంతలాభం చూసుకొనే పరిపాలన చేశారనే విమర్శలు ఉన్నాయి. ♦ తాత్కాలిక అంగన్వాడీ న్యూట్రిషన్ పోస్టుల నియామకానికి రూ.2కోట్లకు పైగా వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. ♦ అనుమతులు లేకుండా బాహుదా, మహేంద్రతనయ నదుల్లో ఇసుక ర్యాంపులను ఏర్పాటు చేసి తమ్ముళ్లతో తవ్వకాలు చేపట్టి, పెద్ద ఎత్తున దందా చేçపట్టి వసూళ్లకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ♦ నియోజకవర్గంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో అధికారుల నుంచి నెలవారీ మామూళ్ల వసూలు చేస్తున్నారే ఆరోపణలు. ♦ కాంట్రాక్టు పనులన్నీ బినామీలకు అప్పగించి, తద్వారా కమీషన్లు వసూళ్లు. ♦ ఏ పని చేయాలన్న ఒక రేటును నిర్ణయించి దర్జాగా వసూళ్లు చేయడం. ♦ సొంతపార్టీ వాళ్ల వద్ద కూడా మొహమాటం లేకుండా అశోక్ తండ్రి ప్రకాశ్, మిగతా ముఖ్య అనుచరులు లంచాలు డిమాండ్ చేయడం. ♦ స్థానికంగా ఉద్యోగాలు ఇచ్చే అవకాశం ఉంటే, నిరుద్యోగుల నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేయడం, వసూలు చేయడం. -
ఐటీగ్రిడ్స్‌పై వాడీవేడి వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ కేసులో ఇరువర్గాల వాదనలు ఇన్న తెలంగాణ హైకోర్టు తదుపరి విచారణను వచ్చే బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. డేటాచోరీ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీగ్రిడ్స్ సంస్థ యజమాని ఆశోక్ తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్దార్థ్ లూత్రా కోర్టులో వాదనలు వినిపించారు. ఏపీ డేటాపై తెలంగాణకు ఏం సంబంధమని, కేసుపై విచారించే హక్కు ఇక్కడి పోలీసులకు లేదని ఆయన అన్నారు. ఒకే కేసుపై రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారని, దీనిలో రాజకీయ దురుద్దేశ్యము తప్ప మరొకటి లేదని ఆయన కోర్టుకు తెలియజేశారు. కేసులో సిట్ తరఫున తెలంగాణ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కౌంటర్‌గా కోర్టులో వాదనలు వినిపించారు. ఐటీగ్రిడ్స్ కంపెనీ ద్వారా డేటాచోరీ జరిగినట్లు తమవద్ద ఖచ్చిమైన ఆధారాలు ఉన్నయని కోర్టుకు తెలిపారు. సంబంధిత కంపెనీ ఇదే రాష్ట్రంలో ఉన్నందున విచారించే హక్కు తెలంగాణ పోలీసులకు ఉందన్నారు. కేవలం ఏపీ డేటానే కాకుండా తెలంగాణ డేటా కూడా చోరీకి గురైందని ఆయన కోర్టుకు నివేధించారు. -
ఐటీ గ్రిడ్స్ అశోక్‌కు పబ్లిక్ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆఖరి నోటీసులు జారీ చేసింది. మార్చి 2, 11, 16వ తేదీల్లో మూడుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అశోక్ నోటీసులకు స్పందించలేదు. దీంతో పబ్లిక్ నోటీసులకు సిట్ సిద్ధమైంది. గతంలో జారీ చేసిన నోటీసులను అశోక్ నేరుగా తీసుకోలేదు. తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయాక అతని ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో ప్రచార సాధనాల (కొన్ని ఆంగ్ల పత్రికలు) ద్వారా పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. అశోక్ ఎక్కడున్నా ప్రకటన వెలువడిన మూడు రోజుల్లోగా గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. సిట్‌కి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేరు మీద ఈ ప్రకటన వెలువడింది. దీనిపై అశోక్ స్పందనను బట్టి సిట్ తదుపరి చర్యలకు సమాయత్తం కానుంది. -
‘మానాన్న పోలీసు.. మానాన్న మాజీ ఎంపీ’ !
సాక్షి, హైదరాబాద్ : అమీర్‌పేట ఎల్లారెడ్డిగూడలో నడి రోడ్డుపై మద్యం మత్తులో పోలీసు అధికారి, మాజీ ఎంపీ తనయులమంటూ ఇద్దరు యువకులు హల్ చల్ చేశారు. దారిన పోయే వారిని అటకాయిస్తూ గొడవకు దిగారు. అమీర్‌పేట కీర్తి అపార్ట్మెంట్ సమీపంలో శనివారం అర్ధరాత్రి బహిరంగంగా మద్యం సేవిస్తూ నానా హంగామా సృష్టించారు. ఎల్లారెడ్డిగూడకు చెందిన ప్రైవేటు ఉద్యోగి అశోక్ తాను పనిచేస్తున్న హైటెక్ సిటీ ప్రాంతం నుంచి శనివారం రాత్రి 1.45 గంటల సమయంలో ఇంటికి వస్తుండగా అడ్డుకొని అగ్గిపెట్టె కావాలని అడగగా... తన వద్ద లేదని చెప్పడంతో దాడి చేశారని తెలిపాడు. ఒకరు తాను ఏసీపీ కుమారుడినని, మరో యువకుడు తాను మాజీ ఎంపీ కొడుకునంటూ కొట్టారని తెలిపాడు. వారి నుంచి తప్పించుకున్న బాధితుడు ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అశోక్‌ను అటకాయించిన యువకులు కూడా పోలీస్‌స్టేషన్‌కు చేరుకుని అక్కడ కూడా హంగామా చేశారు. పోలీసులు మద్యం మత్తులో ఉన్న వారిని అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ ఎనలైజర్ ద్వారా పరీక్షించి చర్యలు తీసుకోకపోగా ముందుగా వచ్చిన బాధితుడి సెల్ ఫోన్ తీసుకుని అతడిని స్టేషన్లోనే ఉంచారు. ఆ తరువాత వచ్చిన యువకులని వెళ్లిపోవాలని ఆదేశించారు. ఆదివారం మధ్యాహ్నం వరకు అశోక్ పోలీస్‌స్టేషన్‌లోనే ఉన్నట్లు తెలిసింది. అయితే రాత్రి జరిగిన సంఘటన మొత్తం సీసీ కెమెరాల్లో రికార్డు అయి ఉండటంతో వాటిని సేకరించిన బాధితుడి స్నేహితులు వాటిని ప్రసార మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు ఇరు వర్గాలపై కేసులు నమోదు చేశారు. రాత్రి రోడ్డుపై గొడవ పడిన వారిలో ఏపీసీ, మాజీ ఎంపీ కుమారులు ఎవరూ లేరని ఎస్ఆర్ నగర్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ తెలిపారు. అది చిన్నపాటి ఘర్షణ కావడంతో అశోక్, రాహుల్ అనే వ్యక్తిపై పెట్టి కేసు నమోదు చేశామన్నారు. -
అశోక్‌కు మూడోసారి నోటీసులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర రాజకీయ దుమారం రేపిన డేటా చౌర్యం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ కేసులో విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగు తున్న ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ అరెస్టుకు రంగం సిద్ధమవుతోంది. 41 సీఆర్పీసీ ప్రకారం.. నోటీసుల జారీకి పోలీసులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే మార్చి 2న మాదాపూర్ పోలీసులు, మార్చి 11న సిట్ పోలీసులు అశోక్‌ను విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ నోటీసులు జారీ చేశారు. మార్చి 11న కేపీహెచ్‌బీలోని అత ని ఇంటికి వెళ్లిన పోలీసులు, అక్కడ ఎవరూ లేకపోవడంతో నోటీసులను గోడకు అంటించి వచ్చారు. మార్చి 13న విచారణ హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నప్పటికీ అశోక్ రాలేదు. ఈ కేసు సమగ్ర వివరాలను అధికారులు ఈ నెల 20న కోర్టుకు సమర్పించనున్నారు. నిబంధనల ప్రకారం మూడోసారి కూడా పోలీసుల నోటీసులకు స్పందించకపోతే అరెస్టు దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. -
ఐటీగ్రిడ్స్ స్కాం : అశోక్‌కు మరోసారి నోటీసులు!
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరి కేసును సిట్ ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ చైర్మన్ అశోక్‌కు మరోసారి నోటీసులు అందించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 11న నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో అందించనున్నారు. ఈ నెల 20న హైకోర్టుకు ఈ కేసుపై నివేదిక ఇవ్వనున్నామని అధకారులు పేర్కొన్నారు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. సంబంధిత కథనాలు సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా! డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు ఐటీగ్రిడ్స్ కేసు.. అశోక్‌కు హైకోర్టులో చుక్కెదురు -
సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా!
సాక్షి, హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల డేటా చోరీకి సంబంధించిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ సీఈవో అశోక్ విచారణకు హాజరుకాలేదు. విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. బుధవారం విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు. ఫిర్యాదుదారుల వాంగ్మూలం రికార్డు.. ఏపీలో 3.6 కోట్ల మంది ప్రజల వ్యక్తిగత డేటాను సేవామిత్ర యాప్ ద్వారా టీడీపీ తస్కరిస్తోందని మార్చి 2న విజిల్ బ్లోయర్ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీసులను ఆశ్రయించాడు. ఆ మర్నాడే దశరథరామిరెడ్డి అనే వ్యక్తి కూడా ఇలాంటి ఫిర్యాదుతో ఎస్ఆర్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కేసులు నమోదయ్యాయి. కేసు తీవ్రత దృష్ట్యా ప్రభుత్వానికి డీజీపీ లేఖ రాయడంతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బుధవారం లోకేశ్వర్‌రెడ్డి, దశరథరామిరెడ్డిలను పోలీసులు సిట్ కార్యాలయానికి పిలిపించారు. వారిని ప్రశ్నించిన పోలీసులు వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. వీరితో పాటు ఐటీ గ్రిడ్స్ సంస్థలో ఉద్యోగులైన ఫణి, భాస్కర్, విక్రమ్, చంద్రశేఖర్‌లను కూడా మరోసారి ప్రశ్నించారు. కాగా, గూగుల్, అమెజాన్‌ల నుంచి సమాచారం ఇంకా రాలేదు. పోలీసులు స్వాధీనం చేసుకున్న ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్ల నుంచి సమాచారాన్ని రీట్రైవ్ చేయడానికి నిపుణులు శ్రమిస్తున్నారు. త్వరలోనే వీటి నుంచి సమాచారాన్ని సంగ్రహిస్తామని పోలీసులు చెబుతున్నారు. మీడియాపై పోలీసుల దురుసు ప్రవర్తన అశోక్ వస్తారన్న సమాచారంతో గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు వెళ్లిన మీడియాపై పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. లోపలికి అనుమతించేది లేదని మీడియాతో వాగ్వాదానికి దిగారు. పోలీసుల తీరును నిరసిస్తూ మీడియా ప్రతినిధులు అక్కడే బైఠాయించారు. అటుగా వస్తున్న డీఎస్పీ రోహిణి ప్రియదర్శిని వాహనాన్ని అడ్డగించారు. అనంతరం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజనీకుమార్‌కు దీనిపై ఫిర్యాదు చేశారు. -
సిట్ ముందుకు ఐటీగ్రిడ్స్ అశోక్
సాక్షి, హైదరాబాద్: ఐటీగ్రిడ్స్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆసంస్థ యజమాని అశోక్ ఈరోజు ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకానున్నారు. ఇటీవల ఆయనకు సిట్ అధికారులు విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీచేసిన విషయం తెలిసిందే. విచారణకు రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీచేసే అవకాశం ఉందని పోలీసులు తేల్చిచెప్పడంతో సిట్ ముందుకు రానున్నారు. ఆయన వ్యక్తిగత న్యాయవాదులతో కలిసి వచ్చే అవకాశం ఉంది. సిట్ విచారణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సార్వత్రిక ఎన్నికల ముందు డేటాచోరీ అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించిన విషయం తెలిసిందే. కాగా పోలీసుల విచారణకు అశోక్ హాజరుకావల్సిందేనని హైకోర్టు ఆదేశించింది. చదవండి: డేటా చోరీ బాధ్యత ఆ ఇద్దరిదే! హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు -
జాతకాలు తవ్వుతున్నారు!
సాక్షి, హైదరాబాద్: ఐటీ గ్రిడ్స్ కేసులో తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) స్పీడ్ పెంచింది. ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో మార్చి 2, 9 తేదీల్లో జరిపిన సోదాల్లో స్వాధీనం చేసుకున్న ల్యాప్‌ట్యాప్‌లు, కంప్యూటర్ల హార్డ్‌డిస్క్‌లను సోమవారం పరిశీలించింది. కంప్యూటర్లలో ఏముందన్న విషయాన్ని రాబట్టే పనిని సైబర్ నిపుణులకు అప్పగించారు. ప్రస్తుతం వారు అందులో ఉన్న, డిలీట్ చేసిన సమాచారాన్ని రిట్రీవ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అశోక్ అరెస్టుకు వ్యూహం ఎలా? టీడీపీ సేవామిత్ర యాప్ సాయంతో 3.60 కోట్ల మంది ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న, ప్రస్తుతం పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్ అరెస్టు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై సిట్ సోమవారం చర్చించింది. ఈ విషయంపై సిట్ బాస్, ఐజీ స్టీఫెన్ రవీంద్ర తన బృంద సభ్యులతో సోమవారం భేటీ అయ్యారు. ప్రస్తుతం అశోక్ ఏపీలో తలదాచుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుండటంతో ఆయన్ను అరెస్టు చేసే క్రమంలో తలెత్తే పరిణామాలపై పోలీసులు ఈ సమావేశంలో చర్చించినట్లు సమాచారం. డేటా చౌర్యం కేసులో ఏపీ ప్రభుత్వం కూడా రెండు వేర్వేరు సిట్ బృందాలను వేసిన నేపథ్యంలో అశోక్ ఏపీ సిట్ పోలీసుల ముందు ప్రత్యక్షమవుతాడా? అన్న విషయం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే అశోక్ కాల్ డేటాను పోలీసులు విశ్లేషిస్తున్నారు. గత అరు నెలల్లో అశోక్ ఎవరెవరితో మాట్లాడారు? అందులో ఉన్న ప్రముఖులు ఎవరు? ఫిబ్రవరి 23న పోలీసులు ఐటీ గ్రిడ్స్ కార్యాలయంలో ప్రాథమిక విచారణకు వెళ్లిన రోజు అశోక్ ఏపీలోని పలువురు ప్రముఖులకు పెద్ద మనుషులతో ఫోన్లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. కోర్టు ఆదేశాలతో కొత్త ఉత్సాహం తనను అన్యాయంగా డేటా చౌర్యం కేసులో ఇరికించారంటూ తెలంగాణ హైకోర్టులో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ అశోక్ వేసిన పిటిషన్‌పై కోర్టు స్పందించింది. తెలంగాణ పోలీసులకు సమాధానం చెప్పాలని స్పష్టం చేసిన నేపథ్యంలో సిట్ బృందానికి కొత్త ఉత్సాహం వచ్చింది. అశోక్ తరఫున వాదించేందుకు దేశంలో పేరుమోసిన లాయర్లు రావడం, ఏపీ ప్రభుత్వం అతన్ని వెనకేసుకురావడం, త్వరలోనే బయటికి వస్తాడంటూ సాక్షాత్తూ ఏపీ సీఎం ప్రకటించడంతో అసలు అశోక్ చిరునామా దొరుకుతుందా? అనే సందిగ్ధంలో పడిన పోలీసులు కోర్టు ఆదేశాలతో మరింత వేగంగా పనిచేయనున్నారు. అతని కదలికలపై ఇప్పటికే సమాచారం ఉన్నప్పటికీ తెలంగాణ సిట్ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అతన్ని చట్టపరంగానే కోర్టు ముందు నిలబెట్టాలన్న లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. మరోవైపు కోర్టు ఆదేశాల నేపథ్యంలో అశోక్ ఇప్పుడు ఏమని సమాధానం ఇస్తాడనే విషయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. -
హైకోర్టులో అశోక్‌కు చుక్కెదురు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రజల వ్యక్తిగత సమాచారం చోరీ కేసులో ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అశోక్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. తనపై పోలీసులు నమోదు చేసిన కేసులను కొట్టేయాలన్న ఆయన విజ్ఞప్తిని న్యాయస్థానం తోసిపుచ్చింది. పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించి వివరణ ఇవ్వాలని అశోక్‌కు స్పష్టం చేసింది. ఆయన దాఖలు చేసిన వ్యాజ్యాలపై విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. అప్పటివరకు అశోక్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇచ్చేందుకూ హైకోర్టు నిరాకరించింది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి. దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఆర్ నగర్ పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని, వాటిని కొట్టేయాలని కోరుతూ అశోక్ గత వారం హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్ సోమవారం విచారణ జరిపారు. ఈ సందర్భంగా పబ్లిక్ ప్రాసిక్యూటర్ సి. ప్రతాప్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ ఈ మొత్తం వ్యవహారంపై ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) దర్యాప్తు చేస్తోందన్నారు. అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఇప్పటివరకు స్పందించలేదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. నోటీసులకు స్పందించకుండా ఇలా పిటిషన్లు దాఖలు చేయడం సరికాదన్నారు. పూర్తి వివరాలను కోర్టు ముందుంచేందుకు విచారణను వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో అశోక్ తరఫున హాజరైన సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపిస్తూ సిట్ దర్యాప్తే తమకు అభ్యంతరకరమన్నారు. వారికి లేని పరిధిని ఉపయోగించి ఈ కేసులో దర్యాప్తు చేస్తున్నారని ఆయన చెప్పారు. పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు చట్ట ప్రకారం చెల్లుబాటు అవుతాయా లేదా? అన్నది మాత్రమే చూడాలని కోరారు. ఇది తేలితే ఈ కేసు తేలిపోతుందన్నారు. ఈ సమయంలో ఫిర్యాదుదారు దశరథరామిరెడ్డి తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ ఈ కేసులో సీనియర్ న్యాయవాది హాజరవుతున్నారని, అందువల్ల విచారణను కొద్దిసేపు వాయిదా వేయాలని కోరారు. ఈ సమయంలో లూథ్రా ఏదో చెప్పబోతుండగా న్యాయమూర్తి ఆయనను వారిస్తూ తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ముందు పిటిషనర్‌ను పోలీసులు ఇచ్చిన నోటీసులకు స్పందించాలని సూచించాలంటూ లూథ్రాకు స్పష్టం చేశారు. అప్పటివరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని లూథ్రా కోరగా న్యాయమూర్తి అందుకు నిరాకరించారు. పిటిషనర్ ఎందుకు ఆందోళన చెందుతున్నారని, ముందు నోటీసులకు స్పందించమనండి అని పునరుద్ఘాటించారు. మిగిలిన విషయాలపై తదుపరి విచారణ సమయంలో వాదనలు వింటానని స్పష్టం చేశారు. అశోక్‌కు మరోసారి నోటీసులు డేటా చోరీ కేసులో ప్రధాన నిందితుడైన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌డైరెక్టర్ దాకవరపు అశోక్‌కు తెలంగాణ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న గోషామహల్‌లోని తమ కార్యాలయానికి ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. ఈ మేరకు కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి సోమవారం వెళ్లిన తెలంగాణ పోలీసులు... అశోక్ పరారీలో ఉండటంతో అతని ఇంటికి నోటీసులు అంటించారు. ఏపీ, తెలంగాణ ప్రజల డేటాను సేవామిత్ర యాప్ సాయంతో తస్కరించారంటూ విజిల్ బ్లోయర్ లోకేశ్వర్‌రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని, దీనిపై ఐపీసీ సెక్షన్లు 120–బీ, 379, 420, 188తోపాటు ఐటీ చట్టంలోని సెక్షన్లు 66 బీ, 72 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సిట్ నోటీసులో పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే ఈ నెల 2, 3 తేదీల్లో నోటీసులు పంపినా విచారణకు హాజరు కానందున మరోసారి నోటీసులు పంపుతున్నామని తెలిపింది. ప్రస్తుతం అశోక్ ఏపీ ప్రభుత్వ పెద్దల సాయంతో విజయవాడ, గుంటూరు పరిసరాల్లో తలదాచుకుంటున్నట్లు సమాచారం. -
‘చోరీ డేటా’ అంతా ఎన్‌క్రిప్షన్‌లోనే..!
సాక్షి, హైదరాబాద్: ‘సేవామిత్ర’యాప్... ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వెలుగుచూసిన డేటా స్కాం మొత్తం తెలుగుదేశం పార్టీకి చెందిన ఈ యాప్, దాన్ని తయారు చేసిన ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ చుట్టూనే తిరుగుతోంది. ఈ యాప్ తయారీలో ఐటీ గ్రిడ్స్ డైరెక్టర్ దాకవరపు అశోక్ అనేక జాగ్రత్తలు తీసుకున్నాడని పోలీసులు గుర్తించారు. అందులో ప్రధానమైంది ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ విధానం. తాము చేస్తున్న భారీ స్కాం భవిష్యత్తులో వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలకు ఆధారాలు లభించకుండా ఉండేందుకే అశోక్ ఈ ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది. యాప్స్ ద్వారా జరిగే సమాచార మార్పిడికి సంబంధించి ఉపయోగించే పరిజ్ఞానమే ఎన్క్రిప్షన్, డిక్రిప్షన్ విధానం. వాట్సాప్ ద్వారా ఓ కాంటాక్ట్‌కు తొలిసారి ఎవరైనా సందేశం పంపినప్పుడు ‘ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్’అంటూ ప్రత్యేక సూచన వస్తుంది. అంటే ఓ సెండర్ పంపిన మెసేజ్ రిసీవర్‌కు వెళ్లే వరకు అది ఎన్‌క్రిప్షిన్ విధానంలో ఉంటుంది. మెసేజ్‌లో పదాలను టైప్ చేస్తే అది ఎన్‌క్రిప్ట్ అయ్యే సరికి ‘కీ’లుగా మారిపోతుంది. ఉదాహరణకు ‘టీడీపీ’అనే పదాన్ని ‘ఎండీ5 ఆన్లైన్’అనే ఎన్‌క్రిప్టర్ వెబ్సైట్లో టైప్ చేస్తే (5ec7c4ede4cb6 c64289a5ed105285945) అనే ‘కీ’గా మారిపోయింది. దీంతో ఇది ఎన్‌క్రిప్ట్ అయినట్లు లెక్క. ఈ సందేశం రీసీవ్ చేసుకునే వ్యక్తి ఫోన్లోకి వచ్చిన తర్వాత డిక్రిప్షన్ ప్రక్రియ పూర్తై మళ్లీ ‘టీడీపీ’అనే పదంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓటర్ల డేటాను దుర్వినియోగం చేయడానికి ఐటీ గ్రిడ్స్ సంస్థ ఇదే విధానాన్నే వినియోగించింది. ట్యాబ్‌లలో వాడిన సాఫ్ట్వేర్ అదే... తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, సేవామిత్ర సర్వేయర్లకు ఐటీ గ్రిడ్స్ సంస్థ ద్వారా జారీ చేసిన ట్యాబ్స్‌ను ఆ సంస్థకు సంబంధించిన సర్వర్‌తో అనుసంధానించారు. ఈ ట్యాబ్స్‌లో ఉండే ‘సేవామిత్ర’యాప్‌లో ఎన్‌క్రిప్షన్‌తోపాటు డిక్రిప్షన్ సాఫ్ట్వేర్ సైతం అంతర్భాగంగా ఏర్పాటు చేసినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సర్వర్ నుంచి ట్యాబ్ వరకు డేటా మార్పిడి మొత్తం ఎన్క్రిప్షన్ విధానంలోనే జరిగేలా చర్యలు తీసుకున్నారు. ఎన్‌క్రిప్షన్‌లో ఉన్న డేటాను డిక్రిప్షన్లోకి మార్చి పదాలుగా చూపించడంలో ఆ యాప్‌లో ఉన్న ‘కీ’ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ ‘కీ’లలోనూ రెండు రకాలు ఉంటాయి. పబ్లిక్ ‘కీ’తో కూడిన ఎన్క్రిప్టెడ్ సందేశాన్ని సర్వర్ నుంచి తీసినా సాధారణ పదాలుగా మార్చుకునే అవకాశం ఉంది. అయితే ఐటీ గ్రిడ్స్ సంస్థ ఈ డేటాను ప్రైవేట్ ‘కీ’తో ఎన్‌క్రిప్ట్ చేసింది. దీంతో ఎవరైనా సర్వర్‌ను స్వాధీనం చేసుకున్నా... అమెజాన్ వంటి సంస్థల నుంచి డేటా పొందినా డిక్రిప్ట్ చేయడం సాధ్యం కాదు. ఈ ‘క్రిప్షన్స్’డేటాను రాసే ‘అల్గోరిథమ్’ను బట్టి మారిపోతుంది. ఓ సంస్థ రూపొందించిన ‘అల్గోరిథమ్’మరొకరి దానితో ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోలదు. తమ వ్యవహారం గుట్టురట్టైనా ఆధారాలు చిక్కకూడదనే ఐటీ గ్రిడ్స్ ఈ జాగ్రత్త తీసుకున్నట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. తమ డేటాను ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్తో ఉండేలా చేస్తే భవిష్యత్తులో ఈ భారీ స్కాం వెలుగులోకి వచ్చినా దర్యాప్తు సంస్థలు ఐటీ గ్రిడ్స్‌తోపాటు అమెజాన్ నుంచి సమాచారం తీసుకున్నా అది ఆధారంగా పనికి రాకూడదనే ఈ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ రూపంలో ఉన్న డేటాతో కేవలం ‘కీ’తెలుసుకోవడం తప్ప అందులోని పదాలను గుర్తించలేదు. డేటాకు సంబంధించిన ప్రైవేట్ ‘కీ’అందుబాటులో ఉంటే తప్ప ఆ ‘కీ’లను పదాలుగా మార్చి అందులోని అంశాలను తెలుసుకోలేరు. ఈ విషయం గుర్తించిన తెలంగాణ సిట్ అధికారులు... సైబర్ నిపుణుల సాయంతో దర్యాప్తు చేయాలని భావిస్తున్నారు. ప్రాథమికంగా డేటా మొత్తం క్రోడీకరిస్తే ఆపై డిక్రిప్ట్ చేయవచ్చని యోచిస్తున్నారు. -
డేటా చోరీ కేసు.. కీలక ఆధారాలు సేకరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ సిట్ కీలక ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న అశోక్ కదలికలను పసిగట్టినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. డేటా చోరీ వెలుగు చూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడవైపు వెళ్లినట్లు తమ దృష్టికి వచ్చిందని సిట్ అధికారులు తెలిపారు. ఆ తర్వాత కొద్ది సేపటికే అశోక్ సెల్‌ఫోన్ టవర్ గుంటూరు లోకేషన్‌ని చూపించినట్లు అధికారులు పేర్కొన్నారు. అశోక్ విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా పలువురు రాజకీయనాయకులతో, ఉన్నతాధికారులతో మాట్లాడినట్లు గుర్తించామన్నారు. అంతేకాక అశోక్ గత ఆరు నెలలుగా ఇదే నంబర్‌తో విస్తృతంగా మాట్లాడినట్లు దర్యాప్తులో తెలిందన్నారు. ఈ సంభాషణలను బట్టి ప్రముఖులేవరికైనా ఈ కేసుతో సంబంధాలున్నాయా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇదిలా ఉండగా డేటా చోరీ కేసులో హై కోర్టు అశోక్‌కు మరోసారి నోటీసులు జారీ చేసింది. ఈ నెల 13న విచారణకు హాజరు కావాలంటూ కోర్టు అశోక్‌ను ఆదేశించింది. -
పరారీలో ఉన్న ఐటీ గ్రిడ్ సీఈవో అశోక్
-
మంత్రి, ఐఏఎస్‌లతో అశోక్ సంభాషణ!
సాక్షి, అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డేటా చోరీ కేసులో తెలంగాణ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) కీలక ఆధారాలు సేకరించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న దాకవరం అశోక్ కదలికలను సిట్ పసిగట్టింది. ఆర్నెలలుగా అశోక్ కీలక వ్యక్తులతో తరచూ సంభాషించడం.. పరారీ తర్వాత ఆయన సెల్‌ఫోన్ సిగ్నళ్లు పలు ప్రాంతాలను సూచించడం ఈ కేసులో కీలక మలుపుగా అధికారులు భావిస్తున్నారు. ఈ సిగ్నళ్ల ఆధారంగా అతన్ని దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా అనే కోణంలోనూ దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. ఇక నిందితుడు మంతనాలు జరిపిన ఫోన్ నెంబర్లలో ప్రముఖులవి కూడా ఉండడంతో సిట్ ఆచితూచి అడుగులేస్తోంది. ఇదే క్రమంలో అశోక్ మరో రెండు మూడు రోజుల్లో బయటకు వస్తారని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే స్వయంగా ప్రకటించడంతో తెలంగాణ సిట్‌ను మరెన్నో సందేహాలు చుట్టుముట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ.. గుంటూరుకు? డేటా చౌర్యం వెలుగుచూసిన తర్వాత అశోక్ ఉన్నట్టుండి హైదరాబాద్ నుంచి మాయమయ్యాడు. అందరికీ తెలిసిన అశోక్ నెంబరు తొలుత రెండు మూడు రోజుల వరకూ హైదరాబాద్ పరిసరాల సెల్ టవర్ల పరిధిలోనే ఉన్నట్టు గమనించారు. కానీ, అశోక్ ఆచూకీ మాత్రం పోలీసులకు లభించలేదు. సెల్‌ఫోన్ ద్వారా కదలికలను గుర్తిస్తారనే అశోక్ తన ఫోన్‌ను హైదరాబాద్‌లోనే వదిలేసి వెళ్లిపోయి ఉండవచ్చునని పోలీసులు ఓ నిర్థారణకు వచ్చారు. అనంతరం అతను మరో ఫోన్ వాడుతున్నట్టు ఇతర మార్గాల ద్వారా పోలీసులు గుర్తించారు. ఈ రహస్య ఫోన్ నెంబర్ ద్వారా అశోక్ కదలికలను అధికారులు గుర్తించే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. డేటా చౌర్యం వెలుగుచూసిన కొన్ని గంటల్లోనే అశోక్ విజయవాడ వైపు వెళ్లినట్టు తెలుస్తోంది. అక్కడి నుంచి గుంటూరు సెల్ టవర్ లొకేషన్ చూపించినట్లు సమాచారం. విజయవాడ నుంచి గుంటూరు వెళ్లేలోగా కీలక అధికారులకు, రాజకీయ ప్రముఖులకు ఈ నెంబర్ నుంచి కాల్స్ వెళ్లినట్టు తెలిసింది. ఇదే నెంబర్లతో గత ఆరు నెలలుగా విస్తృతంగా అశోక్ మాట్లాడినట్లు కూడా అధికారులు గుర్తించారు. ఇదే సమయంలో అశోక్ పలువురు ప్రముఖులతో జరిపిన ఫోన్ సంభాషణలను బట్టి ఈ కేసుకు వాళ్లకు ఏమైనా సంబంధాలున్నాయా? అనే కోణంలోనూ ముందుకెళ్లాలనే యోచనలో ఉన్నట్లు తెలంగాణ పోలీసు ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. గుంటూరు, మంగళగిరిలో మకాం? అశోక్ వాడుతున్న సెల్‌ఫోన్.. డేటా చౌర్యానికి ముందు మాదాపూర్ పరిసర ప్రాంతాల్లో ఉన్నట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి. ఏపీకి చెందిన ఓ మంత్రి ఫోన్ నెంబర్ కూడా మాదాపూర్ టవర్ లొకేషన్లో ఉండటం, ఆయనతో తరచూ మాట్లాడుతుండటం ఈ ఎపిసోడ్లో అనేక అనుమానాలకు తావిస్తోంది. మంత్రితో మాట్లాడిన తర్వాత అశోక్ ఫోన్ నెంబర్ నుంచి కొంతమంది ఐఏఎస్ అధికారులకూ ఫోన్లు వెళ్లినట్టు తెలిసింది. అశోక్‌తో అసలా అధికారులకు సంబంధమేంటి? మంత్రితో మాట్లాడిన వెంటనే అశోక్ అధికారులతో ఏం మాట్లాడాడు? అనే అనుమానాలు పోలీసులు వ్యక్తంచేస్తున్నారు. అలాగే, డేటా చౌర్యం తర్వాత అశోక్ వాడినట్లుగా భావిస్తున్న రహస్య నెంబర్‌గల ఫోన్ మరికొన్ని సందేహాలను కలిగిస్తోంది. హైదరాబాద్ నుంచి పారిపోయిన తర్వాత ఫోన్ సిగ్నల్స్ మంగళగిరి, గుంటూరు టవర్ లొకేషన్స్‌ను సూచిస్తున్నాయి. తరచూ ఇవే సిగ్నల్స్‌ను గుర్తించిన పోలీసులు అశోక్ డేటా చౌర్యం కేసు తెరమీదకొచ్చాక గుంటూరు, మంగళగిరిలో మకాం వేశాడా? హైదరాబాద్‌లో ఉన్నప్పుడు అశోక్‌తో ఫోన్ సంప్రదింపులు జరిపిన అధికారుల ఫోన్లు కూడా ఇదే టవర్ లొకేషన్లను చూపిస్తున్నట్టు తెలిసింది. దేశం దాటించే ప్రయత్నాలు జరిగాయా? ఇదిలా ఉంటే.. కొద్దిరోజుల క్రితం అశోక్ గన్నవరం ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్టు ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్స్ ద్వారా తెలుస్తోంది. అతను ఓ గంటపాటు అక్కడే ఉన్నట్లు గుర్తించారు. ఆ తర్వాత అతను మళ్లీ విజయవాడ మీదుగా మంగళగిరి, గుంటూరు చేరుకున్నట్లు సమాచారం. వాస్తవానికి అశోక్‌ను దేశం దాటించి ఉంటారని పోలీసులు ముందుగా అనుమానించారు. అతను వాడిన ఫోన్‌ను ఇక్కడే ఎవరికో ఇచ్చి ఉంటారని, ఆ వ్యక్తి అక్కడి నుంచి గుంటూరు వెళ్లినట్టు అనుమానించారు. అయితే, శాస్త్రీయ కోణంలో విచారణ జరుగుతున్న సమయంలోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రెస్మీట్లో అశోక్ మరో రెండు రోజుల్లో బయటకొస్తారని చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. ఎయిర్‌పోర్టుకొచ్చిన అశోక్ తిరిగి గుంటూరు వెళ్లి ఉంటాడని భావిస్తున్నారు. దేశం దాటించేందుకే ఎయిర్‌పోర్టుకు వచ్చినప్పటికీ, దీనివల్ల ఎక్కడో ఒకచోట అతను దొరికిపోతాడని భావించి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం మానుకున్నారేమోనని పోలీసులు సందేహిస్తున్నారు. -
ఏపీ డేటా చోరీ చేస్తే మీకెంటి నష్టం?
-
నాపై కేసులు కొట్టేయండి
సాక్షి, హైదరాబాద్: తనపై మాదాపూర్, సంజీవరెడ్డి నగర్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్లను కొట్టేయాలని కోరుతూ డేటా చోరీ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ డి.అశోక్ శుక్రవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. మాదాపూర్ పోలీసులు నమోదు చేసిన కేసును ఏపీకి బదలాయిస్తూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ఆ మేరకు రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు సోమవారం విచారణ జరిపే అవకాశం ఉంది. తనపై డేటా అనలిస్ట్ తుమ్మల లోకేశ్వర్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాదాపూర్ పోలీసులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం ప్రధాన కార్యదర్శి జి.దశరథరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సంజీవరెడ్డి నగర్ (ఎస్ఆర్ నగర్) పోలీసులు వేర్వేరుగా కేసులు నమోదు చేశారని అశోక్ తన పిటిషన్లలో పేర్కొన్నారు. హైదరాబాద్‌లో నివసిస్తున్న ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు సంబంధించిన డేటాను సేవామిత్ర యాప్‌ల ద్వారా చోరీ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారని తెలిపారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన తరువాత ఈ విషయంపై ఏపీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని అతనికి ఇక్కడి పోలీసులు చెప్పకుండా తమకు లేని పరిధిని ఉపయోగించి తెలంగాణ పోలీసులు తనపై కేసు నమోదు చేశారన్నారు. ఫిర్యాదుదారుల ఆరోపణలకు, నాపై పెట్టిన సెక్షన్లకు ఎటువంటి సంబంధం లేదన్నారు. తనపై ఐపీసీ సెక్షన్లు 420, 419, 467, 468, 471, 120(బీ) వర్తించవని వివరించారు. ఫిర్యాదుదారు హైదరాబాద్ వాసి కాబట్టి అతను ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా తనపై కేసులు నమోదు చేయడం చెల్లదని తెలిపారు. డేటా చోరీ ఆరోపణలకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ను ఏర్పాటు చేసిందని, యుద్ధ ప్రాతిపదికన సిట్ దర్యాప్తు చేస్తోందని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని అశోక్ కోర్టును కోరారు. -
అధికారిక సమీక్షల్లో అశోక్ దర్జా!
-
లోకేష్, అశోక్‌ల దోస్తానాకు సాక్ష్యమిదే..!
సాక్షి, అమరావతి: ఈ ఫొటోలో వృత్తంలో ఉన్న వ్యక్తిని చూశారా.. ఆయనే దాకవరం అశోక్. ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ సేవా మిత్ర యాప్ ద్వారా జరిగిన డేటా స్కాంకు సూత్రధారిగా ఉన్న ఐటీ గ్రిడ్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ ఈయన. ఆధార్, రాష్ట్ర ప్రభుత్వ రహస్య డేటా అక్రమంగా కలిగి ఉన్నారన్న ఆరోపణలతో పోలీసు విచారణ ఎదుర్కొంటున్న ఈయన ఏకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపరంగా జరిగే అధికారిక సమీక్ష సమావేశాల్లో మంత్రి నారా లోకేష్‌తోపాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్‌రెడ్డి, రామాంజనేయులు, ఇతర ప్రభుత్వ ఉన్నతాధికారుల మధ్యనే దర్జాగా కూర్చొని ఉన్నారు. ఒక రాజకీయ పార్టీ అయిన టీడీపీకి ఐటీ సేవలు అందించే కంపెనీ యజమాని రాష్ట్ర ప్రభుత్వ అధికారిక సమీక్ష సమావేశాల్లో పాల్గొనడానికి అనుమతి లభించడం, మంత్రి, సీనియర్ ఐఏఎస్ అధికారుల మధ్య దర్జాగా కూర్చోవడాన్ని బట్టి చూస్తే.. మంత్రితో ఆయనకున్న సాన్నిహిత్యం ఏమిటో బోధపడుతుంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్‌తో ఉన్న సాన్నిహిత్యం, ఆయన అండతోనే ప్రభుత్వ అధికార సమీక్ష సమావేశాల్లో అశోక్ పాల్గొంటున్నారని అధికారులు సైతం చెబుతుండడం గమనార్హం. (‘ఐటీ గ్రిడ్స్’పై సిట్) లోకేష్ వెంటే ఉంటూ ఎప్పుడూ ఆయన అధికారిక సమావేశాల్లో పాల్గొంటారని వారు చెబుతున్నారు. సచివాలయంలోని ఐదవ బ్లాక్‌లో మంత్రి లోకేష్ చాంబర్లోనే అశోక్ ఎప్పుడూ ఉంటారని.. మంత్రి కార్యాలయంలో ఆయనదే పూర్తి హవా అని అంటున్నారు. టీడీపీకి ఐటీ సేవలందించే అశోక్‌కు చెందిన సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం ఖజానా నుంచి మంత్రి లోకేష్ శాఖల ద్వారానే కోట్ల రూపాయలు చెల్లింపులు సైతం జరిగాయి. గత ఎనిమిది నెలల్లో నాలుగు విడతల్లో ఈ కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం రూ.1.01 కోట్లు చెల్లించింది. దీన్నిబట్టి పార్టీకోసం పనిచేసేవారిని ప్రభుత్వ విధుల్లో భాగస్వాముల్ని చేయడమేగాక ప్రభుత్వం నుంచి ఐటీ కాంట్రాక్టులను సైతం కట్టబెట్టారనేది స్పష్టమవుతోంది. మొత్తంగా ఈ తతంగంలో ప్రభుత్వ పెద్దలకు సంబంధించిన భారీ కుట్ర దాగి ఉందని అధికార వర్గాల్లోనే చర్చ జరుగుతుండడం గమనార్హం. ఇది చదవండి : టీడీపీ మైండ్‌గేమ్! -
అదే నువ్వు అదే నేను...
‘అభినందన’ సినిమాలోని ‘అదే నువ్వు అదే నేను.. అదే గీతం పాడనా...’ అనే సూపర్‌హిట్ సాంగ్‌ను సంగీతప్రియులు మరచిపోలేరు. ఈ సూపర్‌హిట్ సాంగ్‌లోని ‘అదే నువ్వు అదే నేను’ టైటిల్‌తో ఓ సినిమా ప్రారంభమైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, అమర్‌రాజా మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ కంపెనీ లిమిటెడ్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ద్వారా శశి దర్శకునిగా పరిచయమవుతున్నారు. గల్లా అశోక్, నభా నటేశ్ జంటగా నటిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడు గల్లా జయదేవ్ కుమారుడు, హీరో మహేశ్‌బాబు మేన ల్లుడే గల్లా అశోక్. ఈ చిత్రం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన సూపర్‌స్టార్ కృష్ణ ముహూర్తపు షాట్‌కు క్లాప్ కొట్టారు. చిత్రనిర్మాతల్లో ఒకరైన ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గల్లా అశోక్‌ను మా బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ద్వారా హీరోగా పరిచయం చేయటం ఆనందంగా ఉంది. శశి దర్శకునిగా పరిచయం అవుతున్న ఈ చిత్రానికి హిప్హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు. మిగతా నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలో తెలియజేస్తాను’’ అన్నారు.