'Will Perform Magic Tricks To Earn Money': Rajasthan CM Ashok Gehlot - Sakshi
Sakshi News home page

అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్‌

Published Mon, Jun 5 2023 12:35 PM | Last Updated on Mon, Jun 5 2023 1:05 PM

Rajasthan CM Ashok Gehlot Says I Will Do Magic to Earn Money - Sakshi

జోధ్ పూర్లో నూతనంగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవం సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీకి చేసిన "ఇంద్రజాలికుడు" వ్యాఖ్యలకు స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పొట్టకూటి కోసం అవసరమైతే మళ్ళీ ఇంద్రజాలం  చేసుకుంటాను కానీ జోధ్ పూర్ ప్రజలకు మచ్చ తెచ్చే పని మాత్రం చేయనని అన్నారు.  

రావు జోధా  మార్గ్ ప్రారంభోత్సవంలో... 
15వ శతాబ్దానికి చెందిన మెహరాన్ ఘడ్ కోటకు సందర్శకుల రాకపోకలు సాగేందుకు వీలుగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకప్పుడు జోధ్ పూర్ ఎలా ఉండేది? ఇక్కడ నీళ్లు ఉండేవి కాదు, రైలు సదుపాయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య ఇలా ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 42 ఏళ్లలో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా చేశానని అన్నారు. 

మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటా... 
ఈ సందర్భాంగా కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకుంటూ ఇంద్రజాలం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ..  అవును నేను ఇంద్రజాలికుడినే.. అవసరమైతే పొట్టకూటి కోసం మళ్ళీ ఇంద్రజాలం  చేసుకుంటాను కానీ... జోధ్ పూర్ ప్రజలు తలదించుకునే పనిని ఎన్నడూ చేయనని అన్నారు.
 
మాయ చేస్తోంది మీరు. మీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే రావు జోధా మార్గ్ ఉదాహరణ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆలస్యం చేశారు. ఖర్చు కూడా 39 వేల కోట్ల నుండి 72 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కొనసాగించకుండా జాప్యం చేశారన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement