Gehlot
-
ప్రభుత్వాన్ని కూల్చేందుకు కుట్ర: డీకే శివకుమార్
బెంగుళూరు: గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం(ఆగస్టు) ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని విమర్శించారు. బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడాన్ని శివకుమార్ తప్పుబట్టారు.ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ,జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవన్నారు. -
లిక్కర్ కేసు.. ఢిల్లీ మంత్రిని 5 గంటలు విచారించిన ఈడీ
న్యూఢిల్లీ: లిక్కర్ కేసులో ఆమ్‌ఆద్మీపార్టీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) నీడలా వెంటాడుతోంది. ఇటీవలే ఈ కేసులో పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను అరెస్టు చేసిన ఈడీ తాజాగా ఢిల్లీ ప్రభుత్వంలోని మరో మంత్రి కైలాష్ గెహ్లాట్‌ను శనివారం(మార్చ్ 30) ఐదు గంటల పాటు విచారించింది. లిక్కర్ స్కామ్ సొమ్మును గోవా ఎన్నికల్లో ఆప్ పార్టీ ఖర్చు చేసిన విషయం తనకు తెలియదని గెహ్లాట్ ఈడీకి సమాధానమిచ్చినట్లు తెలిసింది. కాగా, రద్దయిన వివాదాస్పద లిక్కర్ పాలసీ 2021-22 రూపొందించడంలో కైలాష్గెహ్లాట్ కూడా కీలకంగా వ్యవహరించారు. లిక్కర్ పాలసీ రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ప్యానెల్లో గెహ్లాట్ సభ్యులుగా ఉన్నారు. లిక్కర్ పాలసీని అధికారికంగా వెల్లడించకముందే సౌత్ గ్రూప్‌నకు పాలసీ డ్రాఫ్ట్ లీకయిందని ఈడీ ఆరోపిస్తోంది. పాలసీ రూపొందిస్తున్న సమయంలో గెహ్లాట్ తన అధికారిక నివాసాన్ని వాడుకోవడానికి ఆప్ కమ్యూనికేషన్ ఇన్ఛార్జ్ విజయ్నాయర్కు అనుమతిచ్చారని, ఇంతేగాక గెహ్లాట్ తన మొబైల్ నంబర్లను పదే పదే మార్చారని ఈడీ చెబుతోంది. విజయ్‌నాయర్ తన అధికారిక నివాసంలో ఉన్నాడన్న విషయాన్ని తాను ఒప్పుకుంటున్నట్లు గెహ్లాట్ తాజా విచారణలో ఈడీకి చెప్పినట్లు తెలిసింది. ఇదీ చదవండి.. లిక్కర్‌స్కామ్‌లో ఈడీ దూకుడు -
కాంగ్రెస్ హై కమాండ్‌కు ఏటీంఎంలా రాజస్థాన్ : అమిత్ షా
జైపూర్ : కేంద్ర హోం మంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాజస్థాన్‌ను కాంగ్రెస్ ఢిల్లీ పెద్దలు ఏటీఎమ్‌లా వాడుకున్నారని, ఎప్పుడు కావాలంటే అప్పుడు కార్డు గీకి డబ్బులు తీసుకున్నారని ఆరోపించారు. సీఎం అశోక్‌గెహ్లాట్ ఆయన పార్టీ ఢిల్లీ పెద్దలకు రాజస్థాన్‌ను ఏటీఎంలాగా వాడుకునే సదుపాయాన్ని కల్పించారని ఎద్దేవా చేశారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అజ్మీర్‌లోని విజయనగర్‌లో జరిగిన సభలో అమిత్ షా ప్రసంగించారు. అవినీతిలో రాజస్థాన్ దేశంలోనే నెంబర్‌వన్‌గా ఉందని అమిత్ షా విమర్శించారు. మహిళల పట్ల నేరాల్లో,సైబర్ నేరాల్లో రాజస్థాన్ టాప్‌లో ఉందన్నారు. ఇక్కడి ప్రభుత్వాన్ని గద్దె దించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడంలో గెహ్లాట్ ప్రభుత్వం అన్ని హద్దులు దాటేసిందని అమిత్ షా ఫైర్ అయ్యారు. కన్హయ్యలాల్‌ను పట్టపగలు చంపితే ప్రభుత్వ పెద్దలు ఒక్కరూ ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. రాజస్థాన్‌ను గెహ్లాట్ అల్లర్ల రాష్ట్రంగా మార్చారన్నారు. ఇదీచదవండి.. ఫిలిప్పీన్స్‌లో భారీ భూకంపం: పరుగులు తీసిన జనం -
అవసరమైతే మ్యాజిక్కులు చేసుకుని బతుకుతా.. రాజస్థాన్ సీఎం కౌంటర్
జోధ్ పూర్లో నూతనంగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవం సందర్బంగా రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ తనపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషీకి చేసిన "ఇంద్రజాలికుడు" వ్యాఖ్యలకు స్పందించి గట్టి కౌంటర్ ఇచ్చారు. నేను పొట్టకూటి కోసం అవసరమైతే మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ జోధ్ పూర్ ప్రజలకు మచ్చ తెచ్చే పని మాత్రం చేయనని అన్నారు. రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో... 15వ శతాబ్దానికి చెందిన మెహరాన్ ఘడ్ కోటకు సందర్శకుల రాకపోకలు సాగేందుకు వీలుగా నిర్మించిన రావు జోధా మార్గ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఒకప్పుడు జోధ్ పూర్ ఎలా ఉండేది? ఇక్కడ నీళ్లు ఉండేవి కాదు, రైలు సదుపాయం కూడా లేదు. కానీ ఇప్పుడు ఇక్కడ నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. రోడ్లు, రైళ్లు, విద్యుత్తు, ఆరోగ్యం, విద్య ఇలా ఇప్పుడు ఇక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి. నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఈ 42 ఏళ్లలో ఇక్కడ చేయాల్సిన అభివృద్ధి అంతా చేశానని అన్నారు. మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటా... ఈ సందర్భాంగా కేంద్రం చేసిన అభివృద్ధిని తానే చేశానని చెప్పుకుంటూ ఇంద్రజాలం చేసి ప్రజలను మభ్య పెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సీపీ జోషి చేసిన వ్యాఖ్యలకు స్పందిస్తూ.. అవును నేను ఇంద్రజాలికుడినే.. అవసరమైతే పొట్టకూటి కోసం మళ్ళీ ఇంద్రజాలం చేసుకుంటాను కానీ... జోధ్ పూర్ ప్రజలు తలదించుకునే పనిని ఎన్నడూ చేయనని అన్నారు. మాయ చేస్తోంది మీరు. మీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చెప్పడానికి ఇదే రావు జోధా మార్గ్ ఉదాహరణ. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత అంతకుముందే ప్రారంభమైన ఈ నిర్మాణాన్ని పూర్తి చేయకుండా ఆలస్యం చేశారు. ఖర్చు కూడా 39 వేల కోట్ల నుండి 72 వేల కోట్లకు పెంచేశారు. ఇప్పటివరకు బీజేపీ ఇక్కడ చేసిన అభివృద్ధి ఏమీ లేదని కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ప్రారంభించిన అన్ని ప్రాజెక్టులను కొనసాగించకుండా జాప్యం చేశారన్నారు. -
సోనియాగాంధీతో రాజస్థాన్ సీఎం గెహ్లాట్ భేటీ
-
కరోనాతో కేంద్రమంత్రి కుమార్తె కన్నుమూత
ఇండోర్: కేంద్ర మంత్రి తావర్ చంద్ గహ్లోత్ కుమార్తె గోయిత సోలంకి (42) కరోనా బారినపడి కన్నుమూశారు. చికిత్స తీసుకుంటూ ఆమె మరణిం చారని ఆస్పత్రి అధికారులు సోమవారం వెల్లడించారు. కరోనా సోకిన అనంతరం ఆమెను మొదట గా ఉజ్జయినిలోని పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. అయితే పరిస్థితి విషమించడంతో వారం క్రితం ఇండోర్‌లోని మేదాంత ఆస్పత్రికి తీసుకొచ్చారు. అయితే అప్పటికే ఆమె ఊపిరితిత్తుల్లో 80 శాతం వైరస్ బారినపడటంతో రక్షించలేకపోయామని ఆస్పత్రి డైరెక్టర్ సందీప్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆమె మరణం పట్ల మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు వీడీ శర్మ, పలువురు పార్టీ నేతలు విచారం వ్యక్తం చేశారు. -
17 నుంచి కొలువు తీరనున్న 17వ లోక్‌సభ
సాక్షి, న్యూఢిల్లీ : ఈనెల 17 నుంచి 26 వరకూ పార్లమెంట్ సమావేశాలు జరగనున్నాయి. రాజ్యసభలో సభానాయకుడిగా కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లోట్ నియమితులయ్యారు. బీజేపీ సీనియర్‌నేత, కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ స్ధానంలో గెహ్లాట్ ఈ బాధ్యతలు చేపట్టనున్నారు. రాజ్యసభలో ఉపనాయకుడిగా పీయూష్ గోయల్ వ్యవహరిస్తారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ రాజ్యసభ నేతను నియమిస్తుంది. లోక్‌సభలో సభా నాయకుడిగా ప్రధాని నరేంద్ర మోదీ, ఉపనాయకుడిగా రాజ్‌నాథ్ సింగ్ వ్యవహరించనున్నారు. ఈనెల 17 నుంచి లోక్‌సభ సమావేశాలు ప్రారంభం కానుండగా 20 నుంచి రాజ్యసభ సమావేశాలు జరగనున్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన ఎంపీలు 17, 18 తేదీల్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఈనెల 19న స్పీకర్ ఎన్నిక జరగనుండగా, 20న పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్ ప్రసంగిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని బలోపేతం చేస్తాం
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ చట్టంలో లోపాలను సవరించి బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా పదవీ విరమణ పొందిన కె.రాములును మంగళవారం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాములు చాలా నిబద్ధతతో పనిచేశారని, అందుకే ఆయనకు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా సముచిత గౌరవం దక్కిందని గెహ్లాట్ అన్నారు. మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారం అన్నారు. ఏపీలోని గరగపర్రు లో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు 265 దళిత కుటుంబాలను వెలి వేశారని ఆ గ్రామాన్ని ఇంతవరకు సీఎం చంద్రబాబు సందర్శించకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. అనంతరం హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్, ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ మురుగన్, రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు, ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు. -
'బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలి'
సామాజిక న్యాయ మంత్రిని కలిసిన దేవేందర్ గౌడ్ న్యూఢిల్లీ బీసీ సాధికారత సంస్థ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ మంగళవారం ఇక్కడ సామాజిక న్యాయ శాఖ మంత్రి గెహ్లాట్‌ను కలిశారు. సంస్థ ప్రధాన కార్యదర్శి కస్తూరి జయప్రసాద్, కార్యవర్గ సభ్యుడు చొప్పరి శంకర్ ముదిరాజ్ కేంద్రమంత్రిని కలిసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా బీసీల అభ్యున్నతికి తగు చర్యలు తీసుకోవాలని ఒక వినతిపత్రం ఇచ్చారు.