హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ చట్టంలో లోపాలను సవరించి బలోపేతం చేస్తామని కేంద్ర మంత్రి థావర్‌చంద్ గెహ్లాట్ అన్నారు. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడిగా పదవీ విరమణ పొందిన కె.రాములును మంగళవారం ఇక్కడ ఎస్సీ, ఎస్టీ సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. రాములు చాలా నిబద్ధతతో పనిచేశారని, అందుకే ఆయనకు ఎస్సీ కమిషన్ సభ్యుడిగా సముచిత గౌరవం దక్కిందని గెహ్లాట్ అన్నారు.
మోదీ ప్రభుత్వం వచ్చాక దేశంలో అన్నివర్గాలకు న్యాయం చేస్తున్నామని కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ గంగారం అన్నారు. ఏపీలోని గరగపర్రు లో అంబేడ్కర్ విగ్రహాన్ని పెట్టినందుకు 265 దళిత కుటుంబాలను వెలి వేశారని ఆ గ్రామాన్ని ఇంతవరకు సీఎం చంద్రబాబు సందర్శించకపోవడం బాధాకరమని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు.
అనంతరం హోంమం త్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడారు. కార్యక్రమం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ నేత కిషన్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జి.వివేక్, ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ మురుగన్, రిటైర్డ్ ఐఏఎస్ కాకి మాధవరావు, ప్రజా గాయకుడు గద్దర్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment