బెంగుళూరు: గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ బీజేపీకి అనుకూలంగా పనిచేస్తున్నారని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ ఆరోపించారు. శుక్రవారం(ఆగస్టు) ఈ విషయమై ఆయన విలేకరులతో మాట్లాడారు. బీజేపీ ఒత్తిళ్లకు తలొగ్గి ప్రభుత్వం పంపిన బిల్లులను గవర్నర్ వెనక్కి పంపారని విమర్శించారు.
బీజేపీకి అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటే ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు ఎందుకని ప్రశ్నించారు. బిల్లులకు సంబంధించి గవర్నర్‌కు ఏవైనా అనుమానాలుంటే ప్రభుత్వం సమాధానమిస్తుందని పేర్కొన్నారు. ముడా స్కామ్‌లో సీఎం సిద్ధరామయ్యను విచారించేందుకు గవర్నర్ అనుమతివ్వడాన్ని శివకుమార్ తప్పుబట్టారు.
ఈ విషయంలో సీఎంకు పార్టీ సభ్యులంతా అండగా నిలుస్తారన్నారు. ప్రజల కోసం పని చేస్తున్న ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ,జేడీఎస్‌లు ప్రయత్నిస్తున్నాయని, వారి ప్రయత్నాలు ఫలించవన్నారు.
Comments
Please login to add a commentAdd a comment