మందుబాబులకు సందేశం | komari janaki ram new movie shooting completed | Sakshi
Sakshi News home page

మందుబాబులకు సందేశం

Published Sat, Jan 4 2020 1:11 AM | Last Updated on Sat, Jan 4 2020 1:11 AM

komari janaki ram new movie shooting completed - Sakshi

శ్రష్టి వర్మ

ఆనందకృష్ణ, స్వాతిమండల్, అశోక్, యాంకర్‌ ఇందు, వెంకటేష్‌ ముఖ్య తారలుగా కొమారి జానకీరామ్‌ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. తోలుబొమ్మల సిత్రాలు బ్యానర్‌పై కొమారి జానయ్య నాయుడు నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. జానకీరామ్‌ మాట్లాడుతూ– ‘‘కామెడీ, హారర్, థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది.

మా సినిమా ప్రేక్షకులకు థ్రిల్లింగ్‌తో పాటు సందేశం ఇస్తుంది. బాచుపల్లి దగ్గర వేసిన ప్రత్యేకమైన సెట్‌లో ప్రత్యేక పాట చిత్రీకరణతో షూటింగ్‌ మొత్తం పూర్తయింది. ఈ పాట మద్యానికి బానిసైన వారికి మంచి సందేశాన్ని ఇచ్చే విధంగా ఉంటుంది. శ్రష్టి వర్మ డాన్స్‌ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: డి.యాదగిరి, సంగీతం: యు.వి.నిరంజన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement