సాక్షి, హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాలలో దుమారం రేపిన ఐటీ గ్రిడ్స్ డేటా చోరి కేసును సిట్ ముమ్మరం చేశారు. ఐటీ గ్రిడ్స్ చైర్మన్ అశోక్‌కు మరోసారి నోటీసులు అందించేందుకు సిద్దమయ్యారు. ఈనెల 11న నోటీసులు జారీ చేసినప్పటికి విచారణకు హాజరు కాలేదు. హైకోర్టు ఆదేశాలు ఉన్నా అశోక్ విచారణకు హాజరుకాకపోవడం పట్ల సిట్ అధికారులు సీరియస్‌గా ఉన్నారు. 41సీఆర్సీసీ కింద అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇప్పటి వరకు జరిగిన విచారణను కోర్టుకు పూర్తి స్థాయిలో నివేదిక రూపంలో అందించనున్నారు. ఈ నెల 20న హైకోర్టుకు ఈ కేసుపై నివేదిక ఇవ్వనున్నామని అధకారులు పేర్కొన్నారు.
విచారణలో భాగంగా మార్చి 13న తమ ముందు హాజరుకావాలని ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అశోక్‌కు ఈ నెల 11న నోటీసులు జారీ చేసింది. కేపీహెచ్‌బీలోని అశోక్ ఇంటికి వెళ్లిన పోలీసులకు తాళం వేసి ఉండటంతో గోడకు నోటీసులు అంటించి వెనుదిరిగారు. బుధవారం ఉదయం గోషామహల్‌లోని తమ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కానీ ఈ నోటీసులకు అశోక్ స్పందించలేదు. విచారణకు డుమ్మా కొట్టారు. గతంలోనూ విచారణకు రావాలని అశోక్‌కు నోటీసులు జారీ చేసినా ఆయన స్పందించలేదు.
సంబంధిత కథనాలు
సిట్ విచారణకు అశోక్ మళ్లీ డుమ్మా!
Comments
Please login to add a commentAdd a comment