
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచార తస్కరణ కేసులో పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు ఐటీ గ్రిడ్స్ సంస్థ డైరెక్టర్ అశోక్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఆఖరి నోటీసులు జారీ చేసింది. మార్చి 2, 11, 16వ తేదీల్లో మూడుసార్లు పోలీసులు నోటీసులు జారీ చేసినప్పటికీ అశోక్ నోటీసులకు స్పందించలేదు. దీంతో పబ్లిక్ నోటీసులకు సిట్ సిద్ధమైంది. గతంలో జారీ చేసిన నోటీసులను అశోక్ నేరుగా తీసుకోలేదు.
తెలంగాణ నుంచి ఏపీకి పారిపోయాక అతని ఆచూకీ కనిపెట్టడం పోలీసులకు కష్టంగా మారింది. దీంతో ప్రచార సాధనాల (కొన్ని ఆంగ్ల పత్రికలు) ద్వారా పబ్లిక్ నోటీసులు జారీ చేసింది. అశోక్ ఎక్కడున్నా ప్రకటన వెలువడిన మూడు రోజుల్లోగా గోషామహల్‌లోని సిట్ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పష్టం చేసింది. సిట్‌కి నేతృత్వం వహిస్తున్న ఐజీ స్టీఫెన్ రవీంద్ర పేరు మీద ఈ ప్రకటన వెలువడింది. దీనిపై అశోక్ స్పందనను బట్టి సిట్ తదుపరి చర్యలకు సమాయత్తం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment