రిమ్స్ మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో డాక్టర్ సందీప్ పవార్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది.
ఆదిలాబాద్: ఆదిలాబాద్ రిమ్స్‌లో వివాదం రోజురోజుకూ ముదురుతోంది. రిమ్స్ మెడికల్ విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో డాక్టర్ సందీప్ పవార్‌పై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. రిమ్స్ డైరెక్టర్‌గా అశోక్‌ను పదవి నుంచి తొలగించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఆయనతో పాటు నిందితుడు డాక్టర్ సందీప్ పవార్ ను విధుల నుంచి తప్పించేందుకు పోలీసులు ప్రణాళికలు సిద్ధ చేస్తున్నారు. రిమ్స్ మెడికో విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన సందీప్ పవార్‌ను అరెస్ట్ చేయాలని బుధవారం దళిత, ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట మహాధర్నా చేపట్టిన సంగతి తెలిసిందే.
అలాగే రిమ్స్ డైరెక్టర్ అశోక్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని, ఆయన్ను డైరెక్టర్ పదవి నుంచి వెంటనే తప్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో డాక్టర్ సందీప్ పవార్ కేసులో తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని రిమ్స్ డైరెక్టర్ అశోక్ నిన్న జరిగిన సమావేశంలో తెలిపిన సంగతి విదితమే.