ఇది అత్యంత ప్రాచీనమైన కోటల్లో ఒకటి. ఒడిశాలోని ఖుర్దా జిల్లాలో ఉన్న ఈ కోట పేరు శిశుపాలగడ. క్రీస్తుపూర్వం ఏడో శతాబ్ది నాటి కోట ఇది. ఈ కోట, దాని చుట్టు ఏర్పడిన నగరానికి చెందిన శిథిలాలు మాత్రమే ఇప్పుడు మిగిలాయి.
అశోకుడు కళింగ యుద్ధం చేసేనాటికి ముందు దాదాపు క్రీస్తుపూర్వం నాలుగో శతాబ్ది కాలంలో ఈ నగరం అద్భుతంగా వర్ధిల్లినట్లు ఇక్కడ దొరికిన ఆధారాల వల్ల తెలుస్తోంది. మౌర్యుల కాలానికి ముందు నిర్మించిన ఈ కోట ఆనాటి కాలంలోని ఏథెన్స్ నగరానికి మించి ఉండేదని చరిత్రకారులు ఎం.ఎల్.స్మిత్, ఆర్.మహంతి తమ పరిశోధనల ద్వారా వెల్లడించారు.
అప్పట్లో శిశుపాలగడ జనాభా దాదాపు పాతికవేల వరకు ఉంటే, అదేకాలంలో ఏథెన్స్ జనాభా పదివేల వరకు మాత్రమే ఉండేదని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు ఇక్కడి చారిత్రక ఆధారాలను పరిరక్షిస్తున్నారు.
(చదవండి: రోబో చిత్రానికి రూ.9 కోట్లు)
Comments
Please login to add a commentAdd a comment