దర్శకుడి ప్రేమకథ | Director complete the audio release on 15th of this month | Sakshi
Sakshi News home page

దర్శకుడి ప్రేమకథ

Published Thu, Jul 6 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 3:22 PM

దర్శకుడి ప్రేమకథ

దర్శకుడి ప్రేమకథ

‘కుమారి 21ఎఫ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌ నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’.

‘కుమారి 21ఎఫ్‌’ వంటి హిట్‌ చిత్రం తర్వాత దర్శకుడు సుకుమార్‌ నిర్మించిన చిత్రం ‘దర్శకుడు’. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలిసి సుకుమార్‌ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర పనులు జరుపుకుంటోంది. నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ప్రేమకు, లక్ష్యానికి మధ్య నలిగిపోయే ఓ దర్శకుడి ప్రేమకథ ఇది.

స్వార్థపరుడైన దర్శకుడు ప్రేమలో పడితే ఏం జరుగుతుందన్నది ఆసక్తి రేకెత్తిస్తుంది. సాయికార్తీక్‌ అందించిన పాటలను ఒక్కొక్కటిగా విడుదల చేసి, పూర్తి ఆడియోను ఈ నెల 15న ఓ ప్రముఖ హీరో  చేతుల మీదగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అశోక్‌ నటన, హరిప్రసాద్‌ జక్కా దర్శకత్వ ప్రతిభ ఈ సినిమాకు హైలైట్‌. ఆగస్టు 4న సినిమా విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ప్రవీణ్‌ అనుమోలు, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: రమేష్‌ కోలా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement