
దర్శకుడికి తొలి ప్రేక్షకుడు చిరంజీవే!
‘‘నాకిది చాలా కొత్తగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఫస్ట్ టికెట్‌ను నాకు అందించి, ‘దర్శకుడు’ సినిమాకు నన్ను తొలి ప్రేక్షకుణ్ణి చేసిన ఈ యూనిట్ సభ్యులకు, ముఖ్యంగా సుకుమార్‌కు ధన్యవాదాలు’’ అన్నారు చిరంజీవి. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను చిత్రబృందం చిరంజీవికి అందించగా, ఆయన కొనుక్కున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న సుకుమార్ తనకున్న టైమ్‌లో మంచి కథలు రాసుకుని డబ్బు, పేరు సంపాదించుకోవచ్చు. కానీ, అతను అలా ఆలోచించకుండా సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించి... ప్రతిభ గల రచయితలు, దర్శకులు, ఆర్టిస్టులను ప్రోత్సహించడం అభినందనీయం. దీన్ని చిత్రపరిశ్రమకు తను చేస్తున్న కాంట్రిబ్యూషన్‌గా ఫీలవుతున్నా. ‘కుమారి 21ఎఫ్’ కంటే ఈ ‘దర్శకుడు’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు.