Darshakudu
-
దర్శకుడికి తొలి ప్రేక్షకుడు చిరంజీవే!
‘‘నాకిది చాలా కొత్తగానూ, ఆశ్చర్యంగానూ ఉంది. ఫస్ట్ టికెట్‌ను నాకు అందించి, ‘దర్శకుడు’ సినిమాకు నన్ను తొలి ప్రేక్షకుణ్ణి చేసిన ఈ యూనిట్ సభ్యులకు, ముఖ్యంగా సుకుమార్‌కు ధన్యవాదాలు’’ అన్నారు చిరంజీవి. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ఫస్ట్ టికెట్‌ను చిత్రబృందం చిరంజీవికి అందించగా, ఆయన కొనుక్కున్నారు. అనంతరం చిరంజీవి మాట్లాడుతూ– ‘‘దర్శకుడిగా ఉన్నత స్థాయిలో ఉన్న సుకుమార్ తనకున్న టైమ్‌లో మంచి కథలు రాసుకుని డబ్బు, పేరు సంపాదించుకోవచ్చు. కానీ, అతను అలా ఆలోచించకుండా సుకుమార్ రైటింగ్స్ సంస్థను స్థాపించి... ప్రతిభ గల రచయితలు, దర్శకులు, ఆర్టిస్టులను ప్రోత్సహించడం అభినందనీయం. దీన్ని చిత్రపరిశ్రమకు తను చేస్తున్న కాంట్రిబ్యూషన్‌గా ఫీలవుతున్నా. ‘కుమారి 21ఎఫ్’ కంటే ఈ ‘దర్శకుడు’ పెద్ద హిట్టవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. -
'దర్శకుడు' టికెట్ కొన్న చిరంజీవి
-
దర్శకుడు అందరికీ లైఫ్ ఇస్తాడు
అల్లు అర్జున్ ‘‘ఫైట్ మాస్టర్ ఫైట్ తీస్తాడు, డ్యాన్స్ మాస్టర్ డ్యాన్స్ చేస్తాడు, యాక్టర్స్ యాక్ట్ చేస్తాడు. మరి, దర్శకుడు ఏం చేస్తాడు? నన్నడిగితే.. అందరికీ లైఫ్ ఇస్తాడు’’ అన్నారు అల్లు అర్జున్. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ప్రీ–రిలీజ్ వేడుకకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆగస్టు 4న ఈ సిన్మా రిలీజవుతుందని ప్రకటించిన అనంతరం అల్లు అర్జున్ మాట్లాడుతూ– ‘‘మామూలుగా 24 క్రాఫ్ట్స్ అంటారు. నేను 25 అంటుంటా. మొదటిది ఈగో మేనేజ్మెంట్. అందరి ఈగోనూ దర్శకుడు మేనేజ్ చేస్తుంటాడు. దర్శకుల్లోనే నాకిష్టమైన డైరెక్టర్ సుకుమార్. వ్యక్తిగానూ ఇష్టమే. నేను ‘ఐ లవ్యూ’ చెప్పే ఇద్దరు ముగ్గురు మగాళ్లలో సుకుమార్ ఒకడు. ఏడెనిమిదేళ్ల క్రితం సుకుమార్ బోలెడు కథలు చెప్పేవాడు. ‘నువ్వెలాగూ ఏడాదికి ఒకటో, రెండో సినిమాలు తీస్తావ్. అన్నీ తీయ లేవ్’ అంటే... ‘ఇలాంటి కథలతో సినిమాలు నిర్మిస్తా’ అన్నాడు. ‘అనుకుంటాం గానీ... తీయగలమా?’ అన్నా. ‘నేను తీయగలను’ అన్నాడు సుకుమార్. తీస్తున్నాడు. ఈ సినిమా మంచి హిట్టవ్వాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా ట్రైలర్లు చూస్తుంటే సుకుమారే గుర్తొస్తున్నాడు. అందులో హీరో ప్యాకప్ అని చెప్పి లేచే యాటిట్యూడ్ అతనిదే’’ అన్నారు ‘దిల్’ రాజు. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘‘1 నేనొక్కడినే’ టైమ్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరతానని అశోక్ వచ్చాడు. బాగా రాస్తే, జాయిన్ చేసుకున్నా. హ్యాపీగా దర్శకుడు కావల్సినోణ్ణి, ఈ దర్శకుడు (హరిప్రసాద్) తను దర్శకుడు కావడం కోసం హీరోని చేసేశాడు. ఇద్దరికీ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. హరిప్రసాద్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. నా వల్లే బన్నీ హీరో అయ్యాడు! ‘‘ఆర్య’ షూటింగు అప్పుడు బోటు రివర్స్ కావడంతో నీళ్లలో పడ్డా. నాకు ఈత రాదు. షాక్‌తో చూస్తున్నారంతా. ఇంకో క్షణమైతే పోయేవాణ్ణే. అప్పుడు ప్రాణాలకు తెగించి నీళ్లలో దూకి బన్నీ కాపాడాడు. సో, నేను నీళ్లలో పడి ఛాన్స్ ఇవ్వబట్టే బన్నీ నా రియల్ లైఫ్‌లో హీరో అయ్యాడు. లేదంటే హీరో ఎలా అవుతాడు? ‘డార్లింగ్... థ్యాంక్స్. సేవ్ చేశావ్’ అంటే... ‘ఏడు కథలివ్వు చాలు’ అని ప్రామిస్ చేయించుకున్నా డు. అప్పుడు నా ఈగో హరై్టంది. బన్నీతో చేస్తే కల్ట్ సినిమాలే చేయాలి. అలాంటి కథ దొరికినప్పుడు చేస్తా’’ -
క్లీన్ 'యు' దర్శకుడు
అశోక్, ఇషా రెబ్బా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో హరి ప్రసాద్ జక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా, హీరోగా సుకుమార్ అన్న కొడుకు పరిచయం అవుతుండటంతో దర్శకుడిపై ఆసక్తి నెలకొంది. ఒక దర్శకుడు తన నిజ జీవితంలో పడే కష్టాలు, ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో సుకుమార్ చిత్రాల్లో నటించిన అగ్ర హీరోలు పాల్గొంటుండటంతో దర్శకుడుపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. -
సుకుమార్ మాట నిలబెట్టుకున్నాడు
‘‘హీరోల యాటిట్యూడ్, ఆలోచనలు, క్యారెక్టరైజేషన్ వల్ల సుకుమార్ సినిమాలకు కొత్తదనం వస్తుంది. ‘ఆర్య’లో ఆర్య, ‘100% లవ్’లో బాలు, ‘1 నేనొక్కడినే’లో గౌతమ్, ‘నాన్నకు ప్రేమతో’లో అభిరామ్... ప్రతి పాత్ర కొత్తగా, డిఫరెంట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో హీరో పాత్ర కూడా అంతే కొత్తగా ఉంటుంది’’ అన్నారు నిర్మాత థామస్‌రెడ్డి ఆదూరి. అశోక్, ఈషా జంటగా హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి ఆదూరి, రవిచంద్ర సత్తిలతో కలసి సుకుమార్ నిర్మించిన ‘దర్శకుడు’ ఆగస్టు 4న విడుదల కానుంది. బీఎన్‌సీఎస్‌పీ విజయ్‌కుమార్ మాట్లాడుతూ– ‘‘సుకుమార్ నా తమ్ముడే. చిన్నప్పట్నుంచి దర్శకుడు కావాలనుకున్నాడు. ఓ రోజు ‘నేను దర్శకుడు అయితే నిన్ను నిర్మాతను చేస్తా’ అన్నాడు. ‘దర్శకుడు’తో తన మాట నిలబెట్టుకున్నాడు. హరిప్రసాద్ మాకు పదిహేనేళ్లుగా తెలుసు. ఓ దర్శకుడి ప్రేమకథే ఈ సిన్మా. నాకు తెలిసి ప్రపంచంలో 18 ప్రేమకథలే ఉన్నాయి. తెరపై వాటిని వైవిధ్యంగా ఆవిష్కరించిన వారు విజయాలు అందుకుంటున్నారు. ఆ జాబితాలో మా సినిమా ఉంటుంది. కుటుంబమంతా కలసి చూసే చిత్రమిది’’ అన్నారు. ‘‘కొత్త పాయింట్‌తో, ప్రేక్షకుల్ని టచ్ చేసే సినిమాలు తీయాలని సుకుమార్‌గారు ‘సుకుమార్ రైటింగ్స్’ సంస్థ స్థాపించారు. ఆయన ఆలోచనలకు తగ్గ చిత్రమిది. భారీ సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ ఆయన మాకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. ఇందులో దర్శకులు, చిత్రపరిశ్రమపై సెటైర్స్ లేవు. కొన్ని సీన్లను నిజజీవిత సంఘటనల స్ఫూర్తిగా రాశారు’’ అన్నారు థామస్‌రెడ్డి. -
‘దర్శకుడు’ టీజర్‌ను రిలీజ్ చేసిన ఎన్టీఆర్
-
రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..!
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ పీరియాడిక్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుకుమార్ రెండ్రోజుల్లో తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. అయితే సుకుమార్ రిలీజ్ చేయబోయేది రామ్ చరణ్ హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ కాదు. తను నిర్మాతగా తన అసిస్టెంట్ హరిప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్. అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై హరి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా దర్శకుడు. ఇషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమ్మర్ ఎండింగ్‌కు రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకుడు సినిమా ఫస్ట్ లుక్‌ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కిన తొలి చిత్రం కుమారి 21ఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.