క్లీన్ 'యు' దర్శకుడు
అశోక్, ఇషా రెబ్బా హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్టైనర్ దర్శకుడు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ నిర్మాణంలో తెరకెక్కిన ఈ సినిమాతో హరి ప్రసాద్ జక్కా దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ లో వస్తున్న రెండో సినిమా, హీరోగా సుకుమార్ అన్న కొడుకు పరిచయం అవుతుండటంతో దర్శకుడిపై ఆసక్తి నెలకొంది.
ఒక దర్శకుడు తన నిజ జీవితంలో పడే కష్టాలు, ఎదురయ్యే సంఘటనల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సినిమా ప్రమోషన్ లో సుకుమార్ చిత్రాల్లో నటించిన అగ్ర హీరోలు పాల్గొంటుండటంతో దర్శకుడుపై మంచి హైప్ క్రియేట్ అయ్యింది. సెన్సార్ బోర్డ్ నుంచి క్లీన్ యు సర్టిఫికేట్ పొందిన ఈ సినిమాను ఆగస్టు 4న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు.