రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..! | Sukumar next production firstlook to be Out soon | Sakshi
Sakshi News home page

రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..!

Published Sat, Apr 15 2017 1:30 PM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..!

రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..!

ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ పీరియాడిక్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుకుమార్ రెండ్రోజుల్లో తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేస్తున్నాడు. అయితే సుకుమార్ రిలీజ్ చేయబోయేది రామ్ చరణ్ హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ కాదు. తను నిర్మాతగా తన అసిస్టెంట్ హరిప్రసాద్ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్.

అశోక్ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్పై హరి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా దర్శకుడు. ఇషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమ్మర్ ఎండింగ్కు రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకుడు సినిమా ఫస్ట్ లుక్ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కిన తొలి చిత్రం కుమారి 21ఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement