Hari Prasad
-
జాతీయత కొరవడిన పార్టీ.. స్వార్థ ప్రయోజనానికే పెద్దపీట
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ సారథ్యంలో అప్రతిహతంగా పురోగమిస్తున్న భారత్ కీర్తి బావుటా విశ్వ వినీలాకాశంలో ఇప్పుడు మరింత పైఎత్తున ఎగురుతోంది. మొట్ట మొదటి సారిగా జీ–20 అధ్యక్ష హోదా చేపట్టి విశ్వవేదికపై తన సత్తాను భారత్ మరో మారు చాటి చెప్పింది. ఐరోపా యూనియన్ సహా 19 దేశాలు సభ్యులుగా ఉన్న గొప్ప వేదిక ఇది. ప్రపంచ జీడీపీలో 90 శాతం, అంతర్జాతీయ వాణిజ్యంలో 80 శాతం, ప్రపంచ జనాభాలో మూడింట రెండు వంతులు జీ–20 దేశాలవే. ప్రపంచ ఆర్థిక వ్యవహారాల్లో జీ–20 పాత్ర ఏమిటో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇతర దేశాల తలరాతను శాసిస్తూ లాభార్జనే ధ్యేయమైన రెండు ఆర్థిక నమూనాలు ఇప్పుడు ప్రపంచంలో కొనసాగుతున్నాయి. ఆధిపత్యం చలాయిస్తూనే తమ ఉత్పత్తులతో విదేశా లను ముంచెత్తే పాశ్చాత్య నమూనా ఒక వైపు, ఆర్థికంగా బలహీనంగా ఉన్న దేశాలకు అప్పుల వలవేసి దివాలా తీయించే చైనా నయా వలసవాద నమూనా మరొక వైపు ఉన్నాయి. దీనికి పూర్తి భిన్నంగా విశ్వ మానవ సౌభ్రాతృత్వ స్ఫూర్తితో భారత్ ముందుకు సాగుతోంది. కోవిడ్ కష్ట కాలంలో ప్రపంచాన్ని భారత్ ఆదుకున్న తీరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ఇటువంటి భారత్ జీ–20కి నాయకత్వ స్థానంలో ఉండి చేయగలిగింది ఎంతో ఉంది. డిసెంబర్ ఒకటో తేదీన జీ–20 అధ్యక్ష హోదా స్వీకరించిన భారత్, వచ్చే 12 నెలల కాలంలో దేశవ్యాప్తంగా 200 పైగా సమావేశాలు నిర్వ హించాలని నిశ్చయించింది. అందుకోసం రాజకీయాలకు అతీతంగా అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు డిసెంబర్ 5న ఒక సన్నాహక సమావేశానికి కేంద్రం ఆహ్వానం పలికింది. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, డీఎంకే అధినేత స్టాలిన్ సహా దాదాపు అన్ని పార్టీల అధ్యక్షులు హాజరైన ఆ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం డుమ్మా కొట్టారు. దేశాన్ని ఉద్ధరిస్తానని ‘భారాసా’గా పేరు మార్చుకున్న తెరాస అధ్యక్షుడు యావత్ దేశానికి గర్వకారణమైన ఒక కీలక సమావేశాన్ని బహిష్కరించి దేశం పట్ల తన చిత్తశుద్ధిని చాటుకున్నారు. జాతీయ ప్రాధాన్యం కలిగిన అంశాల విషయంలో ఆ పార్టీ నిబద్ధత ఏ పాటిదో ఆదిలోనే అర్థమయ్యింది. దేశ హితం కన్నా కేవలం స్వార్థ రాజకీయ ప్రయోజనానికే పెద్దపీట వేయడం ఇందుకు కారణం. వచ్చే ఏడాది సెప్టెంబర్‌లో జరగనున్న జీ–20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి వ్యూహాలపై చర్చలు జరిపేందుకు, సూచనలు స్వీకరించేందుకు ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి హాజరుకాని కేసీఆర్, అందుకు కారణాలేమిటో చెప్పగలరా? సొంత లాభాపేక్షే తప్ప తెలంగాణ ప్రజానీకం బాగోగుల గురించి ఆయనకు ఏమాత్రం పట్టింపులేదని దీనివల్ల స్పష్టంగా తెలియడం లేదా? కేంద్ర ప్రభుత్వం ఆయనను ఆహ్వానించినప్పటికీ, సమావేశానికి కావాలనే హాజరు కాకపోవడం... జాతీయ రాజకీయాల్లో కీలక, క్రియాశీలక పాత్ర పోషించాలనుకుంటున్న కేసీఆర్‌కు ఎంత మాత్రం తగని పని. జాతీయ రాజకీయాల్లో రాణించడానికి కావలసిన కలుపుగోలుతనం ఇదేనా? చారిత్రక అవకాశాలను ఇలా చేజేతులా వదిలేసుకోవడం కేసీఆర్‌కు అలవాటైన పనే. జీ–20 సమావేశాలు రాష్ట్ర ప్రభుత్వాల ముందు అనేక అవకాశాల తలుపులు తెరవబోతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వంతో కలిసి తమ రాష్ట్రాల్లో తాజా పెట్టుబడులకు బాటలు వేయడానికి మంచి అవకాశం లభిస్తోంది. తెలంగాణకు చెందిన అనేకమంది సౌదీ అరేబియాలో ప్రవాసం ఉంటున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్‌లో దౌత్య కార్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా సౌదీ అరేబియాను తెలంగాణ ప్రభుత్వం అభ్యర్థించింది. కేంద్ర ప్రభుత్వంతో కలిసి సౌదీ అరేబియా రాజకీయ నాయకత్వంతో చర్చలు జరిపి సానుకూల ఫలితం రాట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ వేదికను ఉపయోగించుకునే అవకాశం ఉంది. జీ –20 అధ్యక్ష హోదా భారత్‌కు దక్కడంతో ఎంతో స్ఫూర్తి పొందిన సిరిసిల్ల పట్టణానికి చెందిన హరిప్రసాద్, స్వయంగా జీ–20 లోగో నేసి ప్రధానమంత్రికి పంపించారు. హరిప్రసాద్ వంటి వారి నుంచి స్ఫూర్తి పొంది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశ హితం కోసం కాకపోయినా.. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యానైనా కేంద్రంతో కలిసి ముందడుగు వేస్తారా? (క్లిక్ చేయండి: సందేహాలు తీరకుండా చర్యలెలా?) - కిశోర్ పోరెడ్డి తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి -
కడుపుబ్బా నవ్విస్తున్న డాక్టర్
-
అమ్మా.. నాన్న ఫోన్ ఎందుకు చేస్తలేడు?
మేడిపెల్లి (వేములవాడ): ‘దుబాయ్ పోయి పైసలు సంపాదించి పిల్లలకు ఏ లోటు రాకుండా చూద్దామని అంటివి. అమ్మను ఏడిపించొద్దు.. చెప్పినట్టు వినాలని పిల్లలకు చెప్తివి. పిల్లలను మంచిగ చూసుకో.. డబ్బులు పంపిస్త.. అని చెప్పి పోయి ఆరు నెలలైతుంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఫోన్ లేదు. అమ్మా.. నాన్న ఎందుకు ఫోన్ చేస్తలేడని పిల్లలు అడిగితే ఇప్పటిదాకా ఏదోలాగా సమాధానం చెప్పుకొచ్చిన. నువ్వు ఎక్కడున్నా మాతో ఫోన్లో మాట్లాడి క్షేమంగా ఉన్నానని చెప్పు’అంటూ జాడలేని తన భర్తకోసం ఓ ఇల్లాలు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడి పెట్టిస్తోంది. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండలం మన్నెగూడెంకు చెందిన శ్రీరాముల హరిప్రసాద్ (40) ఊళ్లోనే టీ స్టాల్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. అతడికి భార్య నీరజతో పాటు పవన్ (9), రక్షిత (7) ఇద్దరు పిల్లలున్నారు. పిల్లలు ఎదుగుతుండటంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. అయినప్పటికీ పిల్లలను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేయాలని ఆశ పడ్డాడు. గల్ఫ్ వెళ్లాలని నిర్ణయించుకొని, అబుదాబిలో హోటల్లో పనికోసం రూ.2 లక్షలు చెల్లించి గతేడాది డిసెంబర్ 27న అక్కడికి వెళ్లాడు. కరోనా నిబంధనల ప్రకారం కంపెనీ వారు హరిప్రసాద్‌ను 10 రోజులపాటు క్వారంటైన్లో ఉంచారు. జనవరి 5న కంపెనీ కేటాయించిన రూములోకి మారాడు. రూల్స్ ప్రకారం మెడికల్ టెస్టులు చేయించి జనవరి 19 నుంచి పనికి రావాలని కంపెనీ యాజమాన్యం తెలిపింది. అయితే జనవరి 18న చిన్న పని ఉందని తనతో రూమ్‌లో ఉన్నవారికి చెప్పి బయటకు వెళ్లిన హరిప్రసాద్ అదృశ్యమయ్యాడు. ఇంతవరకు ఆచూకీ లభ్యం కాలేదు. తన భర్త అబుదాబి వెళ్లి ఫోన్ చేయకపోవడంతో భర్త పనికి కుదిరిన ప్రాంతంలో ఉన్న బంధువులకు ఫోన్ చేసి విషయం చెప్పింది నీరజ. వారు అక్కడికి వెళ్లి చూడగా హరిప్రసాద్ ఫోన్‌తోపాటు లగేజీ కూడా రూములోనే ఉన్నాయి. కంపెనీ వారు సైతం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు వారు వెల్లడించారు. హరిప్రసాద్ ఇంటి నుంచి వెళ్లి ఆరు నెలలు అవుతున్నా భార్య, ఇతర కుటుంబ సభ్యులకు ఫోన్ చేయకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తన భర్తను ఇంటికి రప్పించేలా చూడాలని భార్యా పిల్లలు చేతులు జోడించి వేడుకుంటున్నారు. హరిప్రసాద్ ఆచూకీ తెలుసుకునేందుకు ప్రభుత్వం, అధికారులు చొరవ తీసుకోవాలని, స్వగ్రామానికి తీసుకువచ్చేలా చూడాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోరుతున్నారు. -
ఆర్టీఐ కమిషనర్లుగా కాకర్ల చెన్నారెడ్డి, ఉల్చాల హరిప్రసాద్
-
చీటింగ్ కేసులో టీడీపీ నేత హరిప్రసాద్ అరెస్ట్
రాజంపేట, రాయచోటి: అటాచ్‌లో ఉన్న సొసైటీ ఆస్తులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించిన కేసులో వైఎస్సార్ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. రాజంపేట సీఐ శుభకుమార్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెనగలూరు మండలం కంబాలకుంటకు చెందిన వెంకటసుబ్బయ్య 2001లో శ్రీసాయి ఎడ్యుకేషన్ సొసైటీని స్థాపించాడు. చార్మినార్ బ్యాంకుకు రుణం ఎగవేత కేసులో వెంకటసుబ్బయ్య జైలుకు వెళ్లిన సమయంలో రాజంపేటలో అటాచ్‌లో ఉన్న ఐదెకరాల భూమిని నిబంధనలకు విరుద్ధంగా హరిప్రసాద్ విక్రయించాడు. మూర్తి, శంకర్‌నాయుడు, జోహార్ చౌదరి అతడికి సహకరించారు. వెంకటసుబ్బయ్య ఈనెల 1న దీనిపై రాజంపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. విచారణకు హాజరు కాకుండా పరారీలో ఉన్న నిందితుడు హరిప్రసాద్‌ను ఆదివారం దేవుని కడపలో అరెస్టు చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్‌జైలుకు తరలించారు. బెదిరింపులకు పాల్పడుతున్నాడు హరిప్రసాద్ తన భూములను ఆక్రమించడమే కాకుండా తనపై దుష్ప్రచారం చేస్తున్నట్లు వెంకటసుబ్బయ్య ఆదివారం రాయచోటిలో మీడియాతో పేర్కొన్నాడు. చార్మినార్ బ్యాంకులో రుణం విషయంలో తనను అరెస్టు చేయడంతో సొసైటీ తాత్కాలిక సెక్రటరీగా హరిప్రసాద్‌ను నియమించానన్నారు. ఇదే అదనుగా రాజంపేటలో భూమిని నకిలీ పేర్లతో విక్రయించినట్లు పేర్కొన్నాడు. -
టీడీపీ కడప ప్రధాన కార్యదర్శి అరెస్టు
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్‌ను పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నారు. 2003 కు సంబంధించిన పాత కేసు విషయంలో తనకు అన్యాయం జరిగిందని తాజాగా రాజంపేటకు చెందిన సుబ్బయ్య అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి హరిప్రసాద్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే, చట్టానికి అందరూ అతీతులే అన్న విషయాన్ని మరచి హరిప్రసాద్ పోలీసులపై చిందులు తొక్కారు. వారిపై తిరగబడ్డారు. అయినప్పటికీ సంయమనంతో వ్యవహరించిన పోలీసులు... బందోబస్తు మధ్య ఆయనను రాజంపేట కోర్టులో హాజరుపర్చారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించడంతో.. సబ్ జైలుకు తరలించారు. బురదజల్లే యత్నం టీడీపీ జిల్లా నాయకుడు హరిప్రసాద్ మీడియా ద్వారా బెదిరింపులకు దిగుతున్నాడని శ్రీ సాయి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మేనేజింగ్ డైరెక్టర్ సుబ్బయ్య అన్నారు. ప్రభుత్వం పై బురదజల్లడానికి తనను రాజకీయ నేతగా చిత్రికరిస్తున్నారని విమర్శించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘ నాకు ఏ రాజకీయాలతో సంబంధం లేదు. సాయి ఏడ్యుకేషన్ సోసైటి ఆస్తులు అడ్డదారిలో అమ్ముకోవడంపై ఫిర్యాదు చేశాం. టీడీపీ అధికారంలో ఉన్నంతకాలం న్యాయం జరగలేదు. ఇప్పుడు ఫిర్యాదులో భాగంగా విచారిస్తే ప్రభుత్వంపై బురదజల్లుతున్నారు’అని సుబ్బయ్య పేర్కొన్నారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై కబ్జాదారుల దాడి
సాక్షి, నిజామాబాద్: బాల్కొండ నియోజకవర్గం ఎర్గట్ల మండల కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. సాఫ్ట్వేర్ ఇంజినీర్‌పై కొందరు కబ్జాదారులు దాడికి దిగారు. 430 సర్వే నంబర్ ప్రభుత్వ భూమిని స్కూల్ పిల్లల గ్రౌండ్ కోసం ఉపయోగించాలని, అందుకు సంబంధించిన భూమి వివరాలను సాఫ్ట్వేర్ ఇంజినీర్ హరి ప్రసాద్ .. ఆర్టీఐ ద్వారా అధికారులను వివరాలు కోరారు. దీంతో కక్ష కట్టిన కబ్జాదారులు హరి ప్రసాద్‌పై ఇంటి వద్దకు వచ్చి దాడి చేశారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి తల్లిపై కూడా దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఈ దృశ్యాలు అన్ని సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. హరి ప్రసాద్ ఫిర్యాదు మేరకు పోలీసులు తొమ్మిది మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
టీడీపీలో కొనసాగుతోన్న అసమ్మతి సెగలు
వైఎస్సార్ : జిల్లా టీడీపీలో అసమ్మతి సెగలు కొనసాగుతున్నాయి. టీడీపీలోని కాపు నాయకులు, మాజీ మంత్రి బ్రహ్మయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ ప్రత్యేకంగా సమావేశమై అనంతరం విలేకరులతో మాట్లాడారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, జిల్లా మంత్రి ఆదినారాయణ రెడ్డి తీరుపై మండిపడ్డారు. జిల్లా టీడీపీలో ఒక కులానికి చెందిన నాయకులే ఆధిపత్యం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. గ్రూప్ రాజకీయాలను నాయకులు ప్రోత్సహిస్తున్నారని, ఏ రోజూ పార్టీకి పని చేయని వ్యక్తికి ఎమ్మెల్యే అభ్యర్థిత్వం ఇవ్వడం బాధాకరమన్నారు. సొంత పనులు చేసుకునేందుకు కొత్తగా పార్టీలోకి వస్తున్నారు తప్ప ప్రజలకు సేవ చేయడానికి కాదని వ్యాఖ్యానించారు. టీడీపీలో బలిజలకు ఒక న్యాయం..రెడ్లకు ఒక న్యాయమా అని ప్రశ్నించారు. తమను వాడుకుని వదిలేస్తున్నారని, మాకు ధైర్యం చెప్పే నాయకులే కరువు అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా పార్టీ కోసం కష్టపడితే మాకు న్యాయం జరగకపోవడం దారుణమన్నారు. తెలుగుదేశం పార్టీలో మాలాంటి సీనియర్ నాయకులకు అన్యాయం జరుగుతూనే ఉందన్నారు. ఒకరి నియోజకవర్గ పరిధిలో మరొకరు జోక్యం చేసుకుంటున్నారంటూ మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడిని ఉద్దేశించి నిరసన వ్యక్తం చేశారు. ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి ముఖ్యమంత్రి చంద్రబాబు పదవులు ఎందుకు కట్టబెడుతున్నారని సూటిగా ప్రశ్నించారు. మా లాంటి సీనియర్లు ముఖ్యమంత్రికి కనబడటం లేదా.. మాకు న్యాయం చేయకపోతే ఇండిపెండెంటుగా పోటీ చేస్తామని హెచ్చరించారు. -
హోరాహోరీగా రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నిక
-
కేక... ఈ కోక
సిరిసిల్ల: సూది రంధ్రంలో దూరే చీరను తయారు చేసి సిరిసిల్ల చేనేత కళావైభవాన్ని చాటి చెప్పా డు మరమగ్గాల కార్మికుడు వెల్ది హరిప్రసాద్(34). స్థానిక నెహ్రూనగర్‌కు చెందిన హరిప్రసాద్ పవర్లూమ్పై మూడు నెలల పాటు శ్రమించి అతి సూక్ష్మమైన దారం పోగులతో సూదిలో దూరిపోయే సన్నని చీరను తయారు చేశాడు. 6.50 మీటర్ల పొడవున్న సిల్క్చీరను 50 గ్రాముల బరువుతో నేశాడు. సునాయాసంగా చీరసూదిలో నుంచి దూరిపోతుంది. గతంలో ఉంగరంలో దూరేచీరను 6.50 మీటర్ల పొడవు, 450 గ్రాముల బరువుతో పట్టు చీరను పవర్లూమ్పై నేసి రికార్డు సృష్టించాడు. మరో ప్రయత్నంగా సిల్క్, మోనోబ్రైట్ పోగులతో చీరను మరమగ్గంపై నేశాడు. తొలి ప్రయత్నం విఫలమైనా.. రెండో ప్రయత్నంలో సఫలమయ్యాడు. వెంట్రుక అంతటి సూక్ష్మదనంతో ఉండే పోగులను జాగ్రత్తగా పొందుపరిచి 6.50 మీటర్ల పొడవైన చీరను తయారు చేశారు. పదోతరగతి వరకు చదువుకున్న హరిప్రసాద్.. మరమగ్గాల కార్మికుడిగా పనిచేస్తున్నాడు. 2014లో బుల్లిమగ్గం, వార్పిన్, అగ్గిపెట్టెలో ఇమిడే చీరలను తయారు చేసి శభాష్ అనిపించుకున్నారు. వీఐపీలకు గిఫ్ట్‌లను సైతం హరిప్రసాద్ తయారు చేసి ఇస్తారు. హరిప్రసాద్ నైపుణ్యాన్ని పలువురు అభినందించారు. -
ఏడాది క్రితమే పీఎన్బీ స్కాం వెలుగులోకి..
నేడు పేపర్లు, టీవీల్లో మేజర్ వార్త ఏదైనా ఉంది అంటే అది పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణమే. వేల కోట్ల రూపాయల నగదును దోచుకున్న ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ విదేశాలకు పారిపోయారు. దేశీయ బ్యాంకింగ్ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా ఇది వెలుగులోకి వచ్చింది. విజయ్‌మాల్యా, సుబ్రతారాయ్, సత్యం రామలింగ రాజులను మించి నీరవ్ మోదీ ఈ కుంభకోణానికి పాల్పడ్డారు. అయితే ఈ స్కాంపై గతేడాదే అథారిటీలకు ముందస్తు హెచ్చరికలు వెళ్లినప్పటికీ, వారి పట్టించుకోలేదని తెలుస్తోంది. 2016 జూలైలో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త హరి ప్రసాద్ గతేడాదే ఈ కుంభకోణాన్ని బయటపెట్టారు. దీనిపై ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ కూడా రాశారు. విజయ్ మాల్యాను మించిపోయే అతిపెద్ద కుంభకోణం చోటుచేసుకోబోతుందని అథారిటీలను హెచ్చరించారు. '' విజయ్ మాల్యా, సహారా గ్రూప్ సుబ్రతా రాయ్, సత్యం గ్రూప్ రామలింగరాజులకు మాదిరిగా ముంబైకు చెందిన ఓ వ్యక్తి లేదా కంపెనీ వేలకోట్ల రూపాయల ప్రజల నగదును దోచుకుంటోంది. వెయ్యి కోట్ల మేర ప్రజల దనం దుర్వినియోగం పాలవుతోంది. ఈ మోసదారుడు ఎవరో కాదు గీతాంజలి జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ మెహల్ చౌక్సి. గీతాంజలి జెమ్స్ లిమిటెడ్, మెహల్ చౌక్సి, ఇతర సబ్సిడరీలు, స్కాంకు పాల్పడే కంపెనీల వివరాలన్నింటిన్నీ పీడీఎఫ్‌లో ఎన్‌క్లోజ్ చేసి ఆర్ఓసీ మహారాష్ట్రకు లేఖ పంపించా. కానీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఇదే లేఖను పీఎంఓకు కూడా పంపించా. కానీ వారు నా లేఖను పరిగణలోకి తీసుకోలేదు. రెండు లేదా మూడు నెలల అనంతరం నా కేసును మూసివేస్తున్నట్టు ఆర్ఓసీ మహారాష్ట్ర నుంచి లేఖ వచ్చింది. విజయ్‌మాల్యా లాగా వీరు దేశం విడిచి పారిపోకుండా చూడాలంటూ అభ్యర్థించా. కానీ ఎలాంటి ప్రయోజనం కలుగలేదు'' అని ప్రసాద్ చెప్పారు. జరుగబోయే స్కాం గురించి ముందస్తుగా అధికారులను హెచ్చరించినప్పటికీ, వారు ఇలా నిర్లక్ష్యపూర్వకంగా స్పందించడంతో, వ్యవస్థపై తనకున్న నమ్మకం పోయిందన్నారు ప్రసాద్. అయితే ప్రసాద్, చోక్సికి వ్యతిరేకంగా ఎలాంటి ఫైట్ చేయలేదు. ఈ కుంభకోణం గురించి తనకు లీక్ కావడంతో, ముందస్తుగానే పీఎంఓకు అలర్ట్ ఇచ్చారు. కానీ వారు పట్టించుకోలేదు. ప్రసాద్‌కు ఇవ్వాల్సిన రూ.13 కోట్లను ఇవ్వకుండా.. ఆయన్ను చోక్సి మోసం చేశారు. బెంగళూరులోని గీతాంజలి జెమ్స్ ఫ్రాంచైజీని ప్రసాద్ నిర్వహిస్తున్నారు. చెల్లిస్తానన్న ఏ నగదును చోక్సి తనకు ఇవ్వలేదని ప్రసాద్ ఆరోపించారు. స్టోర్ ప్రాంతాల అద్దె ఇలాంటివేమీ తనకు ఇవ్వకుండా ఎగొట్టారన్నారు. ఈ విషయంపై ప్రసాద్ బెంగళూరులోని సెంట్రల్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా దాఖలు చేశారు. ఏడాది అనంతరం ప్రసాద్ చెప్పినట్టు బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ఏడాది క్రితమే అధికారులు స్పందించి ఉంటే, ఈ స్కాం ఇంతదూరం వచ్చేది కాదని ప్రజలు, విపక్షాలు మండిపడుతున్నాయి. -
సుకుమార్ 'దర్శకుడు' ఫస్ట్ లుక్
దర్శకుడిగానే కాక నిర్మాతగానూ తన మార్క్ చూపించిన స్టార్ డైరెక్టర్ సుకుమార్ తన నిర్మాణంలో మరో సినిమాను రూపొందిస్తున్నాడు. తన అన్న కొడుకు అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ సినిమాతో హరి ప్రసాద్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకు సుకుమార్ కేవలం నిర్మాతగానే వ్యవహరిస్తున్నాడు. కథ, కథనం, డైలాగ్స్ అన్ని హరి ప్రసాద్ స్వయంగా తయారు చేసుకున్నాడు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సుకుమార్ తన పేస్ బుక్ పేజ్‌లో రిలీజ్ చేశాడు. సుకుమార్ క్రియేటివ్ వర్క్‌లో పాలు పంచుకోకపోయినా.. పోస్టర్లో సుకుమార్ స్టైల్ స్పష్టంగా కనిపిస్తోంది. సాయి కార్తీక్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో ఈషా హీరోయిన్గా నటిస్తోంది. త్వరలోనే టీజర్ పాటు రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించనున్నారు. -
రెండ్రోజుల్లో సుకుమార్ సినిమా ఫస్ట్ లుక్..!
ప్రస్తుతం రామ్ చరణ్ హీరోగా ఓ పీరియాడిక్ లవ్ స్టోరిని తెరకెక్కిస్తున్న డైరెక్టర్ సుకుమార్ రెండ్రోజుల్లో తన సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేస్తున్నాడు. అయితే సుకుమార్ రిలీజ్ చేయబోయేది రామ్ చరణ్ హీరోగా తన దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫస్ట్ లుక్ కాదు. తను నిర్మాతగా తన అసిస్టెంట్ హరిప్రసాద్‌ను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కిస్తున్న సినిమా ఫస్ట్ లుక్. అశోక్‌ను హీరోగా పరిచయం చేస్తూ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై హరి ప్రసాద్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా దర్శకుడు. ఇషా హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఈ సమ్మర్ ఎండింగ్‌కు రిలీజ్ చేయాలని భావిస్తున్న దర్శకుడు సినిమా ఫస్ట్ లుక్‌ను మరో రెండు రోజుల్లో రిలీజ్ చేసేందుకు ముహుర్తం నిర్ణయించారు. సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లో తెరకెక్కిన తొలి చిత్రం కుమారి 21ఎఫ్ ఘనవిజయం సాధించిన నేపథ్యంలో దర్శకుడు పై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. -
జర్నలిస్టులకు త్వరలో హెల్త్‌కార్డులు
-
భర్త ఇంటి ముందు భార్య నిరసన
తిరుమలలోని భవానీ నగర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆడిపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడు పెట్టే బాధలు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. రక్షణ కల్పించాల్సిందిగా ఖాకీలను కోరింది. అయినా పోలీసుల నుంచి స్పందన కరువైంది. భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మెరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసేదేమి లేక భర్త హరిప్రసాద్ ఇంటి ముందు ఆడ పసికందుతో భార్య నిరసనకు దిగినట్టు సమాచారం. -
24 లక్షల కంటే అమ్మ మాటే గొప్పగా అనిపించింది!
24 లక్షలు రూపాయల కంటే కూడా తల్లితండ్రుల మాటలే గొప్పగా అనిపించాయి. సన్మార్గంలో నడవాలని చెప్పిన తల్లితండ్రుల మాటలే ఆ హరిప్రసాద్ కు వేదవాక్కయ్యాయి. చెడు మార్గంలో సంపాదించే సొమ్ము, తేరగా లభించే డబ్బు మన వెంట ఉండదు అని చెప్పిన మాటలే బ్యాంకు పరువును నిలబెట్టాయి. ఏటీఎం నుంచి కుప్పలుకుప్పలుగా వచ్చిపడిన డబ్బు కోసం ఆశపడకుండా బ్యాంక్ అధికారులకు అప్పగించిన హరిప్రసాద్ జాతీయ మీడియా దృష్టిని ఆకర్షించారు. నాపై మా అమ్మ ఎప్పుడు ఫిర్యాదు చేస్తూ ఉంటుంది. నా చిన్నతనం నుంచి మా అమ్మ ఎప్పుడు చెబుతున్న మాటలు ఎప్పుడు గుర్తుకు వస్తాయి. కష్టపడని సొమ్ము ఎప్పటికి మనది కాదు అని అమ్మ చెబుతూ ఉండేది. సరియైన మార్గంలోనే డబ్బు సంపాదించాలి. ఆ డబ్బే జీవితాంతం తోడుగా ఉంటుంది అని చెప్పిన మాటలు మనసులో నాటుకుపోయాయి అని హరిప్రసాద్ చెప్పారు. బ్యాంకు అకౌంట్లో ఉన్న 500 రూపాయల్లో 200 రూపాయలు డ్రా చేసుకుందామనుకున్న హరిప్రసాద్, అతడి స్నేహితులు లతీఫ్ ఆలీ, దుర్గా ప్రసాద్ లకు కళ్లెదుటే కుప్పులుగా పడి ఉన్న డబ్బు కనిపించింది. ఇంజనీరింగ్ పూర్తి చేసిన నిరుద్యోగులుగా ఉన్న వీరు ముగ్గురు తమదికాని డబ్బు కోసం ఆశపడకుండా పోలీసులకు, బ్యాంక్ అధికారులకు సమాచారం అందించి తమ నిజాయితీని నిరూపించుకున్నారు. ఈ ఘటన తర్వాత ఈ ముగ్గురు యువకులు హీరోలుగా మారారు. అయితే తన తల్లితండ్రులు ఈ విషయాన్ని తేలిగ్గా తీసుకున్నారు. ప్రతి ఒక్కరు ఈ విషయం గురించి తెలుసుకుని గొప్పగా ఫీలయ్యారు. అయితే తండ్రి మాత్రం ఏమైనా ఉద్యోగం లభించిందా అని మాత్రం అడిగారని హరిప్రసాద్ తెలిపారు. ఈ సంఘటన తర్వాత తన నిజాయితీ కారణంగా తండ్రికి ఆయన పనిచేసే స్కూల్లో అధికారులు సన్మానించడంతో చాలా హ్యాపీగా ఫీలవుతున్నానని హరిప్రసాద్ తెలిపారు. నిజాయితీకి నిలువెత్తు అద్దంగా నిలిచిన నిరుద్యోగ ఇంజినీర్లు, చార్టెడ్ అకౌంటెన్సీ రంగంలో ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న హరిప్రసాద్, లతీఫ్ ఆలీ, హరి ప్రసాద్ ఉద్యోగంతోపాటు మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుందాం. చూద్దామంటే కనిపించని ఈ సమాజంలో నిజాయితీకి కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన యువకులకు సెల్యూట్ చేద్దాం! -
నమో అంటే నర మేధం
= నరేంద్ర మోడీ అని కాదు.. = గుజరాత్లో ఆయన చేసిన అభివృద్ధేమీ లేదు = కాంగ్రెస్‌ను విమర్శించడమే బీజేపీ పని = ‘భారతరత్న’కు వాజ్‌పేయి అనర్హుడు = స్వాతంత్య్ర పోరాటంలో ఆయన పాల్గొనలేదట = రాష్ర్టంలో బీజేపీ నిర్వాకాలపై ప్రజలు విసుగెత్తారు = అందుకే గత అసెంబ్లీ ఎన్నికల్లో చిత్తుగా ఓడించారు = ఇప్పుడు మోడీని అడ్డుపెట్టుకొని ఓట్లు అడుగుతున్నారు = ‘మీట్ ది ప్రెస్’లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హరిప్రసాద్ సాక్షి, బెంగళూరు : నమో అంటే అర్థం నరేంద్ర మోడీ అని కాదని, నర మేధం అని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి బీకే హరిప్రసాద్ కొత్త నిర్వచనం ఇచ్చారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో ఓటు అడిగే ధైర్యం రాష్ట్ర బీజేపీ నేతల్లో లేదని, అందుకే మోడీతో ప్రచారం చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్, బెంగళూరు రిపోర్టర్స్ గిల్డ్ సంయుక్త ఆధ్వర్యంలో శుక్రవారమిక్కడ నిర్వహించిన ‘మీట్ ది ప్రెస్’లో మాట్లాడారు. గుజరాత్ అభివృద్ధి పేరిట భారీ ప్రచారం చేస్తున్న నరేంద్ర మోడీ.. అసలు ఆ రాష్ర్టంలో ఆయన చేసిన అభివృద్ధి ఏంటో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మోడీ ముఖ్యమంత్రి కాకముందు నుంచే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అన్నారు. మమతా బెనర్జీ తిరస్కరించిన ‘నానో ప్రాజెక్టు’ను తన రాష్ట్రానికి తీసుకురావడం ఒక్కటే మోడీ చేసిన పని అని హరిప్రసాద్ పేర్కొన్నారు. ఛత్తీస్‌గడ్‌లో బీజేపీ నక్సల్స్‌తో కలిసి పనిచేస్తోందని ఆరోపించారు. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని విమర్శించడమే బీజేపీ పనిగా పెట్టుకుందని విమర్శించారు. వాజ్‌పేయికి భారతరత్న ఇవ్వాలనే వాదనలపై హరిప్రసాద్ స్పందిస్తూ...‘ వాజ్‌పేయి స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నపుడు ఆయన్ను బ్రిటీష్ పోలీసులు అరెస్టు చేశారు. తనకు.. స్వాతంత్య్ర సంగ్రామానికి ఎలాంటి సంబంధం లేదని, తనను వదిలిపెట్టాలని వాజ్‌పేయి బ్రిటీష్ పోలీసులను కోరారు. ఇదంతా ‘ఫ్రంట్‌లైన్’ అనే మ్యాగజైన్లో కూడా ప్రచురితమైంది. మరి అలాంటి వ్యక్తికి భారతరత్నను ఇస్తే మిగతా స్వాతంత్య్ర పోరాటయోధులను అవమానించడమే అవుతుందనేది నా అభిప్రాయం’ అని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ చేసిన నిర్వాకాలను భరించలేక ప్రజలు ఆ పార్టీని గత ఎన్నికల్లో చిత్తుగా ఓడించారని పేర్కొన్నారు. ఐదేళ్లు రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ హయాంలో విధానసౌధలో అశ్లీల చిత్రాల వీక్షణ, రేవ్ పార్టీల గొడవ, అవినీతి తదితర వాటితో ప్రజలు విసిగిపోయే కాంగ్రెస్‌కు పట్టంగట్టారని పేర్కొన్నారు. -
తొలి వికెట్ పడింది
సంగారెడ్డి మున్సిపాలిటీ, న్యూస్‌లైన్: విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించే ప్రభుత్వ ఉద్యోగులను ఇప్పటి వరకు హెచ్చరిస్తూ వచ్చిన కలెక్టర్ స్మితా సబర్వాల్ ఇక చర్యలకు ఉపక్రమించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కొండాపూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి హరిప్రసాద్‌ను ప్రభుత్వానికి సరెండర్ చేయాలని శుక్రవారం ఆమె డీఎంహెచ్ఓ రంగారెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. హరిప్రసాద్ సరిగా విధులకు హాజరు కాకపోవడంపై కొండాపూర్ వాసులు ఫిర్యాదులు చేయడంతో కలెక్టర్ అతని పనితీరుపై విచారణ జరిపించారు. గ్రామస్తుల ఆరోపణలు నిజమని తేలడంతో అతన్ని సరెండర్ చేయాలని ఆదేశించారు. అంతేకాకుండా మండల ప్రాథమిక ఆరోగ్య వైద్యుడి పోస్టు ఖాళీగా చూపిస్తూ కొత్త వైద్యాధికారిని నియమించేలా చర్యలు తీసుకోవాలని డీఎంహెచ్ఓకు పంపిన ఆదేశాల్లో పేర్కొన్నారు. విధుల్లో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించనంటూ ఇప్పటికే తేల్చిచెప్పిన కలెక్టర్, డాక్టర్ హరిప్రసాద్‌ను సరెండర్ చేయడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులందరికీ మరోసారి హెచ్చరికలు పంపారు