తిరుమలలోని భవానీ నగర్లో బుధవారం ఓ దారుణం జరిగింది.
తిరుమలలోని భవానీ నగర్లో ఓ దారుణం చోటుచేసుకుంది. ఆడిపిల్ల పుట్టిందని ఓ భర్త తన భార్యను వేధింపులకు గురిచేస్తున్నాడు. అతడు పెట్టే బాధలు భరించలేక చివరికి పోలీసులను ఆశ్రయించింది. రక్షణ కల్పించాల్సిందిగా ఖాకీలను కోరింది. అయినా పోలీసుల నుంచి స్పందన కరువైంది.
భర్త తనను వేధింపులకు గురిచేస్తున్నాడని మెరపెట్టుకున్న పోలీసులు పట్టించుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఇక చేసేదేమి లేక భర్త హరిప్రసాద్ ఇంటి ముందు ఆడ పసికందుతో భార్య నిరసనకు దిగినట్టు సమాచారం.