Police Arrested Asha Worker for Sold a Three Day Old Baby Girl - Sakshi
Sakshi News home page

Hyderabad: అక్కకు పిల్లలు పుట్టరని చెల్లెలు నిర్వాకం.. పసికందు అమ్మమ్మకు విషయం తెలియడంతో..

Published Tue, Feb 8 2022 11:39 AM | Last Updated on Tue, Feb 8 2022 4:56 PM

Parents Who Sold A Three Day Old Baby Girl - Sakshi

సాక్షి హైదరాబాద్‌: మూడురోజుల  ఆడ శిశువును విక్రయించిన తల్లిదండ్రులను, కొనుగోలు చేసిన అక్కాచెల్లెలిని, ఆశావర్కర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వనస్థలిపురం ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏసీపీ పురుషోత్తంరెడ్డి ఈ వివరాలు వెల్లడించారు. ఏపీలోని ఆలూరుకు చెందిన  దుర్గాప్రియ, శ్రీనివాస్‌ దంపతులు కమలానగర్‌ కాలనీలో నివాసం ఉంటున్నారు.

గాంధీ ఆసుపత్రిలో మూడు రోజుల క్రితం దుర్గాప్రియకు కూతురు జన్మించింది.అయితే దుర్గాప్రియ, ఆమె భర్త శ్రీనివాస్‌లు బాలనగర్‌కు చెందిన కవితకు రూ.80 వేలకు విక్రయించేందుకు  ఆశావర్కర్‌ బాషమ్మ ద్వారా ఒప్పందం కుదుర్చుకుని విక్రయించారు. తన సోదరి ధనమ్మకు పిల్లలు పుట్టరని తేలడంతో అక్క కవిత ఈ కొనుగోలు చేసింది. విషయం తెలుసుకున్న దుర్గాప్రియ తల్లి బాలగోని రాజేశ్వరీ వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

కేసునమోదు చేసుకున్న సీఐ సత్యనారాయణ విచారణ చేపట్టి నిందితులను అదుపులోకి తీసుకొని చిన్నారిని  శిశు సంక్షేమ శాఖ అధికారులకు అప్పజెప్పారు. శిశువును విక్రయించిన తల్లిదండ్రులు దుర్గాప్రియ, శ్రీనివాస్, ఆశావర్కర్‌ బాషమ్మ, కొనుగోలు చేసిన కవిత,ఆమె సోదరి ధనమ్మలను అరెస్ట్‌ చేసి రిమాండ్‌ కు తరలించారు.
(చదవండి: భర్త వేధింపులు.. స్కిన్‌ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్‌ ఇచ్చి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement